తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం | Ajaya Babu Won-Silver-CWG 2026-Continue-Father Legacy-Who-Won Bronze 2010 | Sakshi
Sakshi News home page

CWG 2026: తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం

Jul 28 2026 7:38 AM | Updated on Jul 28 2026 8:13 AM

Ajaya Babu Won-Silver-CWG 2026-Continue-Father Legacy-Who-Won Bronze 2010

Photo Credit: IOA Twitter

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 వెయిట్‌లిఫ్టింగ్‌లో భార‌త అథ్లెట్లు త‌మ జోరును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన 21 ఏళ్ల వ‌ల్లూరి అజ‌య బాబు పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ కేట‌గిరీలో ర‌జ‌తం ఒడిసిప‌ట్టాడు. ముందుగా స్నాచ్ కేట‌గిరీలో 149 కేజీలు ఎత్తిన అజ‌య బాబు క్లీన్ అండ్ జెర్క్ కేట‌గిరీలో 181 కేజీల బ‌రువును ఎత్తాడు. మొత్తంగా రెండు విభాగాలు క‌లిపి 330 కేజీలు ఎత్తిన అజ‌య బాబు రెండో స్థానంలో నిలిచాడు. 

మ‌లేషియాకు చెందిన ఎర్రీ హిద‌య‌త్ ముహ‌మ్మ‌ద్ 331 కేజీలు (స్నాచ్ 147 కేజీలు+ క్లీన్ అండ్ జెర్క్‌లో 184 కేజీలు) ఎత్తి ఒక్క కేజీ బరువు తేడాతో స్వ‌ర్ణం కైవ‌సం చేసుకున్నాడు. ఇంగ్లండ్ వెయిట్‌లిఫ్ట‌ర్ క్రిస్ ముర్రే 325 కేజీల బ‌రువు ఎత్తి కాంస్యం ఒడిసిప‌ట్టాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది ఆరో ప‌త‌కం కావ‌డం విశేషం. 


Photo Credit: IOA Twitter

తొలి ప్ర‌య‌త్నంలో హిద‌య‌త్ క్లీన్ అండ్ జెర్క్ కేట‌గిరీలో 181 కేజీలు ఎత్త‌గా,  ఆ వెంట‌నే అజ‌య బాబు కూడా 181 కేజీలు ఎత్త‌డంతో 330 కేజీల వ‌ద్ద స‌మంగా నిలిచారు. అయితే రెండో ప్ర‌య‌త్నంలో హిద‌య‌త్ 184 కేజీల బ‌రువు ఎత్త‌గా, అజ‌య బాబు విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో ఒక్క కేజీ బ‌రువు తేడాతో అజ‌య బాబు తృటిలో స్వ‌ర్ణం చేజార్చుకున్నాడు. ఇక స్నాచ్ విభాగంలో మాత్రం అజ‌య బాబు 149 కేజీలు ఎత్త‌గా, హిద‌య‌త్ మాత్రం 147 కేజీలకే ప‌రిమిత‌మ‌య్యాడు.

2010లో తండ్రికి కాంస్యం
ఇక అజయ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కూడా వెయిట్‌లిఫ్టరే కావడం విశేషం. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో శ్రీనివాసరావు పురుషుల 56 కేజీల విభాగంలో కాంస్య పతకం ఒడిసిపట్టాడు. తాజాగా వల్లూరి అజయ బాబు 2026 కామన్‌వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించి తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు పొందాడు.

 
Photo Credit: IOA Twitter

విజ‌య‌నగ‌రం జిల్లాకు చెందిన అజ‌య బాబు వెయిట్‌లిఫ్టింగ్‌లో రోజురోజుకు త‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను మెరుగుపరుచుకుంటున్నాడు. 2025 కామ‌న్‌వెల్త్ చాంపియ‌న్‌షిప్‌లో ఇదే 79 కేజీల విభాగంలో అజ‌య బాబు స్వ‌ర్ణం సాధించాడు. అహ్మదాబాద్ వేదిక‌గా జ‌రిగిన చాంపియ‌న్‌షిప్ పోటీల్లో అజ‌య బాబు 335 కేజీలు ( స్నాచ్‌లో 152 కేజీలు+ క్లీన్ అండ్ జెర్క్‌లో 183 కేజీలు) బ‌రువు ఎత్తి ప‌ర్స‌న‌ల్ బెస్ట్ న‌మోదు చేశాడు. 

ఈ ప్ర‌ద‌ర్శ‌న అత‌డిని నేరుగా కామ‌న్‌వెల్త్ గేమ్స్‌కు అర్హ‌త సాధించేందుకు ఉప‌యోగ‌ప‌డింది. 2024 కామ‌న్‌వెల్త్ చాంపియ‌న్‌షిప్‌లోనూ అజ‌య బాబు డ‌బుల్ స్వ‌ర్ణాల‌తో మెరిశాడు. జూనియ‌ర్‌, సీనియ‌ర్ కేటగిరీల్లో 81 కేజీల విభాగంలో అజ‌య బాబు ఈ ఫీట్ సాధించాడు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement