
ఇంతకు ముందు తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న నటి కీర్తిసురేశ్( Keerthy Suresh ). కాగా ఎప్పుడైతే హిందీ చిత్రంలో నటించడానికి అంగీకరించిందో, అప్పటి నుంచి దక్షిణాదిలో నటించిన చిత్రాలు సక్సెస్‌కు దూరం అయ్యాయి. బాలీవుడ్‌లో నటించిన ఏకైక చిత్రం బేబిజాన్ పూర్తిగా నిరాశ పరచింది. అదే సమయంలో తన చిరకాల బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని, సంసార జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే సమీప కాలంలో కీర్తి సురేశ్ నటించిన ఉప్పు కారం చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రం గురించి కీర్తి సురేశ్ చాలా ఎక్కువగానే ఊహించుకుంది. కానీ ఆ చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేక పోయింది. ఆ తరువాత మరో కొత్త చిత్రంలో నటించలేదు.
కమర్శియల్ చిత్రాల్లో నటించి, హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రాల్లో నటించి, జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్న నటికి ఇప్పుడు అవకాశాలు లేవంటే నమ్మశక్యం కాని పరిస్థితి. కొత్తగా అవకాశాలు రావడం లేదా? లేక ఈ బ్యూటీ అంగీకరించడం లేదా? అన్నది తెలియని పరిస్థితి. అయినా కీర్తిసురేశ్ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజీగానే ఉంది. కాగా ఇటీవల ఈ బ్యూటీ ఒక భేటీలో పేర్కొంటూ ‘ఒక్కోసారి నేను అప్‌సెట్ అవుతుంటానని, అప్పుడు ఏం చేస్తానో తెలుసా. ఫుల్‌గా భోజనం చేస్తాను. అలాగే కారు తీసుకుని ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లతాను.
ఆ సమయంలో కారులో మంచి సంగీతం వింటాను. అలానే ఇంట్లో ఒక పెట్ కుక్కను పెంచుకుంటున్నాను. నేను అప్‌సెట్ అయితే దాని ముఖం చూస్తే వెంటనే అంతా మాయం అవుతుంది.’ అని కీర్తి సురేశ్ పేర్కొంది. కాగా ఈ అమ్మడు ఇంతకు ముందు నటించిన హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలు రివాల్వర్ రిటా, కన్నివెడి విడుదల కావలసి ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి హిట్ అయినా కీర్తిసురేశ్‌కు మళ్లీ క్రేజ్ పెరిగే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ఈ అమ్మడు మాత్రం సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.