ప్రపంచంలోని అతిపెద్ద పశువుల సంతలలో ఒకటైన రాజాస్థాన్ పుష్కర్ మేళాలో పెద్ద పెద్ద జంతువులే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. అలాంటిది ఈసారి అత్యం విరుద్ధంగా అత్యంత చిన్న జంతువు చాలా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. జనం అంత దాన్ని చూసేందుకు క్యూ కడుతుండటం విశేషం. పైగా దాంతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. ఇంతకీ అదేం జంతువో తెలిస్తే మాత్రం విస్తుపోవడం ఖాయం.
అదే అత్యంత చిన్న గేదె. దానిపేరు పింకీ. కేవలం రెండు అడుగులే దాని ఎత్తు. ఇంత చిన్న గేదెను ఎవరూ చూడకపోవడంతో చాలా మంది దాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. ఇది చాలా అరుదైన గేదె అని దాని యజమాని పేర్కొన్నాడు. దాని చిన్న పరిమాణం, ప్రశాంత స్వభావం, అసాధారణ రూపం కారణంగా దీని విలువ రూ. కోటిపైనే అని అంచనా వేశాడు. ఇంకా ఎవరు దీన్ని కొనుగోలు చేయలేదు. కానీ దీన్ని ఎవరైన సందర్శించడానికి వస్తే మాత్రం..వాళ్ల ముందు సౌమ్యంగా వచ్చి నిలబడుతుంది.
దాదాపు పిల్లల ఎత్తులో ఉండటంతో అందరూ దానివైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. కొంతమంది సందర్శకులు జాతరలో ఇదే అత్యంత అందమైన జంతువుగా అభిర్ణించారు కూడా. కాగా, ఈసారి జాతరలో దాదాపు రెండున్న అడుగుల ఎత్తులో ఉండే పుంగనూరు ఆవులు కూడా ప్రత్యేకంగా నిలిచాయి. అలాగే అనేక వందల కిలో గ్రాముల బరువు ఉండే ముర్రా గేదెలు కూడా ఉన్నాయి.
అనేక కోట్ల రూపాయల ధర పలుకుతున్న గుర్రాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచినప్పటికీ..వాటన్నింటిని వెనక్కి నెట్టి మొత్తం క్రెడిట్ ఈ పింకీ గేదె సొంతం చేసుకోవడం విశేషం. ఒకరకంగా ఎల్లప్పుడూ పెద్ద జంతువులే అందరి దృష్టిని ఆకర్షించవని.. చిన్న జంతువులు కూడా బలమైన ప్రభావాన్ని చూపగలవని ఈ పింకీ నిరూపించింది.
ఇదీ చదవండి: అతడికి 75, ఆమెకు 63..! అలా మొదలైంది ప్రేమకథ..


