Photo Credit: BCCI X
న్యూజిలాండ్- టీమిండియా మధ్య మంగళవారం జరగాల్సిన మూడో వన్డే వర్షం వల్ల రద్దైపోయింది. హామిల్టన్‌లో వాన వల్ల తొలుత టాస్ ఆలస్యమైంది. వర్షం కాస్త తెరిపినివ్వడంతో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
2-0తో ఆధిక్యంలో భారత్
అయితే, మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో కనీసం 20 ఓవర్ల ఆట అయినా సాధ్యమవుతుందని అంతా భావించారు. కానీ అంతకంతకూ వాన పెరగడంతో అధికారికంగా ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. కాగా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇప్పటికే భారత్ 2-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
ఇక మూడో వన్డే వర్షార్పణం కావడంతో భారత్ నాలుగు లేదంటే ఐదో వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవచ్చు. లేదంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఆతిథ్య కివీస్ గెలిచినా సిరీస్ 2-2తో సమం అవుతుంది. కాబట్టి ఎలా చూసిన వన్డే సిరీస్‌లో టీమిండియాకు ఓటమి ఎదురయ్యే పరిస్థితి మాత్రం లేదు. కాగా ఇంతకుముందు కివీస్‌తో టీ20 సిరీస్‌ను భారత్ 3-2తో గెలిచిన సంగతి తెలిసిందే. కాగా న్యూజిలాండ్‌లో భారత్‌తో వన్డేలు వర్షార్పణం కావడం ఇదే తొలిసారి కాదు.
న్యూజిలాండ్ వేదికగా వర్షం వల్ల రద్దైన వన్డేల జాబితా
జనవరి 14, 1999- వెల్లింగ్‌టన్‌లో వర్షం వల్ల మ్యాచ్ రద్దు
మార్చి 6, 2009- వెల్లింగ్‌టన్‌లో వర్షం వల్ల మ్యాచ్ రద్దు
నవంబరు 27, 2022- హామిల్టన్‌లో వర్షం వల్ల మ్యాచ్ రద్దు
నవంబరు 30, 2022- క్రైస్ట్‌చర్చ్‌లో వర్షం వల్ల మ్యాచ్ రద్దు
నవంబరు 10, 2026- హామిల్టన్‌లో వర్షం వల్ల మ్యాచ్ రద్దు.
ఇదీ చదవండి: కెప్టెన్‌గా రీఎంట్రీ.. ‘ట్రోఫీని ఇంటికి తీసుకొస్తా’


