పంజాబ్‌ పరీక్షలో అక్రమాలపై సీజేపీ పోరాటం | CJP to announce next strategy on Punjab paper leak, says Abhijeet Dipke | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ పరీక్షలో అక్రమాలపై సీజేపీ పోరాటం

Jul 27 2026 4:42 AM | Updated on Jul 27 2026 4:42 AM

CJP to announce next strategy on Punjab paper leak, says Abhijeet Dipke

సంకేతాలిచ్చిన సీజేపీ చీఫ్‌ దీప్కే  

న్యూఢిల్లీ: పేపర్‌ లీకేజీలకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ఆందోళన విజయవంతం కావడంతో ఆ పార్టీ తదుపరి కార్యాచరణపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పంజాబ్‌లో జరిగిన పరీక్షలో అక్రమాలపై పోరాటం చేపట్టాలని చాలామంది ఆ పార్టీని కోరుతున్నారు. దీనిపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే తాజాగా స్పందించారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. జంతర్‌మంతర్‌ వద్ద పోరాటం నిన్ననే ముగిసింది కాబట్టి తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. తదుపరి పోరాటం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

 ఢిల్లీలో విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఏ ఒక్క విద్యార్థిపైనా కేసులు నమోదు చేయకూడదని తేల్చిచెప్పారు. పంజాబ్‌లో 454 మంది ఫార్మసీ అధికారుల నియామకం కోసం బాబా ఫరీద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ జూలై 19న నిర్వహించిన పరీక్షలో వ్యవస్థీకృత పద్ధతిలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం భగవంత్‌ మాన్‌ సమాధానం చెప్పాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement