breaking news
ODI series
-
ఈసీబీ కీలక నిర్ణయం.. ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై నిషేధం?
అప్గానిస్తాన్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నిర్వహణకు సిద్ధమైన ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌తో వన్డే సిరీస్ ఆడడం ఇంగ్లండ్‌కు ఇష్టం లేదు. దీనికి ప్రధాన కారణం ఆఫ్గన్‌లో మహిళల పట్ల తాలిబన్ల ప్రవర్తన, లింగ వివక్ష అని తెలుస్తోంది. 2025 చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్తాన్‌తో ఇంగ్లండ్ తలపడినప్పుడు లండన్‌లో వివిధ పార్టీలకు చెందిన 160 మంది ఎంపీల బృందం ఈసీబీని తీవ్రంగా విమర్శించింది. అప్పటి నుంచి అఫ్గాన్‌తో క్రికెట్ ఆడేందుకు నిరాకరించిన ఇంగ్లండ్ కేవలం ఐసీసీ మేజర్ టోర్నీల్లో మాత్రమే మ్యాచ్‌లు ఆడుతోంది. తాజాగా తమ కనుసన్నల్లో ఉండే ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఆఫ్గన్‌తో సిరీస్ నిర్వహణకు సిద్దమవ్వడం ఈసీబీకి కోపం తెప్పించింది. ఈ చర్య వల్ల ఇంగ్లండ్‌తో భవిష్యత్తులో ఆడాల్సిన అంతర్జాతీయ మ్యాచ్‌లను ఐర్లాండ్ కోల్పోయే ప్రమాదముందని చెప్పొచ్చు. గతంలో స్వదేశంలో యాషెస్ సిరీస్ ఆడడానికి ముందు ఇంగ్లండ్ సన్నాహకంగా ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది. 2019, 2023లో ఇది రిపీట్ అయింది. అయితే 2027 యాషెస్ సిరీస్‌కు ముందు మాత్రం ఈసారి ఐర్లాండ్‌తో కాకుండా బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాలని ఈసీబీ నిర్ణయం తీసుకోవడం చూస్తే ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై ఏర్పడిన వ్యతిరేకత స్పష్టంగా అర్థమవుతోంది. ఇటీవలి కాలంలో ఐర్లాండ్, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుతో (ఏసీబీ) సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నట్లు కనిపిస్తోంది. గత 10 సంవత్సరాల్లో ఐర్లాండ్, ఆఫ్గన్ల మధ్య ఇది ఐదో సిరీస్ కావడం విశేషం.అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ నిర్వహించడంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు స్వదేశంలో ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కొంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడడంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై గుర్రుగానే ఉన్నట్లు సమాచారం. క్రికెట్ బిగ్-త్రీ (బీసీసీఐ, ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియా)లో రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు తీరును వ్యతిరేకిస్తున్న వేళ అది క్రమంగా ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.చదవండి: తొలి టెస్టులో చోటు కష్టమే.. అందుకేనా బ్యాటింగ్ ప్రాక్టీస్! -
ఇంగ్లండ్ గడ్డ మీద సత్తా చాటిన టీమిండియా స్టార్
టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ గడ్డ మీద సత్తా చాటాడు. దేశీ వన్డే కప్ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి.. యార్క్‌షైర్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో చివరగా వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు కుల్దీప్.మేనేజ్మెంట్ తీరుపై విమర్శలుఅయితే, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఈ చైనామన్ స్పిన్నర్‌కు ఒకే ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైనా ఒక్క వన్డేలోనూ ఆడించకుండా.. కుల్దీప్ను బెంచ్‌కే పరిమితం చేసింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.ముఖ్యంగా లార్డ్స్‌లో చివరిదైన, నిర్ణయాత్మక మూడో వన్డేలో కుల్దీప్ యాదవ్‌ను ఆడిస్తే ఫలితం వేరేలా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తమ పార్ట్ టైమ్ స్పిన్నర్ల సేవల్ని ఉపయోగించుకుని గెలుపొంది.. సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.ఒకే ఓవర్లో రెండు వికెట్లతో సత్తాఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం పొందలేని కుల్దీప్ యాదవ్.. ఆ వెంటనే కౌంటీ ఫ్రాంఛైజీ యార్క్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో రాయల్ వన్డే కప్-2026లో భాగంగా శుక్రవారం గ్లామోర్గాన్‌తో యార్క్‌షైర్ తరఫున కుల్దీప్ అరంగేట్రం చేశాడు.ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో రెండు వికెట్లతో సత్తా చాటాడు కుల్దీప్. మొత్తంగా పది ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మొదటి తొమ్మిది ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, తన ఆఖరి ఓవర్లో అలెక్స్ హోర్టాన్, జేమీ మెక్‌రాయ్ వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లలో 39 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.యార్క్‌షైర్ విజయంఇక యార్క్‌షైర్‌కు చెందిన మీడియం పేసర్ బెంజమిన్ క్లిఫ్ కేవలం 29 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా గ్లామోర్గాన్ 186 పరుగులకే పరిమితం కాగా.. లక్ష్య ఛేదనలో యార్క్‌షైర్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.మరోవైపు.. నార్తాంప్టన్ తరఫున కెంట్ జట్టుపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ కూడా రెండు వికెట్లు తీశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో నార్తాంప్టన్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.చదవండి: తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించుకున్నాడు! -
అది వాళ్ల నిర్ణయం: బీసీసీఐ ఉపాధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మను ఉద్దేశించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పట్లో రోహిత్ రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. కాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్ వన్డేల్లో కొనసాగుతున్నాడు.బ్యాట్‌తోనే సమాధానంవన్డే ప్రపంచకప్-2027 ఆడటమే లక్ష్యంగా రోహిత్ శర్మ ఫిట్నెస్ను కూడా మెరుగుపరచుకుని ముందుకు సాగుతున్నాడు. అయితే, ఇటీవల ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన వన్డేనే హిట్‌మ్యాన్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అనే ప్రచారం జరిగింది.అయితే, ఇవన్నీ వట్టి ఊహాగానాలే అని తేలింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మెరుపు శతకం (138)తో చెలరేగి విమర్శకులకు రోహిత్ బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. అంతేకాదు.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తాను ఇప్పట్లో రిటైర్ కానని.. తాను ఆడినంత కాలం ఇలాంటి వదంతులు వస్తూనే ఉంటాయని పేర్కొన్నాడు.నిప్పు లేనిదే పొగ రాదుబీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సైతం రోహిత్ రిటైర్మెంట్ వార్తల్ని కొట్టిపారేశాడు. కానీ.. భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాత్రం.. ‘‘నిప్పు లేనిదే పొగ రాదు.. ఏదో జరిగే ఉంటుంది’’ అని అభిమానుల్లో సందేహాలు రేకెత్తించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.సెలక్టర్లదే అంతిమ నిర్ణయంయూపీ టీ20 లీగ్ మినీ వేలం కార్యక్రమానికి హాజరైన రాజీవ్ శుక్లా విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మా జట్టులో రోహిత్ అంతర్భాగం. అతడి ఆట కొనసాగుతుంది. మీడియా, సోషల్ మీడియాలో రోహిత్ గురించి వస్తున్న వార్తలకు అసలు అర్థమే లేదు.ఇప్పట్లో అతడు రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరికి తమ సొంత అభిప్రాయాలు ఉంటాయి. అయితే, జట్టులో ఎవరు ఉండాలి.. ఎవరిని తప్పించాలి అనే విషయంలో సెలక్టర్లదే అంతిమ నిర్ణయం’’ అని పేర్కొన్నాడు.ఇక ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో టీమిండియా వరుసగా మూడు సిరీస్‌లు కోల్పోయిన నేపథ్యంలో రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. ‘‘టీమిండియా ప్రస్తుతం బాగానే ఆడుతోంది. మ్యాచ్‌లు గెలుస్తోంది. కాబట్టి ఇప్పట్లో నాయకత్వ బృందంలో మార్పులు చేయాల్సిన అవసరం అయితే లేదు’’ అని కుండబద్దలు కొట్టాడు.వరుస పరాజయాల తర్వాత..కాగా టీ20 సిరీస్‌లలో పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ అయిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ 1-2తో ఓటమిపాలైంది. దీంతో టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌పై విమర్శలు రాగా.. రాజీవ్ శుక్లా మాత్రం తమ నాయకత్వ బృందానికి మద్దతుగా నిలవడం విశేషం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత టీ20 జట్టు.. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి.. మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.చదవండి: బంగ్లాదేశ్ అడ్డుపుల్ల.. అఫ్గాన్‌కు షాక్! -
ODI WC: మీకు దమ్ముంటే అతడిని తప్పించండి!
వన్డే వరల్డ్‌కప్ విజేత, భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మకు అండగా నిలిచాడు. దమ్ముంటే అతడిని జట్టు నుంచి తప్పించాలంటూ సెలక్టర్లకు సవాల్ విసిరాడు. కాగా రోహిత్ శర్మ భవితవ్యం గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇదే చివరి మ్యాచ్ అంటూ..వన్డే వరల్డ్‌కప్-2027 నాటికి రోహిత్ 40వ వసంతంలో అడుగుపెడతాడు. వయసు రీత్యా ఫిట్నెస్ సమస్యల వల్ల అతడు జట్టుకు భారం అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తంగా.. పది కిలోలకు పైగా బరువు తగ్గి స్లిమ్, ఫిట్‌గా మారాడు హిట్‌మ్యాన్. అయినప్పటికీ అతడి రిటైర్మెంట్పై ఊహాగానాలు ఆగలేదు.తాజాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆదివారం లార్డ్స్ మ్యాచ్ రోహిత్ కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, ఈ మ్యాచ్‌లో శతక్కొట్టి (138) మరీ విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు రోహిత్. అంతేకాదు.. ఆ తర్వాత రిటైర్మెంట్ వార్తలపై స్వయంగా స్పందించాడు.ఆడినంత కాలం ఇలాగే..‘నేను అరంగేట్రం చేసినప్పటి నుంచీ ఇలాంటి చర్చలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి. నేను ఆడినంత కాలం ఇవి కొనసాగుతూనే ఉంటాయి. అందుకే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గ్రౌండ్లో నేను ఏం చేస్తున్నాననేదే నాకు ముఖ్యం. జట్టు విజయానికి నా వంతు కృషి చేయడంపైనే నా దృష్టి. ఈ చర్చలు సాగనివ్వండి లేకపోతే మజా ఏముంటుంది.నా పని మైదానం లోపల... వారి పని బయట’ అని రోహిత్ తనదైన శైలిలో స్పందించాడు. ఈ క్రమంలో మదన్ లాల్ సైతం హిట్‌మ్యాన్‌కు మద్దతుగా నిలిచాడు. ‘‘నేడో.. రేపో.. ప్రతీ ఒక్క ఆటగాడు ఏదో ఒకరోజు రిటైర్ అవ్వాల్సిందే. అయితే, రోహిత్ శర్మ ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు ఇంకా ఆడాలనుకుంటే ఆడనివ్వండి.ఒకవేళ దమ్ము, ధైర్యం ఉంటేసెలక్టర్లకు ఒకవేళ దమ్ము, ధైర్యం ఉంటే అతడిని తప్పించి ముందుకు సాగండి చూద్దాం. ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇలాంటపుడు అతడి విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అంతేగానీ.. అతడి దగ్గరకు వెళ్లి.. ‘నువ్వు మా దీర్ఘకాలిక, వన్డే వరల్డ్‌కప్ ప్రణాళికల్లో గానీ లేవు’ అని అన్నారనుకోండి.అప్పుడు అతడు.. ‘ఏం.. ఎందుకు మీ ప్లాన్‌లో నేను లేను. నేను పరుగులు రాబడుతున్నా కదా!.. మరి నన్నెలా పక్కనపెడతారు’ అని అడుగుతాడు. అలా అడిగే హక్కు అతడికి ఉంది’’ అని మదన్ లాల్ సెలక్టర్లకు సవాల్ విసిరాడు. కాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు గుడ్‌బై చెప్పిన రోహిత్ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. టీమిండియాకు కెప్టెన్‌గా రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత అతడిది. టీ20 ప్రపంచకప్- 2024, చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలిపాడు.చదవండి: డెబ్బై పరుగులు చేయగానే గిల్‌కు కండరాలు పట్టేస్తాయి! -
డెబ్బై పరుగులు చేస్తాడు.. కండరాలు పట్టేస్తాయి: ఇంగ్లండ్ దిగ్గజం
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఫిట్‌నెస్‌పై ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ప్రశ్నలు సంధించాడు. కాస్త ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసిన ప్రతీసారీ అతడి కండరాలు పట్టేయడం శుభసూచకం కాదన్నాడు. ఇంగ్లండ్‌తో మొదటి, మూడో వన్డేలో 70 పరుగులు చేసిన తర్వాత గిల్ ఇబ్బంది పడ్డ తీరు జట్టుకు ఎంతమాత్రం మంచిది కాదని బ్రాడ్ పేర్కొన్నాడు.అసహనం వ్యక్తం చేసిన గిల్కాగా టీమిండియా ఆటగాళ్లు తరచూ గాయాల పాలవుతుండటంపై శుబ్‌మన్ గిల్ ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రెండు, మూడు మ్యాచ్‌లకు ఒకసారి గాయాలతో అందుబాటులో లేకుండా పోతే... వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఎలా ఆడతారని ప్రశ్నించాడు. ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆడిన మూడు సిరీస్‌ల్లోనూ భారత జట్టు ఓటమి పాలైన సంగతి తెలిసిందే ఇంగ్లండ్‌తో ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో గిల్ సారథ్యంలోని టీమిండియా 27 పరుగుల తేడాతో ఓడింది.మోకాలి గాయం కారణంగా ఆఖరి వన్డేకు పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోగా... పెద్దగా అనుభవం లేని భారత బౌలింగ్‌ను ఇంగ్లండ్ బ్యాటర్లు ఓ ఆటాడుకున్నారు. దీంతో టీమిండియా ముందు రికార్డు లక్ష్యం నిలిచింది. ఛేదనలో ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ సూపర్ సెంచరీకి గిల్, కోహ్లి అర్ధశతకాలు తోడవడంతో ఒక దశలో భారత్ గెలుస్తుందనిపించినా... మిగిలిన ప్లేయర్లు చేతులెత్తేయడంతో పరాజయం తప్పలేదు.గాయాల బెడదఈ సిరీస్ ప్రారంభానికి ముందే పేస్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి గాయాలతో జట్టుకు దూరం కాగా... హర్షిత్ రాణా టీ20 సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెండో మ్యాచ్‌లో గాయపడగా... మోకాలి గాయంతో బుమ్రా మూడో మ్యాచ్ ఆడలేదు. ఈ నేపథ్యంలో లార్డ్స్‌లో ఓటమి అనంతరం గిల్ మాట్లాడుతూ... ‘ముందు ప్రకటించిన జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు చివరి మ్యాచ్ ఆడలేదు. ఒక ఆటగాడు గాయపడితే... ప్రత్యామ్నాయ వ్యూహాన్ని అనుసరించవచ్చు. ఇద్దరు అందుబాటులో లేకపోతే జట్టు కూర్పును మార్చుకోవచ్చు.దీనికి మందు కనిపెట్టాలికానీ ప్రతి మ్యాచ్ తర్వాత ఎవరో ఒకరు గాయపడుతుంటే... జట్టు సమతుల్యత దెబ్బతింటుంది. దీనికి మందు కనిపెట్టాలి. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుంటే... అక్కడి వరుసగా పది, పదకొండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రెండు మ్యాచ్‌లకు గాయపడితే... మెగా టోర్నీలో ఎలా ఆడగలం. మ్యాచ్ రోజు ఉదయం వచ్చి నేను ఆడలేను అని అంటే వ్యూహాలు ఎలా అమలు చేయగలం’ అని అన్నాడు.వ్యక్తిగతంగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినా... ఇటీవలి కాలంలో తరచూ గాయపడుతున్న ప్లేయర్లను ఉద్దేశించే గిల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవతుంది. ఇదిలా ఉంటే... ఇటీవలి కాలంలో గిల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తరచూ కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.డెబ్బై పరుగులు చేస్తాడు.. కండరాలు పట్టేస్తాయిఈ నేపథ్యంలోనే స్టువర్ట్ బ్రాడ్ గిల్ ఫిట్నెస్ సమస్యల గురించి తాజాగా విమర్శించాడు. ‘‘ప్రతిసారీ అతడు 70 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత.. కండరాల నొప్పితో విలవిల్లాడుతున్నాడు. ఇంగ్లండ్‌తో తొలి, మూడో వన్డేలో అతడు ఇలాగే రిథమ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు’’ అని పేర్కొన్నాడు. కాగా తొలి వన్డేలో 80 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన శుబ్‌మన్ గిల్.. మూడో వన్డేలో 77 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు.చదవండి: వైఫల్యాలపై స్పందించిన వైభవ్ సూర్యవంశీ -
పరువు కాపాడిన హెట్‌మైర్, రూథర్‌ఫోర్డ్.. విండీస్‌దే చివరి వన్డే
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ తన పరువును కాపాడుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కివీస్‌కు అప్పగించిన వెస్టిండీస్ బుధవారం జరిగిన చివరి వన్డేలో మాత్రం 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 269 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన వెస్టిండీస్ 47.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ సీనియర్ బ్యాటర్ షిమ్రోన్ హెట్‌మైర్ (69 నాటౌట్) కడదాకా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించగా, షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్ (61) అర్ధసెంచరీతో మెరిశాడు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 95 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. రూథర్‌ఫోర్డ్ ఔటయ్యాకా మళ్లీ వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ హెట్‌మైర్ అజేయంగా నిలిచి విండీస్‌ను గెలిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ, జేడన్ లెన్నోక్స్ చెరో మూడు వికెట్లు తీయగా, నాథన్ స్మిత్, మైకెల్ బ్రాస్‌వెల్ చెరొక వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (69), నిక్ కెల్లీ (64), విల్ యంగ్ (56) అర్ధసెంచరీలు సాధించారు. విండీస్ బౌలర్లలో విటెల్ లాయిస్, అల్జారీ జోసెఫ్ చెరో 2 వికెట్లు తీశారు. విండీస్‌ను గెలిపించిన హెట్‌మైర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకోగా, సిరీస్‌లో 14 వికెట్లతో అదరగొట్టిన కివీస్ బౌలర్ జేడన్ లెనోక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.చదవండి: అతడి విషయంలో బీసీసీఐ ఆందోళన.. జట్టు ప్రకటన వాయిదా! -
వరల్డ్‌లోనే బెస్ట్.. ఎందుకు ఆడించలేదు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం వైఖరిపై ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌ని తుదిజట్టులోకి తీసుకోకుండా పక్కనపెట్టడం ఏమిటని ప్రశ్నించాడు. కాగా ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.లార్డ్స్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డేకు ముందు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడగా.. ఈసారి కుల్దీప్ను ఆడిస్తారని అంతా అనుకున్నారు. కానీ టీమిండియా మేనేజ్మెంట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కుల్దీప్ను కాదని.. పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌ను ఆడించింది. మొత్తంగా నలుగురు సీమర్లతో బరిలోకి దిగి మూల్యం చెల్లించింది.బౌలర్లంతా విఫలంగుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా తేలిపోయాడు. ఫలితంగా ఇంగ్లండ్ 50 ఓవర్లలో కేవలం మూడే వికెట్లు నష్టపోయి 387 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది.ఈ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడిన టీమిండియా.. 27 పరుగుల తేడాతో ఓటమిపాలై.. సిరీస్‌నూ 1-2తో చేజార్చుకుంది. ఇంగ్లండ్ తమ పార్ట్‌టైమ్ స్పిన్నర్ల సేవలను కూడా ఉపయోగించుకుని గిల్ సేనను దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలో మొయిన్ అలీ టీమిండియా వ్యూహాన్ని తప్పుబట్టాడు.వరల్డ్‌లోనే బెస్ట్.. ఎందుకు ఆడించలేదుయూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అసలు కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు ఆడించలేదో నాకింకా అర్థం కావడం లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో అతడూ ఒకడు. ఇంగ్లండ్‌కు ఆదిల్ రషీద్ మాదిరే.. టీమిండియాకు కుల్దీప్ కూడా!.. భాగస్వామ్యాలను విడదీస్తూ వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంలో అతడు దిట్ట. కానీ టీమిండియా మాత్రం వాళ్ల బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టం చేసుకోవడానికి కుల్దీప్ను పక్కనపెట్టింది.భారత బౌలర్లకు బ్యాటింగ్ చేతకాదు. వాళ్ల జట్టులో ఉన్న అతిపెద్ద సమస్య ఇదే’’ అని మొయిన్ అలీ విమర్శించాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుంటే టీమిండియా బౌలింగ్ విభాగం యావరేజ్‌గా ఉంటుందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో తీసుకోకపోవడాన్ని టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సమర్థించుకున్నాడు. తుది జట్టు కూర్పులో భాగంగా తీసుకున్న నిర్ణయమే అని వెల్లడించాడు. చదవండి: శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు -
ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది.. మీరేం చేస్తున్నారు?
టీమిండియాతో వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ అదరగొట్టాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి వన్డేలో 76 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ వన్‌డౌన్ బ్యాటర్.. కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా.. సహచరుడికి మ్యాచ్ ముగించే అవకాశం ఇచ్చి.. హుందాగా వ్యవహరించాడు.ఈ మ్యాచ్‌లో రూట్ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ జయభేరి మోగించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక లార్డ్స్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డేలోనూ రూట్ మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. కేవలం 39 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 48 బంతుల్లో తొమ్మిది ఫోర్లు బాది 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇంగ్లండ్ తొలి క్రికెటర్‌గా రికార్డుఇక మూడో వన్డేలో గెలిచి ఇంగ్లండ్ సిరీస్ 2-1తో కైవసం చేసుకోగా.. టీమిండియా ఓటమితో నిరాశగా వెనుదిరిగింది. రూట్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.నిజానికి గత కొంతకాలంగా రూట్ వన్డేల్లోనూ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ ముప్పై ఐదేళ్ల బ్యాటర్ గత ఆరు వన్డే ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులు వరుసగా.. 61, 75, 111*, 76*, 99*, 74*. తద్వారా ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో వరుసగా ఆరు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన తొలి క్రికెటర్‌గా రూట్ చరిత్రకెక్కాడు.ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది.. మీరేం చేస్తున్నారు?ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ సదగోపన్ రమేశ్ టీమిండియా యాజమాన్యం వైఖరిని విమర్శించాడు. ఇంగ్లండ్ మేనేజ్మెంట్ జో రూట్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చి.. మంచి ఫలితాలు రాబడుతోందన్నాడు. అదే సమయంలో భారత జట్టు యాజమాన్యం మాత్రం దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి విషయంలో తప్పు చేస్తోందని మండిపడ్డాడు.కాగా ఇప్పటికే రోహిత్- కోహ్లి అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే వరల్డ్‌కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే, అనూహ్య రీతిలో రోహిత్‌ను కెప్టెన్సీ తప్పించిన యాజమాన్యం.. రో-కో ప్రపంచకప్ ఆడతారో లేదోనన్న అంశంపై తమకు స్పష్టత లేదన్నారు.రోహిత్ భారీ శతకంఈ క్రమంలోనే లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో మూడో వన్డే సందర్భంగా రోహిత్ శర్మ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోడుతన్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్ భారీ శతకం (138)తో రాణించి ఊహాగానాలకు చెక్ పెట్టాడు. తాను రిటైర్ కాబోవడం లేదని స్పష్టం చేశాడు.మీరు తప్పు చేస్తున్నారుఈ పరిణామాల నేపథ్యంలో నేపథ్యంలో రమేశ్ స్పందిస్తూ.. ‘‘విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు యాజమాన్యం మద్దతుగా ఉండాల్సిన సమయం ఇది. వాళ్లిద్దరు ఇప్పటికీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ఉన్న సత్తా కలవారు. ఓసారి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ను చూడండి. జో రూట్‌కు వాళ్లు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నారు. అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకునేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు.అతడిపై ఏమాత్రం ఒత్తిడి పెట్టడం లేదు. ఇంగ్లండ్ రూట్‌ను తమ బలంగా భావిస్తోంది. కానీ భారత జట్టు యాజమాన్యం మాత్రం రోహిత్- విరాట్లనే తమ వెన్నెముకగా భావించాల్సింది పోయి వారి విషయంలోనే స్పష్టత లేకుండా చేస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్ వరుసగా 11, 26, 138 పరుగులు చేయగా.. కోహ్లి 5, 74, 65 పరుగులు సాధించాడు.చదవండి: లార్డ్స్ వన్డేలో అదే హైలైట్: పాక్ మాజీ క్రికెటర్ -
లార్డ్స్ మ్యాచ్‌లో అదే హైలైట్: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ కెరీర్ చరమాంకానికి చేరిందంటూ గత కొంతకాలంగా వస్తున్న వార్తలకు.. ‘హిట్‌మ్యాన్’ లార్డ్స్‌లో శతకంతో చెక్ పెట్టాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డే సందర్భంగా క్రికెట్ ‘మక్కా’లో సెంచరీ బాది తన బ్యాట్ పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. కాగా ఇంగ్లండ్‌తో లార్డ్స్ వన్డేనే రోహిత్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 110 బంతుల్లోనే పదిహేడు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 138 పరుగులతో అదరగొట్టాడు.లార్డ్స్ మ్యాచ్‌లో అదే హైలైట్అనంతరం తన రిటైర్మెంట్ వార్తలపై స్పందిస్తూ.. తాను క్రికెట్ ఆడుతున్నంత కాలం... రిటైర్మెంట్ ఊహాగానాలు వస్తూ ఉంటాయని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి వార్తలతో పోరాడటం కంటే... మైదానంలో పరుగులు సాధించడంపైనే దృష్టి పెడతానని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లతో పాటు పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ సైతం రోహిత్ శర్మకు మద్దతుగా నిలిచాడు. గేమ్ ప్లాన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్‌లో గెలిచేందుకు ఇంగ్లండ్‌కు అర్హత ఉంది. అయితే, ఆ విషయం కంటే కూడా రోహిత్ శర్మ సెంచరీ చేయడమే లార్డ్స్ మ్యాచ్‌కు హైలైట్. ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో తానూ ఒకడినని.. ఇప్పటికీ తన ఆటలో పదును తగ్గలేని రోహిత్ తన ఇన్నింగ్స్ ద్వారా స్టేట్మెంట్ ఇచ్చాడు. అతడి భవిష్యత్తు గురించి చాలా వదంతులు వస్తున్నాయి. వన్డే వరల్డ్‌కప్-2027 ప్రణాళికల్లో అతడు లేడని చాలా మంది అంటున్నారు. వాళ్లు తలచుకుంటేనే..అయితే, తనను విమర్శించే వాళ్లందరికీ రోహిత్ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. రోహిత్, విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లను ఎవరూ జట్టు నుంచి బయటకు పంపలేరు. ఆటకు వీడ్కోలు పలకడానికి సరైన సమయం వచ్చిందని భావిస్తే వాళ్లే స్వయంగా తప్పుకొంటారు. రిటైర్మెంట్ అనేది కేవలం వారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. భారత క్రికెట్‌కు వీరిద్దరు చేసిన సేవలు వెలకట్టలేనివి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే క్రమంలో మిగతా ఫార్మాట్ల నుంచి వారే తప్పుకొన్నారు. అందుకే వాళ్లు నేటికీ సూపర్స్టార్లుగానే కొనసాగుతున్నారు’’ అని కమ్రాన్ అక్మల్ రో-కోలపై ప్రశంసలు కురిపించాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో 4-0తో వైట్‌వాష్ అయిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.ఇదిలా ఉంటే.. 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన తర్వాత.. రోహిత్- కోహ్లి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. గతేడాది వారం రోజుల వ్యవధిలో ఇద్దరూ టెస్టులకూ గుడ్‌బై చెప్పారు. వరల్డ్‌కప్-2027 ఆడటమే లక్ష్యంగా వన్డేల్లో కొనసాగుతున్నారు.చదవండి: ఆటకు గుడ్‌బై చెప్పు... భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
వికెట్ తేడాతో సంచలన విజయం.. కివీస్‌దే వన్డే సిరీస్
వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ వికెట్ తేడాతో వెస్టిండీస్‌పై సంచలనం విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 44.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో అమిర్ జాంగో (51) అర్ధసెంచరీ సాధించగా, ఆఖర్లో గుదకేశ్ మోతీ (41) రాణించాడు. ఒక దశలో 81 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిన విండీస్‌ను గుదకేశ్, అమిర్ జాంగో ఆదుకున్నారు. ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు 81 పరుగులు జోడించడంతో వెస్టిండీస్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో మాథ్యూ ఫిషర్ మూడు వికెట్లు తీయగా, మిచెల్ సాంట్నర్, మైకెల్ బ్రాస్‌వెల్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ కూడా తడబడింది. 88 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో మార్క్ చాప్మన్ (80), మైకెల్బ్రాస్వెల్ (32), మిచెల్సాంట్నర్ (34 నాటౌట్) విలువైన భాగస్వామ్యాలు నిర్మించారు. చాప్మన్, బ్రాస్‌వెల్ వెనుదిరిగినప్పటికీ కడదాకా నిలిచిన కెప్టెన్ సాంట్నర్ మరో 35 బంతులు మిగిలి ఉండగానే (44.5 ఓవర్లలో) జట్టును విజయతీరాలకు చేర్చాడు. విండీస్ బౌలర్లలో గుదకేశ్ మోతీ 5 వికెట్లతో సత్తా చాటగా, మాథ్యూ ఫోర్డ్ 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన మిచెల్ సాంట్నర్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన చివరి వన్డే రేపు జరగనుంది. -
ఆటకు గుడ్‌బై చెప్పు.. భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఇంగ్లండ్‌తో కీలక మూడో మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా వన్డే సిరీస్‌నూ కోల్పోయింది. లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన వన్డేలో గిల్ సేన 27 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమికి ప్రధాన కారణం భారత బౌలర్ల వైఫల్యమే అని చెప్పడంలో సందేహం లేదు.నలుగురు సీమర్లు అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ కృష్ణలతో పాటు.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌లను టీమిండియా బరిలోకి దించింది. ఈ మ్యాచ్‌కు ముందు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డారు. దీంతో వాషీ స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడిస్తారని విశ్లేషకులు భావించారు. అయితే, ఇక్కడ మధ్య ఓవర్లలో స్పిన్నర్ల కంటే పేసర్లే ఎక్కువ ప్రభావం చూపుతారన్న కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. కుల్దీప్ను కాదని ప్రిన్స్ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు.మూకుమ్మడిగా విఫలంఅయితే, ఈ వ్యూహం బెడిసి కొట్టింది. బౌలర్లంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు. గుర్నూర్ బ్రార్ అయితే పది ఓవర్ల కోటాలో ఏకంగా 97 పరుగులు సమర్పించుకుని లార్డ్స్‌లో చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇక అర్ష్‌దీప్ తన కోటా పూర్తి చేసి 72 పరుగులు ఇవ్వగా.. ప్రసిద్ కృష్ణ 10 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు.అత్యధిక స్కోరుమరోవైపు.. ప్రిన్స్ యాదవ్ పది ఓవర్ల కోటా పూర్తి చేసి 79 రన్స్ ఇచ్చుకుని ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అక్షర్ పటేల్ పది ఓవర్లలో 61 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ నిర్ణీత యాభై ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 387 పరుగులతో లార్డ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా 360 పరుగులు మాత్రమే చేసి ఓటమిని ఆహ్వానించింది.రిటైర్మెంట్ ప్రకటించేలా ఒత్తిడిఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుల్దీప్ యాదవ్ పట్ల మేనేజ్మెంట్ వైఖరి సరిగ్గా లేదని విమర్శించాడు. ‘‘కుల్దీప్ కెరీర్ ముగిసిపోయింది.. ఇక బ్యాగులు సర్దుకోవడమే తరువాయి.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలి’ అనేలా కుల్దీప్ను గందరగోళంలో పడేస్తున్నారు.లార్డ్స్ మ్యాచ్‌లో బుమ్రా, వాషింగ్టన్, వరుణ్ చక్రవర్తి.. ఈ ముగ్గురూ లేరు. మరి వాషీ స్థానంలోనైనా కుల్దీప్ను తుదిజట్టులోకి తీసుకోవచ్చు కదా!.. లార్డ్స్‌లో వైవిధ్యంగా బౌలింగ్ చేసేవాళ్లు కావాలి. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన కుల్దీప్ ఇక్కడ గొప్పగా బౌలింగ్ చేయగలడు.118 వన్డేల్లోనే అతడు 194 వికెటుల కూల్చాడు. అయినా సరే ఈ గణాంకాలను మీరు పరిగణనలోకి తీసుకోరు అనిపిస్తోంది. ఇక భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సైతం కుల్దీప్ యాదవ్‌ను ఆడించకపోవడాన్ని తప్పుబట్టాడు. అశూ ఆగ్రహంఇంగ్లండ్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడించకుండా అతడిని పక్కనపెట్టారని.. ఇది కుల్దీప్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అశూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా యూకే పర్యటనలో టీ20 సిరీస్‌లలో ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ అయింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో 2-1తో ఓటమిపాలైంది.చదవండి: అందుకే అతడు బెంచ్‌కే పరిమితం: గిల్ -
లార్డ్స్‌లో సెంచరీ.. రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్
రిటైర్మెంట్ వార్తల నడుమ లార్డ్స్ మైదానంలో టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మ అద్భుత శతకంతో మెరిశాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం నాటి మూడో వన్డే సందర్భంగా 138 పరుగులు సాధించాడు. తొలుత నెమ్మదిగా ఆడిన హిట్‌మ్యాన్ ఆ తర్వాత గేరు మార్చి.. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.ఈ క్రమంలో 110 బంతుల్లో 17 ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 138 పరుగులు చేశాడు. అయితే, జేకబ్ బెతెల్ అనూహ్య రీతిలో రోహిత్‌ను బౌల్డ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో మరో ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (77), వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (74) అర్ధ శతకాలు సాధించినా ఫలితం లేకుండా పోయింది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఓడి టీమిండియా సిరీస్‌ను 1-2తో ఇంగ్లండ్‌కు కోల్పోయింది.The name is Rohit Gurunath Sharma. 🫡The occasion? A Lord's century. 💯Watch #ENGvIND 3rd ODI LIVE NOW on Sony Sports Network TV channels. #SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/G5HoYMO0BV— Sony Sports Network (@SonySportsNetwk) July 19, 2026రూమర్లు కొత్తేం కాదుఇదిలా ఉంటే.. తాజాగా బీసీసీఐ టీవీతో మాట్లాడిన రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు. ‘‘మైదానంలోకి వచ్చి బ్యాటింగ్ చేయడం నా ముఖ్య విధి. దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయం. నా అరంగేట్రం రోజు నుంచి నేటి దాకా అదే నిబద్ధత, అంకితభావంతో ముందుకు సాగుతున్నాను.అంతేకాదు నేను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నాటి నుంచే ఇలాంటి వార్తలు వింటూ ఉన్నాను. నేను మళ్లీ గ్రౌండ్లోకి వెళ్లే దాకా ఈ వదంతులు ఆగవు. అయినా.. ఇలాంటి రూమర్లు నాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. మైదానంలో నా ఆట తీరు ఎలా ఉందన్నదే ముఖ్యం.జట్టు విజయం కోసం నా వంతు కృషి చేస్తాను. కేవలం ఆ ఒక్క విషయంపైనే నా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. అయినా ఇలాంటి వదంతులు ఉంటేనే కదా.. మనకూ కాస్త సరదాగా అనిపిస్తుంది. నా పని నాదే. బయట ఎవరి పని వాళ్లదే. వాళ్లు ఇలాంటి రూమర్లతో ప్రాచుర్యం పొందాలనుకుంటారు’’ అని రోహిత్ శర్మ గాసిప్‌రాయుళ్లకు కౌంటర్ వేశాడు.కాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకొన్న రోహిత్ శర్మ.. వన్డే వరల్డ్‌కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. అయితే, లార్డ్స్‌లో రోహిత్ చివరి మ్యాచ్ ఆడబోతున్నాడనే ప్రచారం జరుగగా.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేశాడు. కెప్టెన్ గిల్ సైతం ఇవన్నీ కేవలం ఊహాగానాలే అన్నాడు.మా మధ్య అవగాహన ఉందిఇదిలా ఉంటే.. రోహిత్- కోహ్లి కలిసి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 400 మ్యాచ్‌లలో కలిసి ఆడిన తొలి భారత జోడీగా చరిత్రకెక్కారు. ఈ నేపథ్యంలో రోహిత్ స్పందిస్తూ.. ‘‘మా కెరీర్ తొలి నాళ్ల నుంచి మేము కలిసి ఆడుతున్నాం. ఇప్పటికే మేమిద్దరం కలిసి ఎన్నోసార్లు మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాము.మధ్య ఓవర్లలో కోహ్లి వస్తే అతడితో కలిసి ఆడటం నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఈరోజు కూడా ఇద్దరం కలిసే ఆడాము. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. ఆట మధ్యలో మేము ఎక్కువగా చర్చించుకుంటాము. ఒకరి ఆలోచనలు ఒకరం పంచుకుంటూ.. ఒకరినొకరం అర్థం చేసుకుంటూ బ్యాటింగ్ చేస్తూ ఉంటాము’’ అని కోహ్లితో ఉన్న అనుబంధం, సమన్వయం గురించి చెప్పుకొచ్చాడు.చదవండి: మెరుగుపడాల్సిందే: శుబ్‌మన్ గిల్ వార్నింగ్ -
మెరుగుపడాల్సిందే: బుమ్రాతో పాటు వాళ్లకు గిల్ వార్నింగ్!
ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. లార్డ్స్‌లో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్ దారుణంగా విఫలమైంది. టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడంతో ఇంగ్లండ్ రికార్డు స్థాయిలో 387 పరుగులు చేసింది.గాయాల వల్ల ఇద్దరూ దూరంలక్ష్య ఛేదనలో భారత్ 360 పరుగులకే పరిమితమై.. 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా సిరీస్ 2-1తో ఇంగ్లండ్ సొంతమైంది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌కు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక గాయం కారణంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా మ్యాచ్ ఆడలేకపోయాడు.గిల్ కీలక వ్యాఖ్యలుబుమ్రా, వాషీ స్థానాల్లో అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ మూడో వన్డే ఆడారు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తరచూ గాయపడే ఆటగాళ్ల వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతింటోందన్నాడు. ఈ మేరకు.. ‘‘ఒక ఆటగాడు గాయపడితే కూర్పు ఒకలా ఉంటుంది.ఒకరి కంటే ఎక్కువ మంది గాయపడితే జట్టు కాంబినేషన్లో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రతీ మ్యాచ్ తర్వాత ఒక ఆటగాడు గాయపడతున్నాడంటే మేము ఎక్కడో ట్రిక్ మిస్ అవుతున్నామని అనిపిస్తోంది.ఎక్కడో చోట తేడా కొడుతుందిప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని మేము 11 మ్యాచ్‌లు వరుసగా ఆడాల్సి ఉంది. అయితే, తరచూ గాయాల బారిన పడే ఆటగాళ్లు ఈ సిరీస్‌లో రెండు లేదంటే మూడు మ్యాచ్‌లు మిస్ కావొచ్చు. ఇలా ఎక్కడో చోట తేడా కొడుతుంది. తరచూ గాయపడే ప్లేయర్ ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు ఆడతాడు.ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యల వల్ల దూరమవుతాడు. అలాంటి సమయంలో కొత్త ప్లేయర్‌ను ఆడించాల్సి ఉంటుంది. నిజానికి తుదిజట్టును తరచూ మార్చాలనే ఆలోచన మాకు లేదు. కానీ గాయాల వల్ల తప్పక ఇలా చేయాల్సి వస్తోంది.ఎప్పుడు ఎవరు గాయపడతారో తెలియదు. కొంతమంది 80 శాతం ఫిట్‌గా ఉన్నా సరే ఆడటానికి ముందుకు వస్తారు. అయితే, మేము ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే.. అందులో ఒకరు కేవలం ఐదు ఓవర్లు మాత్రమే బౌల్ చేస్తామంటే కుదరదు కదా!మెరుగుపడాల్సిందేపూర్తి ఫిట్‌గా ఉంటేనే వారు పది ఓవర్లు బౌల్ చేయగలరు. కాబట్టి మేము రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ఏదేమైనా జట్టుగా మేము ఫిట్నెస్ ప్రమాణాలను మరింతగా మెరుగపరచుకోవాల్సి ఉంది’’ అని శుబ్‌మన్ గిల్ పేర్కొన్నాడు. తరచూ గాయాలుకాగా పేస్ దళ నాయకుడు బుమ్రా తరచూ గాయపడుతున్న సంగతి తెలిసిందే. చాలా నెలల తర్వాత ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా ఇటీవలే అతడు యాభై ఓవర్ల ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు. రెండు మ్యాచ్‌లు ఆడగానే.. మోకాలి గాయంతో కీలకమైన మూడో వన్డేకు దూరమయ్యాడు.అంతేకాదు బుమ్రాపై పనిభారం తగ్గించే క్రమంలో మేనేజ్మెంట్ అతడికి తరచూ విశ్రాంతినిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో గిల్ ఒక రకంగా బుమ్రా ఫిట్నెస్ ప్రమాణాల పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ ప్రస్తావన తేవడం ద్వారా ఈ పేస్ గుర్రానికి గిల్ పరోక్షంగా హెచ్చరిక జారీ చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా యూకే పర్యటనలో భాగంగా తొలుత ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్ అయిన టీమిండియా.. ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్ అయింది. తాజాగా వన్డే సిరీస్‌నూ కోల్పోయి ఓటమితో నిష్క్రమించింది.చదవండి: వారి వల్లే ఓడిపోయాం.. అతడు అద్భుతం: గిల్ -
లార్డ్స్‌లో చరిత్ర తిరగరాసిన బెన్ డకెట్
భారత్‌తో మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ శతక్కొట్టాడు. ఆది నుంచి నిలకడగా ఆడుతూ భారీ సెంచరీతో అలరించాడు. ఈ క్రమంలో క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ మైదానంలో డకెట్ చరిత్ర తిరగరాశాడు. వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న 47 ఏళ్ల రికార్డును ఈ లెఫ్టాండ్ బ్యాటర్ బద్దలు కొట్టాడు.141 పరుగులులార్డ్స్ వేదికగా టీమిండియాతో నిర్ణయాత్మక మూడో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ బెన్ డకెట్ 135 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో ఏకంగా 141 పరుగులు సాధించాడు. అయితే, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇవ్వడంతో డకెట్ శతక ఇన్నింగ్స్ ముగిసిపోయింది.లార్డ్స్‌లో ప్రపంచ రికార్డుఅయితే, ఈ భారీ శతకం ద్వారా డకెట్ లార్డ్స్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ ‘మక్కా’లో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు వివియన్ రిచర్డ్స్ పేరిట ఉండేది. ఇక మ్యాచ్ విషయానికొస్తే..Nailed to the boundary!A superb hundred for Ben Duckett at Lord's 💯🤝 @IGcom pic.twitter.com/NwS3IH5tMJ— England Cricket (@englandcricket) July 19, 2026డకెట్ శతకంతో చెలరేగగా.. మరో ఓపెనర్ జేకబ్ బెతెల్ (91) సెంచరీ మిస్ అయ్యాడు. ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి బెతెల్ అవుటయ్యాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్ మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. వన్డేల్లో వరుసగా ఆరో అర్ధ శతకం (48 బంతుల్లోనే 74 నాటౌట్) బాదాడు.ఇంగ్లండ్ భారీ స్కోరుకెప్టెన్ హ్యారీ బ్రూక్ (14) నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ కేవలం 13 బంతుల్లోనే 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో ఏకంగా 315కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. దీంతో ఇంగ్లండ్ నిర్ణీత యాభై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 387 పరుగులు సాధించింది. లార్డ్స్‌లో వన్డేల్లో ఇదే హయ్యస్ట్ స్కోరు.లార్డ్స్ మైదానంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్లు👉బెన్ డకెట్ (ఇంగ్లండ్)- టీమిండియా మీద 2026లో 141 పరుగులు👉వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- ఇంగ్లండ్ మీద 1979 వరల్డ్‌కప్ ఫైనల్లో 138 నాటౌట్👉డెనిస్ ఆమిస్ (ఇంగ్లండ్)- టీమిండియా మీద 1975లో 137 పరుగులు👉మార్కస్ ట్రెస్కోతిక్ (ఇంగ్లండ్)- పాకిస్తాన్ మీద 2001లో 137 పరుగులు👉గ్రాహమ్ గూచ్ (ఇంగ్లండ్)- ఆస్ట్రేలియా మీద 1989లో 136 పరుగులు.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్- కోహ్లి -
IND vs ENG: ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు
టీమిండియాతో మూడో వన్డేలో ఇంగ్లండ్ టాపార్డర్ అదరగొట్టింది. ఓపెనర్లు బెన్ డకెట్, జేకబ్ బెతెల్.. వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్ భారత బౌలింగ్‌ను చితక్కొట్టారు. వీరికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.Nailed to the boundary!A superb hundred for Ben Duckett at Lord's 💯🤝 @IGcom pic.twitter.com/NwS3IH5tMJ— England Cricket (@englandcricket) July 19, 2026ఈ క్రమంలో క్రికెట్ ‘మక్కా’గా పేరొందిన లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. కాగా సిరీస్ ఫలితాన్ని తేల్చే నిర్ణయాత్మక మూడో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో డకెట్ భారీ శతకం (135 బంతుల్లో 141) సాధించగా.. బెతెల్ (93 బంతుల్లో 91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.Joe Root reaches 𝑨𝑵𝑶𝑻𝑯𝑬𝑹 ODI half-century 🤯🤝 @IGcom pic.twitter.com/a4G4KmkxKP— England Cricket (@englandcricket) July 19, 2026ఇక జో రూట్ వన్డేల్లో వరుసగా ఆరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 48 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు బాది 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (14) విఫలం కాగా బట్లర్ మెరుపులు మెరిపించాడు. కేవలం 13 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 41 పరుగులు రాబట్టాడు. రూట్‌తో కలిసి ఐదో వికెట్‌కు 19 బంతుల్లోనే 63 పరుగులు జోడించి అజేయంగా నిలిచాడు.Miss any of that? Don't worry, our catch-up highlights have the very best of that ridiculous first innings at Lord's 👇— England Cricket (@englandcricket) July 19, 2026ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో ఇంగ్లండ్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఏకంగా 387 పరుగులు సాధించింది. వన్డేల్లో ఇంగ్లండ్‌కు టీమిండియాపై ఇదే అత్యధిక స్కోరు. అంతేకాదు క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ మైదానంలో వన్డే ఫార్మాట్లో ఇదే హయ్యస్ట్ స్కోరు కావడం విశేషం. తద్వారా లార్డ్స్‌లో వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ తమ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తాజాగా సవరించింది.లార్డ్స్ మైదానంలో వన్డేల్లో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు ఇవే👉ఇంగ్లండ్- 2026 జూలై 19న టీమిండియాపై 50 ఓవర్లలో 387/3👉ఇంగ్లండ్- 1975 జూన్ 7న టీమిండియాపై 60 ఓవర్లలో 334/4👉సౌతాఫ్రికా- 2025 సెప్టెంబరు 4న ఇంగ్లండ్‌పై 50 ఓవర్లలో 330/8👉ఇంగ్లండ్- 2017 మే 7న ఐర్లాండ్‌పై 50 ఓవర్లలో 328/6👉ఇండియా- 2002 జూలై 13న ఇంగ్లండ్‌పై 49.3 ఓవర్లలో 326/8. -
IND vs ENG: ఓపెనర్ల రికార్డు భాగస్వామ్యం.. ఇంగ్లండ్ స్కోరెంతంటే?
టీమిండియాతో నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు బెన్ డకెట్, జేకబ్ బెతెల్ నిలకడగా ఆడుతూ భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 181 బంతుల్లో ఏకంగా 192 పరుగులు జోడించారు.మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా గెలవగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోఇరుజట్ల మధ్య ఆదివారం నాటిక నిర్ణయాత్మక మూడో వన్డేకు ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా మారింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.బెతెల్ సెంచరీ మిస్కాస్త నెమ్మదిగా ఆరంభించినప్పటికీ ఇంగ్లండ్ ఓపెనర్లు డకెట్, బెతెల్ నెమ్మదిగా క్రీజులో పాతుకుపోయారు. ఈ ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు ఎంతగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో 93 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 91 పరుగులు చేశాడు బెతెల్.అయితే, ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 31వ ఓవర్లో తొలి బంతికే ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇవ్వడంతో బెతెల్ అవుటయ్యాడు. సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక నెమ్మదిగా ఆడుతూ 64 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డకెట్.. 36వ ఓవర్లో రెండో బంతికి ఫోర్ బాది శతక మార్కు అందుకున్నాడు. మొత్తానికి 108 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.డకెట్ భారీ శతకంఆ తర్వాత కూడా డకెట్, రూట్‌తో కలిసి జోరు కొనసాగించాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 80 బంతుల్లో 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, 44వ ఓవర్లో మూడో బంతికి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇవ్వడంతో డకెట్ సెంచరీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 135 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 18 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 141 పరుగులు సాధించాడు.Nailed to the boundary!A superb hundred for Ben Duckett at Lord's 💯🤝 @IGcom pic.twitter.com/NwS3IH5tMJ— England Cricket (@englandcricket) July 19, 2026రూట్, బట్లర్ మెరుపులుఇక 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్.. 48 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు బాది 74 పరుగులు రాబట్టాడు. నాలుగో నంబర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (14) విఫలం కాగా.. ఐదో స్థానంలో వచ్చిన జోస్ బట్లర్ టీ20 తరహాలో దంచికొట్టాడు. కేవలం 13 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 41 పరుగులతో రూట్‌తో కలిసి అజేయంగా నిలిచాడు. రూట్, బట్లర్ కలిసి 19 బంతుల్లోనే 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో ఇంగ్లండ్ కేవలం మూడు వికెట్లు నష్టపోయి ఏకంగా 387 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. కాగా వన్డే ఫార్మాట్లో భారత్‌పై ఇంగ్లండ్‌కు ఇదే అత్యధిక స్కోరు. Joe Root reaches 𝑨𝑵𝑶𝑻𝑯𝑬𝑹 ODI half-century 🤯🤝 @IGcom pic.twitter.com/a4G4KmkxKP— England Cricket (@englandcricket) July 19, 2026భారత బౌలర్లు పూర్తిగా విఫలంనలుగురు సీమర్లు అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్‌తో బరిలోకి దిగిన టీమిండియా వ్యూహం బెడిసి కొట్టింది. గుర్నూర్ పది ఓవర్ల కోటాలో ఏకంగా 97 పరుగులు సమర్పించుకోగా.. అర్ష్‌దీప్ తన కోటా పూర్తి చేసి 72 పరుగులు ఇచ్చుకున్నాడు.ఇక ప్రసిద్ కృష్ణ 10 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్రిన్స్ యాదవ్ కోటా పూర్తి చేసి 79 రన్స్ ఇచ్చుకుని ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ పది ఓవర్లలో 61 పరుగులు సమర్పించుకున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన రో-కో! -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా సంయుక్తంగా 400 మ్యాచ్‌లు ఆడిన భారత జోడీగా రికార్డు సాధించారు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా ఆదివారం నాటి మూడో వన్డే సందర్భంగా రో-కో ఈ ఫీట్ నమోదు చేశారు.అగ్రస్థానంలో ఎవరంటే?ఇక మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జోడీగా శ్రీలంక దిగ్గజాలు కుమార్ సంగక్కర- మహేళ జయవర్ధనె కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి శ్రీలంక తరఫున 550 మ్యాచ్‌లలో భాగమయ్యారు. ఆ తర్వాత మూడు స్థానాల్లోనూ లంక దిగ్గజాలే ఉండటం విశేషం. ఇక రోహిత్- కోహ్లి జోడీ ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.కాగా 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ 67 టెస్టులు, 159 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటికి 287 వన్డేలు పూర్తి చేసుకున్నాడు. ఇక 2008లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లి 123 టెస్టులు, 125 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటికి 313 వన్డేలు పూర్తి చేసుకున్నాడు.వన్డే వరల్డ్‌కప్-2027 ఆడటమే లక్ష్యంగాటీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్- కోహ్లి సంయుక్తంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అదే విధంగా గతేడాది రోహిత్ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పగా.. వారం రోజుల వ్యవధిలోనే కోహ్లి సైతం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇద్దరూ ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్-2027లో ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ చేతిలో 4-0తో టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైంది టీమిండియా. ఈ క్రమంలో వన్డే సిరీస్‌ను విజయంతో ఆరంభించిన భారత జట్టు.. రెండో వన్డేలో తడబడింది. ఫలితంగా సిరీస్ 1-1తో సమం కాగా.. లార్డ్స్ వేదికగా ఆదివారం నాటి నిర్ణయాత్మక మూడో వన్డేతో విజేత ఎవరో తేలుతుంది.ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో రోహిత్ 11 పరుగులు చేయగా.. కోహ్లి 5 పరుగులకే అవుటయ్యాడు. ఇక రెండో వన్డేలో రోహిత్ 28 పరుగులు చేయగా.. కోహ్లి అర్ధ శతకం (65)తో అలరించాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జోడీలు👉కుమార్ సంగక్కర- మహేళ జయవర్ధనె (శ్రీలంక): 550 మ్యాచ్‌లు👉తిలకరత్నె దిల్షాన్- మహేళ జయవర్ధనె (శ్రీలంక): 426 మ్యాచ్‌లు👉కుమార్ సంగక్కర- తిలకరత్నె దిల్షాన్ (శ్రీలంక): 418 మ్యాచ్‌లు👉సనత్ జయసూర్య- ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక): 408 మ్యాచ్‌లు👉జాక్వెస్ కలిస్- మార్క్ బుచర్ (సౌతాఫ్రికా): 407 మ్యాచ్‌లు👉రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి (ఇండియా): 400* మ్యాచ్‌లు.చదవండి: టీమిండియాకు భారీ షాక్! -
IND vs ENG: అందుకే అతడు బెంచ్‌కే పరిమితం: గిల్
ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌కు పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. రెండో వన్డే సందర్భంగా ఎడమ మోకాలు ఉబ్బిపోవడం వల్ల అతడు లార్డ్స్ మ్యాచ్‌కు దూరమయ్యాడని ప్రకటన విడుదల చేసింది.కుల్దీప్ను ఆడిస్తారనుకుంటే..ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా రెండో వన్డే సందర్భంగానే గాయపడ్డాడు. దీంతో అతడి స్థానాన్ని బీసీసీఐ హర్ష్ దూబేతో భర్తీ చేసింది. అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. ఇదిలా ఉంటే.. వాషీ దూరం కావడంతో.. అతడి స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడో వన్డే ఆడతాడని అంతా భావించారు.కానీ యాజమాన్యం మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషీకి బదులు.. పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌కు తుదిజట్టులో చోటు ఇచ్చింది. దీంతో కుల్దీప్ యాదవ్‌కు మరోసారి అన్యాయం చేశారంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే, టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఈ విషయం గురించి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘బుమ్రా మోకాలి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడ్డాడు. శివం దూబే కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదు.అందుకే అతడు బెంచ్‌కు పరిమితంఈ ముగ్గురి స్థానాల్లో కేఎల్ రాహుల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ తుదిజట్టులోకి వచ్చారు. మేము లార్డ్స్ మైదానంలో నలుగురు సీమర్లను ఆడించాలని నిర్ణయించుకున్నాము. ఫాస్ట్ బౌలర్లతో పోలిస్తే స్పిన్నర్లు ఇక్కడ మధ్య ఓవర్లలో పెద్దగా ప్రభావం చూపరు అనిపించింది’’ అని గిల్ పేర్కొన్నాడు. తద్వారా కుల్దీప్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని పరోక్షంగా వెల్లడించాడు.వైట్‌వాష్‌ల తర్వాత..కాగా యూకే పర్యటనలో భాగంగా టీమిండియా తొలుత ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో తలపడి.. ఆతిథ్య జట్టు చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. అనంతరం ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్‌లో 4-0తో వైట్‌వాష్ అయింది. ఈ క్రమంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికి భారత్- ఇంగ్లండ్ చెరో వన్డే గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి నిర్ణయాత్మక మూడో వన్డేకు లార్డ్స్ మైదానం ఆతిథ్యమిస్తుండగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ నలుగురు పేసర్లు గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణను ఆడిస్తోంది.ఇంగ్లండ్‌తో మూడో వన్డేకు భారత తుదిజట్టురోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: టీమిండియాకు భారీ షాక్! -
IND vs ENG: టీమిండియాకు భారీ షాక్!
ఇంగ్లండ్‌తో మూడో వన్డేకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ప్రకటన విడుదల చేసింది.ఈ మేరకు.. ‘‘కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా ఎడమ మోకాలికి గాయమైంది. కాబట్టి మూడో వన్డే కోసం సెలక్షన్‌కు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. అతడి ఎడమ మోకాలు ఉబ్బిపోయింది’’ అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. రెండు వికెట్లుకాగా చాన్నాళ్ల తర్వాత బుమ్రా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో పునరాగమనం చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ హ్యారీ బ్రూక్ (1) రూపంలో కీలక వికెట్ తీసి.. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కార్డిఫ్ వేదికగా రెండో వన్డేలో బెన్ డకెట్‌ను డకౌట్ చేశాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగానే అతడు గాయపడినట్లు సమాచారం.ఇక ఇప్పటికే చెరో విజయంతో టీమిండియా- ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో లార్డ్స్ వేదికగా ఆదివారం నాటి ఆఖరి వన్డే కీలకంగా మారింది. అయితే, బుమ్రా గాయం కారణంగా ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాగా బుమ్రా గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత రాలేదు.మూడు మార్పులుమరోవైపు.. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా రెండో వన్డే సందర్భంగా గాయపడి.. మూడో వన్డేకు దూరమయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేలో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్ తిరిగి రాగా.. శివం దూబేపై వేటు పడింది. బుమ్రా, వాషీ స్థానాల్లో అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చారు.మూడో వన్డేకు తుదిజట్లుభారత్రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణఇంగ్లండ్బెన్ డకెట్, జేకబ్ బెతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.చదవండి: టీ20 సిరీస్.. జింబాబ్వేకు బయల్దేరిన టీమిండియా -
మూడో వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్‌దే
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 27 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 రన్స్ చేసింది. రోహిత్ శర్మ(138), శుబ్‌మన్ గిల్(77), విరాట్ కోహ్లి వంటి టాపార్డర్ బ్యాటర్లు రాణించినప్పటికి, మిడిలార్డర్ విఫలం కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్ 4 వికెట్లు పడగొట్టగా.. రషీద్, జాకబ్ బెతల్, ఆర్చర్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఏకంగా 387 పరుగులు సాధించింది. ఓపెనర్లు బెన్ డకెట్ (141), జేకబ్ బెతెల్ (91) దుమ్ములేపగా.. జో రూట్ (48 బంతుల్లో 74), జోస్ బట్లర్ (13 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచారు. ఓటమి దిశగా భారత్భారత్ వరుస ఓవర్లలో కేఎల్ రాహుల్(12), అక్షర్ పటేల్(2) వికెట్లను కోల్పోయింది. టీమిండియా విజయానికి 10 బంతుల్లో 47 పరుగులు కావాలి.విరాట్ కోహ్లి అవుట్టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 74 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత విజయానికి 28 బంతుల్లో 73 పరుగులు కావాలి. క్రీజులో రాహుల్, అక్షర్ పటేల్ ఉన్నారు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్ఇషాన్ కిషన్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన కిషన్.. సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అదే ఓవర్లో శ్రేయస్ అయ్యర్(0) డకౌటయ్యాడు. క్రీజులో కోహ్లి(65) ఉన్నారు. భారత విజయానికి 82 పరుగులు కావాలి.టీమిండియా ట్రిపుల్ సెంచరీటీమిండియా స్కోర్ 300 పరుగులు దాటింది. భారత విజయానికి 39 బంతుల్లో ఇంకా 84 పరుగులు కావాలి.రోహిత్ అవుట్రోహిత్ శర్మ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. భారీ సెంచరీతో సత్తాచాటిన రోహిత్.. బెతల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 138 పరుగులు చేశాడు. 39 ఓవర్లకు భారత్ స్కోర్: 262/2రోహిత్ సెంచరీలార్డ్స్ వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. కేవలం 84 బంతుల్లో తన 34వ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 33 ఓవర్లకు భారత్ స్కోర్: 218/1సెంచరీకి చేరువలో రోహిత్రోహిత్ శర్మ 92 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు. 29 ఓవర్లకు భారత్ స్కోర్: 187/1భారత్ తొలి వికెట్ డౌన్147 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 77 పరుగులు చేసిన కెప్టెన్ శబ్‌మన్ గిల్.. అదిల్ రషీద్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.రోహిత్ హాఫ్ సెంచరీరోహిత్ శర్మ కూడా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 21 ఓవర్లకు భారత్ స్కోర్: 117/0ఇరవై ఓవర్లలో భారత్ స్కోరు: 109-0రోహిత్ 42, గిల్ 65 పరుగులతో ఉన్నారు. భారత్ విజయానికి 279 పరుగులు కావాలి. సెంచరీ కొట్టిన టీమిండియా18.3: ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో రోహిత్ సింగిల్ తీయడంతో.. టీమిండియా వంద పరుగుల మార్కును చేరుకుంది. భారత్ స్కోరు: 103-0 (19). గిల్ 60, రోహిత్ 41 పరుగులతో ఉన్నారు. విజయానికి 285 పరుగులు కావాలి.గిల్ అర్ధ శతకం14.3వ ఓవర్: ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి యాభై పరుగుల మార్కు అందుకున్న గిల్. 54 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి. భారత్ స్కోరు: 89-0 (15). గిల్ 52, రోహిత్ 36 పరుగులతో ఉన్నారు.14 ఓవర్లలో టీమిండియా స్కోరు: 81-0గిల్ 49, రోహిత్ 36 పరుగులతో ఉన్నారు.టీమిండియా హాఫ్ సెంచరీ10.2: సామ్ కరన్ బౌలింగ్‌లో గిల్ సింగిల్ తీయగా.. టీమిండియా యాభై పరుగుల మార్కు పూర్తి చేసుకుంది. స్కోరు: 60-0(11). రోహిత్ 34, గిల్ 26 పరుగులతో ఉన్నారు.పవర్ ప్లేలో భారత్ స్కోరు: 49-0 (10)కట్టుదిట్టమైన బంతులతో పదో ఓవర్‌ను మెయిడెన్ చేసిన టంగ్.రోహిత్ శర్మ 24, గిల్ 25 పరుగులతో ఉన్నారు. విజయానికి ఇంకా 40 ఓవర్లలో 339 పరుగులు కావాలి.గేరు మార్చిన రోహిత్ఎనిమిదో ఓవర్లో జోష్ టంగ్ బౌలింగ్‌లో తొలి రెండు బంతుల్లో ఫోర్లు బాదిన రోహిత్ శర్మ. పుల్ షాట్‌తో ఐదో బంతిని సిక్సర్‌గా మలిచిన హిట్‌మ్యాన్. భారత్ స్కోరు: 43-0 (8). రోహిత్ 23, గిల్ 20 పరుగులతో ఉన్నారు.ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 17-0రోహిత్ మూడు, గిల్ 14 పరుగులతో ఉన్నారు.టార్గెట్ 388.. లక్ష్య ఛేదనకు దిగిన భారత్మూడు ఓవర్లలో భారత్ స్కోరు: 9-0ఓపెనర్లు రోహిత్ ఒకటి , గిల్ ఎనిమిది పరుగులతో ఉన్నారు.ఇంగ్లండ్ భారీ స్కోరుఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది. టీమిండియాకు 388 పరుగుల లక్ష్యాన్ని విధించింది. కాగా వన్డే ఫార్మాట్లో భారత్‌పై ఇంగ్లండ్‌కు ఇదే అత్యధిక స్కోరు. బట్లర్ మెరుపులు49 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 371-3బట్లర్ 10 బంతుల్లోనే 34 పరుగులు చేయగా.. రూట్ 65 పరుగులతో ఉన్నాడు.బ్రూక్ అవుట్46.5వ ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి హ్యారీ బ్రూక్ (14) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. స్కోరు: 324-3. రూట్ 55 పరుగులతో ఉన్నాడు. జోస్ బట్లర్ క్రీజులోకి వచ్చాడు.రూట్ హాఫ్ సెంచరీ45.3వ ఓవర్: గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న రూట్. 39 బంతుల్లోనే యాభై పరుగులు సాధించిన రూట్. వన్డేల్లో అతడికి ఇది వరుసగా ఆరో హాఫ్ సెంచరీ. ఇంగ్లండ్ స్కోరు 315-2 (46). రూట్ 50, బ్రూక్ పది పరుగులతో ఉన్నారు.45 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 305-2హ్యారీ బ్రూక్ 5, రూట్ 45 పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్43.3వ ఓవర్: ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ శతక వీరుడు బెన్ డకెట్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా 135 బంతులు ఎదుర్కొన్న డకెట్ 18 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 141 పరుగులు చేశాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చాడు. నలభై ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 261-1డకెట్ 125 బంతుల్లో 127, రూట్ 22 బంతుల్లో 23 పరుగులతో ఉన్నారు.డకెట్ సెంచరీ35.2వ ఓవర్: గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ ఓపెనర్ డకెట్. 108 బంతుల్లో శతక మార్కు అందుకున్న డకెట్. 36 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ స్కోరు: 226-1(36). డకెట్ 102, రూట్ 13 పరుగులతో ఉన్నారు.200 పరుగులు పూర్తి చేసుకున్న ఇంగ్లండ్33 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 206-1.డకెట్ 90, రూట్ ఐదు పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ డౌన్.. సెంచరీ మిస్30.1వ ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగిన బెతెల్ (93 బంతుల్లో 91). ఆద్యంతం నిలకడగా ఆడి సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. జో రూట్ క్రీజులోకి వచ్చాడు.ఇంగ్లండ్ ఓపెనర్ల రికార్డు భాగస్వామ్యంముప్పై ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 192-0. టీమిండియాపై ఇంగ్లండ్‌కు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. బెతెల్ 91, డకెట్ 81 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి 180 బంతుల్లో 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.25 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 163-0బెతెల్ 79, డకెట్ 65 పరుగులతో ఉన్నారు. లార్డ్స్ మైదానంలో వన్డేల్లో తొలి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం (163).డకెట్ ఫిఫ్టీ21.3: గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి.. యాభై పరుగుల మార్కు అందుకున్న డకెట్. 64 బంతుల్లో ఫిఫ్టీ కొట్టిన డకెట్. ఇంగ్లండ్ స్కోరు: 136- 0 (21.5)20 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 125-0బెతెల్ 61, డకెట్ 46 పరుగులతో ఉన్నారు.బెతెల్ అర్ధ శతకం15.4వ ఓవర్: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఫోర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ ఓపెనర్ బెతెల్. ఇంగ్లండ్ స్కోరు: 101-0(16). బెతెల్ 53, డకెట్ 34 పరుగులతో ఉన్నారు.పదిహేను ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 96-0(15)బెతెల్ 48, డకెట్ 34 పరుగులతో ఆడుతున్నారు.పవర్ ప్లేలో ఇంగ్లండ్ స్కోరు: 58-0(10)బెతెల్ 25, డకెట్ 22 పరుగులతో ఉన్నారు.హాఫ్ సెంచరీ కొట్టిన ఇంగ్లండ్బెతెల్ 23, డకెట్ 18 పరుగులతో ఉన్నారు. ఇంగ్లండ్ స్కోరు: 51-0 (8.1).నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లుఅర్ష్దీప్ సింగ్ టీమిండియా బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జేకబ్ బెతెల్ నిలకడగా ఆడుతున్నారు. నాలుగు ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 31-0. డకెట్ 15, బెతెల్ 14 పరుగులతో ఉన్నారు.భారత్‌కు ఎదురుదెబ్బభారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. టాస్ సమయంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయం వల్ల దూరం కాగా.. భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది.కేఎల్ రాహుల్ తిరిగి రాగా శివం దూబే బెంచ్‌కే పరిమితం కాగా.. బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. వాషీకి బదులు ప్రిన్స్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు.దిగ్గజానికి నివాళిగ్యారీ సోబర్స్‌కు నివాళిగా ఇరుజట్ల ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్లతో బరిలోకి దిగారు.గంట మోగించిన యువీలార్డ్స్ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గంట మోగించి మ్యాచ్‌ను ఆరంభించాడు.Yuvraj Singh rings the iconic Lord's Bell to signal the start of the series decider. 🔔 Watch #ENGvIND, LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/OcQ6C2e7du— Sony Sports Network (@SonySportsNetwk) July 19, 2026తుదిజట్లుభారత్రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణఇంగ్లండ్బెన్ డకెట్, జేకబ్ బెతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్. -
రోహిత్ వివాదం.. టీమిండియాకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
రోహిత్ శర్మ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్‌లు ఉన్న సమయంలో వీలైనంత మేర సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మంచిదని ఆటగాళ్లకు బీసీసీఐ సూచించింది. శనివారం లండన్‌లోని భారత హైకమిషన్ నిర్వహించిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో భాగంగా టీమిండియాతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గంభీర్ సహా ఆటగాళ్లంతా హాజరయ్యారు.99 శాతం అదే ధోరణిలో: రాజీవ్ శుక్లారాజీవ్ శుక్లా మాట్లాడుతూ..'భారతదేశంలో 99 శాతం మంది ప్రజలు తమను తాము క్రికెట్ నిపుణులుగా భావిస్తుంటారని, అందుకే మ్యాచ్‌లకు ముందు ఆటగాళ్లు సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని నా అభిప్రాయం. మన జట్టులో ప్రతిభకు కొదవలేదని, కేవలం ఆటపై దృష్టి పెట్టడమే ఆటగాళ్లు ముందున్న కర్తవ్యం. అనవసర విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదు.' అని చెప్పుకొచ్చారు.బయటి విషయాలు పట్టించుకోను: గిల్టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తన చేతిలో లేని బయటి అంశాల గురించి ఆలోచించకుండా, కేవలం తన ఆటపైనే దృష్టి పెట్టడం వల్ల ఎలాంటి ఒత్తిడినైనా సులభంగా అధిగమించగలనని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే టీమిండియాలో క్యాంప్‌లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్న వేళ గిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇక గాయాల నుంచి కోలుకొని టీ20 కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన శ్రేయస్ అయ్యర్ తన పునరాగమన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు సహచర ఆటగాళ్లు చేసిన ఫోన్ కాల్స్, వారు ఇచ్చిన మద్దతు తనలో ఎంతో స్ఫూర్తిని నింపాయని, అందుకే మరింత బలంగా జట్టులోకి తిరిగి రాగలిగానని అయ్యర్ భావోద్వేగంతో పేర్కొన్నాడు. చారిత్రక బంధం: గంభీర్ఇక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ భారత్-బ్రిటన్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాల వల్ల యూకే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రదేశమేనని అన్నారు. భారత క్రికెట్ అనేది కేవలం డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కాదని, జట్టును బేషరతుగా ప్రేమించే ప్రతి ఒక్క నిజాయితీ గల అభిమానికి చెందుతుందని గంభీర్ స్పష్టం చేశాడు. ఇక ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చిన యూకేలోని భారత హైకమిషనర్ పి. కుమారన్, డిప్యూటీ హైకమిషనర్ కార్తీక్ పాండేలు టీమిండియాకు ఘన స్వాగతం పలికారు. ఇదే వారంలో అమల్లోకి వచ్చిన భారత్-యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (CETA) వ్యాపారంతో పాటు క్రీడారంగానికి కూడా ఎన్నో కొత్త అవకాశాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ టీమిండియా సాధించిన విజయాలు దేశానికి ఎంతో గర్వకారణమని వారు కొనియాడారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇవాళ చివరి వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఇరుజట్లు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. -
సిరీస్ విజయంపై గురి.. లార్డ్స్‌లో టీమిండియాకు ఘన చరిత్ర!
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియా తమ చివరి వన్డేను ఆదివారం ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకోవాలని గిల్ సేన భావిస్తోంది. మరి లార్డ్స్ గడ్డపై టీమిండియా రికార్డు ఎలా ఉంది, ఎన్ని మ్యాచ్‌లు ఆడింది? గెలిచినవెన్నీ, ఓడినవెన్ని అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. లార్డ్స్‌లో భారత జట్టు అంతర్జాతీయంగా 31 మ్యాచ్‌లు (అన్ని ఫార్మాట్లు) ఆడితే ఏడు గెలిచి 19 ఓడింది. ఒక మ్యాచ్ టై కాగా, 14 డ్రాగా ముగిశాయి. లార్డ్స్ వేదికలో భారత్ ఓవరాల్ విన్నింగ్ శాతం 22.58 పర్సంటైల్‌గా ఉంది. వన్డేల్లో మాత్రం టీమిండియాకు లార్డ్స్ వేదికలో మంచి రికార్డే ఉంది. ఓవరాల్‌గా లార్డ్స్‌లో ఏడు గెలిస్తే అందులో మూడు వన్డేల నుంచే రావడం విశేషం. మొత్తంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య 8 వన్డేలు జరిగితే టీమిండియా మూడు, ఇంగ్లండ్ నాలుగు చొప్పున గెలిచాయి. ఒక మ్యాచ్ టై అయింది. వన్డేల్లో లార్డ్స్ వేదికలో భారత విజయాల శాతం 37.5 పర్సంటైల్‌గా ఉంది. ఈ వేదికలో 2022, జూలై 14న భారత్, ఇంగ్లండ్ చివరిసారిగా వన్డే ఆడాయి.ఈ వన్డేలో టీమిండియా 100 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. మోయిన్ అలీ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, డేవిడ్ విల్లే 41 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో పూర్తిగా తడబడిన టీమిండియా 38.5 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. పాండ్యా, జడేజా చెరో 29 పరుగులు చేశారు. మ్యాచ్‌లో రీస్ టోప్లే ఆరు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించాడు.లార్డ్స్ వేదికపై జరిగిన వన్డేలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో సౌరవ్ గంగూలీ (208 పరుగులు) తొలి స్థానంలో ఉండగా, యువరాజ్ సింగ్ (170) రెండు, ఎంఎస్ ధోని (165) మూడు, రాహుల్ ద్రవిడ్ (149), సురేశ్ రైనా (130)లు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే చాహల్, ఆర్పీ సింగ్ ఐదేసి వికెట్లతో తొలి స్థానంలో ఉండగా, మొహిందర్ అమర్నాథ్, జహీర్ ఖాన్, మదన్‌లాల్‌లు తలా 4 వికెట్లు పడగొట్టారు.చదవండి: ఫిఫా ఫైనల్ ఆఖరిదా?.. రిటైర్మెంట్పై మెస్సీ స్పందన! -
IND vs ENG: వాషీ అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ
ఇంగ్లండ్‌తో మూడో వన్డేకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు తెలిపింది. అతడి స్థానంలో హర్ష్ దూబేను ఎంపిక చేసినట్లు శనివారం ప్రకటించింది. కాగా మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్- భారత్ చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. అర్ధ శతకాలతో రాణించితొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (80)తో కలిసి ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్ (52), వాషింగ్టన్ సుందర్ (57 )జట్టును గెలిపించారు. ఇద్దరూ అజేయ అర్ధ శతకాలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో వాషీ సిక్సర్ బాది విజయ లాంఛనం పూర్తి చేశాడు.గాయపడ్డ వాషీఅయితే, రెండో వన్డేలో మాత్రం బ్యాటింగ్ పరంగా అక్షర్ (1)తో పాటు వాషీ (2) పూర్తిగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా వాషీ గాయపడ్డాడు. అతడి చీలమండకు గాయమైంది. దీంతో అతడు బౌలింగ్‌కు రాలేదు. తాజా సమాచారం ప్రకారం అతడి గాయం తీవ్రమైనట్లు తెలుస్తోంది.జట్టులోకి హర్ష్ దూబేఈ నేపథ్యంలోనే వాషీ స్థానంలో యువ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబేను బీసీసీఐ ఎంపిక చేసింది. కాగా మహారాష్ట్రకు చెందిన హర్ష్ దూబే.. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికి రెండు వన్డేలు ఆడిన లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ ప్లేయర్.. నాలుగు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఆదివారం నాటి నిర్ణయాత్మక మూడో వన్డేకు లార్డ్స్ వేదిక.చదవండి: IND vs ENG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే! -
‘బాధ ఎందుకు? అతడి వీడ్కోలు వేడుకలా జరపాల్సిందే!’
ఇంగ్లండ్‌తో ఆదివారం జరగనున్న వన్డే మ్యాచ్ రోహిత్ శర్మకు ఆఖరిదని, ఆ తర్వాత అతడు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై స్పందించారు. అవన్నీ తప్పుడు వార్తలని, జట్టులో కొనసాగినంతకాలం రోహిత్ శర్మ టీమిండియాకు ఆడుతాడని, అతడి రిటైర్మెంట్ ఇప్పుడే ఉండదని పేర్కొంటూ ఊహాగానాలకు తెరదించాడు. అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై భారత దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ఎప్పుడు ఆటకు వీడ్కోలు పలికినా అతడి రిటైర్మెంట్ను ఒక వేడుకలా సెలబ్రేట్ చేయాలని బీసీసీఐకి సూచించారు. 19 ఏళ్ల కెరీర్లో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఎన్నో అరుదైన మైలురాళ్లను అందుకున్న రోహిత్ శర్మకు గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరముందన్నారు. రిటైర్మెంట్ అనేది క్రికెటర్లకు కామన్ అని, దాని గురించి బాధపడొద్దని, ఆ ప్రక్రియను ఒక వేడుకలా జరుపుకోవాలని కపిల్ హితవు పలికారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘రిటైర్మెంట్ అనే పదం వినగానే ఎందుకు బాధపడాలి. సమయం వచ్చింది కాబట్టే అంతా రోహిత్ వీడ్కోలు గురించి మాట్లాడుకుంటున్నారు. 19 ఏళ్లుగా రోహిత్ తన ఆటతో ఎంతో సంతోషాన్ని పంచాడు. ఏదోఒక రోజు అందరూ రిటైర్ అవ్వాల్సిందే. నాతో పాటు సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఇలా అందరం ఆటకు వీడ్కోలు పలికినవాళ్లమే. ఒకవేళ రోహిత్ రిటైర్మెంట్కు సమయం వచ్చినప్పుడు మనమంతా దానిని ఒక వేడుకగా జరుపుకోవాలి. రోహిత్ వీడ్కోలు ఎప్పుడు పలికినా ఆ మ్యాచ్‌లో మాత్రం సెంచరీ సాధించాలని బలంగా కోరుకుంటున్నా.’ అని కపిల్ దేవ్ తెలిపారు.ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్ ఆడిన రెండు వన్డేలు కలిపి కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. అంతకముందు అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ వరుసగా 16, 48, 79 పరుగులు చేశాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో వరుస వైఫల్యాలతో రోహిత్ రిటైర్మెంట్ వార్తలు తెరమీదకు వచ్చాయి. Greater Noida, Uttar Pradesh: When asked about speculation that this match at Lord's could be Rohit Sharma's last ODI, Former Indian cricket team captain and President of PGTI, Kapil Dev says, "... He has entertained the nation immensely, something very few players have… pic.twitter.com/ytrOdnUipk— IANS (@ians_india) July 18, 2026Read: వరుస ఓటములు.. విండీస్ జట్టులో భారీ మార్పులు! -
వరుస ఓటములు.. విండీస్ జట్టులో భారీ మార్పులు!
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన వెస్టిండీస్ 1-2తో వెనుకంజలో ఉంది. ఈ నేపథ్యంలో చివరి రెండు వన్డేలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్ తన జట్టులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. చివరి రెండు వన్డేలకు గాయాలతో సతమతమవుతున్న ఆల్‌రౌండర్ జాన్ కాంప్‌బెల్, టెస్టు కెప్టెన్ రోస్టన్ చేజ్ల స్థానంలో బ్రాండన్ కింగ్, జస్టిన్ గ్రీవ్లను ఎంపిక చేసింది. ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. గాయాలు, ఫామ్ లేమీతో సతమతమవుతున్న జట్టులోకి వీరి రాకతో విండీస్ కాస్త బలంగా కనిపిస్తోంది. కివీస్‌తో సిరీస్‌కు ముందు శ్రీలంకతో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌ల్లో జస్టిన్ గ్రీవ్స్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు మాత్రం గ్రీవ్స్‌ను జట్టు నుంచి తప్పించారు. ఇక 2025 అక్టోబర్‌లో చివరి వన్డే మ్యాచ్ ఆడిన బ్రాండన్ కింగ్ అప్పటి నుంచి టెస్టులు, టీ20లకే పరిమితమయ్యాడు. తాజాగా వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతుండడంతో బ్రాండన్ కింగ్‌ను జాన్ కాంప్‌బెల్ స్థానంలో జట్టులో పరిశీలించాలని విండీస్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. తల్లి అంత్యక్రియల కోసం షమర్ స్ప్రింగర్, వ్యక్తిగత కారణాలతో కారీ పియెర్రీ కూడా జట్టును వీడినట్లు తెలుస్తోంది. శ్రీలంకతో రెండో టెస్టు సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా రోస్టన్ చేజ్ కుడి చూపుడువేలికి గాయమైంది. అప్పటి నుంచి చేజ్ రీహాబిలిటేషన్‌లోనే చికిత్స తీసుకుంటున్నాడు. మరోవైపు మూడో వన్డే సందర్భంగా కాంప్‌బెల్ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. దీంతో అతడికి స్కానింగ్ చేయగా, గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కాంప్‌బెల్ మూడు వన్డేలు కలిపి 30 సగటుతో 60 పరుగుల మాత్రమే చేశాడు. మరోవైపు తొలి వన్డేలో ఓడినప్పటికీ వరుసగా రెండు, మూడు వన్డేలు గెలిచిన న్యూజిలాండ్ సిరీస్ విజయంపై కన్నేసింది. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే ఆదివారం బార్బడోస్ వేదికగా జరగనుంది.చివరి రెండు వన్డేలకు విండీస్ జట్టు:షెయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), అకీమ్ ఆగస్ట్, కీసీ కార్టీ, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, షిమ్రాన్ హెట్‌మైర్, అమీర్ జంగూ, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, విటెల్ లాస్, గుదకేష్ మోతీ, కీమో పాల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్.Read: ఫిఫా ఫైనల్ మ్యాచ్.. ఒక్క టికెట్ ధర 27 లక్షలు! -
IND vs ENG: మూడో వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
వన్డే సిరీస్‌లో ఇప్పటికి చెరో మ్యాచ్ గెలిచి టీమిండియా- ఇంగ్లండ్ 1-1తో సమంగా ఉన్నాయి. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మంగళవారం నాటి తొలి మ్యాచ్‌లో గిల్ సేన గెలవగా.. కార్డిఫ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ బృందం జయభేరి మోగించింది. రెండో వన్డేలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగి 44 ఓవర్లలోనే ఆలౌట్ అయింది.99 పరుగులతో అజేయంగావన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (65), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (66) అర్ధ శతకాల కారణంగా.. 233 పరుగులు చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్లు బెన్ డకెట్ (0), జేకబ్ బెతెల్ (4) వికెట్లు కోల్పోయినా.. జో రూట్ ఒంటిచేతో జట్టును గెలిపించాడు.మూడో స్థానంలో ఆడిన రూట్.. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడ్డాడు. మొత్తంగా 133 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఇంగ్లండ్- టీమిండియా మధ్య ఆదివారం లార్డ్స్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది.అతడిని తొందరగా అవుట్ చేయాలిఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ కీలక సూచనలు చేశాడు. రూట్‌ను ఎంత త్వరగా అవుట్ చేశామన్న అంశం మీదే భారత జట్టు విజయం ఆధారపడి ఉంటుందన్నాడు. ఈ క్రమంలో భారత తుదిజట్టులో పలు మార్పులు సూచించాడు.స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్‌లో భాగంగా మాట్లాడుతూ.. ‘‘జో రూట్‌ను వీలైనంత త్వరగా అవుట్ చేయాలి. అతడి కోసం ప్రత్యేక ప్రణాళికలు అవసరం. కాబట్టి కుల్దీప్ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యం లేదు. లేదంటే.. శివం దూబే స్థానంలో ప్రిన్స్ యాదవ్‌ను ఆడించవచ్చు’’ అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు.అయ్యర్ నాలుగు.. రాహుల్ ఐదో స్థానంలోఇక తాను ఎంపిక చేసుకున్న తుదిజట్టులో అభిషేక్ నాయర్ ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లకు చోటిచ్చాడు. అయితే, శ్రేయస్ అయ్యర్ రెగ్యులర్‌గా వచ్చే నాలుగో స్థానంలోనే రావాలని.. రెండో వన్డేలో మాదిరి ఇషాన్ కోసం అతడిని డిమోట్ చేయవద్దన్నాడు.అదే విధంగా కేఎల్ రాహుల్‌ను ఐదో స్థానంలో ఆడించి.. ఇషాన్‌ను ఆరో నంబర్ బ్యాటర్‌గా పంపాలని అభిషేక్ నాయర్ సూచించాడు. కాగా అనారోగ్యం కారణంగా కేఎల్ రాహుల్ రెండో వన్డేకు దూరంకాగా ఇషాన్ కిషన్ తుదిజట్టులోకి వచ్చాడు.నాలుగో స్థానంలో బరిలోకి దిగిన ఇషాన్.. ఎనిమిది బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. శ్రేయస్ అయ్యర్ ఐదో స్థానంలో వచ్చి అర్ధ శతకం బాదాడు. ఇక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మూడో వన్డేకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్‌లో తొలిసారి ఆడే అవకాశం ఉంది.ఇంగ్లండ్‌తో మూడో వన్డేకు అభిషేక్ నాయర్ ఎంచుకున్న భారత తుదిజట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్/ప్రిన్స్ యాదవ్.చదవండి: విశ్రాంతి వద్దన్న రోహిత్.. అతడి కోసం గిల్ అనూహ్య నిర్ణయం! -
ఏం తప్పు చేశాడని.. అతడిని పక్కనపెడుతున్నారు?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడి విషయంలో యాజమాన్యం వైఖరి అస్సలు బాగాలేదని విమర్శించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో పేస్ విభాగం నుంచి ఎవరినైనా తప్పించాలంటే సెలక్టర్లు ముందుగా అతడిపైనే వేటు వేస్తారన్నాడు.అవకాశం వస్తే ఇరగదీస్తాడుఅయితే, ఒక్కసారి అవకాశం దొరికితే సిరాజ్ తనను తాను నిరూపించుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని ఆకాశ్ చోప్రా ప్రశంసించాడు. కాగా 2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు సిరాజ్. ఈ హైదరాబాదీ స్టార్ ఇప్పటికి 46 టెస్టులు, 50 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్ ఇప్పటికి టెస్టుల్లో 140, వన్డేల్లో 76, టీ20 మ్యాచ్‌లలో 17 వికెట్లు కూల్చాడు. ఇక ఈ ఏడాది సొంతగడ్డపై జనవరిలో న్యూజిలాండ్‌తో చివరగా వన్డే మ్యాచ్ ఆడిన సిరాజ్.. ప్రపంచకప్ టోర్నీ-2026లో భాగంగా అమెరికాతో ఆఖరిగా టీమిండియా తరఫున టీ20 బరిలో దిగాడు.వన్డే జట్టులో దక్కని చోటుఅదే విధంగా అఫ్గానిస్తాన్ జూన్‌లో జరిగిన ఏకైక టెస్టులో పాల్గొన్న సిరాజ్‌కు.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. అయితే, ఇంగ్లండ్‌తో వన్డేలకు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు. సిరాజ్‌కు బదులు ప్రసిద్ కృష్ణకు టీ20, వన్డేలలో అవకాశం ఇచ్చారు.సైలెంట్‌గా పక్కన పెట్టేస్తున్నారుఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సిరాజ్ విషయంలో మేనేజ్మెంట్ ఒక్కోసారి ఒక్కోలా వ్యవహరిస్తోందని విమర్శించాడు. ‘‘అతడిని సైలెంట్‌గా పక్కన పెట్టేస్తున్నారు. బంతి పాతబడే కొద్దీ ప్రభావం చూపలేడంటూ వన్డేల నుంచి మెల్లమెల్లిగా అతడిని పక్కనపెట్టారు.ఇక టీ20 ఫార్మాట్‌కు కూడా చాలాకాలం దూరంగా ఉంచారు. కానీ వరల్డ్‌కప్ జట్టులో మాత్రం చోటిచ్చారు. అలా తుదిజట్టులోకి వచ్చిన తొలిరోజే అతడు మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచేలా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ టోర్నీలో ఆడించలేదు.అయితే, ఇప్పుడు అతడిని వన్డేల నుంచి పక్కనపెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు అనిపిస్తోంది. నిజానికి అతడి విషయంలో మేనేజ్మెంట్కు స్పష్టత లేనట్లు అనిపిస్తోంది. ఎప్పుడైనా వన్డే, టీ20 జట్ల పేస్ విభాగం నుంచి ఓ బౌలర్‌ను పక్కనపెట్టాలనుకుంటే ముందుగా అతడినే తప్పిస్తారు.వన్డే వరల్డ్‌కప్ జట్టులో అతడు ఉంటాడుఅయితే, మున్ముందు అతడి అవసరం కచ్చితంగా ఉంటుందని నా అభిప్రాయం. అతడిని మీరు ఎక్కువకాలం పక్కనపెట్టలేరు. ఎందుకంటే టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో తరచూ మార్పులు కనిపిస్తున్నాయి. ఒక రకంగా గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. కాబట్టి సిరాజ్ కచ్చితంగా వన్డే జట్టులోకి వస్తాడు. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్ జట్టులో అతడు ఉంటాడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.కాగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పనిభారం తగ్గించే క్రమంలో బీసీసీఐ అతడికి ఎక్కువగా విశ్రాంతినిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ సందర్భంగా గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేశారు. ప్రసిద్ కృష్ణకు కూడా అవకాశం దొరికింది. అయితే, సిరాజ్‌ను మాత్రం ఎక్కువగా టెస్టులకే పరిమితం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: విశ్రాంతి వద్దన్న రోహిత్.. అతడి కోసం గిల్ అనూహ్య నిర్ణయం -
విశ్రాంతి వద్దన్న రోహిత్.. అతడి కోసం గిల్ అనూహ్య నిర్ణయం!
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డే హిట్‌మ్యాన్ కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ వార్తల్ని కొట్టిపారేశాడు. లార్డ్స్ వన్డే రోహిత్‌కు చివరి మ్యాచ్ కాదని స్పష్టం చేశాడు.సెలక్టర్లపై బీసీసీఐ ఆగ్రహం!అదే విధంగా ఈ విషయంలో లీకులు ఇచ్చారని సెలక్టర్లపై బీసీసీఐ ఆగ్రహం చేసినట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. నిజానికి అఫ్గానిస్తాన్‌తో ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ నుంచే రోహిత్ శర్మను పక్కనపెట్టాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.అప్పుడే డిసైడ్ అయ్యారువిశ్రాంతి పేరిట రోహిత్‌ను పక్కనపెట్టి.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను అఫ్గాన్‌తో సిరీస్‌లో ఆడించాలనే యోచనలో ఉన్నారట. అయితే, ఇందుకు రోహిత్ ససేమిరా అనడంతో.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్వయంగా తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘గత నెలలో స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్ నుంచి రోహిత్ శర్మను తప్పించాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నారు. కానీ అతడు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆఖరిదైన మూడో వన్డేలోనైనా విశ్రాంతి తీసుకోవాలని కోరారు.విశ్రాంతి వద్దన్న రోహిత్.. గిల్ అనూహ్య నిర్ణయం!అతడి స్థానంలో జైస్వాల్‌ను ఆడించాలనుకున్నారు. కానీ రోహిత్ రెస్ట్ తీసుకునేందుకు నిరాకరించాడు. దీంతో జైస్వాల్‌ను ఎలాగైనా ఆడించాలనే ఉద్దేశంతోనే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు’’ అని పేర్కొన్నాయి. అదే విధంగా.. ‘‘అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన తర్వాత రోహిత్‌కు అసలైన సవాలు ఎదురైంది.అతడు దేశవాళీ క్రికెట్లోనూ కేవలం రెండు మ్యాచ్‌లే ఆడాడు. కానీ ఆశించిన స్థాయిలో లయను అందుకోలేకపోయాడు. ఇటీవల కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఫామ్ కోల్పోయిన రోహిత్ విషయంలో సెలక్టర్లు అయితే ఇప్పటికే తమ నిర్ణయం గురించి చెప్పేశారు. రోహిత్ శర్మ, బోర్డు తీసుకునే నిర్ణయం ఆధారంగానే అతడు వన్డే వరల్డ్‌కప్ టోర్నీ-2027 ఆడతాడా? లేదా? అన్నది తేలుతుంది’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.తొలుత విఫలమైనా..కాగా అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ 16, 48, 79 పరుగులు సాధించాడు. ఇక రెండో వన్డేతో తుదిజట్టులోకి వచ్చిన జైస్వాల్ నిరాశపరిచినా (4).. మూడో వన్డేలో అజేయ శతకం (110*)తో ఆకట్టుకున్నాడు. మరోవైపు.. తొలి వన్డేలో ఓపెనర్‌గా దిగి 84 పరుగులతో అజేయంగా నిలిచిన గిల్.. తర్వాత రెండు వన్డేలో మూడో నంబర్ బ్యాటర్‌గా వచ్చి భారీ శతకం (154)తో దుమ్ములేపాడు.ఇదిలా ఉంటే.. రెగ్యులర్ వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్‌కు దూరం కావడంతో.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌కు జట్టులో చోటు దక్కింది. ఈ వన్డే సిరీస్‌లో భారత్ అఫ్గాన్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ శర్మ ఇప్పటికి రెండు వన్డేలలో వరుసగా 11, 26 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ వార్తలు తెరమీదకు రావడం గమనార్హం.చదవండి: అదే మా కొంప ముంచింది: శుబ్‌మన్ గిల్ -
టీమిండియాకు ఎదురుదెబ్బ.. గాయంతో ఆల్‌రౌండర్ దూరం!
ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో పరాజయం చవిచూసిన టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి వన్డేలో మెరుపు అర్ధసెంచరీతో టీమిండియాను గెలిపించిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో సిరీస్‌లో మిగిలిన వన్డేకు దూరమైనట్లు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా బ్యాటింగ్‌కు ముందే వాషింగ్టన్ సుందర్ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఫిజియో వద్ద చికిత్స తీసుకొని మైదానంలోకి అడుగుపెట్టిన సుందర్ 5 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో సుందర్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో సుందర్‌కు గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంగ్లండ్ సిరీస్‌లో చివరి వన్డేకు దూరమైనట్లు తెలుస్తోంది. అతడు కోలుకోవడానికి రెండు నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశముందని సమాచారం. సుందర్ గాయం తీవ్రతపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ లెక్కన శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సుందర్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 26 ఏళ్ల సుందర్ ప్రస్తుతం టీమిండియాలో అన్ని ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 18 టెస్టుల్లో 41 వికెట్లు తీయడంతో పాటు 937 పరుగులు సాధించాడు.వదలని గాయాల బెడదవరుస సిరీస్‌లతో బిజీగా గడుపుతున్న టీమిండియాను గాయాల బెడద వదలడం లేదు. ఇప్పటికే హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి గాయాలతో ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమయ్యారు. తాజాగా వాషింగ్టన్ సుందర్ దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఇక సుందర్‌కు గాయాలు కొత్తేమి కాదు. ఈ ఏడాది ఆరంభంలో పక్కటెముకల్లో ఫ్రాక్చర్ కావడంతో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న సుందర్ 2026 టీ20 ప్రపంచకప్ మధ్యలో జట్టులో జాయిన్ అయ్యాడు. -
రోహిత్ భవితవ్యంపై టీమిండియా కోచ్ స్పందన!
టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ అతడి భవితవ్యంపై టీమిండియా మేనేజ్మెంట్ తొలిసారి స్పందించింది. 2027 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి ప్రణాళికల్లో భాగంగా జట్టు నుంచి రోహిత్‌ను తప్పించినట్లు బీసీసీఐ ఇప్పటికే హిట్‌మ్యాన్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. లార్డ్స్ వన్డే రోహిత్ కెరీర్లో చివరిదని ప్రచారం నడుస్తోన్న వేళ టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ రిటైర్మెంట్పై సమాధానాన్ని దాటవేసిన సితాన్షు అతడి పేలవ బ్యాటింగ్ ప్రదర్శనపై మాత్రం స్పందించాడు. రోహిత్ శర్మపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.అతడు పెద్ద ప్లేయర్ అని... అలాంటోడు భారత జట్టుకు అవసరమని పేర్కొన్నారు. రోహిత్ శర్మ స్థానంలో ఇషాన్ కిషన్, యశస్వి జైష్వాల్ లకు ఓపెనర్ గా అవకాశాలు ఇస్తారా ? అని మీడియా అడిగిన ప్రశ్నలకు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ సమాధానం ఇచ్చారు. వరుసగా రెండు వన్డేల్లో విఫలమైనంత మాత్రానా రోహిత్ ఆటను జడ్జ్ చేయలేమని కుండబద్దలు కొట్టారు. నిజానికి రోహిత్ శర్మ ఒక టాప్ క్లాస్ ఆటగాడని కితాబిచ్చాడు. హిట్‌మ్యాన్ ఒకసారి టచ్ లోకి వచ్చాడంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదన్నాడు. ఇది ఇలా ఉండగా లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే రోహిత్ శర్మకు చివరిది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 2027 వరల్డ్ కప్ ప్లాన్స్ భాగంగా జట్టులో కూడా రోహిత్ శర్మ లేడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ రిటైర్మెంట్పై ప్రశ్న వేయగా.. దీనికి మాత్రం సితాన్షు కోటక్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం ఆసక్తి కలిగించింది.పేలవ ప్రదర్శన39 ఏళ్ల రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ 2027 ఆడాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తాను ఫిట్‌గా ఉండేదుకు 10 కిలోల బరువు కూడా తగ్గాడు. ఫిట్నెస్ నిరూపించుకున్నప్పటికీ బ్యాటింగ్‌లో మాత్రం వరుసగా విఫలమవుతూనే వస్తున్నాడు. స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు వన్డేలు కలిపి 143 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది. తొలి వన్డేలో 69 బంతుల్లో 79 పరుగులు చేసిన రోహిత్ రెండు, మూడు వన్డేల్లో వరుసగా 48, 16 పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌లో వరుసగా రెండు వన్డేల్లో 11, 26 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.Batting coach Sitanshu Kotak has thrown his weight behind Rohit Sharma despite a slow start to the series for the former skipper 🗣️#ENGvIND pic.twitter.com/VuNEOojFDP— Cricbuzz (@cricbuzz) July 17, 2026Read: ‘రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై కోహ్లి రియాక్షన్!’ -
టీ20లపై మోజు.. వన్డేలు ఆడడం మరిచిన విండీస్!
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ దారుణ ఆటతీరు కనబరుస్తోంది. టీ20 క్రికెట్‌కు బాగా అలవాటు పడిన విండీస్ ఆటగాళ్లు వన్డేలు ఆడడం మరిచిపోయినట్లుగా కనిపిస్తున్నారు. వచ్చిందే తడవు భారీ ఇన్నింగ్స్‌లతో అలరించాలన్న మోజులో వన్డే ఫార్మాట్లో నిలకడగా ఆడితేనే పరుగులు వస్తాయన్న విషయాన్ని విండీస్ పూర్తిగా పక్కనబెట్టేసింది. తొలి వన్డే తర్వాత ఆడిన రెండు వన్డేల్లోనూ వెస్టిండీస్ 150 పరుగుల్లోపే ఆలౌట్ కావడం గమనార్హం. తాజాగా గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. కివీస్ బౌలర్ జేడన్ లెనోక్స్ మరోసారి బౌలింగ్‌లో చెలరేగిన వేళ ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కివీస్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 37.1 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాటర్లలో కీసి కార్టి (48) టాప్ స్కోరర్‌గా నిలవగా, హెట్‌మైర్ (26) పర్వాలేదనిపించాడు. జేడన్ లెనోక్స్ 4 వికెట్లతో చెలరేగగా, మైకెల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్లు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 141 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 39.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డారిల్ మిచెల్ (28), హెన్రీ నికోల్స్ (24) ఆరంభంలో మెరుగ్గా ఆడారు. చివర్లో టామ్ లాథమ్ (31 నాటౌట్), డీన్ ఫాక్స్క్రాప్ట్ (22 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. వెస్టిండీస్ బౌలర్లలో విటెల్ లాస్ 3 వికెట్లు తీయగా, కేరీ పియర్రీ ఒక వికెట్ పడగొట్టాడు. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే జూలై 19న (ఆదివారం) బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరగనుంది.చదవండి: అక్షర్ పటేల్ అరుదైన ఫీట్.. ఆ ఇద్దరి సరసన చోటు -
IND vs ENG: అతడు గొప్పగా ఏమీ బౌలింగ్ చేయలేదు.. కానీ
ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో గెలుపొందిన టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఇక ఇరుజట్ల మధ్య గురువారం నాటి రెండో వన్డేకు కార్డిఫ్ వేదికకాగా.. ఇక్కడా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.ఈ నేపథ్యంలో టీమిండియా సీమ్ విభాగం గురించి.. ముఖ్యంగా గుర్నూర్ బ్రార్ గురించి భారత మాజీ కోచ్ అభిషేక్ నాయర్ కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్‌లో భాగంగా మాట్లాడుతూ.. ‘‘గుర్నూర్ బ్రార్ తొలి వన్డేలో ఆకట్టుకున్నాడు.డకెట్ అవుట్ కాకపోయి ఉంటే..నిజానికి తను మొదటి ఓవర్లో కాస్త ఎక్కువగానే పరుగులు ఇచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత దూకుడు ప్రదర్శిస్తూ అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు. ముఖ్యంగా బెన్ డకెట్ క్రీజులోకి పాతుకుపోయినపుడు.. గుర్నూర్ తన మొమెంటమ్‌ను మార్చి ఎట్టకేలకు వికెట్ పడగొట్టాడు.ఒకవేళ గుర్నూర్ గనుక డకెట్‌ను అవుట్ చేయకపోయినా.. అతడు ఇంకో నాలుగు నుంచి ఐదు ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా.. మ్యాచ్ ఫలితం కచ్చితంగా వేరుగానే ఉండేది. డకెట్‌తో పాటు మరో ఓపెనర్, డేంజరస్ బ్యాటర్ జేకబ్ బెతెల్‌ను అవుట్ చేసి గుర్నూర్ మంచి బ్రేక్ ఇచ్చాడు.గొప్పగా ఏమీ బౌలింగ్ చేయలేదు..కానీఅయితే, ఈ రెండు వికెట్ల కోసం గుర్నూర్ అంత గొప్పగా ఏమీ బౌలింగ్ చేయలేదు. అయితే, ఆ సమయంలో అతడు చూపిన ఆత్మవిశ్వాసం గొప్పది. ఎలాగైనా వికెట్ తీయాలనే కసి మీద ఉన్నాడు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెట్టి అనుకున్నది సాధించాడు’’ అని అభిషేక్ నాయర్ ప్రశంసించాడు.ప్రసిద్ కూడా సూపర్కాగా ఈ మ్యాచ్‌లో రైటార్మ్ పేసర్ గుర్నూర్ బ్రార్ తొమ్మిది ఓవర్లు బౌలింగ్ చేసి 61 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. ఇక ప్రసిద్ కృష్ణ గురించి అభిషేక్ నాయర్ ప్రస్తావిస్తూ.. ‘‘వన్డే ఫార్మాట్లో అతడొక అసాధారణమైన బౌలర్. అఫ్గనిస్తాతో మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ గడ్డ మీదా రాణించాడు’’ అని కొనియాడాడు.ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ప్రసిద్ 10 ఓవర్ల కోటా పూర్తి చేసి 50 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 258 పరుగులకు కట్టడి చేసిన భారత్.. 45.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఇంగ్లండ్ గడ్డపై ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. అంతకుముందు టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్ అయింది.చదవండి: విధ్వంసకర శతకాలు.. పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డు బద్దలు -
ఇంగ్లండ్‌తో రెండో వన్డే.. భారత జట్టులోకి పేస్ సంచలనం?
కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. అయితే ఈ కార్డిఫ్ వన్డేలో టీమిండియా ఓ మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.తొలి వన్డేలో గాయపడిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించినప్పటికి.. పేసర్ గుర్నూర్ బ్రార్ మాత్రం ఇంకా కోలుకోలేదు. ఎడ్జ్‌బాస్టన్ వన్డేలో గుర్నూర్ కాలి పిక్క గాయం బారిన పడ్డాడు. దీంతో మ్యాచ్ మధ్యలోనే అతడు మైదానాన్ని వీడాడు. ఈ క్రమంలో రెండో వన్డేకు అతడికి విశ్రాంతి ఇచ్చి ప్రిన్స్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇంగ్లండ్‌తో టీ20ల్లో ప్రిన్స్ ఆకట్టుకున్నాడు. అంతకుముందు అఫ్గాన్‌తో సిరీస్‌లో కూడా అతడు రాణించాడు. వాస్తవానికి ఇంగ్లండ్‌తో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో ప్రిన్స్‌కు చోటు దక్కలేదు. కానీ హర్షిత్ రాణా గాయపడడంతో సెలక్టర్లు ఈ ఢిల్లీ పేసర్‌కు తిరిగి పిలుపు నిచ్చారు.మరోవైపు ఇంగ్లండ్ కూడా ఓ మార్పు చేసే అవకాశముంది. పేసర్ జోష్ టంగ్ స్ధానంలో బ్రైడన్ కార్స్‌కు అవకాశమివ్వనున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా తొలి వన్డేలో ఇంగ్లండ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమై ఓటమి చవిచూసింది.తుది జట్లు(అంచనా)భారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాఇంగ్లండ్జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్ -
అతడికి అన్యాయం.. అక్షర్, వాషీ.. ఇద్దరూ ఎందుకు?
ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో భారత స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ దుమ్ములేపారు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (80 రిటైర్డ్ హర్ట్)తో కలిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అక్షర్ (57*), వాషీ (52*) ఇద్దరూ అజేయ అర్ధ శతకాలతో రాణించి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.ఆల్‌రౌండ్ ప్రతిభముఖ్యంగా అక్షర్ ఆల్‌రౌండర్‌గా తన పూర్తి నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఉపయోగించుకుని.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. తొలుత 9.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అక్షర్ 62 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటర్‌గానూ సత్తా చాటాడు.అయితే, వాషీ కేవలం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి పదమూడు పరుగులు ఇచ్చి.. వికెట్ లేకుండానే ముగించాడు. మరోవైపు.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.అతడికి అన్యాయంఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లనే ఆడించడం సరికాదని.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా తుదిజట్టులో చోటు ఇవ్వాలని అశూ యాజమాన్యానికి సూచించాడు. ‘‘జట్టు కోసం చాలా కాలం కష్టపడ్డ ఆటగాడికి కూడా విలువనివ్వాలి. కానీ మేనేజ్మెంట్ ఇంగ్లండ్‌లో అతడి (కుల్దీప్)ని ఎందుకో పక్కనపెట్టేసింది.PC: BCCIఒక బ్యాటర్ ఆత్మవిశ్వాసం పెరగాలంటే అతడు ఫామ్‌లో ఉండటం ఎలా ముఖ్యమో.. ఒక బౌలర్ కూడా రిథమ్, లైన్ అండ్ లెంగ్త్ కొనసాగించాలంటే అతడికి అవకాశాలు ఇవ్వడమూ అంతే ముఖ్యం. నాకైతే కుల్దీప్ విషయంలో మేనేజ్మెంట్ పారదర్శకంగా, న్యాయంగా వ్యవహరిస్తున్నట్లు అనిపించడం లేదు. అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సింది.బెంచ్‌కే పరిమితం చేయడం సరికాదుముఖ్యంగా ఈసారి ప్రపంచకప్ సౌతాఫ్రికాలో జరుగబోతోంది. కుల్దీప్ అవసరం అక్కడ కచ్చితంగా ఉంటుంది. కాబట్టి అతడిని బెంచ్‌కే పరిమితం చేయడం సరికాదు. నిజానికి హార్దిక్ పాండ్యా లేడన్న కారణంగా యాజమాన్యం అతడి స్థానంలో శివం దూబేను ఆడిస్తోంది. బౌలర్‌గానూ అతడి సేవలు వాడుకోవాలనుకుంటోంది.టీ20 ఫార్మాట్ మాదిరి ఇద్దరు బౌలర్లే ఇక్కడ (వన్డే) నాలుగు ఓవర్లు వేయాల్సిన పనిలేదు. జట్టులో ఇద్దరు ఫింగర్ స్పిన్నర్లు వాషీ, అక్షర్ ఉన్నారు. ఇద్దరూ బ్యాటింగ్ చేయగలరు. కాబట్టి ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకుని.. కుల్దీప్ యాదవ్‌ను ఆడించవచ్చు కదా!’’ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. చదవండి: అతడిని ఆరోస్థానంలో ఎందుకు ఆడించారు? -
ODI WC: రోహిత్ విఫలం.. ట్విస్ట్ ఇచ్చిన గంభీర్!
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా శుభారంభం అందుకుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.రో- కో విఫలంఅయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తీవ్రంగా నిరాశపరిచారు. ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ 21 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు చేసి.. సామ్ కరన్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ కోహ్లి.. ఆరు బంతుల్లో ఒక ఫోర్ బాది.. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీలో రో-కో ఆడటంపై మరోసారి చర్చమొదలైంది.ప్రయోగాలు చేస్తాంఇప్పటికే ప్రయోగాలు చేస్తామంటూ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పష్టం చేసిన తరుణంలో.. రోహిత్- కోహ్లిని పక్కనపెట్టే సాహసం చేస్తారా? అన్న సందేహాలు వ్యక్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు స్పోర్ట్స్ టాక్‌తో మాట్లాడుతూ రోహిత్ విషయంలో మేనేజ్మెంట్ వైఖరి గురించి కీలక విషయాలు వెల్లడించాయి.ట్విస్ట్ ఇచ్చిన గంభీర్!‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ ఇప్పటికే ఎంతో గొప్పగా సేవ చేశాడు. కాబట్టి కోచ్ (గంభీర్) అతడికి స్వేచ్ఛనిచ్చాడు. ఇన్నాళ్లుగా ఎలా ఆడాడో.. ఇప్పుడు కూడా అలాగే ఆడేమని స్వేచ్ఛగా వదిలేశాడు.అయితే, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం కోచ్ అతడి పట్ల సానుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా రోహిత్ ఒత్తిడి లేకుండా.. ప్రశాంతమైన మనసుతో మ్యాచ్ ఆడేలా చూస్తున్నారు. అలా అయితేనే రోహిత్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడని యాజమాన్యం నమ్ముతోంది.మేనేజ్మెంట్కు ఆ విషయం తెలుసునిజానికి రోహిత్ ఒత్తిడిలో ఉంటే ఏం జరిగిందో చూశాం కదా!.. కాబట్టి ఇప్పుడు మేనేజ్మెంట్ అతడి ప్రతి ఇన్నింగ్స్‌ను భూతద్దంలో పెట్టి చూడాలనుకోవడం లేదు. అతడి స్థాయి ఏమిటో యాజమాన్యానికీ తెలుసు. రోహిత్ ప్రశాంతంగా.. ఒత్తిడి లేకుండా ఆడితే ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రస్తుతానికి మేనేజ్మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది. టెక్నిక్‌లో ఉన్న చిన్నపాటి లోపాలు సరిచేసుకుంటే హిట్‌మ్యాన్‌కు తిరుగు ఉండదు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ రోహిత్ శర్మ పట్ల సానుకూలంగానే ఉన్నట్లు దీనిని బట్టి తెలుస్తోంది. అతడి అనుభవం, దూకుడైన ఆట జట్టుకు ఉపయోగపడుతుందని భావిస్తున్న గంభీర్.. వరల్డ్‌కప్‌లో హిట్‌మ్యాన్‌ను ఆడించేందుకు సుముఖంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.చదవండి: IND vs ENG: అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా? -
అక్షర్ పటేల్ అరుదైన ఫీట్.. ఆ ఇద్దరి సరసన చోటు
టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన అక్షర్ పటేల్ బౌలింగ్‌లో నాలుగు వికెట్లు, ఆ తర్వాత బ్యాటింగ్‌లో (57 నాటౌట్) అజేయ అర్ధసెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. టీమిండియా తరఫున వన్డే మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో పాటు అర్ధసెంచరీ లేదా సెంచరీ సాధించిన మూడో ప్లేయర్ అక్షర్ పటేల్ రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సరసన చోటు సంపాదించాడు. 1998లో ఢాకా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ (141 పరుగులు) సెంచరీతో చెలరేగడంతో పాటు బౌలింగ్‌లో 38 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి ఆనాటి మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. ఆ తర్వాత 2022లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాండ్యా బ్యాటింగ్‌లో 71 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 24 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు.మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జో రూట్ (76 బంతుల్లో 76 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), లియామ్ డాసన్ (83 బంతుల్లో 68; 6 ఫోర్లు 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 262 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (75 బంతుల్లో 80 రిటైర్ట్‌హర్ట్; 11 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (52 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (63 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. కార్డిఫ్‌లో రేపు రెండో వన్డే జరుగుతుంది. 𝐏𝐚𝐫𝐭𝐧𝐞𝐫𝐬𝐡𝐢𝐩 𝐛𝐫𝐞𝐚𝐤𝐞𝐫. 𝐅𝐢𝐧𝐢𝐬𝐡𝐞𝐫. 𝐌𝐚𝐭𝐜𝐡-𝐰𝐢𝐧𝐧𝐞𝐫. A brilliant all-round performance from #AxarPatel powered India to a winning start in the ODI series. 💪#ENGvIND 2nd ODI 👉 THU, 16th JULY, 4:30 PM on JioHotstar! pic.twitter.com/vsi2CAv9Hk— Star Sports (@StarSportsIndia) July 15, 2026Read: బుమ్రా గురించి ప్రశ్న... ఇంగ్లండ్ కెప్టెన్ అసహనం! -
అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా?: మాజీ కెప్టెన్ ఫైర్
ఇంగ్లండ్ తాజా పర్యటనలో టీమిండియా ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్ అయిన భారత్.. వన్డే సిరీస్‌లో మాత్రం శుభారంభం అందుకుంది. బర్మింగ్‌హామ్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ సేన.. ఇంగ్లండ్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ముగ్గురూ అదరగొట్టారుఇంగ్లండ్ విధించిన 259 పరుగుల లక్ష్యాన్ని 45.2 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనింగ్ బ్యాటర్, కెప్టెన్ గిల్ 80 పరుగులతో అదరగొట్టగా.. ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (52), అక్షర్ పటేల్ (57) అజేయ అర్ధ శతకాలతో రాణించి జట్టును గెలిపించారు.A Sundar finish to a near-perfect chase. 💙Washington Sundar seals the win with a towering hit as India take a 1-0 lead in the ODI series. Watch the #ENGvIND 2nd ODI on 16th July, 4:30 PM onwards, LIVE on Sony Sports Network TV channels #SonySportsNetwork #MamlaPersonalHai pic.twitter.com/CXC40cayCn— Sony Sports Network (@SonySportsNetwk) July 14, 2026రాహుల్ విఫలంఇక ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రెగ్యులర్‌గా వచ్చే ఐదో స్థానంలో కాకుండా.. ఆరో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగాడు. అతడి స్థానంలో వాషీ ఐదో స్థానానికి ప్రమోట్ అయి సక్సెస్ కాగా.. రాహుల్ మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి జోష్ టంగ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్ ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యంపై మండిపడ్డాడు. రాహుల్‌కు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి రాహుల్‌కు కూడా ఇలా డిమోట్ అవ్వడం నచ్చి ఉండదు.ఇలాగే బలి చేస్తారా?ఏదేమైనా ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్ సేవలను మీరు సరిగ్గా ఉపయోగించుకోకుండా.. అతడి ప్రతిభను వృథా చేస్తున్నారు. ఇకముందు కూడా వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌ను ఇలాగే బలి చేస్తారా?లెఫ్ట్- రైట్ కాంబినేషన్ గురించి మీరు ఆలోచించి ఉండవచ్చు. కానీ దీని వల్ల కేఎల్ రాహుల్ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అతడు మ్యాచ్ విన్నర్. ఒంటిచేత్తో జట్టును గెలిపించగలడు. అలాంటి ఆటగాడి పట్ల ఇలాంటి వైఖరి ఎంతమాత్రం సరికాదు.ఇలా చేస్తే మున్ముందు కష్టమేరాహుల్ను ఆరు లేదంటే ఏడో స్థానంలో ఎలా పంపగలరు?.. భారత క్రికెట్‌కు ఇది మంచిదికాదు. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్-2027కు ముందు రాహుల్ విషయంలో ఇలాంటి ఆటలు వద్దు. సౌతాఫ్రికాలో పిచ్‌లు ఇంతకంటే బౌన్సీగా ఉంటాయి. కాబట్టి రాహుల్ కంటే ముందు వాషీని బ్యాటింగ్‌కు పంపడం సరికాదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ తన వన్డే కెరీర్లో ఇప్పటికి బ్యాటింగ్ ఆర్డర్లో తొలి ఏడు స్థానాల్లోనూ ఆడాడు. సగటు 50తో పరుగులు రాబట్టాడు. ఎనిమిది సెంచరీలు కూడా చేశాడు. ఇక ఐదో నంబర్ బ్యాటర్‌గా 35 ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ అత్యుత్తమంగా 63.20 సగటుతో పరుగులు చేశాడు. ఇక ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 14 ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగినపుడు అతడి సగటు కేవలం 37 మాత్రమే కావడం గమనార్హం.చదవండి: గిల్ గాయంపై అప్డేట్ -
మాట తప్పిన బీసీసీఐ!?
టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే రాజీనామా అంశంలో బిగ్ ట్విస్ట్..! వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు తన పదవి నుంచి తప్పుకొన్నాడని తొలుత వార్తలు వచ్చాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ తర్వాత డస్కటే తన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది.మాట తప్పిన బీసీసీఐ!అయితే, కేవలం వ్యక్తిగత కారణాలు కాకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) యాజమాన్యం తనకు ఇచ్చిన మాట తప్పినందు వల్లే డస్కటే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం. కాగా రెండేళ్ల క్రితం గౌతం గంభీర్ భారత హెడ్ కోచ్‌గా నియమితుడైన తర్వాత డస్కటే టీమ్ అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. గంభీర్ ఏరికోరి తెచ్చుకుంటే..గతంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కలిసి పని చేసిన అనుభవంతో డస్కటేను గంభీర్ ఎంచుకున్నాడు. అయితే ఇప్పటికీ తన బాధ్యతలపై స్పష్టత లేకపోవడంతో డస్కటే జట్టుకు దూరం కావడమే సరైందిగా భావిస్తున్నట్లు తెలిసింది. టీమ్‌తో చేరినప్పుడు తనకు స్పెషలిస్ట్ ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారట. కానీ హైదరాబాద్‌కు చెందిన టి.దిలీప్‌ను చాంపియన్స్ ట్రోఫీ తర్వాత కూడా కొనసాగించడంతో డస్కటేకు ఆ అవకాశం దక్కలేదు.పని లేదు.. అందుకే‘బ్యాటింగ్ బాధ్యతలను గంభీర్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ చూస్తున్నారు. పేసర్ల కోసం మోర్నీ మోర్కెల్, స్పిన్నర్లకు సాయిరాజ్ బహుతులే కోచ్‌లుగా ఉన్నారు. ఇక డస్కటేకు పని ఏముంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు.. లండన్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న డస్కటే తన కుటుంబంతో తగిన సమయం గడిపేందుకు కూడా భారత జట్టును వీడాలని భావిస్తున్నట్లు క్రిక్‌బజ్ పేర్కొంది.అంతర్జాతీయ జట్టుకంటే ఫ్రాంచైజీ లీగ్‌లతో కలిసి పని చేయడం తనకు సౌకర్యంగా ఉంటుందని కూడా డస్కటే అనుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు లీగ్‌ల యాజమాన్యాలు డస్కటేను సంప్రదించినట్లు సమాచారం. ఇక డస్కటే నిజంగా తప్పుకొంటే దిలీప్‌ను బీసీసీఐ మరికొంత కాలం పాటు ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగించే అవకాశం ఉంది. చదవండి: ఇంగ్లండ్ కంచుకోట బద్దలు.. గిల్ రికార్డు -
బుమ్రా గురించి ప్రశ్న... ఇంగ్లండ్ కెప్టెన్ అసహనం!
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ విఫలమయ్యాడు. ఒక్క పరుగు మాత్రమే చేసి భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు దొరికిపోయాడు. మ్యాచ్ ఓటమి తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన బ్రూక్‌కు బుమ్రా గురించి ప్రశ్న వేయడంపై అసహనం వ్యక్తం చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో ఔటవ్వడంపై మీ స్పందనేంటి అని విలేకరులు బ్రూక్‌కు ప్రశ్న వేశారు. దీనిపై బ్రూక్ స్పందిస్తూ.. ‘బుమ్రా మంచి బౌలర్. నాకు వేసిన బంతి బౌన్స్ కావడం వల్ల షాట్ ఆడే క్రమంలో మిస్ అయ్యాను. దీంతో ఔట్ కావాల్సి వచ్చింది’ అని ముక్తసరిగా సమాధానమిచ్చాడు. ఆ తర్వాత రిపోర్టర్లు మరో ప్రశ్న అడుగుతుండగానే బ్రూక్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే వన్డే సిరీస్ కంటే ముందు జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో హ్యారీ బ్రూక్ 229 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐదో టీ20 మ్యాచ్‌లో తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ (45 బంతుల్లో 95 నాటౌట్) ఆడడం విశేషం. అయితే వన్డే ఫార్మాట్‌కు రాగానే హ్యారీ బ్రూక్ ఆట మారిపోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసి బుమ్రాకు దొరికిపోయాడు. అయితే వన్డేల్లో బ్రూక్, బుమ్రా ఎదురుపడడం ఇదే తొలిసారి. 2026 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో కూడా బ్రూక్.. బుమ్రాకే వికెట్ సమర్పించుకున్నాడు. టెస్టు ఫార్మాట్లో కూడా బ్రూక్‌ను బుమ్రా ఒకసారి ఔట్ చేశాడు. తాజాగా వన్డేలోనూ బ్రూక్‌ను ఔట్ చేయడం ద్వారా మూడు ఫార్మాట్లలోనూ బుమ్రా అతడి వికెట్ తీసిన బౌలర్‌గా నిలిచాడు. మ్యాచ్ ఓటమిపై బ్రూక్ స్పందిస్తూ.. తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ మారిపోయిందన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో తరహాలోనే స్పందించి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. బ్యాటర్లు ఈజీగా పరుగులు చేసేలా మారిందన్నాడు. ఓవర్‌కు 5 నుంచి 6 పరుగులే చేయాల్సి ఉండడంతో ప్రత్యర్థి బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడి పరుగులు సాధించారన్నాడు. ఇక తాము ఎప్పుడూ కూడా పిచ్ పరిస్థితులను బట్టి జట్టును ఎంపిక చేస్తామన్నాడు. బ్యాటర్లు ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే తమ స్పిన్నర్లు ప్రత్యర్థిని కట్టడి చేసి ఉండేవారని అభిప్రాయపడ్డాడు. ఇక రెండో వన్డేలో జట్టు కాంబినేషన్ గురించి ఇంకా ఆలోచిం చలేదన్నాడు. ఆ మ్యాచ్‌కు వేదిక అయిన కార్డిఫ్ కు వెళ్లిన తరువాత అక్కడి పిచ్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన టీమిండియా కార్డిఫ్ వేదికగా రెండో వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్‌లోనే గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. Harry Brook keeping things short when asked about Jasprit Bumrah’s delivery that outsmarted the England captain:“Good bowler. Bounced a little. Nicked it to sleep.” 😂#ENGvIND pic.twitter.com/sKDdeY4w1a— Siddharth Thakur (@fvosid) July 14, 2026Read: ఫిఫా వీఏఆర్పై ప్రపంచవ్యాప్త నిరసనలు.. ఆ దేశంలో మాత్రం! -
తొలి వన్డేలో రిటైర్డ్ హర్ట్.. గిల్ గాయంపై కీలక అప్డేట్
ఇంగ్లండ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 80 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. సెంచరీ దిశగా సాగుతున్న గిల్‌కు కుడి కండరాలు పట్టేయడంతో అసౌకర్యంగా ఫీలయ్యాడు. వెంటనే భారత జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో గిల్ రిటైర్డ్ హర్ట్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో అతడు నడుస్తున్నంత సేపు నొప్పితో ఇబ్బంది పడినట్లుగా కనిపించింది. నొప్పితో బాధపడుతున్న గిల్ రెండో వన్డే ఆడుతాడా లేదా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. తాజాగా గిల్ గాయానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. గాయం తీవ్రతపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కేవలం కండరాలు పట్టేయడంతోనే నొప్పి వచ్చినట్లు భారత మెడికల్ బృందం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికైతే గిల్ బాగానే ఉన్నాడని, రెండో వన్డేలో ఆడుతాడని టీమిండియా మేనేజ్మెంట్ తెలిపింది. రెండో వన్డేకు ఒకరోజు గ్యాప్ ఉండడంతో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని పేర్కొంది. గిల్ కూడా తన గాయంపై స్పందించాడు. ‘నేను బాగానే ఉన్నాను. కండరాల నొప్పితో కాస్త బాధపడ్డాను. ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. రెండో వన్డేకు నేను ఫిట్‌గానే ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్‌లు వెనువెంటనే ఔటైన తర్వాత గిల్, అయ్యర్‌తో కలిసి బాధ్యతగా ఆడాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే గిల్ రిటైర్డ్ హర్ట్ వెళ్లిన కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్ 35 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా కేవలం ఒక్క పరుగుకే ఔటవడంతో భారత్‌పై మరోసారి ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలో క్రీజ్ లోకి వచ్చిన ఆల్ రౌండర్స్ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లు బాధ్యతాయుతంగా ఆడుతూ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసి ఇంగ్లాండ్ ను మట్టికరిపించారు.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఒక దశలో 107/6తో కష్టాల్లో పడింది. అయితే జో రూట్, లియామ్ డాసన్ అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకుని 258 పరుగుల గౌరవప్రదమైన స్కోరు అందించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో రాణించి ఇంగ్లండ్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. తొలి వన్డేలో గెలిచి మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే గురువారం కార్డిఫ్ వేదికగా జరగనుంది.చదవండి: ఇంగ్లండ్ కంచుకోట బద్దలు.. గిల్ అరుదైన ఫీట్ -
ఇంగ్లండ్ కంచుకోట బద్దలు.. గిల్ అరుదైన ఫీట్
ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో విజయం ద్వారా టీమిండియా అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఇంగ్లండ్ గడ్డపై తొలి విజయంతో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించగా, ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. గత 12 ఏళ్లలో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన వన్డేలో ఇంగ్లండ్‌ను ఓడించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. ఎడ్జ్‌బాస్టన్‌లో 2015 నుంచి తాము ఆడిన ఏడు వన్డేల్లో ఇంగ్లండ్ ఒక్కటి కూడా ఓడిపోలేదు. 2014లో ఇదే ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది కూడా టీమిండియానే. మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ కంచుకోటను మరోమారు గిల్ కెప్టెన్సీలోని టీమిండియానే బద్దలు కొట్టడం విశేషం.👉మరో రికార్డు ఏంటంటే.. ఇంగ్లండ్‌పై వన్డేల్లో టీమిండియాకు ఇది వరుసగా ఆరో విజయం. తన లాంగ్ స్ట్రీక్‌ను భారత జట్టు విజయవంతంగా కొనసాగిస్తోంది. గతంలో మూడు వివిధ సందర్భాల్లో ఇంగ్లండ్‌పై వన్డేల్లో వరుసగా ఐదేసి విజయాలు నమోదు చేసింది.👉 కోహ్లి, రోహిత్ విఫలమైన వేళ టీమిండియా వన్డేల్లో 250 ప్లస్ స్కోరును ఛేదించడం 2016 నుంచి ఇది రెండోసారి మాత్రమే. 2022లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో 260 పరుగుల టార్గెట్‌ను టీమిండియా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్‌లు 17 పరుగులు చేసి ఔటయ్యారు.చదవండి: తొలి వన్డేలో రిటైర్డ్ హర్ట్.. గిల్ గాయంపై కీలక అప్డేట్ -
‘ఇది మంచి ఆరంభం.. అతడొక అద్భుతం’
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా తొలి విజయాన్ని అందుకుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బౌలింగ్‌తో, ఆపై బ్యాటింగ్ ఇలా సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడాడు. ఇది తమకు మంచి ఆరంభమని, దీనిని తర్వాతి మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తామని గిల్ తెలిపాడు. ‘నిజానికి నేను టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకునేవాడినేమో. ఎందుకంటే బౌలింగ్‌తో పోలిస్తే బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్‌లో బుమ్రా మినహా మిగతావారికి ఇంగ్లండ్ గడ్డపై పెద్దగా అనుభవం లేదు. మా ముందు ఎంత పెద్ద లక్ష్యం ఉన్నా దానిని ఛేదించేందుకు మా దగ్గర బ్యాటింగ్ అస్త్రాలు నిండుగా ఉన్నాయి. కానీ మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. తొలి 10 ఓవర్లలో ఇంగ్లండ్ 50కి పైగా పరుగులు చేసినప్పటికీ ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టం చేయడంతో వారికి పరుగులు రావడం కష్టమైపోయింది. చివరి పవర్ ప్లేలో ఇంగ్లండ్ కాస్త దూకుడుగా ఆడడంతో 250 ప్లస్ స్కోరును దాటగలిగారు లేదంటే 220 నుంచి 230కి పరిమితమయ్యేవాళ్లేమో. 2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉండడంతో ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. బ్యాటింగ్, బౌలింగ్ సమపాళ్లలో ఉండేలా వర్కౌట్ చేస్తున్నాం. ఇంగ్లండ్ గడ్డపై ఉండే వికెట్ పరిస్థితులు దక్షిణాఫ్రికాలోని పరిస్థితులకు కొంత సారూప్యత ఉంటుందని భావిస్తున్నా. అక్షర్ పటేల్ తన ఆల్‌రౌండ్ పాత్రకు న్యాయం చేశాడు. రాబోయే రోజుల్లో ఈ విజయాలను కంటిన్యూ చేస్తాం’ అని చెప్పుకొచ్చాడు.ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జో రూట్ (76 బంతుల్లో 76 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), లియామ్ డాసన్ (83 బంతుల్లో 68; 6 ఫోర్లు 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ 107/6తో ఇబ్బందుల్లో ఉన్న దశలో రూట్, డాసన్ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 22.2 ఓవర్లలో 121 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 262 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (75 బంతుల్లో 80 రిటైర్ట్‌హర్ట్; 11 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (52 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (63 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అక్షర్, సుందర్ ఐదో వికెట్‌కు 105 బంతుల్లో అభేద్యంగా 102 పరుగులు జత చేశారు. సిరీస్‌లో భారత్ 1–0తో పైచేయి సాధించగా... కార్డిఫ్‌లో రేపు రెండో వన్డే జరుగుతుంది. -
గుర్నూర్ దెబ్బకు కిందపడ్డ గిల్.. కోహ్లి రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో భారత పేసర్ గుర్నూర్ బ్రార్ అదరగొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మంగళవారం నాటి తొలి వన్డేకు బర్మింగ్‌హామ్ వేదిక. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఒకే ఓవర్లో రెండు వికెట్లుఈ క్రమంలో 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఇంగ్లండ్ 61 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన బ్రార్ రెండో బాల్‌కు జేకబ్ బెతెల్ (14), నాలుగో బంతికి బెన్ డకెట్ (43)ను అవుట్ చేశాడు. తద్వారా ఒకే ఓవర్లో ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు.ఘోరంగా ఢీకొట్టుకున్నారుఇదిలా ఉంటే.. పదహారో ఓవర్లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో జోస్ బట్లర్ బంతిని గాల్లోకి లేపాడు. ఈ క్యాచ్‌ను అందుకునేందుకు బ్రార్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరూ ఘోరంగా ఢీకొట్టుకున్నారు. అయితే, బ్రార్ సురక్షితంగా క్యాచ్ పట్టడంతో బట్లర్ (5) వెనుదిరిగాడు.ఇక కిందపడ్డ గిల్‌ను చేయిచ్చి పైకి లేపిన బ్రార్.. అతడిని ఆలింగనం చేసుకున్నాడు. ఇంతలో ప్రసిద్ కృష్ణతో కలిసి వికెట్‌ను సెలబ్రేట్ చేసుకున్న టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి.. బ్రార్ వైపుగా వచ్చి డాన్స్ చేస్తూ అతడిని టీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Gurnoor Brar completes the catch to send Jos Buttler back 🚶➡️ Watch the 1st ODI of #ENGvIND, LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/W2lmSrbZE4— Sony Sports Network (@SonySportsNetwk) July 14, 2026258 పరుగులకు ఆలౌట్‌కాగా ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో భారత బౌలర్లు మెరుగ్గా రాణించారు. ప్రత్యర్థిని 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ చేశారు. అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలా రెండు.. జస్ప్రీత్ బుమ్రా, శివం దూబే తలా ఒక వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ టాప్ రన్ స్కోరర్ (76 నాటౌట్)గా నిలవగా.. లియామ్ డాసన్ (68) కూడా అర్ధ శతకం చేశాడు. మిగిలిన వారిలో బెన్ డకెట్ (43), విల్ జాక్స్ (20) రాణించారు. చదవండి: వాళ్లిద్దరికి అస్సలు పడటం లేదు.. డీకే సంచలన వ్యాఖ్యలు -
IND vs ENG: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
భారత్ ఘన విజయంఎడ్జ్బాస్టన్ వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(85) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నిలకడగా ఆడిన గిల్ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. గిల్‌తో పాటు అక్షర్ పటేల్(55 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(35) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.విజయం దిశగా భారత్ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 66 బంతుల్లో 43 పరుగులు కావాలి. క్రీజులో అక్షర్ పటేల్(35), వాషింగ్టన్ సుందర్(29) ఉన్నారు.గిల్ రిటైర్డ్ హర్ట్80 పరుగుల వద్ద గిల్ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ క్రీజ్‌లోకి వచ్చాడు. 34 పరుగులతో శ్రేయస్ అప్పటిక క్రీజ్‌లో ఉన్నాడు. 26.1 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 151-2గా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ మరో 108 పరుగులు చేయాలి. నిలకడగా ఆడుతున్న గిల్, శ్రేయస్గిల్ (74), శ్రేయస్ అయ్యర్ (32) నిలకడగా ఆడుతున్నారు. 24 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 141-2గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 118 పరుగులు చేయాలి. రోహిత్, కోహ్లి ఔట్ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లి (5) ఘోరంగా విఫలమయ్యారు. సామ్ కర్రన్ బౌలింగ్‌లో రోహిత్ ఔట్ కాగా.. ఆర్చర్ బౌలింగ్‌లో విరాట్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 8.3 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 48-2గా ఉంది. రోహిత్ ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్7.3వ ఓవర్- 259 పరుగుల ఛేదనలో టీమిండియా 43 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 21 బంతుల్లో ఫోర్ సాయంతో 11 పరుగులు చేసిన రోహిత్ సామ్ కర్రన్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. గిల్‌కు (26) జతగా విరాట్ కోహ్లి క్రీజ్‌లోకి వచ్చాడు. బర్మింగ్‌హామ్ వేదికగా టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ బెన్ డకెట్ (43) రాణించగా.. జో రూట్ (76 నాటౌట్), లియామ్ డాసన్ (68) అర్ధ శతకాలతో అదరగొట్టారు. మిగిలిన వారిలో విల్ జాక్స్ (20) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ తలా రెండు.. బుమ్రా, శివం దూబే చెరో వికెట్ దక్కించుకున్నారు. 259 పరుగుల లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. అప్డేట్స్..ఇంగ్లండ్ ఆలౌట్47.5: అక్షర్ బౌలింగ్‌లో జోష్ టంగ్ బౌల్డ్ (0)తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్47.3:అక్షర్ బౌలింగ్‌లో ఆదిల్ రషీద్ స్టంపౌట్ (1)ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్45.6: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన జోఫ్రా ఆర్చర్ (12). స్కోరు 250-8 (46). క్రీజులోకి ఆదిల్ రషీద్ రాగా.. రూట్ 69 పరుగులతో ఉన్నాడు.ఏడో వికెట్ డౌన్43.6: అక్షర్ పటేల్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చిన డాసన్. 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్. క్రీజులోకి జోఫ్రా ఆర్చర్. రూట్ 59 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 228-7 (44).డాసన్, రూట్ హాఫ్ సెంచరీలు42 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 214-6రూట్ 51, డాసన్ 63 పరుగులతో ఉన్నారు.కుదురుగా ఆడుతున్న రూట్, డాసన్జో రూట్ (30), లియామ్ డాసన్ (34) కుదురుగా ఆడుతున్నారు. 32 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 160-6గా ఉంది. 27 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 128-627 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 128-6గా ఉంది. రూట్ 21, లియామ్ డాసన్ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్21.4వ ఓవర్- 107 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే బౌలింగ్‌లో రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో విల్ జాక్స్ (20) ఔటయ్యాడు. 100 దాటిన ఇంగ్లండ్ స్కోర్21 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్ 104-5గా ఉంది. జో రూట్ (9), విల్ జాక్స్ (19) క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్16.4: ప్రసిద్ బౌలింగ్‌లో సామ్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్16.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో బ్రార్‌కు క్యాచ్ ఇచ్చి బట్లర్ అవుట్ (5). కేవలం 19 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్. సామ్ కర్రాన్ క్రీజులోకి రాగా.. రూట్ 6 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 80-4.మూడో వికెట్ డౌన్13.1: బుమ్రా బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (1). క్రీజులోకి జోస్ బట్లర్. రూట్ సున్నా పరుగులతో ఉన్నాడు. స్కోరు: 64-3.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్12.4: గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చిన డకెట్. హాఫ్ సెంచరీకి ఏడు పరుగులదూరంలో నిలిచిన డకెట్ (43).తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్12.2: గుర్నూర్ బ్రార్ బౌలింగ్ వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగిన జేకబ్ బెతెల్ (14).పవర్ ప్లేలో ఇంగ్లండ్ స్కోరు: 51-0 (10)ఓపెనర్లు బెన్ డకెట్ 41, జేకబ్ బెతెల్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.రో-కో రాకఇక ఈ సిరీస్ సందర్భంగా భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ చాలాకాలం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు. ఏడు మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌దే గెలుపు! 👉ఈ ఇద్దరు చివరగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జనవరిలో జరిగిన వన్డే సిరీస్‌లో పాల్గొన్నారు. ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన గత ఏడు వన్డేల్లోనూ ఇంగ్లండ్ గెలుపొందడం విశేషం. అయితే, చివరగా 2014లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ ఓడింది. బట్లర్ @ 200👉మరోవైపు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ కెరీర్లో ఇది 200వ వన్డే. తద్వారా ఇంగ్లండ్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఇయాన్ మోర్గాన్ (225 వన్డేలు) తర్వాతి స్థానాన్ని బట్లర్ ఆక్రమించాడు. ఇదిలా ఉంటే.. ముందుగా టీ20 సిరీస్ జరగగా ఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాను 4-0తో వైట్‌వాష్ చేసింది. తుదిజట్లుఇంగ్లండ్జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్ఇండియారోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ. -
వరల్డ్‌కప్ ప్రణాళికలు వేరు.. కోహ్లితో ఏం మాట్లాడానంటే?: గిల్
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమిండియా వన్డే సిరీస్‌కు సన్నద్ధమైంది. ఇరుజట్ల మధ్య బర్మింగ్‌హామ్ వేదికగా తొలి వన్డేకు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్‌తో భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు.ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదుఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. శిక్షణ సందర్భంగా కోహ్లితో జరిగిన సంభాషణ గురించి వివరించాడు. ‘‘అత్యుత్తమ కాంబినేషన్‌తో ముందుకు వెళ్లడమే మా ప్రధాన ప్రణాళిక. దీని గురించే మేము మాట్లాడుకున్నాము.కొంతమంది ప్రస్తుతం జట్టులో లేకపోవచ్చు. వీరిలో పేస్ బౌలర్లు, ఆల్‌రౌండర్లు, స్పిన్నర్లు.. ఇలా ఎవరైనా సరే ఆయా విభాగం నుంచి భవిష్యత్తులో సేవలు అందించేందుకు జట్టులోకి రావొచ్చు. ఇక విరాట్ భాయ్, రోహిత్ భాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.గత దశాబ్ద కాలంగా వారిద్దరు టీమిండియా బ్యాటింగ్ లైనప్ వెన్నెముకగా ఉన్నారు. వారు జట్టులో అంతర్భాగం. వారి అనుభవం, నైపుణ్యం మా జట్టు విలువను పెంచుతాయి. అయితే, వన్డే ప్రపంచకప్ ప్రణాళికలు కాస్త భిన్నంగా ఉంటాయి.ఇక్కడి వికెట్ల మాదిరే వీలైనన్ని వైవిధ్యమైన కాంబినేషన్లు ప్రయత్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వరల్డ్‌కప్ వేదికైన సౌతాఫ్రికాలోని పిచ్‌లు.. ఇక్కడి (ఇంగ్లండ్) వికెట్ల మాదిరే ఉంటాయి. కాబట్టి మా బలాన్ని పరీక్షించుకునే క్రమంలో ఇది అత్యంత కీలకమైన సిరీస్‌గా మారింది. కొత్త వాళ్లకు అవకాశం నిజానికి మా తుదిజట్టులో ఎప్పుడూ పెద్దగా మార్పులు జరగలేదు. అయితే, కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా.. ఒత్తిడిలో వారు ఏమేరకు రాణించగలరో తెలుసుకోవచ్చు. తద్వారా ప్రపంచకప్ టోర్నీకి ముందే జట్టు కూర్పు గురించి మాకు ఒక అవగాహన వస్తుంది’’ అని శుబ్‌మన్ గిల్ తెలిపాడు.ఇక టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్‌వాష్ కావడం తమపై ఎలాంటి ప్రభావం చూపబోదని గిల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ‘‘ఈ రెండూ వేర్వేరు ఫార్మాట్లు. వేర్వేరు జట్లు. వేర్వేరు లక్ష్యాలు. కాబట్టి ఈ సిరీస్‌పై గత టీ20 సిరీస్ ప్రభావం ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అని గిల్ అన్నాడు.చదవండి: టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్! -
తొలి వన్డే.. కోహ్లిని ఆకాశానికి ఎత్తిన ఇంగ్లండ్ కోచ్
ఇంగ్లండ్, టీమిండియా మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మరికొన్ని గంటల్లో తొలి వన్డే మొదలుకానుంది. జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ తర్వాత వన్డేలు ఆడని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు జట్టులోకి తిరిగొచ్చారు. రో-కో ద్వయం తిరిగి రావడంతో పాటు గిల్, కేఎల్ రాహుల్ కూడా జాయిన్ కావడంతో టీమిండియా సరికొత్తగా కనిపిస్తుంది. అయితే ఇంగ్లండ్‌తో తొలి వన్డే నేపథ్యంలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ కోహ్లిని ఆకాశానికి ఎత్తాడు. 'క్రీడా ప్రపంచంలో కోహ్లి ఒక నిజమైన చాంపియన్. తన దూకుడైన ఆటతో క్రీడకు సరికొత్త నిర్వచనం చెప్పి ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచాడు. కోహ్లి కేవలం క్రికెట్ ప్రపంచంలోనో లేక భారతదేశంలోనో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడల రంగాలకు కూడా సుపరిచితుడిగా మారిపోయాడు. ప్రజలు క్రికెట్‌ను ప్రేమించేలా చేయడంలో కోహ్లి స్ఫూర్తినిచ్చాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోహ్లి వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది. అతడు నిజమైన ఛాంపియన్.' అని పొగడ్తల వర్షం కురిపించాడు.ఇటీవలే ఇంగ్లండ్ వరుస టెస్టు సిరీస్ పరాజయాలు చవిచూడడంతో టెస్టు కోచ్ పదవికి బ్రెండన్ మెక్కల్లమ్ గుడ్‌బై చెప్పాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డే, టీ20 ఫార్మాట్)లో మాత్రం హెడ్‌కోచ్‌గా కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు. తాజాగా టెస్టు కోచ్ పదవి నుంచి తప్పుకోవడంపై స్పందించిన మెక్కల్లమ్ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు క్షమాపణ తెలిపాడు. టెస్టు కోచ్ పదవి నుంచి తప్పుకోవాలనే నిర్ణయం బాధించినప్పటికీ పరిస్థితుల ప్రభావంతోనే అలా చేయాల్సి వచ్చిందన్నాడు. అయితే తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని మెక్కల్లమ్ పేర్కొన్నాడు. తన నిర్ణయం పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు క్షమాపణ కోరుతున్నట్లు తెలిపాడు. టెస్టు కోచ్‌గా తన పాత్రను సమర్థంగా పోషించలేకపోయానని, అందుకే తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించాడు. మెక్కల్లమ్ టెస్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో బెన్‌స్టోక్ కెప్టెన్సీలో 'బజ్‌బాల్' ఆటతో ఇంగ్లండ్ 11 టెస్టుల్లో 10 విజయాలు సాధించి కొత్త శకానికి నాంది పలికింది. కానీ రానురాను బజ్‌బాల్ ఆట ఇంగ్లండ్ కొంపముంచింది. ఈ మధ్య కాలంలో ఇంగ్లండ్ ఆడిన 9 టెస్టుల్లో ఏడింటిలో పరాజయం చవిచూసి డబ్ల్యూటీసీ టైటిల్ రేసులో చాలా వెనుకబడిపోయింది. ఆ తర్వాత స్టోక్స్ ఉదంతం అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించేలా చేసింది. ఆ వెంటనే మెక్కల్లమ్ టెస్టు కోచ్ పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. Brendon McCullum has apologised to England fans for the poor string of Test results that led to his dismissal 💬 pic.twitter.com/zxNyHAvC7y— Sky Sports Cricket (@SkyCricket) July 13, 2026Read: ఫిఫా చరిత్రలో తొలిసారి.. సెంటిమెంట్‌తో బరిలోకి అర్జెంటీనా! -
జేడన్ పాంచ్ పటాకా.. విండీస్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
వెస్టిండీస్ టూర్లో న్యూజిలాండ్ బోణీ కొట్టింది. కివీస్ బౌలర్ జేడన్ లిన్నెక్స్ ఐదు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. గయానా వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 36 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ (43) టాప్ స్కోరర్‌గా నిలవగా, అమిర్ జాంగో (24) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జేడన్ లెన్నోక్స్ 5 వికెట్లతో విండీస్ నడ్డి విరిచాడు. మైకెల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 32.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. టామ్ లాథమ్ (37 నాటౌట్),మైకెల్ బ్రాస్‌వెల్ (24 నాటౌట్) కివీస్ణు విజయతీరాలకు చేర్చారు. అంతకముందు విల్ యంగ్ (28), డారిల్ మిచెల్ (28) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో ఖారీ పియర్రె 2 వికెట్లు తీయగా, అల్జారీ జోసెఫ్, గుదకేశ్ మోతీ చెరొక వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. జూలై 16న మూడో వన్డే జరగనుంది. -
తిరిగొచ్చిన రో-కో ద్వయం.. తొలి వన్డేకు భారత జట్టు ఇదే!
ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్‌లో దారుణ పరాజయం తర్వాత శుబ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా వన్డే సిరీస్ ఆడేందుకు సమాయత్తమవుతోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మంగళవారం (జూలై 14న) ఇరుజట్లు తొలి వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డే జట్టుతో కలిశారు. ఇక తొలి వన్డేకు తుది జట్టు అంచనా ఒకసారి పరిశీలించి చూద్దాం.వీరితో పాటు సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా జాయిన్ కావడంతో టీమిండియా బలం పెరిగింది. 20 ఓవర్ల ఫార్మాట్ నుంచి 50 ఓవర్ల ఫార్మాట్‌కు ఆట మారడానికి తోడు, సీనియర్లు అంతా జట్టులోకి రావడంతో టీమిండియా ఇప్పుడు పేపర్‌పై దుర్భేద్యంగా కనిపిస్తోంది. 39 ఏళ్ల రోహిత్, 38 ఏళ్ల కోహ్లికి 2027 వన్డే ప్రపంచకప్ ఆఖరిది కానుండడంతో వీరిద్దరు రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. టీ20 సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్‌లు తమ బౌలింగ్‌తో టీమిండియా బ్యాటర్లను బెంబెలెత్తించారు. కానీ వన్డే ఫార్మాట్లో కోహ్లి, రోహిత్ వంటి అనుభవజ్ఞులు రావడంతో ఈ ఇద్దరు బౌలర్ల ఆటలు సాగకపోవచ్చని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్‌లో గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌తో పాటు కేఎల్ రాహుల్ కీలకంగా మారనున్నారు.ఆల్‌రౌండ్ విభాగంలో అక్షర్‌పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్‌లు ఉన్నప్పటికీ వీరిలో ఇద్దరికి మాత్రమే అవకాశం రానుంది. ఇక బౌలింగ్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా నడిపించనుండగా.. టీ20 సిరీస్‌లో విఫలమైనప్పటికీ అర్ష్‌దీప్‌కు మరో చాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో స్పిన్నర్ అవసరమనుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడు. లేదంటే ప్రసిధ్ క్రిష్ణ, గుర్నూర్ బ్రార్‌లలో ఒకరికి అవకాశం కల్పించవచ్చు. మొత్తానికి టీ20 సిరీస్‌లో ఓటమి పాలైనప్పటికీ వన్డే సిరీస్‌కు మాత్రం సీనియర్ల రాకతో టీమిండియా కొత్తగా కనిపిస్తోంది. మ్యాచ్ సమయం: భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది.తుదిజట్టు అంచనా: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ క్రిష్ణ/ గుర్నూర్ బ్రార్ -
క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన జింబాబ్వేకు షాక్!
బంగ్లాదేశ్‌పై మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోన్న జింబాబ్వే జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఆ జట్టు కెప్టెన్ రిచర్డ్ నగరవా మూడో వన్డేకు దూరమయ్యాడు. అతడి స్థానంలో సికందర్ రజా స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే మ్యాచ్‌లో రిచర్డ్ నగరవా ఆడకపోవడంపై టాస్ సమయంలో సికందర్ రజా క్లారిటీ ఇచ్చాడు. వర్క్‌లోడ్ కారణంగానే రిచర్డ్ నగరవాకు జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతి కల్పించినట్లు సికందర్ రజా పేర్కొన్నాడు. నగరవాతో పాటు జట్టుకు ఆయువుపట్టు అయిన బ్లెసింగ్ ముజరబానీతో పాటు న్యూమన్ నైమురీకి కూడా మూడో వన్డేకు విశ్రాంతి ఇచ్చినట్లు తెలిపాడు. టీ20 ప్రపంచకప్ నుంచి రిచర్డ్ నగరవా రెస్ట్ లేకుండా అన్ని మ్యాచ్‌లు ఆడుతూనే వస్తున్నాడు. రాబోయే రోజుల్లో భారత్‌తో కీలకమైన టీ20 సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొనే బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుందని సికందర్ రజా వెల్లడించాడు. ఇక బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో జింబాబ్వే కెప్టెన్ రెండో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. బంగ్లా బౌలర్ నహీద్ రానా 7 వికెట్లతో టాప్‌లో ఉండగా, రిచర్డ్ నగరవా ఆరు వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. 8 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. కాయా (4), క్రెయిగ్ ఇర్విన్ (0) క్రీజులో ఉన్నారు. తుదిజట్లు:బంగ్లాదేశ్: తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, నూరుల్ హసన్(వికెట్ కీపర్), మొసద్దెక్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్(కెప్టెన్), మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, తన్వీర్ ఇస్లాంజింబాబ్వే : బెన్ కుర్రాన్, బ్రియాన్ బెన్నెట్, ఇన్నోసెంట్ కైయా, క్రెయిగ్ ఎర్విన్, సికందర్ రజా(కెప్టెన్), వెస్లీ మాధవెరె, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా, ఎర్నెస్ట్ మసుకు, తనకా చివాంగాచదవండి: ఫిక్సింగ్ ఆరోపణలు.. కప్పు గెలవొద్దనే ఇలాంటి కుట్రలు! -
దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్!
జింబాబ్వే చేతిలో ఘోర పరాభవం పాలైన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జింబాబ్వేతో రెండో వన్డేలో ఓడి సిరీస్ కోల్పోయిన బాధలో ఉన్న బంగ్లాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది.కాగా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. తొలుత ఇరుజట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరగ్గా.. ఊహించని రీతిలో ఆతిథ్య జట్టు బంగ్లాను ఏకంగా ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో మట్టికరిపించింది.వన్డే సిరీస్ జింబాబ్వేదేఅనంతరం హరారేలో సోమవారం తొలి వన్డే జరగ్గా.. జింబాబ్వే బంగ్లాదేశ్‌పై 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఇదే వేదికపై గురువారం జరిగిన ఉత్కంఠపోరులోనూ జింబాబ్వేనే పైచేయి సాధించింది. బంగ్లాను 13 పరుగుల తేడాతో ఓడించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. జింబాబ్వే ఓపెనర్ బెన్ కర్రాన్ అజేయ సెంచరీ (111*)తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.జరిమానా విధించిన ఐసీసీఇక జింబాబ్వేతో రెండో వన్డే సందర్భంగా బంగ్లాదేశ్ నిర్ణీత సమయంలో తమ బౌలింగ్ కోటా పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా బంగ్లాకు జరిమానా విధించినట్లు ప్రకటన విడుదల చేసింది.‘‘హరారేలో గురువారం జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ వారి మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధిస్తున్నాం. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ఉల్లంఘించినందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నాం.నిర్ణీత సమయంలో తమకు కేటాయించిన ఓవర్లు పూర్తి చేయనందున ఈ మేరకు జరిమానా విధించాము’’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. కాగా జింబాబ్వే- బంగ్లాదేశ్ మధ్య శనివారం నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది. ఇందుకు హరారే వేదిక.చదవండి: అతడు భయపడుతున్నాడు.. టీమిండియా నుంచి తీసేయండి! -
జింబాబ్వేదే వన్డే సిరీస్
హరారే: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో ఘనవిజయం సాధించిన జింబాబ్వే జట్టు... వన్డే సిరీస్‌లోనూ అదే జోరు కనబర్చింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన జింబాబ్వే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. గురువారం జరిగిన రెండో వన్డేలో జింబాబ్వే 13 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెన్ కరన్ (135 బంతుల్లో 111 నాటౌట్; 9 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.బ్రాడ్ ఇవాన్స్ (38 బంతుల్లో 58 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టగా... సికందర్ రజా (33; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో తస్కీన్ అహ్మద్, మెహదీ హసన్ మిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 48.1 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. తౌహిద్ హృదయ్ (90 బంతుల్లో 60; 5 ఫోర్లు), తన్జీద్ హసన్ (70 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో పోరాడారు. గత మ్యాచ్‌లో 142 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడిన బంగ్లాదేశ్... ఈ సారి 235 పరుగుల ఛేదనలో 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ రిచర్డ్ 3 వికెట్లు పడగొట్టగా... ముజరబాని, బ్రాడ్ ఇవాన్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. శనివారం ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే జరగనుంది. -
జింబాబ్వే ఓపెనర్ సూపర్ సెంచరీ.. బంగ్లాదేశ్‌కు పరీక్ష!
సొంతగడ్డపై జింబాబ్వే అదరగొడుతోంది. బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో అనూహ్య రీతిలో ఇన్నింగ్స్ మీద 85 పరుగుల తేడాతో గెలిచిన జింబాబ్వే.. వన్డేల్లోనూ శుభారంభం అందుకుంది.హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా తొలి వన్డేలో పర్యాటక బంగ్లా జట్టును 25 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి 141 పరుగులకే జింబాబ్వే ఆలౌట్ అయింది. అయితే, స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మాత్రం ఆతిథ్య జట్టు సఫలమైంది.బంగ్లాదేశ్‌ను 116 పరుగులకే ఆలౌట్ చేసి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అదే వేదికపై గురువారం నాటి రెండో వన్డేలో జింబాబ్వే.. తొలి మ్యాచ్‌తో పోలిస్తే భారీ స్కోరే సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది.ఓపెనర్లలో బ్రియాన్ బెనెట్ డకౌట్ కాగా.. బెన్ కర్రాన్ సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా 135 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో సికిందర్ రజా చెప్పుకోగదగ్గ స్కోరు (33) చేయగా.. లోయర్ ఆర్డర్లో బ్రాడ్ ఎవాన్స్ మెరుపులు మెరిపించాడు.కేవలం 38 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. బెన్ కర్రాన్, ఎవాన్స్ ఇన్నింగ్స్ కారణంగా జింబాబ్వే 247 పరుగులు చేయగలిగింది. బంగ్లాదేశ్ బౌలర్లలో కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్, టస్కిన్ అహ్మద్ తలా రెండు వికెట్లు తీయగా.. నహీద్ రాణా, రిషాద్ హొసేన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక తొలి వన్డేలో 116 పరుగులకే ఆలౌట్ అయిన బంగ్లాదేశ్.. ఈసారి 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంటే ఒక రకంగా కఠిన పరీక్షే!! -
బంగ్లాదేశ్‌పై జింబాబ్వే సంచలన విజయం
జింబాబ్వే పర్యటనలో బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్ ఎదురైంది. సొంతగడ్డపై పాకిస్తాన్, ఆస్ట్రేలియాలను చిత్తు చేసిన బంగ్లాదేశ్ జింబాబ్వే పర్యటనలో మరో ఓటమిని చవిచూసింది. ఇప్పటికే జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో దారుణ పరాజయం మూటగట్టుకున్న బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌ను కూడా ఓటమితోనే ప్రారంభించింది. సోమవారం హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్‌పై 25 పరుగుల తేడాతో జింబాబ్వే సంచలన విజయాన్ని సాధించింది. 142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 33.1 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో నురుల్ హసన్ (31), తౌహిద్ హృదోయ్ (25), మెహదీ హసన్ (10) మినహా మిగతావారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ రిచర్డ్ నగరవా, బ్రాడ్ ఎవన్స్ చెరో మూడు వికెట్లు తీయగా, బ్లెసింగ్ ముజరబానీ, న్యూమన్ నైమూరి రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 36.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. న్యూమన్ నైమూరి (33) టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ రిచర్డ్ నగరవా (27), ఇన్నోసెంట్ కైయా (26) పర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నహీద్ రానా 6 వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కెప్టెన్ నగరవా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జింబాబ్వే 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే జూలై 9న జరగనుంది.Read: సంజూపై వేటు.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్ -
జింబాబ్వే 141 ఆలౌట్.. బంగ్లా బౌలర్ అరుదైన రికార్డు
జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్ బౌలర్ నహీద్ రానా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో నహీద్ రానా కెరీర్ బెస్ట్ బౌలింగ్ (10-2-21-6) ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆరు వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించిన నహీద్ రానా ఐదు వికెట్ల ప్రదర్శనతో అరుదైన రికార్డు అందుకున్నాడు. రైట్ ఆర్మ్ పేసర్ అయిన నహీద్ రానా 14 వన్డే మ్యాచ్‌ల్లోనే మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తరఫున వన్డే క్రికెట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన మూడో బౌలర్‌గా నహీద్ రానా నిలిచాడు. ఈ జాబితాలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 6 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన (124 మ్యాచ్‌లు) తొలి స్థానంలో ఉండగా, అబ్దుల్ రజాక్ నాలుగు సార్లు (153 మ్యాచ్‌లు), ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ నాలుగు సార్లు (247 మ్యాచ్‌లు) సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. నహీద్ రానా మూడో స్థానంలో ఉండగా, తస్కిన్ అహ్మద్ రెండు సార్లు (92 మ్యాచ్‌లు) ఐదు వికెట్ల హాల్ నమోదు చేసి తర్వాతి స్థానంలో ఉన్నాడు. 2024లో బంగ్లాదేశ్ తరఫున అరంగేట్రం చేసిన నహీద్ రానా అనతి కాలంలోనే స్టార్ బౌలర్‌గా ఎదిగాడు. 14 వన్డేల్లో 30 వికెట్లు పడగొడితే, అందులో ఈ ఏడాదిలోనే 25 వికెట్లు ఉండడం గమనార్హం. తొలుత పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన నహీద్ రానా, ఆ తర్వాత ఆస్ట్రేలియాపై, తాజాగా జింబాబ్వేపై ఐదు వికెట్ల ఫీట్‌తో మెరిశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 36.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. న్యూమన్ నైమూరి (33) టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ రిచర్డ్ నగరవా (27), ఇన్నోసెంట్ కైయా (26) పర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నహీద్ రానా 6 వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. 142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కూడా బ్యాటింగ్‌లో తడబడుతోంది. 5 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 19 పరుగులు చేసి కష్టాల్లో పడింది. బ్లెసింగ్ ముజరబానీ 2 వికెట్లు తీయగా, నగరవా ఒక వికెట్ పడగొట్టాడు. -
ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ శర్మ
ఇంగ్లండ్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ మరో 8 రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి వన్డే ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూలై 14న జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌కు చేరుకున్న రోహిత్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు. వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరగబోయే ఈ సిరీస్‌లో సత్తాచాటాలని హిట్‌మ్యాన్ ఉవ్విళ్లూరుతున్నాడు. చివరగా అఫ్గానిస్తాన్‌తో వన్డేల్లో కూడా ఈ ముంబైకర్ రాణించాడు. ఇప్పుడు అదే ఫామ్‌ను ఇంగ్లీష్ గడ్డపై కొనసాగించేందుకు రోహిత్ సన్నదమవుతున్నాడు. మరోవైపు అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో ఇంగ్లండ్‌తో వన్డేల్లో కోహ్లి ఆడనున్నాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న విరాట్ త్వరలోనే భారత జట్టుతో కలిసే అవకాశముంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సైతం జట్టుతో చేరనున్నాడు. అతడు కూడా తన బౌలింగ్ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు. అయితే ఇంగ్లండ్ టూర్‌కు స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా దూరమయ్యారు. నితీశ్ స్ధానంలో సూర్యన్ష్ షెడ్గేని జట్టులోకి తీసుకున్నారు.ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, సూర్యన్ష్ షెడ్గే , కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.చదవండి: శ్రీలంక గడ్డపై ద్రవిడ్ కుమారుడి విశ్వరూపం! -
భారత్‌తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! స్టార్లు వచ్చేశారు
టీమిండియాతో స్వదేశంలో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. జోస్ బట్లర్, సామ్ కరన్, జో రూట్, ఆదిల్ రషీద్ వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.అంతేకాకుండా దాదాపు ఎనిమిదిల నెలల తర్వాత స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ ఇంగ్లండ్ వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌కు ఆర్చర్ దూరమయ్యాడు. ఇప్పుడు అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో వన్డేలకు కూడా అతడిని ఎంపిక చేశారు. ఆర్చర్‌తో పాటు శ్రీలంక టూర్‌కు దూరమైన ఫాస్ట్ బౌలర్లు గుస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్‌లు కూడా తిరిగి జట్టులోకి వచ్చారు. అలాగే ఈ జట్టులో 22 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్కు చోటు దక్కింది. లిస్ట్-ఎ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుండడంతో సీనియర్ జట్టుకు అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ ససెక్స్ యువ ఆటగాడు టీ20 జట్టులో కూడా సభ్యునిగా ఉన్నాడు. ఈ మూడు వన్డేల సిరీస్ జూలై 14 నుండి జూలై 19 వరకు జరగనుంది. భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.వన్డే సిరీస్ షెడ్యూల్ వివరాలు:మొదటి వన్డే: జూలై 14 – ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్)రెండవ వన్డే: జూలై 16 – సోఫియా గార్డెన్స్ (కార్డిఫ్)మూడవ వన్డే: జూలై 19 – లార్డ్స్ (లండన్)ఇంగ్లండ్ వన్డే జట్టు:హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, జో రూట్, జోష్ టంగ్. -
ప్రాక్టీస్ మొదలు పెట్టిన కోహ్లి.. ఇంగ్లాండ్ కు వణుకుపుట్టేలా చేస్తున్న వీడియో
-
తిలక్ వర్మపై విమర్శలు.. అశ్విన్ ఏమన్నాడంటే?!
టీమిండియా స్టార్ తిలక్ వర్మకు భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు. శ్రీలంక- ‘ఎ’, అఫ్గానిస్తాన్- ‘ఎ’ జట్లతో ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఈ హైదరాబాదీ స్టార్ అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. అయినప్పటికీ కొంతమంది తిలక్ వర్మను విమర్శించడం తనను ఆశ్చర్యపరిచిందన్నాడు.భారత్‌దే టైటిల్‌కాగా తిలక్ వర్మ సారథ్యంలో భారత్- ‘ఎ’ జట్టు ఇటీవల శ్రీలంకలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ అనధికారిక వన్డే సిరీస్‌లో అఫ్గాన్, శ్రీలంకపై పైచేయి సాధించిన భారత జట్టు.. ఫైనల్లోనూ లంకను చిత్తు చేసి టైటిల్ గెలుచుకుంది.ఈ సిరీస్‌లో తిలక్ వర్మ నాలుగు అర్ధ శతకాల సాయంతో 275 పరుగులు సాధించాడు. తద్వారా భారత్- ‘ఎ’ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి స్ట్రైక్‌రేటు 74.93. ఇక శ్రీలంకతో ఫైనల్లో భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 324కు పైగా స్ట్రైక్‌రేటుతో (29 బంతుల్లో 94) విధ్వంసం సృష్టించగా.. నాలుగో స్థానంలో ఆడిన తిలక్ వర్మ కాస్త నెమ్మదిగానే ఆడాడు.వైభవ్ అలా.. తిలక్ ఇలాఈ మ్యాచ్‌లో తిలక్ 74 స్ట్రైక్‌రేటుతో (90 బంతుల్లో) 67 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వైభవ్‌ను ప్రశంసిస్తూ.. తిలక్ ఆట తీరుపై కొద్దిమంది సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. ఈ విషయంపై అశ్విన్ తాజాగా స్పందించాడు. ‘‘కొంతమంది కామెంట్ల రూపంలో తిలక్ వర్మ స్ట్రైక్‌రేటును విమర్శించడం నా కంటపడింది.అవును నిజమే.. అయితే ఏంటి?నిజమే అతడు కాస్త నెమ్మదిగానే ఆడాడు. అయినా సరే ఇంత ద్వేషం ఎందుకో అర్థం కావడం లేదు. వైభవ్ సూర్యవంశీ వేగంగా ఆడుతూ ఉంటే.. మరో ఎండ్‌లో తిలక్ వర్మ అతడిని కాంప్లిమెంట్ చేస్తూ.. అతడు భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు’’ అని అశ్విన్.. తిలక్ వర్మకు మద్దతుగా నిలిచాడు.చదవండి: టీమిండియాలోకి డేంజరస్ ప్లేయర్! -
నోళ్లు మూయండి.. రెచ్చగొడితే ఇలాగే చితక్కొడతా!
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్- ‘ఎ’ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఫైనల్ అవకాశాలు సన్నగిల్లిన వేళ అఫ్గానిస్తాన్- ‘ఎ’ను చిత్తుగా ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక ‘ఎ’ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది.ఇందుకు ప్రధాన కారణం ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్. దంబుల్లాలో ఆదివారం కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 29 బంతుల్లోనే 94 పరుగులు సాధించాడు. దురదృష్టవశాత్తూ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.అయితే, జట్టును గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకోవడంతో పాటు.. గత మ్యాచ్‌లో తనను కవ్వించిన శ్రీలంక ఆటగాళ్లపై ప్రతీకారం తీర్చుకున్నాడు వైభవ్. ఈ నేపథ్యంలో పదిహేనేళ్ల ఈ పిల్లాడిపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు.తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. వైభవ్ విషయంలో ఎవరైనా జోక్ చేయాలనుకుంటే వారికి అతడు బ్యాట్‌తోనే సమాధానం ఇస్తూ ఉంటాడు.శ్రీలంక ప్లేయర్లు గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో వైభవ్ పరుగులు చేయకపోవడంపై జోకులు వేశారు. భారీగా సంబరాలు చేసుకున్నారు. వారికి కూడా వైభవ్ గట్టిగానే సమాధానం ఇచ్చాడు.‘యువ ఆటగాళ్లు.. ముఖ్యంగా పదిహేనేళ్ల పిల్లాడితో పెట్టుకుంటే.. ఏం జరిగిందో చూశారు కదా!.. కాబట్టి ఇకపై నోరు మూసుకుని ఉంటే మంచిది’ అనే సందేశాన్ని ఇచ్చాడు. వైభవ్ ఇన్నింగ్స్ వల్లే ఇండియా మ్యాచ్ గెలిచింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో వైభవ్ దంచికొట్టకుంటే ఇండియా కచ్చితంగా ఓడిపోయేదే.నిజంగా అతడు దేవుడి బిడ్డ. వైభవ్‌తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో శ్రీలంక ప్లేయర్లకు బాగా తెలిసి వచ్చింది. నిజానికి ఆరోజు వైభవ్‌ను రెచ్చగొట్టకపోయి ఉంటే బహుశా వాళ్లకు ఫైనల్లో గెలుపు అవకాశాలు ఉండేవేమో!ఇది ఐపీఎల్ కాదు! అంటూ అతడిని ఏడిపిస్తారా? బదులుగా అతడు మీ బౌలింగ్ విభాగాన్ని చితక్కొట్టాడు’’ అంటూ చిక్కా వైభవ్ సూర్యవంశీని ఆకాశానికెత్తాడు. కాగా శ్రీలంకతో ఫైనల్లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో శ్రీలం 311 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 66 పరుగుల తేడాతో గెలుపొందిన తిలక్ వర్మ సేన.. సిరీస్‌ను సొంతం చేసుకుంది. -
ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచరీ వీరుడికి నో చాన్స్!
అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోష్ మీదున్న టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై టీ20లతో పాటు మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఇంగ్లండ్ టూర్‌కు ముందు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ విషయం పక్కనబెడితే, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లి ఆడుతాడా లేదా అనే సందేహం ఉండేది. అయితే ఇటీవలే గాయం నుంచి కోలుకున్న కోహ్లి ఫిట్నెస్ టెస్టులో పాసయ్యాడని తెలిపిన బీసీసీఐ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో ఆడబోయే టీమిండియా స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ తుదిజట్టులో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకోలేకపోయాడు. ఆఫ్గన్‌తో జరిగిన రెండో వన్డేలో ఇషాన్ శతకం బాదిన సంగతి తెలిసిందే. అంతకముందు ఐపీఎల్‌లోనూ ఇషాన్ ఎస్ఆర్హెచ్ తరఫున తన బ్యాటింగ్‌తో అలరించిన సంగతి తెలిసిందే.ఇక జట్టు విషయానికొస్తే.. టాపార్డర్‌లో ఓపెనర్లుగా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ శర్మ, వన్‌డౌన్‌లో కోహ్లి రానున్నారు. ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌లో కెప్టెన్ గిల్ అదరగొట్టాడు. మూడు వన్డేలు కలిపి 238 పరుగులు చేసిన గిల్ ఖాతాలో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. మరో బ్యాటర్ రోహిత్ శర్మ తొలి రెండు వన్డేల్లో పెద్దగా రాణించనప్పటికీ మూడో వన్డేలో తనదైన ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఆఫ్గన్‌తో సిరీస్‌లో 143 పరుగులు సాధించాడు. ఇక కోహ్లి గాయం కారణంగా ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక మిడిలార్డర్లో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌తో పాటు ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్‌లను ఎంపిక చేశారు. ఇక వన్డేల్లో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన అయ్యర్ తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు రానుండగా, కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. నితీశ్‌కుమార్ రెడ్డి ప్రస్తుతానికి జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, గాయంతో అతడు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడడం అనుమానంగానే ఉంది. ఆల్‌రౌండర్ కోటాలో అక్షర్‌పటేల్ ఏడో స్థానంలో ఆడడం గ్యారంటీ, బౌలింగ్ కోటాలో బుమ్రా, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ క్రిష్ణలకు చోటు కల్పించింది. ఇంగ్లండ్ వన్డేలకు భారత ప్లేయింగ్ ఎలెవన్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, నితీశ్‌కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వన్డే షెడ్యూల్1వ వన్డే జూలై 14, 2026 (మంగళవారం) ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ మధ్యాహ్నం 3:302వ వన్డే జూలై 16, 2026 (గురువారం) సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ సాయంత్రం 5:303వ వన్డే జూలై 19, 2026 (ఆదివారం) లార్డ్స్, లండన్ మధ్యాహ్నం 3:30Read: నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్ టూర్‌కు దూరం! -
ఆ విషయం చాలా మందికి తెలియదు: వైభవ్
భారత నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి సత్తా చాటాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో వైఫల్యాలకు చెక్ పెడుతూ.. శ్రీలంక -‘ఎ’తో ఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఉపమానాలే ఈర్ష్య పడేలా... అలంకారాలే అసూయపడేలా... బిరుదులే చిన్నబోయేలా... 15 ఏళ్ల ఈ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఆదివారం దంబుల్లాలో విధ్వంస రచన చేశాడు.లంక బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపాడు. మెరుపుల్లాంటి ఫోర్లు, పిడుగుల్లాంటి సిక్స్‌లతో లంక తీరంలో పరుగుల తుఫాన్ సృష్టించాడు. బౌలర్ చేతి నుంచి బంతి వచ్చిందే తడువు దాన్ని స్టాండ్స్‌లోకి పంపడమే తన కర్తవ్యం అన్నట్లు విరుచుకుపడ్డాడు.కేవలం 11 బంతుల్లోనేకేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకొని లిస్ట్ ‘ఎ’క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పిన వైభవ్... ఒక్క షాట్ దూరంలో రికార్డు సెంచరీని కోల్పోయాడు. వైభవ్ (Vaibhav Suryavanshi) తో పోటు మిగిలినవాళ్లు కూడా రాణించడంతో ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లో శ్రీలంక ‘ఎ’ జట్టును ఓడించి భారత ‘ఎ’ జట్టు విజేతగా నిలిచింది.నిజానికి శ్రీలంకతో గత మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్లో పరాజయం పాలైన వేళ.. వైభవ్‌ను లంక ప్లేయర్ విశేన్ రెచ్చగొట్టాడు. అందుకు ఫలితంగా ఫైనల్లో ఆ జట్టు మొత్తాన్ని తన ఆట తీరుతో శిక్షించాడు వైభవ్. మొత్తంగా 29 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాది ఏకంగా 324కు పైగా స్ట్రైక్‌రేటుతో 94 పరుగులు సాధించాడు.ఈ నేపథ్యంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న వైభవ్ సూర్యవంశీ.. తన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా తాను బయటి విషయాలేమీ పట్టించుకోనని.. వన్డేల్లోనూ ఆడగల సత్తా తనకు ఉందని పేర్కొన్నాడు.పరుగులు చేయలేదని తెలుసు‘‘ఓపెనర్‌గా మొదటి పది ఓవర్లలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలనేది నా ఆలోచన. ఈరోజు ఆ ప్రణాళికను పక్కాగా అమలు చేశాను. సిరీస్ మొదట్లో ఆశించినంతగా పరుగులు చేయలేదని తెలుసు. అప్పుడు కోచ్‌లతో చర్చించాను.లోపాలు సరిదిద్దుకుని.. గట్టిగానే ప్రాక్టీస్ చేశాను. అందుకు తగ్గ ఫలితం ఫైనల్లో వచ్చింది. ఈ సిరీస్ నుంచి చాలానే నేర్చుకున్నాను. అయితే, చాలా మందికి నేను 50 ఓవర్ల మ్యాచ్‌లు ఆడినట్లు తెలియదు. ఏదేమైనా విభిన్నమైన పిచ్‌ల మీద ఆడటం కాస్త సరదాగా.. మరికాస్త సవాలుగా అనిపించింది. ఈ సిరీస్ నాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది’’ అని వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్‌లో భారత్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్లు పాల్గొనగా భారత్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి టైటిల్ గెలిచింది. ఇక ఈ సిరీస్‌లో వైభవ్ చేసిన పరుగులు వరుసగా.. 14, 44, 21, 38, 94.చదవండి: నల్గొండను చిత్తు చేసిన రంగారెడ్డి -
జయహో...భారత్.. శ్రీలంకపై ఘన విజయం
-
బుమ్రా పునరాగమనం
న్యూఢిల్లీ: పనిభారం నేపథ్యంలో గత కొంతకాలంగా వన్డే క్రికెట్‌కు దూరంగా ఉంటున్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఈ ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని అతడిని... వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో తిరిగి జట్టుకు ఎంపిక చేశారు. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా గాయపడి అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో లేకపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని కూడా ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే దానికి ముందు అతడు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముంది. వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో టీమిండియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. దాని కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం శుబ్‌మన్ గిల్ సారథ్యంలో... 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అఫ్గాన్‌తో చివరి వన్డేలో సెంచరీతో చెలరేగినప్పటికీ యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కలేదు. గాయం నేపథ్యంలో హార్దిక్ పాండ్యా పేరును పరిశీలించలేదు. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు జూలై 14న తొలి వన్డే (ఎడ్జ్‌బాస్టన్), 16న రెండో వన్డే (సోఫీ గార్డెన్స్), 19న మూడో వన్డే (లార్డ్స్) ఆడనుంది. భారత వన్డే జట్టు: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, ఇషాన్ కిషన్, సుందర్, అక్షర్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్, బుమ్రా, ప్రసిధ్, హర్షిత్ రాణా, అర్‡్షదీప్, గుర్నూర్ బ్రార్. -
భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
చెపాక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలోనూ అఫ్గానిస్తాన్ తమ మార్క్ చూపించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ 5 వికెట్లతో పర్యాటక జట్టు పతనాన్ని శాసించాడు.అయితే 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన అఫ్గాన్‌ను కెప్టెన్ హాష్మతుల్లా షాహిది(102) సెంచరీతో ఆదుకున్నాడు. అతడితో పాటు ఓమర్జాయ్(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.అఫ్గాన్‌కు షాక్!అయితే సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంతి పడక ముందే భారత్ స్కోర్ బోర్డులో 5 పరుగులు చూసి అందరూ షాక్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గాన్ కెప్టెన్ చేసిన చిన్న పొరపాట్ల వల్ల భారత జట్టుకు 5 పెనాల్టీ పరుగులు లభించాయి. షాహిది పిచ్ మధ్య (డేంజర్ లైన్)లో పదే పదే నడిచినందుకు జరిమానా విధించారు.మ్యాచ్ 31వ ఓవర్ సమయంలో షాహిదీ పిచ్ మధ్యలో నడుస్తుండటాన్ని గమనించిన అంపైర్లు, అతనికి మొదటి అధికారిక హెచ్చరిక ఇచ్చారు. అయినప్పటికీ, 40వ ఓవర్ చివరి బంతికి షాహిదీ మళ్లీ అదే తప్పు చేస్తూ డేంజర్ జోన్లోకి దూసుకెళ్లాడు.దీంతో ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గాఫానీ, రోహన్ పండిట్లు ఐదు పరుగులు పెనాల్టీ విధిస్తూ అఫ్గాన్‌కు షాకిచ్చారు. నిబంధనలో పిచ్ మధ్యలో నవడవడం గానీ పరిగెత్తడం గానీ చేయకూడదు. బూట్ల స్పైక్స్ వల్ల పిచ్ దెబ్బతిని, అక్కడ గుంతలు పడే ప్రమాదం ఉంది.తొలి ఓవర్లో 23 రన్స్కాగా కాగా భారత ఇన్నింగ్స్‌లో మొదట ఓవర్ వేసిన అఫ్గాన్ పేసర్ అజ్మతుల్లా ఓమర్జాయ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలి బంతిని డాట్‌గా సంధించిన ఓమర్జాయ్.. ఆ తర్వాత వైడ్లు, నోబాల్స్‌తో విసుగు తెప్పించాడు. అంతకుతోడు భారత ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మూడు ఫోర్లు బాదాడు.దీంతో టీమిండియా పెనాల్టీ రూపంలో లభించిన ఐదు పరుగులతో కలిపి తొలి ఓవర్లో మొత్తం 23 పరుగులు చేసింది. అయితే తొలి ఓవర్లో ఇన్ని పరుగులు రావడం 52 ఏళ్ల భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. అంతకుముందు 2004లో కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌పై మొదటి ఓవర్లో 22 పరుగులు భారత్ సాధించింది. తాజా మ్యాచ్‌తో గత రికార్డును టీమిండియా అధిగమించింది.చదవండి: IPL 2026: 'అలాగైతే ఢిల్లీని వీడు.. వేలంలోకి వెళ్ళిపో' -
వైభవ్‌కు ఉన్న సంస్కారం మా వాళ్లకెక్కడిది?: శ్రీలంక దిగ్గజం
భారత నయా సంచలనం వైభవ్ సూర్యవంశీకి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పద్నాలుగేళ్లకే ఐపీఎల్లో సంచలనాలు సృష్టించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. భారత అండర్-19 జట్టు తరఫునా దుమ్ములేపాడు.ఇక ఈ ఏడాది ఐపీఎల్ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. 16 మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించాడు. తద్వారా 2026 సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. పదిహేనేళ్లకే ఆరెంజ్‌క్యాప్ అందుకుని చరిత్ర సృష్టించాడు.శ్రీలంక పర్యటనలోఈ క్రమంలో తొలిసారి భారత్- ‘ఎ’ జట్టు, టీమిండియాకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో బిజీగా ఉన్నాడు. శ్రీలంక, భారత్, అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌లో వైభవ్ పెద్దగా ఆకట్టుకోలేదు. నాలుగు లీగ్ మ్యాచ్‌లలో వరుసగా 14, 44, 21, 38 పరుగులే చేశాడు.ఇదిలా ఉంటే.. వైభవ్‌ను చూసేందుకు శ్రీలంక ప్రేక్షకులు ఎగబడ్డారు. ఎయిర్‌పోర్టులో అతడి కోసం వేచి ఉండి మరీ ఫొటోలు దిగారు. హోటల్లోనూ ఫొటోల కోసం అభిమానులు రాగా.. వైభవ్ కొన్నిసార్లు సున్నితంగా తిరస్కరించాడు.గంటసేపు ఎదురుచూసి మరీఅయితే, అందరింకంటే ప్రత్యేకమైన అభిమాని ఒకరు వైభవ్ కోసం దాదాపు గంటసేపు ఎదురుచూసి మరీ అతడిని కలిశారు. ఆయన మరెవరో కాదు.. శ్రీలంక జాతీయ జట్టుకు మొట్టమొదటి వన్డే కెప్టెన్‌గా పనిచేసిన అనురా తెనాకూన్.Former great of Sri Lanka and one of the finest batters of the country and the captain of the 1st ever World cup in 1975, Anura Tennekoon met a potential future great Vaibhav Sooryavanshi during the Triangular A team series in Dambulla. pic.twitter.com/xYOWMcO6AM— Roshan Abeysinghe (@RoshanCricket) June 16, 2026ఇరుజట్ల ఆటగాళ్లదీ తప్పేశ్రీలంక- భారత్ ‘ఎ’ జట్ల మధ్య సోమవారం నాటి అనధికారిక వన్డే సందర్భంగా అనురా వైభవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ మధ్య జరిగిన సంభాషణను తాజాగా వెల్లడించారు. ‘‘ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన చూసి నేను ముగ్ధుడినయ్యాను.అతడి బ్యాటింగ్ చూసేందుకే దంబుల్లా స్టేడియానికి వెళ్లాను. కానీ దురదృష్టవశాత్తూ అతడి బ్యాట్ నుంచి మెరుపులు చూడలేకపోయాను. మా ఆటగాళ్లు అతడిని చుట్టుముట్టి రెచ్చగొట్టారు. అతడింకా పిల్లాడే.అప్పటికే మ్యాచ్ ఓడిన కోపంలో ఉన్నాడు. మా వాళ్లు కవ్వించడంతో తానూ రెచ్చిపోయాడు. భావోద్వేగాలు నియంత్రించుకోలేకపోయాడు. దురదృష్టవశాత్తూ ఆ ఘటన జరిగిపోయింది. ఇరుజట్ల ఆటగాళ్లదీ తప్పే.మా శ్రీలంక ఆటగాళ్లు ఎప్పుడూ కూడాఆరోజు నన్ను కలిసినపుడు వైభవ్ నా దగ్గరికొచ్చి.. ‘సర్. మీ ఆశీసులు కావాలి. మిమ్మల్ని కలవడం నా అదృష్టం’ అంటూ నా పాదాలకు నమస్కరించాడు. మా శ్రీలంక ఆటగాళ్లు ఎప్పుడూ కూడా ఇలా నా పాదాలు తాకి ఆశీసులు తీసుకున్న దాఖలాలే లేవు. వైభవ్‌ను ఆరోజు రెచ్చగొట్టినందు వల్లే అలా ప్రవర్తించాడు’’ అని అనురా తెనాకూన్ పేర్కొన్నారు.కాగా శ్రీలంకతో సోమవారం నాటి మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్లో భారత్ ఓడిపోయింది. ఈ క్రమంలో లంక ప్లేయర్ విశేన్.. వైభవ్‌ను ఉద్దేశించి ‘ఇంటికి వెళ్లిపో’ అంటూ రెచ్చగొట్టగా.. అతడూ తిరిగి బదులిచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ శిక్ష పడింది. ఇక ఈ ఘటన గురించి తాజాగా అనురా తెనాకూన్ వద్ద ప్రస్తావించగా.. పైవిధంగా స్పందించారు.చదవండి: వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026 -
IND vs AFG: కేఎల్ రాహుల్‌ను పక్కనపెట్టారా?
అఫ్గానిస్తాన్‌తో మూడో వన్డేలో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. తొలి మ్యాచ్ సందర్భంగా ధర్మశాలలో అరంగేట్రం చేసిన స్పిన్నర్ హర్ష్ దూబే.. రెండో వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడాడు.రాహుల్ లేడుఅయితే, తాజాగా శనివారం నాటి మూడో మ్యాచ్‌లో కుల్దీప్ స్థానాన్ని హర్ష్ తిరిగి భర్తీ చేశాడు. ఇక మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు బదులు.. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తుదిజట్టులోకి వచ్చాడు. తొడ కండరాల నొప్పి నుంచి కోలుకున్న అతడి కోసం రాహుల్ తప్పుకోవాల్సి వచ్చింది.అదే విధంగా.. పేస్ దళంలో కీలకమైన అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో ప్రసిద్ కృష్ణకు చోటు దక్కింది. అయితే, ఈ మూడు మార్పులు చేయడానికి గల కారణం ఏమిటనే ప్రశ్నలకు.. మ్యాచ్‌కు ముందే టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే పరోక్షంగా సమాధానమిచ్చాడు.బ్యాటర్లలో కూడా ఒకరికి రెస్ట్డష్కాటే శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేము మ్యాచ్ మ్యాచ్‌కూ తుదిజట్టులో మార్పులు చేస్తున్నాం. ఈసారి అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతినిస్తున్నాం. బ్యాటర్లలో కూడా ఒకరికి రెస్ట్ ఇస్తాం’’ అని పేర్కొన్నాడు. కాగా గత మ్యాచ్‌లో డకౌట్ అయిన కేఎల్ రాహుల్‌ను మూడో వన్డేలో పక్కనపెట్టడం గమనార్హం.మరోవైపు.. గత మ్యాచ్‌లో పది ఓవర్ల కోటాలో 42 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన కుల్దీప్ యాదవ్ కూడా మూడో వన్డే తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, రాహుల్, కుల్దీప్లపై వేటు వేయడం గాకుండా.. అర్ష్‌దీప్‌తో కలిసి వీరిద్దరికీ విశ్రాంతినిచ్చినట్లు డష్కాటే వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.2-0తో సిరీస్ కైవసంఇక ఇప్పటికే ఈ మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫలితంగా నామమాత్రపు మూడో వన్డే నుంచి ఈ ముగ్గురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. పనిభారాన్ని తగ్గించే క్రమంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గా చెన్నై వేదికగా మూడో వన్డేలో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.చదవండి: వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఏమన్నాడంటే.. -
ఇంగ్లండ్ సిరీస్‌కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) శిబిరంలో ఉన్న పాండ్యా అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్‌కు ఇంకా సమయం ఉండడంతో అప్పటివరకు పాండ్యా కోలుకుంటాడని వార్తలు వచ్చినప్పటికీ, బీసీసీఐ మెడికల్ బృందం మాత్రం పాండ్యా ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధంగా లేడని తెలిపింది. ఎందుకంటే రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న పాండ్యా ఫిట్నెస్ టెస్టులో విఫలమయ్యాడని, అతడు కోలుకునేందుకు మరో నెల రోజులు పట్టే అవకాశముందని సమాచారం. అయితే ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా జూలై 14 నుంచి 19 మధ్య మూడు వన్డేలు ఆడనుంది. ఈ లెక్కన హార్దిక్ టీమిండియాతో జాయిన్ కావడం కష్టమే. ఇక గాయంతో బాధపడుతున్న కోహ్లీ కూడా ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడుతాడా లేదా అనేది జూన్ 22న (సోమవారం) తేలనుంది. ఆరోజు కోహ్లికి ఫిట్నెస్ టెస్టు జరగనుంది.అయితే అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ టూర్లకు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వన్డే వరల్డ్‌కప్ రోడ్‌మ్యాప్ ప్రక్రియలో భాగంగా పాండ్యా కీలకం కానున్నాడని అజిత్ అగార్కర్ వెల్లడించాడు. కానీ ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో వెన్ను గాయంతో బాధపడ్డ పాండ్యా సీవోఈకి చేరుకున్నాడు. వెన్ను నొప్పి నుంచి తేరుకునే లోపే తొడ కండరాల గాయం కావడంతో ఆఫ్గన్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ఒక్కరోజు ముందే పాండ్యా ఆడడం లేదని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.2027 వన్డే వరల్డ్‌కప్ ఆడేనా?వరుస గాయాలతో సతమతమవుతున్న పాండ్యా వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఆడుతాడా లేదా అన్నది మిస్టరీగా మారింది. టీమిండియా కూడా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం మళ్లీ సెప్టెంబర్‌లో వెస్టిండీస్ టూర్లో వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అప్పటికి కోలుకొని పాండ్యా జట్టులోకి వస్తే మంచిదే, కానీ మళ్లీ ఏదైనా గాయం బారిన పడితే మాత్రం వన్డే ప్రపంచకప్‌కు పాండ్యా అందుబాటులో ఉండేది అనుమానమే.Read: నోరు మూసుకున్నందుకు రెడ్‌కార్డ్.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి! -
IND vs AFG: శతక్కొట్టిన జైసూ.. సిరీస్ క్లీన్‌స్వీప్
చెన్నై వేదికగా అఫ్గానిస్తాన్‌తో మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి విధించిన 219 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 28.4 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.భారత ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ శతకం (86 బంతుల్లో 110 నాటౌట్)తో చెలరేగగా.. రోహిత్ శర్మ 79 పరుగులు సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 19 బంతుల్లో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అంతకుముందు ధర్మశాలలో ఏడు వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను ఓడించిన గిల్ సేన.. లక్నో మ్యాచ్‌లో 170 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది.Updates: చెన్నై వేదికగా టాస్ గెలిచిన అఫ్గాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి 44.2 ఓవర్లలో కేవలం 218 చేసి ఆలౌట్ అయింది. ఇక టీమిండియా 219 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది. హష్మతుల్లా పిచ్ ఏరియాలో పరిగెత్తిన కారణంగా అఫ్గాన్‌కు ఐదు పరుగుల పెనాల్టీ పడగా.. టీమిండియా.. 5/0తో తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.25 ఓవర్లలో టీమిండియా స్కోరు: 1771-1జైసూ 81, అయ్యర్ 4 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్22.5: నబీ బౌలింగ్‌లో సెదీకుల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రోహిత్ శర్మ (69 బంతుల్లో 79). శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 171-1. జైసూ 78 పరుగులతో ఉన్నాడు.21 ఓవర్లలో టీమిండియా స్కోరు: 153-0రోహిత్ శర్మ 65, యశస్వి జైస్వాల్ 75 పరుగులతో ఉన్నారు.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ15.2: రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఫోర్ బాది.. అర్ధ శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ. 47 బంతుల్లో హాఫ్ సెంచరీ. స్కోరు: 123-0(15.3). జైసూ 58 పరుగులతో ఉన్నాడు.జైస్వాల్ అర్ద శతకం11.3: రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జైస్వాల్పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 86-0యశస్వి జైస్వాల్ 46, రోహిత్ 27 పరుగులతో ఉన్నారు.తొలి ఓవర్లోనే 23 పరుగులు5/0తో లక్ష్య ఛేదన మొదలుపెట్టిన టీమిండియా.. తొలి ఓవర్లో మొత్తంగా 23 పరుగులు ఖాతాలో వేసుకుంది. జైస్వాల్ 14 పరుగులు చేయగా.. మిగతావి ఎక్స్ట్రా రూపంలో వచ్చాయి. చెలరేగిన ప్రసిద్.. అఫ్గాన్ ఆలౌట్భారత పేసర్ ప్రసిద్ కృష్ణ అఫ్గాన్ టాపార్డర్‌ను కుదేలు చేశాడు. అతడి దెబ్బకు రహ్మానుల్లా గుర్బాజ్ (5), రహ్మత్ షా (5), ఇబ్రహీం జద్రాన్ (11) పెవిలియన్‌కు వరుస కట్టారు. ఇలాంటి దశలో హష్మతుల్లా షాహిది కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 131 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 102 పరుగులు చేశాడు. అయితే, ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో ఆఖరి వికెట్‌గా వెనుదిరగడంతో హష్మతుల్లా శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది. మిగతా వారిలో అజ్మతుల్లా అర్ధ శతకం (50) చేయగా.. మహ్మద్ నబీ 21 పరుగులు చేశాడు. ఫలితంగా 44.2 ఓవర్లలో 218 పరుగులు చేసి అఫ్గాన్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ ఐదు వికెట్లతో చెలరేగగా.. గుర్నూర్, ప్రిన్స్, హర్ష్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అఫ్గాన్ కెప్టెన్ సెంచరీఅఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సెంచరీ సాధించాడు. 126 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. స్కోరు: 217-9(44).తొమ్మిదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్41.1: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో హష్మతుల్లా సింగిల్‌కు వెళ్లగా ఫరీద్ రనౌట్ (0). స్కోరు: 206-9(41.2).ఎనిమిదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్40.6: హర్ష్ దూబే బౌలింగ్‌లో.. హష్మతుల్లా షాహిది సింగిల్‌కు వెళ్లగా.. ఘజన్ఫర్ (1) రనౌట్ అయ్యాడు. స్కోరు: 206-8(41). ఫరీద్ మాలిక్ క్రీజులోకి వచ్చాడు.ఏడో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్40.3: హర్ష్ దూబే బౌలింగ్‌లో ప్రిన్స్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రషీద్ ఖాన్ (5). స్కోరు: 206-7(40.3). హష్మతుల్లా 91 పరుగులతో ఆడుతున్నాడు.ఆరో వికెట్ డౌన్37.1: గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో మహ్మద్ నబీ (21) బౌల్డ్. స్కోరు: 200-6(37.2). రషీద్ ఖాన్ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా 89 పరుగులతో ఉన్నాడు.ఐదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్28.2: ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ప్రసిద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన అజ్మతుల్లా (50). అజ్మతుల్లా అర్ధ శతకం27.3: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి అజ్ముతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (55 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. స్కోరు: 140-4(28). హష్ముతుల్లా 54 పరుగులతో ఆడుతున్నాడు. హష్మతుల్లా హాఫ్ సెంచరీ15.5: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న హష్మతుల్లా షాహిది. 64 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న కెప్టెన్. స్కోరు: 133-4(26). అజ్మతుల్లా 47 పరుగులతో ఆడుతున్నాడు.22 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్: 108/422 ఓవర్లు ముగిసే సరికి అఫ్గానిస్తాన్ నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ హస్మతుల్లా షాహిది(36), అజ్మతుల్లా ఓమర్జాయ్(36) ఉన్నారు.పదిహేను ఓవర్లలో అఫ్గానిస్తాన్ స్కోరు: 69-4(15)హష్మతుల్లా 17, అజ్మతుల్లా 18 పరుగులతో ఆడుతున్నారు.పవర్ ప్లేలో అఫ్గానిస్తాన్ స్కోరు: 37-4 (10)హష్మతుల్లా నాలుగు పరుగులతో ఉండగా.. అజ్మతుల్లా సున్నా పరుగుల వద్ద ఉన్నాడు.నాలుగో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్9.2: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన డార్విష్ రసూలీ (1). అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా షాహిది నాలుగు పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 36-4(9.3)మూడో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్7.2: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఇబ్రహీం జద్రాన్ (11). స్కోరు: 28-3(7.2). డార్విష్ రసూలీ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా ఇంకా పరుగుల ఖాతా తెరవనే లేదు.రెండో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్5.6: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి రహ్మత్ షా (15 బంతుల్లో 5) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. స్కోరు: 26-2. జద్రాన్ 10 పరుగులతో ఉండగా.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది క్రీజులోకి వచ్చాడు. ఐదు ఓవర్లలో అఫ్గాన్ స్కోరు: 22-1(5)రహ్మత్ ఒకటి, జద్రాన్ పది పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్1.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగిన రహ్మానుల్లా గుర్బాజ్ (5). క్రీజులోకి రహ్మత్ షా. స్కోరు: 5-1(1.2). ఇబ్రహీం జద్రాన్ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు.తుదిజట్లలో మార్పులుఈ సందర్భంగా కెప్టెన్ హష్మతుల్లా షాహిది మాట్లాడుతూ.. మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, జియా ఉర్ రహ్మాన్‌లు తిరిగి రాగా.. ఫరీద్ మాలిక్‌కు కూడా తుదిజట్టులో చోటు ఇచ్చినట్లు తెలిపాడు. రాహుల్‌పై వేటు!ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. కుల్దీప్ యాదవ్‌కు బదులు హర్ష్ దూబే రాగా.. అర్ష్‌దీప్ సింగ్, కేఎల్ రాహుల్ స్థానాల్లో ప్రసిద్ కృష్ణ, నితీశ్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకున్నారు.సిరీస్ భారత్ కైవసంకాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలుత ధర్మశాలలో అఫ్గాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. లక్నో మ్యాచ్‌లో 170 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్.అఫ్గానిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. -
వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఏమన్నాడంటే..
శ్రీలంక, భారత్, అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ తుది అంకానికి చేరుకుంది. భారత్- శ్రీలంక టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దంబుల్లా వేదికగా ఆదివారం ఇరుజట్ల మధ్య సిరీస్‌లో ఆఖరి అనధికారిక వన్డే సిరిస్ జరుగనుంది.ఈ నేపథ్యంలో శ్రీలంక- ‘ఎ’ జట్టు కెప్టెన్ సహాన్ అరాచిగే భారత స్టార్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము ఫైనల్లో అతడిని టార్గెట్ చేయబోమని స్పష్టం చేశాడు. కాగా శ్రీలంక- భారత్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు.ఇందులో శ్రీలంక విజయం సాధించగా.. ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలోనే లంక ప్లేయర్ కవ్వింపు చర్యలకు దిగగా.. వైభవ్ సూర్యవంశీ అతడి మీదకు దూసుకువెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. అంపైర్ వచ్చి ఆటగాళ్లను విడదీశాడు.ఈ ఘటన నేపథ్యంలో లంక ప్లేయర్‌తో పాటు వైభవ్కూ మొట్టికాయలు పడ్డాయి. ఇక ఫైనల్లో ఇరుజట్లు మరోసారి తలపడనున్న తరుణంలో వైభవ్ సూర్యవంశీ ఆట తీరు, అతడి ప్రవర్తనపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.ఈ విషయం గురించి శ్రీలంక కెప్టెన్ సహాన్ అరాచిగే వద్ద స్పోర్ట్స్‌స్టార్ ప్రస్తావించగా.. ‘‘మా వాళ్లు ఎవరినీ, ఏ విషయాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోరు. మా ఆటను మేము ఆస్వాదిస్తున్నాము. సూపర్ ఓవర్ లాంటి సందర్భాల్లో ఆటగాళ్లు భావోద్వేగాలకు లోనుకావడం సహజం. ఆటలో ఇలాంటివి సాధారణం’’ అని స్పష్టం చేశాడు.ఇక భారత్‌తో ఫైనల్‌కు తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామన్న అరాచిగే.. ‘‘బ్యాటింగ్ విషయంలో మాకు ఎలాంటి సమస్యా లేదు. మా బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు మెరుగ్గా రాణిస్తున్నారు. మా జట్టు బాగుంది’’ అని పేర్కొన్నాడు. భారత్‌తో పోటీ కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.కాగా లీగ్ దశలో తొలుత శ్రీలంకపై భారత్ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కగా.. రెండో మ్యాచ్‌లో లంక సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఇక ఇరుజట్లు అఫ్గానిస్తాన్‌పై గెలుపుతో ఫైనల్లో అడుగుపెట్టాయి. చదవండి: శ్రీలంక ఫైనల్ చేరిందిలా! -
IND vs AFG: టీమిండియా స్టార్ వచ్చేస్తున్నాడు!
అఫ్గానిస్తాన్‌తో మూడో వన్డేకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త చెప్పింది. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది. అఫ్గాన్‌తో నామమాత్రపు మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది.సిరీస్ కైవసంకాగా టీమిండియా ప్రస్తుతం సొంతగడ్డ మీద అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించిన గిల్ సేన.. లక్నో వేదికగా రెండో వన్డేలో ప్రత్యర్థిని ఏకంగా 170 పరుగుల తేడాతో చిత్తు చేసింది.రెండో వన్డేకు దూరంతద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. ఇక తొలి వన్డే ఆడిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి (Nitish Kumar Reddy).. ఆ మ్యాచ్ సందర్భంగా తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఫలితంగా రెండో వన్డేకు దూరమయ్యాడు. అయితే, తాజాగా నితీశ్ రెడ్డి గాయం గురించి బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది.సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడుఈ విషయం గురించి టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘నితీశ్ రెడ్డి బాగానే ఉన్నాడు. కోలుకున్నాడు. రేపటి మ్యాచ్ ఆడేందుకు అతడు సిద్ధంగానే ఉన్నాడు’’ అని తెలిపాడు. కాగా టీమిండియా ఇప్పటికే సిరీస్ గెలిచింది. కాబట్టి నితీశ్ రెడ్డి విషయంలో మేనేజ్మెంట్ రిస్క్ తీసుకుంటుందా?.. లేదంటే విశ్రాంతినిస్తుందానేది శనివారం తేలనుంది. కాగా భారత్- అఫ్గానిస్తాన్ మధ్య మూడో వన్డేకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక.చదవండి: IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే! -
SL vs AFG: ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరంటే?
ముక్కోణపు సిరీస్‌లో అఫ్గానిస్తాన్- ‘ఎ’ ప్రయాణం ముగిసింది. శ్రీలంక- ‘ఎ’తో శుక్రవారం జరిగిన అనధికారిక వన్డేలో అఫ్గాన్ చిత్తుగా ఓడిపోయింది. శ్రీలంక వేదికగా భారత్, లంక, అఫ్గాన్ జట్ల మధ్య ట్రై సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచిన భారత్.. తర్వాత అఫ్గాన్, శ్రీలంక చేతిలో ఓడిపోయింది. అయితే, లీగ్ దశలో చివరగా అఫ్గనిస్తాన్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఏకంగా 101 పరుగులతో గెలిచి.. ఫైనల్‌కు దూసుకువెళ్లింది.ఈ క్రమంలో దంబుల్లా వేదికగా మరో ఫైనల్ బెర్తు కోసం శ్రీలంక- అఫ్గాన్ తలపడ్డాయి. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో నిరోషన్ డిక్విల్లా అర్ధ శతకం (66)తో ఆకట్టుకోగా.. అవిష్క ఫెర్నాండో సెంచరీ (110)తో దుమ్ములేపాడు. వన్‌డౌన్ బ్యాటర్ నువానిదు ఫెర్నాండో 45 పరుగులతో రాణించగా.. లోయర్ ఆర్డర్లో రవిందు ఫెర్నాండో 25 రన్స్ రాబట్టాడు.ఫలితంగా శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 322 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ దావూద్జాయ్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ఫర్మానుల్లా సఫీ మూడు, మహ్మద్ ఇబ్రహీం ఒక వికెట్ దక్కించుకున్నారు.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టుకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్, కెప్టెన్ ఇమ్రాన్ మిర్, వన్‌డౌన్ బ్యాటర్ నూర్ ఉల్ రహ్మాన్‌ను దులాజ్ సముదిత డకౌట్ చేశాడు. ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ హసన్ ఎసాఖిల్ ఒంటరి పోరాటం (74) చేయగా.. బహీర్ షా 35, ఫర్మానుల్లా సఫీ 43 పరుగులతో రాణించారు. అయితే, మిగతా వారి నుంచి వీరికి పెద్దగా సహకారం లభించలేదు. దీంతో 42.5 ఓవర్లలో కేవలం 219 పరుగుల చేసి అఫ్గాన్ ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో దులాజ్ సముదిత్ ఐదు వికెట్లతో చెలరేగి అఫ్గాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. కుగాతస్ మతూలన్ మూడు, రవిందు ఫెర్నాండో, విజయకాంత్ వియస్కాంత్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో 103 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన శ్రీలంక- ‘ఎ’ జట్టు ఫైనల్‌కు దూసుకుపోయింది. భారత్- ‘ఎ’తో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇరుజట్ల మధ్య ఫైనల్‌కు దంబుల్లా వేదిక. -
IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!
అఫ్గానిస్తాన్‌తో నామమాత్రపు మూడో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శనివారం జరిగే ఈ మ్యాచ్‌కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక. ఇందుకోసం టీమిండియా ఇప్పటికే లక్నో నుంచి చెన్నైకి చేరుకుంది.ఇదిలా ఉంటే.. అఫ్గాన్‌తో మూడో వన్డే కోసం భారత యువ పేసర్ హర్షిత్ రాణా జట్టుతో చేరాడు. గాయం నుంచి కోలుకున్న అతడు మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని యాజమాన్యం ప్రకటించింది.రెండో వన్డేకు మూడు మార్పులుకాగా ధర్మశాల వేదికగా తొలి వన్డేలో అఫ్గాన్‌ను టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా పేసర్ గుర్నూర్ బ్రార్, స్పిన్నర్ హర్ష్ దూబే అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్‌లోనే ఇద్దరూ మూడేసి వికెట్లు కూల్చారు.అయితే, రెండో మ్యాచ్‌కు హర్ష్ దూబే దూరం కాగా.. కుల్దీప్ యాదవ్ ఆడాడు. అదే విధంగా నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ కృష్ణల స్థానంలో యశస్వి జైస్వాల్, ప్రిన్స్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 170 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కన పెట్టి..ఈ నేపథ్యంలో చెన్నై వేదికగా తుదిజట్టులో ఎలాంటి మార్పులు చేస్తారోనన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. అఫ్గాన్‌తో మూడో వన్డేలో అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కన పెట్టి.. నితీశ్ రెడ్డిని ఆడించాలని సూచించాడు.ఈ మేరకు.. ‘‘యశస్వి ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. అతడికి మరో అవకాశం ఇస్తే బాగుంటుంది. నితీశ్ కుమార్ రెడ్డి ఫిట్‌గా ఉంటే.. అతడిని కచ్చితంగా ఆడించాలి. నితీశ్ కోసం అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతినివ్వాలి.ఏదేమైనా విరాట్ కోహ్లి తిరిగి వస్తే.. ఇషాన్ కిషన్‌కు తుదిజట్టులో చోటు ఉండదు. అయితే, రెండో వన్డేలో అతడు శతక్కొట్టాడు. కాబట్టి ఇషాన్‌ను పక్కనపెట్టే వీలులేదు. పేస్ దళంలో గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్‌లను ఆడించాలి’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.అఫ్గానిస్తాన్‌తో మూడో వన్డేకు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టురోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్.చదవండి: భారత క్రికెట్‌కు గుడ్‌బై... వేరే దేశంలో ఆడనున్న తెలుగు క్రికెటర్ -
మీ వల్ల గందరగోళంలో శుబ్‌మన్ గిల్: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరును భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విమర్శించాడు. అఫ్గానిస్తాన్‌తో రెండో వన్డేలో టాపార్డర్‌లో మార్పులు చేయడాన్ని తప్పుబట్టాడు. కాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.తొలుత ధర్మశాలలో అఫ్గాన్‌ను చిత్తు చేసిన భారత జట్టు.. లక్నో వేదికగా బుధవారం రెండో వన్డేలో అఫ్గాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. తద్వారా వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఖాతాలో తొలి సిరీస్ విజయం చేరింది.ఇదిలా ఉంటే.. అఫ్గాన్‌తో రెండో వన్డేలో టీమిండియా తమ ఓపెనింగ్ జోడీని మార్చింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు బదులు.. యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మతో పాటు ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, చాన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జైసూ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు.మరోవైపు.. రోహిత్ 48 పరుగులు చేయగా.. వన్‌డౌన్‌లో వచ్చిన గిల్ భారీ శతకం (154)తో దుమ్ములేపాడు. ఇక గత మ్యాచ్‌లో మూడో స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్.. ఈసారి నాలుగో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగి మెరుపు సెంచరీ (79 బంతుల్లో 125)తో అదరగొట్టాడు. అయితే, ఈ మార్పులతో జట్టు భారీ విజయం సాధించినప్పటికీ మనోజ్ తివారీ మాత్రం నాయకత్వ బృందాన్ని విమర్శించాడు.క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘భవిష్యత్తులో తలనొప్పిగా మారడం తప్ప ఈ ప్రయోగంతో ఎలాంటి ప్రయోజనం లేదు. రోహిత్ శర్మతో యశస్వి జైస్వాల్‌ను ఓపెనింగ్ చేయించి శుబ్‌మన్ గిల్‌ను వన్‌డౌన్‌కి డిమోట్ చేశారు. ఆ స్థానంలో గిల్ భారీగా పరుగులు రాబట్టాడు.ఇప్పుడా విషయం గందరగోళానికి కారణం కావొచ్చు. నేను మళ్లీ ఓపెనర్‌గా వెళ్లాలా? లేదంటే వన్‌డౌన్‌లోనే ఆడాలా అని గిల్ కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు యాజమాన్యం ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. ఇక్కడ స్పష్టత లోపించింది.ఏదేమైనా జైస్వాల్‌ను ఆడించడం మంచి విషయం. ఎందుకంటే అతడు అన్ని ఫార్మాట్లలో ఆడగల సమర్థుడు. అతడికి మళ్లీ అవకాశం రావడం హర్షణీయం. ఇక రోహిత్ శర్మ అఫ్గన్‌తో రెండో వన్డేలో పెద్దగా దూకుడు ప్రదర్శించలేదు. అతడిపై బయటి నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది’’ అని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు. -
డబుల్ సెంచరీ చేసేవాడినే... కానీ
అఫ్గానిస్తాన్‌తో రెండో వన్డేలో టీమిండియా అదరగొట్టింది. లక్నో వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏకంగా 170 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది.ఆత్మవిశ్వాసంతోఈ క్రమంలో టీమిండియా వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill) తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు 154 పరుగులతో బ్యాటర్‌గానూ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘మొదటి బంతి నుంచే నేను ఆత్మవిశ్వాసంతో బాదడం మొదలుపెట్టాను. నా ప్రణాళికలకు తగ్గట్లుగానే ఫలితం రావడం చూశాను.40- 45 ఓవర్ల పాటు ఈ సిరీస్‌లో నాకు నేనే ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. నేనే మ్యాచ్‌లు ఫినిష్ చేయాలని భావించాను. 40- 45 ఓవర్ల పాటు క్రీజులో ఉండాలని టార్గెట్ పెట్టుకున్నాను. శుభారంభం అందుకుంటే దానిని భారీ స్కోరుగా మలచాలని నిర్ణయించుకున్నా.డబుల్ సెంచరీ చేసేవాడినే... కానీఈరోజు డబుల్ సెంచరీ పూర్తి చేయాలనే అనుకున్నా. కానీ జట్టు స్కోరు 430, 440, 450 రేంజ్లో ఉండాలంటే నేను హిట్టింగ్ ఆపకూడదు. నా మనసులో అదొక్కటే ఉండిపోయింది. టాస్ ఓడినంత మాత్రాన పెద్దగా తేడా ఏమీ కనబడలేదు. ఈ పిచ్ మీద 310- 320 మాత్రమే స్కోరు చేసి ఉంటే.. అది ఛేదించదగ్గ టార్గెటే.అయితే, మేము ముందు నుంచే ప్రణాళికతో ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాము. మా బౌలర్లు కూడా తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు’’ అని శుబ్‌మన్ గిల్ తన వ్యక్తిగత ప్రదర్శన పట్ల.. అదే విధంగా జట్టు ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేశాడు.ఆల్‌రౌండ్ ప్రదర్శనతో..ఏకనా స్టేడియంలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గిల్ (154)తో పాటు ఇషాన్ కిషన్ (125) మెరుపు సెంచరీ సాధించడం వల్ల ఈ స్కోరు సాధ్యమైంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో కేవలం 232 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ చెరో మూడు వికెట్లతో సత్తా చాటగా.. ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. చదవండి: వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ షాక్ The in-form #RahmanullahGurbaz is sent packing as #GurnoorBrar delivers the breakthrough.#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/6JvreD78S0— Star Sports (@StarSportsIndia) June 17, 2026 -
అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్- ‘ఎ’ జట్టు తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేసింది. దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్- ‘ఎ’తో బుధవారం నాటి మ్యాచ్‌లో తిలక్ వర్మ సేన 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా నెట్‌రన్‌రేటు భారీగా మెరుగుపరుచుకుని ఫైనల్ చేరుకుంది.వరుసగా రెండు ఓటములుశ్రీలంక వేదికగా ఆతిథ్య జట్టుతో భారత్- ‘ఎ’, అఫ్గాన్ - ‘ఎ’ జట్లు ముక్కోణపు వన్డే సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత శ్రీలంకపై గెలిచిన భారత్.. తదుపరి మ్యాచ్‌లో అఫ్గాన్ చేతిలో ఓడిపోయింది. అనంతరం శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడగా.. సూపర్ ఓవర్లో తిలక్ వర్మ సేనకు భంగపాటే ఎదురైంది.319 పరుగులుఈ క్రమంలో ఫైనల్ రేసులో నిలవాలంటే అఫ్గాన్‌పై బుధవారం నాటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 319 పరుగులు సాధించింది.ఓపెనర్లలో ప్రియాన్ష్ ఆర్య అర్ధ శతకం (58)తో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (38) ఫర్వాలేదనిపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగులు చేయగా.. కెప్టెన్ తిలక్ వర్మ (59), వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర (58) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.సూర్యాంశ్ షెడ్గే (7) విఫలం కాగా.. నిశాంత్ సింధు (21 నాటౌట్), విప్రాజ్ నిగమ్ (30) మెరుగ్గా రాణించారు. ఫలితంగా భారత్ మంచి స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ దావూద్జాయ్, అబ్దుల్లా అహ్మద్జాయ్, ఫర్మానుల్లా సఫీ రెండేసి వికెట్లు కూల్చగా.. జహీర్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.చెలరేగిన నిశాంత్ సింధుఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్‌కు ఆరంభంలోనే షాకులు తగిలాయి. టాపార్డర్‌లో ఓపెనర్ హసన్ ఐసాఖిల్ (14), వన్‌డౌన్ బ్యాటర్ ఖలీద్ తనీవాల్ (13) ఇలా వచ్చి అలా వెళ్లారు. మరో ఓపెనర్, కెప్టెన్ ఇమ్రాన్ మిర్ 32 పరుగులతో ఫర్వాలేదనిపించారు.మిగిలిన వారిలో ఫైజల్ షినోజాదా (46), బహీర్ షా (57) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. మిగతా వారంతా చేతులెత్తేశారు. మహ్మద్ ఇషాక్ (16), ఫర్మానుల్లా సఫీ (17లతో పాటు షామ్స్ ఉర్ రహ్మాన్ (8), అబ్దుల్లా అహ్మద్జాయ్ (6), జహీర్ ఖాన్ (4) భారత బౌలర్ల ధాటికి తాళలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు.ఫైనల్‌కు దూసుకువెళ్లిన భారత్ఈ క్రమంలో 36.5 ఓవర్లలో 218 పరుగులకే అఫ్గానిస్తాన్ ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లలో నిశాంత్ సింధు నాలుగు వికెట్లతో చెలరేగగా.. యశ్ ఠాకూర్ రెండు, అన్షుల్ కాంబోజ్, విప్రాజ్ నిగమ్, సూర్యాంశ్ షెడ్గే, అనుకుల్ రాయ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇక ఈ విజయంతో భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు చేరాయి. నెట్‌రన్‌రేటు +0.797. మిగిలిన ఒక్క లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక- అఫ్గానిస్తాన్ అమీతుమీ తేల్చుకుంటాయి. గెలిచిన జట్టు భారత్‌తో ఫైనల్లో తలపడుతుంది.చదవండి: వైభవ్ సూర్యవంశీకి షాకిచ్చిన బీసీసీఐ -
IND vs AFG: ఇషాన్ కిషన్ ‘ఫాస్టెస్ట్’ సెంచరీ
అఫ్గనిస్తాన్‌తో రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ శతక్కొట్టాడు. లక్నో వేదికగా కేవలం 71 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్ మీద వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు.టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది భారత జట్టు. ఇక లక్నోలోని ఏకనా స్టేడియంలో బుధవారం నాటి రెండో వన్డేలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది.జైసూ విఫలం.. పాపం రోహిత్ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (4) విఫలం కాగా.. రోహిత్ శర్మ అర్ద శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.ఇలాంటి తరుణంలో వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్, నాలుగో నంబర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. గిల్ 77 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. ఇషాన్ 71 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఇషాన్ సెంచరీ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 𝐓𝐡𝐞 𝐈𝐬𝐡𝐚𝐧-𝐝𝐚𝐚𝐫 𝐊𝐢𝐬𝐡𝐚𝐧 𝐬𝐡𝐨𝐰 𝐢𝐧 𝐋𝐮𝐜𝐤𝐧𝐨𝐰! 🤩He switched gears seamlessly, completely taking the game away with a magnificent ton! 🔥#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/sMtq9hV2z8— Star Sports (@StarSportsIndia) June 17, 2026వీరిద్దరి విజృంభణ కారణంగా టీమిండియా 34 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 276 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ మొత్తంగా 79 బంతుల్లో 14 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి.. నంగేయాలియా బౌలింగ్‌లో ఇక్రామ్ అలిఖిల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.అఫ్గనిస్తాన్‌పై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన క్రికెటర్లు1.ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్)- 2019లో 57 బంతుల్లో శతకం2. రోహిత్ శర్మ (ఇండియా)- 2023లో 63 బంతుల్లో శతకం3. ఇషాన్ కిషన్ (ఇండియా)- 2026లో 71 బంతుల్లో శతకం4. గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా)- 2023లో 76 బంతుల్లో శతకం5. శుబ్‌మన్ గిల్ (ఇండియా)- 2026లో 77 బంతుల్లో శతకం.చదవండి: చెలరేగిన బ్యాటర్లు.. అఫ్గన్‌పై భారత్ భారీ స్కోరు -
IND vs AFG: యశస్వి జైస్వాల్ ఫెయిల్
టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ వన్డే పునరాగమనంలో తీవ్రంగా నిరాశపరిచాడు. అఫ్గనిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైసూ.. సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. కాగా టెస్టు ఫార్మాట్లో ఓపెనర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వన్డే అరంగేట్రం కోసం చాలాకాలం ఎదురుచూడాల్సి వచ్చింది.సెంచరీతో ముగించి..ఎట్టకేలకు గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా వన్డేల్లో అడుగుపెట్టాడు జైసూ. అయితే, అరంగేట్రంలో 15 పరుగులే చేసి విఫలమయ్యాడు. ఇక చివరగా గతేడాది డిసెంబరులో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మరోసారి ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్న జైస్వాల్ అజేయ శతకంతో అలరించాడు.మొత్తంగా 121 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ జైస్వాల్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. తాజాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరం కావడంతో.. సెలక్టర్లు జైసూకు పిలుపునిచ్చారు.రాక రాక వచ్చిన అవకాశంఅయితే, ధర్మశాల వేదికగా అఫ్గనిస్తాన్‌తో తొలి వన్డేలో జైసూకు తుదిజట్టులో చోటు దక్కలేదు. లక్నో వేదికగా బుధవారం నాటి రెండో వన్డేకు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి దూరం కాగా.. జైస్వాల్‌కు ఆడే అవకాశం వచ్చింది. రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా వచ్చిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క ఫోర్ బాది నాలుగు పరుగులే చేసి అవుటయ్యాడు.విమర్శలుఅఫ్గన్ యువ పేసర్ మహ్మద్ సలీమ్ సఫీ బౌలింగ్‌లో నంగేయాలియా ఖరోటికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా సలీమ్ సఫీకి వన్డేలో ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. ఏదేమైనా రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక చతికిల పడ్డ జైస్వాల్‌పై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆట తీరును మార్చుకుంటేనే వన్డే వరల్డ్‌కప్-2027 జట్టులో బ్యాకప్ ఓపెనర్‌గానైనా చోటు దక్కుతుందని.. లేదంటే ఇషాన్ కిషన్ జట్టులో పాతుకుపోతాడని అంటున్నారు. కాగా ఇప్పటికి ఐదు వన్డేల్లో కలిపి జైస్వాల్ 175 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ ఇటీవల ఏకైక టెస్టులోనూ జైసూ విఫలమయ్యాడు. కేవలం 24 పరుగులకే అవుటయ్యాడు.చదవండి: వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ -
వైభవ్ సూర్యవంశీ విషయంలో మరో వివాదం!
తొలిసారి భారత్- ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగిన ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీ అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్‌తో ఈ చిచ్చర పిడుగు బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లో 12 బంతుల్లో మూడు ఫోర్లు బాదిన వైభవ్ కేవలం 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆ ఒక్క మ్యాచ్‌లోనే మెరుపులుఇక అఫ్గనిస్తాన్- ‘ఎ’తో మ్యాచ్‌లో మాత్రం ఫర్వాలేదనిపించాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ తొమ్మిది ఫోర్ల సాయంతో 44 పరుగులతో రాణించాడు. అనంతరం శ్రీలంక- ‘ఎ’తో వన్డేలో 21 పరుగులకే పరిమితమయ్యాడు. తాజాగా అఫ్గనిస్తాన్‌తో బుధవారం నాటి వన్డేలోనూ పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ మరోసారి నిరాశపరిచాడు.పరుగుల ఖాతా తెరవకముందే.. ప్రియాన్ష్ ఆర్య (58)కు జోడీగా ఓపెనర్‌గా వచ్చిన వైభవ్.. 28 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. నిజానికి ఈ లెఫ్టాండర్ బ్యాటర్ పరుగుల ఖాతా తెరవకముందే.. అవుటయ్యేవాడు. రెండో ఓవర్ రెండో బంతికి వైభవ్ ఇచ్చిన క్యాచ్‌ను అఫ్గన్ ఫీల్డర్ ఫరీదూన్ దావూద్జాయ్ గాల్లోకి ఎగిరిమరీ ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు.బతికిపోయిన బుడ్డోడుదీంతో ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వగా.. వైభవ్ మైదానం వీడేందుకు సిద్ధమయ్యాడు. అయితే, రీప్లేలో ఫ్రేమ్ బై ఫ్రేమ్ గమనించినపుడు బంతిలోని కొంతభాగం నేలకు తాకినట్లుగా ఉందని చెబుతూ థర్డ్ అంపైర్ వైభవ్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో అఫ్గనిస్తాన్ ప్లేయర్లు తెల్లముఖాలు వేయగా.. వైభవ్‌కు లైఫ్ లభించింది.అయినప్పటికీ వైభవ్ తన ఆట తీరును మార్చుకోలేదు. మూడో ఓవర్ నాలుగో బంతికి కూడా ఇలాగే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని రెండో అవకాశం పొందాడు. కానీ 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫరీదూన్ దావూద్జాయ్ బౌలింగ్‌లో ఖలీద్ తనీవాల్‌కు క్యాచ్ ఇచ్చి వైభవ్ వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్ ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.థర్డ్ అంపైర్ నిర్ణయంపై వివాదంవైభవ్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. స్పష్టంగా అవుట్ అని తెలిసినా.. థర్డ్ అంపైర్ పదే పదే పరిశీలించి ఆఖరికి వైభవ్‌కు అనుకూలంగా తీర్పునివ్వడం సరికాదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో వైభవ్ ఆట తీరును విమర్శిస్తూ.. ‘ ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. నువ్విక మారవా బుడ్డోడా’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శ్రీలంకతోమ్యాచ్ సందర్భంగా వైభవ్ సహనం కోల్పోయిన సంగతి తెలిసిందే.చదవండి: వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐVaibhav survives the scare! Third umpire says NOT OUT 😮💨Watch #TalentTVCup LIVE on #SonyLIV & #SonySportsNetwork 📺 pic.twitter.com/txOaxjXdx3— Sony LIV (@SonyLIV) June 17, 2026 -
చరిత్రకు అడుగుదూరంలో గిల్.. రోహిత్‌ను ఊరిస్తున్న రికార్డు!
అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇప్పటికే తొలి వన్డే గెలిచిన టీమిండియా రెండో విజయంతో పాటు సిరీస్ గెలుపుపై కూడా కన్నేసింది. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా ఇవాళ రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో గిల్ తప్పిదంతో రనౌట్ అయిన సీనియర్ క్రికెటర్, ఓపెనర్ రోహిత్ శర్మను ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఆఫ్గన్‌తో రెండో వన్డేలో రోహిత్ శర్మ మరో 10 పరుగులు చేస్తే లిస్ట్-ఏ క్రికెట్లో 14వేల పరుగులు మైలురాయిని అందుకోనున్నాడు. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ కూడా ఒక అరుదైన ఫీట్‌కు అడుగు దూరంలో ఉన్నాడు. వన్డే కెప్టెన్‌గా గిల్‌కు ఇదే మొదటి సిరీస్. ఇప్పటికే టీమిండియా తొలి వన్డే గెలిచింది. రెండో వన్డేలోనూ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ వశం కానుంది. ఈ క్రమంలో స్వదేశంలో తొలి వన్డే సిరీస్ గెలిచిన కెప్టెన్‌గా గిల్ నిలవనున్నాడు. ఇక రెండో వన్డేకు కుల్దీప్ యాదవ్, జైస్వాల్‌కు చోటు దక్కే అవకాశముందని ఇప్పటికే గిల్ ప్రకటించాడు. ఇక తొలి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గిల్ అజేయ ఇన్నింగ్స్‌కు తోడు కేఎల్ రాహుల్ దనాధన్ ఇన్నింగ్స్‌తో టీమిండియా సులువుగానే గెలిచింది. అయితే బౌలింగ్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ విజయంతో ఆ అంశం పెద్దగా ప్రభావం చూపలేదు. రెండో వన్డేలో అన్ని విభాగాల్లో రాణించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్ (102) సెంచరీ సాధించాడు. అనంతరం టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గిల్ (84 నాటౌట్), కేఎల్ రాహుల్ (39 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.Read: కాన్వేకు ప్రమోషన్.. కివీస్ ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితా ఇదే! -
IND vs AFG: రెండో వన్డేలో భారత్ ఘన విజయం
భారత్ గ్రాండ్ విక్టరీలక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. 403 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో రెహమత్ షా(79) టాప్ స్కోరర్‌గా నిలవగా.. గుర్బాజ్(41), అటల్(42) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తలా మూడు వికెట్లు సాధించారు. వీరిద్దరితో పాటు అరంగేట్ర ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించి టీమిండియా ఆలౌట్ అయింది. శుబ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కారు.అఫ్గాన్ ఎనిమిదో వికెట్ డౌన్అఫ్గానిస్తాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన సలీమ్ సఫీ.. గుర్నూర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.అఫ్గాన్ ఏడో వికెట్అఫ్గాన్ ఏడో వికెట్ కోల్పోయింది. ఘజన్ఫర్ అర్ష్ దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.అఫ్గాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రషీద్ ఖాన్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అఫ్గాన్ స్కోర్: 190/6అఫ్గానిస్తాన్ ఐదో వికెట్అఫ్గానిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ఖరోటి.. ప్రిన్స్ యాదవ్ క్లీన్ బౌల్డయ్యాడు. అఫ్గాన్ 31 ఓవర్లకు స్కోర్: 182/5అఫ్గాన్ నాలుగో వికెట్ డౌన్అఫ్గాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కెప్టెన్ షాహిది.. గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.మూడో వికెట్ డౌన్అఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. సెదీఖుల్లా(42).. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.20 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 105-2సెదీఖుల్లా 28, రహ్మత్ షా 14 పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ డౌన్13.1: అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ప్రిన్స్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఇబ్రహీం జద్రాన్ (21). రహ్మత్ షా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 76-2(13.4).పవర్ ప్లేలో అఫ్గనిస్తాన్ స్కోరు: 62-1 (10)సెదీఖుల్లా 5, ఇబ్రహీం జద్రాన్ 15 పరుగులతో ఉన్నారు.అఫ్గానిస్తాన్ తొలి వికెట్ డౌన్52 పరుగుల వద్ద అఫ్గానిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన గుర్బాజ్.. గుర్నూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.403 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ఐదు ఓవర్లలో అఫ్గానిస్తాన్ స్కోరు: 32-0రహ్మానుల్లా గుర్బాజ్ 26, ఇబ్రహీం జద్రాన్ 6 పరుగులతో ఉన్నారు.టీమిండియా భారీ స్కోరుకెప్టెన్ శుబ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ 48 పరుగులతో రాణించాడు. మిగతా వారిలో శ్రేయస్ అయ్యర్ (26) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించిన టీమిండియా ఆలౌట్ అయింది.తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా48.5: రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ అవుట్ (19).ఎనిమిదో వికెట్ డౌన్47.6: ఘజన్ఫర్ బౌలింగ్‌లో రషీద్‌కు క్యాచ్ ఇచ్చి అర్ష్‌దీప్ సింగ్ (3) అవుట్. క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్. స్కోరు: 392-8.టీమిండియా ఏడో వికెట్ డౌన్టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన గుర్నూర్ బ్రార్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. స్కోరు: 387-7 (47).ఆరో వికెట్ డౌన్44.3: ఖరోటి బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (26) ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. గుర్నూర్ బ్రార్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 373-6 (45).43 ఓవర్లలో టీమిండియా స్కోరు: 361-5ఐదో వికెట్ డౌన్42.3: ఖరోటి బౌలింగ్‌లో ఐదో వికెట్‌గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్గిల్ అవుట్42.3: ఖరోటి బౌలింగ్‌లో 154 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఘజన్ఫర్కు క్యాచ్ ఇచ్చి అవుటైన శుబ్‌మన్ గిల్. క్రీజులోకి కేఎల్ రాహుల్.40 ఓవర్లలో టీమిండియా స్కోరు: 340-3శ్రేయస్ అయ్యర్ 7, గిల్ 146 పరుగులతో ఉన్నారు.భారత్ మూడో వికెట్ డౌన్ఇషాన్ కిషన్ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 125 పరుగులు చేసిన కిషన్.. ఖరోటి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 37 ఓవర్లలో టీమిండియా స్కోరు 322-3. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.ఇషాన్ మెరుపు సెంచరీలక్నో వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. కేవలం 71 బంతుల్లోనే తన రెండో వన్డే సెంచరీ మార్క్‌ను ఇషాన్ అందుకున్నాడు.శతక్కొట్టిన గిల్32.1: 77 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో శుబ్‌మన్ గిల్ సెంచరీ. 32 ఓవర్లలో టీమిండియా స్కోరు 245-2. ఇషాన్ 91 పరుగులతో ఉన్నాడు.30 ఓవర్లలో టీమిండియా స్కోరు: 220-2ఇషాన్ 70, గిల్ 96 పరుగులతో ఉన్నారు.ఇషాన్ అర్ధ శతకం27.5: హష్మతుల్లా బౌలింగ్ ఫోర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్. స్కోరు: 193-2.20 ఓవర్లలో టీమిండియా స్కోరు: 136-2గిల్ 71, ఇషాన్ కిషన్ 11 పరుగులతో ఉన్నారు.గిల్ హాఫ్ సెంచరీ16.1: ఖరోటి బౌలింగ్‌లో సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.రోహిత్ శర్మ అవుట్13.1: అర్ధ శతకానికి చేరువైన ఓపెనర్ రోహిత్ శర్మ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది 48 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ మ్యాచ్సందర్భంగా రోహిత్ లిస్ట్-ఎ క్రికెట్లో 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. గిల్ 42 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 96-2(13.1)పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 80-1గిల్ 31, రోహిత్ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా హాఫ్ సెంచరీ.. స్కోరు: 50-1(6.1)గిల్ 22, రోహిత్ 21 పరుగులతో ఉన్నారు.ఐదు ఓవర్లలో టీమిండియా స్కోరు: 42-1(5)గిల్ 18, రోహిత్ 18 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా1.6: సలీమ్ సఫీ బౌలింగ్‌లో ఖరోటికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన యశస్వి జైస్వాల్. చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చి నిరాశపరిచిన జైసూ. 9 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులే చేసి అవుట్. సలీమ్ ఖాతాలో తొలి వన్డే వికెట్‌గా జైసూ. గిల్ క్రీజులోకి రాగా.. రోహిత్ శర్మ 4 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 9-1 (2).ప్రిన్స్ యాదవ్ అరంగేట్రంఊహించిందే నిజమైంది. అఫ్గనిస్తాన్‌తో రెండో వన్డే సందర్భంగా యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేశాడు. తొలి వన్డేలో ఆడిన ప్రసిద్ కృష్ణను తప్పించిన యాజమాన్యం.. అతడి స్థానంలో యార్కర్ల స్పెషలిస్టు ప్రిన్స్‌కు తుదిజట్టులో చోటు ఇచ్చింది.ఇక ప్లేయింగ్ ఎలెవన్‌లో మొత్తంగా మూడు మార్పులు చేసినట్లు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వెల్లడించాడు. ప్రిన్స్ యాదవ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్‌ను ఆడిస్తున్నట్లు తెలిపాడు. కాగా తొలి వన్డేలో ఆడిన ప్రసిద్ కృష్ణతో పాటు అరంగేట్ర స్పిన్నర్ హర్ష్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డిలను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్అఫ్గనిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఏఎమ్ ఘజన్ఫర్, మహ్మద్ సలీమ్ సఫీ, బిలాల్ సమీ. -
IND vs AFG: రెండో వన్డే.. భారత తుదిజట్టు ఇదే
టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో బిజీగా ఉంది. ఇరుజట్ల మధ్య ధర్మశాలలో శనివారం తొలి వన్డే జరిగింది. వర్షం ఆటంకం కలిగించగా ఈ మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు.గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ విధ్వంసకర సెంచరీ (51 బంతుల్లో 102) కారణంగా ఈ మేరకు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో అరంగేట్ర కుర్రాళ్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే తలా మూడు వికెట్లు పడగొట్టారు.గిల్ అజేయ అర్ధ శతకంమిగిలిన వారిలో అర్ష్‌దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు కూల్చారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 22.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అజేయ అర్ధ శతకం (84)తో రాణించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.లక్నో వేదికగా..ఇక టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు లక్నో ఆతిథ్యం ఇస్తుండగా.. గిల్ సేన ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత తుదిజట్టులో ఒక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రసిద్ కృష్ణను తప్పించి మరో బౌలర్‌ను అరంగేట్రం చేయించనున్నట్లు సమాచారం.యార్కర్ల స్పెషలిస్టు అరంగేట్రంఅఫ్గన్తో తొలి వన్డేలో ప్రసిద్ ఐదు ఓవర్ల కోటా పూర్తి చేసి 35 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతడిపై వేటు వేసి.. పేస్ దళంలోకి యార్కర్ల స్పెషలిస్టు ప్రిన్స్ యాదవ్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా 24 ఏళ్ల ప్రిన్స్ యాదవ్ అఫ్గన్‌తో సిరీస్ సందర్భంగా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.గత మ్యాచ్‌లో డెబ్యుడెంట్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే రాణించగా.. ఈసారి ప్రిన్స్‌కు కూడా వన్డే క్యాప్ ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన ప్రిన్స్ యాదవ్ ఇప్పటికి 20 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు కూల్చాడు.అఫ్గనిస్తాన్‌తో రెండో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.చదవండి: వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ -
వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ
గత కొన్నాళ్లుగా తన ఆట తీరుతో హాట్‌టాపిక్‌గా మారిన భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. భారత్- ‘ఎ’ జట్టు తరఫున శ్రీలంక పర్యటనలో ఉన్న ఈ పిల్లాడు.. ముక్కోణపు వన్డే సిరీస్ ఆడుతున్నాడు.సూపర్ ఓవర్లో లంక విజయంఇందులో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్‌లో శ్రీలంక భారత్- ‘ఎ’ జట్టుపై సూపర్ ఓవర్లో విజయం సాధించింది.నువ్వు ఇక ఇంటికి వెళ్లుఈ క్రమంలో లంక ప్లేయర్ విశేన్ హలంబగే.. భారత ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి.. ‘‘మ్యాచ్ అయిపోయింది. నువ్వు ఇక ఇంటికి వెళ్లు’’ అని రెచ్చగొట్టినట్లు తెలిసింది. దీంతో సహనం కోల్పోయిన వైభవ్.. అతడిపైకి దూసుకెళ్లాడు. విశేన్‌ను వెనక్కి నెట్టేయగా.. అతడూ వైభవ్‌ను తోసేశాడు.ఇంతలో లంక సీనియర్ ప్లేయర్ డిక్విల్లా ఇద్దరినీ విడదీసి.. వైభవ్‌ను అక్కడి నుంచి పంపించాడు. అయితే, వైభవ్ వెళ్తూ వెళ్తూ వేలు చూపించి బెదిరించినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో పదిహేనేళ్ల వైభవ్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. అయితే, ఇది అనధికారిక మ్యాచ్ కాబట్టి ఐసీసీ పెద్దగా చర్యలు తీసుకునే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.స్పందించిన బీసీసీఐఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా వైభవ్ సూర్యవంశీ వివాదం గురించి స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియా- ‘ఎ’ జట్టు కీలక టోర్నమెంట్ ఆడుతోంది. వర్దమాన క్రికెటర్లు టీమిండియాలోకి వచ్చేందుకు ఇదొక మంచి అవకాశం.ముక్కోణపు వన్డే సిరీస్ రూపంలో వారికి తమను తాము నిరూపించుకునే అవకాశం దొరికింది. కాబట్టి వాళ్లంతా కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఇతరత్రా విషయాలను పట్టించుకోకూడదు. అలా చేస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది.ఆటపైనే దృష్టి పెట్టండిఅక్కడికి ఎందుకు వెళ్లారో ఆ విషయంపై మాత్రమే దృష్టి పెట్టండి. ప్రతి ఒక్కరు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఈ ట్రై సిరీస్‌లో ఇండియా విజేతగా నిలవగలదు. మా దృష్టి మొత్తం విజయం మీదే కేంద్రీకృతమై ఉంది. ఆటగాళ్లు అందుకు అనుగుణంగా నడుచుకోవాలి’’ అని దేవజిత్ సైకియా పరోక్షంగా భారత క్రికెటర్లను హెచ్చరించాడు.కాగా ఈ మ్యాచ్ సందర్భంగా సూపర్ ఓవర్ విషయంలో కెప్టెన్ తిలక్ వర్మ సైతం అంపైర్లతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. లంక, భారత్‌తో పాటు అఫ్గనిస్తాన్ కూడా ఈ ట్రై సిరీస్‌లో భాగమైంది. భారత్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండు ఓడిపోయింది. తద్వారా ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. -
పల్లెటూరోడు!.. పెంపకం సరిగ్గా లేదు.. వైభవ్‌పై సంచలన వ్యాఖ్యలు
అతి పిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరిస్తూ నీరాజనాలు అందుకుంటున్నాడు. ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్.. ఏకంగా 776 పరుగులు సాధించాడు.పదిహేనేళ్ల వయసులోనే ఆరెంజ్ క్యాప్తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి పదిహేనేళ్ల వయసులోనే ఆరెంజ్ క్యాప్ దక్కించుకుని చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ఈ నేపథ్యంలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ టీమిండియాకు కూడా ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లో పర్యటించే, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత టీ20 జట్టులో అతడికి స్థానం దక్కింది.ముక్కోణపు వన్డే సిరీస్లోఇక ప్రస్తుతం భారత్- ‘ఎ’ తరఫున వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. భారత్, లంక, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌తో ఈ ఓపెనింగ్ బ్యాటర్ బిజీగా ఉన్నాడు. అయితే, సోమవారం శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ సహనం కోల్పోయాడు. సూపర్ ఓవర్లో విజయం సాధించిన తర్వాత శ్రీలంక ప్లేయర్ విశేన్ హలంబగే వైభవ్, సూర్యాంశ్ షెడ్గేలను ఉద్దేశించి ఏదో అన్నాడు.దీంతో వైభవ్, సూర్యాంశ్ లంక ప్లేయర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పరస్పరం నెట్టేసుకున్నారు. లంక ఆటగాడి ఛాతీపై చేయి వేసి వైభవ్ వెనక్కి నెట్టాడు. అంతేకాదు వెళ్తూ వెళ్తూ వేలు చూపిస్తూ బెదిరించినట్లుగా ఉన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026వైభవ్ ప్రవర్తనపై విమర్శలుఈ నేపథ్యంలో వైభవ్ ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. చిన్న వయసులో ఇంత దూకుడు పనికిరాదని.. కాస్త ఓర్పుతో ఉండాలని మాజీ క్రికెటర్లు సద్విమర్శలు చేస్తున్నారు. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డు మీడియా మాజీ మేనేజర్ బ్రేన్ థామస్ మాత్రం శ్రుతిమించాడు. సూర్యవంశీతో పాటు భారత ప్రజల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు.పల్లెటూరోడు!.. పెంపకం సరిగ్గా లేదంటూ ఓవరాక్షన్‘‘సూర్యవంశీ.. అతడి చెత్త కోపానికి సంబంధించిన ఫుటేజీని ఇప్పుడే చూశాను. క్రికెట్లో యెల్లో, రెడ్ కార్డులు లేకపోవడం విచారకరం. ఒకవేళ మ్యాచ్ రిఫరీ గనుక ఈ కౌబాయ్‌ను తదుపరి మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తే బాగుంటుంది.అప్పుడే ఎలా ప్రవర్తించాలో అతడికి తెలిసి వస్తుంది. అయినా.. ఇండియాలోని గ్రామానికి చెందిన పిల్లాడి నుంచి ఇంతకంటే ఎక్కువగా ఏం ఆశించగలము? శ్రీలంకలో మాదిరి అక్కడి పిల్లల పెంపకం అంత గొప్పగా ఏమీ ఉండదు.హేయ్ సూర్యవంశీ నువ్వు గనుక సంతోషంగా లేకుంటే.. ఇండియాలో నిన్ను పొగుడుతూ నెత్తికెక్కించుకునే వాళ్ల దగ్గరికి వెళ్లిపో. మీ ఇంటికి పో. ఇది జెంటిల్మెన్ గేమ్’’ అంటూ బ్రేన్ థామస్ పరుష పదజాలంతో వైభవ్‌ను కించపరిచాడు. దీంతో భారత నెటిజన్లు సైతం థామస్‌కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ‘స్పెల్లింగ్ సరిగా రాయడం రాని నువ్వు చదువు గురించి మాట్లాడుతున్నావా? 15 ఏళ్ల పిల్లాడిపై ఇంత విషం చిమ్ముతావా?’ అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా ఈ సిరీస్‌లో వైభవ్ ఇప్పటికి మూడు మ్యాచ్‌లలో వరుసగా.. 14, 44, 21 పరుగులు చేశాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లు!భారత జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అక్కసు -
వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు!
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్- ‘ఎ’ జట్టు చిక్కుల్లో పడింది. ఇప్పటికి మూడు మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ సేన.. రెండింట ఓడిపోయింది. తొలుత అఫ్గనిస్తాన్ -‘ఎ’ చేతిలో ఓడిన భారత జట్టు.. సోమవారం నాటి పోరులో లంక చేతిలో పరాజయం పాలైంది.దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు 265 పరుగులు చేయగా.. మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. భారత్ అనూహ్య రీతిలో ఓడిపోయింది. అయితే, వెలుతురులేమి కారణంగా తొలుత సూపర్ ఓవర్ నిర్వహించడం సాధ్యం కాదని అంతా భావించారు.వెలుతురులేమి సమస్యభారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ సైతం ఇదే విషయంపై అంపైర్లతో వాదించినట్లు సమాచారం. కానీ వెలుతురు మరీ తగ్గిపోతే సూపర్ ఓవర్ మొదలైనప్పటికీ మ్యాచ్ నిలిపివేస్తామని అంపైర్లు భారత శిబిరానికి చెప్పినట్లు క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది. అయితే, తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేయగా.. భారత్ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో మరింతగా చీకటి అలుముకుంది.కొట్టుకోవడం ఒక్కటే తక్కువఅయినప్పటికీ సూపర్ ఓవర్ నిర్వహించగా.. భారత జట్టు ఓటమిపాలైంది. ఆద్యంతం ఆసక్తిరేపిన ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ముగిసిన తర్వాత భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో శ్రీలంక ఆటగాళ్లు వ్యవహరించిన తీరు.. అందుకు వైభవ్ బదులిచ్చిన విధానం విమర్శలకు దారితీసింది.వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు!వైభవ్- శ్రీలంక ఆటగాళ్లు పరస్పరం మీదమీదకు వెళ్తూ కొట్టుకున్నంత పనిచేశారు. అయితే, వారి మధ్య గొడవకు కారణం ఏమిటన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. శ్రీలంక ప్లేయర్ విశేన్ హలంబగే వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి.. ‘‘మ్యాచ్ అయిపోయింది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు’’ అన్నట్లు సమాచారం.దీంతో కోపోద్రిక్తుడైన వైభవ్.. ‘‘ఏమంటున్నావు’’ అంటూ మీదకు వెళ్లగా ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. ఆ తర్వాత లంక సీనియర్ ప్లేయర్ ఒకరు వచ్చి ఇద్దరినీ విడదీశారు. అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. అయితే, ఈ విషయం గురించి శ్రీలంక డ్రెసింగ్‌రూమ్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.క్షమాపణ అడుగుదాం!చీకటి పడిన తర్వాత కూడా సూపర్ ఓవర్లో ఆడేందుకు సహకరించిన భారత జట్టుకు ధన్యవాదాలు చెప్పడంతో పాటు.. వైభవ్ విషయంలో జరిగినదానికి క్షమాపణలు కోరాలనే చర్చ నడిచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజా ఓటమితో భారత్ ఫైనల్ చేరే అవకాశాలు సన్నగిల్లాయి.చదవండి: 29 బంతుల్లోనే సెంచరీ చేసిన చహల్🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026 -
అంపైర్లతో తిలక్ వర్మ, వైభవ్ వాగ్వాదం.. తిలక్‌ను తోసేసి..
భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అంపైర్లతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్- ‘ఎ’ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది.దంబుల్లా వేదికగా గురువారం అఫ్గనిస్తాన్- ‘ఎ’ జట్టు చేతిలో ఓడిన భారత్.. సోమవారం శ్రీలంక చేతిలోనూ ఓటమి పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో సరిగ్గా 265 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయింది.అయితే, శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఆఖరి బంతిని ఎదుర్కొన్న గుణశేఖర బాల్‌ను ఫ్లిక్ చేయకుండానే.. సింగిల్ తీసి రనౌట్ అయ్యాడు. దీంతో స్కోరు సమం కాగా.. భారత శిబిరం మాత్రం ఆ పరుగును ఎలా పరిగణిస్తారని అంపైర్లను ప్రశ్నించింది. మరోవైపు.. సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండగా అప్పటికే చీకటి పడిపోయింది.ఈ నేపథ్యంలో కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. గుణశేఖర బంతిని బాదనపుడు తొలి పరుగును ఎలా లెక్కలోకి తీసుకుంటారని వాదించినట్లు కనిపించింది. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ కూడా తిలక్‌కు మద్దతుగా వచ్చి నిలబడ్డాడు.Vaibhav Sooryavanshi sending off Captain Tilak Varma from arguing with Umpire.pic.twitter.com/067cYfhmo2— Maina Singh (@Maina_Singhx77) June 15, 2026అయితే, కాసేటికే తిలక్‌ను సముదాయించినట్లు వెనక్కి నెడుతూ అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఇక సూపర్ ఓవర్లో తిలక్ బంతిని అర్షద్ ఖాన్‌కు ఇవ్వగా.. లంక కెప్టెన్ సహన్ అరాచిగే తొలి బంతికే రెండు పరుగులు రాబట్టాడు. రెండో బంతి వైడ్‌కాగా.. తదుపరి మరో సింగిల్ వచ్చింది.మూడో బంతికి అవిష్క ఫెర్నాండో సింగిల్ తీయగా.. నాలుగో బంతికి అరాచిగే మూడు పరుగులు రాబట్టాడు. ఐదో బంతిని ఫెర్నాండో సిక్సర్‌గా మలచగా.. ఆరో బంతి నోబాల్ అయింది. దీంతో ఫ్రీ హిట్ రాగా.. మొత్తంగా లంక 16 పరుగులు చేసింది. అయితే, నోబాల్ విషయంలో కూడా తిలక్ వర్మ వాదనకు దిగాడు. అనంతరం భారత్ తరఫున వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే బ్యాటింగ్‌కు దిగగా.. భారత్‌కు ఓటమే ఎదురైంది. A heated moment between Tilak Verma and Umpire. 🤯 pic.twitter.com/pe67HdkoHK— Qamar. (@Qamar5618) June 15, 2026చదవండి: శ్రీలంక ప్లేయర్‌ను నెట్టేసిన వైభవ్.. వీడియో వైరల్ -
శ్రీలంక ప్లేయర్‌ను నెట్టేసిన వైభవ్.. కోపంతో ఊగిపోతూ..
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఆతిథ్య శ్రీలంక- ‘ఎ’- భారత్ -‘ఎ’ జట్ల మధ్య మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. దంబుల్లాలో సోమవారం టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్‌కు దిగింది. లంక బౌలర్ల ధాటికి 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.మ్యాచ్ ‘టై’ఆల్‌రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే (72), విప్రాజ్ నిగమ్ (51) అర్ధ శతకాల వల్ల భారత్‌కు ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. అయితే, విప్రాజ్ నిగమ్ పిచ్ మధ్యభాగంలో రెండుసార్లు పరిగెత్తడం వల్ల భారత్‌కు పది పరుగుల పెనాల్టీ పడింది. దీంతో 10/0తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి సరిగ్గా 265 పరుగులే చేసింది.ఫలితంగా మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 పరుగులు చేసింది. అనంతరం భారత్ తరఫున బ్యాటింగ్‌కు దిగిన వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. తొలి బంతికి సూర్యాంశ్ రెండు పరుగులు తీయగా.. తర్వాత పరుగేమీ రాలేదు.భారత్ ఓటమిఆ తర్వాత వైభవ్ రెండు పరుగులు తీయగా.. మరుసటి బంతికి ఫోర్ బాదాడు. ఆఖరి బంతికి ఎనిమిది పరుగులు అవసరం కాగా.. వైభవ్ పరుగులేమీ తీయలేకపోయాడు. దీంతో భారత్ ఓటమి ఖరారైంది. ఈ క్రమంలో వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్న శ్రీలంక ప్లేయర్లలో ఎవరో వైభవ్‌ను ఏదో అన్నట్లుగా కనిపించింది.శ్రీలంక ప్లేయర్‌ను నెట్టేసిన వైభవ్దీంతో కోపంతో శ్రీలంక ఆటగాళ్లపై దూసుకువెళ్లిన పదిహేనేళ్ల వైభవ్ వారిని నెట్టేశాడు. ఇంతలో అంపైర్, సూర్యాంశ్ వచ్చి అతడిని వారి నుంచి విడదీశారు. ఆ తర్వాత కూడా వైభవ్ చేయి చూపిస్తూ కోపంతో ఊగిపోతూ మైదానం వీడాడు. అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. వైభవ్ దూకుడుగా వ్యవహరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులు.. హైడ్రామా🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026 -
IND vs SL: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులే ట్విస్టులు.. ఆఖరికి
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-‘ఎ’ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. తొలుత అఫ్గనిస్తాన్ చేతిలో ఓడిన భారత జట్టు తాజాగా.. సోమవారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనూ పరాజయం పాలైంది.ముక్కోణపు వన్డే సిరీస్‌కాగా శ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, భారత్, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య జూన్ 9న ముక్కోణపు వన్డే సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ 8 పరుగుల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ భారత్‌పై 4 పరుగుల తేడాతో గట్టెక్కింది.ఇక మూడో మ్యాచ్‌లో శ్రీలంక అఫ్గనిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించగా.. నాలుగో మ్యాచ్‌లో భాగంగా సోమవారం భారత్- శ్రీలంక రెండోసారి తలపడ్డాయి. టాస్ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు.. తిలక్ వర్మ సేన తొలుత బ్యాటింగ్‌కు దిగింది.265 పరుగులు చేసి ఆలౌట్గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న భారత ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21) ఈసారి నిరాశపరిచారు. ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఈసారి 37 పరుగులకే పరిమితం కాగా.. కెప్టెన్ తిలక్ వర్మ కేవలం 23 పరుగులే చేశాడు. ఆయుశ్ బదోని 15, నిశాంత్ సింధు 6, అనుకుల్ రాయ్ 8, అర్షద్ ఖాన్ 2 పరుగులు చేసి నిష్క్రమించారు.అయితే, ఆల్‌రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే 66 బంతుల్లో 72, విప్రాజ్ నిగమ్ 49 బంతుల్లో 51 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి అర్ద శతకాల కారణంగా భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.పది పరుగుల పెనాల్టీశ్రీలంక బౌలర్లలో విజయకాంత్ వియస్కాంత్, మొహ్మద్ షిరాజ్ చెరో మూడు వికెట్లు తీసి సత్తా చాటగా.. కెప్టెన్ సహన్ అరాచిగే, వనుజా సహన్, కుగాతస్ మతూలన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అయితే, విప్రాజ్ నిగమ్ పరుగులు తీసే క్రమంలో రెండుసార్లు పిచ్ మధ్యభాగంలోకి వచ్చాడు. దీంతో భారత జట్టుకు పది పరుగుల పెనాల్టీ పడింది.Not every day you see 5 runs off a helmet hit😅 Watch #SLvIND in the #TalentTVCup, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV 📺 #SonySportsNetwork #SonyLIV #TeamIndia pic.twitter.com/2db4eMFJpL— Sony Sports Network (@SonySportsNetwk) June 15, 2026ఫలితంగా శ్రీలంక 10/0తో తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే, బౌలింగ్ సమయంలో బంతి వికెట్ కీపర్ హెల్మెట్‌కు తాకడంతో శ్రీలంకకు కూడా పెనాల్టీ పడింది.ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు నిరోషన్ డిక్విల్లా (37), అవిష్క ఫెర్నాండో (22) మెరుగైన ఆరంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ విశేన్ హలంబగే (17) విఫలమయ్యాడు. కెప్టెన్ సహన్ అరాచిగే 8 పరుగులకే నిష్క్రమించగా.. అహాన్ విక్రమసింఘే 6 పరుగులు చేసి అవుటయ్యాడు.ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ సదీర సమరవిక్రమ ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడుగా వనుజా సహన్ (25) రాణించగా.. విజయకాంత్ వియస్కాంత్ 39 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు.నరాలు తెగే ఉత్కంఠఇక 47 ఓవర్లు పూర్తయ్యేసరికి శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేయగా.. విజయానికి 18 బంతుల్లో 18 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికి సదీర సమరవిక్రమ 104 బంతుల్లో 88 పరుగుల వద్ద ఉన్నాడు.ఈ క్రమంలో 48వ ఓవర్లో ఆరు పరుగులు రాగా.. శ్రీలంక విజయానికి 12 బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సదీర ఆచితూచి ఆడాడు. ఇలాంటి తరుణంలో యశ్ ఠాకూర్ నోబాల్‌తో 48వ ఓవర్ ఆఖరి బంతికి లంకకు ఫ్రీహిట్ రాగా.. గుణశేఖర ఫోర్ బాదాడు. దీంతో చివరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. అర్షద్ ఖాన్ బంతితో రంగంలోకి దిగాడు.తొలి బంతికి పరుగులేమీ ఇవ్వని.. అర్షద్ రెండో బంతికి సదీర సమరవిక్రమను బౌల్డ్ చేశాడు. దీంతో 93 పరుగుల వద్ద సదీర నిష్క్రమించగా.. నాలుగు బంతుల్లో ఐదు పరుగులుగా లంక విజయ సమీకరణం మారింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన షిరాజ్ మూడో బంతికి సింగిల్ తీయగా.. ఆ తర్వాత గుణశేఖర సైతం సింగిల్ పూర్తి చేశాడు.దీంతో రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరం కాగా.. అర్షద్‌పై ఒత్తిడి పెరిగింది. ఐదో బంతికి షిరాజ్ సింగ్ తీయడంతో సమీకరణం ఆఖరి బంతికి రెండు పరుగులుగా మారింది. అయితే, ఆఖరి బంతికి పరుగు తీసిన గుణశేఖర రెండో పరుగు కోసం రాగా.. రనౌట్ అయ్యాడు. దీంతో స్కోర్లు సమం అయ్యాయి.సూపర్ ఓవర్ ముగిసిందిలా..అయితే, గుణశేఖర షాట్ ఆడినట్లు కనిపించలేదని.. బంతి ఫ్లిక్ అయి కీపర్ వైపు వెళ్లింది కాబట్టి దీనిని రన్‌గా పరిగణించవద్దని భారత శిబిరం కోరగా.. ప్రతికూల నిర్ణయమే వచ్చింది. ఇక ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండగా.. వెలుతురులేమి సమస్యగా మారింది. అయినప్పటికీ సూపర్ కోసం పట్టుపట్టగా.. ఫ్లడ్‌లైట్లు లేకుండానే శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది.భారత కెప్టెన్ తిలక్ వర్మ అర్షద్ ఖాన్ చేతికి బంతినివ్వగా.. వైడ్, నోబాల్ రూపంలో భారత్ మూల్యం చెల్లించింది. శ్రీలంక 16 పరుగులు చేసింది. అయితే, నోబ్ విషయంలో తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. కానీ మ్యాచ్ కొనసాగింది. 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 పరుగులే చేయడంతో ఓటమి ఖరారైంది. -
IND vs AFG: ‘టీమిండియా సెలక్టర్ల నిర్ణయం సరైందే’
టీమిండియా సెలక్టర్లపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. విమర్శలకు బెదరకుండా సరైన ఆటగాడినే జట్టుకు ఎంపిక చేశారని కొనియాడాడు. టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఆకిబ్ నబీకి మొండిచేయి అంతకుముందు అఫ్గన్‌తో ఏకైక టెస్టు ఆడింది శుబ్‌మన్ గిల్ సేన. ఈ మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో గుర్నూర్ బ్రార్‌కు చోటు ఇచ్చారు సెలక్టర్లు. రంజీ ట్రోఫీ 2025-26లో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీకి మాత్రం మొండిచేయి చూపారు.ఈ నేపథ్యంలో ఆకిబ్ నబీ పట్ల వివక్షపూరితంగా వ్యవహరించి.. అతడికి బదులు గుర్నూర్‌ను ఎంపిక చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. రంజీల్లో ఒకే సీజన్లో అరవైకి పైగా వికెట్లు సాధించినా ఆకిబ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు తలెత్తాయి.వన్డేతో అరంగేట్రంఇక అఫ్గన్‌తో టెస్టు మ్యాచ్‌లో గుర్నూర్ బ్రార్‌కు తుదిజట్టులో చోటు దక్కలేదు. అయితే, ధర్మశాల వేదికగా శనివారం జరిగిన తొలి వన్డే సందర్భంగా అతడు అరంగేట్రం చేశాడు. ఈ పేస్ బౌలర్‌తో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే కూడా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఇద్దరూ రాణించారుఇక తన తొలి ఓవర్లోనే వికెట్ తీసిన గుర్నూర్ బ్రార్.. మొత్తంగా 4.5 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. మరోవైపు.. హర్ష్ దూబే ఐదు ఓవర్ల కోటా పూర్తి చేసి 47 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.సెలక్టర్ల నిర్ణయం సరైందేఈ నేపథ్యంలో అశ్విన్ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఆకిబ్ నబీని కాదని గుర్నూర్‌ను ఎంపిక చేసి మంచి పనిచేశారన్నాడు. ఈ మేరకు.. ‘‘గుర్నూర్ బ్రార్ తొలి మ్యాచ్‌లోనే తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు పొడుగ్గా ఉంటాడు. బలంగా కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.ప్రతీ బంతిని గంటకు 145కు కిలోమీటర్ల వేగంతో సంధించాడు. అతడి బౌలింగ్ నైపుణ్యం, శైలి.. బంతిని స్వింగ్ చేసే విధానం అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా కొత్త బంతితో అద్భుతంగా ఆడాడు. అతడు ఇంకా వేగంగా కూడా బౌలింగ్ చేయగలడు.సెలక్టర్లు ఆకిబ్ నబీని కాదని గుర్నూర్ ఎంపిక చేసినపుడు చాలా మంది విమర్శించారు. అయితే, వారి నిర్ణయం సరైందే. వాళ్లిద్దరి మధ్య పోలిక ఇక్కడ అనవసరం. గుర్నూర్ ప్రతిభను గుర్తించిన సెలక్టర్లు, కోచ్‌లను తప్పక అభినందించాల్సిందే.భవిష్యత్తులో టీమిండియా స్టార్ బౌలర్గాఒకవేళ అతడు ఫిట్‌గా ఉండి.. ఇలాగే జోరు కొనసాగిస్తే.. భారత పేస్ దళంలో కీలక సభ్యుడిగా మారగలడు. భవిష్యత్తులో టీమిండియా స్టార్ బౌలర్‌గా ఎదగగల సత్తా అతడికి ఉంది’’ అని అశ్విన్.. 26 ఏళ్ల గుర్నూర్ బ్రార్‌తో పాటు సెలక్టర్లను ప్రశంసించాడు. అదే విధంగా.. హర్ష్ దూబే సైతం మున్ముందు జట్టుకు బాగా ఉపయోగపడతాడని అశూ అభిప్రాయపడ్డాడు. కాగా వర్షం వల్ల తొలి వన్డేను 25 ఓవర్లకు కుదించగా.. భారత్ అఫ్గన్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.చదవండి: 29 బంతుల్లోనే చహల్ సెంచరీ -
IND vs SL: కొంపముంచేశాడు.. భారత్‌కు భారీ షాక్!
శ్రీలంక, అఫ్గనిస్తాన్‌లతో ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్- ‘ఎ’ ఇప్పటికి రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. తొలుత ఆతిథ్య లంక జట్టుతో తలపడ్డ తిలక్ వర్మ సేన.. ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.అఫ్గన్ చేతిలో ఓటమిఅనంతరం అఫ్గన్-‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లో 349 పరుగుల మేర భారీ స్కోరు సాధించినప్పటికీ.. భారత జట్టుకు పరాభవం తప్పలేదు. వర్షం పదేపదే అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో అఫ్గన్ జట్టు డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.ఫలితంగా పాయింట్ల పట్టికలో అఫ్గనిస్తాన్ అగ్రస్థానానికి దూసుకుపోగా.. భారత్, శ్రీలంక రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అయితే, తర్వాతి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌పై గెలిచి లంక టాప్కు దూసుకెళ్లగా.. భారత్ రెండు, అఫ్గన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.మరోసారి శ్రీలంకతోఈ ట్రై సిరీస్‌లో భాగంగా భారత్ సోమవారం నాటి మ్యాచ్‌లో మరోసారి శ్రీలంకతో తలపడుతోంది. దంబుల్లా వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ 37, కెప్టెన్ తిలక్ వర్మ 23 పరుగులు చేశారు. మిగతా వారిలో ఆల్‌రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే (72), విప్రాజ్ నిగమ్ (51) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.రెండుసార్లు అదే తప్పుఅయితే, విప్రాజ్ చేసిన పొరపాటు వల్ల భారత్ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. భారత్-‘ఎ’ ఇన్నింగ్స్‌లో 35వ, 37వ ఓవర్లలో విప్రాజ్.. సింగిల్ తీసే క్రమంలో పిచ్ మధ్యలో పరిగెత్తాడు. ఎంసీసీ నిబంధన 41.14 ప్రకారం.. ఉద్వేశపూర్వకంగా గానీ, అనుకోకుండా గానీ పిచ్ మధ్యలో (ప్రొటెక్టెడ్ ఏరియా)కి వచ్చి డ్యామేజ్‌కు కారణమయ్యే పరిస్థితి తలెత్తితే తొలుత అంపైర్ సదరు స్ట్రైకర్‌ను హెచ్చరిస్తాడు.ఇదే తప్పు పునరావృతం చేస్తే బ్యాటింగ్ చేసే జట్టు స్కోరులో ఐదు పరుగుల మేర కోత విధిస్తారు. అయితే, ఇక్కడ తొలుత అనుకుల్ రాయ్ కూడా ఇలాంటి తప్పిదానికే పాల్పడగా.. అంపైర్ వార్నింగ్‌తో వదిలేశాడు. అయితే, విప్రాజ్ ఒకటి కాకుండా.. ఏకంగా రెండుసార్లు పిచ్ మధ్యలోకి రావడంతో మొత్తంగా భారత్‌కు పది పరుగుల మేర నష్టం కలిగింది.పది పరుగుల నష్టంఫలితంగా శ్రీలంక తమ ఇన్నింగ్స్‌ను 10/0తో మొదలుపెట్టింది. అంటే విప్రాజ్ తప్పిదం వల్ల ప్రత్యర్థికి అదనంగా పది పరుగుల మేర లాభం చేకూరింది. ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఈ ఆల్‌రౌండర్ చేసిన తప్పిదం దేనికి దారితీస్తుందో చూడాలి మరి!!చదవండి: హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ విండీస్ కైవసం -
శుబ్‌మన్ గిల్ గెలిపించగా...
అఫ్గాన్‌తో ఏకైక టెస్టులో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ రికార్డు విజయం సాధించిన భారత జట్టు... వన్డే సిరీస్‌లోనూ అదే ఆటతీరుతో బోణీ కొట్టింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో గుర్బాజ్ సెంచరీతో అఫ్గాన్ ఓ మాదిరి స్కోరుకు పరిమితం కాగా... అరంగేట్ర బౌలర్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో మూడు వికెట్లతో సత్తా చాటారు. అనంతరం ఛేదనలో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌కు రాహుల్, ఇషాన్ మెరుపులు తోడవడంతో టీమిండియా ముందంజ వేసింది.ధర్మశాల: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు... అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి పోరులో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయంకంటే నాలుగున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభం కాగా... ఆటను 25 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ (51 బంతుల్లో 102; 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (27; 3 ఫోర్లు), అజ్మతుల్లా (26; 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. ఆడిన తొలి వన్డేలోనే గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో 3 వికెట్లు పడగొట్టగా... అర్ష్ దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 22.5 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించగా... కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించారు. రోహిత్ శర్మ (16; 2 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (12; 1 ఫోర్) భారీ స్కోరు చేయలేకపోయారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, జియాఉర్ రహమాన్ చెరో వికెట్ పడగొట్టారు. గుర్బాజ్ సెంచరీ... భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను కుదించడంతో... మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ టి20 తరహా దూకుడు కనబర్చింది. గుర్నూర్ బ్రార్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఇబ్రహీం జద్రాన్ (1) అవుట్ కాగా... అర్ష్ దీప్ సింగ్ వరుస ఓవర్లలో సాధిఖుల్లా (0), రహమత్ షా (3)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో అఫ్గాన్ జట్టు 26/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ హష్మతుల్లా అండతో గుర్బాజ్ రెచ్చిపోయాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన గుర్బాజ్... ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న అతడు... 48 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. వన్డేల్లో అతడికిది తొమ్మిదో శతకం. ‘టెస్టు మ్యాచ్ అనంతరం నా బ్యాటింగ్‌కు సంబంధించి గౌతమ్ గంభీర్ సర్‌తో చర్చించా. షాట్ సెలక్షన్ విషయంలో గంభీర్ సలహాలు పాటించడంతోనే సెంచరీ చేయగలిగా’ అని మ్యాచ్ అనంతరం గుర్బాజ్ అన్నాడు. నాలుగో వికెట్‌కు 66 బంతుల్లోనే 116 పరుగులు జోడించిన అనంతరం గుర్బాజ్ అవుట్ కాగా... ఆ తర్వాత మిగిలినవారు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో అఫ్గాన్ ఆశించిన స్కోరు చేయలేకపోయింది. హర్ష్ దూబే, గుర్నూర్ అరంగేట్రం...గత కొంతకాలంగా టీమిండియా నెట్ బౌలర్‌గా కొనసాగుతున్న గుర్నూర్ బ్రార్... ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.మ్యాచ్ ఆరంభానికి ముందు అతడికి జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ భారత క్యాప్ అందించాడు. దేశవాళీల్లో సత్తాచాటిన స్పిన్నర్ హర్ష్ దూబేకు సైతం ఇదే తొలి వన్డే కాగా... అతడికి కేఎల్ రాహుల్ క్యాప్ అందజేశాడు.1 టీమిండియా తరఫున వన్డే మ్యాచ్ ఆడిన అతి పెద్ద (39 సంవత్సరాల 44 రోజులు) వయసు్కడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు.మొహిందర్ అమర్నాథ్ (39 సంవత్సరాల36 రోజులు) రెండో స్థానానికి చేరాడు.స్కోరు వివరాలుఅఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (బి) నితీశ్ రెడ్డి 102; ఇబ్రహీం (సి) గిల్ (బి) గుర్నూర్ 1; సాదిఖుల్లా (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 0; రహమత్ షా (సి) హర్ష్ దూబే (బి) అర్ష్ దీప్ 3; హష్మతుల్లా (సి) రాహుల్ (బి) హర్ష్ దూబే 27; అజ్మతుల్లా (స్టంప్డ్) ఇషాన్ (బి) హర్ష్ దూబే 26; నబీ (సి) అర్ష్ దీప్ (బి) నితీశ్ రెడ్డి 9; రషీద్ (బి) గుర్నూర్ 9; ఘజన్ఫర్ (సి) గిల్ (బి) హర్ష్ దూబే 0; జియాఉర్ (సి) అర్ష్ దీప్ (బి) గుర్నూర్ 4; సలీమ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (24.5 ఓవర్లలో ఆలౌట్) 194. వికెట్ల పతనం: 1–13, 2–16, 3–26, 4–142, 5–144, 6–172, 7–182, 8–182, 9–193, 10–194. బౌలింగ్: అర్ష్ దీప్ 5–0–27–2; గుర్నూర్ బ్రార్ 4.5–0–27–3; ప్రసిధ్ 5–0–35–0; హర్ష్ దూబే 5–0–47–3; సుందర్ 1–0–19–0; నితీశ్ రెడ్డి 4–0–31–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (రనౌట్) 16; గిల్ (నాటౌట్) 84; ఇషాన్ (బి) రషీద్ 34; శ్రేయస్ (సి) సలీమ్ (బి) జియాఉర్ 12; రాహుల్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (22.5 ఓవర్లలో 3 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–46, 2–116, 3–142. బౌలింగ్: అజ్మతుల్లా 3–0–28–0; జియా ఉర్ 4–0–39–1; ఘజన్ఫర్ 5–0–28–0; సలీమ్ 3.5–0–36–0; రషీద్ ఖాన్ 5–0–37–1; నబీ 2–0–26–0. -
గిల్, రాహుల్ విధ్వంసం.. టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాటింగ్‌లో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌తో యాంకర్ రోల్ పోషించాడు. చివర్లో కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్) ధనాదన్ ఇన్నింగ్స్‌తో తనదైన శైలిలో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్‌ఖాన్, రెహమాన్ షరిఫీ చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది.ఆఫ్గన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. హస్మతుల్లా (26), భారత బౌలర్లలో హర్ష్‌దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌లు 2 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం లక్నో వేదికగా జరగనుంది.Picture-Perfect 🙌#TeamIndia wrap a comprehensive victory by 7️⃣ wickets in Dharamshala ✅They lead the #INDvAFG ODI series by 1️⃣-0️⃣ 👌Scorecard ▶️ https://t.co/lCuohEZYAl @IDFCFIRSTBank pic.twitter.com/RNy13a0PHX— BCCI (@BCCI) June 13, 2026 -
గిల్ స్టన్నింగ్ క్యాచ్‌కు నోరెళ్లబెట్టాల్సిందే!
అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో శుబ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. హర్ష్ దూబే వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. హర్ష్‌దూబే వేసిన బంతిని అల్లా గజన్ఫర్ ఆఫ్ స్టంప్ ఔట్‌సైడ్ దిశగా ఆడాడు. అయితే స్లిప్‌లో ఉన్న గిల్ ఒక్క ఉదుటున డైవ్ చేసి సెకన్ల వ్యవధిలో ఒంటిచేత్తో క్యాచ్ అందుకోవడం విశేషం. ఇక గిల్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్‌కు గజన్ఫర్ నోరెళ్లబెట్టాడు.అయితే గిల్ పట్టిన క్యాచ్‌ను చాలా మంది టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో పోలుస్తున్నారు. ధోని తన ప్రైమ్‌టైమ్‌లో సెకన్ల వ్యవధిలోనే స్టంపింగ్‌లు చేసిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్‌దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌లు 2 వికెట్లు పడగొట్టారు. 🔹 1st ODI | IND 🇮🇳 vs AFG 🇦🇫 🔹IND 🇮🇳 : 4️⃣0️⃣-0️⃣ (5 Overs)Rohit* : 1️⃣5️⃣¹⁴Gill* : 1️⃣7️⃣¹⁷INDIA 🇮🇳 NEED 1️⃣5️⃣5️⃣ RUNS MORE TO WIN#INDvAFG #TeamIndia #INDvsAFG #ODI #Cricketpic.twitter.com/z9dUJRGKlK https://t.co/oL8hQj02gs— Cricket Lover 🏏 (@Crick97924Lover) June 13, 2026 What. A. Catch 🤯Captain Shubman Gill with an absolute stunner of a grab 🫡Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/jX2rAfSbtq— BCCI (@BCCI) June 13, 2026 -
అఫ్గన్‌తో వన్డే.. ఆ ఇద్దరి అరంగేట్రం.. జైసూకు నో ఛాన్స్
ఊగిసలాటల నడుమ టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డే నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. ధర్మశాలలో వర్షం కారణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు పడాల్సిన టాస్ ఆలస్యమైంది. వర్షం కారణంగా దాదాపు నాలుగు గంటలపాటు ఇటు ఆటగాళ్లు.. ఇటు ప్రేక్షకులు వేచి చూడాల్సిన పరిస్థితి.అయితే, సాయంత్రం ఐదు గంటల తర్వాత వాన తగ్గడంతో మైదానంలో కప్పిన కవర్లు తీసేసిన సిబ్బంది.. మ్యాచ్‌కు గ్రౌండ్‌ను సిద్ధం చేసింది. ఈ క్రమంలో 5.15 నిమిషాలకు టాస్ పడింది. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.ఆ ఇద్దరి అరంగేట్రంఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికెట్ పాత బడే కొద్ది బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా మారుతుందని భావిస్తున్నట్లు గిల్ తెలిపాడు. అదే విధంగా హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ ఈ మ్యాచ్‌తో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపాడు. కాగా విరాట్ కోహ్లి స్థానంలో వన్డే జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్‌కు తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఓపెనింగ్ జోడీగా గిల్- రోహిత్ శర్మ కొనసాతుండగా.. వన్‌డౌన్‌లో కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతున్నాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ సేవలు అందించనున్నాడు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడి సిరీస్‌కు దూరం కాగా.. ఆంధ్ర సీమ్‌బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. ఇక సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టిన యాజమాన్యం.. హర్ష్ దూబేకు తొలి అవకాశం ఇచ్చింది. పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణతో కలిసి గుర్నూర్ బ్రార్ బరిలోకి దిగుతున్నాడు.భారత తుదిజట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.అఫ్గనిస్తాన్ తుదిజట్టుఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ. -
మూడో స్థానం.. ఆ ముగ్గురికి అవకాశం: టీమిండియా కోచ్
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఫిట్‌నెస్‌కు మారుపేరైన ఈ రన్‌మెషీన్.. ప్రస్తుతం తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అఫ్గన్‌తో సిరీస్‌కు అతడు పూర్తిగా దూరమయ్యాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలే ప్రకటించింది.వన్డే జట్టులోకి జైస్వాల్ కోహ్లి స్థానంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే.. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న ఇషాన్ కిషన్‌కు కూడా అఫ్గన్‌తో వన్డే సిరీస్‌లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో కోహ్లి గైర్హాజరీలో వన్‌డౌన్‌లో ఎవరు ఆడతారన్న చర్చ నడుస్తోంది.ఓపెనర్లుగా జైసూ, ఇషాన్‌కు అనుభవం ఉంది. ఇక ఇషాన్ వన్‌డౌన్‌లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ ఈ జార్ఖండ్ డైనమైట్ వైపే మొగ్గుచూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆ ముగ్గురికీ అవకాశంఈ విషయంపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. అఫ్గనిస్తాన్‌తో శనివారం నాటి తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశం. కోహ్లికి బదులు ఇషాన్ లేదా కేఎల్ రాహుల్.. లేదంటే యశస్వి జైస్వాల్ ఎవరైనా ఆడవచ్చు.వాళ్లకు ఇదొక మంచి అవకాశం. మాకు మూడు వన్డేలు ఉన్నాయి. కాబట్టి వివిధ ఆప్షన్లు ప్రయత్నించడానికి అవకాశం దొరికింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టు కూర్పు దెబ్బతినకుండా ఉండేలా విభిన్నమైన ప్లేయర్లను ప్రయత్నించేందుకు ఇదో చక్కటి అవకాశం’’ అని మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యా లేదని.. అతడు మ్యాచ్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మోర్నీ మోర్కెల్ తెలిపాడు.చదవండి: వైభవ్ తమ్ముడి సూపర్ సెంచరీ -
IND vs AFG: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. గిల్ (67), శ్రేయస్ (6) పరుగులతో ఆడుతున్నారు.👉ఇషాన్ కిషన్ (34) రూపంలో టీమిండియా 116 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ బాదిన గిల్అఫ్గాన్తో మ్యాచ్‌లో కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 37 బంతుల్లో గిల్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది.👉10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (30), గిల్ (29) పరుగులతో ఆడుతున్నారు.రోహిత్ శర్మ రనౌట్.. తొలి వికెట్ డౌన్రోహిత్ శర్మ రనౌట్ కావడంతో టీమిండియా 46 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న టీమిండియా195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (15), శుబ్‌మన్ గిల్ (17) పరుగులతో ఆడుతున్నారు.ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్‌దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌లు 2 వికెట్లు పడగొట్టారు.ఐదో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్16.3: హర్ష్ దూబే బౌలింగ్‌లో హష్మతుల్లా (27) రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. హర్ష్‌కు వన్డేల్లో ఇదే తొలి వికెట్. నబీ క్రీజులోకి రాగా.. అజ్మతుల్లా రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 144-5(16.5).నాలుగో వికెట్ డౌన్15.3: నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో బౌల్డ్ అయిన రహ్మానుల్లా గుర్బాజ్. 51 బంతుల్లో 102 పరుగులు చేసి నిష్క్రమణ. స్కోరు: 143-4(16). హష్మతుల్లా 27, అజ్మతుల్లా ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.శతక్కొట్టిన రహ్మానుల్లా గుర్బాజ్48 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న అఫ్గనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 👉14 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 130-3 సెంచరీకి చేరువైన రహ్మానుల్లా గుర్బాజ్సెంచరీ కొట్టిన అఫ్గనిస్తాన్.. స్కోరు: 110-3(12)హష్మతుల్లా 17, రహ్మానుల్లా గుర్బాజ్ 86 పరుగులతో ఉన్నారు.రహ్మానుల్లాగుర్బాజ్ హాఫ్ సెంచరీ👉10 ఓవర్లు ముగిసేసరికి అఫ్గానిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. రహమనుల్లా గుర్బాజ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 25 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకుని.. అఫ్గన్ తరఫున రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు.ఆరు ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 35-3 (6)రహ్మానుల్లా 25 పరుగులతో ఉండగా.. హష్మతుల్లా 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు.మూడో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్4.3: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హర్ష్ దూబేకు క్యాచ్ ఇచ్చి అవుటైన రహ్మత్ షా (3). క్రీజులోకి హష్మతుల్లా షాహిది. రహ్మానుల్లా 20 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 26-3(4.4).రెండో వికెట్ డౌన్2.3: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన సెదీకుల్లా (0). అంపైర్ అవుట్ ఇవ్వగా.. అఫ్గన్ రివ్యూకు వెళ్లింది. అయితే, ఎల్బీడబ్ల్యూగా తేలడంతో సెదీకుల్లా మైదానం వీడాడు. రహ్మత్ షా క్రీజులోకి రాగా.. రహ్మానుల్లా 14 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 17-2(2.4)తొలి వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగిన ఇబ్రహీం జద్రాన్ (1). స్కోరు: 13-1(1.5). క్రీజులోకి సెదీకుల్లా రాగా.. రహ్మానుల్లా 11 పరుగులతో ఉన్నాడు.👉టాస్ గెలిచిన టీమిండియా.. తొలుత బౌలింగ్👉టీమిండియా తరఫున హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ అరంగేట్రంతుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.అఫ్గనిస్తాన్ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ.శుభవార్తవర్షం తగ్గుముఖం పట్టింది. సూర్యుడు మేఘాల మాటు నుంచి బయటకు వచ్చాడు. గ్రౌండ్ సిబ్బంది కవర్లు తీసేసి మాప్ చేస్తున్నారు. 5.45 నిమిషాలకు మ్యాచ్ మొదలుకానుంది. ఈ వన్డే మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ పవర్‌ప్లే ఐదు ఓవర్లు ఉంటుంది. ఐదుగురు బౌలర్లు తలా ఐదు ఓవర్లు బౌల్ చేస్తారు. 👉4.45PM: తగ్గుముఖం పట్టిన వాన.. మైదానంలోకి వచ్చిన గ్రౌండ్ సిబ్బంది.👉కొనసాగుతున్న చిరుజల్లులు👉మరోసారి భారీగా కురుస్తున్న వర్షం. 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహణకు కటాఫ్ టైమ్ సాయంత్రం 6.32 గంటలు.మ్యాచ్ జరిగేనా?👉తగ్గుముఖం పట్టిన వానవరుణుడు కరుణిస్తాడా?👉కొనసాగుతున్న జల్లులు👉మైదానంలోకి వచ్చి పరిశీలించిన హెడ్ క్యూరేటర్.. వాన తెరిపినిస్తేనే కవర్లు ఎత్తివేసే అవకాశంవాన మొదలు👉🌧️ధర్మశాలలో మొదలైన వాన👉రన్-అప్ ఏరియాపై కవర్లు కప్పిన సిబ్బందిటాస్ ఆలస్యంక్రికెట్ అభిమానులకు చేదు వార్త. టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డేకు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ధర్మశాలలో వాతావరణం మేఘావృతం కావడంతో టాస్ ఆలస్యం కానుంది. తాజా సమాచారం ప్రకారం.. ధర్మశాలలో వాన పడేందుకు 60- 70 శాతం అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తుదిజట్ల అంచనాభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్/యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్/ప్రిన్స్ యాదవ్.అఫ్గనిస్తాన్రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదీకుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇక్రమ్ అలికిల్ (వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, బిలామ్ సమీ/మహ్మద్ సలీం. -
మరికొన్ని గంటల్లో మ్యాచ్.. అంతలోనే స్టార్ క్రికెటర్ తండ్రి మరణం
భారత్-అఫ్గానిస్తాన్ మధ్య తొలి వన్డే ధర్మశాల వేదికగా శనివారం జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు అఫ్గాన్ క్యాంప్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్ క్రికెటర్ దర్విష్ రసూలీ తండ్రి గురువారం(జూన్ 11) కన్నుమూశారు.దీంతో వెంటనే రసూలీ తన కుటుంబానికి అండగా ఉండేందుకు ఉన్నపళంగా స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. ఈ విషయాన్ని శుక్రవారం జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అధికారికంగా ధృవీకరించాడు."దర్విష్ రసూలీ తండ్రి మరణించినట్లు మాకు గత రాత్రి తెలిసింది. ఇది చాలా బాధకరం. ఈ కష్టసమయంలో అతడు తన కుటుంబ సభ్యుల వద్ద ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతడు అఫ్గాన్‌కు తిరిగి వెళ్లిపోయాడు" అని షాహిదీ పేర్కొన్నాడు.ఇప్పుడు రసూలీ లేకపోవడంతో తుది జట్టు ఎంపికకు అఫ్గాన్ వద్ద 14 ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. యాదృఛ్చికంగా భారత్ వద్ద కూడా అంతే మంది ఉన్నారు. గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా స్ధానాన్ని బీసీసీఐ ఇంకా భర్తీ చేయలేదు.కాగా దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్న రసూలీ ఇప్పటివరకు ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ధర్మశాల వేదికగా అతడు భారత్‌పై వన్డే డెబ్యూ చేస్తాడని అంతా భావించారు. అంతలోనే అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.ఇప్పటికే అఫ్గానిస్తాన్ తరఫున 28 టీ20లు ఆడిన రసూలీకి లిస్ట్-ఎ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. అతడు 54.94 సగటుతో, 93.79 స్ట్రైక్ రేట్‌తో 3,022 పరుగులు చేశాడు. అతడు తిరిగి జూన్ 17న లక్నోలో జరిగే రెండో వన్డే సమయానికి జట్టుతో చేరే అవకాశముంది.అఫ్ఘనిస్తాన్ జట్టురహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), రహమత్ షా, ఇక్రమ్ అలీఖిల్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఘజన్ఫర్, బిలాల్ రాసోలీ, ఫాలీద్ సమీ, ఫాలీద్ సమీ, రెహమాన్ షరీఫీచదవండి: IND Vs AFG: రోహిత్ శర్మకు గాయం.. ఆఫ్గన్‌తో తొలి వన్డేకు డౌట్! -
రోహిత్ శర్మకు గాయం.. ఆఫ్గన్‌తో తొలి వన్డేకు డౌట్!
అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలినట్లుగా అనిపిస్తోంది. సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి చేతి వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. ప్రసిధ్ క్రిష్ణ వేసిన బంతిని ఆడే క్రమంలో రోహిత్ మిస్ చేయడంతో అతడి కుడిచేతి బొటనవేలిని బలంగా తాకింది. అయితే రోహిత్ శర్మ మాత్రం తన ప్రాక్టీస్‌ను కొనసాగించాడు. కానీ అర్ష్‌దీప్ సింగ్ వేసిన బంతులను ఆడడంలో రోహిత్ ఇబ్బంది పడడం చూస్తుంటే చేతివేలి గాయం పెద్దదిగానే కనిపిస్తోంది. దీంతో ఆఫ్గన్‌తో తొలి వన్డేలో రోహిత్ ఆడడం అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ రోహిత్ గాయంతో దూరమైతే గిల్‌తో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశముంది. అప్పుడు వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు రానున్నాడు. ఇక మరో సీనియర్ విరాట్ కోహ్లీ కండరాల గాయంతో ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే కోహ్లీ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని, ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని వార్తలు వస్తున్నాయి. అయితే 2027 వన్డే ప్రపంచకప్ రోహిత్, కోహ్లీకి చివరి టోర్నీ కానుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ ఇద్దరు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముంది. ఇక రోహిత్ గాయంతో దూరమయ్యే అవకాశాలు ఉంటే మాత్రం అతడి స్థానంలో జైస్వాల్ బరిలోకి దిగనున్నాడు.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్.Rohit Sharma very rusty in the nets so far. Prasidh Krishna delivery hits him on the right thumb, plenty hitting the maker’s mark on the bat and then thick outside edge to a Arshdeep Singh delivery. pic.twitter.com/65M2pKVVeF— Sahil Malhotra (@Sahil_Malhotra1) June 12, 2026చదవండి: ఫ్యాబ్-4: ఇద్దరు పోయారు.. మరో ఇద్దరు మిగిలారు! -
తుదిజట్టులో చోటు ఉండదు.. ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?
అఫ్గనిస్తాన్‌తో శనివారం నాటి తొలి వన్డే కోసం టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇందుకోసం శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే ధర్మశాలకు చేరుకుంది. కాగా అఫ్గన్‌తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ప్రధాన మార్పు జరిగిన సంగతి తెలిసిందే. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం వల్ల టీమిండియాకు దూరమయ్యాడు. ఐపీఎల్-2026 ఫైనల్ సందర్భంగా ఈ ఆర్సీబీ ఆటగాడు తొడకండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అఫ్గన్‌తో సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.ఈ నేపథ్యంలో వన్‌డౌన్ బ్యాటర్ కోహ్లి స్థానంలో.. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను వన్డే జట్టులోకి తీసుకుంది యాజమాన్యం. అయితే, రుతురాజ్ గైక్వాడ్‌ను కాదని జైసూను ఎందుకు తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు.రుతుకు బదులు జైసూను ఎంపిక చేసి సెలక్టర్లు మంచి పనే చేశారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘విరాట్ కోహ్లి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి రుతు శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్నాడు.అక్కడ భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఓ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో వచ్చి సెంచరీ చేశాడు. మరో మ్యాచ్‌లోనూ రాణించాడు. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు రుతును ఎంపిక చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. భారత్- ‘ఎ’ జట్టులో అతడు కీలక సభ్యుడు.ఒకవేళ టీమిండియాకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కదు. అలాంటపుడు కోహ్లి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?.. యశస్వి జైస్వాల్‌కు కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వరు. కాబట్టి రుతురాజ్ శ్రీలంకలో ఉండటమే కరెక్ట్.నిజానికి జైసూ అఫ్గనిస్తాన్‌తో చండీగఢ్‌లో టెస్టు మ్యాచ్ ఆడాడు. తొలి వన్డే కోసం అక్కడి నుంచి ధర్మశాలకు సులువుగానే చేరుకుంటాడు. తుదిజట్టులో యశస్వి జైస్వాల్‌కు బదులు ఇషాన్ కిషన్‌నే ఆడిస్తారు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున ఆడిన తమ చివరి వన్డేల్లో రుతు, జైసూ శతకాలు బాదడం విశేషం.ఇదిలా ఉంటే.. శనివారం ధర్మశాల వేదికగా టీమిండియా అఫ్గనిస్తాన్‌తో తొలి వన్డే ఆడనుంది. ఓపెనర్లుగా కెప్టెన్ శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ బరిలోకి దిగనుండగా.. వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. కాబట్టి జైసూ బెంచ్‌కే పరిమితమయ్యే పరిస్థితి. -
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. కోహ్లీ విషయంలో కీలక ప్రకటన!
అప్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు గాయంతో దూరమైన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విషయంలో ఒక కీలక అప్డేట్ వచ్చింది. కండరాల గాయంతో బాధపడుతున్న కోహ్లీ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూలైలో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని సమాచారం. ఈ లెక్కన అభిమానులకు కోహ్లీ విషయంలో ఇది గుడ్‌న్యూస్.జూలై 14 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఐపీఎల్ 2026 సీజన్ సమయంలోనే కోహ్లీ కండరాల గాయంతో సతమతమయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో చివరిదాకా బ్యాటింగ్ చేయడంతో కోహ్లీ కండరాల గాయం తీవ్రత పెరిగిపోయింది. దీంతో ఫైనల్ పూర్తయిన మరుసటి రోజే కోహ్లీ తన కాలిని స్కాన్ చేయించుకున్నాడు. రిపోర్ట్‌లో కోహ్లి కాలిలో ఉండే డిస్టల్ సెమిమెంబ్రానోనస్ టెండన్ టియర్‌లో చీలిక వచ్చినట్లు తేలింది. డిస్టల్ సెమిమెంబ్రానోనస్ అనేది మోకాలి వెనుక భాగంలో ఉంటుంది. దీనిలో చీలిక వస్తే అది కాలి కండరాలను తీవ్రంగా బాధిస్తోంది. ఇది అత్యంత అరుదుగా జరుగుతుందని, కోలుకోవడానికి ఒక్కోసారి ఆరు నెలలు సమయం పడుతుందని వైద్యబృందం తెలిపింది. కానీ కోహ్లీ విషయంలో అద్భుతం జరిగిందని, అతడి అసామాన్యమైన ఫిట్నెస్ కారణంగా నాలుగు వారాల్లోనే పూర్తిగా కోలుకుంటాడని పేర్కొన్నారు. దీంతో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీ అందుబాటులో ఉంటాడనే వార్తలు వస్తున్న వేళ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్లో ఇప్పటికే చాలా రికార్డులు తన పేరిట లిఖించుకున్న కోహ్లీ సచిన్ వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డును అందుకుంటాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. 37 ఏళ్ల కోహ్లీ కెరీర్లో ఇప్పటివరకు 85 అంతర్జాతీయ సెంచరీలున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ కోహ్లీకి ఆఖరి టోర్నీ అని ప్రచారం జరుగుతున్న వేళ టీమిండియా ఆ టోర్నీ వచ్చేలోగా స్వదేశం, విదేశం కలిపి సుమారు 28 నుంచి 30 వన్డేల వరకు ఆడే అవకాశముంది. ఇందులోనే ఆసియా కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ ఉన్నాయి. ఈ లెక్కన సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లీకి ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు.చదవండి: భారత తుది జట్టు ఇదే.. అతడికి నో ఛాన్స్! యార్కర్ల కింగ్ అరంగేట్రం? -
IND vs AFG: భారత్‌కు భారీ షాక్.. అఫ్గన్ అనూహ్య విజయం
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్- ‘ఎ’ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. అఫ్గనిస్తాన్- ‘ఎ’ జట్టుతో గురువారం నాటి మ్యాచ్‌లో తిలక్ వర్మ సేన ఓటమి పాలైంది.తొలుత ఆతిథ్య శ్రీలంక- భారత్ మధ్య మ్యాచ్ జరుగగా.. భారత్ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. ఈ క్రమంలో గురువారం అఫ్గన్‌తో తలపడ్డ భారత జట్టు.. దంబుల్లాలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అదరగొట్టిన భారత బ్యాటర్లుగత మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఈసారి అదరగొట్టారు. ప్రభ్‌సిమ్రన్ 69 బంతుల్లో 84 పరుగులు సాధించగా.. వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లోనే 44 పరుగులతో దుమ్ములేపాడు.మూడో స్థానంలో వచ్చిన ప్రియాన్ష్ ఆర్య (8) విఫలం కాగా.. నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 80 బంతుల్లో 66, కెప్టెన్ తిలక్ వర్మ 73 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించారు. మిగతా వారిలో ఆయుశ్ బదోని డకౌట్ కాగా.. సూయాన్ష్ షెడ్గే (40) మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అర్షద్ ఖాన్ (1), విప్రాజ్ నిగమ్ (8) ఇలా వచ్చి అలా వెళ్లారు. అనుకుల్ రాయ్ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.349 పరుగుల భారీ స్కోరుఇక వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించగా.. భారత్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గనిస్తాన్ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్జాయ్ ఐదు వికెట్లతో అదరగొట్టగా.. ఫర్మానుల్లా సఫీ మూడు వికెట్లు, కెప్టెన్ ఇమ్రాన్ మిర్ ఒక వికెట్ పడగొట్టారు.పదే పదే ఆటంకంఅనంతరం అఫ్గన్ లక్ష్య ఛేదనకు దిగగా వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. అఫ్గన్ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో ఓపెనర్లు ఇమ్రాన్ మిర్, హసన్ ఐసాఖిల్ అఫ్గన్‌కు శుభారంభం అందించారు.ఇమ్రాన్ 70 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 75 పరుగులతో అజేయంగా నిలవగా.. హసన్ 29 బంతుల్లో 34 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. వన్‌డౌన్ బ్యాటర్ ఖలీద్ తనీవాల్ (2) మాత్రం విఫలమయ్యాడు. అయితే, ఓపెనర్ ఇమ్రాన్‌కు తోడుగా బహీరీ షా పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు.సారథితో పాటు పట్టుదలగా నిలబడ్డ బహీర్బహీర్ 52 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 51 పరుగులతో ఇమ్రాన్‌తో కలిసి అజేయంగా నిలిచాడు. అయితే, అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్‌లో 25.5 ఓవర్లు పూర్తైన తర్వాత మరోసారి వర్షం ఆటంకం కలిగించింది. అప్పటికి అఫ్గన్ రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.భారత్ ఓటమిఅయితే, ఆ తర్వాత వర్షం మరింత ఎక్కువైంది. దీంతో డక్‌వర్త్ లూయీస్ పద్దతి ప్రకారం నిర్ణీత ఓవర్లలో భారత్ కంటే అఫ్గన్ జట్టు ఆధిక్యంలో నిలిచినట్లయింది. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు. భారత్‌పై అనూహ్య రీతిలో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో అఫ్గనిస్తాన్ విజయం సాధించింది.ఇక ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ట్రై సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్ ఒక గెలుపు, ఒక ఓటమి నమోదు చేసింది. మరోవైపు.. అఫ్గన్ ఆడిన ఒక్కటీ గెలిచి రెండు పాయింట్లతో పట్టికలో ప్రథమ స్థానంలో నిలవగా.. భారత్ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్‌రన్‌రేటు పరంగా వెనుకబడి రెండో స్థానంలో ఉంది. ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఓడిన లంక చివరి స్థానంలో నిలిచింది.చదవండి: భారత జట్టులోకి ద్రవిడ్ కుమారుడు -
BCCI: అవును.. అతడు జట్టుకు దూరమయ్యాడు!
అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత జట్టు ముల్లన్పూర్ నుంచి ధర్మశాలకు పయనమైంది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ.. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ విమానంలో బయల్దేరారు. జైస్వాల్‌కు చోటుఇక లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం వల్ల అఫ్గన్‌తో వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్‌కు జట్టులో చోటు దక్కింది. మరోవైపు.. రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ తెచ్చుకున్నాడు.రోహిత్ పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం ఫిట్నెస్ సాధించి జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఆ తర్వాత దురదృష్టవశాత్తూ తొడకండరాలు పట్టేశాయి. దీంతో దాదాపు రెండు వారాల పాటు ఆటకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కానీ పాండ్యా గాయం గురించి అధికారిక ప్రకటన రాలేదు.అతడు జట్టుకు దూరమయ్యాడు!ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ విషయం గురించి తాజాగా స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ‘‘అవును.. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. గాయం వల్ల అతడు అందుబాటులో ఉండటం లేదు.అతడి స్థానంలో వేరే ఆటగాడిని తీసుకోవాలా? లేదంటే పద్నాలుగు మందితోనే జట్టును కొనసాగించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు.నితీశ్ రెడ్డి ఉన్నాడుగాకాగా ఇప్పటికే హార్దిక్‌కు బ్యాకప్‌గా మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని అఫ్గన్‌తో వన్డేలకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందుకే రీప్లేస్మెంట్ గురించి సెలక్టర్లు ఆలోచించడంలేదని తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. అఫ్గన్‌తో ముల్లన్పూర్ వేదికగా టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తదుపరి జూన్ 13, 17, 20 తేదీల్లో మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ధర్మశాల, లక్నో, చెన్నై ఇందుకు వేదికలు. చదవండి: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు -
IND vs AFG ODI: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్-‘ఎ’ జట్టు సత్తా చాటింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ ఈసారి సత్తా చాటగా.. రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ తిలక్ వర్మ మరోసారి రాణించారు. ఫలితంగా నిర్ణీత 49 ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 349 పరుగులు సాధించింది.తొలి మ్యాచ్ శ్రీలంకతోశ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, భారత్, అఫ్గన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ మంగళవారం మొదలైంది. తొలి మ్యాచ్‌లో భారత్- శ్రీలంక తలపడగా.. తిలక్ వర్మ సేన ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.లంకతో మ్యాచ్‌లో ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (14), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ (101) శతకంతో రాణించాడు. తిలక్ వర్మ 60 పరుగులతో రాణించాడు. ఇక తొలి మ్యాచ్‌లో గట్టెక్కిన భారత్.. రెండో మ్యాచ్‌లో భాగంగా గురువారం అఫ్గన్‌పై భారీ స్కోరు సాధించింది.అఫ్గన్‌పై చెలరేగిన ఓపెనర్లు దంబుల్లా వేదికగా టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69 బంతుల్లో 84), వైభవ్ సూర్యవంశీ (22 బంతుల్లోనే 44) శుభారంభం అందించారు. ప్రభ్‌సిమ్రన్ ఆచితూచి ఆడగా.. వైభవ్ ధనాధన్ దంచికొట్టాడు.రుతు, తిలక్ మరోసారి..వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియాన్ష్ ఆర్య (8) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ 80 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. కెప్టెన్ తిలక్ వర్మ 73 బంతులు ఎదుర్కొని 66 రన్స్ రాబట్టాడు. మిగిలిన వారిలో ఆయుశ్ బదోని డకౌట్ కాగా.. సూయాన్ష్ షెడ్గే (40) రాణించాడు. అనుకుల్ రాయ్ 16 పరుగులతో అజేయంగా నిలవగా.. అర్షద్ ఖాన్ (1), విప్రాజ్ నిగమ్ (8) ఇలా వచ్చి అలా వెళ్లారు. 49 ఓవర్లు ఎందుకంటే?వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించగా.. భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. అఫ్గన్ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్జాయ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. ఫర్మానుల్లా సఫీ మూడు వికెట్లు, కెప్టెన్ ఇమ్రాన్ మిర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అఫ్గన్ లక్ష్యం 294వర్షం మరోసారి ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం అఫ్గనిస్తాన్ టార్గెట్‌ను 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్దేశించారు.చదవండి: ఆసీస్ జట్టులో నిఖిల్ చౌదరి -
ఆస్ట్రేలియాకు ఘోర అవమానం.. 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే
బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో ఘోర ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియాలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఢాకా వేదికగా జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆసీస్ టాపార్డర్ బ్యాటర్లు తేలిపోయారు. బంగ్లా పేస్ బౌలర్ల ధాటికి కంగారులు కంగారెత్తిపోతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది.టాస్కిన్ అహ్మద్ వేసిన మొదటి ఓవర్లో నాలుగో బంతికి మాథ్యూ షార్ట్ ఖాతా తెరవకుండానే క్లీన్ బౌల్డయ్యాడు. అంతకుముందు తొలి వన్డేలో కూడా ఇదే తరహాలో షార్ట్ అవుటయ్యాడు. ఆ తర్వాత రెండో ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ పర్యాటక జట్టను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తొలి బంతికి కూపర్ కొన్నోలీ(0).. ఆఖరి బంతికి రెన్షా(0) వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. దీంతో ఆస్ట్రేలియా తమ స్కోర్ బోర్డు ఖాతా తెరవకుండానే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తద్వారా ఆసీస్ ఓ చెత్త రికార్డును మూట కట్టుకుంది. ఆస్ట్రేలియా తమ 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఒక్క పరుగు కూడా బోర్డుపై లేకుండా 3 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.అంతేకాకుండా ఈ ఘోరమైన రికార్డు నమోదు చేసిన తొలి ఆసియా యేతర జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇంతకుముందు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్, సౌతాఫ్రికాపై ఈ చెత్త రికార్డును నమోదు చేసింది. తాజాగా కంగారులు కూడా ఈ జాబితాలో చేరారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 23 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. కెప్టెన్ జోష్ ఇంగ్లిష్(34), గ్రీన్(25) కాసేపు బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. కానీ ఇంగ్లిష్ ఔటయ్యాకు ఆసీస్ వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. కాగా బంగ్లా పర్యటనకు ముందు పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను కూడా 2-1 తేడాతో ఆస్ట్రేలియా కోల్పోయింది. మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, కమ్మిన్స్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.చదవండి: Vaibhav suryavanshi: మనోడు ఏం మారలే.. శ్రీలంక గడ్డపై విధ్వంసం -
టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్?
అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కాగా.. తాజాగా ఈ జాబితాలోకి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేరాడు. పాండ్యా ఇటీవల బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తన ఫిట్నెస్ టెస్ట్‌ను క్లియర్ చేశాడు. దీంతో అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌లో పాల్గోనేందుకు బీసీసీఐ వైద్య బృందం అనుమతి ఇచ్చింది.అయితే క్లియరన్స్ లభించిన కొన్ని గంటల్లోనే హార్దిక్ మళ్లీ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో పాండ్యాకు పక్కటెముకల గాయమైంది. ఈ నేపథ్యంలోనే అఫ్గాన్ సిరీస్ నుంచి వైదొలిగాడు. అతడు కోలుకోవడానికి కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. జూలైలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కూడా ఈ బరోడా ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది.టీమిండియాలోకి అర్షద్?ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా స్ధానాన్ని భర్తీ చేయగల పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు వేటను మొదలు పెట్టారు. దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న మధ్యప్రదేశ్ ఆల్ రౌండర్ అర్షద్ ఖాన్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అర్షద్ ప్రస్తుతం ఇండియా-ఎ జట్టుతో పాటు శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక-ఎతో జరిగిన మ్యాచ్‌లో అర్షద్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. చివరి రెండు ఓవర్లలో శ్రీలంక విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. 48వ ఓవర్ వేసిన అర్షద్ ఊహకందని అద్భుతం చేశాడు. ఆ ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి భారత్‌కు సంచలన విజయాన్ని అందించాడు. ఈ ఎడమచేతి వాటం పేసర్ పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలో కూడా బాగా రాణించగలడు. కేవలం బౌలర్‌గానే కాకుండా లోయర్ ఆర్డర్లో భారీ సిక్సర్లు బాదగల సత్తా అతడిది. గత ఐపీఎల్ సీజన్లలోనూ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో అర్షద్ బ్యాట్‌తో మెరుపు మెరిపించాడు. అర్షద్ ఇప్పటివరకు 9 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. అయితే పాండ్యా స్ధానంలో సెలక్టర్లు అర్షద్‌కు అవకాశమిస్తారో లేదో చూడాలి మరి. జూన్ 13 నుంచి ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: IND vs AFG: టీమిండియాతో వన్డే సిరీస్.. అప్గాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం -
భారత్‌తో వన్డే సిరీస్.. అప్గాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్ట్‌లో 6 వికెట్లు పడగొట్టిన యువ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సలీమ్ సఫీకి ఇప్పుడు వన్డే జట్టులో కూడా చోటు కల్పించారు. ఈ ఏకైక టెస్ట్‌లో అఫ్గాన్ ఓడిపోయినప్పటికి, సఫీ మాత్రం తన అద్భుత బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. ముల్లాన్‌పూర్‌లో తీవ్రమైన వేడిని తట్టుకుని మరి సఫీ ఏకంగా 27 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ స్పీడ్‌స్టర్ భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లయిన యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడిని వన్డే జట్టులో చేర్చారు.2023లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన 23 ఏళ్ల మహ్మద్ సలీమ్ సఫీ.. ఇప్పటివరకు అఫ్గానిస్తాన్ తరపున కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ అతడికి అఫ్గాన్ వన్డే జట్టులో చోటు దక్కింది.నబీ, రషీద్ దూరం!కాగా మొహాలీలో బుధవారం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్‌కు సీనియర్ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ రషీద్ ఖాన్ దూరమయ్యాడు. జూన్ 13న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేకు ముందు రషీద్ నేరుగా జట్టుతో కలవనున్నాడు. 41 ఏళ్ల మహ్మద్ నబీ మాత్రం 'అనారోగ్యం' కారణంగా ఈ ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. కాగా ఈ వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురు దెబ్బతగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు. అదేవిధంగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు.వన్డే సిరీస్ షెడ్యూల్మొదటి వన్డే- జూన్ 13- ధర్మశాలరెండో వన్డే-జూన్ 17-లక్నోమూడో వన్డే-జూన్ 20-చెన్నైవన్డే సిరీస్‌కు జట్లు భారత్శుభ్మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ,యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, , ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబె, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, గుర్నూర్ బ్రార్అఫ్గానిస్తాన్హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, రహ్మత్ షా, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోతై, రహ్మత్ ఝాన్ఫార్, ఘాజాయ్ మాలిక్, బిలాల్ సామి, సలీమ్ సఫీచదవండి: IND vs ENG: 'అతడు పేరుకే ఆల్‌రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ' -
మళ్లీ గాయపడిన పాండ్యా.. ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు దూరం!
అప్గానిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో దూరమయ్యాడు. అయితే మంగళవారమే రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా తమ ఫిట్నెస్ను నిరూపించుకొని క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందినట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరు ఆడుతారని బీసీసీఐ తెలిపింది. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. రీఎంట్రీ కోసం సీవోఈలో శిక్షణ తీసుకుంటున్న పాండ్యా బౌలింగ్ వేస్తున్న క్రమంలో అతడి కాలు బెణికినట్లు సమాచారం. దీంతో అతడు కోలుకోవడానికి మరో రెండు వారాలు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. స్వల్ప గాయం కావడంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని మెడికల్ టీమ్ వెల్లడించింది. దీంతో ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు పాండ్యా దూరమైనట్లే. బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇక సీవోఈ నుంచి క్లియరెన్స్ పొందిన రోహిత్ శర్మ మాత్రం ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఇటీవలే ఐపీఎల్ 2026 సీజన్లో పాండ్యా వెన్నునొప్పికి గురయ్యాడు. దీంతో సీజన్ ఆఖర్లో ముంబై జట్టుకు దూరమైన పాండ్యా నేరుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరానికి చేరుకున్నాడు. పాండ్యా కోలుకొని ఫిట్నెస్ క్లియరెన్స్ కూడా సాధించడంతో అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఈ ఆల్‌రౌండర్ మళ్లీ గాయానికి గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో చీలమండ గాయంతో పాండ్యా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఇక హార్దిక్ పాండ్యా తన చివరి వన్డే మ్యాచ్‌ను 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అప్పటినుంచి పాండ్యా వరుస గాయాలతో సతమతమవుతూనే వస్తున్నాడు.చదవండి: మెస్సీ విజృంభణ.. అర్జెంటీనా ఘన విజయం -
గెలిచామన్న గర్వం.. రెచ్చిపోయిన బంగ్లా బౌలర్!
బంగ్లాదేశ్ తమ సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 21 ఏళ్ల తర్వాత ఆసీస్‌ను మట్టికరిపించిన బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే గెలిచామన్న గర్వమో లేక పొగరో తెలియదు కానీ బంగ్లాదేశ్ బౌలర్ నహిద్ రానా ఆస్ట్రేలియా కెప్టెన్ జోస్ ఇంగ్లిస్‌ను స్లెడ్జింగ్ చేయడం మ్యాచ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. విషయంలోకి వెళితే.. 285 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా, మార్నస్ లబుషేన్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. దీంతో కూపర్‌కు జత కలిసిన ఇంగ్లిస్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. వీరి మధ్య భాగస్వామ్యం బలపడుతున్న తరుణంలో నహీద్ రానా 11వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతికే ఇంగ్లిస్‌ను పెవిలియన్ చేర్చాడు. ఔట్‌సైడ్ అయిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో ఇంగ్లిస్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఇంగ్లిస్ పెవిలియన్ వైపు వెళుతున్న తరుణంలో నహీద్ రానా అతడిని ఉద్దేశించి ఏదో అన్నాడు. ఇది విన్న ఇంగ్లిస్ నేరుగా నహీద్ రానావైపు దూసుకొచ్చి ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన బంగ్లా కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ ఇంగ్లిస్‌ను అడ్డుకొని అక్కడి నుంచి పంపించేశాడు. ఆ తర్వాత నహీద్ రానా వద్దకు వచ్చిన మెహదీ హసన్.. ఎమోషన్ కంట్రోల్ చేసుకో అని అనడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిద్ హసన్ తమీమ్ (54), నజ్ముల్ హొస్సేన్ షాంటో (67) కూడా అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 3 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (52) ఒక్కడే అర్ధశతకంతో పోరాడాడు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కంగారు పడిపోయారు. ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం అంతరాయం కలిగించింది. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్‌ను విజేతగా ప్రకటించారు. Big Wicket for Bangladesh! Josh Inglis departs. Caught by Litton Das, bowled by Nahid Rana! pic.twitter.com/waRZRvW6mX— Bangladesh Cricket (@BCBtigers) June 9, 2026చదవండి: 'అతడు పేరుకే ఆల్‌రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ' -
IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ మీద 300 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో ఈ మ్యాచ్ భాగం కాదు.కాబట్టి అఫ్గన్‌తో టెస్టు, విజయంతో టీమిండియాకు పెద్దగా చేకూరే ప్రయోజనం ఏమీ లేదు. అయితే, కావాల్సినంత ప్రాక్టీస్ మాత్రం దొరికింది. మానవ్ సుతార్ (లెఫ్టార్మ్ స్పిన్నర్) వంటి కొత్త ఆటగాడు తనను తాను నిరూపించుకునే ఓ వేదిక దొరికింది.మూడు వన్డేలుఇదిలా ఉంటే.. జూన్ 13, 17, 20 తేదీల్లో టీమిండియా అఫ్గనిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడనుంది. అయితే, గాయం వల్ల విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.మరోవైపు.. ఇషాన్ కిషన్ సైతం చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక గాయాల నుంచి కోలుకుని ఓపెనర్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించారు. దీంతో అఫ్గన్‌తో తొలి వన్డేకు భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది.ఇషాన్ వద్దు.. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్‌కు బదులు యశస్వి జైస్వాల్‌కు పెద్ద పీట వేయాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. ఓపెనర్‌గా కాకుండా మూడో స్థానంలోనూ జైసూ రాణించగలడని అభిప్రాయపడ్డాడు.స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘అఫ్గన్‌తో వన్డేలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడు. యశస్వి జైస్వాల్‌ను వన్‌డౌన్‌లో ఆడించాలి. శ్రేయస్ అయ్యర్ నాలుగు, కేఎల్ రాహుల్ ఐదు, హార్దిక్ పాండ్యా ఆరు, వాషింగ్టన్ సుందర్ ఏడు, హర్ష్ దూబే ఎనిమిదో స్థానంలో ఆడాలి.పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు గుర్నూర్ బ్రార్‌ను ఆడించాలి. స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఉండనే ఉన్నాడు’’ అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు. తాను ఎంపిక చేసిన తుదిజట్టులో ఇషాన్ కిషన్‌కు చోటు ఇవ్వలేదు.జైసూను ఆడిస్తారా?ఐపీఎల్-2026 సందర్భంగా బరిలో దిగిన యశస్వి జైస్వాల్ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా.. 16 మ్యాచ్‌లు ఆడి 427 పరుగులు సాధించాడు. మరోవైపు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్ కిషన్ 602 పరుగులతో దుమ్ములేపాడు.అంతేకాదు సీజన్ ఆరంభంలో ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు ఇషాన్. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలోనూ సత్తా చాటాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇషాన్‌ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. అభిషేక్ నాయర్ మాత్రం జైసూకు ఓటేయడం విశేషం.అఫ్గనిస్తాన్‌తో తొలి వన్డేకు అభిషేక్ నాయర్ ఎంచుకున్న జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్.చదవండి: సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ -
టీమిండియాలో చోటివ్వరా? శతకంతో కదం తొక్కాడు!
టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ శతక్కొట్టాడు. శ్రీలంక-‘ఎ’ జట్టుతో తొలి వన్డేలో సెంచరీతో మెరిసి జట్టును ఆదుకున్నాడు. ముక్కోణపు వన్డే సిరీస్ ఆడేందుకు భారత్- ‘ఎ’ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో పాటు అఫ్గనిస్తాన్‌తో భారత్ వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో తొలుత శ్రీలంకతో పోరుకు భారత్ సిద్ధమైంది. దంబుల్లా వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.వైభవ్ విఫలం..అయితే, ఆదిలోనే శ్రీలంక భారత్‌కు షాకిచ్చింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2), వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 14)లను పెవిలియన్‌కు పంపి దెబ్బకొట్టింది. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియాంశ్ ఆర్య 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.శతకంతో కదంతొక్కాడుఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ శతకంతో కదంతొక్కాడు. మొత్తంగా 114 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. కెప్టెన్ తిలక్ వర్మ (97 బంతుల్లో 60)తో కలిసి 185 బంతుల్లో 150 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు.మిగిలిన వారిలో ఆయుశ్ బదోని 24, సూర్యాంశ్ షెడ్గే 26 పరుగులతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన భారత్ 277 పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో మహ్మద్ షిరాజ్ రెండు వికెట్లు దక్కించుకోగా.. చమిక కరుణరత్నె, గరుక సంకేత్, వనుజా సాహన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అఫ్గనిస్తాన్‌తో వన్డేలకు ఎంపిక చేయని సెలక్టర్లుచివరగా సౌతాఫ్రికాతో వన్డేలో టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ తర్వాత సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు. అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో జూన్ సిరీస్‌కు రుతురాజ్‌ను ఎంపిక చేయలేదు.స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయపడగా.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌కు ఆఖరి నిమిషంలో చోటిచ్చారు. ఇలాంటి తరుణంలో రుతురాజ్ భారత్-ఎ తరఫున శతక్కొట్టడం విశేషం. దీంతో తనను విస్మరించిన టీమిండియా సెలక్టర్లకు రుతు బ్యాట్‌తోనే గట్టి సమాధానం ఇచ్చాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: కొడితే సెంచరీ.. లేదంటే డకౌట్! -
ODI WC: కొంప ముంచిన వర్షం.. విండీస్‌కు తప్పని గండం!
సొంతగడ్డపై వెస్టిండీస్ చతికిలపడింది. పర్యాటక శ్రీలంక జట్టుకు వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఫలితంగా వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి నేరుగా అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా అక్టోబరు- నవంబరు మధ్య ఈ మెగా ఈవెంట్ జరుగనున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా విండీస్ జట్టు స్వదేశంలో శ్రీలంకతో మూడు వన్డేలు ఆడేందుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టు చేతిలో 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత రెండు వన్డేలు వర్షం వల్ల రద్దైపోయాయి. దీంతో సిరీస్ 1-0తో శ్రీలంక వశమైంది.పదో స్థానంలో...ఫలితంగా వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి వెస్టిండీస్ నేరుగా అర్హత సాధించే అవకాశాలు సన్నగిల్లాయి. కాగా శ్రీలంకతో సిరీస్ ద్వారా ఈ సైకిల్ (2023-2027)లో విండీస్ ఇప్పటికి 32 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది.ఇందులో 11 గెలిచి, 18 ఓడిపోయింది. మిగిలిన మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దైపోయాయి. దీంతో మొత్తంగా 73 రేటింగ్ పాయింట్లతో వెస్టిండీస్ పట్టికలో పదో స్థానంలో ఉంది.టాప్-8లో ఉన్న జట్లు మాత్రమేకాగా పట్టికలో టాప్-8లో ఉన్న జట్లు మాత్రమే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు ఆతిథ్య దేశాలు ఆటోమేటిక్‌గా టోర్నీలో అడుగుపెడతాయి.ఇక విండీస్‌కు ఈ సైకిల్లో దాదాపుగా తొమ్మిది మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. స్వదేశంలో జూలైలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు ఆడనున్న కరేబియన్ జట్టు.. తదుపరి భారత పర్యటనలో మూడు వన్డేలు ఆడుతుంది. అనంతరం అఫ్గనిస్తాన్‌కు మూడు వన్డేల కోసం ఆతిథ్యం ఇస్తుంది. వరుసగా రెండోసారి..ఈ సిరీస్‌లలో వెస్టిండీస్ మెరుగైన ప్రదర్శనతో గెలవాల్సి ఉంటుంది. వర్షం వల్ల ఈ మ్యాచ్‌లకు ఆటంకం కలిగితే విండీస్ అవకాశాలు మరింత సన్నగిల్లడం ఖాయం. అదే జరిగితే వెస్టిండీస్ వరుసగా రెండోసారి గ్లోబల్ క్వాలిఫయర్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది.ఇందులో నాలుగు స్థానాల కోసం పది జట్లు పోటీలో ఉంటాయి. ఉదాహరణకు.. స్కాట్లాండ్, నమీబియా, ఐర్లాండ్ వంటి చిన్నజట్లు రీజినల్ క్వాలిఫయర్స్‌లో సత్తా చాటడం ద్వారా గ్లోబల్ క్వాలిఫయర్‌లో అడుగుపెడతాయి. కాగా గత ఎడిషన్‌లో వెస్టిండీస్‌కు ఈ టోర్నీలో ఘోర పరాభవం ఎదురైంది.గత ఎడిషన్‌కు అర్హత సాధించకుండానే..స్కాట్లాండ్, నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయి.. వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి అర్హత సాధించకుండానే వెస్టిండీస్ వెనుదిరిగిన సంగతి తెలిసిందే. రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు ఈ మేరకు అర్హత కూడా సాధించకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.ఇక ప్రస్తుతం పటిష్టమైన ప్రత్యర్థులు న్యూజిలాండ్, టీమిండియాపై వెస్టిండీస్ సత్తా చాటాల్సి ఉంది. అఫ్గనిస్తాన్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుత సైకిల్లో కూడా విండీస్‌కు క్వాలిఫయర్స్ ఆడే గండం తప్పకపోవచ్చని అనిపిస్తోంది. చదవండి: పాకిస్తాన్ కంటే ప్రమాదకరమా? అని అడిగాను -
మూడో వన్డే రద్దు.. లంక కెప్టెన్ అరుదైన ఫీట్!
వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరగాల్సిన మూడో వన్డే వర్షార్పణమైంది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను లంక 1-0తో కైవసం చేసుకుంది. దీంతో విండీస్ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన మూడో కెప్టెన్‌గా కుశాల్ మెండిస్ నిలిచాడు. గతంలో అర్జున రణతుంగ, ఆటపట్టు ఈ ఫీట్‌ను సాధించారు. జమైకా వేదికగా జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.కనీసం టాస్ వేసేందుకు కూడా వరుణుడు అవకాశం కల్పించలేదు. గ్రౌండ్‌ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని, మ్యాచ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండో వన్డే కూడా వర్షార్పణమైన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో మాత్రం శ్రీలంక జట్టు 41 పరుగుల తేడాతో గెలిచింది. కరీబియన్ గడ్డపై 13 ఏళ్ల తర్వాత లంక విజయం సాధించడం విశేషం. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ గురువారం నుంచి మొదలుకానుంది. ఆ తర్వాత రెండు టెస్టు మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి.చదవండి: రోహిత్, పాండ్యా ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్! -
రోహిత్, పాండ్యా ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్!
అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పాండ్యాకు బీసీసీఐ సీఓఈ స్పోర్ట్స్ బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన పలు మ్యాచ్ సిమ్యులేషన్లలో పాండ్యా పాల్గొన్నాడని, ఎక్కడా అసౌకర్యంగా కనిపించలేదని మెడికల్ బృందం తెలిపింది. అతడు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో జూన్ 13 నుంచి ధర్మశాల వేదికగా జరగనున్న భారత్, ఆఫ్గన్ తొలి వన్డేలో పాండ్యా ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు రోహిత్ శర్మ కూడా ఇప్పటికే ఫిట్నెస్ నిరూపించు కున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ శుభవార్త చెప్పాడు. ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్, పాండ్యా అందుబాటులో ఉంటారని తెలిపాడు. అయితే ఫిట్నెస్ క్లియరెన్స్‌కు సంబంధించి సర్టిఫికెట్‌ను మెడికల్ సీవోఈ బృందం ఇంకా అందించలేదు. అయితే తనకు అందిన సమాచారం మేరకు రోహిత్, పాండ్యా ఫిట్నెస్ నిరూపించుకున్నారని, అయితే మెడికల్ టీమ్ ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వలేదని తెలిపాడు. అయితే వారి నుంచి ఒక్కసారి క్లియరెన్స్ వస్తే మాత్రం రోహిత్, పాండ్యాలు ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌లో ఆడతారని స్పష్టం చేశాడు. కానీ వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరూ పాల్గొనాలంటే పాండ్యా, రోహిత్‌లు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో రోహిత్ శర్మ చాలా మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. కండరాల గాయంతో గ్రూప్ దశలో ఐదు మ్యాచ్‌కు దూరమవ్వగా, పాండ్యా లీగ్ ఆఖరి దశలో వెన్నునొప్పి కారణంగా చివరి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ తర్వాత పాండ్యా, రోహిత్ శర్మలు ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరానికి వచ్చారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విఫలం.. తీవ్ర నిరాశలో అభిమానులు! -
కోహ్లి అవుట్.. రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించిన బీసీసీఐ
అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి దూరమయ్యాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కాగా ఐర్లాండ్, ఇంగ్లండ్‌లో పర్యటించే... అదే విధంగా ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే భారత టీ20 జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది.కొత్త టీ20 కెప్టెన్కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను తప్పించిన సెలక్టర్లు.. శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించారు. ఇక చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని కూడా టీమిండియాకు ఎంపిక చేసి యూకే టూర్‌తో పాటు ఆసియా క్రీడల జట్టులోనూ చోటిచ్చారు.కోహ్లి ఎప్పుడు వస్తాడో తెలియదుఈ జట్ల ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ విరాట్ కోహ్లి గురించి అప్డేట్ అందించాడు. కోహ్లి గాయంపై తమకు ఇంకా స్పష్టత రాలేదని.. అతడు ఎంతకాలం ఆటకు దూరంగా ఉంటాడో తెలియదని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నాటికి అతడు ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు.కోహ్లి స్థానంలో అతడేఅదే సమయంలో విరాట్ కోహ్లి స్థానంలో యశస్వి జైస్వాల్‌ను అఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపాడు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్-2026 ఫైనల్ సందర్భంగా కోహ్లి గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న కోహ్లి దాదాపు ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.రోహిత్ సంగతేంటి?ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ గురించి మాత్రం బోర్డు ఎలాంటి అప్డేట్ అందించలేదు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఈ ముంబై ఇండియన్స్ స్టార్ ఇంతవరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు చేరుకోనే లేదు.మరోవైపు.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నాడు. అయితే, గాయంపై స్పష్టత లేకపోవడంతో అతడిని టీ20 జట్టుకు ఎంపిక చేయలేదని అగార్కర్ తెలిపాడు. కాగా అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ సందర్భంగా తెలియజేశారు.అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు (అప్డేటెడ్)శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ (ఫిట్నెస్ ఆధారంగా), హార్దిక్ పాండ్యా (ఫిట్నెస్ ఆధారంగా).షెడ్యూల్జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికగా అఫ్గనిస్తాన్‌తో మూడు వన్డేలు.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు -
‘అతడు జట్టులో ఉంటే టీమిండియా వరల్డ్‌కప్ గెలవదు’
వన్డే ప్రపంచకప్-2027 టోర్నీకి ముందు టీమిండియాకు కొన్ని మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడనున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలోనూ మూడు మ్యాచ్‌లు ఆడనుంది.రో-కో ఆడతారా?ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం టీమిండియా సొంతగడ్డపై వెస్టిండీస్‌తో మూడు.. అనంతరం న్యూజిలాండ్‌తో మూడు, శ్రీలంకతో మూడు వన్డేలు ఆడుతుంది. మొత్తానికి మెగా టోర్నీకి ముందు భారత్ దాదాపు పదిహేను వన్డేలు ఆడుతుంది. అయితే, దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) వరల్డ్‌కప్‌లో ఆడతారా? లేదా? అన్న అంశంపై గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.అనుభవజ్ఞులైన రో-కో జట్టులో ఉంటేనే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. అయితే, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వాళ్లిద్దరు మెగా టోర్నీకి అందుబాటులో ఉండే విషయమై తమకు ఇంత వరకు సమాచారం లేదన్నాడు. కానీ రో-కో మాత్రం తాము ఈ ఈవెంట్‌కు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు.గాయాల బెడదదేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కూడా ఆడిన దిగ్గజ ద్వయం.. గత కొంతకాలంగా మంచి ఫామ్ కొనసాగించారు. అయితే, అఫ్గన్‌తో సిరీస్‌కు ముందు రోహిత్- కోహ్లి గాయపడటం మరోసారి చర్చకు తావిచ్చింది. 39 ఏళ్ల రోహిత్.. 38 ఏళ్ల కోహ్లి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నారు.కోహ్లి దాదాపు ఆరు వారాల పాటు ఆటకు దూరం కానుండగా.. రోహిత్ అఫ్గన్‌తో ఆఖరి వన్డే నాటికి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జ్యోతిష్కుడిగా చెప్పుకొనే గ్రీన్‌స్టోన్ లోబో సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ జట్టులో ఉంటే టీమిండియా ఈసారి కూడా వన్డే వరల్డ్‌కప్ గెలవదని పేర్కొన్నాడు.రోహిత్ జట్టులో ఉంటే జట్టు గెలవదుటైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘వన్డే ప్రపంచకప్ గెలిచే భారత జట్టులో రోహిత్ శర్మ భాగంగా ఉంటాడని నేను అనుకోవడం లేదు. చాలా మంది నన్ను ఇదే విషయం గురించి అడుగుతున్నారు. రోహిత్ అసలు జట్టులో ఉంటాడా? లేదా? అని వారు ఉత్సుకతతో ఉన్నారు.సెలక్టర్లు కోరుకుంటే అతడు జట్టులో ఉంటాడు. అయితే, ఒక విషయం స్పష్టంగా చెప్పగలను. రోహిత్ శర్మ జట్టులో ఉంటే మాత్రం టీమిండియా ఈసారి వరల్డ్‌కప్ గెలవదు’’ అని గ్రీన్‌స్టోన్ లోబో పేర్కొన్నాడు.సారథిగా ఇప్పటికే ఎన్నో విజయాలుఏదేమైనా ఇప్పటికే రోహిత్ శర్మ సారథిగా ఎన్నో విజయాలు సాధించాడన్న గ్రీన్‌స్టోన్ లోబో.. ముంబై ఇండియన్స్ కారణంగా అతడు వన్డే వరల్డ్‌కప్ గెలవలేకపోయాడని విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్‌గా రోహిత్ 2024లో టీ20 ప్రపంచకప్ సాధించాడు. వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలోనూ అతడే సారథిగా ఉన్నాడు.అయితే, దురదృష్టవశాత్తూ కప్ గెలవలేకపోయాడు. నిజానికి ఫ్రాంఛైజీ క్రికెట్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతడు ఐదు టైటిళ్లు గెలిచాడు. ఒకవేళ అలా జరుగకపోయి ఉంటే.. వన్డేలపై మరింత దృష్టి పెట్టి వరల్డ్‌కప్ కొట్టేవాడు. ముంబై ఇండియన్స్ వల్ల టీమిండియా నష్టపోయింది’’ అని గ్రీన్‌స్టోన్ లోబో వ్యాఖ్యానించాడు.అభిమానుల ఆగ్రహంఈ నేపథ్యంలో జ్యోతిష్కుడి వ్యాఖ్యలపై రోహిత్ శర్మ అభిమానులు భగ్గుమంటున్నారు. ఫేమస్ అయ్యేందుకు లాజిక్ లేకుండా మాట్లాడటం సరికాదని.. అసలు దిగ్గజ ఆటగాడి గురించి మాట్లాడే అర్హతే నీకు లేదంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. కాగా రోహిత్ సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా.. 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే ఫార్మాట్)ని సొంతం చేసుకుంది.చదవండి: కోపంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ -
టీమిండియాకు గుడ్ న్యూస్.. ఏడాది తర్వాత బరిలోకి దిగనున్న సూపర్ స్టార్
అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఊరట లభించింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గోనేందుకు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) నుండి అనుమతి లభించింది.దీంతో దాదాపు ఏడాది తర్వాత పాండ్యా వన్డేల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. కాగా గత నెలలో అఫ్గాన్‌తో సిరీస్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో పాండ్యాకు చోటు దక్కింది. కానీ వెన్ను గాయంతో బాధపడుతున్న పాండ్యాకు ఈ సిరీస్ ఆరంభానికి ముందు తన ఫిట్నెస్ను నిరూపించుకోవాలని సెలక్టర్లు కండీషన్ పెట్టారు. దీంతో జూన్ 2న బెంగళూరులోని సీఓఈకి వెళ్లిన పాండ్యాకు వైద్యులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో అతడు ఉత్తీర్ణత సాధించడంతో సీఓఈ వైద్య బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దైనిక్ జాగరణ్ తమ కథనంలో పేర్కొంది. మరోవైపు తొడ కండరాల గాయంతో బాధపడుతున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఫిట్నెస్ పరీక్షను ఎదుర్కోనున్నాడు.ఇందులో పాసైతేనే అఫ్గాన్‌తో సిరీస్‌కు హిట్‌మ్యాన్ అందుబాటులో ఉంటాడు. లేదంటే అతడి స్ధానాన్ని యశస్వి జైశ్వాల్‌తో సెలక్షన్ కమిటీ భర్తీ చేయనుంది. ఇక ఈ సిరీస్‌కు ఇప్పటికే టీమిండియా స్టార్, రన్‌మిషన్ విరాట్ కోహ్లి గాయం కారణంగా దూరమయ్యాడు. కోహ్లి ప్రస్తుతం కాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడి స్ధానాన్ని రుతురాజ్ గైక్వాడ్‌తో భర్తీ చేశారు.పాండ్యా విషయానికి వస్తే.. చివరిసారిగా 2025 మార్చిలో భారత్ తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. పాండ్యా ఇప్పటివరకు 94 వన్డేలు ఆడి, 32.82 సగటుతో 1904 పరుగులు చేశాడు. అంతేకాకుండా అతడి పేరిట 91 వన్డే వికెట్లు ఉన్నాయి. అయితే వన్డే మ్యాచ్‌లో 10 ఓవర్ల కోటాను పూర్తి చేసేందుకు అతడి శరీరం సహకరిస్తుందో లేదో చూడాలి. వన్డే సిరీస్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది.అఫ్గాన్‌తో వన్డేలకు భారత జట్టు ఇదేశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ*, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ (వైస్‌కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా*, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేచదవండి: ENG vs NZ: ఇంగ్లండ్ బౌలర్ అరుదైన రికార్డు.. 149 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే -
టీమిండియాకు షాక్.. ఆరు నెలలు ఆటకు దూరమైన కోహ్లీ!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాలి పిక్క కండరాల గాయంతో అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన కోహ్లీ తాజాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. దీంతో కోహ్లీ కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశముందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. దీంతో జూలైలో ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరమైనట్లే. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. 'కోహ్లీ తొడ కండరంలో చీలిక వచ్చింది. ఈ గాయానికి శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే ఇది నయం కావడానికి మాత్రం సుమారు ఆరు వారాల సమయం పట్టనుంది. దీనిలో భాగంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోహ్లీ పునరావాసం పొందే అవకాశముంది. కాగా కోహ్లీ తన గాయంపై ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలోని ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పర్దివాలాను టెలి-కన్సల్ట్ అయ్యాడు. ఎంఆర్ఐ స్కాన్‌లో కండరాల్లో చీలిక వచ్చినట్లు రిపోర్ట్‌లో తేలింది.' అని పేర్కొంది.ఇదిలా ఉండగా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు ఫిట్నెస్ మదింపు కోసం రోహిత్ శర్మ జూన్ 8న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కి హాజరుకానున్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది . ఈ సిరీస్ కోసం రోహిత్‌ను జట్టులోకి తీసుకున్నప్పటికీ, అతని లభ్యత పూర్తిగా ఫిట్నెస్ పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. చదవండి: కుప్పకూలిన కివీస్.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్ -
గాయాల బారిన సీనియర్లు.. టీమిండియాకు షాక్ తప్పదా?
ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో టీమిండియా ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌తో జరగనున్న టెస్టుతో పాటు వన్డే సిరీస్‌పై దృష్టి సారించింది. రేపటి నుంచి భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు గిల్ నేతృత్వంలోని టీమిండియా స్టేడియానికి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత వెంటనే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేశారు. అయితే పిక్క కండరాల గాయంతో కోహ్లీ ఈ సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. జూన్ 13న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేకు రుతురాజ్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటన విడుదల చేసినట్లు నివేదికలు వచ్చాయి. కానీ రుతురాజ్ గైక్వాడ్ భారత-ఏ జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు బయల్దేరి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఈ వార్తలన్నింటికీ ఫుల్స్టాప్ పడినట్లయింది.లంక పర్యటనలో భారత్.. శ్రీలంక-ఏ, అప్గానిస్తాన్-ఏ జట్లతో కలిసి ట్రై సిరీస్ ఆడనుంది. తాజాగా రుతురాజ్ కొలంబోలో దర్శనమివ్వడంతో మరి కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడు ఎవరన్నది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.ఎటూ తేల్చని బీసీసీఐ?ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు 15 మందితో జట్టును ప్రకటించడంతో కోహ్లీ దూరమైన అతడి స్థానాన్ని ఆ సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లలో ఒకరితోనే భర్తీ చేయాలనే నిర్ణయానికి బీసీసీఐ వచ్చినట్లు తెలుస్తోంది. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా ఆఫ్గన్‌తో వన్డే సిరీస్ ఆడడం అనుమానంగానే ఉంది. అతడు కూడా పిక్క కండరాల గాయంతో బాధపడుతుండడం టీమిండియాకు ప్రతికూలంగా మారనుంది. మరోవైపు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా జట్టులోని సీనియర్లంతా గాయాల బారిన పడడంతో వన్డే సిరీస్‌లో అప్గానిస్తాన్ మనకు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనసరం లేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీ, రోహిత్, పాండ్యాలు దూరమైతే మాత్రం బీసీసీఐ వీరి స్థానంలో కనీసం ఇద్దరినైనా జట్టులోకి తీసుకోవాల్సిన అవసరముంటుంది. అయితే వన్డే సిరీస్‌కు ఇంకా సమయం ఉండడంతో బీసీసీఐ దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది.ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేచదవండి: ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్.. విలువెంతో తెలుసా? -
షాహీన్ దెబ్బ.. ఆసీస్ అబ్బా! వన్డే సిరీస్ పాక్‌దే
లహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 4 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో పాక్ కైవసం చేసుకుంది. ఈ ఆఖరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 42 ఓవర్లలో కేవలం 157 పరుగులకే ఆలౌటైంది. షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించగా.. షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జోష్ ఇంగ్లిస్ (65 పరుగులు, 71 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా, మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. పాక్ గడ్డపై ఆసీస్‌కు ఇదే అత్యల్ప వన్డే స్కోర్ కావడం గమనార్హం.రాణించిన బాబర్ ఆజంఅనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఆసీస్ స్పిన్నర్లు చుక్కలు చూపించారు. ఆతిథ్య జట్టు 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పిచ్ స్పిన్‌కు అనుకూలించడంతో పాక్ బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలో మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (40 పరుగులు, 84 బంతుల్లో) ఆచితూచి ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగా.. షాదాబ్ ఖాన్(42 బంతుల్లో 29), సమద్(30) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఆసీస్ బౌలర్లలో మాథ్యూ కుహ్నెమాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రెన్షా, ఎల్లీస్ తలా వికెట్ సాధించారు.చదవండి: ENG vs NZ: తొలి రోజే 16 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో న్యూజిలాండ్ -
రోహిత్- కోహ్లి ఆడతారా?.. స్పందించిన టీమిండియా కోచ్
అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అందుబాటులో ఉంటారా? లేదా?.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. ఐపీఎల్-2026లో కోహ్లి అదరగొట్టిన సంగతి తెలిసిందే.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్‌గా కొనసాగుతున్న కోహ్లి.. ఈ సీజన్లో 16 మ్యాచ్‌లలో కలిపి 675 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీ ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు.అంతలోనే గాయమా?ఇక ఆర్సీబీ రెండోసారి టైటిల్ విజేతగా అవతరించిన తరుణంలో కోహ్లి సంబరాలు అంబరాన్నంటాయి. భార్య అనుష్క శర్మ, సహచర ఆటగాళ్లతో కలిసి అతడు ఉత్సాహంగా డాన్స్ చేసిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. అయితే, అంతలోనే కోహ్లి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడనే వార్త బయటకు వచ్చింది.ఫలితంగా అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లి దూరమయ్యాడనే వార్త చక్కర్లుకొడుతోంది. మరోవైపు.. ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణంగా ఐదు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి వచ్చినా ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు.రోహిత్ కూడా డౌటేఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సైతం సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే తాజాగా స్పందించాడు. అఫ్గనిస్తాన్‌తో టీమిండియా ఏకైక టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ..కోచ్ ఏమన్నాడంటే..‘‘ఇప్పటి వరకు మాకు కూడా అధికారిక సమాచారం అందలేదు. విరాట్, రోహిత్ వంటి స్టార్ ప్లేయర్లు గాయాల వల్ల దూరవుతున్నారంటే అది నిజంగా పెద్ద వార్తే. అయితే, ఏ ఆటగాడి విషయంలోనైనా ప్రొటోకాల్ ఒకేలా ఉంటుంది.వాళ్లు ఫిట్నెస్ పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నారా? లేరా? అన్నది మా వైద్య బృందం నిర్ణయిస్తుంది. వారి సూచన ప్రకారమే రో-కోలను ఆడించాలా? వద్దా? అన్నది తేలుతుంది.ఒకవేళ వాళ్లు దూరమైతే వారి స్థానాలను భర్తీ చేసే అంశంపై కూడా యాజమాన్యం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని డష్కాటే తెలిపాడు. కాగా జూన్ 6- 20 మధ్య టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఏం జరుగుతోంది?ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి.. కేవలం వన్డేల్లో కొనసాగుతున్నారు. వన్డే వరల్డ్‌కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు కొన్ని వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రో-కో గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. చదవండి: ‘పంజాబ్ కింగ్స్ ఈ ఐదుగురిని వదిలేయాలి’ -
వన్డే సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టు ప్రకటన
ముక్కోణపు వన్డే సిరీస్‌కు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తమ జట్టును ప్రకటించింది. శ్రీలంక- ‘ఎ’, భారత్- ‘ఎ’ జట్లతో తలపడే అఫ్గన్- ‘ఎ’ జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. ఈ జట్టుకు ఇమ్రాన్ మిర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఏసీబీ తెలిపింది. వికెట్ కీపర్ల కోటాలో నూర్ రహ్మాన్‌తో పాటు మొహమ్మద్ ఇషాక్లకు సెలక్టర్లు చోటిచ్చారు. బ్యాటింగ్ విభాగంలో హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనీవాల్, ఐజాజ్ అహ్మద్జాయ్, బహీర్ షా మెహబూబ్, ఫైజల్ ఖాన్ షినోజదా స్థానం సంపాదించుకున్నారు.ఆల్‌రౌండర్ల జాబితాలో ఫర్మానుల్లా సూఫీ, షామ్స్ ఉర్ రహ్మాన్ ఎంపికయ్యారు. వీరు సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు కాగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఖలీల్ గుర్బాజ్‌కు కూడా సెలక్టర్లు ఈ జట్టులో చోటిచ్చారు.ఇక స్పిన్ దళంలో రిస్ట్ స్పిన్నర్ జహీర్ ఖాన్ పక్టీన్ ఒక్కడే ఉండగా.. పేస్ విభాగంలో మహ్మద్ ఇబ్రహీం, అబ్దుల్లా అహ్మద్జాయ్, ఫరీదూన్ దావూద్జాయ్ సేవలు అందించనున్నారు. కాగా జూన్ 9 నుంచి 21 వరకు శ్రీలంక వేదికగా ఈ ముక్కోణపు వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌లో భారత్-‘ఎ’ జట్టుకు హైదరాబాదీ తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదే విధంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దంబుల్లా వేదికగా భారత్- శ్రీలంక- అఫ్గన్ ‘ఎ’ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి.శ్రీలంక- భారత్‌లతో ముక్కోణపు వన్డే సిరీస్‌కు అఫ్గన్-‘ఎ’ జట్టు ఇదేఇమ్రాన్ మిర్ (కెప్టెన్), నూర్ రహ్మాన్, మొహమ్మద్ ఇషాక్, హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనీవాల్, ఐజాజ్ అహ్మద్జాయ్, బహీర్ షా మెహబూబ్, ఫైజల్ ఖాన్ షినోజదా, ఫర్మానుల్లా సూఫీ, షామ్స్ ఉర్ రహ్మాన్, జహీర్ ఖాన్ పక్టీన్, ఫరీదూన్ దావూద్జాయ్, మహ్మద్ ఇబ్రహీం, అబ్దుల్లా అహ్మద్జాయ్.సిరీస్ షెడ్యూల్ ఇదేజూన్ 9: భారత్ వర్సెస్ శ్రీలంకజూన్ 11: భారత్ వర్సెస్ అఫ్గన్జూన్ 13: అఫ్గన్ వర్సెస్ శ్రీలంకజూన్ 15: భారత్ వర్సెస్ శ్రీలంకజూన్ 17: భారత్ వర్సెస్ అఫ్గన్జూన్ 19: అఫ్గన్ వర్సెస్ శ్రీలంకజూన్ 12: ఫైనల్. -
ODI WC: రోహిత్ శర్మ ఎందుకిలా చేస్తున్నాడు?
దాదాపు రెండు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంది టీమిండియా. భారత జట్టులోని ప్రధాన ఆటగాళ్లంతా ఐపీఎల్-2026తో బిజీ బిజీగా గడిపారు. ఇక ఈ మెగా టోర్నీకి ఆదివారం నాటి ఫైనల్‌తో తెరపడింది.ఈ నేపథ్యంలో జూన్ 6 నుంచే టీమిండియా రంగంలోకి దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో తొలుత ఓ టెస్టు మ్యాచ్ ఆడి.. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక అఫ్గన్‌తో మ్యాచ్‌లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఫిట్‌నెస్‌లోబడే...శుబ్‌మన్ గిల్ సారథ్యంలో అఫ్గన్‌తో ఆడే ఈ జట్లలో వన్డేలకు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపికయ్యారు. అయితే, వీరిద్దరు ఫిట్‌నెస్‌లోబడే ఆడతారని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా ఐపీఎల్-2026లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్‌కు ఆడిన రోహిత్ శర్మ.. సీజన్ మధ్యలో గాయపడ్డాడు.తొడ కండరాల గాయంతో ఐదు మ్యాచ్‌లకు రోహిత్ దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి జట్టుతో చేరినా ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా సైతం వెన్నునొప్పితో నాలుగు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు.క్లియరెన్స్ వస్తేనే..ఈ నేపథ్యంలో రోహిత్, హార్దిక్‌లను అఫ్గన్‌తో సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికీ.. ఫిట్నెస్ ఆధారంగానే వారు ఆడతారో, లేదో తేలుతుందని బీసీసీఐ జట్టు ప్రకటన సమయంలో వెల్లడించింది. అదే విధంగా.. వీరిద్దరిని సిరీస్ ఆరంభానికి రెండు వారాల ముందే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.ఇంత వరకు రిపోర్టు చేయని రోహిత్!అక్కడి వైద్య బృందాన్ని సంప్రదించి.. వేగంగా కోలుకొనే అంశంపై దృష్టి పెట్టాలని.. వారి నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మంగళవారం (జూన్ 2)న బెంగళూరుకు పయనం కానుండగా.. రోహిత్ శర్మ మాత్రం ఇంత వరకు రిపోర్టు చేయలేదని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది.కాగా వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి ముందు టీమిండియా కొద్ది వన్డేలు మాత్రమే ఆడనుంది. ఇలాంటి తరుణంలో రోహిత్ గాయపడటం.. బోర్డు ఆదేశాలు పాటించే అంశంలో స్పష్టత లేకపోవడం సందేహాలకు తావిస్తోంది.రేసులోకి జైసూ!ఇప్పటికే రోహిత్‌కు బదులు యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ పేర్లను శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ జోడీగా పరిగణించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంలో బోర్డు కూడా సానుకూలంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 39 ఏళ్ల రోహిత్ శర్మనే స్వయంగా తప్పుకోనున్నాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ముల్లన్‌పూర్‌లో భారత్- అఫ్గన్ మధ్య ఏకైక టెస్టు జరుగనుండగా.. జూన్ 13, 17, 20 తేదీల్లో వన్డే సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IPL 2026: అత్యుత్తమ జట్టు ఇదే! -
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన పాకిస్తాన్
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శనివారం రావాల్పిండి వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌ను 5 వికెట్ల తేడాతో పాక్ చిత్తు చేసింది. తమ 1,000 వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. పాక్ బౌలర్ల ధాటికి 44.1 ఓవర్లలో 200 పరుగులకే కుప్పకూలింది. అరంగేట్ర ఆటగాడు అరాఫత్ మిన్హాస్ 5 వికెట్లు పడగొట్టి కంగారుల పతనాన్ని శాసించాడు. జోష్ ఇంగ్లిష్, గ్రీన్, లబుషేన్ వంటి కీలక వికెట్లను అరాఫత్ తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా వన్డే అరంగేట్రంలో 5 వికెట్లు పడగొట్టిన తొలి పాక్ బౌలర్‌గా మిన్హాస్ నిలిచాడు. ఇక ఆసీస్ బ్యాటర్లలో మాట్ రెన్షా(61), మాథ్యూ షార్ట్(55) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో మిన్హాస్తో పాటు అబ్రార్ రెండు, రౌఫ్, అఫ్రిది, అఘా తలా వికెట్ సాధించారు.బాబర్, ఘోరి హాఫ్ సెంచరీలుఅనంతరం పాకిస్తాన్ 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (69), వికెట్ కీపర్ బ్యాటర్ ఘాజీ ఘోరి (65) మూడో వికెట్‌కు 127 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ ఔటైనప్పటికి మిన్హాస్(18), సమద్(1) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు.ఆసీస్ బౌలర్లలో నాథన్ ఈల్లీస్ రెండు, మాథ్యూ కునెమన్, తన్వీర్ సంగా, లబుషేన్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జూన్ 2న లహోర్ వేదికగా జరగనుంది.చదవండి: గర్వంగానే ఉంది.. నన్ను ఇరకాటంలో పెట్టొద్దు: అగార్కర్ -
అరుదైన ఫీట్.. టీమిండియా సరసన పాకిస్తాన్
రావల్పిండి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్ ఒక అరుదైన ఫీట్ సాధించింది. ఆసీస్‌తో జరుగుతున్న తొలి వన్డే పాకిస్తాన్‌కు 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో వన్డే క్రికెట్లో వెయ్యి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న మూడో జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. 1075 వన్డే మ్యాచ్‌లతో భారత్ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, 1020 మ్యాచ్‌లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఈ రెండు దేశాల సరసన పాకిస్తాన్ చోటు సంపాదించింది. ఇక 1000వ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా పాక్ కెప్టెన్ షాహిన్ అఫ్రిది ఆస్ట్రేలియా స్టాండ్ ఇన్ కెప్టెన్ జోస్ ఇంగ్లిస్ చేతుల మీదుగ2ఆ ప్రత్యేక మెమొంటో అందుకున్నాడు. ఇక పాక్ ఆడుతున్న 1000వ మ్యాచ్ ద్వారా అరాఫత్ మిన్హాస్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయడం మరో విశేషం. వెయ్యి వన్డేలు ఆడిన మూడు జట్లు విజయాల శాతాన్ని పరిశీలిస్తే.. ఆస్ట్రేలియా (1019 మ్యాచ్‌ల్లో 617 విజయాలు, 52.7 శాతం) తొలి స్థానంలో ఉండగా, టీమిండియా (1075 మ్యాచ్‌ల్లో 571 విజయాలు), పాకిస్తాన్ (999 మ్యాచ్‌ల్లో 527 విజయాలు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 23 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (49), మాట్ రెన్షా (21) పరుగులతో ఆడుతున్నారు. Josh Inglis presented a souvenir to Shaheen Afridi on Pakistan’s 1000th ODI match. ❤️ - A lovely gesture by Inglis. 🇵🇰🇦🇺pic.twitter.com/T1SzeQH8PV— Sheri. (@CallMeSheri1_) May 30, 2026చదవండి: వినేశ్‌కు షాక్.. ఆసియా క్రీడల రేసు నుంచి ఔట్! -
PAK vs AUS: రిజ్వాన్‌పై వేటు.. కొత్త ముఖాలకు చోటు
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ జట్టును ప్రకటించింది. పేసర్ షాహిన్ ఆఫ్రిదిని కెప్టెన్‌గా కొనసాగించింది. ఇక ఈ సిరీస్‌తో బాబర్ ఆజం తిరిగి వన్డే జట్టుతో చేరనుండగా.. మరో మాజీ సారథి మహ్మద్ రిజ్వాన్‌పై సెలక్టర్లు వేటు వేశారు.కెప్టెన్‌గా అతడే.. కాగా టీ20 ప్రపంచకప్-2026లో సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టిన పాకిస్తాన్.. బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. అయితే, సెలక్టర్లు అప్పుడు బాబర్‌ను ఈ జట్టుకు ఎంపిక చేయలేదు. ఇదిలా ఉంటే.. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడిన పాక్... షాహిన్ ఆఫ్రిది సారథ్యంలో బంగ్లాకు దాదాపు పదకొండేళ్ల తర్వాత 2-1 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది.ఈ నేపథ్యంలో షాహిన్‌పై వేటు వేసి.. బాబర్‌కు తిరిగి పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. అయితే, సెలక్టర్లు మాత్రం ఈ లెఫ్టార్మ్ పేసర్‌పై నమ్మకం ఉంచారు. అదే విధంగా సల్మాన్ ఆఘాను వైస్ కెప్టెన్‌గా కొనసాగించారు.ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటుఇక ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టులకు ఎంపిక కాని నసీం షా, హ్యారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్లకు సెలక్టర్లు తాజాగా పిలుపునిచ్చారు. వీరితో పాటు ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు కూడా ఆసీస్‌తో వన్డేలు ఆడే జట్టులో చోటిచ్చారు.అహ్మద్ దనియాల్, అరాఫత్ మిన్హాస్, రొహైల్ నాజిర్‌లు తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యారు. ముహమ్మద్ ఘాజి ఘోరితో పాటు నాజిర్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. ఇక అనారోగ్యం కారణంగా మరో వికెట్ కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.ఓపెనర్లుగా వీరేఇక సయీమ్ ఆయుబ్, ఫఖర్ జమాన్ గాయాల కారణంగా దూరం కాగా.. వారి స్థానంలో ఓపెనర్లుగా సాహిబ్జాదా ఫర్హాన్, మాజ్ సదాకత్ ఆసీస్‌తో వన్డే బరిలో దిగనున్నారు. మరోవైపు.. పేస్ దళంలో కెప్టెన్ షాహిన్ ఆఫ్రిదితో పాటు హ్యారిస్ రవూఫ్, నసీం షా ఉండనే ఉన్నారు. స్పిన్నర్ల కోటాలో అబ్రార్ అహ్మద్, సూఫియాన్ ముకీమ్ చోటు దక్కించుకున్నారు. కాగా గత పర్యటనలో రిజ్వాన్ కెప్టెన్సీలో పాక్ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించి వన్డే సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియాతో వన్డేలకు పాకిస్తాన్ జట్టుషాహిన్ ఆఫ్రిది (కెప్టెన్), సల్మాన్ ఆఘా (వైస్ కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, అహ్మద్ దనియాల్, అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజం, హ్యారిస్ రవూఫ్, మాజ్ సదాకత్, ముహమ్మద్ ఘాజి ఘోరి (వికెట్ కీపర్), నసీం షా, రొహైల్ నాజిర్ (వికెట్ కీపర్), సాహిబ్జాదా ఫర్హాన్, షాదాబ్ ఖాన్, షామిల్ హుసేన్, సూఫియాన్ ముకీమ్.షెడ్యూల్మే 30 (రావల్పిండి), జూన్ 2, జూన్ 4 (లాహోర్) తేదీల్లో పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు.చదవండి: సన్‌రైజర్స్‌కు తప్పని గండం.. అలా అయితేనే టాప్-2లో చోటు! -
నిరాశపరిచారు: టీమిండియా సెలక్టర్లపై విమర్శలు
టీమిండియా సెలక్షన్ కమిటీ తీరును ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే విమర్శించాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటే ఆటగాళ్లను విస్మరించడం ఎంతమాత్రం తగదన్నాడు. అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టుకు జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీని ఎంపిక చేయకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ (జూన్ 6 నుంచి)తో బిజీ కానుంది. ఇందులో భాగంగా తొలుత స్వదేశంలో అఫ్గనిస్తాన్ ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్లను ప్రకటించింది.గుర్నూర్ బ్రార్‌కు తొలిసారి పిలుపు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. గుర్నూర్ బ్రార్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణతో కలిసి పేస్ దళంలో చేరాడు. అయితే, మెజారిటీ మంది విశ్లేషకులు అఫ్గన్‌తో టెస్టుకు ఆకిబ్ నబీని తప్పక ఎంపిక చేస్తారని భావించారు.కానీ సెలక్టర్లు మాత్రం అతడికి మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో ఆకిబ్ నబీ పట్ల సెలక్షన్ కమిటీ వ్యవహారశైలిపై హర్ష్ భోగ్లే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘ఈ జట్టులో ఆకిబ్ నబీ తప్పక ఉంటాడని నేను విశ్వసించాను. అతడి గురించి చర్చ కూడా జరిగింది.అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు?అతడి బౌలింగ్‌లో తగినంత పేస్ ఉందా? లేదా? అన్న విషయంతో నాకు సంబంధం లేదు. బౌలింగ్ చేస్తున్న సమయంలో అతడు బ్యాలెన్స్ చేసుకుంటున్నాడా? లేదా? అన్నది కూడా నాకు అక్కర్లేదు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రెండేళ్లలో అతడు వందకు పైగా వికెట్లు కూల్చాడు. అలాంటి బౌలర్‌కు ప్రోత్సాహం అందించడం కనీస బాధ్యత. అతడిని ఎంపిక చేసి ఉంటే దేశీ క్రికెట్లో సత్తా చాటే ఆటగాళ్లకు మంచి బూస్టప్ లభించేది.టెస్టుల్లో రాణించాలనే కసి మరింత పెరిగేది. అఫ్గన్‌తో టెస్టులో తుదిజట్టులో ఆకిబ్ నబీకి చోటు ఇవ్వకున్నా పర్లేదు. కానీ పదిహేను మంది సభ్యుల జట్టుకు మాత్రం అతడిని ఎంపిక చేయాల్సింది. అతడికి ఫిట్నెస్ సమస్యలు కూడా లేవు.ఏం మెసేజ్ ఇస్తు న్నారు?దేశీ క్రికెట్లో ఓ బౌలర్‌గా ఎంతగా రాణించాలో.. అంతా చేసి చూపాడు. బ్యాటింగ్ ఆర్డర్లో తొమ్మిదో స్థానంలో మెరుగ్గా ఆడగలడు. అయినప్పటికీ అతడిని ఎంపిక చేయకపోవడం నిజంగా నిరాశాజనకం. ఈ సెలక్షన్ కమిటీకి ఆకిబ్ నబీని ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు ఎన్నో ఉండి ఉంటాయి. కానీ వారి చర్యల ద్వారా ఇచ్చే సందేశం మాత్రం సరిగ్గా లేదు’’ అని హర్షా భోగ్లే యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2025-26 సీజన్లో పది మ్యాచ్‌లలో ఆకిబ్ నబీ జమ్మూ కశ్మీర్ తరఫున 60 వికెట్లు తీశాడు. తన జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అంతకుముందు సీజన్లో ఆకిబ్.. 44 వికెట్లతో సత్తా చాటాడు.చదవండి: నితీశ్ రెడ్డి, ఇషాన్‌లకు లక్కీ ఛాన్స్.. పాపం పంత్!.. కొత్త ముఖాలు ఇవే -
కొత్త కుర్రాళ్లకు పిలుపు
గువాహటి: సొంతగడ్డపై వచ్చే నెలలో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుతో పాటు వన్డే సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ భారత జట్లను ప్రకటించింది. దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న నలుగురు కుర్రాళ్లకు జాతీయ జట్టులో తొలిసారి అవకాశం దక్కగా... ఐపీఎల్లో ఆకట్టుకోలేకపోతున్న రిషభ్ పంత్ వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. అలాగే ఇప్పటి వరకు టెస్టు జట్టులో వైస్ కెప్టెన్‌గా ఉన్న అతడు ఇప్పుడిక కేవలం ప్లేయర్‌గానే కొనసాగనున్నాడు. పంత్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు బదలాయించారు. టెస్టు, వన్డే జట్లకు శుబ్‌మన్ గిల్ నాయకత్వం వహించనుండగా... సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. పనిభారం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. రవీంద్ర జడేజా కూడా రెస్ట్ ఇవ్వగా... అక్షర్ పటేల్‌ను ఎంపిక చేయలేదు. రోహిత్‌తో పాటు హార్దిక్ పాండ్యా వన్డే సిరీస్‌కు ముందు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. జూన్ 6 నుంచి భారత్, అఫ్గానిస్తాన్ మధ్య న్యూ చండీగఢ్‌లో ఏకైక టెస్టు జరగనుంది. ఆ తర్వాత జూన్ 14న ధర్మశాలలో తొలి వన్డే, 17న లక్నోలో రెండో వన్డే, 20న చెన్నైలో మూడో వన్డే జరగనున్నాయి. ‘అఫ్గాన్‌తో సిరీస్‌ల అనంతరం ఇంగ్లండ్ పర్యటన వరకు బుమ్రా జట్టుతో చేరుతాడు’ అని అగార్కర్ పేర్కొన్నాడు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు, వన్డే జట్లలో చోటు నిలబెట్టుకున్నాడు. భారత టెస్టు జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే , ధ్రువ్ జురేల్. భారత వన్డే జట్టు: గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్, కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే , కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్. ప్రిన్స్ యాదవ్: తాజా ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ఆ జట్టు పేసర్ ప్రిన్స్ యాదవ్ మాత్రం తన వేగం, కచ్చితత్వంతో సెలెక్టర్ల మెప్పు పొందాడు. గతేడాదే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 24 ఏళ్ల ప్రిన్స్... ఈ సీజన్లో నిలకడ కనబర్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ ఢిల్లీ బౌలర్‌కు పెద్దగా అనుభవం లేకపోయినా... లిస్ట్ ‘ఎ’, ఐపీఎల్ ప్రదర్శనతో అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. యార్కర్లు వేయడంలో దిట్ట అయిన ప్రిన్స్ వన్డే సిరీస్‌లో రాణిస్తే... ఈ ఏడాది చివర్లో జరిగే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు అతడి పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదు. మానవ్ సుతార్: రాజస్తాన్‌కు చెందిన 23 ఏళ్ల మానవ్ సుతార్.. చాన్నాళ్లుగా దేశవాళీల్లో నిలకడ కనబరుస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 29 మ్యాచ్‌ల్లో 129 వికెట్లు పడగొట్టిన ఈ ఎడంచేతి వాటం స్పిన్నర్... బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేయగలడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సుతార్‌ను ఏకైక టెస్టు కోసం ఎంపిక చేశారు. జడేజా, అక్షర్ జట్టులో లేకపోవడంతో సుతార్‌కు అవకాశం దక్కింది. కుల్దీప్, సుందర్‌లు తుది జట్టులో ఉండటం ఖాయం కాగా... మూడో స్పిన్నర్‌గా టీమ్‌లో చోటు కోసం హర్ష్ దూబే తో సుతార్ పోటీపడనున్నాడు. గుర్నూర్ బ్రార్: చాన్నాళ్లుగా భారత జట్టులో నెట్ బౌలర్‌గా కొనసాగుతున్న 25 ఏళ్ల గుర్నూర్ బ్రార్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌కు బ్రార్‌పై అపార నమ్మకం ఉండగా... అతడికి పంజాబ్‌కే చెందిన భారత సారథి గిల్ మద్దతు దండిగా ఉంది. ఐపీఎల్‌లోనూ గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్న అతడు రెండేళ్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అదనపు బౌన్స్ రాబట్టడంలో మంచి నైపుణ్యం ఉన్న ఆరున్నర అడుగుల గుర్నూర్ దక్షిణాఫ్రికా వంటి పేస్ పిచ్‌లపై ప్రభావం చూపగలడని సెలెక్షన్ కమిటీ నమ్ముతోంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 18 మ్యాచ్‌లు ఆడిన బ్రార్ 27.30 సగటుతో 52 వికెట్లు పడగొట్టాడు. హర్ష్ దూబే : సుదీర్ఘ ఫార్మాట్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న 23 ఏళ్ల హర్ష్ దూబే కు మొదటిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. 2024–25 రంజీ సీజన్లో రికార్డు స్థాయిలో 69 వికెట్లు పడగొట్టడంతో పాటు 476 పరుగులు చేసిన దూబే... తాజా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 23.26 సగటుతో 133 వికెట్లు తీసిన హర్ష్... 1026 పరుగులు సైతం చేశాడు. అతడి ఖాతాలో 9 అర్ధశతకాలు ఉన్నాయి. -
అతడి గురించి అసలు చర్చించనేలేదు: అగార్కర్
వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి టీమిండియా సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టు, వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్లలో అతడికి చోటు ఇవ్వలేదు. దీంతో పునరాగమనం చేయాలని ఉవ్విళ్లూరుతున్న షమీ.. మరికొంత కాలం వేచిచూడక తప్పని పరిస్థితి.శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలోకాగా స్వదేశంలో జూన్ 6 నుంచి అఫ్గనిస్తాన్‌తో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో సాగే ఈ సిరీస్‌లలో కొత్తగా యువ పేసర్లు గుర్నూర్బ్రార్, ప్రిన్స్ యాదవ్ (వన్డేలకు మాత్రమే)లకు సెలక్టర్లు చోటిచ్చారు.పేస్ దళ నాయకుడిగా సిరాజ్ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ పేస్ దళ నాయకుడిగా ముందుండి నడిపించనున్నాడు. అతడితోడు ప్రసిద్ కృష్ణ కూడా ఉన్నాడు. ఇక వన్డే జట్టులో వీరితో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు సెలక్టర్లు చోటిచ్చారు.మరోవైపు.. స్పిన్ విభాగంలో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్ష్ దూబే స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలో షమీ గురించి ప్రశ్న ఎదురుకాగా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మరోసారి పాత పాటే పాడాడు. షమీ కేవలం పొట్టి ఫార్మాట్‌కు మాత్రమే సిద్ధంగా ఉన్నాడంటూ మళ్లీ అతడిని ఉడికించాడు.అసలు చర్చే జరుగలేదు‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అతడు టీ20 క్రికెట్ ఆడేందుకు మాత్రమే సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈసారి మహ్మద్ షమీ గురించి మా మధ్య అసలు చర్చే జరుగలేదు’’ అని అగార్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. షమీకి బదులు జమ్మూ కశ్మీర్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆకిబ్ నబీ గురించి చర్చ జరిగిందని.. అయితే, అతడికి కూడా స్థానం దక్కలేదని పేర్కొన్నాడు.కాగా గతేడాది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలకు కూడా షమీని సెలక్ట్ చేయలేదన్న సంగతి తెలిసిందే. సర్జరీ తర్వాత అతడు ఫిట్‌గా లేడన్న కారణంగానే ఎంపిక చేయలేదని అగార్కర్ నాడు పేర్కొన్నాడు.సత్తా చాటినా...ఇందుకు షమీ గట్టిగానే బదులిచ్చాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని.. కావాలనే పక్కనపెడుతున్నారని ఆరోపించాడు. అంతేకాదు.. రంజీ తాజా ఎడిషన్‌లో బెంగాల్ తరఫున సత్తా చాటి మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు.అయినప్పటికీ సెలక్టర్లు షమీకి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ కూడా ఫిట్నెస్ కారణాలు చూపుతూ అతడిని పక్కనపెట్టామని అగార్కర్ చెప్పడం గమనార్హం. దీనిని బట్టి 35 ఏళ్ల షమీ ఇక టీమిండియా తరఫున పునరాగమనం చేయడం దాదాపు అసాధ్యమనే తేలిపోయింది.67 వికెట్లు పడగొట్టినా..కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో భారత్ ఫైనల్ చేరడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా చాంపియన్‌గా నిలవడంలోనూ ఈ రైటార్మ్ పేసర్ హస్తం ఉంది. అయితే ఆ తర్వాత.. అతడు పరిమిత ఓవర్ల జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.ఇక చివరగా 2023 జూన్‌లో టీమిండియా తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన షమీ.. రీఎంట్రీ కోసం పరితపిస్తున్నాడు. బెంగాల్ తరఫున 2025-26 సీజన్లో షమీ మొత్తంగా 67 వికెట్లు కూల్చాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. 12 మ్యాచ్‌లలో కలిపి 10 వికెట్లు కూల్చాడు.చదవండి: టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు -
నితీశ్ రెడ్డి, ఇషాన్‌కు లక్కీ ఛాన్స్.. పాపం పంత్!
అఫ్గనిస్తాన్‌తో టెస్టు, వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. శుబ్‌మన్ గిల్ సారథ్యంలో సొంతగడ్డపై అఫ్గన్‌తో తలపడే జట్ల వివరాలను మంగళవారం వెల్లడించింది. ఇందులో ప్రధానంగా గమనించదగ్గ అంశాలు ఏమిటంటే..పాపం పంత్!ఐపీఎల్-2026లో వరుస వైఫల్యాలతో సతమతమైన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు సెలక్టర్లు షాకిచ్చారు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను టెస్టు జట్టు వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగించారు. పంత్ స్థానంలో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను గిల్ డిప్యూటీగా నియమించారు.అంతేకాదు వన్డే జట్టులోనూ పంత్‌కు చోటు దక్కలేదు. కేఎల్ రాహుల్‌తో కలిసి వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. కాగా 2023 అక్టోబరులో చివరగా టీమిండియా తరఫున వన్డే ఆడిన ఇషాన్ కిషన్.. ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు. అతడికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఈ జార్ఖండ్ పాకెట్ డైనమైట్.. ఏకంగా టీ20 ప్రపంచకప్-2026లో ఆడిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత వచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్.. ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ తరఫునా సత్తా చాటుతున్నాడు. వారిద్దరికి విశ్రాంతిఈ క్రమంలోనే వన్డే జట్టులోనూ అతడికి సెలక్టర్లు చోటిచ్చారు. నిజంగా అతడికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ లాంటిదే. ఇక ముందుగా ఊహించినట్లుగానే ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతడిపై పనిభారాన్ని తగ్గించే క్రమంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.అయితే, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కూడా ఈ సిరీస్‌లకు ఎంపిక చేయకపోవడం గమనార్హం. అతడికి కూడా విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. రంజీల్లో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీకి సెలక్టర్లు మొండిచేయి చూపారు.కొత్త ముఖాలకు చోటుతాజా ఎడిషన్‌లో ఆకిబ్ 60 వికెట్లు తీసినప్పటికీ అతడికి అవకాశం ఇవ్వలేదు. ఇక ఐపీఎల్, దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్న యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు మాత్రం తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు బీసీసీఐ ప్రిన్స్‌ను ఎంపిక చేసింది.రోహిత్, హార్దిక్ డౌటేఇక ప్రిన్స్ యాదవ్‌తో పాటు పేసర్ గుర్నూర్ బ్రార్, స్పిన్నర్ మానవ్ సుతార్, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే వంటి కొత్త ఆటగాళ్లు కూడా తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రధాన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌కు లోబడి అందుబాటులో ఉంటారని బీసీసీఐ తెలిపింది.ఇప్పటికే టెస్టు జట్టులో పాతుకుపోయిన ఆంధ్ర పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి.. హార్దిక్ ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా వన్డే జట్టులోనూ చోటు సంపాదించాడు. ఇక వన్డే జట్టు వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తన స్థానం నిలబెట్టుకోగా.. అఫ్గన్‌తో సిరీస్ ద్వారా దిగ్గజ బ్యాటర్, వన్డే రారాజు విరాట్ కోహ్లి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.టీమిండియా- అఫ్గనిస్తాన్ టెస్టు, వన్డే సిరీస్ షెడ్యూల్ఏకైక టెస్టు: జూన్ 6 నుంచి మొదలు- న్యూ చండీగఢ్- ఉదయం 9.30 గంటలకు ఆరంభంతొలి వన్డే: జూన్ 14- ధర్మశాల- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభంరెండో వన్డే: జూన్ 17- లక్నో- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభంమూడో వన్డే: జూన్ 20- చెన్నై- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం.చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్ కీలక ప్లేయర్లు అవుట్ -
బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐసీసీ!
