breaking news
Commonwealth Games 2026
-
ఆ పేరంటే ద్వేషం: బాక్సర్ మాటలకు మోదీ రియాక్షన్ వైరల్
కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ మెగా ఈవెంట్లో భారత్ గెలిచిన 39 పతకాల్లో పది బాక్సింగ్‌లో వచ్చినవే. అంకుశ్ పంఘాల్, సచిన్ సివాచ్, జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్, సాక్షి చౌదరి, అరుంధతి చౌదరి, ప్రియా ఘంఘాస్ స్వర్ణాలతో సత్తా చాటారు.మరోవైపు.. నరేందర్ బెర్వాల్, లవ్లీనా బొర్గొహెన్, జాదుమణి సింగ్ రజత పతకాలు కైవసం చేసుకున్నారు. కాగా కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాక్సర్ నరేందర్ బెర్వాల్.. పాకిస్తాన్ బాక్సర్తో తనకు జరిగిన సంభాషణ గురించి ప్రధానితో పంచుకున్నాడు.ఆరోజు నేనే గెలిచాను‘‘పాకిస్తాన్ ప్రస్తావన వచ్చింది కాబట్టి.. నాకొక విషయం గుర్తుకువచ్చింది సర్. 2015 వరల్డ్ మిలిటరీ గేమ్స్.. నా తొలి రౌండ్ మ్యాచ్ పాకిస్తాన్‌తోనే. అప్పుడు మన మిలిటరీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. పాకిస్తాన్ ప్రత్యర్థిపై అస్సలు ఓడిపోవద్దని చెప్పారు. ఆరోజు నేనే గెలిచాను. అయితే, నేను, నా ప్రత్యర్థి ఇద్దరం గాయాలపాలై ఆస్పత్రికి చేరుకున్నాం. ఇద్దరికీ కుట్లు పడ్డాయి. అప్పుడు ఆర్మీ కోచ్‌గా నరేందర్ రాణా ఉన్నారు. మీరు కూడా అప్పుడే తొలిసారి ప్రధాని అయ్యారు.ఈ పేరును ద్వేషించడం మొదలుపెట్టానుఆ సమయంలో ఆ పాక్ బాక్సర్ నాతో.. ‘సోదరా నీకో మాట చెప్పనా?’ అన్నాడు. సరే ఏమిటో చెప్పమన్నాను. అప్పుడు అతడు.. ‘నీ పేరు నరేందర్. మీ కోచ్ పేరు నరేందర్. మీ ప్రధాన మంత్రి పేరు నరేంద్ర. ఇప్పటి నుంచి ఈ పేరును నేను ద్వేషించడం మొదలుపెట్టాను’ అని అన్నాడు’’ అని నరేందర్ బెర్వాల్ ప్రధాని మోదీకి తెలిపాడు.మోదీ రియాక్షన్ వైరల్దీంతో ప్రధాని మోదీ నవ్వులు చిందించారు. బెర్వాల్‌తో పాటు అక్కడున్న అథ్లెట్లంతా కూడా నవ్వుకున్నారు. కాగా నరేందర్ బెర్వాల్ భారత సైన్యంలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించిన అతడు.. ఆసియా క్రీడలు-2023లో కాంస్యం గెలిచాడు. తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ అందుకున్నాడు.ఇదిలా ఉంటే.. పతక విజేతలతో ముచ్చటించిన ప్రధాని మోదీ.. వారందరినీ అభినందించారు. భారత క్రీడా ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు చేర్చారని.. క్రీడల పట్ల వారికున్న అంకిత భావాన్ని కొనియాడారు. కాగా గ్లాస్గోలో జరిగిన తాజా కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మొత్తంగా 39 పతకాలు గెలిచింది. ఇందులో పదమూడు స్వర్ణాలు, పదిహేడు రజతాలు, తొమ్మిది కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. అహ్మదాబాద్ ఇందుకు వేదిక. చదవండి: స్పిన్నర్లతో తలనొప్పి.. కుల్దీప్ యాదవ్‌కు నో ఛాన్స్?!#WATCH | "Pakistani boxer said to me 'Aapka naam Narender hai, aapke coach ka naam Narender hai, aapke Pradhan Mantri ka naam Narendra hai. Mujhe Narendra naam se nafrat ho gayi hai'..." says Heavyweight boxer and silver medallist Narender Berwal narrating his conversation with a… pic.twitter.com/qvmwO5D2sz— ANI (@ANI) August 10, 2026 -
‘జో ఖేలేగా... వో ఖిలేగా’
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. కాగా అథ్లెట్లతో భేటీ అయిన వీడియోను ప్రధాని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ‘జో ఖేలేగా... వో ఖిలేగా’ (ఆటలు ఆడేవాళ్లు వికసిస్తారు) అంటూ అథ్లెట్లను అభినందించిన ప్రధానమంత్రి... దేశం కోసం ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కామన్వెల్త్ క్రీడల మహిళల 51 కేజీల బాక్సింగ్ విభాగంలో పసిడి నెగ్గిన సాక్షి మాట్లాడుతూ... ‘పతకాలు సాధించిన ప్లేయర్లను ప్రధాని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ భేటీని మేమంతా ఎంతో ఆస్వాదించాం’ అని పేర్కొంది. 2030లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది. -
పతకాలు తెచ్చాను.. నాపై ఇంత విద్వేషమా?
పాకిస్తాన్ స్టార్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ఒక ఈవెంట్లో విఫలమైనంత మాత్రాన తనను దూషించడం సరికాదన్నాడు. తాను దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చానని.. అయినప్పటికీ తనను అనరాని మాటలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.ఒలింపిక్స్‌లో స్వర్ణంకాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో అర్షద్ నదీమ్ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఈటెను రికార్డు స్థాయిలో 92.7 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలిచాడు. తద్వారా విశ్వ క్రీడల్లో పాకిస్తాన్‌కు తొలి వ్యక్తిగత పసిడి పతకం అందించిన అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు.సీన్ రివర్స్ఈ నేపథ్యంలో అర్షద్ నదీమ్‌పై ఇంటా.. బయట ప్రశంసల వర్షం కురిసింది. సన్మానాలు, సత్కారాలతో అతడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. చివరగా టోక్యోలో జరిగిన వరల్డ్‌కప్ చాంపియన్షిప్స్ల మెడల్ ఈవెంట్లో అత్యుత్తమంగా 82.75 మీటర్ల దూరం ఈటెను విసిరిన అర్షద్.. ఆ తర్వాత ఒక్కసారి కూడా కనీసం 80 మీటర్ల మార్కు కూడా దాటలేకపోయాడు.తాజాగా గ్లాస్కో వేదికగా కామన్వెల్త్ గేమ్స్-2026లోనూ అర్షద్ నదీమ్ వైఫల్యాలు కొనసాగాయి. కామన్వెల్త్ గేమ్స్-2022లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచిన అతడు.. ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగాడు. దారుణ వైఫల్యంతో..అయితే, తొలి ప్రయత్నంలోనే బ్యాలెన్స్ చేసుకోలేక ఫౌల్ కావడంతో ఫైనల్ రౌండ్లో అతడికి చేదు అనుభవమే మిగిలింది. ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ విఫలమైన అర్షద్ నదీమ్ టాప్-8కు చేరలేక ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఈసారి కనీసం కాంస్యం కాదు కదా.. ఫైనల్లో మరో మూడు ప్రయత్నాలు చేసే అవకాశం లేకుండానే నిష్క్రమించాడు. దీంతో పాకిస్తాన్ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అర్షద్ నదీమ్‌పై ఘాటు విమర్శలు చేశారు. అభ్యంతరకర పదజాలంతో అతడిని తిట్టారు.నేనూ పాకిస్తాన్ గడ్డ మీద పుట్టినవాడినేఈ నేపథ్యంలో అర్షద్ నదీమ్ తాజాగా స్పందించాడు. ‘‘కామన్వెల్త్ గేమ్స్‌లో నా వైఫల్యానికి సంబంధించి నేను ఎలాంటి సాకులు చెప్పాలనుకోవడం లేదు. అయితే, నేనూ పాకిస్తాన్ గడ్డ మీద పుట్టినవాడినే.పతకాలు అందించానుగతంలో దేశానికి ఎన్నో పతకాలు అందించాను. కానీ నా పట్ల అమర్యాదపూర్వకంగా, మనసు గాయపడే విధంగా మాట్లాడుతున్నారు. నేనూ మీలో ఒకడిననే గుర్తించండి. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోవద్దని చెబుతూ నా తల్లిదండ్రులు నాకు చెప్పారు.నేను లాగే ఉన్నాను. డబ్బు, పేరు ప్రఖ్యాతుల వల్ల నేనేమీ పొగరుబోతులా తయారుకాలేదు. చలి ఎక్కువగా ఉన్న చోట జావెలిన్ త్రోయర్ల కండరాలు పట్టేయడం సహజం. రిథమ్ కూడా కోల్పోవడం జరుగుతుంది. నేను ప్రాక్టీస్ చేసిన పరిస్థితులు.. క్రీడా వేదిక పరిస్థితులు వేరు.ఏదేమైనా గ్లాస్గోలో నేను మెరుగ్గా రాణించాల్సింది. కానీ గెలవలేకపోయాను. ఎల్లప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు వంద శాతం కృషి చేస్తాను. కఠిన శ్రమనే నమ్ముకున్న నాకు ఆ దేవుడే మార్గం చూపిస్తాడు. ఆయన నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది’’ అని అర్షద్ నదీమ్ ఆవేదన వ్యక్తం చేశాడు.అందుకే ఫెయిల్ అయ్యాడా?కాగా అర్షద్ నదీమ్ తన కోచ్‌గా సల్మాన్ బట్‌ను కొనసాగించడంతో.. పాకిస్తాన్ అమెచూర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్తో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ చేసేందుకు అతడికి ఫెడరేషన్ నుంచి ఎలాంటి సహకారం అందలేదనే వార్తలు వచ్చాయి. లాహోర్‌లో ఎర్రటి ఎండలో అర్షద్ ప్రాక్టీస్ చేయగా.. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో అందుకు విరుద్ధంగా పూర్తి చలి వాతావరణం ఉండటం అతడి ప్రదర్శనపై ప్రభావం చూపినట్లు సమాచారం.చదవండి: టీమిండియాతో మ్యాచ్.. వన్డే తరహాలో లంక బ్యాటర్ల విధ్వంసం -
రూ. కోటిన్నర నజరానా!.. అస్మితకు భారీ షాక్?
అస్మితా డే... కామన్వెల్త్ గేమ్స్‌లో జూడో విభాగంలో భారత్‌కు మొట్టమొదటి స్వర్ణం అందించిన అమ్మాయి. గ్లాస్గోలో 48 కిలోల విభాగంలో కెనడాకు చెందిన అంతర్జాతీయ చాంపియన్ హెడీ క్వాచ్ ను ఓడించి పసిడి పతకాన్ని 23 ఏళ్ల అస్మిత ముద్దాడింది. సైకిల్ మెకానిక్ కుమార్తె అయిన ఆమె జూడోలో ఉన్నత శిఖరాలకు చేరి దేశాన్ని గర్వపడేలా చేసింది.అయితే, అస్మితకు క్యాష్ రివార్డు ఇచ్చే అంశంలో వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ఇచ్చే భారీ నగదు బహుమతికి ఆమె అర్హురాలా? కాదా? అన్న చర్చ మొదలైంది. అస్మిత స్వస్థలం త్రిపుర. బెలోనియా అనే చిన్న పట్టణంలో ఆమె జన్మించింది. అయితే, క్రీడల్లో ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తోంది.వివిధ వేదికలపై సత్తా చాటిన అథ్లెట్లకు నగదు బహుమతి ప్రకటించే క్రమంలో యూపీ ప్రభుత్వం 2024, ఆగష్టులో ఒక జీవో తీసుకువచ్చింది. దీని ప్రకారం.. రాష్ట్రం ఇచ్చే నగదు బహుమతి పొందాలంటే అథ్లెట్లకు మూడు నిబంధనలు విధించింది.మూడు నిబంధనలుఒకటి.. సదరు అథ్లెట్ చట్టబద్ధంగా యూపీలో శాశ్వత నివాసం కలిగి ఉండాలి. రెండు.. యూపీకి చెందిన, గుర్తింపుపొందిన కాలేజీ లేదంటే యూనివర్సిటీలో కనీసం రెండేళ్లపాటు చదివి ఉండాలి. మూడు.. ఏదేని క్రీడాంశంలో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించి ఉండాలి.ఈ నేపథ్యంలో అస్మితకు ఇచ్చే క్యాష్ రివార్డు విషయంలో సందిగ్దత నెలకొన్నట్లు తెలుస్తోంది. త్రిపురకు చెందిన ఆమె యూపీకి ప్రాతినిథ్యం వహిస్తూ పతకాలు సాధిస్తోంది. ఈ క్రమంలో 2023లో యూపీ విభాగంలో ఆమెకు సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం.రూ. 1.5 కోట్ల క్యాష్ రికార్డుఇక కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన అస్మితకు నిజానికి.. అన్నీ కుదిరితే యూపీ ప్రభుత్వం నుంచి రూ. 1.5 కోట్ల క్యాష్ రికార్డు వస్తుంది. అయితే, నిబంధనల ప్రకారం అస్మితకు ఆ అర్హత ఉందా? లేదా? అన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో యూపీ జూడో అసోసియేషన్ కార్యదర్శి మునావర్ అంజర్ స్పందిస్తూ..‘‘ఆమె 2023 నుంచి యూపీ పోలీస్ విభాగంలో పనిచేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో యూపీ ముఖచిత్రంగా అస్మిత కొనసాగుతోంది. తొలుత సీనియర్ జూడో చాంపియన్‌షిప్‌లో యూపీ తరఫున స్వర్ణం గెలిచింది.ఆ తర్వాత 38వ జాతీయ క్రీడల్లోనూ గోల్డ్ మెడల్ సాధించింది. కాసబ్లాంకా ఆఫ్రికన్ ఓపెనర్ చాంపియన్‌షిప్‌లోనూ పసిడి పతకం గెలిచింది. తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లోనూ యూపీ తరఫున స్వర్ణం గెలిచింది’’ అని పేర్కొన్నారు. పరోక్షంగా ఆమె క్యాష్ రివార్డుకు అర్హురాలే అనేలా వ్యాఖ్యలు చేశారు.వీరికి నజరానాలు లభించాయిఇక యూపీ క్రీడా శాఖా కార్యదర్శి సుహాస్ ఎల్వై మాట్లాడుతూ.. ‘‘అర్హులైన ప్రతి ఒక్క అథ్లెట్‌కు అన్ని రకాల ప్రయోజనాలు అందిస్తాము. అధికారులు ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. నిజానికి సుహాస్ కర్ణాటకకు చెందిన ఐఏఎస్ అధికారి. 2003 నుంచి యూపీలో సేవలు అందిస్తున్నారు. పారాలింపిక్స్‌లో యూపీ తరఫున సిల్వర్ గెలిచిన సుహాస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివిధ రివార్డులు అందుకున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. నేపాల్‌కు చెందిన జీతూ రాయ్ లక్నోకు చెందిన 11 గోర్ఖా రైఫిల్స్‌లో చేరిన తర్వాత భారత పౌరసత్వం పొందారు. ఈ క్రమంలో ఆసియా క్రీడల 2014 ఎడిషన్‌లో షూటింగ్ విభాగంలో యూపీ తరఫున గోల్డ్ మెడల్ గెలవగా.. యూపీ ప్రభుత్వం రూ. కోటి నజరానా అందించింది.చదవండి: రూ. 30 లక్షల నజరానా.. డీఎస్పీగా ప్రమోషన్ -
పతకాలు తెచ్చేది మావాళ్లు.. ఆతిథ్య హక్కులు మీకా?
కామన్వెల్త్ గేమ్స్-2026లో 39 పతకాలతో సత్తా చాటిన భారత్.. 2030 ఎడిషన్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా ఎంపీ దీపేందర్ సింగ్ హుడా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.‘‘హర్యానా అత్యధికంగా దేశానికి పతకాలు తెస్తుంటే.. క్రీడల నిర్వహణ మాత్రం గుజరాత్‌కు దక్కింది. గత 15- 20 ఏళ్ల నుంచి భారత్ సాధించిన పతకాల్లో హర్యానా వాటా యాభై శాతం కంటే తక్కువేమీ కాదు. ఈ దేశంలో క్రీడాభివృద్ధి కోసం ఎక్కడైన అత్యధికంగా నిధులు వినియోగించాలంటే అందుకు హర్యానాకు మాత్రమే అర్హత ఉంది.ఇక్కడి క్రీడాకారులు దేశాన్ని తలెత్తుకునేలా చేశారు. గుజరాత్ నుంచి ఒక్క అథ్లెట్ కూడా పతకం సాధించకపోయినా ఆతిథ్య హక్కులు వారికి ఎలా లభిస్తాయి?’’ అని కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ ఎంపీ అన్నట్లుగా నిజంగానే భారత్ ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్‌లో గెలిచిన మెడల్స్‌లో హర్యానాకే మెజారిటీ వాటా ఉందా?! అంటే అవుననే చెప్పవచ్చు. అందుకు ఈ గణాంకాలే నిదర్శనం.కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్ 39 పతకాలు గెలవగా.. అందులో హర్యానా అథ్లెట్లవే పది పతకాలు. హర్యానాకు చెందిన షర్మిలా ధన్కర్, బాక్సర్లు ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఘంఘాస్, సచిన్ సివాచ్, అంకుశ్ పంఘాల్, నీరజ్ చోప్రా, నరేందర్ బేర్వాల్, సీమా కలీరమ్నా పతకాలు సాధించారు.2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లోనూ హవాప్యారిస్ ఒలింపిక్స్-2024లో హర్యానా అథ్లెట్లు అదరగొట్టారు. షూటర్ మనూ భాకర్ రెండు కాంస్యాలతో సత్తా చాటగా.. ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో రజతం అందించాడు. మనూ భాకర్ షూటింగ్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగం, సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్యం అందుకుంది.పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల రెజ్లింగ్ విభాగంలో అమన్ సెహ్రావత్ కాంస్యం గెలవగా.. హాకీ జట్టులో భాగమైన అభిషేక్ నైన్ కాంస్యాన్ని ముద్దాడాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్యం గెలిచాడు.2023 ఆసియా క్రీడల్లో ఇలాఆసియా క్రీడలు-2023లో భారత్ మొత్తంగా 106 పతకాలు గెలవగా.. ఇందులో 38 టీమ్ మెడల్స్. మిగిలిన 68 పతకాల్లో హర్యానా అథ్లెట్లవే 16. నీరజ్ చోప్రా, అన్నూ రాణి (జావెలిన్ త్రో), పారుల్ చౌదరి (5000 మీటర్ల పరుగు), పాలక్ గులియా (షూటింగ్ వ్యక్తిగతం, టీమ్) స్వర్ణాలు సాధించారు.మిగిలిన హర్యానా అథ్లెట్లలో రమితా జిందాల్ (షూటింగ్), అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ) రజతాలు గెలవగా.. సీమా పునియా (డిస్కస్ త్రో), బాక్సర్లు ప్రీతి పవార్, నరేందర్ బేర్వాల్, ప్రవీణ్ హుడా, అథ్లెటిక్స్‌లో ప్రీతి లంబా, రెజ్లింగ్‌లో అంతిమ్ పంఘాల్, కిరణ్, అమన్ సెహ్రావత్, సునిల్ కుమార్ కాంస్యాలు గెలుచుకున్నారు.కామన్వెల్త్ గేమ్స్-2022లోఇదిలా ఉంటే.. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్-2022లో హర్యానా 15 వ్యక్తిగత పతకాలతో పాటు.. ఆరు టీమ్ మెడల్స్ సొంతం చేసుకుంది. వ్యక్తిగత విభాగంలో అథ్లెట్లకు ఎనిమిది స్వర్ణాలు వచ్చాయి.ఏకంగా స్వర్ణ పతకంఇక టోక్యో ఒలింపిక్స్-2021లో నీరజ్ చోప్రా ఏకంగా భారత్‌కు స్వర్ణ పతకం అందించిన సంగతి తెలిసిందే. అదే విధంగా హర్యానాకే చెందిన రెజ్లర్లు రవి కుమార్ దహియా రజతం, బజరంగ్ పునియా కాంస్యం గెలిచారు.ఆసియా క్రీడలు-2018లో భారత్ మొత్తంగా 70 పతకాలు గెలవగా.. ఇందులో హర్యానా అథ్లెట్లు 17 సొంతం చేసుకున్నారు. బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్, నీరజ్ చోప్రా, మంజీత్ సింగ్, అమిత్ పంఘాల్ స్వర్ణాలు దక్కించుకున్నారు. దీనిని బట్టి హర్యానా క్రీడల్లో ఎంతటి విజయవంతమైన రాష్ట్రమో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ప్రతీ ప్రతిష్టాత్మక ఈవెంట్లోనూ హర్యానా నుంచే భారత్‌కు ఎక్కువ పతకాలు లభించాయి.చదవండి: రూ. 30 లక్షల నజరానా.. డీఎస్పీగా ప్రమోషన్ -
అపూర్వ స్వాగతం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించి స్వదేశానికి చేరుకున్న భారత క్రీడాకారుల బృందానికి ఘనస్వాగతం లభించింది. మంగళవారం తెల్లవారుజామున భారత పతక వీరులు న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా... అభిమానులు వారికి అపూర్వ స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో ఓవరాల్‌గా 39 పతకాలు సాధించి పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఆసియా క్రీడలపై దృష్టి కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లు... త్వరలో ప్రారంభం కానున్న ఆసియా క్రీడలపై దృష్టి సారించారు. జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు జరగనున్నాయి. ‘అంతర్జాతీయ వేదికపై జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గడం చాలా ఆనందంగా ఉంది. ఇక ఇప్పుడు నా దృష్టి అంతా ఆసియా క్రీడలపైనే. అక్కడ కూడా ఇదే జోరు కొనసాగిస్తూ పసిడి పతకం సాధించాలనుకుంటున్నా’ అని కామన్వెల్త్ క్రీడల్లో పసిడి నెగ్గిన బాక్సర్ ప్రియా ఘంఘాస్ తెలిపింది. కల నిజమాయే! అపూర్వ స్వాగతం అనంతరం బాక్సర్ సాక్షి మాట్లాడుతూ... ‘ఇదంతా కలలా ఉంది. పోటీలకు ముందు ప్రతీ రోజు స్వర్ణం గెలిచినట్లే ఊహించుకునేదాన్ని. కామన్వెల్త్లో పసిడి నెగ్గినట్లు... త్రివర్ణ పతాకం రెపరెపలాడించినట్లు... తిరిగి స్వదేశానికి విచ్చేసినప్పుడు అపూర్వ స్వాగతం లభించినట్లు ఊహించుకున్నా. ఆ ఊహలు నిజమయ్యాయి’ అని వెల్లడించింది. ఒలింపిక్ పతకమే లక్ష్యం: జైస్మీన్ ఇక తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకొని కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి గెలిచిన జైస్మీన్ లంబోరియా మాట్లాడుతూ... ‘పోటీల ప్రారంభానికి మూడు వారాల ముందే పూర్తి స్థాయిలో కోలుకున్నా. ఆ కొద్ది సమయంలోనే ప్రాక్టీస్ చేశా. అయినా రింగ్‌లో అడుగుపెట్టిన తర్వాత అవేవీ ఆలోచించలేదు. నా అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి పతకం అందించాలి అనుకున్నా. ఒలింపిక్ పతకం గెలవడం నా అతిపెద్ద లక్ష్యం. ఆ మార్గంలో త్వరలోనే జరగనున్న ఆసియా క్రీడల్లో సత్తా చాటాలనుకుంటున్నా’ అని వెల్లడించింది. ఇక కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారి జూడోలో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించిన హర్‡్ష సింగ్, అస్మిత డే ఘన స్వాగతానికి ఉబ్బితబ్బిబ్బయ్యారు. కామన్వెల్త్ క్రీడల్లో మన పారా అథ్లెట్లు సైతం రికార్డు ప్రదర్శనతో సత్తా చాటారు. ఇప్పటి వరకు ఈ క్రీడల చరిత్రలో భారత్ 7 పతకాలు మాత్రమే సాధించగా... ఈ ఒక్క క్రీడల్లోనే ఏడు పతకాలతో మెరిశారు.పతక విజేతలకు నజరానా... కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన బాక్సర్లు, జూడోకాలు, పారా అథ్లెట్లను కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన వారికి రూ. 30 లక్షలు, రజతం గెలిచిన వారికి రూ. 20 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ. 10 లక్షల చొప్పున చెక్‌లు అందజేశారు. -
CWG 2026: పాకిస్థాన్ బాక్సర్ మిస్సింగ్
కామన్వెల్త్ గేమ్స్ 2026 తర్వాత పాకిస్థాన్ బాక్సర్ కుద్రతుల్లా (Qudratullah) మిస్ అయినట్లు తెలుస్తోంది. పోటీలు ముగిసిన అనంతరం టీమ్ హోటల్ నుంచి వెళ్లిన అతడు అదృశ్యమైనట్లు సమాచారం. అతని పాస్‌పోర్ట్ కూడా టీమ్ మేనేజర్ వద్దే ఉన్నట్లు తెలుస్తోంది.ఇదే తొలిసారి కాదుఅంతర్జాతీయ టోర్నీల సమయంలో పాకిస్థాన్ బాక్సర్లు అదృశ్యమైన ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2022 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా సులేమాన్ బలోచ్, నజీరుల్లా ఖాన్ బర్మింగ్‌హామ్‌లో అదృశ్యమయ్యారు. అప్పట్లోనూ వారి పాస్‌పోర్టులు మేనేజర్ వద్దే ఉన్నట్లు సమాచారం.2024లో ఇటలీలో జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్ సందర్భంగా ఆసియా గోల్డ్ మెడలిస్ట్ బాక్సర్ జోహైబ్ రషీద్ (పాక్) తన రూమ్మేట్కు చెందిన విదేశీ కరెన్సీ, విలువైన వస్తువులను తీసుకుని బస్టో అర్సిజియో పట్టణంలో అదృశ్యమైనట్లు ఆరోపణలు వచ్చాయి.ఒక్క పతకంతో సరిపెట్టుకున్న పాక్కామన్వెల్త్ గేమ్స్ 2026లో పాక్‌కు ఒకే ఒక పతకం లభించింది. ఈ పోటీల్లో మొత్తం 36 మంది సభ్యులు పాల్గొనగా..మహిళల బాక్సింగ్‌లో ఫాతిమా జెహ్రా కాంస్య పతకాన్ని సాధించింది. -
‘ఫుడ్ పాయిజన్.. లేదంటే స్వర్ణం గెలిచేవాడిని’
భారత ట్రిపుల్ జంపర్ సెల్వ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను అనారోగ్యం బారిన పడకపోయి ఉంటే కామన్వెల్త్ గేమ్స్-2026లో స్వర్ణం గెలిచేవాడినన్నాడు. కాగా తాజాగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో సెల్వ ప్రభు కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే.గ్లాస్గో వేదికగా ట్రిపుల్ జంప్ మెన్స్ ఫైనల్లో అత్యుత్తమంగా 16.52 మీటర్లు దూకిన సెల్వ ప్రభు మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన ప్రవీణ్ చిత్రావల్ 16.58 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు. ఇక ఈ విభాగంలో స్కాట్లాండ్ అథ్లెట్ జోర్డాన్ స్కాట్ (16.72 మీటర్లు) పసిడి పతకాన్ని ముద్దాడాడు.ఫుడ్ పాయిజనింగ్ ఈ నేపథ్యంలో సెల్వ ప్రభు పీటీఐతో మాట్లాడుతూ.. పోటీకి ముందు తనకు ఎదురైన చేదు అనుభవం గురించి గుర్తు చేసుకున్నాడు. ‘‘నిజంగా నేను స్వర్ణ పతకం గెలవాలని పట్టుదలగా ఉన్నాను. పోటీ మొదలైనపుడు కూడా పూర్తి నమ్మకంతో ఉన్నాను. కానీ అనుకోకుండా అనారోగ్యం పాలయ్యాను.ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఇక అంతా అయిపోయిందనే అనుకునే తరుణం. కానీ నేను మానసికంగా చాలా బలవంతుడిని. ఏం జరిగినా మన మంచికే అని ముందుకు సాగాను. అనుకున్నది సాధించగలననే ఆత్మవిశ్వాసంతో బరిలో దిగాను.నేను ఆరోగ్యంగా ఉండి ఉంటే పసిడి పతకం గెలిచేవాడినే. అయితే, ఇక ముందు ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టాలి. ఒక్కసారి నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. దాని కోసం ఎంతటి కష్టాన్నైనా ఆనందంగా స్వీకరిస్తా.ప్రతి రోజూ మనకొక సవాలేప్రతి ఉదయం సరికొత్తగా మొదలవుతుంది. ప్రతి రోజూ మనకొక సవాలే. ప్రదర్శన రోజురోజుకీ మెరుగుపరచుకోవాలి. అలా అయితే గోల్డ్ గెలవాలన్న లక్ష్యం నెరవేరుతుంది. ఆసియా క్రీడలకు అర్హత సాధించడమే నా ముందున్న తక్షణ లక్ష్యం’’ అని తమిళనాడు అథ్లెట్ సెల్వ ప్రభు చెప్పుకొచ్చాడు. చదవండి: రూ. 30 లక్షల నజరానా.. డీఎస్పీగా ప్రమోషన్ -
‘రొనాల్డోనే స్ఫూర్తి.. నా తండ్రి కూడా అలానే మరణించాడు’
కామన్వెల్త్ గేమ్స్‌లో జూడో గేమ్‌లో మహిళల విభాగంలో స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారిణిగా అస్మితా దే చరిత్ర సృష్టించింది. 48 కేజీల విభాగంలో కెనడాకు చెందిన హిడీ క్వాచ్ను ఓడించి పడిసి పతకం అందకుంది. అయితే తన జీవితంపై ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ప్రభావం బలంగా ఉందని అస్మితా దే స్పష్టం చేసింది. జీవితంలో ఇష్టమైన వాళ్లను కోల్పోతే ఆ బాధను ఎలా దిగమింగాలన్న విషయాన్ని రొనాల్డో నుంచే నేర్చుకున్నట్లు అస్మితా తెలిపింది.నేను ఎక్కువగా ఆరాధించే వ్యక్తి క్రిస్టియానో రొనాల్డో. రొనాల్డో తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అతడు తన 19వ ఏట తండ్రిని కోల్పోయినప్పటికీ, ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు. ఇవాళ రొనాల్డో ఎవరనేది ప్రపంచానికి మొత్తం తెలుసు. అతడి జీవితాన్ని పూర్తిగా చదివాను. అందుకే రొనాల్డో నాకు అత్యంత స్ఫూర్తినిచ్చే వ్యక్తి* అని చెప్పుకొచ్చింది.ఇక అస్మితా దే జీవిత ప్రయాణం కూడా కష్టాల నుంచే మొదలయ్యింది. త్రిపురలో దక్షిణ ప్రాంతమైన బెలోనియాలో జన్మించిన అస్మితా ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్న ఇంట్లో పుట్టింది. అస్మితా తండ్రి అర్జున్ దే త్రిపురలో సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తూ రోజుకు రూ. 300 సంపాదించేవాడు. అయితే చిన్నప్పటి నుంచే ఆటలపై కూతురు పెంచుకున్న ఇష్టాన్ని చూసిన తండ్రి తాను సంపాదించే ప్రతి రూపాయిని పొదుపుగా ఖర్చు చేసేవారు. ఆ తర్వాత అస్మితా భోపాల్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేరి జోడోలో మరింత పట్టు సాధించింది. ఈ నేపథ్యంలోనే స్పోర్ట్స్ కోటాలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసు విభాగంలో ఉద్యోగం లభించడంతో ఆర్థిక కష్టాలు కొంతమేర తగ్గాయి. అయితే ఆర్థిక కష్టాలు తగ్గినప్పటికీ, కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించడానికి కొన్ని రోజుల ముందే అస్మితా తండ్రి అర్జున్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించారు. తండ్రి మరణంతో షాక్‌లో ఉండిపోయిన అస్మితా తాను పోటీల్లో పాల్గొనగలనా అనే సందేహం వచ్చింది. కానీ అస్మితా తల్లి అనుక్షణం ఆమె వెంటే నిలిచి తండ్రి కలను నెరవేర్చాలని గుర్తు చేస్తూ ప్రోత్సహించింది. తండ్రి పోయిన బాధను దిగమింగుకొని కామన్వెల్త్ గేమ్స్‌కు పుట్టెడు దుఃఖంతో వెళ్లిన అస్మితా దే తండ్రి కలను నిజం చేస్తూ ఇవాళ స్వర్ణ పతకంతో దేశానికి తిరిగి వచ్చింది.INSPIRED BY THE GREATEST! 🐐 India’s golden judoka Asmita Dey reveals how Cristiano Ronaldo’s relentless drive fuels her own journey to the top. 💪 #SonySportsNetwork #SonyLIV #Glasgow2026 #GlasgowMeinTiranga #Cheer4Bharat pic.twitter.com/x40Dg3oygj— Sony Sports Network (@SonySportsNetwk) August 3, 2026చదవండి: విషాదం.. గుండెపోటుతో కన్నుమూసిన బ్రెజిల్ ఆటగాడు -
రూ. 30 లక్షల నజరానా.. డీఎస్పీగా ప్రమోషన్
కామన్వెల్త్ క్రీడలు-2026లో రజత పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్‌ను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సముచితరీతిలో గౌరవించింది. ఆమెకు రూ.30 లక్షల నగదు బహుమతితో పాటు ఉద్యోగంలో కూడా ప్రమోషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ప్రకటించారు. కాగా తాజా కామన్వెల్త్ క్రీడల ఎడిషన్‌లో మహిళల 53 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ సిల్వర్ మెడల్ గెలిచింది.స్నాచ్‌లో 88 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కిలోల బరువు.. మొత్తంగా 199 కిలోల బరువు ఎత్తింది జ్ఞానేశ్వరి. నైజీరియాకు చెందిన ఒనోమ్ ఒమెలొలా దీదీ మొత్తంగా 206 కిలోల బరువునెత్తి స్వర్ణం గెలవగా.. రెండో స్థానంలో నిలిచిన జ్ఞానేశ్వరి రజతం కైవసం చేసుకుంది.రూ. 30 లక్షల క్యాష్ రివార్డుతో పాటుఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ రాయ్‌పూర్‌లోని తన నివాసంలో జ్ఞానేశ్వరిని సత్కరించారు. రాష్ట్రాన్ని గర్వపడేలా చేశావంటూ ఆమెను అభినందించారు. ‘‘రాజ్నంద్గావ్కి చెందిన ప్రతిభ గల మా అమ్మాయి జ్ఞానేశ్వరి యాదవ్‌ను ఈరోజు సీఎం నివాసంలో సత్కరించుకున్నాము. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆమె రజత పతకం గెలిచింది.తొలి ప్రయత్నంలోనే పతకంతో తిరిగి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌తో పాటు దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసింది. యువత, దేశంలోని కుమార్తెలందరికీ ఆమె విజయం స్ఫూర్తిదాయకం. ఇందుకు ప్రతిగా రూ. 30 లక్షల క్యాష్ రివార్డుతో పాటు డీఎస్పీగా ప్రమోషన్ ఇస్తున్నాము. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందే ఉంటుంది’’ అని సీఎం విష్ణుదేవ్ సాయ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు.నిబంధనలు సడలించికాగా ఛత్తీస్‌గఢ్ పోలీసు విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ ప్రస్తుతం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ)గా పని చేస్తోంది. అయితే, ఆమె కోసం నిబంధనలు సడలించి డిప్యూటీ సూపరింటెండెట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) గా ప్రమోట్ చేస్తున్నట్లు సీఎం విష్ణుదేవ్ వెల్లడించారు.ఇదిలా ఉంటే.. కామన్వెల్త్ క్రీడలు-2026లో భారత వెయిట్‌లిఫ్టర్లు మొత్తం ఎనిమిది పతకాలు సాధించారు. మీరాబాయి చాను స్వర్ణం గెలవగా.. భారత్ ఖాతాలో మరో ఆరు రజత, ఒక కాంస్య పతకం చేరాయి. రిషికాంత సింగ్, రాజా ముత్తపండి, వల్లూరి అజయ్ బాబు, లవ్‌ప్రీత్ సింగ్, జ్ఞానేశ్వరి యాదవ్, హర్జీందర్ కౌర్ (రజతాలు), బింద్యారాణి దేవి (కాంస్యం) పతకాలు సాధించారు.చదవండి: గంభీర్‌పై ఫిర్యాదు చేసిన సీనియర్ ప్లేయర్లు! -
వెయిట్లిఫ్టర్లకు నజరానా
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు మొత్తం 8 పతకాలతో మెరిశారు. వీటిలో మీరాబాయి చాను స్వర్ణం గెలుచుకోగా... మరో 6 రజతాలు, 1 కాంస్యం భారత్ ఖాతాలో చేరాయి. రిషికాంత సింగ్, రాజా ముత్తుపండి, వల్లూరి అజయ్ బాబు, లవ్‌ప్రీత్ సింగ్, జ్ఞానేశ్వరి యాదవ్, హర్జీందర్ కౌర్‌లకు రజతం దక్కగా, బింద్యారాణి దేవి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత లిఫ్టర్ల ప్రదర్శనపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రశంసలు కురిపించారు. వారు తెచి్చన ప్రతీ మెడల్ దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు. ‘భారత ఆటగాళ్లు ఎప్పుడు పతకం గెలిచినా పార్లమెంట్లో దాని గురించి ప్రకటన తర్వాత సభ ప్రారంభమయ్యేది. ఈసారి మన ముగ్గురు ఆటగాళ్లు పతకం సాధించడంలో విఫలమయ్యారు. అయితే వారు నిరాశపడవద్దు. ఒక ప్లేయర్ ఎప్పుడూ ఓడిపోడనే విషయం మర్చిపోవద్దు. ఓటమి ఎదురైనా పాఠాలు నేర్చుకొని మళ్లీ గెలిచేందుకు సిద్ధమవుతాడు’ అని మాండవీయ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వెయిట్లిఫ్టర్లను సన్మానించి నగదు పురస్కారాలు అందజేశారు. మీరాబాయికి రూ.30 లక్షలు... రజత, కాంస్య పతక విజేతలకు వరుసగా రూ. 20 లక్షలు, రూ.10ల చొప్పున చెక్‌లను మంత్రి అందించారు. -
వందేమాతరం 2030 వైపు...
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ కమిటీ నుంచి స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాకు... అతడి నుంచి దిగ్గజ అథ్లెట్, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషకు... ఆమె చేతుల మీదుగా గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీకి... ఇలా కామన్వెల్త్ క్రీడల పతాకం 2030 పోటీలు జరిగే అహ్మదాబాద్‌కు చేరింది. దాంతో అధికారికంగా గ్లాస్గో క్రీడలు ముగిశాయి. పరిమిత సమయంలో, పరిమిత వనరులతోనే కామన్వెల్త్ గేమ్స్‌కు సిద్ధమైన స్కాట్లాండ్ ప్రభుత్వం సమర్థంగా, ఘనంగా నిర్వహించి ప్రశంసలందుకుంది. పోటీల ప్రధాన స్టేడియం ‘హైడ్రో’లో ముగింపు కార్యక్రమం కూడా అన్ని విధాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. ముఖ్యంగా తర్వాతి పోటీల వేదిక అయిన భారత్ గురించి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ఆసాంతం ఆకట్టుకున్నాడు. ‘వసుధైక కుటుంబం’ థీమ్‌లో వందేమాతరాన్ని ఆలపించిన సింగర్ శంకర్ మహదేవన్... అయ్ వతన్, సబ్ సే ఆగే హిందూస్తానీ, లహరాదో, భాగ్ మిల్కా భాగ్ వంటి పాటలతో అలరించాడు. మాజీ మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక 2026+2030 పోటీల ఆతిథ్య దేశాల సంగీతాలను కలుపుతూ రిషభ్ రికిరామ్ శర్మ, రాస్ ఎయిన్స్లీ ప్రదర్శించిన ‘ఫ్యూజన్’ మరో హైలైట్‌గా నిలిచింది. స్కాటిష్ సింగర్ స్యాండీ థామ్, ఆ్రస్టేలియా గాయని డెల్టా గూడ్రెమ్ పాడిన పాటలు, స్కాటిష్ స్టెప్ డాన్స్ అభిమానుల్లో ఉత్సాహం నింపగా, ఈ పోటీల్లో ఆటగాళ్ల ప్రదర్శనతో రూపొందించిన ‘స్పోర్ట్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్’ ఏవీ ప్రజెంటేషన్ ఆకట్టుకుంది. గ్లాస్గో చైర్మన్ జార్జ్ బ్లాక్, డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ సందేశంతో కార్యక్రమం ముగిసింది. 74 దేశాలకు చెందిన అథ్లెట్లు ముగింపు కార్యక్రమంలో పాల్గొనగా... భారత్ నుంచి బాక్సర్ జైస్మీ¯Œ జాతీయ పతాకంతో ముందు నడిచింది. ‘ఘనంగా నిర్వహిస్తాం’ 2030 కామన్వెల్త్ గేమ్స్‌పై గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీగ్లాస్గో: రెండు దశాబ్దాల తర్వాత భారత్ మరోసారి కామన్వెల్త్ క్రీడలకు వేదిక అవుతోంది. 2030లో జరిగే పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ పోటీలు జరుగుతాయి. గ్లాస్గో ముగింపు వేడుకల్లో సీడబ్ల్యూజీ నిర్వాహకులు సంప్రదాయ రీతిలో పోటీల జెండాను గుజరాత్ ఉప ముఖ్యమంత్రి, క్రీడా మంత్రి హర్ష్ సంఘ్వీకి అందజేశారు. ఈ నేపథ్యంలో గేమ్స్ నిర్వహణకు సంబంధించి ఆయన పలు అంశాలు మాట్లాడారు. గతంలో ఎన్నడూ జరగని రీతిలో ఘనంగా, అత్యుత్తమంగా పోటీలను నిర్వహిస్తామని హర్ష్ సంఘ్వీ చెప్పారు. 2010లో తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ భారత్‌లోని ఢిల్లీ నగరంలో జరిగాయి. ‘కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు ఇప్పటికే అహ్మదాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి. 20 శాతం వసతులను మెరుగు పరిస్తే చాలు. క్రీడాభివృద్ధిలో భాగంగా మేం చేస్తున్న పనులు 2028 చివర్లో పూర్తవుతాయి. కొత్తగా నిర్మించే స్టేడియంలను యువ అథ్లెట్ల శిక్షణ, హాస్టల్ వసతి కోసం వినియోగిస్తాం. ఇప్పటికిప్పుడు గేమ్స్ నిర్వహించగల హోటల్ వసతి, రవాణా సౌకర్యాలు మా వద్ద ఉన్నాయి. గుజరాత్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందీ ఉండదు’ అని సంఘ్వీ వివరించారు. -
బంగారు కోటలో అరుంధతి
కోచింగ్‌లకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన రాజస్థాన్‌లోని కోటలో ఏ సబ్జెక్ట్‌కు సంబంధించి అయినా కోచ్‌లకు కొదవ లేదు. అయితే బాక్సింగ్ కోచ్ దొరకడం మాత్రం చా...లా కష్టం. అలాంటి కష్టం ఉన్నచోట బాక్సింగ్ రింగ్‌లోకి అడుగు పెట్టిన అరుంధతి చౌదరి ఒక్కో మెట్టు ఎక్కుతూ అంతర్జాతీయ స్థాయికి చేరింది. తాజా విషయానికి వస్తే... గ్లాస్గోలోని ఎస్ఇసి సెంటర్లో మహిళల 70 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది....మీరు డాక్టర్ కావాలి లేదా సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలని మీ తల్లిదండ్రులకు బలంగా ఉండొచ్చు. మీకు మరేదో లక్ష్యం ఉండొచ్చు. ‘నా లక్ష్యం ఇది’ అని స్పష్టంగా చెప్పండి. వారు తప్పకుండా ఒప్పుకుంటారు. మీకు బలమైన ఆశీస్సులు అందిస్తారు. అరుంధతి కథ అలాంటిదే.→ అయినా సరే, ఆటలంటే ఇష్టం‘విద్యాపరంగా కోటకు ఎంత పెద్ద పేరు ఉందో అందరికీ తెలుసు. అరుంధతి చదువులో ముందుండేది. గణితంలో అత్యధిక మార్కులు వచ్చేవి. అందుకే ఐఐటీ లేదా ఐఏఎస్ పరీక్ష రాయించాలనుకునేవాడిని. ఆ రెండిటిలో కనీసం ఒకదానిలోనైనా అరుంధతి విజయం సాధిస్తుందని నాకు నమ్మకం ఉండేది. అందుకే ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాను. అయితే తాను మాత్రం ఆటలు అంటే ఇష్టం అని చెప్పింది’ గతాన్ని గుర్తు చేసుకున్నారు అరుంధతి తండ్రి సురేష్ చౌదరి.→ రెండు ప్రశ్నలుఐఐటీ, ఐఏఎస్‌ల గురించి చెబుతున్నప్పుడు తండ్రిని ఒక ప్రశ్న అడిగింది అరుంధతి... ‘ఐఐటీ, ఐఏఎస్ ప్రవేశ పరీక్షలలో ఎంతమంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు?’ ‘ఐఏఎస్‌లో రెండువందల మంది, ఐఐటీలో పదివేల మంది’ అని చెప్పారు తండ్రి. ‘ఎంతమంది భారతీయులు ఒలింపిక్ స్వర్ణపతకాన్ని గెల్చుకున్నారు?’ అని రెండో ప్రశ్న వేసింది అరుంధతి. ఆయనకు అభినవ్ బింద్రా గురించి మాత్రమే తెలుసు! ఏ ఆటను ఎంచుకోవాలి అనే విషయంలో తండ్రీకూతుళ్ల మధ్య చాలాసేపు చర్చ నడిచింది.టబాక్సింగ్ అనేది ఒలింపిక్ క్రీడ అని తెలిసినప్పుడు అరుంధతి కళ్లలో మెరుపు కనిపించింది. అలా ఆమె మనసులోకి బాక్సింగ్ ప్రవేశించింది. బాక్సింగ్‌పై ఇష్టం సరే, మరి కోచ్ ఎవరు?ఎవరూ లేరు!చివరికి టైక్వాండో కోచ్ అశోక్ గౌతమ్ ఇంటికి వెళ్లారు. తండ్రీకూతుళ్లు తనకు బాక్సింగ్ గురించి ఏమీ తెలియదని గౌతమ్ చెప్పారు. అయితే ఆయన చేసిన మంచి పని... మహమ్మద్ అలి, మైక్ టైసన్‌ల గురించి తనకు తెలిసిన విషయాలను అరుంధతికి చెప్పడం. బాక్సింగ్ కోచ్‌లు అప్లోడ్ చేసిన శిక్షణా వీడియోలను చూసి ఆ విషయాలను అరుంధతికి అర్థమయ్యేలా చెప్పేవారు గౌతమ్.కట్ చేస్తే...యూత్ ఆసియా క్రీడల్లో (2019) లో కాంస్యం, సెర్బియాలో జరిగిన నేషన్స్ కప్(2019)లో స్వర్ణం, యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్స్(2021)లో స్వర్ణం, 2025లో వరల్డ్ బాక్సింగ్ కప్‌లో స్వర్ణం గెలుచుకుంది అరుంధతి. తాజాగా...కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించింది.‘ఒలింపిక్స్ అంటే ఇంటి పై కప్పులాంటిది. ఒకేసారి పై కప్పుకు చేరుకోలేము. అక్కడికి చేరుకోవాలంటే మెట్లు ఎక్కాలి. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ అనేవి ఒలింపిక్ మెట్లలాంటివి’ అంటుంది అరుంధతి. 2028 ఒలిపింక్స్‌లో పతకం సాధించడం అరుంధతి లక్ష్యం. ఆమె లక్ష్యం సిద్ధించాలని ఆశిద్దాం. పట్టుదల పెంచేలా...పోటీలో ఓటమి ఎదురైనప్పుడు, నేను బాధగా కనిపించినప్పుడు అమ్మా,నాన్నలు నాకు ధైర్యం ఇచ్చేవారు. ‘నువ్వు కోల్పోయింది జీవితాన్ని కాదు ఆటను మాత్రమే’ అనేవారు. వారి మాటలు నాకు బలమైన టానిక్‌లా పనిచేసేవి. ఉత్సాహాన్ని పెంచేవి. ‘ఎలాగైనా ఈసారి గెలవాలి’ అనే పట్టుదలను పెంచేవి.– అరుంధతి చౌదరి -
నాన్నా... నీ కల ఇది...
త్రిపురలోని సైకిల్ మెకానిక్ కుమార్తె అస్మితా డే గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో చరిత్ర లిఖించింది. 48 కేజీల విభాగంలో స్వర్ణం సాధించి కామన్వెల్త్ జూడోలో దేశానికి తొలి గోల్డ్‌మెడల్ అందించింది. మెడలో మెరుస్తున్న పతకాన్ని చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లతో ఆకాశం వైపు చూసి ‘నాన్నా... ఇది నీ కల’ అన్నప్పుడు అక్కడ ఉన్న వేలాది మంది కళ్లు చెమర్చాయి. ఆమెను ప్రోత్సహించిన తండ్రి కొద్ది నెలల కిందే మరణించాడు. కాని బిడ్డ ఆయన కలను సాకారం చేసింది.గ్లాస్గో, జూలై 31ఆడిటోరియం అంతా నిశ్శబ్దం. మ్యాట్‌పై ఇద్దరు జూడో యోధులు తలపడుతున్నారు. ఒకరు కెనడాకు చెందిన అంతర్జాతీయ ఛాంపియన్ హెడీ క్వాచ్, మరొకరు మన త్రిపుర మట్టిలో పెరిగిన నిరుపేద సైకిల్ మెకానిక్ కూతురు, 23 ఏళ్ల అస్మితా డే. అస్మితా కళ్లలో అలసట లేదు. కేవలం గెలవాలనే కసి, తండ్రికి ఇచ్చిన మాట మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా మెరుపులాంటి పట్టు... ప్రత్యర్థి చిత్తయింది! అంపైర్ అస్మితా చేయి పైకెత్తగానే స్టేడియం భారత జయజయధ్వానాలతో మారుమోగిపోయింది. కానీ, అస్మితా మాత్రం మోకాళ్లపై కూలబడి, రెండు చేతులతో ముఖాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ ఏడుపులో గెలిచిన ఆనందం కంటే, ఈ విజయాన్ని చూడడానికి నాన్న లేడనే దు:ఖమే ఎక్కువగా ఉంది.తండ్రి కలత్రిపురలోని బెలోనియా అనే చిన్న పట్టణంలో నివసించే అస్మితా డే కుటుంబం కూటికి పేదదేమో కాని కలలకు కాదు. ఆమె తండ్రి అర్జున్ కుమార్ డే చిన్న సైకిల్ రిపేర్ షాపు నడుపుతూ రోజుకు 300 సంపాదించేవాడు. అయినా సరే కుమార్తెను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా చూడాలని కలలు కనేవాడు. అస్మితాకు జూడో ఆటను పరిచయం చేసి, లక్ష రూపాయల అప్పు చేసి మరీ జూడో సెంటర్లో చేర్పించాడు. ‘మా అమ్మాయి దేశం మెచ్చే స్థాయికి ఎదగాలి‘ అనేదే ఆ తండ్రి ఆరాటం. కానీ, కూతురు సాధించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని చూడకుండానే డిసెంబర్, 2025లో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా కన్నుమూశాడు. ఆ సమయంలో అస్మితా తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది, తన ప్రపంచమంతా ముగిసిపోయిందని భావించింది. కాని పదిరోజుల్లోనే తల్లి కుమార్తెను లక్ష్యం వైపు ఉత్తేజపరిచింది. ‘నువ్వు ఆగిపోతే మీ నాన్నను అగౌరవపరిచినట్టే’ అని శిక్షణకు పంపింది.కోచ్‌ల అండకన్నతండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అస్మితాను త్రిపుర స్పోర్ట్స్ స్కూల్ కోచ్‌లు, జూడో అసోసియేషన్ సెక్రటరీ ప్రణబ్ సాహా ఎంతో అండగా నిలిచి మళ్ళీ మ్యాట్ మీదకు తీసుకువచ్చారు. అస్మితాలోని ప్రతిభను మొదట గుర్తించిన బీనా దేబ్నాథ్, మణికలాల్ దేబ్ ఆమెకు ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా, ఊరి నుంచి రావడానికి బస్సు చార్జీలు లేని రోజుల్లో తమ సొంత డబ్బులతో సహాయం చేశారు. ఆమె భోజన వసతి కోసం కోచ్‌లు అందరూ కలిసి డబ్బులు పూల్ చేసిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత భోపాల్‌లోని సాయ్ ( అఐ) రీజినల్ సెంటర్లో కోచ్ యశ్పాల్ సోలంకి పర్యవేక్షణలో ఆమె మరింత రాటుదేలింది. గత కొన్ని సంవత్సరాలుగా జూనియర్ ఆసియా కప్, ఆఫ్రికన్ ఓపెన్ లలో పతకాలు సాధిస్తూ తన పట్టుదలని నిరూపించుకోవడంతో రెండేళ్ల క్రితం యుపి పోలీస్ ఆమెకు ఎస్.ఐ. పోస్టు ఇచ్చింది. అయినా సరే తన శిక్షణకు, ఇల్లు గడవడానికి ఆ జీతం అంతంత మాత్రమే.లక్ష్యం అదేఇప్పుడు అస్మితా లక్ష్యం ఒక్కటే. నాన్న పేరుతో బెలోనియాలో ఒక జూడో అకాడమీ పెట్టడం. ‘నాలా ఇంకా చాలా మంది పేద పిల్లలు ఉన్నారు. వాళ్లకు అవకాశం ఇవ్వాలి’ అని చెబుతోంది అస్మితా. కూతురు సాధించిన విజయం చూసి ‘నా భర్త బ్రతికి ఉండి ఈ విజయాన్ని చూసుంటే ఎంత సంతోషించేవారో!’ అంటూ అస్మితా తల్లి కన్నీరుమున్నీరయ్యింది. అస్మితా సాధించిన విజయం కేవలం ఒక పతకం మాత్రమే కాదు. పేదరికంపై, విధిపై ఒక సామాన్య భారతీయురాలు సాధించిన అసాధారణ విజయం. ఆకాశం వైపు చూస్తూ తన తండ్రికి ఆమె సమర్పించిన ఈ సువర్ణ నివాళి ఎప్పటికీ అమరమే. గ్లాస్గో మ్యాట్‌పై సింహగర్జనఎలాగైనా స్వర్ణం గెలవాలనే పట్టుదలతో గ్లాస్గో వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కెనడాకు చెందిన బలమైన ప్రత్యర్థి హెడీ క్వాచ్‌తో అస్మితా తలపడింది. మ్యాచ్ ఆరంభంలో ప్రత్యర్థి ఆధిక్యం సాధించినప్పటికీ, అస్మితా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. తన తండ్రి ఆశయాలను, పడ్డ కష్టాలను గుండెల్లో నింపుకుని సింహంలా పోరాడింది. ఉత్కంఠభరితంగా సాగిన ‘గోల్డెన్ స్కోర్’ రౌండ్లో అద్భుతమైన పట్టుతో ప్రత్యర్థిని మట్టికరిపించి చారిత్రాత్మక ‘గోల్డ్’ కైవసం చేసుకుంది. మెడలో బంగారు పతకం పడుతుంటే, పోడియంపై నిలబడి జాతీయగీతం వింటున్నప్పుడు అస్మితా కళ్ల నుంచి ఆనంద బాష్పాలు ధారలుగా ప్రవహించాయి. -
39 పతకాలకే పరిమితం.. 24 ఏళ్లలో అత్యల్పం.. అయినా..!
గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. సంఖ్యాపరంగా చూస్తే 1998 తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ సాధించిన అత్యల్ప పతకాల సంఖ్య ఇదే. అయితే గ్లాస్గో గేమ్స్‌లో భారత్ ఎదుర్కొన్న పరిస్థితులను పరిశీలిస్తే ఈ ప్రదర్శనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.పరిమితుల కారణంగా ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో కేవలం 10 క్రీడలనే నిర్వహించారు. భారత్‌కు సంప్రదాయంగా భారీగా పతకాలు అందించే షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ వంటి క్రీడలు ఈసారి పోటీల్లో లేకపోవడం భారత పతకాల అవకాశాలను గణనీయంగా దెబ్బతీసింది.2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ ఐదు క్రీడల నుంచే భారత్ 30 పతకాలు (13 స్వర్ణాలు) సాధించింది. అంటే గతసారి భారత్ సాధించిన మొత్తం పతకాలలో దాదాపు సగం ఈ క్రీడల నుంచే వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లోనూ భారత్ గ్లాస్గోలో 39 పతకాలు సాధించడం గమనార్హం.బాక్సింగ్‌లో చారిత్రాత్మక ప్రదర్శనభారత బాక్సర్లు ఈసారి అద్భుతంగా రాణించారు. మొత్తం 10 పతకాలు సాధించగా, అందులో ఏకంగా 7 స్వర్ణాలు, 3 రజతాలు ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో ఒకే దేశానికి చెందిన బాక్సింగ్ బృందం సాధించిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది ఒకటిగా నిలిచింది.జూడోలో కొత్త చరిత్రజూడోలోనూ భారత్ సత్తా చాటింది. హర్ష్ సింగ్, అస్మితా డే తమ విభాగాల్లో స్వర్ణాలు సాధించి, కామన్వెల్త్ గేమ్స్ జూడోలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాలను అందించారు. యామిని మౌర్య రజతం, ఉన్నతి శర్మ కాంస్యం సాధించారు.అథ్లెటిక్స్‌లోనూ మెరుపులుఅథ్లెటిక్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో రజత పతకం సాధించాడు. గుల్వీర్ సింగ్ 10,000 మీటర్లలో రజతం, 5,000 మీటర్లలో కాంస్యం సాధించి ఒకే కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ట్రాక్ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్‌లో కాంస్యం సాధించి ఈ ఈవెంట్లో భారత్‌కు తొలి కామన్వెల్త్ పతకాన్ని అందించాడు.వెయిట్‌లిఫ్టింగ్, పారా-స్పోర్ట్స్‌లోనూ సత్తావెయిట్లిఫ్టింగ్లో మీరాబాయి చాను వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించి అరుదైన ఘనత అందుకుంది. భారత వెయిట్‌లిఫ్టింగ్ బృందం మొత్తంగా 8 పతకాలు సాధించింది.పారా-అథ్లెటిక్స్‌లోనూ భారత్ అద్భుతంగా రాణించింది. ఈ విభాగంలో 7 పతకాలు వచ్చాయి. శర్మిలా ధంకర్, దిలీప్ మహదు గవిత్, సోమన్ రాణా స్వర్ణాలు సాధించారు.నాలుగో స్థానంలో భారత్మొత్తంగా ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. టాప్-3లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా ఉన్నాయి. భారత్, ఆతిథ్య స్కాట్లాండ్ చెరో 39 పతకాలు సాధించినప్పటికీ, భారత్ ఎక్కువ రజతాలు సాధించడంతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.సంఖ్యాపరంగా 39 పతకాలు భారత్‌కు 1998 తర్వాత అత్యల్పమే అయినప్పటికీ, సంప్రదాయ పతకాల వనరులైన ఐదు క్రీడలు లేకుండానే ఈ స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం గ్లాస్గో గేమ్స్‌లో భారత బృందం సాధించిన కీలక విజయంగా చెప్పొచ్చు. ముఖ్యంగా బాక్సింగ్, జూడో, అథ్లెటిక్స్, పారా-స్పోర్ట్స్‌లో వచ్చిన పురోగతి భారత బహుళ క్రీడా సామర్థ్యానికి కొత్త ఆశలు కలిగిస్తోంది. -
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు..
-
నాడు సన్మానాలు, సత్కారాలు.. తర్వాత తొక్కిపడేశారు!
ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌కు మొట్టమొదటి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించిన అథ్లెట్ అర్షద్ నదీమ్. పారిస్ ఒలింపిక్స్-2024లో అనూహ్య రీతిలో ఈ జావెలిన్ త్రోయర్ ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. తద్వారా విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జావెలిన్ త్రోయర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు.ఈ క్రమంలో పాకిస్తాన్లో అర్షద్ నదీమ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అతడు సన్మానాలు, సత్కారాలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. అతడి ప్రదర్శన రోజురోజుకీ దిగజారిపోయింది.చేదు అనుభవంతాజాగా కామన్వెల్త్ గేమ్స్-2026లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్షద్ నదీమ్.. కనీసం కాంస్యం కూడా గెలవలేకపోయాడు. తొలి ప్రయత్నంలోనే ఫౌల్ కావడంతో అతడికి ఫైనల్ రౌండ్లో చేదు అనుభవం ఎదురైంది. టాప్-8కు చేరలేక అతడు ఎలిమినేట్ అయ్యాడు. గత ఎడిషన్‌లో పసిడితో మెరిసిన అతడు ఈసారి కనీసం కాంస్యం కూడా లేకుండానే వెనుదిరిగాడు.చెప్పినట్లు వినలేదని...అయితే, ఇందుకు పాకిస్తాన్ అమెచూర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (PAAF)తో అతడికి ఉన్న విభేదాలే కారణం అని తెలుస్తోంది. PAAF అభీష్టానికి వ్యతిరేకంగా అర్షద్.. సల్మాన్ బట్‌ను తన కోచ్‌గా ఎంచుకున్నట్లు సమాచారం. నిజానికి సల్మాన్‌పై PAAF 2025 అక్టోబరులో జీవితకాల నిషేధం విధించింది. ఆ తర్వాత నెల రోజుల వ్యవధిలోనే నిషేధం ఎత్తివేసింది.దీంతో అర్షద్ సల్మాన్ మార్గదర్శనంలో ప్రాక్టీస్ చేశాడు. అయితే, ఇందుకు PAAF ఏమాత్రం సహకరించలేదని సమాచారం. పాకిస్తాన్ క్రీడా బోర్డు సైతం అర్షద్ నదీమ్ సన్నాహకాలకు కావాల్సిన నిధులు విడుదల చేయలేదని అతడి సన్నిహిత వర్గాలు గతంలో స్థానిక మీడియాకు తెలిపాయి.ఈ నేపథ్యంలో విదేశాల్లో ప్రాక్టీస్ చేయడం వీలుకాక.. లాహోర్‌లో ఎర్రటి ఎండల్లో అర్షద్ ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. కామన్వెల్త్ క్రీడల వేదికైన గ్లాస్గో (స్కాట్లాండ్)లో ఇందుకు పూర్తి వ్యతిరేకమైన వాతావరణం ఉండటం అతడి ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.అతడికి ఎంతటి దుస్థితిఈ పరిణామాల నేపథ్యంలో అర్షద్ నదీమ్ ఈసారిక పతకం లేకుండానే వెనుదిరిగినట్లు అతడి సన్నిహితవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, పాక్ మాజీ బాక్సర్ హుసేన్ షా ఈ విషయం గురించి మాట్లాడుతూ..‘‘సరైన ఆదాయం లేని.. నిరుపేద కుటుంబం, చిన్న గ్రామం నుంచి వచ్చి దేశాన్ని తలెత్తుకునేలా చేసిన అథ్లెట్ అతడు. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో దేశానికి పసిడి పతకాలు అందించాడు. కానీ ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ కోసం సన్నద్ధమయ్యే వాతావరణం కూడా మా క్రీడా సంస్థ కల్పించలేకపోయింది.పాక్ క్రీడా వ్యవస్థలోని లోపానికి ఇది నిలువెత్తు నిదర్శనం’’ అని హుసేన్ షా మండిపడ్డాడు. కాగా అంతకుముందు సల్మాన్‌తో పాటు సౌతాఫ్రికా కోచ్ టెర్సస్ లీబెన్బెర్గ్తో అర్షద్ ప్రాక్టీస్ చేసి అత్యుత్తమ ఫలితాలు అందుకున్నాడు.సరైన సదుపాయాలు ఉంటే స్వర్ణం గెలిచేదాన్నిమరోవైపు.. పాకిస్తాన్‌కు ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో ఏకైక పతకం అందించిన బాక్సర్ ఫాతిమా జెహ్రా సైతం పాక్ క్రీడా బోర్డు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తనకు సరైన సదుపాయాలు కల్పించి ఉంటే కచ్చితంగా మెరుగైన పతకం అందించేదానినని పేర్కొంది. కాగా ఫాతిమా కాంస్య పతకం గెలిచింది. ఇక పాకిస్తాన్ నుంచి ఈసారి మొత్తంగా 36 మంది సభ్యుల బృందం గ్లాస్గోకు వెళ్లగా.. కేవలం ఒకే ఒక్క పతకం దక్కింది.చదవండి: గిల్, అభిషేక్ శర్మ కీలక నిర్ణయం -
అహ్మదాబాద్‌లో కలుద్దాం!
క్రీడాంశాలు తగ్గిపోయినా... పతకాల వేటలో మాత్రం భారత క్రీడాకారులు జోరు కొనసాగించారు. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో సాధించిన ఓవరాల్ నాలుగో స్థానాన్ని 2026 గ్లాస్గో గేమ్స్‌లోనూ నిలబెట్టుకున్నారు. స్కాట్లాండ్లో 11 రోజులపాటు జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌కు ఆదివారం తెరపడింది. 74 దేశాల నుంచి 2,729 మంది క్రీడాకారులు 10 క్రీడాంశాల్లో పోటీపడ్డారు. ఆ్రస్టేలియా మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకొని 171 పతకాలతో అగ్రస్థానాన్ని అలంకరించింది. 110 పతకాలతో ఇంగ్లండ్ రెండో స్థానం దక్కించుకోగా... 62 పతకాలతో కెనడా మూడో స్థానాన్ని సంపాదించింది. 39 పతకాలతో భారత్, స్కాట్లాండ్ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాయి. రెండు దేశాలు 13 చొప్పున స్వర్ణాలు గెలుపొందగా... స్కాట్లాండ్కంటే ఎక్కువ రజతాలు నెగ్గిన భారత్‌కు నాలుగో స్థానం ఖరారైంది. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలోనే నిలిచింది. బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో భారత్ పతకాలు నెగ్గిన క్రీడాంశాలు బ్యాడ్మింటన్, హాకీ, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, స్క్వాష్, టి20 క్రికెట్ ఈసారి లేకపోవడంతో ఈసారి మనం గెలిచిన పతకాల సంఖ్య తగ్గింది. తదుపరి 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం ఈ మెగా ఈవెంట్‌కు వేదిక కానుంది. గ్లాస్గో: ఆఖరి రోజును పతకంతో ముగించాలని ఆశించిన భారత బృందానికి నిరాశ ఎదురైంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో చివరిరోజు భారత్ పతకం గెలవకుండానే ముగించింది. జూడోలో మహిళల 78 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి ఇష్రూప్ నారంగ్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. అయితే కాంస్య పతక బౌట్లో ఇష్రూప్ కెనడా ప్లేయర్ కొరాలీ గాడ్‌బౌట్ చేతిలో ఓడిపోయింది. ఇక ఆఖరి ఈవెంట్ సైక్లింగ్ 40 కిలోమీటర్ల పాయింట్స్ రేస్‌లో భారత ప్లేయర్లు హర్ష్ వీర్, దినేశ్ క్వాలిఫయింగ్ రౌండ్లోనే వెనుదిరిగారు. వెరసి గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ చివరిరోజు భారత్ ఖాతాలో ఒక్క పతకం కూడా చేరలేదు. ఓవరాల్‌గా భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 39 పతకాలతో నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుంది. తద్వారా 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి వరుసగా ఏడో గేమ్స్‌లోనూ భారత్ టాప్–5లో నిలిచింది. మరోవైపు ఆ్రస్టేలియా 70 స్వర్ణాలు, 45 రజతాలు, 56 కాంస్యాలతో కలిపి 171 పతకాలతో నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ 29 స్వర్ణాలు, 45 రజతాలు, 36 కాంస్యాలతో కలిపి 110 పతకాలతో రెండో స్థానం దక్కించుకుంది. కెనడా 19 స్వర్ణాలు, 20 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 62 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. గ్లాస్గో గేమ్స్‌లో చివరి స్వర్ణం ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ దేశం ఖాతాలోకి వెళ్లింది. పురుషుల సైక్లింగ్ 40 కిలోమీటర్ల పాయింట్స్ రేస్ ఫైనల్లో ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ సైక్లిస్ట్ మాథ్యూ బోస్టాక్ పసిడి పతకం గెలిచాడు. అర్ధరాత్రి గం. 1:30 నుంచి జరిగిన ముగింపు వేడుకల్లో భారత బృందానికి స్వర్ణ పతకం గెలిచిన మహిళా బాక్సర్ జైస్మిన్ లంబోరియా ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించింది. తదుపరి 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్‌లోని అహ్మదాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుంది.45 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో కనీసం ఒక్క పతకమైనా సాధించిన దేశాలు. ఇందులో 25 దేశాలు కనీసం ఒక్క స్వర్ణ పతకమైనా గెలిచాయి.5 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు ఒక్క పతకం నెగ్గని క్రీడాంశాలు జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, సైక్లింగ్, బాస్కెట్‌బాల్, లాన్ బౌల్స్21 ఈసారి భారత్ గెలిచిన 39 పతకాల్లో 21 పతకాలు తొలిసారి ఈ క్రీడల్లో పాల్గొన్నవారు గెలిచారు. -
'పతకాలు చూసి మురిసిపోవద్దు.. ముందుంది ముసళ్ల పండగ!’
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తున్న వేళ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని ఆమె కొనియాడారు. బాక్సింగ్‌లో ఏడు స్వర్ణాలు రావడం నిజంగా గొప్ప విషయమన్నారు.అయితే కామన్వెల్త్లో సాధించిన పతకాలను చూసి మురిసిపోవద్దని, ఆసియా గేమ్స్ రూపంలో మన ముంగిట అసలైన సవాల్ ఉందని పేర్కొన్నారు. కామన్వెల్త్ ముగిసిన కొద్ద రోజులకే ఆసియా గేమ్స్ జరగనున్న నేపథ్యంలో అథ్లెట్లంతా ఆ క్రీడలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనని చైనా, జపాన్‌లు ఇక్కడ పోటీలో ఉంటాయని, కాబట్టి భారత్ పతకాల కోసం గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సున్నితంగా హెచ్చరించారు. మన అథ్లెట్లంతా కామన్వెల్త్లో చూపిన ప్రదర్శనను ఆసియా గేమ్స్‌లోనూ కంటిన్యూ చేసి దేశానికి వీలైనన్ని ఎక్కువ పతకాలు తీసుకురావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు పీటీ ఉష వెల్లడించారు. అయితే పీటీ ఉష వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడిచింది. ఒలింపిక్స్‌లో లేదా కామన్వెల్త్ గేమ్స్‌లో దేశానికి ఒక్క పతకం కూడా తీసుకురాని వ్యక్తి ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని కొంతమంది కామెంట్లు చేయడం కనిపించింది. ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 39 పతకాలు కొల్లగొట్టింది. మనకు అచ్చొచ్చిన రెజ్లింగ్, షూటింగ్ సహా చాలా క్రీడలను ఈసారి కామన్వెల్త్ గేమ్స్ నుంచి తొలగించడం భారత్‌పై గట్టి ప్రభావం చూపింది. అయినప్పటికీ మన అథ్లెట్లు మంచి ప్రదర్శనే కనబరిచారు. ముఖ్యంగా బాక్సింగ్‌లో ఎవర్గ్రీన్ ప్రదర్శనతో అదరగొట్టారు. ఏడు స్వర్ణాలు, మూడు రజతాలతో మన బాక్సర్ల తమ పంచ్ పవర్ చూపించారు. మొత్తంగా భారత్ సాధించిన 39 పతకాల్లో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలున్నాయి. ఇక పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం చివరి రోజు కావడం, భారత అథ్లెట్లకు మెడల్ ఈవెంట్స్ ఉండడంతో, 40 పతకాల మార్క్‌ను అందుకుంటుందా అన్నది చూడాలి. “They should not just celebrate their victory. They have a very big competition ahead of them, the Asian Games. They should now focus on their events and bring a lot of medals for our country."- Indian Olympic Association President P. T. Usha pic.twitter.com/wBJ8O8wrQ5— The Khel India (@TheKhelIndia) August 1, 2026Read: ‘అతడిని ఎంపిక చేయబోం.. రిటైరవ్వడమే మంచిది’ -
'అసంపూర్ణంగా భారతదేశ చిత్రపఠం.. ఎందుకీ వివక్ష?'
భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ తన చర్యతో వార్తల్లో నిలిచింది. గ్లాస్కోలోని ఒక రెస్టారెంట్లో తమకు ఇచ్చిన నాప్కిన్లో భారతదేశ చిత్రపఠం అసంపూర్తిగా ఉండడంపై లవ్లీనా అసంతృప్తి వ్యక్తం చేసింది. విషయంలోకి వెళితే.. గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్లు పతకాలు సాధించిన సంతోషంలో ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు గ్లాస్కోలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడి రెస్టారెంట్ మేనేజ్మెంట్ తమ హోటల్‌కు వచ్చిన సందర్భంగా ఆటగాళ్లకు భారత చిత్రపఠంతో తయారు చేసిన ప్రత్యేక నాప్కిన్లను అందించారు. అయితే నాప్కిన్ను సుశితంగా పరిశీలించిన బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ నాప్కిన్పై భారత చిత్రపఠం అసంపూర్ణంగా ఉండడాన్ని గమనించింది. నాప్కిన్పై ముద్రించిన చిత్రపఠంలో ఈశాన్య రాష్ట్రాలను చేర్చకపోవడంపై లవ్లీనా అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఇక్కడా ఎలాంటి గొడవ చేయకుండా లవ్లీనా వ్యవహరించిన తీరు రెస్టారెంట్ మేనేజ్మెంట్కు బాగా నచ్చింది. నాప్కిన్పై ముద్రించిన భారత చిత్రపఠంలో ఈశాన్య ప్రాంతాలను విస్మరించడం తనకు బాధ కలిగించిందని, తమపై ఎందుకీ వివక్ష అని నవ్వుతూనే పేర్కొంది. వెంటనే దానిని సవరించాలని రెస్టారెంట్ యజమానులను లవ్లీనా అభ్యర్థిస్తూ కోరింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక కామన్వెల్త్ గేమ్స్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బాక్సర్లు స్వర్ణ వర్షం కురిపించారు. శనివారం మధ్యాహ్నం ప్రీతి పవార్ ఆరంభించిన గోల్డెన్ పంచ్.. రాత్రి అంకుశ్ పంఘల్ తెచ్చిన ఆఖరి బంగారు పతకం వరకూ కొనసాగింది. జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియ ఘంగాస్ , అరుంధతి చౌదరి, సచిన్ సివాచ్ కూడా పసిడి పతకాలకు గురిపెట్టగా.. ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గోహైన్, జాదుమణి సింగ్, నరేందర్ బెర్వాల్ రజతాలు తీసుకొచ్చారు. కామన్వెల్త్ చరిత్రలో భారత బాక్సర్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2010, 2018, 2022 ఎడిషన్లలో మూడేసి స్వర్ణాలే ఇప్పటిదాకా రికార్డు కాగా.. గ్లాస్గోలో బాక్సర్లు ఆల్‌టైమ్ రికార్డు సృష్టించారు. పారా అథ్లెట్ సోమన్ రాణా కూడా పసిడి పతకం అందుకోవడంతో మెగా గేమ్స్‌లో ఒకే రోజు 8 పసిడి పతకాలతో పండగ చేసుకున్న భారత్ పట్టికలో టాప్-5లోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం భారత్ 39 పతకాలు (13 స్వర్ణం, 17 రజతం, 9 కాంస్యం) సాధించి పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. All Indian players went to a restaurant in Glasgow to celebrate victory in commonwealth games when they noticed incomplete map of India..Boxer Lovlina Borgohain who recently won silver medal in commonwealth games objected to a map of India printed on the restaurant's napkins as… pic.twitter.com/gfSGXmx00B— Trupti Garg (@garg_trupti) August 2, 2026Read: గుండుతో దర్శనం.. హార్దిక్ పాండ్యా కొత్త లుక్ వైరల్ -
చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్.. తొలి భారత అథ్లెట్‌గా
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ గుల్వీర్ సింగ్ అదరగొట్టాడు. తొలుత జూలై 28న జరిగిన 10,000 మీటర్ల విభాగంలో రజతం (సిల్వర్) గెలుచుకున్న గుల్వీర్.. తాజాగా శనివారం 5000 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు.రేసును గుల్వీర్ 13 నిమిషాల 24.95 సెకన్లలో ముగించి ఈ బ్రాంజ్ మెడల్‌ను ఒడిసి పట్టాడు. తద్వారా ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుల్వీర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే 5000 మీటర్ల పరుగు పందెంలో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా గుల్వీర్ రికార్డులకెక్కాడు. అంతేకాకుండా కామన్వెల్త్ గేమ్స్ ఒకే ఎడిషన్‌లో భారత్ తరపున రెండు పతకాలు సాధించిన మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా కూడా అతడు చరిత్ర సృష్టించాడు.గుల్వీర్ సింగ్ ట్రాక్ రికార్డ్28 ఏళ్ల గుల్వీర్ సింగ్ అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 5000 మీటర్లు (12:59.77), 10,000 మీటర్లు రెండింటిలోనూ జాతీయ రికార్డులు కలిగి ఉన్నాడు. అంతకుముందు చైనా వేదికగా జరిగిన ఆసియాక్రీడలు-2023లోనూ అతడు 10,000 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. గుల్వీర్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలోని గ్రెనేడియర్స్ రెజిమెంట్‌లో నాయిబ్ సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. -
'పంచ్'లతో పసిడి పంట
భారత బాక్సింగ్ బృందం కామన్వెల్త్ గేమ్స్‌లో పదునైన పంచ్‌లతో విరుచుకుపడింది...అటు పురుషులు, ఇటు మహిళల విభాగాల్లో పసిడి వేటలో ఒకరితో మరొకరు పోటీ పడినట్లుగా మన బాక్సర్లు చెలరేగిపోయారు... ఫలితంగా ఒకే రోజు మన ఖాతాలో 7 స్వర్ణాలు చేరాయి. ఫైనల్లో ఓటమితో మరో 3 రజతాలు కూడా దక్కడంతో మొత్తంగా 10 పతకాలకు బాక్సింగ్ మనకు అందించింది. జైస్మీన్, సాక్షి, ప్రీతి, ప్రియ, అరుంధతి, అంకుశ్, సచిన్ స్వర్ణ పతకాలు గెలుచుకోగా...జాదూమణి సింగ్, లవ్లీనా బొర్గొహైన్, నరేందర్ రజతాలు సాధించారు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యంతో 7 పతకాలు గెలుచుకున్న భారత్...ఇప్పుడు దానిని అధిగమించింది. మొత్తంగా శుక్ర, శనివారాలు కలిపి వేర్వేరు ఈవెంట్లలో పెద్ద సంఖ్యలో పతకాలు గెలిచిన భారత్ కామన్వెల్త్ క్రీడల్లో తమ స్థాయిని ప్రదర్శించింది. నేడు పోటీలకు చివరి రోజు. జైస్మీన్ లంబోరియా (57 కేజీలు): ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జైస్మీన్ కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణాన్ని అందుకుంది. ఫైనల్లో జైస్మీన్ 5–0తో మికెలా వాల్ష్ (నార్తర్న్ ఐలాండ్)పై ఘన విజయం సాధించింది. 2022 క్రీడల్లో ఆమె కాంస్యం సాధించింది. సాక్షి చౌదరి (51 కేజీలు): ఫైనల్లో సాక్షి 5–0తో రూబీ వైట్ (ఇంగ్లండ్)ను ఓడించింది. గత కొంత కాలంగా పలు మార్లు కెరీర్లో గాయాలతో ఇబ్బంది పడి కోలుకున్న సాక్షి కెరీర్లో ఇది కీలక విజయం. ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న సమయంలో విరాట్ కోహ్లి ఫౌండేషన్ మూడేళ్ల పాటు సాక్షికి అండగా నిలవడంతో ఆమె పట్టుదలగా పోటీలో నిలవగలిగింది. అరుంధతి చౌదరి (70 కేజీలు): ఫైనల్లో అరుంధతి 5–0తో షాంటెల్ రీడ్ (ఇంగ్లండ్)ను ఓడించి పసిడి గెలుచుకుంది. రాజస్తాన్‌కు చెందిన అరుంధతి గత ఏడాది వరల్డ్ బాక్సింగ్ కప్‌లో స్వర్ణం సాధించింది. ప్రియా ఘంఘాస్ (60 కేజీలు): ఫైనల్లో ప్రియ 4–1 తేడాతో మేరీ అల్ అహ్మదీ (కెనడా)పై గెలుపొందింది. సచిన్ సివాచ్ (60 కేజీ): హోరాహోరీగా సాగిన ఫైనల్లో సచిన్ 3–2తో ట్రైగెన్ మార్నింగ్ (నమీబియా)ను ఓడించి స్వర్ణం గెలిచాడు. అతనికి కామన్వెల్త్ పోటీల్లో ఇదే తొలి పతకం కావడం విశేషం. అంకుశ్ పంఘాల్ (80 కేజీలు): ఫైనల్లో అంకుశ్ 4–1 స్కోరుతో దిమెజె షిటు (ఇంగ్లండ్)ను ఓడించి పసిడి గెలిచాడు.గుల్వీర్కు కాంస్యంభారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో ‘డబుల్’ సాధించాడు. ఈ పోటీల్లో ఇప్పటికే 10,000 మీటర్ల పరుగులో రజతం నెగ్గిన అతను శనివారం 5,000 మీటర్ల పరుగులతో కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఈ పరుగును గుల్వీర్ 13 నిమిషాల 24.95 సెకన్లలో పూర్తి చేశాడు.లవ్లీనాకు నిరాశ...ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్‌కు కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం లభించలేదు. మహిళల 75 కేజీల విభాగంలో ఆమె ఫైనల్లో 1–4తో ఎమా స్యూ గ్రీన్‌ట్రీ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడి రజతంతో సంతృప్తి చెందింది. పురుషుల 55 కేజీల కేటగిరీ ఫైనల్లో జాదూమణి సింగ్ 0–5తో జై డిక్సన్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడి రజతాన్ని సొంతం చేసుకున్నాడు. పురుషుల 90+ కేటగిరీలో నరేందర్ బెర్వాల్ 0–5తో డామర్ థామస్ (ఇంగ్లండ్) చేతిలో పరాజయంపాలు కావడం రజతం మాత్రమే దక్కింది.పవర్ ఫుల్ ప్రీతిశనివారం బాక్సింగ్‌లో ప్రీతి పవార్ భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించింది. 54 కేజీల ఫైనల్లో ఆమె 5–0 స్కోరుతో స్కార్లెట్ డెల్గాడో (కెనడా)ను చిత్తు చేసింది. తొలి రౌండ్‌నుంచి ప్రత్యర్థిపై ప్రీతి చెలరేగింది. ఐదుగురూ జడ్జీలు ఆమెకు అనుకూలంగా 10–9 పాయింట్లు ఇచ్చారు. తర్వాతి రెండు రౌండ్లలో కూడా ఇదే సరళి కొనసాగి 10–9, 10–9తో ప్రీతి సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. చివరకు 30–27 పాయింట్లతో ఆమె ఏకపక్ష విజయాన్ని అందుకుంది. హరియాణాలోని భివానికి చెందిన 22 ఏళ్ల ప్రీతికి కామన్వెల్త్ క్రీడల్లో ఇదే తొలి పతకం. 2022 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన ఆమె గత ఏడాది వరల్డ్ బాక్సింగ్ కప్‌లో స్వర్ణం గెలుచుకుంది. బాంటమ్ వెయిట్ విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న ప్రీతి ప్రస్తుతం భారత ఆర్మీలో నాయబ్ సుబేదార్ హోదాలో పని చేస్తోంది. -
2030లో అహ్మదాబాద్‌లో కామన్వెల్త్ గేమ్స్... నేడు భారత్ చేతికి క్రీడల పతాకం
గాందీనగర్: పది రోజులుగా క్రీడాభిమానులను అలరిస్తున్న గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలు నేటితో ముగియనున్నాయి. నాలుగేళ్ల తర్వాత జరగనున్న ఈ క్రీడలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. అహ్మదాబాద్ వేదికగా 2030 కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. దీంతో ప్రస్తుత క్రీడల ముగింపు కార్యక్రమంలో కామన్వెల్త్ క్రీడల పతాకాన్ని భారత్‌కు అప్పగించనున్నారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గ్లాస్గోలో నేడు ప్రత్యేక ప్రదర్శన జరగనుంది.భారత సంస్కృతిని ప్రతిబింభించేలా ప్రత్యేక సంగీత కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. 1930లో కెనడాలోని హామిల్టన్‌లో తొలి కామన్వెల్త్ క్రీడలు జరగగా... సరిగ్గా వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 2030లో అహ్మదాబాద్‌లో జరిగే క్రీడలు శతాబ్ది ఉత్సవాలుగా నిలవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం గ్లాస్గో ముగింపు వేడుకలకు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్‡్ష సంఘ్వీ హాజరై క్రీడల పతాకాన్ని స్వీకరించనున్నారు. -
‘డెకా’లో తేజస్విన్ కేక
కామన్వెల్త్ క్రీడల చరిత్రలో డెకాథ్లాన్ పోటీల్లో పతకం గెలుచుకున్న తొలి భారత అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ గుర్తింపు పొందాడు. శుక్రవారం జరిగిన ఈ పోటీల్లో అతను కాంస్య పతకంతో సత్తా చాటాడు. పది వేర్వేరు ఈవెంట్ల సమాహారమైన డెకాథ్లాన్‌లో తేజస్విన్ ఓవరాల్‌గా 7976 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. లిండన్ విక్టర్ (గ్రెనడా – 8096) స్వర్ణం గెలుచుకోగా, డామియాన్ వార్నర్ (కెనడా – 8036)కు కాంస్యం లభించింది. 2022 కామన్వెల్త్ క్రీడల హైజంప్‌లో కాంస్యం సాధించిన తేజస్విన్...ఈ పోటీల రెండు వేర్వేరు క్రీడాంశాల్లో పతకం నెగ్గిన తొలి భారతీయుడిగా కూడా ఘనత సాధించాడు. తాజా పోటీల హైజంప్ ఈవెంట్లో తొలి ప్రయత్నంలో విఫలమైన తర్వాత తేజస్విన్ బరినుంచి తప్పుకున్నాడు. సుదీర్ఘకాలంగా తనను ఇబ్బంది పెడుతున్న మోకాలి గాయం తిరగబెట్టడమే అందుకు కారణం.కన్నీళ్లతో ఫీల్డ్‌ను వీడిన తేజస్విన్ ఇప్పుడు డెకాథ్లాన్‌లో విజయం అనంతరం తన భావోద్వేగాన్ని ప్రదర్శించాడు. డెకాథ్లాన్‌లో తేజస్విన్ వరుసగా 100 మీ. (870 పాయింట్లు), లాంగ్ జంప్ (1015), షాట్‌పుట్ (673), హైజంప్ (944), 400 మీ. (837), 110 మీ. హర్డిల్స్ (922), డిస్కస్ త్రో (674), పోల్‌వాల్ట్ (702), జావెలిన్ (635), 1500 మీ.(704) చొప్పున పాయింట్లు నమోదు చేశాడు. -
రజతంతో నీరజ్ ‘సమ్’తృప్తి!
గ్లాస్గో: భారత స్టార్ అథ్లెట్, జావెలియన్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకంతో మెరిశాడు. రెండు ఒలింపిక్ పతకాల విజేత అయిన నీరజ్ స్థాయి, అంచనాలతో పోలిస్తే రెండో స్థానం నిరాశ కలిగించేదే అయినా...సుదీర్ఘ కాలం గాయంతో బాధపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తీరును చూస్తే రజతం సంతృప్తికర ఫలితంగానే చెప్పవచ్చు. క్వాలిఫయింగ్‌లో జావెలిన్ ఆశించిన విధంగా విసరలేకపోయిన నీరజ్ అసలు పోరులో సత్తా చాటాడు. తన రెండో ప్రయత్నంలో బల్లెంను 85.83 మీటర్లు విసిరిన నీరజ్ ఖాతాలో సిల్వర్ మెడల్ చేరింది. తన మొదటి ప్రయత్నంలో 80.97 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన నీరజ్... రెండో ప్రయత్నంలో విసిరిన దూరం పతకాన్ని అందించింది మూడు, నాలుగు ప్రయత్నాల్లో అంతకంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయిన నీరజ్...తర్వాతి రెండు ప్రయత్నాలనూ ఫౌల్‌గా ముగించాడు. ఈ ఈవెంట్లో కాంస్యం కూడా భారత ఆటగాడే గెలుచుకోవడం విశేషం. యశ్వీర్ సింగ్ (85.41 మీ.) తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న శ్రీలంక జావెలిన్ త్రోయర్ రుమేశ్ తరంగ పతిరగేకు స్వర్ణ పతకం లభించింది. పతిరగే విసిరిన జావెలియన్ 89.75 మీటర్లు దూసుకుపోయింది. ఈ సీజన్లో తాను పాల్గొన్న ఎనిమిది ఈవెంట్లలో పతిరగే ఏడు సార్లు మొదటి స్థానంలో నిలవడం విశేషం. యశ్వీర్ తొలి ఐదు ప్రయత్నాల్లో రెండు ఫౌల్స్ సహా తడబాటుకు గురైనా...చివరి ప్రయత్నంలో నమోదు చేసిన దూరం అతనికి కాంస్యాన్ని అందించింది. 12 మంది పాల్గొన్న ఫైనల్లో మరో భారత ఆటగాడు రోహిత్ (81.56 మీ.) ఏడో స్థానంతో ముగించగా... పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ (పాకిస్తాన్) 9వ స్థానానికే పరిమితమయ్యాడు.‘ఫిట్నెస్పరంగా నేను ఇంకా కోలుకునే దశలోనే ఉన్నాను. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు సంతృప్తిగా ఉన్నా. ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో నేను అనుకున్నట్లుగా జావెలిన్ విసరలేకపోయా. కానీ ఇలాంటి చోటా పతకం గెలవడం ఆనందాన్నిచ్చింది. ఆసియా క్రీడలకు ముందు నా ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉంది’ అని నీరజ్ స్పందించాడు.తండ్రి శిక్షణలో...భారత జావెలిన్‌లో నీరజ్ చోప్రా శకం మొదలైన తర్వాత అతని నీడలో మరో ఆటగాడి ప్రదర్శనకు సహజంగానే గుర్తింపు లభించడం లేదు. ఇలాంటి స్థితిలో యశ్వీర్ గెలిచిన కాంస్యం విలువ ఎంతో అమూల్యం. నిజానికి 2021లో నీరజ్ ఒలింపిక్ చాంపియన్‌గా నిలవడానికి కొన్నాళ్ల క్రితం నెలకొల్పిన జూనియర్ ఫెడరేషన్ మీట్ రికార్డును బద్దలు కొట్టడంతోనే యశ్వీర్ మొదటిసారి వెలుగులోకి వచ్చాడు. అయితే ఇంత కాలానికి అతని కష్టానికి ఫలితం లభించింది. రాజస్తాన్‌కు చెందిన యశ్వీర్కు అతని తండ్రి, మాజీ జావెలిన్ త్రోయర్ అయిన రాయ్ సింగ్ కోచ్‌గా మారి మార్గనిర్దేశనం చేశాడు.జాతీయ స్థాయిలో, రైల్వే చాంపియన్‌షిప్‌లలో పలు పతకాలు గెలుచుకొని స్పోర్ట్ కోటాలోనే ఉద్యోగం అందుకున్న రాయ్ సింగ్ కోచింగ్‌లో కూడా ఎన్ఐఎస్ డిప్లొమా హోల్డర్. ఈ అనుభవాన్నంతా అతను తన కొడుకును తీర్చిదిద్దేందుకు ఉపయోగించాడు. తాను పెద్ద స్థాయిలో విజయాలు సాధించలేదని, యశ్వీర్ కామన్వెల్త్, ఆసియా క్రీడలవంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో పతకాలు సాధించాలని కలగన్న రాయ్ సింగ్ అన్ని రకాలుగా శ్రమించి శిక్షణ అందించాడు.ఈవెంట్‌కు ముందు కొడుకును ప్రోత్సహిస్తూ ‘జీవితంలో ఇదే అతి పెద్ద ప్రశ్నగా భావించి సరైన రీతిలో సమాధానం ఇవ్వు. ఇక్కడ పూర్తి సామర్థ్యంతో సత్తా చాటు. ఇక్కడ గెలిస్తే నీ జీవితం మారిపోతుంది. ఎంత బాగా ఆడగలవో ఆడు’ అంటూ ఈవెంట్‌కు ముందు స్ఫూర్తి నింపిన తండ్రికి యశ్వీర్ పతకాన్ని కానుకగా ఇచ్చాడు. -
సెమీస్‌లో శ్రీజ
న్యూఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత ప్యాడ్లర్లు సత్తాచాటుతున్నారు. మహిళ ల, పురుషుల విభాగాల్లో మొత్తం ఎనిమిది మంది భార త ప్లేయర్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్, రెండో సీడ్ ఆకుల శ్రీజ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శనివారం 13–11, 11–4, 11–9, 12–10తో టిన్ టిన్ హో (ఇంగ్లండ్)పై ఏకపక్ష విజయం నమోదు చేసుకుంది. మరో క్వార్టర్ ఫైనల్లో సిండ్రెలా దాస్ 10–12, 11–9, 12–10, 11–8, 7–11, 11–8తో టాప్ సీడ్ యాంగ్జీ లూ (ఆస్ట్రేలియా)పై సంచలన విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో యశస్విని 4–0తో కాన్స్టాంటినా (ఆస్ట్రేలియా)పై... సుతీర్థ ముఖర్జీ 4–1తో మిన్ హ్యూంగ్ జీ (ఆస్ట్రేలి యా)పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టారు. ఇక పురుషుల విభాగంలో టాప్ సీడ్ మనుశ్ షా 11–6, 11–8, 2–11, 13–15, 11–8, 11–5తో ఆదిత్య సరీన్ (ఆస్ట్రేలియా)పై... పాయస్ జైన్ 8–11, 12–10, 12–14, 12–10, 11–6, 11–9తో భారత్‌కే చెందిన హర్మీత్ దేశాయ్‌పై గెలుపొందారు. అంకుర్ భట్టాచార్య 7–11, 15–13, 10–12, 11–5, 11–9, 11–9తో నికోలస్ వెన్ జెంగ్ లుమ్ (ఆస్ట్రేలి యా)పై... మానవ్ ఠక్కర్ 5–11, 11–8, 13–11, 11–8, 11–6తో అలెగ్జాండర్ గ్రీన్ (ఇంగ్లండ్)పై విజయాలతో ముందంజ వేశారు. -
బాక్సింగ్‌లో మరో స్వర్ణం.. అరుంధతికి గోల్డ్
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్లు స్వర్ణాల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా గంగాస్ పసిడి పతకాలు నెగ్గగా.. తాజాగా ఈ లిస్ట్‌లో అరుంధతి చౌదరీ కూడా చేరింది. మహిళల 70 కేజీల విభాగంలో గోల్డ్ కైవసం చేసుకుంది. దీంతో భారతదేశ బాక్సింగ్‌లో భారత స్వర్ణాల సంఖ్య ఐదుకు చేరింది.తాజాగా మహిళల 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరీ కూడా స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. కామన్వెల్త్లో భారత్‌కు ఇది 11వ స్వర్ణం కాగా.. మొత్తం పతకాల సంఖ్య 34కి పెరిగింది. ఈ పతకాలతో ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది. -
మేరీ కోమ్ స్ఫూర్తి.. కామన్వెల్త్లో పాకిస్తాన్‌కు తొలి పతకం
భారత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీ కోమ్ ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మేరీ కోమ్ ఇచ్చిన స్ఫూర్తి భారత్‌లో ఎంతోమంది మహిళా బాక్సర్లను పుట్టేలా చేసింది. అయితే తాజాగా ఆమె ఇచ్చిన స్ఫూర్తి దేశ సరిహద్దులను కూడా దాటి పాకిస్తాన్‌ను కూడా తాకింది. విషయంలోకి వెళితే పాకిస్తాన్ బాక్సర్ అయిన 22 ఏళ్ల ఫాతిమా జహ్రా కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 60 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది.తద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన తొలి పాకిస్తాన్ బాక్సర్‌గా ఫాతిమా నిలిచింది. అంతేకాదు ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో ఫాతిమా సాధించిన పతకమే వారికి మొదటిది కావడం గమనార్హం. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న సర్ఘోడాలో పెరిగిన ఫాతిమా భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్‌ను ఆదర్శంగా తీసుకుంది. మేరీ కోమ్ జీవితం ఆధారంగా 2014లో బాలీవుడ్లో తెరకెక్కిన బయోపిక్ అప్పటికి 10 ఏళ్ల వయసు ఉన్న ఫాతిమాపై చెరగని ముద్ర వేసింది. ఆ సినిమాలో మేరీ కోమ్ జీవితంలో ఎన్నో కష్టాలను దాటుకొని దిగ్గజ బాక్సర్‌గా పేరు పొందడం ఫాతిమాను బాగా ఆకట్టుకుంది. ఆ క్షణంలోనే తాను కూడా బాక్సర్ కావాలని కలలు కన్నది. అయితే ఫాతిమా బాక్సర్ అయ్యే క్రమంలో సొంత దేశంలో ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంది. ఫాతిమా కుటుంబం బాక్సింగ్‌కు వ్యతిరేకంగా ఉండేది. ఆమెను శిక్షణకు వెళ్లనిచ్చేవారు కాదు. కానీ సంవత్సరాల తరబడి ఫాతిమా చేసిన పోరాటం ఆమెపై వ్యతిరేకతను పోగొట్టి మద్దతు పెరిగింది. అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇవాళ వాళ్ల దేశానికి కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం తీసుకొచ్చి అందరి చేత శెభాష్ అనిపించుకుంది. కాగా పతకం సాధించిన అనంతరం ఫాతిమా మాట్లాడుతూ.. భారతదేశానికి చెందిన మేరీ కోమ్ నాకు స్ఫూర్తి. ఆమె జీవితంపై తీసిన సినిమాను నేను అప్పట్లో ప్రతీరోజు చూసేదాన్ని. నేను బాక్సింగ్ మొదలుపెట్టినప్పుడు ఆ సినిమా చూస్తూ శిక్షణ తీసుకునేదాన్ని. ఆమె అంటే నాకు చాలా గౌరవం. దేవుడి దయవల్ల ఇవాళ ఆమె లాగే మా దేశానికి ఒక పతకం తీసుకొచ్చాను. ఏదో ఒకరోజు ఆమెలానే మా దేశానికి నేను కూడా పేరు ప్రఖ్యతలు తీసుకొస్తానని ఆశిస్తున్నా* అని తెలిపింది.ఇక మేరీకోమ్ ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెచ్యూర్ బాక్సింగ్‌లో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసింది. మేరీకోమ్ తన కెరీర్లో ఆరు ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిళ్లు, ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాలు, ఐదు ఆసియా ఛాంపియన్షిప్లను గెలిచి అత్యున్నత శిఖరాన్ని అందుకుంది. More history has been made at the 2026 Commonwealth Games as Fatima Zahra becomes the first women from Pakistan to medal in boxing. 🇵🇰Zahra lost in the semi finals against Marie-Bathoul Al-Ahmadieh, who will go on to face Priya Priya of India in the final. #TimeForWorldBoxing pic.twitter.com/SpSuDpBhVB— World Boxing (@RealWorldBoxing) July 31, 2026చదవండి: సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా పటీదార్.. అందరి కళ్లు అతడిపైనే! -
CWG 2026: షాట్‌పుట్ భారత్‌కు డబుల్ ధమాకా.. స్వర్ణం, రజతం సొంతం
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత పారా అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల షాట్‌పుట్ F57 ఫైనల్లో సోమన్ రాణా స్వర్ణ పతకం సాధించగా, శుభమ్ జుయాల్ రజత పతకం దక్కించుకున్నాడు. సోమన్ రాణా 13.40 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలువగా.. శుభమ్ జుయాల్ 13.28 మీటర్ల త్రోతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ పతకాలతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 30కి (8 గోల్డ్, 15 సిల్వర్, 7 బ్రాంజ్) చేరింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ ఆరో స్థానంలో కొనసాగుతోంది.కాగా, ఇవాళ ఒక్క రోజే భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు (మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్, మహిళల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియా, పారా పురుషుల షాట్‌పుట్ F57 విభాగంలో సోమన్ రాణా) చేరాయి.ట్రిపుల్ జంప్‌లోనూ రెండు పతకాలుఇవాళే జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలోనూ భారత అథ్లెట్లు మెరిశారు. ప్రవీణ్ చిత్రవేల్ (16.58 మీటర్ల ఎత్తు) ఎగిరి రజతం ఒడిసిపట్టగా, భారత్‌కే చెందిన మరో అథ్లెట్ సెల్వ ప్రభు (16.52 మీటర్ల ఎత్తు) ఎగిరి కాంస్య పతకం సాధించాడు.రజతంతో సరిపెట్టుకున్న జడుమణిపురుషుల 55 కేజీల విభాగంలో భారత బాక్సర్ జడుమణి సింగ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో జడుమణి ఆస్ట్రేలియాకు చెందిన జై డిక్సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. -
నీరజ్‌కు చెక్.. ఫాస్ట్ బౌలర్ నుంచి జావెలిన్ చాంపియన్ దాకా
కామన్వెల్త్ గేమ్స్ 2026లో జావెలిన్ త్రోలో శ్రీలంక స్టార్ రుమేశ్ తరంగ పతిరగె స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో రుమేశ్ తరంగా పతిరగె 89.75 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సాధించగా, నీరజ్ చోప్రా ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శన (85.83 మీటర్లు) చేసినప్పటికీ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారత్‌కే చెందిన మరో జావెలిన్ త్రోయర్ యశ్వీర్ సింగ్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో 85.41 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని ఒడిసిపట్టాడు. కామన్వెల్త్లో రుమేశ్ స్వర్ణం సాధించడం వెనుక పెద్దగా ఆశ్చర్యమేమి లేదు. ఎందుకంటే ఈ ఏడాది రోమ్ డైమండ్ లీగ్‌లో 90 మీటర్ల మార్కును దాటిన తొలి అథ్లెట్‌గా నిలిచిన పతిరగే, 92.62 మీటర్లతో ప్రపంచంలోనే అత్యుత్తమ త్రో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.క్రికెటర్ నుంచి జావెలిన్ ఛాంపియన్‌గా..రుమేశ్ పతిరగే ప్రస్థానం ఎంతో ఆసక్తికరమైనది. జావెలిన్ క్రీడలోకి రాకముందు అతను ఒక క్రికెటర్. అండర్-18 కేటగిరీలో శ్రీలంక పేసర్ ఇషాన్ మలింగ తర్వాత గంటకు 134 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన రెండో ఫాస్టెస్ట్ బౌలర్‌గా అతనికి పేరుంది. అయితే, కోచ్ టోనీ ప్రసన్న ప్రోత్సాహంతో జావెలిన్ వైపు మళ్లినట్లు పతిరగే 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. "నాకు జావెలిన్‌ను పరిచయం చేసింది కోచ్ టోనీనే. ఆయన నాకు క్రీడ గురించే కాదు, జీవితం గురించి కూడా నేర్పించారు" అని పేర్కొన్నాడు.చదవండి: బాక్సింగ్‌లో డబుల్ స్వర్ణాలు.. ట్రిపుల్ జంప్‌లో రెండు పతకాలు -
బాక్సింగ్‌లో డబుల్ స్వర్ణాలు.. ట్రిపుల్ జంప్‌లో రెండు పతకాలు
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్ ప్రీతి పవార్ స్వర్ణం గెలిచింది. మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ కెనడాకు చెందిన బాక్సర్ స్కార్లెట్ సవన్నాహ్పై సునాయాసంగా గెలుపొందింది. తొలి బౌట్ నుంచి ప్రీతి పవార్ ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడింది. ఇక రెండో బౌట్లోనూ ప్రీతి తన ప్రత్యర్థి ముఖంపై పంచుల వర్షం కురిపించి ఆధిక్యంలో నిలిచింది. ఇక మూడో బౌట్లోనూ తనదైన శైలిలో విరుచుకుపడ్డ ప్రీతి పవార్‌ను న్యాయ నిర్ణేతలు యునానిమస్ విజయం సాధించినట్లు ప్రకటించారు. కాగా ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో బాక్సింగ్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం. ఇప్పటికే బాక్సింగ్ విభాగం నుంచి కనీసం 10 పతకాలు ఖాయమైన సంగతి తెలిసిందే. ప్రీతి సాధించిన స్వర్ణం భారత్‌కు 6వ స్వర్ణం కాగా, ఓవరాల్‌గా 24వ పతకం.👉ఇక మహిళల 57 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియా కూడా స్వర్ణం కైవసం చేసుకుంది. ఫైనల్లో జాస్మిన్ ఐర్లాండ్‌కు చెందిన మికెలియాను చిత్తు చేసి పసిడి పతకం సాధించింది. కామన్వెల్త్లో భారత్‌కు ఇది ఏడో స్వర్ణం కాగా, ఓవరాల్‌గా 25వ పతకం. JAISMINE LAMBORIA IS BOXING 57KG COMMONWEALTH GAMES CHAMPION 🇮🇳🥇- She defeated Northern Ireland’s boxer via unanimous decision 5:0 in the FinalsTOTAL DOMINATING WIN! 🔥🔥🔥 pic.twitter.com/fgu6Nt0jCG— The Khel India (@TheKhelIndia) August 1, 2026 👉ఇక పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో భారత అథ్లెట్లు మెరిశారు. ప్రవీణ్ చిత్రవేల్ (16.58 మీటర్ల ఎత్తు) ఎగిరి రజతం ఒడిసిపట్టగా, భారత్‌కే చెందిన మరో అథ్లెట్ సెల్వ ప్రభు (16.52 మీటర్ల ఎత్తు) ఎగిరి కాంస్య పతకం సాధించాడు. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 27కు చేరుకుంది. ఇందులో 7 స్వర్ణాలు, 13 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి.SELVA PRABHU WINS THE BRONZE MEDAL FOR INDIA IN TRIPLE JUMP! 🥉- 27th Medal for India at CWG 2026 pic.twitter.com/2Y2AjToipA— The Khel India (@TheKhelIndia) August 1, 2026PRAVEEN CHITRAVEL WINS THE SILVER FOR INDIA IN TRIPLE JUMP! 🥈- 26th Medal for India at CWG 2026 pic.twitter.com/wbnXWA02DB— The Khel India (@TheKhelIndia) August 1, 2026 -
‘మీ శకం ముగిసిందా?’.. నీరజ్ చోప్రా అదిరిపోయే రిప్లై!
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్ 2026లో రజతం సాధించిన సంగతి తెలిసిందే. ప్రతికూల వాతావరణంలోనూ సీజన్ బెస్ట్ నమోదు చేసిన నీరజ్ ఈటెను 85.83 మీటర్ల దూరం విసిరి వెండి పతకాన్ని ఒడిసిపట్టాడు. ముందే ఊహించినట్లుగా ఈసారి నీరజ్‌కు పోటీ పాకిస్తాన్ ప్లేయర్ అర్షద్ నదీమ్ నుంచి కాకుండా శ్రీలంక అథ్లెట్ రుమేశ్ పతిరగె నుంచే ఎదురయ్యింది. ఈ పోటీలో రుమేశ్ తరంగా పతిరగె 89.75 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సాధించగా, భారత్‌కు చెందిన మరో జావెలిన్ త్రోయర్ యశ్వీర్ సింగ్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో 85.41 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని ఒడిసిపట్టాడు. రజతం సాధించిన అనంతరం తన ప్రదర్శనపై నీరజ్ చోప్రా స్పందించాడు. గాయం పూర్తిగా నయం కాకపోవడం వల్ల మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యానని నీరజ్ తెలిపాడు. ఇదే సమయంలో ‘నీరజ్ మీలో మునుపటి జోష్ కనిపించడం లేదు.. మీ శకం ముగిసినట్లేనా?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి నీరజ్ స్పందిస్తూ.. ‘‘మనం 100 శాతం ఫిట్‌గా ఉన్నప్పుడు ఎంతటి కఠినమైన సవాలునైనా ఎంతో ధైర్యంతో ఎదుర్కొంటాం. కానీ శరీరంలో గాయం ఉన్నప్పుడు ఎక్కడ అది తిరగబెడుతుందోననే భయం ప్రతి త్రోకు ముందు వెంటాడుతుంది. ఈరోజు కూడా అదే జరిగింది. అందుకే చాలా వేగంగా పరిగెత్తకుండా నా శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించాను. పోటీ జరిగిన ప్రాంతంలో వాతావరణం చాలా చల్లగా ఉంది.Photo Credit: SAI Twitterసాధారణంగా ఇలాంటి వాతావరణంలో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం కొంచెం కష్టమే. ఈ ఫైనల్ పోటీలో నాకు ఒక్క మంచి త్రో మాత్రమే వచ్చిందని, మిగిలిన ప్రయత్నాల్లో ఆశించిన స్థాయిలో జావెలిన్ వెళ్లలేదు. విజేతగా నిలిచిన రుమేశ్ తరంగా కూడా ఒక్క అద్భుతమైన త్రోతోనే స్వర్ణాన్ని సాధించాడన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పునరాగమనం నాకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. రాబోయే పోటీల్లో ఈ లోపాలను సరిదిద్దుకుని మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వడమే నా ప్రధాన లక్ష్యం’’ అని స్పష్టం చేశాడు.పదును తగ్గిందా?ఇక నీరజ్ చోప్రా ప్రదర్శనలో పదును తగ్గుతుందా అంటే సమాధానం చెప్పలేని స్థితి. ఎందుకంటే వయసు మీద పడుతుండడంతో నీరజ్‌లో మునుపటి జోష్ కనిపించడం లేదు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నీరజ్ 90 మీటర్ల మార్క్‌ను దాటేందుకు విఫలయత్నం చేశాడు. Photo Credit: SAI Twitterకానీ ఈ ఐదేళ్లలో నీరజ్ అంతర్జాతీయ ఈవెంట్లలో ఒక్కసారి కూడా 90 మీటర్ల మార్క్ అందుకోలేదు. చివరగా 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ ఈవెంట్లో ఈటెను 89.45 మీటర్ల దూరం విసిరి రజతం ఒడిసిపట్టాడు. అప్పుడు కూడా తృటిలో 90 మీటర్ల మార్క్‌ను చేజార్చుకున్నాడు. ఆ తర్వాత వెన్ను నొప్పి బారిన పడిన నీరజ్ కోలుకోలేకోపోయాడు. రీఎంట్రీ తర్వాత నీరజ్‌లో మునుపటి పదును తగ్గిందనే చెప్పొచ్చు.2025 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఈటెను 84.03 మీటర్ల దూరం విసిరిన నీరజ్ 8వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. తాజాగా గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచినప్పటికీ ఈటెను వేసిన దూరం లెక్కిస్తే ఇది నీరజ్ స్థాయికి సరిపోని ప్రదర్శనగా పరిగణించవచ్చు. ప్రస్తుతం నీరజ్ 28 ఏళ్ల వయసు ఉండడం, ఒలింపిక్స్‌కు మరో రెండేళ్ల సమయం ఉండడంతో తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలని ఆశిద్దాం. What a soaring throw by Neeraj Chopra!Heartiest congratulations on winning the Silver medal in the Men's Javelin Throw event at the Commonwealth Games 2026. His relentless pursuit of excellence, competitive spirit and ability to deliver on the biggest stages continue to inspire… pic.twitter.com/FzJRAJbAt0— Anurag Thakur (@ianuragthakur) August 1, 2026 Glasgow, Scotland: On winning the silver medal in the men's javelin throw at the Commonwealth Games 2026, Neeraj Chopra says, "I am very happy. Even when I am dealing with injuries, it feels good to see other Indian javelin throwers performing well. Yash Vir has crossed the… pic.twitter.com/SP5CNfoeax— IANS (@ians_india) July 31, 2026Read: మెడ విరిగినా వెనక్కి తగ్గలేదు.. ఒలింపిక్ గోల్డ్‌ను ముద్దాడాడు! -
గోల్డ్ మెడల్స్ నుంచి.. ఒక్కసారిగా ‘పాతాళానికి’!
పాకిస్తాన్ స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్ పసిడి పతక విజేత అర్షద్ నదీమ్‌కు కామన్వెల్త్ క్రీడలు-2026 చేదు అనుభవాన్ని మిగిల్చాయి. గత ఎడిషన్‌లో స్వర్ణ పతకం గెలిచిన అతడు.. ఈసారి ఫైనల్ ఈవెంట్లో కనీసం చివరి మూడు అవకాశాలు ఉపయోగించుకోలేని దుస్థితిలో నిలిచాడు.ఫైనల్‌కు చేరినా....కాగా కామన్వెల్త్ క్రీడల తాజా ఎడిషన్‌లో గురువారం జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్ నిర్వహించారు. ఇందులో పద్దెనిమిది మంది పాల్గొనగా అత్యుత్తమంగా ఈటెను ఎక్కువ దూరం విసిరిన టాప్-12 మంది ఫైనల్‌కు అర్హత సాధించారు. శ్రీలంకకు చెందిన రుమేశ్ తరంగ పతిరగే అగ్రస్థానం సంపాదించగా.. భారత అథ్లెట్లు నీరజ్ చోప్రా, రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ వరుసగా ఐదు, తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచారు.ఫౌల్‌తో మొదలు.. ఇక అర్షద్ నదీమ్ టాప్-7లో చోటు సంపాదించి ఫైనల్లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఫైనల్ ఈవెంట్లో అర్షద్‌కు చేదు అనుభవం ఎదురైంది. తొలి మూడు త్రోలలో భాగంగా అతడు ఫౌల్‌తో ఈవెంట్ మొదలుపెట్టాడు.ఇక రెండో ప్రయత్నంలో 77.41 మీటర్ల దూరం ఈటెను విసిరిన అర్షద్.. మూడో ప్రయత్నంలో 75.39 మీటర్లు మాత్రమే విసిరాడు. దీంతో టేబుల్లో అతడు తొమ్మిదో స్థానానికి పరిమితమయ్యాడు. నిబంధనల ప్రకారం.. ఫైనల్‌కు వచ్చిన టాప్-12లోని అథ్లెట్ల తొలి మూడు త్రోల ఆధారంగా.. చివరి నాలుగు స్థానాల్లో నిలిచిన జావెలిన్ త్రోయర్లు ఎలిమినేట్ అవుతారు.ఎలిమినేట్...దీంతో తొమ్మిదో స్థానంలో నిలిచిన అర్షద్ నదీమ్ ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో పతక వేటలో భాగంగా చివరి మూడు ప్రయత్నాలు చేయకుండానే అతడు వెనుదిరగాల్సి వచ్చింది. కాగా 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో అర్షద్ నదీమ్ స్వర్ణం గెలిచాడు. నాడు అతడు ఈటెను 85.28 మీటర్ల దూరం విసిరాడు.ఇక పారిస్ ఒలింపిక్స్‌లో అత్యుత్తమంగా రికార్డు స్థాయిలో 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి పసిడి పతకం గెలుచుకున్నాడు అర్షద్ నదీమ్. దీంతో అతడి పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. అయితే, ఆ తర్వాత అర్షద్ స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డాడు. టోక్యోలో వరల్డ్‌కప్ చాంపియన్‌షిప్స్ మెడల్ ఈవెంట్లో అత్యుత్తమంగా 82.75 మీటర్లు ఈటెను విసిరిన అర్షద్ నదీమ్.. ఆ తర్వాత కనీసం 80 మీటర్ల మార్కు దాటలేకపోయాడు.Champions know. 💫 The javelin was still in the air. The message was already clear. 🔥Neeraj Chopra's second throw travelled 85.83m, his season's best. 🤩Watch the Commonwealth Games Glasgow 2026 LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/OZpCUfPVFA— Sony Sports Network (@SonySportsNetwk) July 31, 2026భారత్‌కు రెండు పతకాలుకామన్వెల్త్ క్రీడలు-2026 జావెలిన్ త్రో విభాగంలో శ్రీలంక స్టార్ రుమేశ్ పతిరగే 89.75 మీటర్ల దూరం ఈటెను విసిరి స్వర్ణం గెలిచాడు. ఇక టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత, భారత స్టార్ జావెలిన్‌త్రోయర్ నీరజ్ చోప్రా 85.3 మీటర్ల దూరం విసిరి రజతంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కే చెందిన యశ్వీర్ 85.41 మీటర్ల దూరం ఈటెను విసిరి కాంస్యం దక్కించుకున్నాడు. మొత్తానికి ఈ విభాగంలో మూడు పతకాలు సౌత్ ఆసియా ప్లేయర్లకే దక్కడం విశేషం. Bronze unlocked! 🔥𝐏𝐨𝐝𝐢𝐮𝐦 𝐰𝐨𝐫𝐭𝐡𝐲 𝐭𝐡𝐫𝐨𝐰! 🚀Despite the challenging conditions, Yash Vir Singh unleashed a personal best of 85.41m to win bronze! 🥉Watch the Commonwealth Games Glasgow 2026 LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/Y1zmDC50iV— Sony Sports Network (@SonySportsNetwk) July 31, 2026 -
CWG 2026: ఇవాళ భారత్‌కు పతకాల పంట
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో శనివారం (ఆగస్ట్ 1) భారత్‌కు అత్యంత కీలకమైన రోజు కానుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే 23 పతకాలు (5 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలు) సొంతం చేసుకున్న భారత్.. ఇవాళ మరిన్ని అద్భుత ప్రదర్శనలు చేస్తే మరో 25 పతకాలు ఖాతాలో చేరే అవకాశం ఉంది.బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయంభారత్కు అత్యధిక పతక అవకాశాలు బాక్సింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే 10 మంది భారత బాక్సర్లు సెమీఫైనల్స్ దాటి ఫైనల్‌కు చేరుకోవడంతో 10 పతకాలు ఖాయమయ్యాయి. వీరిలో ప్రీతి, జాస్మిన్, జడుమణి సింగ్, సాక్షి, ప్రియా, అరుంధతి చౌదరి, లవ్లీనా బోర్గోహైన్, సచిన్, అంకుష్ పాంగల్, నరేందర్ ఉన్నారు.వీరంతా ఫైనల్స్‌లో విజయం సాధిస్తే భారత్‌కు బాక్సింగ్‌లోనే 10 స్వర్ణ పతకాలు వచ్చే అవకాశం ఉంది.అథ్లెటిక్స్‌లో 8 పతకాలపై కన్నుఅథ్లెటిక్స్లోనూ భారత్‌కు భారీ అవకాశాలున్నాయి. పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో ప్రవీణ్ చిత్రవేల్, సెల్వ ప్రభు తిరుమారన్, మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామి, రవీనా గాయక్వాడ్, పురుషుల పోల్ వాల్ట్‌లో దేవ్ కుమార్ మీనా, కుల్దీప్ కుమార్ బరిలోకి దిగనున్నారు.అలాగే పురుషుల 5000 మీటర్ల ఫైనల్లో గుల్వీర్ సింగ్, మిక్స్డ్ 4x400 మీటర్ల రిలేలో భారత జట్టు పతకం కోసం పోటీ పడనుంది.పారా అథ్లెటిక్స్‌లో 3 అవకాశాలుపురుషుల షాట్‌పుట్ F57 ఫైనల్లో సోమన్ రాణా, శుభమ్ జుయాల్, పురుషుల 1500 మీటర్ల T54 ఫైనల్లో రమేశ్ షణ్ముగం పతకాల కోసం పోటీ పడనున్నారు.జూడోలో మరో 4 అవకాశాలుజూడోలో ఉన్నతి శర్మ, కరణ్‌జిత్ సింగ్ మాన్, హర్ష్ తోకస్, ఇనుంగన్బి తఖెల్లంబమ్ తమ తమ విభాగాల్లో ముందడుగు వేస్తే భారత్ పతకాల సంఖ్య మరింత పెరగనుంది.ఇవాళ భారత్ పతకాల అంచనా* బాక్సింగ్: 10* అథ్లెటిక్స్: 8* పారా అథ్లెటిక్స్: 3* జూడో: 4కాగా, ప్రస్తుతం పతకాల పట్టికలో 10వ స్థానంలో ఉన్న భారత్.. ఇవాల్టి ప్రదర్శనల తర్వాత ఒక్కసారి భారీ జంప్ కొట్టే అవకాశం ఉంది. ఒకవేళ స్వర్ణాలు ఎక్కువ సాధిస్తే.. ఆస్ట్రేలియా (128), ఇంగ్లండ్ (80), కెనడా (53) తర్వాత నాలుగో స్థానానికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. -
Asmita Dey: సైకిల్ మెకానిక్ కూతురి నుంచి.. బంగారు పతకం వరకు
ఒక వైపు కటిక పేదరికం.. మరోవైపు దేశం గర్వించదగ్గ అథ్లెట్‌గా ఎదగాలన్న కల. ఈ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఆమె పట్టుదలను సడలించలేకపోయాయి. ఆ కష్టాలనే సాధనాలుగా మార్చుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. సైకిల్ మెకానిక్ కూతురిగా సాధారణ కుటుంబంలో జన్మించిన ఆ అమ్మాయి.. ఈ రోజు ప్రతిష్టాత్మక కామన్మెల్త్ గేమ్స్‌లో భారత జెండాను రెపరెపలాడించింది. ఆమే 23 ఏళ్ల జూడో సంచలనం అస్మితా డే.గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో అస్మితా బంగారు పతకంతో మెరిసింది. జూడో మహిళల 48 కేజీల విభాగంలో ఆమె ఈ గోల్డ్‌మెడల్ కైవసం చేసుకుంది. దీంతో మహిళల విభాగంలో భారత్‌కు తొలి కామన్వెల్త్ స్వర్ణం అందించిన జూడోకాగా అస్మిత చరిత్ర పుటలకెక్కింది.ఉత్కంఠ పోరులో విజయంకెనడాకు చెందిన హెయిడీ క్వాచ్‌తో జరిగిన ఈ ఫైనల్ పోరు అభిమానులను ఆఖరి వరకు మునివేళ్లపై నిలబెట్టింది. మ్యాచ్ ప్రారంభంలోనే అస్మిత 'యుకో' పాయింట్‌తో పాటు ఒక పెనాల్టీని ఎదుర్కొని వెనుకబడింది. ఆ తర్వాత అస్మిత అద్భుతమైన పునరాగమనం ఇచ్చింది.అస్మిత ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా ప్రత్యర్ధికి గట్టిగా బదులిచ్చింది. దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి స్కోర్‌ను 1-1తో సమం చేసింది. అనంతరం నిర్ణీత 4 నిమిషాల సమయం ముగిసేసరికి ఇద్దరూ సమంగా నిలవడంతో మ్యాచ్ 'గోల్డెన్ స్కోర్'కు దారితీసింది. విజేతను నిర్ణయించే ఈ రౌండ్లో అస్మిత అద్భుతం చేసింది. ఏ మాత్రం ఏకాగ్రతను కోల్పోకుండా వ్యూహత్మకంగా వ్యవహరించి మరొక 'యూకో' పాయింట్ దక్కించుకుంది. దీంతో 2-1 తేడాతో విజయం సాధించి భారత్‌కు గోల్డ్‌మెడల్ అందించింది.సైకిల్ మెకానిక్ కూతురి నుంచి..23 ఏళ్ల అస్మిత త్రిపురలోని బెలోనియా అనే ఒక చిన్న పట్టణంలో జన్మించింది. ఆమెకు చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువ ఎక్కువ. కానీ ఆమె తండ్రి ఒక సైకిల్ మెకానిక్ కావడంతో ఆమె కలలకు ఆర్ధిక ఇబ్బందిలు అడ్డంకిగా మారాయి. అయినప్పటికి అతడు మాత్రం తన కూమర్తెను ఎలాగైనా ఒక మంచి అథ్లెట్‌ను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తూనే అస్మితను జూడోలో చేర్పించి శిక్షణ ఇప్పించాడు. కానీ అస్మిత తన కెరీర్లో అత్యంత కీలకమైన సమయంలో మోకాలి గాయానికి గురైంది. శస్రచికిత్స కారణంగా ఆమె దాదాపు కొన్ని నెలల పాటు తనకు ఇష్టమైన జుడో క్రీడకు దూరమైంది. అయితే ఆమె తీవ్రంగా శ్రమించి సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మ్యాట్‌పై అడుగుపెట్టింది.అస్మిత అద్భుతమైన కమ్‌బ్యాక్‌లో తన తండ్రిది కూడా కీలక పాత్ర. గాయంతో ఆటకు దూరంగా ఉన్న సమయంలో ఆమెకు తన తండ్రి ఎంతో సపోర్ట్‌గా నిలిచాడు. ఆమె ఏ మాత్రం మానసిక ఒత్తిడి గురువ్వకుండా చూసుకున్నాడు. అయితే ఈ రోజు దేశం గర్వించేలా అస్మిత సాధించిన విజయాన్ని చూసేందుకు అతడు లేడు. గత డిసెంబర్లో అస్మిత తండ్రి బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయాడు. పతకం గెలుచుకున్న అనంతరం అస్మిత తన తండ్రిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది.రన్నర్ నుంచి జుడుకోగాకాగా అస్మిత తన క్రీడా ప్రయాణాన్ని ఒక రన్నర్‌గా ప్రారంభించింది. 800 మీటర్ల రన్నింగ్ ట్రాక్‌పై ఆమె ప్రాక్టీస్ చేసింది. అయితే ఆమెలోని అసలైన ప్రతిభను గుర్తించిన మొదటి కోచ్.. తనను జూడో వైపు నడిపించారు. ఆ తర్వాత ఆమె జుడుకోగా అద్భుత విజయాలను సాధించింది. ఆఫ్రికన్ ఓపెన్, జూనియర్ ఆసియా కప్ జూడోలో ఆమె బంగారు పతకాలను కైవసం చేసుకుంది. -
జూడోలో బంగారు ధగధగ
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో 1990లో జూడోను మెడల్ ఈవెంట్‌గా ప్రవేశపెట్టగా... భారత్‌కు ఒక్కసారి కూడా స్వర్ణం లభించలేదు. ఈసారి ఆ లోటును తీరుస్తూ ఒకే రోజు ఇద్దరు భారత జూడో ప్లేయర్లు బంగారు పతకాలు అందించారు. పురుషుల విభాగంలో హర్ష్ సింగ్ (60 కేజీలు), మహిళల 48 కేజీల విభాగంలో అస్మిత డే ఈ ఘనత సాధించారు. శుక్రవారం జరిగిన 60 కేజీల ఫైనల్లో 23 ఏళ్ల హర్ష్ 10–0 ఆ్రస్టేలియాకు చెందిన జోషువా కట్జ్‌ను చిత్తు చేశాడు. నిర్ణీత నాలుగు నిమిషాల సమయంకంటే మరో 41 సెకన్లు మిగిలి ఉండగానే ప్రత్యర్థి ఆటను ముగించడంలో హర్ష్ సఫలమయ్యాడు. మహిళల విభాగంలో భారత్‌కు తొలి కామన్వెల్త్ స్వర్ణం అందించిన జూడోకాగా అస్మిత నిలిచింది. 48 కేజీల ఫైనల్లో అస్మిత 2–1తో హీడీ క్వాచ్ (కెనడా)ను ఓడించింది. జూడోలో మనకు మూడో స్వర్ణం గెలుచుకునే అవకాశం చేజారింది. మహిళల 57 కేజీల ఫైనల్లో యామిని మౌర్య ఓడి రజతంతో సంతృప్తి చెందింది. ఇంగ్లండ్‌కు చెందిన అసీలియా టోప్రాక్ 100–0 (ఇపాన్ స్కోరింగ్)తో యామినిపై గెలుపొందింది. రేపటితో ముగియనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో ప్రస్తుతం భారత్ 5 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలతో తొమ్మిదో స్థానంలో ఉంది. తొలిసారి కామన్వెల్త్ బరిలోకి దిగి... కామన్వెల్త్ క్రీడల అథ్లెటిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల డిస్కస్ త్రోలో సీమా కాలిరామ్నా కాంస్యం నెగ్గింది. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో బరిలోకి దిగిన సీమా డిస్‌్కను 58.65 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. లవ్‌ప్రీత్‌కు రజతం... వెయిట్‌లిఫ్టింగ్ పురుషుల ప్లస్ 110 కేజీల కేటగిరీలో భారత లిఫ్టర్ లవ్‌ప్రీత్ సింగ్ రజతం దక్కించుకున్నాడు. స్నాచ్‌లో 176 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 212 కేజీలు కలిపి మొత్తం 388 కేజీల బరువెత్తిన లవ్‌ప్రీత్ రెండో స్థానంతో ముగించాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు ముగిశాయి. భారత్ 1 స్వర్ణం, 6 రజతాలు, 1 కాంస్యంతో మొత్తం 8 పతకాలు గెలుచుకుంది.తండ్రి అండగా నిలవగా... అస్మిత డే స్వస్థలం త్రిపురలోని బెలోనియా. తండ్రి సైకిల్ మెకానిక్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. అయితే కూతురు ఆసక్తి చూపించడంతో ఆమెను జూడోలో చేర్పించి శిక్షణ ఇప్పించాడు. ఆర్థిక సమస్యలతో సతమతమైనా... ఆమె ఆటకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. ఒకదశలో మోకాలి గాయంతో కెరీర్ ఇబ్బందుల్లో పడినా ఢిల్లీలో చికిత్స అందించి ప్రోత్సహించాడు. అయితే అస్మిత కామన్వెల్త్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన విషయాన్ని పంచుకునేందుకు ఆయన లేడు. గత డిసెంబర్లో అస్మిత తండ్రి బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయాడు. పతకం గెలుచుకున్న అనంతరం అస్మిత కన్నీళ్ళతో తన తండ్రిని గుర్తు చేసుకుంది. ‘క్రీడల్లోకి వెళ్లాలనే ఆలోచన కూడా రాని ఊరునుంచి నేను వచ్చాను. కానీ నాన్న మాత్రం నన్ను నమ్మి అన్ని విధాలా అండగా నిలిచాడు. ఆయన అంత్యక్రియలు ముగిసిన పది రోజులకే నాన్న కల నెరవేర్చమంటూ అమ్మ నన్ను మళ్లీ శిక్షణకు పంపించింది. ఈ పతకం కోసం నేను చాలా కష్టపడ్డాను. నా బౌట్ల గురించి ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఇక్కడికి వచ్చాక ఎంతో ఒత్తిడికి గురయ్యాను. చివరకు స్వర్ణం సాధించగలిగా’ అని అస్మిత చెప్పింది. ‘పసిడి’ పంచ్‌లకు గెలుపు దూరంలో భారత బాక్సర్లు తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ దూసుకుపోతున్నారు. వేర్వేరు విభాగాల్లో సత్తా చాటిన ఏడుగురు భారత బాక్సర్లు ఫైనల్లోకి ప్రవేశించారు. తద్వారా కనీసం స్వర్ణం లేదా రజతాన్ని ఖాయం చేశారు. మహిళల సెమీఫైనల్స్‌లో అరుంధతి (70 కేజీలు) 4–0తో డిఫెండింగ్ చాంపియన్ రోజీ ఎకెల్స్ (వేల్స్)పై, వరల్డ్ చాంపియన్ జైస్మిన్ (57 కేజీలు) ‘రిఫరీ స్టాప్స్ ద కాంటెస్ట్’తో రాపెలాంగ్ మస్లెలా (లెసోతో)పై, ప్రీతి పవార్ (54 కేజీలు) 5–0తో కాథరీన్ ఎంవాపె (జాంబియా)పై, సాక్షి (51 కేజీలు) 5–0తో అంబర్ జేన్వాల్ (కెనడా)పై , ప్రియ (60 కేజీలు) 5–0తో లూసీ (ఇంగ్లండ్)పై నెగ్గి తుది పోరుకు అర్హత సాధించారు. పురుషుల సెమీఫైనల్స్‌లో జాదూమణి సింగ్ (55 కేజీలు) 5–0తో ఫిలిప్ హోసెబ్ (నమీబియా)ను, అంకుశ్ (80 కేజీలు) 5–0తో ఒఫోరి (కెనడా)ను చిత్తు చేసి ఫైనల్లోకి అడుగు పెట్టారు. -
అమ్మ... ఆర్థరైటిస్... కామన్వెల్త్ మెడల్
కళ్లద్దాలు, నుదుటిపై బొట్టు, చలి నుంచి తట్టుకునేందుకు చెవుల వరకు చిన్న సైజు టోపీ... డిస్కస్ త్రో ఈవెంట్ ప్రారంభానికి ముందు నిలబడిన అథ్లెట్ల వరుసలో ఆమెను చూస్తే మైదానంలో ఒక ప్లేయర్‌లాగా కాకుండా ఒక టీచర్ తరహాలో కనిపించింది. పొరపాటున అటువైపు వచ్చినట్లుగా అనిపించిన ఈ అథ్లెట్ మరికొద్ది సేపు తర్వాత పతకధారిగా పోడియంపై నిలిచింది. ఈ ప్రస్తావన అంతా భారత డిస్కస్ త్రోయర్ సీమా కాలిరామ్నా గురించి. !కామన్వెల్త్ క్రీడల డిస్కస్ త్రోలో పతకం గెలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా 27 ఏళ్ల సీమా నిలిచింది. చదువులోనూ తగ్గని ఆమె వ్యాయామ విద్యలో పీహెచ్డీ చేస్తోంది. తల్లిగా మారిన తర్వాత పలు ప్రతికూలతలను అధిగమించి ఇప్పుడు మెడల్‌తో మెరిసింది. హరియాణాలోని భివానీ పట్టణం సీమా స్వస్థలం. సైన్యంలో పని చేసిన తండ్రి వ్యక్తిగతంగా మంచి బాస్కెట్‌బాల్ ఆటగాడు, జావెలిన్ త్రోయర్ కూడా. ఆయన ప్రోత్సాహంతో అటు చదువు, ఇటు ఆటల్లో కూడా సీమా సమాంతరంగా మంచి ఫలితాలు రాబడుతూ ఎదిగింది. స్కూల్ స్థాయిలో ఆటలపై పెరిగిన ఆసక్తి ఆపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో విజయాలు సాధిస్తూ పూర్తి స్థాయి అథ్లెట్‌గా మారడం వరకు చేరింది. మాజీ డిస్కస్ త్రోయర్ రవీందర్ కాలిరామ్నాతో వివాహం తర్వాత ఆమె కెరీర్ మరింత ఊపందుకుంది. రవీందర్ కోచ్‌గా మారి సీమాకు మార్గనిర్దేశనం చేశాడు. ఇప్పుడు సాధించిన కామన్వెల్త్ మెడల్ సీమా అంతర్జాతీయ కెరీర్లో మొదటి పతకం కావడం విశేషం. 2022లో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సీమా ప్రసవానంతరం సమస్యలు ఎదుర్కొంది. దాంతో పాటు ‘ఆర్థరైటిస్’ బారిన పడి తీవ్ర మోకాలి నొప్పితో బాధపడింది. దీని నుంచి కోలుకునేందుకు డాక్టర్లు స్టెరాయిడ్ ఇంజక్షన్లను సిఫారసు చేశారు. అయితే ఇందుకు దంపతులిద్దరూ అంగీకరించలేదు. సహజరీతిలో స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఎక్సర్సైజ్లు, డైట్లతో పాటు స్వల్ప ఆయుర్వేద చికిత్సతో ఆమె శారీరక పరిస్థితి మెరుగవుతూ వచ్చింది.కొడుకు పుట్టిన రెండేళ్ల తర్వాత 2024 జాతీయ క్రీడల్లో సీమా పునరాగమనంలో స్వర్ణం గెలిచింది. ఆపై జాతీయ చాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన (59.73 మీటర్లు) ఆమె నమోదు చేసింది. ‘అథ్లెట్ల ప్రదర్శనలో ఊహాత్మక ప్రభావం–సానుకూల దృక్పథం’ అనే అంశంపై పీహెచ్డీ చేస్తోన్న సీమా పోటీల సమయంలో దానినే తనకు అన్వయించుకుంది. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె పట్టుదలగా ఉంది. -
జూడోలో మరో స్వర్ణం.. భారత్ ఖాతాలో 19వ పతకం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో 9వ రోజు రెండో స్వర్ణం వచ్చి చేరింది. ఇప్పటికే జూడో మహిళల విభాగంలో అస్మితా స్వర్ణం గెలవగా, తాజాగా జూడో పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్ బంగారు పతకాన్ని అందుకున్నాడు. 4 నిమిషాల పాటు జరిగిన ఫైనల్ బౌట్లో హర్ష్ సింగ్ ఆస్ట్రేలియాకు చెందిన జోషజవా కట్జ్‌ను చిత్తు చేసి పసిడి పతకం ఒడిసిపట్టాడు. తద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల జూడో విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి అథ్లెట్‌గా హర్ష్ సింగ్ నిలిచాడు. ఇది భారత్‌కు ఐదో స్వర్ణం కాగా, ఓవరాల్‌గా పతకాల సంఖ్య 19కి చేరినట్లయింది. ఇప్పటికే జూడోలో మహిళల 48 కేజీల విభాగంలో అస్మితా దే స్వర్ణం సాధించింది. జూడోలో స్వర్ణం సాధించిన తొలి మహిళా ప్లేయర్‌గా అస్మితా రికార్డులకెక్కింది.ఇక కామన్వెల్త్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ 19 పతకాలు (5 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలు) సాధించి పట్టికలో 19వ స్థానంలో కొనసాగుతోంది. అయితే గేమ్స్‌లో 9వ రోజైన శుక్రవారం ఒక్కరోజే భారత్ ఖాతాలో 13 పతకాలు ఖరారయ్యాయి. ఇందులో బాక్సింగ్ నుంచి 10 పతకాలు ఉంటే, జూడో నుంచి మరో మూడు పతకాలు ఉన్నాయి. HARSH SINGH CREATES HISTORY | GOLDHe became Indian first ever male CWG Judo champion pic.twitter.com/gsgc6jJ2zC— IndiaSportsHub (@IndiaSportsHub) July 31, 2026#WATCH | Glasgow | Indian Judo Athlete and gold medallist Harsh Singh says, “I am feeling really happy to win this medal for the country... We prepared to win today... I dedicate this medal to my mother... If qualified, I will prepare well for the Asian Games and give my best to… https://t.co/9XbewAgl6U pic.twitter.com/lgn5bvMYka— ANI (@ANI) July 31, 2026Read: జూడోలో భారత్‌కు స్వర్ణం.. ఒక్కరోజే 13 పతకాలు ఖరారు! -
జూడోలో భారత్‌కు స్వర్ణం.. ఒక్కరోజే 13 పతకాలు ఖరారు!
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. జూడోలో మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో కెనడాకు చెందిన హెల్దీ క్వాచ్‌పై 4-0తో విజయం సాధించిన అస్మితా దే స్వర్ణం సాధించింది. జూడోలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఇక జూడోలో స్వర్ణం సాధించిన తొలి మహిళా ప్లేయర్‌గా అస్మితా రికార్డులకెక్కింది. ఈ గేమ్స్‌లో ఇది భారత్‌కు 4వ స్వర్ణం కాగా, ఓవరాల్‌గా భారత్‌కు ఇది 18వ పతకం. ఇక కామన్వెల్త్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ 18 పతకాలు (4 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలు) సాధించింది. అయితే గేమ్స్‌లో భాగంగా 9వ రోజైన శుక్రవారం ఒక్కరోజే భారత్ ఖాతాలో 13 పతకాలు ఖరారయ్యాయి. ఇందులో బాక్సింగ్ నుంచి 10 పతకాలు ఉంటే, జూడో నుంచి మరో మూడు పతకాలు ఉన్నాయి. జూడో గేమ్‌లో హర్ష్ సింగ్, యామిని మౌర్య, అస్మితా దే ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఫైనల్లో గెలిస్తే స్వర్ణం లేదంటే రజతాలు దక్కనున్నాయి. ఇక బాక్సింగ్‌లో భారత్ పంచ్ పవర్ అదుర్స్ అనిపిస్తోంది. భారత బాక్సర్లలో ప్రీతి పవార్, అంకుశ్ పంగల్, జాస్మిన్ లంబోరియా, జాదుమణి సింగ్, అరుంధతీ చౌదరీలు శనివారం ఫైనల్ మ్యాచ్‌లు ఆడనున్నారు. గెలిస్తే ఐదు స్వర్ణాలు.. ఓడితే ఐదు రజతాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. ఇక మరో ఐదుగురు భారత బాక్సర్లు సెమీస్‌కు అర్హత సాధించడంతో కనీసం కాంస్యం ఖరారు చేసుకున్నారు. ఇక ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత జావెలిన్ త్రో ఫైనల్ జరగనుంది. అందరి కళ్లు నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. నీరజ్ కచ్చితంగా స్వర్ణం లేదా కనీసం రజతమైనా ఒడిసిపడతడని అంతా భావిస్తున్నారు. నీరజ్‌తో పాటు మరో ఇద్దరు భారత జావెలిన్ త్రోయర్లు కూడా బరిలో ఉండడంతో పతకాలపై ఆశలు మరింత పెరుగుతున్నాయి. ఇలా శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 13 పతకాలకు పైగా ఖరారు కావడంతో భారత్‌కు ఆదివారం లోగా 30 నుంచి 31 పతకాలు వచ్చే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. ఇవాళ జూడో మహిళల విభాగంలో అస్మితా దే (48 కేజీల విభాగంలో), యామిన్ మౌర్య (57 కేజీల విభాగంలో) ఫైనల్ ఆడనుండగా, పురుషుల విభాగంలో హర్ష్ సింగ్ (60 కేజీలు) ఫైనల్లో ఆడనుండడంతో భారత్ పతకాల సంఖ్య 20కి చేరనుంది. 🇮🇳🥹 India's first-ever Commonwealth Games Gold Medal in Judo.Asmita Dey has etched her name into Indian sporting history! 🥇She defeats Canada's Heidi Quach 2-1 to win the Women's -48kg Judo Gold at the Commonwealth Games 2026.pic.twitter.com/4KEKWaDmXG— Sports Apna 🇮🇳 (@sportsapna1) July 31, 2026 𝐀𝐒𝐌𝐈𝐓𝐀 𝐃𝐄𝐘 𝐂𝐑𝐄𝐀𝐓𝐄𝐒 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘! 🇮🇳🥇 Becomes the FIRST-EVER Indian JUDOKA (male or female) to win a Commonwealth Games GOLD medal! Defeats Heidi Quach in 48kg Final. #Glasgow2026 #Glasgow2026withIAS pic.twitter.com/Ux3mQQ8Jf3— India_AllSports (@India_AllSports) July 31, 2026 -
CWG 2026: ఫైనల్లో ప్రీతి.. బాక్సింగ్‌లో పతకం ఖాయం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్ ప్రీతి పవార్ దేశానికి పతకం ఖాయం చేసింది. సెమీస్ చేరినప్పుడే పతకం ఖాయమైనప్పటికీ తాజాగా మహిళల 54 కేజీల విభాగంలో ప్రపంచ మూడో ర్యాంకర్ ప్రీతి పవార్ ఫైనల్లో అడుగుపెట్టడంతో భారత్ ఖాతాలో స్వర్ణం లేదా రజతం ఖరారు కానుంది. శుక్రవారం మహిళల 54 కేజీల విభాగంలో సెమీఫైనల్లో ప్రీతి పవార్ 5-0తో జాంబియాకు చెందిన కేథరిన్ వేప్ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. స్వర్ణ పతకం కోసం జరిగే పోరులో కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాడోతో తలపడనుంది. ఫైనల్లో ప్రీతి ఓడినప్పటికీ భారత్‌కు రజతం దక్కనుంది. హర్యానాలోని భివానీకి చెందిన ప్రీతి పవార్ 2022 ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. సెమీస్‌లో విజయం తర్వాత ప్రీతి పవార్ మాట్లాడుతూ.."నేను అనుకున్నది సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. స్వర్ణ పతకం గెలవడానికి రేపు నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. నేను నా పోటీదారులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయను. కామన్వెల్త్ గేమ్స్‌లో నా ప్రతీ ఫైట్‌కు ముందు కోచ్‌తో పర్యవేక్షణలో ప్రత్యేకంగా సన్నద్ధమవుతాను. ఆ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయగలుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది.'' అని ప్రీతి పవార్ తెలిపింది.జూడో క్వార్టర్స్‌లో భారత ప్లేయర్లుజూడోలో రోహిత్ బసిర్, శ్రద్ధా చొపాడేలు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. మొజాంబిక్‌కు చెందిన సామ్యూల్ రిబెరియోను ఇప్పోన్ ద్వారా ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖరారు చేసుకున్నాడు. మరోవైపు జేన్ మసాక్వియోను ఇప్పోన్లో ఓడించిన శ్రద్ధా కూడా క్వార్టర్స్ చేరుకుంది. VIDEO | Glasgow, Scotland: Indian boxer Preeti Pawar in 54 kg category sailed into the Commonwealth Games final by out-punching Zambia's Catherine Mwape in the last-four stage.She says, "I am very happy that I have managed to do what I prepared for. I have to give my best… pic.twitter.com/O1pRkyvgF0— Press Trust of India (@PTI_News) July 31, 2026Read: క్యాచ్ మిస్ కొంపముంచింది.. జట్టును గెలిపించిన జెమీమా! -
అదరగొడుతున్న భారత అథ్లెట్స్.. లవ్‌ప్రీత్‌కు రజతం! సీమాకు కాంస్యం
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భాతర అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 110+ కేటగిరీలో లవ్‌ప్రీత్ సింగ్ రజత పతకం సాధించగా.. మహిళల డిస్కస్ త్రోలో సీమా కళిరామ్న కాంస్య పతకాన్ని కైసవం చేసుకుంది. మరోవైపు జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా, రోహిత్ యాదవ్, యష్వీర్ సింగ్‌లు ఫైనల్‌కు అర్హత సాధించారు.పంజాబ్‌కు చెందిన లవ్‌ప్రీత్ తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. స్నాచ్ విభాగంలో 176 కేజీలను ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డును తిరగరాశాడు. అనంతరం క్లీన్ అండ్ జెర్క్‌లో 212 కేజీల బరువు ఎత్తి ఔరా అనిపించాడు. మొత్తంగా అతడు 388 కేజీల వెయిట్‌ను లిప్ట్ చేసి రెండో స్ధానంలో నిలిచాడు. స్నాచ్ రౌండ్ ముగిసేసరికి లవ్‌ప్రీత్ 10 కేజీల ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. చివరి రౌండ్లో న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్ ఆండ్రూ లిటి క్లీన్ అండ్ జెర్క్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. అతడు మొత్తం 389 కేజీలతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.కేవలం ఒక్క కిలోగ్రామ్ తేడాతో లవ్‌ప్రీత్ గోల్డ్‌మెడల్ కోల్పోయాడు. అయితే వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది ఎనిమిదవ మెడల్ కావడం గమనార్హం.పోరాడి కాంస్యం నెగ్గిన సీమ ఇక మహిళల డిస్కస్ త్రోలో 27 ఏళ్ల సీమా కళిరామ్న అద్భుతంగా పోరాడి కాంస్య పతకం సొంతం చేసుకుంది. పోటీలో వరుసగా మూడు ఫౌల్స్ నమోదైనప్పటికీ, మూడో రౌండ్లో ఆమె చేసిన త్రో పతకాన్ని ఖాయం చేసింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 17కు చేరింది. -
గిరిజన వీరుడు... పరుగులో ధీరుడు
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా తొరన్ డోంగ్రీ గ్రామానికి చెందిన దిలీప్ మహాడు గావిత్... ఆరేళ్ల వయసులో చేయి కోల్పోయాడు. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న దిలీప్ చెట్టుపై నుంచి కిందపడగా... పసరు వైద్యాన్నే నమ్ముకున్న అతడి ఆదివాసీ తల్లిదండ్రులు సకాలంలో వైద్యం అందించలేకపోయారు. దీంతో అతడి కుడి చేతిని మోచేయి కింది వరకు తొలగించాల్సి వచ్చింది. అసలే కూలీనాలీ చేసుకునే కుటుంబంలో ఒక చేయి కోల్పోవడంతో దిలీప్ మరింత కుంగిపోయాడు. ఆత్మన్యూనత భావంతో చదువుకన్నా ఎక్కువ మైదానంలోనే గడిపేవాడు. ఈ సమయంలోనే ప్రముఖ కోచ్ వైజనాథ్ కాలే దృష్టి అతడిపై పడింది. సాధారణ పిల్లలతో పోటీపడి పరుగులు తీస్తున్న అతడిలో ఏదో ప్రత్యేకత ఉందని వైజనాథ్ గుర్తించారు. ‘అతడిని ఓ పాఠశాలలో చూశాను. పదకొండేళ్ల ప్రాయంలో అతడు పరుగు తీస్తున్న తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. సరైన కోచింగ్ ఇస్తే అద్భుతాలు చేయగలడనిపించింది. ఇదే విషయాన్ని అతడి తల్లిదండ్రులకు చెప్పినా వారు అర్థం చేసుకోలేకపోయారు. పారా పోటీలు ఉంటాయనే విషయమే వారికి తెలియదు. దీంతో కేవలం మెరుగైన జీవితం అందిస్తానని చెప్పి అతడిని నా వెంట తీసుకొచ్చా. అప్పటి నుంచి అన్నీ నేనే అయి పెంచాను. దత్తత తీసుకున్నా. ఇంటి పేరు లేకున్నా అతడు నా కుమారుడే’ అని వైజనాథ్ గర్వంగా చెప్పారు. కోచ్ సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగిన దిలీప్... అనతికాలంలోనే మంచి గుర్తింపు సాధించాడు. అండర్–18 స్థాయిలో పలు పతకాలు సాధించిన దిలీప్... ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మెరిశాడు. తాజాగా గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల పురుషుల 100 మీటర్ల టి47 విభాగంలో దిలీప్ 10.71 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణ పతకం సాధించాడు. రేసు ముగిసిన వెంటనే అగ్రస్థానంలో నిలిచిన దిలీప్‌ను తమ కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీపడుతుండగా... అతడు మాత్రం తన గురువు కోసం వెతుక్కుంటూ కనిపించాడు. ఒక్కసారిగా అతడు కనిపించగానే పట్టరాని ఆనందంతో ఎగిరి గంతేశాడు. ‘ఆశించిన స్థాయిలో రేసును ప్రారంభించలేకపోయా. అయినా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చివర్లో వేగం పెంచి ఫలితం రాబట్టా’ అని దిలీప్ పేర్కొన్నాడు. భారీ వర్షంలో జరిగిన ఫైనల్ రేసులో పరిస్థితులు పరీక్షిస్తున్నా... మొక్కవోని దీక్షతో ముందుకు సాగిన దిలీప్ అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ‘ఈ విజయంతో ఆగిపోవాలని అనుకోవడం లేదు. ప్రస్తుతానికి ఉద్యోగం చేయాలనే ఆలోచన లేదు. దేశానికి వీలైనన్ని ఎక్కువ పతకాలు సాధించడమే నా ముందున్న లక్ష్యం. సెపె్టంబర్లో జరగనున్న పారా ఆసియా క్రీడలతో పాటు, 2028 లాస్ ఏంజెలిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించేందుకు కృషి చేస్తా. పారా ఆసియా క్రీడల్లో 100 మీటర్లతో పాటు 400 మీటర్ల విభాగంలోనూ పోటీ పడతా.నా పతకం వెనక కర్త, కర్మ, క్రియ... నా గురువు వైజనాథ్. ఆయనే లేకుంటే నేను ఈ రోజు ఎక్కడ ఉండేవాడినో. 11 ఏళ్ల వయసు నుంచి నాకు అన్నీ ఆయనే. వాళ్లింట్లోనే పెరిగా. మెరుగైన జీవితాన్నిస్తా అని ఆయన ఇచ్చిన మాటకు బదులుగా ఈ రోజు నేను కామన్వెల్త్ స్వర్ణాన్ని గురువుకు అంకితమిస్తున్నా. ఈ పతకం మాత్రమే కాదు ఈ జీవితం కూడా ఆయానదే. గురు పూర్ణిమ రోజు తండ్రిలాంటి గురువుకు అంతర్జాతీయ పతకం కానుకగా ఇవ్వడం ఆనందంగా ఉంది’ అని దిలీప్ భావోద్వేగానికి గురయ్యాడు. – సాక్షి క్రీడా విభాగం -
పాకిస్తానీ కాదు.. ‘రియల్ పెద్ది’తోనే నీరజ్‌కు సవాల్!
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై ఈసారి భారీ అంచనాలున్నాయి. రెండు వరుస ఒలింపిక్స్‌లో పతకాలు కొల్లగొట్టిన నీరజ్ చోప్రా ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో జావెలిన్ త్రోలో దేశానికి స్వర్ణం అందిస్తాడని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్ ముగిసింది. అందరి అంచనాలను అందుకుంటూ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్‌చోప్రా ఫైనల్ చేరినప్పటికీ, అంతా అనుకుంటున్నట్లుగా నెంబర్‌వన్ స్థానంలో కాకుండా ఐదో స్థానంలో మెడల్ రౌండ్‌కు అర్హత సాధించాడు. నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో ఈటెను 76.28 మీటర్ల దూరం విసిరాడు. ఇక రెండో ప్రయత్నంలో అత్యుత్తమంగా 79.61 మీటర్ల దూరం ఈటెను విసిరి ఐదో స్థానం దక్కించుకున్నాడు. కాగా మొత్తంగా 18 మంది జావెలిన్ త్రోయర్లు క్వాలిఫయింగ్‌లో పోటీపడ్డారు.అయితే, ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. నీరజ్ చోప్రాతో పాటు రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ కూడా టాప్-12లో నిలిచి ఫైనల్లో అడుగుపెట్టారు. శ్రీలంకకు చెందిన జావెలిన్ త్రోయర్ రుమేశ్ తరంగ పతిరగే (రియల్ పెద్ది) 82.84 మీటర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచాడు.కాగా గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 81.29 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో, సౌతాఫ్రికాకు చెందిన డౌ స్మిత్ 80.64 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో, ఇంగ్లండ్‌కు చెందిన బెన్ ఈస్ట్ (80.38 మీటర్లు) విసిరి నాలుగో స్థానంలో నిలిచారు. ఇక భారత్ నుంచి నీరజ్ చోప్రానే కాకుండా రోహిత్ యాదవ్ అత్యుత్తమంగా ఈటెను 78.37 మీటర్ల దూరం విసరగా.. యశ్వీర్ సింగ్ 78.36 మీటర్ల దూరం విసిరి వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు.. పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్, పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ (78.63 మీటర్ల) దూరం బల్లాన్ని విసిరి టాప్-7లో నిలిచాడు. కాగా భారత కాలమానం ప్రకారం జూలై 31న రాత్రి 10.15 గంటలకు జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.అర్షద్ కాదు అతడితోనే పోటీఅయితే నీరజ్ చోప్రాకు ఈసారి స్వర్ణ పతకం అంత ఈజీగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. క్వాలిఫయింగ్ పోటీల్లో పీటర్స్ అండర్సన్, అర్షద్ నదీమ్‌లను కూడా వెనక్కి నెట్టిన శ్రీలంక స్టార్ రుమేశ్ తరంగ తొలి స్థానంలో నిలిచి నీరజ్‌కు సవాల్‌గా మారాడు. దీంతో ఈసారి ఫైనల్లో నీరజ్ చోప్రాకు అర్షద్ నదీమ్, అండర్సన్ పీటర్స్‌తో పాటు రుమేశ్ తరంగ రూపంలో మరో బలమైన ప్రత్యర్థి ఎదురవ్వనున్నాడు. దీంతో నీరజ్‌కు ఈసారి అర్షద్ నదీమ్ నుంచి కాకుండా రియల్ పెద్ది (క్రాస్ ఓవర్ అథ్లెట్) అనిపించుకున్న రుమేశ్తోనే మెడల్ కోసం టఫ్ ఫైట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది.ఫైనల్ కోసం దాచుకున్నాడా?కామన్వెల్త్ గేమ్స్‌లో బరిలోకి దిగిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. తొలి ప్రయత్నంలో ఈటెను 76.28 మీటర్ల దూరం విసిరాడు. ఇక రెండో ప్రయత్నంలో అత్యుత్తమంగా 79.61 మీటర్ల దూరం ఈటెను విసిరి ఐదో స్థానం దక్కించుకున్నాడు. ఆటోమేటిక్ క్వాలిఫయింగ్ మార్క్ అయిన 84 మీటర్ల మార్క్‌ను నీరజ్ అందుకోలేకపోయాడు. అయితే ఫైనల్లో తన అసలైన పవర్‌ను బయటికి తీస్తాడని, అక్కడే తన అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు రుమేశ్ తరంగ క్వాలిఫయింగ్ రౌండ్లోనే ఈటెను 82.84 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు.క్వాలిఫయింగ్‌లో తొలి స్థానం ఇచ్చిన కిక్‌తో ఫైనల్లో రికార్డు ప్రదర్శన చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. అవసరమైతే నీరజ్ చోప్రా రికార్డును కూడా బద్దలు కొట్టే సత్తా రేమేశ్ తరంగలో కనిపిస్తోందని జోస్యం చెబుతున్నారు. మరి వీళ్లంతా వేస్తున్న లెక్కలు నిజమవుతాయా లేదా అన్నది ఫైనల్ రౌండ్‌తో తేలిపోనుంది. Neeraj Chopra books his place in the Men's Javelin Final with a 79.61m throw despite challenging conditions. 👏Watch the Golden Boy in action on 1st August, 12:45 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #Glasgow2026… pic.twitter.com/M4kYPIuCTJ— Sony Sports Network (@SonySportsNetwk) July 30, 2026 Rumesh Tharanga qualifies for Javelin Finals at Commonwealth Games Full Story: https://t.co/4qSMn90KjA pic.twitter.com/lwt3lINSfx— NewsWire 🇱🇰 (@NewsWireLK) July 30, 2026చదవండి: రియల్ పెద్ది షాకింగ్ జర్నీ -
ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా
భారత స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్-2026 జావెలిన్ త్రో క్వాలిఫయింగ్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐదోస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. కాగా స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్ నిర్వహించారు. నీరజ్ చోప్రాతో పాటు భారత్‌కే చెందిన రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో ఈటెను 76.28 మీటర్ల దూరం విసిరాడు.12 మందికి అర్హతఇక రెండో ప్రయత్నంలో అత్యుత్తమంగా 79.61 మీటర్ల దూరం ఈటెను విసిరి ఐదో స్థానం దక్కించుకున్నాడు. కాగా మొత్తంగా 18 మంది జావెలిన్ త్రోయర్లు క్వాలిఫయింగ్‌లో పోటీపడ్డారు. అయితే, ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. నీరజ్ చోప్రాతో పాటు రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ కూడా టాప్-12లో నిలిచి ఫైనల్లో అడుగుపెట్టారు.రోహిత్ యాదవ్ అత్యుత్తమంగా ఈటెను 78.37 మీటర్ల దూరం విసరగా.. యశ్వీర్ సింగ్ 78.36 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో వీరిద్దరు తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచారు. అగ్రస్థానం అతడిదేఇక శ్రీలంకకు చెందిన రుమేశ్ తరంగ పతిరగే 82.84 మీటర్ల దూరం ఈటెను విసిరి తొలి స్థానం దక్కించుకున్నాడు. మరోవైపు.. పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ 78.63 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి టాప్-7లో నిలిచాడు. కాగా భారత కాలమానం ప్రకారం ఆగష్టు 1న ఉదయం 12.45 గంటలకు జావెలిన్ త్రో ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. -
CWG 2026: భారత్ డబుల్ ధమాకా.. దిలీప్‌కు స్వర్ణం, బాసిల్‌కు రజతం
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత పారా అథ్లెట్లు సంచలనం సృష్టించారు. 100 మీటర్ల T47 స్ప్రింట్ విభాగంలో భారత అథ్లెట్లు స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకుని సత్తా చాటారు. రన్నర్ దిలీప్ మహాదు గావిత్ కేవలం 10.71 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. గావిత్ పసిడి పతకంతో పాటు కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే T47 స్ప్రింట్ విభాగంలో అత్యంతవేగంగా రేసును పూర్తి చేసిన అథ్లెట్‌గా కూడా రికార్డులకెక్కాడు. ఇక అతడి వెనుకే వచ్చిన మహమ్మద్ బాసిల్ 10.83 సెకన్ల టైమింగ్‌తో తన సీజన్‌లోని ఉత్తమ ప్రదర్శన ఇచ్చి రజతాన్ని అందుకున్నాడు. మరోవైపు లాంగ్ జంప్‌లో మురళీ శ్రీశంకర్‌కు రజత పతకం సాధించాడు. శ్రీశంకర్ తన చివరి జంప్‌లో 7.97 మీటర్లతో రెండో స్ధానంలో నిలిచాడు. ఇక అగ్రస్ధానంలో నిలిచిన జమైకాకు చెందిన తజాయ్ గేల్( 8.15 మీటర్లు) గోల్డ్‌మెడల్ సాధించాడు.భారత్‌కు మూడో స్వర్ణంగ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ఇది మూడో స్వర్ణ పతకం. అంతకుముందు మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, మహిళల షాట్‌పుట్ F57 పారా అథ్లెటిక్స్ విభాగంలో షర్మిల ధన్కర్ భారత్‌కు పసిడి పతకాలను అందించారు. కాగా భారత్ మొత్తం 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో పతకాల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. -
గుల్వీర్ రజత పరుగు
గ్లాస్గో: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల జాబితాలో మరో రెండు రజతాలు చేరాయి. మరో ఆరు పతకాలు ఖరారయ్యాయి. హర్జీందర్ కౌర్ ప్రదర్శనతో వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో మెడల్ మనకు దక్కగా... అథ్లెటిక్స్‌లో గుల్వీర్ సింగ్ పరుగు పతకాన్ని అందించింది. ఆరుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్ చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. పురుషుల 10,000 మీటర్ల పరుగును 27 నిమిషాల 49.78 సెకన్లలో పూర్తి చేసి గుల్వీర్ రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్సన్ (27 నిమిషాల 48.93 సెకన్లు) స్వర్ణం గెలుపొందగా, డేవిడ్ ములార్కీ (ఐల్ ఆఫ్ మ్యాన్; 27 నిమిషాల 50.28 సె.) కాంస్యం దక్కించుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల 10 వేల మీటర్ల పరుగులో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. 1986 క్రీడల తర్వాత ఈ పోటీల్లో ఒక్క ఆఫ్రికా అథ్లెట్ కూడా టాప్–3లో నిలవకపోవడం ఇదే మొదటిసారి. పూర్తిగా ప్రతికూల వాతావరణం, భారీ వర్షం, అనూహ్యంగా మారుతున్న ఉష్ణోగ్రతలు... ఇలాంటి స్థితిలో 10 వేల మీటర్ల పరుగు అథ్లెట్లకు కష్టంగా మారింది. గత ఏడాది తాను నెలకొల్పిన అత్యుత్తమ ప్రదర్శన (27 నిమిషాల 14.88 సెకన్లు)ను ఇలాంటి స్థితిలో గుల్వీర్ పునరావృతం చేయలేకపోయినా... రజతంతో సత్తా చాటాడు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలుచుకున్న డానిల్ ఎబెన్యో (కెన్యా), ఆస్కార్ షెలిమో (ఉగాండా)లను వెనక్కి నెట్టడంలో 28 ఏళ్ల గుల్వీర్ సఫలమయ్యాడు. రేస్ ఆరంభంలో వేగంగా దూసుకుపోయి ఆ తర్వాత మధ్యలో కాస్త తగ్గి చివర్లో జోరందుకున్నాడు. 4,000 మీటర్ల వరకు మూడో స్థానంలో ఉన్న అతను... 6,800 మీటర్లు ముగిసేసరికి 9వ స్థానంలో నిలిచాడు. అయితే ఆ తర్వాత చెలరేగిపోయి పతకం దిశగా సాగిపోయాడు. చివరి 200 మీటర్ల ముందు మూడో స్థానంలో నిలిచిన గుల్వీర్ వేగం పెంచి చివరకు రెండో స్థానంతో ముగించాడు. మరోవైపు మహిళల హైజంప్‌లో ఆసియా చాంపియన్ పూజ సింగ్ 1.77 మీటర్ల ఎత్తుకు ఎగిరి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల షాట్‌పుట్‌లో తజిందర్ పాల్ సింగ్ తూర్, సమర్దీప్ సింగ్ గిల్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల 200 మీటర్ల విభాగంలో అనిమేశ్ కుజుర్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. పురుషుల స్విమ్మింగ్‌లో సాజన్ ప్రకాశ్, అనీశ్ గౌడ 200 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. పారా స్విమ్మర్లు సుయశ్ నారాయణ్ జాధవ్, చైతన్య విశ్వాస్ పురుషుల ఎస్7 50 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్లోకి అడుగు పెట్టారు. మట్టి రోడ్లపై మొదలు పెట్టి...ఆర్మీలో ఇంటర్ యూనిట్ రేస్‌లలో అథ్లెట్లు మంచి ప్రదర్శన కనబరిస్తే పలు ప్రయోజనాలు ఉన్నాయి. అత్యుత్తమ డైట్, కఠిన షిఫ్ట్‌ల నుంచి విముక్తి, ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. గుల్వీర్ సింగ్ కూడా సరిగ్గా దీనిపైనే దృష్టి పెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని అత్రౌలి జిల్లా సిర్సాకు చెందిన గుల్వీర్ ముందుగా ఆర్మీలో ఎంపికయ్యేందుకు తన ఊర్లో మట్టి రోడ్డులపై పరుగెత్తాడు. అక్కడ జవాన్‌గా చేరిన తర్వాత దానినే కొనసాగిస్తూ ఇంటర్ యూనిట్ రేస్‌లలో పాల్గొంటూ వచ్చాడు. సైన్యంలో చేరిన మూడేళ్లలోపే 2023 జాతీయ క్రీడల్లో అతను 10,000 మీటర్ల పరుగులో చాంపియన్‌గా నిలిచి వెలుగులోకి వచ్చాడు. 3,000 మీటర్లు, 5,000 మీటర్ల పరుగులో కూడా జాతీయ రికార్డులు అతని పేరిటే ఉన్నాయి. హాఫ్ మారథాన్‌ను గంటలోపు పూర్తి చేసిన తొలి భారత అథ్లెట్ గుల్వీర్. ఆసియా క్రీడల్లో కూడా కాంస్యం గెలుచుకున్నా ... ఆఫ్రికన్లు లేని ఆ ఈవెంట్లో అతని విజయానికి తగిన విలువ దక్కలేదు. తాజా ఈవెంట్ కోసం యూఎస్‌లోని కొలరాడో స్ప్రింగ్స్‌లో కోచ్ స్కాట్ సైమన్స్ పర్యవేక్షణలో తీసుకున్న ప్రత్యేక శిక్షణ తగిన ఫలితాన్నిచ్చింది. మిల్కా సింగ్, అవినాశ్ సాబ్లే తర్వాత కామన్వెల్త్ క్రీడల నాన్–రిలే ట్రాక్‌లో పతకం సాధించిన మూడో భారత అథ్లెట్‌గా గుల్వీర్ ఘనత సాధించాడు. నేడు బరిలో నీరజ్ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నేడు బరిలోకి దిగనున్నాడు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే జావెలిన్ త్రో క్వాలిఫయింగ్‌లో నీరజ్‌తోపాటు భారత్‌కే చెందిన రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ పాల్గొంటారు. మొత్తం 18 మంది జావెలిన్ త్రోయర్లు క్వాలిఫయింగ్‌లో ఉన్నారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. గురువారమే ఏడుగురు భారత క్రీడాకారులు పతకాల కోసం పోటీపడనున్నారు.మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో మార్టినా దేవి (ప్లస్ 86 కేజీలు; సాయంత్రం గం. 6:30 నుంచి), పురుషుల వెయిట్‌లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్ సింగ్ (ప్లస్ 110 కేజీలు; రాత్రి 11 గంటల నుంచి) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అథ్లెటిక్స్ షాట్‌పుట్ ఫైనల్లో తజిందర్ పాల్, సమర్దీప్ (రాత్రి గం. 11:30 నుంచి) పోటీపడతారు. మహిళల డిస్కస్ త్రో ఫైనల్లో సీమా పూనియా, నిధి రాణి (అర్ధరాత్రి గం. 1:10 నుంచి), మహిళల 5000 మీటర్ల ఫైనల్ రేసులో పారుల్ (అర్ధరాత్రి గం. 1:58 నుంచి) బరిలో ఉన్నారు. ఈసారి వేరే కేటగిరీలో... మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 69 కేజీల కేటగిరీలో హర్జీందర్ మొత్తం 227 కేజీల బరువెత్తి (స్నాచ్‌లో 101 + క్లీన్ అండ్ జర్క్‌లో 126) రెండో స్థానంలో నిలిచింది. మూడు ప్రయత్నాల్లోనూ తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ వచ్చిన హర్జీందర్ స్నాచ్‌లో వరుసగా 96, 99, 101 కిలోలు... క్లీన్ అండ్ జెర్క్‌లో వరుసగా 120, 123, 126 కేజీలను ఎత్తింది. కెనడాకు చెందిన చార్లోట్ సిమోనూ (240 కేజీలు) స్వర్ణం గెలుచుకోగా, ఫీబ్ హేమన్ (ఆ్రస్టేలియా; 218 కేజీలు) కాంస్యం సాధించింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది 7వ పతకం. పంజాబ్‌లోని నభాకు చెందిన 29 ఏళ్ల హర్జీందర్ 2022 బర్మింగ్‌హామ్ క్రీడల్లో 71 కేజీల విభాగంలో కాంస్యం గెలుచుకుంది. ఈసారి కేటగిరీ మారడంతో పాటు తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసి సిల్వర్ మెడల్‌తో మెరిసింది. మహిళల 77 కేజీల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ సంజన పూర్తిగా నిరాశపరిచింది. సంజన స్నాచ్‌లో 94 కేజీలను మూడు ప్రయత్నాల్లోనూ ఎత్తలేకపోయింది. మన పంచ్ అదిరింది...బాక్సింగ్‌లో బుధవారం భారత్‌కు ఆరు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో సాక్షి (51 కేజీలు), అరుంధతి (70 కేజీలు), జైస్మీన్ (57 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సాక్షి 5–0తో కైట్లిన్ (నార్నర్త్ ఐర్లాండ్)పై, అరుంధతి 3–1తో మోర్గాన్ హెండర్సన్ (న్యూజిలాండ్)పై, జైస్మీన్ 4–1తో ఎలీస్ గ్లిన్ (ఇంగ్లండ్)పై గెలిచారు. పురుషుల విభాగంలో సచిన్ సివాచ్ (60 కేజీలు), అంకుశ్ (80 కేజీలు), నరేందర్ (ప్లస్ 90 కేజీలు) కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సచిన్ 5–0తో ట్రెజర్ మొరెమి (బోట్స్వానా)పై, అంకుశ్ 5–0తో జేడ్ మికాక్ (సీషెల్స్)పై, నరేందర్ 3–2తో మైకేల్ సికో (సమోవా)పై విజయం సాధించారు. ఓవరాల్‌గా బాక్సింగ్‌లో భారత్‌కు 10 పతకాలు ఖాయమయ్యాయి. ఇప్పటికే లవ్లీనా (75 కేజీలు), ప్రియ (60 కేజీలు), ప్రీతి (54 కేజీలు), జాదుమణి సింగ్ (55 కేజీలు) సెమీఫైనల్‌కు చేరుకున్నారు. బాక్సింగ్ పోటీలకు నేడు విశ్రాంతి. శుక్రవారం సెమీఫైనల్స్ జరుగుతాయి. సెమీఫైనల్లో ఓడిన వారికి కాంస్య పతకాలు లభిస్తాయి. -
CWG 2026: భారత్‌కు 19వ పతకం ఖరారు
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ పతకాల వేటను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఏడో రోజు భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటల సమయానికి భారత్‌కు 19 పతకాలు ఖాయమయ్యాయి. బాక్సింగ్‌లో సచిన్ సివాచ్ సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేశాడు.పురుషుల 60 కేజీల విభాగం క్వార్టర్ఫైనల్లో సచిన్ సివాచ్ విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించాడు. ఇవాళే మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి, 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి కూడా సెమీస్‌కు చేరి భారత్‌కు పతకాలను ఖాయం చేశారు.ఇంకా ముగ్గురు భారత బాక్సర్లు తమ తమ క్వార్టర్‌ఫైనల్ పోటీల్లో విజయం సాధిస్తే భారత్ పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.అథ్లెటిక్స్‌లో పురుషుల షాట్‌పుట్ ఫైనల్‌కు తాజిందర్‌పాల్ సింగ్ తూర్, సమర్దీప్ సింగ్ గిల్ అర్హత సాధించారు. వీరిద్దరూ గురువారం జరిగే ఫైనల్లో పతకాల కోసం పోటీ పడనున్నారు.పారా స్విమ్మింగ్‌లో చైతన్య విశ్వాస్ కులకర్ణి, సుయశ్ నారాయణ్ జాధవ్ పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్7 ఫైనల్‌కు చేరుకున్నారు.పురుషుల లాంగ్‌జంప్‌లో భారత స్టార్ మురళీ శ్రీశంకర్ తొలి ప్రయత్నంలోనే అర్హత మార్క్‌ను అధిగమించి ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇప్పుడు అతనిపై భారత్‌కు మరో పతకం ఆశలు నెలకొన్నాయి.7వ రోజు (జులై 29) భారత్‌కు పతకాలు అందించే ఈవెంట్ల వివరాలు:సాయంత్రం 7:00 గంటలకు: బాక్సింగ్ - పురుషుల 80 కేజీల క్వార్టర్ ఫైనల్లో అంకుష్ యాదవ్ వర్సెస్ జేడ్ మైకాక్ (సెషెల్స్)సాయంత్రం 7:30 గంటలకు: బాక్సింగ్ - పురుషుల 90+ కేజీల క్వార్టర్ ఫైనల్లో నరేందర్ బెర్వాల్ వర్సెస్ మైఖేల్ సెకో (సమోవా)రాత్రి 11 గంటలకు: బాక్సింగ్ - మహిళల 57 కేజీల క్వార్టర్ ఫైనల్లో జైస్మిన్ లంబోరియా వర్సెస్ ఎలీస్ గ్లిన్ (ఇంగ్లాండ్)రాత్రి 11:54 గంటలకు: అథ్లెటిక్స్ - పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో శ్రీశంకర్ మురళి మరియు లోకేష్ సత్యనాథన్రాత్రి 12:31 గంటలకు: అథ్లెటిక్స్ - మహిళల షాట్ పుట్ ఫైనల్లో (పతకం ఈవెంట్) మన్‌ప్రీత్ కౌర్రాత్రి 12:46 గంటలకు: పారా స్విమ్మింగ్ - పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టైల్ S7 ఫైనల్లో సుయాష్ నారాయణ్ జాదవ్ మరియు చైతన్య విశ్వాస్ కులకర్ణిరాత్రి 12:55 గంటలకు: పారా అథ్లెటిక్స్ - పురుషుల డిస్కస్ త్రో F42-44/F61-64 ఫైనల్లో దేవేందర్ కుమార్ మరియు సాగర్ థాయత్ఉదయం 1:14: స్విమ్మింగ్ - పురుషుల 1500మీ ఫ్రీస్టైల్ ఫైనల్లో ఆర్యన్ నెహ్రాఉదయం 1:42: పారా అథ్లెటిక్స్ - పురుషుల 100మీ T47 ఫైనల్లో మహమ్మద్ బాసిల్ ఎం మరియు దిలీప్ మహాదు గావిత్ఉదయం 2:05: అథ్లెటిక్స్ - మహిళల 3000మీ స్టీపుల్‌చేజ్ ఫైనల్లో పరుల్ చౌదరి -
CWG 2026: భారత్‌కు మరో పతకం ఖాయం చేసిన సాక్షి
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు మరో పతకం ఖరారైంది. ఇప్పటికే 12 పతకాలతో (2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలు) పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్ మరో పతకం ఖాయం చేసుకొని పట్టికలో మరింత మెరుగైన స్థానానికి వెళ్లే దిశగా సాగుతోంది.మహిళల బాక్సింగ్ 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి ఈ పతకాన్ని ఖాయం చేసింది. క్వార్టర్ఫైనల్లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్‌ను 5-0 తేడాతో చిత్తు చేసి సెమీఫైనల్‌కు దూసుకెళ్లడంతో ఆమెకు కనీసం కాంస్య పతకం ఖరారైంది.ఈ బౌట్లో ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సాక్షి మూడు రౌండ్లలోనూ ఏకగ్రీవంగా 5-0 స్కోరుతో విజయం సాధించింది. వేగవంతమైన కదలికలు, కచ్చితమైన పంచ్‌లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను తన ఆధీనంలో ఉంచుకుంది.ఫైనల్ బెర్త్ కోసం శుక్రవారం జరిగే సెమీఫైనల్లో కెనడాకు చెందిన అంబర్-జేన్ వాల్‌తో సాక్షి తలపడనుంది. అంతకుముందు ప్రీక్వార్టర్ఫైనల్లో బోట్స్వానాకు చెందిన లెథాబో మొడుకనెలెపై విజయం సాధించి సాక్షి క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది.ఇదిలా ఉంటే, ఈ పోటీల్లో భారత బాక్సర్ల పోరు కొనసాగనుంది. మహిళల 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి న్యూజిలాండ్‌కు చెందిన మోర్గాన్ హెండర్సన్‌తో క్వార్టర్ఫైనల్లో పోటీ పడనుండగా.. పురుషుల 60 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ బోట్స్వానాకు చెందిన ట్రెజర్ మోరెమితో.. 80 కేజీల విభాగంలో అంకుష్ యాదవ్ సీషెల్స్‌కు చెందిన జేడ్ మికాక్తో, 90 కేజీల విభాగంలో నరేందర్ బెర్వాల్ సమోవాకు చెందిన మైఖేల్ సెకోతో క్వార్టర్‌ఫైనల్ బరిలోకి దిగనున్నారు. -
CG 2026: వర్షంలోనూ తగ్గని జోరు.. ఆఖరి క్షణాల్లో అద్భుతం
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్స్ పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ చారిత్రాత్మక విజయం సాధించాడు. పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో అతడు రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో ఈ విభాగంలో పతకం గెలుచుకున్న తొలి భారత పురుష అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు.ఆఖరి క్షణాల్లో అద్భుతంఉత్కంఠభరితంగా సాగిన ఈ రేసులో 28 ఏళ్ల గుల్వీర్ ఆఖరి క్షణాల్లో అద్భుతం చేశాడు. చివరి ల్యాప్‌లో అనూహ్యమైన వేగంతో ముందుకు దూసుకెళ్లిన గుల్వీర్.. 27 నిమిషాల 49.78 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్సన్ (27:48.93) స్వర్ణ పతకం సాధించగా.. ఐల్ ఆఫ్ మ్యాన్‌కు చెందిన డేవిడ్ ముల్లార్కే కాంస్య పతకం ఒడిసి పట్టాడు.వర్షంలోనూ తగ్గని జోరుకాగా స్కాట్స్టౌన్ స్టేడియంలో ఈ పరుగు పందం తీవ్ర ప్రతికూల వాతావరణంలో జరిగింది. రేసు సమయంలో భారీ వర్షం కురిసింది. నీటితో ట్రాక్ తడిసిపోయింది. అయినప్పటికి గుల్వీర్ తన పట్టుదలను వీడలేదు. మొదటి నుంచీ అగ్రస్థానంలో ఉన్న అథ్లెట్ల గుంపుతోనే సాగుతూ టాప్-2లో నిలిచాడు. అయితే ఈ విభాగంలో ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించే కెన్యా, ఉగాండా అథ్లెట్లకు ఈసారి పతకాలు దక్కకపోవడం విశేషం. 1986 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత పురుషుల 10,000 మీటర్ల విభాగంలో ఒక్క ఆఫ్రికన్ అథ్లెట్ కూడా పతకం గెలవకపోవడం ఇదే మొదటిసారి. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుల్వీర్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలోని గ్రెనేడియర్స్ రెజిమెంట్‌లో నాయిబ్ సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. మరోవైపు భారత వెయిట్ లిఫ్టర్ హర్జిందర్ కౌర్ సైతం సత్తాచాటింది. మహిళల 69 కేజీల విభాగంలో మొత్తం 227 కేజీల (స్నాచ్‌లో 101 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 126 కేజీలు) బరువును ఎత్తి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. దీంతో ఈ క్రీడల్లో భారత పతకాలు సంఖ్య 12కు చేరింది. -
అటు అజయ్... ఇటు సర్వేశ్
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అబ్బాయి వల్లూరి అజయ్ బాబు రజతం అందించగా... హైజంప్‌లో తొలిసారి రజతాన్ని అందించిన ఘనతను సర్వేశ్ కుశారే సొంతం చేసుకున్నాడు. పారా అథ్లెట్లు కూడా తమ వంతుగా రెండు పతకాలను భారత్ ఖాతాలో చేర్చారు. షాట్‌పుట్‌లో షర్మిల స్వర్ణంతో, శిల్ప కాంస్యంతో మెరిశారు.గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు తమపై పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నారు. ఈ క్రీడాంశం ద్వారా భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల 79 కేజీల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు మొత్తం 330 కేజీల బరువెత్తి రజతం గెలుచుకున్నాడు. స్నాచ్‌లో 149 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 181 కేజీల బరువెత్తిన అజయ్‌కు రెండో స్థానం దక్కింది. మలేసియాకు చెందిన హిదాయత్ (331 కేజీలు) స్వర్ణం సాధించగా, క్రిస్ ముర్రే (ఇంగ్లండ్; 325 కేజీలు) కాంస్యం గెలిచాడు. పురుషుల హైజంప్‌లో సర్వేశ్ కుశారే రజతాన్ని సొంతం చేసుకున్నాడు. 2.25 మీటర్ల ఎత్తుకు ఎగిరిన సర్వేశ్ రెండో స్థానంలో నిలిచాడు. జమైకా అథ్లెట్ రొమైన్బెక్ఫోర్డ్ (2.25 మీటర్లు) స్వర్ణం దక్కించుకోగా... కిమాని జాక్ (ఇంగ్లండ్; 2.20 మీటర్లు) కాంస్యం సాధించాడు. సర్వేశ్, బెక్‌ఫోర్డ్ ఇద్దరూ 2.25 మీటర్ల ఎత్తే ఎగిరినా... కౌంట్‌బ్యాక్‌లో జమైకా అథ్లెట్ పైచేయి సాధించాడు. సర్వేశ్‌తో పోలిస్తే బెక్‌ఫోర్డ్ విఫల ప్రయత్నాల సంఖ్య తక్కువ కావడమే అందుకు కారణం. కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు ఇది తొలి రజతం కావడం విశేషం. హైజంప్‌లో ఇప్పటి వరకు తేజస్విన్ శంకర్ (2022 బర్మింగ్‌హామ్) గెలుచుకున్న కాంస్యమే భారత్‌కు ఏకైక పతకం కాగా... ఇప్పుడు సర్వేశ్ దానిని సవరించాడు. మరో భారత హైజంపర్ ఆదర్శ్రామ్ (2.15 మీటర్లు) ఐదో స్థానంతో ముగించాడు. మరోవైపు బాక్సింగ్‌లో మూడు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో ప్రీతి (54 కేజీలు), ప్రియ (60 కేజీలు), పురుషుల విభాగంలో జాదుమణి సింగ్ (55 కేజీలు) సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలు ఖరారు చేసుకున్నారు. మరో బాక్సర్ పర్విన్ 2–3తో సాషా హెకీ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయింది. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 63 కేజీల విభాగంలో నిరుపమా దేవి విఫలమైంది. స్నాచ్‌లో 93 కేజీలు బరువెత్తిన నిరుపమా క్లీన్ అండ్ జెర్క్ మూడు ప్రయత్నాల్లోనూ ఫౌల్ చేసింది. పారా స్విమ్మింగ్ పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్లో భారత స్విమ్మర్ రవి బుడిగిన (ఆంధ్రప్రదేశ్; 25.68 సెకన్లు) 6వ స్థానంలో నిలిచాడు.స్వర్ణ, కాంస్యాలు మనవే...కామన్వెల్త్ పారా క్రీడల అథ్లెటిక్స్ పోటీల చరిత్రలో భారత్ తొలిసారి స్వర్ణం గెలుచుకుంది. మహిళల షాట్‌పుట్ (ఎఫ్57)లో హరియాణకు చెందిన షర్మిల ధన్కర్ పసిడి సొంతం చేసుకుంది. ఆమె తన మూడో ప్రయత్నంలో ఇనుప గుండును 9.81 మీటర్ల దూరం విసిరింది. భారత్‌కే చెందిన కంచుగరకొప్పలు శిల్పా శైలా (కర్ణాటక) కాంస్యం సొంతం చేసుకుంది. ఆమె గుండును 7.26 మీటర్లు విసిరింది. గృహ హింసకు గురై... హరియాణాలోని చిత్రోలికి చెందిన 40 ఏళ్ల షర్మిల గృహ హింస బాధితురాలు. రెండేళ్ల వయసులోనే పోలియో బారిన పడిన ఆమెకు చిన్నతనంలోనే పెళ్లయింది. అయితే వివాహానంతరం ఆమె తీవ్ర హింసకు గురైంది. దీనిని తట్టుకోలేక చివరకు ఆ బంధం నుంచి తప్పుకున్న ఆమె మరో పెళ్లి చేసుకుంది. భర్త అజిత్ సింగ్ ఆమెకు అండగా నిలుస్తూ అన్ని విధాలా ప్రోత్సహించాడు. దాంతో ఆరేళ్ల క్రితం ఆమె పారా అథ్లెట్ కెరీర్ మొదలైంది. ఏడాదిలోపే జాతీయ టైటిల్ గెలుచుకోవడంతో పాటు పారా షాట్‌పుట్, పారా డిస్కర్త్రోలో భారత అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా ఎదిగింది. ఇంటర్నేషల్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన షర్మిల 2022 కామన్వెల్త్ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచింది.ఒక్కో మెట్టు ఎదుగుతూ... ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఈవెంట్లో టాప్–3లో నిలిచిన నాలుగో భారత ఆటగాడి గా సర్వేశ్ గుర్తింపు పొందాడు. గతంలో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. ఇటీవల మొనాకోలో జరిగిన పోటీల్లో సర్వేశ్ ఈ ఘనత సాధించాడు. ఆలస్యంగా ఆటలోకి అడుగుపెట్టి సత్తా చాటిన అరుదైన అథ్లెట్‌గా సర్వేశ్ అందరి దృష్టిలో పడ్డాడు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన సర్వేశ్ తండ్రి ఉల్లిగడ్డలు పండించే రైతు. 20 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అతను పాల్గొన్నాడు. జాతీయ సీనియర్ పోటీల్లో వరుసగా రెండేళ్లు ఇండియన్ ఓపెన్‌లో స్వర్ణం గెలిచిన అతను గత నెలలో ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో 2.31 మీటర్ల ఎత్తు ఎగిరి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. 2025 వరల్డ్ చాంపియన్ షిప్లో ఆరో స్థానంలో నిలిచిన సర్వేశ్...ఈ పోటీల్లో ఫైనల్స్‌కు అర్హత సాధించిన తొలి భారత హైజంపర్గా నిలిచాడు. -
వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్‌కు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి ; కామన్వెల్త్ గేమ్స్-2026 వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల వల్లూరి అజయ బాబు పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో రజత పతకం సాధించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తండ్రి వారసత్వాన్ని అజయ్ విజయవంతంగా కొనసాగించటం నిజంగా ప్రశంసనీయమన్నారు వైఎస్ జగన్. ఈ మేరకు ట్వీట్ చేశారు.‘మీ అద్భుతమైన ప్రదర్శన ఆంధ్రప్రదేశ్‌కు మరియు యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధించాలాని కోరుకుంటున్నా. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా’ అని అభినందనలు తెలియజేశారు. Heartiest congratulations, Valluri Ajaya Babu, on winning the silver medal in the Men's 79 kg weightlifting event at the 2026 Commonwealth Games! Hats off to you for carrying forward the incredible legacy of your father, Valluri Srinivasa Rao Garu.Your outstanding performance… pic.twitter.com/1O8Ip66ZhY— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2026 కాగా, వెయిట్‌లిఫ్టింగ్ స్నాచ్ కేటగిరీలో 149 కేజీలు ఎత్తిన అజయ బాబు క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 181 కేజీల బరువును ఎత్తాడు. మొత్తంగా రెండు విభాగాలు కలిపి 330 కేజీలు ఎత్తిన అజయ బాబు రెండో స్థానంలో నిలిచాడు. దాంతో రజతం ఒడిసిపట్టుకున్నాడు వల్లూరి అజయ బాబు. తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం -
బంగారు స్ఫూర్తి... మీరాబాయి చాను
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్–2026లో భారత వెయిట్‌లిఫ్టింగ్ స్టార్ మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించడం దేశవ్యాప్తంగా క్రీడాకారుల్లో నూతనోత్సాహం నింపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌లో రాణించాలని కలలు కంటున్న యువ క్రీడాకారుల్లో ఈ విజయం ఆత్మవిశ్వాసం నింపుతోంది.సరైన శిక్షణ, కఠోరసాధన, లక్ష్యంపై ఏకాగ్రత ఉంటే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం సాధ్యమేనని ఆమె నిరూపించారు. ఆమె విజయం ఉమ్మడి జిల్లా వెయిట్ లిఫ్టర్లకు స్ఫూర్తిగా నిలుస్తోందని జిల్లా వెయిట్ లిఫ్టింగ్ సంఘం ప్రతినిధులు, క్రీడాకారులు పేర్కొన్నారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, లక్ష్యసాధనతో ప్రపంచ వేదికపై విజయాలు సాధించవచ్చని మీరాబాయి మరోసారి నిరూపించారని కొనియాడారు. - కరీంనగర్మహిళా క్రీడాకారిణులకు గొప్ప ప్రేరణమీరాబాయి చాను విజయం మహిళా క్రీడాకారిణులకు గొప్ప ప్రేరణ. కష్టపడి సాధన చేస్తే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఆమె నిరూపించారు. ఆమె విజయాన్ని ఆదర్శంగా తీసుకుని మరింత పట్టుదలతో శిక్షణ కొనసాగిస్తాను. ఒకరోజు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనేది నా కల.– ఎం సాయిదుర్గ, జాతీయ వెయిట్లిఫ్టర్జాతీయస్థాయిలో రాణిస్తామీరాబాయి చాను గోల్డ్ మెడల్ సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆమె విజయాన్ని చూసిన తర్వాత మా సాధనపై మరింత నమ్మకం పెరిగింది. కోచ్‌ల సూచనలతో కష్టపడి సాధన చేసి జాతీయస్థాయిలో రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. భవిష్యత్‌లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకం సాధించాలనుకుంటున్నా – ఎన్ సాత్విక, స్టేట్ లెవల్ వెయిట్లిఫ్టర్ఆత్మవిశ్వాసం పెంపుమీరాబాయి చాను లాంటి చాంపియన్లు మార్గదర్శకులు. ఆమె క్రమశిక్షణ, అంకితభావం ప్రతీ క్రీడాకారుడు నేర్చుకోవాలి. ఆమె సాధించిన విజయం మాలో ఆత్మవిశ్వాసం పెంచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టర్లు రావాలనే సంకల్పంతో సాధన చేస్తున్నాం.– డి.శృతి, జాతీయ వెయిట్లిఫ్టర్అన్ని విధాలా ప్రోత్సాహంజిల్లాలోని ప్రతి వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానును ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో సాధన చేస్తే అంతర్జాతీయ విజయాలు సాధించడం అసాధ్యం కాదు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు సంఘం తరఫున అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తాం.– అంతటి శంకరయ్య, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ సంఘం అధ్యక్షుడు -
తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం
కామన్వెల్త్ గేమ్స్-2026 వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత అథ్లెట్లు తమ జోరును ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల వల్లూరి అజయ బాబు పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో రజతం ఒడిసిపట్టాడు. ముందుగా స్నాచ్ కేటగిరీలో 149 కేజీలు ఎత్తిన అజయ బాబు క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 181 కేజీల బరువును ఎత్తాడు. మొత్తంగా రెండు విభాగాలు కలిపి 330 కేజీలు ఎత్తిన అజయ బాబు రెండో స్థానంలో నిలిచాడు. మలేషియాకు చెందిన ఎర్రీ హిదయత్ ముహమ్మద్ 331 కేజీలు (స్నాచ్ 147 కేజీలు+ క్లీన్ అండ్ జెర్క్‌లో 184 కేజీలు) ఎత్తి ఒక్క కేజీ బరువు తేడాతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్ వెయిట్‌లిఫ్టర్ క్రిస్ ముర్రే 325 కేజీల బరువు ఎత్తి కాంస్యం ఒడిసిపట్టాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం కావడం విశేషం. Photo Credit: IOA Twitterతొలి ప్రయత్నంలో హిదయత్ క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 181 కేజీలు ఎత్తగా, ఆ వెంటనే అజయ బాబు కూడా 181 కేజీలు ఎత్తడంతో 330 కేజీల వద్ద సమంగా నిలిచారు. అయితే రెండో ప్రయత్నంలో హిదయత్ 184 కేజీల బరువు ఎత్తగా, అజయ బాబు విఫలమయ్యాడు. దీంతో ఒక్క కేజీ బరువు తేడాతో అజయ బాబు తృటిలో స్వర్ణం చేజార్చుకున్నాడు. ఇక స్నాచ్ విభాగంలో మాత్రం అజయ బాబు 149 కేజీలు ఎత్తగా, హిదయత్ మాత్రం 147 కేజీలకే పరిమితమయ్యాడు.2010లో తండ్రికి కాంస్యంఇక అజయ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కూడా వెయిట్‌లిఫ్టరే కావడం విశేషం. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీనివాసరావు పురుషుల 56 కేజీల విభాగంలో కాంస్య పతకం ఒడిసిపట్టాడు. తాజాగా వల్లూరి అజయ బాబు 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించి తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు పొందాడు. Photo Credit: IOA Twitterవిజయనగరం జిల్లాకు చెందిన అజయ బాబు వెయిట్‌లిఫ్టింగ్‌లో రోజురోజుకు తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంటున్నాడు. 2025 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో ఇదే 79 కేజీల విభాగంలో అజయ బాబు స్వర్ణం సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చాంపియన్‌షిప్ పోటీల్లో అజయ బాబు 335 కేజీలు ( స్నాచ్‌లో 152 కేజీలు+ క్లీన్ అండ్ జెర్క్‌లో 183 కేజీలు) బరువు ఎత్తి పర్సనల్ బెస్ట్ నమోదు చేశాడు. ఈ ప్రదర్శన అతడిని నేరుగా కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించేందుకు ఉపయోగపడింది. 2024 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లోనూ అజయ బాబు డబుల్ స్వర్ణాలతో మెరిశాడు. జూనియర్, సీనియర్ కేటగిరీల్లో 81 కేజీల విభాగంలో అజయ బాబు ఈ ఫీట్ సాధించాడు. #CWG2026 | "It is a mix of happiness and sadness, as I missed out on the gold," says Indian weightlifter Valluri Ajaya Babu after winning silver in the men's 79kg event at the 2026 Commonwealth Games in Glasgow with a total lift of 330kg(Source: ANI) pic.twitter.com/TrdIiENBLL— WION (@WIONews) July 28, 2026Sheer strength on show! 🥈Many congratulations to Khelo India athlete Valluri Ajaya Babu on winning the Silver Medal in the Men's 79kg Weightlifting. With a total lift of 330kg, he also set a Commonwealth Games record in the Snatch. A memorable performance and another proud… pic.twitter.com/GMCQPQtIvm— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 28, 2026 -
పతకాల జోరు.. డబుల్ డిజిట్ దాటిన భారత్
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు జోరును ప్రదర్శిస్తున్నారు. సోమవారం రాత్రి మరో నాలుగు పతకాలు భారత్ ఖాతాలో చేరడంతో ఆ సంఖ్య పదికి చేరుకుంది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్‌లో వల్లూరు అజయ బాబు 79 కేజీల విభాగంలో రజతం సాధించగా, పురుషుల హైజంప్ విభాగంలో సర్వేశ్ కుషారే రజతం సాధించాడు. ఇక పారా అథ్లెటిక్స్‌లో షాట్‌పుట్ ఎఫ్-57 కేటగిరీలో షర్మిలా ధంకర్ స్వర్ణం సాధించగా, శిల్ప కాంస్యం ఒడిసిపట్టింది. ముఖ్యంగా పారా షాట్ ఫుట్ F57 విభాగంలో భారత స్టార్ అథ్లెట్ షర్మిలా ధనకర్ తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించి బంగారు పతకాన్ని ముద్దాడారు. మరోవైపు పురుషుల హైజంప్ విభాగంలో సర్వేశ్ కుష్వారే సంచలన ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయంతో కామన్వెల్త్ క్రీడల చరిత్రలోనే హైజంప్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా సర్వేశ్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.వీరితో పాటు వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో అజయ బాబు వెండి పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఒకే రోజున అటు పారా అథ్లె టిక్స్, ఇటు ట్రాక్ అండ్ ఫీల్డ్, వెయిట్రిఫ్టింగ్ విభాగాల్లో వరుస పతకాలు వరించడంతో భారత క్రీడాభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఐదో రోజులు ముగిసేసరికి భారత్ రెండు స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు కలిపి మొత్తం 10 పతకాలతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. An exciting end to Day 4 🇮🇳Team India’s Medal Tally Grew to 10! 🙌🥇 Sharmila Dhankar struck gold in Women’s Shot Put F57🥈 Sarvesh Anil Kushare soared to silver in Men’s High Jump🥈 Valluri Ajaya Babu bagged a silver in Men’s 79kg Weightlifting 🥉 Bindyarani Devi… pic.twitter.com/pNUMnAPLo1— Team India (@WeAreTeamIndia) July 27, 2026Heartiest congratulations to Sharmila on scripting history by winning the Gold medal in the Women's Shot Put F57 event at #CWG2026.Becoming India's first-ever Commonwealth Games Gold medallist in Para Athletics is a truly remarkable achievement. Your unwavering determination,… pic.twitter.com/vuUedWlwuF— Sunil Singhi (@SunilSinghiIND) July 28, 2026Silver for Sarvesh! 🥈 Sarvesh Kushare clears 2.25m to clinch the Silver Medal in the Men's High Jump at Glasgow 2026.👏Watch the Commonwealth Games Glasgow 2026 LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #Glasgow2026… pic.twitter.com/3e62CEPb5M— Sony Sports Network (@SonySportsNetwk) July 27, 2026Read: తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం -
తన బరువుతోనే అసలు యుద్ధం
కామన్వెల్త్... గ్లాస్గో... ఆదివారం రాత్రి. 31 ఏళ్ల మీరాబాయి చాను మళ్లీ నిరూపించింది. 48 కిలోల బరువు విభాగంలో 190 కిలోలు ఎత్తి హ్యాట్రిక్ గోల్డ్‌మెడల్ సాధించింది. కానీ ఈ బంగారం వెనుక ఒక అదృశ్య పోరాటం ఉంది. అది తానెత్తే బరువులతో కాదు... తన బరువుతో. పన్నెండేళ్లుగా మీరాబాయి 48 కిలోల బరువునే మెయింటైన్ చేస్తోంది. 2014లో గ్లాస్గోలో ఏ బరువుతో కామన్వెల్త్లో మొదటిసారి పాల్గొందో, 2026లో గ్లాస్గోలో కూడా అదే బరువుతో పాల్గొని మూడో బంగారం తెచ్చింది. మహిళలకు వయసు పెరిగే కొద్దీ బరువు పెరగడం సహజం. కానీ మీరా మాత్రం ఒకే బరువు, ఒకే క్రమశిక్షణ. ఆమె ఫిట్నెస్ రహస్యం ఏమిటి?‘వెయిట్లిఫ్టర్లం అనగానే అందరూ మేము విపరీతంగా తినేస్తాం అనుకుంటారు. కానీ అది తప్పు, మేం చాలా తక్కువ తింటాం. బ్రెడ్, పాలు కూడా ముట్టలేము. ప్రతి గ్రాముకూ లెక్క ఉంటుంది’ అంటుంది మీరాబాయి చాను. బరువులెత్తడంలో ప్రపంచ విజేతగా నిలుస్తున్న మీరాబాయి తన బరువు విషయంలో కూడా అంతే విజేత. ‘బరువు తగ్గడం సాధ్యం కావడం లేదు’ అనేవారికి మీరాబాయి 12 ఏళ్లుగా స్థిరంగా మెయిన్‌టెయిన్ చేస్తున్న బరువు తప్పక స్ఫూర్తి కలిగించవచ్చు.ఆమె విజయం సులభం కాదుప్రపంచ వేదికల మీద పతకాలు సాధిస్తున్న మీరాబాయి జీవితం మనకు కనిపించేంత గ్లామరస్ కాదు. ‘ట్రైనింగ్‌లో పిచ్చిగా కష్టపడాలి. లేదంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతాం’ అంటుందామె. సాధన ఒకటే కాదు గాయాలూ వెంటాడుతాయి. 2023లో తొడ గాయం. ఈ ఏడాది భుజం నొప్పి. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళలకు సహజంగా వచ్చే మెన్స్ట్రువల్ పెయిన్‌తో బాధ పడుతూనే పోటీ రోజు వేదిక ఎక్కింది. గ్లాస్గో పోటీకి కొన్ని రోజుల ముందు శిక్షణలో చిన్న గాయం. అయినా సాధన ఆపలేదు. కోచ్ విజయ్‌శర్మతో ఉదయం 5 గంటల నుండి బరువు ఎత్తే సాంకేతికతను వేలాదిసార్లు ప్రాక్టీస్ చేయడం. ఒక మిల్లీమీటర్ తేడా వచ్చినా పతకం జారిపోతుందని ఆమెకు తెలుసు.చిన్నప్పటి నుంచి కష్టాలుమణిపూర్లోని నోంగ్‌పోక్ కచింగ్ గ్రామం మీరాబాయిది. పేద కుటుంబం. మీరాకు ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు. తండ్రి రోజు కూలీ. తల్లి చిన్న టీ కొట్టు నడిపేది. చదువు 12వ తరగతితో ఆగిపోయింది. కానీ ఆమెకు బలం ఉండేది. ఆరేళ్ల వయసులో అన్నయ్య మోయలేని కట్టెల మోపును తనే మోసేది. ఇంట్లో బియ్యం బస్తాలు, నీళ్ల కుండలు లేవనెత్తేది. ‘ఈ పిల్లకు చేతుల్లో బలం ఉంది’ అని ఒక కోచ్ గుర్తించాడు. పన్నెండేళ్లకే ఇంటి నుండి ముప్పై కిలోమీటర్లు సైకిల్ తొక్కి ఇంఫాల్ స్టేడియానికి ప్రాక్టీసుకు వెళ్లేది. అమ్మ నగలు అమ్మి, అన్నయ్య జీతం నుండి డబ్బులు ఇచ్చి పోటీలకు పంపారు. 2016 రియో ఒలింపిక్స్‌లో విఫలమైనప్పుడు దేశమంతా విమర్శించింది. కానీ, ఆ విమర్శలనే ఇంధనంగా మార్చుకుని 2017లో ప్రపంచ ఛాంపియన్ గా, 2020 టోక్యోలో ఒలింపిక్ రజత విజేతగా నిలిచింది. ఈరోజు ఆమె ధరించే చెవిపోగులు రియోకు ముందు అమ్మ చేయించినవే. ‘అవి నాకు అదృష్టాన్ని తెస్తాయి’ అంటుంది.ముగింపుమీరాబాయి చాను మనకు నేర్పింది ఒకటే. బరువు తగ్గడం అంటే అందం కోసం కాదు. ఆత్మగౌరవం కోసం. ఆరోగ్యం కోసం. లక్ష్యం కోసం. శరీరం బరువు 48 కేజీలైనా ఆమె మనసు 140 కోట్ల భారతీయుల ఆశలను మోస్తోంది.‘నా శరీరం నా ఆలయం. దాన్ని బలంగా ఉంచుకోవడం నా బాధ్యత’ అంటుంది మీరాబాయి చాను. ఈ మాట ఒక్కటి చాలు. మనం కూడా మన శరీరాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి. ఆహార నియమాలుఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది. 48 కిలోల క్రీడాకారిణిగా ఉండాలంటే ప్రతి గ్రామూ లెక్కే. పండగ భోజనం, జిలేబి ముక్క కూడా బరువు పెంచేస్తుంది. పోటీకి ముందు రోజులలో నీళ్లు కూడా తక్కువ తాగుతుంది. చెమట పట్టించి, సౌనా బాత్‌లో కూర్చుని ఆవిరితో ఒక్కో గ్రాము తగ్గిస్తుంది. మీరాబాయి ఫిట్‌నెస్‌కు 3 స్తంభాలు ఉన్నాయి. ఆహారం, సాధన, మానసిక బలం.1. ఆహారంఉదయం: గోరువెచ్చని నీళ్లు, తేనె, గుడ్డు తెల్లసొన, ఓట్స్, పండ్లు.మధ్యాహ్నం: ఉడికించిన చికెన్ లేదా చేప, గోధుమ రొట్టెలు, పెద్ద సలాడ్.సాయంత్రం: పాలు, బాదం, ప్రోటీన్ పానీయం.రాత్రి: సూప్, ఉడికించిన కూరగాయలు, పప్పు.నూనె, తీపి, వేయించిన పదార్థాలకు దూరం. రోజుకు 4 నుండి 5 లీటర్ల నీళ్లు. ఆకలి వేసినా నీళ్లు తాగి కంట్రోల్ చేస్తుంది.2. సాధనఉదయం: జిమ్‌లో సాంకేతిక సాధన. బరువు ఎత్తడం, పట్టు.మధ్యాహ్నం: కార్డియో, పరుగు, సైక్లింగ్, తాడు దూకడం. సాయంత్రం: యోగా, స్ట్రెచింగ్. గాయాలు రాకుండా శరీరాన్ని సాగదీయడం.ఒక్కరోజు కూడా సెలవు లేదు. ‘నా క్లాస్రూమ్ జిమ్’ అంటుంది.3. మానసిక బలం‘నా కళ్ల ముందు ఎప్పుడూ దేశ జెండా ఉంటుంది’ అంటుంది మీరా. గ్లాస్గోలో మొదటి ప్రయత్నం విఫలమైనా ఆందోళన చెందకుండా, స్మైల్ ఇస్తూ తర్వాతి రౌండ్లో రికార్డు కొట్టడం ఆమె మానసిక బలానికి నిదర్శనం. -
భారత టీటీ జట్ల శుభారంభం
న్యూఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. భారత పురుషుల జట్టు 3–0తో జింబాబ్వే జట్టుపై... భారత మహిళల జట్టు 3–0తో మాల్దీవులు జట్టుపై విజయం సాధించాయి. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ మానవ్ ఠక్కర్ 11–3, 11–2, 11–6తో తయెందా ముమ్వుమాపై, హర్మిత్ దేశాయ్ 11–5, 11–4, 11–5తో తపివా ముసరువాపై, పాయస్ జైన్ 11–3, 11–3, 11–8తో విక్రమ్ సింగ్‌పై గెలిచారు. భారత మహిళల జట్టు తరఫున సుతీర్థ ముఖర్జీ, యశస్విని, స్వస్తిక విజయం అందుకున్నారు. సుతీర్థ 11–4, 11–2, 11–5తో ఫతీమత్ ధీమా అలీపై, యశస్విని 11–2, 11–5, 11–7తో ఐశాత్ రఫా నాజిమ్పై, స్వస్తిక 11–3, 11–5, 11–2తో మిష్కా ఇబ్రహీంపై గెలుపొందారు. ఏడేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న కామన్వెల్త్ టీటీ చాంపియన్‌షిప్‌లో పురుషుల, మహిళల టీమ్ విభాగాలతోపాటు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో భారత క్రీడాకారులే డిఫెండింగ్ చాంపియన్స్‌గా ఉండటం విశేషం. -
కబడ్డీ నుంచి వెయిట్‌లిఫ్టింగ్ వైపు...
రాజా ముత్తుపండి స్వస్థలం తమిళనాడు రాష్ట్రం కోవిల్పట్టి సమీపంలోని శంకరలింగాపురం. తండ్రి ముత్తుపండి రోజూవారీ లేబర్ కాగా, తల్లి పెచ్చియమ్మాల్ ఒక అగ్గి పెట్టెల ఫ్యాక్టరీలో పని చేస్తుంది. చిన్నప్పటి నుంచి రాజా, అతని సోదరుడు సురేశ్ కబడ్డీ బాగా ఆడేవారు. సాయంత్రం ఫిట్నెస్ కోసం స్థానికంగా ఉండే జిమ్‌కు కూడా వారిద్దరు వెళ్లేవారు. రాజా శారీరక సామర్థ్యం, అతని పట్టుదల చూసిన కోచ్ అతడిని భవిష్యత్ బాగుంటుందంటూ వెయిట్‌లిఫ్టింగ్ వైపు మళ్లించాడు. ఇక్కడ అతను కఠోర శ్రమతో లిఫ్టింగ్‌లో ప్రతిభను ప్రదర్శించాడు. ఈ క్రమంలో మైలదుత్తురైలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) హాస్టల్లో అతనికి సీటు లభించింది. ఆపై తగిన శిక్షణ, కోచ్‌ల మార్గనిర్దేశనంలో రాజా ఆట మెరుగైంది. 2017 యూత్/జూనియర్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజతాలతో తొలిసారి రాజాకు గుర్తింపు దక్కింది. 2024లో జాతీయ రికార్డు నెలకొల్పిన అతను గత ఏడాది కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు. గత ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన (299 కేజీలు) నమోదు చేశాడు. 2018 కామన్వెల్త్ క్రీడల్లో ఆరో స్థానంలో నిలిచిన రాజా... 2022 కామన్వెల్త్ క్రీడలకు ముందు కాలికి అనూహ్య గాయంతో పోటీల నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు మూడో ప్రయత్నంలో అతనికి మెడల్ దక్కింది. రాజాకు తమిళనాడు ప్రభుత్వం రూ.30 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించింది. -
రజత రాజా... వెండి జ్ఞానేశ్వరి
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. భారత వెయిట్‌లిఫ్టర్లు ఈ మూడు పతకాలు అందించారు. పురుషుల విభాగంలో రాజా ముత్తుపండి, మహిళల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్‌లకు రజతాలు లభించగా... మణిపూర్ ప్లేయర్ బింద్యారాణి దేవి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం భారత్ ఒక స్వర్ణం, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఆరు పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 42 పతకాలతో (18 స్వర్ణాలు, 9 రజతాలు, 15 కాంస్యాలు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. మహిళల 53 కేజీల కేటగిరీలో జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకం గెలుచుకుంది. స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీల బరువెత్తి (మొత్తం 199 కేజీలు) ఆమె రెండో స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన ఒనోమ్ ఒమొలొలా దీదీ మొత్తం 206 కేజీలు (93+113) స్వర్ణం సాధించి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పగా... రెబెకా గ్రోక్స్ (కెనడా–178 కేజీలు) కాంస్యం అందుకుంది. స్నాచ్‌లో వరుసగా 82, 85, 88 కేజీల బరువుతో తన ప్రదర్శనను మెరుగుపర్చుకున్న జ్ఞానేశ్వరి...క్లీన్ అండ్ జర్క్‌లో కూడా వరుసగా మూడు ప్రయత్నాల్లో 103, 107, 111 కేజీల బరువును ఎత్తింది. వెయిట్‌లిఫ్టింగ్ పురుషుల విభాగంలో భారత్‌కు రాజా ముత్తుపండి రజతంతో మెరిశాడు. పురుషుల 65 కేజీల విభాగంలో రాజా రెండో స్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో 126 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 160 కేజీలు కలిపి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తిన రాజాకు రజతం లభించింది. ఈ ఈవెంట్లో అజ్నిల్ బిన్ బిదిన్ ముహమ్మద్ (మలేసియా) కామన్వెల్త్ రికార్డు 299 కేజీలు (133+166)తో స్వర్ణం గెలుచుకోగా, మోరియా బారు (పవువా న్యూ గినియా; 282 కేజీలు)కు కాంస్యం లభించింది. ఈసారి కాంస్యం.. మహిళల 58 కేజీల కేటగిరీలో బింద్యారాణి దేవి సొరొఖైబమ్కు కాంస్య పతకం దక్కింది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో రజతం గెలుచుకున్న ఆమె ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని బరిలోకి దిగినా... కాంస్యానికే పరిమితమైంది. ఒకదశలో స్వర్ణం దిశగా సాగుతున్నట్లు అనిపించినా... చివర్లో ఆమె తడబడింది. ఓవరాల్‌గా 199 కేజీలు (స్నాచ్‌లో 87 + క్లీన్ అండ్ జర్క్‌లో 112) బరువు ఎత్తిన బింద్యారాణి మూడో స్థానంతో ముగించింది. ఈ పోటీల్లో రఫియతు లవాల్ (నైజీరియా; 229 కేజీలు) కామన్వెల్త్ క్రీడల్లో రికార్డు ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకోగా... ఆన్ సోఫీ (కెనడా; 215 కేజీలు)కు రజతం దక్కింది. బింద్యారాణి గతంలో కామన్వెల్త్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఒక స్వర్ణం, 2 రజతాలు సాధించింది.పోలీస్ ఖాతాలో పతకం... ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌కు చెందిన 23 ఏళ్ల జ్ఞానేశ్వరి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ)గా పని చేస్తోంది. చిన్న వయసులో ముందు పవర్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి చూపించిన ఆమెను వెయిట్‌లిఫ్టింగ్ మరింతగా ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక క్రీడాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జ్ఞానేశ్వరి వెలుగులోకి వచ్చింది. ఎల్రక్టీషియన్ అయిన తండ్రి దీపక్ యాదవ్ ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురైనా... కూతురిని ఆమె లక్ష్యం దిశగా ప్రోత్సహించడంలో ఎప్పుడూ వెనుకాడలేదు. జూనియర్ స్థాయిలో పలు విజయాలతో గుర్తింపు దక్కించుకున్న ఆమె... పాటియాలాలోనే ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో శిక్షణ పొందుతోంది. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 5వ స్థానంలో నిలిచిన జ్ఞానేశ్వరి ఇటీవలే ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకుంది. ఈ కామన్వెల్త్ క్రీడల కోసం గ్లాస్గోలోని పరిస్థితులకు అలవాటు పడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో బర్మింగ్‌హామ్‌లోని వార్లీ వెయిట్‌లిఫ్టింగ్ క్లబ్లో ప్రత్యేకంగా సిద్ధమై ఫలితం సాధించింది.ఫైనల్లో సాజన్ ప్రకాశ్ స్విమ్మింగ్ పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్లో భారత స్టార్ సాజన్ ప్రకాశ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కేరళకు చెందిన ‘డబుల్ ఒలింపియన్’ సాజన్ హీట్–2లో 1ని:58.59 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఆరో ఫాస్టెస్ట్ స్విమ్మర్‌గా సాజన్ ఫైనల్లో చోటు సంపాదించాడు. క్వార్టర్స్‌లో అంకుశ్, సచిన్ పురుషుల బాక్సింగ్ ఈవెంట్లో భారత బాక్సర్లు అంకుశ్, సచిన్ సివాచ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పతకాలు ఖరారు చేసుకోవడానికి విజయం దూరంలో నిలిచారు. 80 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో అంకుశ్ 5:0తో జాన్ జలాన్ (అంటిగ్వా అండ్ బార్బుడా)పై గెలుపొందగా... 60 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో సచిన్ 4:1తో విలియమ్ హెవిట్ (ఇంగ్లండ్)ను ఓడించాడు.నిరాశపరిచిన సమంత మహిళల జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఫైనల్లో భారత జిమ్నాస్ట్ ప్రొతీస్థా సమంత నిరాశ పరిచింది. సమంత 12.883 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. లియా మోనిక (కెనడా; 14.000 పాయింట్లు) స్వర్ణం, అబిగెయిల్ మార్టీన్ (ఇంగ్లండ్; 13.799 పాయింట్లు) రజతం, రోపెర్ (వేల్స్; 13.433 పాయింట్లు) కాంస్యం నెగ్గారు.లాంగ్‌జంప్ ఫైనల్లో శ్రీశంకర్అథ్లెటిక్స్ ఫీల్డ్ ఈవెంట్ లాంగ్‌జంప్‌లో భారత్ నుంచి ఇద్దరు ఫైనల్లోకి అడుగు పెట్టారు. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో రజతం నెగ్గిన శ్రీశంకర్తోపాటు లోకేశ్ సత్యనాథన్ ఫైనల్లోకి ప్రవేశించారు. క్వాలిఫయింగ్‌లో శ్రీశంకర్ 8.01 మీటర్ల దూరం గెంతి నేరుగా ఫైనల్‌కు చేరాడు. క్వాలిఫయింగ్ ప్రమాణం 8 మీటర్ల కావడంతో శ్రీశంకర్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించాడు. లోకేశ్ 7.77 మీటర్ల దూరం గెంతి ఓవరాల్‌గా ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. మరోవైపు పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో తేజస్ శిర్సే కూడా ఫైనల్లోకి ప్రవేశించాడు. హీట్ రేసును తేజస్ 13.76 సెకన్లలో ముగించి ఓవరాల్‌గా ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు. పురుషుల 100 మీటర్ల విభాగంలో జాతీయ చాంపియన్ గురీందర్వీర్ సింగ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. గురీందర్వీర్ 10.39 సెకన్లలో గమ్యానికి చేరి ఓవరాల్‌గా 28వ స్థానంలో నిలిచాడు. -
భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరికి రజతం
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత వెయిట్‌లిఫ్టర్లు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా మహిళల 53 కేజీల విభాగంలో వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ అద్భుత ప్రదర్శనతో రజత పతకం సొంతం చేసుకుంది.ఈ ఈవెంట్ ఆరంభం నుంచే జ్ఞానేశ్వరి అదరగొట్టింది. తొలుత స్నాచ్ విభాగంలో తన మూడో ప్రయత్నంలో 88 కేజీలను ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో కూడా తన జోరును కొనసాగించింది. మొదటి ప్రయత్నంలో 103 కేజీలు, రెండో ప్రయత్నంలో 107 కేజీలు ఎత్తగా.. మూడో ప్రయత్నంలో ఏకంగా 111 కేజీలు లిఫ్ట్ చేసింది. జ్ఞానేశ్వరి మొత్తం 199 కేజీలు (స్నాచ్ 88 కేజీలు + క్లీన్ అండ్ జెర్క్ 111 కేజీలు) లిఫ్ట్ చేసి రెండో స్దానంలో నిలిచి రజతం కైవసం చేసుకుంది. మొత్తం 206 కేజీలు (93 కేజీలు + 113 కేజీలు) ఎత్తిన నైజీరియా అథ్లెట్ ఒనోమే దిదిద్కు స్వర్ణ పతకం దక్కింది. -
కామన్వెల్త్ హీరోకు సీఎం విజయ్ భారీ నజరానా
స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన తమిళనాడు వెయిట్‌లిఫ్టర్ రాజా ముత్తుపాండికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ భారీ నజరానా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.30 లక్షల నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ ముత్తుపాండిని అభినందించారు. ఆయన సాధించిన విజయం తమిళనాడుకు గర్వకారణమని అన్నారు. ముత్తుపాండి విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి రాష్ట్రం, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముత్తుపాండి తమిళనాడులోని కోవిల్పట్టికి చెందినవారు.కాగా, ముత్తుపాండి కామన్వెల్త్ క్రీడల పురుషుల 65 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించాడు.స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలో 126 కిలోలు ఎత్తడంలో విఫలమైన ముత్తుపాండి, రెండో ప్రయత్నంలో అదే బరువును విజయవంతంగా ఎత్తాడు. అనంతరం 129 కిలోల ప్రయత్నం విఫలమైనప్పటికీ, 126 కిలోలతో ఆ విభాగాన్ని ముగించాడు.క్లీన్ అండ్ జర్క్‌లో కూడా తొలి ప్రయత్నంలో 158 కిలోలు ఎత్తలేకపోయిన ముత్తుపాండి, రెండో ప్రయత్నంలో 160 కిలోలు విజయవంతంగా ఎత్తి మొత్తం 286 కిలోల లిఫ్ట్‌తో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. -
మీరాబాయి స్వర్ణం వెనుక దాగున్న కన్నీటిగాథ!
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 48 కేజీల విభాగంలో స్వర్ణంతో మెరిసి ఔరా అనిపించింది. 48 కేజీల కేటగిరీలో మీరాబాయి స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేటగ2ఇరీలో 105 కేజీలు.. మొత్తంగా 190 కేజీల బరువు ఎత్తి దేశానికి తొలి స్వర్ణంప పతకం అందించింది. మీరాబాయికి కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా మూడో పతకం. 2018 గోల్డ్‌కోస్ట్, 2022 బర్మింగ్హమ్ క్రీడల్లోనూ మీరాబాయి పతకాలు సాధించింది. తాజాగా గ్లాస్కో వేదికపై వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం గెలిచిన మీరాబాయి ఫోడియంపై నిలబడ్డ సమయంలో జాతీయ గీతం ఆలపిస్తూ కన్నీటిపర్యంతమవ్వడం వైరల్‌గా మారింది. విజయం తర్వాత మీరాబాయి చాను మాట్లాడుతూ.. ‘వరుసగా మూడోసారి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించినందుకు చాలా ఆనందంగా ఉంది. బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు గత రెండు రోజులుగా ఆహారం ఏమీ తీసుకోలేదు. పసిడి పతకం గెలవడంతో నాపై ఉన్న ఒత్తిడి అంతా పోయింది. నేను చాలా సంతోషంగా, అలాగే చాలా ఉద్వేగంగా ఉన్నాను. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇవాళ పతకం గెలవడం వెనుక ఎన్నో త్యాగాలు చేయడంతో పాటు, ఒత్తిడిని, గాయాలను అధిగమించాను. నేను కామన్వెల్త్ గేమ్స్‌లో రికార్డు నెలకొల్పుతానని అనుకోలేదు. కేవలం నా కోచ్ అప్పగించిన బాధ్యతను పూర్తి చేయడంపై మాత్రమే దృష్టి సారించాను. కష్టకాలంలో నా తల్లితో పాటు కోచ్ విజయ్ శర్మ అండగా నిలిచారు. కుటుంబం, స్నేహితుల నుంచి నాపై చాలా ఒత్తిడి ఉండేది. భారత్‌కు మూడో స్వర్ణం అందించినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ క్రీడల్లో నేను పెద్దగా శ్రమ పెట్టకూడదని అనుకున్నాను, కానీ నా మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాను. నేను చెరో రెండు లిఫ్టులు చేస్తానని కోచ్, నేను భావించాము.’ అని మీరాబాయి వ్యాఖ్యానించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం, ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించిన మీరాబాయి తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించడం ద్వారా కొత్త చరిత్ర లిఖించింది. INDIAN NATIONAL ANTHEM IN GLASGOW 🇮🇳- Mirabai Chanu got emotional after winning the Gold Medal for India in Weightlifting! 🏋️♀️🥺 pic.twitter.com/UfNeFHXg1a— The Khel India (@TheKhelIndia) July 26, 2026 मीराबाई चानू ने CWG 2026 में जीता गोल्ड मेडल CWG गेम्स में चानू की गोल्डन हैट्रिकMirabai Chanu #MirabaiChanu || #GoldMedal #BreakingNews #CWG #mirabaichanu pic.twitter.com/GDCUum3jqY— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) July 26, 2026Read: పాక్ బాక్సర్‌ను చిత్తు చేసి పతకం రేసులో జాదుమణి -
పాక్ బాక్సర్‌ను చిత్తు చేసి పతకం రేసులో జాదుమణి
కామన్వెల్త్ గేమ్స్ 2026లో బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ జాదుమణి పతకం ఆశలు రేపుతున్నాడు. క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన జాదుమణి పతకానికి అడుగుదూరంలో నిలిచాడు. పురుషుల బాక్సింగ్‌లో భారత బాక్సర్ జాదుమణి సింగ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జాదుమణి 5-0తో పాకిస్తాన్ బాక్సర్ సుమామా రెహమాన్‌ను మట్టికరిపించాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం జాదుమణి ఈ విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితమిస్తున్నట్లు తెలిపాడు. "నా విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితం చేస్తున్నాను. పాకిస్థాన్‌పై గెలవడం చాలా గొప్పగా అనిపించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో మరింత మెరుగ్గా రాణించి భారత్‌కు స్వర్ణం సాధించిపెడతాను''అని జాదుమణి పేర్కొన్నాడు. తొలి రౌండ్లో బై లభించిన జాదుమణి రెండో రౌండ్లో స్కాట్లాండ్కు చెందిన ఆరోన్ కల్లెన్పై 5-0తో అజేయ విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రిక్వార్టర్స్‌లో పాకిస్తానీ బాక్సర్‌పై విరుచుకుపడిన జాదుమణి 5-0తో ఏకగ్రీవ విజయాన్ని సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇక జాదుమణి మంగళవారం క్వార్టర్స్ ఫైట్‌లో తలపడనున్నాడు. క్వార్టర్ ఫైనల్లో గెలిచి సెమీస్‌లోకి ప్రవేశిస్తే అతనికి కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్‌లో సెమీఫైనల్లో ఓడిపోయిన ఇద్దరికీ కాంస్య పతకాలు లభిస్తాయి.ఇక మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రీతి పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి దెబోరా మావ్ (కెన్యా) రెండో రౌండ్లోనే చేతులెత్తేసింది. ఇక స్విమ్మింగ్‌లో భారత ఫ్రీస్టయిల్ రిలే జట్టు ఫైనల్‌కు చేరింది. 4X200 ఫ్రీస్టయిల్ రిలే హీట్‌లో దక్షణ్, అనీశ్ గౌడ, ఆర్యన్ నెహ్రా, శ్రీహరి నటరాజ్లతో కూడిన భారత జట్టు 7ని:39.48 సెకన్లలో లక్ష్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్ ఫైనల్లో భారత ప్లేయర్ తపన్ మొహంతి 70.100 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు. లాన్ బౌల్స్‌లో మహిళల పెయిర్ ఈవెంట్లో రూపా రాణి–పింకీ సింగ్ (భారత్) జోడీ, పురుషుల సింగిల్స్‌లో పుతుల్ సోనోవాల్ (భారత్) పరాజయాలు చవిచూసి ముందంజ వేయడంలో విఫలమయ్యారు. 🚨 INDIA’S JADUMANI SINGH THRASHED PAKISTANI BOXER 5-0 AT COMMONWEALTH GAMES 2026 🇮🇳🔥Jadumani Singh Mandengbam said - "I dedicate my win to the Kargil heroes. I felt great winning against Pakistan."Another day, Another humiliation for Pakistan 😅pic.twitter.com/1REqzhnEoe— Ajay Jadeja (@AjayJadeja171) July 27, 2026 -
‘వెండి’ కెరటం.. మోచేయి విరిగినా పట్టువదలని విక్రమార్కుడు!
కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మూడో పతకం వచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి పురుషుల 65 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రాజా ముత్తుపాండి రజతం గెలుచుకున్నాడు. 26 ఏళ్ల రాజా ముత్తుపాండి స్నాచ్ విభాగంలో 126 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 160 కేజీలు ఎత్తి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తి వెండిని కొల్లగొట్టాడు. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి పతకం కొల్లగొట్టిన రాజా ముత్తుపాండి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. మరి ఎవరీ రాజా ముత్తుపాండి? అతడి నేపథ్యం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.తొలి ప్రయత్నంలోనే స్వర్ణం..జనవరి 12, 2000న జన్మించిన రాజా ముత్తుపాండి, ఇండియన్ రైల్వేస్‌కు వెయిట్‌లిఫ్టర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2017లో కామన్వెల్త్ యూత్/జూనియర్ ఛాంపియన్‌షిప్‌లలో స్వర్ణ, రజత పతకాలతో రాజా ముత్తుపాండి తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత 2019, 2022లో జాతీయ టైటిళ్లను గెలుచుకున్న ముత్తుపాండి వెయిట్‌లిఫ్టింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. మోచేతికి తీవ్రగాయం..అయితే కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడే 2019లో రాజా ముత్తుపాండి మోచేతి గాయానికి గురయ్యాడు. మోచేతి లిగ్మెంట్‌లో చీలిక రావడంతో బరువులు ఎత్తొద్దని డాక్టర్లు చెప్పడంతో రాజా ముత్తుపాండి కెరీర్ ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ రెండేళ్ల పాటు ఆటకు దూరంగా ఉన్న రాజా ముత్తుపాండి పట్టువదలని విక్రమార్కుడిలా మోచేతి గాయం నుంచి కోలుకొని తన ప్రస్థానాన్ని మళ్లీ మొదటి నుంచే మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రాజా ముత్తుపాండి 2024లో రాజా 61 కేజీల విభాగంలో 289 కేజీల బరువు ఎత్తి జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. ఇక 2025లో అహ్మదాబాద్‌లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో (296 కేజీల బరువు ఎత్తి) రజతం గెలుచుకున్నాడు. నార్వేలోని ఫోర్డేలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో 65 కేజీల విభాగంలో తొమ్మిదవ స్థానంలో నిలిచిన రాజా ముత్తుపాండి 299 కేజీల (130 కేజీల స్నాచ్ + 169 కేజీల క్లీన్ అండ్ జర్క్) బరువు ఎత్తి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. తద్వారా 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు రాజా ముత్తుపాండి ఉవ్విళ్లూరుతున్నాడు. ఇదే ఏడాది సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 302 కేజీల బరువు ఎత్తిన రాజా ముత్తుపాండి జాతీయ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. Proud Moment for Indian Weightlifting!Many congratulations to Raja Muthupandi for clinching Silver in Men's 65kg Weightlifting. #Cheer4Bharat #CWG2026 pic.twitter.com/qjldVR9ja5— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 27, 2026CWG 2026: On winning the silver medal in the men's 65kg weightlifting event at the Commonwealth Games 2026, Muthupandi Raja says, "I did not perform well enough to win the gold, and it was not my best compared to how I had been performing in training. Still, I am happy to have… pic.twitter.com/OEuklfSq3h— IANS (@ians_india) July 26, 2026 -
CWG 2026: వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్లు అదరగొడుతున్నారు. ఈ విభాగం నుంచి ఇప్పటికే రెండు పతకాలు రాగా, తాజగా మూడో పతకం వచ్చి చేరింది. ఆదివారం రాత్రి పురుషుల 65 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రాజా ముత్తుపాండి రజతం గెలుచుకున్నాడు. 26 ఏళ్ల రాజా ముత్తుపాండి స్నాచ్ విభాగంలో 126 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 160 కేజీలు ఎత్తి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తి వెండిని కొల్లగొట్టాడు. మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిదిన్ 299 కేజీల (133+166) బరువు ఎత్తి వరుసగా మూడో సారి స్వర్ణం గెలుచుకోవగా, పపువా న్యూ గినియాకు చెందిన మోరియా బారు 282 కేజీల (125+157 ) బరువు ఎత్తి కాంస్యం కైవసం చేసుకున్నాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇప్పటికే మీరాబాయి చాను స్వర్ణం గెలుచుకోగా, 60 కేజీల విభాగంలో రిషికాంత్ సింగ్ రజతం సాధించాడు. ఓవరాల్‌గా స్వర్ణం, రెండు రజతం, ఒక కాంస్యంతో మొత్తం నాలుగు పతకాలు వచ్చి చేరాయి. Another lift. Another medal. 🥈 Raja Muthupandi muscles his way to Commonwealth Games silver in the Men's 65kg event. 🏋️♂️ Watch the Commonwealth Games 2026 TODAY, 2 PM onwards, LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels and Sony LIV#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/SUTs7cv1mH— Sony Sports Network (@SonySportsNetwk) July 26, 2026 #WATCH | Scotland | Glasgow Commonwealth Games 2026 | On winning the silver medal in men's 65kg weightlifting final, Indian weightlifter Raja Muthupandi says, "... I am certainly disappointed because my coach had placed his trust in me, believing we would put in the full effort… pic.twitter.com/hRcmht7xnc— ANI (@ANI) July 26, 2026 -
Commonwealth Games: మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్
గ్లాస్గోలో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను గోల్డ్‌మెడల్ కైవసం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయికి ఇది వరుసగా మూడో బంగారు పతకం కావడం విశేషం. ఇంతకుముందు 2018 గోల్డ్ కోస్ట్, 2022 బర్మింగ్‌హామ్‌లోనూ ఆమె స్వర్ణ పతకం కొల్లగొట్టింది. కామన్వెల్త్ గేమ్స్‌లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళా వెయిట్‌లిఫ్టర్‌గా మీరా చరిత్ర సృష్టించింది.మీరాబాయి సరికొత్త రికార్డుమీరాబాయి స్నాచ్ విభాగంలో తన తొలి ప్రయత్నంలో 82 కేజీలు ఎత్తడంలో విఫలమైంది. కానీ రెండో సారి ఆ బరువును విజయవంతంగా లిఫ్ట్ చేసింది. ఆ తర్వాత తన మూడో ప్రయత్నంలో ఏకంగా 85 కేజీల భారాన్ని ఎత్తి అందరిని ఆశ్చర్యపరిచింది. అనంతరం క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో కూడా తొలి ప్రయత్నంలో విఫలమైంది.రెండో ప్రయత్నంలో 105 కేజీల బరువును అత్యంత సునాయాసంగా ఎత్తి కామన్వెల్త్ గేమ్స్‌లో సరికొత్త రికార్డు సాధించింది. 31 ఏళ్ల మీరాబాయి చాను ఓవరాల్‌గా 190 కేజీల భారాన్ని బంగారు పతకాన్న కైవసం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో అత్యధిక వెయిట్ లిఫ్ట్ చేసిన మహిళా లిప్టర్‌గా మీరా నిలిచింది.Mirabai Chanu sets a new Commonwealth record, snatching 85 kg / 187 lbs!#Mirabaichanu #commonwealthgames #weightliftingpic.twitter.com/dGykrz997s— Female In Sports (@femalesports_in) July 26, 2026 -
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. పురుషల వెయిట్‌లిఫ్టింగ్ 60 కేజీల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ చనంబమ్ రిషికాంత్ సింగ్ రజత పతకం సాధించాడు. ఈ ఈవెంట్లో రిషికాంతకు ప్రధాన పోటీదారుడిగా నిలిచిన మలేషియా అథ్లెట్ అనిక్ కస్దాన్కు గోల్డ్‌మెడల్ దక్కింది.కాగా తొలుత స్నాచ్ విభాగంలో రిషికాంత, అనిక్ కస్దాన్లు ఇద్దరూ అత్యధికంగా 121 కేజీల బరువును ఎత్తి ఇద్దరూ అగ్రస్ధానంలో నిలిచారు. క్లీన్ అండ్ జెర్క్‌లో మాత్రం కస్దాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. రిషికాంత తన అత్యుత్తమ ప్రయత్నంలో 143 కేజీలు మాత్రమే ఎత్తగా, కస్దాన్ 152 కేజీల బరువును ఎత్తి అందరిని ఆశ్చర్యపరిచాడు. కస్దాన్ మొత్తం 273 కేజీల (121kg+152kg) బరువు ఎత్తి అగ్రస్ధానంలో నిలవగా.. రిషికాంత మొత్తం 264 కేజీల (121kg+143kg) రెండో స్ధానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన జోషువా అముంగా మబోయా 260 కేజీల మొత్తం స్కోరుతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. -
కామన్వెల్త్ గేమ్స్‌లో అపశ్రుతి.. జిమ్నాస్టిక్స్‌లో భయానక దృశ్యం!
కామన్వెల్త్ గేమ్స్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. జిమ్నాస్టిక్స్ ఫైనల్ ఈవెంట్ సందర్భంగా ఇంగ్లండ్ జిమ్నాస్ట్ గాబ్రియెల్ లాంగ్టన్ హారిజంటల్ బార్‌పై పట్టు కోల్పోయి తలకిందులుగా మ్యాట్‌పైకి జారిపడ్డాడు. దీంతో అతడి మెడకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. సపోర్ట్ స్టాఫ్ వచ్చి లాంగ్టన్కు అత్యవసర చికిత్స అందించారు. Photo Credit: CWG 2026 Twitterఆ తర్వాత లాంగ్టన్ లేవడానికి ఇబ్బంది పడడంతో స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. లాంగ్టన్ కిందపడడంతో కాసేపు భయానక వాతావరణం నెలకొనడంతో పోటీలు నిలిపివేశారు. ఇప్పటికే గాయంతో ఆరుసార్లు ఒలింపిక్ విజేత మాక్స్ విట్లాక్ దూరమవ్వడంతో అతడి స్థానంలో లాంగ్టన్కు అవకాశమిచ్చారు.వరుసగా నాలుగో కామన్వెల్త్ గేమ్స్ పురుషుల టీం టైటిల్ కోసం ఇంగ్లండ్ ప్రయత్నిస్తున్న సమయంలో చివరి రౌండ్లో లాంగ్టన్ గాయపడడం ఇంగ్లండ్‌ను దెబ్బతీసింది. ఆ తర్వాత లాంగ్టన్ లేకుండానే పోటీలు పూర్తి చేసిన ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచి వెండి పతకం గెలుచుకోగా, కెనడా, ఆస్ట్రేలియా జట్లు స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాయి. Photo Credit: CWG 2026 Twitterఇక గాబ్రియెల్ లాంగ్టన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఇంగ్లండ్ టీమ్ ప్రకటించింది. అతడి పరిస్థితి మెరుగ్గానే ఉందని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని తెలిపింది. లాంగ్టన్ గాయాలతో పోటీకి దూరమైనప్పటికీ, తన జట్టు సిల్వర్ మెడల్ సాధించడంతో సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తున్నట్లు ఇంగ్లం్ టీమ్ వెల్లడించింది. 🚨NEWS: English gymnast Gabriel Langton has been rushed to hospital after suffering a major fall during the Commonwealth Games pic.twitter.com/bXsMusO5fF— Basil the Great (@BasilTheGreat) July 25, 2026చదవండి: ఆటలోనే కాదు ఆ విషయంలోనూ మెస్సీ కింగే! -
ఝండూ పవర్
గ్లాస్గో: పారా పవర్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకంతో బోణీ చేస్తూ కామన్వెల్త్ క్రీడల పతకాల జాబితాలో భారత్ కూడా చేరింది. పురుషుల హెవీ వెయిట్ కేటగిరీలో భారత్‌కు చెందిన ఝండూ కుమార్ కాంస్యం (130.9 పాయింట్లు) సొంతం చేసుకున్నాడు. ఈ పోటిల్లో భారత్‌కు ఇదే తొలి పతకం తన రెండో ప్రయత్నంలో 190 కేజీల బరువెత్తి ఝండూ కుమార్ మూడో స్థానంలో నిలిచాడు. మొదటి ప్రయత్నంలో 181 కేజీల బరువెత్తిన అతను రెండో ప్రయత్నంలో దానిని మరింత మెరుగుపర్చుకున్నాడు. చివరి ప్రయత్నంలో 196 కేజీల కోసం ప్రయత్నించినా అతను విఫలమయ్యాడు. ఈ ఈవెంట్లో రిలువాన్ ఇద్రీస్ (208 కేజీలు; నైజీరియా) స్వర్ణం గెలుచుకోగా, మాథ్యూ హార్డింగ్ (199 కేజీలు; ఇంగ్లండ్)కు రజతం దక్కింది. ఇదే విభాగంలో పోటీ పడిన మరో ఆరుగురు భారత పవర్‌లిఫ్టర్లు పతకం సాధించడంలో విఫలమయ్యారు. పారా పవర్ లిఫ్టింగ్ పురుషుల లైట్ వెయిట్ విభాగంలో భారత్ లిఫ్టర్ అశోక్ కుమార్ నాలుగో స్థానంలో నిలిచి పతకం చేజార్చుకున్నాడు. ఇతర ఫలితాలు→ భారత బాక్సర్ సచిన్ సివాచ్ (62 కేజీలు) 4–1తో అహ్మదీ (కెనడా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. → మహిళల బౌల్స్ పెయిర్ ఈవెంట్లో భారత జోడి రూపా రాణి – పింకీ సింగ్ ‘టైబ్రేకర్’లో టోంగాపై గెలిచింది. → పురుషుల స్విమ్మింగ్ (400 మీ. ఫ్రీస్టయిల్)లో భారత స్విమ్మర్లు ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. దక్షణ్ శశికుమార్ 15వ, ఆర్యన్ 6వ స్థానంతో ముగించారు. → మహిళల 3X3 వీల్ చెయిర్ బాస్కెట్‌బాల్ ఈవెంట్ తొలి మ్యాచ్‌లో భారత్ 1–16 తేడాలో వేల్స్ చేతుల్లో చిత్తుగా ఓడింది. → పురుషుల బౌల్స్ ఈవెంట్ సింగిల్స్‌లో భారత ఆటగాడు పుతుల్ సోనోవాల్ 4–8, 8–9 స్కోరుతో ఇజ్జత్ జుల్కెప్లె (మలేసియా) చేతిలో ఓడాడు. దక్షిణాఫ్రికా స్విమ్మర్ చాడ్ లి క్లోజ్ ఖాతాలో 19వ కామన్వెల్త్ పతకం చేరింది. తద్వారా ఈ పోటీల్లో అత్యధిక పతకాలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు షూటర్లు ఫిల్ ఆడమ్స్, గౌల్ట్ (18 పతకాలు) పేరిట ఉంది.అవమాన కుమార్!!! అతని అసలు పేరు అవినాశ్ కుమార్. అయితే ఐదేళ్ల వయసులో పోలియోబారిన పడి నడుం కిందిభాగం చచ్చుబడిపోయింది. ‘నువ్వు తండ్రికి భారంగా పుట్టావు. అతడి పరువు తీశావు’ అంటూ కొందరు బంధువులు ఝండ్ (అవమానం) అంటూ పిలవడం మొదలుపెట్టారు. చిన్నప్పుడు రికార్డుల్లో కూడా ఇదే పేరు నమోదు కావడంతో చివరకు అసలు పేరు పోయి అతను ఝండూ కుమార్‌గా మారాడు! స్వస్థలం బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా హర్నౌత్. తండ్రి కూరగాయలు అమ్మగా వచ్చే ఆదాయంతో జీవనం సాగే పరిస్థితుల్లో అతను చిన్నప్పటి నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడు. అయితే కఠోర శ్రమతో, పట్టుదలతో వాటిని అధిగమించాడు. కుటుంబ పోషణకు తాను కూడా కూరగాయాలు అమ్మాడు. ఉదయం 4 గంటలకే 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హోల్‌సేల్ మార్కెట్లో కూరగాయలు తెచ్చుకొని హర్నౌత్లో ఫుట్‌పాత్‌పై అమ్మడం అతని రోజూవారీ దినచర్య. 4 గంటల వరకు అమ్మకం ముగించి ఆ తర్వాత జిమ్‌కు వెళ్లడం, ప్రాక్టీస్ చేయడంతోనే పవర్‌లిఫ్టింగ్‌లో అతను రాటుదేలాడు. కాళ్లు లేకపోయినా శారీరక సౌష్టవం పెంచుకోగలననే నమ్మకంతో తన ట్రైసైకిల్‌ను దాదాపు కిలోమీటర్ తోసుకుంటూ జిమ్‌కు వెళ్లి ఝండూ సాధన చేశాడు. అయితే ఆర్థిక సమస్యలు మరింత పెరగడంతో బ్యాటరీ ఈ–రిక్షా నడిపి కొంత ఆదాయం పొందే ప్రయత్నం చేశాడు. గాందీనగర్‌లోని స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో అవకాశం లభించడంతో అతని జీవితం మారింది. ఏడాది క్రితం 205 కిలోల బరువెత్తి కొత్త జాతీయ రికార్డు సాధించిన ఝండూ ఆ తర్వాత 206 కేజీలతో దానిని సవరించాడు. ప్రపంచ కప్‌లో కాంస్యం, ఆసియా ఓషియానియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన ఝండూ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. -
కామన్వెల్త్ క్రీడల్లో సరికొత్త చరిత్ర
దక్షిణాఫ్రికా స్టార్ స్విమ్మర్ చాడ్ లే క్లోస్ (Chad le Clos) కామన్వెల్త్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ క్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన పురుష అథ్లెట్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న ప్రస్తుత ఎడిషన్‌లో (commonwealth Games 2026) ఈ ఘనత సాధించాడు.పురుషుల 4×100 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో కాంస్య పతకం గెలవడంతో అతడు తన ఖాతాలో 19వ కామన్వెల్త్ పతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ పతకంతో ఆస్ట్రేలియా షూటర్ ఫిల్ అడమ్స్, ఇంగ్లండ్ షూటర్ మిక్ గాల్ట్ పేరిట ఉన్న 18 పతకాల రికార్డును అధిగమించాడు.34 ఏళ్ల క్లోస్ ఇప్పటివరకు కామన్వెల్త్ గేమ్స్‌లో 7 స్వర్ణాలు, 4 రజతాలు, 8 కాంస్యాలు సహా మొత్తం 19 పతకాలు సాధించాడు. 2010లో న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌తో అరంగేట్రం చేసిన అతడు అప్పుడే ఐదు పతకాలు గెలిచి సంచలనం సృష్టించాడు. రికార్డు పతకం సాధించిన అనంతరం క్లోస్ భావోద్వేగానికి గురయ్యాడు.ప్రస్తుత ఎడిషన్‌లో క్లోస్ పోటీలు ఇంకా ముగియలేదు. అతడు 50 మీటర్లు, 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్లలో బరిలోకి దిగాల్సి ఉంది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో నాలుగు పతకాలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో 16 టైటిళ్లు గెలిచిన ఈ స్టార్ స్విమ్మర్.. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లోనూ పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. -
కాంస్యంతో మెరిసిన ‘రిక్షావోడు’ .. కామన్వెల్త్లో భారత్ బోణీ
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల బోణీ చేసింది. పురుషుల పారా పవర్‌లిఫ్టింగ్ హెవీవెయిట్ కేటగిరీలో ఝండు కుమార్ కాంస్యంతో మెరిశాడు. గ్రూప్-బి నుంచి బరిలోకి దిగిన ఝండు తన రెండో ప్రయత్నంలో 190 కేజీల బరువును ఎత్తి 130.9 పాయింట్లు స్కోరును సాధించాడు. ఇప్పటివరకు ఝండు కెరీర్లో అత్యుత్తమంగా ఉన్న 198 కేజీల బరువును అధిగమించనప్పటికీ తాజా కామన్వెల్త్ గేమ్స్‌లో మాత్రం కాంస్యాన్ని ఒడిసిపట్టాడు. మూడో ప్రయత్నంలో 196 కేజీల బరువు ఎత్తే ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ తన కంటే ఎక్కువగా ఎవరు బరువు ఎత్తకపోవడంతో గ్రూప్-బి నుంచి తొలి స్థానంలో, ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచి పతకం ఖాయం చేసుకున్నాడు. ఇక నైజీరియాకు చెందిన రిలువాన్ ఇద్రిస్ 208 కిలోల బరువు ఎత్తి 132.8 పాయింట్లు సాధించి పోడియంపై తొలి స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నాడు. ఇక 199 కిలోల బరువు ఎత్తిన ఇంగ్లండ్‌కు చెందిన మాథ్యూ హార్డింగ్ 131 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి వెండిని కైవసం చేసుకున్నాడు. ఇక కాంస్య పతకం గెలుచుకున్న అనంతరం ఝండు కుమార్ మాట్లాడాడు.‘నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. భారత్‌కు ఇది చాలా ముఖ్యం. ఈ గేమ్స్‌లో నాదే దేశానికి తొలి పతకం కావడాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా. జాతీయ జెండాను పోడియంపై చూసినప్పుడు గర్వంగా ఫీలయ్యాను. థాంక్యూ ఇండియా. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నేను పతకం గెలిచిన విషయాన్ని ముందుగా ఇంట్లో అమ్మానాన్నలకు చెప్తాను. అలాగే, చిన్నప్పటి నుంచి నాకు అండగా నిలిచిన నా స్నేహితుడు గౌతమ్ భయ్యాకు కూడా విషయాన్ని చెప్పాలి’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ-రిక్షా నుంచి వెయిట్‌లిఫ్టర్ దాకాపేదరికం విజయకాంక్షను పెంచుతుందనే మాట పారా పవర్‌లిఫ్టర్ ఝండు కుమార్ సాధించిన ఘనత ద్వారా మరోసారి నిరూపితమైంది. హర్నౌత్‌కు చెందిన ఒక కూరగాయల వ్యాపారి కుమారుడైన ఝండు ఒక ఈ-రిక్షా డ్రైవర్‌గా తన జీవితాన్ని ప్రారంభించాడు. హర్నౌత్లోని ది రాక్ స్టార్ జిమ్ యజమాని గౌతమ్ సింగ్ రాకతో ఝండు జీవితం పూర్తిగా మారిపోయింది. ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా పారా గేమ్స్ (కేఐపీజీ)లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. మార్చి 23న జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని వెయిట్‌లిఫ్టింగ్ హాల్లో జరిగిన పురుషుల 72 కేజీల విభాగంలో, ఆ పవర్‌లిఫ్టర్ 206 కేజీల బరువును ఎత్తి తన సొంత జాతీయ రికార్డును బద్దలు కొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. మార్చి 17-18 తేదీలలో నోయిడాలో జరిగిన పారా నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో ఝండు 205 కేజీల బరువును ఎత్తి, సుధీర్ కుమార్ యొక్క 192 కేజీల జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు.పుట్టుకతో పోలియో28 ఏళ్ల అతనికి పుట్టుకతోనే పోలియో సోకిన కాళ్లు ఉన్నాయి. అతని పారా స్పోర్ట్స్ ప్రయాణం 2017లో ప్రారంభమైంది. మొదట్లో, అతను షాట్‌పుట్, డిస్కస్ త్రోలో పోటీపడ్డాడు. ఆ సమయంలో, అతనికి పారా పవర్‌లిఫ్టింగ్ గురించి తెలియదు. F-55 కేటగిరీలో, ఝండు అనేక షాట్పుట్డి, డిస్కస్ త్రో ఈవెంట్లలో పాల్గొని విజయం సాధించాడు, కానీ అతని గమ్యం వేరే చోట ఉండటంతో, విధి అతన్ని ఆ దిశగా నడిపించింది.కష్టాలతో కూడిన ప్రయాణం తర్వాత, అతను గాంధీనగర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(NCOE)కి చేరుకున్నాడు. ప్రముఖ పారా కోచ్ రాజిందర్ సింగ్ రాహేలు మార్గదర్శకత్వంలో పవర్ వెయిట్‌లిఫ్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. డిసెంబర్ 2023లో, KIPG తొలి ఎడిషన్‌లో పవర్‌లిఫ్టింగ్ విభాగంలో ఝండు కుమార్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 2028 లాస్ ఏంజెలెస్ పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమే తన లక్ష్యమని ఝండు కుమార్ పేర్కొన్నాడు.ప్రధాని మోదీ అభినందనలుకామన్వెల్త్ గేమ్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన ఝండు కుమార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు. 'కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్ ఈవెంట్లో కాంస్యం గెలిచిన ఝండు కుమార్‌కు అభినందనలు. అతడి అద్భుత ప్రదర్శనతో భారత్ పతకాల పట్టికను తెరవడం గొప్ప విషయం. అతడి విజయం అపారమైన శక్తికి, అతడి సంకల్పానికి, ఎన్నో ఏళ్ల తరబడి క్రమశిక్షణకు నిదర్శనం. తన జీవితంలో ఎదురైన ప్రతీ సవాల్‌ను అధిగమించి ఇవాళ అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి దేశానికి గర్వకారణంగా నిలిచి భారతీయులందరికి స్ఫూర్తిగా నిలిచాడు.' అని మోదీ కొనియాడారు. A spectacular performance by Jhandu Kumar, who has opened India’s medal tally at the #CWG2026 by winning a Bronze in the Men’s Heavyweight Para Powerlifting event! Congratulations to him. His achievement is a powerful reflection of immense strength, unwavering determination and… pic.twitter.com/kMdkU6RRAF— Narendra Modi (@narendramodi) July 25, 2026 🇮🇳 BRONZE FOR BHARAT! 🥉 Jhandu Kumar opens India’s #CWG2026 medal tally with a massive 190kg lift in Men’s Heavyweight Para Powerlifting. The entire nation is proud! 🇮🇳 #Cheer4Bharat pic.twitter.com/pyZSOZw0uI— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 24, 2026చదవండి: గోళీలాట మాదిరే లాన్ బౌల్స్.. కాని చిన్న ట్విస్ట్! -
CWG 2026: భారత్‌కు షాక్.. స్టార్ జుడో ప్లేయర్‌పై వేటు
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పారా స్విమ్మర్స్ అదరగొట్టారు. ఈతగాళ్లు కార్తీక్ బుడిగిన, అలీ ఇమామ్‌లు ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించారు. పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ S13 విభాగంలో హీట్స్ రేసులో కార్తీక్ 57.10 సెకన్ల సమయంలో మూడో స్థానంలో నిలవగా.. అలీ ఇమామ్ 1:05.32 సెకన్ల టైమింగ్‌తో చివరి క్వాలిఫైయింగ్ స్థానాన్ని దక్కించుకుని ఫైనల్లో అడుగుపెట్టారు. మరోవైపు 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ లో శ్రీహరి నటరాజ్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరగనున్న సెమీఫైనల్స్‌లో శ్రీహరి పాల్గోనున్నాడు.భారత్‌కు షాక్భారత్కు మరో భారీ షాక్ తగిలింది. స్టార్ జుడుకో తులికా మాన్ కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమైంది. డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) ఆమెపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. గతేడాది నుంచి ఆమె డోపింగ్ టెస్ట్‌లకు హాజరు కాకపోవడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్-2022లో తులిక సిల్వర్ మెడల్ సాధించింది. ఇక ఇది ఇలా ఉండగా మరో భారత జుడో ప్లేయర్ అరుణ్ కుమార్ కామన్వెల్త్ క్రీడలకు దూరమయ్యాడు. నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో అతడిపై నాడా నిషేధం విధించింది. -
గోళీలాట మాదిరే లాన్ బౌల్స్.. కాని చిన్న ట్విస్ట్!
ప్రపంచంలో మనకు తెలియని ఆటలు ఎన్నో ఉన్నాయి. క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, వాలీబాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్.. ఇవన్నీ ప్రపంచ క్రీడలుగా విశిష్టతను పొందాయి. కానీ ఒలింపిక్స్ లేదా కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పుడు మాత్రం మనకు తెలియని కొత్త గేమ్స్ కూడా పరిచయమవుతాయి. అలా పరిచయం అయిందే లాన్ బౌల్స్ క్రీడ. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో లాన్ బౌల్స్‌లో భారత్ ఒక స్వర్ణంతో పాటు మరో రజతం గెలవడం ద్వారా మన దేశంలో ఈ ఆట తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఈ ఆట చూడ్డానికి చిన్నప్పుడు మనం ఆడే గోళీలాట మాదిరే ఉంటుంది. కానీ గోళీలాటకు కాస్త భిన్నంగా లాన్ బౌల్స్ ఆట ఉంటుంది.లాన్ బౌల్స్ అనేది ఇంచుమించుగా బౌలింగ్ క్రీడ మాదిరి ఉంటుంది. ఒక ఎండ్ నుంచి రౌండ్ గా ఉన్న బంతులను మరో ఎండ్ లో ఉన్న టార్గెట్ మీదకు వదలాలి. ఎవరిదైతే టార్గెట్ కు దగ్గరగా చేరుకుంటుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇక్కడ టార్గెట్ ను జాక్ గా పిలుస్తారు. ఉదాహరణకు ’బి‘ టీం కంటే కూాడా ’ఎ‘ టీమ్ టార్గెట్ కు సమీపంగా రెండు బాల్స్ ను విసిరితే అప్పుడు ఎ టీంకు రెండు పాయింట్లు లభిస్తాయి. అంటే టార్గెట్ కు ఏ టీంవి ఎక్కువ దగ్గరగా ఉంటే అన్ని పాయింట్స్ ఇస్తారన్నమాట. రూల్స్ ఇలా..ఈ ఆటను సింగిల్స్, డబుల్స్ తో పాటు ముగ్గురు/ నలుగురితో కూడిన జట్టుగానూ ఆడొచ్చు. టీమ్ ఈవెంట్లలో తొలుత బంతిని విసిరే బౌలర్ ను 'లీడ్' అని పిలుస్తారు. ఇక చివర్లో రోల్ చేసే ప్లేయర్‌ను 'స్కిప్' అంటారు. ఇరు జట్లు లేదా ఇద్దరు ప్లేయర్లు తమ బౌల్స్‌ను రోల్ చేయడం పూర్తయిన తర్వాత.. పాయింట్లను లెక్కిస్తారు. జాక్ కు బౌల్ దగ్గరగా వెళ్లడం లేదా తాకడమే ఈ ఆట లక్ష్యం. సింగిల్స్ విభాగంలో ఎవరైతే తొలుత 21 పాయింట్లకు చేరుతారో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇక టీమ్ ఈవెంట్స్‌లో మాత్రం రౌండ్లన్నీ పూర్తయ్యాకనే విజేత ఎవరనేది తేలుస్తారు. జాకు బంతి తగిలిందా? ఎంత దూరంలో నిలిచింది అనేదే ఇక్కడ ప్రధానం. దాని ఆధారంగానే పాయింట్లను నిర్ణయిస్తారు.ఇక లాన్ బౌల్స్ గేమ్‌లో భారత్ శుభారంభం చేసింది. లాన్ బౌల్స్ మహిళల పెయిర్స్ ఈవెంట్లో భారత్ తొలి రౌండ్లో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో భారత జోడీ రూపా రాణి–పింకీ ‘టైబ్రేక్’లో మాల్టాను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ పుతుల్ సోనోవాల్ 5–4, 3–7, 1–0తో ‘టైబ్రేక్’లో 2023 ప్రపంచ చాంపియన్ రియాన్ బెస్టెర్ (కెనడా)పై సంచలన విజయం సాధించాడు. Winning Start for Team India at CWG 2026!🇮🇳🔥Pinki Singh & Rupa Rani Tirkey defeated Malta in a thrilling tie-breaker in the women's pairs lawn bowls event.pic.twitter.com/EiffSZLrXn— Sports Apna 🇮🇳 (@sportsapna1) July 23, 2026Read: విద్యార్థుల నిరసన.. నాన్న మాటలు గుర్తు చేసుకున్న సచిన్ -
కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం.. లాన్ బౌల్స్‌లో భారత్ శుభారంభం
గ్లాస్కో వేదికగా కామన్వెల్త్ గేమ్స్ గురువారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత్ తరఫున వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, లవ్లీనా బొర్గొహైన్ ఫ్లాగ్ బేరర్స్‌గా వ్యవహరించారు. మువ్వన్నెల జెండాను చేతపట్టి వీరిద్దరు ముందు నడవగా, వారిని భారత జట్టు అనుసరించింది. ఇక గేమ్స్ ప్రారంభానికి ముందే బాక్సర్ లవ్లీనా భారత్‌కు పతకం ఖాయం చేయగా, లాన్ బౌల్స్ గేమ్‌లో భారత్ శుభారంభం చేసింది.లాన్ బౌల్స్ మహిళల పెయిర్స్ ఈవెంట్లో భారత్ తొలి రౌండ్లో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో భారత జోడీ రూపా రాణి–పింకీ ‘టైబ్రేక్’లో మాల్టాను ఓడించింది. తొలి సెట్‌ను భారత్ 7–1, రెండో సెట్‌ను మాల్టా 4–3తో గెలుచుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. చివరి బౌల్లో రాణించి పింకీ జట్టును గెలిపించింది. పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ పుతుల్ సోనోవాల్ 5–4, 3–7, 1–0తో ‘టైబ్రేక్’లో 2023 ప్రపంచ చాంపియన్ రియాన్ బెస్టెర్ (కెనడా)పై సంచలన విజయం సాధించాడు. డోపింగ్‌లో పట్టుబడిన భారత ప్లేయర్లు డోపింగ్‌లో పట్టుబడటంతో భారత జూడో క్రీడాకారుడు అరుణ్ కుమార్ కామన్వెల్త్ క్రీడలకు దూరమయ్యాడు. 73 కేజీల విభాగంలో అతను బరిలోకి దిగాల్సి ఉంది. అయితే ఇటీవల నిర్వహించిన డోపింగ్ పరీక్షలో అతను నిషేధిత ఉత్రే్పరకం వాడాడని తేలడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అరుణ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. దాంతో గ్లాస్గోకు వెళ్లాల్సిన భారత టీమ్ నుంచి అతడిని తప్పించారు. ఇక వెయిట్‌లిఫ్టింగ్‌లో పలువురు ఆటగాళ్లు డోపింగ్ నిబంధనలు ఉల్లఘించడంతో భారత్‌కు కేటాయించిన కోటాను 16 నుంచి 11కు తగ్గిస్తూ కామన్వెల్త్ క్రీడల నిర్వాహక మండలి నిర్ణయం తీసుకుంది. అజిత్ (71 కేజీలు), సాయిరాజ్ పరదేశి (88 కేజీలు), హర్చరణ్ సింగ్ (110 కేజీలు), వంశితా వర్మ (86 కేజీలు) డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. A proud moment for India! Led by Flag Bearer Mirabai Chanu and Ceremonial Baton Bearer Lovlina Borgohain, #TeamIndia proudly marches into the Opening Ceremony as the Commonwealth Games 2026 officially begin. Pic credit: @PTUshaOfficial#Cheer4Bharat #CWG2026… pic.twitter.com/w41GmdsmB2— Doordarshan Sports (@ddsportschannel) July 24, 2026 -
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయం
కామన్వెల్త్ గేమ్స్-2026 ఆరంభానికి ముందే భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. బాక్సర్ లవ్లీనా బొర్గొహేన్ నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో బై లభించడంతో ఆమెకు సెమీస్‌కు అర్హత సాధించింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని లవ్లీనా ఖరారు చేసుకుంది. జూలై 31న 75 కిలోల మహిళా విభాగంలో జరిగే సెమీస్ పోటీలో లవ్లీనా తువాలుకు చెందిన తఫాకిని ఎదుర్కోనుంది. కాగా డ్రాలో కేవలం ఐదుగురు అథ్లెట్లు మాత్రమే ఉండటంతో.. బోర్గోహైన్‌తో సహా ముగ్గురు బాక్సర్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించగా, మిగిలిన ఇద్దరు క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో తలపడాల్సి ఉంది. ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరపున 124 మంది అథ్లెట్లు పాల్గోనున్నారు. గురువారం సాయంత్రం కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. -
అచ్చొచ్చిన గేమ్స్ తొలగింపు.. కామన్వెల్త్లో భారత్ షెడ్యూల్ ఇదే
రెండు నెలల పాటు సాగిన ఫిఫా ప్రపంచకప్ యావత్ క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. అయితే ఫిఫా టోర్నీ అలా ముగిసిందో లేదో మరో ప్రపంచ క్రీడా వేడుకకు సమయం ఆసన్నమైంది. మినీ ఒలింపిక్స్‌గా భావించే కామన్వెల్త్ గేమ్స్‌కు నేటి నుంచే తెరలేవనుంది. ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌కు గ్లాస్కో ఆతిథ్యమిస్తోంది. ఇక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ గురువారం నుంచి తమ ఆటను ప్రారంభించనుంది. జూలై 23 నుంచి ఆగస్టు 11 వరకు సాగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఏ విభాగాల్లో పోటీ పడుతుందనేది ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా మూడు విభాగాల్లో భారత్‌కు ఈసారి అధిక పతకాలు వచ్చే అవకాశాలున్నాయి. అథ్లెటిక్స్, బాక్సింగ్‌తో పాటు వెయిట్‌లిఫ్టింగ్ ఇందులో ఉన్నాయి. వ్యక్తిగత విభాగాల్లో నీరజ్ చోప్రా మరోసారి ఫెవరెట్‌గా బరిలోకి దిగుతుండగా, లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్, ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్, రన్నర్ గుల్వీర్ సింగ్‌పై కూడా భారీ ఆశలు ఉన్నాయి. ఇక వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 48 కేజీల విభాగంలో పోటీ పడుతున్న మీరాబాయి చానుపై భారీ అంచనాలున్నాయి. ఈసారి ఆమె స్వర్ణం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మీరాబాయితో పాటు బింద్యారాని దేవి, గ్యానేశ్వరీ యాదవ్‌ల నుంచి కూడా పతకాలు ఆశించొచ్చు. ఇక బాక్సింగ్ విభాగంలో లవ్లీనా బొర్గొహైన్, వరల్డ్ చాంపియన్ జాన్మిన్ లంబోరియాతో పాటు సాక్షి చౌదరీ, ప్రీతి పవార్లపై భారీ అంచనాలున్నాయి. జూడోలో తులికామన్తో పాటు లాన్‌బౌల్స్‌లో బరిలోకి దిగుతున్న జట్టుపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో లాన్‌బౌల్స్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, వెండి పతకం లభించింది. ఈసారి భారత్ లాన్స్బౌల్తోనే కామన్వెల్త్ గేమ్స్‌ను ఆరంభించనుంది.👉2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ సీజన్లో భారత్ 66 పతకాలు (26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలు) సాధించింది. 2022 బర్మింగ్హమ్ గేమ్స్‌లోనూ భారత్ 61 పతకాలతో సత్తా చాటింది. ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలున్నాయి.👉 భారత్‌కు అచ్చొచ్చిన రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, స్క్వాష్, మహిళల టీ20 క్రికెట్, ట్రయాథ్లాన్ వంటి క్రీడలను గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నుంచి తొలగించారు. ఇది భారత స్వర్ణ పతకాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. గత ఎడిషన్‌లో భారత్ గెలిచిన 22 స్వర్ణాలలో 13 స్వర్ణాలు ఈ తొలగించిన క్రీడల నుంచే వచ్చాయి.కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ షెడ్యూల్గురువారం, 23 జూలైలాన్ బౌల్స్: పురుషుల, మహిళల సింగిల్స్ గ్రూప్ దశ (మధ్యాహ్నం 2:00 గంటలకు)శుక్రవారం, 24 జూలైలాన్ బౌల్స్: పురుషుల సింగిల్స్ & మహిళల పెయిర్స్ గ్రూప్ దశ (మధ్యాహ్నం 1 గంటకు)బాక్సింగ్: మధ్యాహ్నం 3:30 గంటలకు - ప్రిలిమినరీ బౌట్స్ (రౌండ్ ఆఫ్ 32 / రౌండ్ ఆఫ్ 16)ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: సాయంత్రం 4:30 గంటలకు - పురుషుల టీమ్ ఫైనల్ & వ్యక్తిగత క్వాలిఫికేషన్పారా పవర్‌లిఫ్టింగ్: పురుషుల & మహిళల లైట్‌వెయిట్ ఫైనల్స్ (సాయంత్రం 5:30 గంటలకు), పురుషుల & మహిళల హెవీవెయిట్ ఫైనల్స్ (రాత్రి 10:30 గంటలకు)స్విమ్మింగ్ / పారా స్విమ్మింగ్: పురుషుల S13 100మీ ఫ్రీస్టైల్ ఫైనల్ & 4x100మీ ఫ్రీస్టైల్ రిలే ఫైనల్ (రాత్రి 11:30 గంటలకు )శనివారం, 25 జూలైలాన్ బౌల్స్: గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు (మధ్యాహ్నం 1:00 గంటకు)బాక్సింగ్: మొదటి రౌండ్ / రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు (మధ్యాహ్నం 3:30 గంటలకు) ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: మహిళల టీమ్ ఫైనల్ & వ్యక్తిగత క్వాలిఫికేషన్ (సాయంత్రం 4:30 గంటలకు) 3x3 వీల్‌చైర్ బాస్కెట్‌బాల్: భారత మహిళలు వర్సెస్ స్కాట్లాండ్ (గ్రూప్ స్టేజ్-రాత్రి 9:30 గంటలకు)స్విమ్మింగ్: పురుషుల S14 200మీ ఫ్రీస్టైల్ ఫైనల్ & 50మీ బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్ (రాత్రి 11:30 గంటలకు)ఆదివారం, 26 జూలైలాన్ బౌల్స్: గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు (మధ్యాహ్నం 1:00 గంటకు)వెయిట్ లిఫ్టింగ్: పురుషుల 60 కేజీల ఫైనల్ (మధ్యాహ్నం 2:00 గంటలకు), మహిళల 48 కేజీల ఫైనల్ (సాయంత్రం 6.30 గంటలకు), పురుషుల 65 కేజీల ఫైనల్ (రాత్రి 11.00 గంటలకు)బాక్సింగ్: రెండవ రౌండ్ మ్యాచ్‌లు (మధ్యాహ్నం 3:30 గంటలకు)ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: పురుషుల వ్యక్తిగత 'ఆల్-రౌండ్' ఫైనల్ (సాయంత్రం 4:30 గంటలకు), మహిళల వ్యక్తిగత 'ఆల్-అరౌండ్' ఫైనల్ (రాత్రి 10:30 గంటలకు)సోమవారం, 27 జూలైలాన్ బౌల్స్: గ్రూప్ దశ (మధ్యాహ్నం 1:00 గంటకు); సెమీ-ఫైనల్స్ (రాత్రి 8:30 గంటలకు)అథ్లెటిక్స్ & పారా అథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు - పురుషుల 400మీ హర్డిల్స్ (రౌండ్ 1), లాంగ్ జంప్ (క్వాలిఫైయింగ్), పురుషుల 110మీ హర్డిల్స్ (రౌండ్ 1), రాత్రి 11:00 గంటలకు - పురుషుల హై జంప్ ఫైనల్, 110మీ హర్డిల్స్ ఫైనల్, మహిళల షాట్ పుట్ F57 ఫైనల్స్విమ్మింగ్: మధ్యాహ్నం 3:00 గంటలకు - పురుషుల 200మీ బటర్‌ఫ్లై హీట్స్; రాత్రి 11:30 గంటలకు - ఫైనల్వెయిట్లిఫ్టింగ్: సాయంత్రం 5:30 గంటలకు - మహిళల 53కిలోల & 58కిలోల విభాగాల ఫైనల్స్, పురుషుల 79కిలోల విభాగం ఫైనల్ (అర్ధరాత్రి 12:30)3x3 వీల్‌చైర్ బాస్కెట్‌బాల్: రాత్రి 9:30 గంటలకు - భారత్ మహిళల జట్టు vs నైజీరియా (గ్రూప్ దశ)మంగళవారం, 28 జూలైలాన్ బౌల్స్: మధ్యాహ్నం 1:00 గంటకు - పతక పోరు మ్యాచ్‌లు (పురుషుల సింగిల్స్ & మహిళల పెయిర్స్), సాయంత్రం 7:30 గంటలకు- పురుషుల పెయిర్స్ & మహిళల సింగిల్స్ గ్రూప్ దశఅథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు - పురుషుల 400మీ రౌండ్ 1, రాత్రి 11:00 గంటలకు - మహిళల హై జంప్ ఫైనల్, పురుషుల 100మీ సెమీ-ఫైనల్స్ & ఫైనల్స్వెయిట్లిఫ్టింగ్: సాయంత్రం 6:30 గంటలకు- మహిళల 63కిలోల విభాగం ఫైనల్; రాత్రి 11:00 గంటలకు - మహిళల 69 కేజీల ఫైనల్బుధవారం, 29 జూలైలాన్ బౌల్స్: మధ్యాహ్నం 1:00 గంటలకు - పురుషుల జంటలు & మహిళల సింగిల్స్ గ్రూప్ దశవెయిట్లిఫ్టింగ్: మధ్యాహ్నం 2:00 గంటలకు - మహిళల 77 కేజీల ఫైనల్; సాయంత్రం 6:30 గంటలకు - పురుషుల 94 కేజీల ఫైనల్అథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు - పురుషుల షాట్‌పుట్ క్వాలిఫైయింగ్, పురుషుల 200 మీటర్ల రౌండ్ 1, రాత్రి 11:00 గంటలకు- పురుషుల లాంగ్ జంప్ ఫైనల్, మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్గురువారం, 30 జూలైలాన్ బౌల్స్: మధ్యాహ్నం 1:00 గంటలకు - పురుషుల పెయిర్స్ & మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ ట్రాక్ సైక్లింగ్: మధ్యాహ్నం 2:30 గంటలకు - క్వాలిఫైయింగ్ రౌండ్లు; రాత్రి 8:30 గంటలకు- టీమ్ పర్స్యూట్ & టీమ్ స్ప్రింట్ ఫైనల్స్అథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు - పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫైయింగ్, పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫైయింగ్, పురుషుల డెకాథ్లాన్, రాత్రి 11:00 గంటలకు - మహిళల డిస్కస్ త్రో ఫైనల్, మహిళల 5000మీ ఫైనల్, పురుషుల షాట్ పుట్ ఫైనల్వెయిట్లిఫ్టింగ్: సాయంత్రం 6:30 గంటలకు - మహిళల +86 కేజీల ఫైనల్; రాత్రి 11:00 గంటలకు- పురుషుల +110 కేజీల ఫైనల్శుక్రవారం, 31 జూలైజూడో: మధ్యాహ్నం 3:30 గంటలకు - ప్రిలిమినరీ రౌండ్లు; రాత్రి 8:30 గంటలకు- ఫైనల్బాక్సింగ్: మధ్యాహ్నం 3:00 గంటలకు - సెమీ-ఫైనల్ బౌట్లుఅథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు - మిక్స్డ్ 4x400మీ రిలే హీట్స్, రాత్రి 11:00 గంటలకు- పురుషుల జావెలిన్ త్రో ఫైనల్, పురుషుల 400మీ హర్డిల్స్ ఫైనల్, పురుషుల 200మీ ఫైనల్శనివారం, 1 ఆగస్టులాన్ బౌల్స్: మధ్యాహ్నం 1:00 గంటలకు - గ్రూప్ స్టేజ్ ; రాత్రి 9:00 గంటలకు-సెమీ-ఫైనల్స్అథ్లెటిక్స్ & పారా అథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు- పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్, మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్ ఫైనల్, పురుషుల 400 మీటర్ల ఫైనల్, రాత్రి 11:00 గంటలకు- పురుషుల పోల్ వాల్ట్ ఫైనల్, పురుషుల 5000 మీటర్ల ఫైనల్, మిక్స్డ్ 4x400 మీటర్ల రిలే ఫైనల్బాక్సింగ్: మధ్యాహ్నం 3:00 గంటలకు& రాత్రి 9:00 గంటలకు - గోల్డ్ మెడల్ ఫైనల్స్ట్రాక్ సైక్లింగ్: రాత్రి 7:30 గంటలకు- వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్ & 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేస్ ఫైనల్ఆదివారం, 2 ఆగస్టుట్రాక్ సైక్లింగ్: మధ్యాహ్నం 1:30 గంటలకు - 1000 మీటర్ల టైమ్ ట్రయల్ ఫైనల్ & 40 కిలోమీటర్ల పాయింట్స్ రేస్జూడో: మధ్యాహ్నం 2:30 గంటలకు- హెవీవెయిట్ ప్రిలిమినరీ రౌండ్స్; సాయంత్రం 7:30 గంటలకు - పతకాల మ్యాచ్లుముగింపు వేడుకలు-రాత్రి 10.30 గంటల నుంచి👉 భారత్‌లో కామన్వెల్త్ గేమ్స్‌కు సంబంధించిన మ్యాచ్‌లన్నీ సోనీ నెట్‌వర్క్‌తో పాటు సోనిలివ్, దూరదర్శన్, డీడీలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.2030లో భారత్ వేదికగా 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యమివ్వ నుంది. ఈ నేపథ్యంలో ఈసారి గ్లాస్గో పోటీల చివరి రోజు తదుపరి గేమ్స్ పతాకాన్ని భారత్‌కు అందిస్తారు. ఈ సందర్భంగా 20 నిమి షాలపాటు సంగీతం, నృత్యంతో పాటు సంప్రదాయక ప్రదర్శనల ద్వారా మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి భారత్ చాటి చెప్పనుంది. దీంట్లో భాగంగా జరిగే కార్యక్రమంలో రష్మిక, మహదేవన్ పాల్గొంటారు. 2030 కామన్వెల్త్ గేమ్స్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న సంగతి తెలిసిందే.


