భారత టీటీ జట్ల శుభారంభం | India begins campaign both table Tennis men and women team victories | Sakshi
Sakshi News home page

భారత టీటీ జట్ల శుభారంభం

Jul 28 2026 1:05 AM | Updated on Jul 28 2026 1:06 AM

India begins campaign both table Tennis men and women team victories

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. భారత పురుషుల జట్టు 3–0తో జింబాబ్వే జట్టుపై... భారత మహిళల జట్టు 3–0తో మాల్దీవులు జట్టుపై విజయం సాధించాయి. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత నంబర్‌వన్‌ మానవ్‌ ఠక్కర్‌ 11–3, 11–2, 11–6తో తయెందా ముమ్‌వుమాపై, హర్మిత్‌ దేశాయ్‌ 11–5, 11–4, 11–5తో తపివా ముసరువాపై, పాయస్‌ జైన్‌ 11–3, 11–3, 11–8తో విక్రమ్‌ సింగ్‌పై గెలిచారు. 

భారత మహిళల జట్టు తరఫున సుతీర్థ ముఖర్జీ, యశస్విని, స్వస్తిక విజయం అందుకున్నారు. సుతీర్థ 11–4, 11–2, 11–5తో ఫతీమత్‌ ధీమా అలీపై, యశస్విని 11–2, 11–5, 11–7తో ఐశాత్‌ రఫా నాజిమ్‌పై, స్వస్తిక 11–3, 11–5, 11–2తో మిష్కా ఇబ్రహీంపై గెలుపొందారు. ఏడేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న కామన్వెల్త్‌ టీటీ చాంపియన్‌షిప్‌లో పురుషుల, మహిళల టీమ్‌ విభాగాలతోపాటు సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత క్రీడాకారులే డిఫెండింగ్‌ చాంపియన్స్‌గా ఉండటం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement