రెండు ఫ్లాట్లు అమ్మేసిన ప్రభుదేవా.. ఇంత తక్కువ లాభమా? | Prabhu Deva sells Two Flats in one of Mumbai | Sakshi
Sakshi News home page

Prabhu Deva: 14 ఏళ్ల ఎదురుచూపులకు అంతే లాభమా?

Mar 19 2026 5:37 PM | Updated on Mar 19 2026 6:19 PM

Prabhu Deva sells Two Flats in one of Mumbai

కొరియోగ్రాఫర్‌, నటుడు ప్రభుదేవా రెండు ఫ్లాట్లు అమ్మేశాడు. దక్షిణ ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలోని మినర్వా బిల్డింగ్‌లోని ఫ్లాట్లను తక్కువ లాభానికే వదిలేసుకున్నాడు. సుమారు రూ.14.80 కోట్లకు ఈ ఫ్లాట్స్‌ అమ్మేశాడు. మార్చి 13న ఈ లావాదేవీ జరిగినట్లు తెలుస్తోంది.

అప్పట్లో..
కాగా వీటిని ప్రభుదేవా 2012లో రూ.14.45 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. ఒక ఫ్లాట్‌ 32వ అంతస్తులో ఉండగా, మరొకటి 33వ అంతస్తులో ఉంది. ఒక్క ఫ్లాట్‌ సుమారు 1295 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగుంది. పద్నాలుగు సంవత్సరాల తర్వాత వాటిని అమ్మితే ప్రభుదేవాకు కేవలం రూ.35 లక్షలు మాత్రమే లాభం వచ్చింది. ఇది చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.

చదవండి: సూర్య అడుగుజాడల్లో చిరంజీవి.. త్వరలోనే..

Advertisement
 
Advertisement
Advertisement