టాలీవుడ్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తోన్న బైకర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి అభిలాశ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజైన సాంగ్ ఆడియన్స్‌ను మెప్పించింది.
అయితే ఈ సినిమా సంగతి పక్కనపెడితే హీరో రాజశేఖర్‌పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. గతంలో ఆయన గోటీల బిజినెస్ ప్రారంభించారని నెట్టింట మీమ్స్ వైరలయ్యాయి. ఈ వ్యాపారంలో ఆయన కోట్లు సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. కొందరైతే ఏకంగా రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీలో మాకు ఉద్యోగాలు వచ్చాయంటూ మరీ హాస్యంగా పోస్టులు పెట్టారు. ఇది చూసిన నెటిజన్స్ ఇదంతా నిజమేనా అని ఆరా తీయడం మొదలెట్టారు.
తాజాగా తనపై వచ్చిన మీమ్స్‌పై హీరో రాజశేకర్ స్పందించారు. ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. తనకు అలాంటి వ్యాపారాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. తనకు గోటీల ఫ్యాక్టరీ ఉందని అందరు మాట్లాడుకుంటుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. కొందరు అది నిజమే అనుకుని నాకు కాల్ చేసి అడిగారని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో వీడియో చూడగానే నాకు ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? నేనెక్కడ రూ.3 కోట్లు సంపాదిస్తున్నా? అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.


