
టీమిండియాతో ప్రతిష్టాత్మక ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సిరీస్ తర్వాత ఇంగ్లండ్.. సౌతాఫ్రికా (ENG vs SA)తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమైంది. భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేసుకున్న ఇంగ్లిష్ జట్టు.. తదుపరి ప్రొటిస్ టీమ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
సొంతగడ్డపై జరిగే ఈ వైట్‌బాల్ సిరీస్‌లకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తాజాగా వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. హ్యారీ బ్రూక్ (Harry Brook) సారథ్యంలోని ఈ జట్లలో ఆల్‌రౌండర్ రెహాన్ చోటు దక్కించుకున్నాడు. రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
తొలిసారి జాతీయ జట్టులో..
మరోవైపు.. పేసర్ సోనీ బేకర్ (Sonny Baker) తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇక నాలుగేళ్ల విరామం తర్వాత టీమిండియాతో టెస్టు సిరీస్‌తో పునరాగమనం చేసిన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా సౌతాఫ్రికాతో సిరీస్‌లలో పాల్గొననున్నాడు.
వీరితో పాటు ల్యూక్ వుడ్, లియామ్ డాసన్‌ను కూడా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక ప్రొటిస్ జట్టుతో సిరీస్‌లు ముగిసిన అనంతరం.. ఇంగ్లండ్ ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకోసం ఎంపిక చేసిన జట్టుకు యువ సంచలనం జేకబ్ బెతెల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
హ్యారీ బ్రూక్‌కు విశ్రాంతి.. కెప్టెన్‌గా జేకబ్
రెగ్యులర్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌కు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. సారథ్య బాధ్యతలను జేకబ్‌కు అప్పగించారు. ఇక లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీతో పాటు మాథ్యూ పాట్స్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా ఐర్లాండ్‌తో సిరీస్ నేపథ్యంలో మార్కస్ ట్రెస్కోతిక్ ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
సౌతాఫ్రికాతో వన్డేలకు ఇంగ్లండ్ జట్టు
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జేకబ్ బేతెల్, జోస్ బట్లర్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, విల్ జాక్స్, సకీబ్ మహమూద్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేమీ స్మిత్.
సౌతాఫ్రికాతో టీ20లకు ఇంగ్లండ్ జట్టు
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జేకబ్ బెతెల్, జోస్ బట్లర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సకీబ్ మహమూద్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, ల్యూక్ వుడ్.
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు
జేకబ్ బెతెల్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జోస్ బట్లర్, లియామ్ డాసన్, టామ్ హార్ట్‌లీ, విల్ జాక్స్, సకీబ్ మహమూద్, జేమీ ఓవర్టన్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్.
సౌతాఫ్రికాతో ఇంగ్లండ్ వన్డే, టీ20 సిరీస్‌ల షెడ్యూల్
వన్డే సిరీస్
👉సెప్టెంబరు 2- తొలి వన్డే (లీడ్స్)
👉సెప్టెంబరు 4- రెండో వన్డే (లార్డ్స్, లండన్)
👉సెప్టెంబరు 7- మూడో వన్డే (సౌతాంప్టన్)
టీ20 సిరీస్
👉సెప్టెంబరు 10- తొలి టీ20 (కార్డిఫ్)
👉సెప్టెంబరు 12- రెండో టీ20 (మాంచెస్టర్)
👉సెప్టెంబరు 14- మూడో టీ20 (నాటింగ్‌హామ్).