Photo Credit: IOA Twitter
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు జోరును ప్రదర్శిస్తున్నారు. సోమవారం రాత్రి మరో నాలుగు పతకాలు భారత్ ఖాతాలో చేరడంతో ఆ సంఖ్య పదికి చేరుకుంది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్‌లో వల్లూరు అజయ బాబు 79 కేజీల విభాగంలో రజతం సాధించగా, పురుషుల హైజంప్ విభాగంలో సర్వేశ్ కుషారే రజతం సాధించాడు. ఇక పారా అథ్లెటిక్స్‌లో షాట్‌పుట్ ఎఫ్-57 కేటగిరీలో షర్మిలా ధంకర్ స్వర్ణం సాధించగా, శిల్ప కాంస్యం ఒడిసిపట్టింది.
ముఖ్యంగా పారా షాట్ ఫుట్ F57 విభాగంలో భారత స్టార్ అథ్లెట్ షర్మిలా ధనకర్ తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించి బంగారు పతకాన్ని ముద్దాడారు. మరోవైపు పురుషుల హైజంప్ విభాగంలో సర్వేశ్ కుష్వారే సంచలన ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయంతో కామన్వెల్త్ క్రీడల చరిత్రలోనే హైజంప్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా సర్వేశ్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.
వీరితో పాటు వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో అజయ బాబు వెండి పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఒకే రోజున అటు పారా అథ్లె టిక్స్, ఇటు ట్రాక్ అండ్ ఫీల్డ్, వెయిట్రిఫ్టింగ్ విభాగాల్లో వరుస పతకాలు వరించడంతో భారత క్రీడాభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఐదో రోజులు ముగిసేసరికి భారత్ రెండు స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు కలిపి మొత్తం 10 పతకాలతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
An exciting end to Day 4 🇮🇳
Team India’s Medal Tally Grew to 10! 🙌
🥇 Sharmila Dhankar struck gold in Women’s Shot Put F57
🥈 Sarvesh Anil Kushare soared to silver in Men’s High Jump
🥈 Valluri Ajaya Babu bagged a silver in Men’s 79kg Weightlifting
🥉 Bindyarani Devi… pic.twitter.com/pNUMnAPLo1— Team India (@WeAreTeamIndia) July 27, 2026
Heartiest congratulations to Sharmila on scripting history by winning the Gold medal in the Women's Shot Put F57 event at #CWG2026.
Becoming India's first-ever Commonwealth Games Gold medallist in Para Athletics is a truly remarkable achievement. Your unwavering determination,… pic.twitter.com/vuUedWlwuF— Sunil Singhi (@SunilSinghiIND) July 28, 2026
Silver for Sarvesh! 🥈
Sarvesh Kushare clears 2.25m to clinch the Silver Medal in the Men's High Jump at Glasgow 2026.👏
Watch the Commonwealth Games Glasgow 2026 LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #Glasgow2026… pic.twitter.com/3e62CEPb5M— Sony Sports Network (@SonySportsNetwk) July 27, 2026