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున.. మ్యాచ్ ఫీజులో కోత విధించింది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 17న తొలి వన్డే జరుగగా కివీస్ గెలుపొందింది.198 పరుగులకు ఆలౌట్‌ఈ క్రమంలో సోమవారం రెండో వన్డే జరుగగా బంగ్లాదేశ్ జయభేరి మోగించింది. యువ పేసర్ నహీద్ రాణా (5/32) కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో చెలరేగి బంగ్లాకు విజయం అందించాడు. అంతర్జాతీయ స్థాయిలో అంతగా అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి.. 48.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. చెలరేగిన నహీద్ఓపెనర్ నిక్ కెల్లీ (102 బంతుల్లో 83; 14 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ టామ్ లాథమ్ (14), హెన్రీ నికోల్స్ (13), విల్ యంగ్ (2), మొహమ్మద్ అబ్బాస్ (19), డీన్ ఫోక్స్ క్రాఫ్ట్ (15), క్లార్క్సన్ (6) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరారు. తన్జిద్, షంటో హాఫ్ సెంచరీలుబంగ్లా బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నహీద్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో షరీఫుల్ ఇస్లామ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.3 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. తన్జిద్ హసన్ (58 బంతుల్లో 76; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), నజ్ముల్ హసన్ షంటో (71 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. సైఫ్ హసన్ (8), సౌమ్య సర్కార్ (8), లిటన్ దాస్ (7) విఫలమైనా... లక్ష్యం చిన్నది కావడంతో బంగ్లాదేశ్‌కు ఎక్కువ ఇబ్బంది కాలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో జైడన్ లెనాక్స్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది.ఫీజులో 10 శాతం కోతఅయితే, న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందున ఐసీసీ బంగ్లాకు షాకిచ్చింది. బంగ్లా జట్టు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనుందన ఈ మేరకు శిక్ష వేసింది. కాగా బంగ్లాదేశ్- న్యూజిలాండ్ మధ్య నిర్ణయాత్మక ఆఖరి వన్డే గురువారం జరగనుంది. చట్టోగ్రామ్ ఇందుకు వేదిక.చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డుpic.twitter.com/3kSqC7iEUy 🚨 BANGLADESH WIN 🚨BAN vs NZ — 2nd ODI | Sher-e-Bangla, DhakaBangladesh chase down 199 with 6 wickets in hand!The heroes of the win:-Nahid Rana — 5 wickets, dismantled the NZ batting lineup-Tanzid Hasan Tamim — 76 off 58 balls, set the chase on…— Suresh N (@TheDugoutStats) April 20, 2026 -
బంగ్లా 221 ఆలౌట్.. న్యూజిలాండ్‌దే తొలి వన్డే
బంగ్లాదేశ్ టూర్‌ను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. హెన్రీ నికోలస్ (68) టాప్ స్కోరర్‌గా నిలవగా, డియాన్ ఫాక్స్ క్రాఫ్ట్ (59) అర్థసెంచరీ సాధించాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసెన్, షోరిపుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ హసన్ (57), తౌహిద్ హృదోయ్ (55) అర్థసెంచరీలు సాధించారు. లిటన్ దాస్ (46) పర్వాలేదనిపించాడు. అయితే వీరు ఔటైన తర్వాత బంగ్లా ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. న్యూజిలాండ్ బౌలర్లలో బ్లెయిర్ టిక్నర్ 4 వికెట్లతో చెలరేగగా, నాథన్ స్మిత్ 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో అర్థసెంచరీ, బౌలింగ్‌లో ఒక వికెట్ తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనరబరిచిన డియాన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే సోమవారం జరగనుంది. -
బీసీసీఐకి మా రిక్వెస్ట్.. లేఖలో ఆ విషయాలు: బంగ్లాదేశ్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సంప్రదించినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తాజాగా ధ్రువీకరించింది. భారత్‌తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ కోసం తాము ముందడుగు వేసినట్లు తెలిపింది. కాగా గత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.భద్రతా కారణాలు చూపుతూఈ క్రమంలో బంగ్లాదేశ్ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ తొలగించగా.. టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు భారత్‌కు వచ్చేందుకు బంగ్లా నిరాకరించింది. భద్రతా కారణాలు చూపుతూ తమ వేదికను శ్రీలంకను మార్చమని ఐసీసీని కోరగా.. ప్రతికూల నిర్ణయం రావడంతో టోర్నీ నుంచే తప్పుకొంది.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు వంత పాడుతూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసింది. ఐసీసీ సైతం బీసీసీఐ ఒత్తిడికి తలొగ్గి బంగ్లాదేశ్‌కు అన్యాయం చేసిందని ఆరోపించింది. ఇందుకు ప్రతిగా తాము భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రగల్భాలు పలికి బొక్కబోర్లా పడింది.భారీగా నష్టపోయే ప్రమాదంఐసీసీ రంగంలోకి దిగడంతో టీమిండియాతో మ్యాచ్ ఆడటమే కాకుండా.. యథావిధిగా మరోసారి ఓటమిని మూటగట్టుకుంది పాకిస్తాన్. ఈ ఎపిసోడ్‌తో బంగ్లాదేశ్ ఆర్థికంగా భారీగా నష్టపోయే ప్రమాదం వచ్చిపడింది. ఆదేశంలోని మెజారిటీ ప్లేయర్ల క్రికెట్ కిట్లకు స్పాన్సర్లుగా ఉన్న భారత కంపెనీలు వైదొలుగుతాయనే భయం పట్టుకుంది.ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పలువురు మాజీ క్రికెటర్లు బంగ్లా బోర్డును హెచ్చరించారు కూడా!.. ఈ క్రమంలో తాజాగా బీసీబీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ నజ్ముల్ అబెదిన్ ఫాహిమ్ ANIతో మాట్లాడుతూ కీలక విషయం వెల్లడించాడు. బీసీసీఐని సంప్రదించాము‘‘వివిధ దేశాల క్రికెట్ బోర్డులతో మేము సమన్వయం చేసుకుంటున్నాము. ఇటీవలే బీసీసీఐని కూడా సంప్రదించాము. ఇ-మెయిల్ ద్వారా లేఖ పంపించాము. అందులో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన గురించి ప్రస్తావించాము. ఈ ఏడాది సెప్టెంబరులో టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సిన విషయాన్ని గుర్తుచేశాము.అదే విధంగా మా మహిళా జట్టు భారత్‌లో పర్యటించాల్సి ఉంది. దీనితో పాటు పరస్పర ప్రయోజనాలు చేకూరేలా క్రికెట్‌కు సంబంధించి ఇతర కార్యక్రమాలు ఏమైనా నిర్వహించవచ్చన్న విషయాన్ని కూడా పరిశీలించాలని అభ్యర్థించాము’’ అని నజ్ముల్ తెలిపాడు. మూడు వన్డేలు, మూడు టీ20లు!కాగా బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిక్ రహమాన్ ఎన్నికైన తర్వాత భారత్- బంగ్లా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఏప్రిల్ 7,8 తేదీల్లో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖా మంత్రి డాక్టర్ ఖాలిలుర్ రహమాన్ భారత పర్యటనకు రానున్నారు.ఈ నేపథ్యంలో క్రికెట్లోనూ సంబంధాల పునరుద్ధరణ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది బంగ్లా బోర్డు. ఇదిలా ఉంటే గతేడాది ఆగస్టులో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. టూర్ వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబరు 1- 13 మధ్య బంగ్లాదేశ్‌తో భారత్ మూడు వన్డే, మూడు టీ20లు ఆడేలా షెడ్యూల్ ఖరారు కావాలని బీసీబీ కోరుకుంటోంది.చదవండి: టీమిండియాకు శుభవార్త: నితీశ్ రెడ్డిపై గావస్కర్ ప్రశంసలు -
మూడో వన్డేలో విండీస్ చిత్తు.. క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్
సెయింట్ కిట్స్ వేదికగా వెస్టిండీస్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా అమ్మాయిల జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0 తో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఆఖరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 35.4 ఓవర్లలో కేవలం 136 పరుగులకే కుప్పకూలింది.అసీస్ స్పిన్నర్ అలానా కింగ్ ఐదు వికెట్లు పడగొట్టి కరేబియన్ జట్టు పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు గార్డనర్ రెండు, హామిల్టన్, కారీ, మెక్‌గ్రాత్ తలా వికెట్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో చినెల్లే హెన్రీ (42 పరుగులు), హేలీ మాథ్యూస్(34 పరుగులు) రాణించగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.అనంతరం 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్(68), ఎలీస్ పెర్రీ(33) నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ముగించారు. విండీస్ బౌలర్లలో అష్మిని మునిసర్ ఒక్క వికెట్ పడగొట్టింది.కాగా అంతకుముందు టీ20 సిరీస్‌ను కూడా ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకుంది. దీంతో మొత్తం పర్యటనలో ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.చదవండి: ముస్తాఫిజుర్ రహమాన్ తొలగింపు దురదృష్టకరం: ఐపీఎల్ చైర్మన్ -
న్యూజిలాండ్ ప్లేయర్ ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్ క్రికెటర్ అమేలియా కెర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్- ఓపెనర్ బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. కాగా సౌతాఫ్రికా మహిళా జట్టుతో స్వదేశంలో న్యూజిలాండ్ వైట్‌బాల్ సిరీస్‌లు ఆడుతోంది.ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా ఆతిథ్య న్యూజిలాండ్ 4-1 తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఇక ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవగా.. వెల్లింగ్టన్ వేదికగా బుధవారం రెండో వన్డే జరిగింది.346 పరుగులుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. కెప్టెన్ వాల్వర్ట్ (69; 8 ఫోర్లు, 1 సిక్స్), అనికె బాష్ (91; 12 ఫోర్లు), ట్రియాన్ (25 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో రాణించారు. అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ 49.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 350 పరుగులు చేసి.. రెండు వికెట్ల తేడాతో గెలిచింది. మహిళల వన్డే క్రికెట్లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం.139 బంతుల్లో 179 పరుగులతో అజేయంగాగతేడాది ఆస్ట్రేలియాపై టీమిండియా ఛేజ్ చేసిన 339 పరుగుల స్కోరు రెండో స్థానానికి చేరింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కివీస్ సారథి అమేలియా కెర్ (Amelia Kerr) ఆకాశమే హద్దుగా చెలరేగింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసిన ఆమె మొత్తంగా 139 బంతుల్లో 179 పరుగులతో అజేయంగా నిలిచింది.కెర్ ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు, 1 సిక్స్ ఉండటం విశేషం. ఇలా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కెర్ న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చగా... ఆమెకు ఇసాబెల్లా (68;11 ఫోర్లు) చక్కటి సహకారం అందించింది. సఫారీ బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా... ప్రస్తుతం సిరీస్ 1–1తో సమమైంది.అమేలియా కెర్ ప్రపంచ రికార్డుసౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా అమేలియా కెర్ 179 పరుగులతో అజేయంగా నిలవడం ద్వారా.. మహిళల వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్- ఓపెనింగ్ ప్లేయర్‌గా రికార్డు సాధించింది. ఇంతకు ముందు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం చమరి ఆటపట్టు పేరిట ఉండేది.బ్రిస్టల్ వేదికగా 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆటపట్టు 178 పరుగులతో అజేయంగా నిలిచింది. తాజాగా ఆమె కంటే ఒక్క పరుగు ఎక్కువ చేసిన అమేలియా కెర్.. ఆటపట్టును అధిగమించింది. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (171), న్యూజిలాండ్ స్టార్లు సుజీ బేట్స్ (168), బీఎమ్ హైల్డే (157) కెర్, ఆటపట్టు తర్వాతి స్థానాల్లో నిలిచారు.చదవండి: నాకైతే భయం వేస్తోంది: వైభవ్ సూర్యవంశీపై పాక్ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు -
బంగ్లాదేశ్ పర్యటన.. కివీస్ వన్డే, టీ20 జట్ల ప్రకటన
బంగ్లాదేశ్ పర్యటనకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టును కివీస్ బోర్డు ప్రకటించింది. ఇందులో పేస్ త్రయం మ్యాట్ ఫిషర్, విలియం ఓ రూర్కీ, బ్లెయిర్ టిక్నర్లకు చోటు దక్కింది. కాగా భారత్‌తో టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది.ఈ క్రమంలో ఐసీసీ టోర్నీ ముగిసిన వెంటనే దాదాపుగా ద్వితీయ శ్రేణి జట్టుతో స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడింది కివీస్ జట్టు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రొటిస్ జట్టు ఆతిథ్య న్యూజిలాండ్‌పై 3-2తో గెలిచింది.పరిమిత ఓవర్ల సిరీస్లుఇక ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పర్యటన (New Zealand tour of Bangladesh, 2026)కు వెళ్లేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. తొలుత ఏప్రిల్ 17న వన్డే సిరీస్ మొదలుకానుండగా.. మే 2 నాటి మూడో టీ20తో ఈ టూర్ ముగియనుంది.టామ్ లాథమ్ సారథ్యంలోఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కివీస్ బోర్డు తాజాగా తమ జట్లను ప్రకటించింది. మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) స్థానంలో వన్డే, టీ20 జట్లకు టెస్టు కెప్టెన్ టామ్ లాథమ్ సారథ్యం వహించనున్నాడు.కాగా సాంట్నర్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడితో పాటు పలువురు కీలక ప్లేయర్లు సైతం ఐపీఎల్, పాకిస్తాన్ సూపర్ లీగ్ విధులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్లేయర్లతో కివీస్ బోర్డు వన్డే, టీ20 జట్లను ప్రకటించింది.ఇక గాయాల నుంచి కోలుకున్న ఫిషర్, ఓరూర్కీ, టిక్నర్ తిరిగి జట్టుతో చేరడం పట్ల హెడ్‌కోచ్ రాబ్ వాల్టర్ హర్షం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే.. ఆఫ్ స్పిన్నింగ్ ఆల్‌రౌండర్ డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ చాలా కాలం తర్వాత తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు.బంగ్లాదేశ్ పర్యటనకు న్యూజిలాండ్ వన్డే జట్టు (ఏప్రిల్ 17, 20, 23)టామ్ లాథమ్ (కెప్టెన్), ముహమ్మద్ అబ్బాస్, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డేన్ క్లీవర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, నిక్ కెల్లి, జేడెన్ లెనాక్స్, హెన్రీ నికోల్స్, విలియం ఓరూర్కీ, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.బంగ్లాదేశ్‌తో టీ20లకు న్యూజిలాండ్ జట్టు (ఏప్రిల్ 27, 29, మే 2)టామ్ లాథమ్ (కెప్టెన్), కెటెనె క్లార్క్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డేన్ క్లీవర్, మ్యాట్ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, బెవాన్ జేకబ్స్, నిక్ కెల్లి, జేడెన్ లెనాక్స్, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్.చదవండి: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీని పంపండి: మైకేల్ వాన్ -
‘అఫ్గనిస్తాన్‌తో సిరీస్ బాయ్‌కాట్ చేయొచ్చు’
క్రికెట్ ఐర్లాండ్ ఇటీవలే అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేసింది. సొంతగడ్డపై ఆగష్టు 5- 14 వరకు ఐర్లాండ్- అఫ్గనిస్తాన్ మధ్య ఐదు వన్డేలు జరుగనున్నట్లు వెల్లడించింది.కాగా గతంలో ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్లు అఫ్గనిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు బహిష్కరిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అఫ్గన్‌లో 2021లో తిరిగి వచ్చిన తాలిబన్ ప్రభుత్వం మహిళలు, బాలికల పట్ల అనుసరిస్తున్న విధానాలే కారణం.అయితే, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ సమయంలో ఇంగ్లండ్ అఫ్గన్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తామని ముందుగా చెప్పినా.. ఆ తర్వాత మాత్రం మ్యాచ్ ఆడింది. ఇక ఐర్లాండ్ తాజాగా అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్ ఆడనుండటం పట్ల విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో క్రికెట్ ఐర్లాండ్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ గ్రేమ్ వెస్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము అఫ్గన్‌తో సిరీస్ నిర్వహిస్తున్నా.. ఇష్టం లేని ఆటగాళ్లు తప్పుకొనే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘కచ్చితంగా ఆటగాళ్లకు మేము ఆ వెసలుబాటు కల్పిస్తాం.ఇప్పటికే పురుష, మహిళల జట్లతో మేము ఈ విషయంలో అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాము. బోర్డుతో కూడా మాట్లాడాము. ఇరు వర్గాలకు ఇందుకు సంబంధించి పూర్తి అవగాహన ఉంది. ఈ విషయంలో వారికి స్వేచ్ఛ ఉంటుంది’’ అని వెస్ట్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. క్రికెట్ ఐర్లాండ్ సీఈవో ఇటీవలే ఎంపికైన సారా కీన్ అఫ్గనిస్తాన్‌తో సిరీస్ నిర్వహణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళగా తనకు ఈ విషయంలో నైతికంగా కాస్త ఇబ్బందిగానే ఉందని.. అయితే, సిరీస్ బహిష్కరించడం ద్వారా సాధించేది ఏమీ ఉండకపోవచ్చని అన్నారు.తమ బోర్డులో నలభై శాతం మహిళలే ఉన్నారని.. అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ను బహిష్కరించే బదులు.. ఆ మహిళా జట్టును కూడా ఐర్లాండ్‌కు పంపాల్సిందిగా కోరినట్లు సారా తెలిపారు. కాగా ఇటీవల ఐర్లాండ్ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విఫలమైంది. కనీసం సూపర్-8 దశ చేరకుండానే లీగ్ స్టేజీలోనే నిష్క్రమించింది. ఫలితంగా టీ20 కెప్టెన్ పదవికి పాల్ స్టిర్లిండ్ రాజీనామా చేశాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టులో అఫ్గనిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు బ్రీడీ, బెల్ఫాస్ట్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. -
జట్టులో చోటుకే దిక్కులేదు.. కెప్టెన్‌ను చేయాలా?
పాకిస్తాన్ పేస్ దళ నాయకుడిగా పేరొందిన షాహిన్ ఆఫ్రిదిపై విమర్శల వర్షం కురుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026లో పేలవ ప్రదర్శన, వన్డే కెప్టెన్‌గా బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమి ఇందుకు తాజా కారణాలు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 103 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టార్మ్ పేసర్ 136 వికెట్లు కూల్చాడు.తద్వారా పాక్ తరఫున పొట్టి క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షాహిన్ ఆఫ్రిది కొనసాగుతున్నాడు. అయితే, గత కొంతకాలంగా అతడి ఆట మరీ దిగజారింది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో మొత్తంగా ఎనిమిది వికెట్లు మాత్రమే తీయగలిగాడు.పదకొండేళ్ల తర్వాతఇక ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో పాక్ వన్డే జట్టుగా బాధ్యతలు నిర్వర్తించిన షాహిన్ ఆఫ్రిది.. 2-1 తేడాతో పాక్ సిరీస్ కోల్పోవడంతో విమర్శల పాలయ్యాడు. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత పాక్ బంగ్లాకు వన్డే సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి కావడంతో విమర్శలు పదునెక్కాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సైతం షాహిన్ ఆఫ్రిది ఆట తీరుపై మండిపడ్డాడు.జట్టులో చోటుకే దిక్కులేదు‘‘పాకిస్తాన్ టీ20, వన్డే జట్ల కెప్టెన్‌గా షాహిన్ ఆఫ్రిది ఉండాలని గతంలో క్యాంపెయిన్ నడిచింది. ఆ తర్వాత వన్డేలకు బదులు టీ20 జట్టుకు కెప్టెన్ అయితే చాలు అన్నారు. కానీ ఇప్పుడు వన్డే కెప్టెన్‌గా అతడు పూర్తిగా విఫలమయ్యాడు.నిజానికి పాక్ టీ20 జట్టులో అతడికి చోటు కూడా ఇవ్వొద్దు. ముఖ్యంగా తుదిజట్టులో ఉండే అర్హత అతడు కోల్పోయాడు. అతడి ఖేల్ ఖతమైపోయింది’’ అని రషీద్ లతీఫ్ షాహిన్ ఆఫ్రిదిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.మామ అలామరోవైపు.. బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ ఓటమి తర్వాత షాహిన్ ఆఫ్రిది మామ, మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ.. సెలక్షన్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్, బంగ్లా సిరీస్‌లో ఓటముల నేపథ్యంలో విమర్శలకు సెలక్టర్లు అర్హులేనని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. ఏ ఫార్మాట్‌కు ఎవరిని కెప్టెన్ చేయాలో తెలియదంటూ మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో రషీద్ లతీఫ్ పైవిధంగా స్పందించడం గమనార్హం.చదవండి: పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లా క్రికెట్ బోర్డు! -
’ఇంకా నేర్చుకుంటూనే ఉండు.. సెలక్టర్లకు బుద్ధి లేదు’
పాకిస్తాన్ స్టార్ మహ్మద్ రిజ్వాన్‌పై ఆ దేశ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెజాద్ విమర్శల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా నేర్చుకునే దశలోనూ ఉన్నాడంటూ చురకలు అంటించాడు. ఇప్పటికైనా ఆట తీరు మార్చుకోకపోతే జట్టులో కొనసాగడం కష్టమని అభిప్రాయపడ్డాడు.చేదు అనుభవం.. బంగ్లా చేతిలో చిత్తుటీ20 ప్రపంచకప్-2026లో సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన పాకిస్తాన్ జట్టు.. తాజాగా బంగ్లాదేశ్ పర్యటనలోనూ చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో 2-1తో ఓడిపోయి దాదాపు పదకొండేళ్ల తర్వాత.. తొలిసారి బంగ్లాదేశ్‌కు సిరీస్ కోల్పోయింది.షాహిన్ ఆఫ్రిది సారథ్యంలో బంగ్లాతో వన్డే సిరీస్ ఆడిన పాకిస్తాన్ జట్టులో రిజ్వాన్ ఒక్కటే సీనియర్ మోస్ట్ ప్లేయర్. అయితే, ఈ వికెట్ కీపర్ బ్యాటర్ దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం 58 పరుగులే చేశాడు.అసలు టెక్నికే సరిగ్గా లేదుఈ నేపథ్యంలో అహ్మద్ షెజాద్ రిజ్వాన్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘బంతులు నువ్వు ఆడగలిగేలానే పడుతున్నాయి రిజ్వాన్ సాబ్. నువ్వు చాలా సమయం తీసుకుంటున్నావు. అయినా సరే బంతిని బాదలేకపోతున్నావు.అసలు టెక్నికే సరిగ్గా లేదు. లెగ్ సైడ్ ఆడాల్సింది. ఇన్నేళ్లు గడిచినా నువ్వింకా నేర్చుకునే దశలోనే ఉన్నావు. అసలు నీ ఆటలో ఏమైనా పురోగతి ఉందా? టీ20 ప్రపంచకప్ జట్టులో నీకు స్థానమే లేదు.బుద్ధి రావడం లేదువన్డేల్లోనైనా అవకాశం ఇచ్చారు. బంగ్లాదేశ్ వంటి జట్టుపై నువ్వు సెంచరీలు బాదాల్సింది. కానీ సెలక్టర్ల నిర్ణయం తప్పని నిరూపించేలా చెత్తగా ఆడావు. నిన్ను జట్టుకు ఎంపిక చేసే వాళ్లకు కూడా బుద్ధి రావడం లేదు’’ అని అహ్మద్ షెజాద్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా 2015లో పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేసిన రిజ్వాన్.. ఇప్పటి వరకు 41 టెస్టుల్లో 2399, 103 వన్డేల్లో 2979, 106 టీ20లలో 3414 పరుగులు సాధించాడు.చదవండి: కోహ్లి, గేల్ కాదు!.. అత్యుత్తమ టీ20 క్రికెటర్ అతడే: డివిలియర్స్ -
‘అతడు మానసికంగా అన్‌ఫిట్.. అందుకే చోటు కరువు’
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. దాదాపు పదకొండేళ్ల తర్వాత తొలిసారి బంగ్లాదేశ్‌కు వన్డే సిరీస్‌ను కోల్పోయింది. బంగ్లా పర్యటనలో భాగంగా మూడో వన్డేలో ఓడి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది.షాహిన్ ఆఫ్రిది కెప్టెన్సీలో ఈ మూడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్.. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడినా.. రెండో వన్డేలో గెలిచింది. ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిన మూడో వన్డేలో మాత్రం 11 పరుగుల తేడాతో ఓటమిపాలై సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ఆట తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎవరు ఎంపిక చేశారు?ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ హెడ్‌కోచ్ మైక్ హెసన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ‘‘ఈ పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎవరు ఎంపిక చేశారు? అన్నింటిలోనూ అతి జోక్యం అవసరమా? ఇదేమైనా అతడి అంకుల్స్ జట్టా?’’ అంటూ ఫైర్ అయ్యాడు.పాకిస్తాన్ క్రికెట్‌ను నాశనం చేయడంలో...ఇక చీఫ్ సెలక్టర్ ఆకిబ్ జావేద్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పాకిస్తాన్ క్రికెట్‌ను నాశనం చేయడంలో ఆకిబ్ జావేద్ పాత్ర కూడా ఉంది. మైక్ హసన్‌కు తన సెలక్షన్ అధికారాలను కట్టబెట్టిందే అతడు. హెడ్‌కోచ్ అయినప్పటికీ.. సెలక్టర్ల పనిని తానే చేస్తున్నాడు. అతడే జట్టు ఎంపిక చేస్తున్నాడు. దీనికి కారణం ఎవరు?’’ అని బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.మానసికంగానే అతడు అన్ఫిట్అదే విధంగా.. బాబర్ ఆజంను బంగ్లాదేశ్ పర్యటన నుంచి తప్పించడంపై ఆకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్యలపైనా బసిత్ అలీ స్పందించాడు. ఆకిబ్ చెప్పినట్లు బాబర్‌కు ఎలాంటి గాయమూ కాలేదని పేర్కొన్నాడు. ‘‘బాబర్ ఆజం శారీరకంగా ఫిట్‌గానే ఉన్నాడు. మానసికంగానే అతడు అన్‌ఫిట్’’ అంటూ బసిత్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా బాబర్ ఆజం గత కొంతకాలంగా ఫామ్‌లేమితో విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విఫలంఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో వన్డేల నుంచి సెలక్టర్లు అతడిని తప్పించినట్లు వార్తలు రాగా.. ఆకిబ్ జావేద్ మాత్రం ఫిట్‌గా లేనందువల్లే సెలక్ట్ చేయలేదని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాకిస్తాన్ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే, గత వరల్డ్‌కప్‌లో సూపర్-8 కూడా చేరుకుండానే నిష్క్రమించిన పాక్.. ఈసారి సూపర్-8కు చేరుకున్నా.. సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ టోర్నీలో బాబర్ ఆజం మొత్తంగా 91 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.చదవండి: అతడి ఆట అసాధారణం.. గంభీర్‌పై ద్రవిడ్ ప్రశంసలు -
బంగ్లాదేశ్‌దే వన్డే సిరీస్
ఢాకా: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బంగ్లాదేశ్ జట్టు 2–1తో పాకిస్తాన్‌పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఆఖరి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్ 128 పరుగుల తేడాతో నెగ్గింది. నిర్ణయాత్మక పోరులో విజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్ చేజిక్కించుకుంది. కీలక మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్... నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్ తన్జిద్ హసన్ (107 బంతుల్లో 107; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కగా... తౌహిద్ హృదయ్ (48 నాటౌట్; 4 ఫోర్లు), లిటన్ దాస్ (41; 1 ఫోర్, 1 సిక్స్), సైఫ్ హసన్ (36; 3 ఫోర్లు) అతడికి సహకరించారు. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3 వికెట్లు పడగొట్టగా... షాహీన్ షా అఫ్రిది, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 50 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సల్మాన్ ఆగా (98 బంతుల్లో 106; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో పోరాడగా... అబ్దుల్ సమద్ (34; 5 ఫోర్లు), సాద్ మసూద్ (38; 5 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. సాహిబ్జాదా ఫర్హాన్ (6), మాజ్ (6), రిజ్వాన్ (4) విఫలమయ్యారు. పాకిస్తాన్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 28 పరుగులు అవసరమైన దశలో రెండు సిక్స్‌లు కొట్టిన కెప్టెన్ షాహీన్ అఫ్రిది (38 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆశలు రేపినా ఫలితం లేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టగా... ముస్తఫిజుర్ 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ ద్వారా పాకిస్తాన్ ప్లేయర్లు ఘాజి ఘోరి, సాద్ మసూద్ అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశారు. -
అబ్బో క్రీడాస్ఫూర్తి!.. పాక్ క్రికెటర్లపై లిటన్ దాస్ ఫైర్
పాకిస్తాన్ క్రికెటర్ల తీరుపై బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లా- పాక్ మధ్య శుక్రవారం జరిగింది చారిటీ మ్యాచ్ కాదని.. అదొక ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటూ చురకలు అంటించాడు. నిబంధనలకు అనుగుణంగానే తాము వ్యవహరించామని స్పష్టం చేశాడు.కాగా మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్ వెళ్లిన పాకిస్తాన్ జట్టు తొలి వన్డేలో చిత్తుగా ఓడింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో వన్డేలో మాత్రం సమిష్టిగా రాణించి ఆతిథ్య జట్టును చిత్తు చేసిన పాక్ 1-1తో సిరీస్‌ను సమం చేసింది.రనౌట్‌పై వివాదంఇదిలా ఉంటే.. పాక్ బ్యాటర్ సల్మాన్ ఆఘా రనౌట్ (Salman Agha's run-out)పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. బంగ్లా కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో మొహ్మద్ రిజ్వాన్ స్ట్రెయిట్ షాట్ ఆడగా.. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సల్మాన్‌కు బంతి తాకింది. అప్పటికే క్రీజును వీడిన అతడు బంతి అందుకుని మిరాజ్‌కు ఇచ్చే ప్రయత్నం చేయగా.. వేగంగా స్పందించిన మిరాజ్ బంతిని వికెట్లకు గిరాటేశాడు.మాటల యుద్ధంఈ క్రమంలో బంగ్లాదేశ్ రనౌట్‌కు అప్పీలు చేయగా.. సానుకూల ఫలితం వచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన సల్మాన్ హెల్మెట్‌ను నేలకేసి కొట్టి అసంతృప్తి వెళ్లగక్కాడు. మిరాజ్‌తో కాసేపు మాటల యుద్ధం చేశాడు. ఇంతలో లిటన్ దాస్ జోక్యంచేసుకోగా.. రిజ్వాన్ అతడిని సముదాయించి పక్కకు తీసుకువెళ్లాడు.క్రీడా స్ఫూర్తి ప్రదర్శించేవాడిని అయితే, సల్మాన్ రనౌట్ అయిన విషయంపై పాక్ జట్టు, మాజీ క్రికెటర్లు రాద్దాంతం చేస్తున్నారు. సల్మాన్ ఆఘా మిరాజ్ స్థానంలో ఉండి ఉంటే ఇలా చేసి ఉండేవాడిని కాదన్నాడు. క్రీడా స్ఫూర్తి ప్రదర్శించేవాడిని అన్నాడు.ఇక పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా స్పందిస్తూ.. ‘‘నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్ చేసింది సరైందే కావచ్చు. కానీ క్రీడాస్ఫూర్తికి వారు భంగం కలిగించారు. బ్యాటర్ బౌలర్‌కు సాయం చేద్దామని చూశాడు. కానీ అతడు తనని రనౌట్ చేస్తాడని ఊహించలేదు’’ అని మిరాజ్ తీరును విమర్శించాడు.ఇదేమీ చారిటీ లీగ్ మ్యాచ్ కాదుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ స్పందిస్తూ.. ‘‘ముందుగా అందరికీ ఓ విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. ఇదేమీ చారిటీ లీగ్ మ్యాచ్ కాదు. ఇదొక అంతర్జాతీయ మ్యాచ్.క్రీడాస్ఫూర్తికి భంగమా?నిబంధనలకు అనుగుణంగానే మేము రనౌట్ చేశాము. ఇందులో క్రీడాస్ఫూర్తికి భంగం కలిగినట్లు నాకైతే ఎక్కడా కనిపించలేదు. ప్రతి ఒక్కరికి తమ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. అయితే, మైదానంలో ఆటగాళ్లుగా అది అవుట్ అంటే అవుటేనని మా అందరికీ తెలుసు’’ అని పాక్ క్రికెటర్లు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.కాగా ఢాకాలో జరిగిన రెండో వన్డేలో టాస్ ఓడిన పాక్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (31), మాజ్ సదాకత్ (75)లతో పాటు రిజ్వాన్ (44), సల్మాన్ ఆఘా (64) రాణించారు. దీంతో 47.3 ఓవర్లలో 274 పరుగులు చేసి పాక్ ఆలౌట్ అయింది.బంగ్లా బౌలర్లలో రిషాద్ హొసేన్ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ మిరాజ్ రెండు, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నహీద్ రాణా తలా ఒక వికెట్ తీశారు. ఇక వర్షం వల్ల బంగ్లా టార్గెట్‌ను డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం 32 ఓవర్లలో 243 పరుగులకు కుదించగా.. 23.3 ఓవర్లలో 114 పరుగులు చేసి ఆలౌట్ అయింది.చదవండి: SRH: బెస్ట్ ప్లేయింగ్ XII.. రూ. 13 కోట్ల ఆటగాడికి దక్కని చోటు!Crucial moment! Mehidy Hasan Miraz removes Salman Agha with a brilliant run-out. ⚡🏏#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/N0inKkZVwz— Bangladesh Cricket (@BCBtigers) March 13, 2026 -
BAN vs PAK: ’చెడ్డ మాటలు!.. అలా రనౌట్ చేస్తాడనుకోలేదు’
బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో తాను అవుటైన విధానంపై పాకిస్తాన్ క్రికెటర్ సల్మాన్ ఆఘా స్పందించాడు. ఆ సమయంలో తాను గందరగోళంలో పడిపోయానని.. అంతలో మెహిదీ హసన్ మిరాజ్ మాత్రం తనను రనౌట్ చేసేందుకే మొగ్గుచూపాడని పేర్కొన్నాడు. దీంతో ఇద్దరి మధ్య మైదానంలోవాగ్యుద్ధం నడిచిందన్నాడు.అసలు విషయం ఏమిటంటే.. మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో బంగ్లా గెలవగా.. శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లో పాక్ జయభేరి మోగించింది.ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ ఇన్నింగ్స్ సందర్భంగా బంగ్లా కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ 39వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగాడు. అప్పటికి క్రీజులో ఉన్న మొహ్మద్ రిజ్వాన్ మిరాజ్ బౌలింగ్‌లో నాలుగో బంతికి స్ట్రెయిట్ షాట్ ఆడాడు. అది నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సల్మాన్ ఆఘా ప్యాడ్‌కు తగిలి కింద పడింది.రనౌట్‌కు అప్పీలు ఈ క్రమంలో బంతి కోసం వచ్చిన మిరాజ్- సల్మాన్‌ను ఢీకొట్టగా.. బంతిని తీసి మిరాజ్‌కు ఇచ్చే ప్రయత్నం చేశాడు సల్మాన్. అప్పటికి అతడు క్రీజు బయటే ఉండటం గమనించిన మిరాజ్ బంతిని అందుకుని స్టంప్స్‌కు గిరాటేసి.. రనౌట్‌కు అప్పీలు చేశాడు.ఇందుకు అంపైర్ నుంచి సానుకూల ఫలితంగా వచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన సల్మాన్ మిరాజ్‌తో గొడవపడ్డాడు. ఇంతలో లిటన్ దాస్ కూడా మిరాజ్‌కు మద్దతుగా రాగా.. రిజ్వాన్ అతడిని శాంతింపజేశాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా మిరాజ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ విమర్శల వర్షం కురుస్తోంది. మరోవైపు.. టెక్నికల్‌గా మిరాజ్ చేసింది సరైందేనని మరికొందరు వాదిస్తున్నారు. ఈ పరిణామాలపై సల్మాన్ ఆఘా స్వయంగా స్పందించాడు.Crucial moment! Mehidy Hasan Miraz removes Salman Agha with a brilliant run-out. ⚡🏏#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/N0inKkZVwz— Bangladesh Cricket (@BCBtigers) March 13, 2026అలా రనౌట్ చేస్తాడనుకోలేదు‘‘అతడు చేసింది నిబంధనల ప్రకారం సరైందే. ఆ సమయంలో అతడు తాను సరైంది అనుకున్న పనే చేశాడు. నేనే కాస్త భిన్నంగా ప్రవర్తించాల్సింది. గతంలో నేను ఇప్పుడూ ఇలా చేయలేదు. ఇకముందు కూడా చేయను.నిజానికి బంతి నా ప్యాడ్‌ను తాకి.. తర్వాత బ్యాట్‌కు తాకింది. కాబట్టి అతడు నన్ను రనౌట్ చేయడని భావించా. ముందుగా చెప్పినట్లు బంతి నా ప్యాడ్, బంతిని అప్పటికే తాకింది. అతడికి బంతి తిరిగి ఇచ్చే ప్రయత్నం చేశా. నేనేమీ పరుగు తీయడానికి ప్రయత్నించలేదు.చెడ్డ మాటలు!.. కానీ అతడు నన్ను రనౌట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో మేమిద్దరం ఒకరినొకరం చాలా మాటలే అనుకున్నాం. అవేమీ మంచి మాటలు కాదు. కోపంలో ఇద్దరం అలా నోరు జారాము’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. కాగా బంతి బ్యాటర్ ప్యాడ్ లేదంటే దుస్తుల్లో ఇరుక్కుంటే డెడ్‌బాల్ అవుతుంది. అలా కాకుండా ప్యాడ్, బ్యాట్‌ను తాకి రోల్ అయితే మాత్రం అది ఇంకా లైవ్‌లోనే ఉన్నట్లు లెక్క. ఈ నిబంధన ప్రకారమే మిరాజ్ సల్మాన్‌ను రనౌట్ చేశాడు. కానీ సల్మాన్ మాత్రం ఆ బంతి డెడ్ అయిందని భావించడం కన్ఫ్యూజన్కు దారితీసి ఉంటుంది.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో సల్మాన్ హాఫ్ సెంచరీ (64) చేయగా.. మిరాజ్ రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించగా.. డీఎల్ఎస్ పద్ధతిలో పాక్ బంగ్లాపై 128 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది.చదవండి: ఇది కాదు.. గంభీర్‌కు ముందుంది అసలైన సవాల్: గంగూలీ -
ప్రతీకారం తీర్చుకున్న పాకిస్తాన్
బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో ఎదురైన ఘోర పరబాభావానికి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో 128 పరుగుల భారీ తేడాతో (డీఎల్ఎస్ పద్దతి ప్రకారం) ఆతిథ్య బంగ్లాను పాక్ చిత్తు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మెన్ ఇన్ గ్రీన్ 1-1తో సమం చేసింది.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 47.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాక్ బ్యాటర్లలో యువ ఆటగాడు మాజ్ సదాకత్ (75) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సల్మాన్ ఆఘా (64), మహమ్మద్ రిజ్వాన్ (44) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన బంగ్లాదేశ్ 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో ఆటకు వర్షం కూడా అంతరాయం కలిగించింది. భారీ వర్షం, వడగళ్ల వాన కారణంగా ఆట రెండు గంటల పాటు నిలిచిపోయింది. ఆ తర్వాత డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 243 పరుగులుగా కుదించారు. కానీ ఆట తిరిగి మొదలయ్యాక కూడా బంగ్లా వికెట్ల పతనం కొనసాగింది.లిటన్ దాస్ (41) కాసేపు పోరాడినా, అతనికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. దీంతో బంగ్లా జట్టు కేవలం 23.3 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్ బౌలర్లలో మాజ్ సదాకత్, హారిస్ రవూఫ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. షాహిన్ అఫ్రిది రెండు వికెట్లు సాధించాడు. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే మార్చి 15న ఇదే వేదికలో జరగనుంది.చదవండి: IPL 2026: కేకేఆర్‌కు మరో భారీ షాక్ -
పాక్‌కు ఘోర ఓటమి.. షాహిన్ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఢాకా వేదికగా తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లా చేతిలో పాక్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో కనీసం సెమీస్ చేరకుండానే పాకిస్తాన్ జట్టు ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.మూడు వన్డేల సిరీస్‌ఈ క్రమంలో వరల్డ్‌కప్ టోర్నీ అనంతరం తొలుత బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది పాక్ జట్టు. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు ఆడాల్సి ఉండగా.. బుధవారం ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరిగింది. 114 పరుగులకే ఆలౌట్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిని పాక్.. 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్, అరంగేట్ర బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ 27 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఆల్‌రౌండర్ ఫాహీమ్ ఆష్రఫ్ 37 పరుగులతో పాక్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్ యువ పేసర్ నహీద్ రాణా ఐదు వికెట్లతో చెలరేగి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ మూడు, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.15.1 ఓవర్లలోనే ఫినిష్లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ కేవలం 15.1 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. రెండు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసి పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. కాగా వరల్డ్‌కప్ టోర్నీలో విఫలమైన బాబర్ ఆజంను బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పించింది యాజమాన్యం.ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో తొలి వన్డే సందర్భంగా సాహిబ్జాదా ఫర్హాన్, షామిల్ హుసేన్, మాజ్ సదాకత్ వన్డేల్లో అరంగేట్రం చేశారు. వీరిలో ఫర్హాన్ కాస్త ఫర్వాలేదనిపించగా.. అతడి ఓపెనింగ్ జోడీగా వచ్చిన సదాకత్ 18 పరుగులకే నిష్క్రమించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన షామిల్ 4 పరుగులకే అవుటయ్యాడు.ఓడినా పర్లేదుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి అనంతరం పాక్ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది స్పందిస్తూ.. ‘‘ఓడిపోయినపుడు ఎన్నో అంశాలకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇది యువ జట్టు. చివరి వరకు ఈ జట్టుకు నేను మద్దతుగా ఉంటాను’’ అని తెలిపాడు.అదే విధంగా.. ‘‘వన్డే క్రికెట్లో భాగస్వామ్యాల నిర్మాణం అత్యంత ముఖ్యం. బ్యాట్, బాల్.. రెండింటితోనూ రాణించాల్సి ఉంటుంది. జట్టుకు ఇదొక మేలుకొలుపు లాంటిది. నహీద్ రాణా రానంత వరకు మా జట్టు బాగానే ఆడింది.అత్యద్భుతంగా బౌలింగ్ చేసిఅయితే, అతడు అత్యద్భుతంగా బౌలింగ్ చేసి మమ్మల్ని దెబ్బ కొట్టాడు. ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. ఆ రెండింటిపై దృష్టి పెట్టి సానుకూల ఫలితం సాధిస్తాం’’ అని షాహిన్ ఆఫ్రిది చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లా- పాక్ మధ్య మార్చి 13న రెండు వన్డే, మార్చి 15న మూడో వన్డే జరుగుతాయి. ఢాకాలోని షేరే బంగ్లా నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: T20 WC 2026: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’ -
‘గేమ్‌ప్లాన్ ఎవడిదో కానీ చంపేయాలి’!
పాకిస్థాన్ క్రికెట్ అంటేనే అనిశ్చితికి మారుపేరు. ఎప్పుడు ఎలా ఆడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ, కమ్రాన్ అక్మల్ గేమ్‌ప్లాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్ బాసిత్ అలీ మాట్లాడుతూ.. ‘పవర్‌ప్లేలో 60 కంటే తక్కువ పరుగులు చేయాలని చెప్పిన వాడిని మొదట షూట్ చేయాలి. గేమ్‌ప్లాన్ చాలా చెత్తగా ఉంది. నాకు తెలిసి ఆ చెప్పినవాడు ఇంతవరకు ఒక్కసారి కూడా గ్రౌండ్లోకి దిగినట్లుగా అనిపించడం లేదు. కేవలం పేపర్‌పై రాసుకొన్న థియరీని మాత్రమే అప్లై చేసే పనిలో పడ్డట్లున్నాడు. పిచ్ పరిస్థితులపై కనీసం అంచనాలు లేకుండా జట్టును బరిలోకి ఎలా దించుతారు. ఇదే పిచ్‌పై టీమిండియా కూడా ఓటమి పాలైందన్న సంగతి మరిచిపోయినట్లున్నారు.’ అని తెలిపాడు. మరో మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ కూడా ఘాటుగా స్పందించాడు. ‘ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఒకవైపు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతుంటే.. పాకిస్థాన్ ఆటతీరు మాత్రం క్లబ్ క్రికెట్ కోసం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నట్లుగా ఉంది. బాసిత్ అలీకి ఫోన్ చేసి పాక్ జట్టు ఆడుతున్న ఆట గురించి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అంతేకాదు క్లబ్ క్రికెటర్లు కూడా ఇంత దారుణంగా ఆడరనుకుంటా’ అని తెలిపాడు. బంగ్లాతో మ్యాచ్‌లో ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయని బాసిత్ అలీ తెలిపారు. జట్టులో యువరక్తం ఎక్కువగా ఉందని, వాళ్లంతా సెటిల్ కావడానికి టైం పట్టే అవకాశముందన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 30.4 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలింది. ఫహీమ్ అశ్రఫ్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో నహిద్ రానా 5 వికెట్లు తీయగా, మెహదీ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బంగ్లాదేశ్ 15.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే మార్చి 13న జరగనుంది.చదవండి: గురుశిష్యులకు అరుదైన గౌరవం! -
200 పరుగుల తేడాతో చిత్తుగా!
జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ మహిళల జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. డునెడిన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కివీస్ అమ్మాయిలు 200 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకొని 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. కెప్టెన్ అమెలియా కెర్ (106 బంతుల్లో 80), మ్యాడీ గ్రీన్ (73 బంతుల్లో 94) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో చటోన్వాజ 2 వికెట్లు తీయగా, మకుశా, అడెల్, మరంగేలు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే మహిళల జట్టు 27.1 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. లోరీన్ షుమా 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, చిపో టిరిపానో 22 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో అమేలి కెర్ 5 వికెట్లతో జింబాబ్వే నడ్డి విరవగా.. రోస్‌మేరీ మెయిర్ 2 వికెట్లు పడగొట్టింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన అమెలియా కెర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకుంది. చదవండి: భజ్జీ చేసిన గాయం ఇప్పటికీ మానలేదు! -
PCB: బాబర్‌పై వేటు.. కెప్టెన్‌గా ఆఫ్రిది.. ఆరుగురికి చోటు
ఊహాగానాలే నిజమయ్యాయి. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విఫలమైన ‘స్టార్’ బ్యాటర్ బాబర్ ఆజంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) వేటు వేసింది. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ నుంచి అతడిని తప్పించింది.బంగ్లాతో వన్డే సిరీస్‌కాగా ఢాకా వేదికగా బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య మార్చి 11- 15 మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో పర్యటించే జట్టును పీసీబీ బుధవారం ప్రకటించింది. పేస్ బౌలర్ షాహిన్ ఆఫ్రిదిని కెప్టెన్‌గా కొనసాగించిన యాజమాన్యం.. బాబర్‌ను మాత్రం ఎంపిక చేయలేదు.ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటుఅంతేకాదు.. ఈ జట్టులో ఏకంగా ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటు ఇచ్చారు సెలక్టర్లు. తద్వారా సీనియర్లపై కఠిన చర్యలు తప్పవని.. జట్టు పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే అబ్దుల్ సమద్, మాజ్ సదాకత్, ముహమద్ ఘాజి ఘోరి, సాద్ మసూద్, సాహిబ్జాదా ఫర్హాన్, షామిల్ హుసేన్‌లకు తొలిసారి వన్డే జట్టులో చోటు ఇచ్చారు.అందుకే బాబర్‌పై వేటు.. వారికి చోటుకాగా బాబర్ ఆజం ఆట తీరుపై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ప్రపంచకప్ టోర్నీలోనూ అతడు విఫలమయ్యాడు. మొత్తంగా 91 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.ఇక గతేడాది వన్డేల్లోనూ బాబర్ ఆజం 17 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 544 పరుగులే చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అతడిని పక్కనపెట్టారు. మరోవైపు.. టీ20 జట్టులో నిలకడగా రాణిస్తున్న ఓపెనర్ ఫర్హాన్‌కు మాత్రం సెలక్టర్లు వన్డేక్యాప్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కాగా ఫర్హాన్ వరల్డ్‌కప్ టోర్నీలో 383 పరుగులతో రాణించాడు.ఇదిలా ఉంటే.. అన్క్యాప్డ్ ప్లేయర్లు అబ్దుల్, మాజ్, మసూద్, హుసేన్ ఇప్పటికే పాకిస్తాన్ షాహిన్స్ తరఫున సత్తా చాటారు. ఇక సీనియర్ ప్లేయర్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, పేసర్ హ్యారిస్ రవూఫ్, మొహమ్మద్ వసీం జూనియర్, ఆల్‌రౌండర్ ఫాహిమ్ ఆష్రఫ్, సల్మాన్ ఆఘా, మణికట్టు స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఈ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.బంగ్లాదేశ్‌తో వన్డేలకు పాకిస్తాన్ జట్టుషాహిన్ ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫాహిమ్ ఆష్రఫ్, ఫైజల్ అక్రం, హ్యారిస్ రవూఫ్, హుసేన్ తలత్, మాజ్ సదాకత్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, ముహమద్ ఘాజి ఘోరి (వికెట్ కీపర్), సాద్ మసూద్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా, షామిల్ హుసేన్షెడ్యూల్మార్చి 11- తొలి వన్డేమార్చి 13- రెండోవన్డేమార్చి 15- మూడో వన్డేవేదిక: షేరే బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, ఢాకా.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
T20 WC 2026: బీసీసీఐ కీలక ప్రకటన
టీమిండియా జూన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా విడుదల చేసింది. భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌లు ఆడనుందని వెల్లడించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.సెమీ ఫైనల్లో భారత్‌కాగా టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్.. సూపర్-8లో జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో గురువారం (మార్చి 5) సెమీస్ మ్యాచ్‌లో తలపడేందుకు షెడ్యూల్ ఖరారైంది.మళ్లీ జూన్లోనేఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరితే మార్చి 8న టైటిల్ పోరులో టీమిండియా తలపడుతుంది. అనంతరం భారత జట్టులోని ఆటగాళ్లంతా ఐపీఎల్-2026 (IPL)తో బిజీ అవుతారు. ఈ క్రమంలో మళ్లీ జూన్‌లోనే అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున విధుల్లో పాల్గొంటారు.అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా తదుపరి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తుందని పేర్కొంది. జూన్ 6-10 మధ్య టెస్టు జరుగనుండగా.. ఇరుజట్ల మధ్య జూన్ 14, 17, 20 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. భారత్- అఫ్గన్ టెస్టుకు న్యూ చండీగఢ్ వేదిక కాగా.. వన్డే సిరీస్‌కు ధర్మశాల, లక్నో, చెన్నై ఆతిథ్యం ఇవ్వనున్నాయి.రో-కో రీఎంట్రీ డేట్ ఫిక్స్.. అభిమానులు ఖుష్అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డేలలో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు చివరగా ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ బరిలో దిగారు.రోహిత్ శర్మ ఫర్వాలేదనిపించగా.. కోహ్లి వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సిరీస్‌లో భారత్ కివీస్ చేతిలో ఓడిపోయింది. ఇక తదుపరి అఫ్గనిస్తాన్‌తో సిరీస్ సందర్భంగా జూన్ 14న రో-కో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నారు. అంతకంటే ముందు ఐపీఎల్లో బెంగళూరు తరఫున కోహ్లి.. ముంబైకి ఆడుతూ రోహిత్ అభిమానులను అలరించనున్నారు.భారత్ వర్సెస్ అఫ్గనిస్తాన్ షెడ్యూల్👉జూన్ 6- 10 టెస్టు మ్యాచ్, న్యూ చంఢీగఢ్ (ఉదయం 9. 30 నిమిషాలకు ఆరంభం)👉జూన్ 14- తొలి వన్డే, ధర్మశాల👉జూన్ 17- రెండో వన్డే, లక్నో👉జూన్ 20- మూడో వన్డే, చెన్నై.👉వన్డే మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఆరంభం. చదవండి: T20 WC: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఆటగాళ్లకు భారీ షాక్! -
ఆఖరి వన్డే గెలుస్తారా!
హోబర్ట్: ఆ్రస్టేలియా పర్యటనలో టి20 సిరీస్ నెగ్గిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పుడు క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకునేందుకు, గెలుపు తృప్తితో ముగించేందుకు ఆఖరి వన్డే బరిలోకి దిగుతోంది. ఒత్తిడిలో ఉన్న హర్మన్‌ప్రీత్ సేన జోరు మీదున్న ఆసీస్‌ను సొంతగడ్డపై ఎలా నిలువరిస్తుందో చూడాలి. వన్డే సిరీస్‌కు వచ్చేసరికి భారత బ్యాటింగ్ తడబడుతోంది. టాపార్డర్‌లో స్మృతి మంధాన, మిడిలార్డర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మెరుగ్గా ఆడుతున్నప్పటికీ సహచరులంతా ఆసీస్ బౌలింగ్‌కు దాసోహం కావడం జట్టుకు ప్రతికూలంగా పరిణమిస్తోంది. బ్యాటింగ్‌లో షఫాలీ, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మలు రాణించాలి. అలాగే బౌలింగ్ విభాగం కూడా మెరుగవ్వాలి. రేణుక, క్రాంతి, కాశ్వీ గౌతమ్‌లు ఆరంభంలో వికెట్లు తీయగలిగితే పటిష్టమైన ఆ్రస్టేలియాపై వన్డే సిరీస్‌ను సంతృప్తికరంగా ముగిస్తుంది. లేదంటే వైట్‌వాష్ ఖాయమవుతుంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ కంగారూ జట్టు అద్భుతంగా ఆడింది. బౌలింగ్‌తో కట్టడి చేసి... బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ఇప్పుడు ఇదే జోరుతో ‘హ్యాట్రిక్’ విజయంపై కన్నేసింది. ఇదే జరిగితే ఓవరాల్ చాంపియన్‌షిప్ (టి20, వన్డే, ఏకైక టెస్టు సిరీస్)లోనూ ఆ్రస్టేలియా పైచేయి సాధిస్తుంది. ఒకే ఒక టెస్టును డ్రా చేసుకున్నా... ఆసీసే ఓవరాల్ చాంప్‌గా నిలుస్తుంది. ఉ. గం. 9:20 నుంచి ‘స్టార్‌స్పోర్ట్స్’లో ప్రసారం -
IND vs AUS: టీమిండియాను చిత్తు చేసిన ఆసీస్
ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ఆరంభించిన భారత మహిళా క్రికెట్ జట్టు అదే జోరు కొనసాగించలేకపోయింది. టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టుపై 2-1తో ఆధిపత్యం కనబరిచిన హర్మన్ సేన.. వన్డే సిరీస్‌లో మాత్రం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఆసీస్‌కు సమర్పించుకుంది.తొలుత బ్యాటింగ్‌మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో గెలిచిన ఆస్ట్రేలియా.. రెండో వన్డేలోనూ భారత్‌ను ఓడించింది. హోబర్ట్ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ప్రతీకా రావల్ (52), స్మృతి మంధాన (31) శుభారంభం అందించగా.. జెమీమా రోడ్రిగ్స్ (11) మాత్రం విఫలమైంది.హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ద శతకంకెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ద శతకం (54)తో రాణించగా.. రిచా ఘోష్ (22), కశ్వీ గౌతం (25) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 251 పరుగులు మేర మెరుగైన స్కోరు సాధించింది. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్, అలనా కింగ్, ఆష్లే గార్డ్నర్ రెండేసి వికెట్లు కూల్చగా.. మేగన్ షట్, నికోలా క్యారీ ఒక్కో వికెట్ పడగొట్టారు.ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆరంభంలో తడబడినా.. 36.1 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. టాపార్డర్‌లో కెప్టెన్ అలిసా హేలీ (6) విఫలం కాగా.. మరో ఓపెనర్ ఫోబే లిచిఫీల్డ్, వన్‌డౌన్ బ్యాటర్ జార్జియా వోల్ అదరగొట్టారు.Georgia Voll had us all nervous on 99 😅 She's got her second ODI ton 👏 #AUSvIND pic.twitter.com/eP41Tfx5Qp— cricket.com.au (@cricketcomau) February 27, 2026జార్జియా శతకంతో..లిచిఫీల్డ్ 62 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ బాది 80 పరుగులు చేయగా.. జార్జియా శతక్కొట్టింది. మొత్తంగా 82 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 101 పరుగులు సాధించింది. మిగిలిన వారిలో బెత్ మూనీ 31 పరుగులు చేయగా.. అనాబెల్ (10) విఫలమైంది.అయితే, ఆష్లే గార్డ్నర్ 19 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు గెలుపును ఖరారు చేసింది. భారత బౌలర్లలో కశ్వీ గౌతం, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. క్రాంతి గాడ్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక భారత్- ఆసీస్ మధ్య నామమాత్రపు మూడో వన్డే ఆదివారం జరుగుతుంది. ఇందుకు హోబర్ట్ వేదిక. తదుపరి ఇరుజట్లు ఏకైక టెస్టు ఆడతాయి.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ఆరంభించింది. ఈ సిరీస్‌లో భాగంగా మంగళవారం బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన 48.3 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది.బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. స్టార్ బ్యాటర్లు ప్రతిక రావల్ (0), షెఫాలీ వర్మ(4) వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేరారు. అయితే స్మృతి మంధాన (58), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (53) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత భారత్ మళ్లీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆఖర్లో కశ్వీ గౌతమ్ (43) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 200 పరుగుల మార్కును దాటగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో యాష్ గార్డనర్ 3 వికెట్లతో రాణించగా.. మేఘాన్ షాట్, అలానా కింగ్, మెక్‌గ్రాత్ తలా వికెట్ సాధించారు.215 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 38.2 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఓపెనర్లు అలిస్సా హీలీ (50), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (32) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం బెత్ మూనీ (76 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును గెలుపు తీరాలకు చేర్చింది. భారత బౌలర్లలో శ్రీ చరణి రెండు వికెట్లు, దీప్తీ శర్మ, క్రాంతి గౌడ్ తలా వికెట్ సాధించారు.


