దేశీయ విత్తన ధాన్యాగారం | sagubadi: karnataka women bags award for saving desi ... | Sakshi
Sakshi News home page

దేశీయ విత్తన ధాన్యాగారం

Nov 27 2026 10:47 AM | Updated on Nov 27 2026 10:47 AM

sagubadi: karnataka women bags award for saving desi ...

వ్యవసాయంలో సంప్రదాయ విత్తనాల ప్రాధాన్యం తగ్గుతున్న వేళ.. వాటిని కాపాడేందుకు కర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన మహిళలు గత కొన్నేళ్లుగా శ్రమిస్తున్నారు. ఇప్పుడు వీరు చేస్తున్న కృషికి గుర్తింపు లభించింది. బీబీజాన్‌ మౌలాసాబ్‌ హలేమాని నాయకత్వంలో తొలుత 15 మంది మహిళలు కలిసి దేశీయ విత్తనాల సంరక్షణకు నడుం బిగించారు. 2018లో ప్రారంభమైన వీరి ప్రయాణం ఇప్పుడు వందలాది సంప్రదాయ విత్తన రకాలను కాపాడే ఉద్యమంగా మారింది. 

స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పెరిగే సంప్రదాయ పంటలను కాపాడటమే వీరి లక్ష్యం. ఈ మహిళల బృందం దాదాపు 30 గ్రామాల్లో చిరుధాన్యాల మిశ్రమ సాగును ప్రోత్సహిస్తూ, రైతులకు దేశీయ విత్తనాలను అందిస్తోంది. వీరి వల్ల వ్యవసాయంతో పాటు పశుపోషణ, ఉద్యానవన సాగు, చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ వంటి  కార్యకలాపాల ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలొస్తున్నాయి.

అలుపెరుగని ఈ మహిళా బృందం కార్యక్రమాల ద్వారా 5,000 మందికి పైగా రైతులకు తోడ్పాటు అందుతోంది. కాగా వీరి కృషికి గుర్తింపుగా ఇటీవల న్యూఢిల్లీలో ప్లాంట్‌ జినోమ్‌ సేవియర్‌ కమ్యూనిటీ అవార్డ్‌ లభించింది. దీంతోపాటు రూ.10 లక్షల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందుకున్నారు. అంతేకాకుండా 2025లో యూఎన్‌డీపీ అందించే ఈక్వేటర్‌ ప్రైజ్‌ కూడా ఈ బృందానికి లభించింది. కాలం మారినా... సంప్రదాయ విత్తనాలను వదల్లేదు ఆ మహిళలు. వాటిని కాపాడుతూ, రైతులకు అందుబాటులోకి తెస్తున్న ధార్వాడ్‌ మహిళల కృషి నిజంగానే భావితరాలకు ఆదర్శప్రాయం...

ప్రస్తుతం వీరి కమ్యూనిటీ సీడ్‌ బ్యాంకులో 250కి పైగా దేశీయ విత్తన రకాలున్నాయి. వీటిలో 70 రకాల రాగులు, 25 రకాల సామలు, రెండు రకాల బ్రౌన్‌ టాప్‌ మిల్లెట్స్, 10 రకాల కొర్రలు, 25 రకాల గుర్రపు శనగలు, 10 రకాల శనగలు, 25 రకాల వరి, మూడు రకాల పెసలు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలు ఉన్నాయి.  

ఇదీ చదవండి: ఆక్వా రైతులకు గుడ్‌న్యూస్‌.. క్షణాల్లో వ్యాధులను గుర్తించే ఏఐ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement