
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీ 2025లో అన్‌క్యాప్టెడ్ ఇండియన్ క్రికెటర్ మహ్మద్ తాహా తన అద్బుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఈ టోర్నీలో హుబ్లి టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తహా పరుగులు వరదపారిస్తున్నాడు. వరుసగా రెండో మ్యాచ్‌లలో సెంచరీలతో సత్తాచాటాడు.
తొలుత ఆగస్టు 12న శివమొగ్గ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసిన తాహా.. అనంతరం ఆగస్టు 13న బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో మళ్లీ 101 పరుగులు చేశాడు.
రెండు మ్యాచ్‌లలోనే మొత్తంగా 202 పరుగులు చేసిన తహా.. ఈ ఏడాది టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతడి స్ట్రైక్ రేట్ 190కు పైగా ఉండడం విశేషం. ఈ క్రమంలో నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత్‌కు మరో వీరేంద్ర సెహ్వాగ్ దొరికేశాడని పోస్ట్‌లు పెడుతున్నారు. మరి కొంతమంది ఈ ఏడాది ఐపీఎల్ మినీ వేలంలో అతడిపై కాసుల వర్షం కురువనుందని అభిప్రాయపడుతున్నారు.
ఎవరీ తాహా?
బెంగళూరుకు చెందిన 31 ఏళ్ల తహా మహ్మద్ తాహా 2016లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటక తరపున టీ20 అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే డకౌటయ్యాడు. దీంతో ఆ తర్వాత అతడికి పెద్దగా అవకాశాలు లభించలేదు. అతడు కేవలం 5 టీ20లు మాత్రమే ఆడాడు. చివరిసారిగా 2017లో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక తరపున ఆడాడు.
ఓవరాల్ కర్ణాటక తరపున 5 టీ20లు ఆడి 91 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తహాకు రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. ఐపీఎల్-2012 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నెట్ బౌలర్‌గా తాహా పని చేశాడు. అతడు విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్లకు బౌలింగ్ చేశాడు.
ది హిందూ రిపోర్ట్ ప్రకారం.. మహమ్మద్ తహా టన్‌బ్రిడ్జ్ హై స్కూల్‌లో చదువుకున్నాడు.తరువాత జైన్ విశ్వవిద్యాలయం నుండి బి.కామ్ డిగ్రీని పూర్తి చేశాడు. తహా తన 16 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. తహా తండ్రి అతన్ని కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ (KIOC) జాయిన్ చేశాడు. 2015లో తన తండ్రి మరణించిన తర్వాత పార్ట్ టైమ్ కోచ్‌గా పని చేస్తూ కుటంబాన్ని పోషించినట్లు ఓ ఇంటర్వ్యూలో తాహా పేర్కొన్నాడు.
చదవండి: మ్యాచ్ ఫిక్సింగ్ యత్నం.. శ్రీలంక క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం