తిరుపతి : శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర భక్తుల బైరాగి వేషాలతో హోరెత్తింది. వయోభేదం లేకుండా ఒళ్లంతా విభూది పూసుకుని, నల్లటి బొగ్గు బొట్లు పెట్టుకొని, మెడ, కాళ్లు చేతులకు రేల కాయల గజ్జలు కట్టుకుని, నడుముకు వేపాకు కట్టి నగర వీధుల్లో బూతులు తిడుతూ, గంగమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు.
ఉదయం నుంచి రాత్రి వరకు బైరాగి వేషాల కోలాహలం సాగింది. అనంతరం వేశాలమ్మ, శ్రీతాళ్లపాక పెద్ద గంగమ్మను దర్శించుకుని శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని, ఆలయ ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించారు.


