breaking news
Valluri Ajaya Babu
-
వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్‌కు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి ; కామన్వెల్త్ గేమ్స్-2026 వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల వల్లూరి అజయ బాబు పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో రజత పతకం సాధించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తండ్రి వారసత్వాన్ని అజయ్ విజయవంతంగా కొనసాగించటం నిజంగా ప్రశంసనీయమన్నారు వైఎస్ జగన్. ఈ మేరకు ట్వీట్ చేశారు.‘మీ అద్భుతమైన ప్రదర్శన ఆంధ్రప్రదేశ్‌కు మరియు యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధించాలాని కోరుకుంటున్నా. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా’ అని అభినందనలు తెలియజేశారు. Heartiest congratulations, Valluri Ajaya Babu, on winning the silver medal in the Men's 79 kg weightlifting event at the 2026 Commonwealth Games! Hats off to you for carrying forward the incredible legacy of your father, Valluri Srinivasa Rao Garu.Your outstanding performance… pic.twitter.com/1O8Ip66ZhY— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2026 కాగా, వెయిట్‌లిఫ్టింగ్ స్నాచ్ కేటగిరీలో 149 కేజీలు ఎత్తిన అజయ బాబు క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 181 కేజీల బరువును ఎత్తాడు. మొత్తంగా రెండు విభాగాలు కలిపి 330 కేజీలు ఎత్తిన అజయ బాబు రెండో స్థానంలో నిలిచాడు. దాంతో రజతం ఒడిసిపట్టుకున్నాడు వల్లూరి అజయ బాబు. తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం -
తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం
కామన్వెల్త్ గేమ్స్-2026 వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత అథ్లెట్లు తమ జోరును ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల వల్లూరి అజయ బాబు పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో రజతం ఒడిసిపట్టాడు. ముందుగా స్నాచ్ కేటగిరీలో 149 కేజీలు ఎత్తిన అజయ బాబు క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 181 కేజీల బరువును ఎత్తాడు. మొత్తంగా రెండు విభాగాలు కలిపి 330 కేజీలు ఎత్తిన అజయ బాబు రెండో స్థానంలో నిలిచాడు. మలేషియాకు చెందిన ఎర్రీ హిదయత్ ముహమ్మద్ 331 కేజీలు (స్నాచ్ 147 కేజీలు+ క్లీన్ అండ్ జెర్క్‌లో 184 కేజీలు) ఎత్తి ఒక్క కేజీ బరువు తేడాతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్ వెయిట్‌లిఫ్టర్ క్రిస్ ముర్రే 325 కేజీల బరువు ఎత్తి కాంస్యం ఒడిసిపట్టాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం కావడం విశేషం. Photo Credit: IOA Twitterతొలి ప్రయత్నంలో హిదయత్ క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 181 కేజీలు ఎత్తగా, ఆ వెంటనే అజయ బాబు కూడా 181 కేజీలు ఎత్తడంతో 330 కేజీల వద్ద సమంగా నిలిచారు. అయితే రెండో ప్రయత్నంలో హిదయత్ 184 కేజీల బరువు ఎత్తగా, అజయ బాబు విఫలమయ్యాడు. దీంతో ఒక్క కేజీ బరువు తేడాతో అజయ బాబు తృటిలో స్వర్ణం చేజార్చుకున్నాడు. ఇక స్నాచ్ విభాగంలో మాత్రం అజయ బాబు 149 కేజీలు ఎత్తగా, హిదయత్ మాత్రం 147 కేజీలకే పరిమితమయ్యాడు.2010లో తండ్రికి కాంస్యంఇక అజయ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కూడా వెయిట్‌లిఫ్టరే కావడం విశేషం. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీనివాసరావు పురుషుల 56 కేజీల విభాగంలో కాంస్య పతకం ఒడిసిపట్టాడు. తాజాగా వల్లూరి అజయ బాబు 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించి తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు పొందాడు. Photo Credit: IOA Twitterవిజయనగరం జిల్లాకు చెందిన అజయ బాబు వెయిట్‌లిఫ్టింగ్‌లో రోజురోజుకు తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంటున్నాడు. 2025 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో ఇదే 79 కేజీల విభాగంలో అజయ బాబు స్వర్ణం సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చాంపియన్‌షిప్ పోటీల్లో అజయ బాబు 335 కేజీలు ( స్నాచ్‌లో 152 కేజీలు+ క్లీన్ అండ్ జెర్క్‌లో 183 కేజీలు) బరువు ఎత్తి పర్సనల్ బెస్ట్ నమోదు చేశాడు. ఈ ప్రదర్శన అతడిని నేరుగా కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించేందుకు ఉపయోగపడింది. 2024 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లోనూ అజయ బాబు డబుల్ స్వర్ణాలతో మెరిశాడు. జూనియర్, సీనియర్ కేటగిరీల్లో 81 కేజీల విభాగంలో అజయ బాబు ఈ ఫీట్ సాధించాడు. #CWG2026 | "It is a mix of happiness and sadness, as I missed out on the gold," says Indian weightlifter Valluri Ajaya Babu after winning silver in the men's 79kg event at the 2026 Commonwealth Games in Glasgow with a total lift of 330kg(Source: ANI) pic.twitter.com/TrdIiENBLL— WION (@WIONews) July 28, 2026Sheer strength on show! 🥈Many congratulations to Khelo India athlete Valluri Ajaya Babu on winning the Silver Medal in the Men's 79kg Weightlifting. With a total lift of 330kg, he also set a Commonwealth Games record in the Snatch. A memorable performance and another proud… pic.twitter.com/GMCQPQtIvm— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 28, 2026


