source: X
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి శ్రీలంక ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 434-9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది.
పాక్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు అర్ద సెంచరీలతో రాణించారు. మిడిలార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ సెంచరీ చేజార్చుకున్నాడు. లంక బౌలర్లలో దిల్షన్ మధుషంక, అసిత ఫెర్నాండో చెరో 3 వికెట్లు పడగొట్టగా.. లహీరు కుమార, మిలన్ రత్నాయకే, సోనల్ దినుష తలో వికెట్ దక్కించుకున్నారు.
ఐదుగురు హాఫ్ సెంచరీలు
పాక్ ఇన్నింగ్స్‌లో తయ్యబ్ ఆరిఫ్ (57), మొహమ్మద్ తాహా (51), కెప్టెన్ బాబర్ ఆజం (50), అరాఫత్ మిన్హాస్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. సౌద్ షకీల్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. వికెట్ కీపర్ ఘాజీ ఘోరీ (48) అర్ద సెంచరీ మిస్ కాగా.. అజాన్ అవైస్ 30, సల్మాన్ అఘా 16, రజావుల్లా 10 పరుగులకు ఔటయ్యారు.
సాకిబ్ ఖాన్ ఖాతా తెరవనప్పటికీ నాటౌట్‌గా నిలవగా.. మొహమ్మద్ అబ్బాస్ బ్యాటింగ్‌కు దిగలేదు. పాక్ అప్పటికే 106.3 ఓవర్లు ఆడటంతో బాబర్ ఆజం హుటాహుటిన సాకిబ్ ఖాన్‌ను పెవిలియన్‌కు పిలిచి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.
కాగా, శ్రీలంక జట్టు టీ20, టెస్ట్ సిరీస్‌ల కోసం పాక్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలుత జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
ఇదీ చదవండి: న్యూజిలాండ్‌ను భారీ దెబ్బేసిన టీమిండియా


