మోకామా: బీహార్‌లోని మోకామాలో మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె శివాంగి వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పెళ్లి వేడుకలు కేవలం ఆడంబరాల పరంగానే కాకుండా భారీ జనసందోహంతోనూ వార్తల్లో నిలిచాయి. పెళ్లికి వచ్చిన అతిథులు, స్థానికులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. సుమారు నాలుగు లక్షల మందికి భోజనం సిద్ధం చేసినట్లు నిర్వాహకులు ప్రకటించినప్పటికీ.. ఒకేసారి భారీ సంఖ్యలో జనం విందు వద్దకు చేరుకోవడంతో ఏర్పాట్లు అస్తవ్యస్తమయ్యాయి. భోజనం కోసం జనం ఎగబడటంతో కొన్ని చోట్ల విస్తళ్లను గాల్లోకి విసిరి పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు వడ్డించే వారి కోసం ఎదురుచూడకుండా పెద్ద పాత్రల్లోని ఆహారాన్ని స్వయంగా చేతులతోనే తీసుకున్నారు.
గాల్లోకి విస్తళ్లు.. ఎక్కడపడితే అక్కడే భోజనం
మహాభోజనం కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. మైదానంలో తాత్కాలిక వంటశాలను నిర్మించి, పెద్దపెద్ద కడాయిల్లో వంటకాలు సిద్ధం చేశారు. అనేక మంది వంటవాళ్లు నిరంతరం పనిచేశారు. రసగుల్లాలతో పాటు వివిధ రకాల స్వీట్లు పెద్ద మొత్తంలో తయారు చేశారు. అయితే ఏర్పాట్లకు మించి జనం తరలిరావడంతో భోజన పంపిణీ కష్టంగా మారింది. విస్తళ్లు అందించేందుకు సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో వాటిని గాల్లోకి విసిరి ప్రజలకు అందించాల్సి వచ్చింది. భోజనం కోసం ఎదురుచూస్తున్న వారిలో విస్తళ్లు దక్కించుకునేందుకు పోటీ నెలకొంది. కొందరు నేలపైనే కూర్చుని తినగా, మరికొందరు జనం మధ్యలోనే తమకు దొరికిన చోట భోజనం చేశారు.
I don’t know who is anant singh but it’s not his fault. You won’t probably act like this for free food but you should observe how privileged people act when there is no “direct full stop” on the food they are eating like in a hotel buffet. This is all intrinsic. It will take 100 more years to fix this. Many of these people would have enough food at their homes but they still get crazy for unlimited food or thali.
— Chirag Barjatya (@chiragbarjatya) November 26, 2026
చేతులతోనే ఆహారం తీసుకున్న జనం
వంటశాలలో పెద్దపెద్ద పాత్రలు, కడాయిల్లో వంటకాలు సిద్ధంగా ఉన్నప్పటికీ.. వాటిని క్రమపద్ధతిలో వడ్డించడం నిర్వాహకులకు సవాలుగా మారింది. జనం సంఖ్య పెరిగిపోవడంతో కొందరు వడ్డించే వారి కోసం వేచి ఉండకుండా పాత్రల్లోంచి నేరుగా ఆహారాన్ని తీసుకున్నారు. మరికొందరు చేతులతోనే భోజనం తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అతిథులను క్రమపద్ధతిలో కూర్చోబెట్టి వడ్డించాలన్న ప్రణాళిక జనసందోహం ముందు పనిచేయలేదు. ఒకేసారి వేలాది మంది భోజనం కోసం రావడంతో పంపిణీ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడింది.
గుర్రపు పందేలు చూసేందుకు..
శివాంగి వివాహం సందర్భంగా నిర్వహించిన గుర్రపు పందేలు కూడా భారీ జనసందోహానికి కారణమయ్యాయి. మోకామాలోని నద్వాన్ గ్రామంలో జరిగిన ఈ పోటీలను చూసేందుకు బీహార్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు. గుర్రాల పోటీలను వీక్షించేందుకు మైదానం పరిసరాల్లో జనం భారీగా చేరుకున్నారు. దీంతో రహదారులపై 10 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మైదానంలో నిలబడేందుకు కూడా స్థలం లేకుండా పోయింది. కొందరు 33 వేల వోల్టుల హైటెన్షన్ విద్యుత్ లైన్ల టవర్లపైకి ఎక్కారు.
మధ్యలోనే నిలిచిన గుర్రపు పందేలు
జనాన్ని నియంత్రించడం కష్టంగా మారడంతో అనంత్ సింగ్ గుర్రపు పందేలను మధ్యలోనే నిలిపివేశారు. పోటీల చివరి విడతను గురువారం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచే గుర్రం యజమానికి థార్ వాహనాన్ని బహుమతిగా అందించనున్నారు. గుర్రపు పందేలకు వచ్చిన జనసందోహం, ట్రాఫిక్ సమస్యలు పెళ్లి వేడుకల్లో ప్రత్యేకంగా చర్చనీయాంశమయ్యాయి.
Bihar: Anant Singh's Daughter's Wedding Turns Into a Mega Event, Lakhs Expected to Be Served Food A grand wedding celebration is underway for Mokama MLA Anant Singh's daughter, Shivangi Singh, in Bihar, with massive arrangements attracting attention. - Food arrangements for nearly 4–5 lakh people. - Over 500 cooks and 300 cooking stoves preparing more than 150 varieties of dishes. - Massive wedding pandals spread across 25 bighas — 10 bighas for VIP guests and 15 bighas for other guests. - A grand Jaimala stage designed on the lines of Jaipur's Hawa Mahal. - Flowers reportedly imported from abroad for decoration. - More than 500 police personnel and around 3,000 private bouncers deployed for security. - Parking arrangements for over 1,000 vehicles and five helipads. - A horse-racing competition organised, with a Thar SUV, Bullet motorcycle and scooter reportedly lined up as prizes for winners. The huge crowd outside the MLA's residence has also become a talking point, with guests and supporters arriving from far and wide.
— Atulkrishan (@iAtulKrishan1) November 25, 2026
వర్షాల మధ్య రాత్రింబవళ్లు ఏర్పాట్లు
ఈ భారీ వివాహ వేడుకల కోసం నిర్వాహకులు గత కొద్ది రోజులుగా ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. అయితే నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు పలు ఇబ్బందులు సృష్టించాయి. అయినప్పటికీ అనంత్ సింగ్ తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి రాత్రి పొద్దుపోయే వరకు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మైదానాన్ని చదును చేయించడం, గుర్రపు పందేలకు ప్రత్యేక స్థలం సిద్ధం చేయడం, హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం వంటి పనులు చేపట్టారు. పెళ్లికి పెద్ద సంఖ్యలో అతిథులు, స్థానిక ప్రజలు వస్తారని అంచనా వేసి భోజన ఏర్పాట్లను విస్తృతం చేశారు. సుమారు నాలుగు లక్షల మందికి సరిపడా ఆహార పదార్థాలను సమకూర్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రముఖుల రాకతో సందడిగా వివాహ వేడుకలు
శివాంగి వివాహానికి రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్, బీహార్ అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ కుమార్, బీహార్ మంత్రి రామ్‌కృపాల్ యాదవ్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. వరుడు రిషికేశ్ కుమార్ పట్నాలోని బీహతా ప్రాంతం కృష్ణానగర్ నుంచి బరాత్‌తో వచ్చారు. జయమాల కార్యక్రమంలో శివాంగి ల్యాండ్ క్రూయిజర్ వాహనంలో ప్రత్యేకంగా ప్రవేశించారు. అనంత్ సింగ్ స్వయంగా బరాత్‌కు వచ్చిన అతిథులను ఆహ్వానించారు.
ఇదీ చదవండి: 2028 వరకు ఆగని యుద్ధం.. జ్యోతిష్యుల హెచ్చరిక!


