సిల్వర్‌ మెడల్‌.. హీరో మాధవన్‌ కొడుకుపై ప్రశంసలు | Sakshi
Sakshi News home page

R Madhavan: స్విమ్మింగ్‌ పోటీల్లో సత్తా చాటిన హీరో మాధవన్‌ కొడుకు

Published Sun, Apr 17 2022 10:35 AM

R Madhavan Son Wins Silver Medal In Danish Open Swimming Meet - Sakshi

స్టార్‌ హీరో మాధవన్‌ కొడుకు వేదాంత్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.స్విమ్మింగ్‌లో రాణిస్తున్న వేదాంత్‌ ఇప్పటికే భారత్‌కు పలు పతకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి స్విమ్మింగ్‌ పోటీల్లో దేశానికి సిల్వర్‌ మెడల్‌ను సాధించాడు. డెన్మార్క్‌లో జరిగిన డానిష్ స్విమ్మింగ్ ఓపెన్‌లో మాధవన్‌ కొడుకు వేదాంత్‌ రజత పతకం సాధించి సత్తా చాటాడు. 

డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరిగిన డానిష్ ఓపెన్ స్విమ్మింగ్ మీట్‌లో 1500 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో వేదాంత్ ఈ ఘనత సాధించాడు. ఈ విషయాన్ని మాధవన​ సోషల్‌ మీడియా వేదికగా పంచుకొని ఆనందం వ్యక్తం చేశాడు.  అంతేకాకుండా మాధవన్‌ తన కొడుకు ఫోటోను మాత్రమే కాకుండా బంగారు పతకం సాధించిన సాజన్‌ ప్రకాష్‌ను కూడా అభినందించాడు.  ఇక ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వేదాంత్‌ గురువు ప్రదీప్‌కు కూడా థ్యాంక్స్‌ చెప్పాడు. 

Advertisement
 
Advertisement