‘రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి.. ఏబీఎన్‌ మూసివేత కోరుకుంటున్నారా?’ | YSRCP Leaders Given Complaint Against ABN Radha Krishna | Sakshi
Sakshi News home page

‘రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి.. ఏబీఎన్‌ మూసివేత కోరుకుంటున్నారా?’

Apr 27 2026 1:07 PM | Updated on Apr 27 2026 1:34 PM

YSRCP Leaders Given Complaint Against ABN Radha Krishna

వైఎస్సార్‌సీపీ నాయకులు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఇప్పటికే ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా, రాధాకృష్ణపై ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులకు మరోసారి ఫిర్యాదు సహా వినతి పత్రాలు అందజేస్తున్నారు. రాధాకృష్ణ క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 

భూమన కామెంట్స్‌..

  • తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి.

  • సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అంటూ అక్రమ కేసులు పెట్టారు

  • రాధాకృష్ణ వైఎస్సార్‌సీపీపై ఉలుకు పలుకు రాతల్లో రాసిన రాతలు పట్ల సభ్య సమాజం తలదించుకుంటోది

  • ఆయన క్షమాపణ చెప్పకుండా, విచ్చలవిడిగా రాష్ట్రం మీదకు వదిలేస్తున్నారు

  • మాపై విషపు రాతలు రాసే వారికి ఈ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది

  • నేను నిజాయితీకి కట్టుబడి ఉన్నా అని సుద్దులు చెప్తున్న రాధాకృష్ణ..

  • ఆయన మాటలపై ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదు

  • రాధాకృష్ణ వాడిన పద ప్రయోగంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం


విశాఖ..

  • విశాఖ నగర వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కేకే రాజు కామెంట్స్‌..

  • రాష్ట్రంలో ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ కనిపించలేదు.

  • రాష్ట్రంలో రాచరిక వ్యవస్థ నడుస్తోంది..

  • ప్రజా సమస్యలను డైవర్షన్ చేయడం కోసం చంద్రబాబు తన అద్దె మైక్‌లను తెరపైకి తెస్తున్నారు.

  • మావిగన్ అంశాన్ని పక్కతోవ పట్టించడం కోసం రాధాకృష్ణతో తప్పుడు రాతలు రాయించారు.

  • మహిళలను కించపరిచే విధంగా చెత్త పలుకులో రాతలు రాయించారు..

  • సభ్య సమాజం తలదించుకునేలా రాధాకృష్ణ రాతలు రాశారు..

  • రాధాకృష్ణ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సమన్వయంతో వ్యవహరించాము.

  • రాధాకృష్ణ పై ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయలేదు..

  • పోలీసుల అధికారి పార్టీకి బానిసల్లా పనిచేస్తున్నారు..

  • రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలి..

  • కేసు నమోదు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.

  • పోలీసులు తీరుపై రాధాకృష్ణపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తాము.

గుంటూరు..

  • మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాజీ ఎంపీ కామెంట్స్...

  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సతీమణులు అవమానించిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి.

  • ఇప్పటికే 175 నియోజకవర్గాలలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం

  • ఇప్పటి వరకు రాధాకృష్ణపై ఒక కేసు కూడా నమోదు చేయలేదు

  • పోలీసులు రాధాకృష్ణపై కేసు నమోదు చేయకపోవడం సిగ్గుచేటు

  • అధికార పార్టీకి ఒకలా.. ప్రతిపక్ష పార్టీకి మరోలా పోలీసులు చట్టాన్ని అమలు చేస్తున్నారు

  • ఆంధ్రజ్యోతి అక్షరమే మా ఆయుధం అని చెప్పుకుంటుంది ఆంధ్రజ్యోతి తెలుగుదేశానికి ఆభరణం

  • వెంటనే ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలి

  • క్షమాపణ చెప్పని పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఏబీఎన్ క్లోజ్ అవుతుంది


వైఎస్సార్ జిల్లా

  • జిల్లా ఎస్పీని కలిసి ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు కోరిన వైఎస్సార్సీపీ నేతలు

  • జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు దాసరి సుధా, ఆకేపాటి అమర్‌నార్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

  • నేతల కామెంట్స్‌..

  • వైఎస్సార్‌సీపీ నేతలను నొటికొచ్చినట్లు మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న నేతలు

  • ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా కనీసం పోలీసు శాఖ స్పందించడం లేదు.

  • ఆయన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి.

  • వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్

  • చిన్న సోషల్ మీడియా పోస్టులకే కేసులు కడుతున్న ప్రభుత్వం..

  • రాధాకృష్ణపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించిన నేతలు


విజయవాడ..

  • ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కామెంట్స్‌

  • రాధాకృష్ణ బూతు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం

  • కానీ ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు

  • వైఎ‍స్సార్‌సీపీ వాళ్లు కేకు కోసినా.. మేక కోసినా కేసులు పెడుతున్నారు

  • మాపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు

  • మా ఇంట్లో మహిళలపై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు

  • మేం ఇచ్చే వినతిపత్రం తీసుకోవడానికి కూడా పోలీసులు భయపడుతున్నారు

  • మా వినతిపత్రం తీసుకోవడానికి సీపీ, డీసీపీ భయపడిపోతున్నారు

  • మహిళలంటే గౌరవం ఉంటే చంద్రబాబు, లోకేష్, రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి

  • పోలీసులు మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలి

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్‌..

  • పోలీసులు మా దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీసులు భయపడుతున్నారు

  • చంద్రబాబు, టీడీపీ నేతల ఇళ్లలో ఉన్నవారే మహిళలా?.

  • మా ఇంట్లో వారు మహిళలు కాదా.  

  • అంబటి రాంబాబును అరెస్ట్ చేసినపుడు ఉపయోగపడిన చట్టం రాధాకృష్ణకు వర్తించదా?.

  • రాధాకృష్ణను ఎందుకు అరెస్ట్ చేయరు


మాజీ మంత్రి జోగి రమేష్ కామెంట్స్‌..

  • ఏబీఎన్ ఒక బూతు ఛానల్

  • మా కుటుంబంలోని మహిళలను కించపరిచారు

  • చంద్రబాబు, లోకేష్, పవన్, బీజేపీ నేతలకు నాదొక సూటి ప్రశ్న

  • రాధాకృష్ణ మాట్లాడిన భాషను మీరు సమర్థిస్తున్నారా?

  • చంద్రబాబు.. నిన్ను అన్నారో లేదో తెలియని మాటలకు గుక్కపెట్టి ఏడ్చావుగా

  • రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఎందుకు ఖండించలేకపోయారు

  • మేం శాంతియుతంగా నిరసన చేయడానికి వెళ్తే దాడి చేశారని విమర్శించారు

  • చంద్రబాబు ఇదేనా నీ సంస్కారం

  • చంద్రబాబు ఎల్లవేళలా అధికారంలో ఉంటారనుకుంటున్నారా?.

  • రాధాకృష్ణ ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి

  • లేకపోతే ఏదో ఒకరోజు రాధాకృష్ణకు నడిరోడ్డుపై శిక్ష తప్పదు


మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్‌..

  • రాధాకృష్ణ పై చర్యలు తీసుకోవాలి

  • రాధాకృష్ణ తప్పు చేసినా చంద్రబాబు, లోకేష్, పవన్, టీడీపీ మంత్రులు సమర్థిస్తున్నారు

  • ఏ మొహం పెట్టుకుని మీరు రాధాకృష్ణ వ్యాఖ్యలు సమర్థిస్తారు

  • రాధాకృష్ణను చూసి చంద్రబాబు భయపడుతున్నాడు

  • ఎక్కడ తన గురించి పేపర్లో రాస్తాడోనని చంద్రబాబు భయపడుతున్నాడు

  • మహిళా బిల్లు వ్యతిరేకించిన ముఖ్యమంత్రితో ఢిల్లీలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు

  • మళ్లీ సిగ్గు లేకుండా మహిళా బిల్లు పై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెడతామంటున్నారు

  • ఇప్పటికైనా రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి

  • లేకపోతే పోలీసులు రాధాకృష్ణ పై కేసు నమోదు చేయాలి.


మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కామెంట్స్‌..

  • రాధాకృష్ణ పై ఫిర్యాదు తీసుకోవాలన్నా పోలీసులు భయపడుతున్నారు

  • ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది

  • ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయింది

  • తన కుటుంబ సభ్యులను ఏదో అన్నారని చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు

  • మీ ఇళ్లలో వారే మీకు మహిళలా?

  • మా ఇళ్లలో వారు మహిళలుగా కనిపించడం లేదా

  • తన తల్లిని ఏదో అన్నారని పవన్ పూనకం వచ్చినట్లు ఊగిపోయారు

  • ఇప్పుడు పవన్ ఏమైపోయారు?.

  • మహిళలంతా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.


విశాఖ..

  • వాసుపల్లి గణేష్ కుమార్ కామెంట్స్‌..

  • రాధాకృష్ణ ఒక బ్రోకర్.

  • ఇటు వంటి బ్రోకర్‌ను బొక్కలో వేయాలి.

  • చంద్రబాబు కొంతమంది పిచ్చి కుక్కలను తయారు చేస్తున్నారు..

  • చంద్రబాబు తయారు చేసిన పిచ్చి కుక్కలు ఇష్టానుసారంగా  మొరుగుతున్నాయి..

  • మావిగన్‌కు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది .

  • మావిగన్ నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం కొన్ని పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయి.
     

Advertisement
 
Advertisement
Advertisement