వాహనదారులకు గుడ్‌ న్యూస్‌, ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రద్దు | Centre Removes Excise Duty On Higher Ethanol Fuel, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

వాహనదారులకు గుడ్‌ న్యూస్‌, ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రద్దు

Jun 11 2026 11:07 AM | Updated on Jun 11 2026 2:31 PM

Centre Removes Excise Duty On Higher Ethanol Fuel check deets inside

సాక్షి, న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అధిక స్థాయిలో ఇథనాల్ కలిపిన పెట్రోల్‌కు ఎక్సైజ్ సుంకం నుండి మినహాయింపు నిచ్చింది. బధవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 22 శాతం నుండి 30 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్‌పై ఇకపై ఎలాంటి ఎక్సైజ్ సుంకం ఉండదు. భారతదేశ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం E20 లక్ష్యాన్ని చేరుకునే దశలో ఇదొక కీలక అడుగు. ఈ మినహాయింపు E22, E25, E27 , E30 వంటి ఇంధన రకాలకు వర్తిస్తుంది. E20 కి పైన ఉన్న ఇథనాల్ బ్లెండ్స్‌కు ఇంత పెద్ద వెసులు బాటు  కల్పించడం ఇదే తొలిసారి.

ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్న మూడో అతిపెద్ద దేశమైన ఇండియా, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, అలాగే దేశీయంగా తయారయ్యే స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించడం తోపాటు,  తన బయో ఫ్యూయల్ ప్రణాళికలను శరవేగంగా విస్తురిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

కాగా మిడిల్‌ ఈస్ట్‌ ఉద్రికత్తలు మళ్లీ రాజుకుంటున్న తరుణంలో భారతదేశం తన ముడి చమురు సరఫరా సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇథనాల్‌ను ఒక వ్యూహాత్మక సాధనంగా చూస్తోంది. ఈ క్రమంలోనే ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను, బయో డీజిల్‌ను ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రిటైల్ అవుట్‌లెట్లలో అమ్మే సాధారణ పెట్రోల్‌కు సంబంధించి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

ఇదీ చదవండి: ప్రతీ ఆదివారం రెండు బిర్యానీలు ఫ్రీ : అవాక్కయ్యారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement