breaking news
silver medal
-
దేశానికి పతకం తీసుకొస్తే లైంగిక వేధింపులతో స్వాగతం!
దక్షిణాఫ్రికాలోని సన్ సిటీలో జరిగిన '2026 ఐపీఎఫ్ వరల్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌ల'లో జూనియర్ మహిళల 47 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన 21 ఏళ్ల అథ్లెట్ కీయా కునాల్ బెనర్జీ రజత పతకాన్ని సాధించింది. పోటీ సమయానికి కేవలం 45.70 కేజీల బరువున్న కీయా, తన శరీర బరువుకు మూడు రెట్ల కంటే ఎక్కువ బరువైన 140 కేజీల డెడ్‌లిఫ్ట్‌ను ఎత్తి సంచలనం సృష్టించింది. పవర్‌లిఫ్టింగ్ రంగంలో తన అద్భుత ప్రదర్శనతో భారతదేశానికి కీర్తి తెచ్చిన ఆమెకు కొంతమంది ఆన్లైన్ వేధింపులతో స్వాగతం పలకడం కలకలం రేపింది. ఆమె ఘనతను పొగడాల్సింది పోయి ఆన్లైన్ వేదికగా ఆమె పేరిట నకిలీ ఖాతాలు వెలిశాయి. అంతటితో ఆగకుండా కొంతమంది ఆమె ముఖాన్ని, శరీరాన్ని ఏఐ సాయంతో అసభ్యకరరీతిలో మార్ఫింగ్ చేసి వాటిని వైరల్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. జాతి వివక్ష వ్యాఖ్యలతో ఆమెను మానసికంగా ఒత్తిడికి లోనయ్యేలా చేశారు.ఇదే విషయమై కీయా కునాల్ మాట్లాడుతూ.. "పవర్‌లిఫ్టింగ్ అనేది నన్ను నేను సవాలు చేసుకోవడానికి మాత్రమే తప్ప సోషల్ మీడియా ప్రచారం కోసం కాదు. ఆటలో పోటీ పడి గెలవడమే తప్ప ఇలాంటి వేధింపులతో వచ్చే పేరు, ఫాలోవర్లు నాకొద్దు. నా అనుమతి లేకుండా ఏఐ చిత్రాలను సృష్టించడం దారుణం. డెడ్‌లిఫ్ట్ ఇష్టపడే ఒక సాధారణ అమ్మాయిగా బతికే ప్రశాంతమైన జీవితం మాత్రమే నాకు కావాలి. ప్లీజ్ నన్ను స్వేచ్ఛగా బతకనివ్వండి" అని కీయా కునాల్ బెనర్జీ ఆవేదన వ్యక్తం చేసింది.ఇక కీయా కునాల్ పాల్గొన్న టోర్నమెంట్ విషయానికొస్తే..ఫ్రాన్స్‌కు చెందిన ఇనెస్ హెర్బాక్స్ 165 కేజీలతో స్వర్ణం సాధించగా, ఐర్లాండ్‌కు చెందిన బ్లాత్నైడ్ ఓడ్వైర్ కూడా 140 కేజీలే ఎత్తినప్పటికీ, నియమాల ప్రకారం ఓ'డ్వైర్‌ను అధిగమించి కీయా రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 140 కేజీల డెడ్‌లిఫ్ట్‌తో పాటు స్కౌట్లో 90 కేజీలు, బెంచ్ ప్రెస్‌లో 50 కేజీలు.. మొత్తం కలిపి 280 కేజీల బరువును ఎత్తి ఓవరాల్ విభాగంలో ఐదో స్థానంలో నిలిచింది. పవర్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు పతకం తీసుకొచ్చి దేశ ఖ్యాతిని ఇనుమడింపచేసిన కీయా కునాల్‌కు సంతోషంతో స్వాగతం పలకాల్సింది పోయి నరక కూపంలోకి నెట్టేశారు.वज़न 47 किलो Deadlift 140 किलो !ये हैं Keyaa Banerji!IPF World Championships में 140 KG वजन उठाकर Junior Silver Medal जीतकर Keyaa ने देश का नाम रोशन किया है।ये सिर्फ एक मेडल नहीं, बल्कि मेहनत, अनुशासन और हौसले की जीत है।जब कोई युवा अपने सपने को जुनून बना लेता है, तो… pic.twitter.com/s91X2i3e2U— Ashok Kumar IPS (@AshokKumar_IPS) September 3, 2026Keyaa Banerjee breaks silence on social media fake accounts and impersonation#KeyaaBanerjee #Powerlifting #IndianPowerlifting #IndiaSports pic.twitter.com/iEa7dlZiJo— Sports Today (@SportsTodayofc) September 7, 2026Read: సీపీఎల్‌లో నబీ విధ్వంసం.. ఆ జట్టుకు వరుస విజయాలు! -
మళ్లీ దెబ్బేసిన పతిరగే.. నీరజ్ చోప్రాకు రజతం
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా లుసానే డైమండ్ లీగ్ మీట్లో రజతంతో మెరిశాడు. ఈటెను 88.05 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా సీజన్ బెస్ట్ త్రో నమోదు చేశాడు. కామన్వెల్త్లో స్వర్ణంతో మెరిసిన లంక స్టార్ జావెలిన్ త్రోయర్ రుమేశ్ పతిరగే మరోసారి పసిడి పతకాన్ని కొల్లగొట్టాడు. పతిరగే తన మూడో ప్రయత్నంలో ఈటెను నీరజ్ కంటే 9 సెంటీమీటర్లు ఎక్కువ దూరం విసిరాడు. దీంతో నీరజ్ స్కోరును దాటేసిన పతిరగే తొలి స్థానంలో నిలిచి భారత స్టార్‌ను మరోసారి దెబ్బకొట్టాడు. ఇక గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ మూడో ప్రయత్నంలో ఈటెను 86.61 మీటర్ల దూరం విసిరి బెస్ట్ నమోదు చేయడంతో పాటు కాంస్య పతకం సాధించాడు.కామన్వెల్త్ గేమ్స్‌లో అంత ఫిట్‌గా కనిపించనప్పటికీ నీరజ్ చోప్రా రజతంతో మెరిశాడు. అయితే లుసానే డైమండ్ లీగ్‌లో మాత్రం నీరజ్ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. తొలి రౌండ్లో ఈటెను 83.54 మీటర్లు విసిరి మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఇక రెండో రౌండ్లో 88.05 మీటర్లు విసిరిన నీరజ్ ఈ సీజన్లోనే బెస్ట్ ప్రదర్శన కనబరిచాడు. ఇక లంక స్టార్ పతిరగే 87.06 మీటర్లు విసిరి నీరజ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. పీటర్స్ కూడా 84.76 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. మూడో రౌండ్లో నీరజ్ ఈటెను 83.72 మీటర్లు మాత్రమే విసరగలిగాడు. కానీ పతిరగే మాత్రం ఈటెను 88.14 మీటర్లు విసిరి నీరజ్ స్కోరును దాటేసి అగ్రస్థానంలో నిలిచాడు. నాలుగో రౌండ్లో నీరజ్ ఫౌల్ చేయగా, పతిరగే మాత్రం 86.71 మీటర్ల దూరం విసిరాడు. ఇక పీటర్స్ మాత్రం నాలుగో రౌండ్లో ఈటెను 86.61 మీటర్లు విసిరి తన స్కోరును కాస్త పెంచుకున్నాడు. ఇక చివరి రౌండ్‌కు నీరజ్ దూరంగా ఉన్నాడు. అదే సమయంలో పతిరగే ఫౌల్ చేయగా, మిగతా అథ్లెట్లు 70 నుంచి 80 మీటర్ల మధ్యలోనే విసరడంతో నీరజ్‌కు రజతం ఖరారైంది.కామన్వెల్త్ క్రీడలు ముగిసిన తర్వాత నీరజ్ స్విట్జర్లాండ్‌లోని బీల్లో ఉన్న తన శిక్షణా కేంద్రానికి వెళ్లిపోయాడు. తన కోచ్ జైవీర్ చౌధరీ, ఫిజియో ఇషాన్ మార్వా సమక్షంలో అతను రీహాబిలిటేషన్‌ను కొనసాగించడంతో పాటు ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. బ్రసెల్స్‌లో జరిగే ఫైనల్స్‌కు ఆరుగురు త్రోయర్లు క్వాలిఫై అవుతారు. లుసానే తర్వాత తమ ర్యాంక్‌ను మెరుగపర్చుకునేందుకు ఆటగాళ్లకు ఈ నెల 27 నుంచి జ్యూరిచ్‌లో జరిగే అంచెలో కూడా అవకాశం ఉంది. 2022లో డైమండ్ లీగ్ చాంపియన్‌గా నిలిచిన నీరజ్, ఆ తర్వాత వరుసగా మూడేళ్ల పాటు రెండో స్థానంతో ముగించాడు. లుసానేలో టాప్–3లో నిలవడంతో తొలిసారి భారీ ప్రైజ్‌మనీ ఈవెంట్ వరల్డ్ అథ్లెటిక్స్ అల్టిమేట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు నీరజ్‌కు మార్గం సుగమమయింది.NEERAJ CHOPRA FINISHED 2ND AT THE DIAMOND LEAGUE LAUSANNE! 💎- Season Best throw of 88.05m 🔥🔥🔥 pic.twitter.com/iKbpOS2Li7— The Khel India (@TheKhelIndia) August 21, 2026 NEERAJ CHOPRA FINISHED 2ND AT THE DIAMOND LEAGUE LAUSANNE! 💎- Season Best throw of 88.05m 🔥🔥🔥 pic.twitter.com/iKbpOS2Li7— The Khel India (@TheKhelIndia) August 21, 2026చదవండి: 'భారత్, బ్రెజిల్ మ్యాచ్ బహిష్కరించండి' -
శివానికి రజతం... ఆరుశ్కు కాంస్యం
జైపూర్: జాతీయ సబ్ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ఆదివారం తెలంగాణ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. గ్రూప్–2 బాలికల 100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో కర్రా శివాని రజత పతకం సొంతం చేసుకోగా... గ్రూప్–2 బాలుర 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో ఆరుశ్ దాస్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. శివాని 100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్‌ను 1 నిమిషం 01.28 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. ధీవశ్రీ కేశవన్ (తమిళనాడు; 1ని:00.23 సెకన్లు) స్వర్ణం, ఇంద్రాణి మీనన్ (కేరళ; 1ని:01.66 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నారు. 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్‌ను ఆరుశ్ 29.44 సెకన్లలో ముగించి మూడో స్థానం సంపాదించాడు. క్రిశివ్ దోషి (మధ్యప్రదేశ్; 28.36 సెకన్లు) స్వర్ణం... శ్లోక్ జాధవ్ (కర్ణాటక; 28.45 సెకన్లు) రజతం దక్కించుకున్నారు.ఆదివారంతో ముగిసిన ఈ పోటీల్లో ఓవరాల్‌గా శివాని కర్రా మూడు పతకాలు సాధించింది. అంతకుముందు శివాని 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో రజత పతకం... 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో పసిడి పతకం కైవసం చేసుకుంది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి చెందిన గచ్చిబౌలి స్విమ్మింగ్ స్టేడియంలో కోచ్ ఆయుశ్ యాదవ్ వద్ద శివాని, ఆరుశ్ శిక్షణ తీసుకుంటున్నారు. -
గురునాయుడుకు రజతం
తాష్కెంట్: ఆసియా జూనియర్, యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు ఎస్. గురునాయుడు రజత పతకం (60 కేజీల కేటగిరీ) గెలుచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గురు నాయుడు మొత్తం 265 కేజీల (స్నాచ్ 119 కేజీలు + క్లీన్ అండ్ జర్క్ 146 కేజీలు) బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఇదే ఈవెంట్లో మరో భారత వెయిట్ లిఫ్టర్ తోమ్చు మీటి స్వర్ణం సాధించాడు. తోమ్చు మొత్తం 266 కేజీల (స్నాచ్ 116 కేజీలు + క్లీన్ అండ్ జర్క్ 150 కేజీలు) బరువును ఎత్తి మొదటి స్థానంతో ముగించాడు. -
రజతంతో నీరజ్ ‘సమ్’తృప్తి!
గ్లాస్గో: భారత స్టార్ అథ్లెట్, జావెలియన్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకంతో మెరిశాడు. రెండు ఒలింపిక్ పతకాల విజేత అయిన నీరజ్ స్థాయి, అంచనాలతో పోలిస్తే రెండో స్థానం నిరాశ కలిగించేదే అయినా...సుదీర్ఘ కాలం గాయంతో బాధపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తీరును చూస్తే రజతం సంతృప్తికర ఫలితంగానే చెప్పవచ్చు. క్వాలిఫయింగ్‌లో జావెలిన్ ఆశించిన విధంగా విసరలేకపోయిన నీరజ్ అసలు పోరులో సత్తా చాటాడు. తన రెండో ప్రయత్నంలో బల్లెంను 85.83 మీటర్లు విసిరిన నీరజ్ ఖాతాలో సిల్వర్ మెడల్ చేరింది. తన మొదటి ప్రయత్నంలో 80.97 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన నీరజ్... రెండో ప్రయత్నంలో విసిరిన దూరం పతకాన్ని అందించింది మూడు, నాలుగు ప్రయత్నాల్లో అంతకంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయిన నీరజ్...తర్వాతి రెండు ప్రయత్నాలనూ ఫౌల్‌గా ముగించాడు. ఈ ఈవెంట్లో కాంస్యం కూడా భారత ఆటగాడే గెలుచుకోవడం విశేషం. యశ్వీర్ సింగ్ (85.41 మీ.) తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న శ్రీలంక జావెలిన్ త్రోయర్ రుమేశ్ తరంగ పతిరగేకు స్వర్ణ పతకం లభించింది. పతిరగే విసిరిన జావెలియన్ 89.75 మీటర్లు దూసుకుపోయింది. ఈ సీజన్లో తాను పాల్గొన్న ఎనిమిది ఈవెంట్లలో పతిరగే ఏడు సార్లు మొదటి స్థానంలో నిలవడం విశేషం. యశ్వీర్ తొలి ఐదు ప్రయత్నాల్లో రెండు ఫౌల్స్ సహా తడబాటుకు గురైనా...చివరి ప్రయత్నంలో నమోదు చేసిన దూరం అతనికి కాంస్యాన్ని అందించింది. 12 మంది పాల్గొన్న ఫైనల్లో మరో భారత ఆటగాడు రోహిత్ (81.56 మీ.) ఏడో స్థానంతో ముగించగా... పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ (పాకిస్తాన్) 9వ స్థానానికే పరిమితమయ్యాడు.‘ఫిట్నెస్పరంగా నేను ఇంకా కోలుకునే దశలోనే ఉన్నాను. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు సంతృప్తిగా ఉన్నా. ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో నేను అనుకున్నట్లుగా జావెలిన్ విసరలేకపోయా. కానీ ఇలాంటి చోటా పతకం గెలవడం ఆనందాన్నిచ్చింది. ఆసియా క్రీడలకు ముందు నా ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉంది’ అని నీరజ్ స్పందించాడు.తండ్రి శిక్షణలో...భారత జావెలిన్‌లో నీరజ్ చోప్రా శకం మొదలైన తర్వాత అతని నీడలో మరో ఆటగాడి ప్రదర్శనకు సహజంగానే గుర్తింపు లభించడం లేదు. ఇలాంటి స్థితిలో యశ్వీర్ గెలిచిన కాంస్యం విలువ ఎంతో అమూల్యం. నిజానికి 2021లో నీరజ్ ఒలింపిక్ చాంపియన్‌గా నిలవడానికి కొన్నాళ్ల క్రితం నెలకొల్పిన జూనియర్ ఫెడరేషన్ మీట్ రికార్డును బద్దలు కొట్టడంతోనే యశ్వీర్ మొదటిసారి వెలుగులోకి వచ్చాడు. అయితే ఇంత కాలానికి అతని కష్టానికి ఫలితం లభించింది. రాజస్తాన్‌కు చెందిన యశ్వీర్కు అతని తండ్రి, మాజీ జావెలిన్ త్రోయర్ అయిన రాయ్ సింగ్ కోచ్‌గా మారి మార్గనిర్దేశనం చేశాడు.జాతీయ స్థాయిలో, రైల్వే చాంపియన్‌షిప్‌లలో పలు పతకాలు గెలుచుకొని స్పోర్ట్ కోటాలోనే ఉద్యోగం అందుకున్న రాయ్ సింగ్ కోచింగ్‌లో కూడా ఎన్ఐఎస్ డిప్లొమా హోల్డర్. ఈ అనుభవాన్నంతా అతను తన కొడుకును తీర్చిదిద్దేందుకు ఉపయోగించాడు. తాను పెద్ద స్థాయిలో విజయాలు సాధించలేదని, యశ్వీర్ కామన్వెల్త్, ఆసియా క్రీడలవంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో పతకాలు సాధించాలని కలగన్న రాయ్ సింగ్ అన్ని రకాలుగా శ్రమించి శిక్షణ అందించాడు.ఈవెంట్‌కు ముందు కొడుకును ప్రోత్సహిస్తూ ‘జీవితంలో ఇదే అతి పెద్ద ప్రశ్నగా భావించి సరైన రీతిలో సమాధానం ఇవ్వు. ఇక్కడ పూర్తి సామర్థ్యంతో సత్తా చాటు. ఇక్కడ గెలిస్తే నీ జీవితం మారిపోతుంది. ఎంత బాగా ఆడగలవో ఆడు’ అంటూ ఈవెంట్‌కు ముందు స్ఫూర్తి నింపిన తండ్రికి యశ్వీర్ పతకాన్ని కానుకగా ఇచ్చాడు. -
‘మీ శకం ముగిసిందా?’.. నీరజ్ చోప్రా అదిరిపోయే రిప్లై!
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్ 2026లో రజతం సాధించిన సంగతి తెలిసిందే. ప్రతికూల వాతావరణంలోనూ సీజన్ బెస్ట్ నమోదు చేసిన నీరజ్ ఈటెను 85.83 మీటర్ల దూరం విసిరి వెండి పతకాన్ని ఒడిసిపట్టాడు. ముందే ఊహించినట్లుగా ఈసారి నీరజ్‌కు పోటీ పాకిస్తాన్ ప్లేయర్ అర్షద్ నదీమ్ నుంచి కాకుండా శ్రీలంక అథ్లెట్ రుమేశ్ పతిరగె నుంచే ఎదురయ్యింది. ఈ పోటీలో రుమేశ్ తరంగా పతిరగె 89.75 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సాధించగా, భారత్‌కు చెందిన మరో జావెలిన్ త్రోయర్ యశ్వీర్ సింగ్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో 85.41 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని ఒడిసిపట్టాడు. రజతం సాధించిన అనంతరం తన ప్రదర్శనపై నీరజ్ చోప్రా స్పందించాడు. గాయం పూర్తిగా నయం కాకపోవడం వల్ల మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యానని నీరజ్ తెలిపాడు. ఇదే సమయంలో ‘నీరజ్ మీలో మునుపటి జోష్ కనిపించడం లేదు.. మీ శకం ముగిసినట్లేనా?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి నీరజ్ స్పందిస్తూ.. ‘‘మనం 100 శాతం ఫిట్‌గా ఉన్నప్పుడు ఎంతటి కఠినమైన సవాలునైనా ఎంతో ధైర్యంతో ఎదుర్కొంటాం. కానీ శరీరంలో గాయం ఉన్నప్పుడు ఎక్కడ అది తిరగబెడుతుందోననే భయం ప్రతి త్రోకు ముందు వెంటాడుతుంది. ఈరోజు కూడా అదే జరిగింది. అందుకే చాలా వేగంగా పరిగెత్తకుండా నా శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించాను. పోటీ జరిగిన ప్రాంతంలో వాతావరణం చాలా చల్లగా ఉంది.Photo Credit: SAI Twitterసాధారణంగా ఇలాంటి వాతావరణంలో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం కొంచెం కష్టమే. ఈ ఫైనల్ పోటీలో నాకు ఒక్క మంచి త్రో మాత్రమే వచ్చిందని, మిగిలిన ప్రయత్నాల్లో ఆశించిన స్థాయిలో జావెలిన్ వెళ్లలేదు. విజేతగా నిలిచిన రుమేశ్ తరంగా కూడా ఒక్క అద్భుతమైన త్రోతోనే స్వర్ణాన్ని సాధించాడన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పునరాగమనం నాకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. రాబోయే పోటీల్లో ఈ లోపాలను సరిదిద్దుకుని మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వడమే నా ప్రధాన లక్ష్యం’’ అని స్పష్టం చేశాడు.పదును తగ్గిందా?ఇక నీరజ్ చోప్రా ప్రదర్శనలో పదును తగ్గుతుందా అంటే సమాధానం చెప్పలేని స్థితి. ఎందుకంటే వయసు మీద పడుతుండడంతో నీరజ్‌లో మునుపటి జోష్ కనిపించడం లేదు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నీరజ్ 90 మీటర్ల మార్క్‌ను దాటేందుకు విఫలయత్నం చేశాడు. Photo Credit: SAI Twitterకానీ ఈ ఐదేళ్లలో నీరజ్ అంతర్జాతీయ ఈవెంట్లలో ఒక్కసారి కూడా 90 మీటర్ల మార్క్ అందుకోలేదు. చివరగా 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ ఈవెంట్లో ఈటెను 89.45 మీటర్ల దూరం విసిరి రజతం ఒడిసిపట్టాడు. అప్పుడు కూడా తృటిలో 90 మీటర్ల మార్క్‌ను చేజార్చుకున్నాడు. ఆ తర్వాత వెన్ను నొప్పి బారిన పడిన నీరజ్ కోలుకోలేకోపోయాడు. రీఎంట్రీ తర్వాత నీరజ్‌లో మునుపటి పదును తగ్గిందనే చెప్పొచ్చు.2025 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఈటెను 84.03 మీటర్ల దూరం విసిరిన నీరజ్ 8వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. తాజాగా గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచినప్పటికీ ఈటెను వేసిన దూరం లెక్కిస్తే ఇది నీరజ్ స్థాయికి సరిపోని ప్రదర్శనగా పరిగణించవచ్చు. ప్రస్తుతం నీరజ్ 28 ఏళ్ల వయసు ఉండడం, ఒలింపిక్స్‌కు మరో రెండేళ్ల సమయం ఉండడంతో తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలని ఆశిద్దాం. What a soaring throw by Neeraj Chopra!Heartiest congratulations on winning the Silver medal in the Men's Javelin Throw event at the Commonwealth Games 2026. His relentless pursuit of excellence, competitive spirit and ability to deliver on the biggest stages continue to inspire… pic.twitter.com/FzJRAJbAt0— Anurag Thakur (@ianuragthakur) August 1, 2026 Glasgow, Scotland: On winning the silver medal in the men's javelin throw at the Commonwealth Games 2026, Neeraj Chopra says, "I am very happy. Even when I am dealing with injuries, it feels good to see other Indian javelin throwers performing well. Yash Vir has crossed the… pic.twitter.com/SP5CNfoeax— IANS (@ians_india) July 31, 2026Read: మెడ విరిగినా వెనక్కి తగ్గలేదు.. ఒలింపిక్ గోల్డ్‌ను ముద్దాడాడు! -
జూడోలో మరో పతకం.. భారత్ ఖాతాలో 20వ మెడల్
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతోంది. ఇవాళ ఒక్క రోజే ఇండియన్ ప్లేయర్స్ అదరగొట్టేశారు. జూడోలో ఏకంగా ఒక్క రోజే మూడు పతకాలు సాధించారు. జూడో మహిళల విభాగంలో అస్మితా స్వర్ణం గెలవగా, తాజాగా జూడో పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్ బంగారు పతకాన్ని అందుకున్నాడు. తాజాగా జూడో మహిళల విభాగంలో యామిన్ మౌర్య రజతం సాధించింది. ఈ పతకాలతో జూడోలో ఓకే రోజు మూడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. ఇలా జూడోలో మూడు ఓకే రోజు మూడు పతకాలు రావడం తొలిసారి కావడం విశేషం.ఓకే రోజు మూడు మెడల్స్.. మొత్తానికి 9వ రోజు జూడో అథ్లెట్లు పతకాల పంట పండించారు. జూడో మహిళలు, పురుషుల విభాగాల నుంచి భారత్ ఖాతాలో పతకాలు సాధించారు. జూడో మహిళల 57 కేజీల విభాగంలో యామిన్ మౌర్య.. ఇంగ్లండ్‌కు చెందిన ఎసీలా టోప్రక్ చేతిలో పోరాడి ఓడింది. దీంతో రజతం కైవసం చేసుకుంది. దీంతో ఓవరాల్‌గా భారత్ పతకాల సంఖ్య 20కి చేరినట్లయింది. అంతకుముందే జూడో మహిళల విభాగంలో అస్మితా స్వర్ణం గెలిచి.. జూడోలో స్వర్ణం సాధించిన తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. అంతేకాకుండా పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్ బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఫైనల్ బౌట్లో హర్ష్ సింగ్ ఆస్ట్రేలియాకు చెందిన జోషజవా కట్జ్‌ను చిత్తు చేసి పసిడి పతకం ఒడిసిపట్టాడు. తద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల జూడో విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి అథ్లెట్‌గా హర్ష్ సింగ్ నిలిచాడు. ఇప్పటి వరకు భారత్‌కు ఐదు స్వర్ణాలు చేరాయి. -
CWG 2026: ఫైనల్లో ప్రీతి.. బాక్సింగ్‌లో పతకం ఖాయం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్ ప్రీతి పవార్ దేశానికి పతకం ఖాయం చేసింది. సెమీస్ చేరినప్పుడే పతకం ఖాయమైనప్పటికీ తాజాగా మహిళల 54 కేజీల విభాగంలో ప్రపంచ మూడో ర్యాంకర్ ప్రీతి పవార్ ఫైనల్లో అడుగుపెట్టడంతో భారత్ ఖాతాలో స్వర్ణం లేదా రజతం ఖరారు కానుంది. శుక్రవారం మహిళల 54 కేజీల విభాగంలో సెమీఫైనల్లో ప్రీతి పవార్ 5-0తో జాంబియాకు చెందిన కేథరిన్ వేప్ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. స్వర్ణ పతకం కోసం జరిగే పోరులో కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాడోతో తలపడనుంది. ఫైనల్లో ప్రీతి ఓడినప్పటికీ భారత్‌కు రజతం దక్కనుంది. హర్యానాలోని భివానీకి చెందిన ప్రీతి పవార్ 2022 ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. సెమీస్‌లో విజయం తర్వాత ప్రీతి పవార్ మాట్లాడుతూ.."నేను అనుకున్నది సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. స్వర్ణ పతకం గెలవడానికి రేపు నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. నేను నా పోటీదారులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయను. కామన్వెల్త్ గేమ్స్‌లో నా ప్రతీ ఫైట్‌కు ముందు కోచ్‌తో పర్యవేక్షణలో ప్రత్యేకంగా సన్నద్ధమవుతాను. ఆ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయగలుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది.'' అని ప్రీతి పవార్ తెలిపింది.జూడో క్వార్టర్స్‌లో భారత ప్లేయర్లుజూడోలో రోహిత్ బసిర్, శ్రద్ధా చొపాడేలు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. మొజాంబిక్‌కు చెందిన సామ్యూల్ రిబెరియోను ఇప్పోన్ ద్వారా ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖరారు చేసుకున్నాడు. మరోవైపు జేన్ మసాక్వియోను ఇప్పోన్లో ఓడించిన శ్రద్ధా కూడా క్వార్టర్స్ చేరుకుంది. VIDEO | Glasgow, Scotland: Indian boxer Preeti Pawar in 54 kg category sailed into the Commonwealth Games final by out-punching Zambia's Catherine Mwape in the last-four stage.She says, "I am very happy that I have managed to do what I prepared for. I have to give my best… pic.twitter.com/O1pRkyvgF0— Press Trust of India (@PTI_News) July 31, 2026Read: క్యాచ్ మిస్ కొంపముంచింది.. జట్టును గెలిపించిన జెమీమా! -
తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం
కామన్వెల్త్ గేమ్స్-2026 వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత అథ్లెట్లు తమ జోరును ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల వల్లూరి అజయ బాబు పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో రజతం ఒడిసిపట్టాడు. ముందుగా స్నాచ్ కేటగిరీలో 149 కేజీలు ఎత్తిన అజయ బాబు క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 181 కేజీల బరువును ఎత్తాడు. మొత్తంగా రెండు విభాగాలు కలిపి 330 కేజీలు ఎత్తిన అజయ బాబు రెండో స్థానంలో నిలిచాడు. మలేషియాకు చెందిన ఎర్రీ హిదయత్ ముహమ్మద్ 331 కేజీలు (స్నాచ్ 147 కేజీలు+ క్లీన్ అండ్ జెర్క్‌లో 184 కేజీలు) ఎత్తి ఒక్క కేజీ బరువు తేడాతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్ వెయిట్‌లిఫ్టర్ క్రిస్ ముర్రే 325 కేజీల బరువు ఎత్తి కాంస్యం ఒడిసిపట్టాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం కావడం విశేషం. Photo Credit: IOA Twitterతొలి ప్రయత్నంలో హిదయత్ క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 181 కేజీలు ఎత్తగా, ఆ వెంటనే అజయ బాబు కూడా 181 కేజీలు ఎత్తడంతో 330 కేజీల వద్ద సమంగా నిలిచారు. అయితే రెండో ప్రయత్నంలో హిదయత్ 184 కేజీల బరువు ఎత్తగా, అజయ బాబు విఫలమయ్యాడు. దీంతో ఒక్క కేజీ బరువు తేడాతో అజయ బాబు తృటిలో స్వర్ణం చేజార్చుకున్నాడు. ఇక స్నాచ్ విభాగంలో మాత్రం అజయ బాబు 149 కేజీలు ఎత్తగా, హిదయత్ మాత్రం 147 కేజీలకే పరిమితమయ్యాడు.2010లో తండ్రికి కాంస్యంఇక అజయ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కూడా వెయిట్‌లిఫ్టరే కావడం విశేషం. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీనివాసరావు పురుషుల 56 కేజీల విభాగంలో కాంస్య పతకం ఒడిసిపట్టాడు. తాజాగా వల్లూరి అజయ బాబు 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించి తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు పొందాడు. Photo Credit: IOA Twitterవిజయనగరం జిల్లాకు చెందిన అజయ బాబు వెయిట్‌లిఫ్టింగ్‌లో రోజురోజుకు తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంటున్నాడు. 2025 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో ఇదే 79 కేజీల విభాగంలో అజయ బాబు స్వర్ణం సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చాంపియన్‌షిప్ పోటీల్లో అజయ బాబు 335 కేజీలు ( స్నాచ్‌లో 152 కేజీలు+ క్లీన్ అండ్ జెర్క్‌లో 183 కేజీలు) బరువు ఎత్తి పర్సనల్ బెస్ట్ నమోదు చేశాడు. ఈ ప్రదర్శన అతడిని నేరుగా కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించేందుకు ఉపయోగపడింది. 2024 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లోనూ అజయ బాబు డబుల్ స్వర్ణాలతో మెరిశాడు. జూనియర్, సీనియర్ కేటగిరీల్లో 81 కేజీల విభాగంలో అజయ బాబు ఈ ఫీట్ సాధించాడు. #CWG2026 | "It is a mix of happiness and sadness, as I missed out on the gold," says Indian weightlifter Valluri Ajaya Babu after winning silver in the men's 79kg event at the 2026 Commonwealth Games in Glasgow with a total lift of 330kg(Source: ANI) pic.twitter.com/TrdIiENBLL— WION (@WIONews) July 28, 2026Sheer strength on show! 🥈Many congratulations to Khelo India athlete Valluri Ajaya Babu on winning the Silver Medal in the Men's 79kg Weightlifting. With a total lift of 330kg, he also set a Commonwealth Games record in the Snatch. A memorable performance and another proud… pic.twitter.com/GMCQPQtIvm— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 28, 2026 -
పతకాల జోరు.. డబుల్ డిజిట్ దాటిన భారత్
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు జోరును ప్రదర్శిస్తున్నారు. సోమవారం రాత్రి మరో నాలుగు పతకాలు భారత్ ఖాతాలో చేరడంతో ఆ సంఖ్య పదికి చేరుకుంది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్‌లో వల్లూరు అజయ బాబు 79 కేజీల విభాగంలో రజతం సాధించగా, పురుషుల హైజంప్ విభాగంలో సర్వేశ్ కుషారే రజతం సాధించాడు. ఇక పారా అథ్లెటిక్స్‌లో షాట్‌పుట్ ఎఫ్-57 కేటగిరీలో షర్మిలా ధంకర్ స్వర్ణం సాధించగా, శిల్ప కాంస్యం ఒడిసిపట్టింది. ముఖ్యంగా పారా షాట్ ఫుట్ F57 విభాగంలో భారత స్టార్ అథ్లెట్ షర్మిలా ధనకర్ తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించి బంగారు పతకాన్ని ముద్దాడారు. మరోవైపు పురుషుల హైజంప్ విభాగంలో సర్వేశ్ కుష్వారే సంచలన ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయంతో కామన్వెల్త్ క్రీడల చరిత్రలోనే హైజంప్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా సర్వేశ్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.వీరితో పాటు వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో అజయ బాబు వెండి పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఒకే రోజున అటు పారా అథ్లె టిక్స్, ఇటు ట్రాక్ అండ్ ఫీల్డ్, వెయిట్రిఫ్టింగ్ విభాగాల్లో వరుస పతకాలు వరించడంతో భారత క్రీడాభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఐదో రోజులు ముగిసేసరికి భారత్ రెండు స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు కలిపి మొత్తం 10 పతకాలతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. An exciting end to Day 4 🇮🇳Team India’s Medal Tally Grew to 10! 🙌🥇 Sharmila Dhankar struck gold in Women’s Shot Put F57🥈 Sarvesh Anil Kushare soared to silver in Men’s High Jump🥈 Valluri Ajaya Babu bagged a silver in Men’s 79kg Weightlifting 🥉 Bindyarani Devi… pic.twitter.com/pNUMnAPLo1— Team India (@WeAreTeamIndia) July 27, 2026Heartiest congratulations to Sharmila on scripting history by winning the Gold medal in the Women's Shot Put F57 event at #CWG2026.Becoming India's first-ever Commonwealth Games Gold medallist in Para Athletics is a truly remarkable achievement. Your unwavering determination,… pic.twitter.com/vuUedWlwuF— Sunil Singhi (@SunilSinghiIND) July 28, 2026Silver for Sarvesh! 🥈 Sarvesh Kushare clears 2.25m to clinch the Silver Medal in the Men's High Jump at Glasgow 2026.👏Watch the Commonwealth Games Glasgow 2026 LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #Glasgow2026… pic.twitter.com/3e62CEPb5M— Sony Sports Network (@SonySportsNetwk) July 27, 2026Read: తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం -
కబడ్డీ నుంచి వెయిట్‌లిఫ్టింగ్ వైపు...
రాజా ముత్తుపండి స్వస్థలం తమిళనాడు రాష్ట్రం కోవిల్పట్టి సమీపంలోని శంకరలింగాపురం. తండ్రి ముత్తుపండి రోజూవారీ లేబర్ కాగా, తల్లి పెచ్చియమ్మాల్ ఒక అగ్గి పెట్టెల ఫ్యాక్టరీలో పని చేస్తుంది. చిన్నప్పటి నుంచి రాజా, అతని సోదరుడు సురేశ్ కబడ్డీ బాగా ఆడేవారు. సాయంత్రం ఫిట్నెస్ కోసం స్థానికంగా ఉండే జిమ్‌కు కూడా వారిద్దరు వెళ్లేవారు. రాజా శారీరక సామర్థ్యం, అతని పట్టుదల చూసిన కోచ్ అతడిని భవిష్యత్ బాగుంటుందంటూ వెయిట్‌లిఫ్టింగ్ వైపు మళ్లించాడు. ఇక్కడ అతను కఠోర శ్రమతో లిఫ్టింగ్‌లో ప్రతిభను ప్రదర్శించాడు. ఈ క్రమంలో మైలదుత్తురైలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) హాస్టల్లో అతనికి సీటు లభించింది. ఆపై తగిన శిక్షణ, కోచ్‌ల మార్గనిర్దేశనంలో రాజా ఆట మెరుగైంది. 2017 యూత్/జూనియర్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజతాలతో తొలిసారి రాజాకు గుర్తింపు దక్కింది. 2024లో జాతీయ రికార్డు నెలకొల్పిన అతను గత ఏడాది కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు. గత ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన (299 కేజీలు) నమోదు చేశాడు. 2018 కామన్వెల్త్ క్రీడల్లో ఆరో స్థానంలో నిలిచిన రాజా... 2022 కామన్వెల్త్ క్రీడలకు ముందు కాలికి అనూహ్య గాయంతో పోటీల నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు మూడో ప్రయత్నంలో అతనికి మెడల్ దక్కింది. రాజాకు తమిళనాడు ప్రభుత్వం రూ.30 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించింది. -
భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరికి రజతం
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత వెయిట్‌లిఫ్టర్లు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా మహిళల 53 కేజీల విభాగంలో వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ అద్భుత ప్రదర్శనతో రజత పతకం సొంతం చేసుకుంది.ఈ ఈవెంట్ ఆరంభం నుంచే జ్ఞానేశ్వరి అదరగొట్టింది. తొలుత స్నాచ్ విభాగంలో తన మూడో ప్రయత్నంలో 88 కేజీలను ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో కూడా తన జోరును కొనసాగించింది. మొదటి ప్రయత్నంలో 103 కేజీలు, రెండో ప్రయత్నంలో 107 కేజీలు ఎత్తగా.. మూడో ప్రయత్నంలో ఏకంగా 111 కేజీలు లిఫ్ట్ చేసింది. జ్ఞానేశ్వరి మొత్తం 199 కేజీలు (స్నాచ్ 88 కేజీలు + క్లీన్ అండ్ జెర్క్ 111 కేజీలు) లిఫ్ట్ చేసి రెండో స్దానంలో నిలిచి రజతం కైవసం చేసుకుంది. మొత్తం 206 కేజీలు (93 కేజీలు + 113 కేజీలు) ఎత్తిన నైజీరియా అథ్లెట్ ఒనోమే దిదిద్కు స్వర్ణ పతకం దక్కింది. -
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో పతకం
-
‘వెండి’ కెరటం.. మోచేయి విరిగినా పట్టువదలని విక్రమార్కుడు!
కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మూడో పతకం వచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి పురుషుల 65 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రాజా ముత్తుపాండి రజతం గెలుచుకున్నాడు. 26 ఏళ్ల రాజా ముత్తుపాండి స్నాచ్ విభాగంలో 126 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 160 కేజీలు ఎత్తి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తి వెండిని కొల్లగొట్టాడు. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి పతకం కొల్లగొట్టిన రాజా ముత్తుపాండి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. మరి ఎవరీ రాజా ముత్తుపాండి? అతడి నేపథ్యం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.తొలి ప్రయత్నంలోనే స్వర్ణం..జనవరి 12, 2000న జన్మించిన రాజా ముత్తుపాండి, ఇండియన్ రైల్వేస్‌కు వెయిట్‌లిఫ్టర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2017లో కామన్వెల్త్ యూత్/జూనియర్ ఛాంపియన్‌షిప్‌లలో స్వర్ణ, రజత పతకాలతో రాజా ముత్తుపాండి తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత 2019, 2022లో జాతీయ టైటిళ్లను గెలుచుకున్న ముత్తుపాండి వెయిట్‌లిఫ్టింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. మోచేతికి తీవ్రగాయం..అయితే కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడే 2019లో రాజా ముత్తుపాండి మోచేతి గాయానికి గురయ్యాడు. మోచేతి లిగ్మెంట్‌లో చీలిక రావడంతో బరువులు ఎత్తొద్దని డాక్టర్లు చెప్పడంతో రాజా ముత్తుపాండి కెరీర్ ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ రెండేళ్ల పాటు ఆటకు దూరంగా ఉన్న రాజా ముత్తుపాండి పట్టువదలని విక్రమార్కుడిలా మోచేతి గాయం నుంచి కోలుకొని తన ప్రస్థానాన్ని మళ్లీ మొదటి నుంచే మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రాజా ముత్తుపాండి 2024లో రాజా 61 కేజీల విభాగంలో 289 కేజీల బరువు ఎత్తి జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. ఇక 2025లో అహ్మదాబాద్‌లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో (296 కేజీల బరువు ఎత్తి) రజతం గెలుచుకున్నాడు. నార్వేలోని ఫోర్డేలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో 65 కేజీల విభాగంలో తొమ్మిదవ స్థానంలో నిలిచిన రాజా ముత్తుపాండి 299 కేజీల (130 కేజీల స్నాచ్ + 169 కేజీల క్లీన్ అండ్ జర్క్) బరువు ఎత్తి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. తద్వారా 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు రాజా ముత్తుపాండి ఉవ్విళ్లూరుతున్నాడు. ఇదే ఏడాది సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 302 కేజీల బరువు ఎత్తిన రాజా ముత్తుపాండి జాతీయ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. Proud Moment for Indian Weightlifting!Many congratulations to Raja Muthupandi for clinching Silver in Men's 65kg Weightlifting. #Cheer4Bharat #CWG2026 pic.twitter.com/qjldVR9ja5— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 27, 2026CWG 2026: On winning the silver medal in the men's 65kg weightlifting event at the Commonwealth Games 2026, Muthupandi Raja says, "I did not perform well enough to win the gold, and it was not my best compared to how I had been performing in training. Still, I am happy to have… pic.twitter.com/OEuklfSq3h— IANS (@ians_india) July 26, 2026 -
CWG 2026: వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్లు అదరగొడుతున్నారు. ఈ విభాగం నుంచి ఇప్పటికే రెండు పతకాలు రాగా, తాజగా మూడో పతకం వచ్చి చేరింది. ఆదివారం రాత్రి పురుషుల 65 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రాజా ముత్తుపాండి రజతం గెలుచుకున్నాడు. 26 ఏళ్ల రాజా ముత్తుపాండి స్నాచ్ విభాగంలో 126 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 160 కేజీలు ఎత్తి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తి వెండిని కొల్లగొట్టాడు. మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిదిన్ 299 కేజీల (133+166) బరువు ఎత్తి వరుసగా మూడో సారి స్వర్ణం గెలుచుకోవగా, పపువా న్యూ గినియాకు చెందిన మోరియా బారు 282 కేజీల (125+157 ) బరువు ఎత్తి కాంస్యం కైవసం చేసుకున్నాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇప్పటికే మీరాబాయి చాను స్వర్ణం గెలుచుకోగా, 60 కేజీల విభాగంలో రిషికాంత్ సింగ్ రజతం సాధించాడు. ఓవరాల్‌గా స్వర్ణం, రెండు రజతం, ఒక కాంస్యంతో మొత్తం నాలుగు పతకాలు వచ్చి చేరాయి. Another lift. Another medal. 🥈 Raja Muthupandi muscles his way to Commonwealth Games silver in the Men's 65kg event. 🏋️♂️ Watch the Commonwealth Games 2026 TODAY, 2 PM onwards, LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels and Sony LIV#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/SUTs7cv1mH— Sony Sports Network (@SonySportsNetwk) July 26, 2026 #WATCH | Scotland | Glasgow Commonwealth Games 2026 | On winning the silver medal in men's 65kg weightlifting final, Indian weightlifter Raja Muthupandi says, "... I am certainly disappointed because my coach had placed his trust in me, believing we would put in the full effort… pic.twitter.com/hRcmht7xnc— ANI (@ANI) July 26, 2026 -
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. పురుషల వెయిట్‌లిఫ్టింగ్ 60 కేజీల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ చనంబమ్ రిషికాంత్ సింగ్ రజత పతకం సాధించాడు. ఈ ఈవెంట్లో రిషికాంతకు ప్రధాన పోటీదారుడిగా నిలిచిన మలేషియా అథ్లెట్ అనిక్ కస్దాన్కు గోల్డ్‌మెడల్ దక్కింది.కాగా తొలుత స్నాచ్ విభాగంలో రిషికాంత, అనిక్ కస్దాన్లు ఇద్దరూ అత్యధికంగా 121 కేజీల బరువును ఎత్తి ఇద్దరూ అగ్రస్ధానంలో నిలిచారు. క్లీన్ అండ్ జెర్క్‌లో మాత్రం కస్దాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. రిషికాంత తన అత్యుత్తమ ప్రయత్నంలో 143 కేజీలు మాత్రమే ఎత్తగా, కస్దాన్ 152 కేజీల బరువును ఎత్తి అందరిని ఆశ్చర్యపరిచాడు. కస్దాన్ మొత్తం 273 కేజీల (121kg+152kg) బరువు ఎత్తి అగ్రస్ధానంలో నిలవగా.. రిషికాంత మొత్తం 264 కేజీల (121kg+143kg) రెండో స్ధానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన జోషువా అముంగా మబోయా 260 కేజీల మొత్తం స్కోరుతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. -
భారత్‌కు రజతం
హాంగ్జౌ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ పతకాల బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సంయం విజ్ భారత్‌కు రజత పతకాన్ని అందించింది. చండీగఢ్‌కు చెందిన 22 ఏళ్ల సంయం 243.4 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. యావో కియాన్జున్ (చైనా; 243.6 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా... హనియె (ఇరాన్; 221 పాయింట్లు) కాంస్యం దక్కించుకుంది. భారత్‌కే చెందిన సురుచి సింగ్ 137.6 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. -
రాజా రిత్విక్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: మెనూరెస్ అంతర్జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించాడు. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ టోర్నీలో రాజా రిత్విక్ నిర్నీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని సంపాదించాడు. ఈ టోర్నీలో రిత్విక్ ఐదు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో టాప్ సీడ్, ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మాక్సిమి లగార్డెను రిత్విక్ ఓడించాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ రోహిత్ కృష్ణ (తమిళనాడు) ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు. రోహిత్ కృష్ణ, రిత్విక్ ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానం దక్కించుకున్నా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా రోహిత్ కృష్ణకు టైటిల్ ఖరారైంది. -
భారత్‌కు రజత పతకం
మాడ్రిడ్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–4 టోర్నమెంట్లో భారత జట్టుకు రజత పతకం దక్కింది. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), తానిపర్తి చికిత (తెలంగాణ), ప్రీతిక (మహారాష్ట్ర)తో కూడిన భారత జట్టు ఫైనల్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన తుది పోరులో ప్రపంచ మూడో ర్యాంక్ జ్యోతి–చికిత–ప్రీతిక త్రయం 228–232 పాయింట్ల తేడాతో ప్రపంచ 14వ ర్యాంక్ కొలంబియా జట్టు చేతిలో ఓడింది. కీలక సమయంలో స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోవడంతో... భారత్ జట్టు రజతానికి పరిమితమైంది. ప్రీతిక ఆరుసార్లు పదేసి పాయింట్లు సాధించి జట్టును నడిపించగా.. జ్యోతి మూడుసార్లు మాత్రమే ‘పర్ఫెక్ట్–10’ సాధించింది. సీజన్ ప్రారంభ ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్–1 టోర్నీలో ఈ ముగ్గురితో కూడిన భాతర మహిళల కాంపౌండ్ జట్టు పసిడి పతకం గెలిచింది. ప్రీతిక డబుల్ ధమాకా... టీమ్ విభాగంలో రజతం దక్కించుకున్న భారత టీనేజ్ ఆర్చర్ ప్రీతిక... వ్యక్తిగత విభాగంలో సంచలన ప్రదర్శనతో పతకం సాధించింది. ప్రపంచ 11వ ర్యాంకర్‌ను ఓడించి కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. 17 ఏళ్ల ప్రీతికకు వరల్డ్‌కప్‌లో ఇదే తొలి వ్యక్తిగత పతకం. ఆదివారం కాంస్య పతక పోరులో ప్రీతిక 145–142 పాయింట్ల తేడాతో హజల్ బురున్ (టర్కీ)ను చిత్తుచేసింది. కాంపౌండ్ టీమ్ ఫైనల్లో భారత జట్టు పతకం గెలవడంలో కీలక పాత్ర పోషించిన ప్రీతిక... వ్యక్తిగత విభాగంలో అదే జోరు కొనసాగిస్తూ పోడియంపై నిలిచింది. కాంపౌండ్ విభాగంలో భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరగా... ఇక రికర్వ్ విభాగంలో మరో రెండు పతకాల కోసం ఆదివారం భారత ఆర్చర్లు పోటీపడనున్నారు. భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కృతి శర్మతో కలిసి నేడు బరిలోకి దిగనున్నాడు. రికర్వ్ మహిళల వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు చేరలేకపోయిన కృతి... నేడు కాంస్య పతకం కోసం పోటీ పడనుంది. -
‘పారిస్ పరాజయం పాఠాలు నేర్పింది’
న్యూఢిల్లీ: భారత పిస్టల్ షూటర్ ఇషా సింగ్ ఇటీవల అద్భుత ప్రదర్శనతో అదరగొడుతోంది. మ్యూనిక్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణం సాధించడంతో పాటు మరో ఈవెంట్లో రజతం కూడా గెలుచుకుంది. అయితే తెలంగాణకు చెందిన 21 ఏళ్ల ఇషా రెండేళ్ల క్రితం జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో పూర్తిగా విఫలమైంది. ఆ మెగా ఈవెంట్లో ఓటమితో తాను పాఠాలు నేర్చుకున్నానని, అదే కసితో సాధన చేసి మళ్లీ విజయాల బాట పట్టానని ఆమె వ్యాఖ్యానించింది. ‘ఉదాసీనత వల్లనో లేక అతి విశ్వాసం వల్లనో నేను పారిస్ ఒలింపిక్స్‌లో ఓడిపోలేదు. నేను నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నించాను. దాని గురించే ఆలోచిస్తూ తీవ్రమైన ఒత్తిడిని పెంచుకున్నాను. ఆఖరి షాట్ వరకు కూడా ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఒలింపిక్స్ తర్వాత కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాను. దాని నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగాను. నాటి పరాజయం నన్ను మానసికంగా దృఢంగా మార్చింది’ అని ఇషా గుర్తు చేసుకుంది. మ్యూనిక్‌లో 25 మీటర్ల విభాగంలో స్వర్ణం గెలిచిన ఇషా, 10 మీటర్ల ఈవెంట్లో రజతం అందుకుంది. ‘ఈసారి ఒత్తిడిని అధిగమించి విజయం సాధించగలిగాను. పదేళ్లుగా ఆడుతున్న అనుభవం నాకు ఉపయోగపడింది. ప్రతీసారి గెలుస్తామని బరిలోకి దిగరాదు. టోర్నీ పేరు, వేదికలు మారవచ్చేమో కానీ మనం ఒకే తరహాలో కష్టపడతాం. అందులో ఎలాంటి మార్పు ఉండదని అర్థం చేసుకోవాలి. మానవమాత్రులం కాబట్టి తప్పులు సహజం. కొన్ని సార్లు మనం అనుకున్న విధంగా జరగదు’ అని ఆమె పేర్కొంది. -
భారత రెజ్లర్ లలిత్‌కు రజత పతకం
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్లు లలిత్ (55 కేజీలు) రజత పతకం... సునీల్ (87 కేజీలు) కాంస్య పతకం నెగ్గారు. ఫైనల్లో లలిత్ 0–9తో బొటిరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. కాంస్య పతక బౌట్లో సునీల్ 5–4తో రసులోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచాడు. 77 కేజీల కాంస్య పతక బౌట్లో భారత రెజ్లర్ అమన్ 14–15తో యోంగన్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. -
నికిత్ శ్రీ చక్రికి రజత పతకం
జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో నికిత్ శ్రీ చక్రి ఆకుల సత్తా చాటాడు. రికర్వ్ అండర్-10 బాలుర విభాగంలో రజత పతకం గెలిచాడు. అంతేకాదు జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. ఈ నేపథ్యంలో నికిత్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.2025-26లో నికిత్ శ్రీ చక్రి సాధించిన విజయాలుజాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్ (రికర్వ్ అండర్-10)- సిల్వర్ మెడల్తెలంగాణ రాష్ట్ర ఆర్చరీ చాంపియన్‌షిప్స్ (రికర్వ్ అండర్-10)- సిల్వర్ మెడల్రంగారెడ్డి జిల్లా ఆర్చరీ చాంపియన్‌షిప్ (రికర్వ్ అండర్-10)- గోల్డ్ మెడల్తమిళనాడు స్టేట్ ఓపెనర్ ఆర్చరీ చాంపియన్‌షిప్ (రికర్వ్ అండర్-10)- గోల్డ్ మెడల్సౌత్ ఇండియన్ ఓపెనర్ ఆర్చరీ చాంపియన్‌షిప్ (రికర్వ్ అండర్-10)-గోల్డ్ మెడల్ -
చికిత ఖాతాలో స్వర్ణం, రజతం
బ్యాంకాక్: ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్–1 ఆర్చరీ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత స్వర్ణ, రజత పతకాలతో మెరిసింది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో భారత ఆర్చర్లు మొత్తం 10 పతకాలు సాధించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన 20 ఏళ్ల చికిత కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో రజత్ చౌహాన్‌తో కలిసి పసిడి పతకం సొంతం చేసుకుంది. చికిత, రాజ్ కౌర్, తేజల్ సాల్వేలతో కూడిన మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకాన్ని దక్కించుకుంది. మిక్స్డ్ టీమ్ ఫైనల్లో చికిత–రజత్ చౌహాన్ (భారత్) ద్వయం 158–156తో ఫాతిన్ నూర్‌ఫతే–జువైది (మలేసియా) జంటపై గెలిచింది. కాంపౌండ్ టీమ్ ఫైనల్లో చికిత, రాజ్ కౌర్, తేజల్ బృందం 227–229తో విక్టోరియా, డయానా, రొక్సానాలతో కూడిన కజకిస్తాన్ జట్టు చేతిలో ఓడి రజత పతకాన్ని గెల్చుకుంది. పురుషుల రికర్వ్ టీమ్ ఫైనల్లో దేవాంగ్ గుప్తా, సుఖ్‌చెయిన్ సింగ్, జుయెల్ సర్కార్ (భారత్) బృందం 4–5తో కరిమోవ్, ఇల్ఫాత్, దౌలత్‌కెల్దీ (కజకిస్తాన్) జట్టు చేతిలో ఓడి రజతం నెగ్గింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్‌లో తేజల్ సాల్వే 144–138తో మరియాపై గెలిచింది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు ఉదయ్ కంబోజ్ (స్వర్ణం), ప్రథమేశ్ (రజతం), రజత్ (కాంస్యం) క్లీన్‌స్వీప్ చేశారు. ఫైనల్లో ఉదయ్ కంబోజ్ 145–144తో ప్రథమేశ్‌పై, కాంస్య పతక మ్యాచ్‌లో రజత్ చౌహాన్ 145–144తో పీరావత్ (థాయ్‌లాండ్)పై నెగ్గారు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో రిధి (భారత్) 2–6 సెట్లతో ఒయున్ బసాన్‌దోర్జ్ (మంగోలియా) చేతిలో ఓడి రజతం సొంతం చేసుకుంది. బుధవారం భారత పురుషుల కాంపౌండ్ జట్టు, భారత మహిళల రికర్వ్ జట్టు కాంస్య పతకాలు సాధించాయి. -
సురుచి–సామాట్ర్ జోడీకి రజతం
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. గురువారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురుచి సింగ్–సామ్రాట్ రాణా (భారత్) ద్వయం భారత్‌కు రజత పతకాన్ని అందించింది. 48 షాట్లతో కూడిన ఫైనల్లో సురుచి–సామ్రాట్ జోడీ 479.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. నగీనా సైద్కులోవా–ముఖమ్మద్ కమలోవ్ (ఉజ్బెకిస్తాన్) జంట 481.3 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. అంతకుముందు 10 జోడీల మధ్య 60 షాట్లతో నిర్వహించిన క్వాలిఫయింగ్‌లో సురుచి–సామ్రాట్ 583 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించింది. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు రషి్మక సహగల్ (237.9 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... వన్షిక చౌధరీ (236.7 పాయింట్లు) రజత పతకాన్ని హస్తగతం చేసుకుంది. యూత్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు ప్రియాన్షి పూర్వ (234.8 పాయింట్లు) స్వర్ణం... చహెక్ కోహ్లా (233 పాయింట్లు) రజతం దక్కించుకున్నారు. టీమ్ విభాగాల్లో రష్మిక, వన్షిక, అగం గ్రెవాల్ జట్టు... ప్రియాన్షి, చహెక్, శిక్షా శరణ్ జట్టు పసిడి పతకాలు సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం భారత్ ఖాతాలో పది స్వర్ణాలున్నాయి. -
ఆర్చరీలో చికితకు రజతం
జైపూర్: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ (కేఐయూజీ)లో తెలంగాణ ఆర్చర్ తానిపర్తి చికిత రజత పతకంతో మెరిసింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో చికిత ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఈ క్రీడల్లో చికిత లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ తరఫున బరిలోకి దిగింది. టోర్నీ ఆసాంతం రాణించిన తెలంగాణ ఆర్చర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ అదితి గోపీచంద్ స్వామి (శివాజీ యూనివర్సిటీ) చేతిలో ఓడి రజత పతకం కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో చికిత 143–147తో అదితి చేతిలో పోరాడి ఓడింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పసిడి నెగ్గిన అదితి... ఇక్కడ కూడా అదే జోరు కనబర్చింది. మధుర (కరమ్‌వీర్ పాటిల్ యూనివర్సిటీ)కు కాంస్య పతకం దక్కింది. కాంపౌండ్ టీమ్ విభాగంలో చికిత ప్రాతినిధ్యం వహించిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి స్వర్ణ పతకం దక్కగా... గురు కాశీ యూనివర్సిటీ రజతం, పంజాబ్ యూనివర్సిటీ కాంస్యం గెలుచుకున్నాయి. స్విమ్మింగ్‌లో ఒలింపియన్ శ్రీహరి నటరాజన్ తొమ్మిది పసిడి పతకాలతో సత్తాచాటాడు. రాజస్తాన్‌లోని పలు నగరాల్లో జరుగుతున్న ఈ క్రీడల్లో 222 యూనివర్సిటీలకు చెందిన 4448 మంది అథ్లెట్లు 23 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు. ఐదో రోజు పోటీలు ముగిసేసరికి జైన్ యూనివర్సిటీ 45 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. స్విమ్మింగ్‌లోనే 27 స్వర్ణాలు, 9 రజతాలు, 9 కాంస్యాలు సాధించింది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 22 స్వర్ణాలతో రెండో స్థానంలో ఉంది. -
ఇషా–సామ్రాట్ జోడీకి రజతం
కైరో (ఈజిప్ట్): ఏకాగ్రత కోల్పోకుండా లక్ష్యంపైనే గురి పెడుతూ... ప్రపంచ రైఫిల్, పిస్టల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు తమ పతకాల వేట కొనసాగిస్తున్నారు. పోటీల నాలుగో రోజు భారత్ ఖాతాలో రెండు రజత పతకాలు చేరాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ రజతం నెగ్గగా... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్–సామ్రాట్ రాణా జోడీ రజతం సొంతం చేసుకుంది. 62 జోడీలు పోటీపడ్డ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫయింగ్‌లో ఇషా సింగ్ (తెలంగాణ)–సామ్రాట్ రాణా (హరియాణా) ద్వయం 586 పాయింట్లు... కియాన్జున్ యావో–హు కాయ్ (చైనా) జంట 583 పాయింట్లు స్కోరు చేసి టాప్–2లో నిలిచి ఫైనల్లోకి చేరుకున్నాయి. ఫైనల్లో ఇషా–సామ్రాట్ జోడీ 10–16 స్కోరుతో కియాన్ జున్–హు కాయ్ ద్వయం చేతిలో ఓడిపోయి రజత పతకంతో సంతృప్తి పడింది. ఈ మెగా ఈవెంట్లో సామ్రాట్కిది మూడో పతకం కావడం విశేషం. సోమవారం సామ్రాట్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. చివరి షాట్లో తడబడి...గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన ఐశ్వర్య ప్రతాప్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం మెరిశాడు. 66 మంది పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో ప్రతాప్ 600 పాయింట్లకుగాను 597 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డును సమం చేశాడు. అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందాడు. భారత్‌కే చెందిన మరో షూటర్ నీరజ్ కుమార్ 592 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు.ఫైనల్లో ప్రతాప్ 466.9 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. చివరి షాట్ వరకు ఐశ్వర్య త్రాప్ 457.1 పాయింట్లతో తొలి స్థానంలో, లియు యుకున్ (చైనా) 457 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆఖరి షాట్లో ప్రతాప్ 9.8 పాయింట్లు సాధించగా ... లియు యుకున్ 10.1 పాయింట్లు స్కోరు చేసి ఓవరాల్‌గా 467.1 స్కోరుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నీరజ్ కుమార్ 432.6 పాయింట్లతో ఐదో స్థానంలో నిలువగా... రొమైన్ (ఫ్రాన్స్; 454.8 పాయింట్లు) కాంస్యాన్ని సాధించాడు. నాలుగో రోజు పోటీలు ముగిశాక భారత్ 3 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి 11 పతకాలతో రెండో స్థానంలో ఉంది. చైనా 15 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి 15 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
భారత్ గురి బంగారం
కైరో: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు భారత షూటర్లు అదరగొట్టారు. రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలు సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు మొత్తం మూడు పతకాలు లభించాయి. ముందుగా టీమ్ విభాగంలో సామ్రాట్ రాణా, వరుణ్ తోమర్, శ్రవణ్ కుమార్‌లతో కూడిన భారత బృందం 1754 పాయింట్లతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. క్వాలిఫయింగ్‌లో సామ్రాట్ రాణా 586 పాయింట్లు, వరుణ్ తోమర్ 586 పాయింట్లు, శ్రవణ్ 582 పాయింట్లు స్కోరు చేశారు. 10 పాయింట్ల షాట్లను వరుణ్‌తో (26) పోలిస్తే ఒక్క షాట్ ఎక్కువ కొట్టడంతో సామ్రాట్ (27)కు క్వాలిఫయింగ్‌లో టాప్ ర్యాంక్ దక్కింది. వరుణ్‌కు రెండో స్థానం లభించింది. వీరిద్దరితోపాటు మరో ఆరుగురు షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సామ్రాట్ 243.7 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచి బంగారు పతకాన్ని గెలిచాడు. హు కాయ్ (చైనా; 243.3 పాయింట్లు) రజత పతకం సాధించగా... వరుణ్ తోమర్ (భారత్; 221.7 పాయింట్లు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఇషా బృందానికి రజతం మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్, పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన మనూ భాకర్, ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్ సురుచి సింగ్‌లతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో 1740 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెల్చుకుంది. క్వాలిఫయింగ్‌లో ఇషా సింగ్ 583 పాయింట్లు, మనూ భాకర్ 580 పాయింట్లు, సురుచి 577 పాయింట్లు స్కోరు చేశారు. క్వాలిఫయింగ్‌లో ఇషా నాలుగో స్థానంలో, మను ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకోగా... సురుచి 14వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూరమైంది. వ్యక్తిగత విభాగంలో మాత్రం ఇషా, మనూ భాకర్‌లకు నిరాశ ఎదురైంది. వీరిద్దరు పతకాలు నెగ్గలేకపోయారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇషా 159.2 పాయింట్లతో ఆరో స్థానంలో, మనూ 139.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి పతకానికి దూరమయ్యారు. మూడో రోజు పోటీలు ముగిశాక భారత్ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి 9 పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
శ్రియా మిలింద్కు రజత పతకం
రిఫ్ఫా (బహ్రెయిన్): ఆసియా యూత్ గేమ్స్‌లో భారత్‌కు చెందిన శ్రియా మిలింద్ రజత పతకంతో మెరిసింది. మహిళల 50 కేజీల మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్ఎమ్ఏ) కేటగిరీలో శ్రియా రజత పతకం కైవసం చేసుకుంది. దీంతో ఈ టోర్నీలో భారత పతకాల సంఖ్య 16 (2 స్వర్ణాలు, 6 రజతాలు, 8 కాంస్యాలు)కు చేరింది. శనివారం జరిగిన ఫైనల్లో కజకిస్తాన్‌కు చెందిన అమెలినా బకియేవా చేతిలో శ్రియా పరాజయం పాలైంది. అంతకుముందు శ్రియా యూఏఈ, కిర్గిస్తాన్ ప్లేయర్లపై గెలిచి గ్రూప్ టాపర్‌గా ముందంజ వేసింది. ఈ టోర్నమెంట్లో ఎమ్ఎమ్ఏ విభాగంలో భారత్‌కు ఇది రెండో పతకం. శుక్రవారం పురుషుల 80 కేజీల విభాగంలో వీర్ కాంస్యం గెలుచుకోగా... తాజాగా శ్రియా రజతం నెగ్గింది. కబడ్డీలో పురుషుల, మహిళల విభాగాల్లో భారత్ స్వర్ణాలు గెలిచింది. తైక్వాండోలో పురుషుల వ్యక్తిగత విభాగంలో దేబాశీశ్ దాస్, మిక్స్డ్ డబుల్స్‌లో యశ్విని సింగ్–శివాన్షు పటేల్ కాంస్యాలు గెలుచుకున్నారు. అథ్లెటిక్స్‌లో భారత్ 4 పతకాలు నెగ్గింది. శౌర్య అవినాశ్ (మహిళల 100 మీటర్ల హర్డిల్స్), ఎడ్విన్ జాసన్ (మహిళల 400 మీటర్లు), రాన్‌జానా యాదవ్ (మహిళల 5000 మీటర్ల నడక), ఓషిని (మహిళల డిస్కస్ త్రో) వెండి వెలుగులు విరజిమ్మారు. పలాశ్ మండల్ (పురుషుల 5000 మీటర్ల నడక), జుబిన్ (పురుషుల హైజంప్), జాస్మీన్ కౌర్ (మహిళల షాట్‌పుట్) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. కురాశ్లో భారత్‌కు మూడు పతకాలు దక్కాయి. 14 ఏళ్ల కనిష్క బిధూరి రజతం... అరవింద్, ఖుషీ కాంస్యాలు సొంతం చేసుకున్నారు. -
బీఎస్ఎఫ్ అరుదైన నిర్ణయం
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో కానిస్టేబుల్ అయిన ఐదు నెలల కాలానికే మహిళా వుషు ప్లేయర్ శివాని హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందింది. బీఎస్ఎఫ్లాంటి బలగాల్లో ఉన్న జవాన్లకు ప్రమోషన్ అంత సులువు కాదు. కనీసం 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల సర్వీస్ కాలం పూర్తవ్వాలి. కానీ 21 ఏళ్ల శివాని ప్రపంచ వుషు చాంపియన్‌షిప్ సాండా ఈవెంట్ 75 కేజీల విభాగంలో భారత్‌కు రజత పతకం తెచ్చిపెట్టడంతో అరుదైన ప్రమోషన్‌కు అర్హత సాధించింది. ఈ ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లో బ్రెజిల్లో జరిగిన వుషు (చైనా మార్షల్ ఆర్ట్స్) పోటీల్లో శివాని రన్నరప్‌గా నిలువడంతో బీఎస్‌ఎఫ్‌లోకి వచ్చీరాగానే హెడ్ కానిస్టేబుల్ అయ్యింది. గురువారం బీఎస్ఎఫ్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ (డీజీ) దల్జీత్ సింగ్ చౌదరి ప్రమోషన్‌కు సంబంధించిన రిబ్బన్‌ను ఖాకీ యూనిఫామ్‌లో ఉన్న శివానికి పిన్ చేశారు. ఏళ్ల తరబడి పనిచేస్తే గానీ రాని ప్రమోషన్‌ను ఇలా కట్టబెట్టాలంటే నిబంధనల సడలింపు, ప్రత్యేక అనుమతి తప్పనిసరి. దీనికోసం బీఎస్ఎఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (డీఓపీటీ) వద్ద శాఖపరమైన అనుమతి తీసుకున్నట్లు బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ఈ జూలైలో అనూజ్ అనే కానిస్టేబుల్‌కు ఇలాంటి పదోన్నతే కల్పించారు. అతను ఏప్రిల్‌లో చైనాలో జరిగిన ప్రపంచకప్ సాండా ఈవెంట్ 52 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. 2.7 లక్షల మందితో కూడిన బీఎస్ఎఫ్ బలగాలు క్లిష్టమైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పగలనక రాత్రనక పహారా కాస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు, క్లిష్టమైన లేదంటే ప్రత్యేక పరిస్థితుల్లో కూడా అంతర్గత భద్రతా ఏర్పాట్లలోనూ బీఎస్ఎఫ్ సిబ్బంది తలమునకలై శ్రమిస్తుంటుంది. -
భారత్‌కు రజత పతకం
జొహోర్ బారు (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ అండర్–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు రజత పతకం దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో రోహిత్ సారథ్యంలోని మూడు సార్లు చాంపియన్ టీమిండియా 1–2 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. చివరి నిమిషంలో ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు... పెనాల్టీ కార్నర్ అవకాశాలను వృథా చేసుకొని పరాజయం వైపు నిలిచింది. భారత్ తరఫున అన్మోల్ ఎక్కా (17వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించగా... ఆస్ట్రేలియా తరఫున ఇయాన్ గ్రాబెలార్ (13వ, 59వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో మెరిశాడు.తొలి క్వార్టర్లో ఆ్రస్టేలియా గోల్ చేసి ఆధిక్యం సాధించగా... రెండో క్వార్టర్లో అన్మోల్ గోల్‌తో భారత్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ చేయలేకపోయాయి. అయితే మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా... వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని ఆ్రస్టేలియా సద్వినియోగం చేసుకొని ఆధిక్యం రెట్టింపు చేసుకుంది. గత మూడు ఫైనల్స్‌లో ఓడిన ఆ్రస్టేలియాకు ఇది నాలుగో ట్రోఫీ. భారత జట్టుకు చివరి నిమిషంలో ఏకంగా ఆరు పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కగా... వాటిలో ఒక్కదాన్ని కూడా గోల్‌గా మలచలేకపోయింది. ఆస్ట్రేలియా గోల్ కీపర్ మాగ్నస్ మెక్కాస్లాండ్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. గత రెండు పర్యాయాలు కాంస్య పతకాలు సాధించిన భారత జట్టు... ఈసారి రజతం గెలుచుకుంది. -
మీరాబాయి చానుకు రజతం
ఫోర్డె (నార్వె): భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసింది. మహిళల 48 కేజీల విభాగంలో బరిలోకి దిగిన మీరా రెండో స్థానంలో నిలిచింది. 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2022 టోర్నీలో రజతం నెగ్గిన మీరాబాయి... ఇప్పుడు మూడో పతకం ఖాతాలో వేసుకుంది. నార్వే వేదికగా జరిగిన పోటీల్లో మీరాబాయి 199 కేజీల (స్నాచ్‌లో 84 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు) బరువెత్తి రజతం కైవసం చేసుకుంది. ఉత్తర కొరియాకు చెందిన రి సాంగ్ గుమ్ 213 కేజీల (స్నాచ్‌లో 91 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 122 కేజీలు) బరువెత్తి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు పసిడి పతకం గెలుచుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన థాన్యాథోన్ సుక్చరోన్ 198 కేజీల (స్నాచ్‌లో 88 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 110 కేజీలు)తో కాంస్య పతకం నెగ్గింది. స్నాచ్‌లో తొలి ప్రయత్నంలోనే 84 కేజీల బరువెత్తని చాను... ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లో 87 కేజీల బరువెత్తడంలో విఫలమైంది. మరోవైపు క్లీన్ అండ్ జెర్క్‌లో తొలుత 109 కేజీలు బరువెత్తిన మీరాబాయి... రెండో ప్రయత్నంలో 112 కేజీలు, మూడో ప్రయత్నంలో 115 కేజీల బరువెత్తింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సైతం చాను క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీల బరువు ఎత్తే రజత పతకం గెలుచుకుంది. ‘పతకం సాధించడం ఆనందంగా ఉంది. ఈ ప్రదర్శన నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా సాగుతున్నా. ఈ క్రమంలో పాల్గొనే ప్రతి టోర్నీ దానికి సన్నాహకమే. త్వరలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయతి్నస్తా. పోటీపడ్డ ప్రతిసారీ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తా. దేశానికి మరిన్ని పతకాలు అందించడమే నా ప్రధాన లక్ష్యం’ అని మీరాబాయి చెప్పింది. ఆమె కోచ్ విజయ్ శర్మ మాట్లాడుతూ... ఈ పతకం మీరాబాయి కఠోర సాధనకు ఫలితమని అన్నాడు. ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 200 కేజీల మార్క్ అందుకోవాలని మీరా లక్ష్యంగా పెట్టుకుంది. దానికి ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. రానున్న కాలంలో కామన్వెల్త్, ఆసియా గేమ్స్, ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో ఆమె తీవ్ర సాధన చేస్తోంది. తన బలం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేందుకు కష్టపడుతోంది’ అని అన్నాడు. -
రజత దీప్తి
న్యూఢిల్లీ: తెలంగాణ పారా అథ్లెట్ జివాంజి దీప్తి ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసింది. పారిస్ పారాలింపిక్స్‌లో పసిడి పతకం నెగ్గిన దీప్తి... తాజా పోటీల్లో రజతం ఖాతాలో వేసుకుంది. మహిళల 400 మీటర్ల పరుగు టి20 విభాగంలో బరిలోకి దిగిన దీప్తి శనివారం ఫైనల్లో 55.16 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో దీప్తికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా... టర్కీకి చెందిన అయెసెల్ ఒండెర్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పుతూ 54.51 సెకన్లలో గమ్యాన్ని చేరి పసిడి పతకం కైవసం చేసుకుంది. ఉక్రెయిన్ యులియా షులియర్ (56.20 సెకన్లు)కు కాంస్యం దక్కింది. న్యూఢిల్లీ వేదికగా శనివారం ఘనంగా ప్రారంభమైన వరల్డ్ అథ్లెటిక్స్ పోటీల్లో తొలి రోజు భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. దీప్తి రజతం చేజిక్కించుకోగా... హై జంప్‌లో భారత అథ్లెట్లు రెండు పతకాలు కైవసం చేసుకున్నారు. పురుషుల హై జంప్ టి42 విభాగంలో శైలేశ్ కుమార్ స్వర్ణం గెలుచుకోగా... వరుణ్ సింగ్ కాంస్యం నెగ్గాడు. శైలేశ్ 1.91 మీటర్ల ఎత్తు దూకి అగ్రస్థానంలో నిలవగా... పారా ఆసియా క్రీడల పతక విజేత వరుణ్ సింగ్ 1.85 మీటర్లతో కాంస్యం నెగ్గాడు. భారత్‌కే చెందిన రాహుల్ (1.78 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. -
బ్యాడ్మింటన్‌లో తెలంగాణ అమ్మాయికి రజతం
గ్వాటెమాల అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి రూహి రాజు సత్తా చాటింది. ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన 22 ఏళ్ల రూహి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో కొలంబియాకు చెందిన జూలియానా గిరాల్డో చేతిలో 10-21, 15-21 తేడాతో ఆమె ఓటమి చవిచూసింది.అన్‌సీడెడ్ ప్లేయర్‌గా ఈ ఈవెంట్లోకి అడుగుపెట్టిన రూహి రాజు.. క్వార్టర్ ఫైనల్లో గ్వాటెమాలకు చెందిన టాప్ సీడ్ నైక్ సోటోమేయర్ను 21-23, 21-19, 21-16 తేడాతో ఓడించింది. ఆతర్వాత హైదరాబాద్ అమ్మాయి సెమీఫైనల్లో పెరూ స్టార్ మియాహిరాపై 21-18, 21-17 తేడాతో విజయం సాధించింది.కానీ టోర్నీ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన రూహి రాజు.. ఆఖరి మొట్టుపై మాత్రం బోల్తా పడింది. రూహి రాజు గతంలో సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీ ప్రధాన కోచ్, వ్యవస్థాపకుడు ప్రదీప్ రాజు వద్ద శిక్షణ తీసుకుంది. -
భారత షూటర్ల జోరు
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఆదివారం సీనియర్ పురుషుల విభాగంలో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం దక్కింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణ పతకం నెగ్గగా... టీమ్ విభాగంలో ఐశ్వర్య ప్రతాప్, చెయిన్ సింగ్, అఖిల్ షెరాన్‌లతో కూడిన భారత జట్టుకు రజతం లభించింది. ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ 462.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెన్యు జావో (చైనా; 462) రజతం, నయోవా ఒకాడా (జపాన్; 448.8) కాంస్యం గెలిచారు. చెయిన్ సింగ్ (435.7) నాలుగో స్థానంలో, అఖిల్ (424.9 పాయింట్లు) ఐదో స్థానంలో నిలిచారు. టీమ్ విభాగంలో ఐశ్వర్య ప్రతాప్ (584 పాయింట్లు), చెయిన్ సింగ్ (582 పాయింట్లు), అఖిల్ (581 పాయింట్లు) బృందం మొత్తం 1747 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత భారత్‌కు చెందిన అడ్రియన్ కర్మాకర్ (463.8 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని సాధించాడు. టీమ్ విభాగంలో అడ్రియన్, నితిన్, రోహిత్‌లతో కూడిన భారత బృందం 1733 పాయింట్లతో పసిడి పతకాన్ని నెగ్గింది. ఓవరాల్‌గా భారత్ 26 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 46 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
అంకితకు రజతం
రినె–రుర్ ఎసెన్ (జర్మనీ): ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో భారత స్టీపుల్‌ఛేజర్ అంకిత ధ్యాని రజత పతకంతో మెరిసింది. మహిళల 3000 మీటర్ల పోటీలో అంకిత 9 నిమిషాల 31.99 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలవగా... పురుషుల 4x100 మీటర్ల రిలేలో భారత జట్టుకు కాంస్య పతకం దక్కింది. ఆదివారంతో ఈ టోర్నీ ముగియగా... చివరి రోజు భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో భారత్ 12 పతకాలు (2 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలు) సాధించింది. మహిళల స్టీపుల్‌చేజ్‌లో 23 ఏళ్ల అంకిత తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో వెండి వెలుగులు విరజిమ్మింది. అంతకుముందు హీట్స్‌లో అగ్రస్థానంతో ఫైనల్‌కు చేరిన అంకిత... తుది రేసులోనూ జోరు కనబర్చి మిల్లీ సెకన్ల తేడాతో స్వర్ణానికి దూరమైంది. ఈ క్రమంలో తన గత వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కంటే 7 సెకన్ల టైమింగ్‌ను మెరుగు పరుచుకోవడం విశేషం. పురుషుల 4x100 మీటర్ల రిలే టీమ్ రేసులో లాలు ప్రసాద్ భోయ్, అనిమేశ్, మణికంఠ, మృత్యం జయరాంతో కూడిన భారత జట్టు 38.89 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పతకం గెలుచుకుంది. దక్షిణ కొరియా (38.50 సెకన్లు), దక్షిణాఫ్రికా (38.80 సెకన్లు) జట్లు వరుసగా స్వర్ణ, రజతాలు నెగ్గాయి. మహిళల 4్ఠ100 మీటర్ల రిలే టీమ్ విభాగంలో అనఖ బిజుకుమార్; దివ్యనిబ జాలా, రష్‌దీప్ కౌర్, రూపాల్‌తో కూడిన భారత జట్టు 2 నిమిషాల 35.8 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఐదో స్థానంలో నిలిచింది. పురుషుల 4x100 మీటర్ల రిలేలో విశాల్, అశ్విన్, జెరోమ్, బాలకృష్ణతో కూడిన భారత జట్టు 3 నిమిషాల 6.5 సెకన్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. రేస్ వాక్‌లో భారత పురుషుల, మహిళల అథ్లెట్లు టాప్–10లో చోటు దక్కించుకోలేకపోయారు. అంతకుముందు మహిళల 20 కిలోమీటర్ల రేస్‌వాక్ టీమ్ విభాగంలో సెజల్ సింగ్, మునిత ప్రజాపతి, మాన్సి నేగితో కూడిన భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది. -
నిఖత్ జరీన్‌కు రజతం
జాతీయ సీనియర్ మహిళల ఎలైట్ బాక్సింగ్ టోర్నీలో భారత స్టార్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు) రజత పతకం సాధించింది. హైదరాబాద్‌లో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో గాయం కారణంగా నిఖత్ ఫైనల్ బౌట్లో బరిలోకి దిగలేదు. దాంతో నిఖత్ ప్రత్యర్థి జ్యోతి (రైల్వేస్) రింగ్‌లోకి దిగకుండానే స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకుంది. రైల్వేస్ బాక్సర్లు మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 9 పతకాలను గెల్చుకున్నారు. -
హార్స్ రైడింగ్‌లో.. ధృవ సత్తా..
హార్స్ షోలో సత్తా చాటిన అత్యంత పిన్న వయస్కుడైన ఈక్వెస్టియన్ రైడర్‌గా నగరానికి చెందిన మాస్టర్ ధృవ నిలిచాడు. ఈక్వెస్ట్రియన్ అకాడమీ ఆధ్వర్యంలో శంకర్‌పల్లిలోని నాసర్ పోలో ఆవరణలో అండర్–10, 12, 14, 16, అదే విధంగా 45–125 సెంటీమీటర్ల ఓపెన్ విభాగాల్లో దాదాపు 650 మంది రైడర్లకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రెస్సేజ్ విభాగంతో పాటు ట్రోట్ సీహెచ్–2 వంటి విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచారు. ఈ పోటీల్లో పదేళ్ల బాలుడు మాస్టర్ ధృవ 3 బంగారు, 1 రజితం, 1 కాంస్య పతకాలతో ప్రథమ బహుమతులు సాధించాడు. ఈ సందర్భంగా ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించడమే తన లక్ష్యం అని చెబుతున్నాడు ధృవ. నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఈ విద్యార్థి ఆరేళ్ల వయసు నుంచే గుర్రపుస్వారీ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. (చదవండి: ఐస్ బాత్ థెరపీ ట్రెండ్..! నిపుణులు ఏమంటున్నారంటే..) -
ఆటల్లో మేటి.. కష్టాలు కోటి
సాక్షి, సిద్దిపేట: ఆటలపై మక్కువ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఆర్థిక ఇబ్బందులు మాత్రం పాతాళానికి లాగుతున్నాయి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండటం జంగాపల్లికి చెందిన బేస్‌బాల్ క్రీడాకారిణి పోసానిపల్లి సౌమ్యారెడ్డి పరిస్థితి ఇది. చైనాలో నవంబర్‌లో జరిగే బేస్‌బాల్ మహిళా ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టులో ఆమె చోటు సంపాదించింది. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కప్ క్వాలిఫైయింగ్ పోటీలలో భారత జట్టు సిల్వర్ మెడల్ సాధించడంలో సౌమ్యారెడ్డి కీలకపాత్ర పోషించింది. చిన్నప్పటి నుంచి ఆటలే లోకం సౌమ్యారెడ్డి తల్లిదండ్రులు ప్రతాప్‌రెడ్డి, కవిత. వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు సౌమ్యారెడ్డి, చిన్న కూతురు మాధురి. సౌమ్య క్రీడల్లో రాణిస్తుండటంతో మంచి శిక్షణ ఇప్పించేందుకు హైదరాబాద్‌కు మకాం మార్చారు. ప్రతాప్‌రెడ్డి ఇళ్లకు పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సౌమ్యకు చిన్నప్పటి నుంచి ఆటలే లోకం. 8వ తరగతి చదువుతున్నప్పుడే త్రో బాల్ నేషనల్స్ ఆడింది. సాఫ్ట్‌బాల్, క్రికెట్, బేస్‌బాల్ ఆటలో సైతం రాణిస్తోంది. హైదరాబాద్ పీజీ గ్రౌండ్లో బేస్‌బాల్ కోచింగ్ తీసుకుంది. ఇప్పటివరకు బేస్‌బాల్‌లో 12 నేషనల్స్ ఆడింది.అండర్ –19 క్రికెట్‌తోపాటు సాఫ్ట్‌బాల్ 15 నేషనల్స్లలో పాల్గొంది. నవంబర్‌లో చైనాలో జరిగే ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు ఇటీవల ఎంపికైంది. అయితే, పేద కుటుంబం కావటంతో ప్రయాణ ఖర్చులు భారంగా మారాయి. పోటీలలో పాల్గొనేందుకు నెల రోజుల ముందే చైనాకు చేరుకుని ప్రాక్టీస్ చేయాలి. ప్రయాణం ఖర్చులతో పాటు అక్కడ నెలపాటు ఉండేందుకు దాదాపు రూ.5 లక్షల వరకు అవసరం. అంతమొత్తం భరించే స్తోమత ఆ కుటుంబానికి లేకపోవటంతో సౌమ్య నిరాశలో కూరుకుపోయారు.ఇండియాకు మెడల్స్ తీసుకొస్తా ఇండియా తరఫున ఆడి మెడల్స్ తీసుకువస్తా. చైనాలో జరిగే ఆసియా కప్‌ను గెలుపొందేందుకు కృషి చేస్తా. చైనాకు వెళ్లాలంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. హైదరాబాద్‌లో బేస్‌బాల్ శిక్షణ, ప్రాక్టీస్ కోసం రోజు 14 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న బేస్‌బాల్ అసోసియేషన్¯ ప్రధాన కార్యదర్శి శ్వేత, కోచ్ చిన్న, ఖాదర్, షానవాజ్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. – సౌమ్యారెడ్డి, బేస్‌బాల్ క్రీడాకారిణి. బ్యాంకాక్‌కు బంగారం కుదువపెట్టి పంపించాం బ్యాంకాక్ పోటీల్లో పాల్గొనేందుకు దాదాపు రూ.3.5 లక్షలు ఖర్చు అయింది. మా బిడ్డ లక్ష్యంకు చేరుకునేందుకు మా దగ్గర ఆర్థిక స్తోమత లేనప్పటికీ బంగారం బ్యాంకులో కుదువపెట్టి ఆ డబ్బుతో పంపించాము. కొంత అప్పు కూడా చేశాం. నవంబర్‌లో చైనా వెళ్లేందుకు రూ.5 లక్షలు అవుతుందని తెలిసింది. అంత ఖర్చు భరించే స్తోమత మాకు లేదు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలి. – సౌమ్య తల్లిదండ్రులు ప్రతాప్‌రెడ్డి, కవిత -
ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్: ధీరజ్ బృందానికి రజత పతకం
సెంట్రల్ ఫ్లోరిడా (అమెరికా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో భారత జట్టుకు రజత పతకం లభించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్, అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కూడిన భారత జట్టు 1–5 సెట్ల తేడాతో లీ జాంగ్యువాన్, కావో వెన్‌చావో, వాంగ్ యాన్లతో కూడిన చైనా జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి సెట్లో రెండు జట్లు 54–54తో సమంగా నిలిచి చెరో పాయింట్ దక్కించుకున్నాయి. రెండో సెట్‌ను చైనా 58–55తో నెగ్గి 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మూడో సెట్‌ను చైనా 55–54తో సొంతం చేసుకొని 5–1తో స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకుంది. ఆర్చరీ సీజన్ తొలి టోర్నీలో ఇప్పటి వరకు భారత్‌కు మూడు పతకాలు లభించాయి. -
పంకజ్ అద్వానీకి రజత పతకం
న్యూఢిల్లీ: వరల్డ్ మ్యాచ్‌ప్లే బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత దిగ్గజం పంకజ్ అద్వానీ రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఐర్లాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో పంకజ్ హోరాహోరీగా పోరాడి ఓడాడు. శనివారం జరిగిన తుదిపోరులో పంకజ్ 7–8 (100–19, 100–0, 47–100, 52–100, 100–19, 0–100, 100–49, 3–100, 100–34, 100–4, 85–100, 100–31, 53–100, 43–100, 28–100) ఫ్రేమ్‌ల తేడాతో ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ కాసియర్ చేతిలో పరాజయం పాలయ్యాడు. బిలియర్డ్స్, స్నూకర్ క్రీడాంశాల్లో వివిధ విభాగాల్లో కలిపి 28 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పంకజ్... ‘బెస్ట్ ఆఫ్ 15’ పోరులో ఆరంభంలో చక్కటి ఆధిపత్యం కనబర్చినా... ఆఖర్లో పుంజుకున్న ఇంగ్లండ్ క్యూయిస్ట్ విజయం సాధించాడు. ఇక ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఐబీఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ పోటీ పడనున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న అద్వానీ... 2016 నుంచి ఈ టోర్నీలో వరుసగా టైటిల్స్ సాధిస్తూ వస్తున్నాడు. -
ఆర్య–రుద్రాంక్ష్ జోడీకి రజతం
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్‌కు ఏడో పతకం లభించింది. బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఆర్య బోర్సే–రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ జోడీ రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆర్య–రుద్రాంక్ష్ ద్వయం 9–17 పాయింట్ల తేడాతో జిఫె వాంగ్–బుహాన్ సాంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. కాంస్య పతక మ్యాచ్‌లో నర్మద నితిన్ రాజు–అర్జున్ బబూటా (భారత్) జంట 13–17 పాయింట్ల తేడాతో ఫెర్నాండా రుసో–మార్సెలో జూలియన్ గిటిరెజ్ (అర్జెంటీనా) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల ట్రాప్ ఈవెంట్లో భారత షూటర్లు నిరాశపరిచారు. నీరూ 115 పాయింట్లతో 12వ స్థానంలో, ప్రగతి దూబే 110 పాయింట్లతో 17వ స్థానంలో, భవ్య త్రిపాఠి 106 పాయింట్లతో 26వ స్థానంలో నిలిచారు. పురుషుల ట్రాప్ ఈవెంట్లోనూ భారత షూటర్లెవరూ ఫైనల్ చేరలేకపోయారు. జొరావర్ సింగ్ సంధూ 119 పాయింట్లతో ఏడో స్థానంలో, పృథ్వీరాజ్ 117 పాయింట్లతో 16వ స్థానంలో, లక్షయ్ 115 పాయింట్లతో 21వ స్థానంలో నిలిచారు. టాప్–6లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ప్రస్తుతం భారత్ నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఏడు పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
ఇషా సింగ్ రజత గురి
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): హైదరాబాద్ యువ షూటర్ ఇషా సింగ్ ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో రజత పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఇషా సింగ్ వెండి వెలుగులు విరజిమ్మింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇషా సింగ్ 35 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనా షూటర్లు సున్ యుజీ 28 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా... ఫెంగ్ జియాన్ 30 పాయింట్లతో కాంస్యం కైవసం చేసుకుంది. ఇదే విభాగంలో పోటీపడిన భారత మరో షూటర్, ‘డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్’ మనూ భాకర్ 24 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమైంది. అంతకుముందు క్వాలిఫయింగ్ ఈవెంట్లో మనూ భాకర్ 585 పాయింట్లు సాధించి మూడో స్థానంతో, ఇషా సింగ్ 579 పాయింట్లతో తొమ్మిదో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా పసిడి పతకం కైవసం చేసుకుంది. దీంతో సీజన్ ప్రారంభ ప్రపంచకప్ ఈవెంట్లో భారత్ ఖాతాలో తొలి పసిడి పతకం చేరింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 23 ఏళ్ల సిఫ్ట్ కౌర్ 458.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అనిట మంగోల్డ్ (జర్మనీ; 455.3 పాయింట్లు), అరినా అటుఖోవా (కజకిస్తాన్; 445.9 పాయింట్లు) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో స్విఫ్ట్ కౌర్‌కు ఇదే తొలి పతకం మొత్తం 45 షాట్ల పాటు జరిగిన ఫైనల్లో తొలి 15 షాట్లు ముగిసిన అనంతరం జర్మనీ షూటర్ అనిట మంగోల్డ్ కంటే... 7.2 పాయింట్లు వెనుకబడిన సిఫ్ట్ కౌర్ ఆ తర్వాత అదరగొట్టింది. నీలింగ్ పొజిషన్లో సరైన గురి పెట్టలేకపోయిన భారత షూటర్... ఆ తర్వాత ప్రోన్, స్టాండింగ్ పొజిషన్లలో సత్తాచాటింది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో సిఫ్ట్ కౌర్ 590 పాయింట్లు సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. -
తైక్వాండోలో హర్షప్రదకు రజతం... వరుణ్‌కు కాంస్యం
డెహ్రాడూన్: 38వ జాతీయ క్రీడల్లో శుక్రవారం తెలంగాణ ఖాతాలో ఒక పతకం... ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఒక పతకం చేరాయి. మహిళల తైక్వాండో (క్యోరుగీ) అండర్–73 కేటగిరీలో తెలంగాణకు చెందిన పాయం హర్షప్రద రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో హర్షప్రద 0–2 తేడాతో ఇతిషా దాస్ (చండీగఢ్) చేతిలో పరాజయం పాలైంది.ప్రస్తుతం తెలంగాణ ఆరు పతకాలతో (1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్యాలు) 28వ స్థానంలో ఉంది. మరోవైపు పురుషుల తైక్వాండో అండర్–68 కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి.వరుణ్ కాంస్య పతకం గెలిచాడు. సెమీఫైనల్లో వరుణ్ 0–2తో మహేంద్ర పరిహార్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 10 పతకాలతో (4 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు) 18వ స్థానంలో ఉంది. మరిన్ని క్రీడా వార్తలుసెమీస్లో మాయ ముంబై: తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ భారత టీనేజ్ టెన్నిస్ స్టార్ మాయ రాజేశ్వరన్ రేవతి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 15 ఏళ్ల మాయ 6–4, 3–6, 6–2తో ప్రపంచ 285వ ర్యాంకర్ మి యామగుచి (జపాన్)పై గెలిచింది. రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో మాయ ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. స్పెయిన్‌లోని రాఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మాయ నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 117వ ర్యాంకర్ జిల్ టెచ్‌మన్ (స్విట్జర్లాండ్)తో తలపడుతుంది.భారత మూడో ర్యాంకర్, తెలంగాణకు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పోరాటం ఈ టోరీ్నలో ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో రష్మిక 2–6, 2–6తో జిల్ టెచ్‌మన్ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైన రష్మికకు 3,450 డాలర్ల (రూ. 3 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 27 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రాజస్తాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బహుతులేజైపూర్: భారత మాజీ లెగ్‌స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో మరోసారి జత కట్టనున్నాడు. టీమ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బహుతులేను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కోచ్‌లలో ఒకడిగా ఉన్న బహుతులే 2018–21 మధ్య కాలంలో కూడా రాజస్తాన్ రాయల్స్ సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నాడు.టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్లతో కలిసి అతను పని చేస్తాడు. భారత జట్టు హెడ్ కోచ్‌గా ద్రవిడ్ ఉన్న సమయంలో రెండు వేర్వేరు సిరీస్‌లలో బహుతులే కోచింగ్ బృందంలో ఉన్నాడు. బహుతులే భారత్ తరఫున 2 టెస్టులు, 8 వన్డేలు ఆడి 5 వికెట్లు తీశాడు. -
పాపాల భోపాల్‌లో పారా తారలు.. విషం కాటేసినా ఆటై మెరిశారు
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 40 ఏళ్లు. డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి మొదలై డిసెంబర్ 3 వరకూ కొనసాగిన విష వాయువులు ఆ ఒక్క రాత్రితో తమ ప్రభావాన్ని ఆపేయలేదు. అవి జన్యువుల్లో దూరి నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దుర్ఘటన నుంచి బయటపడిన వారికి నేటికీ అవకరాలతో పిల్లలు పుడుతున్నారు. ఏనాటి ఎవరి పాపమో ఇప్పటికీ వీళ్లు అనుభవిస్తున్నారు. అయితే వీరిలో కొందరు పిల్లలు పారా స్పోర్ట్స్‌లో ప్రతిభ చూపుతుండటం ఒక ఆశ. కాని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పడమే వీరు మనకు కలిగిస్తున్న చైతన్యం.పదిహేడేళ్ల దీక్షా తివారి ‘ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ డిజార్డర్’ (ఐడిడి) రుగ్మతతో బాధ పడుతోంది. ఆ అమ్మాయిని బాల్యంలో గమనించిన తల్లిదండ్రులు మహేష్ తివారి, ఆర్తి తివారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ఆయన ‘ఇది భోపాల్ గ్యాస్ విష ఫలితం’ అనంటే ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. ‘అదెప్పటి సంగతో కదా’ అన్నారు. ‘అవును... ఇప్పటికీ వెంటాడుతోంది’ అన్నాడు డాక్టర్. దానికి కారణం భోపాల్ ఘటన జరిగినప్పుడు మహేష్ వయసు 5 ఏళ్లు, ఆర్తి వయసు 3 సంవత్సరాలు. వారు భోపాల్‌లో ఆ గ్యాస్‌ని పీల్చారు. కాని అది జన్యువుల్లో దూరి సంతానానికి సంక్రమిస్తుందని నాడు వాళ్లు ఊహించలేదు.అదృష్టం ఏమిటంటే దీక్షా తివారి 2023 స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బాస్కెట్ బాల్లో రజత పతకం తేవడం. ఈ అమ్మాయే కాదు భోపాల్ విష వాయువు వెంటాడుతున్న చాలా మంది బాలలు భోపాల్‌లోని జేపీ నగర్ప్రాంతంలో అత్యధికం ఉన్నారు. వీరంతా తమ శారీరక, మానసిక లోపాలను, రుగ్మతలను జయించడానికి స్పోర్ట్స్‌ను ఎంచుకున్నారు. అథ్లెటిక్స్, సైక్లింగ్, ఫుట్‌బాల్ తదితర ఆటల్లో ప్రతిభ చూపుతున్నారు. బతుకు జీవచ్ఛవం కాకుండా ఉండేందుకు క్రీడలు వారిని కాపాడుతున్నాయి. కాని ప్రభుత్వం వీరికి చేయవలసింది చేసిందా?40 టన్నుల గ్యాస్డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి అత్యంత ప్రాణాంతకమైన ‘మిథైల్ ఐసొసైనెట్’ విడుదలవడం మొదలయ్యి మరుసటి రోజు సాయంత్రం వరకూ వ్యాపించింది. దాదాపు 40 టన్నుల విషవాయువు విడుదలైంది. దీని వల్ల చనిపోయిన వారు అధికారికంగా 2,259 కాని 20 వేల నుంచి 40 వేల వరకు మరణించి ఉంటారని సామాజిక కార్యకర్తల అంచనా. ఆ సమయంలో బతికున్నవారు జీవచ్ఛవాలుగా మారితే కొద్దిపాటి అస్వస్థతతో బయటపడిన వారూ ఉన్నారు. విషాదం ఏమంటే ఈ ఘటన జరిగినప్పుడు చంటిపాపలు, చిన్న పిల్లలుగా ఉన్నవారు ఆ ఘటన నుంచి బయట పడి అదృష్టవంతులం అనుకున్నారు కానీ వారికి యుక్తవయసు వచ్చి పిల్లలు పుట్టాక వారిలో అధిక శాతం దివ్యాంగులుగా, మానసిక దుర్బలురుగా మిగిలారు.1300 మంది దివ్యాంగులు‘‘భోపాల్ విషవాయువులు భోపాల్‌లోని 42 వార్డుల మీద ప్రభావాన్ని చూపాయి. ఆ 42 వార్డుల్లో దివ్యాంగ శిశువులు జన్మిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య అధికారికంగా 1300. వీరిలో అత్యధికులు అంధత్వం, సెరిబ్రల్ పాల్సీ, డౌన్ సిండ్రోమ్, మస్క్యులర్ డిస్ట్రఫీ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వంటి సమస్యలతో బాధ పడుతున్నారు.వీరికి రెగ్యులర్‌గా థెరపీ అవసరం. కాని మా వద్ద వున్న వనరులతో కేవలం 300 మందికే సేవలు అందించగలుగుతున్నాం. మిగిలినవారికీ ఏ థెరపీ అందడం లేదు. వీరిలో చాలామంది పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు. ఈనాటికీ వీరికి నష్టపరిహారం అందలేదు’’ అని ‘చింగారి’ ట్రస్ట్ బాధ్యుడొకరు తెలిపారు. భోపాల్ విషవాయువు బాధిత దివ్యాంగ శిశువులకు ఈ సంస్థ వైద్య సహాయం అందిస్తుంది.కల్లాకపటం లేని పిల్లలుభోపాల్లోని జేపీనగర్‌లో కల్లాకపటం లేని అమాయక బాలలు చాలామంది కనిపిస్తారు. ముద్దొచ్చే మాటలు మాట్లాడుతూ అందరిలాగా ఆటలాడాలని, స్కూలుకు వెళ్లాలని, కబుర్లు చెప్పే వీరంతా చాలామటుకు బుద్ధిమాంద్యంతో బాధపడే పిల్లలే. కొందరు శరీరం చచ్చుబడ్డ వారే. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన వీరంతా నిరసన కార్యక్రమం జరుపుతుంటారు. న్యాయం కోరుతుంటారు. కానీ దుర్ఘటన జరిగి 40 ఏళ్లు అవుతున్నా వీరు రోడ్ల మీదకు వస్తూనే ఉండాల్సి రావడం బాధాకరం.నీరు తాగిభోపాల్ విషవాయులు భూమిలోకి ఇంకడం వల్ల కొన్ని చోట్ల ఇప్పటికీ ఆ నీరు విషతుల్యం అయి ఉంది. వేరే దిక్కు లేక పేదలు ఆ నీరే చాలాకాలం తాగి ఇప్పుడు దివ్యాంగ శిశువులకు జన్మనిస్తున్నారు. ‘ఆటలాడే ఉత్సాహం ఉన్నా వీరికి ఆటవస్తువులు లేవు. హెల్త్ కార్డులు లేవు’ అని తల్లిదండ్రులు భోరున విలపిస్తుంటే ఏ పాపానికి ఈ శిక్ష అనిపిస్తుంది. -
పతకాల పందెం.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా..
మొనాకో: లండన్ ఒలింపిక్స్ (2012) జరిగి ఓ పుష్కర కాలం పూర్తయ్యింది. ఈలోపు రియో (2016), టోక్యో (2020), పారిస్ (2024) ఒలింపిక్స్ క్రీడలు కూడా ముగిశాయి. అయితే లండన్ విశ్వక్రీడల్లో మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో పతకాల పందెం ఇంకా.. ఇంకా కొనసాగుతోంది.ఈసారి డోపీగా తేలిన రష్యా రన్నర్ తాత్యానా తొమషోవా పతకం (కాంస్యం) కోల్పోతే, అమెరికా రన్నర్ షానన్ రోబెరి అందుకోనుంది. ఈ ఈవెంట్లో మూడు రంగులు (స్వర్ణం, రజతం, కాంస్యం) మారడం మరో విశేషం. అలా ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పుడిదీ నిలిచిపోనుంది. 12 ఏళ్ల క్రితం టర్కీ అథ్లెట్లు అస్లి కాకిర్ అల్ప్టెకిన్, గమ్జే బులుట్ వరుసగా స్వర్ణం, రజతం గెలుపొందారు.కానీ వీరిద్దరు ఇదివరకే డోపీలుగా తేలి అనర్హత వేటుకు గురయ్యారు. ఈ క్రమంలో ఇథియోపియాలో జన్మించిన బహ్రైనీ మరియం యూసఫ్ జమాల్‌కు గోల్డ్(మూడో స్థానం), ఇథియోపియాకే చెందిన అబెబా అరెగవీకి సిల్వర్(ఐదో స్థానం) మెడల్ దక్కాయి.అదేవిధంగా.. ఐదో స్థానంలో ఉన్న తొమషొవాకు కాంస్యం లభించింది. అయితే, ఇప్పుడు ఆమె కూడా డోపీ కావడంతో ఆరో స్థానంలో ఉన్న అమెరికన్ రోబెరి కాంస్య పతకం అందుకోనుంది. టర్కీ, రష్యా అథ్లెట్లపై ప్రపంచ అథ్లెటిక్స్ నిషేధం విధించింది. మారిన పతకాలను ప్రపంచ చాంపియన్‌షిప్ లేదంటే భవిష్యత్‌లో జరిగే ఒలింపిక్స్‌లో ప్రదానం చేస్తారు. క్వార్టర్ ఫైనల్లో రిత్విక్ జోడీసాక్షి, హైదరాబాద్: రొవరెటో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ శుభారంభం చేశాడు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రిత్విక్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ 6–4, 6–3తో డానియల్ మసూర్–అలెక్సీ వటుటిన్ (జర్మనీ) జంటపై విజయం సాధించింది. 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రిత్విక్–బాలాజీ జోడీ ఏడు ఏస్‌లు సంధించింది. మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌లో నాలుగుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకొని... ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. -
అంజలికి రజతం
టిరానా (అల్బేనియా): ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్ అంజలి (59 కేజీలు) రజత పతకం కైవసం చేసుకుంది. 55 కేజీల పురుషుల విభాగంలో చిరాగ్ ఫైనల్‌కు దూసుకెళ్లి మరో పతకం ఖాయం చేశాడు. 55 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో రామచంద్ర మోర్, మహిళల 68 కేజీల విభాగంలో మోనిక కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఆదివారం భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరడంతో పాటు మరో పతకం ఖాయం కాగా... అంతకు ముందు శుక్రవారం మన రెజ్లర్లు రెండు కాంస్యాలు గెలుచుకున్నారు. దీంతో ఓవరాల్‌గా భారత్ ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. మహిళల 59 కేజీల సెమీఫైనల్లో అరోరా రుసో (ఇటలీ)పై విజయం సాధించిన అంజలి... తుది పోరులో ఉక్రెయిన్ రెజ్లర్ సొలోమియా చేతిలో ఓడింది. పురుషుల 55 కేజీల ఫైనల్లో అడిమాలిక్ కరాచోవ్ (కిర్గిస్తాన్)తో చిరాగ్ తలపడనున్నాడు. 18 ఏళ్ల చిరాగ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–0తో ఒజావా గుకుటో (జపాన్)పై గెలిచాడు. క్వార్టర్స్‌లో లుబుస్ లబాటిరోవ్పై సెమీఫైనల్లో అలాన్ ఒరల్బేక్ (కజకిస్తాన్)పై గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. అభిషేక్ (61 కేజీలు), సుజీత్ (70 కేజీలు) కాంస్య పతకాల కోసం పోటీ పడనున్నారు. -
వివాన్‌కు రజతం... అనంత్‌కు కాంస్యం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌ను భారత జట్టు నాలుగు పతకాలతో ముగించింది. టోర్నీ చివరిరోజు గురువారం భారత్ ఖాతాలో ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి రెండు పతకాలు చేరాయి. పురుషుల ట్రాప్ ఈవెంట్లో జైపూర్‌కు చెందిన వివాన్ కపూర్ రజత పతకం సొంతం చేసుకోగా... పురుషుల స్కీట్ ఈవెంట్లో అనంత్‌జీత్ సింగ్ నరూకా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఆరుగురు షూటర్లు పోటీపడ్డ ‘ట్రాప్’ ఫైనల్లో 22 ఏళ్ల వివాన్ 44 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. వివాన్ కెరీర్లో ఇదే తొలి అంతర్జాతీయ వ్యక్తిగత పతకం. గతంలో అతను మూడుసార్లు వరల్డ్‌కప్ టీమ్ ఈవెంట్స్‌లో రజత పతకాలు సాధించాడు. ‘స్కీట్’ ఈవెంట్ ఫైనల్లో ‘పారిస్ ఒలింపియన్’ అనంత్‌జీత్ 43 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని పొందాడు. అనంత్ కెరీర్లో ఇదే తొలి వరల్డ్‌కప్ మెడల్ కావడం విశేషం. మహిళల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో భారత షూటర్ గనీమత్ సెఖోన్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ టోరీ్నలో భారత్ 2 రజతాలు, 2 కాంస్యాలతో నాలుగు పతకాలు నెగ్గి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచింది. -
భారత మహిళల రగ్బీ జట్టుకు రజత పతకం
ముంబై: ఆసియా రగ్బీ ఎమిరేట్స్ సెవెన్స్ ట్రోఫీలో భారత మహిళల జట్టు రజత పతకం కైవసం చేసుకుంది. నేపాల్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ 5–7 పాయింట్ల తేడాతో ఫిలిప్పీన్స్ చేతిలో ఓటమి పాలైంది. శిఖా యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అంతకుముందు సెమీఫైనల్లో 24–7 తేడాతో గువామ్‌పై గెలిచి పట్టికలో అగ్రస్థానంతో తుదిపోరుకు చేరింది. లీగ్ దశలో భారత్ 29–10 తేడాతో శ్రీలంకపై... 17–10తో ఇండోనేసియాపై గెలిచి సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఈ టోర్నీలో మరోసారి రజతం గెలవడం ఆనందంగా ఉందని శిఖా యాదవ్ పేర్కొంది. ‘ప్లేయర్లంతా సమష్టిగా సత్తా చాటారు. కఠిన ప్రత్యర్థులపై చక్కటి ప్రదర్శన కనబర్చడం వల్లే రజత పతకం సాధించగలిగాం. సహచరుల ఆటతీరుతో గర్వపడుతున్నా. ఈ విజయంలో కోచ్‌లతోపాటు సహాయక సిబ్బంది పాత్ర ఎంతో ఉంది’అని శిఖా యాదవ్ చెప్పింది. -
స్వర్ణం గెలవలేకపోయా: ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్
వరుసగా రెండు పారాలింపిక్స్‌లో రజత పతకాలు సాధించిన భారత పారా షట్లర్ సుహాస్ యతిరాజ్... విశ్వక్రీడల్లో స్వర్ణం గెలవలేకపోవడం నిరాశగా ఉందని అన్నారు. పారిస్ పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 ఫైనల్లో పరాజయం పాలై రజతం దక్కించుకున్న 41 ఏళ్ల ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్... మూడేళ్ల క్రితం టోక్యోలోనూ రెండో స్థానంలోనే నిలిచారు.‘పసిడి పతకం సాధించాలని ఎంతో శ్రమించా. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌తో విశ్వ క్రీడలకు రావడంతో అంచనాల భారం కూడా పెరిగింది. రజతం దక్కడం కూడా ఆనందంగానే ఉన్నా... ఏదో వెలితి అనిపిస్తోంది. బంగారు పతకం చేజారిందనే బాధ ఒకవైపు... పారాలింపిక్స్ వంటి అత్యుత్తమ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పతకం నెగ్గాననే భావన మరో వైపు ఉంది. గత కొంతకాలంగా దేశంలో క్రీడా సంస్కృతి పెరిగింది. గతంలో క్రికెట్‌కే ఎక్కువ క్రేజ్ ఉండేది. ఇప్పుడు అన్ని క్రీడలకు ఆదరణ దక్కుతోంది. పారా అథ్లెట్లకు కూడా మంచి తోడ్పాటు లభిస్తోంది. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో మనవాళ్లు మరిన్ని పతకాలు సాధించగలరు’ అని సుహాస్ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాకు చెందిన సుహాస్ 2007 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం సుహాస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ప్రాంతీయ రక్షక్ దళ్, యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సెక్రటరీ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వచ్చింది. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 56 కేటగిరీలో యోగేశ్ కథూనియా రజత పతకం గెలుచుకున్నాడు. కథూనియా తన తొలి ప్రయత్నంలోనే డిస్క్స్ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్లో అతనికి ఇది అత్యుత్తమ ప్రదర్శన. కథూనియాకు పారాలింపిక్స్‌లో ఇది వరుసగా రెండో రజత పతకం. గత (టోక్యో) పారాలింపిక్స్‌లోనూ కథూనియా రజతం సాధించాడు. ప్రస్తుత పారాలింపిక్స్ ఎఫ్ 56 కేటగిరీలో యోగేశ్ కథూనియా రజత పతకం సాధించగా.. బ్రెజిల్‌కు చెందిన క్లౌడిని బటిస్ట డోస్ శాంటోస్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. పారాలింపిక్స్‌లో బటిస్టకు ఇది వరుసగా మూడో స్వర్ణం. నేటి ఈవెంట్లో బటిస్ట్ తన ఐదో ప్రయత్నంలో డిస్కస్‌ను 46.86 మీట్లర దూరం విసిరాడు. ఇది పారాలింపిక్స్ రికార్డు. ఈ కేటగిరీలో గ్రీస్‌కు చెందిన కాన్స్టాంటినోస్ జోయునిస్ 41.32 మీటర్ల దూరం డిస్కస్‌ను విసిరి కాంస్యం సొంతం చేసుకున్నాడు. యోగేశ్ కథూనియా సాధించిన రజతంతో ప్రస్తుత పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఎనిమిదికి (ఒక స్వర్ణం, 3 రజతాలు, 4 కాంస్యాలు) చేరింది. -
‘పసిడి’ వేటలో భారత షట్లర్లు
పారిస్: పారాలింపిక్స్‌లో ఆదివారం భారత షట్లర్లు మెరిపించారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 కేటగిరీలో సుహాస్ యతిరాజ్... ఎస్ఎల్–3 కేటగిరీలో నితేశ్ కుమార్ ఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం రజత పతకాలను ఖరారు చేసుకున్నారు. 2007 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన సుహాస్ గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ ఫైనల్‌కు చేరి రజత పతకం దక్కించుకున్నాడు. ఈసారి సెమీఫైనల్లో సుహాస్ 21–17, 21–12తో భారత్‌కే చెందిన సుకాంత్ కదమ్‌ను ఓడించాడు. మరో విభాగం సెమీఫైనల్లో నితేశ్ 21–16, 21–12తో దైసుకె ఫుజిహారా (జపాన్)పై గెలిచి తొలిసారి పారాలింపిక్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. నేడు జరిగే ఫైనల్స్‌లో టోక్యో పారాలింపిక్స్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్)తో సుహాస్; డేనియల్ బెథెలి (బ్రిటన్)తో నితేశ్ తలపడతారు. మహిళల సింగిల్స్ ఎస్యు5 కేటగిరీలో ఇద్దరు భారత క్రీడాకారిణులు తులసిమతి మురుగేశన్, మనీషా రామదాస్ సెమీఫైనల్లో పోటీపడనున్నారు. ఇద్దరిలో ఒకరు ఫైనల్‌కు చేరుకోనుండటంతో ఈ విభాగంలోనూ భారత్‌కు కనీసం రజతం లభించనుంది. ఈరోజు జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో ఫ్రెడీ సెతియావాన్ (ఇండోనేసియా)తో సుకాంత్ తలపడతాడు. ప్రీతికి రెండో పతకం మహిళల అథ్లెటిక్స్ టి35 200 మీటర్ల విభాగంలో భారత అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సాధించింది. ప్రీతి 200 మీటర్ల దూరాన్ని 30.01 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. టి35 100 మీటర్ల విభాగంలోనూ ప్రీతికి కాంస్య పతకం లభించిన సంగతి తెలిసిందే. రాకేశ్‌కు దక్కని కాంస్యం పురుషుల ఆర్చరీ కాంపౌండ్ ఓపెన్ విభాగంలో భారత ప్లేయర్ రాకేశ్ కుమార్ కాంస్య పతక మ్యాచ్‌లో ఓడిపోయాడు. హి జిహావో (చైనా)తో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో రాకేశ్ 146–147 స్కోరుతో పరాజయం పాలయ్యాడు. రవికి ఐదో స్థానం పురుషుల షాట్‌పుట్ ఎఫ్40 కేటగిరీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు రవి రొంగలి ఐదో స్థానంలో నిలిచాడు. ఇనుప గుండును రవి 10.63 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది ఆసియా పారా గేమ్స్‌లో రజతం గెలిచిన రవి ఈసారి తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా ఫలితం లేకపోయింది. మిగెల్ మోంటెరో (పోర్చుగల్; 11.21 మీటర్లు) స్వర్ణం సాధించాడు. మరోవైపు మహిళల 1500 మీటర్ల టి11 విభాగం తొలి రౌండ్లో భారత అథ్లెట్ రక్షిత రాజు 5 నిమిషాల 29.92 సెకన్లలో గమ్యానికి చేరి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. షూటర్ల గురి కుదరలేదు భారత షూటర్లకు ఆదివారం అచి్చరాలేదు. ఆదివారం లక్ష్యంపై గురి పెట్టిన ఏ షూటర్ కూడా పోడియంపై నిలువలేకపోయాడు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్1) ఈవెంట్లో అవని లేఖరా 11వ స్థానంలో నిలువగా, సిద్ధార్థ బాబు 28వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. ఇదే విభాగం వ్యక్తిగత ఈవెంట్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన అవని గురి ‘మిక్స్డ్’లో మాత్రం కుదర్లేదు. ఆమె 632.8 స్కోరు చేయగా, సిద్ధార్థ 628.3 స్కోరు చేశాడు. ఈ ఈవెంట్ల్లో టాప్–8 స్థానాల్లో నిలిచిన వారే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్2) ఈవెంట్లోనూ శ్రీహర్ష రామకృష్ణకు క్వాలిఫయింగ్‌లోనే చుక్కెదురైంది. అతను 630.2 స్కోరుతో 26వ స్థానంలో నిలిచాడు. రోయింగ్‌లో నిరాశ భారత రోయింగ్ జోడీ కొంగనపల్లి నారాయణ–అనితకు పారాలింపిక్స్‌లో నిరాశ ఎదురైంది. ఆసియా పారా క్రీడల్లో రజత పతకం నెగ్గుకొచి్చన ఈ జంట పారిస్ నుంచి రిక్తహస్తాలతో రానుంది. ఆదివారం జరిగిన పీఆర్3 మిక్స్డ్ డబుల్ స్కల్స్ రోయింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నారాయణ–అనిత జోడీ ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. 7 నుంచి 12వ స్థానాల కోసం నిర్వహించిన వర్గీకరణ పోటీల్లో భారత ద్వయానికి 8వ స్థానం దక్కింది. ఈ జంట పోటీని 8 నిమిషాల 16.96 సెకన్లలో పూర్తి చేసింది. ఆర్మీ సిపాయి అయిన కొంగనపల్లి నారాయణ 2015లో జమ్మూ కశీ్మర్లోని సరిహద్దు విధుల్లో ఉండగా ల్యాండ్‌మైన్ పేలి ఎడమ కాలిని మోకాలు నుంచి పాదం వరకు పూర్తిగా కోల్పోయాడు. అనిత రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయింది. -
వినేశ్ రజత పతకం అప్పీల్‌పై తీర్పు నేడు!
పారిస్: క్రీడాలోకమే కాదు... యావత్ దేశం ఎదురుచూపులకు నేడు తెరపడే అవకాశముంది. భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అప్పీల్‌పై నేడు తీర్పు వెలువడనుంది. పారిస్ విశ్వక్రీడల్లో మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్లోకి ప్రవేశించిన ఆమె సరిగ్గా బౌట్‌కు ముందు కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. దీంతో ఫైనల్లో ఓడినా కనీసం ఖాయమనుకున్న రజతం చేజారడంతో పాటు... అమె పాల్గొన్న వెయిట్ కేటగిరీ జాబితాలో చివరి స్థానంలో నిలవడం భారతావనిని నిర్ఘాంత పరిచింది. తన అనర్హతపై సవాలుకు వెళ్లిన ఫొగాట్... సంయుక్త రజతం డిమాండ్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో అప్పీలు చేసింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నిష్ణాతులైన లాయర్లతో ఈ అప్పీలుపై వాదించింది. విచారణ పూర్తికావడంతో నేడు సీఏఎస్ తుది తీర్పు వెలువరించనుంది. కాగా ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ... వినేశ్ బరువు పెరగడం, అనర్హతకు బాధ్యుడిని చేస్తూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పర్దివాలాపై విమర్శలకు దిగడం సమంజసం కాదని చెప్పింది.సంబంధిత అథ్లెట్ల బరువు, ఈవెంట్ల నిబంధనలపై కోచ్, వ్యక్తిగత సిబ్బంది జాగ్రత్తగా ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడింది. -
Tanisha Bajia: జేబులో దాగిన స్థైర్యం.. చెయ్యెత్తి జై కొట్టింది
ఆ అమ్మాయి స్కూల్‌కు వచ్చినన్ని రోజులు ఎడమ చేతిని ఎవరూ చూళ్లేదు. దానిని స్కర్ట్ జేబులో పెట్టుకుని ఉంటే అదామె అలవాటనుకున్నారు. కాని అసలు రహస్యం ఏమిటంటే ఎడమ అర చెయ్యి లేకుండా పుట్టింది తనీషా. స్కూల్లో ఎగతాళి చేయకుండా ఉండడానికి మణికట్టుకు దుపట్టా చుట్టి జేబులో దాచేది. కాని ఇప్పుడు దాచడం లేదు. గత నెల బెంగళూరులో జరిగిన 13వ జాతీయ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో గెలిచిన రజత పతకం ఆమె చేతికి గౌరవాన్ని ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టింది.ఆరావళి పర్వతాలు చుట్టుముట్టిన రాజస్థాన్‌లోని సికార్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్లోయి తనీషా సొంత గ్రామం. తన వైకల్యాన్ని చూసి ఇతర పిల్లలు ఆట పట్టించడంతో స్కూల్‌కు వెళ్లకుండా తనీషా ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోయేది. దీంతో ఆమెను గ్రామానికి దూరంగా ఉన్న వేరే పాఠశాలలో చేర్పించారు. అక్కడ కూడా వెక్కిరింపులు ఎదురు కాకుండా ఉండడానికి ఉపాధ్యాయులకు, తోటిపిల్లలకు తెలియకుండా తన అంగవైకల్యాన్ని జేబులో దాచిపెట్టింది. అంగవైకల్యాన్ని దాచి పెట్టడం అంటే... ఒంటరితననానికి దగ్గర కావడమే.గెలుపుతో విముక్తి‘ఇప్పుడు నా ఎడమ చెయ్యిని దాచాల్సిన అవసరం లేదు’ అంటోంది తనీషా. అద్భుతమైన బెంగళూరు విజయంతో ఆమె ఎడమ చేయి జేబు నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అది అంగవైకల్యంలా అనిపించడం లేదు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది. ఒకప్పుడు తనీషాకు నలుగురితో కలవడం తెలియదు. నలుగురితో కలిసి నవ్వడం తెలియదు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. స్వేచ్ఛా జీవితపు మాధుర్యాన్ని రుచి చూస్తోంది. ‘ఇప్పుడు నన్ను ఎవరూ ఎగతాళిగా కామెంట్ చేయడం లేదు’ చిరునవ్వుతో అంది తనీషా. గత ఏడాదిలో రాష్ట్ర, జాతీయ చాంపియన్‌షిప్‌లలో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో సహా అయిదు పతకాలు సాధించింది. ‘ఈ పతకాలు నా జీవితాన్ని మార్చేసాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నా ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది’ అంటుంది తనీషా.తొలిసారి పట్టుదల‘నాకు 1,500 మీటర్ల తొలి పరుగు పందెం గుర్తుంది. పోటీలో నన్ను చూసి ఇతర పోటీదారులు నవ్వుతున్నారు. దాంతో పోటీలో పాల్గొనడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. మా నాన్నమాత్రం ఎలాగైనా సరే, పాల్గొనాల్సిందే అన్నాడు. దాంతో సర్వశక్తులు ఒడ్డి పరుగెత్తాను.నాలుగోస్థానంలో నిలిచినప్పుడు అందరూ వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక ఇప్పటినుంచి నేను కూడా ఏదైనా చేయగలను అనే నమ్మకం కలిగింది’ అని ఆ రోజును గుర్తు చేసుకుంది తనీషా.జూలైలో పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియానికి వెళ్లిన తనీషా వందలాది మంది ప్రేక్షకులను చూసి కంగారు పడింది. ‘ఇప్పుడు సాధించకపోతే సంవత్సరం శ్రమ వృథా అయిపోతుంది’ అనుకుంది మనసులో. అనుకోవడమే కాదు 400 మీటర్ల రేసును విజయవంతంగా పూర్తి చేసి రజత పతకం గెలుచుకుంది. ‘ఇప్పుడు ఉన్నంత సంతోషంగా నా కూతురు ఎప్పుడూ లేదు. ఆటలు ఆమెను పూర్తిగా మార్చివేసాయి’ అంటోంది తల్లి భన్వారీదేవి. నాన్న నిలబడ్డాడుపుట్టినప్పుడు ఎడమ అర చెయ్యి లేకపోవడంతో తనీషాను తండ్రి ఇంద్రజ్ బాజియా ఓ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు. ఈ అమ్మాయి మీకు దేవుడు ఇచ్చిన వరం. ప్రేమగా చూసుకోండి... అన్నాడు ఆ డాక్టర్. ఆయన మాటలు తండ్రిలోని దిగులును మాయం చేశాయి. ఇక అప్పటి నుంచి ఎలాంటి వివక్షత చూపకుండా ఆమెను ఆటల్లో ప్రోత్సహించాడు తండ్రి. ‘తనీషా బాగా పరుగెడుతుంది. ఇంకా ఎన్నో విజయాలు సాధించే సామర్థ్యం ఆమెలో ఉంది. తనీషాకు శిక్షణ ఇవ్వడానికి ప్రతివారం ఆమె గ్రామానికి వెళుతుంటాను’ అంటుంది తనీషా కోచ్ సరితా బవేరియా. నేషనల్ లెవల్ ప్లేయర్ అయిన సరిత బవేరియా దివ్యాంగులైన పిల్లలకు ఆటల్లో శిక్షణ ఇస్తుంటుంది. -
వినేశకు రజతం ఇవ్వాలి: సచిన్ టెండూల్కర్
-
నిజమైన విజేతవు నీవే బంగారం!
క్రీడలే జీవితంగా భావించే వారు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఒలింపి క్స్‌లో పతకం సాధించాలని కోరుకొంటారు. పతకం కోసం అహరహం శ్రమిస్తూ సంవ త్సరాల తరబడి సాధన చేస్తూ ఉంటారు. అయితే... గెలుపు, ఓటమితో సంబంధం లేని ఓ సాంకేతిక కారణంతో స్వర్ణపతకం చేజారితే... కనీసం రజత పతకమైనా దక్కకుంటే అంతకుమించిన విషాదం మరొకటి ఉండదు. ప్రస్తుత ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల కుస్తీ 50 కిలోల విభాగంలో భారత మల్లయోధురాలు వినేశ్ పోగట్‌కు అదే పరిస్థితి ఎదు రయ్యింది. వంద గ్రాముల అదనపు బరువు కొండంత దురదృష్టాన్ని, గుండెబరువును మిగిల్చింది.ఒలింపిక్స్‌లో పతకం మినహా ప్రపంచ కుస్తీలోని అన్ని రకాల పోటీలలో పతకాలు సాధించిన ఘనత వినేశ్‌కు ఉంది. 49 కిలోలు, 50 కిలోలు, 53 కిలోల విభాగాలలో పాల్గొంటూ చెప్పుకోదగ్గ విజయాలు, ఎన్నో పతకాలు సాధించిన ఘనత ఉంది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ పోటీలలో సైతం స్వర్ణ, కాంస్య పతకాలు సాధించిన వినేశ్‌కు ఒలింపిక్స్ పతకం మాత్రం గత పుష్కరకాలంగా అందని ద్రాక్షలా ఉంటూ వచ్చింది.2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటూ గాయంతో వైదొలిగిన వినేశ్ 2020 టోక్యో ఒలింపి క్స్‌లో మాత్రం స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయింది. ఇక 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి కొద్దిమాసాల ముందు వినేశ్ న్యాయం కోసంముందుగా రోడ్లు, ఆ తరువాత న్యాయస్థానాల మెట్లు ఎక్కి పోరాడాల్సి వచ్చింది.అంతర్జాతీయ కుస్తీ పోటీలలో పాల్గొంటూ, దేశానికి పతకాలతో ఖ్యాతి తెస్తున్న ఏడుగురు మహిళా వస్తాదులపై బీజెపీ మాజీ ఎంపీ, జాతీయ కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్, ఆయన పరివారం లైంగిక వేధింపులకు పాల్పడటానికి నిరసనగా భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ లాంటి దిగ్గజ వస్తాదులతో కలసి వినేశ్ గొప్ప పోరాటమే చేసింది. చివరకు ఢిల్లీ పోలీసుల కాఠిన్యాన్ని రుచి చూడాల్సి వచ్చింది. న్యాయస్థానాల జోక్యంతో బ్రిజ్ భూషణ్ అధ్యక్షపదవిని వీడక తప్పలేదు.మొక్కవోని దీక్షతో, మోకాలి శస్త్ర చికిత్సను సైతం భరించి, పోరాడి ప్యారిస్ ఒలింపిక్స్ 50 కిలోల విభాగంలో పాల్గొనటానికి అర్హత సంపాదించింది. 53 కిలోల విభాగంలో తనకు అవకాశం లేకపోడంతో యాభై కిలోల విభాగంలో పాల్గొనటం కోసం బరువు తగ్గించుకొని మరీ ప్యారిస్‌లో అడుగుపెట్టింది. మహిళా కుస్తీ 50 కిలోల విభాగం పోటీల తొలిరోజున 50 కిలోల బరువుతోనే జపాన్, ఉక్రెయిన్, క్యూబా బాక్సర్లను చిత్తు చేయడం ద్వారా ఫైనల్లో అడుగు పెట్టింది. వినేశ్ ఫైనల్స్ చేరడంతో బంగారు పతకం ఖాయమనే శతకోటి భారత క్రీడాభిమానులు ఆశ పడ్డారు. కానీ జరిగింది వేరు. అంతర్జాతీయ కుస్తీ సమాఖ్య నిబంధనల ప్రకారం పోటీలు జరిగే ప్రతి రోజూ వివిధ విభాగాలలో పోటీకి దిగే వస్తాదుల బరువును చూసిన తరువాతే పోటీకి అనుమతిస్తారు. అయితే...పోటీల తొలిరోజున 50 కిలోల బరువున్న వినేశ్... స్వర్ణపతం కోసం పోటీపడే రోజున మాత్రం 100 గ్రాముల బరువు అదనంగా ఉండడంతో అనర్హత వేటు వేశారు. బరువును నియంత్రించుకోడం కోసం ఫైనల్‌కు ముందురోజు రాత్రి వినేశ్, ఆమె శిక్షకులు చేయని ప్రయత్నం అంటూ ఏమీలేదు. తెల్లవార్లూ నడకతో, సైక్లింగ్ చేస్తూ, విపరీతమైన వేడితో ఉండే ఆవిరి గదిలో వినేశ్ గడిపింది. చివరకు బరువు తగ్గించుకోవటం కోసం శిరోజాలను సైతం కత్తిరించుకొన్నా ప్రయోజనం లేకపోయింది. వంద గ్రాముల అదనపు బరువు కారణంగా బంగారు పతకం కోసం పోటీ పడే అవకాశాన్ని కోల్పోడంతో పాటు... కనీసం రజత పత కానికి సైతం నోచుకోలేకపోయింది. అదనపు బరువు నిబంధన కారణంగా వినేశ్‌కు బంగారు పతకం పోరులో పాల్గొనే అవకాశాన్ని నిరాకరించడం గుండె కోతను మిగిల్చింది. వినేశ్తో పాటు కోట్లాది క్రీడాభి మానులు, యావత్ భారతజాతి తల్లడిల్లిపోయింది.అదనంగా ఉన్న 100 గ్రాముల బరువే తనకు ఒలింపిక్స్ పతకం సాధించే అవకాశం లేకుండా చేయటాన్ని జీర్ణించుకోలేని వినేశ్ అర్ధంతరంగా రిటై ర్మెంట్ ప్రకటించింది. వినేశ్‌కు న్యాయం చేయాలంటూ అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘానికి భారత కుస్తీ సమాఖ్య అప్పీలు చేసింది. ఫైనల్ బరిలో దిగకుండానే సర్వం కోల్పోయిన వినేశ్‌కు కనీసం రజత పతకమైనా ఇవ్వాలంటూ మొరపెట్టుకొన్నారు. రజత పతకాలు ఇద్దరికీ ఇచ్చినా ఇబ్బంది రాదని అంటున్నారు.వినేశ్‌కు ప్రధాని, కేంద్ర క్రీడామంత్రి; భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో పాటు పలు వురు క్రీడాదిగ్గజాలు, సింధు లాంటి ఒలింపియన్లు అండగా నిలిచారు.ప్రతిభకు, బరువుకు సంబంధం ఏంటని పలు వురు నిపుణులు, ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. 100 గ్రాముల అదనపు బరువుతో ప్రత్యర్థికి జరిగే నష్టమేంటని నిలదీస్తున్నారు. హార్మోనుల అసమతౌల్యత వల్ల మహిళల బరువు తరచూ మారిపోతూ ఉంటుందని, ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని మినహా యింపు ఇవ్వాలంటూ సూచిస్తున్నారు.భారత ఒలింపిక్స్ సంఘం మొరను అంతర్జా తీయ ఒలింపిక్స్ సంఘం ఆలకించినా... ఆలకించ కున్నా, కనీసం రజత పతకం ఇచ్చినా, ఇవ్వకున్నా... నిజమైన విజేతగా కోట్లాది మంది క్రీడాభిమానుల గుండెల్లో వినేశ్ పోగట్ నిలిచిపోతుంది.వ్యాసకర్త సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ మొబైల్: 84668 64969 -
Paris Olympics 2024: రజత నీరాజనం
పారిస్: పసిడి ఆశలతో ‘పారిస్’లో అడుగు పెట్టిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. రెండో ప్రయత్నంలో 26 ఏళ్ల నీరజ్ జావెలిన్‌ను 89.45 మీటర్ల దూరం విసిరి ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. చివరకు ఈ స్కోరుతోనే నీరజ్‌కు రజత పతకం ఖరారైంది.క్వాలిఫయింగ్‌లో 89.34 మీటర్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచిన నీరజ్ ఫైనల్లో కాస్త ఒత్తిడికి లోనయ్యాడు. అతడి తొలి ప్రయత్నం ఫౌల్ అయింది. రెండో ప్రయత్నంలో నీరజ్ ఆందోళన చెందకుండా సంయమనంతో జావెలిన్‌ను 89.45 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత నీరజ్ మూడు, నాలుగు, ఐదు, ఆరో ప్రయత్నాలు కూడా ఫౌల్గానే నమోదయ్యాయి. దాంతో ఈ త్రోలలో నమోదైన స్కోరును పరిగణనలోకి తీసుకోలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఎవరూ ఊహించని విధంగా జావెలిన్ త్రోలో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకొని అందర్నీ నివ్వెరపరిచాడు. 27 ఏళ్ల నదీమ్ తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే రెండో ప్రయత్నంలో నదీమ్ జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరి కొత్త ఒలింపిక్ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఆండ్రెస్ థోర్కిల్డ్సన్ (నార్వే; 90.57 మీటర్లు) నెలకొల్పిన రికార్డును నదీమ్ బద్దలు కొట్టాడు. ప్రపంచ మాజీ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) 88.54 మీటర్లతో కాంస్య పతకాన్ని సాధించాడు. 1 వ్యక్తిగత క్రీడాంశంలో ఒలింపిక్స్ చరిత్రలో పాకిస్తాన్‌కు తొలి స్వర్ణ పతకం నదీమ్ ద్వారా లభించింది. గతంలో పాకిస్తాన్ హాకీ జట్టు 3 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు గెలిచింది. 1960 రోమ్ ఒలింపిక్స్ రెజ్లర్ మొహమ్మద్ బషీర్ కాంస్యం... 1988 సియోల్ ఒలింపిక్స్‌లో బాక్సర్ హుస్సేన్ షా కాంస్యం సాధించారు. 4 ఒలింపిక్స్ క్రీడల్లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన నాలుగో భారత ప్లేయర్‌గా నీరజ్ గుర్తింపు పొందాడు. గతంలో రెజ్లర్ సుశీల్ (2008 బీజింగ్; కాంస్యం... 2012 లండన్; రజతం), షట్లర్ పీవీ సింధు (2016 రియో; రజతం... 2020 టోక్యో; కాంస్యం), షూటర్ మనూ భాకర్ (2024 పారిస్; 2 కాంస్యాలు) ఈ ఘనత సాధించారు. -
కంటిచూపుతో...
టీ షర్ట్‌తో క్యాజువల్ లుక్... ఎడమ చేయి ప్యాంట్ జేబులో... లక్ష్యాన్ని స్పష్టంగా చూసేందుకు ఎలాంటి ప్రత్యేకమైన లెన్స్‌లు లేవు, ఐ కవర్ లేదు, పక్కనుంచి వచ్చే కాంతి నుంచి తప్పించుకునేందుకు వైజర్ పెట్టుకోలేదు, ఇయర్ ప్రొటెక్షన్ లేదు. లక్ష్యంపై గురి...ట్రిగ్గర్‌పై వేలు... నొక్కితే దేశానికి రజత పతకం వచ్చేసింది! టర్కీ షూటర్ యూసుఫ్ డికెక్ ఒక్కసారిగా పారిస్ ఒలింపిక్స్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు. సాధారణంగా షూటర్లు పోటీలో దిగినప్పుడు తమతో పాటు ధరించే సరంజామా ఏదీ అతను వాడలేదు. ఏదో అలా వ్యాహ్యాళికి వెళుతూ బొమ్మ తుపాకీతో సంతలో బెలూన్లను కొట్టినంత అలవోకగా అతను బుల్లెట్లను దించేయడం విశేషం. టర్కీ ఆర్మీలో సైనికుడైన 51 ఏళ్ల యూసుఫ్ హాలీవుడ్ సినిమాల స్టయిల్‌ను గుర్తుకు తెచ్చేలా షూటింగ్ చేశాడంటూ కామెంట్లు రావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో తర్హాన్‌తో కలిసి యూసుఫ్ రజతం సాధించాడు. షూటింగ్లో టర్కీకి ఇదే తొలి మెడల్. -
భారత ఆటగాడు రాజా రిత్విక్‌కు రజతం
ఫ్రాన్స్‌లో జరిగిన ‘లా ప్లాన్’ ఓపెన్ ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్íÙప్లో భారత గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ రజత పతకం సాధించాడు. 9 రౌండ్ల పాటు జరిగిన ఈ ఈవెంట్లో తెలంగాణకు చెందిన రిత్విక్ తొమ్మిదో సీడ్లో బరిలోకి దిగి 5 విజయాలు, 4 ‘డ్రా’ల తర్వాత మొత్తం 7 పాయింట్లు సాధించాడు. మరో ముగ్గురు ఆటగాళ్లు ఇన్నియాన్ పన్నీర్‌సెల్వం, ప్రణీత్ ఉప్పల, ధూళిపాళ బాలచంద్రప్రసాద్లతో సమంగా నిలిచాడు. అయితే టైబ్రేక్ ఆధారంగా రిత్విక్‌కు రెండో స్థానం దక్కగా, ఇన్నియాన్కు కాంస్యం లభించింది. ఫ్రెంచ్ జీఎం జూల్స్ మాసర్డ్ 7.5 పాయింట్లతో స్వర్ణం గెలుచుకున్నాడు. జూల్స్, రిత్విక్ మధ్యే జరిగిన 9వ రౌండ్ పోరు 28 ఎత్తుల తర్వాత డ్రాగా ముగిసింది. ఈ టోర్నీలో 17 దేశాలకు చెందిన 184 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో 17 మంది గ్రాండ్‌మాస్టర్లు, 40 మంది ఇంటర్నేషనల్ మాస్టర్లు ఉన్నారు. రాజా రితి్వక్ ఇటీవలే జాతీయ ర్యాపిడ్ చాంపియన్íÙప్లో కాంస్యం, జాతీయ బ్లిట్జ్ చాంపియన్íÙప్లో రజతం గెలుచుకున్నాడు. -
రెజ్లర్ అమన్‌కు రజతం
పొల్యాక్ ఇమ్రి–వర్గా జోనస్ స్మారక ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నీలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ రజత పతకం సాధించాడు. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో అమన్ పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. రె హిగుచి (జపాన్)తో జరిగిన ఫైనల్లో అమన్ 1–11 పాయింట్లతో ఓడిపోయాడు. నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన అమన్ 11–1తో రొబెర్టి డింగా‹Ùవిలి (జార్జియా)పై, సెమీఫైనల్లో 14–4తో టిసిటర్న్ (బెలారస్)పై గెలుపొందాడు. -
శీతల్ దేవి అద్భుతం: సాధారణ ఆర్చర్లతో పోటీ పడి మరీ!
న్యూఢిల్లీ: ఆర్చరీ పారా క్రీడల్లో వరుస విజయాలతో సత్తా చాటి ‘అర్జున’ అవార్డు అందుకున్న దివ్యాంగురాలు శీతల్ దేవి అరుదైన ఘనతను సాధించింది. రెండు చేతులు కూడా లేని శీతల్ ‘ఖేలో ఇండియా’ క్రీడల్లో సాధారణ ఆర్చర్లతో పోటీ పడి రజత పతకం సాధించడం విశేషం. జూనియర్ వరల్డ్ చాంపియన్ ఏక్తా రాణి ఈ పోటీల్లో స్వర్ణం గెలుచుకోగా... ఫైనల్లో ఏక్తా చేతిలో 140–138 తేడాతో శీతల్ ఓడింది. ‘ఫోకోమెలియా’ అనే అరుదైన వ్యాధి బారిన పడి రెండు చేతులు కోల్పోయిన శీతల్... గత ఏడాది పారా ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకుంది. పారా ఈవెంట్లలో కాకుండా సాధారణ పోటీల్లో పాల్గొంటే తగిన సాధన లభించడంతో పాటు ఆమెలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే ఈ ప్రయత్నం చేశామని శీతల్ కోచ్ అభిలాష వెల్లడించారు. -
రజతంగా ఐశ్వర్య కాంస్యం
గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ ఐశ్వర్య మిశ్రా కాంస్యం సాధించింది. అయితే ఇప్పుడు ఆమె ప్రదర్శనకు రజత పతకంగా ప్రమోషన్ దక్కింది. ఈ ఈవెంట్లో రజతం సాధించి ఉజ్బెకిస్తాన్ అథ్లెట్ ఫరీదా సొలియెవా డోపింగ్ పరీక్షలో పట్టుబడింది. దాంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ఆమెపై 3 ఏళ్ల నిషేధం విధించింది. ఫలితంగా ఐశ్వర్య టైమింగ్ (53.07)ను రెండో స్థానంగా గుర్తిస్తూ ఆమె కాంస్యాన్ని రజతంగా మార్చారు. -
Strandja Memorial Boxing: నిఖత్‌కు రజతం
సోఫియా- Amit Panghal and Sachin win Gold: బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు లభించాయి. మహిళల 50 కేజీల ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 2–3తో సబీనా (ఉజ్బెకిస్తాన్) చేతిలో, 66 కేజీల ఫైనల్లో అరుంధతి 1–4తో లి యంగ్ (చైనా) చేతిలో ఓడి రజత పతకాలను దక్కించుకున్నారు. పురుషుల 51 కేజీల ఫైనల్లో అమిత్ 5–0తో తష్కెంబే (కజకిస్తాన్)పై, 57 కేజీల ఫైనల్లో సచిన్ 5–0తో షఖ్జోద్ (ఉజ్బెకిస్తాన్)పై నెగ్గి స్వర్ణాలు సాధించారు. ఫైనల్స్‌లో బరున్ సింగ్ (48 కేజీలు), రజత్ (67 కేజీలు) ఓడి రజత పతకాలు గెలిచారు. Take a look at 🇮🇳's #Silver🥈& #Bronze🥉medalists of the 7⃣5⃣th Strandja Cup, 🇧🇬 *Nikhat: 🥈in 51kg weight category * Arundhati:🥈in 66kg weight category * Barun:🥈in 48kg weight category * Rajat: 🥈in 67kg weight category * Akash:🥉in 67kg weight category * Naveen:🥉in… pic.twitter.com/K0LqKHM8FT — SAI Media (@Media_SAI) February 11, 2024 -
Preeti Rajak: సుబేదార్ ప్రీతి
ఆర్మీలో మొదటిసారి ఒక మహిళ ‘సుబేదార్’ ర్యాంక్‌కు ప్రమోట్ అయ్యింది. రెండేళ్ల క్రితం ఆర్మీలో హవల్దార్‌గా చేరిన ప్రీతి రజక్ తన క్రీడాప్రావీణ్యంతో ఆసియన్ గేమ్స్‌లో ట్రాప్ షూటర్‌గా సిల్వర్ మెడల్ సాధించింది. దేశవ్యాప్తంగా యువతులను ఆర్మీలో చేరేలా ఆమె స్ఫూర్తినిచ్చిందని ఆమెకు ఈ గౌరవం కల్పించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రీతి రజక్ ఆర్మీలో ‘సుబేదార్’ ర్యాంక్‌కు ప్రమోట్ అయ్యింది. ఆర్మీలో ‘సుబేదార్’ అనిపించుకోవడం చిన్న విషయం కాదు. ‘సిపాయి’ నుంచి మొదలయ్యి ‘లాన్స్ నాయక్’, ‘నాయక్’, ‘హవల్దార్’, ‘నాయబ్ సుబేదార్’... ఇన్ని దశలు దాటి ‘సుబేదార్’ అవుతారు. ఆర్మీలో మహిళల రిక్రూట్మెంట్ 1992లో మొదలయ్యాక సంప్రదాయ అంచెలలో ఒక మహిళ సుబేదార్‌గా పదవి పొందటం ఇదే మొదటిసారి. ఆ మేరకు ప్రీతి రజక్ రికార్డును నమోదు చేసింది. ట్రాప్ షూటర్‌గా ఆసియన్ గేమ్స్‌లో ఆమె చూపిన ప్రతిభను గుర్తించిన ఉన్నత అధికారులు ఆమెను ఈ విధంగా ప్రోత్సహించి గౌరవించారు. ► లాండ్రీ ఓనరు కూతురు ఇరవై రెండేళ్ల ప్రీతి రజక్ది మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ సమీపంలో ఉన్న నర్మదాపురం. దిగువ మధ్యతరగతి కుటుంబం. తండ్రి లాండ్రీషాపు నడుపుతాడు. తల్లి సామాజిక సేవలో ఉంది. ముగ్గురు అక్కచెల్లెళ్లలో రెండవ సంతానమైన ప్రీతి చిన్నప్పటి నుంచీ ఆటల్లో చురుగ్గా ఉండేది. క్రీడలంటే ఆసక్తి ఉన్న తండ్రి తన కూతుళ్లను శక్తిమేరకు క్రీడాకారులు చేయదలిచి ప్రోత్సహించాడు. అలా ప్రీతి షూటింగ్‌లోకి వచ్చింది. భోపాల్‌లోని స్పోర్ట్స్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న సమయంలోనే ప్రీతి జాతీయ స్థాయిలో ప్రతిభ చూపింది. పతకాలు సాధించింది. దాంతో ఆర్మీలో స్పోర్ట్స్ కోటాలో మిలటరీ పోలీస్ డివిజన్లో నేరుగా 2022లో హవల్దార్ ఉద్యోగం వచ్చింది. ► ఏ సాహసానికైనా సిద్ధమే ఆర్మీలో చేరినప్పటి నుంచి ప్రీతి ఏ సాహసానికైనా సిద్ధమే అన్నట్టుగా పనిచేస్తూ పై అధికారుల మెప్పు పొందింది ప్రీతి. షూటింగ్‌ను ప్రాక్టీస్ చేయాలంటే ఖర్చుతో కూడిన పని. కాని ఆర్మీలో చేరాక ఆమెకు శిక్షణ మరింత సులువైంది. అందుకు కావలసిన గన్స్ ఆమెకు మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. ఇక చైనాలో జరిగిన 2023 ఆసియన్ గేమ్స్‌లో షార్ట్ పిస్టల్ విభాగంలో ప్రీతి రజత పతకం సాధించడంతో ఆర్మీ గౌరవంతో పాటు దేశ గౌరవమూ ఇనుమడించింది. ‘నేటి యువతులు ఇళ్లల్లో కూచుని ప్రతిభను వృథా చేయొద్దు. ఇంటినుంచి బయటకు రండి’ అని ప్రీతి ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. దాంతో చాలామంది అమ్మాయిలు ఆర్మీలో చేరడానికి ఉత్సాహం చూపారు. ఇది పై అధికారులకు మరింతగా సంతోషం కలిగించడంతో జనవరి 28, 2024న ఆమెకు సుబేదార్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ► పారిస్ ఒలింపిక్స్‌కు ఈ సంవత్సరం జూలైలో పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో ఎలాగైనా పతకం తేవడానికి ప్రీతికి ఆర్మీ వారే శిక్షణ ఇస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని మహౌలోని ‘ఆర్మీ మార్క్స్‌మెన్‌షిప్ యూనిట్’ (ఏ.ఎం.యు.)లో ప్రీతికి ప్రస్తుతం శిక్షణ కొనసాగుతూ ఉంది. జాతీయ స్థాయిలో మహిళా ట్రాప్ షూటింగ్లో విభాగంలో ఆరవ ర్యాంక్‌లో ఉంది ప్రీతి. ఆమె గనక ఒలింపిక్ మెడల్ సాధిస్తే ఆర్మీలో ఆమెకు దొరకబోయే ప్రమోషన్ మరింత ఘనంగా గర్వపడే విధంగా ఉంటుంది. -
వెయిట్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్ సాధించిన సినీ నటి
-
NSG: ఆంధ్రప్రదేశ్ తైక్వాండో బృందానికి పతకాలు
జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ “తైక్వాండో” అండర్ – 14,17, 19 బాల, బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బృందానికి పతకాలు లభించాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఏపీ టీమ్ మొత్తంగా ఒక రజతం, మూడు కాంస్య పతకాలు గెలుచుకుంది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విజేతలను అభినందించారు. ఇక.. మధ్యప్రదేశ్‌లోని ‘బీటల్’ వేదికగా డిసెంబరు 31 నుంచి జనవరి 5 వరకు ఈ పోటీలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు తెలిపారు. విజేతలు వీరే: ►అండర్ 19 బాలికల (52-55 కేజీలు) విభాగంలో- హస్తి తేజస్విని (యస్.వి.జూనియర్ కాలేజీ ,కోడూరు ఆర్.యస్. అన్నమయ్య జిల్లా)కి రజత పతకం ►అండర్ 19 బాలికల (46-49 కేజీలు ) విభాగంలో వారణాసి హిమ శ్రీ (మున్సిపల్ హై స్కూల్ , కస్పా, విజయనగరం)కి కాంస్య పతకం ►అండర్ 14 బాలికల (16-18 కేజీలు) విభాగంలో ఆకుల సమీరా (జెడ్పీహెచ్ఎస్, భాగ్యనగరం, దొర్నిపాడు, మండలం, నంద్యాల జిల్లా)కి కాంస్య పతకం ►అండర్ 17 బాలురు (73-78 కేజీలు) విభాగంలో పెదగాడి ధనుష్ తేజ(ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అశోక్ నగర్, కాకినాడ, కాకినాడ జిల్లా)కు కాంస్య పతకం -
పారా ఆర్చర్ శీతల్‌కు స్వర్ణం, రజతం
ఆసియా పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలు లభించాయి. ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు నెగ్గి అందరి ప్రశంసలు అందుకున్న శీతల్ దేవి ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ రాణించింది. రెండు చేతులు లేకున్నా తన కాళ్లతో విల్లు ఎక్కుపెట్టి బాణాలు సంధించే శీతల్ ఈ టోర్నీలో మిక్స్డ్ టీమ్ విభాగంలో రాకేశ్‌తో కలిసి స్వర్ణం... వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో శీతల్ దేవి ‘షూట్ ఆఫ్’లో సింగపూర్ ప్లేయర్ నూర్ సియాదా చేతిలో ఓడిపోయింది. -
జ్యోతి సురేఖకు స్వర్ణం, రజతం
బ్యాంకాక్: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రెండు పతకాలు గెలిచింది. గురువారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రజతం, టీమ్ విభాగంలో స్వర్ణం సాధించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ 145–145 (8/9) ‘షూట్ ఆఫ్’లో భారత్‌కే చెందిన పర్ణీత్ కౌర్ చేతిలో ఓడిపోయింది. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరి స్కోర్లు సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందు ఇద్దరికి ఒక్కో షాట్ అవకాశం ఇచ్చారు. జ్యోతి సురేఖ బాణం 8 పాయింట్ల వృత్తంలోకి వెళ్లగా... పంజాబ్‌కు చెందిన 18 ఏళ్ల పర్ణీత్ కౌర్ 9 పాయింట్ల షాట్‌తో తొలి అంతర్జాతీయ వ్యక్తిగత స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత బృందం కాంపౌండ్ టీమ్ ఫైనల్లో 234–233తో చైనీస్ తైపీని ఓడించి పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇప్పటి వరకు ఏడుసార్లు ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న జ్యోతి సురేఖ ఓవరాల్‌గా 5 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో అదితి–ప్రియాంశ్ జోడీ 156–151తో కనోక్నాపుస్–నవాయుత్ (థాయ్‌లాండ్) జంటను ఓడించి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో అభిషేక్ వర్మ 147–146తో జూ జేహూన్ (దక్షిణ కొరియా)ను ఓడించాడు. -
తనిష్క్ బృందానికి రజతం
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆదివారం భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ ప్లేయర్ కొడవలి తనిష్క్ మురళీధర్ నాయుడు, రాజ్కన్వర్ సింగ్ సంధూ, సమీర్లతో కూడిన భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది. తనిష్క్ (569), సమీర్ (573), రాజ్కన్వర్ (579) బృందం ఓవరాల్‌గా 1721 పాయింట్లు స్కోరు చేసి రజత పతకం కైవసం చేసుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ జాహిద్ హుస్సేన్ రజత పతకం సొంతం చేసుకున్నాడు. జాహిద్ 624.5 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. మరో మూడు రోజులపాటు కొనసాగే ఈ చాంపియన్íÙప్లో ప్రస్తుతం భారత్ 8 స్వర్ణాలు, 12 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 25 పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
Asian Games 2023: అదే జోరు...
వంద పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడాకారుల బృందం ఆ దిశగా సాగుతోంది. పోటీలు మొదలైన తొలి రోజు నుంచే పతకాల వేట మొదలు పెట్టిన భారత క్రీడాకారులు దానిని వరుసగా తొమ్మిదోరోజూ కొనసాగించారు. ఆదివారం ఈ క్రీడల చరిత్రలోనే ఒకేరోజు అత్యధికంగా 15 పతకాలు సాధించిన భారత క్రీడాకారులు సోమవారం ఏడు పతకాలతో అలరించారు. అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్న అథ్లెట్లు మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించగా... ఎవరూ ఊహించని విధంగా రోలర్ స్కేటింగ్‌లో రెండు కాంస్య పతకాలు వచ్చాయి. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో సుతీర్థ–అహిక ముఖర్జీ సంచలన ప్రదర్శనకు కాంస్య పతకంతో తెరపడింది. ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్, స్క్వా‹Ùలోనూ భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యం చాటుకొని పతకాల రేసులో ముందుకెళ్లారు. తొమ్మిదో రోజు తర్వాత ఓవరాల్‌గా భారత్ 13 స్వర్ణాలు, 24 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 60 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: షూటర్ల పతకాల వేట ముగిసినా వారిని స్ఫూర్తిగా తీసుకొని భారత అథ్లెట్స్ ఆసియా క్రీడల్లో అదరగొడుతున్నారు. సోమవారం భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. అందులో అథ్లెట్స్ మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి నాలుగు అందించారు. రోలర్ స్కేటింగ్‌లో రెండు కాంస్యాలు, టేబుల్ టెన్నిస్‌లో ఒక కాంస్యం దక్కింది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో ఆసియా చాంపియన్, భారత స్టార్ పారుల్ చౌధరీ రజత పతకం నెగ్గగా... భారత్‌కే చెందిన ప్రీతి కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ చాంపియన్ యావి విన్‌ఫ్రెడ్ ముతిలె తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. కెన్యాలో జని్మంచిన 23 ఏళ్ల యావి విన్‌ఫ్రెడ్ 2016లో బహ్రెయిన్‌కు వలస వచ్చి అక్కడే స్థిరపడింది. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో బహ్రెయిన్ తరఫున పోటీపడుతోంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లోనూ పసిడి పతకం నెగ్గిన యావి విన్‌ఫ్రెడ్ ఈసారీ తన ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. యావి విన్‌ఫ్రెడ్ 9ని:18.28 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలువగా... పారుల్ 9ని:27.63 సెకన్లతో రెండో స్థానాన్ని... ప్రీతి 9ని:43.32 సెకన్లతో మూడో స్థానాన్ని సంపాదించారు. ఆన్సీ అదుర్స్... మహిళల లాంగ్‌జంప్‌లో కేరళకు చెందిన 22 ఏళ్ల ఆన్సీ సోజన్ ఇడపిలి రజత పతకంతో సత్తా చాటుకుంది. తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్న ఆన్సీ సోజన్ 6.63 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. షికి జియాంగ్ (చైనా; 6.73 మీటర్లు) స్వర్ణం... యాన్ యు ఎన్గా (హాంకాంగ్; 6.50 మీటర్లు) కాంస్యం గెలిచారు. భారత్‌కే చెందిన శైలి సింగ్ (6.48 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచింది. రిలే జట్టుకు రజతం... 4గీ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత జట్టుకు రజత పతకం లభించింది. అజ్మల్, విత్యా రామ్రాజ్, రాజేశ్, శుభ వెంకటేశ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్ రేసును 3ని:14.34 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. శ్రీలంక జట్టు 3ని:14.25 సెకన్లతో రజతం గెలిచింది. అయితే రేసు సందర్భంగా శ్రీలంక అథ్లెట్ నిబంధనలకు విరుద్ధంగా వేరే బృందం పరిగెడుతున్న లైన్లోకి వచ్చాడని తేలడంతో నిర్వాహకులు శ్రీలంక జట్టుపై అనర్హత వేటు వేశారు. దాంతో భారత జట్టు పతకం కాంస్యం నుంచి రజతంగా మారిపోయింది. నాలుగో స్థానంలో నిలిచిన కజకిస్తాన్‌కు కాంస్యం లభించింది. ఈ ఈవెంట్లో బహ్రెయిన్ జట్టు స్వర్ణం సాధించింది. పురుషుల 200 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్ అమ్లాన్ బొర్గోహైన్ 20.60 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల పోల్‌వాల్ట్‌లో భారత క్రీడాకారిణి పవిత్ర వెంకటేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్‌లో ఐదు ఈవెంట్లు ముగిశాక భారత ప్లేయర్ తేజస్విన్ శంకర్ 4260 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
సత్తా చాటుతున్న భారత షూటర్లు.. మరో సిల్వర్ మెడల్
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత షుటర్లు సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. సరబ్జోత్ సింగ్ ,దివ్యతో కూడిన భారత ద్వయం రెండో స్ధానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఈవెంట్లో భారత్ 14 పాయింట్లు సాధించి రెండో స్ధానంతో సరిపెట్టుకుంది. 16 పాయిట్లతో అగ్రస్ధానంలో నిలిచిన బోవెన్ జాంగ్ రాంక్సిన్ జియాంగ్‌లతో కూడిన చైనా జోడీ గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నారు. ఈ ఏషియన్ గేమ్స్‌లో షూటింగ్లో భారత్ మొత్తంగా 19 పతకాలు గెలుచుకుంది. అందులో 6 గోల్డ్, 8 సిల్వర్, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. -
ప్రపంచ రికార్డుతో సిఫ్ట్‌కౌర్ సమ్రా.. ఇషా సింగ్‌కు సిల్వర్ మెడల్
Asian Games 2023 Day 4 Updates: టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో ముందడుగు భారత జోడీ సాహిత్యాన్, మనికా బాత్రా థాయ్‌లాండ్ ద్వయాన్ని ఓడించి రౌండ్ 16కు చేరుకున్నారు. చరిత్ర సృష్టించిన అనంత్‌జీత్ స్కీట్ మెన్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు రజత పతకం లభించింది. షూటర్ అనంత్‌జీత్ సింగ్ నరూకా ఆసియా క్రీడల చరిత్రలోనే తొలిసారిగా భారత్‌కు ఈ పతకం అందించాడు. అద్భుత ప్రతిభతో సిల్వర్ మెడల్ సాధించి చరిత్రకెక్కాడు. 🥈SILVER IN SKEET MEN⚡ 🇮🇳 Shooter and #KheloIndiaAthlete Anantjeet adds another SILVER medal in India's medal haul🌟🎯 This is the 1️⃣st time ever in the history of the Asian Games that India has won a silver in this event. Our shooters' combined excellence is making India… pic.twitter.com/5178kedO1u — SAI Media (@Media_SAI) September 27, 2023 ఇషా సింగ్‌కు రజతం తెలంగాణ షూటర్ ఇషా సింగ్ 25మీ పిస్టల్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది. 18 ఏళ్ల ఇషా ఇప్పటికే 25మీ పిస్టల్ టీమ్ విభాగంలో మనూ బాకర్, రిథం సంగ్వాన్‌తో కలిపి గోల్డ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. 🥈 A Shining Silver for Esha Singh! 🇮🇳🔫 18-year-old @singhesha10 #TOPSchemeAthlete won a spectacular silver 🥈 in the 25m Pistol event at the #AsianGames2022 Let's applaud her unwavering spirit 🎯🫡 Congratulations, Esha! 🌟🎯 P.S: A special shoutout to the Olympian,… pic.twitter.com/D0AkuBPIAY — SAI Media (@Media_SAI) September 27, 2023 ఫెన్సింగ్‌లో ముందుకు ఫెన్సింగ్ వుమెన్స్ ఎపీ టీమ్ విభాగంలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తనిక్షా ఖత్రి, జ్యోతికా దత్త, ఇనా అరోరా జెర్డాన్ మహిళా జట్టుపై 45-36తో విజయం సాధించారు. ఇక క్వార్టర్స్‌లో భారత జట్టు సౌత్ కొరియాను ఎదుర్కోనుంది. హాకీలో.. భారత మహిళా జట్టులో హాకీలో విజయంతో గ్రూప్ దశను ఆరంభించింది. సెయిలింగ్‌లో మరో పతకం ఆసియా క్రీడల్లో సెయిలింగ్ విభాగంలో భారత్ మరో పతకం సాధించింది. Men's Dnghy ILCA7 ఈవెంట్లో విష్ణు శరవణన్ కాంస్యం గెలిచాడు. కాగా సెయిలింగ్‌లో భారత్‌కు ఇది మూడో మెడల్. 3️⃣rd Medal in SAILING⛵🇮🇳@VishnuS28686411 has secured the BRONZE🥉 MEDAL in the ILCA7 sailing event at the #AsianGames2022! 🥉⛵ His outstanding performance on the water has brought honor to India. Well done, Vishnu! 🌟🌊 #Cheer4India#Hallabol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/Dr9RSqq5ae — SAI Media (@Media_SAI) September 27, 2023 GOLD WITH A WORLD RECORD- భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 50 మీటర్ల రైఫిల్ విభాగం(3 పొజిషన్స్) వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ సిఫ్ట్‌కౌర్ సమ్రా గోల్డ్ మెడల్ సాధించింది. 469.6 స్కోరుతో ప్రపంచ రికార్డు నమోదు చేసి దేశానికి బంగారు పతకం అందించింది 22 ఏళ్ల సమ్రా. తద్వారా భారత పసిడి పతకాల సంఖ్యను ఐదుకు చేర్చింది. GOLD FOR 🇮🇳 WITH A WORLD RECORD! Huge applause for Sift Samra Kaur, who has secured 🇮🇳's 1st Individual Gold🥇at the #AsianGames2022 👏@SiftSamra's Gold in the Women's 50m Rifle 3 Position event was achieved through unbelievable and surreal shooting, displaying incredible… pic.twitter.com/M1Sg1aB9e6 — Anurag Thakur (@ianuragthakur) September 27, 2023 స్కీట్ మెన్స్ టీమ్ విభాగంలో భారత జట్టుకు కాంస్యం భారత పురుష షూటర్ల జట్టు కాంస్య పతకం సాధించింది. గుర్జోత్, అనంత్‌జీత్, అంగాడ్విర్ స్కీట్ మెన్స్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు. Remarkable display of skill and teamwork⚡👍 The Skeet Men's Team secures the BRONZE MEDAL! 🥉🇮🇳 Their precision shooting has earned 🇮🇳 a place on the podium, and we couldn't be prouder! 🌟🎯#Cheer4India#Hallabol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/FfaqFlRubI — SAI Media (@Media_SAI) September 27, 2023 ఆషీ చోక్సీకి కాంస్యం 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ వ్యక్తిగత విభాగంలో భారత మహిళా షూటర్ ఆషీ చోక్సీ కాంస్యం సాధించింది. AND ANOTHER BRONZE🥉🎯 Outstanding performance by the 🇮🇳 Shooter, Ashi Chouksey finished 3️⃣rd in the Women's 50m Rifle 3 Positions Individual, winning India it's 8️⃣th bronze at the #AsianGames2022 ⚡🏅 With this, Ashi has won a total of 3️⃣ medals (2🥈1 🥉) so far. Proud of you,… pic.twitter.com/IQhhdQyA6m — SAI Media (@Media_SAI) September 27, 2023 బంగారు తల్లులు.. వారికేమో వెండి పతకం చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ బుధవారం శుభారంభం చేసింది. షూటింగ్ విభాగంలో తొలుత రజతం, తర్వాత ఈవెంట్లో స్వర్ణం దక్కింది. 50 మీటర్ల రైఫిల్ విభాగం(3 పొజిషన్స్)లో సిఫ్ట్‌కౌర్ సమ్రా, మనిని కౌశిక్, ఆషి చోక్సీలతో కూడిన మహిళా జట్టు భారత్‌కు సిల్వర్ మెడల్ అందించింది. 50 మీటర్ల రైఫిల్ విభాగం(3 పొజిషన్స్)లో రజతం బంగారు తల్లులు వీరే తదుపరి.. 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో భారత షూటర్లు మనూ బాకర్, రిథం సంగ్వాన్, ఇషా సింగ్ అద్భుత ప్రదర్శనతో భారత్ ఖాతాలో మరో పసిడి చేర్చారు. దీంతో ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 16కు చేరింది. ప్రస్తుతం నాలుగు స్వర్ణాలు, ఐదు వెండి, ఏడు కాంస్యాలు ఉన్నాయి. 🏆 Triumph Beyond Measure! 🇮🇳🔫 In the 25-meter Pistol Women's Team event, the formidable trio of @realmanubhaker, Sangwan Rhythm, and @singhesha10 secures India's pride with a GOLD medal finish! 🥇🔥 Their exceptional precision and teamwork deserve a standing ovation! 🌟👏… pic.twitter.com/lh7q3t8inx — SAI Media (@Media_SAI) September 27, 2023 -
నిశ్చల్‌కు రజతం
రియో డి జనీరో (బ్రెజిల్): ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో నిశ్చల్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 458 పాయింట్ల స్కోరుతో ఆమె రెండో స్థానంలో నిలిచింది. సీనియర్ స్థాయిలో ఈ టీనేజర్‌కు ఇదే తొలి ప్రపంచకప్. నార్వేకు చెందిన జీనెట్ హెడ్ డస్టడ్కు స్వర్ణం లభించింది. ఈ ప్రపంచకప్‌ను భారత్ 2 పతకాలతో ముగించింది. గత వారం మహిళల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌లో ఎలవెని వలరివన్ స్వర్ణం గెలుచుకుంది. -
ప్రథమేశ్ ‘రజత’ గురి
హెర్మెసిలో (మెక్సికో): ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్స్ టోర్నీలో భారత ప్లేయర్ ప్రథమేశ్ జాకర్ రజత పతకంతో మెరిశాడు. ఆదివారం జరిగిన కాంపౌండ్ ఈవెంట్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో ప్రథమేశ్, మథియాస్ ఫులెర్టన్ (డెన్మార్క్) నిర్ణీత 15 బాణాల తర్వాత 148–148 పాయింట్లతో సమంగా నిలిచారు. ‘షూట్ ఆఫ్’లో ఇద్దరు 10 పాయింట్ల షాట్ కొట్టారు. అయితే మథియాస్ కొట్టిన బాణం కేంద్ర బిందువుకు అతి సమీపంలో ఉండటంతో అతనికి స్వర్ణ పతకం దక్కింది. ప్రథమేశ్‌కు 15 వేల స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 13 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. భారత్‌కే చెందిన అభిషేక్ వర్మ ఒక పాయింట్ తేడాతో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. మహిళల వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ, అదితి క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగారు. -
195 దేశాలు.. 2100 మంది అథ్లెట్లు! చరిత్రకెక్కిన నీరజ్, అర్షద్..
World Athletics Championships 2023 Medal Tally: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పతకాల పట్టికలో భారత్ 18 స్థానంలో నిలిచింది. ఒక్కో స్వర్ణ పతకం గెలిచిన బహ్రెయిన్, బుర్కినా ఫాసో, డొమినికన్ రిపబ్లిక్, వెనిజులా, సెర్బియా దేశాలతో కలిసి భారత్ సంయుక్తంగా 18వ ర్యాంక్ సాధించింది. ప్రపంచ చాంపియన్‌షిప్-2022లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రజత పతకం కారణంగా భారత జట్టు మరో ఐదు దేశాలతో కలసి సంయుక్తంగా 33వ స్థానంలో నిలిచింది. ఈసారి మన బంగారు కొండ నీరజ్ చోప్రా రజతాన్ని స్వర్ణంగా మార్చి దేశానికి గర్వకారణమయ్యాడు. చరిత్రకెక్కిన నీరజ్, అర్షద్ నదీం హంగేరీలోని బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్‌లో అత్యధికంగా 88.17 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. ఇక దాయాది పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీం 87.82 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి నీరజ్ తర్వాతి స్థానం దక్కించుకున్నాడు. రజత పతకం గెలిచి తొలిసారి పాక్‌కు మెడల్ అందించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ విషయాలు తెలుసా! ఇప్పటి వరకు 19 సార్లు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈసారీ అమెరికా తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ పతకాల పట్టికలో 15వసారి అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా 12 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 29 పతకాలతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ఈసారి ప్రపంచ చాంపియ న్షిప్లో పాల్గొన్న దేశాలు 195. మొత్తం 2100 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. 120 దేశాల నుంచి నాలుగు లక్షల మంది ప్రేక్షకులు వచ్చి ఈ మెగా ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కనీసం ఒక్క పతకమైనా సాధించిన దేశాలు 46. జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ రజత పతకంతో ఈ పోటీల చరిత్రలో తొలిసారి పాకిస్తాన్ ఖాతాలో తొలి పతకం చేరింది. చదవండి: ఇష్టాయిష్టాలతో పనిలేదు.. ఆరోజు యువరాజ్ సింగ్ నన్ను ఓదార్చాడు: రోహిత్ -
Asian Athletics Championships: జ్యోతికి రజతం... జ్యోతికశ్రీకి కాంస్యం
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ తమ రెండో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో భారత్ 6 స్వర్ణాలు, 12 రజతాలు, 9 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 27 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. 2017లో భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్ అత్యధికంగా 29 పతకాలతో అగ్రస్థానంలో నిలువగా... 1989, 1985 ఆసియా చాంపియన్‌షిప్‌లలో 22 పతకాల చొప్పున సాధించింది. చివరిరోజు ఆదివారం భారత అథ్లెట్లు 13 పతకాలు సొంతం చేసుకున్నారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు జ్యోతి యర్రాజీ రజతం, దండి జ్యోతికశ్రీ కాంస్య పతకం సాధించారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన జ్యోతి యర్రాజీ 200 మీటర్ల విభాగంలో రజతం గెలిచింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 23.13 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో దండి జ్యోతికశ్రీ, హీనా మలిక్, ఐశ్వర్య మిశ్రా, శుభ వెంకటేశన్ బృందానికి కాంస్య పతకం దక్కింది. జ్యోతికశ్రీ బృందం 3 నిమిషాల 33.73 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలేలో అమోజ్ జేకబ్, అజ్మల్, మిజో కురియన్, రాజేశ్‌లతో కూడిన భారత బృందం (3ని:01.80 సెకన్లు) రజతం సాధించింది. మహిళల షాట్‌పుట్ ఈవెంట్లో అభా ఖతువా (భారత్) ఇనుప గుండును 18.06 మీటర్ల దూరం విసిరి జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకం గెలిచింది. మహిళల 5000 మీటర్ల రేసులో పారుల్ చౌదరీ (15ని:52.35 సెకన్లు) రజతం, అంకిత (16ని:03.33 సెకన్లు) కాంస్యం నెగ్గారు. పురుషుల 5000 మీటర్ల విభాగంలో గుల్వీర్ సింగ్ (13ని:48.33 సెకన్లు) కాంస్యం సాధించాడు. పురుషుల జావెలిన్ త్రోలో డీపీ మనూ (81.01 మీటర్లు) రజతం దక్కించుకున్నాడు. పురుషుల 800 మీటర్లలో కిషన్ కుమార్ (1ని:45.88 సెకన్లు), మహిళల 800 మీటర్లలో కేఎం చందా (2ని:01.58 సెకన్లు) రజత పతకాలు నెగ్గారు. పురుషుల 20 కిలోమీటర్ల నడకలో వికాశ్ సింగ్ (1గం:29ని:32 సెకన్లు) కాంస్యం, మహిళల 20 కిలోమీటర్ల నడకలో ప్రియాంక గోస్వామి (1గం:34ని:24 సెకన్లు) రజతం గెలిచారు. -
Asian Weightlifting Championships 2023: బింద్యారాణికి రజతం
జింజు (దక్షిణ కొరియా): మహిళల ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన బింద్యారాణి దేవి పతకంతో మెరిసింది. శనివారం జరిగిన 55 కేజీల విభాగం పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన ఆమె రజతపతకాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో కూడా రజతం నెగ్గిన మణిపూర్ లిఫ్టర్ బింద్యా ఈ పోరులో క్లీన్ అండ్ జర్క్, స్నాచ్లలో కలిపి మొత్తం 194 కేజీల (83 కేజీలు + 111 కేజీ) బరువెత్తింది. చెన్ గ్వాన్ లింగ్ (చైనీస్ తైపీ –204 కేజీలు) స్వర్ణం గెలుచుకోగా, వో తి క్యూ ను (వియత్నాం – 192 కేజీలు) కాంస్యం గెలుచుకుంది. -
రజతం నెగ్గిన భారత రెజ్లర్ రూపిన్.. తొలి రోజు భారత్‌కు మూడు పతకాలు
కజకిస్తాన్‌లో జరుగుతున్న ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో రూపిన్ (55 కేజీలు) రజతం... నీరజ్ (63 కేజీలు), సునీల్ (87 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. ఫైనల్లో రూపిన్ 1–3తో సౌలత్ (ఇరాన్) చేతిలో ఓడిపోగా... నీరజ్ 5–2తో జిన్‌సెయుబ్ సాంగ్ (దక్షిణ కొరియా)పై, సునీల్ 4–1తో మసాటో సుమి (జపాన్)పై గెలిచారు. చదవండి: #KavyaMaran: 'చల్ హట్ రే'.. నీకు నేనే దొరికానా! రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. ఎవరికీ సాధ్యం కాలేదు! వీడియో వైరల్ -
Asian Indoor Athletics Championships 2023: ‘రికార్డు’తో మెరిసిన జ్యోతి
అస్తానా (కజకిస్తాన్): కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత యువ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ తన కెరీర్లో గొప్ప విజయం సాధించింది. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జ్యోతి మహిళల 60 మీటర్ల హర్డిల్స్ విభాగంలో రజత పతకం గెల్చుకుంది. వైజాగ్‌కు చెందిన 24 ఏళ్ల జ్యోతి ఫైనల్ రేసును 8.13 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో జ్యోతి ఈ విభాగంలో మళ్లీ కొత్త జాతీయ రికార్డును నమోదు చేసింది. ఈ ఏడాది 60 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి జాతీయ రికార్డును నెలకొల్పడం ఇది ఐదోసారి కావడం విశేషం. శనివారం జరిగిన హీట్స్‌లో జ్యోతి 8.16 సెకన్లతో జాతీయ రికార్డు సృష్టించగా... రోజు వ్యవధిలోనే తన పేరిటే ఉన్న రికార్డును ఆమె సవరించడం విశేషం. ఫైనల్లో మాసుమి ఆకో (జపాన్; 8.01 సెకన్లు) అందరికంటే వేగంగా లక్ష్యాన్ని దాటి స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... చెన్ జియామిన్ (చైనా; 8.15 సెకన్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్ లో భారత్ ఒక స్వర్ణం, ఆరు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. తాజా ప్రదర్శనతో జ్యోతి 19 ఏళ్ల ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో 60 మీటర్ల హర్డిల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారతీయ అథ్లెట్‌గా నిలిచింది. 2008లో దోహా ఆతిథ్యమిచ్చిన ఆసియా ఈవెంట్లో భారత్‌కే చెందిన లీలావతి వీరప్పన్ 9.21 సెకన్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. జ్యోతి రజతం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. -
Khelo India Youth Games: ‘స్వర్ణ’ సురభి
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఆదివారం జరిగిన జిమ్నాస్టిక్స్ అండర్–18 బాలికల టేబుల్ వాల్ట్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కె.సురభి ప్రసన్న పసిడి పతకం సాధించింది. సురభి 11.63 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్లో సురభి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. అథ్లెటిక్స్‌లో 2000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో డిండి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అథ్లెటిక్స్ అకాడమీ విద్యార్థిని చెరిపెల్లి కీర్తన (పాలకుర్తి) రజత పతకం సొంతం చేసుకుంది. కీర్తన 7 నిమిషాల 17.37 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. బాలికల కబడ్డీ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 28–46తో మధ్యప్రదేశ్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈనెల 11 వరకు జరగనున్న ఈ క్రీడల్లో తెలంగాణ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో 11వ స్థానంలో ఉంది. -
Khelo India Youth Games: ప్రణయ్‌కు పసిడి పతకం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారుల తమ పతకాల వేట కొనసాగిస్తున్నారు. భోపాల్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో శనివారం అథ్లెటిక్స్ బాలుర ట్రిపుల్ జంప్‌లో తెలంగాణ ప్లేయర్ కొత్తూరి ప్రణయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకోగా.. బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో నామాయి రుచిత రజత పతకాన్ని గెల్చుకుంది. శుక్రవారం 1500 మీటర్ల రేసులో సుమిత్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. శనివారం జరిగిన జూనియర్ పురుషుల సైక్లింగ్ కెరిన్ రేసు వ్యక్తిగత విభాగంలో ఆశీర్వాద్ సక్సేనా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. బ్యాడ్మింటన్‌లో అండర్–19 బాలుర సింగిల్స్ విభాగంలో కె.లోకేశ్ రెడ్డి తెలంగాణకు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో లోకేశ్ రెడ్డి 21–19, 15–21, 22–20తో అభినవ్ ఠాకూర్ (పంజాబ్)పై గెలుపొందాడు. బాక్సింగ్‌లో బాలుర 51 కేజీల విభాగంలో బిలాల్... బాలికల 75 కేజీల విభాగంలో గుణనిధి పతంగె కాంస్య పతకాలు సాధించారు. పతకాల పట్టికలో ప్రస్తుతం తెలంగాణ పది పతకాలతో 14వ ర్యాంక్‌లో ఉంది. -
Elite Indoor Track Miramas: జాతీయ రికార్డుతో జ్యోతికి రజతం
సాక్షి, హైదరాబాద్: మిరామస్ ఎలైట్ ఇండోర్ ట్రాక్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ 60 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం సాధించింది. అంతేకాకుండా 60 మీటర్ల హర్డిల్స్‌లో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ మీట్లో విశాఖపట్నంకు చెందిన జ్యోతి ఫైనల్ రేసును 8.17 సెకన్లలో ముగించింది. సైప్రస్ అథ్లెట్ డాఫ్నీ జార్జియు కూడా 8.17 సెకన్లలోనే రేసును ముగించింది. అయితే రియాక్షన్ టైమ్ ఆధారంగా డాఫ్నీ (0.145 సెకన్లు) స్వర్ణ పతకం దక్కించుకోగా... జ్యోతి (0.175 సెకన్లు) ఖాతాలో రజతం చేరింది. అంతకుముందు హీట్స్‌లో జ్యోతి 8.18 సెకన్లతో జాతీయ రికార్డును సృష్టించగా... ఫైనల్లో తన రికార్డును ఆమె మరోసారి సవరించింది. -
హంపికి గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం
-
World Blitz Chess: హంపి అద్భుతం
అల్మాటీ (కజకిస్తాన్): ఊహకందని ఆటతీరుతో అదరగొట్టిన భారత మహిళా చెస్ స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసింది. నిర్ణీత 17 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 35 ఏళ్ల హంపి 12.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలి రోజు గురువారం తొమ్మిది రౌండ్లు ముగిశాక హంపి 5 పాయింట్లతో 44వ ర్యాంక్‌లో ఉండటంతో ఆమెకు పతకం నెగ్గే అవకాశాలు లేవని భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ హంపి రెండో రోజు జరిగిన ఎనిమిది గేముల్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఏడు గేముల్లో గెలవడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని 44వ స్థానం నుంచి ఏకంగా రెండో ర్యాంక్‌కు చేరుకుంది. 13 పాయింట్లతో బిబిసారా అసుబయేవా (కజకిస్తాన్) విజేతగా నిలువగా... 12 పాయింట్లతో పొలీనా షువలోవా (రష్యా) కాంస్య పతకాన్ని సాధించింది. బిబిసారాకు 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు), హంపికి 30 వేల డాలర్లు (రూ. 24 లక్షల 83 వేలు), పొలీనాకు 20 వేల డాలర్లు (రూ. 16 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 10.5 పాయింట్లతో హారిక 13వ ర్యాంక్‌లో నిలిచింది. 21 రౌండ్లపాటు జరిగిన ఓపెన్ విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే; 16 పాయింట్లు) టైటిల్ సాధించగా... ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 13 పాయింట్లతో 17వ ర్యాంక్‌లో, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 12 పాయింట్లతో 42వ ర్యాంక్‌లో నిలిచారు. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ చరిత్రలో హంపి సాధించిన మొత్తం పతకాలు. ర్యాపిడ్ విభాగంలో 2012లో కాంస్యం నెగ్గిన హంపి, 2019లో స్వర్ణ పతకం గెలిచింది. బ్లిట్జ్ విభాగంలో రజతం రూపంలో తొలిసారి పతకం సాధించింది. -
4 స్వర్ణాలు 1 రజతం
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళలు ఒకే రోజు ఐదు పతకాలతో మెరిశారు. ఇందులో 4 స్వర్ణాలు కాగా మరొకటి రజతం. లవ్లీనా బొర్గొహైన్, పర్వీన్ హుడా, సవీటీ బూరా, అల్ఫియా పఠాన్ వేర్వేరు విభాగాల్లో బంగారు పతకాలు గెలుచుకోగా, తొలిసారి ఈ పోటీల బరిలోకి దిగిన మీనాక్షి రజతాన్ని అందుకుంది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా 75 కేజీల విభాగం ఫైనల్లో రుజ్‌మెటొవా సొఖిబా (ఉజ్బెకిస్తాన్)ను చిత్తు చేసింది. ఒలింపిక్ పతకం తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో, కామన్వెల్త్ క్రీడల్లో లవ్లీనా విఫలమైంది. టోక్యోలో 69 కేజీల విభాగంలో పాల్గొన్న లవ్లీనా, పారిస్ ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్ లేకపోవడంతో 75 కేజీలకు మారింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొన్న పర్వీన్ 63 కేజీల కేటగిరీ ఫైనల్లో పర్వీన్ 5–0 తేడాతో జపాన్ను చెందిన కిటోమై పై ఘన విజయం సాధించింది. 81 కేజీల ఫైనల్లో సవీటీ కూడా అదే జోరుతో 5–0తో గుల్‌సయా యెర్జాన్ (కజకిస్తాన్)ను ఓడించి విజేతగా నిలిచింది. 81 ప్లస్ కేటగిరీ ఫైనల్లో అల్ఫియా కూడా సత్తా చాటింది. ఆమె ప్రత్యర్థి, స్థానిక జోర్డాన్‌కే చెందిన ఇస్లామ్ హుసైలి తొలి రౌండ్లోనే డిస్క్వాలిఫై కావడంతో అల్ఫియాకు స్వర్ణం దక్కింది. అయితే మీనాక్షి మాత్రం రజతంతో సంతృప్తి చెందింది. ఫైనల్లో 1–4 తేడాతో కినో షియా రింకా (జపాన్) చేతిలో ఓటమిపాలైంది. -
World Shooting Championship: అనీశ్ – సిమ్రన్‌లకు సిల్వర్ మెడల్
కైరో: వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరో రజత పతకాన్ని గెలుచుకుంది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత ద్వయం రెండో స్థానంలో నిలిచింది. ఫైనల్లో అనీశ్ – సిమ్రన్ప్రీత్ కౌర్ ద్వయం 14–16 స్కోరుతో ఉక్రెయిన్‌కు చెందిన యులి యా కొరొస్టైలోపొవా – మాక్సిమ్ హొరడైనెట్స్ చేతిలో పరాజయంపాలైంది. తాజా వెండి పతకంతో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 26కు చేరగా, జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో 10 స్వర్ణాలు, 6 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. చదవండి: T20 WC 2022: పేరుకే రెండుసార్లు చాంపియన్.. మరీ ఇంత దారుణంగా! సూపర్-12లో ఐర్లాండ్ -
European Chess Club Cup 2022: హరికృష్ణ జట్టుకు యూరోపియన్ చెస్ క్లబ్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ సభ్యుడిగా ఉన్న నోవీ బోర్ చెస్ క్లబ్ ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ (ఈసీసీ) టోర్నమెంట్లో టైటిల్ సాధించింది. ఆస్ట్రియాలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 70 క్లబ్ జట్లు పాల్గొన్నాయి. చెక్ రిపబ్లిక్కు చెందిన నోవీ బోర్ క్లబ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచి 14 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. నోవీ బోర్ క్లబ్లో హరికృష్ణతోపాటు గ్రాండ్‌మాస్టర్లు విదిత్ సంతోష్ (భారత్), రాడోస్లా (పోలాండ్), డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్), ఎన్గుయెన్ థాయ్ డై వాన్ (చెక్ రిపబ్లిక్), నిల్స్ గ్రాండెలియస్ (స్వీడన్), డేవిడ్ గిజారో (స్పెయిన్), మార్కస్ రేజర్ (ఆస్ట్రియా) సభ్యులుగా ఉన్నారు. వ్యక్తిగత విభాగంలో హరికృష్ణకు రజత పతకం లభించింది. బోర్డు–1పై ఆడిన హరికృష్ణ మొత్తం ఏడు పాయింట్లకుగాను 4.5 పాయింట్లు స్కోరు చేశాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ప్రాతినిధ్యం వహించిన ఆఫర్స్పిల్ చెస్ క్లబ్ (నార్వే) ఏడో స్థానంలో... భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ సభ్యులుగా ఉన్న సీఎస్‌యు ఏఎస్ఈ సూపర్‌బెట్ (రొమేనియా) క్లబ్ ఆరో స్థానంలో... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ సభ్యుడిగా ఉన్న తాజ్ఫన్ లుబియానా (స్లొవేనియా) క్లబ్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. -
తెలంగాణ ‘డబుల్’ ధమాకా
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. రెండు స్వర్ణ పతకాలతోపాటు ఒక రజతం, ఒక కాంస్యంతో మొత్తం నాలుగు పతకాలు సొంతం చేసుకున్నారు. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ 3–0తో కేరళను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ 21–15, 14–21, 21–14తో ట్రెసా జాలీ–ఎం.ఆర్.అర్జున్ ద్వయంపై గెలిచి తెలంగాణకు 1–0 ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో సాయిప్రణీత్ 18–21, 21–16, 22–20 తో ప్రణయ్‌ను ఓడించి తెలంగాణ ఆధిక్యాన్ని 2–0కు పెంచాడు. మూడో మ్యాచ్‌లో సామియా ఇమాద్ ఫారూఖి 21–5, 21–12తో గౌరీకృష్ణపై గెలవడంతో తెలంగాణ విజయం ఖరారైంది. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లు నిర్వహించలేదు. మహిళల బాస్కెట్‌బాల్ 3గీ3 ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ జట్టు 17–13తో కేరళను ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకుంది. మహిళల స్విమ్మింగ్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో తెలంగాణ అమ్మాయి వ్రిత్తి అగర్వాల్ రజత పతకం దక్కించుకుంది. ఆమె 9ని:23.91 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల రోయింగ్ కాక్స్డ్–8లో బాలకృష్ణ, నితిన్ కృష్ణ, సాయిరాజ్, చరణ్ సింగ్ కెతావత్, మహేశ్వర్ రెడ్డి, గజేంద్ర యాదవ్, నవదీప్, హర్దీప్ సింగ్, వెల్ది శ్రీకాంత్‌లతో కూడిన తెలంగాణ జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. -
జాతీయ క్రీడల్లో సత్తా చాటుతున్న తెలుగు తేజాలు
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో ఆదివారం తెలంగాణకు ఒక రజత పతకం లభించింది. మరో రెండు పతకాలు ఖరారయ్యాయి. మహిళల షూటింగ్ స్కీట్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణకు చెందిన రష్మీ రాథోడ్ 25 పాయింట్లు స్కోరు చేసి రజతం సాదించింది. బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ జట్టు ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో తెలంగాణ 3–2తో మహారాష్ట్రపై నెగ్గింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–పుల్లెల గాయత్రి జోడీ 21–9, 21–16తో సిమ్రన్–రితిక జంటను ఓడించి తెలంగాణను గెలిపించింది. వియత్నాం ఓపెన్‌లో ఆడి శనివారం రాత్రి నేరుగా గుజరాత్ చేరుకున్న సిక్కి రెడ్డి ఆదివారం మధ్యాహ్నం సెమీఫైనల్లో ఆడటం విశేషం. నేడు ఫైనల్లో కేరళతో తెలంగాణ ఆడుతుంది. మహిళల 3్ఠ3 బాస్కెట్‌బాల్ ఈవెంట్లో తెలంగాణ జట్టు ఫైనల్ చేరి కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. రజతాలు నెగ్గిన పల్లవి, కార్తీక జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఆదివారం రెండు రజత పతకాలు చేరాయి. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 64 కేజీల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎస్.పల్లవి రజతం సాధించింది. 18 ఏళ్ల పల్లవి మొత్తం 199 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో జి.కార్తీక రజతం సాధించింది. కార్తీక 12.85 మీటర్ల దూరం దూకింది. అథ్లెటిక్స్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యెర్రాజీ ఫైనల్ చేరింది. -
National Games 2022: జ్యోతి పసిడి పరుగు
గాంధీనగర్: జాతీయ క్రీడల్లో శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు పతకాలతో మెరిశారు. మహిళల అథ్లెటిక్స్ 100 మీటర్ల విభాగంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి యెర్రాజీ స్వర్ణ పతకం సాధించగా... 400 మీటర్ల విభాగంలో దండి జ్యోతిక శ్రీ రజత పతకం సొంతం చేసుకుంది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో నీలం రాజు రజత పతకం దక్కించుకున్నాడు. మరోవైపు తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని గెల్చు కుంది. రోలర్ స్కేటింగ్ కపుల్ డ్యాన్స్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన అనుపోజు కాంతిశ్రీ–చలంచర్ల జూహిత్ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ద్వయం 71 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ స్కేటర్ ఏలూరి కృష్ణసాయి రాహుల్ –యాష్వి శిరీష్ షా జోడీ 90.8 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జ్యోతి యెర్రాజీ అదే ఉత్సాహంతో జాతీయ క్రీడల్లోనూ అదరగొట్టింది. 100 మీటర్ల రేసును జ్యోతి 11.51 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. అర్చన (తమిళనాడు; 11.55 సెకన్లు) రజతం, డియాండ్ర (మహారాష్ట్ర; 11.62 సెకన్లు) కాంస్యం సాధించారు. 400 మీటర్ల ఫైనల్ రేసును జ్యోతిక శ్రీ 53.30 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచింది. ఐశ్వర్య మిశ్రా (మహారాష్ట్ర; 52.62 సెకన్లు) స్వర్ణం, రూపల్ చౌదరీ (ఉత్తరప్రదేశ్; 53.41 సెకన్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. వెయిట్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో నీలం రాజు మొత్తం 270 కేజీలు (స్నాచ్‌లో 124+క్లీన్ అండ్ జెర్క్‌లో 146) బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. 73 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ జె.కోటేశ్వర రావు 280 కేజీల బరువెత్తి నాలుగో స్థానంలో నిలిచాడు. శుక్రవారం రాత్రి జరిగిన రోలర్ స్పోర్ట్స్ ఆర్టిస్టిక్ సింగిల్ ఫ్రీ స్కేటింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆకుల సాయిసంహిత రజతం, భూపతిరాజు అన్మిష కాంస్య పతకం సాధించారు. -
National Games 2022: తెలంగాణ నెట్‌బాల్ జట్టుకు రజతం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం ఖాతాలో నాలుగో పతకం చేరింది. టేబుల్ టెన్నిస్ (టీటీ)లో ఇప్పటికే మూడు పతకాలు లభించగా... తాజాగా నెట్‌బాల్ క్రీడాంశంలో తెలంగాణ జట్టుకు రజత పతకం దక్కింది. భావ్‌నగర్‌లో శుక్రవారం జరిగిన పురుషుల నెట్‌బాల్ ఫైనల్లో తెలంగాణ 73–75తో (16–9, 12–18, 16–20, 29–28) హరియాణా చేతిలో పోరాడి ఓడిపోయింది. రజత పతకం నెగ్గిన తెలంగాణ జట్టులో బి.విక్రమాదిత్య రెడ్డి, సయ్యద్ అమ్జాద్ అలీ, జన్ను హరీశ్, కంబాల శ్రీనివాసరావు, ముజీబుద్దీన్, మొహమ్మద్ ఇస్మాయిల్, పి.వంశీకృష్ణ, కె.సుమన్, కురకుల సంయుత్, బి.రంజీత్ కుమార్, సయ్యద్ మొహమ్మద్ అహ్మద్, ఎన్.లునావత్ అఖిల్ సభ్యులుగా ఉన్నారు. మహిళల టీమ్ టెన్నిస్‌లో తెలంగాణ జట్టు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. తెలంగాణ 0–2తో గుజరాత్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. మణిపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరాబాయి మొత్తం 191 కేజీలు (స్నాచ్‌లో 84+క్లీన్ అండ్ జెర్క్‌లో 107) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. -
ఫైనల్లో ఓటమి.. భారత హాకీ జట్టుకు రజతం
కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత పురుషుల హాకీ జట్టు రజత పతకం సాధించింది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో 0-7 తేడాతో భారత్ ఓటమిపాలైంది. తద్వారా భారత్ సిల్వర్ మెడల్ సాధించింది. తొలి క్వార్టర్ నుంచే భారత్‌పై ఆస్ట్రేలియా అధిపత్యం చెలాయించింది. ఏ దశలోను ఆస్ట్రేలియాకు భారత్ పోటీ ఇవ్వలేకపోయింది. నాలుగు క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా 7 గోల్స్ సాధించగా.. భారత్ కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. ఆస్ట్రేలియా తరపున టామ్ విక్హామ్, బ్లేక్ గోవర్స్, ఫిన్ ఒగిల్వీ, నాథన్ ఎఫ్రామ్స్, నాథన్ ఎఫ్రామ్స్ గోల్స్ సాధించారు. దీంతో ఆస్ట్రేలియా బంగారు పతకం తమ ఖాతాలో వేసుకుంది. కాగా కామన్వెల్త్ గేమ్స్ హాకీలో ఇది ఆస్ట్రేలియాకు ఏడో పతకం కావడం గమనార్హం. ఇక కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత మ్యాచ్‌లు ముగిశాయి. కామన్వెల్త్ గేమ్స్-2022 పతకాల పట్టికలో 61 మెడల్స్‌తో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. వాటిలో 22 గోల్డ్ మెడల్స్,16 రజత, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: CWG 2022:: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్లో అదరగొట్టిన రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి -
World U-20 Athletics Championships: భారత్‌కు మరో పతకం
ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. పురుషుల ట్రిపుల్‌జంప్‌లో సెల్వ తిరుమారన్ రజత పతకం గెల్చుకున్నాడు. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల సెల్వ 16.15 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 4X400 మీటర్ల రిలేలో సుమ్మీ, ప్రియా హబ్బతనహల్లి మోహన్, కుంజ రజిత, రూపల్ చౌదరీలతో కూడిన భారత బృందం ఫైనల్ చేరింది. ఇప్పటి వరకు భారత్‌కు ఈ టోర్నీలో 4గX400 మిక్స్డ్ రిలేలో రజతం, మహిళల 400 మీటర్ల విభాగంలో కాంస్యం లభించాయి. -
భారత్ ఖాతాలో 27వ పతకం.. రేస్ వాక్‌లో ప్రియాంకకు రజతం
కామన్వెల్త్ క్రీడల ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ మూడో పతకం (పురుషుల హై జంప్‌లో తేజస్విన్ యాదవ్ కాంస్యం, లాంగ్ జంప్‌లో శ్రీశంకర్ మురళీ రజతం) సాధించింది. మహిళల 10000 మీటర్ల రేస్ వాక్ విభాగంలో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్ చేజిక్కించుకుంది. 43 నిమిషాల 38 సెకెన్లలో రేస్‌ను ముగించి ప్రియాంక.. కెరీర్లో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు కామన్వెల్త్ క్రీడల రేస్ వాకింగ్‌లో పతకం గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కింది. ప్రియాంక సాధించిన పతకంతో భారత పతకాల సంఖ్య 27కు (9 స్వర్ణాలు, 9 రజతాలు, 9 కంస్యాలు) చేరింది. మరోవైపు తొమ్మిదో రోజు బాక్సింగ్‌లోనూ భారత్ హవా కొనసాగింది. మహిళల 48 కేజీల విభాగంలో నీతూ గంగస్ కెనడాకి చెందిన ప్రియాంక దిల్లాన్‌పై అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. పురుషుల 51 కేజీల విభాగం సెమీ ఫైనల్లో అమిత్ పంగల్.. జాంబియా బాక్సర్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. దీంతో ఆయా విభాగాల్లో భారత్‌కు రెండు పతాకలు ఖరారయ్యాయి. చదవండి: CWG 2022: 9వ రోజు భారత షెడ్యూల్ ఇదే -
మేజర్ సర్జరీ.. లాంగ్ జంప్ చేయొద్దన్నారు; ఎవరీ మురళీ శ్రీశంకర్?
ఒక ఇంట్లో తండ్రి మంచి క్రీడాకారుడైనంత మాత్రాన అతడి వారసులు(కొడుకు లేదా కూతురు) అలాగే అవ్వాలని ఎక్కడా రాసిపెట్టి ఉండదు. అయితే, కొంతమంది తల్లిదండ్రులు మాత్రం తమ వారసులు కూడా క్రీడాకారులు అవ్వాలని.. రాణించాలని ఆశపడుతుంటారు. మరికొంత మంది మాత్రం తాము ఏం కావాలనుకుంటున్నామో అన్న నిర్ణయాన్ని పిల్లలకే వదిలేస్తారు. ఆ ప్రయత్నంలో కొంతమంది పిల్లలు విఫలమైతే.. మరికొందరు మాత్రం వారసత్వాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతారు. ఆ కోవకు చెందినవాడే భారత్ హై జంప్ స్టార్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్. తన అపూర్వ విజయంతో తల్లిదండ్రులతో పాటు యావత్ భారతావనిని గర్వపడేలా చేశాడు. బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో హై జంప్ విభాగంలో జరిగిన ఫైనల్స్‌లో ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్లు దూకి రజతం ఒడిసిపట్టాడు. ఇక శ్రీశంకర్ ఆర్థికంగా ఏనాడు ఇబ్బంది పడనప్పటికి.. ఈరోజు పతకం సాధించాడంటే అందులో తన పాత్ర ఎంత ఎందో.. కుటుంబానికి అంతే ప్రాధాన్యత ఉంటుంది. 23 ఏళ్ల మురళీ శ్రీ శంకర్ కేరళలోని పాలక్కడ్ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. తల్లిదండ్రులిద్దరు క్రీడాకారులే కావడం శ్రీశంకర్‌కు కలిసి వచ్చింది. తల్లి కెఎస్ బిజ్మోల్ 800 మీటర్ల క్రీడాకారిణి.. తండ్రి ఎకోస్ బిజ్మోల్ అథ్లెటిక్స్ కోచ్‌గా పని చేస్తున్నాడు. ఇంకేముంది తల్లిదండ్రులిద్దరు క్రీడా విభాగంతో పరిచయం ఉంటే శ్రీశంకర్ క్రీడాకారుడు కాకుండా ఇంకేం అవుతాడు. కుటుంబంతో మురళీ శ్రీశంకర్ 2018 కామన్వెల్త్ క్రీడలకు చివరి నిమిషంలో దూరమయ్యాడు మురళీ శ్రీశంకర్. అపెండిస్ రూపంలో అతనికి సమస్య వచ్చి పడింది. నొప్పిని భరించలేక కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమయ్యాడు. లాంగ్ జంప్ చేస్తే సమస్యలు చుట్టుముడుతాయన్నారు వైద్యులు. కానీ అపెండిస్ ఆపరేషన్ విజయవంతం కావడం.. ఆ తర్వాత కఠోర సాధన ద్వారా శ్రీశంకర్ లాంగ్‌జంప్‌లో ఈ నాలుగేళ్లలో తనను తాను చాలా మెరుగు పరుచుకున్నాడు. తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లో రజతంతో మెరిసిన మురళీ శ్రీశంకర్ ఔరా అనిపించాడు. మురళీ శ్రీశంకర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. ►శ్రీశంకర్ తాను సాధన చేసే సమయంలో ఎలాంటి డిస్టర్బన్స్ లేకుండా చూసుకోవడం అలవాటు. తాను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనూ అంతేనంట. ఒక సందర్బంలో శ్రీశంకర్ తండ్రి మొబైల్‌కు హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నాడు. ఆ పాట సౌండ్ శంకర్‌కు వినిపించింది. వెంటనే తండ్రి దగ్గరకు వచ్చి నా ప్రాక్టీస్ సమయంలో నాకు ఎలాంటి సౌండ్ వినిపించొద్దు.. అలా అయితే నేను డిస్ట్రబ్ అవుతా అని చెప్పాడట. అంతే ఆప్పటి నుంచి ఇప్పటివరకు శ్రీశంకర్ ప్రాక్టీస్ సమయంలో తండ్రి మ్యూజిక్‌ను బ్యాన్ చేస్తూనే వచ్చాడు. శ్రీశంకర్ తెచ్చిన ఈ రూల్ ఇప్పటికి ఆ కుటుంబసభ్యులు పాటిస్తూనే ఉన్నారు. 11 గంటల తర్వాత టీవీ కట్.. ►ఇక రాత్రి 11 గంటల తర్వాత శ్రీశంకర్ ఇంట్లో ఎవరు టీవీ చూడరు. అది ఎంత పెద్ద మ్యాచ్ గాని.. ఇంట్లో మాత్రం టీవీ ఆన్ చేయరు. తాజాగా శ్రీశంకర్ ఒక మెగాటోర్నమెంట్‌లో పాల్గొంటూ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసి కూడా టీవీ పెట్టలేదంటే వాళ్లు తమ నిర్ణయానికి ఎంత కట్టుబడి ఉన్నారో తెలుస్తోంది. తమ కొడుకు కామన్వెల్త్లో రజతం సాధించాడన్న వార్తను ఆ తల్లిదండ్రులు ఉదయమే తెలుసుకోవడం విశేషం. ►శ్రీశంకర్ తనకు 18 ఏళ్ల వయసు వచ్చేవరకు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటికి దూరంగా ఉన్నాడు. తల్లిదండ్రులు తనపై ఎన్ని ఆంక్షలు పెట్టినా వాటిని ఏనాడు నెగిటివ్‌గా తీసుకోలేదు. వాళ్లు పెట్టే కండీషన్స్ వల్లే ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నానని శ్రీశంకర్ బలంగా నమ్ముతాడు. చదువులో మెరిట్.. ►సాధారణంగా క్రీడాకారులుగా మారేవాళ్లకు సరిగ్గా చదువు అబ్బదంటారు. కానీ ఈ విషయంలో శ్రీశంకర్ పూర్తిగా వేరు. ఆటలో ఎంత చురుకుగా ఉండేవాడో.. చదువులోనూ అంతే చురుకుదనాన్ని చూపించేవాడు. మ్యాచ్‌లు లేని సమయంలో చదువుకునే శ్రీశంకర్.. ఒకవేళ తాను పాల్గొనబోయే గేమ్స్‌లో సమయం దొరికితే కూడా చదువుకునేవాడు. అలా 10వ తరగతి, ఇంటర్మీడియెట్లు 95 శాతం మార్కులతో పాసయ్యాడు. ►ఆ తర్వాత నీట్ పరీక్షలో స్పోర్ట్స్ కోటాలో సెకండ్ ర్యాంక్ సాధించిన మురళీ శ్రీశంకర్ మెరిట్లో బీఎస్సీ మాథ్స్‌ను పూర్తి చేశాడు. నీట్లో తనకొచ్చిన మార్కులతో మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉన్నప్పటికి వేరే కారణాల వల్ల మెడిసిన్ చేయలేదు. ఇక్కడ విచిత్రమేంటంటే.. మెరిట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికి శ్రీశంకర్ ఇప్పటికి నిరుద్యోగే.'' చదువు మనకు బ్రతికే తెలివిని నేర్పిస్తుంది.. నాతో సహా నా మిత్రులందరూ ఇప్పటికీ ఏ ఉద్యోగాలు చేయడం లేదంటే నమ్ముతారా.. భారత్ కదా ఈ పరిస్థితి మాములే'' అని ఒక సందర్బంలో చెప్పుకొచ్చాడు. మద్యం, సిగరెట్లకు ఆమడ దూరం ►శ్రీశంకర్ ఇచ్చే పార్టీల్లో ఫ్రూట్ జ్యూస్‌లు తప్ప ఇంకేం కనిపించవు. ఎందుకంటే శ్రీశంకర్ ఆల్కహాల్‌ను ఎంకరేజ్ చెయ్యడు. తన మిత్రుల్లో చాలా మంది మందు, సిగరెట్లు అలవాట్లు ఉన్నవారే. కానీ శ్రీశంకర్ పార్టీలిచ్చినా.. ఏ పార్టీలకు వెళ్లినా అక్కడ నో ఆల్కాహాల్.. నో సిగరెట్. ఎందుకంటే శ్రీశంకర్‌కు మేమిచ్చే గౌరవమని అతని స్నేహితులు పేర్కొంటారు. ''శంకు(మురళీ శ్రీశంకర్ ముద్దుపేరు) నా కొడుకుగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎంత పెద్ద స్థాయికి చేరుకున్నా వాడు చూపించే ప్రేమ, గౌరవం ఎప్పుడు తగ్గిపోలేదు. స్కూల్ వయసు నుంచి వాడిని ఒక మంచి అథ్లెట్‌గా చూడాలని కఠిన నిబంధనల మధ్య పెంచినా.. ఒక్కసారి కూడా మాకు ఎదురుచెప్పడం చూడలేదు. అందుకే ఈరోజు దేశం గర్వించే స్థాయికి చేరుకున్నాడు'' - తల్లి కెస్ బిజ్మోల్ ''వాడు(శ్రీశంకర్) కష్టపడే తత్వాన్ని ఎప్పుడు వదల్లేదు. ఏనాడు షార్ట్‌కట్స్, అడ్డదారులు తొక్కలేదు. చిన్నప్పటి నుంచి కష్టపడిన తత్వమే ఈరోజు ఈస్థాయిలో నిలబెట్టింది. ఒక తండ్రిగా నాకు ఇంతకమించి ఏముంటుంది. నా మాటకు ఎదురుచెప్పకుండా ఎన్నో చేశాడు.. అలాంటి వాడి కోసం నేను చేసిన త్యాగాలు చాలా చిన్నవి. వాడు నా కొడుకుగా పుట్టడం నాకు గర్వకారణం' - తండ్రి ఎకోస్ బిజ్మోల్ Keep watching that 8.08m jump on a loop...it's a Silver Medal for #India from Murli Sreeshankar 🇮🇳#CommonwealthGames2022 Congratulations India, Congratulations Sree!@birminghamcg22 pic.twitter.com/Rzec3zHWyO — Athletics Federation of India (@afiindia) August 5, 2022 The First Medal of the Day 💪 Murali Sreeshankar wins the first medal of the day with his 🥈 win and takes India to a medal count of 19 in #CWG2022 🔥#BirminghamMeinJitegaHindustanHamara 🫶#B2022 #SirfSonyPeDikhega #SonySportsNetwork pic.twitter.com/dcbAFO0Wgu — Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2022 చదవండి: Commonwealth Games 2022: మురళీ శ్రీశంకర్ కొత్త చరిత్ర.. లాంగ్‌జంప్‌లో భారత్‌కు రజతం వారం కిత్రం పేరు లేదు.. కుక్కలతో హై జంప్ ప్రాక్టీస్; కట్‌చేస్తే -
మురళీ శ్రీశంకర్ కొత్త చరిత్ర.. లాంగ్‌జంప్‌లో భారత్‌కు రజతం
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ పతకాల జోరు కొనసాగుతుంది. బుధవారం హై జంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధించిన ఆ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో భారత్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ రజతం సాధించి చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల లాంగ్ జంప్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఓవరాల్‌గా కామన్వెల్త్ గేమ్స్‌లో లాంగ్‌జంప్ విభాగంలో ఇది మూడో పతకం. ఇంతకముందు 2002 ,2010లో మహిళల లాంగ్ జంప్ విభాగంలో అంజూ బాబీ జార్జీ(కాంస్యం), ప్రజూషా మాలిక్కల్(రజతం) పతకాలు సాధించారు. భారత కాలమాన ప్రకారం గురువారం రాత్రి జరిగిన లాంగ్ జంప్ ఫైనల్లో ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్లు దూకిన శ్రీశంకర్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. కాగా బహమాస్‌కు చెందిన లకాన్ నైర్న్ కూడా 8.08 మీటర్లే దూకి స్వర్ణం గెలిచాడు. ఎందుకంటే లకాన్ రెండో ఉత్తమ ప్రదర్శన(7.98 మీటర్లు).. శ్రీశంకర్(7.84 మీటర్లు) కన్నా ఎక్కువగా ఉండడమే కారణం. జమైకాకు చెందిన థాంప్సన్(8.05 మీటర్లు) దూకి కాంస్యం గెలిచాడు. కాగా కేరళకు చెందిన 23 ఏళ్ల మురళీ శ్రీ శంకర్ 2018 కామన్వెల్త్ క్రీడలకు చివరి నిమిషంలో దూరమయ్యాడు. అపెండిస్ సమస్యతో కామన్వెల్త్కు దూరమైన మురళీ శ్రీ శంకర్ ఇకపై లాంగ్ జంప్ చేయకపోవచ్చు అని అంతా భావించారు. కానీ అపెండిస్ ఆపరేషన్ విజయవంతం కావడం.. ఆ తర్వాత కఠోర సాధన ద్వారా లాంగ్‌జంప్‌లో తనను తాను మెరుగు పరుచుకున్నాడు. తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లో రజతంతో మెరిసిన మురళీ శ్రీశంకర్ ఔరా అనిపించాడు. SOARING HIGH 🤩🤩 🥈 #SreeshankarMurali after the historic feat at #CommonwealthGames in Men's Long Jump 😍😍#Cheer4India #India4CWG2022 pic.twitter.com/BdPt80MQwo — SAI Media (@Media_SAI) August 4, 2022 -
భారత రిలే జట్టుకు రజతం
కలి (కొలంబియా): ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత మిక్స్డ్ రిలే జట్టు 4X400 మీటర్ల పరుగులో రజత పతకం సాధించింది. శ్రీధర్, ప్రియా మోహన్, కపిల్, రూపల్ చౌదరీలతో కూడిన భారత జట్టు రేసును 3 నిమిషాల 17.67 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. వరల్డ్ అండర్–20 అథ్లెటిక్స్‌లో భారత మిక్స్డ్ టీమ్ మెరుగైన ప్రదర్శనతో పతకంతో నిలబెట్టుకుంది. గతేడాది నైరోబీలో మొదటిసారిగా నిర్వహించిన ప్రపంచ అండర్ –20 అథ్లెటిక్స్‌లో మిక్స్డ్ జట్టు కాంస్యం గెలిచింది. అప్పుడు రూపల్ మినహా భరత్, ప్రియా, కపిల్ ముగ్గురు కాంస్యం గెలిచిన బృందంలో ఉన్నారు. 🇮🇳The Indian U-20 4x400m mixed relay team of Bharath, Priya, Kapil & Rupal make the nation proud💥 They finish with a timing of 3.17.76, a new Asian U-20 record, to win 🥈 at the #U20WorldChampionships #Athletics pic.twitter.com/2890EMphNM — The Bridge (@the_bridge_in) August 2, 2022 That effort by #TeamIndia 🇮🇳🫡 pic.twitter.com/gkOW1y1MZk — Athletics Federation of India (@afiindia) August 3, 2022 -
Commonwealth Games 2022: న్యూస్ మేకర్.. జూడో ధీర
కామన్వెల్త్ క్రీడలలో సుశీలా దేవి లిక్మబమ్ రజత పతకం సాధించింది. 48 కేజీల జూడో ఫైనల్స్‌లో హోరాహోరీ పోరాడి రెండో స్థానంలో నిలిచింది. సుశీలా దేవి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి చేరింది. డిప్రెషన్‌ను జయించి ప్రత్యర్థిని గెలిచింది. మణిపూర్ ఖ్యాతిని పెంచిన మరో వనిత సుశీలా దేవి పరిచయం... ప్రత్యర్థిని నాలుగు వైపుల నుంచి ముట్టడించాలని అంటారు. జూడోలో కూడా నాలుగు విధాలుగా ప్రత్యర్థిని ముట్టడించవచ్చు. త్రోయింగ్, చోకింగ్, లాకింగ్, హోల్డింగ్ అనే నాలుగు పద్ధతులతో ప్రత్యర్థిపై గెలుపు సాధించాల్సి ఉంటుంది. బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్– 2022లో మహిళా జూడో 48 కేజీల విభాగంలో సోమవారం జరిగిన ఫైనల్స్‌లో సుశీలా దేవి లిక్మబమ్ తన ప్రత్యర్థి దక్షిణాఫ్రికా జూడో క్రీడాకారిణి మిషిలా వైట్బూయీ మీద ఈ నాలుగు విధాలా దాడి చేసినా ప్రత్యేక పాయింట్ల విషయంలో వెనుకబడింది. ఫలితంగా రెండో స్థానంలో నిలబడింది. అయినప్పటికీ భారత దేశానికి మహిళా జూడోలో రజతం సాధించిన క్రీడాకారిణిగా ఆమె ప్రశంసలను పొందుతోంది. అయితే ఈ రజతంతో ఆమె సంతోషంగా లేదు. ‘నేను అన్ని విధాలా గోల్డ్ మెడల్‌కు అర్హురాలిని. మిస్ అయ్యింది’ అని కొంత నిరాశ పడుతోంది. కాని సుశీలా ఎదుర్కొన్న ఆటుపోట్లను చూస్తే దాదాపుగా జూడో నుంచి బయటికొచ్చేసి తిరిగి ఈ విజయం సాధించడం సామాన్యం కాదని అనిపిస్తుంది. మేరీకోమ్ నేల నుంచి మణిపూర్ అంటే మేరీకోమ్ గుర్తుకొస్తుంది. 27 ఏళ్ల సుశీలా దేవిది కూడా మణిపూరే. తండ్రి మనిహర్, తల్లి చవోబి. నలుగురు పిల్లల్లో రెండో సంతానం సుశీలాదేవి. చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండే సుశీలాను చూసి ఆమె మేనమామ దినిక్ తనలాగే అంతర్జాతీయ స్థాయి జూడో క్రీడాకారిణి చేయాలనుకున్నాడు. అప్పటికే సుశీలాదేవి అన్న శైలాక్షి కూడా జూడో నేర్చుకుంటూ ఉండటంతో ఎనిమిదేళ్ల వయసు నుంచే సుశీలకు జూడో మీద ఆసక్తి పుట్టింది. ప్రాక్టీసు కోసం మేనమామ ఇంఫాల్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కేంద్రానికి రోజూ రమ్మంటే సుశీల వాళ్ల ఇంటి నుంచి అది సుమారు 10 కిలోమీటర్లు అయినా రోజూ అన్నా చెల్లెళ్లు సైకిల్ తీసుకుని కొండలు, గుట్టలు దాటుతూ సాయ్ కేంద్రానికి చేరుకునేవారు. అలా ఆమె శిక్షణ మొదలయ్యింది. చెప్పాల్సిన విషయం ఏమంటే అన్న క్రమంగా జూడోలో వెనకబడితే చెల్లెలు పేరు తెచ్చుకోవడం మొదలెట్టింది. దానికి కారణం మహిళా జూడోలోకి ప్రవేశించే క్రీడాకారిణులు తక్కువగా ఉండటమే. పాటియాలా శిక్షణ సుశీల శిక్షణ ఇంఫాల్ నుంచి పాటియాలాలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలె¯Œ ్సకు మారింది. అక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఆడే మేరీకోమ్ వంటి ఆటగాళ్లను చూశాక ఆమెలో స్ఫూర్తి రగిలింది. తాను కూడా విశ్వవేదికపై మెరవాలని కలలు కని వాటిని సాకారం చేసుకునే దిశగా కృషి చేసింది. కోచ్ జీవన్ శర్మ ఆమెకు ద్రోణాచార్యుడి గా మారి శిక్షణ ఇచ్చాడు. 2008 జూనియర్ నేషనల్ చాంపియన్ షిప్లో పతకం సాధించడంతో ఆమె పేరు జూడోలో వినిపించడం మొదలెట్టింది. కొనసాగింపుగా ఆసియా యూత్ చాంపియన్ షిప్లో కూడా సుశీల పతకాలు సాధించింది. కారు అమ్ముకుంది క్రికెట్ తప్ప వేరే క్రీడలను పెద్దగా పట్టించుకోని స్పాన్సర్లు భారత్‌లో అంతగా తెలియని జూడోను అసలు పట్టించుకోనేలేదు. పైగా మహిళా జూడో అంటే వారికి లెక్కలేదు. ప్రభుత్వం కూడా ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌కు తప్ప వరల్డ్ ఛాంపియ¯Œ ్సకు పెద్దగా స్పాన్సర్షిప్ చేయదు. స్పాన్సర్లు లేకపోవడంతో తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న మొదటి కారును అమ్ముకుని ఆ పోటీలలో పాల్గొన్నది సుశీల. ‘నేను సంపాదించిందంతా జూడోలోనే ఖర్చు చేశాను. ఇంక నా దగ్గర అమ్ముకోవడానికి ఏమీ మిగలలేదు. కానీ ఈ ఆటను నేను వీడను..’ అంటుంది సుశీల. ఈ మెడల్‌తో ఆమె ఖ్యాతి మరింత పెరిగింది. ఇక ఆట కొనసాగింపు చూడాలి. సుశీల ప్రస్తుతం మణిపూర్ పోలీస్ శాఖలో ఇన్స్పెక్టర్గా పని చేస్తోంది. 2014 కామన్వెల్త్ విజయం 2014లో జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించడంతో సుశీల మీద అందరి అంచనాలు పెరిగాయి. ఆమె నుంచి ఒక ఒలింపిక్ పతకం ఖాయం అని భావించారు. అందుకు రిహార్సల్స్ వంటి 2018 ఆసియా క్రీడల్లో పాల్గొనాలని ఉత్సాహపడుతున్న సుశీలను గాయం బాధ పెట్టింది. ఆమె ఆ గేమ్స్‌లో పాల్గొనలేకపోవడంతో డిప్రెషన్ బారిన పడింది. ఆ తర్వాత వచ్చిన లాక్డౌన్, టోర్నీలు రద్దుకావడం ఇవన్నీ ఆమెను టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటానో లేదోననే స్థితికి తీసుకెళ్లాయి. టోక్యో ఒలింపిక్స్‌లో అదృష్టవశాత్తు కాంటినెంటల్ కోటాలో స్థానం దొరికితే దేశం తరపున ఏకైక జూడో క్రీడాకారిణిగా పాల్గొన్నా ఫస్ట్ రౌండ్లోనే వెనుదిరగాల్సి వచ్చింది. 2019 ఆసియన్ ఓపెన్ ఛాంపియన్ షిప్లో సిల్వర్ మెడల్, 2019 లో కామన్వెల్త్ జూడో ఛాంపియన్ షిప్లో స్వర్ణం నెగ్గింది. అయితే 2018 కు ముందు ఆమె చేతికి గాయమైంది. దీంతో ఆమె ఏడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఒలింపిక్స్ లో పాల్గొనాలన్న ఆశలు ఆవిరవుతున్నట్టు అనిపించింది. కానీ ఆమె కుంగిపోలేదు. ఇంటికి వెళ్లి మూడు నెలలు విరామం తీసుకుంది. తిరిగి 2018లో ఆసియా గేమ్స్ లో పాల్గొనలేకపోయినా 2019 లో హాంకాంగ్ వేదికగా జరిగిన హాంకాంగ్ ఓపెన్ లో బరిలోకి దిగింది. -
కంటతడి పెట్టిన కిదాంబి శ్రీకాంత్.. స్వర్ణం చేజారాక తీవ్ర భావోద్వేగం
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి సత్తా చాటుతున్నారు. ఆరో రోజు లవ్‌ప్రీత్ సింగ్ వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్యం గెలవడంతో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. భారత్ సాధించిన ఈ పతకాలలో 9 వెయిట్ లిఫ్టింగ్లోనే సాధించినవి కాగా, మిగతా 5 మెడల్స్.. జూడో (2), లాన్స్ బౌల్స్ (1), టేబుల్ టెన్నిస్ (1), బ్యాడ్మింటన్ (1) క్రీడల్లో గెలిచినవి. ఇదిలా ఉంటే, క్రీడల ఐదో రోజు బ్యాడ్మింటన్ మిక్సడ్ టీమ్ ఈవెంట్లో భారత్ సాధించిన సిల్వర్ మెడల్‌పై ప్రస్తుతం నెట్టింట జోరుగా చర్చ సాగుతుంది. ఈ ఈవెంట్ ఫైనల్లో భారత జట్టు 1-3 తేడాతో మలేషియా చేతిలో దారుణంగా ఓడి రజతంతో సరిపెట్టుకుంది. భారత్ ఆడిన నాలుగు గేమ్‌ల్లో ఒక్క పీవీ సింధు మాత్రమే విజయం సాధించింది. స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సహా సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీ కూడా ఫైనల్లో ఓటమిపాలై భారత్ బంగారు ఆశలను నీరుగార్చారు. అయితే ఓటమి అనంతరం కిదాంబి శ్రీకాంత్ కంటతడి పెట్టిన వైనం భారత అభిమానులను చాలా బాధించింది. శ్రీకాంత్.. తన వల్లే భారత్ స్వర్ణం గెలిచే అవకాశాన్ని కోల్పోయిందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ విషయాన్ని సహచరుడు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి మీడియాకు తెలిపాడు. శ్రీకాంత్ అలా ఏడవడం చూస్తే చాలా బాధ అనిపించిందని, అతన్ని ఆ పరిస్థితిలో చూడటం అదే మొదటిసారి అని సాత్విక్ అన్నాడు. చదవండి: కొనసాగుతున్న భారత వెయిట్ లిఫ్టర్ల హవా.. ఇవాళ మరో పతకం -
పీవీ సింధు మాత్రమే.. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్‌కు రజతం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల జోరు కొనసాగుతుంది. తాజాగా భారత్ ఖాతాలో 13వ పతకం వచ్చి చేరింది. భారత బ్యాడ్మింటన్ మిక్సడ్ టీమ్ విభాగం రజత పతకం సాధించింది. మంగళవారం అర్థరాత్రి మలేషియాతో జరిగిన మిక్స్డ్ టీమ్ ఫైనల్లో 3-1 తేడాతో ఓడిన భారత జట్టు రజతం గెలుచుకుంది. పీవీ సింధు మినహా మిగతావారు ఓటమి పాలవ్వడంతో భారత్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముందుగా భారత షెట్లర్లు చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయిరాజ్ మలేషియాకు చెందిన టెంగ్ ఫాంగ్ ఆరోన్ చియా,వూయి యిక్‌తో జరిగిన పురుషులు డబుల్స్ మ్యాచ్‌లో పరాజయం పాలయ్యారు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 21-18,21-15 తేడాతో చిరాగ్-సాత్విక్ జంట ఓటమి చవిచూసింది. అనంతరం సింగిల్స్‌లో భాగంగా పీవీ సింధు.. మలేషియా స్టార్ జిన్ వెయ్-గోహ్‌ను 22-20, 21-17తో మట్టికరిపించి మ్యాచ్ గెలిచింది. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో భారత్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్.. మలేషియా షెట్లర్ జె యోంగ్ చేతిలో 21-19,6-21,21-16తో ఓడిపోయాడు. దీంతో మలేషియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక నిర్ణయాత్మకమైన నాలుగో మ్యాచ్ అయిన మహిళల డబుల్స్‌లో భారత్ జోడి త్రీసా జోలీ-గాయత్రి గోపిచంద్ చేతులెత్తేసింది. మలేషియన్ జంట మురళీధరన్ తీనా- కూంగ్ లే పెర్లీ టాన్ చేతిలో 21-18,21-17తో భారత్ జంట ఓటమి పాలవ్వడంతో భారత్ ఖాతాలో రజతం వచ్చి చేరింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 13 పతకాలు ఉండగా.. అందులో 5 స్వర్ణం, ఐదు రజతం, మూడు కాంస్యాలు ఉన్నాయి. SILVER FOR INDIA 🇮🇳 Indian #Badminton Mixed Team puts up a brilliant show of team play, grit, resilience to bag its 2nd consecutive medal🥇🥈 at #CommonwealthGames A mix of comebacks & dominance by our Champs lead 🇮🇳 to this 🥈 at @birminghamcg22 Well played 👏#Cheer4India pic.twitter.com/AMj8q9sAik — SAI Media (@Media_SAI) August 2, 2022 చదవండి: Lan Bowls CWG 2022: ఊహించని ఫలితం.. ‘ఆనందం నాలుగింతలు’ CWG 2022: ఫ్రెంచ్ ఫ్రైస్ ధర తెలిస్తే షాకవ్వడం ఖాయం! -
CWG 2022: దూసుకుపోతున్న భారత్.. వెయిట్ లిఫ్టింగ్‌లో మరో పతకం
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. ఐదో రోజు మహిళల లాన్ బౌల్స్, పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లలో స్వర్ణ పతాకలు సాధించిన భారత్.. వెయిట్ లిఫ్టింగ్‌లో తాజా మరో పతకం సాధించింది. పురుషుల 96 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ వికాస్ సింగ్ రజతం సాధించాడు. స్నాచ్ రౌండ్లో 155 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్లో 191 కేజీలు ఎత్తిన వికాస్.. మొత్తంగా 346 కేజీల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో వికాస్‌కు ఇది వరుసగా మూడో పతకం కావడం విశేషం. 2014 గ్లాస్గో క్రీడల్లో రజతం గెలిచిన వికాస్.. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించాడు. ఈ విభాగంలో సమోవాకి చెందిన డాన్ ఓపెలోగ్ (171+210=381 కేజీలు) స్వర్ణం గెలువగా.. ఫిజికి చెందిన తానియెల (155+188=343) కాంస్యం సాధించాడు. వికాస్ సింగ్ విజయంతో భారత పతకాల సంఖ్య 12కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, నాలుగు రజతాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: భారత్ ఖాతాలో ఐదో స్వర్ణం.. ఎందులో అంటే..? -
Commonwealth Games 2022: సుశీలకు చేజారిన స్వర్ణం
బర్మింగ్‌హామ్: ఎనిమిదేళ్ల క్రితం గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన రజతాన్ని ఈ సారి స్వర్ణంగా మార్చాలని బరిలోకి దిగిన భారత జూడో ప్లేయర్ సుశీలా దేవికి నిరాశే ఎదురైంది. గాయాలతో బాధపడుతూనే ఫైనల్ బరిలోకి దిగిన సుశీల చివరకు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో సుశీలపై దక్షిణాఫ్రికాకు చెందిన మైకేలా వైట్‌బూ విజయం సాధించింది. గాయం కారణంగా కుడి కాలికి నాలుగు కుట్లతో బరిలోకి దిగిన సుశీల 4.25 నిమిషాల పాటు హోరాహోరీగా పోరాడి చివరకు తలవంచింది. పురుషుల 60 కేజీల విభాగంలో భారత్‌కు కాంస్యం లభించింది. వారణాసికి చెందిన విజయ్ కుమార్ యాదవ్ కాంస్య పతక పోరులో 58 సెకన్లలోనే పెట్రోస్ క్రిస్టోడూలిడ్స్ (సైప్రస్)ను ఓడించాడు. అయితే జూడోలోనే భారత్‌కు రెండు పతకాలు చేజారాయి. కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లలో పురుషుల 66 కేజీల విభాగంలో నాథన్ కట్జ్ (ఆస్టేలియా) చేతిలో జస్లీన్ సింగ్ సైనీ... మహిళల 57 కేజీల విభాగంలో క్రిస్టీ లెజెంటిన్ (మారిషస్) చేతిలో సుచిక తరియాల్ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఎనిమిది పతకాలతో ఆరో స్థానంలో ఉంది. బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ విభాగంలో వరుసగా రెండోసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. సెమీఫైనల్లో భారత్ 3–0తో సింగపూర్‌ను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో మలేసియాతో భారత్ తలపడుతుంది. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో మలేసియాపైనే నెగ్గి భారత్ స్వర్ణ పతకం సాధించడం విశేషం. సింగపూర్‌తో జరిగిన సెమీఫైనల్లో తొలి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–11, 21–12తో యాంగ్ కాయ్–లియాంగ్ క్వెక్‌లపై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 21–11, 21–12తో జియా మిన్ యోను ఓడించి భారత్‌కు 2–0తో ఆధిక్యంలో నిలిపింది. మూడో మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21–18, 21–15తో ప్రపంచ చాంపియన్ కీన్ యె లోపై నెగ్గి భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఇంగ్లండ్‌తో భారత్ మ్యాచ్ ‘డ్రా’ పురుషుల హాకీలో ఇంగ్లండ్‌తో జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను భారత్ 4–4తో ‘డ్రా’ చేసుకుంది. భారత్ తరఫున లలిత్ ఉపాధ్యాయ్ (3వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్(46వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... మన్దీప్ (13వ, 22వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. సెమీస్‌లో సౌరవ్ పురుషుల స్క్వాష్ సింగిల్స్‌లో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ సెమీఫైనల్ చేరాడు. క్వార్టర్ ఫైనల్లో సౌరవ్ 11–5, 8–11, 11–7, 11–3తో గ్రెగ్ లాబన్ (స్కాట్లాండ్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జోష్నా చినప్ప 9–11, 5–11, 13–15తో హోలీ నాటన్ (కెనడా) చేతిలో ఓడిపోయింది. మహిళల జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఈవెంట్ ఫైనల్లో భారత ప్లేయర్ ప్రణతి నాయక్ ఐదో స్థానంలో నిలిచింది. -
భారత్ ఖాతాలో నాలుగో పతకం.. వెయిట్లిప్టింగ్లో బింద్యారాణికి రజతం
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 55 కిలోల విభాగంలో బింద్యారాణి దేవి రజతం గెలుపొందింది. 23 ఏళ్ల బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ జెర్క్ కేటగిరిలో 116 కేజీలు.. మొత్తంగా 202 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. అయితే బింద్యారాణి క్లీన్ అండ్ జర్క్ రెండో ప్రయత్నంలో 114 కిలోలు ఎత్తడంలో విఫలమైంది. దీంతో అంతా ఆమెకు కాంస్యం వస్తుందని భావించారు. అయితే చివరి రౌండ్లో పుంజుకున్న బింద్యారాణి..116 కిలోలు ఎత్తి రజతం దక్కించుకున్నది. నైజీరియాకు చెందిన అడిజట్ ఒలారినోయ్ 117 కిలోల బరువెత్తి గోల్డ్ మెడల్ సాధించింది. ఒలారొనోయ్(స్నాచ్ 92 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు) మొత్తంగా 203 కేజీలు ఎత్తి స్వర్ణం చేజెక్కించుకుంది. కాగా కేవలం ఒక్క కేజీ కేజీ తేడాతో బింద్యారాణి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక లోకల్ క్రీడాకారిణి ఫ్రేర్ మారో 196 కేజీలు(86 స్నాచ్, 109 క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి కాంస్యం చేజెక్కించుకుంది. కాగా, బింద్యారాణి సాధించిన పతకంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నాలుగు వెయిట్‌లిఫ్టింగ్‌లోనే రావడం విశేషం. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం ముద్దాడగా, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం సాధించగా, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారికి కాంస్యం లభించింది. SUPER SENSATIONAL SILVER FOR BINDYARANI 🔥🔥 Bindyarani Devi 🏋♀️wins 🥈in the Women's 55kg with a total lift of 202kg, after an amazing come back 💪💪 Snatch - 86 kg (PB & Equalling NR) Clean & Jerk - 116 kg (GR & NR) With this 🇮🇳 bags 4️⃣🏅 @birminghamcg22#Cheer4India pic.twitter.com/iFbPHpnBmK — SAI Media (@Media_SAI) July 30, 2022 చదవండి: Mirabai Chanu: మన 'బంగారు' మీరాబాయి -
Commonwealth Games 2022: ‘త్రివర్ణాలు’
బరువులెత్తడంలో భారత్ భళా అనిపించింది. కామన్వెల్త్ గేమ్స్ రెండో రోజు వెయిట్‌లిఫ్టర్ల ప్రదర్శనతో స్వర్ణ, రజత, కాంస్యాలు మన ఖాతాలో చేరాయి. ఒలింపిక్స్ రజతధారి మీరాబాయి చాను తన స్థాయిని ప్రదర్శిస్తూ సంపూర్ణ ఆధిపత్యంతో స్వర్ణం సాధించింది. యువ ఆటగాడు సంకేత్ సర్గార్ రజతంతో ఈ క్రీడల్లో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టగా... సీనియర్ గురురాజ కంచు మోత మోగించి వరుసగా రెండో క్రీడల్లోనూ పతకాన్ని అందుకున్నాడు. మరోవైపు వరుసగా రెండో రోజు కూడా మన షట్లర్లు, బాక్సర్లు తమదైన ఆటతో దూసుకుపోవడం శనివారం పోటీల్లో విశేషం. బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ ఒకే రోజు మూడు వేర్వేరు పతకాలతో తమ ముద్రను ప్రదర్శించింది. అందరిలోకి మహిళల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతక ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయి 49 కేజీల కేటగిరీలో అలవోకగా, ప్రత్యర్థులకు అందనంత బరువెత్తి మొదటి స్థానంలో నిలిచింది. మణిపూర్‌కు చెందిన మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి ఖాయం చేసుకుంది. మేరీ హనిత్రా (మారిషస్; 172 కేజీలు), హన్ కమిన్స్కీ (కెనడా; 171 కేజీలు) తర్వాతి స్థానాల్లో నిలిచి రజతం, కాంస్యం గెలుచుకున్నారు. పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సర్గార్ రజత పతకం సాధించాడు. మహారాష్ట్రకు చెందిన సంకేత్ స్నాచ్‌లో 113 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 135 కేజీలు (మొత్తం 248 కేజీలు) బరువెత్తిన అతను రెండో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో మొహమ్మద్ అనీఖ్ కస్‌దమ్ (మలేసియా)కు స్వర్ణ పతకం దక్కింది. అతను 107+142 (మొత్తం 249 కేజీలు) స్వర్ణం సాధించగా, ఇసురు కుమార (శ్రీలంక; మొత్తం 225 కేజీలు)కు కాంస్యం దక్కింది. పురుషుల 61 కేజీల కేటగిరీలో భారత లిఫ్టర్ గురురాజ పుజారికి కాంస్యం లభించింది. కర్ణాటకకు చెందిన గురురాజ స్నాచ్‌లో 118 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 151 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 269 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో మొహమ్మద్ అజ్నిల్ (మలేసియా; 285 కేజీలు), బరు మొరియా (పపువా న్యూగినియా; 273 కేజీలు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. మూడో ప్రయత్నంలో విఫలమై... స్నాచ్ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. అయితే ఓవరాల్‌గా ఆమెకు, తర్వాతి స్థానంలో నిలిచిన లిఫ్టర్‌కు మధ్య ఉన్న అంతరం (29 కేజీలు) చూస్తే ఈ పోటీల్లో చాను స్థాయి ఏమిటో అర్థమవుతుంది. మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన సంకేత్, స్నాచ్‌లో మూడు ప్రయత్నాల్లో 107, 111, 113 కిలోల బరువులెత్తి అగ్ర స్థానం సాధించాడు. రెండో స్థానంలో ఉన్న ప్రత్యర్థి బిన్కస్దమ్కంటే అతను 6 కిలోల ఆధిక్యంలో నిలిచాడు. క్లీన్ అండ్ జర్క్‌లో మొదటి ప్రయత్నంలో సంకేత్ 135 కిలోలు ఎత్తగా, బిన్కస్దన్ 138 కిలోలతో పైచేయి సాధించాడు. అయితే ఆ తర్వాత సంకేత్‌ను దురదృష్టం వెంటాడింది. రెండో ప్రయత్నంలో 139 కిలోలు ఎత్తే లక్ష్యంతో బరిలోకి దిగి విఫలమైన అతను... స్వర్ణమే లక్ష్యంగా మూడో ప్రయత్నంలో మరింత ఎక్కువ బరువును (141 కేజీ) ఎత్తేందుకు సిద్ధమయ్యాడు. అయితే మరింతగా ఇబ్బంది పడిన సంకేత్ వెయిట్‌ను ఒక సెకన్ కూడా లిఫ్ట్ చేయలేక వదిలేశాడు. ఈ క్రమంలో అతని చేతికి గాయం కూడా అయింది. చివరకు 1 కేజీ తేడాతో స్వర్ణం సంకేత్ చేజారింది. 2018 క్రీడల్లో రజతం గెలిచిన గురురాజ ఈసారి కాంస్యంతో ముగించాడు. అప్పుడు 56 కేజీల విభాగంలో పతకం గెలిచిన అతను ఒలింపిక్స్ లక్ష్యంగా కేటగిరీ మార్చుకొని 61 కేజీల విభాగంలో పోటీ పడ్డాడు. బర్మింగ్‌హామ్ వచ్చిన తర్వాత కూడా జ్వరంతో బాధపడుతుండటంతో సరైన విధంగా సాధన సాగలేదు. ఈవెంట్లో ఒకదశలో కాంస్యం చేజారేలా అనిపించినా పట్టుదలగా నిలిచిన అతను ఒక కేజీ తేడాతో కెనడా లిఫ్టర్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానంతో ముగించాడు. బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో భారత్ బ్యాడ్మింటన్‌లో భారత జట్టు తొలి లక్ష్యం పూర్తయింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వరుసగా రెండో విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5–0తో శ్రీలంక జట్టును ఓడించింది. ఫైనల్లో శ్రీహరి స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో శ్రీహరి 54.55 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. హుసాముద్దీన్, లవ్లీనా శుభారంభం పురుషుల బాక్సింగ్‌లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి, మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్ (70 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో హుసాముద్దీన్ 5–0తో అమ్జోలెలె (దక్షిణాఫ్రికా)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 5–0తో అరియాన్ నికోల్సన్ (న్యూజిలాండ్)పై గెలిచారు. మహిళల టీటీ జట్టుకు షాక్ టేబుల్ టెన్నిస్ (టీటీ)లో మహిళల టీమ్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 2–3తో మలేసియా చేతిలో ఓడిపోయింది. 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో క్వార్టర్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయిన మలేసియా ఈ గేమ్స్‌లో భారత్‌ను ఓడించి బదులు తీర్చుకుంది. పాక్‌తో భారత్ పోరు... కామన్వెల్త్ గేమ్స్ మహిళల టి20 క్రికెట్ ఈవెంట్లో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మధ్య గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ జరగనుంది. తమ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ ఓడిపోవడంతో సెమీఫైనల్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. మధ్యాహ్నం గం. 3:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
CWG 2022: బోణీ కొట్టిన భారత్.. వెయిట్ లిఫ్టింగ్‌లో తొలి పతకం
Birmingham 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రజత పతకం సాధించాడు. ఈ పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన సంకేత్.. మొత్తం 248 కేజీల బరువును (స్నాచ్‌లో 113 కేజీలు, సీ ఎండ్ జేలో 135 కేజీలు) ఎత్తి తన లక్ష్యానికి (స్వర్ణం) కేవలం ఒక్క కిలో దూరంలో నిలిచిపోయాడు. Braving through injury to win a medal for his country, we couldn't have asked for more from Sanket! ❤️🇮🇳#CommonwealthGames pic.twitter.com/btIYs9MEqx — The Bridge (@the_bridge_in) July 30, 2022 మలేషియాకు చెందిన బిబ్ అనిక్ 259 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. శ్రీలంకకు చెందిన దిలంక యోడగే (225 కేజీలు) కాంస్యం సాధించాడు. సంకేత్.. సీ ఎండ్ జే రెండో ప్రయత్నంలో గాయపడటంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. చదవండి: CWG 2022: ఎక్కడికెళ్లినా దొరికిపోవడమే.. వీడేం బాక్సర్ రా బాబు!.. కామన్వెల్త్ నుంచి సస్పెండ్ -
వచ్చేసారి మరింత మెరుగ్గా రాణిస్తా.. బంగారు పతకమే నా టార్గెట్: నీరజ్ చోప్రా
ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2022లో రజత పతకం గెలిచి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం గెలిచిన రెండో భారత అథ్లెట్‌గా చోప్రా నిలిచాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితర ప్రముఖులు నీరజ్ ప్రదర్శనను కొనియాడారు ఇక పతకం సాధించిన అనంతరం నీరజ్ చోప్రా మాట్లాడూతూ.. "కఠిన ప్రత్యర్థుల నడుమ క్లిష్ట వాతావరణ పరిస్థితుల మధ్య రజత పతకం గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒలింపిక్స్‌తో పోలిస్తే ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే పోటీ ఎక్కువగా ఉంటుంది. తొలి మూడుప్రయత్నాల్లో జావెలిన్‌ను అనుకున్నంత దూరం విసరకపోయినా నాలుగో ప్రయత్నంలో అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నాను. నాలుగో త్రో అనంతరం తొడలో నొప్పి కలగడంతో తర్వాతి రెండు త్రోలు సవ్యంగా చేయలేకపోయా. ఏ క్రీడాకారుడైనా బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో స్వర్ణ పతకం సాధించలేడు. ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో మినహా అన్ని ప్రముఖ టోర్నీలలో నేను బంగారు పతకాలు సాధించాను. నా ప్రదర్శనను మరింత మెరుగు పర్చుకొని వచ్చే ఏడాది హంగేరిలో జరిగే ప్రపంచ చాంపియన్ షిప్లో స్వర్ణ పతకం సాధించేందుకు కృషి చేస్తా" అని పేర్కొన్నాడు. చదవండి: Neeraj Chopra: నీరజ్ చోప్రా 'రజతం'.. డ్యాన్స్‌తో ఇరగదీసిన కుటుంబసభ్యులు -
World Athletics Championships 2022: నీ‘రజత’ధీర..!
అమెరికాలో ఆదివారం ఉదయం భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అద్భుతం చేశాడు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. తద్వారా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు రజత పతకం అందించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ బాబీజార్జి కాంస్య పతకాన్ని సాధించింది. తాజా ప్రదర్శనతో నీరజ్ ఒలింపిక్స్, ఆసియా చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, దక్షిణాసియా క్రీడలు, డైమండ్ లీగ్ మీట్ తదితర మెగా ఈవెంట్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా అరుదైన ఘనత సాధించాడు. కోట్లాది మంది భారతీయుల అంచనాలను నిజం చేస్తూ... మన అథ్లెట్స్లోనూ ప్రపంచస్థాయి వేదికపై పతకాలు గెలిచే సత్తా ఉందని నిరూపిస్తూ... గతంలో ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ప్రదర్శనను నమోదు చేస్తూ... అమెరికా గడ్డపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ... భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుతం ఆవిష్కరించాడు. 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు తొలిసారి రజత పతకాన్ని అందించాడు. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ జార్జి కాంస్య పతకాన్ని సాధించగా... నీరజ్ తాజాగా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన అథ్లెట్‌గా ఘనత వహించాడు. యుజీన్ (అమెరికా): సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. 19 ఏళ్ల తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ మళ్లీ పతకాల బోణీ కొట్టింది. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అందరి అంచనాలకు అనుగుణంగా రాణించి భారత్‌కు రజత పతకం అందించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) జావెలిన్‌ను 90.54 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోగా... జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్) జావెలిన్‌ను 88.09 మీటర్ల దూరం పంపించి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. జావెలిన్ త్రో ఫైనల్లో పోటీపడిన భారత్‌కే చెందిన మరో అథ్లెట్ రోహిత్ యాదవ్ (78.22 మీటర్లు) పదో స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో విఫలమైనా... జావెలిన్ త్రో ఫైనల్లో మొత్తం 12 మంది పోటీపడ్డారు. తొలి మూడు రౌండ్ల తర్వాత టాప్–8లో నిలిచిన వారు రెండో దశకు చేరగా... మిగతా నలుగురు నిష్క్రమించారు. క్వాలిఫయింగ్‌లో తొలి ప్రయత్నంలోనే అర్హత ప్రమాణాన్ని అందుకున్న 24 ఏళ్ల నీరజ్ చోప్రా ఫైనల్లో మాత్రం తొలి అవకాశంలో ఫౌల్ చేశాడు. అయితే ఆందోళన చెందకుండా నీరజ్ నెమ్మదిగా పుంజుకున్నాడు. రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 82.39 మీటర్లు... మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు విసిరిన నీరజ్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇక నాలుగో ప్రయత్నంలో నీరజ్ తన శక్తినంతా కూడదీసుకొని జావెలిన్‌ను 88.13 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. నీరజ్ ఐదో, ఆరో ప్రయత్నాలు ఫౌల్ కాగా... 24 ఏళ్ల అండర్సన్ పీటర్స్ చివరిదైన ఆరో ప్రయత్నంలో ఈటెను 90.54 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. వాద్లెచ్, జూలియన్ వెబర్ (జర్మనీ), అర్షద్ నదీమ్ (పాకిస్తాన్) లసీ ఇటెలాటలో (ఫిన్లాండ్), ఆండ్రియన్ మర్డారె (మాల్డోవా) తదితరులు తర్వాతి ప్రయత్నాల్లో నీరజ్ దూరాన్ని అధిగమించకపోవడంతో భారత అథ్లెట్ ఖాతాలో రజతం చేరింది. నీరజ్ సాధించిన రజత పతకంతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ సంయుక్తంగా 29వ ర్యాంక్‌లో ఉంది. ఒక రజతం, ఐదుగురు ఫైనల్స్ చేరడంద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ ఈసారి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. జెలెజ్నీ తర్వాత... డిఫెండింగ్ చాంపియన్ ఆండర్సన్ పీటర్స్ ఆరు ప్రయత్నాల్లో మూడుసార్లు జావెలిన్‌ను 90 మీటర్లకంటే ఎక్కువ దూరం విసిరి ఫైనల్లో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెజ్నీ (1993, 1995) తర్వాత వరుసగా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకాలు నెగ్గిన జావెలిన్ త్రోయర్‌గా అండర్సన్ గుర్తింపు పొందాడు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ అండర్సన్ చాంపియన్‌గా నిలిచాడు. ప్రశంసల వర్షం... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు తొలి రజత పతకాన్ని అందించిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితర ప్రముఖులు నీరజ్ ప్రదర్శనను కొనియాడారు. ‘నీరజ్‌కు శుభాకాంక్షలు. భారత క్రీడల్లో ఇదెంతో ప్రత్యేక ఘట్టం. భవిష్యత్‌లో నీరజ్ మరిన్ని విజయాలు సాధించాలి’ అని ప్రధాని ట్విటర్లో అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత, షూటర్ అభినవ్ బింద్రా, దిగ్గజ అథ్లెట్స్ పీటీ ఉష, అంజూ బార్జి కూడా నీరజ్‌ను అభినందించారు. విసిరితే పతకమే... 2016 జూలై 23న పోలాండ్‌లో జరిగిన ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి వెలుగులోకి వచ్చిన నీరజ్ చోప్రా అటునుంచి వెనుదిరిగి చూడలేదు. హరియాణాకు చెందిన నీరజ్ ఆ తర్వాత బరిలోకి దిగిన ప్రతి మెగా ఈవెంట్లో పతకంతో తిరిగి వచ్చాడు. 2016లోనే జరిగిన దక్షిణాసియా క్రీడల్లో... 2017లో ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో... 2018 జకార్తా ఆసియా క్రీడల్లో... 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో... నీరజ్ జావెలిన్ త్రోలో భారత్‌కు పసిడి పతకాలు అందించాడు. 2017లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా ఫైనల్‌కు అర్హత పొందలేకపోయిన నీరజ్ 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మోచేయి గాయంతో బరిలోకి దిగలేదు. గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచి విశ్వక్రీడల అథ్లెటిక్స్‌లో బంగారు పతకం నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ తర్వాత రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకొని గత అక్టోబర్‌లో మళ్లీ శిక్షణ ప్రారంభించాడు. గత నెలలో ఫిన్లాండ్లో జరిగిన కుర్టానో గేమ్స్‌లో స్వర్ణం... పావో నుర్మీ గేమ్స్‌లో రజతం... స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో రజతం సాధించిన నీరజ్ అదే జోరును ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కొనసాగించి భారత్‌కు తొలి రజత పతకాన్ని అందించాడు. ఈనెల 28 నుంచి బర్మింగ్హమ్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా నీరజ్ బరిలోకి దిగనున్నాడు. ఎల్డోజ్ పాల్‌కు తొమ్మిదో స్థానం ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆదివారమే జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో భారత ప్లేయర్ ఎల్డోజ్ పాల్ నిరాశపరిచాడు. కేరళకు చెందిన పాల్ 16.79 మీటర్ల దూరం గెంతి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే హీట్స్‌ను మొహమ్మద్ అనస్ యాహియా, మొహమ్మద్ అజ్మల్, నాగనాథన్ పాండి, రాజేశ్ రమేశ్‌లతో కూడిన భారత బృందం 3ని:07.29 సెకన్లలో పూర్తి చేసి ఆరో స్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందలేకపోయింది. నీరజ్ గ్రామంలో సంబరాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా ప్రదర్శనతో... హరియాణాలోని పానిపట్‌కు సమీపంలోని ఖాండ్రా గ్రామంలో నీరజ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంబరాలు చేసుకున్నారు. ‘దేశం మొత్తం, హరియాణా రాష్ట్రం మొత్తం నీరజ్ ప్రదర్శనకు గర్వపడుతోంది. నిరంతరం శ్రమిస్తూ అతను దేశానికి పేరుప్రతిష్టలు తెస్తున్నాడు’ అని నీరజ్ తల్లి సరోజ్ వ్యాఖ్యానించారు. -
నీరజ్ చోప్రా 'రజతం'.. డ్యాన్స్‌తో ఇరగదీసిన కుటుంబసభ్యులు
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా స్వస్థలమైన హర్యానాలోని పానిపట్ కేంద్రంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. నీరజ్ పతకం సాధించాడని తెలియగానే అతని కుటుంబసభ్యులు, బంధు మిత్రులు మిఠాయిలు పంచుకొని బాణసంచాలు కాల్చారు. అనంతరం డ్యాన్స్‌లతో ఇరగదీశారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఏఎన్ఐ ట్విటర్లో షేర్ చేయగా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇక ఆదివారం జరిగిన ఫైనల్లో తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ చోప్రా.. నాలుగో ప్రయత్నంలో ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రజతం కొల్లగొట్టాడు. తద్వారా 19 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. 2003 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో లాంగ్ జంప్ విభాగంలో భారత మహిళా అథ్లెట్ అంజూ బాబీ జార్జీ కాంస్యం గెలుచుకుంది. అప్పటి నుంచి భారత్‌కు అథ్లెటిక్స్ విభాగంలో పతకం రాలేదు. తాజాగా నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్‌లో పతకం సాధించిన రెండో భారత అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు. గ్రెనేడియన్ జావెలిన్ త్రోయర్ అండర్సన్ పీటర్స్ 90.54 దూరం విసిరి స్వర్ణం సాధించగా.. 88.09 మీటర్లతో జాకుబ్ వడ్లేజ్ కాంస్యం గెలుచుకున్నాడు. కాగా భారత్‌కు చెందిన మరో అథ్లెట్ రోహిత్ యాదవ్ ఫైనల్లో నిరాశపరిచాడు. తన మూడో ప్రయత్నంలో ఈటెను 78.72 మీటర్ల దూరం విసిరిన రోహిత్ ఓవరాల్‌గా 10వ స్థానానికి పరిమితమయ్యాడు. #WATCH Family and friends celebrate Neeraj Chopra's silver medal win in the World Athletics Championships at his hometown in Panipat, #Haryana Neeraj Chopra secured 2nd position with his 4th throw of 88.13 meters in the men's Javelin finals. pic.twitter.com/khrUhmDgHG — ANI (@ANI) July 24, 2022 చదవండి: రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా.. రెండో భారత అథ్లెట్‌గా రికార్డు -
జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు మరో పతకం
-
Neeraj Chopra Latest Photos: శభాష్ నీరజ్ చోప్రా (ఫొటోలు)
-
నీరజ్ చోప్రా మరో సంచలనం.. రెండో భారత అథ్లెట్‌గా రికార్డు
ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరో మారు సంచలనం సృష్టించాడు. అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2022లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 88.13 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా.. సిల్వర్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. నీరజ్ చోప్రా తన తొలి ప్రయత్నాన్ని ఫౌల్ త్రో తో ప్రారంభించాడు. రెండో ప్రయత్నంలో 82.39మీ విసిరి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇక మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు విసిరాడు. నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్లు త్రో చేశాడు. ఇక తన అఖరి ప్రయత్నంలో నీరజ్ ఫౌల్ త్రో చేశాడు. దీంతో నాలుగో ప్రయత్నంలో విసిన దూరాన్ని అత్యధికంగా లెక్కించారు. ఇక గ్రెనేడియన్ జావెలిన్ త్రోయర్ అండర్సన్ పీటర్స్ 90.54 దూరం విసిరి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఇక సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన రెండో భారత అథ్లెట్‌గా నీరజ్ చోప్రా రికార్డులకెక్కాడు. అంతకు ముందు 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత లాంగ్ జంపర్ అంజూ బాబి జార్జ్ కాంస్య పతకం సాధించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: World Athletics Championship: పసిడి... ప్రపంచ రికార్డు -
Shooting World Cup: 15 పతకాలతో ‘టాప్’
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్‌ను భారత్ అగ్రస్థానంతో ముగించింది. టోర్నీ ఆఖరి రోజు కూడా హవా కొనసాగిస్తూ మరో రజతం సాధించిన భారత్ మొత్తం 15 పతకాలతో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇందులో ఐదు స్వర్ణాలు కాగా, ఆరు రజతాలు, నాలుగు కాంస్య పతకాలున్నాయి. రెండో స్థానంలో ఉన్న ఆతిథ్య కొరియా ఖాతాలో 12 పతకాలే ఉన్నాయి. బుధవారం 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో అనిశ్ భన్వాలా, విజయ్ వీర్ సిద్ధు, సమీర్లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. ఫైనల్లో భారత జట్టు 15–17తో మార్టిన్, థామస్, మతేజ్లతో కూడిన చెక్ రిపబ్లిక్ చేతిలో ఓడిపోయింది. మొదట్లో మన షూటర్ల గురి కుదరడంతో ఒక దశలో 10–2తో పసిడి వేటలో పడినట్లు కనిపించింది. కానీ తదనంతరం లక్ష్యాలపై కచ్చితమైన షాట్లు పడకపోవడంతో 2 పాయింట్ల తేడాతో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. -
బాంబుల మోత తప్పించుకొని పతకం గెలిచి..
అమెరికాలోని ఒరెగాన్‌లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఉక్రెయిర్ హై జంప్ క్రీడాకారిణి యారోస్లావా మహుచిఖ్ రజతం సాధించింది. అందరిలానే పతకం సాధించిందిగా ఇందులో ఏముందిలే అనుకోవద్దు. యారోస్లావా పతకం సాధించడం ఇప్పుడు పెద్ద విశేషమే. ఎందుకంటే యారోస్లావా ఉక్రెయిన్ దేశస్థురాలు కాబట్టి. దాదాపు నాలుగు నెలలుగా కంటి మీద కునుకు లేకుండా రష్యా ఉక్రెయిన్ మీద దాడులు చేస్తూనే ఉంది. యుద్ధ వాతావరణంలో ఉన్న తన దేశం నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని స్నేహితుల సాయంతో మూడురోజుల పాటు కారులో ప్రయాణించి ఉక్రెయిన్ను దాటి అమెరికాలో అడుగుపెట్టింది. ఒక పక్క ఉక్రెయిన్ బాంబుల మోతతో దద్దరిల్లుతున్నప్పటికి దేశానికి పతకం తేవాలన్న ఆమె సంకల్పాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. అందుకే యారోస్లావా సాధించింది రజతమే అయినా ఆమె దృష్టిలో మాత్రం అది బంగారు పతకమేనని పేర్కొంది. బుధవారం జరిగిన మహిళల హై జంప్ ఫైనల్ రసవత్తరంగా సాగింది. 2.02 మీటర్ల ఎత్తును( దాదాపు 6 అడుగుల ఏడున్నర అంగుళాలు) ఆస్ట్రేలియాకు చెందిన ఎలినర్ పాటర్సన్ క్లియర్ చేసింది. ఆ తర్వాత వచ్చిన యారస్లావా మాత్రం తృటిలో దానిని అందుకోలేకపోయింది. దీంతో పాటర్సన్ స్వర్ణం దక్కించుకోగా.. యారోస్లావా మహుచిఖ్ రజతం గెలిచింది. పతకం సాధించిన అనంతరం యారోస్లావా ఎమెషనల్ అయింది. ''నేను సాధించింది రజతమే కావొచ్చు.. నా దృష్టిలో మాత్రం అది స్వర్ణ పతకం కిందే లెక్క. ఈ పతకం రష్యాతో యుద్దంలో అసువుల బాసిన నా దేశ సైనికులకు.. ప్రజలకు అంకితమిస్తున్నా. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ను దాటడానికి మూడు రోజులు పట్టింది. ఈ క్రమంలో నా ప్రాణాలు పోయినా దేశం కోసం ఆనందంగా ప్రాణత్యాగం చేశాననుకుంటా. దేవుడి దయవల్ల ఈరోజు వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని పతకం సాధించా'' అంటూ చెప్పుకొచ్చింది. అయితే రష్యాకు చెందిన స్టార్ హైజంపర్.. డిపెండింగ్ చాంపియన్ మారియా లసిట్స్కేన్ తమ దేశంపై నిషేధం ఉండడంతో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనలేకపోయింది. మారియా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడుసార్లు స్వర్ణం సాధించడం విశేషం. Literally flying 🦅@eleanorpatto 🇦🇺 clears a lifetime best of 2.02m on her first attempt to win world high jump title!#WorldAthleticsChamps pic.twitter.com/dSISIzOk75 — World Athletics (@WorldAthletics) July 20, 2022 చదవండి: భారత్‌కు భారీ షాక్.. డోప్ టెస్టులో పట్టుబడ్డ స్టార్ అథ్లెట్లు..! -
Archery World Cup: సురేఖ డబుల్ ధమాకా
పారిస్: పునరాగమనంలో భారత స్టార్ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టింది. పారిస్‌లో శనివారం జరిగిన ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీలో విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం, వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట భారత్‌కు తొలిసారి స్వర్ణ పతకాన్ని అందించింది. ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ ద్వయం 152–149 పాయింట్ల తేడాతో (40–37, 36–38, 39–39, 37–35) సోఫీ డోడెమోంట్–జీన్ ఫిలిప్ (ఫ్రాన్స్) జోడీపై విజయం సాధించింది. ఒక్కో జంట నాలుగు బాణాల చొప్పున నాలుగుసార్లు లక్ష్యంపై గురి పెట్టాయి. తొలి సిరీస్‌లో భారత జోడీ పైచేయి సాధించగా, రెండో సిరీస్‌లో ఫ్రాన్స్ జంట ఆధిక్యంలో నిలిచింది. మూడో సిరీస్‌లో రెండు జోడీలు సమంగా నిలువగా... నాలుగో సిరీస్‌లో మళ్లీ భారత జంట ఆధి క్యం సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. మిక్స్డ్ టీమ్ ఫైనల్ అనంతరం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలోనూ విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ రాణించింది. ముందుగా సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సురేఖ 147–145తో సోఫీ డోడెమోంట్ (ఫ్రాన్స్)ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎల్లా గిబ్సన్ (బ్రిటన్)తో జరిగిన ఫైనల్లో సురేఖ ‘షూట్ ఆఫ్’లో త్రుటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయింది. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 148–148తో సమంగా నిలిచారు. అనంతరం విజేతను నిర్ణయించేందుకు ఇద్దరికీ చెరో షాట్ ఇవ్వగా... గిబ్సన్, జ్యోతి సురేఖ ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేశారు. అయితే గిబ్సన్ బాణం 10 పాయింట్ల వృత్తం లోపల ఉండగా... సురేఖ వృత్తం అంచున తగిలింది. దాంతో గిబ్సన్‌కు స్వర్ణం, సురేఖకు రజతం లభించాయి. -
రజతం నెగ్గిన జ్యోతి యర్రాజీ
ఆంధ్రప్రదేశ్ మహిళా అథ్లెట్ జ్యోతి యర్రాజీ బెల్జియంలో జరిగిన ఐఫామ్ ఈఏ పర్మిట్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో రజత పతకం సాధించింది. వైజాగ్‌కు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.19 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. జో సెడ్నీ (నెదర్లాండ్స్; 13.18 సెకన్లు) స్వర్ణం, జెన్నా బ్లన్‌డెల్ (బ్రిటన్; 13.30 సెకన్లు) కాంస్యం సాధించారు. హీట్స్‌లో జ్యోతి 13.26 సెకన్లతో రెండో స్థానంలో నిలిచింది. -
Surabhi Bharadwaj: విజయ వీచిక
సురభి తొమ్మిదో తరగతి వరకు అమ్మకూచి. ఎన్సీసీలో చేరింది... రెక్కలు విచ్చుకుంది. రైఫిల్ చేతిలోకి తీసుకుంది... టార్గెట్‌కు గురిపెట్టింది. లక్ష్యాలను సాధించడమే లక్ష్యంగా తీర్మానించుకుంది. ఆ లక్ష్యాల్లో ఓ మైలురాయి.. ప్రపంచ స్థాయి రజత పతకం జర్మనీలో ఎగిరిన త్రివర్ణ పతాకమే అందుకు నిదర్శనం. మధ్య తరగతి కుటుంబం నుంచి స్పోర్ట్స్ పర్సన్ తయారు కావడం అంటే సాధారణమైన విషయం కాదు. తనలో నేర్చుకోవాలనే తపన, సాధన చేయాలనే కసి తనలో రగిలే జ్వాలలాగ ఉంటే సరిపోదు. తల్లిదండ్రులకు కూడా అదే స్థాయిలో ఆకాంక్ష ఉండాలి. అంతకంటే ముఖ్యంగా ఆర్థిక వెసులుబాటు ఉండాలి. పిల్లల క్రీడాసాధన, పోటీలకు తీసుకువెళ్లడం, స్కూల్లో ప్రత్యేక అనుమతులు తీసుకోవడం, మిస్ అయిన క్లాసుల నోట్స్ తయారీ వంటి పనుల కోసం పేరెంట్స్‌లో ఒకరు ఆసరా ఇవ్వాలి. కొన్ని క్రీడలకైతే ఖర్చు లక్షల్లో ఉంటుంది. స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నించక తప్పని పరిస్థితులుంటాయి. కఠోర సాధనకు తోడుగా ఈ సౌకర్యాలన్నీ అమరినప్పుడే క్రీడాకారులు తయారవుతారు. ఇన్ని సమ్మెట దెబ్బలకు ఓర్చి మెరిసిన వీచిక రాపోలు సురభి భరద్వాజ్. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ పోటీల్లో రజతంతో అంతర్జాతీయ వేదిక మీద మన జాతీయ పతాకాన్ని సగర్వంగా ఆవిష్కరించింది. ఇద్దరూ షూటర్సే! ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ వరల్డ్ కప్ 2022 పోటీలు జర్మనీలోని సూల్లో ఈ నెల తొమ్మిదవ తేదీ మొదలయ్యాయి. ఈ పోటీల్లో ఈ 18వ తేదీన 50 మీటర్ల ప్రోన్ విభాగంలో రజత పతకాన్ని సాధించిన సురభి హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. తండ్రి విష్ణు భరద్వాజ్ ప్రైవేట్ ఉద్యోగి, తల్లి లావణ్య జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉద్యోగి. కుటుంబంలో క్రీడానేపథ్యం లేని సురభికి రైఫిల్ షూటింగ్‌కి బీజం ఆమె చదివిన కేంద్రీయ విద్యాలయ, ఉప్పల్ బ్రాంచ్‌లో పడింది. కుటుంబ సభ్యులతో సురభి సురభి కంటే ముందు ఆమె అక్క వైష్ణవి రైఫిల్ షూటింగ్లో చేరింది. అక్క స్ఫూర్తితో సురభి కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఢిల్లీలో ఎన్సీసీ షూటింగ్ పోటీల్లో ఇద్దరూ పాల్గొన్నారు. కేరళలో 2017లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ ఇద్దరూ పాల్గొని నేషనల్స్‌కి క్వాలిఫై అయ్యారు. ఖరీదైన క్రీడాసాధనలో ఇద్దరిని కొనసాగించడం కష్టం కావడంతో తల్లిదండ్రులు సురభి ప్రాక్టీస్ మీద మాత్రమే దృష్టి పెట్టగలిగారు. సురభి శ్రమలో అమ్మానాన్నతోపాటు అక్క కూడా భాగం పంచుకుంటోంది. కాల పరీక్ష! సురభి డైలీ రొటీన్ ఉదయం ఆరు గంటలకు మొదలవుతుంది. వార్మప్ ఎక్సర్సైజ్లు చేసుకుని ఏడు– ఏడున్నరకంతా ఇంటి నుంచి ప్రాక్టీస్ కోసం గచ్చిబౌలికి బయలుదేరుతుంది. నాగోలులో మెట్రో రైలు, ఆటోరిక్షాలు పట్టుకుని పది గంటలలోపు హైదరాబాద్‌లో సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న షూటింగ్ రేంజ్‌కు చేరుకుంటుంది. పది నుంచి ప్రాక్టీస్ మొదలవుతుంది. ఒంటి గంటకు లంచ్ బ్రేక్. తిరిగి రెండున్నర నుంచి ఐదున్నర వరకు ప్రాక్టీస్, ఇంటికి చేరేటప్పటికి రాత్రి తొమ్మిదవుతుంది. కోచ్ సూచించిన విధంగా ఆహారాన్ని సిద్ధం చేసి బాక్సులు పెడుతుంది తల్లి లావణ్య. మెట్రో లేని రోజుల్లో, సిటీ బస్సులో వెళ్లాల్సిన రోజుల్లో అయితే దినచర్య ఐదింటికే మొదలయ్యేది. సురభి షూటింగ్ ప్రాక్టీస్‌తోపాటు ఉస్మానియాలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మూడవ సంవత్సరం చదువుతోంది. మినిమమ్ అటెండెన్స్ చూసుకుంటూ ఎక్కువ సమయం ప్రాక్టీస్‌కే కేటాయిస్తోంది. మెట్రోలో ప్రయాణించే సమయంలో పాఠాలను పూర్తి చేసుకుంటోంది. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నప్పటికీ కాలం పరీక్షల రూపంలో ప్రత్యేక పరీక్ష పెడుతుంది. షూటింగ్ పోటీలు, కాలేజ్ పరీక్షలు ఒకే సమయంలో వచ్చాయి. దాంతో ఐదవ సెమిస్టర్ పరీక్షలు రాయలేకపోయింది. జర్మనీలో పోటీలు పూర్తయిన వెంటనే ప్రస్తుతం పూణేలో గన్ ఫర్ గ్లోరీ నిర్వహిస్తున్న ప్రత్యేక లీప్ ప్రోగ్రామ్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఖర్చు లక్షల్లో తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహించిన సురభి బంగారు పతకాన్ని సాధించింది. సౌత్ జోన్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్స్‌లో రజతాలను మూటగట్టుకుంది. రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్‌లో వాడే బుల్లెట్ దాదాపుగా 30 రూపాయలవుతుంది. కాంపిటీషన్లకు ముందు ప్రాక్టీస్‌లో రోజుకు యాభై నుంచి వంద బుల్లెట్లు వాడాల్సి ఉంటుంది. బ్లేజర్, ట్రౌజర్, షూస్, గ్లవుజ్ వంటివన్నీ కలిపి రెండు లక్షలవుతాయి. ఇక సురభి ఉపయోగించే పాయింట్ టూటూ వాల్టర్ రైఫిల్ ధర ఇరవై లక్షలు ఉంటుంది. సొంత రైఫిల్ లేకపోవడంతో సురభి అద్దె రైఫిల్‌తోనే ఇన్ని పోటీల్లో పాల్గొన్నది, పతకాలు సాధించింది. ఆమె ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్‌కు అర్హత 2018లోనే సాధించింది. కానీ వెపన్ లేకపోవడంతో కొన్ని అవకాశాలను చేతులారా వదులుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి క్రీడాకారులను మానసిక క్షోభకు గురి చేస్తుంది. సురభి వాటన్నింటినీ నిబ్బరంగా అధిగమించింది. మంచి రైఫిల్ అమరితే దేశానికి మరిన్ని పతకాలను తెచ్చి పెడుతుందనడంలో సందేహం లేదు. రైఫిల్ కావాలి! కాంపిటీషన్ల కోసం కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణానికి, ఆహారానికి అలవాటు పడడం ప్రధానం. అలాగే విండ్ అసెస్మెంట్ కూడా గెలుపును నిర్ణయిస్తుంది. మన గురి లక్ష్యాన్ని చేరడంలో అసలైన మెళకువ గాలి వీచే వేగాన్ని కచ్చితంగా అంచనా వేయగలగడమే. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్‌లో మనదేశానికి పతకాలు సాధించడం నా ముందున్న లక్ష్యం. మా పేరెంట్స్ ఇప్పటికే వాళ్ల శక్తికి మించి ఖర్చు చేసేశారు. ప్రభుత్వం కానీ ఇతర స్పాన్సర్లు కానీ వెపన్‌కి సపోర్ట్ చేస్తే నేను నా ప్రాక్టీస్ మీద పూర్తి సమయాన్ని కేటాయించగలుగుతాను. – రాపోలు సురభి భరద్వాజ్, షూటర్, వరల్డ్ కప్ విజేత – వాకా మంజులారెడ్డి. -
Archery World Cup 2022: భారత్ గురి అదిరింది
గ్వాంగ్జు (దక్షిణ కొరియా): ఈ ఏడాది తమ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తూ భారత ఆర్చర్లు ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీలో సత్తా చాటుకున్నారు. శనివారం జరిగిన కాంపౌండ్ విభాగం మ్యాచ్‌ల్లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకం లభించాయి. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగం ఫైనల్లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమన్ సైనీలతో కూడిన భారత జట్టు 232–230 (56–57, 58–58, 60–56, 58–59) పాయింట్ల తేడాతో అడ్రియన్ గాంటియర్, జీన్ ఫిలిప్ బౌల్చ్, క్విన్టిన్ బారిర్‌లతో కూడిన ఫ్రాన్స్ జట్టును ఓడించింది. గత నెలలో టర్కీలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలోనూ ఫైనల్లో ఫ్రాన్స్‌పైనే గెలిచి భారత జట్టు బంగారు పతకం సాధించడం విశేషం. అనంతరం జరిగిన కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతక పోరులో అభిషేక్ వర్మ, అవ్నీత్ కౌర్‌లతో కూడిన భారత జంట 156–155 (39–39, 38–40, 39–38, 40–38) పాయింట్ల తేడాతో బెరా సుజెర్, ఎమిర్కాన్ హనీలతో కూడిన టర్కీ జోడీపై విజయం సాధించింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో రెండో ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్న మోహన్ రామ్‌స్వరూప్ భరద్వాజ్ (భారత్) రజత పతకం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో మోహన్ 141–149తో ప్రపంచ నంబర్‌వన్ మైక్ షోలోసెర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన మోహన్ సెమీఫైనల్లో 143–141తో ప్రపంచ చాంపియన్ నికో వీనర్ (ఆస్ట్రియా)పై గెలుపొందడం విశేషం. -
Khelo India University Games 2021: స్విమ్మర్ అభిలాష్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో హైదరాబాద్ స్విమ్మర్ చల్లగాని అభిలాష్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో రజత పతకం సాధించాడు. బెంగళూరులో జరిగిన ఈ గేమ్స్‌లో అభిలాష్ 4ని. 19.86 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థి అభిలాష్ జేఎన్టీయూ తరఫున పాల్గొన్నాడు. -
ట్రాప్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు రజతం
ప్రపంచకప్ షాట్‌గన్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు తొలి పతకం లభించింది. ఇటలీలో శనివారం జరిగిన పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో హైదరాబాద్ షూటర్ కైనన్ షెనాయ్, వివాన్ కపూర్, పృథ్వీరాజ్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. క్రొయేషియాతో జరిగిన ఫైనల్లో భారత్ 1–7 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. -
సిల్వర్ మెడల్.. హీరో మాధవన్ కొడుకుపై ప్రశంసలు
స్టార్ హీరో మాధవన్ కొడుకు వేదాంత్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.స్విమ్మింగ్‌లో రాణిస్తున్న వేదాంత్ ఇప్పటికే భారత్‌కు పలు పతకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి స్విమ్మింగ్ పోటీల్లో దేశానికి సిల్వర్ మెడల్‌ను సాధించాడు. డెన్మార్క్‌లో జరిగిన డానిష్ స్విమ్మింగ్ ఓపెన్‌లో మాధవన్ కొడుకు వేదాంత్ రజత పతకం సాధించి సత్తా చాటాడు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరిగిన డానిష్ ఓపెన్ స్విమ్మింగ్ మీట్లో 1500 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్లో వేదాంత్ ఈ ఘనత సాధించాడు. ఈ విషయాన్ని మాధవన సోషల్ మీడియా వేదికగా పంచుకొని ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా మాధవన్ తన కొడుకు ఫోటోను మాత్రమే కాకుండా బంగారు పతకం సాధించిన సాజన్ ప్రకాష్‌ను కూడా అభినందించాడు. ఇక ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వేదాంత్ గురువు ప్రదీప్‌కు కూడా థ్యాంక్స్ చెప్పాడు. With all your blessings & Gods grace🙏🙏 @swim_sajan and @VedaantMadhavan won gold and silver respectively for India, at The Danish open in Copenhagen. Thank you sooo much Coach Pradeep sir, SFI and ANSA.We are so Proud 🇮🇳🇮🇳🇮🇳🙏🙏 pic.twitter.com/MXGyrmUFsW — Ranganathan Madhavan (@ActorMadhavan) April 16, 2022 -
సజన్‌కు స్వర్ణం... వేదాంత్‌కు రజతం
కొపెన్‌హగెన్ (డెన్మార్క్): డానిష్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్లో భారత స్విమ్మర్లు సజన్ ప్రకాశ్, వేదాంత్ మెరిశారు. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో కేరళకు చెందిన సజన్ ప్రకాశ్ స్వర్ణ పతకం సాధించగా... పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో తమిళనాడుకు చెందిన వేదాంత్ రజత పతకం సొంతం చేసుకున్నాడు. సజన్ 200 మీటర్ల లక్ష్యాన్ని ఒక నిమిషం 59.27 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. సినీ నటుడు మాధవన్ కుమారుడైన వేదాంత్ 1500 మీటర్ల లక్ష్యాన్ని 15 నిమిషాల 57.86 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ గత ఏడాది లాత్వియా ఓపెన్‌లో కాంస్యం నెగ్గగా... జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించాడు. -
Indian Grand Prix Athletics 2: మన మహేశ్వరికి రజత పతకం
ఇండియన్ గ్రాండ్‌ప్రి–2 అథ్లెటిక్స్ మీట్లో తెలంగాణ అథ్లెట్ జి.మహేశ్వరి రజత పతకం సాధించింది. తిరువనంతపురంలో బుధవారం జరిగిన ఈ మీట్లో మహేశ్వరి 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో 10 నిమిషాల 52.49 సెకన్లలో గమ్యానికి చేరింది. పారుల్ (ఉత్తరప్రదేశ్; 9ని:38.29 సెకన్లు) స్వర్ణ పతకాన్ని గెలిచింది. ఇక పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్ సాబ్లే (మహారాష్ట్ర; 8ని:16.21 సెకన్లు) కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం! -
రిథమ్–అనీశ్ జోడీకి స్వర్ణం
కైరో (ఈజిప్ట్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌ను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. టోర్నీ చివరిరోజు సోమవారం భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రిథమ్ సాంగ్వాన్–అనీశ్ భన్వాలా జోడీ పసిడి పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో రిథమ్–అనీశ్ ద్వయం 17–7తో చవీసా పాదుక–రామ్ ఖమాయెంగ్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచింది. అంతకుముందు జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో అనీశ్, గుర్ప్రీత్ సింగ్, భావేశ్ షెఖావత్‌లతో కూడిన భారత జట్టుకు రజతం దక్కింది. ఫైనల్లో భారత జట్టు 7–17తో జర్మనీ జట్టు చేతిలో ఓడిపోయింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. -
కిడాంబి శ్రీకాంత్‌కు ప్రధాని అభినందన
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో రజతం నెగ్గిన స్టార్ షట్లర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘శ్రీకాంత్‌కు అభినందనలు. రజతంతో చరిత్రకెక్కావు. నీ విజయం మరెంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. Congratulations to @srikidambi for winning a historic Silver Medal. This win will inspire several sportspersons and further interest in badminton. https://t.co/rxxkBDAwkP— Narendra Modi (@narendramodi) December 20, 2021 కాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను నెగ్గే సువర్ణావకాశాన్ని తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ తృటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్ ఆటగాడు, సింగపూర్‌కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో 15వ సీడ్ శ్రీకాంత్ అద్భుతంగా పోరాడినప్పటికీ.. కీలక సమయాల్లో ప్రత్యర్ధి పైచేయి సాధించాడు. ఫలితంగా, శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకోగా, కియోన్ కెరీర్లో తొలి టైటిల్ నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి సింగపూర్ షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ నుంచి పీవీ సింధు మాత్రమే స్వర్ణం గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండు సార్లు రజతాలు గెలిచిన సింధు.. 2019లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. -
వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచిన తొలి భారత ఆటగాడు..
‘స్వర్ణ ప్రపంచాన్ని’ అందుకోవాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ చివరకు రజత సంబరం చేసుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన శ్రీకాంత్ విశ్వవిజేతగా అవతరించలేకపోయాడు. సింగపూర్‌కు చెందిన 24 ఏళ్ల లో కీన్ యుతో జరిగిన తుది పోరులో శ్రీకాంత్ ఓటమి రుచి చూసి రన్నరప్‌గా నిలిచాడు. శ్రీకాంత్ ఆటలో అడపాదడపా మెరుపులు కనిపించినా కీలకదశలో అనవసర తప్పిదాలు అతడిని పసిడి పతకానికి దూరం చేశాయి. హుఎల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ తుది మెట్టుపై తడబడ్డాడు. ఆదివారం జరిగిన ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ శ్రీకాంత్ 43 నిమిషాల్లో 15–21, 20–22తో అన్‌సీడెడ్, ప్రపంచ 22వ ర్యాంకర్ లో కీన్ యు (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. ఈ ఓటమితో శ్రీకాంత్ రజత పతకం సొంతం చేసుకోగా... లో కీన్ యు స్వర్ణ పతకం దక్కించుకొని కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. సెమీఫైనల్లో ఓడిపోయిన లక్ష్య సేన్ (భారత్), ఆంటోన్సెన్ (డెన్మార్క్)లకు కాంస్య పతకాలు లభించాయి. ఆధిక్యంలోకి వెళ్లి... 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో లో కీన్ యుపై వరుస గేముల్లో గెలిచిన 28 ఏళ్ల శ్రీకాంత్ ఈసారి కూడా గెలుపు రుచి చూస్తాడనిపించింది. ఆరంభంలో జంపింగ్ స్మాష్‌లు, నెట్ ఫ్లిక్ షాట్లతో అలరించిన శ్రీకాంత్ 9–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే గత నాలుగేళ్లలో ఎంతో మెరుగుపడ్డ లో కీన్ యు ఈసారి శ్రీకాంత్ ఆటతీరుపై పూర్తి హోంవర్క్ చేసి వచ్చినట్లు కనిపించింది. 3–9తో వెనుకబడ్డా ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా నిగ్రహంతో ఆడిన లో కీన్ యు నెమ్మదిగా గాడిలో పడ్డాడు. శ్రీకాంత్ సంధించిన స్మాష్‌లను లో కీన్ యు అద్భుతంగా డిఫెండ్ చేశాడు. శ్రీకాంత్ కూడా అనవసర తప్పిదాలు చేయడం సింగపూర్ షట్లర్‌కి కలిసి వచ్చింది. నిలకడగా పాయింట్లు స్కోరు చేసిన లో కీన్ యు ఎట్టకేలకు 11–11తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత లో కీన్ యు జోరు పెంచగా శ్రీకాంత్ ఒత్తిడికి లోనై చాలా షాట్లు నెట్‌పైకి, బయటకు కొట్టి పాయింట్లు సమర్పించుకున్నాడు. దాంతో లో కీన్ యు తొలి గేమ్‌ను 16 నిమిషాల్లో సొంతం చేసుకున్నాడు. తప్పిదాలతో మూల్యం... రెండో గేమ్‌లోనూ ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఈ దశలో శ్రీకాంత్ 9–6తో ముందంజ వేసినా ఆ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయాడు. ఈ స్కోరు వద్ద లో కీన్ యు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 12–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఒకట్రెండుసార్లు శ్రీకాంత్ ఆధిక్యంలోకి రావడం... అంతలోనే చేసిన అనవసర తప్పిదాలతో లో కీన్ యు మళ్లీ పుంజుకోవడం జరిగింది. ఈ క్రమంలో లో కీన్ యు 20–18తో ముందంజ వేశాడు. శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి స్కోరును 20–20తో సమం చేశాడు. అయితే వెంటనే లో కీన్ యు రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొని ప్రపంచ చాంపియన్ అయ్యాడు. సూపర్ ఫినిష్... మలేసియాలోని పెనాంగ్ నగరంలో పుట్టిన లో కీన్ యు తన 13వ యేట కుటుంబసభ్యులతో కలిసి సింగపూర్‌కు వలస వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. గత ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో సింగపూర్ బృందానికి పతాకధారిగా వ్యవహరించిన లో కీన్ యు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలిచిన తొలి సింగపూర్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. రెండోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న లో కీన్ యు విశ్వవిజేతగా నిలిచిన క్రమంలో అద్భుత విజయాలు అందుకున్నాడు. తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను ఓడించిన లో కీన్ యు సెమీఫైనల్లో మూడో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై, ఫైనల్లో మాజీ వరల్డ్ నంబర్‌వన్ శ్రీకాంత్‌పై గెలిచి తన విజయం గాలివాటం కాదని నిరూపించాడు. టైటిల్ గెలిచే క్రమంలో లో కీన్ యు తన ప్రత్యర్థులకు కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోవడం విశేషం. ఈ వారం అద్భుతంగా గడిచింది. ఫైనల్లో రెండు గేముల్లోనూ నేను మంచి స్థితిలో ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఈ ఓటమితో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మున్ముందు మరింత మెరుగైన ప్రదర్శన ఇస్తాను. పాజిటివ్‌గా ఆడాలనే ఆలోచనతో బరిలోకి దిగాను. అనవసర తప్పిదాలతో చికాకు కలిగింది. అయితే మ్యాచ్ అన్నాక ఒకరు గెలుస్తారు. మరొకరు ఓడిపోతారు. నాలుగేళ్ల క్రితం చివరిసారి లో కీన్ యుతో తలపడ్డాను. అప్పటికి ఇప్పటికి అతని ఆటలో ఎంతో మార్పు వచ్చింది. వాస్తవానికి నేను ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడతానో లేదోననే అనుమానం కలిగింది. ఈనెల 12న టోర్నీ మొదలవ్వగా 6వ తేదీ వరకు నాకు వీసా లభించలేదు. ఈ ఏడాది ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్ ఉన్నాయి. ఈ అనుభవంతో వచ్చే ఏడాది మంచి ఫలితాలు సాధిస్తానని విశ్వాసంతో ఉన్నాను. –కిడాంబి శ్రీకాంత్ -
Anshu Malik: భారత తొలి మహిళా రెజ్లర్‌గా సరికొత్త చరిత్ర!
Anshu Malik First Indian Woman Win Silver Medal: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాలని ఆశించిన అన్షు మలిక్‌కు నిరాశ ఎదురైంది. గురువారం జరిగిన మహిళల 57 కేజీల ఫైనల్లో 20 ఏళ్ల అన్షు ‘బై ఫాల్’ పద్ధతిలో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ హెలెన్ లూయిస్ మరూలీస్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. తొలి విరామానికి 1–0తో అన్షు ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో భాగం ఆరంభంలోనే హెలెన్ 2 పాయింట్లతో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత మరో రెండు పాయింట్లు గెలిచిన హెలెన్ తన ఆధిక్యాన్ని 4–1కు పెంచుకుంది. ఈ దశలో హెలెన్ తన పట్టుతో అన్షును కిందకు పడేసి ఆమె రెండు భుజాలను కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు తగిలించి పెట్టింది. దాంతో హెలెన్ ‘బై ఫాల్’ పద్ధతిలో విజయం సాధించినట్లు రిఫరీ ప్రకటించారు. తాజా ఫలితంతో అన్షు రజత పతకంతో సంతృప్తి పడింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో రజతం గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా అన్షు గుర్తింపు పొందింది. ఈ క్రమంలో కేంద్ర క్రీడాశాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు అన్షుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సరితాకు కాంస్యం మరోవైపు ఈ మెగా ఈవెంట్‌లోని మహిళల 59 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన సరితా మోర్ కాంస్యంతో మెరిసింది. సారా జోనా లిండ్‌బోర్గ్ (స్వీడన్)తో జరిగిన కాంస్య పతక పోరులో సరిత 8–2తో విజయం సాధించింది. అల్కా తోమర్, బబితా ఫొగాట్, గీతా ఫొగాట్, వినేశ్ ఫొగాట్, పూజా ధాండాల తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన ఆరో భారతీయ మహిళా రెజ్లర్‌గా, ఓవరాల్‌గా పతకం నెగ్గిన ఏడో భారతీయ మహిళా రెజ్లర్‌గా సరిత గుర్తింపు పొందింది. చదవండి: Indian Hockey: హర్మన్‌ప్రీత్ సింగ్, గుర్జీత్ కౌర్‌లకు ఉత్తమ క్రీడాకారుల అవార్డులు So proud of you Anshu ! That’s the spirit ! 1st 🇮🇳 woman wrestler to win a SILVER 🥈 at prestigious World Championship | @OLyAnshu | pic.twitter.com/aY2jNccXtG — Anurag Thakur (@ianuragthakur) October 7, 2021 -
భారత్‌కు రజతం
సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు రజతం లభించింది. 2007లో ఈ మెగా ఈవెంట్ మొదలయ్యాక భారత్‌కు లభించిన తొలి పతకం ఇదే కావడం విశేషం. గోర్యాక్ చినా, కొస్టెనిక్, కాటరీనా లాగ్నో (గ్రాండ్ మాస్టర్లు), షువలోవా, కషిలిన్‌స్కాయాలతో కూడిన రష్యా జట్టు తో శనివారం జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా, భక్తి కులకర్ణి, మేరీఆన్‌గోమ్స్‌లతో కూడిన భారత జట్టు 0–2తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌ను భారత్ 1.5–2.5తో చేజా ర్చుకోగా... రెండో మ్యాచ్‌లో టీమిండియా 1–3తో ఓటమి చవిచూసింది. ప్రపంచ రెండో ర్యాంకర్ గోర్యాక్‌చినాతో జరిగిన తొలి గేమ్‌లో హారిక 47 ఎత్తుల్లో గెలిచి, రెండో గేమ్‌ను 39 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. -
తెలంగాణ కుర్రాడు.. స్నేహిత్ ఖాతాలో రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: కజకిస్తాన్ ఓపెన్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాడు సూరావజ్జుల స్నేహిత్ పురుషుల సింగిల్స్ విభాగంలో రజతం... డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 6–11, 9–11, 3–11, 11–9, 6–11తో 46వ ర్యాంకర్ కిరిల్ జెరాసిమెంకో (కజకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశాడు. డబుల్స్ సెమీఫైల్లో స్నేహిత్–సుదాన్షు గ్రోవర్ (భారత్) జోడీ 11–8, 2–11, 6–11, 12–10, 5–11తో జెరాసిమెంకో–అలెన్ (కజకిస్తాన్) జంట చేతిలో ఓడి కాంస్య పతకం దక్కించుకుంది. చదవండి: RCB Vs KKR: కోహ్లి డబుల్ సెంచరీ.. ఆర్సీబీ కెప్టెన్ ఖాతాలో మరో రికార్డు -
పారాలింపిక్స్‌లో పతకం సాధించిన కలెక్టర్ సాబ్ కథ ఇదీ..
టోక్యో: సుహాస్ యతిరాజ్ ఓ ఐఏఎస్ ఆఫీసర్. కలెక్టర్ అవడం కంటే గొప్ప కల ఏముంటుంది. కానీ ఇతను కల సాకారంతోనే ఆగిపోలేదు. కలని మించి ఆలోచించాడు. చక్కగా ఆచరణలో పెట్టాడు. అందుకే ఇపుడు టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతక విజేత అయ్యాడు. కర్ణాటకలోని హసన్ ప్రాంతానికి చెందిన కంప్యూటర్ ఇంజినీర్ సుహాస్ 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధనగర్ (నోయిడా) జిల్లా మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి కాలి పాదాల వైకల్యమున్నా... బ్యాడ్మింటన్ అంటే ఎనలేని ఆసక్తి. అందుకేనేమో అందులో ప్రొఫెషనల్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ఎదిగాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అతను మూడో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ పారా క్రీడల్లో మనసుపెట్టి పోటీపడే ఈ ప్రొఫెషనల్ ఖాతాలో చాలా పతకాలే ఉన్నాయి. 2016లో బీజింగ్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలువడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యూరోక్రాట్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘యశ్ భారతి’ పురస్కారంతో సుహాస్‌ను సత్కరించింది. జకార్తాలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో టీమ్ విభాగంలో కాంస్య పతకం గెలిచాడు. ఇలా అంతర్జాతీయ కెరీర్లో ఈ పారా షట్లర్ 5 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్యాలు గెలిచాడు. చాలా ఉద్విగ్నంగా ఉంది. ఇంత సంతోషంగా ఎప్పుడూ లేను. ఇదే సమయంలో ఇంత బాధ కూడా ఎప్పుడూ పడలేదు. పారాలింపిక్స్‌లో రజతం ఆనందమైతే... స్వర్ణం చేజార్చుకోవడం, జాతీయ గీతాన్ని ఆలపించే అవకాశాన్ని కోల్పోవడం చాలా నిరాశ పరిచింది. ఓవరాల్‌గా పారాలింపిక్ పతకం సాధించినందుకు గర్వపడుతున్నాను. –సుహాస్ చదవండి: పారాలింపిక్స్‌లో పతకం సాధించిన ఐఏఎస్ ఆఫీసర్.. -
Tokyo Paralympics: చివరి రోజు భారత్ ఖాతాలో స్వర్ణం
పారాలింపిక్స్‌లో రజతంతో మొదలైన తమ పతకాల వేటను భారత క్రీడాకారులు స్వర్ణంతో దిగి్వజయంగా ముగించారు. ఈ క్రీడల ఆఖరి రోజు ఆదివారం భారత్ రెండు పతకాలను సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్‌లో çకృష్ణ నాగర్ బంగారు పతకం... ఐఏఎస్ అధికారి, నోయిడా జిల్లా కలెక్టర్ సుహాస్ యతిరాజ్ రజత పతకం నెగ్గారు. ఓవరాల్‌గా భారత్ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 19 పతకాలు సాధించి 24వ స్థానంలో నిలిచింది. టోక్యో: ఆత్మవిశ్వాసమే ఆస్తిగా.... పట్టుదలే పెట్టుబడిగా... అనుక్షణం తమ పోరాట పటిమితో ఆకట్టుకున్న భారత పారాలింపియన్లు టోక్యో విశ్వ క్రీడలకు చిరస్మరణీయ ముగింపు ఇచ్చారు. చివరి రోజు ఒక స్వర్ణం, ఒక రజతం సాధించి యావత్ దేశం గర్వపడేలా చేశారు. తొలుత బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగం ఫైనల్లో సుహాస్ యతిరాజ్ 21–15, 17–21, 15–21తో రెండుసార్లు ప్రపంచ పారా చాంపియన్ లుకాస్ మజూర్ (ఫ్రాన్స్) చేతిలో పోరాడి ఓడిపోయి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారి పారాలిం పిక్స్‌లో ఆడుతున్న 38 ఏళ్ల సుహాస్ తొలి గేమ్‌ను గెల్చుకున్నా ఆ తర్వాత అదే జోరును కనబర్చలేకపోయాడు. అనంతరం జరిగిన పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్–6 కేటగిరీ ఫైనల్లో రాజస్తాన్‌కు చెందిన కృష్ణ నాగర్ 21–17, 16–21, 21–17తో చు మన్ కాయ్ (హాంకాంగ్)పై గెలిచి బంగారు పతకం దక్కించుకున్నాడు. సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగం కాంస్య పతక పోరులో భారత ప్లేయర్ తరుణ్ ధిల్లాన్ 17–21, 11–21తో ఫ్రెడీ సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ ఎస్ఎల్–3/ఎస్ఎల్–5 కాంస్య పతక పోరులో ప్రమోద్ భగత్–పలక్ కోహ్లి (భారత్) ద్వయం 21–23, 19–21తో దైసుకె ఫుజిహారా–అకీకో సుగినో (జపాన్) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. షూటింగ్ మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఎస్‌హెచ్–1 విభాగంలో బరిలోకి దిగిన భారత షూటర్లు సిద్ధార్థ బాబు, దీపక్, అవనీ లేఖరా క్వాలిఫయింగ్‌ను దాటలేకపోయారు. క్వాలిఫయింగ్‌లో సిద్ధార్థ బాబు 617.2 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో... 612 పాయింట్లు స్కోరు చేసి అవని 28వ స్థానంలో... 602.2 పాయింట్లు సాధించి దీపక్ 46వ స్థానంలో నిలిచారు. టాప్–8లో నిలిచిన వారికి మాత్రమే ఫైనల్లో పోటీపడే అవకాశం లభిస్తుంది. దటీజ్ కృష్ణ... రెండేళ్లపుడే కృష్ణ నాగర్ వయసుకు తగ్గట్టుగా పెరగడని నిర్ధారించారు. కానీ అతనే ఇప్పుడు బంగారం గెలిచేంతగా ఎదిగిపోయాడు. జైపూర్ (రాజస్తాన్)కు చెందిన కృష్ణది ఎదగలేని వైకల్యం. కానీ దేన్నయినా సాధించే అతని పట్టుదల ముందు మరుగుజ్జుతనమే మరుగున పడింది. పొట్టొడే గట్టోడని టోక్యో పారాలింపిక్స్ స్వర్ణంతో నిరూపించాడు. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ పొట్టివాడే. కానీ పతకాలు కొల్లగొట్టేవాడు కూడా! తనకిష్టమైన బ్యాడ్మింటన్‌లో చాంపియన్. 14 ఏళ్ల వయసులో షటిల్ వైపు దృష్టి మరల్చిన ఈ పొట్టి కృష్ణుడు 2016 నుంచి గట్టి మేలే తలపెట్టాడు. ప్రొఫెషనల్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా సత్తా చాటుకోవడం మొదలుపెట్టాడు. 4 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న కృష్ణ నిలకడైన విజయాలతో ఎస్‌హెచ్–6 పురుషుల సింగిల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంకర్‌గా ఎదిగాడు. 2019లో బాసెల్‌లో జరిగిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్ చాంపియన్íÙప్లో సింగిల్స్‌లో కాంస్యం, డబుల్స్‌లో రజతం సాధించాడు. గతేడాది బ్రెజిల్లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ఓపెన్‌లో రన్నరప్‌గా (రజతం) నిలిచాడు. అదే ఏడాది పెరూలో జరిగిన ఈవెంట్లో సింగిల్స్, డబుల్స్‌లో విజేతగా నిలిచి రెండు బంగారు పతకాలు సాధించాడు. పోటీల బరిలో అతని ఆత్మవిశ్వాసమే అతన్ని అందనంత ఎత్తులో నిలబెడుతోంది. ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకానికి ఉండే ప్రత్యేకతే వేరు. ప్రతిష్టాత్మక ఈ విశ్వక్రీడల్లో ఏకంగా బంగారమే సాధిస్తే ఆ ఆనందం మాటలకందదు. మేం బ్యాడ్మింటన్‌లో ఐదారు పతకాలు సాధిస్తామనే ధీమాతో వచ్చాం. చివరకు నాలుగింటితో తృప్తిపడ్డాం. అనుకున్న దానికి ఒకట్రెండు తగ్గినా మా ప్రదర్శన ఎంతో మెరుగైందన్న వాస్తవాన్ని అంగీకరించాలి. ఈ పతకాన్ని కరోనా వారియర్స్‌కు అంకితం ఇస్తున్నాను. –కృష్ణ నాగర్ -
మీరాబాయి... పారిస్‌లో స్వర్ణం సాధించాలి: అమిత్ షా
న్యూఢిల్లీ: 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం కోసం ప్రయత్నించాలని భారత వెయిట్‌లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చానును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు. శనివారం న్యూఢిల్లీలో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 51వ రైజింగ్ డే వేడుకల్లో మీరాబాయిని అమిత్ షా సన్మానించారు. మీరాబాయి కష్టానికి, నిబద్ధతకు పతకం రూపంలో టోక్యోలో ప్రతిఫలం లభించింది. దేశంలో ప్రధాని నుంచి సామాన్యుడి వరకు కూడా ఆమె ఘనతను కొనియాడారు. ఆమెకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. వచ్చే ఒలింపిక్స్‌లో పసిడి కోసం ప్రయత్నించాలని కోరుతున్నాను. దేశమంతా ఆ క్షణం కోసం ఎదురుచూస్తోంది’ అని అమిత్ షా అన్నారు. చదవండి: పారాలింపిక్స్‌లో పతకం సాధించిన ఐఏఎస్ ఆఫీసర్.. -
పసిడి కాంతులు...
మునుపెన్నడూ లేని విధంగా దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత క్రీడాకారులు తమ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా పతకాల పంట పండిస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. టోక్యో పారాలింపిక్స్‌కు నేటితో తెర పడనుండగా... శనివారం భారత దివ్యాంగ క్రీడాకారులు రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలను గెల్చుకున్నారు. షూటింగ్లో మిక్స్డ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్–1 ఫైనల్లో మనీశ్ నర్వాల్ పసిడి పతకం నెగ్గగా... సింగ్‌రాజ్ అధానా రజత పతకం కైవసం చేసుకున్నాడు. పారాలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన బ్యాడ్మింటన్‌లోనూ భారత షట్లర్లు మెరిశారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–3 విభాగంలో ప్రపంచ చాంపియన్ ప్రమోద్ భగత్ బంగారు పతకం సాధించగా... మనోజ్ సర్కార్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. టోక్యో: పారాలింపిక్స్‌లో మరోసారి భారత క్రీడాకారులు తమ ప్రతాపం చూపించారు. శనివారం ఏకంగా నాలుగు పతకాలతో అదరగొట్టారు. ముందుగా షూటింగ్లో మనీశ్ నర్వాల్... సింగ్‌రాజ్ అధానా... అనంతరం బ్యాడ్మింటన్‌లో ప్రమోద్ భగత్, మనోజ్ సర్వార్ పతకాలు సొంతం చేసుకున్నారు. మిక్స్డ్ 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో 19 ఏళ్ల మనీశ్ నర్వాల్ 218.2 పాయింట్లు స్కోరు చేసి పారాలింపిక్ రికార్డు సృష్టించడంతోపాటు అగ్రస్థానంలో నిలిచాడు. 39 ఏళ్ల సింగ్‌రాజ్ 216.7 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రీడల్లో సింగ్‌రాజ్‌కిది రెండో పతకం కావడం విశేషం. ఇంతకుముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సింగ్‌రాజ్ కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనతో ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా, ఓవరాల్‌గా మూడో భారత ప్లేయర్‌గా సింగ్‌రాజ్ గుర్తింపు పొందాడు. 1984 పారాలింపిక్స్‌లో అథ్లెట్ జోగిందర్ సింగ్ బేడీ మూడు పతకాలు గెల్చుకోగా... ప్రస్తుత పారాలింపిక్స్‌లో మహిళా షూటర్ అవనీ లేఖరా రెండు పతకాలు సాధించింది. ఫుట్‌బాలర్ కావాలనుకొని... హరియాణాకు చెందిన 19 ఏళ్ల మనీశ్ జన్మతః కుడి చేతి వైకల్యంతో జని్మంచాడు. కొన్నాళ్లు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేసి క్లబ్ స్థాయిలో మ్యాచ్‌లు కూడా ఆడిన మనీశ్ కుడి చేతి వైకల్యం కారణంగా ఎక్కువ రోజులు ఫుట్‌బాల్‌లో కొనసాగలేకపోయాడు. ఆ తర్వాత తండ్రి దిల్బాగ్ మిత్రుడొకరు మనీశ్‌కు షూటింగ్‌ను పరిచేయం చేశాడు. స్థానిక 10ఎక్స్ షూటింగ్ అకాడమీలో చేరిన మనీశ్ రెండేళ్లలో ఆటపై పట్టు సాధించాడు. 2018లో ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణం, రజతం సాధించాడు. ఆ తర్వాత 2019 వరల్డ్ పారా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెలిచాడు. ప్రమోదం నింపిన విజయం టోక్యో పారాలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు సూపర్ ప్రదర్శన చేశారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగంలో ఒడిశాకు చెందిన 33 ఏళ్ల ప్రమోద్ భగత్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఫైనల్లో టాప్ సీడ్ ప్రమోద్ 21–14, 21–17తో రెండో సీడ్ డానియెల్ బెథెల్ (బ్రిటన్)ను ఓడించాడు. ‘ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. నా కల నిజమైంది. ఈ పతకాన్ని నా తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నాను’ అని ప్రమోద్ వ్యాఖ్యానించాడు. నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డ ప్రమోద్ ఇరుగు పొరుగు వారు బ్యాడ్మింటన్ ఆడుతుండగా ఈ ఆటపై ఆసక్తి ఏర్పరచుకున్నాడు. 2006లో పారా బ్యాడ్మింటన్‌లో అడుగుపెట్టిన ప్రమోద్ ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 45 పతకాలను సాధించాడు. ఇందులో నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణ పతకాలు ఉండటం విశేషం. మరోవైపు ఎస్ఎల్–4 విభాగంలోనే భారత్‌కు చెందిన మనోజ్ సర్కార్ కాంస్యం సాధించాడు. కాంస్య పతక పోరులో మనోజ్ 22–20, 21–13తో దైసుకె ఫుజిహారా (జపాన్)పై విజయం సాధించాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన 31 ఏళ్ల మనోజ్ ఏడాది వయసులో పోలియో బారిన పడ్డాడు. ఐదేళ్ల వయసులో బ్యాడ్మింటన్ వైపు ఆకర్షితుడైన మనోజ్ ఆటపై పట్టు సంపాదించి 2013, 2015, 2019 ప్రపంచ చాంపియన్íÙప్ డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించాడు. చివరి రోజు భారత ప్లేయర్లు 5 పతకాలపై గురి పెట్టారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగంలో ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్ స్వర్ణం కోసం... తరుణ్ కాంస్యం కోసం... ఎస్‌హెచ్ –6 విభాగంలో కృష్ణ నాగర్ స్వర్ణం కోసం... మిక్స్డ్ డబుల్స్‌లో ప్రమోద్–పలక్ ద్వయం కాంస్యం కోసం పోటీపడతారు. షూటింగ్ మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో సిద్ధార్థ, దీపక్, అవని బరిలో ఉన్నారు. -
టోక్యో పారాలింపిక్స్: పురుషుల హై జంప్‌లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించాడు
-
ప్రవీణ్ కూమార్‌కు రజతం.. భారత్ ఖాతాలో 11 పతకాలు
టోక్యో: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్స్ సత్తా చాటుతున్నారు. శుక్రవారం భారత ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల హైజంప్ T64 విభాగంలో ప్రవీణ్ కూమార్ రజత పతకాన్ని సాధించాడు. దీంతో భారత ఖాతాలోకి 11 పతకాలు చేరాయి. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ప్రవీణ్ కూమార్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. చదవండి: IND Vs ENG 4th Test: పడినా...పడగొట్టారు..! Proud of Praveen Kumar for winning the Silver medal at the #Paralympics. This medal is the result of his hard work and unparalleled dedication. Congratulations to him. Best wishes for his future endeavours. #Praise4Para — Narendra Modi (@narendramodi) September 3, 2021 -
Paralympics 2021: భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు..
