పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. ఈ ఫార్మాట్ చరిత్రలో తొలిసారి ఓ బౌలర్ 8 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ ఫార్మాట్‌లో అత్యుత్తమంగా 7 వికెట్ల ప్రదర్శనలు మాత్రమే నమోదయ్యాయి.
తాజాగా మయన్మార్‌తో జరిగిన అంతర్జాతీయ టీ20లో భూటాన్ బౌలర్ సోనమ్ ఎషే (22 ఏళ్ల లెఫ్డ్ ఆర్మ్ స్పిన్నర్) 8 వికెట్ల చారిత్రక ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో సోనమ్ 4 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి (ఓ మెయిడిన్) ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. సోనమ్ నమోదు చేసిన ఈ గణాంకాలు యుగయుగాలు గుర్తుండిపోతాయి.
ఎషే చారిత్రక ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్‌లో మయన్మార్‌పై భూటాన్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భూటాన్ 127 పరుగులు చేసింది. అనంతరం 128 పరుగుల ఛేదనలో మయన్మార్ 9.2 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటైంది. ఈ గెలుపుతో భూటాన్ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది.
పొట్టి క్రికెట్‌లో అత్యుత్తమ గణాంకాలు..
సోనమ్ ఎషే (భూటాన్)- మయన్మార్‌పై 4-1-7-8
శ్యాజ్రుల్ ఇద్రుస్ (మలేషినా)- చైనాపై 4-1-8-7
అలీ దావూద్ (బహ్రెయిన్)- భూటాన్‌పై 4-0-19-7
హర్ష భరద్వాజ్ (సింగపూర్)- మంగోలియాపై 4-2-3-6
పీటర్ అహో (నైజీరియా)- సియెర్రా లియోన్‌పై 3.4-1-5-6
దీపక్ చాహర్ (భారత్)- బంగ్లాదేశ్‌పై 3.2-0-7-6
చదవండి: న్యూజిలాండ్ సిరీస్‌కు ముందే 'మరోసారి' రంగంలోకి దిగనున్న విరాట్ కోహ్లి


