బిహార్‌కి చెందిన ఎమ్మెల్యే అనంత్ సింగ్ కూతురి పెళ్లి గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలిచింది. దీనికి చాలానే కారణాలు ఉన్నాయి. అనంత్ సింగ్ కుమార్తె శివాంగి సింగ్ వివాహం కోసం లక్షలాది మందిని ఆహ్వానించారు. వందలాది వంటశాలలు ఏర్పాటు చేసి భోజన ఏర్పాట్లు చేశారు. కానీ పెళ్లికి వచ్చిన అతిథులు.. భోజనం కోసం అష్టకష్టాలు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పట్నా జిల్లాలోని నడ్వాన్ గ్రామంలో ఈ పెళ్లిని ఘనంగా నిర్వహించారు. అయితే ఇందులో పాల్గొనేందుకు వచ్చిన అతిథుల వాహనాల కారణంగా ఏకంగా 10 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డు పక్కన దుకాణాలు, లౌడ్ స్పీకర్లతో ఆ ప్రాంతమంతా ఓ జాతరలా అనిపించింది. ఈ వేడుకలో భాగంగా గుర్రపు స్వారీ, కుస్తీ పోటీలు నిర్వహించారు. అయితే గుర్రపు పందెలు చూడటం కోసం జనాలు ప్రమాదకరంగా హై టెన్షన్ టవర్ల పైకి ఎక్కారు.
మరోవైపు ఈ పెళ్లికి వచ్చిన సమీప ప్రాంత ప్రజలకు సరైన భోజనం దొరకలేదు. వరద బాధితుల్లా వీళ్లని ట్రీట్ చేశారు. ప్లేట్లని గాల్లోకి విసిరారు. అవి దొరికిన వాళ్లు.. ఫుడ్ కోసం చాలానే కష్టాలు పడాల్సి వచ్చింది. కొందరికి అన్నం దొరికితే మరికొందరికి కూర దొరికింది. ఇలా సగం సగం తినేసి తిరిగి వెళ్లిపోయారు. ఏదేమైనా ఓ ఎమ్మెల్యే కూతురి పెళ్లి, అక్కడి పరిస్థితులు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయాయి.
बिहार है साहब, यहां शादियां भी यादगार होती हैं और चर्चाएं भी दूर तक जाती हैं ! #Bihar #AnantSingh https://t.co/VyYVubbsyo
— Prabhakar Kumar (@prabhakarjourno) November 25, 2026
पूरे बिहार से लोग पहुंच गए बाहुबली विधायक अनंत सिंह के गांव, बिहार की सबसे बड़ी शादी है। ऐसा नजारा पहले कभी नहीं देखा गया। https://t.co/AGFMehPYfh
— Anish Anand (@anishanand77863) November 25, 2026
इतनी भीड़ मोदीजी के रैली में भी नहीं आती है। मोकमा पट गया। https://t.co/cVLRD3zfaW
— Magadh Updates (@magadh_updates) November 25, 2026
जो लोग कह रहे थे कि बिहार वाले 10 हजार में बिक गए, उनको ये वीडियो देखनी चाहिए! जहां तीन चार दिन पहले बने रसगुल्ला और पुड़ी सब्जी खाने के लिए लोग धक्के खा रहे हो, वहां 10 हजार तो बहुत बड़ी चीज होती हैं! अनंत सिंह की बेटी की शादी में लोगों का हुजूम उमड़ा है, भीड़ इतनी है कि किसी को सब्जी मिल रही हैं तो पुड़ी नहीं , तो किसी को पुड़ी मिल रहा हैं तो सब्जी नहीं ! फिर भी लोग ऐसे जुटे हुए हैं जैसे इनके घर खाना नहीं बनता हैं!
— Prem Bhardwaj (@premkumarcbn01) November 25, 2026
एक प्लेट खाने के बदले अब ये सब जीवन भर अनंत सिंह की गुलामी करेंगे।😂 https://t.co/sxLkk7ePvY
— खबर 360° (@Khabar3600) November 25, 2026
काफी मशक्कत करने के बाद आखिरकार इस लड़के को अनंत सिंह के यहां भोज में एक प्लेट खाना मिल ही गया। https://t.co/yCP1kzx0x6
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) November 25, 2026


