అనిరుధ్, కావ్య మారన్‌లది ఆత్మగౌరవ వివాహం..! ఎలా చేస్తారంటే.. | Anirudh Ravichander And Kavya Maran Opt For Self-Respect Marriage | Sakshi
Sakshi News home page

Self-Respect Marriageఫ ఆత్మగౌరవ వివాహ పద్ధతిలో ఒక్కటైన అనిరుధ్‌-కావ్య మారన్‌లు! ఎలా నిర్వహిస్తారంటే..

Nov 13 2026 10:54 AM | Updated on Nov 13 2026 11:03 AM

Anirudh Ravichander And Kavya Maran Opt For Self-Respect Marriage

సంగీత స్వరకర్త అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స​ హైదరాబాద్‌ సహ యజమాని కావ్యమారన్‌లు నవంబర్‌ 11న గ్రీస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగత తెలిసిందే. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెక చక్కర్లు కొడుతున్నాయి. అందులోని పెళ్లి ఆచారాలు చూసి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే..సంప్రదాయ వివాహ వేడుక మాదిరిగా జరగలేదు. కావ్యమెడలో గొలుసు వేస్తున్న ఫోటో వైరల్‌ అవ్వడంతో ఇదేం వివాహ తంతు అంటూ ఆ ఆచారాలపై రకరకాల ఊహగానాలు మొదలయ్యాయి. ఇంతకీ ఏంటా వివాహ ఆచారం అంటే..!.

Anirudh and Kavya got married: ఆ అనుమానాలకు తెరదించుతూ..ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఐటీ వింగ్ కార్యదర్శి డాక్టర్ టి.ఆర్.బి. రాజా,ఆ వివాహ వేడుకలో ఏం జరిగిందో సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. అనిరుధ్‌, కావ్యలు ఆత్మగౌరవ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. వాళ్లు గొలుసులు మార్చుకుని తమ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారని తెలిపారు. అలాగే వారి దాంపత్యం కలకాలం పదిలం ఉండాలంటే బంధుమిత్రులు మనస్సారా దీవించారు. ఇక ఏంటి ఆత్మగౌరవ వివాహం అంటే..

ఎలా జరుగుతుందంటే..
ఆత్మగౌరవ వివాహం అనేది తమిళనాడు సంఘ సంస్కర్త పెరియార్ ఇ.వి. రామస్వామి ప్రారంభించిన ఆత్మగౌరవ ఉద్యమం నుంచి ఉద్భవించిన ఒక వివాహ తంతు ఇది. ఇది సాధారణ సాంప్రదాయ వివాహ ఆచారాలను, కుల వివక్షను, మత పెద్దల పాత్రను సవాలు చేసేలా జరుగుతుంది. ఈ ఆత్మగౌరవ వివాహంలో వధువరులు సాక్షుల సమక్షంలో ఒకరికొకరు తమ నిబద్ధతను ప్రకటించుకుంటూ..పూలమాలలు లేదా ఉంగరాలను మార్చుకుంటారట. 

ఈ వేడుకకు మత గురువు గానీ, విస్తృతమైన మతపరమైన ఆచారాలు గానీ ఉండవు. 1967లో తమిళనాడులో హిందూ వివాహ చట్టానికి చేసిన సవరణ ద్వారా, సాంప్రదాయ మతపరమైన వేడుకలు లేకుండా ఆత్మగౌరవ వివాహాలను చట్టబద్ధంగా జరిపించడానికి అనుమతి లభించింది. అప్పటి నుంచి ఈ వివాహ తంతు చట్టపరమైన గుర్తింపు పొందింది.  ఈ పెళ్లిలో పురోహితుడు, మంగళసూత్రం, సప్తపది (ఏడు అడుగులు) వంటి సంప్రదాయ తంతులు తప్పనిసరి కాదు. 

బంధువులు లేదా స్నేహితుల సమక్షంలో వధూవరులు పూలమాలలు లేదా ఉంగరాలు మార్చుకుని, సమానత్వంతో కూడిన ప్రమాణాలు చేస్తూ ఒకరినొకరు జీవిత భాగస్వాములుగా ప్రకటించుకుంటారు. అదీగాక 2023 ఆగస్టులో సుప్రీంకోర్టు ఆత్మగౌరవ వివాహాలు పూర్తిగా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది కూడా.

 

ఇదీ చదవండి: Miss Universe 2026: పింక్‌ లిల్లీలా అందంగా పాక్‌ బ్యూటీ మిస్బా అర్షద్‌..!

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement