ప్యూర్టో రికోలో మిస్ యూనివర్స్ 2026 పోటీ అధికారికంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. పోటీదారులంతా తమ దేశాల పేర్లతో ఉన్న శాష్‌లను అందుకున్నారు కూడా. అలాగే ఫైనల్‌కు ముందు ర్యాంపులపై తమ గ్లామర్‌తో హోయలు ఒలికిస్తుంటారు. అందులో భాగంగానే పాకిస్తాన్‌కు చెందిన మిస్బా అర్షద్ కూడా పింక్ లిల్లీ పువ్వులా మెరిసింది. అచ్చం పువ్వులా తన అందమైన కాస్ట్యూమ్‌తో కట్టిపడేసిందామె. అందుకు సంబంధించిన పోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది.
పువ్వులు ఒక దానితో ఒకటి పోటీ పడువు..అవి కేవలం వికసిస్తాయి అని రాసుకొచ్చింది. ఆమె ఈ మిస్ యూనివర్స్ 2026 వేదికపైకి పింక్ లిల్లీ పువ్వులా మెరిసింది. అంతేగాదు ఆ డిజైనర్‌వేర్ వెనుక ఉన్న కథను కూడా పంచుకుంది. ఈ దుస్తులను రూపొందించిన వియత్నామీస్ డిజైనర్ గుయెన్ టియెన్ ట్రూయెన్‌కు క్రెడిట్‌ని ఇస్తూ..ఆ పువ్వు వెనుక ఉన్న స్ఫూర్తిదాయక కథను పంచుకుంది ఇలా.
"గులాబీ రంగు లిల్లీ స్థైర్యం, స్త్రీత్వంలకు ప్రతీక అని, వీటినే మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ కూడా గౌరవిస్తుందని చెప్పుకొచ్చింది. మనమంతా అందమైన పువ్వులం..మన టైం వచ్చినప్పుడూ చక్కగా వికసించాలని. ముందుగా మన టైం వస్తుందనేది నమ్మండి. అలాగే మనమంతా అందమైన తోటలా మరి చక్కగా వికసిద్దాం" అంటూ తన పోస్ట్‌ని ముగించింది. ఆమె ఆకుపచ్చ గులాబీ రంగు దుస్తుల్లో అచ్చం ఒక లిల్లీ పువ్వు మాదిరిగా ఆకర్షణీయంగా కనిపించింది.
ఇదీ చదవండి: ప్రియాంక చోప్రా తోరానీ గౌను వెనుక ఇంత కథ ఉందా..?! ఏకంగా 2,200 గంటలు..


