స్నేహిత్‌ శుభారంభం | Snehit makes a good start at the World Table Tennis Chennai Star Contenders Tournament | Sakshi
Sakshi News home page

స్నేహిత్‌ శుభారంభం

Feb 13 2026 3:46 AM | Updated on Feb 13 2026 3:46 AM

Snehit makes a good start at the World Table Tennis Chennai Star Contenders Tournament

చెన్నై: వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) చెన్నై స్టార్‌ కంటెండర్‌ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ ప్లేయర్‌ సూరావజ్జుల స్నేహిత్‌ శుభారంభం చేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 100వ ర్యాంకర్‌ స్నేహిత్‌ 9–11, 11–8, 8–11, 11–7, 11–6తో భారత్‌కే చెందిన దివ్యాంశ్‌ శ్రీవాస్తవపై నెగ్గి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. భారత్‌కే చెందిన ఆకాశ్‌ పాల్, అంకుర్, హర్మీత్‌ కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. 

Advertisement
 
Advertisement
Advertisement