తాడేపల్లి ; కామన్‌వెల్త్ గేమ్స్-2026 వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల వల్లూరి అజయ బాబు పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో రజత పతకం సాధించడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తండ్రి వారసత్వాన్ని అజయ్ విజయవంతంగా కొనసాగించటం నిజంగా ప్రశంసనీయమన్నారు వైఎస్ జగన్. ఈ మేరకు ట్వీట్ చేశారు.
‘మీ అద్భుతమైన ప్రదర్శన ఆంధ్రప్రదేశ్‌కు మరియు యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధించాలాని కోరుకుంటున్నా. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా’ అని అభినందనలు తెలియజేశారు.
Heartiest congratulations, Valluri Ajaya Babu, on winning the silver medal in the Men's 79 kg weightlifting event at the 2026 Commonwealth Games! Hats off to you for carrying forward the incredible legacy of your father, Valluri Srinivasa Rao Garu.
Your outstanding performance… pic.twitter.com/1O8Ip66ZhY— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2026
కాగా, వెయిట్‌లిఫ్టింగ్ స్నాచ్ కేటగిరీలో 149 కేజీలు ఎత్తిన అజయ బాబు క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 181 కేజీల బరువును ఎత్తాడు. మొత్తంగా రెండు విభాగాలు కలిపి 330 కేజీలు ఎత్తిన అజయ బాబు రెండో స్థానంలో నిలిచాడు. దాంతో రజతం ఒడిసిపట్టుకున్నాడు వల్లూరి అజయ బాబు.
తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం