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ T-63 విభాగంలో మరియప్పన్ తంగవేల్ భారత్‌కు రజత పతకం సాధించగా,శరధ్ కూమార్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలోకి మొత్తం 10 పతకాలు చేరాయి. మరియప్పన్ తంగవేల్, శరధ్ కూమార్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. 2016 రియో పారాలింపిక్స్‌లో మరియప్పన్ గోల్డ్ మెడల్ సాధించాడు. అంతకు ముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 కేటగిరీలో సింగ్‌రాజ్ అధానా కాంస్య పతకం సాధించాడు. పారా ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, 5 రజతాలు, మూడు కాంస్య పతకాలతో భారత్ 30వ స్థానంలో ఉంది. చదవండి: Dale Steyn: అన్ని క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన స్టార్ బౌలర్ Soaring higher and higher! Mariyappan Thangavelu is synonymous with consistence and excellence. Congratulations to him for winning the Silver Medal. India is proud of his feat. @189thangavelu #Paralympics #Praise4Para pic.twitter.com/GGhtAgM7vU — Narendra Modi (@narendramodi) August 31, 2021 The indomitable @sharad_kumar01 has brought smiles on the faces of every Indian by winning the Bronze Medal. His life journey will motivate many. Congratulations to him. #Paralympics #Praise4Para pic.twitter.com/uhYCIOoohy — Narendra Modi (@narendramodi) August 31, 2021 -
పారా ఒలింపిక్స్ విజేతలకు ప్రధాని ఫోన్ కాల్
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. ఈవెంట్లో దేశానికి తొలి స్వర్ణం సాధించిన షూటర్ అవని లేఖారా, రజతం సాధించిన డిస్కస్ త్రోయర్ యోగేశ్ కతునియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. మోదీ లేఖారాతో మాట్లాడుతూ.. ఇది చాలా గర్వించదగ్గ విషయం అని ఆమెను అభినందించారు. ప్రధాని మాటల అనంతరం అవని.. దేశ ప్రజల నుంచి తనకు లభించిన మద్దతు పట్ల సంతోషం వ్యక్తం చేసింది. లేఖారా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్లో మొత్తం 249.6 స్కోరుతో ప్రపంచ రికార్డును సమం చేసింది. ఎఫ్56 విభాగంలో రజత పతకం సాధించిన కతునియాను అభినందిస్తూ, ప్రధానీ మోదీ ట్వీట్ చేశారు. అందులో.. యోగేశ్ కతునియాది అత్యుత్తమ ప్రదర్శన. అతను మన దేశానికి రజత పతకం తెచ్చినందుకు సంతోషిస్తున్నాను. అతని విజయం వర్ధమాన అథ్లెట్లను ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం ప్రధాని కాల్ చేసి.. యోగేశ్ విజయానికి భరోసా ఇవ్వడంలో అతని తల్లి చేసిన కృషిని ప్రశంసించారు. 40 ఏళ్లలో రెండుసార్లు స్వర్ణం గెలిచిన జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝజారియా కూడా ఎఫ్ 46 విభాగంలో సోమవారం రజత పతకాన్ని సాధించాడు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఝజారియాను ప్రధాని అభినందించారు. మోదీ ట్వీట్ చేస్తూ.. అద్భుతమైన ప్రదర్శన! మా అత్యంత అనుభవజ్ఞులైన అథ్లెట్లలో ఒకరు రజత పతకం సాధించారు. మీరు సాధించిన పతకాలతో దేశం గర్వపడుతుందన్నారు. చదవండి: Tokyo Paralympics 2021: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట.. -
టోక్యో పారా ఒలింపిక్స్‌లో ఇవాళ ఒక్కరోజే భారత్‌కు 4 పతకాలు
-
Tokyo Paralympics 2021: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట..
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. జావిలన్‌త్రో లో దేవేంద్ర ఝజారియా రజతం పతకం సాధించగా, సుందర్ సింగ్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. దీంతో సోమవారం ఒక్కరోజే భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. అంతకు ముందు పారా ఒలింపిక్స్ భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. మహిళల షూటింగ్ 10 మీటర్ల విభాగంలో విజయం సాధించి అవని లేఖారా గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. డిస్కస్ త్రోలో ఎఫ్-56 విభాగంలో యోగేశ్ కధూనియా రజత పతకం సాధించాడు. ఇప్పటి వరకు పతకాలు సాధించింది వీరే 1. అవని లేఖారా- గోల్డ్ మెడల్ (షూటింగ్) 2. యోగేశ్ కధూనియా- సిల్వర్ మెడల్(డిస్కస్ త్రో) 3. నిశాద్ కుమార్- సిల్వర్ మెడల్(హైజంప్) 4.భవీనాబెన్ పటేల్- సిల్వర్ మెడల్(టేబుల్ టెన్నిస్) 5. దేవేంద్ర ఝజారియా- సిల్వర్ మెడల్(జావిలన్‌త్రో) 6. సుందర్ సింగ్- కాంస్య పతకం(జావిలన్‌త్రో) చదవండి: Tokyo Paralympics 2021:పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం -
నిశాద్ సూపర్ జంప్...
పురుషుల అథ్లెటిక్స్ హైజంప్‌లో 21 ఏళ్ల నిశాద్ కుమార్ భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. టి–47 విభాగంలో నిశాద్ 2.06 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఆసియా రికార్డు కూడా నెలకొల్పాడు. డాలస్ వైజ్ (అమెరికా) కూడా 2.06 మీటర్ల ఎత్తుకు ఎగరడంతో అతనికి కూడా రజతం లభించింది. రోడెరిక్ టౌన్సెండ్ (అమెరికా) 2.15 మీటర్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. చేయి లేకపోతేనేం... మన దైనందిన పనులు చక్కబెట్టేదే కుడి చేయి. అలాంటి చేతినే కోల్పోతే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఎంత కష్టమైనా, ఓ చేయి లేకపోయినా పతకం గెలవడం నిజంగా విశేషమే కదా! హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల నిశాద్ కుమార్ అదేపని చేశాడు. నిశాద్ది రైతు కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయదారులు. ఉనా జిల్లాలోని అంబ్ గ్రామంలో సాగుబడే వారి జీవనాధారం. 8 ఏళ్ల వయసులో వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన నిశాద్ గడ్డికోసే యంత్రంలో గడ్డిని కత్తిరిస్తుండగా కుడి చేయి తెగిపడింది. అప్పుడు విలవిల్లాడిన ఆ బాలుడు రెండేళ్లకే క్రీడాశిక్షణపై దృష్టిపెట్టాడు. స్కూల్ గ్రౌండ్లో హైజంప్‌లో ప్రాక్టీస్ చేసేవాడు. జాతీయ స్కూల్ గేమ్స్‌లో ఏకంగా సాధారణ అథ్లెట్లతో పోటీపడి పదో స్థానంలో నిలిచాడు. పాఠశాల విద్య అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా పంచ్కులాలోని దేవిలాల్ స్టేడియంలో హైజంప్‌లో శిక్షణ తీసుకున్నాడు. అక్కడే నిశాద్ పారాథ్లెట్గా ఎదిగాడు. 2019లో తొలి సారి దుబాయ్‌లో పోటీపడ్డాడు. అక్కడ జరిగిన ఫజార్ పారాథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రిలో అతను టి47 కేటగిరీ హైజంప్‌లో 1.92 మీటర్లు జంప్ చేసి విజేతగా నిలిచాడు. అనంతరం అక్కడే జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 1.94 మీటర్ల జంప్‌తో కాంస్యం సాధించాడు. దీంతోనే టోక్యో పారాలింపిక్స్ కోటా దక్కింది. గత ఏడాది కాలంగా రెండుసార్లు కోవిడ్ బారిన పడినా కూడా ప్రాక్టీస్‌ను అలక్ష్యం చేయలేదు. నాలుగు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న అనుభవంతో తాజాగా దివ్యాంగుల విశ్వక్రీడల్లో రజత పతకం గెలిచాడు. -
Bhavinaben Patel: రజత సంబరం
జాతీయ క్రీడా దినోత్సవాన టోక్యో పారాలింపిక్స్ క్రీడల్లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఒకేరోజు ఏకంగా మూడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) క్లాస్–4 సింగిల్స్ విభాగంలో భవీనాబెన్ పటేల్ రజత పతకం సొంతం చేసుకోగా... పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ టి–47 విభాగంలో నిశాద్ కుమార్ కూడా రజత పతకం కైవసం చేసుకున్నాడు. పురుషుల అథ్లెటిక్స్ డిస్కస్ త్రో ఎఫ్–52 విభాగంలో భారత ప్లేయర్ వినోద్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. అయితే వినోద్‌తో పోటీపడిన ప్రత్యర్థులు అతడి వైకల్యం స్థాయిపై సందేహం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. దాంతో డిస్కస్ త్రో ఫలితాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. పతకాల ప్రదానోత్సవాన్ని నేటికి వాయిదా వేశారు. నేడు ఫిర్యాదుపై విచారించి వినోద్‌కు పతకం ఇవ్వాలా వద్దా అనేది నిర్వాహకులు తేలుస్తారు. టోక్యో: ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ భవీనాబెన్ పటేల్‌కు నిరాశ ఎదురైంది. టోక్యో పారాలింపిక్స్‌లో భాగంగా ఆదివారం జరిగిన టీటీ మహిళల సింగిల్స్ క్లాస్–4 విభాగం ఫైనల్లో భవీనాబెన్ పటేల్ 7–11, 5–11, 6–11తో ప్రపంచ నంబర్‌వన్ యింగ్ జౌ (చైనా) చేతిలో ఓడిపోయింది. 19 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో యింగ్ జౌ నిలకడగా పాయింట్లు స్కోరు చేసింది. లీగ్ దశలోనూ యింగ్ జౌతో జరిగిన మ్యాచ్‌లో భవీనా పరాజయం చవిచూసింది. ఓవరాల్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా తొలిసారి పారాలింపిక్స్‌లో పోటీపడిన గుజరాత్‌కు చెందిన 34 ఏళ్ల భవీనా అబ్బురపరిచే ఆటతీరుతో ఎవరూ ఊహించని విధంగా రజత పతకాన్ని సాధించింది. రజత పతకం గెలిచినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. అయితే పతకం స్వర్ణమై ఉంటే ఇంకా సంతోషం కలిగేది. తమ సామర్థ్యంపై నమ్మకం ఉంటే మహిళలు ఎన్నో అద్భుతాలు చేయగలరు. రియో పారాలింపిక్స్‌కు అర్హత సాధించినా సాంకేతిక కారణాలతో నేను ఆ క్రీడలకు దూరమయ్యాను. ‘రియో’లో చేజారిన అవకాశం నాలో కసిని పెంచింది. పతకం గెలిచేందుకు దోహదపడింది. వైకల్యం కారణంగా నేను జీవితంలో పడిన ఇబ్బందులు తర్వాతి తరంవారు ఎదుర్కోకూడదని కోరుకుంటున్నాను. దైనందిన జీవితంలో దివ్యాంగులకు ప్రతి చోటా క్లిష్ట పరిస్థితులే ఎదురవుతాయి. ఉద్యోగాలతోపాటు ఇతర రంగాల్లోనూ వారికి సముచిత స్థానం ఇవ్వాలి. నా పతకం ద్వారా దివ్యాంగులకు ఏదైనా మేలు జరిగితే అంతకంటే సంతోషం మరోటి ఉండదు. –భవీనాబెన్ పటేల్ విశేష ప్రదర్శనతో భవీనా చరిత్ర లిఖించింది. దేశానికి రజతం అందించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం మరెంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. యువతను క్రీడలవైపు ఆకర్షించేలా చేస్తుంది. –ప్రధాని మోదీ -
వినోద్ కూమార్‌కు కాంస్యం.. భారత్ ఖాతాలో మూడో పతకం
Update: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో డిస్కస్ త్రో విభాగంలో వినోద్ కూమార్ కాంస్య పతకం సాధించాడు. దీంతో పారాలింపిక్స్‌లో ఒకేరోజు మూడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల హై జంప్ T47 విభాగంలో నిషద్ కూమార్ రజత పతకం సాధించాడు. 24 మంది సభ్యుల అథ్లెటిక్స్ జట్టులో నిషిద్ కూమార్ 2.06 మీటర్లు ఎత్తు ఎగిరి రెండో స్థానం లో నిలిచాడు. దీంతో నిషద్ కుమార్ రజతం కైవసం చేసుకున్నాడు.మరో వైపు ఆదివారం భవీనా బెన్ పటేల్ టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించింది. పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న అథ్లెట్ నిషాద్ కుమార్‌ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. పురుషల హై జంప్ టీ47 విభాగంలో నిషాద్ కుమార్ రజతం సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. Congratulations to Nishad kumar for winning silver 🇮🇳🇮🇳… Great work 🙏🙏#TokyoParalympics #Tokyo2020 … https://t.co/hQQ9PvK4M7 — Saina Nehwal (@NSaina) August 29, 2021 More joyful news comes from Tokyo! Absolutely delighted that Nishad Kumar wins the Silver medal in Men’s High Jump T47. He is a remarkable athlete with outstanding skills and tenacity. Congratulations to him. #Paralympics A JUMP TO #SILVER! 😍 Asian record holder Nishad Kumar jumps 2.06m in Men's High Jump T47 Final to earn #IND's second medal of the day - setting another new Asian record along the way! 🤩#Tokyo2020 #Paralympics #ParaAthletics @nishad_hj pic.twitter.com/t3M5VZdL68 — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 29, 2021 — Narendra Modi (@narendramodi) August 29, 2021 India is rejoicing thanks to Vinod Kumar’s stupendous performance! Congratulations to him for the Bronze Medal. His hard work and determination is yielding outstanding results. #Paralympics — Narendra Modi (@narendramodi) August 29, 2021 చదవండి: మరో టీమ్‌కు ధోని కెప్టెన్.. మిగతా 10 మంది వీళ్లే! -
భవీనా పటేల్‌కు రజతం.. ప్రముఖుల ప్రశంసల వెల్లువ
ఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన భవీనాబెన్ పటేల్‌పై ప్రశంసల జల్లు కురుస్తుంది. ప్రధాని, రాష్ట్రపతి మొదలుకొని పలువురు సెలబ్రిటీలు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రజతం సాధించిన భవీనా పటేల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టోక్యో పారాలింపిక్స్ 2020 లో కృషి, పట్టుదల, సంకల్పంతో రజత పతకం సాధించిన భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భావినాబెన్ పటేల్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. పటేల్ తన అత్యుత్తమ ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేసారన్నారు. టోక్యో పారాలింపిక్స్ క్రీడలలో టేబుల్ టెన్నిస్‌లో ఆమె సాధించిన రజత పతకం దేశంలోని యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గవర్నర్ అన్నారు. చదవండి: పారాలింపిక్స్‌లో భవీనా కొత్త అధ్యాయం.. 12 నెలల వయసులో పోలియో బారిన పడినప్పటికీ.. ► పారాలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన భవీనా.. భారత బృధానికి, క్రీడాభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మీ అసాధారణ సంకల్పం, నైపుణ్యాలు భారతదేశానికి కీర్తిని తెచ్చాయి. మీకు నా అభినందనలు - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ President Ram Nath Kovind wishes Para table tennis player #BhavinaPatel on winning a Silver medal at Tokyo Paralympics "...Your extraordinary determination and skills have brought glory to India. My congratulations to you on this exceptional achievement," he says. pic.twitter.com/E59vmq82IY — ANI (@ANI) August 29, 2021 ► భవీనా పటేల్ చరిత్ర లిఖించింది. దేశానికి ఆమె చారిత్రక సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది. ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తి. ఆమె ప్రయాణం యువతను క్రీడలవైపు ఆకర్షిస్తుంది - ప్రధాని నరేంద్ర మోదీ PM Modi congratulates Para-paddler Bhavina Patel on winning a Silver medal at Tokyo Paralympics "The remarkable Bhavina Patel has scripted history! ...Her life journey is motivating and will also draw more youngsters towards sports," he says. pic.twitter.com/CDlW1KS5d7 — ANI (@ANI) August 29, 2021 ► టోక్యో పారాలింపిక్స్ 2020లో టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించిన భవీనా పటేల్‌కు అభినందనలు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణం. భవిష్యత్తులో ఆమె మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను - ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు టోక్యో పారాలింపిక్స్ 2020లో టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించిన భవీనా పటేల్‌కు అభినందనలు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణం. భవిష్యత్తులో ఆమె మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. #Paralympics pic.twitter.com/89CCkOUhR6 — Vice President of India (@VPSecretariat) August 29, 2021 -
శెబ్బాష్ భవీనా.. ఈమె జీవితం నేర్చుకోవాల్సిన పాఠం
Bhavina Patel Wins Silver Medal: తొందరపడితే చరిత్రను తిరగరాయలేం.. ఊరికే చరిత్రను సృష్టించలేం.. ఇదొక బ్లాక్ బస్టర్ సినిమా డైలాగ్. అయితే నిజ జీవితంలోనూ ఇది అక్షర సత్యమని నిరూపించింది భవీనాబెన్ పటేల్. టోక్యో పారాలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ విభాగంలో తొలి పతకం(రజతం) సాధించి చరిత్ర సృష్టించిన భవీనాబెన్ పటేల్.. అందుకోసం పడ్డ కష్టం, గెలుపు కోసం పడ్డ తాపత్రయం ఎందరికో స్ఫూర్తిదాయకం కూడా.. సాక్షి, వెబ్‌డెస్క్: టోక్యో పారాలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ మహిళ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. సెమీస్‌లో చేరినప్పుడే ఆమెకు పతకం ఖాయమైనప్పటికీ శనివారం జరిగిన సెమీస్ పోరులో గెలిచిన భవీనా ఫైనల్‌కు అడుగుపెట్టింది. ఇక ఫైనల్లో గెలిస్తే బంగారు పతకాన్ని గెలిచే అవకాశం వచ్చింది. అయితే తుది పోరులో చైనా క్రీడాకారిణి.. ప్రపంచ నెంబర్‌వన్.. చైనా క్రీడాకారిణి జౌ యింగ్ చేతిలో 3-0తో ఓడిపోయింది. టోక్యో పారాలింపిక్స్‌లో దేశానికి రజతం అందించిన భవీనాబెన్ పటేల్ జీవితం ఒక ఆదర్శం. 12 నెలల వయసులో పోలియో బారిన పడినప్పటికీ.. ఒడిదుడుకులతో విజయాలు సాధించింది. చదవండి: Tokyo Paralympics: భవీనాబెన్ పటేల్‌కు రజతం An accomplishment that will echo through #IND 🗣️ Bhavina Patel receives her medal as she wins the nation's first #silver in #ParaTableTennis at the #Tokyo2020 #Paralympics ❤️pic.twitter.com/l4xzgHpYWK — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 29, 2021 పోలియో బారిన పడి... గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్‌లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్‌ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది. ముందుగా జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన భవీనా ఆ తర్వాత అంతర్జాతీయ టోర్నీలలో పతకాలు సాధించడం మొదలుపెట్టింది. 2011లో థాయ్‌లాండ్ ఓపెన్ పారా టీటీ టోర్నీలో భవీనా రజత పతకం సాధించింది. ఆ తర్వాత 2013లో ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం కైవసం చేసుకుంది. ఆ తర్వాత జోర్డాన్, చైనీస్ తైపీ, చైనా, కొరియా, జర్మనీ, ఇండోనేసియా, స్లొవేనియా, థాయ్‌లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఈజిప్ట్ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలలో భవీనా భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఓవరాల్‌గా ఐదు స్వర్ణాలు, 13 రజత పతకాలు, ఎనిమిది కాంస్య పతకాలను ఆమె గెల్చుకుంది. 2017లో గుజరాత్‌కు చెందిన రాష్ట్రస్థాయి మాజీ క్రికెటర్ నికుంజ్ పటేల్‌ను వివాహం చేసుకున్న భవీనా 2018 ఆసియా పారా గేమ్స్‌లో డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించింది. ప్రస్తుతం ఆమె సాధించిన విజయానికి దేశం నలుమూలల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. -
Shaili Singh: సెంటి మీటర్ తేడాతో స్వర్ణం చేజారె!
నైరోబి: ఒకే ఒక సెంటిమీటర్ దూరం భారత అథ్లెట్ శైలీ సింగ్‌ను స్వర్ణానికి దూరం చేసింది. ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ (అండర్–20) చాంపియన్‌షిప్‌లో ఆమె రజతం గెలిచినా... వెంట్రుకవాసిలో పసిడి దక్కకపోవడమనేది అథ్లెట్‌ను బాగా నిరాశపరిచే అంశం. కెన్యా రాజధానిలో ఆదివారం ముగిసిన ఈ జూనియర్ మెగా ఈవెంట్లో లాంగ్‌జంపర్ శైలీ ఆదివారం ఫైనల్స్‌లో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కనబరిచింది. మొత్తం 12 మంది పోటీపడిన మహిళల లాంగ్‌జంప్ ఫైనల్లో స్వీడన్‌కు చెందిన మజ అస్కగ్ 6.60 మీటర్ల దూరం దూకి బంగారు పతకం సాధించింది. (మీకు మేమున్నాం, చెలరేగి ఆడండి.. అఫ్గాన్ క్రికెటర్లకు తాలిబన్ల భరోసా) భారత లాంగ్‌జంపర్ శైలీ కూడా తానేం తక్కువ కాదని 6.59 మీటర్ల దూరం దూకింది. అర అంగుళం కంటే తక్కువ తేడాతో బంగారాన్ని కోల్పోయింది. తొలి, రెండో ప్రయత్నంలో ఆమె 6.34 మీ. దూరాన్ని నమోదు చేసింది. రెండో ప్రయత్నం ముగిసే సరికి హొరియెలొవా (6.50 మీ.; ఉక్రెయిన్) ఆధిక్యంలో నిలువగా, ఎబొసెలె (6.46మీ.; స్పెయిన్), శైలీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మూడో ప్రయత్నం (6.59 మీ.) శైలీని స్వర్ణావకాశానికి దగ్గర చేసింది. అప్పటికి అస్కగ్ (6.44 మీ.) పతకం బరిలోకి రానేలేదు. కానీ నాలుగో ప్రయత్నం అస్కగ్ (6.60 మీ.)ను చాంపియన్‌గా చేస్తే, భారత అథ్లెట్ 4, 5 ప్రయత్నాలు ఫౌల్ అయ్యాయి. ఆఖరి ఆరో ప్రయత్నం సఫలమైనా... 6.37 మీటర్ల దూరమే దూకింది. దీంతో చివరకు రజతమే ఖాయమైంది. ఉక్రెయిన్ అథ్లెట్ మరియా హొరియెలొవా (6.50 మీ.) కాంస్యం గెలిచింది. చదవండి: ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత మహిళల రిలేలో నాలుగో స్థానం తెలుగమ్మాయి కుంజా రజిత భాగంగా ఉన్న 4 X 400 మీటర్ల రిలేలో భారత జట్టుకు నాలుగో స్థానం దక్కింది. మహిళల ఫైనల్లో రజిత, ప్రియా మోహన్, పాయల్ వోహ్రా, సమ్మీలతో కూడిన జట్టు పోటీని 3 నిమిషాల 40.45 సెకన్లలో పూర్తి చేసింది. ఇందులో నైజీరియా అమ్మాయిలు 3 ని.31.46 సెకన్ల టైమింగ్‌తో విజేతగా నిలిస్తే, జమైకా జట్టు (3ని.36.57 సె.) రజతం, ఇటలీ బృందం (3ని.37.18 సె.) కాంస్యం గెలుపొందింది. పురుషుల ట్రిపుల్ జంప్‌లో స్వల్పతేడాతో భారత అథ్లెట్ డొనాల్డ్ మకిమయిరాజ్ (15.82 మీ.) కాంస్య పతకం కోల్పోయాడు. ఇతని కంటే మూడు సె.మీ.దూరం దూకిన సైమన్ గోర్ (15.85 మీ.; ఫ్రాన్స్)కు కాంస్యం లభించగా, మకిమయిరాజ్‌కు నాలుగో స్థానం దక్కింది. ఇందులో గాబ్రియెల్ (16.43 మీ.; స్వీడెన్), హిబెర్ట్ (16.05 మీ.; జమైకా) వరుసగా స్వర్ణ, రజతాలు గెలిచారు. మహిళల 5000 మీ. ఫైనల్లో అంకిత నిరాశపరిచింది. పది మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో ఆమె (17 ని.17.68 సెకన్లు) ఎనిమిదో స్థానంలో నిలిచింది. జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 1 రజతం, 2 కాంస్యాలతో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పోటీలను ముగించింది. నేను 6.59 మీటర్ల తర్వాత ఇంకాస్త దూరాన్ని నమోదు చేయాల్సింది. స్వర్ణం గెలిచే అవకాశాలు ఇంకా మూడు ప్రయత్నాల రూపంలో ఉన్నా... అనుకున్నది సాధించలేకపోయాను. నా తల్లి పసిడిపైనే కన్నేయాలి. జాతీయ గీతాన్ని వినిపించాలని చెప్పింది. అలా కుదరకపోవడం నన్ను బాధించింది. నాకు ఇంకా 17 ఏళ్లే. మరో జూనియర్ ఈవెంట్లో తలపడే అవకాశం ఉంది. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ కూడా జరగనుండటంతో మరింత మెరుగైన ప్రదర్శనతో స్వర్ణాన్ని సాకారం చేసుకుంటా’ – శైలీ సింగ్ -
అమిత్ ఖత్రీకి రజతం
నైరోబి: భారత అథ్లెట్ అమిత్ ఖత్రీ సుదీర్ఘ పరుగులో సత్తా చాటుకున్నాడు. ప్రపంచ జూనియర్ (అండర్–20) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 10,000 మీ. పరుగులో అతను రజత పతకం సాధించాడు. మహిళల 400 మీ. పరుగులో ప్రియా మోహన్ తృటిలో కాంస్యం గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. రోహ్టక్కు చెందిన 17 ఏళ్ల టీనేజ్ అథ్లెట్ అమిత్ ఖత్రీ ఓ రకంగా అద్భుతమే చేశాడు. సాధారణంగా ఆఫ్రికా అథ్లెట్లకు మాత్రమే సాధ్యమయ్యే సుదీర్ఘ పరుగులో భారత అథ్లెట్ పతకం గెలవడం విశేషం. శనివారం జరిగిన పురుషుల పదివేల మీటర్ల రేస్‌వాక్‌లో అతను పోటీని 42 నిమిషాల 17.94 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన హెరిస్టోన్ వాన్యోని 42 ని.10.84 సెకన్ల టైమింగ్‌తో బంగారు పతకం సాధించగా, స్పెయిన్ అథ్లెట్ పాల్ మెక్‌గ్రాత్ (42ని.26.11 సె.) కాంస్యం గెలుపొందాడు. నిజానికి ఖత్రీ స్వర్ణం గెలిచే అవకాశాలు చివరి వరకు కనిపించాయి. వేగంగా దూసుకెళ్లిన అతను 8 ల్యాపులు ముగిసే సరికి అందరికంటే ముందున్నాడు. దాదాపు 9000 మీటర్ల దాకా ఇదే వేగం నమోదు చేయగా... స్థానిక అథ్లెట్ వాన్యోని అనూహ్యంగా ఆఖరి ల్యాపులో అమిత్ ఖత్రీని అధిగమించి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. కెన్యా రాజధాని నైరోబి సముద్ర మట్టానికి 1800 మీ. ఎత్తులో ఉంటుంది. ఇది భారతీయులకు ప్రతికూల ప్రదేశం. ఇలాంటి చోట భారత అథ్లెట్ సుదీర్ఘ పరుగులో స్వర్ణానికి చేరువగా వెళ్లడం ఆషామాషీ విషయం కాదు. పరుగు ముగిసిన అనంతరం ఖత్రీ మాట్లాడుతూ ‘నేను ఆశించిన ఫలితం కాదిది. అయినా సరే రజతంతో తృప్తిగా ఉన్నాను. ఐదు రోజుల ముందు ఇక్కడికొచ్చిన నన్ను ప్రతికూల వాతావరణం ఇబ్బంది పెట్టింది. ఒక ల్యాప్‌లో అయితే శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది’ అని అన్నాడు. పాల్గొన్న తొలి అంతర్జాతీయ పోటీలో రజతం గెలిచిన తన శిష్యుడి ప్రదర్శన పట్ల కోచ్ చందన్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళల 10వేల మీటర్ల రేస్‌వాక్‌లో బల్జీత్‌కౌర్ (48 ని.58.17 సె) ఏడో స్థానంలో నిలిచింది. ప్రియకు చేజారిన పతకం... మహిళల 400 మీటర్ల పరుగులో అనేక అంచనాల మధ్య బరిలోకి దిగిన ప్రియా మోహన్‌కు నిరాశే ఎదురైంది. దురదృష్టవశాత్తూ ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. ఫైనల్ పోటీని ప్రియ 52.77 సెకన్లలో ముగించింది. ఈ ఈవెంట్లో ఇమావోబంగ్ (నైజీరియా; 51.55 సె.), కార్నెలియా (పోలండ్; 51.97 సె.), కెన్యా అథ్లెట్ సిల్వియా చెలన్‌గట్ (52.23 సె.) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలిచారు. పురుషుల 400 మీ. హర్డిల్స్‌లో రోహన్ గౌతమ్ కాంబ్లి ఫైనల్ చేరడంలో విఫలమయ్యాడు. సెమీస్‌లో అతను 52.88 సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచాడు. పురుషుల 4్ఠ400 మీటర్ల హీట్స్‌లో అబ్దుల్ రజాక్, సుమిత్ చహల్, కపిల్, భరత్ శ్రీధర్‌లతో కూడిన జట్టు హీట్స్‌తోనే సరిపెట్టుకుంది. -
పసిపాప కోసం ‘ఒలింపిక్ మెడల్’ వేలానికి..
ఆమె ఓ క్రీడాకారిణి.. కష్టపడి ఒలింపిక్స్‌లో పతకం సాధించి సత్తా చాటింది. పతకంతో ఇంటికి వెళ్లిన ఆమె సంబరాల్లో మునిగింది. ఈ సమయంలో ఓ పసిపాపకు ఆరోగ్యం బాగాలేదు.. పసికందు చికిత్సకు భారీగా ఖర్చవుతోందని తెలుసుకుని ఆమె తల్లడిల్లింది. దీంతో ఎంతో శ్రమకోర్చి సాధించిన తన ఒలింపిక్ పతకాన్ని వేలానికి పెట్టింది. ఆమె మానవత్వాన్ని మెచ్చి వేలం దక్కించుకున్న సంస్థ ఆమె మెడల్‌ను తిరిగి ఇచ్చేసింది. దీంతోపాటు పాప చికిత్సకు అయ్యే ఖర్చుకు డబ్బును కూడా సమకూర్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ( చదవండి: నీరజ్ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు) పోలాండ్‌కు చెందిన మరియా అండ్రెజెక్ జావెలిన్ త్రోయర్ క్రీడాకారిణి. ఆమె తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంది. మన హీరో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించిన క్రీడ జావెలిన్ త్రో మహిళల విభాగంలో 64.61 మీటర్ల దూరం జావెలిన్ విసిరి మరియా రెండో స్థానంలో నిలిచింది. రజత పతకం సొంతం చేసుకుంది. అయితే ఆమెకు ఇటీవల 8 నెలల వయసున్న మలీసా అనే పాప అరుదైన వ్యాధి (గుండె సంబంధిత)తో బాధపడుతోందని తెలుసుకుని ఆవేదనకు లోనైంది. ఆ పాప చికిత్సకు అవసరమైన ఖర్చును తాను పెట్టలేని స్థితిలో ఉండడంతో తన రజత పతకాన్ని వేలం పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఆమె చర్యను అందరూ అభినందించారు. కొందరు వేలం వద్దు.. మేం కొంత ఇస్తాం అని కామెంట్ చేశారు. అయితే ఆమె ప్రకటనతో పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చింది. ఏకంగా 1.25 లక్షల డాలర్ల వరకు విరాళాలు సమకూరాయి. ఇక పతకం వేలంలో పోలాండ్‌కు చెందిన సూపర్‌మార్కెట్ చెయిన్ సంస్థ జాబ్కా పోటీ పడింది. చివరకు వేలంలో ఆ సంస్థ మెడల్‌ను దక్కించుకుంది. అయితే ఆ సంస్థ మాత్రం మెడల్ తీసుకునేందుకు నిరాకరించింది. పాప చికిత్సకు అయ్యే డబ్బు ఇవ్వడంతో పాటు మరియా దక్కించుకున్న పతకాన్ని కూడా తిరిగి ఇచ్చేయాలని జాబ్క సంస్థ తెలిపింది. మానవత్వం చాటుకున్న మరియా ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌ను జయించింది. 2018లో బోన్ క్యాన్సర్‌తో బాధపడింది. క్యాన్సర్‌ను జయించడంతో ఇప్పుడు పోలాండ్ దేశానికి ఒలింపిక్స్‌లో కాంస్య పతకం తీసుకువచ్చింది. రియో ఒలింపిక్స్‌లో మరియాకు త్రుటిలో పతకం చేజారింది. 2 సెంటీ మీటర్ల దూరంలో మెడల్ ఆగిపోయింది. View this post on Instagram A post shared by Maria M. Andrejczyk (@m.andrejczyk) -
'సచిన్ సార్‌ను కలిశాను.. చాలా హ్యాపీగా ఉంది'
ముంబై: టోక్యో ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కలిసింది. ముంబైలోని ఆయన ఇంటికి వెళ్లి కొద్దిసేపు మాట్లాడింది. ఈ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్ విశేషాలను గురించి సచిన్ ఆమెను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిచారు. అనంతరం సచిన్‌ను కలిసిన ఫోటోలను ట్విట్టర్లో మీరాబాయి చాను షేర్ చేసుకుంది. ''సచిన్ సార్‌ని ఉదయం కలిశాను. నన్ను ప్రోత్సహిస్తూ ఆయన మాట్లాడిన మాటలను ఎప్పటికి మరిచిపోలేను. నిజంగా ఎంతో స్ఫూర్తి పొందాను.. చాలా హ్యాపీగా ఉంది'' అంటూ ట్వీట్ చేసింది. కాగా మీరాబాయి చేసిన ట్వీట్‌పై సచిన్ కూడా రిప్లై ఇచ్చాడు. మీరాబాయిని కలవడం నాకు సంతోషంగా ఉంది. ఒలింపిక్స్‌లో రజతం తెచ్చినందుకు ఎంతో గర్విస్తున్నా.. మున్ముందు జరిగే క్రీడల్లో ఇలాంటి అద్భుత ప్రదర్శనలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నా'' అంటూ తెలిపారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది. 2012 లండన్ ఒలింపిక్స్‌ను మరిపిస్తూ ఏడు పతకాలతో మురిసిన భారత్ టోక్యో ఒలింపిక్స్‌ను ఘనంగా ముగించింది. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో మొత్తం ఏడు పతకాలు కొల్లగొట్టింది. Loved meeting @sachin_rt Sir this morning! His words of wisdom & motivation shall always stay with me. Really inspired. pic.twitter.com/Ilidma4geY — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 11, 2021 -
రెజ్లర్ రవి దహియాకు భారీ నజరానా.. క్లాస్ 1 కేటగిరీ ఉద్యోగం..!
చండిగఢ్: టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్ పోరులో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఒలింసిక్స్‌లో రజతం సాధించిన రెజ్లర్ రవి కుమార్ దహియాకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. దేశానికి పతకం సాధించి పెట్టిన రవి దహియాకు రూ.4 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే క్లాస్-1 కేటగిరి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు.. రవి దహియా అడిగిన చోట 50శాతం రాయితీతో ఓ ఫ్లాట్ స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. దహియా పుట్టి పెరిగిన తన స్వగ్రామం నహ్రిలో.. రెజ్లింగ్ కోసం ప్రత్యేకంగా ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్లు వెల్లడించింది. కాగా ఫైనల్లో రష్యా రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన దహియా 7-4 తేడాతో ఓడి రజతం గెలిచాడు. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో సుశీల్ కుమార్ తర్వాత రజతం సాధించిన రెండో రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన రవి దహియాపై సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు ట్విటర్ వేదికగా రవి దహియాకు శుభాకాంక్షలు చెప్పారు. ఇక దహియా పతకంతో టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ రెండు రజతాలు, మూడు కాంస్యాలు సాధించింది. ఇక సుశీల్ కుమార్ 2012 లండన్ గేమ్స్‌లో రజతం గెలుచుకోగా.. అక్కడ యోగేశ్వర్ దత్ కాంస్యం సాధించాడు. ఇక 2008 బీజింగ్ గేమ్స్‌లో సుశీల్ కాంస్యం గెలుచుకున్నారు. అంతేకాకుండా జాదవ్ 1952 హెల్సింకి గేమ్స్‌లో కాంస్య పతకం సాధించారు. 2016 రియో ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన తొలి మహిళా రెజ్లర్‌గా సాక్షి మాలిక్ నిలిచిన సంగతి తెలిసిందే. -
అరంగేట్రంలోనే అదరగొట్టావ్ రవి దహియా: సీఎం జగన్
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్ పోరులో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. రష్యా రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన రవికుమార్ 7-4 తేడాతో ఓడి రజతం గెలిచాడు. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో సుశీల్ కుమార్ తర్వాత రజతం సాధించిన రెండో రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన రవి దహియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు ట్విటర్ వేదికగా రవి దహియాకు శుభాకాంక్షలు చెప్పారు. కంగ్రాట్స్ రవి దహియా: సీఎం జగన్ టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో రజతం సాధించిన రవి దహియాకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి రెండో రజతం అందించిన నీకు శుభాకాంక్షలు. అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే అదరగొట్టే ప్రదర్శన చేశావు. '' అంటూ ట్వీట్ చేశారు. Congratulations to wrestler #RaviDahiya, for adding second Silver medal to India's tally at #Tokyo2020. India is proud of this young champ who made his mark in his debut #Olympics . Ravi has been brilliant throughout his Olympic journey for #TeamIndia . — YS Jagan Mohan Reddy (@ysjagan) August 5, 2021 ఓడిపోయినా మనసులు గెలుచుకున్నావు: మోదీ '' రవి కుమార్ దహియా ఒక గొప్ప రెజ్లర్.. ఫైనల్లో అతని పోరాట పటిమ నన్ను ఆకట్టుకుంది. అతని పోరాట స్పూర్తి.. మ్యాచ్ గెలవాలనే దృడత్వం అమోఘం. కానీ మ్యాచ్‌లో విజేత ఒకరే అవుతారు. దహియా.. నువ్వు ఈరోజు మ్యాచ్ ఓడిపోయుండొచ్చు.. కానీ మా మనసులు గెలుచుకున్నావ్.. రజతం సాధించిన నీకు శుభాకాంక్షలు.. నీ ప్రదర్శనతో దేశ గౌరవాన్ని మరింత పెంచావు'' అంటూ ట్వీట్ చేశారు. Ravi Kumar Dahiya is a remarkable wrestler! His fighting spirit and tenacity are outstanding. Congratulations to him for winning the Silver Medal at #Tokyo2020. India takes great pride in his accomplishments. — Narendra Modi (@narendramodi) August 5, 2021 ''టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించావు.. మీ ప్రదర్శనను చూసి దేశం గర్విస్తుంది'' - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ India is proud of Ravi Dahiya for winning the wrestling Silver at #Tokyo2020. You came back into bouts from very difficult situations and won them. Like a true champion, you demonstrated your inner strength too. Congratulations for the exemplary wins & bringing glory to India. — President of India (@rashtrapatibhvn) August 5, 2021 ''గ్రేట్ గోయింగ్.. రవి కుమార్ దహియా.. రజతం సాధించిన నీకు ఇవే నా శుభాకాంక్షలు.. మున్ముందు దేశానికి మరిన్ని పతకాలు తేవాలని కోరుకుంటున్నా''- రాహుల్ గాంధీ -
ఫైనల్లో ఓడినా.. చరిత్ర లిఖించాడు
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్లో పోరాడి ఓడిపోయాడు. 57 కిలోల రెజ్లింగ్ ఫ్రీస్టైల్ విభాగంలో రష్యాకు చెందిన రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన రవికుమార్ 7-4 తేడాతో ఓడి రజతం గెలుచుకున్నాడు. తద్వారా సుశీల్ కుమార్ తర్వాత రెజ్లింగ్‌లో రజతం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఒలింపిక్స్‌లో పతకం తెచ్చిన ఐదో రెజ్లర్‌గా రవి కుమార్ నిలిచాడు. కేడీ జాదవ్(కాంస్యం), సుశీల్ కుమార్(కాంస్యం, రజతం), సాక్షి మాలిక్( కాంస్యం), యేగేశ్వర్ దత్( కాంస్యం) తర్వాత రవి దహియా టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. గతంలో 2012 ఒలింపిక్స్‌లో సుశీల్‌కుమార్ రెజ్లింగ్‌లో సిల్వర్ సాధించిన విషయం తెలిసిందే. టక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు రవికుమార్ దహియాపై ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ రవికుమార్ బుధవారం జరిగిన అర్హత, క్వార్టర్స్, సెమీస్ బౌట్లలో దుమ్మురేపాడు. దాదాపు అన్ని ఏకపక్ష విజయాలు సాధించిన రవికుమార్ సెమీస్‌లో కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్ సనయేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందు వెనుకబడినా చివరి నిమిషంలో అద్బుతంగా నిలదొక్కుకొని విక్టరీ బై ఫాల్ కింద గెలపొంది ఫైనల్‌కు ప్రవేశించాడు. -
తండ్రి మాజీ క్రికెటర్; కొడుకు ఇవాళ ఒలింపిక్ చాంపియన్
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ విన్స్టన్ బెంజమిన్ కుమారుడు రాయ్ బెంజమిన్ ఒలింపిక్స్‌లో పతకం సాధించాడు. విషయంలోకి వెళితే.. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్స్‌లో రాయ్ బెంజమిన్ 46.17 సెకండ్లలో గమ్యాన్ని చేరుకొని రజతం అందుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో 400 మీటర్ల హార్డిల్స్‌ను వేగంగా పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రాయ్ బెంజమిన్ నిలిచాడు. ఇప్పుడు బెంజమిన్ ఒలింపిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాడు. ఇక రాయ్ బెంజమిన్ తండ్రి విన్స్టన్ బెంజమిన్ తన తొమ్మిదేళ్ల కెరీర్లో వెస్టిండీస్ తరపున 21 టెస్టులు, 85 వన్డేలు ఆడాడు. ఇక ఇదే హార్డిల్స్‌లో స్వర్ణం అందుకున్న నార్వే అథ్లెట్ కార్స్టెన్ వార్లోమ్ ప్రపంచరికార్డు సాధించాడు. 400 మీ హార్డిల్స్‌ను 45.94 సెకన్లలో చేరుకొని చరిత్ర సృష్టించాడు. బ్రెజిల్‌కు చెందిన అలిసన్ దాస్ సాంటోస్ 46.72 సెకండ్లతో కాంస్యం దక్కించుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ సోదరుడు బ్రెండన్ స్టార్క్ మెన్స్ హై జంప్ విభాగంలో ఫైనల్‌కు చేరుకున్నా ఆరో స్థానంలో నిలిచాడు. WORLD RECORD‼️ Norway's Karsten Warholm breaks his OWN world record to win gold in the men's 400m hurdles and @TeamUSA's Rai Benjamin wins the silver. #TokyoOlympics 📺 NBC 💻 https://t.co/ZOFdXC4e4u 📱 NBC Sports App pic.twitter.com/lPSNrv2Qoo — #TokyoOlympics (@NBCOlympics) August 3, 2021


