breaking news
Cockroach Janta Party
-
రూ.8,452 కోట్ల పీఎంకేర్స్.. బడుల కోసం మళ్లించాలా?
కరోనా మహమ్మారి సమయంలో అత్యవసర సహాయ చర్యల కోసం ఏర్పాటు చేసిన పీఎంకేర్స్ ఫండ్ మరోసారి చర్చలోకి వచ్చింది. ఫండ్‌లో రూ.8,452 కోట్లకు పైగా నిధులు నిల్వ ఉన్నట్లు తాజా ఆడిట్ వివరాలు వెల్లడించడంతో.. ఈ మొత్తాన్ని ఎక్కడ, ఎలా వినియోగించాలనే అంశంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా గ్రామీణ పాఠశాలల అభివృద్ధికి ఈ నిధులను ఉపయోగించాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేసిన డిమాండ్ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.యువత తనకు అండగా నిలిస్తేనే ‘వికసిత్ భారత్’ లక్ష్యం సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు. యువత కలలను సాకారం చేసేందుకు అవసరమైన అవకాశాలు, వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే.. దేశ భవిష్యత్‌కు కీలకమైన విద్యారంగం, ముఖ్యంగా గ్రామీణ పాఠశాలల అభివృద్ధికి పీఎంకేర్స్ నిధులను వినియోగించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. పీఎంకేర్స్ నిధులు ఎంత పెరిగాయి?.. 2020లో కోవిడ్ సంక్షోభ సమయంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంకేర్స్ (Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Situations) ఫండ్‌ను ఏర్పాటు చేసింది. తాజా ఆడిట్ నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ ఫండ్‌లో రూ.8,452 కోట్లకు పైగా నిధులు ఉన్నాయి.తాజా ఆడిట్ నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పీఎంకేర్స్ ఫండ్ నుంచి మొత్తం చెల్లింపులు కేవలం రూ.87.85 లక్షలుగా ఉన్నాయి. ఇందులో రూ.87.84 లక్షలు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సహాయం అందించే పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కోసం ఖర్చయ్యాయి. మిగిలిన మొత్తం బ్యాంకు తదితర చిన్న ఖర్చులకు వెళ్లినట్లు వివరాలు వెల్లడించాయి.అంతకుముందు ఏడాది రూ.7,173 కోట్లుగా ఉన్న నిల్వ.. ఏడాదిలో దాదాపు 17.8 శాతం పెరిగింది. ఇందులో సుమారు రూ.7,846 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉండగా.. మిగిలిన మొత్తం బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అయితే నిధులు పెరిగినప్పటికీ.. విరాళాల రూపంలో వచ్చే ఆదాయం మాత్రం తగ్గింది. 2024-25లో దేశీయ విరాళాలు రూ.479 కోట్లకు పడిపోయాయి. విదేశీ విరాళాలు కూడా తగ్గినట్లు వివరాలు చెబుతున్నాయి. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ ఫండ్‌కు ప్రధాన ఆదాయంగా మారింది.సీజేపీ డిమాండ్ ఏంటి?పీఎంకేర్స్‌లో వేల కోట్ల రూపాయలు నిల్వగా ఉన్నప్పటికీ.. దేశంలోని గ్రామీణ పాఠశాలలు కనీస సదుపాయాల కోసం ఇబ్బందులు పడుతున్నాయని కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్కే ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లేందుకు రోడ్లు, తరగతి గదుల్లో బెంచీలు, తాగునీరు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేని పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని ఎత్తిచూపుతూ సీజేపీ ఇప్పటికే ‘స్కూల్ ఠీక్ కరో’ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించింది. గ్రామీణ బడుల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆరోపిస్తూ.. పాఠశాలల పరిస్థితిని పరిశీలించడం, సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారం కోసం స్థానిక ప్రజాప్రతినిధులను ఒత్తిడి చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా సీజేపీ చెబుతోంది.‘‘ఒకవైపు పాఠశాలలకు నిధుల కొరత ఉందని చెబుతున్నారు.. మరోవైపు రూ.8,500 కోట్లు పీఎంకేర్స్‌లో ఉపయోగం లేకుండా ఉన్నాయి. ఈ డబ్బును పిల్లల భవిష్యత్తు కోసం ఎందుకు వినియోగించకూడదు?’’ అని ఆయన ప్రశ్నించారు. ఒక మోడల్ హైటెక్ పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.8 కోట్లు ఖర్చవుతుందని లెక్కిస్తే.. ఈ మొత్తంతో వెయ్యికి పైగా ఆధునిక పాఠశాలలు నిర్మించవచ్చని ఆయన చెప్పారు.పీఎంకేర్స్పై వచ్చిన ఆరోపణలు ఏంటి?పీఎంకేర్స్ ఏర్పాటు అయినప్పటి నుంచే ఈ ఫండ్ పారదర్శకతపై ప్రతిపక్షాలు, కొన్ని పౌరసంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రధానంగా ఈ అంశాలపై విమర్శలు వచ్చాయి:ఆర్టీఐ పరిధిలోకి ఎందుకు రావడం లేదు?పీఎంకేర్స్ నిధులు ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరిస్తున్నప్పటికీ.. ఇది సమాచార హక్కు చట్టం (RTI) పరిధిలోకి రాదని ప్రభుత్వం చెబుతోంది. దీంతో నిధుల సేకరణ, ఖర్చుల వివరాలపై పూర్తి సమాచారం ప్రజలకు అందుబాటులో లేదని విమర్శలు వచ్చాయి.కాగ్ ఆడిట్ ఎందుకు లేదు?ప్రతిపక్షాలు పీఎంకేర్స్‌ను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ఆడిట్ చేయాలని డిమాండ్ చేశాయి. అయితే ఇది ప్రభుత్వ నిధులతో కాకుండా స్వచ్ఛంద విరాళాలతో నడిచే ట్రస్ట్ కావడంతో కాగ్ పరిధిలోకి రాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.నిధులు ఎందుకు ఎక్కువగా నిల్వ ఉన్నాయి?రూ.8,452 కోట్లలో ఎక్కువ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉండటంపై కూడా విమర్శలు వచ్చాయి. అత్యవసర సహాయం కోసం ఏర్పాటైన ఫండ్‌లో ఇంత పెద్ద మొత్తం వినియోగం లేకుండా ఉండటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.‘‘అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన నిధిలో వేల కోట్ల రూపాయలు ఉండగా.. వినియోగం ఎందుకు తక్కువగా ఉంది?’’ అనేది చాలా మంది అడిగేది. మరోవైపు ప్రభుత్వం మాత్రం.. పీఎంకేర్స్ అనేది అత్యవసర పరిస్థితుల కోసం ఉద్దేశించిన స్వచ్ఛంద విరాళాల ట్రస్ట్ అని, అవసరమైన సందర్భాల్లో ఉపయోగించేందుకు నిధులు అందుబాటులో ఉండాలని చెబుతోంది.ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయి?పీఎంకేర్స్ ఒక స్వతంత్ర ట్రస్ట్ అని, దీనికి ఎలాంటి బడ్జెట్ నిధులు కేటాయించరని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు, సంస్థలు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలతో ఇది నడుస్తుందని పేర్కొంటున్నాయి. కరోనా సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, వెంటిలేటర్ల కొనుగోలు, అత్యవసర వైద్య సదుపాయాల కోసం ఈ నిధులను ఉపయోగించినట్లు ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. భవిష్యత్తులో వచ్చే విపత్తులు, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకు నిధులను నిల్వ ఉంచాల్సిన అవసరం ఉందని వాదిస్తోంది. అయితే..సీజేపీ డిమాండ్‌కు ప్రజల్లో కొంత మద్దతు కనిపిస్తున్నప్పటికీ.. ఆచరణలో ఇది అంత సులభం కాదన్నది ప్రభుత్వ వర్గాల మాట. పీఎంకేర్స్ ఏర్పాటు చేసిన లక్ష్యాలు అత్యవసర సహాయానికి సంబంధించినవి కావడంతో.. నిధులను విద్యా రంగానికి మళ్లించాలంటే ట్రస్ట్ నిబంధనలు, చట్టపరమైన అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే దేశంలో పాఠశాలల మౌలిక వసతుల సమస్యలు ఉన్న నేపథ్యంలో.. ఇలాంటి భారీ నిధులను ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే రంగాల్లో వినియోగించాలనే డిమాండ్ మాత్రం కొనసాగుతోంది.అసలు ప్రశ్న ఏంటి?పీఎంకేర్స్ విషయంలో ఇప్పుడు రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు.. విపత్తుల సమయంలో వెంటనే ఉపయోగించుకునేలా భారీ నిధి ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు.. ప్రజల విరాళాలతో ఏర్పడిన వేల కోట్ల నిధులు మరింత పారదర్శకంగా ఉండాలని, అవసరమైన రంగాలకు ఉపయోగపడాలని విమర్శకులు కోరుతున్నారు.రూ.8,452 కోట్ల పీఎంకేర్స్ నిధి.. కేవలం ఓ ఆర్థిక గణాంకం మాత్రమే కాదు. అత్యవసర నిధి లక్ష్యం, ప్రజా ప్రయోజనం, పారదర్శకత మధ్య సమతుల్యతపై జరుగుతున్న పెద్ద చర్చకు ఇది కేంద్ర బిందువుగా మారింది. -
పీఎంకేర్స్ నిధులు బడులకు ఉపయోగించండి
న్యూఢిల్లీ: కోవిడ్ సమయంలో ఏర్పాటైన పీఎంకేర్స్ ఫండ్‌లో మూలుగుతున్న డబ్బులను దేశంలో గ్రామీణ పాఠశాలల మౌలిక వసతుల బాగుకు ఉపయోగించాలని కాక్రోచ్ జనతాపార్టీ కన్వీనర్ అభిజిత్ దీప్కే సూచించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా వెయ్యి హైటెక్ పాఠశాలల నిర్మాణానికీ ఈ నిధులు వాడవచ్చునని ఆయన బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. సీజేపీ ఆధ్వర్యంలో ఇప్పటికే ‘స్కూల్ ఠీక్ కరో’ పేరుతో గ్రామీణ పాఠశాలల బాగు డిమాండ్ చేస్తూ ఒక కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంత విద్యార్థులు బడికెళ్లేందుకు మంచి రోడ్లు, తరగతి గదుల్లో బెంచిలు, తాగునీరు కోసం ఎదురు చూస్తున్నారని దీప్కే ఆ వీడియోలో చెప్పారు. ‘‘ఒక పక్క పీఎంకేర్స్ ఫండ్‌లో రూ.8500 కోట్లు నిరుపయోగంగా పడిఉన్నాయి. ఇంకోపక్క ఈ దేశపు బాలలు పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ డబ్బులను వారి కోసం ఎందుకు ఖర్చు చేయకూడదు?’’ అని ప్రశ్నించారు. అన్ని రకాల సౌకర్యాలు, హంగులతో ఒక పాఠశాల కట్టేందుకు సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు అవుతుందని అనుకుంటే పీఎంకేర్స్‌లో ఏడాదికాలంగా పడి ఉన్న డబ్బుతో వెయ్యికిపైగా హైటెక్ స్కూళ్లు కట్టవచ్చునని, కానీ అలాంటిదేమీ జరగడం లేదని అన్నారు. దేశ ప్రజలు కూడా ఈ డబ్బులను పాఠశాలల బాగుకు వాడేలా ప్రధానికి తెలియజేయాలని దీప్కే విన్నవించారు. ప్రధాని కూడా తాను ప్రజలను పట్టించుకుంటున్నట్లు కనిపించాలని విమర్శించారు. -
విజయ్ సర్కార్ యూటర్న్.. వివాదాస్పద ఉత్తర్వులు వెనక్కి
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సంబంధించిన వివాదాస్పద జీవోను.. బుధవారం వెనక్కి తీసుకుంది. లెఫ్ట్ పార్టీలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో విద్యార్థులు, యువత పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలంటూ అంతకు ముందు జారీ చేసిన జీవోలో దుమారం రేపింది. ఆగస్టు 14న విజయ్ ప్రభుత్వం పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలకు ఓ ఉత్తర్వు జారీ చేసింది. అందులో.. లెఫ్ట్ పార్టీలతో పాటు సీపీజే నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనాలనే ఆసక్తికి విద్యార్థులు, యువత ‘లోనుకాకుండా’ చర్యలు తీసుకోవాలని పాఠశాలలు, కళాశాలలకు సూచించింది. ఇందుకోసం పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. అంతేకాదు.. తీసుకున్న చర్యలపై ఆగస్టు 20లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కూడా స్పష్టం చేసింది.దేశవ్యాప్తంగా విద్యార్థి ఆందోళనలుఇటీవల పరీక్షలు, విద్యా సంబంధిత అంశాలపై దేశవ్యాప్తంగా జెన్‌జెడ్, జెన్ఆల్ఫా విద్యార్థుల నిరసనలు పెరుగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీపీజే ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి ఉద్యమం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు యువత పోరాటాలకు మద్దతుగా మాట్లాడిన సీఎం విజయ్.. మొన్న స్వాతంత్ర్య దినోత్సవంలోనూ వణక్కం జెన్‌జీ అంటూ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువత నిరసనల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వం అంతకు ఒక్కరోజు ముందు ఈ ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.సీజేపీ తీవ్ర అభ్యంతరం.. ఆగ్రహంఈ ఉత్తర్వులపై సీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ జాతీయ సహ కన్వీనర్ సౌరవ్ దాస్.. విజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా అభివర్ణించారు. విద్యార్థులు, యువత తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకోకుండా అడ్డుకోవడం అర్థరహితమైన, అహేతుకమైన చర్య అని విమర్శించారు. అయితే బీజేపీ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. సీజేపీ, లెఫ్ట్ పార్టీలను ‘అరాచకానికి ఏజెంట్లు’గా బీజేపీ నేత వినోజ్ పి. సెల్వం అభివర్ణించారు.విజయ్ ప్రభుత్వానికి లెఫ్ట్ మద్దతు..మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం కోసం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు జూన్‌లో లెఫ్ట్ పార్టీలు బేషరతుగా బయటి నుంచి మద్దతు ప్రకటించాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి దూరంగా నిలిచింది. దీంతో కాంగ్రెస్, వీసీకే వంటి చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొంది.ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన లెఫ్ట్ పార్టీల ఆందోళనలకూ విద్యార్థులు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం రాజకీయంగానూ చర్చకు దారితీసింది. ఈ ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.విద్యార్థులు, యువత నిరసనల్లో పాల్గొనే హక్కు, వారిని రాజకీయ ఆందోళనలకు దూరంగా ఉంచే ప్రయత్నాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. వివాదాస్పద ఉత్తర్వులను విజయ్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం తాజా రాజకీయ పరిణామంగా మారింది.ఇటు సీపీజే పేరుపైనా వివాదంఇదిలా ఉండగా.. తమిళనాడులో కాక్రోచ్ జనతా పార్టీ పేరు పైనా వివాదం నడుస్తోంది. ఆ పేరుతో ఓ ప్రాంతీయ రాజకీయ పార్టీని నమోదు చేయాలని న్యాయవాది సి. బ్రహ్మ బాలసుబ్రమణియం నేతృత్వంలోని బృందం జూన్‌లో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. అయితే ఆ సంస్థ.. అభిజిత్ దీప్కేకు చెందిన సీపీజేకు భిన్నమైనదని బ్రహ్మ బాలసుబ్రమణియం వాదిస్తున్నారు. అయితే సీజేపీ మాత్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. -
కేసులను ఎత్తేయాల్సిందే
న్యూఢిల్లీ: చలో సంసద్ ర్యాలీ సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తత వేళ విద్యార్థులపై పోలీసులు మోపిన కేసులను రద్దుచేసేందుకు సుప్రీంకోర్టు సానుకూలత వ్యక్తంచేసినా అందుకు మోదీ ప్రభుత్వం సముఖంగా లేదని కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘జూలై 25న సీజేపీకి మోదీ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే. విద్యార్థులపై కేసులు ఎత్తేయాలి. ఈ దిశలో ఆలోచనచేసిన సుప్రీంకోర్టు ఎదుట ప్రభుత్వం మోకాలడ్డొద్దు. అలా చేస్తే సీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ రెండ్రోజుల్లో సమావేశమై మళ్లీ జాతీయస్థాయి ఉద్యమానికి రంగం సిద్ధంచేస్తుంది’’అని ఆయన హెచ్చరించారు. ‘‘విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ల జాబితా ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరితే ప్రభుత్వం ఆ జాబితాను ఉద్దేశపూర్వకంగా అందజేయలేదు. జాబితా ఇస్తే ఆ కేసులన్నింటినీ 142వ అధికరణం ద్వారా దఖలుపడిన అధికారం ద్వారా రద్దుచేస్తామని కోర్టు మంగళవారం మూడు సార్లు గుర్తుచేసి, జాబితా అడిగినా ప్రభుత్వం సమర్పించలేదు. ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయాలకు తగ్గట్లే దీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇద్దరు కేంద్ర మంత్రులు మాట ఇచ్చి తప్పారు. యావత్ భారత దేశ యువత నమ్మకంతో ఆటలాడతామంటే మేం చూస్తూ ఊరుకోం. ఇకనైనా కోర్టు నియమించిన హైపవర్ కమిటీలో సీజేపీకి ప్రాతినిధ్యం ఇవ్వాలి. పోలీసుల దారుణాలను వివరించే అవకాశం ఇవ్వాలి’’అని దాస్ కోరారు. -
సరైన దారిలో 'కాక్రోచ్ సీజన్ 2'
దేశం ఈ నెల 15న 80వ స్వాతంత్య్ర సంవత్సరంలోకి ప్రవేశించిన వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఒక అపూర్వమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాని పేరు ‘స్కూల్స్ ఠీక్ కరో’, లేదా ‘ఫిక్స్ రూరల్ గవర్నమెంట్ స్కూల్స్’. సీజేపీ ఉద్యమం మొదలైందే విద్యారంగ సమస్యలపై. ఈ దేశ భవిష్యత్తు ఆధారపడింది విద్యా వ్యవస్థపై అనీ, అది పేదలకూ, గ్రామీణులకూ అందుబాటులో లేకుండా పోయిందనీ, కనుక ఈ సమస్యపై మొత్తం దేశాన్ని కదిలించేందుకు ప్రయత్నించగలమనీ నిర్వాహకులు ప్రకటిస్తున్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో మొదటి రెండు రోజులపాటు జరిగిన కార్యక్రమాల వీడియోలు, వార్తలు అందుబాటులోకి వస్తున్నాయి. సీజేపీ వ్యవస్థాపకుడైన అభిజీత్ దీప్కే తన స్వస్థలమైన ఛత్రపతి శంభాజీ నగర్‌లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లల మధ్య కూర్చుని, వివిధ సౌకర్యాలు, బోధనా పరిస్థితుల గురించి వారిని చిన్న చిన్న ప్రశ్నలు వారి మాతృభాష మరాఠీలో అడుగుతూ నోట్స్ రాసుకోవటం కన్పించింది. ఆ పిల్లలు ఉత్సాహంగా చెప్తున్నారు. అదే రోజున సీజేపీ ఇతర బాధ్యులు, ఇంకా వందలాది మంది కార్యకర్తలు వేర్వేరు రాష్ట్రాలలోని వేర్వేరు గ్రామాలలో అదే పని చేశారు. నూతన ఉద్యమ వాతావరణంగమనించదగిన విశేషం మరొకటి జరిగింది. జంతర్ మంతర్ ఉద్యమస్ఫూర్తితో అంతటా ఒక కొత్త వాతావరణం ఏర్పడినందున, అనేకచోట్ల సీజేపీ బాధ్యులెవరూ లేకుండానే బడిపిల్లలు ఈ ‘స్కూల్స్ ఠీక్ కరో’ కార్యక్రమం గురించి విని, తమంతట తామే తమ బడులలో వివిధ సౌకర్యాల లేమిపై పాఠశాల పెద్దలనే కాక, సమీపాన గల ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లి ప్రశ్నించటం కనిపించింది. ఇదే చైతన్యం దేశమంతటా వ్యాపిస్తే? వ్యాపింపజేయటమే జంతర్ మంతర్ తర్వాత తమ తదుపరి కార్యక్రమమని సీజేపీ ప్రకటించింది. దానిని ‘సీజన్–2’ ఉద్యమ మంటున్నది. అందులో భాగంగా చేపట్టే కార్యక్రమం కోసం ఒక ఫారాన్ని తమ వెబ్సైట్లో పెట్టింది. దాని ద్వారా ఎవరైనా సభ్యు లుగా చేరి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. యథాతథంగా కార్యక్రమంలో చేయవలసిన పనులు మూడు విధాలు. ఒకటి– మంచినీళ్ళు, టాయిలెట్ సౌకర్యాల పరిస్థితి.రెండు– విద్యుత్తు, తరగతి గదులు, వాటి భద్రత. మూడు– ప్రహరీ గోడలు, భద్రత. ఇదంతా మొదటి విధమైన పని. రెండవ విధమైన దానిలో కార్యకర్తలు లైట్లు, ఫ్యాన్లతో సహా వీట న్నింటిని ఫొటోలు, వీడియోలు తీయాలి. అగ్నిమాపక సిలిండర్లు ఉన్నాయో లేదో చూడాలి. మూడవ విధమైన పని ఈ వివరాలన్నీ అధికారులకు అందజేయటంతో పాటు, సీజేపీ అడ్రసుకు అప్లోడ్ చేయాలి. మన దేశం స్వతంత్రమైనప్పటినుంచి విద్యారంగానికి సంబంధించి ఆధా రాలతో అధికారులను ఒత్తిడి చేయటం వంటి కార్యక్రమం దేశ వ్యాప్తంగా ఎన్నడూ జరగలేదు. గమనించదగిన మరొకటి, నెహ్రూ కాలంలోనూ ఉన్నత విద్యపై తప్ప గ్రామీణ విద్యపై, ప్రాథమిక విద్యపై తగిన శ్రద్ధ చూపలేదు.అయినా అణచివేతలా?సీజేపీ కార్యక్రమం ఏ విధంగా సాగి ఎటువంటి ప్రభావాలు చూపగలదో ఇప్పుడే చెప్పలేము. విద్యారంగానికి సంబంధించి వారి అవగాహనలు, ఆలోచనలు, లేవనెత్తుతున్న ప్రశ్నలు, తలపెట్టిన కార్యక్రమాలు మాత్రం సమగ్రంగా కనిపిస్తున్నాయి. వాటిలో లోతు, దూరదృష్టి ఉన్నాయి. విద్యార్థి లోకంలో, వారి తండ్రులలో, సమా జంలో, ఆలోచనాపరులలో మద్దతు పెరుగుతున్నది. మరొక విషయం, ఆ నిర్వాహకులపై, వారి కార్యక్రమాలపై వ్యతిరేకత, అణచివేత చర్యలు జంతర్ మంతర్ దశ తర్వాత కూడా కొనసాగు తుండటం. ఉదాహరణకు, తమ ‘స్కూల్స్ ఠీక్ కరో’ కార్యక్రమ ప్రకటనకు ఢిల్లీలో కార్యకర్తల సమావేశాన్ని జరపచూడగా, అందు కోసం హాలును ఇవ్వకుండా యజమానులను బెదిరించారు. చివరకు ఒక పార్కులో సమావేశమవుతుండగా పోలీసులను పంపి గేట్లకు తాళాలు వేశారు. గట్టిగా ప్రశ్నించిన మీదటగానీ తెరవలేదు. ఇటువంటి నిర్హేతుకతలు, అణచివేతల ప్రభావం, దేశమంతటా ఇప్పటికే జంతర్‌మంతర్ సృష్టించిన ప్రభావాలను మరెంత పెంచు తుందో అధికారంలో గల వారికి అర్థం కావటం లేదు. జంతర్ మంతర్ దరిమిలా స్వయంగా ప్రధాని మోదీ, ఆరెస్సెస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ విద్యారంగం గురించీ, యువ తరం అసంతృప్తి న్యాయబద్ధం కావటం గురించీ చెప్పిన మాటలను గమనించినప్పుడు, ఈ అణచివేతలు విచిత్రంగా తోస్తాయి.ప్రభుత్వ విద్యారంగం బాగుపడక ప్రైవేట్ రంగం మాత్రమే వర్ధిల్లినంత కాలం సాధారణ కుటుంబాల పిల్లలు చదువులో ముందుకుపోలేరు. అందువల్ల వారికేగాక దేశానికి కూడా నష్టమే. కనుక విద్యారంగానికి బడ్జెట్లను జీడీపీలో ఆరు శాతానికే కాదు,అంతకు మించి పెంచాలి. నివేదికలను అమలుపరచాలి. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని వసతులు కల్పించి విద్యాబోధనను మెరుగుపర చాలి. ఈ దిశలో తమ తొలి దశ కార్యక్రమాన్ని ఆరు మాసాలపాటు సాగి స్తారు. ఇది క్రమంగా ఊపందుకుని దేశవ్యాప్తమైన కొద్దీ కొత్త పరిస్థితులను చూడగలమని ఆశించవచ్చు. వారు మూతపడిన 94 వేల స్కూళ్ల గురించి కూడా ప్రశ్నిస్తున్నందున వాటిని తిరిగి తెరవటం, ఇక ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మూసివేత లను కొనసాగించకపోవటం కూడా జరుగుతుందని ఆశించాలి.క్యా బోల్తీ పబ్లిక్?పోతే, కాక్రోచ్ సీజన్ 2 సరైన మార్గంలో ముందుకు సాగుతున్న సూచనలు ఇతరత్రా కూడా ఉన్నాయి. వారి కోర్ కమిటీ ఈ నెల మొదటి వారంలో రెండు రోజులపాటు చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. తాము విద్యతో పాటు ప్రజలకు సంబంధించిన ఇతర సమస్యలపై ప్రభుత్వాలను ఒత్తిడి చేసే ఉద్యమంగానే ఉంటాము తప్ప రాజకీయాలలోకి ప్రవేశించబోమన్న అంతకుముందటి వైఖరినే పునరుద్ఘాటించటం వాటిలో మొదటిది. అందువల్ల వారి విశ్వసనీయత పెరిగి, పునాది స్థిరపడి విస్తరిస్తుంది. అదే సమావేశంలో సంస్థ బాధ్యుల టీమ్‌ను ప్రకటించటంతోపాటు, దేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి నలుగురు ఇన్ఛార్జ్లను నియమించుకున్నారు. కార్యాచరణకు సంబంధించి, ఈ సెప్టెంబర్ నుంచి, దేశమంతటా పర్యటనలు జరిపి ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరిట అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలూ, ఆలోచనలేమిటి? ఏమి జరగాలనుకుంటున్నారు? అనేవి తెలుసుకోవటం; దాని ఆధారంగా భవిష్యత్తు అజెండాలను, కార్యాచరణను రూపొందించటం.ఎంతో సంయమనంతో, ప్రజాస్వామికంగా, శాంతియుతంగా ప్రజలతో సమన్వయమవుతూ ముందుకు సాగేందుకు సీజేపీ ప్రయత్నిస్తున్న తీరును, అందుకు సమాజంలో కనిపిస్తున్న సానుకూలతలను గమనించినప్పుడు, మన దేశపు 80వ స్వాతంత్య్ర సంవత్సరంలో కొత్త గాలులు మొదలుకానున్నాయా అనే సూచనలు కనిపిస్తున్నాయి. స్వాతంత్య్రానంతర దేశం 1991 నాటి ఆర్థిక సంస్కరణలతో ఒక కొత్త మలుపు తిరగగా, ఈ 2026లో మరొక మలుపు తిరిగే అవకాశమున్నదా? ఈ ప్రశ్నలు ఇప్పటికే ఆలోచనా పరుల మెదళ్లకు మేతగా మారాయి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
రెండో ఉద్యమం మొదలు పెట్టిన సీజేపీకి బిగ్ షాక్.. ఒకరి మృతి
న్యూఢిల్లీ: ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమం చేపట్టిన రెండో రోజే సీజేపీకి భారీ షాక్ తగిలింది. పాఠశాల సమస్యలను అందరి దృష్టికి తీసుకురావాలనుకున్న సీజేపీ మద్దతుదారుడి తండ్రిని కొందరు కొట్టి చంపారు. పశ్చిమ బెంగాల్‌లోని బంకురాకు చెందిన కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారుడి తండ్రి ఆగస్టు 15న మృతి చెందారు. సీజీపీ చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారంలో భాగంగా తన చిన్నతనంలో చదువుకున్న పాఠశాల పరిస్థితులను అతడి కుమారుడు వీడియో తీసినందుకు ఆగ్రహించిన కొందరు వ్యక్తులు ఇంట్లోనే ఆయనపై దాడి చేశారని పోలీసులు, కుటుంబ సభ్యులు ఆదివారం జాతీయ మీడియాకు తెలిపారు.మృతుడి కుమారుడి పేరు అబ్దుల్ హఫీజ్. దాడికి బీజేపీ కార్యకర్తలే కారణమని ఆరోపించిన అబ్దుల్ హఫీజ్.. దాడిలో గాయపడిన తన తండ్రి బంకురాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. “ఈ బీజేపీ స్థానిక నేతలు దారుణంగా దాడి చేసిన తర్వాత నా తండ్రి శనివారం మృతి చెందారు” అని హఫీజ్ చెప్పారు.బంకురా ఎస్పీ వీజీ సతీష్ పసుమర్తి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. “హఫీజ్ తల్లి ఫిర్యాదు చేసేందుకు వస్తున్నట్లు మాకు సమాచారం అందింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని చెప్పారు.ఇదిలా ఉండగా, తమ కార్యకర్తలకు ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు తేలి, వారిపై పేర్లతో పోలీసులకు ఫిర్యాదు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ తెలిపింది.“అయితే, టీఎంసీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి సామాజిక తనిఖీ చేసే ధైర్యం చేశారా? కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీని చెడుగా చూపించేందుకు టీఎంసీ, వామపక్షాలు చేస్తున్న పద్ధతి ఇది మాత్రమే” అని బీజేపీ బెంగాల్ అధికార ప్రతినిధి కేయా ఘోష్ చెప్పారు.జంతర్ మంతర్‌లో జరిగిన సీజీపీ నిరసనల్లో కూడా పాల్గొన్న హఫీజ్.. పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు సామాజిక తనిఖీలో భాగస్వామి కావాలని అనుకున్నట్లు తెలిపారు. తాను చదువుకున్న కరిసుంద ప్రాథమిక విద్యాలయానికి వెళ్లి కొన్ని వీడియోలు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చానని చెప్పారు.రాత్రి 8 గంటల సమయానికి కొందరు వ్యక్తులు తన ఇంటికి వచ్చి చుట్టుముట్టారని, తనపై కూడా దాడి చేయడంతో పాటు వృద్ధుడైన తన తండ్రిని కొట్టారని హఫీజ్ తెలిపారు. తన ఫోన్‌ను లాక్కుని, పాఠశాలకు సంబంధించిన వీడియోలు, జంతర్ మంతర్‌లో తాను తీసిన వీడియోలను తొలగించాలని బలవంతం చేశారని చెప్పారు.నా రక్తం మరిగిపోతోంది: దీప్కేఅబ్దుల్కు కాక్రోచ్ జనతా పార్టీ (సీజీపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అబ్దుల్‌కు మద్దతు తెలిపారు. అతడి తండ్రి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై మాట్లాడిన తర్వాత అబ్దుల్ ఆ పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లారని దీప్కే ఎక్స్‌లో చేసిన పోస్టులో తెలిపారు. అబ్దుల్, ఆయన కుటుంబంపై బీజేపీతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు దాడి చేసిన తర్వాత ఆయన తండ్రి హత్యకు గురయ్యారని దీప్కే ఆరోపించారు.“మెరుగైన పాఠశాలలు కావాలని డిమాండ్ చేసినందుకు ప్రజలను హత్య చేస్తున్నారంటే నా రక్తం మరిగిపోతోంది” అని దీప్కే పోస్టులో పేర్కొన్నారు. సీజీపీ బృందం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి అబ్దుల్, ఆయన కుటుంబంతో కలిసి న్యాయం కోసం పోరాడుతుందని దీప్కే తెలిపారు. బెదిరింపులు, భయపెట్టే ప్రయత్నాలు ఎదురైనా.. మెరుగైన ప్రభుత్వ పాఠశాలల కోసం తమ ప్రచారాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ ప్రాథమిక సదుపాయాల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతున్న ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారాన్ని దీప్కే ప్రారంభించిన తర్వాత ఆయన ఈ పోస్టు చేశారు. -
పిరికిపందలు.. మా గొంతు నొక్కాలని చూశారు: దీప్కే సంచలన వ్యాఖ్యలు
ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం సంచలన ఆరోపణలు చేశారు. సీజేపీ ఉద్యమానికి సంబంధించిన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను మెటా తొలగించిందని ఆయన ఆరోపించారు. ఖాతా అందుబాటులో లేదని చూపిస్తున్న స్క్రీన్షాట్లను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఈ సందర్భంగా అభిజీత్ దీప్కే ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌ను తొలగించారు. పిరికిపందలు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన షేర్ చేసిన స్క్రీన్షాట్లలో సీజేపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీ అందుబాటులో లేదని, ‘User not found’ అనే సందేశం కనిపించింది. దీంతో మెటానే తమ ఖాతాను తొలగించిందని ఆయన ఆరోపించారు.ఈ పరిణామంపై సీజేపీ అధికారిక ఎక్స్ ఖాతా కూడా స్పందించింది. తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌ను ఉదయం తొలగించారని, అయితే కొద్దిసేపటికే ఖాతాను విజయవంతంగా తిరిగి పొందామని వెల్లడించింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజునే తమ గొంతును నొక్కేందుకు ప్రయత్నించారని పార్టీ ఆరోపించింది. తమను వ్యతిరేకించే వారు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించింది. ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేసింది. అయితే సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతా తాత్కాలికంగా ఎందుకు అందుబాటులో లేకుండా పోయిందనే విషయంపై మెటా నుంచి అధికారిక వివరణ వెలువడినట్లు సమాచారం లేదు.🚨CJP Instagram handle was taken down this morning 🚨But we have been able to successfully recover the account. What a shame that those who oppose CJP chose India’s Independence Day to try to muzzle our voice. We will not be intimidated by such cowardly acts! ✊ https://t.co/Wz3rhExHpu— Cockroach Janta Party - CJP (@Cockroachisback) August 15, 2026అభిజీత్ దీప్కే సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన వివాదం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మేలో తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని ఆయన ఆరోపించారు. తన ఖాతాలోకి ప్రవేశించలేకపోతున్నానని, తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదని అప్పట్లో ఎక్స్‌లో పేర్కొన్నారు. సీజేపీ కోసం ఉపయోగిస్తున్న బ్యాకప్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా మెటా తొలగించిందని ఆయన ఆరోపించారు.‘స్కూల్ ఠీక్ కరో’ ఇదిలా ఉండగా, గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో సీజేపీ ‘స్కూల్ ఠీక్ కరో’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలోని దీప్కే స్వగ్రామం సంతుక్ పింప్రిలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. శనివారం ఉదయం ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. తన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను మరమ్మతులు చేయించి, విద్యార్థులకు బెంచీలు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని సర్పంచ్‌ను కోరనున్నట్లు దీప్కే తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇతర గ్రామాలకూ విస్తరించేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామస్థులు, సర్పంచ్ల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుతున్న పాఠశాలలను స్వయంగా సందర్శించి, అక్కడ ఏవైనా సౌకర్యాల కొరత ఉంటే CJPకి సమాచారం ఇవ్వాలని దీప్కే పిలుపునిచ్చారు. దీంతో సోషల్ మీడియా ఖాతా వివాదం మధ్యే గ్రామీణ పాఠశాలల సమస్యలపై ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లేందుకు CJP సిద్ధమవుతోంది. -
‘‘అనని మాటలూ అన్నట్టు చూపించారు’’
న్యూఢిల్లీ: కోర్టు విచారణల తాలూకూ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందర్భ రహితంగా ప్రసారం అవుతూండటంపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. కాక్రోచ్లంటూ తాను చేసిన వ్యాఖ్యను దురుద్దేశంతో తప్పుగా చిత్రీకరించి, వాడి దేశ యువతను తప్పుదారి పట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మే నెల 15న ఒక కేసు విచారణ సందర్బంగా సీజేఐ మాట్లాడుతూ నకిలీ డిగ్రీలున్న కొంతమంది వ్యక్తులు వ్యవస్థలపై దాడి చేసేందుకు ఆర్టీఐ కార్యకర్తలుగా/సోషల్ మీడియాగా మారుతున్న వారిని బొద్దింకలు (కాక్రోచెస్)గా వరి్ణంచారు. అయితే ఈ వ్యాఖ్యపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగడం, ‘కాక్రోచ్ జనతా పారీ్ట’పేరుతో ఆన్లైన్ వ్యంగ్య ఉద్యమం ప్రారంభం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజేఐ దూరదర్శన్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కాలంలో కోర్టు విచారణల తాలూకూ క్లిప్‌లు సందర్భ రహితంగా సోషల్ మీడియాలో ప్రసారమవుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘‘నా వ్యాఖ్యను వక్రీకరించారు. ఉపయోగించుకున్నారు. చెప్పనిదాన్ని కూడా చెప్పినట్టుగా చూపారు. ఇది చాలా దురదృష్టకరం. దేశ యువతను తప్పుదారి పట్టించేందుకు దురుద్దేశంతో చేసిన ప్రయత్నం’’అని చెప్పారు. జర్నలిస్టులు న్యాయ ప్రక్రియలకు సంబంధించిన రిపోరి్టంగ్కు బాధ్యతాయుతంగా చేపట్టాలని సూచించారు. సమాజంలో సామరస్య వాతావరణాన్ని కాపాడటం ప్రతి పౌరుడి కర్తవ్యమని అన్నారు. ‘‘మీరు సోషల్ మీడియాలో ఉన్నారు. లేదంటే ప్రింట్ మరో రకమైన మీడియా. అదీ కాదంటే మీరు ఓ సాధారణ పౌరుడైనా కావచ్చు. అందరికీ హక్కులున్నాయి. రాజ్యాంగపరమైన విధులు, బాధ్యతలూ ఉన్నాయి’’అని చెప్పారు. ‘‘హక్కుల గురించి మాట్లాడితే మనం మన బాధ్యతలను కూడా నిర్వర్తించే సామర్థ్యం కలిగి ఉండాలి. కాబట్టి వాళ్లు తమ బాధ్యతలను మనసులో ఉంచుకోవాలని కోరుతున్నా. సమాజంలో సామరస్యం నెలకొని ఉండేలా చూసేందుకు మనమందరం శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి’’అని వివరించారు. వ్యాపారం కోసం వాడుకున్నారు... కోర్టు ప్రక్రియలకు సంబంధించిన ఆడియో, వీడియోలను సరైన అనుమతుల్లేకుండా ప్రసారం చేయడం, పోస్ట్, అప్లోడ్ చేయడం, వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించడంపై తాను ఇటీవల జారీ చేసిన ఆదేశాలను కూడా ప్రస్తావించిన సీజేఐ... న్యాయప్రక్రియల్లో పారదర్శకత అవసరమైనప్పటికీ అది వ్యాపారానికి దారి తీయకూడదని స్పష్టం చేశారు. పారదర్శకతకు కట్టుబడి ఉన్నందునే సు ప్రీంకోర్టులో ప్రత్యక్ష ప్రసారాలను మొదలుపెట్టామని, అయితే దీన్ని కూడా దుర్వినియోగం చేశారని, వ్యాపారం కోసం వాడుకున్నారని.. కొంతమంది చి న్న క్లిప్పులను (విచారణకు సంబంధించినవి) వ్యక్తిగత లాభాల కోసం దుర్వినియోగం చేశారని, మరికొందరు వ్యాపారం కోసం వాడుకున్నారని ఆయన చెప్పారు. దీనికి అడ్డుకట్ట పడాల్సిందేనన్నారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి సీజేపీ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నెల రోజులపాటు నిరసన ప్రదర్శనలు జరగడం జూలై 20న ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు తలెత్తడం తెలిసిందే. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. నిరసన కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది కూడా. -
జంతర్ మంతర్ సీజన్ -2 లోడింగ్...!
-
‘‘మధ్యలో మీ జోక్యమేంటి?’’.. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: నల్సార్ లా వర్సిటీ వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ విద్యార్థులే తప్పు చేసినా.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేలా నిరసన తెలిపే హక్కు వాళ్లకు ఉందని స్పష్టం చేశారు. ఈ అంశంలో బీసీఐ జోక్యం చేసుకోవడం పూర్తిగా అనవసరమని వ్యాఖ్యానించారు.హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పాల్గొనాల్సిన కార్యక్రమంపై నిరసన వ్యక్తం అయ్యింది. జంతర్ మంతర్ విద్యార్థుల లాఠీఛార్జి పిటిషన్ విచారణలో ఆయన వైఖరి సరిగా లేదని.. ఆయన నుంచి పట్టా అందుకోవడం తమకు ఇష్టం లేదని చెబుతూ వర్సిటీ నిర్వాహకులకు వాళ్లు సైన్ పిటిషన్ అందజేశారు. ఈ వ్యవహారాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరువు వ్యవహారంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో.. 2026 బ్యాచ్ న్యాయ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేయాలని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు బీసీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విద్యార్థులందరినీ ఒకే కోణంలో చూడటం సరికాదని, కొందరి చర్యలకు మొత్తం బ్యాచ్‌ను బాధ్యులను చేయడం అన్యాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు కాగా.. విచారణ సందర్భంగా బీసీఐ జోక్యంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.బీసీఐకి నోటీసులుసీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారణ జరిపింది. నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థుల ఎన్రోల్మెంట్ వివాదంపై సుప్రీంకోర్టు బీసీఐకి నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అసలు ఆ ఆదేశాలు ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఇప్పటికే వివాదాస్పద ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు బీసీఐ కోర్టుకు తెలిపింది. ఈ తరుణంలో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.‘‘ఇది విద్యార్థులు–నా మధ్య విషయం’’నల్సార్ విద్యార్థులపై బీసీఐ తీసుకున్న చర్యలపై స్పందించిన సీజేఐ.. ఇది విద్యార్థులకు, తనకు మధ్య ఉన్న అంశమని పేర్కొన్నారు. విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించడం ప్రజాస్వామ్యంలో భాగమని అన్నారు. నిరసన వ్యక్తం చేశారనే కారణంతో వారి భవిష్యత్‌పై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకోవడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.‘‘విద్యార్థుల హక్కుల పరిరక్షణే ముఖ్యం’’బీసీఐ చైర్మన్ మానన్ మిశ్రా కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు. తొందరపాటులో ఆదేశాలు ఇచ్చామని, విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే 40 నిమిషాల్లో సవరించామని పేర్కొన్నారు. బీసీఐ, విద్యార్థుల హక్కుల విషయంలో ఎలాంటి ఘర్షణ లేదని స్పష్టం చేశారు. ‘‘అభిజీత్ దీప్కే అయినా, సౌరవ్ దాస్ అయినా.. మా లక్ష్యం ఒక్కటే. విద్యార్థుల హక్కులను కాపాడటం’’ అని మానన్ మిశ్రా వ్యాఖ్యానించారు.‘కాక్రోచ్’ వ్యాఖ్యలతో మొదలైన వివాదంఈ వివాదానికి నేపథ్యం సీజేఐ సూర్యకాంత్ గతంలో చేసిన బొద్దింకల వ్యాఖ్యలు. ఆయన చేసిన ‘కాక్రోచ్’ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో ఆన్లైన్ ప్రచారం, ఆందోళనలు జరిగాయి.. అయితే తాను నకిలీ డిగ్రీలతో వస్తున్న న్యాయవాదుల్ని ఉద్దేశించే అన్నానని ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ జెన్‌జీ ఉద్యమం చల్లారలేదు. తాజా బీసీఐ ఆదేశాల అనంతరం CJP నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. ‘‘అన్ని లీగల్ కాక్రోచ్లు ఒక్కటైతే?’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. బీసీఐ చైర్మన్‌పైనా విమర్శలు కూడా చేశారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.బీసీఐకి సీజేఐ స్పష్టమైన సంకేతంనల్సార్ వ్యవహారంలో సీజేఐ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థుల అభిప్రాయ స్వేచ్ఛ, నిరసన హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు న్యాయ వ్యవస్థకు సంబంధించిన సంస్థలు పరస్పర గౌరవంతో వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ పరిణామం మరోసారి తెరపైకి తెచ్చింది. -
‘లీగల్ కాక్రోచెస్ ఏకమైతే?.. నల్సార్ వివాదంపై అభిజిత్ సంచలనం!
న్యూఢిల్లీ: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా , నల్సార్ లా యూనివర్సిటీ వివాదంపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందించారు. గతంలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి పునాది వేసిన నినాదాన్ని ఇప్పుడు న్యాయవ్యవస్థకు ముడిపెడుతూ ఆయన సరికొత్త సామాజిక చర్చకు తెరలేపారు.నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని ఆ వర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు వ్యతిరేకించారు. ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ 2026 బ్యాచ్‌కు చెందిన దాదాపు 70 మంది విద్యార్థులు వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్లకు అధికారికంగా విజ్ఞప్తి లేఖను సమర్పించారు. ఆ తర్వాత, వీరి నిర్ణయానికి మద్దతుగా తదుపరి బ్యాచ్‌లకు చెందిన మరో 380 మంది విద్యార్థులు కూడా డిమాండ్‌పై సంతకాలు చేశారు. ఆ రకంగా, ఆ తర్వాత మొత్తం మీద వ్యతిరేకత వ్యక్తం చేసిన విద్యార్థుల సంఖ్య దాదాపు 450 కి చేరింది.ఈ క్రమంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) నల్సార్ 2026 బ్యాచ్ గ్రాడ్యుయేట్లు ఎవరినీ లాయర్లుగా ఎన్రోల్ చేసుకోవద్దంటూ అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లను ఆదేశించింది. ఈ సామూహిక నిషేధంపై తీవ్ర విమర్శలు రావడంతో, కొన్ని గంటల వ్యవధిలోనే బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే నిషేధాన్ని ఎత్తేసినట్లు ఆయన పేర్కొన్నారు.బీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిజీత్ దిప్కే ఎక్స్ వేదికగా స్పందించారు. ‘న్యాయవాద రంగంలోని కాక్రోచ్లు అంతా ఒకటైతే ఎలా ఉంటుంది?’ అంటూ ప్రశ్నించారు. గతంలో ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ దేశ యువతను ఉద్దేశించి కాక్రోచ్ అని వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఆ సమయంలో అమెరికాలో ఉన్న దిప్కే.. ‘దేశంలోని బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుంది?’ అంటూ ప్రారంభించిన సోషల్ మీడియా పోస్ట్, ఆ తర్వాత 'కాక్రోచ్ జనతా పార్టీ' ఏర్పాటుకు బీజం పడింది. పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆత్మహత్యలపై ఈ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన భారీ విద్యార్థి నిరసనల కారణంగానే అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే సీజేఐ వివాదంలోకి రావడంతో అభిజీత్ దిప్కే ఈ 'లీగల్ కాక్రోచ్ 'ను వాడారు. అంతేకాకుండా 2012 నుండి బీసీఐ చైర్మన్‌గా కొనసాగుతున్న మనన్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలంటూ సరికొత్త ప్రచారానికి ఆయన తెరలేపారు. బీసీఐ నిషేధాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ, ఆ లేఖను పూర్తిగా వెనక్కి తీసుకోలేదని సీజేపీ ముఖ్య ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించారు. నిరసన తెలిపిన విద్యార్థులు, వారికి సహకరించిన అధ్యాపకులపై విచారణ జరిపి పేర్లు సేకరించాలని బీసీఐ కొత్త లేఖలో పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. శాంతియుతంగా అసమ్మతిని వ్యక్తం చేసిన విద్యార్థులపై జరుగుతున్న వేధింపులను ఆపాలని, బీసీఐ తన ఆదేశాలను పూర్తిగా ఉపసంహరించుకోకపోతే లా విద్యార్థులు, సీనియర్ న్యాయవాదులతో కలిసి బీసీఐ కార్యాలయం, చైర్మన్ నివాసం వద్ద భారీ నిరసనలు చేపడతామని సీజేపీ హెచ్చరించింది. మనన్ కుమార్ మిశ్రా అధికార బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని, తాము ఈ అణచివేతపై నిశ్శబ్దంగా ఉండబోమని సీజేపీ స్పష్టం చేసింది.What if all legal cockroaches come together? https://t.co/mzqrL2a904— Abhijeet Dipke (@abhijeet_dipke) August 13, 2026 Time for Manan Mishra isteefa do?— Abhijeet Dipke (@abhijeet_dipke) August 13, 2026 -
సీజేపీ దాస్ ఇంటికి పోలీసులు.. బీజేపీ ప్లాన్ మార్చిందా?
పుదుచ్చేరిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కుటుంబ సభ్యుల ఇంటికి పోలీసులు వెళ్లడం వివాదానికి దారితీసింది. పోలీసులు తమ కుటుంబాన్ని ప్రశ్నల పేరుతో భయబ్రాంతులకు గురిచేశారని దాస్ ఆరోపించగా.. పోలీసు శాఖ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో చేపట్టే సాధారణ భద్రతా చర్యల్లో భాగంగానే ఇంటికి వెళ్లామని స్పష్టం చేసింది.పోలీసులు తమ కుటుంబం వద్దకు వచ్చి రకరకాల ప్రశ్నలు అడిగారని దాస్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఇది కేవలం సాధారణ విచారణ కాదని, తనను మౌనం చేయించేందుకు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న చర్యగా ఆయన అభివర్ణించారు. పుదుచ్చేరిలో బీజేపీ ప్రభుత్వం తన కుటుంబాన్ని ఎందుకు భయపెడుతోందని దాస్ ప్రశ్నించారు. ఈ చర్య వెనుక కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయా? అసలు ఇలాంటి విచారణకు చట్టపరమైన ఆధారం ఏమిటని నిలదీశారు. తనను బెదిరించి మౌనం చేయించాలని చూస్తే అది సాధ్యం కాదని, ఇలాంటి చర్యలు తమ పోరాట సంకల్పాన్ని మరింత బలపరుస్తాయని అన్నారు.అంతేకాదు, రెండు రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుదుచ్చేరికి వచ్చి అక్కడి హోంమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్‌తో సమావేశమైన విషయాన్ని కూడా దాస్ ప్రస్తావించారు. ఆ సమావేశంలోనే తన కుటుంబాన్ని సందర్శించే నిర్ణయం తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. అయితే, పోలీసుల వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. దాస్ బంధువుల ఇంటికి పోలీసులు వెళ్లిన విషయం నిజమేనని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కానీ ఇందులో ఎలాంటి వేధింపులు, బెదిరింపులు లేవని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం వంటి ముఖ్యమైన రోజులకు ముందు భద్రతా చర్యల్లో భాగంగా కీలక మార్గాల సమీపంలో నివసించే ప్రజల ఇళ్లను పోలీసులు సందర్శించడం సాధారణమేనని చెప్పారు.#Alert🚨Two hours ago, the Pondicherry Police showed up at my family’s home and subjected them to all kinds of questioning. Why this harassment, @PuducheryPolice? Who ordered this and for what purpose? Is this the legal procedure? Why is the BJP government in Pondicherry…— Saurav Das (@SauravDassss) August 12, 2026ముఖ్యమైన రూట్లకు సమీపంలో నివసించే ప్రజలను కలిసి కొన్ని వివరాలు తెలుసుకోవడం, భద్రతకు సంబంధించిన సాధారణ ప్రశ్నలు అడగడం పోలీసుల రొటీన్ ప్రక్రియలో భాగమని అధికారి వివరించారు. దీంతో ఒకే ఘటనపై రెండు భిన్నమైన వాదనలు తెరపైకి వచ్చాయి. దాస్ మాత్రం దీన్ని రాజకీయ బెదిరింపుగా చూస్తుండగా.. పోలీసులు మాత్రం స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు చేపట్టే సాధారణ భద్రతా తనిఖీల్లో భాగమని చెబుతున్నారు. ఇక దాస్ చేసిన వ్యాఖ్యలు పుదుచ్చేరి రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా అమిత్ షా పర్యటనను ఈ ఘటనతో ముడిపెడుతూ ఆయన ప్రశ్నలు లేవనెత్తడంతో రాజకీయ కోణం కూడా తెరపైకి వచ్చింది. ఈ విషయం ఇప్పుడు పుదుచ్చేరిలో హాట్ టాపిక్‌గా మారింది. -
పేపర్ లీక్స్ వ్యవస్థాగత సమస్య
కోల్‌కతా: ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం భారత విద్యా వ్యవస్థలోని లోపాల వల్ల వచ్చిన వ్యవస్థాగత సమస్య అని, లీకేజీ బాధ్యులకు శిక్ష పెంచడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించలేమని ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరా స్పష్టం చేశారు. జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమాల సందర్భంగా సామజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో కలిసి నేహా బోరా 23 రోజులపాటు ఉద్యమించిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలపై జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న నేహా మంగళవారం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. విద్యార్థి ఉద్యమాలతో వ్యవహరించే విషయంలో బీజేపీయేతర రాజకీయ పార్టీలు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ప్రశ్న పత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్రం ప్రతిపాదిస్తున్న చట్టం నష్టం జరిగిన తరువాత ఏం చేయాలన్న దానిపైనే దృష్టి పెట్టిందని, లీకేజీ జరిగేందుకు కారణమవుతున్న సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. ప్రశ్న పత్రాల లీకేజీ ఘటనలపై దర్యాప్తును కొత్త చట్టం ప్రకారం 11 నెలల్లో పూర్తి చేసినా అప్పటికి అడ్మిషన్ ప్రక్రియ పూర్తయి ఉంటుందని అన్నారు. జార్ఖండ్‌లో కొనసాగుతున్న ఆందోళనలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విపక్ష, బీజేపీయేతర పార్టీలు శాంతియతంగా నిరసన చేస్తున్న విద్యార్థులతో ఎలా వ్యవహరించాలో చూపాలని, అందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఇంకోలా వ్యవహరిస్తే విపక్షాలు రాజకీయంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ను రాజకీయంగా సమర్థంగా ఎదుర్కోలేరని అన్నా రు. జెన్–జీ ఉద్యమం ప్రజా ప్రతినిధులను తప్పులకు బాధ్యులుగా నిలపవచ్చునన్న విషయాన్ని నిరూపించిందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఒక్కటొక్కటిగా బలహీన పడుతున్న సమయంలో పుట్టుకొచ్చిన జెన్–జీ ఉద్యమం వాటి పునరుద్ధరణపై ఆశలు పెంచేవిగా ఉన్నాయన్నారు.అనుభవజు్ఞల చేతుల్లో విధాన రూపకల్పనవిద్యా వ్యవస్థలో అనుభవం ఉన్నవారు విధానాల రూపకల్పనలో తమవంతు పాత్ర పోషించాలని బోరా అభిప్రాయపడ్డారు. కేంద్రీకరణను ప్రోత్సహించే నూతన విద్యా విధానాన్ని వెనక్కు తీసుకోవాలని, ఈ విధానం ప్రైవేటీకరణను, విద్యార్థుల మధ్య అసమానతలను పెంచేదిగా ఉందని విమర్శించారు. న్యాయం, అన్యాయం, సమాజ నిర్వహణ వంటి అంశాలపై చర్చలకు, అవగాహన పెంచుకునేందుకు విశ్వవిద్యాలయాలు వేదికలని అన్నారు. విద్యార్థి రాజకీయాలు కూడా ప్రజాస్వామ్య పరీక్షేనని, అక్కడ కూడా నేతలు విద్యార్థుల ప్రశ్నలు ఎదుర్కొని తాము వారికి నిజమైన ప్రతినిధులుగా నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థి రాజకీయాలను అణచివేస్తే ప్రశ్నించే సంస్కృతికి బదులు అనుకరించే సంస్కృతి ఎక్కువవుతుందని బోరా హెచ్చరించారు. ఢిల్లీ నిరసనల సమయంలో పౌరులపై బలప్రయోగం సరికదాన్న బోరా నిరసనకారులతో వ్యవహరించడానికి ప్రభుత్వాలు వ్యవస్థలు, ప్రోటోకాల్‌లు ఏర్పాటు చేసుకున్నాయని గుర్తు చేశారు. జెన్–జీకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మద్దతివ్వడంపై బోరా పరోక్షంగా స్పందించారు. పెద్దల సలహాలను ప్రశ్నించకుండా పాటించి ఉంటే సాంఘిక సంస్కరణలు జరిగేవే కాదని వ్యాఖ్యానించారు.ఏకమైతేనే హక్కుల సాధనప్రజలు ఐకమత్యంతో నిలిస్తే తమ హక్కులను సాధించుకోగలరు అనేందుకు జంతర్‌మంతర్ నిరసన కార్యక్రమం ప్రత్యక్ష ఉదాహరణ అని నేహా బోరా వ్యాఖ్యానించారు. కోల్‌కతాలో మంగళవారం కొంతమంది వామపక్ష విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ జంతర్ మంతర్ ఉద్యమ ఫలితం కేంద్ర మంత్రి రాజీనామా ఒక్కటే కాదని స్పష్టం చేశారు. జవాబుదారీతనానికి అతీతంగా ఉన్నామని అనుకునే వారిపై సాధించిన విజయమని అన్నారు. ప్రజలు దోషులుగా భావిస్తే ఎంతటి ముఖ్యులనైనా గద్దె దింపవచ్చునని ఈ ఉద్యమం నిరూపించిందని చెప్పారు. -
కోర్టు వ్యాఖ్యలు.. వైరల్ కంటెంట్(మీమ్స్)గా మారుతున్నాయా?
కోర్టు వ్యాఖ్యలు సోషల్ మీడియా వైరల్ కంటెంట్‌గా మారుతున్నాయా? వాటి ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందుతున్నారా?.. ఈ అంశాలపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కార్యకలాపాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్రం, సీబీఐ సహా పలు సంస్థలకు నోటీసులు ఇచ్చింది.డిజిటల్-రాజకీయ సంస్థగా పేర్కొంటున్న సీజేపీ కార్యకలాపాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు న్యాయవాది రాజా చౌద్రి ఓ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వంతో పాటు దర్యాప్తు సంస్థలకూ నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు చేసే మౌఖిక వ్యాఖ్యలను(Oral Comments) సందర్భం నుంచి వేరు చేసి వైరల్ చేయడం, వాటి ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందడాన్ని పిటిషన్లో ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.కోర్టు వ్యాఖ్యలు.. వైరల్ కంటెంట్‌గా మారుతున్నాయా?న్యాయ విచారణల్లో న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య జరిగే సంభాషణలను కొన్ని భాగాలుగా కట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో న్యాయ ప్రక్రియ అసలు ఉద్దేశం పక్కదారి పడుతోందని తెలిపారు. “కోర్టు వ్యాఖ్యలను మీమ్స్, వైరల్ వీడియోలు, ఆన్లైన్ ప్రచారాలుగా మార్చి సందర్భం లేకుండా చూపిస్తున్నారు” అని పిటిషన్లో పేర్కొన్నారు.‘కాక్రోచ్’ వ్యాఖ్యలతో మొదలైన వివాదంనకిలీ న్యాయ డిగ్రీల అంశంపై విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ చేసినట్లు ప్రచారమైన ‘కాక్రోచ్’ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం సీజేఐ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యల ఆధారంగా ‘కాక్రోచ్ జంతా పార్టీ’ పేరుతో ఓ ఆన్లైన్ వేదిక ఏర్పడటం, అది రాజకీయ-డిజిటల్ ఉద్యమంగా మారడంపై పిటిషన్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకం కాదన్న పిటిషనర్తమ పిటిషన్ ప్రజాస్వామ్య విమర్శలు, వ్యంగ్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకం కాదని రాజా చౌదరి తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. అయితే రాజ్యాంగ సంస్థలపై జరిగే వ్యాఖ్యలను వాణిజ్య ప్రయోజనాల కోసం వక్రీకరించడం సమస్యగా పేర్కొన్నారు.నీట్ వివాదం నేపథ్యంలో CJP చర్చనీట్ యూజీ పేపర్ లీక్‌లపై కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసనలు, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యల నేపథ్యంలో ఈ సంస్థపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారం రేపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు నోటీసులతో సీజేపీ కార్యకలాపాలు, కోర్టు వ్యాఖ్యల వినియోగంపై తదుపరి విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్రం, సీబీఐ సమాధానాల అనంతరం ఈ కేసులో తదుపరి పరిణామాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. -
సీజేఐ హైదరాబాద్ నల్సార్ ఈవెంట్‌పై ఉత్కంఠ!
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ప్రతిష్ఠాత్మక న్యాయ విశ్వవిద్యాలయం కాన్వొకేషన్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానించే ప్రతిపాదనపై విద్యార్థుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (NALSAR) చివరి సంవత్సరం విద్యార్థుల బృందం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వర్సిటీ యాజమాన్యాన్ని కోరింది.సీజేఐ చేతుల మీదుగా పట్టా తీసుకోవడం తమకు ఇష్టం లేదంటూ సుమారు 450 మంది విద్యార్థుల సంతకాలు చేసి కాలేజీ యాజమాన్యానికి సమర్పించారు. తమ అభ్యంతరం కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదని.. రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, నిరసనలపై న్యాయవ్యవస్థ స్పందన వంటి అంశాలకు సంబంధించినదని వాళ్లు యాజమాన్యానికి చేసిన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. కాన్వొకేషన్ వేదిక తమ విశ్వవిద్యాలయ విలువలను ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.‘చలో సంసద్’ నిరసన నేపథ్యంలో..విద్యార్థుల అభ్యంతరానికి ప్రధాన కారణం.. జులై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘చలో సంసద్’ నిరసన సందర్భంగా పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్!. నీట్ పరీక్ష నిర్వహణ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. ఆ సమయంలో పోలీసులు అతిగా వ్యవహరించారంటూ ఆరోపణలు వచ్చాయి.ఈ అంశంపై అత్యవసర విచారణ కోరుతూ జులై 22న సుప్రీంకోర్టులో ప్రస్తావించగా.. న్యాయస్థానం స్పందనపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను చూపించేందుకు ప్రయత్నించిన న్యాయవాదులకు తగిన అవకాశం ఇవ్వలేదని వారు తమ వినతిలో పేర్కొన్నారు.170 మందికి పైగా నిరసనకారులు గాయపడ్డారని, ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని విద్యార్థులు ప్రస్తావించారు. పౌరుల హక్కులు, పోలీసు అధికారాల పరిమితులపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తు చేశారు.“మేం నేర్చుకున్న విలువలకు విరుద్ధం”..NALSAR విద్యార్థులు వీసీ, రిజిస్ట్రార్, అధ్యాపకులకు ఇచ్చిన వినతిపత్రంలో.. కాన్వొకేషన్ ముఖ్య అతిథిగా జస్టిస్ సూర్యకాంత్ ఎంపికను పునరాలోచించాలని కోరారు. “ప్రజల హక్కులు, న్యాయం అందుబాటులో ఉండటం, సమస్యలపై తర్కబద్ధమైన చర్చ” వంటి అంశాలను న్యాయ విద్యలో నేర్చుకున్నామని.. అలాంటి సమయంలో నిరసనకారుల ఆరోపణలపై స్పందన విషయంలో అసంతృప్తి ఉన్న వ్యక్తిని గౌరవ అతిథిగా ఆహ్వానించడం తమకు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. అయితే అసలు సీజేఐని ఈ ఈవెంట్‌కు నల్సార్ నిజంగానే ఆహ్వానించిందా?.. ఈ అంశంపై వర్సిటీ అధికారికంగా తుది నిర్ణయం ప్రకటించలేదు.మొన్న మహారాష్ట్రలోనూ..ఇదే సమయంలో మహారాష్ట్ర ముంబైలోని ప్రతిష్ఠాత్మక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS)లోనూ జస్టిస్ సూర్యకాంత్ హాజరు కావాల్సిన కాన్వొకేషన్ కార్యక్రమం వాయిదా పడటం చర్చకు దారితీసింది. ఆగస్టు 2న జరగాల్సిన TISS 86వ కాన్వొకేషన్‌ను “అనుకోని పరిస్థితుల” కారణంగా వాయిదా వేస్తున్నట్లు యాజమాన్యం విద్యార్థులకు సమాచారం ఇచ్చింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అధికారికంగా కారణాలు వెల్లడించకపోయినా.. భద్రతా కారణాలు, సాధ్యమైన నిరసనలపై వచ్చిన సమాచారమే ఈ నిర్ణయానికి కారణమై ఉండొచ్చన్న చర్చ మొదలైంది.కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావమా?జస్టిస్ సూర్యకాంత్‌కు సంబంధించిన గత వ్యాఖ్యలు, CJP ఉద్యమం నేపథ్యంలో ఈ పరిణామాలను పలువురు విశ్లేషిస్తున్నారు. గతంలో ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ “కాక్రోచ్లు”, “పరాన్నజీవులు” వంటి పదాలు ఉపయోగించారనే ప్రచారం జరిగింది. ఆ వ్యాఖ్యలు నిరుద్యోగ యువతను ఉద్దేశించినవని కొందరు భావించగా.. తాను నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తిలోకి వస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడానని జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు.ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఏర్పడింది. అనంతరం NEET పరీక్ష అంశంపై ఆ సంస్థ చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి.సౌరవ్ దాస్ ట్వీట్మరోవైపు నల్సార్లోకాక్రోచ్ల నిరసనపై సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఓ ట్వీట్ చేశాడు. అయితే గతంలోనూ ఆయన నల్సార్‌లో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండడంతో.. ఈ వ్యవహారం వెనుక సౌరవ్ హస్తం ఉందంటూ కొందరు విమర్శలకు దిగుతున్నారు.NALSAR student-lawyers with a spine. pic.twitter.com/rX0sDqDzhR— Saurav Das (@SauravDassss) August 9, 2026ఒకే అంశం.. రెండు పరిణామాలుహైదరాబాద్లో NALSAR విద్యార్థులు నేరుగా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేయగా.. ముంబైలో TISS కాన్వొకేషన్ వాయిదా చుట్టూ భద్రత, నిరసనల అంశం తెరపైకి వచ్చింది. ఒకవైపు న్యాయవ్యవస్థపై గౌరవం కొనసాగాలని భావించే వర్గాలు ఉండగా.. మరోవైపు పౌర హక్కులు, నిరసనలపై న్యాయస్థానాల స్పందనను ప్రశ్నించే కొత్త తరం విద్యార్థుల గొంతు వినిపిస్తోంది. కాన్వొకేషన్ వేదికలు కేవలం పట్టాలు అందించే కార్యక్రమాలేనా? లేదంటే రాజ్యాంగ విలువలపై చర్చ జరిగే వేదికలా? అనే కొత్త చర్చకు ఈ పరిణామాలు దారితీశాయి. -
కాక్రోచ్ పార్టీలో కాకరేపిన అసంతృప్తి.. తెరపైకి కొత్త ట్విస్ట్!
కొత్తగా జాతీయ స్థాయి కమిటీని ప్రకటించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)లో అప్పుడే అసంతృప్తి భగ్గుమంది. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి.. వ్యవస్థాపకుడికి సన్నిహితంగా ఉన్నవారికే కీలక పదవులు కట్టబెట్టారంటూ అహ్మదాబాద్‌కు చెందిన యువకుడు మణీష్ బ్రహ్మభట్ నిరవధిక నిరాహార దీక్షకు దిగాడు. జంతర్ మంతర్ విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కోఆర్డినేటర్లు, వాలంటీర్లకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నివాసం ఎదుట కూడా నిరసన చేపట్టాడు.సీజేపీ తన తొలి నేషనల్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన మరుసటి రోజే ఈ వివాదం తెరపైకి వచ్చింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన పలువురు వాలంటీర్లు, కోఆర్డినేటర్లను నాయకత్వ ఎంపికలో పట్టించుకోలేదని బ్రహ్మభట్ ఆరోపించాడు. దీప్కేకు దగ్గరగా ఉన్నవారికే కొత్త కమిటీలో పదవులు దక్కాయని విమర్శించాడు. కోర్ కమిటీ సమావేశానికి తాను, మరికొందరు వాలంటీర్లు హాజరైనప్పటికీ.. సమావేశంలో పాల్గొనే అవకాశం ఇవ్వలేదని బ్రహ్మభట్ చెప్పాడు. రోజంతా అక్కడే ఉన్నప్పటికీ తమను లోపలికి పిలవలేదని, మొదట తాము సమావేశ ప్రదేశానికి రాలేదంటూ వాట్సాప్‌లో సమాచారం ఇచ్చారని ఆరోపించాడు. ఆ తర్వాత ఆశుతోష్‌ను సంప్రదించినా స్పందన రాలేదని పేర్కొన్నాడు.సమావేశం జరుగుతున్న సమయంలో సభ్యుల ఫోన్లను బయటే ఉంచేడంతో తాము బయట వేచి ఉన్న విషయం లోపల ఉన్నవారికి తెలియలేదని కొందరు తర్వాత చెప్పినట్లు బ్రహ్మభట్ తెలిపాడు. మరుసటి రోజు ఉదయం రావాలని తమకు సూచించినట్లు చెప్పాడు. ఇక తాను ప్రతిపాదించిన ప్రచార కార్యక్రమాన్ని కూడా తనకు క్రెడిట్ ఇవ్వకుండా మరో పేరుతో ప్రారంభించారని బ్రహ్మభట్ ఆరోపించాడు. దేశవ్యాప్తంగా ప్రజలు సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలను చెప్పుకునేలా ‘ఏక్ రీల్ దేశ్ కే నామ్’ పేరుతో ప్రచారం నిర్వహించాలని తాను సూచించానని తెలిపాడు. అయితే అదే తరహా కార్యక్రమాన్ని సీజేపీ ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో ప్రారంభించిందని, తన ప్రతిపాదనకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని ఆరోపించాడు.Chhatrapati Sambhajinagar, Maharashtra: Jantar Mantar protester Manish Brahmbhatt began a hunger strike over the CJP core committee dispute, alleging volunteers were excluded and only Abhijit Dipke’s close associates were included.Manish Brahmbhatt, Ahmedabad youth sitting on… pic.twitter.com/jFsuRBNcyy— IANS (@ians_india) August 7, 2026ఈ నేపథ్యంలో మరో సీజేపీ వాలంటీర్‌తో కలిసి అభిజిత్ దీప్కే ఇంటి ముందు బ్రహ్మభట్ నిరసనకు దిగాడు. జంతర్ మంతర్ ఉద్యమంలో పనిచేసిన కోఆర్డినేటర్లకు పార్టీ నాయకత్వంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశాడు. మరోవైపు, ఛత్రపతి సంభాజీనగర్‌లోని దీప్కే నివాసంలో రెండు రోజుల పాటు జరిగిన కోర్ కమిటీ సమావేశం అనంతరం సీజేపీ తన తొలి జాతీయ నాయకత్వాన్ని ప్రకటించింది. వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను నేషనల్ కన్వీనర్‌గా నియమించగా.. చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్, స్పోక్స్‌పర్సన్ ఆశుతోష్ రంకాలను కో-కన్వీనర్లుగా నియమించింది.అజింక్య షిండేను నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్‌గా, దీపక్ బలియాన్‌ను ఆర్గనైజేషన్ కో-ఇన్‌ఛార్జ్‌గా, ఆఫ్రీన్ నవాజ్‌ను నేషనల్ సెక్రటరీగా ప్రకటించింది. విజయ్ రెడ్డి మల్లంగి మీడియా లీడ్‌గా, రత్నా సింగ్ లీగల్ అఫైర్స్ లీడ్‌గా, వైష్ణవి గౌర్ రీసెర్చ్ అండ్ పాలసీ లీడ్‌గా, రోహన్ దేశ్‌పాండే టెక్నాలజీ లీడ్‌గా, యోగేశ్ ఇంగలే ఫైనాన్స్ లీడ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, ఈశాన్య, పశ్చిమ జోన్లకు కూడా నాయకత్వ బాధ్యతలు కేటాయించారు. -
సీజేపీ జాతీయ కార్యవర్గం ఇదే.. తెలుగు వ్యక్తికి చోటు
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) గురువారం జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే దేశవ్యాప్త కార్యక్రమం ‘క్యా బోల్తీ పబ్లిక్’ను కూడా ఇవాళే ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నుంచి పార్టీ దేశమంతా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతుందని తెలిపారు. సీజేపీ ఇకపై నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం వంటి అంశాలను తమ రాజకీయ కార్యాచరణలో ప్రధానంగా నిలపనుంది.సీజేపీ జాతీయ కార్యవర్గంజాతీయ కన్వీనర్- అభిజీత్ దీప్కేకో-కన్వీనర్లు - అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్చార్జ్ - అజింక్యా షిండేఆర్గనైజేషన్ కో ఇన్చార్జ్- దీపక్ బలియన్జాతీయ కార్యదర్శి- ఆఫ్రీన్ నవాజ్సీజేపీ మీడియా లీడ్ -విజయ్ రెడ్డి మల్లంగి (తెలుగు వ్యక్తి )న్యాయ వ్యవహారాల ఇన్చార్జ్ - రత్న సింగ్రీసెర్చ్ & పాలసీ లీడ్ - వైష్ణవి గౌర్టెక్నాలజీ లీడ్- రోహన్ దేశ్పాండేఫైనాన్స్ లీడ్ -యోగేష్ ఇంగాలేజోనల్ లీడర్‌షిప్‌గా..నార్త్ జోన్- దీపక్ బలియన్దక్షిణ జోన్ -విజయ్ రెడ్డి మల్లంగి (తెలుగు వ్యక్తి)తూర్పు & ఈశాన్య జోన్లు- అంకిత్ భరద్వాజ్పశ్చిమ జోన్- యోగేష్ ఇంగలేరాబోయే ఆరు నెలల్లో, సీజేపీ భారతదేశవ్యాప్తంగా రాష్ట్ర సమన్వయ కమిటీలతో పాటు లోక్‌సభ, నగర స్థాయి సమన్వయ విభాగాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. -
కాక్రోచ్ పార్టీ మరో సంచలనం అభిజీత్ దీప్కే కామెంట్స్ వైరల్
-
సీజేపీ మరో సంచలనం.. దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేస్తామన్న దీప్కే
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గురువారం దేశవ్యాప్త కార్యక్రమం ‘క్యా బోల్తీ పబ్లిక్’ను ప్రకటించారు. సెప్టెంబర్ నుంచి పార్టీ దేశమంతా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతుందని, నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం వంటి అంశాలను తమ రాజకీయ కార్యాచరణలో ప్రధానంగా నిలుపుతామని చెప్పారు.రెండు రోజుల పార్టీ చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన దీప్కే.. గత నెల న్యూఢిల్లీ జంతర్ మంతర్‌లో జరిగిన సీజేపీ ఆధ్వర్యంలోని జెన్ జీ ఉద్యమానికి ముఖచిత్రంగా నిలిచారని, ఆ ఉద్యమం ఫలితంగా అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీగా మారకుండానే సీజేపీ కొనసాగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా యువత ఆశయాలు, అంచనాలు, ఆందోళనలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామని దీప్కే తెలిపారు. “రెండు రోజుల చర్చల తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ సెప్టెంబర్‌లో దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఆ కార్యక్రమం పేరు ‘క్యా బోల్తీ పబ్లిక్’” అని దిప్కే చెప్పారు.“ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల ఆశయాలు, అంచనాలు, ఆందోళనలను అర్థం చేసుకోవాలనుకుంటున్నాం” అని ఆయన తెలిపారు. భారత యువ జనాభాను నిర్లక్ష్యం చేశారని ఆరోపించిన దీప్కే.. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారేనని, అయినా వారి సమస్యలకు ప్రధాన రాజకీయ చర్చల్లో చోటు దక్కలేదని అన్నారు.“భారత జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. అయినా ఈ ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. ఈ అంశాలపై మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మేము ప్రజల వద్దకు వెళ్తాం. వారి అంచనాలను తెలుసుకుంటాం. వారు ఎదుర్కొంటున్న సమస్యలను వింటాం” అని చెప్పారు.విద్యా సంస్కరణలపై సీజేపీ పోరాటంవిద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా విద్యా సంస్కరణలను సీజేపీ ముందుకు తీసుకెళ్తుందని దీప్కే చెప్పారు. “విద్య ఖర్చు గణనీయంగా పెరిగింది. విద్యార్థులు అధిక ట్యూషన్ ఫీజులను ఎదుర్కొంటున్నారు. కుటుంబాలు భారీ విద్యా వ్యయాన్ని భరించాల్సి వస్తోంది. మన దేశంలో ఉద్యోగాలు దాదాపు లేవు. జంతర్ మంతర్‌కు వచ్చిన వారిలో చాలామంది నిరుద్యోగులే. బలవంతం వల్ల స్విగ్గి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా లేదా డెలివరీ బాయ్‌గా మారాలని ఎవరి కలా, ఆశయమూ ఉండదు” అని చెప్పారు.డిగ్రీలు సంపాదించినా పెద్ద సంఖ్యలో చదువుకున్న యువత నిరుద్యోగులుగానే ఉన్నారని దిప్కే అన్నారు. “డిగ్రీ సంపాదించిన తర్వాత కూడా దేశ యువతలో దాదాపు 80 శాతం మంది నిరుద్యోగులుగానే ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు. చదువు పూర్తి చేయని వారు లేదా డిగ్రీలు లేని వారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. చదువుకున్న యువత భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు.“ఇప్పుడు నిరుద్యోగాన్ని జాతీయ అంశంగా మార్చాలనుకుంటున్నాను. ప్రభుత్వంగా మీరు నిరుద్యోగ సంక్షోభాన్ని ఇక నిర్లక్ష్యం చేయలేరు” అని ఆయన తెలిపారు. పార్టీ సైద్ధాంతిక వైఖరిని మరోసారి స్పష్టం చేసిన దిప్కే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆదర్శాలే సీజేపీకి మార్గదర్శకాలని చెప్పారు.“మా సిద్ధాంతం భారత రాజ్యాంగ విలువలపై ఆధారపడి ఉంటుంది. మేము లౌకికవాదులం. ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాం. మేము ప్రజాస్వామ్యవాదులం. సామాజిక న్యాయం దిశగా పని చేస్తూనే ఉంటాం” అని అన్నారు.“మహాత్మా గాంధీ శాంతి, అహింస సందేశం, అంబేద్కర్ సామాజిక న్యాయ దృక్పథం, జవహర్లాల్ నెహ్రూ ఆధునిక భారత స్వప్నం మాకు స్ఫూర్తిగా నిలుస్తాయి” అని చెప్పారు. ఇటీవలి రాజకీయ మార్పులకు విద్యార్థులే కారణమని దిప్కే పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలకు ముందు దేశం చాలా ఏళ్ల పాటు అణచివేత, నిరంకుశ పాలనను చూసిందని ఆరోపించారు. -
సీజేపీ కొత్త మిషన్.. నేడు భారీ ప్రకటనపై దేశవ్యాప్త ఉత్కంఠ!
పరీక్షల పేపర్ లీకుల ఆరోపణలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ప్రధాన స్వరంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తన తదుపరి కార్యాచరణపై కీలక ప్రకటనకు సిద్ధమవుతోంది. ఉద్యమ భవిష్యత్ దిశ, దేశవ్యాప్త విస్తరణ ప్రణాళికలను గురువారం వెల్లడించనున్నట్లు సంస్థ ప్రకటించింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో గత రెండు రోజులుగా జరిగిన కీలక సమావేశాల అనంతరం ఈ ప్రకటన రానుంది. సంస్థ నాయకత్వం ఉద్యమం తదుపరి దశకు సంబంధించి సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేసినట్లు సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా తెలిపారు.ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియో సందేశంలో రంకా మాట్లాడుతూ.. ‘దేశంలో వ్యవస్థాగత మార్పు కోసం మేము భారీ పోరాటాన్ని ప్రారంభించాం. ఈ ఉద్యమంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి’ అని అన్నారు. మద్దతుదారుల నుంచి సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా వచ్చిన వేలాది సూచనలు, అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత భవిష్యత్ వ్యూహాన్ని ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. గురువారం చేయబోయే ప్రకటనలో ఉద్యమం ఎటువైపు సాగుతుందనే దానిపై స్పష్టత ఇవ్వనున్నట్లు చెప్పారు.కాగా, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నివాసంలో దాదాపు ఏడు గంటల పాటు వ్యూహాత్మక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థను దేశవ్యాప్తంగా విస్తరించడం, విద్యార్థి సంఘాలతో బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేయడం, వివిధ రాష్ట్రాల్లో విద్యా సమస్యలపై జరుగుతున్న ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, సీజేపీ ప్రస్తుతం రాజకీయ పార్టీగా మారే ఆలోచనలో లేదని నాయకత్వం స్పష్టం చేసింది. విద్యా రంగ సమస్యలపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే సామాజిక, ప్రజా ఉద్యమ వేదికగా కొనసాగాలని నిర్ణయించినట్లు తెలిపింది.‘మేము రాజకీయ పార్టీ ప్రారంభించడం గురించి ఆలోచించడం లేదు. ప్రజలకు న్యాయవ్యవస్థ, రాజకీయ నాయకులు, మొత్తం వ్యవస్థపై నమ్మకం తగ్గింది. మేము ఒక సమూహంగా పనిచేస్తాం’ అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. విద్యా సంస్కరణలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, పేపర్ లీకుల నివారణ, విద్యార్థుల సంక్షేమం, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం వంటి అంశాలే తమ ఉద్యమ ప్రధాన లక్ష్యాలని సీజేపీ నాయకత్వం వెల్లడించింది. తమ ఉద్యమం మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాల ఆధారంగా కొనసాగుతుందని, అహింసా మార్గంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పోరాటం చేస్తామని సంస్థ తెలిపింది. సంప్రదాయ రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటూ విద్యా రంగ మార్పుల కోసం పనిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను తమ పేపర్ లీక్ వ్యతిరేక ఉద్యమంలో కీలక మైలురాయిగా సీజేపీ అభివర్ణించింది. అయితే తమ పోరాటం ఒక్క సంఘటనతో ఆగిపోదని, దేశ విద్యా వ్యవస్థలో విస్తృత మార్పులు వచ్చే వరకు కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చింది. గురువారం సీజేపీ చేయనున్న ప్రకటనలో దేశవ్యాప్త విస్తరణ ప్రణాళికలు, కొత్త కార్యక్రమాలు, విద్యార్థి ఉద్యమాలతో అనుసంధానం వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పేపర్ లీకుల అంశంతో ప్రారంభమైన ఈ ఉద్యమం భవిష్యత్తులో ఎంతటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
అభిజిత్ దీప్కే సంచలన నిర్ణయం
ఊహాగానాలకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తెర దించింది. ఆ పార్టీ భవిష్యత్‌పై వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. రాజకీయ పార్టీగా మారే ఆలోచన తమకు లేదని.. ప్రజా సమస్యలపై ఒత్తిడి తీసుకొచ్చే ‘ప్రెజర్ గ్రూప్’గానే పనిచేస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో జరుగుతున్న రెండు రోజుల వ్యూహ సమావేశాల సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.30 ఏళ్ల అభిజిత్ దీప్కే కేవలం రెండు నెలల క్రితమే వ్యంగ్య రూపంలో కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. తొలుత సోషల్ మీడియా వేదికగా సరదా ఉద్యమంలా కనిపించిన ఈ సంస్థ.. ఆ తర్వాత పరీక్షల అక్రమాలు, పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరిగిన విద్యార్థి ఆందోళనలకు దీప్కే నాయకత్వం వహించారు. ఆ నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.‘పార్టీ పెట్టే ఆలోచన లేదు’తమ భవిష్యత్ ప్రణాళికలపై దీప్కే మాట్లాడుతూ.. “రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన ప్రస్తుతం లేదు. మీడియాకే ఆ అంశంపై ఆసక్తి ఎక్కువగా ఉంది. మేము ప్రెజర్ గ్రూప్‌గా పనిచేస్తాం” అని తెలిపారు. యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలు, పరీక్షల నిర్వహణలో అక్రమాల వంటి అంశాలపై పోరాడడమే తమ లక్ష్యమని చెప్పారు.దేశవ్యాప్త విస్తరణకు ప్రణాళికCJP ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించే దిశగా వ్యూహాలు రూపొందిస్తున్నట్లు దీప్కే తెలిపారు. యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా ‘లిజనింగ్ టూర్’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. “దేశంలోని ఏ ప్రాంతంలో విద్యార్థులు సమస్యలపై పోరాడినా.. వారికి అండగా ఉంటాం” అని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం జార్ఖండ్‌లో జేపీఎస్సీ సివిల్స్ పరీక్షలో అక్రమాల ఆరోపణలపై కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి మద్దతు ఇచ్చే అంశాన్ని కూడా సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. అవసరమైతే అక్కడికి వెళ్లి మద్దతు ఇస్తామని చెప్పారు. జంతర్ మంతర్ ఆందోళన సమయంలో 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తమ ఉద్యమానికి మార్గదర్శకుడిగా ఉన్నారని దీప్కే పేర్కొన్నారు. జార్ఖండ్ విద్యార్థి నేతలతో వాంగ్‌చుక్ ఇప్పటికే మాట్లాడి సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే.(అయితే ఈ మీటింగ్ జరుగుతున్న వేళ.. ఇవాళ అక్కడి ఆందోళలను విరమించడం గమనార్హం)యువత ఉద్యమానికి కొత్త దిశ?సీజేపీ వ్యూహ సమావేశంలో సంస్థ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, దాదాపు 50 మంది కీలక వాలంటీర్లు పాల్గొన్నారు. యువత సమస్యలను ఒక వేదికపైకి తీసుకురావడం, వాటిపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని వారు తెలిపారు. “యువత ఒక్కటైతే ఏదైనా సాధించగలరని ఈ ఉద్యమం నిరూపించింది” అని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ వ్యాఖ్యానించారు.కేవలం వ్యంగ్య వేదికగా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు యువత సమస్యలపై జాతీయ స్థాయి ఉద్యమ వేదికగా మారే ప్రయత్నం చేస్తోంది. అయితే ఎన్నికల రాజకీయాల్లోకి కాకుండా.. ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే శక్తిగా కొనసాగాలని అభిజిత్ దీప్కే ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. -
ఉద్యమ స్ఫూర్తి కోసం ఎటో చూడక్కరలేదు
ఛత్రపతి శంభాజీనగర్: విద్యార్థి లోకం ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లేందుకు తగిన స్ఫూర్తి కోసం బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగుదేశాల వైపు చూడాల్సిన అగత్యంలేదని, మనకు మహాత్మాగాంధీ ఉన్నారని కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే వ్యాఖ్యానించారు. సోమవారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో పీటీఐకి ఇచి్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో దీప్కే పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహాత్మాగాంధీ నుంచి స్ఫూర్తి కణికలు దేశ నలుచెరుగులా ఎగసిపడుతుండగా మళ్లీ ఉద్యమస్ఫూర్తి కోసం విదేశాల వైపు చూడాల్సిన అగత్యం మన యువతరానికి పట్టలేదు. వాస్తవానికి బంగ్లాదేశ్, నేపాల్‌లో జరిగిన ఉద్యమాలకు భారత ప్రతిష్టను దిగజార్చేందుకు జరిగిన ప్రయత్నాలు. అక్కడ ఉద్యమాలు హింసాత్మక బాటలో కొనసాగాయి. కానీ భారత్‌లో మనం ప్రత్యేకం. రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాం. మన విద్యార్థుల విదేశీయుల మాదిరి అనవసరంగా ఉద్రేకాలకు లోనుకారు. సంయమంతో డిమాండ్ల సాధన కోసం పోరాడతారు. జంతర్ మంతర్‌లో ఎంతో మంది విద్యార్థులు, సీజేపీ కార్యకర్తల తలలు పగలాయి. కాళ్లు, చేతులు విరిగాయి. అయినాసరే సంయమనం కోల్పోకుండా మొక్కవోని దీక్షతో నీట్ ఉదంతం సహా పరీక్షల వ్యవస్థ, విద్యావ్యవస్థలో సమూల మార్పుల కోసం శాంతియుతంగా పోరాడారు’’అని అన్నారు. విద్య ప్రధాన అజెండాగా మారాలి ‘‘దేశంలో ప్రతి ఎన్నికల్లోనూ కులం, మతం, ప్రాంతం వంటివి ప్రధానాంశాలుగా మారే సంస్కృతికి చరమగీతం పాడుదాం. ఎన్నికల్లో విద్య అనేది ప్రధాన అజెండాగా మారాలి. విద్యకు ఎన్నికల్లో ప్రధాన అజెండా హోదా దక్కకపోతే భవిష్యత్ గురించి ఆలోచన పెట్టుకోవడం వృథా. దేశ భవిష్యత్తకు విద్య అనేదే అసలైన పెట్టుబడి. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీతో మనస్తాపం చెంది ప్రాణాలుతీసుకున్న బాధితుల కుటుంబాలకు హామీ ప్రకారం అందజేస్తామన్న నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు మంజూరుచేయకపోవడం దారుణం. రాత్రికిరాత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వందల అధికార పారీ్టల వద్ద కోట్లకొలదీ డబ్బు ఉంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలను కొనేందుకు వందల కోట్ల నగదును సిద్ధంగా ఉంచుకుంటారు. తీరా నీట్ ఉదంతంలో బాధిత విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలంటే మాత్రం రూపాయి కూడా బయటకు తీయరు. ఇకనైనా బాధితులకు వీలైనంత త్వరగా నష్టపరిహారం ఇవ్వాలి. ఇవ్వకపోతే మళ్లీ ఉద్యమబాటలో పయనిస్తాం’’అని దీప్కే స్పష్టంచేశారు. బీజేపీ నేతల స్థాయి మాకు చేతకాదు‘‘బీజేపీ నేతలు పార్లమెంట్లో, సభలు, సమావేశాల్లో ఇష్టమొచి్చనట్లు మాట్లాడతారు. అంతటి తెలివితేటలు, స్థాయి మా జెన్ జీ తరానికి లేవు. అది మాకు చేతకాదు. గూండాలకు, విద్యార్థులకు చాలా తేడా ఉంది. ఆ తేడా ఎప్పుడూ ఉంటుంది’’అని బీజేపీపై వెటకారంగా మాట్లాడారు. జార్ఖండ్‌లో పోరుకు మా మద్దతు ‘‘జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో తీవ్రస్థాయిలో అవకతవకలు జరిగాయి. న్యాయం కోసం జార్ఖండ్‌లో పరీక్షార్థులు ఉద్యమిస్తున్నారు. వాళ్లకు మా సీజేపీ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. పబ్లిక్ సరీ్వస్ పరీక్షలతోపాటు ఇతర నియామక పరీక్షల్లో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాల్సిందే. నియామక ఏజెన్సీల్లో సంస్కరణలు తేవాలి. జార్ఖండ్‌లో పరీక్షార్థుల ఉద్యమం ఏ రాజకీయ పారీ్టతో సంబంధంలేదు. లోపభూయిష్ట పరీక్ష వ్యవస్థమీదనే వాళ్లు పోరాడుతున్నారు. వాళ్ల డిమాండ్లకు మేం మద్దతిస్తున్నాం. విద్యావ్యవస్థ బాగు కోసం ఏ రాష్ట్రంలో ఉద్యమం ఆరంభమైనా సీజేపీ తన వంతు మద్దతు తెలుపుతుంది. అక్కడ ఏ పార్టీ అధికారంతో ఉంది అనేది మాకు సంబంధం లేదు’’అని దీప్కే స్పష్టంచేశారు. అక్కడ అద్భుతమైన వసతులు‘‘విద్యా వ్యవస్థ మౌలిక వసతుల దగ్గరికొచ్చేసరికి విదేశాల్లో అద్భుతమైన వనరులు, వసతులు ఉంటాయి. భారత్‌లో ఆ స్థాయిలో పరిస్థితులు లేనేలేవు. ఎంతో నేర్చుకుందామనుకుంటే అంతలా అక్కడి మౌలిక వసతులు విదేశీ విద్యార్థులను దోహదపడతాయి. మౌలికవసతుల రూపంలో విద్యార్థులకు ఎంతో తోడ్పాటుఅందుతుంది. భారత్‌లో ఇంకా పరిస్థితులు గ్రేడ్లు ఇవ్వడానికి పరిమితమయ్యాయి. నేను అమెరికా విద్యనభ్యసించేటప్పుడు ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్య, సిలబస్ ఉంది. భారత్‌లోనూ అలాగే ప్రాక్టికల్ అభ్యసన విధానం ఉంటే బాగుంటుంది. కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుత మోదీ సర్కార్ విద్యకు తక్కువ నిధులు కేటాయిస్తోంది. విద్యకు కేటాయింపులను కేంద్రప్రభుత్వం ఎందుకు తగ్గిస్తోందో అర్థంకావట్లేదు. కేటాయింపులు ఎంతగా పెరిగితే దేశ పునాదులు అంత పటిష్టంగా మారతాయి’’అని దీప్కే అన్నారు. ఆ నిధిని ఉపయోగించుకోవాలి ‘‘పీఎం కేర్స్ ఫండ్‌లో ఎంత నగదు ఉందో ఎవరికీ తెలీదు. వేల కోట్ల నగదు నిల్వలు మూలుగుతుంటే మాత్రం వాటిలో కొంత మేర విద్యాభివృద్ధికి తప్పకుండా కేటాయించాలి. నాణ్యమైన విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం సామాన్యుడికి అది అందని ద్రాక్ష అయింది’’అని దీప్కే ఆవేదన వ్యక్తంచేశారు. అది కీలక భేటీయే.. ‘‘రేపు(5న) ఛత్రపతి శంభాజీనగర్‌లో జరగబోయే సీజేపీ భేటీ కీలకమైంది. తాజా ఉద్యమం విజయవంతం కావడంతో మాపై బాధ్యత పెరిగింది. సీజేపీ దేశవ్యాప్తంగా ఎదిగి విద్యార్థుల కోసం పోరాడాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అందుకే సీజేపీని విస్తరించాలని భావిస్తున్నాం. ఆగస్ట్ ఐదునాటి భేటీలో మా తదుపరి కార్యాచరణను ఖరారుచేయాలని యోచిస్తున్నాం. మా ఇంట్లో సీజేపీ కీలక 10 లేదా 15 మంది సభ్యులతో పలు అంశాలపై చర్చించనున్నాం’’అని దీప్కే వెల్లడించారు. -
అభిజిత్ కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై ఆరా
-
5న సీజేపీ కీలక భేటీ
ఛత్రపతి శంభాజీనగర్: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక సభ్యుల సమావేశం ఈ నెల 5వ తేదీన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరగనుంది. తదుపరి కార్యాచరణను ఖరారు చేయడమే అజెండాగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నివాసంలో భేటీ జరగనుందని పార్టీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. వలంటీర్లు, విద్యార్థులతో చర్చలు జరిపి, సూచనలు, సలహాలతో ఈ సమావేశానికి రావాల్సిందిగా ఇప్పటికే కీలక సభ్యులకు సమాచారం అందించామని తెలిపాయి. 5న సమావేశం అనంతరం మీడియాతో భేటీ ఉంటుందని, భవిష్యత్ కార్యాచరణను వెల్లడించే అవకాశాలున్నాయని సీజేపీ వర్గాలు వివరించాయి. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్‌తో సీజేపీ జంతర్‌మంతర్‌లో నిరసనలు కొనసాగించడం తెల్సిందే. -
మోదీ పెద్ద మనసు.. తనను తిట్టిన అమ్మాయికి ‘కొత్త జీవితం’ ఇచ్చిన ప్రధాని!
సాక్షి,ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో జరిగిన విద్యార్థి ఆందోళనల్లో పాల్గొన్న ఓ మైనర్ బాలిక, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై సదరు బాలిక తల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీ పెద్ద మనసుతో తన కుమార్తెను క్షమించి, ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారని కొనియాడారు. ఈ సందర్భంగా తన కుమార్తెపై నమోదైన జీరో ఎఫ్ఐఆర్ను పూర్తిగా ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.చేతులు జోడించి ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నాను. నా కుమార్తె చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని మోదీ పెద్ద మనసుతో క్షమించారు. ప్రధాని కొత్త జీవితాన్ని ప్రసాదించడంతో ఆమె మళ్లీ జన్మించినట్లైంది’అని అన్నారు.కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలో బాలిక ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గత వారం నోయిడా పోలీసులు ఆమెపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్లో బాలిక పేరు రుచికా సింగ్, వయస్సు 25గా పొందుపరిచారు. అయితే ఆ ఎఫ్ఐఆర్లో తన కుమార్తె వివరాలు తప్పుగా ఉన్నాయని ఆమె తల్లి మోదీకి వివరించారు.మోదీపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఒకటే అభ్యర్థిస్తున్నాను. దయచేసి ఆమెపై తప్పుడు పేరు, వయస్సుతో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను తొలగించండి. అప్పుడు ఆమె ప్రశాంతంగా జీవించగలదు. ఇప్పుడు ఆమె మీ పర్యవేక్షణలో ఉంది. మైనర్ పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారిని ఆసరాగా చేసుకుని లబ్ధి పొందాలనుకునే వారికి సులభ లక్ష్యాలుగా మారతారని పేర్కొంటూ, వారిపై సోషల్ మీడియాను నిషేధించాలని కూడా ఆమె ప్రధానమంత్రిని కోరారు.విద్యార్థుల నిరసనల సందర్భంగా తనపై చేసిన దూషణాత్మక నినాదాల విషయంలో, ప్రధాని మోదీ గత శుక్రవారం సంయమనం పాటించాలని, క్షమించాలని విజ్ఞప్తి చేశారు. ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో ఆయన దూషణలు ఎప్పటికీ దేనినీ పరిష్కరించవు అని పేర్కొంటూ వారిని శిక్షించడం కాకుండా సమాజం వారికి మార్గనిర్దేశం చేయాలని కోరారు.వారు తప్పుదారి పట్టిన పిల్లలు. వారికి సరైన మార్గాన్ని చూపించడం మన బాధ్యత. వారిని శిక్షించడం, కోర్టుల చుట్టూ తిప్పడం లేదా వేధించడం వల్ల పరిస్థితులేమీ మారవు. నేను వారిని క్షమించాలనుకుంటున్నాను. సమాజం కూడా నా మాటను అంగీకరించాలని కోరుతున్నాను’ అని ఆయన అన్నారు.తనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై బాలిక ప్రధానికి క్షమాపణలు చెప్పారు. నిరసన సమయంలో ఇతరుల ప్రభావంతోనే తాను ప్రధానమంత్రిని ఉద్దేశించి అసభ్య పదజాలం వాడానని ఆమె పేర్కొన్నారు. నా వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. నేను చేసిన పని క్షమించరానిది. నేను అభ్యంతరకరమైన మాటలు అన్నాను. ఇదే నా మొదటి, చివరి తప్పు. దేశం మొత్తానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. నా ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికి కూడా నాకు ధైర్యం చాలడం లేదు. దయచేసి నన్ను క్షమించండి’ అని ఆమె చెప్పింది. -
ముఖేశ్ ఖన్నాకు ఇచ్చిపడేసిన సీజేపీ
న్యూఢిల్లీ: బాలీవుడ్ సీనియర్ నటుడు ముఖేశ్ ఖన్నా తమపై చేసిన వ్యాఖ్యలకు కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చింది. నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలకు నిరసన తెలిపిన వారికి మద్దతు ఇచ్చిన యువతపై బెదిరింపులకు దిగడాన్ని తిప్పికొట్టింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న యువతకు ఉద్యోగాలు రావని, ప్రభుత్వం సాయం అందని ముకేశ్ ఖన్నా హెచ్చరించారు. అంతేకాదు వారిని మురికి కాలువలోని పురుగులుగా ఆయన వర్ణించారు. సీజేపీ ట్రాప్‌లో పడొద్దని పిల్లలకు సూచించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టడంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో కూడా షేర్ చేశారు.''ఇంట్లోకి బొద్దింకలు వస్తే, మనం ఏం చేస్తాం?? వాటిని వెతికి పట్టుకుంటాం, పైకి ఎత్తి బయట పడేస్తాం. వీరితో కూడా అలాగే చేయండి. కొంత మంది పిల్లలు ప్రలోభాలకు లొంగిపోయి, ఆవేశంలో అన్ని రకాల తప్పుడు, నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. వారికి ఇదే నా హెచ్చరిక.. మీ మాటలు చరిత్రలో లిఖించబడ్డాయి. వారితో తిరగడం ద్వారా, మీరు మిమ్మల్ని మీరే ఒక మురికి కాలువలోని పురుగులుగా మార్చుకున్నారు. దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది!!ఏ పోలీసులూ మీకు సహాయం చేయరు. చాలామంది మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి సంకోచిస్తారు. ప్రభుత్వ సహాయం నిలిపివేయబడుతుంది. మీకు కొన్ని వీసాలు కూడా రాకపోవచ్చు!! మీరు ఇప్పటికే మీ కుటుంబం దృష్టిలో పడిపోయారు! అందుకే, మీరు వారి బారి నుండి ఎంత త్వరగా తప్పించుకుంటే అంత మంచిది. నాకు మీ గురించి ఆందోళనగా ఉంద''ని ఎక్స్‌లో పేర్కొన్నారు.మాకు మీరు తెలియదుముఖేశ్ ఖన్నా వ్యాఖ్యలను సీజేపీ తిప్పికొట్టింది. తాము జెనజీ తరానికి చెందిన వాళ్లమని మీ గురించి మాకు తెలియదు అనే అర్ధం వచ్చేలా కౌంటర్ ఇచ్చింది. ''క్షమించండి, మేము జెన్‌జీ. మేము స్పైడర్మాన్, బాట్మాన్, మార్వెల్స్ చూశాం. మీ గురించి మాకు తెలియదు. కాబట్టి మీ జ్ఞానాన్ని మీ జేబులోనే ఉంచుకోవాల''ని ఎక్స్‌లో సీజేపీ జవాబిచ్చింది. కాగా, శక్తిమాన్ పాత్రతో ముఖేశ్ ఖన్నా సినిమా రంగంలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు అదే తరహాలో సీజేపీ కౌంటర్ ఇచ్చింది.Sorry , but we are Gen-z हम spiderman, batman, Marvels देखते हैं Animes देखते हैं ! हम आपको नहीं जानते ! So please keep your knowledge in your pocket. https://t.co/OdQp0Pe25M— Cockroach Janta Party (@shah34516) August 1, 2026చదవండి: ఈ20 ఇథనాల్ పెట్రోల్ స్కామ్‌ను బయటపెడతా -
జెన్‌జీ టెన్షన్?.. CJI కార్యక్రమం వాయిదా!
విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టమైన కాన్వొకేషన్ వేడుక. అలాంటి వేడుకకు దేశ ప్రధాన న్యాయమూర్తి హాజరు కావడంపై వాళ్లు ఒకింత ఎగ్జయిటింగ్‌గా ఫీలయ్యారు. తల్లిదండ్రుల కోసం టికెట్లు.. హోటల్ రూమ్స్ అన్నీ బుక్ చేసుకుని కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆ సమయంలోనే అనూహ్యంగా కార్యక్రమం వాయిదా పడడంతో వందలాది మంది నిరాశకు లోనయ్యారు.మహారాష్ట్ర ముంబైలోని ప్రతిష్ఠాత్మక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) తన 86వ కాన్వొకేషన్ వేడుకను ఆకస్మికంగా వాయిదా వేసింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే ఆగస్టు 2న జరగాల్సిన ఈ వేడుకను “అనుకోని పరిస్థితులు” కారణంగా వాయిదా వేస్తున్నట్లు TISS రిజిస్ట్రార్ విద్యార్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారు. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అయితే ఈ నిర్ణయం వెనుక భద్రతా కారణాలు ఉన్నాయనే చర్చ మొదలైంది.కాక్రోచ్ నిరసనల భయమేనా?TISS అధికారికంగా కారణాలను వెల్లడించకపోయినా.. క్యాంపస్‌లో భద్రతాపరమైన ఆందోళనలు, సాధ్యమైన నిరసనలపై వచ్చిన సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమానికి సంబంధించిన నిరసనలు కాన్వొకేషన్ సమయంలో చోటుచేసుకునే అవకాశం ఉందన్న నిఘా సమాచారంతో అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు ప్రముఖులు పాల్గొనే కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వేడుకను వాయిదా వేసినట్లు సమాచారం.CJIతో పాటు పలువురు ప్రముఖులు.. ఈ కాన్వొకేషన్‌కు జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అలాగే బాంబే హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రవీంద్ర ఘుగే కూడా కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దేశంలోని ప్రముఖ న్యాయవ్యవస్థకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే కార్యక్రమం కావడంతో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కాన్వొకేషన్ వాయిదాకు నిరసనలే కారణమని TISS అధికారికంగా ప్రకటించలేదు. భద్రతా పరిస్థితులు, అనుకోని పరిణామాల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమని మాత్రమే సంస్థ వెల్లడించింది.టికెట్లు బుక్.. చివరికి వాయిదాకాన్వొకేషన్ కోసం విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. కొందరు విమాన టికెట్లు, మరికొందరు రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు. హోటల్ గదులు కూడా రిజర్వ్ చేసుకున్నారు. చివరి నిమిషంలో కార్యక్రమం వాయిదా పడటంతో ప్రయాణ ఖర్చులు, వసతి కోసం చేసిన ఖర్చులు వృథా అయ్యాయని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులకు కొత్త తేదీ ఎప్పుడు ప్రకటిస్తారన్న ఆందోళన కూడా నెలకొంది.ఆర్థిక నష్టంపై పరిశీలనవిద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తించిన TISS.. ఆర్థిక నష్టంపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని తెలిపింది. అవసరమైన వారికి తాత్కాలిక ధ్రువపత్రాలు అందిస్తామని, కొత్త కాన్వొకేషన్ తేదీని త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది.బొద్దింకల వ్యాఖ్యలతోనే..అప్పట్లో ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ కొందరు నిరుద్యోగ యువతను ఉద్దేశిస్తూ “కాక్రోచ్లు”, “పరాన్నజీవులు” వంటి పదాలు ఉపయోగించారని ప్రచారం జరిగింది. ఆ వ్యాఖ్యలకు నిరసనగానే.. కాక్రోచ్ జనతా పార్టీని మహారాష్ట్రకే చెందిన అభిజిత్ దీప్కే ప్రారంభించాడు. అది.. నీట్ నిరసన ఉద్యమంతో ఎంత పని చేసిందో అందరికీ తెలిసిందే. అయితే.. తాను యువతను ఉద్దేశించి అలా అనలేదని, నకిలీ డిగ్రీలతో ప్రాక్టీస్ చేస్తున్న లాయర్లనే అన్నానని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తరచూ వివరణ ఇస్తూ వస్తున్నారు. మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారంటూ మొన్నీమధ్యే ఆవేదన వ్యక్తం చేశారు. అంతెందుకు.. జంతర్ మంతర్ నిరసనల పిటిషన్‌ను కూడా ఆయన బెంచే ఇప్పుడు విచారణ జరుపుతుండడం గమనార్హం. ఈ తరుణంలో.. CJI హాజరు కావాల్సిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అలాంటి నిరసనలు జరుగుతాయనే అనుమానంతో చివరి నిమిషంలో వాయిదా పడటం కొత్త చర్చకు దారితీసింది. -
పాక్ హోంమంత్రి హెచ్చరిక.. మునీర్‌కు ముప్పు సంకేతమా?
పాకిస్తాన్లో పెరుగుతున్న అసంతృప్తి, యువతలో ఆగ్రహం, కుప్పకూలుతున్న పాలనా వ్యవస్థపై ఆ దేశ హోంమంత్రి మొహ్సిన్ నక్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. సాధారణంగా ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంటాయి. కానీ ఇక్కడ ఏకంగా అంతర్గత వ్యవహారాల మంత్రే.. నిరాశకు గురైన యువత ఒక్కటైతే దేశాన్ని మార్చగల శక్తి వారికి ఉందని హెచ్చరించడం ఆసక్తికర పరిణామంగా మారింది.ఇస్లామాబాద్‌లో జరిగిన పాకిస్తాన్ ఎకనామిక్ సమ్మిట్‌లో పాల్గొన్న మొహ్సిన్ నక్వీ, దేశంలోని పాలనా వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న విధానాలతో సమస్యలకు పరిష్కారం లభించదని, పరిపాలనా వ్యవస్థలో మూలస్థాయి మార్పులు అవసరమని అన్నారు. ‘ఇప్పుడు మనం జీవిస్తున్న వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ విధానంతో సమస్యలను పరిష్కరించలేం. నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టకపోతే పదేళ్ల తర్వాత కూడా ఇవే సమస్యలపై చర్చించాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.బొద్దింకలైనా సరే.. ఏకమైతే శక్తే!దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించిన నక్వీ.. వారికి ఆర్థిక సాయం కంటే ఉద్యోగాలు, ప్రతిభకు గుర్తింపు, న్యాయం ముఖ్యమని అన్నారు. ‘ప్రజలకు కావాల్సింది న్యాయం, ప్రతిభకు విలువ, ఉద్యోగ అవకాశాలు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చేసిన ఓ వ్యాఖ్య మాత్రం సంచలనంగా మారింది. ‘ఆ యువకుడిని యువత అనండి... బొద్దింక అనండి... ఇంకేదైనా అనండి. కానీ ఆ బొద్దింకలన్నీ ఒక్కటైతే అన్నింటినీ తలకిందులు చేయగలవు’ అని అన్నారు. నక్వీ నేరుగా ఏ నిరసనను ప్రస్తావించకపోయినా, ఇటీవల భారత్‌లో జరిగిన సీజేఐ (CJP) ఉద్యమం, దాని రాజకీయ ప్రభావాల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాకిస్తాన్‌లోనూ యువతలో పెరుగుతున్న నిరాశ, నిరుద్యోగం, అవకాశాల కొరత ఒక పెద్ద ఉద్యమానికి దారితీయవచ్చన్న ఆందోళన ఈ వ్యాఖ్యల్లో కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదే సమయంలో పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆసిమ్ మునీర్ పాత్రపై కూడా నక్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. మునీర్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కటే దేశ సమస్యలను పరిష్కరించలేవని, రాజకీయ నాయకులు కలిసి పాలనా వ్యవస్థను మార్చకపోతే శాశ్వత ఫలితాలు రావని అన్నారు. ‘రాజకీయ నాయకులు దేశ వ్యవస్థను సరిచేయకపోతే ఫీల్డ్ మార్షల్ చేస్తున్న కృషికి ప్రయోజనం ఉండదు’ అని స్పష్టం చేశారు. మునీర్ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయనని పలుమార్లు చెప్పారని గుర్తుచేసిన నక్వీ, అన్ని రాజకీయ పార్టీలు కలిసి దేశ పరిపాలనను మెరుగుపర్చేందుకు పనిచేయాలని సూచించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేస్తున్నప్పటికీ, వ్యవస్థలో మార్పులు లేకపోతే అది కేవలం సమస్యలపై తాత్కాలిక చర్యలకే పరిమితమవుతుందని అభిప్రాయపడ్డారు.భారీ అప్పులు, బలహీన పాలన, నెమ్మదించిన అధికార యంత్రాంగం, నిరుద్యోగం, ప్రతిభ ఆధారిత అవకాశాల కొరత వంటి సమస్యలు పాకిస్తాన్‌ను వెంటాడుతున్నాయని నక్వీ పేర్కొన్నారు. వీటికి తాత్కాలిక పరిష్కారాలు కాకుండా వ్యవస్థాగత సంస్కరణలే అవసరమని అన్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఆర్థిక కష్టాలు, రాజకీయ విభేదాల మధ్య దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రజల అసంతృప్తి ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో పాలక వర్గాల్లోనే చర్చకు వస్తుండటం పాకిస్తాన్ భవిష్యత్ రాజకీయాలపై ఆసక్తిని పెంచుతోంది. -
రుచికా సింగ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. క్రిమినల్ కేసుపై CJP సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై జరిగిన నిరసనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యువతి రుచికా సింగ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తీవ్రంగా తప్పుబట్టారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను సమర్థించలేమని స్పష్టం చేసిన ఆయన, అలాంటి సందర్భాల్లో క్రిమినల్ చర్యలకు బదులుగా పరువు నష్టం దావా వంటి చట్టపరమైన మార్గాలను అనుసరించాలని సూచించారు.జూలై 23న జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న రుచికా సింగ్ ప్రధాని గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆమెపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ పరిణామంపై స్పందించిన సౌరవ్ దాస్, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసే విధంగా క్రిమినల్ చట్టాలను వినియోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు.‘రుచికా సింగ్ చేసిన వ్యాఖ్యలు తప్పు కావచ్చు. అవి చాలామందికి అభ్యంతరకరంగా అనిపించవచ్చు. కానీ కేవలం అలాంటి భాష వాడినందుకు ఒక యువతిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం సమంజసం కాదు. అలాంటి సందర్భాల్లో పరువు నష్టం దావా వంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. క్రిమినల్ విచారణ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది యువతకు ఆమోదయోగ్యం కాదు’ అని ఆయన అన్నారు.అయితే యువ నిరసనకారులు తమ అసమ్మతిని వ్యక్తం చేసే సమయంలో సంయమనం పాటించాలని, ఉపయోగించే పదాల విషయంలో మరింత బాధ్యతతో వ్యవహరించాలని కూడా దాస్ సూచించారు. ప్రజాప్రతినిధులు లేదా ఇతర వ్యక్తులపై వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో పోలీసులు రాజకీయ ప్రయోజనాల కోసం తమ అధికారాలను దుర్వినియోగం చేయరాదని ఆయన హెచ్చరించారు. ‘క్రిమినల్ న్యాయ వ్యవస్థను ఇలాంటి సందర్భాల్లో వినియోగించడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. పోలీసులు శాంతంగా వ్యవహరించాలి. యువతపై వేధింపులు ఆగాలి’ అని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, ఘజియాబాద్‌కు చెందిన స్మృతి సింగ్ ఫిర్యాదు మేరకు జూలై 29న గౌతమ్ బుద్ధ నగర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో రుచికా సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రధానమంత్రి రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీశాయని, ద్వేషాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో చేసినవని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదు చేశారు.జీరో ఎఫ్ఐఆర్ విధానం ప్రకారం, నేరం ఎక్కడ జరిగినా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం సంబంధిత అధికార పరిధి ఉన్న పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేస్తారు. నీట్ పేపర్ లీక్, పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన సీజేపీ ఆందోళన నేపథ్యంలో ఈ వివాదం చోటుచేసుకుంది. 36 రోజుల పాటు కొనసాగిన నిరసనలు కేంద్ర ప్రభుత్వం పార్టీ ప్రధాన డిమాండ్లను అంగీకరించిన అనంతరం జూలై 25న ముగిశాయి. -
కాక్రోచ్లు ఏం చేశారో చూడండి.. ఢిల్లీ పోలీసుల కుటుంబాల ఆవేదన
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ విద్యార్థుల ఆందోళన సందర్భంగా పోలీసులు కర్కశంగా వ్యవహరించారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. గాయపడిన పోలీసుల కుటుంబాలు మరో వాదనను తెరపైకి తీసుకొచ్చాయి. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘర్షణల్లో పోలీసులపై కూడా తీవ్ర దాడులు జరిగాయని ఆరోపిస్తూ బాధిత సిబ్బంది కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. తమవాళ్లపై జరిగిన దాడులకు కూడా న్యాయం కావాలని డిమాండ్ చేశారు.ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఉదయం సంచలన ప్రెస్‌మీట్ నిర్వహించారు. జంతర్ మంతర్ ఆందోళనల్లో గాయపడిన పోలీసుల కుటుంబాలు ఘటనకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వాళ్ల కుటుంబ సభ్యులు.. అసాంఘిక శక్తులు చొరబడి హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటివరకు విద్యార్థులపై పోలీసుల చర్యల గురించే ఎక్కువగా చర్చ జరిగిందని, కానీ విధి నిర్వహణలో గాయపడిన పోలీసుల పరిస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాయి.నా తండ్రిని ఈడ్చుకెళ్లి కొట్టారు.. ఢిల్లీ పోలీస్ ఏఎస్ఐ కుమార్తె మాట్లాడుతూ తన తండ్రిపై జరిగిన దాడిని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి గతంలో 15 ఏళ్ల పాటు భారత నౌకాదళంలో మెరైన్ కమాండోగా పనిచేశారని, అనంతరం ఢిల్లీ పోలీస్‌లో చేరారని తెలిపారు. #WATCH | Delhi | Daughter of a Delhi Police SI (Sub-Inspector) who sustained injuries during the clash between Police and protesters in Delhi, says, "...Before joining the police, my father served as a Marine Commando in the Indian Navy. He dedicated 15 years of his life to the… pic.twitter.com/aevnbcdNyQ— ANI (@ANI) July 31, 2026“జంతర్ మంతర్ వద్ద బ్యారికేడ్ల దగ్గర విధుల్లో ఉన్న సమయంలో ఓ గుంపు ఆయనను ఈడ్చుకెళ్లింది. దాదాపు మూక దాడికి గురయ్యారు. స్పృహ కోల్పోయి ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో నాలుగు గంటలు ఉన్నారు” అని ఆమె తెలిపారు. “రాత్రి 10 గంటలకు సహచర పోలీసులు ఇంటికి తీసుకొచ్చారు. ఆయన యూనిఫాం మొత్తం రక్తంతో తడిసిపోయింది. ఆ దృశ్యం మా కుటుంబానికి ఎప్పటికీ మర్చిపోలేని బాధ” అని చెప్పారు. తన తండ్రి తలకు నాలుగు కుట్లు పడ్డాయని, అయినప్పటికీ “ఇవి విధిలో భాగమే” అంటూ కుటుంబాన్ని ధైర్యం చెప్పారని ఆమె పేర్కొన్నారు.‘సోషల్ మీడియాలో మమ్మల్ని నేరస్థులుగా చూపిస్తున్నారు’పోలీసులపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. “సోషల్ మీడియాలో నా తండ్రినే నేరస్థుడిగా చూపిస్తున్నారు. కానీ దాడికి గురైన మా కుటుంబానికి కూడా న్యాయం కావాలి. మాకు కూడా సమాన హక్కులు ఉన్నాయి” అని ఏఎస్ఐ కుమార్తె అన్నారు. గాయపడిన పోలీసుల కుటుంబాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయని తెలిపారు.‘రాళ్ల దాడిలో నా భర్త హెల్మెట్ పగిలిపోయింది’మరో ఏఎస్ఐ భార్య సీమ మాట్లాడుతూ.. 33 ఏళ్లుగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న తన భర్త జులై 20న జంతర్ మంతర్ వద్ద విధుల్లో ఉన్నారని చెప్పారు. ఆందోళనకారుల సంఖ్య పెరిగిందని, కొందరు పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారని భర్త తనకు చెప్పారని తెలిపారు.VIDEO | Wife of a Delhi Police ACP who sustained injuries during the clash between police and CJP protesters in Delhi on July 20, says, "When he returned home late on the night of July 20 with injuries, it was an extremely painful and traumatic moment for me and my two-year-old… pic.twitter.com/l6YllUXHS3— Press Trust of India (@PTI_News) July 31, 2026“ఆందోళనకారులు పూల కుండీలు, చెప్పులు, రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. నా భర్త ధరించిన హెల్మెట్ రాళ్ల దాడిలో పూర్తిగా ధ్వంసమైంది. హెల్మెట్ లేకపోతే ఆయన ప్రాణాలతో ఉండేవారు కాదేమో” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.‘సీనియర్ అధికారులను కాపాడుతూ గాయపడ్డారు’మరో ఏఎస్ఐ కుమారుడు లక్ష్య మాట్లాడుతూ.. తన తండ్రి సీనియర్ అధికారులను సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నంలో రాళ్ల దాడికి గురయ్యారని ఆరోపించారు. “తలపై రాయి తగలడంతో నాలుగు కుట్లు పడ్డాయి. ఆన్లైన్లో చూస్తే పోలీసులపై మాత్రమే విమర్శలు కనిపిస్తున్నాయి. మా బాధను ఎవరూ పట్టించుకోవడం లేదు” అని అన్నారు.#WATCH | Delhi | A family member of a Delhi Police official who sustained injuries during the clash between Police and protesters in Delhi, says, "This was not a student protest; rather, there were mischievous elements who tried to sabotage and discredit the students' protest and… pic.twitter.com/qfyP8CawD4— ANI (@ANI) July 31, 2026రెండు వాదనలు.. వీడియోలు వైరల్జంతర్ మంతర్ ఆందోళనపై ఇప్పటివరకు ప్రధానంగా విద్యార్థులపై పోలీసులు అధిక బలప్రయోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. లాఠీచార్జ్, అరెస్టులు, పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా పోలీసుల కుటుంబాలు విడుదల చేసిన వీడియోలు, చేసిన ఆరోపణలు ఘటనకు మరో కోణాన్ని చూపిస్తున్నాయి. ఆందోళన సమయంలో పోలీసులు కూడా దాడులకు గురయ్యారా? లేక బలప్రయోగం అంశం ఎంతవరకు సమంజసం? అన్నదానిపై మరోసారి చర్చ మొదలైంది. ఈ వ్యవహారంలో విద్యార్థులు, పోలీసులు ఇద్దరి వాదనలు పరిశీలించి నిష్పక్షపాత విచారణ జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మోదీపై అభ్యంతకర పోస్టులు.. మెటా హెడ్‌పై కేసు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన నిరసనలలో ప్రధాని మోదీకి అభ్యంకతరంగా పోస్టులు చేశారంటూ మోటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. ఆయనతో పాటు పలువురి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఇద్దరు బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీకి సంబంధించినటువంటి అభ్యంతరకరమైన, తప్పుడు కంటెంట్‌ను తమ ఫ్లాట్పారమ్లపై (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్రసారం కావడానికి అనుమతించారని,అటువంటి పోస్టులను తొలగించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ప్రధానమంత్రిని అసభ్యకరంగా, అవమానకరంగా మరియు తప్పుదోవ పట్టించే విధంగా చిత్రీకరిస్తూ మార్ఫింగ్ చేయబడిన, డిజిటల్‌గా తారుమారు చేయబడిన అనేక వీడియోలు ,చిత్రాలు అందులో కనిపించాయని తెలిపారు.కాగా నీట్లీకేజ్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. దీంతో మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేశారు. మరిన్ని డిమాండ్లను సైతం కేంద్రం ముందుంచింది. -
పదవి వదిలేసి ఇన్ఫ్లుయెన్సర్గా మారండి
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న తరుణంలో విద్యార్థులతో సంప్రదింపుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాను వినియోగించుకోవడంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకొని, దానికి బదులుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారా లని సూచించారు. నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా వ్యవహరించడానికే సరిగ్గా సరిపోతారని ఎద్దేవా చేశారు. ఆయన పదవి నుంచి తప్పుకోవాలని, దేశాన్ని నడిపే బాధ్యతను మరొకరికి అప్పగించాలని అన్నారు. నీట్ పేపర్ లీక్‌పై ఆందోళనను విరమించినప్పటికీ నిరసనకారులపై వేధింపులు ఆగడం లేదని దీప్కే ఆరోపించారు. నిరసనల్లో పాల్గొన్న వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని విమర్శించారు. కేంద్ర మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన నిరసన కారుల ఆగ్రహం చల్లారలేదని తేల్చిచెప్పారు. యువత ఆగ్రహాన్ని బీజేపీ ఎందుకు అర్థం చేసుకో లేకపోతోందని ప్రశ్నించారు. -
నన్నంతా హృతిక్ రోషన్‌లా ఉంటానంటారు! కంగనాకేమో..
బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్, సీపీజే (Cockroach Janata Party) ప్రతినిధి సౌరవ్ దాస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. జెన్-జీ నిరసనకారులపై కంగనా చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ పేరును కూడా తెరపైకి తెచ్చింది. సౌరవ్ దాస్ చేసిన ఓ వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘‘నా స్నేహితులు నన్ను చూస్తే యంగ్ హృతిక్ రోషన్‌లా ఉంటానని చెబుతుంటారు’’ అంటూ సౌరవ్ దాస్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. కంగనా వ్యాఖ్యలను విమర్శిస్తూ ఆయన చేసిన ఈ కామెంట్స్.. గతంలో హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య జరిగిన వివాదాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయి.జెన్-జీపై కంగనా వ్యాఖ్యలతో..నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణలపై విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న సమయంలో కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. నిరసనల్లో పాల్గొంటున్న కొందరు యువతపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. జెన్-జీ నిరసనకారుల వీడియోలు చూస్తే అసహ్యం వేస్తోందని, వారి భాష, ప్రవర్తన తనను బాధించాయని కంగనా వ్యాఖ్యానించారు. వారిని ఉద్దేశించి చేసిన కొన్ని ఘాటు పదజాలంపై(ఇలాంటి వాళ్లను ఎలా కంటారో..) రాజకీయ.. సినీ వర్గాలు, యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వ్యాఖ్యలను సౌరవ్ దాస్ తప్పుబట్టాడు. ఆమెను సొంత పార్టీ నేతలే సీరియస్‌గా తీసుకోవడం లేదు’ అంటూ విమర్శించాడు. ప్రజా జీవితంలో ఉన్న ఓ ఎంపీ యువతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. జెన్-జీ తరం దేశంలో మార్పు కోసం పోరాడుతోందని, వారి గొంతును తక్కువ చేసి చూడకూడదని వ్యాఖ్యానించాడు. కంగనా ఘాటు కౌంటర్.. సౌరవ్ దాస్ వ్యాఖ్యలకు కంగనా కూడా అదే స్థాయిలో స్పందించారు. సౌరవ్ దాస్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఆమె.. అతడిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘గూగుల్‌లో ఈ వ్యక్తి గురించి వెతికాను. అతడి వయసు 28 ఏళ్లు అని తెలిసింది. అతనో పనికిమాలిన వ్యక్తి అని అర్థమైంది’’ అంటూ కంగనా వ్యాఖ్యానించారు. తన వయసులోనే తాను రెండు జాతీయ అవార్డులు అందుకున్నానని, ప్రజా జీవితంలో తనకు 20 ఏళ్ల అనుభవం ఉందని పేర్కొన్నారు. నటిగా, నిర్మాతగా, రచయిత్రిగా, వ్యాపారవేత్తగా తాను ఎన్నో రంగాల్లో పనిచేశానని తెలిపారు. సౌరవ్ దాస్‌ను ఉద్దేశించి ‘‘ముందు ఏదైనా నైపుణ్యం నేర్చుకోవడం ప్రారంభించు’’ అంటూ కౌంటర్ ఇచ్చారు.‘యంగ్ హృతిక్ రోషన్‌లా ఉంటానంటారు’సౌరవ్ దాస్ స్పందిస్తూ కంగనా వ్యాఖ్యలపై వ్యంగ్యంగా మాట్లాడారు. తనను స్నేహితులు చూస్తే యువ హృతిక్ రోషన్‌లా కనిపిస్తానని చెబుతుంటారని అన్నారు. అయితే కంగనా మాత్రం తనపై తీవ్రంగా స్పందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఒక్క వ్యాఖ్యతో సోషల్ మీడియాలో హృతిక్ రోషన్ పేరు వైరల్‌గా మారింది. ఎందుకంటే గతంలో హృతిక్, కంగనా మధ్య జరిగిన వివాదం బాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.అసలు హృతిక్-కంగనా వివాదం ఏంటి?హృతిక్ రోషన్ పేరు ఇప్పుడు చర్చలోకి రావడానికి కారణం 2016లో జరిగిన వివాదమే. ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ హృతిక్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం మొదలైంది. తమ మధ్య ప్రేమ సంబంధం ఉందని కంగనా చేసిన ఆరోపణలను హృతిక్ రోషన్ ఖండించారు. ఇద్దరూ ఒకరికొకరు లీగల్ నోటీసులు పంపించుకున్నారు. ఈ-మెయిల్స్, డిజిటల్ ఆధారాలపై కూడా దర్యాప్తు జరిగింది. అయితే తమ మధ్య సంబంధం ఉందని కంగనా చెబుతుండగా.. అలాంటి సంబంధం ఎప్పుడూ లేదని హృతిక్ స్పష్టం చేశారు. ఈ వివాదం ఇప్పటికీ ఎటూ తేలలేదు.మాటల యుద్ధం..ప్రస్తుతం కంగనా రనౌత్, సౌరవ్ దాస్ మధ్య కొనసాగుతున్న ఈ వివాదం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జెన్-జీపై వ్యాఖ్యలతో మొదలైన ఈ వ్యవహారం.. ఇప్పుడు కంగనాకు పర్సనల్ ఎటాక్‌లా హృతిక్ రోషన్ పేరు ప్రస్తావనకు వచ్చే స్థాయికి చేరింది. హృతిక్-కంగనా పాత వివాదాన్ని గుర్తుచేస్తూ నెటిజన్లు సౌరవ్ దాస్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
జంతర్ మంతర్ లో లాఠీ ఛార్జ్.. పోలీసులకు సుప్రీం నోటీసులు
-
‘గూగుల్‌లో వెతికా.. ఎంత పనికిమాలినోడివో!’
జెన్-జీ నిరసనలపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో ఉన్న బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్.. తాజాగా సీజీపీ (Cockroach Janata Party) ప్రతినిధి సౌరవ్ దాస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలను విమర్శించిన సౌరవ్ దాస్‌కు కౌంటర్‌గా.. అతడిని ‘‘పనికిమాలినోడు, ఉద్యోగం లేనివాడు’’ అంటూ మండిపడ్డారు. తన కెరీర్ విజయాలను ప్రస్తావిస్తూ విమర్శలకు బదులిచ్చారు.సౌరవ్ దాస్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన కంగనా.. ‘‘గూగుల్‌లో ఈ వ్యక్తి గురించి వెతికాను. అతడి వయసు 28 ఏళ్లు. అతనో పనికిమాలినోడు అని అర్థమైంది. అలాంటి వ్యక్తి తనను తాను విద్యార్థి అని ఎలా చెప్పుకుంటున్నాడో అర్థం కావడం లేదు’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను రాజకీయాల్లోకి వచ్చి రెండేళ్లే కావచ్చు. కానీ ప్రజా జీవితంలోకి వచ్చి 20 ఏళ్లు అవుతోంది. అతడి వయసులోనే నేను రెండు జాతీయ అవార్డులు సాధించాను’’ అని పేర్కొన్నారు.నటిగా, ఎంపీగా నా ప్రయాణం వేరుతాను కేవలం రాజకీయ నాయకురాలిని మాత్రమే కాదని కంగనా అన్నారు. నటిగా, చిత్ర నిర్మాతగా, స్క్రీన్‌రైటర్‌గా, వ్యాపారవేత్తగా కూడా తన ప్రయాణం కొనసాగిందని తెలిపారు. ‘‘కొత్త ఎంపీగా బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో ఒత్తిడి ఎదురైంది. ఎందుకంటే నేను ఫిల్మ్‌మేకర్, పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్, నిర్మాత, రచయిత్రి, వ్యాపారవేత్తగా కూడా ఉన్నాను’’ అని పేర్కొన్నారు. ఎప్పుడూ డిమాండ్‌లో ఉండటం అంటే ఏమిటో సౌరవ్ దాస్ లాంటి వారు అర్థం చేసుకోలేరంటూ విమర్శించారు.‘ముందు నైపుణ్యం నేర్చుకో’సౌరవ్ దాస్‌ను ఉద్దేశించి కంగనా మరింత ఘాటుగా స్పందించారు. ‘‘నీ సమస్యలు వ్యక్తిగతమైనవి. నువ్వు విద్యార్థివి కాదు. నువ్వు కేవలం పనికిమాలిన వ్యక్తివి. ముందు ఏదైనా నైపుణ్యం నేర్చుకోవడం ప్రారంభించు’’ అంటూ తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.జెన్-జీ నిరసనలపై కంగనా వ్యాఖ్యలునీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణలపై జరిగిన విద్యార్థుల నిరసనలకు సంబంధించిన కొన్ని వీడియోలపై కంగనా గతంలో తీవ్రంగా స్పందించారు. ‘‘నా జీవితంలో ఒకే దగ్గర ఇంత కంపును ఎప్పుడూ చూడలేదు. జెన్-జీ నిరసనకారుల రీల్స్ వాంతులు తెప్పించేలా ఉన్నాయి. వారు మాట్లాడే విధానం, ఉపయోగించే భాష నేనెప్పుడూ చూడలేదు’’ అంటూ విమర్శించారు. ‘‘ఇలాంటి వారిని ఎవరు కంటున్నారు? ఎవరు పెంచుతున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.విపక్షాల నుంచి తీవ్ర విమర్శలుకంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఎంఐఎం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ స్పందిస్తూ.. జెన్-జీ యువత నుంచి కంగనాకు త్వరలోనే సమాధానం వస్తుందని అన్నారు. యువతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు. కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కూడా కంగన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందేందుకు ఒక మహిళా ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.సౌరవ్ దాస్ కౌంటర్కంగనా వ్యాఖ్యలకు ముందు సౌరవ్ దాస్ కూడా ఆమెపై విమర్శలు చేశారు. ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘కంగనాను ఆమె సొంత పార్టీ నేతలే పెద్దగా పట్టించుకోరు. ఆమెను సీరియస్‌గా తీసుకోనప్పుడు మేమెందుకు తీసుకోవాలి?’’ అని అన్నారు. జెన్-జీ, జెన్ ఆల్ఫా తరాలు కంగనా వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ‘‘జెన్-జీ ఈ దేశానికి మీకంటే ఎక్కువ చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ప్రజాస్వామ్యంపై మళ్లీ నమ్మకం కలిగించే పని యువత చేస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.నీట్ నిరసనలతో మొదలైన వివాదంనీట్-యూజీ పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో సీజీపీ కీలక పాత్ర పోషించింది. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఆందోళనల తర్వాత కేంద్రం కొన్ని డిమాండ్లను అంగీకరించింది. బాధిత కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ పరిణామాల తర్వాత అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కూడా చర్చనీయాంశమైంది.కొనసాగుతున్న మాటల యుద్ధంనిరసనలు ముగిసినా.. కంగనా, సీజీపీ నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతోంది. ఒకవైపు కంగనా నిరసనకారుల తీరును ప్రశ్నిస్తుండగా.. మరోవైపు సీజీపీ నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. తాజాగా సౌరవ్ దాస్‌పై కంగనా చేసిన ఘాటు వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. -
నిరసనలకు ‘సుప్రీం’ ఛత్రం!
ఉద్యమించటం, నిరసనలు వ్యక్తం చేయటం నేరమన్న అభిప్రాయం వ్యవస్థల్లో నరనరానా వ్యాపించింది. ఒక బ్యానర్తోనో, ఒక జెండాతోనో, నిర్దిష్టమైన ఎజెండాతోనో జనం రోడ్లపైకి రాగానే లాఠీలు పైకి లేవడం, బాష్పవాయు గోళాలు వర్షించడం... ఉద్యమకారుల్ని ఈడ్చుకెళ్లడం, పిడిగుద్దులు, బూటుకాళ్లతో తన్నడాలు రివాజయ్యాయి. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమంలోనైతే పెల్లెట్లనుంచి ఏకే–47 బుల్లెట్ల వరకూ కనబడటం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. ఈ నేపథ్యంలో సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం శాంతియుత నిరసనలపట్ల ఎలా వ్యవహరించాలో తెలియజేస్తూ మార్గదర్శ కాలు జారీచేస్తామనటం స్వాగతించదగింది. నిరసనలు రాజ్యాంగం ప్రసాదించిన హక్కనీ, వాటిని నిరాకరించటం సరికాదనీ వ్యాఖ్యానించింది. పాలకులూ, వారిని సమర్థించే కొన్ని వర్గాలూ ఈ సంగతి మరిచి చాన్నాళ్లయింది. ఉద్యమాలూ, నిరసనలను ఏవగించుకునే జాతీయ మీడియా చానెళ్లకు కూడా కొదవలేదు. దగ్గర వాటర్ బాటిళ్లు తప్ప మరేం లేని 15, 16 ఏళ్ల పిల్లల్ని... అందునా ఆడపిల్లల్ని గూండాలుగా అభివర్ణించే స్థాయికి అవి దిగజారాయి. ఆడపిల్లల ఛాతీపై చేతులువేసి నెట్టడం, చెంపదెబ్బలు కొట్టడం, లాఠీలతో మోదటం ఏ రకంగా సమర్థనీయం? వారు కనీసం ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేయలేదే! విధి నిర్వహణలోవున్న పాత్రికేయుల్నీ, పక్కన నిలబడి చూస్తున్నవారినీ కూడా తలలు పగలగొట్టారు. పెల్లెట్లతో గాయపరిచారు. ఇలా అతిగా ప్రవర్తించిన సిబ్బంది మాస్క్‌లు, స్వెట్టర్లు ధరించి వివరాలు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. డీకే బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్ కేసులో వెలువరించిన తీర్పులో చట్టబద్ధమైన విధి నిర్వహణలో ఉండే ప్రతి పోలీసు అధికారి తప్పనిసరిగా తమ గుర్తింపు తెలిసేలా ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. అటుపై అది సీఆర్పీసీలో 41–బి సెక్షన్‌గా, ఇప్పుడు బీఎన్ఎస్లో సెక్షన్–36గా చేరింది. బలప్రయోగం చేయటానికి రాజ్యానికున్న అధికారం తాలూకు బాధ్యతను నిర్దిష్టంగా గుర్తించదగిన వ్యక్తికి ఆపాదించగలిగేలా ఉండాలన్న రాజ్యాంగపరమైన హామీ ఇది.పెద్దయెత్తున జనం పాల్గొనే ఆందోళనల్లో నేరగాళ్లు చొరబడే అవకాశాలు లేకపోలేదు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశాలు తోసిపుచ్చలేం. అలాంటివారిని గుర్తించి అదుపు చేయటానికే సాధారణ దుస్తుల్లో పోలీసు సిబ్బంది ఉంటారు. అంతకన్నా ముందు నిరసన జరిగే ప్రాంతాన్ని నిరంతరం నిఘా కళ్లు చూస్తుంటాయి. అలాంటపుడు ఊరేగింపు జరపాలని సీజేపీ నిర్ణయించిన రోజు వేకువజామున జంతర్‌మంతర్‌లో పెద్ద పెద్ద రాళ్లతో కూడిన ట్రక్కు, అప్పటికే పూర్తిగా ధ్వంసమైన వాహనం ఎలా చేరాయి? అప్రమత్తంగా ఉన్న కార్యకర్తలు వెనువెంటనే వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అప్పుడైనా చర్యలుంటే పోలీసులపై జరిగాయంటున్న దాడులకు ఆస్కారం ఉండేది కాదు. కానీ అటుతర్వాత విచక్షణారహితంగా ఉద్యమకారుల్ని కొట్టారు. తలలకు గాయాలై నెత్తురోడుతున్నవారు అనేకమంది వీడియోల్లో కనబడ్డారు. కొందరికి చేతులు విరిగాయి. లాఠీచార్జి చేసేటపుడు మోకాలు దాటి పై భాగంలో కొట్టడం చట్టవిరుద్ధం.ఈ నెల 25న బిహార్ బంద్ సందర్భంగా శివాన్ జిల్లాలో ఉద్యమకారులతో ఘర్షణ చోటుచేసుకున్నప్పుడు ఒక కానిస్టేబుల్ ఏకే–47తో కాల్పులు జరుపుతూ కెమెరాలకు చిక్కాడు. 15 యేళ్ల బాలుడితోసహా ముగ్గురు గాయపడ్డారని అంటున్నా పోలీసులు మాత్రం ఆ కాల్పులవల్ల ఎవరూ గాయపడలేదంటున్నారు. నిరాయుధ పౌరులపై మిలిటరీ గ్రేడ్ ఆయుధాలు ఉపయోగించరాదన్న ప్రాథమిక పరిజ్ఞానం కూడా అతగాడికి లేదని అర్థమవుతుంది. అతన్ని సస్పెండ్ చేశారు సరేగానీ... కనీస అవగాహన లేనివారికి ఇటువంటి ప్రమాదకర ఆయుధాలు ఎలా ఇచ్చారన్నది తేల్చాలి. మొన్న శుక్రవారం విజయవాడలో విద్యార్థి, యువజన సంఘాల ‘చలో లోక్‌భవన్’లో సైతం ఇలాంటి దృశ్యాలే దర్శనమిచ్చాయి. ఏపీలో అమలయ్యేది రెడ్ బుక్ రాజ్యాంగం కనుక విద్యార్థి సంఘాల కండువాలేసుకుని మరీ పోలీసులు దాడిచేశారు. యువకుల్ని బూటుకాళ్లతో తన్ని, పిడిగుద్దులు గుద్ది తీవ్రంగా గాయపరిచారు. రోడ్డుపై పడేసి కొట్టారు. ఇలా ఆటవిక ప్రవృత్తి మితిమీరుతున్న దశలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం శుభ పరిణామం. -
కేసులు ఎత్తివేయకపోతే తీవ్ర పరిణామాలు.. కేంద్రానికి CJP మరో వార్నింగ్
-
యువతరం రోడ్డెక్కితే.. దేశానికి హెచ్చరికేనా?
-
నీట్ ఉద్యమంలో మిడ్నైట్ ట్విస్ట్!
న్యూఢిల్లీ: నీట్ వివాదంపై సాగిన విద్యార్థుల ఉద్యమం మరో కీలక మలుపు తిరిగింది. నిరసనకారులపై నమోదైన కేసులు, అరెస్టుల అంశంపై కేంద్రంతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో.. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులతో ప్రభుత్వం అర్ధరాత్రి కీలక చర్చలు జరిపింది. ఈ సమావేశం అనంతరం నిరసనకారులకు రక్షణ కల్పించేలా మరిన్ని రాష్ట్రాల నుంచి అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని సీజేపీ వెల్లడించింది.“ఏ ఒక్క నిరసనకారుడిని ఒంటరిగా వదిలిపెట్టం. అందరం కలిసి ఉన్నాం” అని సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై తమకు ఉన్న అనుమానాలను చర్చల్లో ప్రస్తావించామని, వాటిపై స్పష్టమైన హామీలు లభించాయని పేర్కొన్నారు.#Important: 1 AM update.Hours after our press conference, Government’s representatives met us. The meeting lasted for 2-3 hours. They shared copies of the Bihar and Assam notifications guaranteeing FIR withdrawals, no action in future, and release of all detainees and… pic.twitter.com/G7WcHHcfAs— Saurav Das (@SauravDassss) July 27, 2026 2–3 గంటల పాటు సాగిన అర్ధరాత్రి భేటీసోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సౌరవ్ దాస్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. తమ ప్రెస్‌మీట్ తర్వాత ప్రభుత్వ ప్రతినిధులు తమను కలిశారని, దాదాపు 2–3 గంటల పాటు చర్చలు సాగాయని తెలిపారు. బిహార్, అస్సాం ప్రభుత్వాలు నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఉండవన్న హామీలకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతులను ప్రభుత్వం తమకు అందించిందని చెప్పారు. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం, ఇతర బీజేపీ–ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి కూడా ప్రకటనలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.“హామీలు అమలవుతాయా?”చర్చల అనంతరం విడుదల చేసిన వీడియో సందేశంలో సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ హామీల అమలుపై తమకు ఆందోళన ఉందని స్పష్టం చేశారు. “చర్చల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోతాయేమోనన్న భయాన్ని ప్రభుత్వ ప్రతినిధుల ముందు పెట్టాం. అందుకు ప్రతిగా బిహార్ హోం శాఖ జారీ చేసిన ప్రకటనను వారు చూపించారు. అందులో నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లు ఉపసంహరిస్తామని, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఉండవని పేర్కొన్నారు” అని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా రక్షణ కల్పించేలా నోటిఫికేషన్లు జారీ చేయడంపై చర్చ జరిగినట్లు వెల్లడించారు.మళ్లీ ఉద్యమం హెచ్చరికతో కదిలిన ప్రభుత్వంకేంద్రంతో చర్చలకు ముందు సీజేపీ మరోసారి ఆందోళన బాట పట్టే హెచ్చరికలు చేసింది. ఒప్పందం ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు కొనసాగుతున్నాయని పేర్కొంది. బిహార్, బెంగాల్లో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారని, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో వాలంటీర్లను వేధిస్తున్నారని సీజేపీ ఆరోపించింది. వెంటనే కేసులు ఉపసంహరించుకోవాలని, అరెస్టైన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే తిరిగి జంతర్ మంతర్ వేదికగా ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించింది.బిహార్, అస్సాం తర్వాత రాజస్థాన్ హామీఇప్పటికే బిహార్, అస్సాం ప్రభుత్వాలు నీట్ నిరసనలకు సంబంధించి నమోదైన కేసులపై ఉపశమనం కల్పించే నిర్ణయాలు ప్రకటించాయి. అరెస్టైన వారిని విడుదల చేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల చర్యలు ఉండవని హామీ ఇచ్చాయి. తాజాగా రాజస్థాన్‌లోనూ నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ లభించిందని సీజేపీ తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదని, ఇకపై కూడా నమోదు చేయబోమని అధికారులు స్పష్టం చేసినట్లు పేర్కొంది.నీట్ పోరాటం ముగిసినట్లే!నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై జూన్ 20న ప్రారంభమైన సీజేపీ ఉద్యమం.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తాత్కాలికంగా ముగిసింది. అయితే నిరసనకారులపై కేసులు, అరెస్టుల అంశం కొత్త వివాదానికి దారితీసింది. తాజా చర్చలతో తాత్కాలికంగా ఆందోళన సద్దుమణిగినప్పటికీ.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేసుల ఉపసంహరణ, విద్యార్థుల రక్షణపై అధికారిక ప్రకటనలు రావడమే కీలకంగా మారింది. -
కేసుల రద్దుపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారంలోగా ఆమేరకు హామీ లభించకుంటే మళ్లీ ఆందోళన బాట పడతామని హెచ్చరించింది. సీజేపీ జాతీయ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌తో కలిసి సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ఆందోళనకారులు, నిర్వాహకులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఉప సంహరించుకుంటామని, కొత్తగా ఎవ్వరిపైనా కేసులు పెట్టబోమని మూడో విడత చర్చల సమయంలో కేంద్రం మాకు హామీ ఇచ్చింది. ఆ తర్వాతే 36 రోజులపాటు జంతర్‌మంతర్‌లో కొనసాగించిన నిరసనలను ఉపసంహరించుకున్నాం’అని సీజేపీ ప్రతినిధులు వివరించారు. ‘ముసాయిదా ఒప్పందాన్ని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు అందజేయగా వారు ఆమోదం తెలిపారు. న్యాయనిపుణులతో చర్చలు జరిపాక మంగళవారం కల్లా ప్రభుత్వం లిఖిత పూర్వక ఒప్పందాన్ని అందజేస్తుందని మాకు హామీ ఇచ్చారు’అని వివరించారు. ‘ప్రభుత్వం నుంచి అందాల్సిన లిఖిత పూర్వక ఒప్పందం కోసం మేం ఎదురు చూస్తున్నాం. కేబినెట్ సీనియర్ మంత్రులు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నాం. నిరసనకారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వేధించరాదు. భవిష్యత్తులో వారిపై ఎటువంటి కేసులు పెట్టరాదు’అని రాంకా, దాస్ స్పష్టం చేశారు. లేనిపక్షంలో తాము మరోసారి నిరసనలకు దిగక తప్పదని స్పష్టం చేశారు. -
విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై కేసులు పెడతాం
-
CJP పుట్టుక వెనుక అసలు కథ అభిజీత్ దీప్కే చరిత్ర
-
‘కాక్రోచ్’ ఉద్యమం కుదిపేసిన రాజకీయాలు.. అమరావతి వరకు సెగ!
రాజకీయాలలో ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదన్నది ఒక అభిప్రాయం. అన్నిసార్లు కాకపోయినా, కొన్నిసార్లు బొద్దింకలు కూడా తిరగబడతాయన్న సత్యాన్ని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పక్షాన యువత రుజువు చేసింది. ఎంత బలాఢ్యుడైనా ఆ తిరుగుబాటుకు తలొగ్గక తప్పదని రుజువైంది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్‌కు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ పర్వం దేశానికే ఒక స్పూర్తిదాయక ఘట్టంగా నిలిచింది. ఇలాంటి లీక్‌లు జరిగినా, లేదా స్కామ్‌ల ఆరోపణలు ఆధారాలతో సహా బయటపడినా సంబందిత బాధ్యులు పదవి నుంచి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ యువత ఆందోళన తేల్చి చెప్పింది.కేంద్రంలోనేనా ఇలా రాజీనామాలు జరగవలసింది? మరి రాష్ట్రాలలో జరిగే లీక్‌లు, ఇతర కుంభకోణాల పరిస్థితి ఏమిటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదవి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ గట్టిగా తెరపైకి వచ్చింది. డీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ ఆరోపణ, టీచర్ల ఎంపికలో అవకతవకలు, స్పోర్ట్ కోటా టీచర్ల ఎంపికలో అక్రమాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధారసహింతంగా ఆరోపణలు చేసినా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. బహుశా ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం గురించి స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. కాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఉద్యమం చేస్తున్న యువతపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శకు గురయ్యారు.కాక్రోచ్ ఉద్యమానికి కాంగ్రెస్ తదితర విపక్షాలు రంగంలోకి దిగడంతో తీవ్రరూపం దాల్చింది. ఒకరకంగా రాజకీయ రంగు పులుముకున్నప్పటికీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేలు ప్రధాని ఇంటిముందు ధర్నాకు దిగడంతో బీజేపీ కంగుతిన్నట్లనిపించింది. సీజేపీతో చర్చలకు సిద్దమని బీజేపీ కూడా చెప్పవలసి వచ్చింది. రాహుల్ గాంధీపై విమర్శలు చేసినా, బీజేపీ కొంత డిఫెన్స్‌లో పడినట్లయింది. కాక్రోచ్ ఉద్యమంతో పాటు, కాంగ్రెస్ ధర్నా ప్రభావం వివిధ రాష్ట్రాలలో కూడా పడింది. కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ యాక్టివ్ అయ్యాయి. వారికి పోటీగా బీజేపీ కూడా ఎదురుదాడి చేయడానికి యత్నించింది.ఏపీ, తెలంగాణలలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇదో గొడవగా మారింది. తెలంగాణలో రెండు పార్టీలు కర్రలతో ఘర్షణకు దిగాయి. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. విజయవాడలో కాంగ్రెస్ ఆఫీస్‌పై బీజేపీ దాడికి యత్నించడం ఆశ్చర్యంగానే ఉంది. ఏపీలో ఈ రెండు పార్టీలకు పెద్దగా బలం లేకపోయినా, ఈ అవకాశం ద్వారా తమ ఉనికి కోసం ప్రయత్నించినట్లు అనిపిస్తుంది.23 లక్షల మంది విద్యార్ధులు మెడికల్ కాలేజీలలో సీట్ల నిమిత్తం రాసిన నీట్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన వైనం, ఆ తర్వాత ఆ విషయాలు బయటకు వచ్చి దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ చేసిన ఒక అనవసర వ్యాఖ్యతో దేశంలో కొత్తగా పుట్టుకువచ్చిన క్రాకోచ్ జనతాపార్టీ యువతను ఆకర్షించింది. నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌కు సంబంధించి కొందరిని ప్రభుత్వం అరెస్టు చేసింది. కాని తొలి నీట్ పరీక్ష రద్దు కావడంతో సుమారు ఇరవైమంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆవేదనకు గురి చేసింది. మళ్లీ నీట్ పరీక్షను నిర్వహించినప్పటికీ, నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌కు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను కాక్రోచ్ జనతా పార్టీ చేసింది. అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని వీరు కోరారు.ఇలా వివిధ డిమాండ్లతో సాగుతున్న వీరి ఉద్యమం ఒక దశలో ముగిసిపోయిందని అనుకున్నారు. కాని వాంగ్ చుక్ అనే ఉద్యమకారుడు నిరాహారదీక్షకు దిగడంతో తిరిగి ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. వేలాదిగా తరలివచ్చిన యువత పార్లమెంటు ముట్టడికి వెళ్లడం, ఆ క్రమంలో పోలీసులు లాఠీచార్జీ చేయడం వంటివి పరిస్థితిని ఉద్రిక్తం చేశాయి. పోలీసులు విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు పలువురిని లాఠీలతో కొట్టారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది సంబంధం లేని పిల్లలను కూడా పోలీసులు కొట్టిన తీరు విమర్శలకు గురి అయింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.ప్రధాని మోదీ తొలిసారిగా నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌పై స్పందించి అది మహాపాపమని అభివర్ణించారు. ఈ వ్యవహారంలో గట్టిగా స్పందిస్తున్నామన్న సంకేతం ఇవ్వడానికి యత్నించారు. బీజేపీ, జనసేన వంటి పార్టీలు ఈ ఉద్యమంలో దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, ఇతరత్రా ఆరోపణలు చేసినా, ప్రధాని ఆ యువతను స్నేహితులు అని అడ్రస్ చేయడం విశేషం. ఈ కేసులో నిందితులకు సత్వరమే శిక్ష పడడానికి వీలుగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. వాంగ్ చుక్ దీక్ష విరమించినా, ఉద్యమం కొనసాగడం, దేశం అంతటా దీని ప్రభావం పడుతుండడం గమనించి మోదీ స్పందించారు. వెంటనే డామేజ్ కంట్రోల్‌కు చర్యలు చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ఉద్యమకారుల డిమాండ్లను అంగీకరించినట్లు కేంద్ర మంత్రులు ప్రకటించారు. దాంతో కాక్రోచ్ సంబరాలు అంబరాన్ని అంటాయి.నిజానికి కాక్రోచ్ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం మొదట తేలికగా తీసుకున్నట్లుగా ఉంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కొన్ని వందలమంది దేశ యువతకు ప్రతినిధులుగా కేంద్రం ఆలోచించలేకపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల ఇంటర్నెట్ బంద్ చేశారంటే, 18 మెట్రో రైల్వేస్టేషన్లను బంద్ చేశారంటేనే ఈ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. ఇదంతా యువత స్వచ్చందంగా చేసిందే.కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో రైతుల ఆందోళన కుదిపేసింది. వారు కోరినట్లు కొన్ని చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంది. అయినా ఆనాడు సమర్థంగా హాండిల్ చేశామన్న భావన కేంద్ర పెద్దలకు ఉండి ఉండవచ్చు. ఆ పరిస్థితి వేరు. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితి వేరు. ఒక్కసారి యువతలో గూడుకట్టిన అసంతృప్తి ఎగసిపడితే, అది దేశ వ్యాప్తంగా పాకితే ఎంత ప్రమాదమో బీజేపీ పెద్దలకు తెలియనిది కాదు. అందులోనూ పలు ఇతర దేశాలలో యువత ఈ మధ్యకాలంలో ఎంతటి క్రియాశీలకపాత్ర పోషించి ప్రభుత్వాలే మారిపోయేలా చేసిందో ఇటీవలి చరిత్రే.ఈ క్రమంలో పార్లమెంటు సమావేశాలలో సహజంగానే విపక్షం దీనిని ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. మంత్రి ప్రధాన్ రాజీనామాకు విపక్షం కూడా పట్టుబట్టింది. ఎప్పుడో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం సంచలనం అయింది. తర్వాతకాలంలో కొందరు కేంద్ర మంత్రులు వివిధ కారణాలతో రాజీనామాలు చేయకపోలేదు. రైల్వే ప్రమాదాల కారణంగానే నితీష్ కుమార్, మమత బెనర్జీ వంటివారు రాజీనామా చేశారు. విమాన ప్రమాదం జరిగినప్పుడు మాధవరావు సింధియా రాజీనామా చేశారు. ఉగ్రదాడికి బాధ్యత వహిస్తూ శివరాజ్ పాటిల్ పదవి నుంచి తప్పుకున్నారు.అలాగే, ఆయా స్కామ్‌ల ఆరోపణలపై దయానిది మారన్, ఎ.రాజా తదితరులు రాజీనామా చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీక్‌కు బాధ్యత వహిస్తూ అప్పటి విద్యా మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రాజీనామా చేశారు. క్యాబినెట్ ఎజెండాను లీక్ చేశారన్న కారణంగా 31 మంది మంత్రుల నుంచి ఎన్టీరామారావు రాజీనామాలు తీసుకున్నారు. చంద్రబాబు టైమ్‌లో వివిధ ఆరోపణలు వచ్చినా ఆయన నైతిక బాధ్యత వహించడానికి సిద్దపడలేదు. గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట కారణంగా 29 మంది మరణిస్తే, చంద్రబాబు ఎదురు బుకాయించారు తప్ప బాధ్యత తీసుకోలేదు. పూరి జగన్నాథ రథయాత్రలో జరగలేదా? కుంభమేళాలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో మరణించడం లేదా అంటూ డబాయించారు. ఆ ఘటనలో ఒక్క కానిస్టేబుల్‌పై కూడ కేసు రాకపోవడం చిత్రంగానే అనిపిస్తుంది.తిరుమలలో 20 మంది తమిళ కూలీలు ఎన్ కౌంటర్‌కు గురి కావడం వివాదాస్పదం అయినా, అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పడలేదు. అవన్ని ఎందుకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయినా, ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసే లేకుండా చేసుకోగలిగారు. ఒకప్పుడు చెన్నారెడ్డి ప్రభుత్వంలో హౌసింగ్ స్కామ్ జరిగితే అప్పటి మంత్రి కోనేరు రంగారావుతో రాజీనామా చేయించారు. తదుపరి ఆ ఆరోపణలు రుజువు కాలేదని తిరిగి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు డీఎస్సీ అక్రమాలకు వైఎస్సార్సీపీ ఎన్నో ఆధారాలు చూపి సీబీఐ విచారణ కోరుతోంది. వాటికి చంద్రబాబు లేదా లోకేష్ ఎక్కడా నేరుగా జవాబు ఇవ్వలేదు. టీడీపీ ఇతర నేతలతో ఎదురుదాడి చేయించారు.ఈ నేపథ్యంలో డీఎస్సీ అక్రమాలపై ఉద్యమించాలని వైఎస్సార్సీపీ తలపెట్టింది. దీనికి యువత కూడా తోడైతే అది సీరియస్‌గా మారవచ్చు. అయితే వారిని అణచివేయడానికి చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇది ఏ రూపు దాల్చుతుందో అప్పుడే చెప్పలేం. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లోకేష్‌పై ఒత్తిడి పెంచుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యమం చేసిన కాక్రోచ్ యువతపై కక్ష కట్టకుండా ఉండాలని ఆశిద్దాం. ఏది ఏమైనా కాక్రోచ్‌లే కదా అని తేలికగా చూడరాదన్న విషయం అర్థం అవుతోంది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రాజీనామా ఖుషీ.. హుషారుగా స్టెప్పులేసిన సీజేపీ లీడర్స్
నీట్ పేపర్ లీకేజీ.. విద్యార్థుల ఆత్మహత్యలు.. మంత్రి రాజీనామా అంశంతో ఆందోళనలు చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ తమ డిమాండ్లు నెరవేరడంతో రిలాక్స్ అయ్యింది. గత రాత్రి ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఆ పార్టీ నేతలు, పలువురు స్టూడెంట్స్ గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. రకరకాల వంటకాలతో.. డీజే పాటలతో హుషారెత్తించే స్టెప్పులేశారు. అయితే.. ఖుషీగా వాళ్లు చేసిన ఆ పార్టీపై ఇప్పుడు దుమారం రేగుతోంది.కొందరు అమ్మాయిలు(సీజేపీ ప్రతినిధులు/నీట్ అభ్యర్థులు?!) జోష్‌గా డ్యాన్సులు చేయగా.. అటు చర్చల్లో పాల్గొన్న అశుతోష్ రాంకా, సౌరబ్ దాస్ ఇద్దరూ కూడా హుషారుగా వాళ్లతో కలిసి స్టెప్పులు కలిపారు. అందరూ కలిసి హోటల్లో సంబురాల్లో మునిగిపోయారు. మరోవైపు.. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఓ మూలన కూర్చుని పార్టీ చూస్తున్నట్లు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. రాజీనామా సందర్భంగా ఖుషీ అంటూ ఆ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచే ఈ వీడియో(Resignation की ख़ुशी) పోస్ట్ కావడం గమనార్హం.Resignation की ख़ुशी 🥹 pic.twitter.com/QT4Y5j4cy6— Cockroach Janta Party (@CJP_for_India) July 26, 2026అయితే ఈ వీడియోపై పలువురు అభ్యంతరాలు.. ఇంకొందరు తిట్టిపోస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్న కొందరు విద్యార్థులకు పార్లమెంట్ మార్చ్ సందర్భంగా గాయాలైన సంగతి తెలిసిందే. వాళ్లు కోలుకోకముందే కాక్రోచ్ నాయకత్వంలో ఉన్నవాళ్లు ఇలా పార్టీ చేసుకోవడానికి కొందరు తీవ్రంగా తప్పు బడుతున్నారు. నీట్ కారణంగా దేశవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అసలు ఉద్యమం ఉద్దేశాన్ని నీరుగార్చేలా వీళ్ల తీరు ఉందంటూ మండిపడుతున్నారు.అదే సమయంలో యాంటీ నెటిజన్లు మాత్రం.. ఇది కాక్రోచ్ల నిజ స్వరూపం అంటూ మండిపడుతున్నారు. నిరసనల్లో ఆందోళనకారులకు అరటిపండ్లు, బ్రెడ్ పకోడీలు పంచుతూ గుర్తింపు పొందిన జునైద్ అనే యువకుడి గురించి కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘అభిజీత్ దీప్కే నా కాల్స్‌కు స్పందించడం లేదు’.. అంటూ అతను కంటతడి పెట్టిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. షాదాబ్ సైఫీ సైతం ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ జోష్ పార్టీలో కనిపించకపోవడంతో.. ఇలాంటి కొందరిని కేవలం తమ అవసరాలే దీప్కే వాడుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వాంగ్‌చుక్ ప్రస్తావన లేకుండానే.. గత రెండ్రోజులుగా సీజేపీ వ్యవహరిస్తుండడమూ విమర్శలకు తావిస్తోంది. మరోవైపు.. అభిజీత్ దీప్కే తనకు టైఫాయిడ్ సోకిందని ట్రీట్మెంట్ ఫొటోలను వైరల్ చేశాడని.. కానీ సాయంత్రానికే ఇంటికి దగ్గర్లో ఉన్న హోటల్లో పన్నీర్ టిక్కా తింటూ ఎంజాయి చేస్తున్నాంటూ ఇంకొందరు మండిపడుతున్నారు. అయితే ఇటు ఈ యువతకు మద్దతుగా పోస్టులు చేసేవాళ్లు కొందరు కనిపిస్తున్నారు. -
పంజాబ్ పరీక్షలో అక్రమాలపై సీజేపీ పోరాటం
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ఆందోళన విజయవంతం కావడంతో ఆ పార్టీ తదుపరి కార్యాచరణపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పంజాబ్‌లో జరిగిన పరీక్షలో అక్రమాలపై పోరాటం చేపట్టాలని చాలామంది ఆ పార్టీని కోరుతున్నారు. దీనిపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తాజాగా స్పందించారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. జంతర్‌మంతర్ వద్ద పోరాటం నిన్ననే ముగిసింది కాబట్టి తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. తదుపరి పోరాటం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఢిల్లీలో విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఏ ఒక్క విద్యార్థిపైనా కేసులు నమోదు చేయకూడదని తేల్చిచెప్పారు. పంజాబ్‌లో 454 మంది ఫార్మసీ అధికారుల నియామకం కోసం బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ జూలై 19న నిర్వహించిన పరీక్షలో వ్యవస్థీకృత పద్ధతిలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం భగవంత్ మాన్ సమాధానం చెప్పాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
వేదికపై ఒక్కరే.. వెనుక ఏడుగురు
సాక్షి, న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న ఆందోళనలకు, నిరసనలకు సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే ముందుండి నడిపిస్తే ఈ నిరసనోద్యమానికి ఏడుగురు వ్యక్తులు వెనక వెన్నుముకలా నిలబడి ఉద్యమాన్ని విజయవంతంచేశారు. సీజేపీని స్థాపించడం మొదలు రోజువారీగా వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టడం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో ఈ ఏడుగురు వ్యూహకర్తలే కీలక భూమిక పోషించారు. లాయర్లు, జర్నలిస్టులు, పబ్లిక్ పాలసీ నిపుణులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులతో కూడిన ఈ బృందం ఉమ్మడి కృషితో ఉద్యమాన్ని ముందుకు సాగేలా దిశానిర్దేశంచేస్తోంది. వేదికపై వాగ్దాటితో ఉపన్యాసాలు చేసే నాయకుల పైనే కాకుండా, వెనుక ఉండి వ్యూహాలు రచించేవారు, మీడియా సమన్వయకర్తలు, చట్టపరమైన పోరాటం చేసేవారు, విద్యార్థి–జన సమీకరణ చేసేవారిపైనే ఉద్యమ విజయఫలితం ఆధారపడి ఉంటుందని సీజేపీ కీలక నాయకత్వం మరోసారి నిరూపించింది. దీంతో ఈ ఏడుగురు ఎవరనే చర్చ మొదలైంది. వీళ్ల గురించి క్లుప్తంగా.. వైష్ణవి (పాలసీ నిపుణురాలు) ఢిల్లీకి చెందిన వైష్ణవి సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధుల్లో ఒకరు. ఈమె విధాన నిర్ణయాల రూపకల్పనలో దిట్ట. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు ప్రముఖ పరిశోధనా సంస్థల్లో దాదాపు ఐదేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉంది. విధాన రూపకల్పన, విద్యా వ్యవస్థలోని అంశాలపై ఈమెకున్న అవగాహన పార్టీ వ్యూహాల రచనకు ఎంతగానో తోడ్పడుతోంది. ఆఫ్రీన్ (సామాజిక ఉద్యమకారిణి) బెంగళూరుకు చెందిన ఆఫ్రీన్ ఎంబీఏ పూర్తి చేసింది. కార్పొరేట్ ఉద్యోగాన్ని సైతం వదులుకుని ఈ ఉద్యమంలోకి వచ్చారు. విద్యా వ్యవస్థలోని లోపాలు, విద్యార్థుల సమస్యలను క్షేత్రస్థాయిలో గమనించిన ఆమె సామాజిక అంశాలపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం సీజేపీ వక్తగా కొనసాగుతూ యువత, విద్యార్థి వర్గాల సమస్యలను బలంగా వినిపిస్తున్నారు. దీపక్ బలియాన్ (విద్యార్థి నేత) దీపక్ బలియాన్ రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని రైతు కుటుంబం నుంచి వచ్చారు. సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. రైతులు, యువత సమస్యలపై పనిచేసారు. పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలపై సీజేపీ తరఫున పోరాడుతున్నారు. గ్రామీణ ప్రాంత యువత సమస్యలపై గళమెత్తుతున్నారు. రత్నా సింగ్ (న్యాయవాది) న్యాయపరమైన వ్యవహారాల బాధ్యతలను రత్నా సింగ్ పర్యవేక్షిస్తున్నారు. లా చదువుకున్నారు. జర్నలిజంలోనూ మంచి పట్టుంది. లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. గతంలో ’స్క్రోల్’, ‘బార్ అండ్ బెంచ్’వంటి ప్రముఖ న్యాయ–మీడియా సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ పార్టీ తరఫున చట్టపరమైన అంశాలను పర్యవేక్షస్తున్నారు. అశుతోష్ రాంకా (సామాజిక ఉద్యమాల అనుభవం) జైపూర్ కు చెందిన అశుతోష్ రాంకాకు సామాజిక ఉద్యమాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. సీజేపీ కంటే ముందు ఆయన ‘పరివర్తన్’అనే సంస్థ ద్వారా ఆరావళి పర్వతాల పరిరక్షణ, ధోల్ కా బాడ్ అడవులను కాపాడుకోవడం, నీట్ పరీక్షల అవకతవకలపై ఆందోళనలు చేపట్టారు. ఆయన అనుభవం సీజేపీ ప్రజా ఆందోళనలకు పెద్ద దిక్సూచిగా మారింది. సౌరభ్ దాస్ (ప్రజా సంబంధాలు) సౌరభ్ దాస్ స్వస్థలం ఢిల్లీ. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ చదివి స్వతంత్ర పరిశోధనాత్మక విలేకరిగా పనిచేశారు. ప్రస్తుతం సీజేపీ ప్రధాన వక్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియాతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఉద్యమ సమస్యలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్తున్నారు. సిద్ధాంత్ (డిజిటల్ మీడియాలో పట్టు) డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రాధాన్యతను గుర్తించిన సిద్ధాంత్ పూర్తిగా తెరవెనుక ఉండి సీజేపీ ఉద్యమాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా దేశవ్యాప్తంగా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లారు. డిజిటల్ క్యాంపెయిన్ బాధ్యతలు పూర్తిగా ఈయనే చూసుకుంటున్నారు. పార్టీ సిద్ధాంతాలు, ఆందోళనల వివరాలు డిజిటల్ వేదికల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. ఈయన అవలంభించిన సోషల్ మీడియా వ్యూహాలు సీజేపీకి ఎంతగానో కలసివస్తున్నాయి. -
నిరసన జ్వాలకు నిలువుటద్దం!
‘‘ఏదైనా సరిగా లేదు అనిపించింది అనుకోండి.. న్యాయంగా, ధర్మంగా లేవని తోచిందనుకోండి... దానిపై గొంతెత్తాలి. ఏదో ఒకటి మాట్లాడాలి. చేయాలి’’ అమెరికా పౌర హక్కుల నేత, జార్జియా ప్రజాప్రతినిధి (1940– 2020) జాన్ లూయిస్ చేసిన వ్యాఖ్య ఇది. దీన్ని రియా ఆహిర్ అక్షరాలా చేసి చూపించింది. ఆ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీపై విద్యార్థుల ఉద్యమానికి జంతర్ మంతర్ కేంద్రబిందువైనప్పటికీ.. జెన్–జీ చైతన్యానికి, ఆ మాటకొస్తే ఉద్యమం మొత్తానికి సాక్షిభూతంగా నిలిచింది మాత్రం పోలీసు వ్యాన్‌ను ఆపుతూ నిలిచిన రియా ఆహిర్ ఫొటోనే అంటే అతిశయోక్తి కాదు. ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన 27 ఏళ్ల రియా ముంబైకర్. మోడల్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కూడా. ముంబైలో నిరసన తెలుపుతున్న విద్యార్థులతో వెళుతున్న వ్యాన్‌కు ఎదురెళ్లి రెండు చేతులతో అడ్డుకోవడం కేవలం ప్రతీకాత్మకమైన విషయం కానేకాదు. తప్పనిపిస్తే ఎవరినైనా నిలదీస్తాం. నిగ్గదీస్తాం అన్న జెన్–జీ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం! ‘‘కుడోస్ రియా ఆహిర్’’ – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుర్తుంచుకోండి.. బొద్దింకతో పెట్టుకోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమం కీలక మలుపు తిరిగింది. రాజీనామా వార్త తెలియగానే జంతర్‌మంతర్ వద్ద ఆందోళనచేస్తున్న నిరసనకారులు ఒక్కసారిగా ఆనందడోలికల్లో మునిగారు. జాతీయజెండాలు చేతబూని కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. ఉద్యమంలో ప్రభుత్వంపై గెలిచామన్న ఆనందంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ‘విద్యార్థి శక్తి విజయం సాధించింది‘అంటూ హర్షధ్వానాలు చేశారు. నీట్ లీకేజీతో మనస్తాపంతో ఆత్మహత్యచేసుకున్న పరీక్షార్థులకు నివాళిగా అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత సంబరాలు కొనసాగించారు. వందేమాతరం నినాదాలతో ప్రాంగణం హోరెత్తిపోయింది. ఫోన్ కాల్‌తో ఒక్కసారిగా ఆనందం శనివారం తొలుత జంతర్‌మంతర్‌లో నిరసన కార్యక్రమంలో సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే ఉన్న సమయంలోనే మంత్రి పదవికి ధర్మేంద్ర రాజీనామాచేసిన విషయం ఫోన్‌కాల్ ద్వారా తెలిసింది. ఈ ఘటన వివరాలను దీప్కే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియో షేర్ చేసి తెలిపారు. 3 నిమిషాల నిడివి గల ఆ వీడియోలో దీప్కే ఫోన్ మాట్లాడటం పూర్తయ్యేలోపే అక్కడి విద్యార్థులకు విషయం తెల్సి పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. తర్వాత దీప్కే మైక్‌తీసుకుని ‘మన విద్యార్థి శక్తి వరి్ధల్లాలి. మనం సాధించాం’అని బిగ్గరగా అరుస్తూ చర్చలు ఫలవంతమయ్యాయని ప్రకటించారు.దీంతో విద్యార్థులంతా కేరింతలు కొట్టారు. చేతులు పైకెత్తి విజయోత్సాహం వ్యక్తం చేశారు. వేదికపై ప్రదర్శించిన పోస్టర్లో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనతో మనస్తాపంతో బలవన్మరణాలకు పాల్పడిన పరీక్షార్థుల పేర్లను దీప్కే చదివి వినిపించారు. వారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ, వారి త్యాగాలను ఉద్యమం ఎప్పటికీ మరచిపోదని అన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పలువురు విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. షారుఖ్‌ఖాన్ హిట్ సినిమా ఛక్‌దే ఇండియాలోని దేశభక్తి పాటలను అక్కడ ప్లే చేశారు. బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలను ప్రదర్శించారు. సీజేఐ సూర్యకాంత్‌కు థాంక్యూ.. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి దిప్కే ప్రసంగించారు. ‘‘ధర్మేంద్ర రాజీనామా చేయడం ప్రజాస్వామ్య విజయం. గుర్తుంచుకోండి బొద్దింకలతో పెట్టుకోవద్దు. ప్రస్తుత ప్రభుత్వంలో ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయడం అంత సులభం కాదు. కానీ విద్యార్థుల ఐక్యతతో ఇది సాధ్యమైంది. ప్రపంచం వంగుతుంది. కానీ దానిని వంచే సామర్థ్యం, నాయకత్వం మనకుండాలి. మీరు భయపడకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడితే ఎవరినైనా రాజీనామా చేయించవచ్చు అని ఈ ఉద్యమం నిరూపించింది. విద్యార్థుల ఐక్యత ముందు ప్రభుత్వం తలవంచింది’’ అని అన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు దీప్కే కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీరే గనక మమ్మల్ని బొద్దింకలు అని పిలవకపోయి ఉంటే నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేవాడినే కాదు. మీరే గనక మమ్మల్ని కాక్రోచెస్ అని పిలవకపోయి ఉంటే దేశ యువత వీధుల్లోకి వచ్చి పోరాటం మొదలెట్టేదేకాదు. మీరేగనక కాక్రోచ్ అని పిలవకపోయి ఉంటే ఈరోజు ధర్మేంద్ర మంత్రిగా రాజీనామా చేసేవాడేకాదు. ఇవన్నీ సుసాధ్యంకావడానికి పరోక్షంగా మీ కాక్రోచ్ వ్యాఖ్యలే కారణం. అందుకే మీకు కృతజ్ఞతలు’’ అని దీప్కే అన్నారు. వాంగ్చుక్కు థాంక్యూ చెప్పని దీప్కే! తాము ఘన విజయం సాధించామని నిరసన వేదికపై నుంచి ప్రకటించిన సందర్భంగా దీప్కే చేసిన ప్రసంగంలో సోనమ్ వాంగ్‌చుక్ పేరును ప్రస్తావించలేదు. కనీసం థాంక్యూ చెప్పలేదు. వాంగ్‌చుక్ నిరాహార దీక్షతోనే తొలుత నిరసనగా మొదలైన ఈ కార్యక్రమం తర్వాత ఉద్యమంగా ఉధృతరూపం దాల్చింది. అలాంటి వాంగ్చుక్ను దీప్కే తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంతో ఉద్యమనేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా అనే కొత్త చర్చ మొదలైంది. అయితే ఉద్దేశపూర్వకంగానే వాంగ్‌చుక్ పేరును దీప్కే ప్రస్తావించలేదనే వాదనా విని్పస్తోంది. ఈ వాదనకు బలం చేకూర్చేలా దీప్కే ప్రసంగంలోని మాటలు ఉండటం గమనార్హం. ‘మన డిమాండ్లు నెరవేరడంతో నన్ను హీరోను చేసేయకండి. కేవలం ఒక్క వ్యక్తిని హీరోను చేస్తూ పోవడంతోనే ఇప్పుడు భారత్ ఇలా అస్తవ్యస్తంగా తయారైంది. అలాంటి తప్పును మీరు చేయొద్దు’’ అని దీప్కే అన్నారు.ఇప్పుడే సూర్యోదయమైంది ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలోని ఫేమస్ డైలాగ్‌ను దీప్కే చెప్పారు. ‘‘మోదీజీ. ప్రజాస్వామ్యానికి ఇప్పుడే సూర్యోదయం అయింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పుడే తొలి వికెట్ పడింది. మా ఉద్యమ ప్రయాణం మరెంతో ముందుకు సాగాల్సి ఉంది. ఈ ప్రభుత్వంలో ఎవరూ రాజీనామా చేయరని అందరూ మాతో చెప్పేవారు. కానీ సంకల్పం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని మేము నిరూపించాం’అని దీప్కే అన్నారు. -
ఆందోళనల విరమణ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పోటీపరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంతో ఉద్యమించిన యువత ఆరంభించిన ఆందోళనలను విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పారీ్ట(సీజేపీ) శనివారం ప్రకటించింది. నీట్ ఉదంతంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తోపాటు ఆత్మహత్యలకు పాల్పడిన పరీక్షార్థుల కుటుంబాలకు తలో రూ.1 కోటి నష్టపరిహారం, జూన్ 20నాటి ఛలో సంసద్ ర్యాలీలో పోలీసులతో ప్రతిఘటించిన ఉద్యమకారులపై మోపిన కేసులన్నింటినీ ఎత్తేసేందుకు మోదీ సర్కార్ సమ్మతి తెలపడంతో తమ ఆందోళనలను విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. ప్రభుత్వంతో జరిపిన నాలుగో దఫా చర్చలు ఫలవంతమయ్యాక సీజేపీ ప్రతినిధులు ఈ విషయాన్ని మంత్రులతో కలిసి సంయుక్త మీడియా ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో కలిసి శనివారం ఢిల్లీలోని ‘కాన్సిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా’లో సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలు సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో అశుతోష్ మాట్లాడారు. ‘‘బాధిత కుటుంబాలకు గౌరవప్రదమైన ఆర్థిక సాయంతోపాటు ఢిల్లీ, బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఉద్యమకారులపై నమోదైన కేసులను నాలుగు రోజుల్లోపు ఎత్తేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. దీంతో నిరసనలకు నేటితో ముగింపు పలుకుతున్నాం. జంతర్‌మంతర్ సహా అన్ని నిరసనవేదికల నుంచి కార్యకర్తలంతా ఇళ్లకు బయల్దేరండి’’అని అశుతోష్ కోరారు. హామీల అమలు, విద్యావ్యవస్థ పటిష్టతకు తీసుకునే చర్యలపై సమీక్ష కోసం సీజేపీ, ప్రభుత్వ ప్రతినిధులు నాలుగు వారాల తర్వాత మళ్లీ భేటీ అవుతారని అశుతోష్ వెల్లడించారు. తర్వాత జేపీ నడ్డా మాట్లాడారు. ‘‘ఉద్యమం ముగిశాక కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడవద్దు అని సీజేపీ ప్రతినిధులు కోరారు. మంత్రి రాజీనామా, బాధితులకు నష్టపరిహారం, కేసుల ఉపసంహరణతోపాటు పరీక్షల నిర్వహణ, విద్యావ్యవస్థలో సమూల మార్పులకు వాళ్లు సూచించిన ఐదు పాయింట్ల చార్టర్‌ను పరిశీలించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తంచేసింది’’అని నడ్డా తెలిపారు. -
'కాక్రోచ్' గెలిచింది
న్యూఢిల్లీ: బొద్దింకే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరూపించింది. నీట్–యూజీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువతరాన్ని ఉద్యమం వైపు మళ్లించి అనుకున్నది సాధించింది. సీజేపీ పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. గత పది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల కలత చెందానని ఆయన చెప్పారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నానని స్పష్టంచేశారు. ఇప్పటి పరిస్థితిని దేశ విద్రోహ శక్తులు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వొద్దన్న కారణంతోనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు యువతకు ప్రధాన్ లేఖ రాశారు. ఢిల్లీలో పరిణామాలు శనివారం చకచకా జరిగిపోయాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషీకి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. కేంద్రం, సీజేపీ చర్చలు సఫలం మరోవైపు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ మధ్య మూడో విడత చర్చలు జరిగాయి. సీజేపీ లేవనెత్తిన మరో రెండు కీలక డిమాండ్ల పట్ల కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని, నిరసనకారులపై కేసులు కొట్టివేయాలని సీజేపీ డిమాండ్ చేయగా, ప్రభుత్వం అందుకు అంగీకారం తెలియజేసింది. మొత్తానికి మూడు కీలకమైన డిమాండ్లు నెరవేరడంతో కాక్రోచ్ జనతా పారీ్టలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. శనివారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ సంబరాల్లో మునిగిపోయింది. ఆశించిన లక్ష్యం నెరవేరడంతో.. 49 రోజులుగా సాగుతున్న పోరాటాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నిరసన ప్రదేశాల నుంచి అందరూ శాంతియుతంగా వైదొలగాలని ఆ పార్టీ నేత సౌరవ్ దాస్ కోరారు. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నడ్డా వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల మేరకు పరిహారం అందిస్తామని తెలిపారు. అయితే, ఎంత ఇస్తారన్నది ఆయన పేర్కొనలేదు. శనివారం జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల సంబరాలు జంతర్‌మంతర్ వద్ద సంబరాల హోరు కేంద్ర మంత్రి రాజీనామా చేసిన సంగతి తెలియడంతో జంతర్‌మంతర్ వద్ద శనివారం పండుగ వాతావరణం నెలకొంది. నిరసనకారులు త్రివర్ణ పతాకాలు చేతబూని, కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. ‘చక్ దే ఇండియా’వంటి పాటలు వినిపిస్తుండగా, వారు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం కనిపించింది. చాలామంది డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలను, పోస్టర్లను ప్రదర్శించారు. మంత్రి రాజీనామాను తమ పోరాటానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే జంతర్‌మంతర్ వద్ద జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనుకున్నది చేసి చూపించామని చెప్పారు. భయపడకపోతే గెలవవచ్చనడానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామే నిదర్శనమని స్పష్టంచేశారు. సోనమ్ వాంగ్‌చుక్ సైతం స్పందించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. శాంతి, సహనం, పట్టుదలకు దక్కిన విజయం అని తేల్చిచెప్పారు. సీజేపీకి, దేశంలోని జెన్ జెడ్‌కి అభినందనలు తెలియజేశారు. అవినీతికి ప్రతీక ప్రధాన్ ప్రధాని మోదీ మొండితనం ఓడిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ‘విక్టరీ ఆఫ్ ట్రూత్’గా అభివర్ణించారు. ‘‘యువతకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. లాఠీలు, పెల్లెట్ గన్లతో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’అని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన.. ప్రభుత్వాన్ని ఎవరూ తమ సొంత జాగీరులా నడపలేమని బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలకవర్గానికి హెచ్చరిక జారీ చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వాన్ని సొంత జాగీరుగా భావిస్తే ఇప్పుడు జరిగిన దానికంటే పది రెట్లు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి ప్రతీక అని అని మండిపడ్డారు. ఆయన వెళ్లిపోవడం మంచిదేనని చెప్పారు. ఆందోళన సమయంలో విద్యార్థులపై జరిగిన అకృత్యాలకు గాను ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యానికి ఇది గొప్ప విజయం, దేశ ప్రజలందరికీ అభినందనలు’’అని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. -
‘సంపూర్ణ క్రాంతి’ సైరన్!
‘‘పదండి ముందుకు, పదండి తోసుకు – ప్రభంజనం వలె హోరెత్తండి’’... శ్రీశ్రీ కవితావేశానికి దృశ్యరూపంలా కనిపించింది ‘కాక్రోచ్’ల కదనోత్సాహం. ఎండుగడ్డి మైదానంలో నిప్పు రవ్వలా నిద్రాణమైన జన చేతనను రగిలించగలిగింది. 1974లో స్వాతంత్య్ర సమరయోధుడు జేపీ నాయకత్వంలో నడిచిన ‘సంపూర్ణ క్రాంతి (టోటల్ రివోల్యూషన్) ఛాయలు ఈ ఉద్య మంలో ప్రస్ఫుటంగా కనిపించాయి. నిరంకుశ పాలన వైపు అడుగులేస్తున్న అధికార కూటమికీ, పక్షవాతం సోకిన ప్రధాన ప్రతిపక్షానికీ కాక్రోచ్ ఉద్యమం గట్టి సవాల్నే విసిరింది. ఉద్యమ స్వభావాన్ని, దాని గమనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సమయంలోనే గుర్తించగలిగారు. ఫలితంగా శనివారం మధ్యాహ్నం విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఆయనే వ్యక్తిగతంగానే తీసుకున్నారని జాతీయ మీడియాకు లీకులందాయి. బహుశా ఆయన ప్రతిష్ఠను నిలబెట్టడం కోసం వీటిని ప్రసారం చేసి ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల విజయాల కీలక పాత్రధారుల్లో ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఒకరు. ఆయన గౌరవాన్ని కాపాడటం పార్టీ బాధ్యత కూడా. సంపూర్ణ క్రాంతి ఉద్యమం మాదిరిగా దేశ వ్యాప్తంగా విస్తరించే లక్షణాలను కాక్రోచ్ ఉద్యమంలో గుర్తించి నందువల్ల దీనికి వెంటనే ఫుల్స్టాప్ పెట్టాలని ప్రధాని భావించి నట్టు సమాచారం.ధరేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌ను తొలి దశలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రజా ఉద్యమాలకు తలొగ్గి నిర్ణయాలను మార్చుకునే లక్షణం పన్నేండేళ్ల పాలనా కాలంలో ఎన్డీఏకు ఎప్పుడూ లేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతి రేకంగా పంజాబ్ రైతులు చేసిన చరిత్రాత్మక పోరాటంపై స్పందించడానికి మోదీ సర్కార్ సుదీర్ఘ సమయాన్ని తీసు కున్నది. అంతర్జాతీయ క్రీడా యవనికపై దేశ ప్రతిష్ఠను ఇనుమ డింపజేసిన మహిళా మల్లయోధుల ఆక్రందన అరణ్యరోదనగా మారింది తప్ప ఎన్డీఏ సర్కార్ చలించలేదు. పౌరసత్వ చట్టం దగ్గర నుంచి అనేకానేక అంశాల్లో కేంద్రం ప్రజా ఉద్యమాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ‘కాక్రోచ్’ల పార్లమెంట్ ముట్టడి జరిగిన మూడు రోజుల్లోనే ప్రధానమంత్రి రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలను చేపట్టారు.ఈ నెల 23న ఆందోళనపై తొలిసారిగా ఆయన నోరు విప్పారు. పేపర్ లీకేజీ ఘటనల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు లను ఏర్పాటు చేస్తున్నట్టు అర్ధరాత్రి ట్వీట్ చేశారు. విద్యార్థుల సంక్షేమం, వారి భవితవ్యం కంటే ఇంకేదీ ముఖ్యం కాదని కూడా అందులో పేర్కొన్నారు. 24న జరిగిన కేబినెట్ సమావేశంలో ఇటువంటి నేరాలకు సంబంధించి చట్టానికి మరింత పదును పెడుతూ తీర్మానించారు. సీజేపీ ప్రతినిధులు పెట్టిన గడువు లోపల 25 మధ్యాహ్నం మంత్రి రాజీనామా నిర్ణయం వెలువడింది. ఈ మూడు రోజులుగా కేంద్రమంత్రులు సీజేపీ ప్రతి నిధులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. సీజేపీ పెట్టిన డిమాండ్లలో మంత్రి రాజీనామా ముఖ్యమైనది. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వడం, ఆందోళనలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయడం మిగిలిన రెండు డిమాండ్లు. వీటిని కూడా కేంద్రం అంగీకరించినట్టు సమాచారం.విద్యార్థులపై జరిగిన పాశవిక లాఠీచార్జికి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని తాజాగా సీజేపీ డిమాండ్ చేసింది. మంత్రి రాజీనామాతో యువజనోద్యమం ముగిసిపోలేదనీ, విద్యావ్యవస్థ ప్రక్షాళన జరిగేవరకూ కొనసాగు తుందనీ కాక్రోచ్ ప్రతినిధులు విజయోత్సవం సందర్భంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ధర్నా, దీక్షా కార్యక్రమాల విరమణపై నిర్ణయం వెలువడాల్సి ఉన్నది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం కంటే ఎక్కువగా అప్రదిష్ట మూటకట్టుకున్నది గోదీ (పెంపుడు) మీడియా.ఏన్డీఏ కూటమిలో అప్రకటిత భాగస్వాములుగా పెంపుడు మీడియా, యెల్లో మీడియా వగైరాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జూలై 20న జరిగిన కాక్రోచ్ల పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం పెంపుడు మీడియాను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశం నలుమూలల నుంచి లక్షలాది యువజనం తరలి వస్తారని అది ఊహించలేకపోయింది. పోలీసు దమనకాండకు ఎదురొడ్డి నిలబడతారని కూడా అంచనా వేయలేకపోయింది. ఈ ఉలికి పాటు నుంచి తెప్పరిల్లిన తర్వాత సన్నాయి నొక్కులు ప్రారంభించింది. తరలివచ్చిన ఝంఝూమారుత యువ కెరటాలను ‘నీట్ పరీక్ష’ పరిధిల్లోనే బంధించడానికి తాపత్రయపడింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదని ధర్మపన్నాగాలను వల్లె వేసింది. జవాబుదారీతనం ఒక కనీస ప్రజాస్వామిక ధర్మమనే విషయాన్ని విస్మరించి మంత్రి రాజీనామా డిమాండ్‌ను తప్పుపట్టింది. తాడూ బొంగరం లేని పార్టీ పిలుపునిస్తే ఇంత జనసందోహం పోగవడం వెనుకనున్న ‘అదృశ్య శక్తుల’ కోసం ఆరా తీయడం మొదలుపెట్టింది. మీడియా పక్షపాతాన్ని నిలదీసిన యువకులను అరాచక శక్తులుగా చిత్రించారు. నవతరం యువతుల ధైర్యసాహసాలకూ, మొహమాటమెరుగని ముక్కుసూటి తనానికీ వాట్సాప్ యూనివర్సిటీ పెడార్థాలు తీసింది.ఆన్లైన్లో మొదలైన కాక్రోచ్ పార్టీ పిలుపునిస్తే లక్షలాది మంది స్పందించడం పట్ల ప్రభుత్వం, పెంపుడు మీడియాలే కాదు, ప్రతిపక్షం కూడా అవాక్కయింది. పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి సహజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. అయితే పాలక కూటమి అందుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. యాభయ్యేళ్ల కింద దేశంలో సంపూర్ణ క్రాంతి ఉద్యమంనాటి పరిస్థితులే నేటి యువజనో ద్యమం పరిస్థితులు కూడా. బంగ్లాదేశ్ విమోచన యుద్ధం తర్వాత ఇందిరాగాంధీ ప్రతిష్ఠ పెరిగింది కానీ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. సరకుల ధరలు పెరిగాయి. నిరుద్యోగం ప్రబలింది. రాజకీయ నేతలు, అధికార యంత్రాంగంలో గతంతో పోలిస్తే అవినీతి ప్రబలింది. దీనికి తోడు ఎదురులేదన్న ధీమాతో అధికార పార్టీలో, అధినాయకత్వంలో నియంతృత్వ ధోరణులు ప్రబలాయి. ఈ ధోరణులకు వ్యతిరేకంగా గుజరాత్ విద్యార్థులు ప్రారంభించిన ఆందోళనను బిహార్ అందిపుచ్చుకున్నది.అనంతరం జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో అది సంపూర్ణ క్రాంతి ఉద్యమంగా పరిణామం చెంది ఎమర్జెన్సీ విధింపునకు, తదనంతరం ఇందిరాగాంధీ ఓటమికి దారితీసింది. 1974 నాటి పరిస్థితులు మరింత దారుణంగా ఇప్పుడు పరిణమించాయి. విద్యారంగంలో విచ్చలవిడిగా ప్రైవేటీకరణ ప్రబలింది. ఈ ప్రైవేటీకరణ భూతంలేని ఆ రోజుల్లోనే సంపూర్ణ క్రాంతి డిమాండ్లలో అందరికీ విద్య అందుబాటులో ఉండాలనే అంశం ప్రముఖంగా చోటుచేసుకున్నది. ఇప్పుడు దేశంలో మెజా రిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో లేని పరి స్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ స్కూళ్లను దిగజార్చుతున్నాయి. 2014 నుంచి నేటివరకు దేశంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఒక కోటి పద్దెనిమిది లక్షలు తగ్గింది. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో 88 లక్షల మంది పెరిగారు. ఇటువంటి పరిస్థితుల్లోనే నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. కొన్ని స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు పెట్టడం జాతీయ వార్తగా మారింది. వాస్తవాలు ఇలా వుంటే... ఇప్పుడు కొత్తగా లోకేశ్ సారథ్యంలో ప్రభుత్వ స్కూళ్లు నో వేకెన్సీ బోర్డులు పెడుతున్నట్టు రంప చోడవరం సభలో చంద్రబాబు కళ్లార్పకుండా చెప్పేశారు. తల్లికి వందనం ఐడియా కూడా లోకేశ్‌దే నన్నట్టుగా ఆయన మాట్లా డారు. పెద్ద నాయకుడు కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా అలా మాట్లాడితే ‘అతన్నెవరికైనా చూపించండర్రా’ అంటారు. జగన్ మోహన్‌రెడ్డి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం అనుమతులు తీసుకోకుండా 1,800 మెడికల్ సీట్లను ఏపీ విద్యార్థులకు దూరం చేసి వారి కలలను భగ్నం చేశారు. ఇలాంటి పరిస్థితులే కదా కాక్రోచ్ల పుట్టుకకు దారితీసేది!దేశవ్యాప్తంగా ఉన్నత విద్యారంగం పరిస్థితి కూడా నిరాశా జనకంగానే ఉన్నది. యూజీసీ గ్రాంట్లకు భారీగా కత్తెర వేసి విశ్వవిద్యాలయాల నాణ్యతా ప్రమాణాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వర్సిటీలకు అనుమతులు పెరిగాయి. అవి కాసుల కోసం పని చేస్తాయి తప్ప పరిశోధనల కోసం పాకులాడవు కదా! ఉన్నత విద్యారంగంలో కూడా ప్రమాణాలు గణనీయంగా పడిపోతు న్నాయి. లక్షల సంఖ్యలో ఉత్పత్తి అవుతున్న నాణ్యతలేని పట్టభద్రులకు ఉద్యోగాలు దొరకడం లేదు. పట్టభద్రుల నిరు ద్యోగితా శాతం దేశంలో ముప్పయి శాతం దాటింది. నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో దూరం చేశారు. ప్రైవేట్ సంస్థల్లో కొనలేని పేద, మధ్యతరగతి విద్యార్థులు నిరుద్యో గులుగా మిగిలిపోతున్నారు. విద్యారంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సంక్షోభంలో కోట్లాది మంది చిక్కుకొని పోయారు.సంక్షోభానికి మరోకోణం అవినీతి. రాష్ట్రాల వారీగా నిక్షేపంగా జరుగుతున్న మెడికల్ అడ్మిషన్ల విధానాన్ని ఉద్దరిస్తామని చెప్పి కేంద్రీకరించారు. వ్యవస్థాగత బలంలేని టెస్టింగ్ ఏజెన్సీకి ప్రతిష్ఠాత్మక సంస్థల అడ్మిషన్ల బాధ్యతను అప్పగించారు. ప్రైవేట్ సంస్థలకు కీలకమైన పనులను ఔట్ సోర్సింగ్ చేసే పద్ధతి వల్ల అవకతవకలకు రాచబాట ఏర్పడింది. ఫలితంగా లక్షలాది విద్యా ర్థుల కలలు కల్లలవుతున్నాయి. ఈ పూర్వరంగంలో ప్రధాన్ రాజీనామాతోనే ఈ సంక్షోభం తొలగిపోదు. సంపూర్ణ క్షాళన కోసం యువతరం ఉద్యమించడం అనివార్యం. ఇవాళ కాక పోయినా రేపైనా ఈ సంపూర్ణ క్రాంతిరథం కదలక తప్పదు.ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అవకతవకలపై ప్రతిపక్ష నేత అందజేసిన సాక్ష్యాలను యువతరం అందిపుచ్చుకోవలసి ఉన్నది. మెడికల్ సీట్లను రాష్ట్ర విద్యార్థులకు అందకుండా చేసిన నిర్వాకంపై ఎలు గెత్తవలసి ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం తోడుగా ఉన్నంతవరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏ శక్తీ ఏమార్చ లేదని ఈ పరిణామం రుజువు చేసింది. జెన్జీగా పిలుచుకుంటున్న నవతరం మొబైల్ ఫోన్లలో మునిగిపోయి స్తబ్ధుగా మారిపోయిందనే అభిప్రాయం శుద్ధ తప్పని తేలి పోయింది. అవసరం వస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎలాంటి సవాలైనా ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడతారని రుజువైంది. కాక్రోచ్ ఆందోళనకు దేశవ్యాప్త గుర్తింపు రావడానికి దోహద పడిన సోనమ్ వాంగ్‌చుక్, ఒక సెటైర్‌ను వైల్డ్ ఫైర్‌గా మార్చగలిగిన అభిజిత్ దీప్కే, 23 రోజుల నిరాహార దీక్ష అనంతరం కూడా సివంగిలా రణగర్జనలు చేసిన నేహా బోరా, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా పోలీస్ వ్యాన్ ఎదురుగా నిలబడి అమరత్వానికి సిద్ధపడిన రియా అహిర్, వాటర్ కెనాన్లను గేలిచేస్తూ వాటికింద డ్యాన్సులు చేసిన బిహారీ విద్యార్థులు, తోడేళ్ల మంద ఎదుట తొడగొట్టినట్టు లాఠీచార్జీలను సవాల్ చేసిన యువతీ యువకులందరూ ఈ ఉద్యమంలో హీరోలే! రాబోయే సంపూర్ణ విప్లవానికి వేగుచుక్కలు వారే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘నీట్’ అయిపోయింది.. సీజేపీ నెక్ట్స్ ఏం చేస్తుందంటే?
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నిరసనలకు తలొగ్గడం చాలా అరుదు. సాధారణంగా ప్రభుత్వాలు చర్చలు జరుపుతాయి, నిరసనలను కాలక్రమంలో చల్లారేలా చూస్తాయి. కానీ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేఐ) ఆందోళనల విషయంలో మాత్రం ఆ పరిస్థితి మారింది.నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై వారాల తరబడి పెరిగిన ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. జూన్ 6 నుంచి జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఇతర యువత నిరసనలు కొనసాగించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త వెలువడగానే అక్కడ సంబరాలు జరిగాయి.నీట్ సంక్షోభం కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, జూలై 20న జరిగిన పోలీసు చర్యపై రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు డిమాండ్ చేశారు.ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే..?సీజేపీ ఇకపై నీట్, పరీక్షల సంస్కరణలకే పరిమితమవుతుందా? లేక ఉద్యోగాలు, నియామకాలు, యువత భవిష్యత్తు వంటి అంశాలపై దేశవ్యాప్త ఉద్యమంగా చేస్తుందా? ఈ నిర్ణయమే సీజేపీ చరిత్రను నిర్ణయించనుంది.సీజేపీ.. కేవలం నీట్ ప్రశ్నపత్రం లీక్ కారణంగా పుట్టిందని భావించడం సరికాదు. నీట్ వివాదానికి ముందే, ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్య దేశ యువతలో తీవ్ర చర్చకు దారి తీసింది. నిరుద్యోగ యువతను "కాక్రోచ్లు" అని అన్నారనే అభిప్రాయం సామాజిక మాధ్యమాల్లో విస్తరించింది. అనంతరం ఆయన నకిలీ డిగ్రీలతో ఉద్యోగాల్లోకి వచ్చే వారినే ఉద్దేశించి మాట్లాడినట్లు వివరణ ఇచ్చినా, అప్పటికే ఆ పదాన్ని యువత తమ ఉద్యమానికి ప్రతీకగా మార్చుకుంది. అలా "కాక్రోచ్" అనే పదం అవమానం నుంచి ప్రతిఘటనకు చిహ్నంగా మారింది.సామాజిక మాధ్యమాల నుంచే పుట్టిన ఉద్యమంగతంలో విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగేవి. కానీ, సీజేపీ పూర్తిగా డిజిటల్ వేదికలపై రూపుదిద్దుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్‌లు, ప్రత్యక్ష ప్రసారాల్లో ఉద్యమం వ్యాప్తి చెందింది. వీటి ద్వారానే వేలాది మంది యువత ఒక్కటయ్యారు. మీమ్స్ ఉద్యమానికి ఊపునిచ్చాయి. ఆ తర్వాత నీట్ ప్రశ్నపత్రం లీక్ ఈ ఉద్యమానికి స్పష్టమైన లక్ష్యాన్ని ఇచ్చింది.ప్రతి సంవత్సరం సుమారు 25 లక్షల మంది నీట్ పరీక్ష రాస్తున్నారు. అయితే జంతర్ మంతర్ వద్ద కేవలం వైద్య విద్యార్థులే కాదు... యూపీఎస్సీ అభ్యర్థులు, ఎస్ఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత, ఇంజినీరింగ్ పట్టభద్రులు, నిరుద్యోగులు అందరూ ఈ ఉద్యమంలో భాగమయ్యారు. ఎందుకంటే పరీక్ష రద్దు కావడం అంటే వారికి మరో ఏడాది కోచింగ్ ఖర్చు, మరో ఏడాది ఉద్యోగం లేకపోవడం, కుటుంబంపై మరింత భారం పడటమే.తదుపరి అజెండా ఉద్యోగాలేనా?భారత్‌లో ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. అయితే స్థిరమైన ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోంది. ప్రభుత్వ నియామకాల్లో... ఖాళీలు భర్తీ కాకపోవడం, కోర్టు కేసులు, ప్రశ్నపత్రాల లీకులు, నియామకాల ఆలస్యం వంటి సమస్యలు తరచుగా కనిపిస్తున్నాయి. యువతకు నిరుద్యోగం అనేది నిత్యజీవిత సమస్య.సీజేపీ ముందున్న కీలక అంశాలుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఒక ప్రధాన డిమాండ్ నెరవేరింది. ఇప్పుడు సీజేపీ ముందు పలు మార్గాలు ఉన్నాయి. పరీక్షల సంస్కరణలు, పారదర్శకత కోసం ఉద్యమాన్ని కొనసాగించడం. ఉద్యోగాలు, నియామకాలు, ప్రభుత్వ ఖాళీల భర్తీ వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకోవడం. లేదా భవిష్యత్తులో రాజకీయ ప్రత్యామ్నాయంగా మారాలా అనే విషయంపై ఆలోచించడం.చరిత్ర ఏమి చెబుతోంది?భారత రాజకీయాల్లో ఇలాంటి ఉద్యమాలు భిన్న ఫలితాలు ఇచ్చాయి. జేపీ ఉద్యమం దేశ రాజకీయాలను మార్చింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం తర్వాత ఒక వర్గం రాజకీయాల్లోకి ప్రవేశించింది. రైతుల ఉద్యమం ఒకే చట్ట లక్ష్యంతో విజయాన్ని సాధించింది. అయితే విద్యార్థి ఉద్యమాలు మాత్రం ప్రధాన సమస్య పరిష్కారమైన తర్వాత బలహీనపడిన సందర్భాలు ఎక్కువ.శనివారం జరిగిన పరిణామం మరో విషయాన్ని కూడా నిరూపించింది. రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల మద్దతు లేకుండానే డిజిటల్ వేదికల ద్వారా దేశవ్యాప్తంగా ఒక తరం యువతను ఏకం చేయవచ్చని సీజేపీ చూపించింది. ఈ ఉద్యమం ఇంటర్నెట్ సంస్కృతి నుంచి పుట్టుకొచ్చినా దాని డిమాండ్లు మాత్రం ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాథమికమైనవి.. అవే జవాబుదారీతనం, సమాన అవకాశాలు, న్యాయం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సీజేపీ ఉద్యమానికి ముగింపు కాకపోవచ్చు. ఉద్యోగాలు, నియామక సంస్కరణలు, యువత భవిష్యత్తు వంటి పెద్ద అంశాలపై కొత్త దశకు ఇది ఆరంభం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘కాక్రోచ్’ సాఫ్ట్వేర్ కంపెనీ గురించి తెలుసా?
ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల కారణంగా సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ ల్యాబ్స్’ (Cockroach Labs) అనే పేరు కూడా ట్రెండ్‌గా మారింది. పార్టీ పేరుకు, అమెరికాకు చెందిన ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేకపోయినా, పేరులోని "కాక్రోచ్" పదం ఒకటే కావడంతో నెటిజన్లు మీమ్స్, పోస్టులతో వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి కూడా "మా కంపెనీకి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు" అనే భావనతో సోషల్ మీడియాలో స్పందించడంతో మరింత చర్చ మొదలైంది.ఏమిటీ కాక్రోచ్ ల్యాబ్స్?కాక్రోచ్ ల్యాబ్స్ అనేది అమెరికాకు చెందిన క్లౌడ్ డేటాబేస్ సాఫ్ట్వేర్ సంస్థ. ఆధునిక క్లౌడ్ అప్లికేషన్ల కోసం అత్యంత వేగంగా, సురక్షితంగా పనిచేసే ‘కాక్రోచ్డీబీ’ (CockroachDB) అనే డిస్ట్రిబ్యూటెడ్ SQL డేటాబేస్‌ను అభివృద్ధి చేసింది. సిస్టమ్‌లో ఏదైనా సర్వర్ పనిచేయకపోయినా, డేటా కోల్పోకుండా సేవలు కొనసాగించేలా ఈ టెక్నాలజీని రూపొందించారు. అందుకే ఎన్ని విపత్తులు వచ్చినా బతికి బయటపడే కాక్రోచ్ (బొద్దింక) పేరును కంపెనీ బ్రాండ్‌గా ఎంచుకున్నారు.ఈ సంస్థను 2015లో ముగ్గురు మాజీ గూగుల్ ఇంజినీర్లు స్పెన్సర్ కిమ్బాల్, పీటర్ మ్యాటిస్, బెన్ డార్నెల్ స్థాపించారు. గూగుల్‌లో భారీ స్థాయి డేటా సిస్టమ్‌లపై పనిచేసిన అనుభవంతో, క్లౌడ్ యుగానికి సరిపోయే కొత్త తరహా డేటాబేస్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కంపెనీని ప్రారంభించారు. సంస్థ సహవ్యవస్థాపకుడు స్పెన్సర్ కిమ్బాల్ (Spencer Kimball) ప్రస్తుతం కంపెనీ సీఈవోగా కొనసాగుతున్నారు. గూగుల్‌లో పనిచేసే ముందు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఓపెన్‌సోర్స్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ GIMP అభివృద్ధిలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.కాక్రోచ్ ల్యాబ్స్ ప్రధాన ఉత్పత్తి ‘కాక్రోచ్డీబీ’. ఈ డేటాబేస్‌ను ముఖ్యంగా బ్యాంకింగ్, ఫిన్‌టెక్ సంస్థలు, ఈ-కామర్స్ కంపెనీలు, టెలికాం సంస్థలు, SaaS కంపెనీలు, AI, క్లౌడ్ అప్లికేషన్ డెవలపర్లు వంటి భారీ స్థాయి సంస్థలు ఉపయోగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్వర్లలో ఒకేసారి డేటాను నిర్వహించడం, సిస్టమ్ డౌన్‌టైమ్‌ను తగ్గించడం, ఆటోమేటిక్ రికవరీ, హై అవైలబిలిటీ వంటి ఫీచర్లు దీని ప్రత్యేకత. ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి ప్రధాన క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఇది అందుబాటులో ఉంది.కాక్రోచ్ ల్యాబ్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాలేదు. కాబట్టి దీనికి అధికారిక మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదు. అయితే 2021లో సిరీస్ ఎఫ్ ఫండింగ్ సమయంలో కంపెనీ విలువ 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.43,000 కోట్లకు పైగా)గా అంచనా వేశారు. ఇది ఇప్పటికీ ప్రైవేట్ కంపెనీగానే కొనసాగుతోంది.భారత్‌లో కూడా కార్యకలాపాలు2022లో కాక్రోచ్ ల్యాబ్స్ భారతదేశంలోని బెంగళూరులో తన అనుబంధ సంస్థను నమోదు చేసింది. ప్రస్తుతం భారత్‌లో కూడా ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ బృందాలను విస్తరిస్తోంది. ప్రపంచంలోని అనేక పెద్ద సంస్థలు కాక్రోచ్డీబీని ఉపయోగిస్తున్నాయి. వీటిలో నెట్‌ఫ్లిక్స్, కామ్‌కాస్ట్, బోస్, ఈక్విఫాక్స్ వంటి సంస్థలు ఉన్నాయి. అధిక ట్రాఫిక్‌ను నిర్వహించే అప్లికేషన్ల కోసం ఈ డేటాబేస్కు మంచి డిమాండ్ ఉంది. -
సీజేపీ ఆందోళన ఎఫెక్ట్.. మెట్రోస్టేషన్లుక్లోజ్.. నెట్ కట్
-
చర్చల్లో బిగ్ ట్విస్ట్.. కేంద్రానికి షాకిచ్చిన సీజేపీ!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మధ్య మూడో విడత చర్చలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ మరోసారి స్పష్టం చేసింది. రాజీనామాపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే చర్చలను కొనసాగించడంలో ఎలాంటి ప్రయోజనం లేదని శనివారం తేల్చిచెప్పింది.సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమకు చర్చలకు అతీతమైన అంశమని పేర్కొన్నారు. ప్రభుత్వం రాజీనామాకు అంగీకరించకపోతే తదుపరి చర్చలకు అర్థం ఉండదని స్పష్టం చేశారు.Dharmendra Pradhan’s resignation is NON-NEGOTIABLE.If it’s a no from the government, there’s no point of further discussion.— Ashutosh Ranka (@AshutoshRanka) July 25, 2026‘ముందు రాజీనామా.. ఆ తర్వాతే చర్చలు’నీట్ సహా పోటీ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం జరగనున్న మూడో విడత చర్చలకు ముందు సీజేపీ చేసిన ఈ ప్రకటనతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో సీజేపీ తన ప్రధాన డిమాండ్‌పై మరింత కఠిన వైఖరి ప్రదర్శించింది.రెండు డిమాండ్లపై కేంద్రం సానుకూలతఇప్పటికే జరిగిన చర్చల్లో సీజేపీ చేసిన మూడు ప్రధాన డిమాండ్లలో రెండు అంశాలపై కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.శాంతియుతంగా నిరసనల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయకూడదన్న డిమాండ్పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించాలన్న డిమాండ్ఈ అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించినప్పటికీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇందుకోసం ఈ మధ్యాహ్నం వరకు కేంద్రం గడువు కోరింది. అయితే రాజీనామాపై స్పష్టత ఇచ్చాకే చర్చలను ముందుకు తీసుకెళ్తామని సీజేపీ ఇప్పుడు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.రాజీనామాకు నో?మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజీనామా చేయడం సమస్యకు పరిష్కారం కాదని, అది బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుందని కేంద్ర వర్గాల అభిప్రాయం. పరీక్షల నిర్వహణలో లోపాలను సరిదిద్దడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో సంస్కరణలు చేపట్టడమే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటున్న సీజేపీప్రధాన్ రాజీనామాపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని సీజేపీ హెచ్చరిస్తోంది. చర్చల ఫలితం ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని నేతలు తెలిపారు. నీట్ పేపర్ లీక్ వివాదంతో ప్రారంభమైన ఆందోళనలు ప్రస్తుతం కేంద్రం–సీజేపీ మధ్య ప్రతిష్టంభనకు దారితీశాయి. ఈ నేపథ్యంలో మూడో విడత చర్చలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. -
మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకారం: సీజేపీ
సీజేపీ ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. సీజేపీ విధించిన డెడ్‌లైన్‌లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో కేంద్రానికి మా సత్తా ఏంటో చూపించామంటూ సీజేపీ వ్యాఖ్యానించింది. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఉద్యమం ఆగదని.. ఈ విజయం విద్యార్థులందరిందని సీజేపీ పేర్కొంది. సీజేపీ నిరసనలు.. అప్డేట్స్..విద్యారంగంలో మంచి సంస్కరణలు తీసుకురావాలి: రాహుల్విద్యావ్యవస్థను బీజేపీ భ్రష్ఠు పట్టించిందివిద్యార్థులకు మోదీ క్షమాపణలు చెప్పాల్సిందేదేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ ఆక్రమించిందివిద్యా రంగాన్ని క్రమంగా ప్రైవేటీకరణ చేస్తున్నారువిద్యార్థులపై దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలి నీట్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం: జేపీ నడ్డాత్వరలోనే పరిహారం ఇస్తాంనిబంధనలకు లోబడే పరిహారం చెల్లిస్తాంసీజేపీ ప్రతిపాదించిన సంస్కరణలను పరిశీలిస్తాంమూడు డిమాండ్లకు కేంద్రం అంగీకారం: సీజేపీవిద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందిప్రధాన్ రాజీనామాతో మా మొదటి డిమాండ్ నెరవేరిందివిద్యార్థులపై కేసు ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందిపరిహారంపై కూడా స్పష్టత ఇచ్చిందివిద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలిఆందోళన విరమించిన సీజేపీసీజేపీ, కేంద్ర మధ్య ముగిసిన చర్చలుసీజేపీ ప్రతినిధులతో చర్చించిన నడ్డా, జితేంద్రసింగ్దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన చర్చలు కేంద్రంతో సీజేపీ మూడో విడత చర్చలుచర్చల్లో పాల్గొన్న జేపీ నడ్డా, జితేంద్ర సింగ్సీజేపీ నుంచి హాజరైన సౌరవ్ దాస్, అశుతోష్లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరిన సీజేపీసెంట్రల్ ఢిల్లీలో తెరుచుకున్న మెట్రో స్టేషన్లువిద్యార్థుల ఆందోళన విరమణతో మెట్రో స్టేషన్లు రీఓపెన్ఢిల్లీలో వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాలుఢిల్లీకి బయల్దేరి రావాలని ఫడ్నవీస్, షిండేలకు పిలుపుమరికొంతమంది రాజకీయ నాయకులకు ఢిల్లీ పిలుపుఇది ప్రజాస్వామ్య విజయం మల్లికార్జున ఖర్గేఇప్పటికైనా విద్యా వ్యవస్థను సరిదిద్దాలియువత ధైర్యంగా పోరాడిందిఢిల్లీ:ప్రధాని మోదీతో అమిత్ షా భేటీతాజా పరిణామాలపై మోదీ, అమిత్ షా చర్చలు కాసేపట్లో కేంద్రంతో సీజేపీ ప్రతినిధుల చర్చలుమిగతా రెండు డిమాండ్లను నెరవేర్చాలంటున్న సీజేపీప్రజాస్వామ్యం గెలిచింది: వాంగ్చుక్శాంతికి, సహనానికి చెందిన విజయం ఇదిఇప్పటికైనా విద్యారంగంలో సంస్కరణలు తేవాలిఇకపై కేంద్ర బాధ్యతాయుతంగా వ్యహరించాలిసీజేపీ, జెన్ జీలకు ధన్యవాదాలు జంతర్‌మంతర్ దగ్గర విద్యార్థుల సంబరాలుఒక డిమాండ్ నెరవేరింది: సీజేపీమిగతా 2 డిమాండ్లు నెరవేరే వరకు వేచి ఉందాంవిద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి ప్రజాస్వామ్యం గెలిచింది: సీజేపీకేంద్రానికి మా సత్తా ఏంటో చూపించాం: సీజేపీవిద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఉద్యమం ఆగదుఈ విజయం విద్యార్థులందరిదికేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ రాజీనామాసీజేపీ ఉద్యమంతో దిగొచ్చిన ధర్మేంద్ర ప్రధాన్సీజేపీ విధించిన డెడ్‌లైన్‌లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామారాజీనామా లేఖను ప్రధానికి పంపిన ధర్మేంద్ర ప్రధాన్జంతర్మంతర్ సమీపంలో ఉద్రిక్తతపోలీసులపై రాళ్లురువ్విన ఆందోళనకారులుఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగంజంతర్మంతర్లో కొనసాగుతున్న సీజేపీ నిరసనలు ఢిల్లీ పోలీసులకు సీజేపీ డిమాండ్జంతర్ మంతర్‌ను ముట్టడించడం ఆపండిదీక్షా స్థలికి వచ్చే ప్రజలను అడ్డుకోవద్దునిరసనకారులకు ఆహారం, మందులు చేరనివ్వాలిజంతర్ మంతర్ ముట్టడిని ఎత్తివేయాలని డిమాండ్ఢిల్లీ పోలీసుల సంచలన ప్రకటనజంతర్మంతర్ హింసాత్మక ఘటనలపై పోలీసుల ప్రెస్మీట్అందులో చాలా వరకు ఫేక్ వీడియోలు, ఫొటోలు ఉన్నాయిసోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారాలు చేశారుదీని వెనక పాకిస్తాన్ ప్రమేయం ఉందిపాక్ నుంచి ఏఐ వీడియోలను క్రియేట్ అయ్యాయి400కి పైగా పాక్ హ్యాండిల్స్‌ను బ్లాక్ చేశాంఏఐ కట్టడికి కృషి చేస్తున్నాంఏఐ ద్వారా ఫేక్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయిరేపు దేశవ్యాప్త నిరసనలను సీజేపీ పిలుపుమరోసారి దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చిన సీజేపీరేపు సాయంత్రం 6గం. క్యాండిల్ ర్యాలీలు చేపట్టాలని పిలుపుఇవాళ చర్చలు ఉంటాయా? ఉండవా? అనేదానిపై నెలకొన్న అనిశ్చితిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతున్న సీజేపీధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించకలేకపోతే.. మోదీనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్కేంద్రంతో చర్చకు ముందు సీజేపీ కీలక ట్వీట్రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదునిర్ణయం తీసుకోకపోతే.. చర్చలు కొనసాగించడంలో అర్థం లేదు“వాళ్లు అడిగే పరిస్థితి రాకముందే.. ఇప్పటికి బాధ్యత తీసుకుని స్వయంగా రాజీనామా చేసి ఉండాల్సింది.” అంటూ మరో ట్వీట్మధ్యాహ్నం 3.30గం. కు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులతో సీజేపీ భేటీ!నిన్న గంటన్నరపాటు జరిగిన చర్చలుకీలక డిమాండ్‌పై కొలిక్కి రాని చర్చలుఇవాళ ఏ నిర్ణయం ప్రకటిస్తామన్న కేంద్ర మంత్రులుమంత్రి రాజీనామాపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతి చేస్తామని ప్రకటనजिम्मेदारी लेकर बिना मांगे ही अब तक इस्तीफा दे देना चाहिए था 🥺— Cockroach Janta Party (@CJP_for_India) July 25, 2026 సీజేపీ నిరసనలకు ప్రొఫెసర్ కోదండరాం మద్దతుసీజేపీ నిరసనలకు ప్రొఫెసర్, తెలంగాణ ఎమ్మెల్సీ కోదండరాం మద్దతువిద్యార్థులు చేస్తున్న ఆందోళన సరైందిపేపర్ లీకేజీకి ధర్మేంద్ర ప్రధానే కారణంకచ్చితంగా ఆయన రాజీనామా చేయాలిసీజేపీ నిరసనలకు రాహుల్ గాంధీ సంఘీభావంశనివారం.. మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్ ప్రధాని అర్ధరాత్రి పూట వీడియోలు చేస్తున్నారు.. ఏం లాభం?ఢిల్లీ పోలీసులు విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తించారులాఠీలతో తలలు పగలకొట్టారుపిల్లలపై దాడి చేసిన వాళ్లు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందేధర్మేంద్రను ప్రధాని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలినీట్ లీక్‌పై విద్యార్థులకు ప్రధాని క్షమాపణలు చెప్పాలిఅవినీతికి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతీకధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు అంటున్నారుఆయన్ని మరో శాఖకు మార్చాలని అనుకుంటున్నారుఆయన శాఖ మార్చడం కూడా ఆమోద యోగ్యం కాదుఎంత బెదిరించినా.. జంతర్ మంతర్నుంచి విద్యార్థులు కదలరుయువతకు అభిజిత్ దీప్కే ధన్యవాదాలు టైఫాయిడ్‌తో బాధపడుతున్ను కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేచికిత్స తీసుకుంటున్న సీజేపీ చీఫ్శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న యువతకు ధన్యవాదాలుఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తే కేంద్రం తప్పకుండా దిగి వస్తుందిధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి తప్పకుండా రాజీనామా చేస్తారుపోరాటం ఇలాగే కొనసాగించాలని సూచనకోలుకోగానే తాను చేరతానని వ్యాఖ్యమోహన్ భగవత్ పరోక్ష వ్యాఖ్యలుఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలునేటి యువత దారితప్పిన వారు కాదని, వారిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న భగవత్యువతకు ఆదేశాలు ఇవ్వడం కాకుండా.. వారితో చర్చలు జరపాలని సూచనకొత్త తరం ఎక్కువగా ప్రశ్నలు అడుగుతోందని, వారికి సరైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని వ్యాఖ్యయువతకు మార్గనిర్దేశం చేయాలే తప్ప.. వారి అభిప్రాయాలను అణచివేయకూడదన్న ఆరెస్సెస్ చీఫ్“ఆదేశాలు కాదు.. చర్చలు, నియంతృత్వం కాదు.. ఏకాభిప్రాయం” అనే సందేశం ఇచ్చిన మోహన్ భగవత్యువత విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే సంభాషణ(మాటలు, చర్చల) ద్వారానే సాధ్యమని ఆసక్తికర వ్యాఖ్యరాజీనామా లేకుండానే దీక్ష విరమణ.. వాంగ్‌చుక్ వివరణధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ మినహా మిగతా వాటికి అంగీకరించిన సోనమ్ వాంగ్చుక్కేంద్ర మంత్రుల సమక్షంలో మొన్న దీక్ష విరమణప్రధాన డిమాండ్ నెరవేరక ముందే దీక్ష విరమించడంపై విమర్శలునిన్న రాత్రి వీడియోలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చిన వాంగ్చుక్కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ.. 26 రోజుల నిరాహార దీక్షను విరమించినట్లు సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు.రాజీనామా తనకు ప్రధాన అంశం కాదని.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు నమోదు కాకుండా చూడటమే తన ప్రాధాన్యత అని చెప్పారు.ఢిల్లీలోని ‘సీజేపీ’ (Cockroach Janta Party) ఆధ్వర్యంలో జరిగిన ‘సంసద్ చలో’ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండవని కేంద్రం రాతపూర్వక హామీ ఇచ్చిందని వెల్లడించారు.పరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్‌లపై పార్లమెంట్లో చర్చిస్తామని.. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారాన్ని పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని తాను చర్చల్లో ప్రస్తావించానని.. కానీ కేంద్రం మరింత సమయం కోరిందని వాంగ్‌చుక్ తెలిపారు.ప్రధాన్ రాజీనామా చివరికి జరిగే అవకాశం ఉందని తాను భావిస్తున్నానని.. అందుకే దానిపై పట్టుబట్టలేదని చెప్పారు."నా లక్ష్యం విద్యార్థులు నష్టపోకూడదనేది. వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు కాకుండా చూడటమే అత్యంత ముఖ్యమైన విషయం" అని స్పష్టం చేశారు.దీక్ష విరమణపై వచ్చిన ‘డీల్ కుదిరింది’ అనే ఆరోపణలను వాంగ్‌చుక్ ఖండించారు."డీల్ చేసుకోవాలనుకుంటే 26 రోజులు ఆకలితో ఉండాల్సిన అవసరం ఏముంది? ఏసీ గదిలో కూర్చునే ఒప్పందం చేసుకునేవాడిని" అని వ్యాఖ్యానించారు.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆస్పత్రికి వచ్చి హామీలు ఇచ్చారని.. అయితే రాతపూర్వక హామీ వచ్చే వరకు దీక్ష విరమించలేదని తెలిపారు.తనతో పాటు పోరాడిన విద్యార్థులు, ఎంపీలు, లద్దాఖ్ ప్రతినిధులు దీక్ష ముగింపు సమయంలో తన వద్ద లేకపోవడం బాధ కలిగించిందని వాంగ్‌చుక్ అన్నారు. AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026సమగ్ర కథనం కోసం👉 ఎలాంటి డీల్ లేదు: ఐసీయూ నుంచి వాంగ్‌చుక్ చర్చల వేళ సీజేపీ కీలక వ్యాఖ్యలుకేంద్ర ప్రభుత్వంతో మూడో విడత చర్చలకు ముందు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక ప్రకటన.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పష్టత లేకుండా చర్చలు కొనసాగించడంలో అర్థం లేదని స్పష్టీకరణ.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పనిసరి డిమాండ్ (నాన్-నెగోషియబుల్) అంటూ సీజీపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా వ్యాఖ్య ప్రభుత్వం రాజీనామాకు అంగీకరించకపోతే.. తదుపరి చర్చలకు వెళ్లడంలో ప్రయోజనం లేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు.కేంద్రం, సీజీపీ ప్రతినిధుల మధ్య మూడో విడత సమావేశానికి కొన్ని గంటల ముందు ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని సీజీపీ డిమాండ్ చేస్తోంది.సమగ్ర కథనం కోసం👉 కేంద్రానికి సీజేపీ సంచలన షరతువాంగ్చుక్ వైరల్ వీడియోపై సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వివరణసోనమ్ వాంగ్చుక్ను అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో రికార్డైన దృశ్యాలు బయటకు వైరల్‌గా మారిన వీడియో‘‘నేను వెళ్తున్నా.. నన్ను అరెస్ట్ చేయండి’’ అని పోలీసులకు సవాల్ విసిరిన వాంగ్చుక్వైరల్ వీడియోపై స్పందించిన సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి జూలై 21న ఆస్పత్రిలోని నో-వీడియోగ్రఫీ జోన్లో రికార్డు చేసినట్లు వెల్లడించింది.వాంగ్‌చుక్ అనుచరులు ఈ వీడియోను చిత్రీకరించారని స్పష్టీకరణరికార్డు చేసిన వెంటనే కాకుండా శుక్రవారం విడుదల చేశారని స్పష్టం చేసింది.ఆస్పత్రి నిబంధనలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరించారంటూ వివరణ ఇచ్చిన సర్దర్జంగ్ ఆస్పత్రికేంద్రం–సీజేపీ చర్చలు 3.0.. కీలక పరిణామాలుకేంద్రం, సీజేపీ మధ్య మూడో విడత చర్చలు నేడు జరగనున్నాయి.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పైనే ప్రధానంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది.శుక్రవారం జరిగిన దాదాపు రెండు గంటల చర్చల్లో ఎలాంటి తుది నిర్ణయం రాలేదు.సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లలో రెండింటికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు సమాచారం.శాంతియుత నిరసనకారులపై కేసులు ఎత్తివేయడం, మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అంశాలపై సానుకూలత వ్యక్తం చేసింది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మాత్రం కేంద్రం మరింత సమయం కోరింది.ఇవాళ మధ్యాహ్నం 3గం.లకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధుల భేటీ జరగనుందినీట్ నిరసనలు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలుపేపర్ లీక్ నేరాలకు కఠిన శిక్షలు విధించే ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.పేపర్ లీక్ మాఫియాకు కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష ప్రతిపాదించారు.నేర తీవ్రత ఆధారంగా శిక్షను 10 ఏళ్ల వరకు పెంచే అవకాశం కల్పించారు.వ్యవస్థీకృత పేపర్ లీక్ రాకెట్లకు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలు చేర్చారు.పేపర్ లీక్ కేసుల దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించారు.కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ చేపట్టనున్నారు.ఈ బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.మంత్రి రాజీనామాపై ఉత్కంఠ..విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాన్ని ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి.రాజీనామా చేయడం బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుందని కేంద్ర వర్గాల వాదన.ఎన్టీఏ సంస్కరణలు, పరీక్షల వ్యవస్థలో మార్పులే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం చెబుతోంది.సీజేపీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేస్తోంది.సీజేపీ హెచ్చరికలు..రాజీనామాపై స్పష్టమైన నిర్ణయం రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.ప్రభుత్వం స్పందన ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అశుతోష్ రాంకా తెలిపారు.కేంద్రం వైఖరిలో మార్పు లేకుంటే కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు.డిమాండ్లపై అశుతోష్ రాంకా కీలక వ్యాఖ్యలునిన్న జరిగిన సమావేశంలో పరిహారం, చట్టపరమైన కేసులకు సంబంధించిన అంశాలపై సానుకూల స్పందన వచ్చిందన్న రాంగాఈ అంశాలపై ప్రభుత్వం నుంచి సూత్రప్రాయ అంగీకారం లభించిందని, ఈరోజు లిఖితపూర్వక ఒప్పందం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాలేదన్నారు.మీడియా కథనాల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని సమాచారం వస్తోందని, అదే జరిగితే సమావేశాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని రాంకా అన్నారు.ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్‌ను పట్టించుకోకుండా రాజీనామాకు నిరాకరిస్తే, తదుపరి వ్యూహాన్ని ప్రకటిస్తామని తెలిపారు.ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే సీజేపీ కూడా మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని అశుతోష్ రాంకా కోరారు.VIDEO | Delhi Jantar Mantar Protest: CJP spokesperson Ashutosh Ranka, says, "In yesterday's meeting, we received a positive response regarding compensation and legal cases. We got an in-principle agreement, and we hope to receive the written agreement today as well. However,… pic.twitter.com/BFvGHOZWBm— Press Trust of India (@PTI_News) July 25, 2026సమగ్ర కథనం కోసం👉: నీట్ టైం బాంబ్.. ఎప్పుడైనా పేలొచ్చుజంతర్ మంతర్ వద్ద భద్రత కట్టుదిట్టం..సీజేపీ ఆందోళన నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద కట్టుదిట్టమైన భద్రతఢిల్లీ పోలీసులు భద్రతా చర్యలను పెంచారు.నిరసనలకు ప్రధాన వేదిక అయిన జంతర్ మంతర్ ప్రాంతం చుట్టూ అదనపు బారికేడ్ల ఏర్పాటు.బారికేడ్లను భారీ స్థాయి గొలుసులతో ఒకదానికొకటి అనుసంధానించారు.బారికేడ్లు కదలకుండా ఉండేందుకు వాటిని వెల్డింగ్ చేసి మరింత బలోపేతం.పెద్ద సంఖ్యలో ప్రజలు చేరే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు.జంతర్ మంతర్ పరిసరాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు.శాంతియుతంగా ఆందోళన కొనసాగించేలా పోలీసులు చర్యలు చేపట్టారుPolice Fortifies Jantar Mantar,A six-layer barricade setup is now in place on the road near Jantar Mantar and Jai Singh Marg. An attempt is being made to restrict the protesters to the area. The barricades have been anchored to the ground using iron rods and welding pic.twitter.com/NmwjZOfNPN— Amit Bhardwaj (@AmmyBhardwaj) July 24, 2026ఇంటర్నెట్ నిలిపివేత..సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సర్వీస్ నిలిపివేతపని చేయని మొబైల్ డేటా సర్వీసెస్బుకింగ్ కానీ క్యాబ్ సర్వీసులు, పని చేయని యూపీఐ పేమెంట్స్ యాప్సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు#WATCH | Security intensified around Jantar Mantar as Delhi Police set up additional barricades that have been interlinked with heavy duty chains and reinforced through welding. pic.twitter.com/I9tNCvGp6X— ANI (@ANI) July 25, 2026 మెట్రో మూసివేత..సీజేపీ నిరసనల నేపథ్యంలో మళ్ళీ మెట్రో స్టేషన్లు మూసివేత18 మెట్రో స్టేషన్లు క్లోజ్ లోక్ కల్యాణ్ మార్గ్రాజీవ్ చౌక్పటేల్ చౌక్రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్బారఖంబా రోడ్సుప్రీం కోర్ట్సేవా తీర్థ్జనపథ్మండి హౌస్సెంట్రల్ సెక్రటేరియట్ఐటీఓఢిల్లీ గేట్ఇంద్రప్రస్థఖాన్ మార్కెట్జోర్ బాగ్శివాజీ స్టేడియంఝండేవాలాన్న్యూ ఢిల్లీకేంద్రం, సీజేపీ చర్చల్లో ప్రతిష్టంభన..రాజీనామా చేయాల్సిందేనన్న కాక్రోచ్ జనతా పార్టీ24 గంటల్లో చెబుతామన్న మంత్రులు, నేడు మళ్లీ చర్చలు47 మంది ఎన్టీఏ సిబ్బందికి ఉద్వాసనధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరంటున్న ప్రభుత్వ వర్గాలుకేంద్ర ప్రభుత్వం, సీజేపీ చర్చలు శుక్రవారం అసంపూర్తిగా ముగిశాయి.ఏమీ తేల్చకుండా శనివారానికి ఉత్కంఠను మిగిల్చాయి.విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే ప్రధానంగా చర్చ నడిచింది.మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ పట్టుబట్టగా.. ప్రభుత్వం 24 గంటల సమయం కోరింది.శనివారం మధ్యాహ్నం ఏ విషయం చెబుతానంటూ వాయిదా వేసింది. -
పెల్లెట్ గన్లు గురిపెట్టారు
న్యూఢిల్లీ: జంతర్‌మంతర్ వద్ద ఈ నెల 20వ తేదీన శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా పెల్లెట్ గన్స్‌తో కాల్పులు జరిపారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. పెల్లెట్స్ ఉపయోగించారనడానికి ఈ విద్యార్థే నిదర్శనమంటూ సాహిల్ అనే యువకుడిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. విద్యార్థులపై కాల్పులు జరిపి, లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని పునరుద్ఘాటించారు. సాహిల్ త్రివర్ణ పతాకం చేతబూని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పుడు అతడిపై పెల్లెట్ గన్‌తో దాడి జరిగిందని, తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. సాహిల్ కన్ను దెబ్బతి న్నదని, ఆ కంటితో అతనికి ఏమీ కనిపించడం లేదని తెలిపారు. సాహిల్ శరీరానికి తగి లిన గాయాలను సైతం రాహుల్ మీడియాకు చూపించారు. వేలాది మంది యువతకు ఇదే పరిస్థితి ఎదురైందని, వారిపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపి, లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారని ఆరోపించారు. నిరసనకారులు చేసిన నేరం ఏమిటని తీవ్రంగా ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్ ఒక ‘క్రిమినల్ ఎడ్యుకేషన్ మినిస్టర్’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భారత విద్యా వ్యవస్థ పతనానికి ప్రతీకగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. -
నిరసనకారులపై ఏఐ నజర్!
న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకు రావాలని, పేపర్ లీకేజీలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద యువత, విద్యార్థు లు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అయితే, ఉద్యమకా రులపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. జంతర్‌మంతర్ వద్ద నిరసనకు సంబంధించిన వీడియోలను చాలామంది ‘ఎక్స్’లో పోస్టు చేస్తున్నారు. నిరసన కారులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనేది కచ్చితంగా గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ముఖ గుర్తింపు(ఫేసియల్ రికగ్నిషన్) వ్యవస్థలను ఉపయోగిస్తున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ‘ఎక్స్’లో పోస్టుచేసిన వీడియో క్లిప్‌లలో 360 డిగ్రీల కెమెరాలతో కూడిన లైవ్ సీసీటీవీ నిఘా వాహనం ద్వారా తీసిన దృశ్యాలు కనిపిస్తు న్నాయి. వాహనం లోపల ఉన్న స్క్రీన్ మీద కొందరు నిరసనకారుల పేర్లు, ఫొటోలు, ఇతర వివరాలు కూడా దర్శనమి స్తున్నాయి. ఆ వీడియో ల్లో ఎక్కడా ఆధార్ కార్డు వివరాల ప్రస్తావన లేదు. అయితే, వ్యక్తుల ముఖాలను స్కాన్ చేసిన తర్వాత వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఇచ్చే వ్యవస్థను పోలీసులు ఉపయో గిస్తున్నట్లు నిరసనకారులు అనుమానిస్తున్నారు. ఇది ఆధార్‌తో లేదా మరేదైనా ప్రభుత్వ డేటా బేస్‌తో అనుసంధానమై ఉండొచ్చని అంటున్నా రు. పోలీసులు ఆధార్ డేటాను ఉపయోగిస్తున్నట్లు అధికారిక ధ్రువీకరణ లేదు. తమ సాంకేతిక వ్యవస్థను ఆధార్ డేటాబేస్‌తో అనుసంధానించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పడం లేదు. జంతర్‌మంతర్ వద్ద నిరసన ప్రదేశానికి సమీపంలో ఢిల్లీ పోలీసులు రెండు నిఘా వాహనాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి మొబైల్ పర్యవేక్షణ యూనిట్‌గా పనిచేస్తూ, ఆ ప్రాంతం చుట్టూ అమర్చిన సీసీటీవీ కెమెరాల నుండి ప్రత్యక్ష ప్రసారాలను స్వీకరిస్తుంది. రెండో వాహనం కృత్రిమ మేధను ఉపయోగించి ఆ వీడియో ఫీడ్లను విశ్లేషించి, కెమెరాలో బంధించిన ముఖాలను పోలీసుల డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న చిత్రాలతో పోల్చి చూస్తుంది. నిరసనకారులను ప్రత్యక్షంగా గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ వ్యాన్లను మోహరించారని, వారు అక్కడికక్కడే బయో మెట్రిక్ వివరాలను సేకరించి, వ్యక్తిగత డేటాను వెలికితీస్తున్నారని కాక్రోచ్ జనతా పార్టీ వెల్లడించింది. అయితే, తమ ఉద్దేశశం నిరసనకారులందరినీ గుర్తించడం కాదని పోలీసు అధికారులు చెబుతున్నారు. జన సమూహంలో నేర చరిత్ర ఉన్నవారు ఎవరైనా కనిపిస్తే పోలీసులను అప్రమత్తం చేయడమే దీని లక్ష్యమని పేర్కొంటున్నారు. ‘‘నేరగాళ్ల ఫొటోలతో కూడిన ఒక పెద్ద డేటాబేస్ మా దగ్గర ఉంది. అందువల్ల జంతర్‌మంతర్ ప్రాంతంలోని వివిధ సీసీటీవీ కెమెరాల నుంచి మాకు అందిన ఫుటేజ్ ఆధారంగా ముఖ గుర్తింపు చేస్తాం. తద్వారా అక్కడ నేరగాళ్లు ఉంటే అదుపులోకి తీసుకోవడం సాధ్యమవుతుంది’’ అని పోలీసులు స్పష్టంచేశారు. -
రాజీనామా కుదరదు!
న్యూఢిల్లీ: నీట్–యూజీ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఎంతమాత్రం లేదని, అది ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి. పదవికి రాజీనామా చేయడం చాలా సులభమైన పనే అయినప్పటికీ.. అలా చేస్తే ప్రజలు అప్పగించిన బాధ్యత నుంచి పారి పోవడమే అవుతుందని శుక్రవారం పేర్కొన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే పదవి నుంచి తప్పించాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ఆయన రాజీనామా చేయబోరని ప్రభుత్వం విస్పష్టంగా చెబుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘ప్రజలు మాకు అధికారాన్ని కట్టబెట్టారు. వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మాపై ఉంది’’అని ప్రభుత్వం తేల్చిచెప్పింది. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ సమావేశమైన రోజే ప్రభుత్వ వర్గాల నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. పేపర్ లీకేజీలను అరికట్టే విషయంలో నామమాత్రపు చర్యలు చేపట్టడానికి బదులుగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లో వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్టీఏకు సంబంధించిన లోపాలపై సమగ్ర జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. త్వరలోనే వీటిని సరిదిద్దేందుకు కార్యాచరణ ప్రారంభం కానుంది. పేపర్ లీకేజీల్లో ప్రమేయం ఉన్న ముఠాలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దోషులపై తదుపరి చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే దాకా జంతర్‌మంతర్‌వద్ద ఆందోళన కొనసాగిస్తామని సీజేపీ ఇప్పటికే ప్రకటించింది. -
ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందే.. రాజీ ప్రసక్తే లేదు!
సాక్షి, న్యూఢిల్లీ: నీట్–యూజీ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తేల్చిచెప్పింది. ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని పునరుద్ఘాటించింది. ఈ నెల 20న నిరసన సందర్భంగా విద్యార్థులపై క్రూరంగా దాడి చేసినందుకు కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా క్షమాపణ చెప్పాలని స్పష్టంచేసింది. పేపర్ లీక్, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, సీజేపీ ప్రతినిధుల మధ్య శుక్రవారం ఢిల్లీలో రెండో విడత చర్చలు జరిగాయి. కేంద్రం తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్, సీజేపీ తరఫున పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా పాల్గొన్నారు. తాజా పరిణామాలపై సుమారు రెండు గంటల పాటు చర్చించారు. మూడు ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రులకు అందజేశారు. ప్రస్తుతం సీజేపీ పోరాటం మొత్తం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం చుట్టే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన రాజీనామా చేసే దాకా విడిచిపెట్టబోమని ఆ పార్టీ పదేపదే చెబుతోంది. ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ మేరకు స్పష్టమైన సంకేతాలిస్తోంది. ప్రధాన్ రాజీనామా చేయడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు డిమాండ్లకు కేంద్రం అంగీకారం! కేంద్ర మంత్రులతో సమావేశం అనంతరం సీజేపీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తమ మూడు డిమాండ్లలో రెండింటికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి శనివారం మధ్యాహ్నం వరకు గడువు ఇస్తున్నట్లు వెల్లడించారు. గడువులోగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే తమఆందోళనను మరింత ఉధృతం చేస్తామని తేల్చిచెప్పారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని ఆపబోమని పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌కు ఉద్వాసన పలుకుతారని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, సీజేపీ డిమాండ్లలో రెండింటికి తాము అంగీకరించినట్లు కేంద్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం తర్వాత కేంద్రం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు మరోసారి చర్చలు: నడ్డా సీజేపీ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వంతో అంతర్గతంగా చర్చిస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. వారితో శనివారం మధ్యాహ్నం మరోసారి సమావేశం కానున్నట్లు వెల్లడించారు. శుక్రవారం నాటి భేటీ అనంతరం జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. సీజేపీ ప్రతినిధులు మూడు ప్రధాన డిమాండ్లతోపాటు పరీక్షల కోసం ఐదు సంస్కరణలు సూచించారని వెల్లడించారు. అంతర్గతంగా చర్చించి.. తీసుకున్న నిర్ణయాలను శనివారం మధ్యాహ్నం జరిగే మూడో విడత భేటీలో వారికి తెలియజేస్తామని పేర్కొన్నారు. సీజేపీ ప్రధాన డిమాండ్లు → దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలి. ఈ డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. → పేపర్ లీకేజీ, పరీక్షల రద్దు తదితర పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే రూ.కోటి చొప్పున ఆర్థిక పరిహారం చెల్లించాలి. → న్యాయమైన హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే బేషరతుగా కొట్టివేయాలి. -
విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న మోదీ ప్రభుత్వం: సోనియా
న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అకౌంటబిలిటీ కోరిన పాపానికి మోదీ ప్రభుత్వం విద్యార్థులపట్ల క్రూరంగా ప్రవర్తిస్తోందని, ఈ దేశ భవిష్యత్తుగా కాకుండా శత్రువులా చూస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీప ఆర్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించార.ఉ. దేశ విద్యా వ్యవస్థను దిగజారుస్తున్న మోడీ ప్రభుత్వ డొల్లతనాన్ని ఈ దేశ విద్యార్థులు బట్టబయలు చేశారని వ్యాఖ్యానించారు. విద్యార్థుల పక్షాన నిలవడం నైతికంగానే కాకుండా రాజకీయ, రాజ్యాంగబద్ధ ధర్మం కూడా అని స్పష్టం చేశారు. నిరాశ నిస్పృహలను కలిగించే విద్యావ్యవస్థ, మోడీ ప్రభుత్వపు అహంకార ధోరణి, బాధ్యతారాహిత్యం వంటి అంశాలన్నీ నిరసనలకు దారితీయడం సహజ పరిణామమేనని సోనియాగాంధీ ‘ద హిందూ’పత్రికలో ‘ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్, యంగ్ ఇండియాస్ ట్రామా’శీర్షికతో రాసిన కథనంలో పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి ఆధ్వర్యంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు ‘ఛలో సంసద్’సందర్భంగా విద్యార్థులపై చూపిన క్రూరత్వం ఈ ప్రభుత్వ హయాంలో కొత్తేమీ కాదని, 2020లో సీఏఏ నిరసన ప్రదర్శనల సందర్బంగానూ పోలీసులు, పారా మిలటరీ బలగాలు దారుణంగా వ్యవహరించాయని, మహిళ రెజ్లర్లపై జరిగిన దమనకాండను కూడా ఈ దేశం మరచిపోలేదని అన్నారు. విద్యార్థులు ధైర్యంగా వేస్తున్న ప్రశ్నలకు ఈ ప్రభుత్వం పిరికితనంతో జవాబు చెబుతోందని, క్రూరంగా అణచివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రశ్న పత్రాల లీకేజీని అరికట్టడంలో దారుణంగా విఫలమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేందుకు నిరాకరించడం ప్రజల మనసుల్లో గూడుకట్టుకుపోయిన ఆగ్రహానికి ఆజ్యం పోసిందని అన్నారు. ఎనీ్టయేను శక్తిమంతం చేసేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచి్చన సలహాలను బహిరంగంగానే తిరస్కరించడం ద్వారా ప్రధాన్ ధిక్కారాన్ని ప్రదర్శించడమే కాకుండా బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆ కథనంలో ఆరోపించారు. -
నిరసనలపై విచారణ 27న రెండు పిల్స్‌పై విచారిస్తాం
న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై పోలీసుల దాష్టీకంపై ఈ నెల 27న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రకటించింది. ఈ అంశంపై దాఖలైన రెండు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేస్తామని ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ యాదవ్ జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ తెలిపింది. ‘‘విద్యార్థులపై పోలీసులు అతిగా బలం ఉపయోగించారు’’అని, ఇది రోజూ జరుగుతున్నందున అత్యవసరంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ప్రస్తావించగా సీజేఐ స్పందించారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ నెలరోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూలై 20వ తేదీన నిర్వహించిన ‘ఛలో సంసద్’ర్యాలీలో పోలీసులు విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా పోలీసుల చర్యను గర్హిస్తూ జూలై 22న ఢిల్లీ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయ. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు కేంద్రం, ఢిల్లీ పోలీసుల స్పందనను కోరింది. పోలీసుల చర్యకు సంబంధించిన అన్ని రికార్డులను, సీసీటీవీ ఫుటేజ్‌లను భద్రపరచాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. మీడియాది అతి నిర్లక్ష్యం: సీజేఐ ఛలో సంసద్ సందర్భంగా విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ అంశంపై సత్వర విచారణను తాను నిరాకరించినట్లు వచ్చిన వార్తలను సీజేఐ సూర్యకాంత్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఆ అంశంపై ఎలాంటి రిట్ పిటిషన్ దాఖలు కాలేదని, ఒక రిప్రెజెంటేషన్ మాత్రమే అందిందని ఆయన శుక్రవారం వ్యాఖ్యానించారు. తమ కేసులను అత్యవసరంగా లిస్ట్ చేయాలని న్యాయవాదులు కోరుతున్న సమయంలో సీజేఐ మాట్లాడుతూ ‘‘రెండు రోజులుగా పిటిషన్ ఫైల్ అయినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోంది. మీడియా అన్ని రకాల బాధ్యతల నుంచి తప్పించుకని చీఫ్ జస్టిస్ ఆ పిటిషన్‌ను లిస్ట్ చేసేందుకు నిరాకరించారని తప్పుడు రిపోరి్టంగ్ చేస్తోంది’’అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆ రోజు ఉదయం పదిగంటల వరకూ ఒక్క కాగితమూ దాఖలు కాలేదు. ఒక రిప్రజెంటేషన్ మాత్రమే.. మిశ్రానో ఇంకెవరో పంపారు. దాన్ని రిట్ పిటిషన్‌గా ఎలా పరిగణిస్తా’’అని ప్రశ్నించారు. బుధవారం ఒక న్యాయవాది విద్యార్థులపై లాఠీఛార్జ్ విషయమై అత్యవసర విచారణ జరపాలని సీజేఐని కోరుతూ.. ‘‘పోలీసుల అకృత్యాలపై నా దగ్గర వీడియోలున్నాయి.... కేసు రేపు (గురువారం) లిస్ట్ చేయగలిగితే... విద్యార్థులు ఉన్నారు’’అని విన్నవించారు. అయితే సీజేఐ ఈ విజ్ఞప్తిని తిరస్కరించడంతోపాటు కేసులు ప్రస్తావించే సమయంలో వీడియోలు చూడలేమని స్పష్టం చేశారు. విద్యార్థులను బాగా కొట్టారని న్యాయవాది తెలపగా.. ‘‘మా సమయం వృథా చేయవద్దు. మేము వీడియోలు చూడదలచుకోలేదు’’అని ఘాటుగా సమాధానమిచ్చారు. -
సీజేపీ కార్యకర్తల ఆందోళన.. నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు : సీజేఐ
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద సీజేపీ కార్యకర్తలు, విద్యార్థుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలపై మీడియాలో వస్తున్న కథనాలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. కోర్టు సమయంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన స్పష్టం చేశారు.ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. దీని వెనుక ఉన్న అసలు సందర్భాన్ని వివరించారు. ఈ పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించిందంటూ వస్తున్న వార్తలను సీజేఐ పూర్తిగా కొట్టిపారేశారు. అత్యున్నత న్యాయస్థానం ఏనాడూ ఏ కేసు విచారణను కూడా తిరస్కరించదు. ప్రజలకు న్యాయం చేసేందుకు మేము 24 గంటలూ అందుబాటులో ఉంటాము అని ఆయన తేల్చి చెప్పారు.అసలు ఏం జరిగిందనే దానిపై వివరణ ఇస్తూ.. మా ముందుకు అధికారికంగా పిటిషనే రానప్పుడు, మేము దేనిపై విచారణ జరుపుతాము? కేవలం ఒక పేజీ లేఖ ఇచ్చి, దానిపై వెంటనే అత్యవసర విచారణ చేపట్టమంటే కుదరదు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి కొన్ని నిర్దిష్ట నిబంధనలు, ప్రక్రియలు ఉంటాయి. వాటిని మేము ఉల్లంఘించలేము. పిటిషన్‌ను సరైన పద్ధతిలో దాఖలు చేయాలని నేను వారికి చెప్పాను. కానీ వారు తక్షణమే విచారణ కావాలని పట్టుబట్టారు. అందుకే నిబంధనల ప్రకారం సరైన పిటిషన్ ఫైల్ చేయాలని వారికి స్పష్టం చేయాల్సి వచ్చింది అని సీజేఐ వివరించారు.చట్టం అందరికంటే ముందు సుప్రీంకోర్టుకు అత్యున్నతమైనదని, దానిని మనమందరం అనుసరించాల్సిందేనని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈరోజు నిబంధనల ప్రకారం సరైన రూపంలో దాఖలైన ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించిందని ఆయన తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ, ఇతర పరీక్షల అక్రమాలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులు, కార్యకర్తలపై పోలీసులు జరిపిన దాడిని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై వచ్చే సోమవారం విచారణ జరపనుంది. -
ఈ కథకు ముగింపు ఎప్పుడు అనేది . ఇప్పుడే చెప్పలేం... అసలు కథ ముందుంది
-
ఎవరితో పెట్టుకోవద్దో వారితోనే మోదీ పెట్టుకున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా యువత అద్భుత పోరాటం జరుగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే ప్రధాని మోదీ పెట్టుకున్నారు. యువత.. మోదీ ప్రభుత్వాన్ని కూలగొడతారు. రాజ్యామా ఉలిక్కిపడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వీ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో యువత కదం తొక్కుతున్నారు. 25 రోజులుగా ఢిల్లీలో పార్టీలకు అతీతంగా యువత పోరాడుతున్నారు. మీడియా రాకున్నా యువత ఒంటరిగా ఢిల్లీ వీధుల్లో పోరాటం చేసింది. యువతపై జరుగుతున్న దాడులు దారుణం. ఢిల్లీలో జరిగిన ఘటనలు అమానుషం.. పిల్లలపై పోలీసులు దాడులు చేశారు. విద్యార్థులు న్యాయం అడిగితే పోలీసులు దౌర్జన్యానికి దిగారు. యువకులను దారుణంగా కొట్టారు. యువత జవాబుదారీతనం కోరుతున్నారు. ఉద్యమ పార్టీగా మాకు ప్రజా ఉద్యమాల పట్ల గౌరవం ఉంది.ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే మోదీ పెట్టుకున్నారు. ప్రధాని మోదీ కొరివితో తల గోక్కుంటున్నారు. విద్యార్థులు మంత్రి పదవి అడగలేదు. న్యాయం చేయాలని మాత్రమే కోరుతున్నారు. ఢిల్లీలో ఇటీవల ఘటనలు చూస్తే నా కళ్లలో నీళ్లు వచ్చాయి. ఈ జనరేషన్ చావుకు భయపడే రకం కాదు. యువతకు పొట్టు పొట్టు ఆకలి ఉంది.. మోదీ ప్రభుత్వాన్ని కూలగొడతారు. రాజ్యామా ఉలిక్కిపడు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు రావాలి.. వచ్చాయా?. ఈ జనరేషన్ ఐటీ, ఈడీ సోదాలకు భయపడే వారు కాదు. మేకిన్ ఇండియా అడిగితే లీకిన్ ఇండియా ఇచ్చారు. నేను మోదీని ప్రశ్నిస్తే ఇక్కడున్న కేడీకి ఎందుకంత భయం?. పేపర్ లీక్‌కు, నాకు సంబంధం ఉందని రేవంత్ అంటున్నాడు. మోదీని ఎదిరించే దమ్ము రేవంత్‌కు లేదు. పాత కేసులు చూపించి జైల్లో పెడతారని రేవంత్‌కు భయం ఉంది. ఢిల్లీలో గల్లా పట్టి అడిగే దమ్ము మాకుంది ’ అని వ్యాఖ్యలు చేశారు. -
నీట్ లీక్‌పై ‘సుప్రీం’ సీరియస్.. కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణలో వరుస లోపాలను ఇకపై కొనసాగించలేమని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నుంచి సమగ్ర నివేదికలు కోరింది.నీట్ పేపర్ లీక్ కేసును శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం.. ఈ అంశాన్ని అత్యంత దగ్గరగా పర్యవేక్షిస్తామని తెలిపింది. పరీక్షల వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకొచ్చి, వాటిని సంస్థాగతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో నీట్‌ను నిర్వహించే ఎన్టీఏకు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.సంస్కరణలపై అఫిడవిట్లు దాఖలు చేయాలినీట్ పేపర్ లీక్ తర్వాత పరీక్షల నిర్వహణలో తీసుకున్న చర్యలు, భవిష్యత్ సంస్కరణల పురోగతిపై కేంద్రం, ఎన్టీఏ వివరణాత్మక అఫిడవిట్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ముఖ్యంగా పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానానికి మార్చే అవకాశాలు, డేటా భద్రత వంటి అంశాలపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని ధర్మాసనం కోరింది. “కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు మారితే డేటాను ఎలా రక్షిస్తారు?” అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.‘ఇక ఇలా కొనసాగనివ్వం’నీట్ వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “వరుస తప్పిదాలను ఇక కొనసాగించలేం. ఈ అంశాన్ని చాలా దగ్గరగా పర్యవేక్షిస్తాం” అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. విద్యార్థుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సమగ్ర ప్రణాళికను కోర్టు ముందు ఉంచేందుకు మరింత సమయం కావాలని కోరారు.ఇటు హైకోర్టులోనూ.. మరోవైపు నీట్ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత అంశం కూడా కోర్టు ముందుకు వచ్చింది. ఇంటర్నెట్ నిలిపివేతను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. నిరసనల సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధమేనా? అనే అంశంపై కోర్టు పరిశీలించనుంది.ఆందోళనలు.. రాజకీయ వేడినీట్ పేపర్ లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో ఉద్రిక్తత చోటుచేసుకోవడం, పోలీసులు బలప్రయోగం చేశారన్న ఆరోపణలు వివాదానికి దారితీశాయి. ఇప్పటికే నీట్ లీక్ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో పలువురిని అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలతో.. నీట్ పరీక్షల భవిష్యత్ విధానం, భద్రతా ప్రమాణాలు, సంస్కరణలపై కేంద్రం తీసుకునే చర్యలపై ఆసక్తి నెలకొంది. -
ఈరోజు రాత్రి మేమంతా అరెస్ట్.. సీజేపీ దీప్కే సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాత్రికి సీజేపీ టీమ్ మొత్తాన్ని అరెస్ట్ చేయవచ్చు అని చెప్పుకొచ్చారు. తాము అరెస్ట్ అయినా ఉద్యమం శాంతియుతంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దీంతో, ఈరోజు ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. జంతర్ మంతర్ వద్ద మీడియాతో మాట్లాడిన అభిజీత్ దీప్కే...‘ఈ రాత్రికి సీజేపీ టీమ్ మొత్తాన్ని అరెస్ట్ చేయవచ్చు. అరెస్ట్ చేసి మరో తప్పు చేయవద్దని ప్రభుత్వానికి చెబుతున్నా. అరెస్ట్‌తో ఆందోళన మరింత ఉధృతం అవుతుంది. మేము అరెస్ట్ అయినా ఉద్యమం శాంతియుతంగా సాగాలి. అలాగే, సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల నిరాహార దీక్షను విరమించడం శుభపరిణామం. ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఆరోగ్యం పట్ల మాకు ఆందోళన ఉండేది. 26 రోజులకు పైగా ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఈ దేశానికి ఎంతో విలువైనది” అని వ్యాఖ్యలు చేశారు.VIDEO | Delhi: “According to new input, CJP team members may be arrested tonight”, says CJP Founder Abhijeet Dipke, urging protesters to continue movement across nation even after arrest.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/6AW7aACtxQ— Press Trust of India (@PTI_News) July 24, 2026అయితే, తమ ఉద్యమం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద తమ ధర్నా కొనసాగుతుందని ప్రకటించారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మాకు మరే పరిష్కారం ఆమోదయోగ్యం కాదు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, పరీక్షా వ్యవస్థలో జవాబుదారీతనం వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది’ అని దీప్కే తేల్చి చెప్పారు.కేంద్ర మంత్రులతో జరగనున్న సమావేశంపై స్పందిస్తూ... చర్చలు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా తటస్థ వేదికలోనే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ ప్రధాన డిమాండ్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ వివాదం, పోటీ పరీక్షల్లో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది.#WATCH | Delhi: Founding President of Cockroach Janta Party, Abhijeet Dipke says, "Our dharna at Jantar Mantar will continue until Dharmendra Pradhan resigns. We are very relieved that Sonam Wangchuk has broken his hunger strike as it had been more than 26 days. His life is… pic.twitter.com/SSyJANfcXA— ANI (@ANI) July 24, 2026మరోవైపు.. సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని, అది నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జేపీ నడ్డా గారితో సమావేశం ఉంది. ఈ సమావేశానికి జితేంద్ర సింగ్ గారు కూడా హాజరయ్యే అవకాశం ఉందని మాకు సమాచారం. చర్చల్లో ఏం జరిగిందో మీడియాకు వెల్లడిస్తాం” అని తెలిపారు.సోనమ్ గారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో దీక్ష విరమించాలని మేము నిరంతరం కోరుతున్నాం. మా రెండు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం హామీ ఇచ్చింది. శాంతియుత నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, అలాగే బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది’ అని చెప్పుకొచ్చారు. అయితే, ఈ హామీలతో పోరాటం ముగిసినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోపై కూడా ఆయన స్పందించారు. ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడి పెరిగిందని వ్యాఖ్యానించారు. ‘మొదటిసారి ప్రధానమంత్రి అర్ధరాత్రి 12 గంటలకు సెల్ఫీ వీడియో విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీని ద్వారా పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. యువత భవిష్యత్తుపై ప్రభుత్వం నిజంగా సీరియస్‌గా ఉంటే, అత్యంత కఠినమైన చర్యగా ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలి’ అని రంకా అన్నారు. -
కేంద్రంతో చర్చలకు సీజేపీ గ్రీన్‌సిగ్నల్.. వేదిక ఫిక్స్
ఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమం కీలక మలుపు తిరిగింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని ఇప్పటికే ప్రకటించిన సీజేపీ నాయకత్వం, తటస్థ వేదికలోనే సమావేశం నిర్వహించాలని చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించినట్లు పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఇరు పక్షాల మధ్య చర్చలు జరగనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా గురువారం అర్ధరాత్రి సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రేపు చర్చలకు పిలుపు వచ్చింది. తటస్థ వేదికలో సమావేశం నిర్వహించాలని మేము కోరాం. ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించింది. చర్చలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాను వేదికగా ఎంపిక చేశారు’ అని తెలిపారు. ఈ చర్చలు సానుకూలంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.#WATCH | Delhi: Saurav Das, Chief Spokesperson, Cockroach Janta Party, says, "... Tomorrow, a discussion has been called for, we are very happy that the government has agreed to our request that it be at a neutral venue. The Constitution Club of India has been chosen..." (23.07) pic.twitter.com/MoK1DgdgJ5— ANI (@ANI) July 24, 2026కాగా, నిరసనల వేళ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చర్చల కోసం పలుమార్లు ఆహ్వానం పంపినప్పటికీ, కేంద్ర మంత్రుల నివాసాల్లో సమావేశాలకు తాము హాజరుకాబోమని సీజేపీ స్పష్టం చేసింది. జంతర్ మంతర్‌లోనే లేదా అందరికీ ఆమోదయోగ్యమైన తటస్థ వేదికలోనే చర్చలు జరగాలని పట్టుబట్టింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం తటస్థ వేదిక ప్రతిపాదనను అంగీకరించినట్లు తెలుస్తోంది.దేశవ్యాప్తంగా జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాల లీకులు, యువతలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో పారదర్శకత వంటి అంశాలపై ఈ ఉద్యమం ప్రారంభమైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, బాధ్యులపై కఠిన చర్యలు, బాధిత కుటుంబాలకు న్యాయం వంటి డిమాండ్లతో సీజేపీ ఉద్యమం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ప్రధానమంత్రి మోదీ పరీక్షా పేపర్ లీకుల కేసులపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ, అది తమ ప్రధాన డిమాండ్లకు పూర్తి పరిష్కారం కాదని సీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జరగనున్న శుక్రవారం చర్చలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ సమావేశంలో ప్రభుత్వం ఉద్యమకారుల డిమాండ్లపై ఎలాంటి హామీలు ఇస్తుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
విద్యార్థుల నిరసన.. నాన్న మాటలు గుర్తు చేసుకున్న సచిన్
నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహం రాజుకుంటోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది. ఢిల్లీ నుంచి కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో జంతర్‌మంతర్‌కు తరలివస్తూ ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు లాఠాచార్జీ చేసినప్పటికీ విద్యార్థులు ఏమాత్రం బెదరకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. విద్యార్థుల ఆందోళనకు ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతూ వస్తోంది . తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విద్యార్థుల నిరసనలకు మద్దతు పలికాడు. ఎంతో కష్టపడి చదివినా ఫలితం దక్కనప్పుడు విద్యార్థులు ఆవేదన చెందడం అర్థం చేసుకోదగిన అంశమేనని పేర్కొన్నాడు. విద్యార్థులు మరోసారి ఇలా నిరాశకు లోనవ్వకుండా చూసే బాధ్యత సమాజంపై ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సచిన్ గురువారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. స్వతహాగా తన తండ్రి ప్రొఫెసర్ కావడంతో చిన్నప్పుడే తనకు నూరి పోసిన మాటలను సచిన్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ‘ఓటములు ఎదురైనా పర్వాలేదు, కానీ మోసం మాత్రం చేయకూడదు. విజయం కోసం ఎప్పుడూ అడ్డదారులు తొక్కవద్దని మా నాన్న నాకు చెప్పేవారు. సమాజంలో పెద్దలుగా, మన సంస్కృతిని సరైన మార్గంలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని విద్యార్థులు నిరాశ చెందడం సహజం. భవిష్యత్తులో వారికి మళ్లీ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా మనమందరం సమష్టిగా కృషి చేయాలి. జైహింద్’ అని సచిన్ టెండూల్కర్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.కేవలం ఫలితాలకే ప్రాధాన్యమిచ్చే సమాజం, ప్రతిభ కంటే అక్రమ మార్గాలనే ఎక్కువగా ఆశ్రయిస్తుందని అని సచిన్ అభిప్రాయపడ్డాడు. యువత ఆకాంక్షలను పరిరక్షించే దిశగా త్వరలోనే సరైన పరిష్కారాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.సచిన్‌తో పాటు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో పాటు కోహ్లి, శుబ్‌మన్ గిల్ కూడా తమ సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు చేస్తున్న శాంతియుత నిరసనలకు మద్దతు ప్రకటించారు. ఇదిలాఉంటే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై అటు పార్లమెంట్ కూడా అట్టుడుకుతోంది. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు కాక్రోచ్ జనతాపార్టీ తమ ఆందోళనలను మరింత ఉధృతం చేసింది. pic.twitter.com/3a8WRHhWIK— Sachin Tendulkar (@sachin_rt) July 23, 2026 -
ప్లకార్డ్‌లో పంచ్‌లైన్... నిరసనలో రీల్ వైబ్
లాఠీలతో కొడితే థ్యాంక్యూలు చెప్తున్నారు. చెదరగొట్టడానికి వాటర్ కానన్ వాడితే రెయిన్ డాన్స్ చేస్తున్నారు. వాళ్ల పాటే నినాదం. వాళ్ల వ్యంగ్యమే ప్రశ్న. సెల్‌ఫోన్ పట్టుకున్న సైన్యంలా ఉంటున్నారు. జెన్ జి నిరసనకు ఫార్మాట్ మారింది. సీరియస్ ఇష్యూ + సినిమా పంచ్ + సోషల్ మీడియా... అదే ‘జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్’.ఢిల్లీ జంతర్ మంతర్‌లో ‘నీట్’ ప్రశ్నాపత్రానికి సంబంధించి తాజా నిరసనలో టియర్ గ్యాస్ గుప్పుమంది. అది చూసిన ఒక కుర్రాడు వెంటనే ప్లకార్డ్ మీద ఇలా రాశాడు. ‘గురూ... నేను యమునకు ఆ వైపున ఉంటా. ఇంతకన్నా కంపు రోజూ తెలుసు. ఇదసలు లెక్కే కాదు’....అక్కడే ఉన్న మరో కుర్రాడు ఇంకో ప్లకార్డ్ పట్టుకున్నాడు. దాని మీద గాంధీగారి బొమ్మ ఉంది. కింద కామెంట్– ‘ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే సీజన్1 హీరోని రంగంలో దించాల్సి వచ్చింది’... అంటే అహింసామార్గ ప్రదాతనే రంగంలోకి దించాల్సి వచ్చిందని అర్థం.మరో ప్లకార్డ్ ఒకమ్మాయి పట్టుకుంది. దాని మీద కామెంట్– ‘నాకు ఎవరూ ఫండింగ్ చేయలేదు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని ఉచితానికే అసహ్యించుకుంటున్నా’...తమ నిరసనకు స్పందించని పెద్దలకు చురక వేస్తూ మరో పోస్టర్. దానిపై మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్‌లోని సర్క్యూట్ పాత్ర. కింద కామెంట్– ఓయ్ సర్క్యూట్. రాంగ్ పర్సన్‌ని ఎత్తుకొచ్చావ్ స్వామీ.మామూలుగా నిరసనల్లో లాఠీచార్జీ జరిగితే పారిపోతారు. కాని నిరసనకు దిగిన జెన్ జి తరం వెనక్కి తగ్గలేదు. వాటర్ కానన్ కొట్టినా బదులుగా ‘రెయిన్ డాన్స్’ చేశారు. ‘Fitness plan: Running from police’ అని బోర్డు పట్టుకున్నారు.జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్ఒకప్పుడు నిరసన అంటే నల్ల జెండాలు, గొంతు చించుకునే నినాదాలు. కానీ 2026లో జెన్ జి ఆ డెఫినిషన్ను చెరిపేసింది. వాళ్లకు ఆగ్రహం ఉంది. కానీ ఆ ఆగ్రహాన్ని మీమ్‌గా, రీల్‌గా, పాటగా మారుస్తున్నారు. పేపర్ లీక్, నిరుద్యోగం, అవినీతి– సీరియస్ ఇష్యూలే. కానీ చెప్పే తీరు మాత్రం క్రియేటివ్. ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, జైపూర్ కావచ్చు... జెన్ జికి కోపం వస్తే స్టయిల్ ఇదే. స్పందించని వ్యవస్థను ఎద్దేవా చేస్తూ ‘నా ఎక్స్ (బాయ్‌ఫ్రెండ్/గర్ల్‌ఫ్రెండ్) కూడా నన్ను ఇంతగా బాధించ లేదు’ అని ప్లకార్డు పట్టుకొని నిలబడుతున్నారు. ఇలా డిజిటల్ కల్చర్‌ను, మీమ్స్ భాషను నిరసనకు వాడుకోవడాన్నే ‘జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్’ అంటున్నారు. బాలీవుడ్ పాటలు పాడటం, సంగీత కచ్చేరీలు, ప్రబోధ గీతాల ఆలాపన.. అన్నీ అలౌడ్.గెట్ రెడీ విత్ మీ (G-RWM)జెన్ జి యువతీ యువకులు ఒక దగ్గరకు కూడటానికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ఢిల్లీ ‘చలో సంసద్’ నిరసన కోసం ప్రిపరేషన్ అంతా సోషల్ మీడియా రీల్స్ నుంచే ప్లాన్ అయింది. ‘గెట్ రెడీ విత్ మీ’ అంటూ రీల్స్ చేస్తూ యువతను సమీకరించారు. టియర్ గ్యాస్‌ను తట్టుకోవడానికి స్విమ్మింగ్ గాగుల్స్, ఢిల్లీ ఉక్కపోతను తట్టుకోవడానికి మినీ యూఎస్బీ ఫ్యాన్లు, విసనకర్రలు దగ్గర పెట్టుకుని బయలుదేరి వచ్చారు. ఎయిర్‌పోర్టుల నుంచి, రైలు కంపార్ట్మెంట్లలో నుంచి స్టోరీలు పెడుతూ ఏదో మ్యూజిక్ కాన్సెర్ట్‌కు వెళ్తున్నంత ఊపుతో దేశ రాజధానికి తరలివచ్చారు. ‘మా గుండెల్లో ఇంక్విలాబ్.. మా చేతుల్లో ఇన్ స్టాగ్రామ్!’ అనే వన్–లైనర్ ఈ తరం నిరసన తత్వం. ధర్మాగ్రహం కలిగి, శాంతియుతంగా మార్పు తేవాలని ప్రయత్నిస్తున్న ఈ తరాన్ని, వ్యంగ్యమనే బాణాలతో ప్రత్యర్థి మనసు మార్చాలని చూస్తున్న ఈ భావితరం స్వరాన్ని ‘నో’ అని నొక్కేస్తే రేపు వాళ్లు మాట్లాడటమే మానేస్తారు. ‘మేమున్నాం’ అని భుజం తడితే ఈ దేశానికి క్రియేటివ్, కరేజియస్ లీడర్స్ దొరుకుతారు. పంచ్‌లైన్ తో మొదలైన ఈ నిరసన రేపు పాలసీతో అంతం కావాలి. అప్పుడే ఈ ‘సెల్‌ఫోన్ సైన్యం’ నిజమైన దేశభక్తి సైన్యంగా మారుతుంది. వారి దారి వినూత్నంఢిల్లీలో పోలీసుల లాఠీచార్జి జరిగి, సాయంత్రం వాళ్లు డ్యూటీ దిగుతుంటే లాఠీ దెబ్బలు తిన్న యువతీ యువకులంతా ‘థ్యాంక్యూ సర్... చాలా బాగా డ్యూటీ చేశారు’ అని రోడ్డు పొడుగునా నిలబడి చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇలా చేయడం తిట్టడం కంటే చాలా ఎక్కువ. ‘ఇంటికెళ్లి గర్వంగా ముఖం చూపించండి’ అని కూడా అన్నారు. తమను కొట్టిన వారికే మంచి నీళ్లు అందించడం, గులాబీపూలు ఇవ్వడం జెన్ జి ప్రొటెస్ట్ స్టయిల్. పోలీసులు కొడుతుంటే జాతీయ జెండాను చుట్టుకుని నిలబడటం, సారే జహాసే అచ్ఛా పాడటం.... జనగణమన ఆలపించడం.... కచ్చితంగా గాంధీ మార్గం.– కె -
జవాబుదారీతనం పెంచేలా లేదు
న్యూఢిల్లీ: పేపర్ లీక్ కేసుల్లో విచారణ పట్ల ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అసంతృప్తి వ్యక్తంచేసింది. మోదీ ప్రకటన పరీక్షల్లో జవాబుదారీతనం పెంచేలా లేదని పేర్కొంది. నీట్–యూజీ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పునరుద్ఘాటించింది. ఈ మేరకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘హాయ్.. నా పేరు ఏమీ లేదు’అనే శీర్షికతో ధర్మేంద్ర ప్రధాన్ ఫొటోను షేర్ చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదాకా జంతర్‌మంతర్‌ను వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదని సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా తేలి్చచెప్పారు. పేపర్ లీక్ కేసులపై మోదీ స్పందించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే అసలైన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదని ఆక్షేపించారు. ప్రశ్నపత్రం లీక్ అయిన శిక్ష విధిస్తామంటే ప్రయోజనం ఉండదన్నారు. దానివల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. అసలు ప్రశ్నపత్రాల లీకేజీ ఎందుకు జరుగుతోందన్నదే అసలైన ప్రశ్న అని పేర్కొన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలని చెప్పారు. గాయం అయిన తర్వాత మందు పూయడం కంటే అసలు ఆ గాయం జరగకుండా నివారించడమే తెలివైన పని అని సూచించారు. వ్యవస్థను నడిపే వారికి జవాబుదారీతనం, సామర్థ్యం లేకపోవడం వల్లే ఇలాంటి గాయాలు పునరావృతం అవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు సరిపోవచ్చని చెప్పారు. పేపర్ లీక్ అంశంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఇప్పుడు ప్రధాని మోదీ వైపు ఎక్కువగా మళ్లుతోందని, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిరసనకారుల సంఖ్య పెరుగుతోందని రాంకా పేర్కొన్నారు. -
యువత కళ్లలోకి చూసే ధైర్యం మోదీకి ఉందా?
న్యూఢిల్లీ: ఢిల్లీ వీధుల్లో రక్తమోడిన యువత కళ్లలోకి నేరుగా చూసే ధైర్యం ప్రధాని మోదీకి ఉందా? అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. యువతకు అన్ని దారులు మూసుకుపోయాయని, ఇక వారు ఎక్కడికి వెళ్లాలని అన్నారు. నరేంద్ర మోదీ హయాంలో విద్యా వ్యవస్థ క్షీణించిపోయిందని ఆరోపించారు. ప్రజలకు ఊరట మాటలు గానీ, శాంతి ప్రకటనలు గానీ అవసరం లేదన్నారు. మోదీ ప్రభుత్వం యువతపై లాఠీచార్జి చేసిందని, సొంత పిల్లలు కానట్లుగా నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. ఈ మేరకు ఖర్గే గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘మీ ఏసీ గదుల విలాసవంతమైన కోటల నుంచి బయటకు రండి. మీ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ వీధుల్లో రక్తమోడ్చిన యువతీ యువకుల కళ్లలోకి నేరుగా చూడండి’’అని మోదీకి తేలి్చచెప్పారు. విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నేరవేర్చాలని స్పష్టంచేశారు. దేశంలో విద్యా వ్యవస్థ ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో చిక్కుకుందని ఖర్గే ఆరోపించారు. మోదీ చేసిన ప్రకటన కంటితుడుపు చర్యగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ అభివరి్ణంచారు. యువత దీన్ని అంగీకరిస్తారనే భ్రమలో ప్రధానమంత్రి ఉన్నారని ఆక్షేపించారు. టూ లిటిల్, టూ లేట్ పేపర్ లీక్‌ల దోషులను శిక్షించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రధానమంత్రి ప్రకటనను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘చాలా తక్కువ, చాలా ఆలస్యం’అని కొట్టిపారేశారు. అది మోసపూరితమైన ప్రకటన అని విమర్శించారు. విద్యార్థులు అలాంటి తక్కువ స్థాయి చర్యలను అంగీకరించలేరని పేర్కొన్నారు. పేపర్ లీకేజీలను నివారించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. -
జడ్జి గ్రోవర్ సారథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు
న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో ప్రవేశాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీల ఉదంతంలో నమోదైన కేసుల సత్వర విచారణకు ఉద్దేశించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టును జడ్జి అను గ్రోవర్ బాలిగా సారథ్యంలో నడపనున్నట్లు ఢిల్లీ హైకోర్టు గురువారం ప్రకటించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుల ప్రాంగణంలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. మహిళా జడ్జి అను గ్రోవర్ ప్రస్తుతం ఢిల్లీలోని సౌత్–ఈస్ట్ జిల్లాలో జిల్లా జడ్జి(కమర్షియల్–4)గా సేవలందిస్తున్నారు. పేపర్ లీకేజీ నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తానని ప్రధాని మోదీ ప్రకటించిన కొన్ని గంటలకే ఈ బాధ్యతల్లోకి జడ్జిని నియమించడం గమనార్హం. ఉన్నత విద్య కార్యదర్శి బదిలీ.. కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని మోదీ సర్కార్ గురువారం ఆకస్మికంగా పంచాయతీరాజ్ శాఖకు బదిలీచేసింది. ఈయన స్థానంలో ఉన్నత విద్య కార్యదర్శిగా నరేశ్ కుమార్ గంగ్వార్‌ను నియమించారు. పాఠశాల విద్య కార్యదర్శిగానూ ఇన్నాళ్లూ వినీత్ జోషినే కొనసాగారు. ఇప్పుడు ఆయనను తప్పించడంతో పాఠశాల విద్యా కార్యదర్శిగా నూతనంగా టీకే అనిల్ కుమార్‌ను గురువారం నియమించారు. -
విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకుండా వారి ఉద్దేశాలను ప్రశ్నిస్తారా?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘సంసద్ చలో’ర్యాలీలో హింస జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులను ప్రతికూలంగా చిత్రీకరించడాన్ని చూడటం తీవ్ర వేదన కలిగించే విషయమని సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మో పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోవడం కంటే వారి ఉద్దేశాలను ప్రశ్నించడం ఎందుకు సులభంగా అనిపిస్తుందో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు ఆమె గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనను ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలతో ఎటువంటి ఆధారాలు లేకుండా ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తొందరపాటు వద్దని సూచించారు. విద్యార్థుల ఉద్యమం శాంతియుతంగానే కొనసాగుతోందని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిష్టను మీడియాలో మసకబార్చేలా చూపడం ఒక విద్యావేత్తగా తనకు ఎంతో బాధ కలిగిస్తోందని వెల్లడించారు. ఆందోళనకారులు అసాధారణమైన సహనం, క్రమశిక్షణ, సంయమనం ప్రదర్శించారని అంగ్మో కొనియాడారు. అలాగే సమస్యలను ప్రభుత్వం ఆలకించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. సొంత విద్యార్థులనే అంత త్వరగా అపనమ్మకంతో చూసే వ్యవస్థ ఎలాంటిదని తాను తరచుగా ఆలోచిస్తుంటానని ఉద్ఘాటించారు. మన పిల్లలు రక్షణకు అర్హులు అని తేల్చిచెప్పారు. వారిని ప్రతినాయకులుగా చిత్రీకరించవద్దని కోరారు. వారు చెప్పేది అందరూ వినాలని వెల్లడించారు. కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చే కుట్రలతో విద్యార్థులను అణచివేస్తామంటే సహించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. -
నిరసనకారులపై పెల్లెట్ల వర్షం
న్యూఢిల్లీ: లాఠీచార్జ్‌తో విద్యార్థులను పోలీసులు చితకబాదారన్న వార్తల నడుమ మరో దారుణోదంతం వెలుగులోకి వచ్చింది. పార్లమెంట్ సమీపంలో జూన్ 20వ తేదీన జరిగిన చలో సంసద్ ర్యాలో పోలీసులు చట్టవిరద్ధంగా పెల్లెట్ గన్లను ఉపయోగించినట్లు నిర్ధారణ అయింది. తాము వాటిని ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నప్పటికీ పెల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో శస్త్రచికిత్సచేయించుకున్న పలువురి మెడికల్ రిపోర్ట్లు బహిర్గతంకావడంతో ఈ ఖాకీ దుస్తుల కర్కోటక వైఖరి తేటతెల్లమైంది. నిరాయుధులైన ఉద్యమకారులు శాంతియుతంగా చేసే ర్యాలీల్లో పెల్లెట్లు ఉపయోగించకూడదని ఐక్యరాజ్యసమతి మానవహక్కుల విభాగం గతంలోనే ఎన్నోసార్లు మొత్తుకున్నా ఢిల్లీ పోలీసులు మొద్దనిద్రపోతూ ఇప్పుడు సీజేపీ కార్యకర్తలపై పెల్లెట్ల వర్షం కురిపించారని సామాజికమాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కంట్లో చూపు కోల్పోయిన టీనేజర్ ర్యాలీలో పాల్గొన్న 19 ఏళ్ల సాహిల్ లోకాబ్ కుడి కంట్లోకి పెల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ముఖమంతా రక్తసిక్తమైన అతడిని వెంటనే సమీప లేడీ హార్డింగ్ వైద్యకళాశాలకు తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి, అక్కడా సరైన పరిష్కారం లభించకపోవడంతో చివరకు ఎయిమ్స్ ట్రామా విభాగానికి 21వ తేదీన తరలించారు. వివరాలను అతని మేనమామ అజయ్ దుగ్గల్ ఏడుస్తూ చెప్పారు. ఇప్పుడెలా ఉందిరా అని లోకాబ్ను అడిగితే అతను చెప్పిన సమాధానంతో నోట మాట రాలేదు. మసగ్గా కాదుకదా కనీసం వెలుగు కూడా కన్పించట్లేదు. అంతా చీకటే’’అని సమాధానమిచ్చారు. ‘‘పెల్లెట్ ధాటికి అతని కుడి కంటి కారి్నయాకు రంధ్రం పడింది. కారి్నయల్ పెర్ఫోరేషన్ కారణంగా కుడి కంటితో చూడగలిగే అవకాశాలు కేవలం ఒక శాతం’’అని వైద్యులు చెప్పారు. మెడ, ఛాతి, భుజం, చేతిలోకీ పెల్లెట్లు దూసుకెళ్లాయి. ఒకటి కుడి కంట్లో ఉండిపోయింది. ఢిల్లీ వర్సిటీ దూరవిద్యా కోర్సులో సాహిల్ డిగ్రీ చేస్తున్నాడు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షకు సిద్దమవుతున్నాడు. ఇప్పుడు ఇతని భవిష్యత్ ఏంటి? అని అతని కుటుంబం ఆవేదన వ్యక్తంచేసింది. సాహిల్లాగా మరెంతో మంది పెల్లెట్ల బారిన పడ్డారని మీడియాలో సాక్ష్యాధారాలతో సహా కథనాలు వెలువడుతున్నాయి. పలువురి ముఖం, ఛాతీ, మెడ, భుజాల్లోకి పెల్లెట్లు దూసుకెళ్లాయి. ఔట్లుక్ రిపోర్టర్, 25 ఏళ్ల షేక్ ఇర్షాద్ మన్సూరీ సైతం పెల్లెట్ల బారినపడి శస్త్రచిక్సిత చేయించుకోవాల్సి వచ్చింది. వివరాలను మన్సూరీ వెల్లడించారు. ‘‘ఆరోజు మధ్యాహ్నం మూడున్నరకు ఉద్యమకారులతోపాటు వెళ్తుంటే కన్నాట్ ప్లేస్‌లోని పాలికా బజార్ వద్ద సీఆర్పీఎఫ్లోని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) జవాన్లు గాల్లోకి బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. తర్వాత నేరుగా ఏదో ఆయుధం గురిపెట్టారు. కొన్ని సెకన్ల తేడాతో ఏదో వచ్చి నా ఎడమ కనుబొమ్మకు గుచ్చుకుంది. తర్వాత ఇంకొన్ని ఇనుపముక్కల్లాంటి నుదురు, ముక్కు, గదమ వద్ద గుచ్చుకున్నాయి. మెడలోకీ దూసుకెళ్లాయి. బాధ తాళలేక వెంటనే ఆస్పత్రికి వెళ్లా. వైద్యులు వాటిని పెల్లెట్లుగా నిర్ధారించారు. మూడు పెల్లెట్లను వెంటనే తొలగించకపోతే ప్రమాదమని చెప్పారు. ఒకటి మెడలో ప్రధాన నరం, రక్తనాళం సమీపంలో ఇరుక్కుంది. ఇంకోటి ఎడమ కంటి కదలికలను నియంత్రించే కండరం వద్ద చిక్కుకుంది. ఇంకోటి ముక్కు సమీపంలో ముఖంలోకి వెళ్లింది. వీటిని తీయకపోతే ప్రమాదమని చెప్పారు. సర్జన్ అందుబాటులో లేకపోవడంతో తర్వాతి రోజు శస్త్రచికిత్స చేసి తొలగించారు’’అని మన్సూరీ వెల్లడించారు.ఏమిటీ పెల్లెట్లు? పెల్లెట్ గన్ను పంప్–యాక్షన్ గన్ లేదా షాట్‌గన్ అని కూడా పిలుస్తారు. వీటిని పేలిస్తే చాలా చిన్నగా ఉండే ఇనుపముక్కల్లాంటివి జల్లెడలా చుట్టూతా వేగంగా దూసుకెళ్తాయి. ఇవి సెకన్‌కు 1,000 అడుగుల వేగంతో దూసుకెళ్తాయి. వీటిని ఏదైనా ఖనిజంతో లేదా రబ్బర్‌తో తయారుచేస్తారు. గన్‌లోని ఒక్కో క్యాట్రిడ్జ్‌లో 600 వరకు పెల్లెట్లు ఉంటాయి. ది బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇతర నిబంధనల ప్రకారం ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్ఓపీ)ను పాటిస్తూ తొలుత పోలీసులు మైక్‌లో ఆందోళనకారులను శాంతించాలని హెచ్చరించాలి. తర్వాత జలఫిరంగులతో అడ్డుకోవాలి. బాష్పవాయుగోళాలు ప్రయోగించాలి. తప్పదనుకుంటే లాఠీచార్జ్ చేయాలి. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోతే పెల్లెట్లు ప్రయోగించాలి. అవి కూడా నడుం కిందకు గురిపెట్టి కాల్చాలి. కానీ ప్రభుత్వ సాయుధబలగాలు ఉద్యమకారులను తరమికొట్టేందుకు నేరుగా ముఖం, ఛాతికి గురిపెడుతున్నాయని చాన్నాళ్ల నుంచి ఆరోపణలున్నాయి. -
మోదీ ట్వీట్‌కు రాహుల్, సీజేపీ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ సహా పోటీ పరీక్షల పేపర్ లీకుల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చాయి. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసింది కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపించాయి.ప్రధాని మోదీ స్పందిస్తూ.. విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పేపర్ లీకులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘‘విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఎవరినీ వదిలిపెట్టం’’ అని ప్రధాని స్పష్టం చేశారు.రాహుల్ గాంధీ ఘాటు స్పందనప్రధాని ట్వీట్‌పై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘‘యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే’’ అంటూ విమర్శించారు. పేపర్ లీకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన రాహుల్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.మంత్రి రాజీనామా చేయాల్సిందే:సీజేపీమరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్న సీజేపీ కూడా ప్రధాని మోదీ ట్వీట్‌పై స్పందించింది. పేపర్ లీకుల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేసింది. అలాగే విద్యార్థులపై దాడులు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఉద్ఘాటించింది. అప్పటిదాకా తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేసింది. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీజేపీ కోరింది. -
బీజేపీపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉత్కంఠగా మారాయి. గత రాత్రి జరిగిన ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే స్పందిస్తూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ నిరసనలను ఉద్దేశపూర్వకంగా హింసాత్మకంగా మార్చేందుకు బీజేపీకి చెందిన వ్యక్తులు చొరబడ్డారని ఆయన ఆరోపించారు.తాజాగా అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడుతూ.. ‘కొందరు బయటి వ్యక్తులు మా నిరసనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి చెందిన వ్యక్తులు మా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వారి వల్లే హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సీజేపీకి చెడ్డపేరు తీసుకురావడమే వారి లక్ష్యం. కొందరు సివిల్ డ్రెస్సుల్లో వచ్చి విద్యార్థులపై దాడులు చేస్తున్నారు. జంతర్ మంతర్ ఎప్పుడూ ప్రజాస్వామ్య నిరసనలకు అందుబాటులో ఉండే ప్రదేశమే’ అని వ్యాఖ్యానించారు.#WATCH | Delhi: Founding President of Cockroach Janta Party, Abhijeet Dipke says, "I have already spoken about the lathi charge. It was very brutal, and we will take the police officers who carried it out to court, and today is the 34th day of our protest. Sonam Sir's hunger… pic.twitter.com/LuZgdavsIr— ANI (@ANI) July 23, 2026అలాగే, నిరసనల సందర్భంగా పోలీసులు చేపట్టిన లాఠీచార్జ్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లాఠీచార్జ్ అత్యంత దారుణంగా జరిగింది. ఈ చర్యకు బాధ్యులైన పోలీసు అధికారులపై కోర్టును ఆశ్రయిస్తాం. మా ఉద్యమానికి ఇవాళ 34వ రోజు. మా డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు.లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ కొనసాగిస్తున్న నిరాహార దీక్షపై కూడా దీప్కే స్పందించారు. ‘వాంగ్‌చుక్ సర్ నిరాహార దీక్షకు ఇవాళ 26వ రోజు. ఆయన ఆరోగ్యం మాకు ఆందోళన కలిగిస్తోంది. ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లకూడదని భావిస్తున్నాం. అందుకే దీక్ష విరమించాలని కోరుతున్నాం. అయినప్పటికీ మా డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం మాత్రం కొనసాగుతుంది’ అని తెలిపారు.Jantar Mantar: men in civvies walking the street with sticks. Students ask who they are. No answer. Riot police standing nearby.Police? Another agency? Someone private? That’s not a detail you shrug off. This needs a real investigation, not silence. pic.twitter.com/GX8vEnehdt— Dilip Ray 🇮🇳 (@dilipray) July 21, 2026 Sarthak Goswami covering a protest near New Delhi Railway Station. Video shows Delhi Police pushing and handling him in the crowd — arm yanked, phones out, total chaos. pic.twitter.com/Bw3feKQwij— Dilip Ray 🇮🇳 (@dilipray) July 22, 2026 -
గాంధీ స్మృతివనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన
నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సీజేపీ. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మరోవైపు నిరసనలు ఇతర రాష్ట్రాలకు విస్తరించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాజా పరిణామాలు ఇవే..Live Updates08: 14 PMగాంధీ స్మృతివనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శనఇండి కూటమి ఎంపీల కొవ్వొత్తుల ప్రదర్శనగాంధీ స్మృతి కేంద్రం వద్ద నివాళులర్పిస్తున్న ఇండి కూటమి నేతలుమొదట ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని భావించిన నేతలుప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో గాంధీ స్మృతి కేంద్రానికి వచ్చిన నేతలునీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ఇండికూటమి నేతల నివాళి 07: 30 PMవిద్యార్థులకు అండగా ప్రతిపక్ష ఎంపీలంతా రోడ్డెక్కాలని భావించాం: రాహుల్ఇండియాగేట్కు వెళ్దామంటే అనుమతి ఇవ్వలేదువిద్యార్థులంతా రోడ్డుపై ఉన్నారురాజ్ఘాట్కు వెళ్దామని అనుకుంటున్నాంమా బస్సును పోలీసులు అడ్డుకున్నారుబస్సును వదిలి డ్రైవర్ వెళ్లిపోయాడు07:18 PMఢిల్లీలో ఇండి కూటమి నేతల ర్యాలీరాజ్ఘాట్కు ర్యాలీగా వెళ్తున్న రాహుల్, ఇండి కూటమి నేతలురాజ్ఘాట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్న ఇండి కూటమి నేతలువిద్యార్థులు ఒంటరి వారు కాదు.. బాసటగా నిలుస్తాం: రాహుల్07:08 PMఢిల్లీలో ఇండి కూటమి నేతల నిరసనలురాహుల్ నివాసంలో ముగిసిన ఇండి కూటమి ఎంపీల భేటీరాజ్ ఘాట్ బయల్దేరిన రాహుల్, ఇండి కూటమి నేతలువిద్యార్థులకు అండగా ఉంటాం: రాహుల్06:13 PMరాహుల్ గాంధీ నివాసంలో విపక్షాల కీలక భేటీవిద్యార్థుల ఆందోళనలు, తాజా పరిణామాలపై చర్చసమావేశం అనంతరం రాజ్‌ఘాట్‌కు వెళ్లే యోచనరాహుల్ గాంధీ ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు04:50PMరేపు దేశవ్యాప్త ఆందోళనలకు సీజేపీ పిలుపుశాంతియుతంగా నిరసనలు చేపట్టాలన్న సీజేపీ 03:21 PMనీట్ పేపర్ లీక్ కేసుపై కేంద్రం కీలక నిర్ణయంనాలుగు రాష్ట్రాల్లో 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుబాంబే హైకోర్టులోని రెండు బెంచ్‌ల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులుపేపర్ లీక్ చట్టం కింద ప్రతిరోజూ విచారణ03:13 PMసీజేపీని మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రంఅన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమన్న కేంద్రం..జంతర్మంతర్లోనే చర్చలు జరగాలని పట్టుబడుతున్న సీజేపీ02:03 PM | కేంద్రం సంచలన నిర్ణయంఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం అమలునిరసనకారుల్ని మూడు నెలల బంధించే అధికారంసీజేపీ నిరసనల నేపథ్యంలో పోలీస్ కమిషనర్‌కు విశేష అధికారాలిచ్చిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధుసీజేపీ ఆందోళనలతో ఢిల్లీ పోలీసులకు అదనపు అధికారాలునేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద నిర్బంధించే అవకాశంగెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోం శాఖ1:58 PM | నిరసనకారుల్ని బెదిరించిన పోలీస్‌పై చర్యలుముంబైలో విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ పోలీసు డ్రైవర్ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు.‘‘డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’’ అంటూ విద్యార్థులను బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్.వీడియోపై స్పందించిన ముంబై పోలీస్ శాఖ.. ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.నిరసనకారులపై తప్పుడు కేసులు పెట్టడం సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.01:18 PM | సీజేపీకి అనూహ్యంగా పెరుగుతున్న మద్దతుజంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలుఅంతకంతకు పెరుగుతున్న మద్దతు కమల్ హాసన్, నసీరుద్దీన్ షా లాంటి దిగ్గజ నటుల మద్దతుమొదటి విద్యార్థి మరణం దగ్గరే ప్రభుత్వం స్పందించి ఉండాల్సిందేన్న కమల్బాలీవుడ్ మద్దతు ప్రకటించకపోవడం సిగ్గుచేటన్న షాఆందోళనలకు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్లు చేస్తున్న బాలీవుడ్ తారలుఇటు సౌత్‌లోనూ పలువురి సపోర్ట్12:21 PM | మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు దృష్టిసీజేపీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో మూసివేసిన మెట్రో స్టేషన్ల అంశం సుప్రీంకోర్టుకు చేరింది.సెంట్రల్ ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లు మూసివేయడంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు.సుప్రీంకోర్టు సమీప మెట్రో స్టేషన్ మూసివేత వల్ల కేసులకు హాజరయ్యే వారికి ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.ఎంట్రీ పాస్‌లు ఉన్న న్యాయవాదులు, రిజిస్ట్రీ సిబ్బందిని భద్రతా తనిఖీల తర్వాత అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.సమస్య పరిష్కారం కాకపోతే మధ్యాహ్నం తర్వాత తాను జోక్యం చేసుకుంటానని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.ఇప్పటికే మెట్రో అధికారులతో మాట్లాడాలని సుప్రీంకోర్టు పరిపాలన విభాగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు. 11:33 AM | ముంబైలో పోలీస్ వాహనం నుంచి నిరసనకారుల పరార్చెంబూర్లో జరిగిన CJP నిరసనల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.అదుపులోకి తీసుకున్న విద్యార్థులను తరలిస్తున్న పోలీస్ వ్యాన్ తలుపును ఓ వ్యక్తి తెరిచినట్లు వైరల్ వీడియోలో కనిపించింది.దీంతో పలువురు విద్యార్థులు వాహనం నుంచి బయటకు వచ్చి పరారైనట్లు సమాచారం.నిషేధాజ్ఞలు ఉల్లంఘించి నిరసన చేపట్టారని పోలీసులు తెలిపారు.దాదాపు 700–800 మంది ఆందోళనలో పాల్గొన్నట్లు వెల్లడించారు.సుమారు 200 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.11:31 AM | రాళ్ల దాడిలో ఢిల్లీ ఏసీపీకి గాయాలుజంతర్ మంతర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రాళ్ల దాడిలో ఢిల్లీ పోలీస్ ఏసీపీ వివేక్ భగత్ గాయపడ్డారు.తలకు గాయం కావడంతో పాటు చేతులు, కాళ్లు, భుజంపై గాయాలైనట్లు ఆర్ఎంఎల్ ఆస్పత్రి అధికారులు తెలిపారు.చెవి నుంచి రక్తస్రావం, వాంతులు వంటి లక్షణాలతో ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.11:14 AM | ప్రధాని మోదీ ట్వీట్‌పై CJP చీఫ్ సెటైర్పేపర్ లీక్ కేసుల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ మరోసారి డిమాండ్ చేశారు.ప్రధాని ట్వీట్లోని “యువత భవిష్యత్తు, సంక్షేమమే ముఖ్యం” అన్న వ్యాఖ్యలపై సెటైరికల్‌గా పోస్టు చేశారు.‘‘Hi, my name is Nothing’’ అంటూ గ్రాఫిక్‌ను షేర్ చేశారు. https://t.co/mo44rK6tNc pic.twitter.com/kEeHWUMouF— Abhijeet Dipke (@abhijeet_dipke) July 23, 2026 11:08 AM | బిహార్ అసెంబ్లీలో నీట్ నిరసనల సెగవిద్యార్థులపై లాఠీచార్జ్ అంశం బిహార్ అసెంబ్లీని కుదిపేసింది.విపక్ష ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.విద్యార్థులపై పోలీసుల చర్యను ప్రశ్నించారు.మరోవైపు తమ వాహనంపై దాడి చేసిన వారిని అధికార కూటమి ఎమ్మెల్యేలు ‘గూండాలు’గా అభివర్ణించారు.అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతపార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు యువత ప్రయత్నంఅడ్డుకున్న పోలీసులు.. భారీగా మోహరింపుయువతను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటుఇవాళ పార్లమెంట్ సమావేశాలు నాలుగో రోజు భేటీఉభయ సభల్లోనూ విపక్షాల నిరసనలతో కొనసాగుతున్న వాయిదాల పర్వంశాంతియుతంగానే నిరసనలు కొనసాగుతాయన్న సీజేపీచలో సంసద్ మళ్లీ ఉండబోదన్న సీజేపీజంతర్ మంతర్ వద్దే దీక్ష చేస్తున్న మద్దతుదారులునిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయని సీజేపీ ఆరోపణఅప్రమత్తంగా ఉండాలని వలంటీర్లకు ప్రతినిధుల పిలుపు11:04 AM | అభిజిత్ దీప్కేకు అస్వస్థతCJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు అస్వస్థతనిరసనలకు దూరంగా ఇవాళ రెస్ట్ తీసుకోనున్న దీప్కే గత కొన్ని రోజులుగా జ్వరం, తీవ్ర ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు సీజేపీ వెల్లడి.నొప్పి నివారణ మందులతో ఇప్పటివరకు కొనసాగానని.. విశ్రాంతి కోసం కొంత సమయం పాటు నిరసన స్థలం నుంచి దూరంగా ఉంటాడని వెల్లడితిరిగి సాయంత్రానికి తిరిగి జంతర్ మంతర్‌కు వచ్చే చాన్స్.10:50 AM | పోలీసుల చర్యలపై ప్రియాంక గాంధీ ప్రశ్నలునిరసనకారులపై లాఠీఛార్జి, టియర్ గ్యాస్ ప్రయోగంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిజంగా శ్రద్ధ చూపిస్తే ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకున్నారని నిలదీశారు.విద్యార్థులతో నేరుగా చర్చలు జరిపి వారి సమస్యలు వినాలని కేంద్రాన్ని కోరారు.10:46 AM | ‘విద్యార్థుల మాట వినండి’నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో విద్యార్థులు వ్యవస్థపై నమ్మకం కోల్పోయారని ప్రియాంక గాంధీ అన్నారు.సమస్య పరిష్కారం కావాలంటే ముందుగా విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వినాలని సూచించారు.10:43 AM | జంతర్ మంతర్‌కు అలఖ్ పాండేఫిజిక్స్ వాలా సీఈవో అలఖ్ పాండే జంతర్ మంతర్ వద్ద CJP నిరసనల్లో పాల్గొన్నారు.ఆందోళనకారులను ‘పాక్ ఫండెడ్’, ‘చైనా మద్దతుదారులు’గా చిత్రీకరించడాన్ని తప్పుబట్టారు.పోలీసుల చర్యల్లో గాయపడిన విద్యార్థుల అంశాన్ని ప్రస్తావించారు.10:34 AM | చండీగఢ్‌కు విస్తరించిన నిరసనలుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో చండీగఢ్‌లోనూ నిరసనలు జరిగాయని CJP తెలిపింది.దేశవ్యాప్తంగా ఆందోళనలు విస్తరిస్తున్నాయని పేర్కొంది.10:31 AM | చర్చలు ఉంటాయా? ఉండవా?!మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తున్న విపక్షాలు, నిరసనకారులురాజీనామా తర్వాతే పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరగాలంటున్న ప్రతిపక్షాలుఅప్పటిదాకా సమావేశాలను ముందుకు వెళ్లనివ్వబోమని స్పష్టీకరణఇటు.. జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలుమంత్రి రాజీనామా చేస్తేనే ఆందోళనలు విరమిస్తామని స్పష్టీకరణఇదివరకే మంత్రి జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులురాజీనామా సహా మూడు డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తిడిమాండ్లపై ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయని కేంద్రంచర్చలు ఉంటాయంటూనే.. ముందుకు అడుగు వేయని వైనంచర్చలకు కేంద్రమే దిగి రావాలని.. తాము వెళ్లబోమని సీజేపీ కుండబద్ధలులీక్కు కారకులైన వాళ్లను వదలమని.. కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటనమంత్రి రాజీనామాపై మాత్రం మౌనం!ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ముడిపడి ఉన్న నీట్ నిరసనల వ్యవహారంకేంద్రం నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠచర్చలు ఉంటాయా? ఉండవా? అనే సందిగ్ధం10:00 AM | నిరసనల్లోకి చొరబడ్డ అసాంఘిక శక్తులు!కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ఆరోపణలు సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ.. నిరసనల్లోకి కొందరు అసాంఘిక శక్తులు చొరబడ్డారని తెలిపారు. వారిని నియంత్రించేందుకు వాలంటీర్ల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. రాత్రి సమయంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని, టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు.09:49 AM | ‘యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే’పేపర్ లీక్‌లపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. యువత భవిష్యత్తుకు అత్యధిక నష్టం చేసింది కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు.09:49 AM | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: CJP పేపర్ లీక్ కేసుల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై స్పందించిన CJP.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చింది.09:42 AM | పోలీస్‌పై దాడి వీడియో వైరల్జూలై 20న జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో కొందరు ఆందోళనకారులు ఢిల్లీ పోలీస్ సిబ్బందిని వెంబడించి దాడి చేసినట్లు కనిపిస్తోంది.09:28 AM | ముంబైలోనూ CJP నిరసనలు.. 1,500 మందికి పైగా పాల్గొనడంNEET పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ముంబై శివాజీ పార్క్‌లో భారీ నిరసన చేపట్టారు. ఇందులో నటులు, కమెడియన్లు కూడా పాల్గొన్నారు.09:17 AM | NEET పేపర్ లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు: ప్రధాని మోదీ ప్రకటనపరీక్షల పేపర్ లీక్‌లకు పాల్పడిన వారిపై వేగంగా చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.09:05 AM | ముంబైలో నిరసనలు.. 200 మంది అదుపులోకిఅనుమతి లేకుండా నిరసన చేపట్టారని పోలీసులు తెలిపారు. శివాజీ పార్క్‌లో జరిగిన ఆందోళనలో సుమారు 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.08:59 AM | నిరసనల్లో గాయపడిన పోలీస్ అధికారి ఫొటో వైరల్CJP ఆందోళనల్లో ఇన్స్పెక్టర్ నందకిశోర్‌పై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఫొటో బయటకు వచ్చింది.08:21 AM | కేంద్రంపై ఆప్ నేత అతిషి విమర్శలుఢిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేతపై ఆప్ నేత అతిషి స్పందించారు. సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, కానీ విద్యార్థులతో చర్చలకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపించారు.08:21 AM | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగుతుంది: CJP చీఫ్CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దీక్ష విరమించాలని కోరారు.08:21 AM | గాయపడిన పోలీసులను పరామర్శించిన సీనియర్ అధికారిఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ కమిషనర్ దేవేశ్ చంద్ర శ్రీవాస్తవ ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన పోలీసులను పరామర్శించారు.07:55 AM | పోలీస్ అధికారి చర్యలపై CJP స్పందననిరసనకారిణిని కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ADCPను విధుల నుంచి తప్పించడంపై CJP స్పందించింది. విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.🔴 08:21 AM | ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లు మూసివేతCJP నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాలతో ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను మూసివేశారు. రాజీవ్ చౌక్, మండీ హౌస్, ఐటీవో వంటి కీలక స్టేషన్ల వద్ద రాకపోకలను నిలిపివేశారు. జంతర్ మంతర్ పరిసరాల్లో భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మోహరించాయి.🔴 08:13 AM | మంత్రి రాజీనామా చేసే వరకు పోరాటం: CJPకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. నిరసన 34వ రోజుకు చేరిందని, సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష 26వ రోజుకు చేరిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.🔴 07:55 AM | పోలీస్ అధికారిపై చర్యలకు CJP డిమాండ్జంతర్ మంతర్ వద్ద మహిళా నిరసనకారిపై పోలీస్ అధికారి చేయి చేసుకున్న వీడియో వైరల్ కావడంతో.. సదరు అధికారిని సస్పెండ్ చేసి, విచారణ జరపాలని CJP డిమాండ్ చేసింది.🔴 07:24 AM | భద్రత కట్టుదిట్టం.. మెట్రో సేవలపై ప్రభావంకేంద్ర ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు.🔴 07:13 AM | ఇంటర్నెట్ నిలిపివేతపై కాంగ్రెస్ ఆరోపణలుజంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. యువత నిరసన గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.🔴 05:01 AM | ముంబైలో 13 ఎఫ్ఐఆర్లు నమోదుCJPకి మద్దతుగా జరిగిన అనుమతి లేని నిరసనలపై ముంబై పోలీసులు చర్యలు చేపట్టారు. గత ఐదు రోజుల్లో 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి.. దాదాపు 400 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.🔴 03:46 AM | నాగ్‌పూర్‌లో నిరసనకారుల తరలింపునాగ్పూర్లోని సంవిధాన్ స్క్వేర్ వద్ద కొనసాగిన నిరసనను పోలీసులు రాత్రివేళ తొలగించారు. గడువు ముగిసినా ఆందోళన కొనసాగించడంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్య సమయంలో కొందరు యువకులు జాతీయ గీతం ఆలపించారు.🔴 02:44 AM | మరో పోలీస్ చర్యపై CJP ఆరోపణలుజంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని CJP ఆరోపించింది. మరోసారి పోలీస్ చర్యకు ప్రభుత్వం సిద్ధమవుతోందా? అంటూ ప్రశ్నించింది.🔴 02:04 AM | షరతులతో దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్చుక్నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని ప్రభుత్వం హామీ ఇస్తే దీక్ష విరమించేందుకు సిద్ధమని సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు. విద్యార్థులు కూడా తాత్కాలికంగా ఆందోళన విరమించి చర్చలకు రావాలని కోరారు.🔴 01:45 AM | నిరసనలో నేరస్తుడి హల్చల్!జూలై 20న జంతర్ మంతర్ నిరసనలో చరిత్ర కలిగిన నేర చరిత్ర కలిగిన హాజీ అఫ్జల్ కనిపించినట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.🔴 01:18 AM | బ్యారికేడ్లు దాటేందుకు మళ్లీ ప్రయత్నంజంతర్ మంతర్ వద్ద కొందరు నిరసనకారులు బ్యారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. గతంలో రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే.🔴 11:16 PM | దేశవ్యాప్తంగా నిరసనలపై కేంద్రం సమీక్షCJP ఆందోళనలు పలు రాష్ట్రాలకు విస్తరించడంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా పరిస్థితిపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. మహారాష్ట్రలో అత్యధికంగా నిరసనలు నమోదయ్యాయని, ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ, అసోం, హర్యానాల్లోనూ ఆందోళనలు జరిగాయని అధికారులు తెలిపారు.🔴 10:30 PM | ఢిల్లీలో రాళ్ల దాడి ఘటనకనాట్ ప్లేస్ సమీపంలోని టాల్‌స్టాయ్ మార్గ్ వద్ద పోలీసులు, RAF సిబ్బందిపై కొందరు రాళ్లు, బాటిళ్లు విసిరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ ఏసీపీ గాయపడినట్లు వెల్లడించారు. -
ఆన్లైన్లో సీజేపీ నిరసన: 8.4 లక్షలు దాటిన సంతకాలు!
న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త ఆందోళనకు ఆన్లైన్లో భారీ మద్దతు లభిస్తోంది. సీజేపీ అధికారిక వెబ్సైట్లో నిర్వహించిన ఆన్లైన్ సామూహిక పిటిషన్‌పై ఇప్పటివరకు దాదాపు 8.41 లక్షల మంది డిజిటల్‌గా సంతకాలు చేశారు. ఢిల్లీలో జరిగే నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేని విద్యార్థులు, యువతీ యువకులు ఈ ఆన్లైన్ పిటిషన్లో పెద్దఎత్తున భాగస్వామ్యమవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఉద్యమానికి సంబంధించిన ప్రచారం జోరుగా సాగుతోంది.ఈ నిరసనల ద్వారా ప్రధానంగా కొన్ని డిమాండ్లను లేవనెత్తుతున్నారు.అవి..కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.పరీక్ష విధానంలోని అక్రమాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి నష్టపరిహారం చెల్లించాలి.పరీక్ష విధానంలో సమూల సంస్కరణలు చేపట్టాలి.సోనమ్ వాంగ్‌చుక్ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలి.మరోవైపు నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఆయనకు మద్దతుగా 'ఛేంజ్.ఆర్గ్' (Change.org) వేదికగా కూడా ప్రజలు గళం విప్పుతున్నారు. జూలై 13 నుండి వాంగ్చుక్కు మద్దతుగా 51 పిటిషన్లు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా లక్షలాది సంతకాలు సేకరణ జరుగుతోంది.ఇది కూడా చదవండి: 2027లో ఉత్తరప్రదేశ్‌ను ఏలేది ఎవరు? -
సీజేపీ నిరసనకు స్పాన్సర్ ఎవరు?.. అసలు కథ ఇదే
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. జంతర్‌మంతర్ వద్ద మరో ఆసక్తికర అంశం చర్చకు దారితీస్తోంది. నిరసనకారుల వెనుక ఎవరున్నారు?. అసలు వాళ్లకు మద్దతుగా వస్తున్న ఆహారం, నీరు, ఇతర సహాయ సామగ్రి ఎవరు పంపిస్తున్నారు? నిజంగానే ఆ ఆర్డర్లు ముంబై, హైదరాబాద్‌లాంటి నగరాల నుంచి ఆర్డర్ చేస్తున్నవేనా?.. ఇలాంటి ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.సీజేపీ ఆందోళనలు దేశానికి ప్రమాదకరమని.. ఈ ఉద్యమంలోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడుతున్నాయంటూ కొన్ని రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. విదేశీ నిధులు, ముఖ్యంగా పాక్ నుంచి ఫండింగ్ వస్తోందన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా కొనసాగుతోంది. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు అధికారిక ఆధారాలు బయటకు రాలేదు. అదే సమయంలో నిరసన ప్రాంగణంలో కనిపిస్తున్న పరిణామాలు మాత్రం మరో కథ చెబుతున్నాయి.జంతర్‌మంతర్‌కు వరుసగా.. నిరసన ప్రాంతంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఫుడ్ డెలివరీలు వస్తూనే ఉన్నాయి. దాల్ చావల్, రాజ్మా చావల్, టీ, శాండ్విచ్లు, బర్గర్లు, తాగునీటి బాటిళ్లు పెద్ద సంఖ్యలో చేరుతున్నాయి. కొందరు డెలివరీ రైడర్లు వరుసగా రావడం అక్కడ కనిపిస్తోంది. అయితే ఈ ఆహారాన్ని ఎవరు పంపిస్తున్నారో తమకు తెలియదని వాలంటీర్లు చెబుతున్నారు. ఆర్డర్ వచ్చిన ప్రాంతం మాత్రమే తెలుస్తుందని.. పంపించిన వ్యక్తుల వివరాలు తమకు తెలియవని అంటున్నారు.దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సహాయం?నిరసనకారుల ప్రకారం.. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, నాగ్‌పూర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాల నుంచి కూడా ఫుడ్ ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ముంబై వంటి నగరాల నుంచి కూడా సహాయం అందుతోందని వారు చెబుతున్నారు. కొంతమంది వ్యక్తులు నేరుగా ఉద్యమంలో పాల్గొనలేకపోయినా.. తమ మద్దతును ఆహారం, నీరు వంటి రూపాల్లో తెలియజేస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో తాము మద్దతుగా ఆర్డర్లు పెడుతున్నామంటూ కొందరు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. జూలై 20 తర్వాతే పెరిగిన మద్దతుజూలై 20న చలో సంసద్‌కు సీజేపీ ప్రయత్నించింది. అయితే ఘర్షణల నేపథ్యం, అలాగే నిరసనకారులకు గాయాలు అయిన నేపథ్యంలో.. శాంతియుతంగా జంతర్ మంతర్ వద్దే ఆ మరుసటి రోజు నుంచి ఆందోళన కొనసాగిస్తోంది. ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని అంటోంది. అయితే లాఠీ చార్జి పరిణామాల తర్వాత నిరసనకు ప్రజల నుంచి మద్దతు పెరిగిందని అక్కడి వారు చెబుతున్నారు. అంతకుముందు వరకు పరిమితంగా ఉన్న సహాయం.. ఆ తర్వాత భారీగా పెరిగిందని వాలంటీర్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆహార కొరత లేదని, రోజంతా పలు పంపిణీ కేంద్రాలు పనిచేస్తున్నాయని వారు తెలిపారు. మిగిలిపోయిన ఆహారాన్ని ఇతరులకు కూడా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఒకానొక దశలో.. ఫుడ్ ఆర్డర్లు భారీగా చేరడంతో ఇక భోజనాలు పంపొద్దంటూ CJP తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేసింది.ఫండింగ్పై రాజకీయ ఆరోపణలు.. సోషల్ మీడియాలో చర్చఅయితే ఉద్యమానికి వస్తున్న మద్దతుపై రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. నిరసనల వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందన్న అంశంపై అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కొన్ని వర్గాలు నిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని ఆరోపిస్తుండగా.. మరికొందరు మాత్రం విద్యార్థుల సమస్యపై ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారని వాదిస్తున్నారు.సోషల్ మీడియాలోనూ ఇదే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఫుడ్ సపోర్ట్‌ను ప్రజల స్వచ్ఛంద మద్దతుగా చూస్తుంటే.. మరికొందరు ఉద్యమానికి నిధుల మూలాలపై స్పష్టత అవసరమని ప్రశ్నిస్తున్నారు.పేర్లు తెలియని దాతలు.. కనిపిస్తున్న మద్దతుప్రస్తుతం జంతర్‌మంతర్ వద్ద కనిపిస్తున్న దృశ్యం ఏమిటంటే.. పేర్లు వెల్లడించని వ్యక్తుల నుంచి ఆహారం, నీరు వంటి సహాయం నిరసనకారులకు చేరుతోంది. అయితే ఈ సహాయం వెనుక ఎవరు ఉన్నారు? ఇది కేవలం వ్యక్తిగత మద్దతేనా? లేదంటే మరేదైనా వ్యవస్థీకృత సహకారం ఉందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఆరోపణలు ఒకవైపు.. ఆధారాలతో నిరూపితమైన వాస్తవాలు మరోవైపు. సీజేపీ నిరసనల చుట్టూ పెరుగుతున్న రాజకీయ చర్చల మధ్య.. జంతర్‌మంతర్ ఫుడ్ ప్యాకెట్ల కథ ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. -
సీజేపీ నిరసనలపై స్పందించిన యువీ
గత కొద్ది రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు, యువతను ఉద్దేశించి శాంతి, సంభాషణ, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చాడు.తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొస్తూ.."ప్రతి చిన్నారి, విద్యార్థి, మహిళ, పురుషుడు ప్రశాంత వాతావరణంలో చదువుకునే, సురక్షితంగా ఎదిగే, తమ కలలను సాకారం చేసుకునే అవకాశం పొందాలి. వారి సంక్షేమమే భారత భవిష్యత్తుకు బలమైన పునాది. సంభాషణ ద్వారానే దేశ భవిష్యత్తు కోసం అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరుకుతుంది" అని పేర్కొన్నాడు.Yuvraj Singh Instagram Story. pic.twitter.com/ufb1k3JVBX— Jotdofficial (@jotdofficial_) July 22, 2026విద్యార్థుల నిరసనలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో యువరాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఆయన ఏ రాజకీయ పక్షానికీ మద్దతు ప్రకటించకుండా, విద్యార్థుల భద్రత, సంక్షేమం, విద్యా భవిష్యత్తుపైనే తన సందేశాన్ని కేంద్రీకరించాడు.క్యాన్సర్‌ను జయించిన తర్వాత యువరాజ్ స్థాపించిన 'YouWeCan' ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ అవగాహన, చికిత్స సహాయం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలపై ఇప్పుడిప్పుడే సెలబ్రిటి లోకం స్పందించడం మొదలు పెట్టింది. తొలుత ఈ విషయంపై మాట్లాడేందుకు వెనకడుగు వేసిన వారు ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి యువరాజ్ సింగ్ చేరాడు.కాక్రోచ్ల నిరసనలపై క్రికెట్ రంగానికి సంబంధించి యువరాజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన నేపథ్యంలో నెటిజన్లు మరో భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. విద్యార్థుల నిరసనలతో దేశం అట్టుడికి పోతుంటే విరాట్ మాత్రం స్వామీజీల చుట్టూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు.దేశ యువత భవిష్యత్తు పట్ల ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తిగా విరాట్‌ను అభివర్ణిస్తున్నారు. ఇలాంటి వాడు యువతకు ఏరకంగా ఆదర్శంగా నిలుస్తాడని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకొందరు విరాట్ తన మఖాంను యూకే మార్చడాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటి వారిని దేశం నుంచే బహిష్కరించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.దేశం పట్ల, దేశ యువత పట్ల ఏమాత్రం బాధ్యలేకుండా ఇక్కడ సంపాదించుకొని విదేశాల్లో స్థిరపడే వారికి కూడా యువత సరైన గుణపాఠం నేర్పాలని పిలుపునిస్తున్నారు. -
పిజ్జాలు, బర్గర్లు, గోల్గప్పా..
కొద్దిరోజుల నుంచి అలుపెరగక ఉద్యమంలో కొనసాగి అలసిపోయిన ఉద్యమకారులకు ఢిల్లీ, పొరుగున ఉన్న ప్రాంతాల్లోని సానుభూతిపరుల నుంచి ఆహార సహాయం వెల్లువెత్తుతోంది. తమ శక్తిమేరకు జనం ఈ విద్యార్థులకు సీజనల్ పండ్లు, ఇతర ఆహారాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మరి కొందరు వినూత్నంగా పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, గోల్గప్పాలు సైతం పంపిణీచేస్తున్నారు. పంక్తి భోజనాలకూ కొందరు ఆర్థికసాయం చేస్తున్నారు. కొందరు సాయంకాలపు చిరుతిండ్లు పంపిస్తూ ఉద్యమకారుల ఆకలిబాధలను తీరుస్తున్నారు. చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, పండ్ల రసాలు, శీతలపానీయాలు, దహీబల్లా ఇలా ఎన్నో రకాల ఆహారపదార్థాలను ఉచితంగా పంపిణీచేస్తున్నారు. ఆహార పొట్లాల పంపిణీ ఊపందుకుంద. సామూహిక భోజనాలకు సిక్కు వర్గీయులు ముందుకొచ్చారు. వాటర్ బాటిళ్లను విపరీతంగా పంచుతున్నారు. ఒక మలీ్టనేషనల్ కంపెనీలో పనిచేసే ఉన్నతోద్యోగి రవి మౌర్య కొద్దిరోజులు ఆఫీస్‌కు సెలవు పెట్టిమరీ ఉద్యమకారులకు ఆహార ఏర్పాట్లలో సాయపడుతున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్లనూ అందుబాటులో ఉంచుతున్నారు. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ల నుంచి బుధవారం ఉదయమే ఇక్కడికి చేరుకున్నట్లు కొందరు నిరసనకారులు తెలిపారు. సమగ్రమైన విద్యావ్యవస్థ కోసం పోరాడుతున్న విద్యార్థులకు వృద్ధుల మద్దతూ ఉందని చాటేందుకే ఇక్కడికి వచ్చానని పంజాబ్ నుంచి వచ్చిన 70 ఏళ్ల బలదేవ్ తెలిపారు. ఇంట్లోంచి చూడ్డంకంటే నేరుగా ఉద్యమాన్ని కళ్లారా చూడ్డానికి వచ్చానని స్కూల్ యూనిఫాంలో వచ్చిన 16 ఏళ్ల విద్యార్థి ఒకరు తెలిపారు. -
ఉద్యమం... ఉధృతం
న్యూఢిల్లీ: పార్లమెంట్ పరిసరాల్లో ఉద్యమకారులపై పోలీసులు జులుం తర్వాత విద్యార్థుల ఉద్యమం బుధవారం మరింత ఉధృతమైంది. దేశ రాజధానితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మద్దతుదారులు జంతర్‌మంతర్‌కు తరలివస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా పరీక్షార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలతో కోలాహలంగా మారింది. వాళ్లు చేసే ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. బ్యాక్‌ప్యాక్‌లతో కొందరు కొన్ని రోజులపాటు ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చారు. సొంతంగా బ్యానర్లు సిద్ధంచేసుకుని, ప్లకార్డులు పట్టుకుని ఉద్యమస్థలికి చేరుకున్నారు. కొందరు పోలీస్బారికేడ్లను ఊతంగా చేసుకుని కూర్చోగా కొందరు సమీపంలోని చెట్లు ఎక్కి మొత్తం ఉద్యమప్రాంగణాన్ని ఆసక్తిగా గమనించారు. బుధవారం సాయంత్రం అక్కడ ఉన్న పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారని, ఈ ఘటనలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జై ప్రకాశ్‌కు స్వల్పగాయమైందని పోలీసులు ఆరోపించారు. మూతబడిన మెట్రోస్టేషన్లు.. ఎలాంటి అనూహ్య పరిణామాలు జరక్కుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఢిల్లీ అధికార యంత్రాంగం ఢిల్లీలో 17 మెట్రో స్టేషన్లను కొన్ని గంటలపాటు మూసేసింది. లోక్ కల్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవా తీర్‌్థ, జన్‌పథ్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీవో, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్‌బాగ్, శివాజీ స్టేడియం, ఝాన్దేవాలన్ స్టేషన్లను మూసేశారు. ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తూ... ఉద్యమ స్ఫూర్తి పలు రాష్ట్రాల్లోనూ నిరసనకారులు పుణికిపుచ్చుకుని రాష్ట్ర రాజధానుల్లో ర్యాలీలు చేపట్టారు. బిహార్‌లో ‘లోక్‌భవన్ మార్చ్’పేరిట గవర్నర్ హౌస్‌కు ర్యాలీగా వెళ్లిన ఉద్యమకారులపై పోలీసులు బాష్పవాయుగోళాలు, జలఫిరంగులను ప్రయోగించి విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. లాఠీచార్జ్ సైతం చోటుచేసుకుంది. తమిళనాడులోనూ విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఉద్యమసంఘాలు కోయంబత్తూర్ తదితర చోట్ల ఢిల్లీ లాఠీచార్జ్‌ను నిరసిస్తూ ర్యాలీలు చేపట్టాయి. -
చర్చలకు సిద్ధం: సీజేపీ
న్యూఢిల్లీ: నెల రోజులుగా ఉద్యమబాటలో పయనిస్తున్న తాము ఇకపై చర్చల బాటలో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గురువారం ప్రకటించింది. పోటీ పరీక్షల్లో అక్రమాలకు సత్వరం చరమగీతం పాడాలంటూ ఉద్యమపంథాలో వెళ్తున్న తాము ప్రస్తుతం ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ‘‘చర్చలకు మోదీ సర్కార్ సుముఖంగా ఉందని బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమాచారమిచ్చారు. ఆయన అధికార నివాసంలో చర్చలకు రావాలని ఆహా్వనంపలికారు. అయితే అధికారిక నివాసాల్లో చర్చలకు మేం సిద్ధంగా లేము. జంతర్‌మంతర్‌లో ప్రజాకోర్టు ఇప్పటికే కొలువుతీరి ఉంది. ప్రజలు వచ్చినట్లు మంత్రులూ ఇక్కడికొచ్చి చర్చిస్తే బాగుంటుంది. ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది’’అని దాస్ చెప్పారు. ‘‘మనందరం విద్యావంతులమే. జంతర్ మంతర్‌లో భద్రత పరంగా ఏమైనా సమస్యలు తలెత్తవచ్చు అని ప్రభుత్వం భావిస్తే దీక్షాస్థలికి బదులుగా మరేదైనా తటస్థ వేదికపై చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. చర్చలకు మేం రెడీ అని ఎప్పుడో చెప్పాం. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనడం ఉత్తమమైన ప్రక్రియ. అయితే అర్థరహిత చర్చలకు మా ఉద్యమంలో చోటేలేదు. నిరసనకారుల డిమాండ్ల సాధనకు కృషిజరిగేలా ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకురావాలి. మా డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఏ మేరకు సంసిద్ధంగా ఉందనేదే ఇక్కడ అసలు విషయం. ఎందుకంటే కాలం చాలా విలువైంది. ఇంకా వేలాది మంది జంతర్మంతర్లోనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. రెండ్రోజుల క్రితంనాటి పోలీసుల లాఠీచార్జ్, ఉద్యమకారుల ప్రతిఘటన ఉదంతంలో విద్యార్థులపై పోలీసులు ఎలాంటి కేసులు మోపకూడదు. ఉద్యమం ఉధృతమవుతోంది. ఢిల్లీ నుంచి ఉద్యమం గోవా, ముంబై, జైపూర్‌లకు పాకింది. ఇది సహజంగానే జాతీయస్థాయి ఉద్యమంగా రూపాంతరం చెందింది’’అని దాస్ వ్యాఖ్యానించారు. -
ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తారా?: సూర్య భార్య పోస్ట్ వైరల్
ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమంపై టీమిండియా స్టార్లు ఇంతవరకు స్పందించలేదు. అయితే, భారత టీ20 జట్టు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిశా శెట్టి, టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్ మాత్రం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు.దేవిశా, సంజనా వైఖరి పట్ల నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కాగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనలు మరింత ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేపట్టిన ‘చలో సంసద్’ ర్యాలీ హింసాత్మకంగా మారింది. విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సంజన ఇలా...ఈ నేపథ్యంలో సంజనా గణేషన్ స్పందిస్తూ.. ‘‘నిరసనకు దూరంగా ఉన్న ఆరేళ్ల పసి ప్రాణానికి టియర్ గ్యాస్ వల్ల ఇబ్బంది కలిగినప్పుడు.. ఎవరికైనా సరే ఇది ఇబ్బందిని కలిగిస్తుంది కదా!..చిన్నారులు టియర్ గ్యాస్ బారిన పడటాన్ని ప్రజాస్వామ్యంలో సాధారణ విషయంగా మార్చకండి. తమను రక్షించడం కోసమని రక్షణ పేరుతో భయపెట్టడాన్ని ఏ పౌరుడు కూడా కోరుకోడు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సంజనకు పలువురు నెటిజన్లు మద్దతుగా నిలుస్తూ పోలీసుల వైఖరిని ప్రశ్నిస్తున్నారు.పోరాటాలు చేయండి అంటూనే...ఇక దేవిశా శెట్టి మాత్రం మరింత తీవ్రంగా, కాస్త భిన్నంగా స్పందించింది. ‘‘ఇది స్పాన్సర్ చేసిందే అనుకోండి. రాజకీయ ఉద్దేశాలు ఉన్న పోస్టు అనుకోండి. మీరు దీనికి ఏ పేరు పెట్టినా నిజం మాత్రం మారదు. భారతీయ యువత అగ్నిపంథాను ఎంచుకుంది. సవాళ్లకు ఎదురు నిల్చుంది.పోలీసులు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పరిస్థితులను చక్కదిద్దాలి. ప్రభుత్వం కూడా వారి సమస్యకు గల కారణం ఏమిటో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వాన్ని విమర్శించండి. ప్రధానిని ప్రశ్నించండి.రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తండి. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమాలు నడపండి. ఓటుతో సమాధానం చెప్పండి. దానినే ప్రజాస్వామ్యం అంటారు. పబ్లిక్ ప్రాపర్టీ అంటే ప్రభుత్వ ఆస్తులు కావు.ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తారా?మీరు ధ్వంసం చేసిన ప్రతీ బస్సు, విరగొట్టిన ప్రతీ బారికేడ్, తగలబెట్టిన ప్రతీ వాహనం, మీరు నాశనం చేసిన రోడ్డు.. ఇలా ప్రతీదీ భారత పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చిన డబ్బు ద్వారా నిర్మితమైనవి. ఇందులో మీరు కూడా ఉంటారు.ఏదేమైనా హింస అనేది ఎప్పుడూ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మీరు రాళ్లు విసిరినపుడు, పోలీసులపై దాడి చేసినపుడు.. బారికేడ్లను తోసుకుని వెళ్తూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉంటే దీనిని ఎవరూ నిరసన అనరు. మీరు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు’’ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు దేవిశాను విమర్శిస్తున్నారు.ఆస్తుల కంటే ప్రాణాలు విలువైనవి కాదా?‘ఓవైపు విద్యార్థులు ప్రాణాలకు తెగించి న్యాయం కోసం పోరాడుతుంటే.. మీరేమో మీ భర్తను తిరిగి టీమిండియాలోకి చేర్చాలనే ఉద్దేశంతో రాజ్యానికి వంతపాడుతున్నారు. మీరన్నది నిజమే. ప్రభుత్వ ఆస్తుల్ని నష్టపరిచే హక్కు ఎవరికీ లేదు.మరి ఆస్తుల కంటే ప్రాణాలు మరింత విలువైనవి కదా! పేపర్ లీకేజీ వ్యవహారంతో బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థులకు మద్దతుగా మీరు ఏనాడైనా రాజ్యాన్ని ప్రశ్నించారా? ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మన వరకూ వస్తేనే ఏదైనా అర్థమవుతుంది’ అని విరుచుకుపడుతున్నారు. మరికొందరేమో దేవిశా సరిగ్గా చెప్పిందంటూ సమర్థిస్తున్నారు.చదవండి: వైఫల్యాలపై స్పందించిన వైభవ్ సూర్యవంశీ -
కాక్రోచ్ పార్టీకి మద్దతుగా ప్రకాష్ రాజ్
-
LIVE: రణరంగంగా ఢిల్లీ..! హై అలర్ట్
-
కాక్రోచ్ జనతా పార్టీపై సీఎం రేవంత్ ఫస్ట్ రియాక్షన్
-
చర్చల్లో ట్విస్ట్! కేంద్రానికి CJP కొత్త కండిషన్
న్యూఢిల్లీ: నీట్ ఆందోళనల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమేనని చెబుతూనే.. కాక్రోచ్ జనతా పార్టీ కొత్త కండిషన్ పెట్టింది. తాము వాళ్ల దగ్గరకు వెళ్లబోమని.. చర్చలకు ప్రభుత్వమే ముందుకు రావాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా జంతర్ మంతర్‌కు వచ్చి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.“ప్రభుత్వం చర్చలు జరపాలనుకుంటే మా వద్దకే రావాలి. మా షరతులకు అంగీకరించాలి” అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని, అహంకారాన్ని పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని CJP తేల్చిచెప్పింది. తమ ప్రధాన డిమాండ్ నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపింది.జంతర్ మంతర్‌లోనే, లేకుంటే..సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా మాట్లాడుతూ.. చర్చలు జరపాలంటే తటస్థ ప్రదేశంలో లేదా జంతర్ మంతర్‌లోనే నిర్వహించాలని అన్నారు. తమ డిమాండ్ల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో జరిగిన చర్చలపై కూడా సీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ప్రతినిధులను నడ్డా నివాసంలో గంటల తరబడి కూర్చోబెట్టి సమయం వృథా చేశారని అభిజీత్ దీప్కే ఆరోపించారు.చర్చలకు సిద్ధమన్న కేంద్రంమరోవైపు, నిరసనకారులు చర్చలకు వస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. అయితే చర్చల విషయంలో బాధ్యతను ప్రభుత్వం నిరసనకారులపైనే ఉంచినట్లు తెలుస్తోంది.జూలై 20న CJP చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పోలీసులు బలప్రయోగం చేశారని CJP ఆరోపించగా.. నిబంధనలు ఉల్లంఘించడంతోనే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ సమయంలోనే జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులు.. మూడు డిమాండ్లతో వినతి పత్రం సమర్పించారు. వాటిని పరిశీలించి నిర్ణయం తెలియజేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో సీజేపీ–కేంద్ర ప్రభుత్వం మధ్య రెండో దఫా చర్చల అంశం కీలకంగా మారింది. ఎవరు ముందడుగు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. -
కాక్రోచ్ పార్టీకి ఊహించని మద్దతు.. ప్రత్యర్థుల్లో టెన్షన్!
-
జంతర్‌మంతర్ వద్ద మళ్లీ ఉద్రిక్త వాతావరణం
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు ఢిల్లీలో ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. సోమవారం పార్లమెంట్ ముట్టడి సమయంలో, అలాగే మంగళవారం చోటుచేసుకున్న ఘర్షణల అనంతరం పోలీసులు జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు, వేదికను తొలగించారు. అయితే బుధవారం ఉదయం నుంచి నిరసనకారులు మళ్లీ అక్కడకు చేరుకుని ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు.లేటెస్ట్ అప్డేట్స్:ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులుపోలీసులపై అల్లరిమూకల దాడిదాడిలో పలువురు పోలీసులకు గాయాలుజంతర్మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్పై నిషేదంగాయపడిన పలువురు పోలీసులుజంతర్మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణంపోలీసులపైకి రాళ్లు విసిరిన ఆందోళనకారులుపోలీసులు, RAF సిబ్బందిపైకి రాళ్లు, బాటిళ్లు విసిరిన ప్రొటెస్టర్లుగాయపడిన పలువురు పోలీసులు ఢిల్లీ జంతర్‌మంతర్ దగ్గర హైటెన్షన్భారీగా తరలివస్తున్న యువతపార్లమెంట్ వైపు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలుప్రభుత్వం చర్చలకు రావాలంటే తమ వద్దకే రావాలని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధమేనని, కానీ తమ షరతులను అంగీకరించాలని తెలిపారు.ప్రభుత్వ అహంకారం తగ్గాలని డిమాండ్ చేశారు.NEET పేపర్ లీక్ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.చర్చలు తటస్థ ప్రదేశంలో లేదంటే జంతర్ మంతర్‌లో జరగొచ్చని CJP ప్రతినిధి ఆశుతోష్ రంకా తెలిపారు.ప్రభుత్వం తమతో చర్చలు జరుపుతూనే మరోవైపు విద్యార్థులపై పోలీసు చర్యలకు దిగిందని CJP ఆరోపించింది.తమ ప్రతినిధులను జేపీ నడ్డా నివాసంలో గంటల తరబడి కూర్చోబెట్టి సమయం వృథా చేశారని అభిజీత్ దీప్కే ఆరోపించారు.చర్చలకు పిలిచి మరోవైపు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారని విమర్శించారు.జూలై 20 పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు బలప్రయోగం చేశారని CJP ఆరోపించింది.మరోవైపు, నిరసనకారులు చట్టాన్ని ఉల్లంఘించడంతోనే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.NEET అంశంపై CJP–ప్రభుత్వం మధ్య రెండో విడత చర్చలు కొనసాగుతున్నాయి.నాలుగు నినాదాలే చేద్దాం: సీజేపీ జంతర్ మంతర్‌లో CJP ప్రతినిధి ఆశుతోష్ రంకా కీలక వ్యాఖ్యలు.ఆందోళనల్లో నాలుగు నినాదాలకే పరిమితం కావాలని పిలుపు.‘‘భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి’’ అంటూ నినాదాలు చేయాలని సూచన.ప్రతికూల నినాదాలతో ఉద్యమంపై తప్పుడు కథనం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణ.ఎలాంటి నెగెటివ్ స్లోగన్స్‌ను సహించబోమని స్పష్టం చేశారు.స్పీకర్‌ను కలిసిన ధర్మేంద్ర ప్రధాన్NEET అంశంపై పార్లమెంట్లో చర్చకు ప్రతిపక్షాల ఒత్తిడిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉభయ సభల్లో డిమాండ్రాజీనామాకు పట్టుబడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. విపక్షాలుఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామంలోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీపై సర్వత్రా ఉత్కంఠCJP నిరసనలు.. తాజా పరిణామాలువిద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని DMK ఎంపీ తిరుచ్చి శివ ఆరోపించారు.NEET వ్యతిరేక నిరసనల్లో విద్యార్థులపై బలప్రయోగం జరిగిందని విమర్శించారు.సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను 20 రోజులకు పైగా కొనసాగించేందుకు అనుమతించారని గుర్తుచేశారు.ప్రభుత్వానికి మానవతా దృక్పథం లేదని DMK ఎంపీ ఆరోపించారు.విద్యార్థుల పోరాటం ఆగదని, వారు తమ డిమాండ్ల కోసం కొనసాగుతారని వ్యాఖ్యానించారు.ఢిల్లీలో భద్రతా కారణాలతో మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.రాజీవ్ చౌక్, ఐటీవో, మండీ హౌస్ సహా 16 మెట్రో స్టేషన్లు తదుపరి ఆదేశాల వరకు మూసివేశారు.జంతర్ మంతర్ పోలీస్ యాక్షన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు👉 ‘సమయం వృథా చేయొద్దు’జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల దాడి ఆరోపణలపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. “మా సమయం, మీ సమయం వృథా చేయొద్దు” అని న్యాయవాదికి సూచించింది. 👉 వీడియోలు చూడబోమన్న సీజేఐపోలీసుల చర్యకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని కోరగా.. “మేము ఎలాంటి వీడియోలు చూడాలనుకోవడం లేదు” అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.👉 పార్లమెంట్ మార్చ్ సమయంలో ఉద్రిక్తతనీట్ పేపర్ లీక్‌పై CJP చేపట్టిన నిరసనల్లో భాగంగా పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.👉 లాఠీఛార్జ్ చేశారంటూ ఆరోపణలువిద్యార్థులపై పోలీసులు అధిక బలప్రయోగం చేశారని CJP ఆరోపించింది. పలువురు గాయపడ్డారని తెలిపింది.👉 ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్పోలీసుల చర్యపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.👉 ‘కోర్టును ఇందులోకి లాగొద్దు’పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం సూచన చేసింది. కేసును బుధవారం విచారణకు లిస్ట్ చేసింది. విచారణ జరగాల్సి ఉంది.👉 నిరసనలు కొనసాగుతున్నాయిజంతర్ మంతర్ వద్ద CJP ఆందోళనలు కొనసాగుతుండగా.. భారీగా పోలీసు బలగాలను మోహరించారు.CJP హెచ్చరిక.. ఢిల్లీకి లక్షల మంది వస్తారుNEET పేపర్ లీక్ ఆరోపణలపై ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని CJP హెచ్చరిక.జూలై 20న జరిగిన నిరసన కేవలం ‘‘ట్రైలర్ మాత్రమే’’ అని CJP జాతీయ అధికార ప్రతినిధి ఆశుతోష్ రంకా వ్యాఖ్య.ప్రభుత్వం డిమాండ్లు అంగీకరించకపోతే లక్షలాది మంది ఢిల్లీకి తరలివస్తారని హెచ్చరిక.స్వాతంత్ర్యం తర్వాత దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఉద్యమమని రంకా పేర్కొన్నారు.ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, లేదంటే భారీ స్థాయిలో నిరసనలు తప్పవని వ్యాఖ్య.జూలై 20 మార్చ్ పోలీసుల జోక్యం వరకు శాంతియుతంగానే సాగిందని ఆరోపణ.ఆందోళనకారులను హింసాత్మకులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని విమర్శ.పోలీసులు విద్యార్థులపై బలప్రయోగం చేయడంతోనే ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.31 రోజులుగా శాంతియుతంగా నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు.మహాత్మా గాంధీ, బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాల ఆధారంగా ఉద్యమం సాగుతోందని చెప్పారు.CJP–ప్రభుత్వం రెండో దఫా చర్చలు నేడుNEET-UG 2026 పేపర్ లీక్ వివాదంపై కొనసాగుతున్న CJP ఆందోళనలు.నేడు మధ్యాహ్నం 12 గంటలకు CJP–కేంద్ర ప్రభుత్వం మధ్య రెండో విడత చర్చలు.జూలై 20న తొలిసారి CJP ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ.ప్రభుత్వానికి మూడు ప్రధాన డిమాండ్లతో వినతిపత్రం సమర్పించిన CJP.కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను ఎలాంటి ఆంక్షలు లేకుండా విడుదల చేయాలని డిమాండ్.విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేదా తొలగింపు కోరిన CJP.NEET పేపర్ లీక్‌తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్.తొలి చర్చల్లో డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం.CJP ఆందోళనకు TMC మద్దతుCJP చేపట్టిన నిరసనలకు మద్దతు ప్రకటించిన TMC ఎంపీ కల్యాణ్ బెనర్జీ.విద్యార్థుల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వ స్పందన దురదృష్టకరమని వ్యాఖ్య.‘‘విద్యార్థుల మాట వినకపోతే ఇంకెవరి మాట వింటారు?’’ అని ప్రశ్న.ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై విమర్శలు చేసిన బెనర్జీ.పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయం వెల్లడించారు.నిరసనల్లో భద్రతా సిబ్బంది, జర్నలిస్టులపై దాడుల ఆరోపణలపై ప్రశ్నించగా అసహనం వ్యక్తం చేశారు.జంతర్ మంతర్ పోలీస్ చర్యలపై ఢిల్లీ హైకోర్టులో విచారణజంతర్ మంతర్‌లో విద్యార్థులు, ఆందోళనకారులపై పోలీసుల చర్యను సవాల్ చేస్తూ పిటిషన్.ఈ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.జూలై 18న సోనమ్ వాంగ్చుక్ను నిరసన స్థలం నుంచి తరలించిన ఘటనపై అభ్యంతరం.పోలీస్ ఆపరేషన్‌పై స్వతంత్ర దర్యాప్తు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి.ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, బాడీ కెమెరా రికార్డులు భద్రపరచాలని కోరారు.శాంతియుత నిరసన హక్కును కాపాడేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి.భవిష్యత్‌లో నిరసనకారులపై విచక్షణారహిత పోలీస్ చర్యలను అడ్డుకోవాలని కోర్టును కోరారు.CJP నిరసనలు.. 10 ఎఫ్ఐఆర్లు నమోదుఢిల్లీలో CJP నిరసనలకు సంబంధించి మొత్తం 10 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.న్యూఢిల్లీ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా.. పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్‌లో 4, కన్నాట్ ప్లేస్‌లో 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.మండీర్ మార్గ్, బరాఖంబా రోడ్, కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదు చేశారు.నిరసనల సమయంలో హింస, రాళ్ల దాడి, విధ్వంసం, పోలీసుల విధులకు ఆటంకం వంటి అంశాలపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.హింస ముందస్తు ప్రణాళికలో భాగమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.ఘటనలకు సంబంధించిన 250కిపైగా వీడియోలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.👉 పార్లమెంట్లో చర్చకు సిద్ధం: కేంద్రంనీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో విస్తృత చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి.👉 ‘ఘోర పాపం’ అన్న ప్రధాని మోదీనీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. యువత భవిష్యత్‌తో ఆడుకోవడం ‘ఘోర పాపం’ అని వ్యాఖ్యానించినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.👉ఆయన రాజీనామా చేయాల్సిందే!నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాల్సిందేనని కాక్రోచ్లు పట్టుబడుతున్నాయి. ఆ తర్వాతే ఆందోళనలను విరమిస్తామని సీజేపీ ప్రతినిధులు తేల్చి చెబుతున్నారు. అయితే.. ఈ విషయంలో కేంద్రం నుంచి సానుకూల సంకేతాలేవీ కనిపించడం లేదు. తొలిరోజు నిరసనల సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసిన నిరసనకారుల ప్రతినిధులు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించినప్పటికీ.. ఇప్పటిదాకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా తప్పు చేసినవాళ్లను జైల్లో పెట్టామని ప్రధాని మోదీ అంటుండగా.. చర్చలకు ప్రభుత్వం సిద్ధమంటూ ధర్మేంద్ర ప్రదాన్ విపక్షాలకు స్పష్టం చేశారు. #WATCH | Delhi | Cockroach Janta Party (CJP) National Spokesperson Ashutosh Ranka says, "This is the biggest movement in India's post-independence history...We have said this very clearly, what happened on 20th was a trailer. If the Govt doesn't agree, millions more will come to… pic.twitter.com/YwBpgeGkXc— ANI (@ANI) July 22, 2026👉జంతర్ మంతర్‌లో మళ్లీ భారీగా చేరిన నిరసనకారులువర్షం కురుస్తున్నప్పటికీ CJP కార్యకర్తలు జంతర్ మంతర్‌లో నిరసనలు కొనసాగిస్తున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం ఉదయం ఆందోళనకారుల సంఖ్య పెరిగినట్లు సమాచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను కొనసాగిస్తున్నారు.👉 CJP నేత వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అంటూ ఆరోపణCJP ప్రతినిధి సౌరవ్ దాస్ తన వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యిందని ఆరోపించారు. తమ నిరసనల నేపథ్యంలోనే డిజిటల్ ఆంక్షలు విధిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికే తమ సంస్థకు చెందిన పలు సోషల్ మీడియా ఖాతాలు, వ్యవస్థాపకుడికి సంబంధించిన ఖాతాలు బ్లాక్ లేదా సస్పెండ్ అయ్యాయని CJP ఆరోపిస్తోంది.👉 పోలీసులపై రాళ్ల దాడి.. కేసు నమోదుమంగళవారం రాత్రి ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్ల దాడి జరిగిన ఘటనపై కేసు నమోదైంది. గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.👉 RAF వాహనంపై దాడికన్నాట్ ప్లేస్‌లో గుంపును చెదరగొట్టే క్రమంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వినట్లు పోలీసులు తెలిపారు. RAFకు చెందిన వజ్ర వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు సంయమనం పాటించారని అధికారులు తెలిపారు.👉 రాహుల్ గాంధీ నిరసన.. ప్రధాని నివాసం వద్ద ఉద్రిక్తతజంతర్ మంతర్ ఆందోళనకు దూరంగా ఉన్నారంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ ప్రధాని నివాసం వైపు నిరసనకు వెళ్లారు. పోలీసులు అడ్డుకుని రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వారిని విడుదల చేశారు.👉భద్రత కట్టుదిట్టంజంతర్ మంతర్, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను మరింత పెంచారు. -
నిరసన స్వరాలు వింటారా?
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజైన సోమవారం ఢిల్లీ ఆకాశంలో నిరసన మబ్బులు దట్టంగా అలుముకున్నాయి. రాజవీధులన్నీ వేలాది యువగళాలతో హోరెత్తాయి. పన్నెండేళ్ల బాలిక మొదలుకొని అనేకమంది యువతీయువకులు పోలీసుల లాఠీచార్జిలో గాయపడి నెత్తురోడుతున్న, విలపిస్తూ నిలదీస్తున్న దృశ్యాలు చానెళ్లలో వీక్షించటం చాలామందికి కష్టంగా తోచింది. ఈ దశాబ్ద కాలంలో దేశ రాజధాని ఎన్నడూ చూడని దృశ్యాలివి. నీట్ ప్రశ్నపత్రాల లీక్‌పై గత నెల జూన్ 6 నుంచి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేస్తున్న ఆందోళననూ, మూడు వారాలుగా కొనసాగుతున్న నిరశనలనూ మౌనంగా వీక్షిస్తూ ఉండిపోయిన ప్రభుత్వానికి సోమవారం నాటి ‘చలో సంసద్’ కళ్లు తెరిపించి ఉండాలి. అందుకే కావొచ్చు... కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా ఉద్యమ కార్యకర్తలను చర్చలకు పిలిచారు. అక్కడేమైంది, చివరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందన్న సంగతలా ఉంచితే ముందు వినడం పాలకులు చేయాల్సిన పని. పదిహేనేళ్ల క్రితం అన్నా హజారే నిరశన మొదలెట్టినప్పుడు ఆనాటి యూపీఏ ప్రభుత్వం మొదట్లో పట్టించుకోకున్నా, ఆ తర్వాత కేంద్ర మంత్రులతో ప్రతినిధి బృందాన్ని పంపింది. దాన్ని సంపూర్ణంగా సమర్థించి, క్రియాశీలంగా పాల్గొని దేశవ్యాప్తంగా ఆ ఉద్యమానికి ఊపూ ఉత్సాహాన్నీ తీసుకొచ్చింది బీజేపీయే. అందుమూలంగా ఇతోధికంగా లాభపడింది కూడా. కానీ అదే పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు నిర్లిప్తంగా ఉండి పోవటం, సమస్యను ఇంత సంక్లిష్టం చేసుకోవటం దిగ్భ్రాంతికరం. ఈ ఆందోళనలో గాయపడిన వారిలో వందమంది వరకూ రాంమనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్సకు చేరగా వారిలో తలలు పగిలినవారూ, కాళ్లూ చేతులూ విరిగినవారూ అనేకులున్నారని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అటు 118 మంది పోలీసులు గాయాలతో ఆస్పత్రుల్లో చేరారని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. పాలకులుగా ఎవరుండాలో ఎన్నికలు చెబితే... వారి పాలన ఎలావుందో నిరసనలు చెబుతాయి. అసమ్మతి అనేది దేశభక్తికి అత్యున్నత రూపం అంటాడు అమెరికా రాజనీతి శాస్త్ర ఆచార్యుడు హోవార్డ్ జిన్. ప్రజాస్వామ్యంలో విభేదించేందుకూ, అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకూ చోటివ్వడం ప్రభుత్వాల బాధ్యత. ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం విపక్షాల బాధ్యత కూడా. కానీ విషాదమేమంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ కర్తవ్య నిర్వహణలో విఫలమైంది. జూన్ 17న రాజస్థాన్‌లోని కోటలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒకరోజు ధర్నా చేయటం మినహా చేసిందేమీ లేదు. అన్నా హజారే ఉద్యమ సమయంలో జరిగిందేమిటో గుర్తున్నా తాను చేయాల్సిందేమిటో ఆ పార్టీకి తెలిసేది. ఆ సంగతి ఆలస్యంగా గ్రహించి మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో రాహుల్, ప్రియాంక, ఇతర కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేశారు. ఈ ఉద్యమానికి చెప్పుకోదగ్గ నాయకులంటూ ఎవరూ లేకపోవడం గమనించదగ్గది. నిరశనలో ఉన్న సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు అరెస్టుచేసి ఆస్పత్రిలో చేర్చారు. సీజేపీ నాయకుడు అభిజీత్ దీప్కేను ప్రదర్శన ప్రారంభంలోనే పోలీసులు అరెస్టు చేశారని వార్తలొచ్చాయి. కానీ దాదాపు 50,000 మంది వరకూ ఉన్న ఆందోళనకారులు గుంపులుగా విడిపోయి పార్లమెంటువైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయటం, చాలావరకూ సఫలీకృతం కావటం చిన్న విషయం కాదు. పటేల్ చౌక్, జన్‌పథ్ గేటు మెట్రో స్టేషన్ల వద్ద, అశోకా రోడ్, కన్నాట్‌ప్లేస్ సర్కిల్ వద్ద బైఠాయింపులు, మరో అయిదుచోట్ల వారిపై బాష్ప వాయు గోళాలు ప్రయోగించటం సమస్య తీవ్రతను వెల్లడిస్తుంది. హింసకూ, దౌర్జన్యానికీ దిగినవారిని నియంత్రించటాన్ని ఎవరూ ప్రశ్నించరు. కానీ ఒక్కరిని చేసి ఏడెనమండుగురు పోలీసులు లాఠీలతో మోదటం, ఆడపిల్లలని కూడా చూడకుండా హింసించటం సబబేనా? ‘మీ ఇంట్లో పిల్లలు లేరా? ఇంత దారుణంగా కొడతారా?’ అని ఒక బాలిక ప్రశ్నించటం, తన దుస్తులు చించారని మరొకామె ఆరో పించటం ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచదు. పరీక్షపత్రాలు లీకవటం, కష్టపడి చదివేవారు దగాపడటం తొలిసారి కాదు. ఏళ్లతరబడి ఇలా జరగటంవల్లే పరిస్థితి ఇంతవరకూ వచ్చింది. ఇకనైనా విద్యార్థుల అభీష్టాన్ని వినటం, సానుకూలంగా స్పందించటం ప్రభుత్వ బాధ్యత. లేకుంటే సమస్య మరింత జటిలమవుతుంది. -
చలో సంసద్.. షాక్‌లో కాక్రోచ్ జనతా పార్టీ!
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నియమావళిని ఉల్లంఘించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొంటూ పార్టీ అధికార ప్రతినిధి విజేత దహియాను పార్టీ పదవి నుంచి తొలగించారు. దీంతో సీజేపీ నేతలకు షాక్ తగిలినట్లైంది. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ మంగళవారం ‘చలో సంసద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పార్టీ పిలుపుతో విద్యార్థులు, తల్లిదండ్రులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున ఢిల్లీలోని జంతర్‌మంతర్, పార్లమెంట్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. భారీగా జనసమూహం రావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి, నిరసనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ సమయంలో పార్టీ అధికార ప్రతినిధి విజేత దహియా ఢిల్లీలోని ఓ బర్గర్ అవుట్‌లెట్‌లో బర్గర్ కొనుగోలు చేసి కారులో కూర్చొని తింటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు నిరసనలో పాల్గొంటున్న వేళ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకులు ఇలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మరికొన్ని వీడియోల్లో అతన్ని కొందరు నిలదీస్తూ, నిరసనకు మద్దతుగా నిలవకుండా బర్గర్ ఎందుకు తింటున్నారని ప్రశ్నించిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి.ఈ ఘటనపై స్పందించిన అభిజిత్ దీప్కే, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకే విజేత దహియాను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. जंतर मंतर पर कल छात्र लाठियां खा रहे थे, उसी वक्त CJP प्रवक्ता विजेता दहिया मॉल में जाकर बर्गर खा रहा था !! pic.twitter.com/D75L0hJlZL— Sachin Gupta (@Sachingupta) July 21, 2026 విమర్శలపై స్పందించిన విజేత దహియా మాత్రం తాను నిరసన కార్యక్రమంలో పూర్తిగా పాల్గొన్నానని, అది ముగిసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్లానని తెలిపారు. రెండు రోజులుగా ఉద్యమ కార్యక్రమాలతో నిద్ర లేకుండా పనిచేశానని, ఇంటికి వెళ్లే మార్గంలో ఆకలి వేయడంతో ఆహారం తీసుకున్నానని చెప్పారు. బర్గర్ తినడంలో తప్పేముంది? ఆకలి వేసింది కాబట్టి తిన్నాను. దేశం కోసం ఉద్యమం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు ఎవరూ డబ్బులు ఇవ్వడం లేదు’అని ఆమె పేర్కొన్నారు.కాగా, ట్రాన్స్జెండర్లపై చేసిన వ్యాఖ్యలు, మహిళల రాజకీయ అవగాహనపై చేసిన వ్యాఖ్యల కారణంగా విజేత దహియా గతంలోనూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు నిరసన కార్యక్రమం సందర్భంగా వైరల్ అయిన వీడియోలతో దహియా వివాదం మరింత ముదిరి, చివరకు పార్టీ అతన్ని పదవి నుంచి తొలగించింది. -
డింపుల్ వీడియోలు వైరల్.. అఖిలేశ్ అరెస్ట్
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి ఎంపీ డింపుల్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) మద్దతుదారులు, ప్రజాస్వామిక వాదులు.. ఆమెను ప్రశంసిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమంలో ఆమె చూపించిన తెగువ, మానవత్వం అందరినీ ఆకట్టుకుంది. యువతపై పోలీసుల దాడులను ధైర్యంగా ప్రశ్నించారు. ముఖ్యంగా యువతులపై పోలీసుల దాష్టీకాన్ని నిలదీశారు. పోలీసుల దాడిలో గాయపడిన వారికి సఫర్యలు చేసి అమ్మగా ఆదరించారు. భయంతో వణికిపోతున్న చిన్న పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకుని భరోసా కల్పించారు.సీజేపీ పిలుపు మేరకు సోమవారం ఆమె తన పార్టీ నాయకులతో కలిసి చలో సంసద్ ఆందోళన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. విద్యార్థులకు మద్దతుగా ర్యాలీలో చురుగ్గా పాల్గొన్నారు. పోలీసులు, భద్రతా సిబ్బంది అడుగడుగునా అడ్డుపడినా ముందుకు సాగారు. విద్యార్థులకు నైతిక స్థైర్యాన్ని ఇచ్చి తాను కూడా వారితో పాటు ఆందోళనలో భాగమయ్యారు. యువత పట్ల నిర్దయగా వ్యహరించిన పోలీసుల తీరును గర్హించారు. పోలీసులు గూండాల్లా వ్యవహరించారని ధ్వజమెత్తారు. భారత చరిత్రలో ఇంత అహంకారపూరితమైన, క్రూరమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ లేదని మండిపడ్డారు. మంగళవారం నాడు కూడా సీజేపీ పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. డింపుల్ వీడియోలు వైరల్కాక్రోజ్ జనతా పార్టీ పోరాటంలో డింపుల్ యాదవ్ పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన వారంతా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నాయకులు ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండాలని కోరుతున్నారు. కాగా, బీజేపీ మద్దతుదారులు మాత్రం డింపుల్ యాదవ్‌పై విమర్శలు చేస్తున్నారు. ఓట్ల కోసమే ఆమె ఇదంతా చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. एक मां ही अपने बच्चों का दर्द समझ सकती है। pic.twitter.com/kKvh8P4D2c— Luffy (@luffyspeaking) July 20, 2026 అఖిలేశ్ యాదవ్ అరెస్ట్కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద ధర్నాకు దిగిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అఖిలేశ్ యాదవ్ అరెస్ట్‌ను సమాజ్‌వాదీ పార్టీ ఖండించింది. మోదీ సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడింది. छात्रों के समर्थन में समाजवादी हुंकार नहीं चलेगी ये युवा विरोधी सरकार pic.twitter.com/cE0L4fnqFA— Samajwadi Party (@samajwadiparty) July 21, 2026చదవండి: చాలెంజ్ అంటూ జంపింగ్‌లకు ఇచ్చిపడేసిన మమత బెనర్జీ -
హైదరాబాద్‌ను తాకిన ఢిల్లీ సెగ
సాక్షి,హైదరాబాద్: ఢిల్లీ కాక్రోచ్ జనతా పార్టీ సెగ హైదరాబాద్‌కు తగిలింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఛలో లోక్ భవన్‌కు పిలుపునిచ్చాయి. దీంతో విద్యార్థులు ప్రెస్‌క్లబ్ నుంచి లోక్ భవన్‌కు బయల్దేరారు. మరోవైపు రాహుల్‌గాంధీ చర్చలపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు. పార్లమెంట్లో చర్చిస్తామంటే రాహుల్ గాంధీ ధర్నా విరమిస్తామని అన్నారు. పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధమని చెప్పా.ఐతే ఆయన వెంటనే డిమాండ్ మార్చారు. పార్లమెంట్లో చర్చ జరపడమే కాదు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చర్చించాలని మాత్రమే అన్నారు కదా అని ప్రశ్నిస్తే.. మా డిమాండ్లు మారాయని రాహుల్ సమాధానం ఇచ్చారు. ప్రతిపక్ష నేత వెంటవెంటనే మాట మార్చడం సరికాదు’ ట్వీట్లో పేర్కొన్నారు. -
ఐసీయూలో 21 ఏళ్ల యువతి.... దేశ ప్రజలకు CJP అభిజిత్ క్షమాపణలు
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేపీ చేపట్టిన ‘చలో సంసద్’ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో పలువురు నిరసనకారులు గాయపడ్డారు. వారిలో 21 ఏళ్ల యువతి తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఢిల్లీలోని ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) ఆసుపత్రి ఐసీయూలో వెంటిలేటర్ సపోర్ట్‌పై చికిత్స పొందుతోంది. ఈ ఘటన అనంతరం గాయపడిన మద్దతుదారులను పరామర్శించిన దీప్కే.. వారిని రక్షించడంలో విఫలమైనందుకు దేశ ప్రజలకు, ముఖ్యంగా తమ పార్టీ మద్దతుదారులకు క్షమాపణలు తెలిపారు. గాయపడిన విద్యార్థులను పరామర్శించేందుకు ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లిన అభిజీత్ దీప్కే, నిరసనలో గాయపడిన మద్దతుదారులకు, ముఖ్యంగా మహిళా నిరసనకారులకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. మా మద్దతుదారులందరికీ.. ముఖ్యంగా పురుష పోలీసుల చేతిలో దాడికి గురైన యువతులకు నేను క్షమాపణలు చెబుతున్నాను. మిమ్మల్ని రక్షించడంలో మేము ఇంకా మెరుగ్గా వ్యవహరించి ఉండాల్సింది. ఢిల్లీ పోలీసుల చర్యల నుంచి మిమ్మల్ని కాపాడలేకపోయాం. దీనికి నేను బాధ్యత వహిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.అలాగే, 20 మందికి పైగా విద్యార్థుల మరణాలకు కారణమైన ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడేందుకే ప్రభుత్వం మరికొంత మంది యువ విద్యార్థుల రక్తాన్ని చిందించడానికి కూడా సిద్ధపడింది అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాయపడిన వారు ఎవరైనా ఉంటే తనను వ్యక్తిగతంగా సంప్రదించాలని కూడా ఆయన కోరారు.సోమవారం జరిగిన నిరసనకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, సీజేపీ పిలుపుతో విద్యార్థులు, తల్లిదండ్రులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పార్లమెంట్ పరిసరాలకు చేరుకున్నారు. పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జ్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రి, మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా గాయపడిన విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక తీవ్రంగా గాయపడిన యువతి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతుండగా, నిరసన సందర్భంగా పోలీసుల చర్యలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయి. -
మరోసారి పార్లమెంట్ ను ముట్టడించనున్న CJP నేతలు
-
‘‘ఆ ఫొటోలో ఉన్నది నా కూతురు.. ఆమె గొంతుకగా నిలుస్తా’’
కార్గిల్ యుద్ధ వీరుడు రాజేశ్ మాల్‌కు తన కూతురు కెరీర్లో బాగా రాణించాలన్న ఆశ ఉండేది. కానీ గత నెల ఆయన కల ఛిన్నాభిన్నమైంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో నివసిస్తున్న ఆయన 23 ఏళ్ల కూతురు, నీట్ అభ్యర్థిని రియా కుమారి థాపా ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన తల్లిదండ్రులకు "ఐ లవ్ యూ" అని మాత్రమే రాసి లేఖను పెట్టింది.ఆ ఘటన తర్వాత తన కూతురు ఫొటోను చేతిలో పట్టుకుని రాజేశ్ మాల్ పోరాటం చేస్తున్నారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆ ర్యాలీలో పాల్గొన్న వారి మాటలను ప్రభుత్వం పట్టించుకోలేదని పీక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు."ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టే నిరసనలు ఎక్కడ జరిగినా నా కూతురు ఫొటోను తీసుకెళ్తాను. వారు విన్నా వినకపోయినా నా కూతురి గొంతుకగా నేనే నిలుస్తా" అని ఆయన చెప్పారు.రాజేశ్ మాల్ 1999 కార్గిల్ యుద్ధ వీరుడు. ఆయన ఉత్తరాఖండ్‌కు చెందినవారు. సోమవారం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు జరిగిన సీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన కూతురు రియా కుమారి థాపా, డెహ్రాడూన్‌కు చెందిన 23 ఏళ్ల నీట్ అభ్యర్థిని. ఆమె జూన్‌లో ఆత్మహత్య చేసుకుంది.తన కూతురు ఫొటోను చేతిలో పట్టుకుని, ఆమె విషాద గాథను రాజకీయ నాయకులతో ఒకే వేదికపై పంచుకుంటూ న్యాయం కోరుతున్నారు. ఈ నెల ప్రారంభంలో జంతర్ మంతర్‌లో జరిగిన సీజేపీ నిరసనలోనూ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా కలిశారు.విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదని రాజేశ్ మాల్ నిరాశ వ్యక్తం చేశారు. "ఇప్పటివరకు ప్రభుత్వం కనీసం విచారం కూడా వ్యక్తం చేయకపోవడమే అత్యంత విషాదకరం" అని అన్నారు. సోమవారం వేలాది మంది పాల్గొన్న నిరసన, తన కూతురితో పాటు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులందరికీ నివాళి అని చెప్పారు. ఆమె కూతురి ఫొటో నిరసన ప్రదర్శన వద్ద ఉంది. ఆ ఫొటోలో ఉన్నది తన కూతురేనని అన్నారు."ప్రభుత్వం వినకపోయినా ఇంతమంది నిరసనకు రావడం గొప్ప విషయం. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. బహుశా దేశం మేల్కొంటుంది. బహుశా ఆయన (ధర్మేంద్ర ప్రధాన్) రాజీనామా చేస్తారు" అని అన్నారు.ఇంట్లో రియా ఆత్మహత్య రియా జూన్ 16న ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె గదిలో ఆత్మహత్య లేఖ దొరికింది. "ఐ లవ్ యూ మమ్మీ, పాపా. ఎవరి తప్పూ లేదు" అని ఆమె హిందీలో రాసినట్టు సమాచారం.చదువులో ఆశించిన విజయం రాకపోవడం వల్ల కలిగిన నిరాశే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని సీనియర్ పోలీసు అధికారి అంకిత్ కందారి తెలిపారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్) మే 3న జరిగింది. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్ష రద్దైంది. జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించారు. పలువురు నీట్ అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పార్లమెంట్ ముట్టడి ర్యాలీ చేపట్టడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. ఢిల్లీలోని మధ్య ప్రాంతాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. View this post on Instagram A post shared by PEEK TV (@peektv_in) -
నీట్ సెగలు: ధర్మేంద్ర ప్రదాన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతోంది. విద్యార్థులు.. కాక్రోచ్ పార్టీ తరఫున ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్లతో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ వివాదం మధ్యలో నిలిచిన ధర్మేంద్ర ప్రదాన్ రాజకీయ నేపథ్యం ఏమిటి? బీజేపీలో ఆయనకు ఉన్న ప్రాధాన్యత ఎంత? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రదాన్ పదవి నుంచి తప్పుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన్ని తప్పించే సంకేతాలు కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ లీక్ వ్యవహారంపై స్పందిస్తూ.. పరీక్షా పత్రాల లీకేజీని ‘ఘోర పాపం’గా అభివర్ణించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివాదంలో ఉన్న ధర్మేంద్ర ప్రదాన్ నేపథ్యం మరోసారి చర్చకు వచ్చింది.తండ్రి కేంద్ర మంత్రిధర్మేంద్ర ప్రదాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్‌లో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్ర ప్రదాన్ కూడా బీజేపీ సీనియర్ నాయకుడు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ.. ధర్మేంద్ర ప్రదాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చురుకుగా పనిచేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం బీజేపీ యువమోర్చా, పార్టీ సంస్థాగత బాధ్యతల వరకు సాగింది.వ్యూహకర్తగా.. బీజేపీలో క్రమంగా ఎదిగిన ధర్మేంద్ర ప్రదాన్ 2004లో తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ జాతీయ రాజకీయాల్లో తన స్థానం బలపర్చుకున్నారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ విస్తరణ వ్యూహాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన ఆయన.. పార్టీ అధిష్ఠానం దృష్టిలో నమ్మకమైన నాయకుడిగా ఎదిగారు.మోదీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా..2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మేంద్ర ప్రదాన్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇంధన రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఉజ్వల యోజన అమలును కేంద్రం ఆయన శాఖకు చెందిన ముఖ్య విజయాల్లో ఒకటిగా పేర్కొంది. ఆ తర్వాత 2021లో ఆయనకు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు. జాతీయ విద్యా విధానం (NEP) అమలు, విద్యా రంగంలో సంస్కరణలపై ఆయన దృష్టి పెట్టారు.నీట్ వివాదమే ఇప్పుడు అతిపెద్ద పరీక్షవిద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు తెరపైకి రావడం ధర్మేంద్ర ప్రదాన్‌కు అతిపెద్ద రాజకీయ సవాల్‌గా మారింది. పరీక్ష నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని చెబుతోంది. లీక్ వ్యవహారంలో నిందితులను అరెస్టు చేశామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తామని స్పష్టం చేస్తోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన వివరాల ప్రకారం.. నీట్ లీక్‌లో నిందితులపై చర్యలు తీసుకున్నామని, విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారు.Birthday wishes to Union Minister Shri Dharmendra Pradhan Ji. He is making commendable efforts towards the implementation of the National Education Policy, which seeks to make India a hub for knowledge, learning and innovation. Praying for his long and healthy life.@dpradhanbjp— Narendra Modi (@narendramodi) June 26, 2026బీజేపీలో ఎందుకు కీలకం?ధర్మేంద్ర ప్రదాన్‌ను బీజేపీలో కీలక వ్యూహకర్తల్లో ఒకరిగా భావిస్తారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఎన్నికల నిర్వహణలో ఆయనకు ఉన్న అనుభవం అధిష్ఠానం దృష్టిలో ప్రత్యేక స్థానం కల్పించింది. ఒడిశాకు చెందినప్పటికీ.. ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయికి చేరింది. మోదీ-షా నాయకత్వానికి సన్నిహితంగా ఉండే నేతల్లో ఆయన పేరు తరచూ వినిపిస్తుంది. అందుకే ప్రస్తుత నీట్ వివాదం నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నా.. ఇప్పటివరకు బీజేపీ నాయకత్వం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ముందున్న అసలు సవాల్ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడి.. ఇంకోవైపు దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థపై తగ్గిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత.. ఇవన్నీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రదాన్ ముందున్న సవాళ్లు. మంత్రి పదవి కొనసాగుతుందా? లేదా?? అన్నది రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉన్నప్పటికీ.. కోట్లాది విద్యార్థులు నమ్మే పరీక్షా వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడం ఆయన ముందున్న అసలు పరీక్షగా మారింది.కుటుంబ నేపథ్యం.. వ్యక్తిగత జీవితంధర్మేంద్ర ప్రదాన్ భార్య పేరు మృదులా ప్రదాన్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. కుటుంబాన్ని రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతూ, ఎక్కువ సమయం పార్టీ మరియు ప్రభుత్వ బాధ్యతలకే కేటాయించే నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ధర్మేంద్ర ప్రదాన్‌కు చర, స్థిరాస్తులు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, ఆస్తుల వివరాలను ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్లలో క్లియర్‌గా వెల్లడించారు. -
నీట్ వివాదంపై మోదీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరీక్షా పత్రాలను లీక్ చేయడం ‘ఘోర పాపం’ అని అభివర్ణించిన ఆయన.. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. పార్లమెంట్ సమీపంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు కొనసాగుతున్న వేళ.. ఎన్టీయే (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వివరాలు వెల్లడించారు.‘తప్పు చేసిన వారిని వదిలిపెట్టం’నీట్ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ప్రధాని పేర్కొన్నట్లు కిరణ్ రిజిజు తెలిపారు. లీక్‌కు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేశామని.. ఇప్పటివరకు 13 మంది నిందితులు జైలులో ఉన్నారని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలిగించే ఇలాంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రధాని స్పష్టం చేసినట్లు తెలిపారు. నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారని.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు అవసరమని పేర్కొన్నట్లు చెప్పారు.విద్యార్థుల ప్రయోజనాలే ప్రాధాన్యంనీట్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో విద్యార్థుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ప్రధాని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని.. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, భద్రత మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు రిజిజు వెల్లడించారు. లీక్ కారణంగా రద్దైన నీట్-యూజీ పరీక్షకు ప్రభుత్వం రీ-ఎగ్జామ్ నిర్వహించిందని.. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి ఫలితాలను కూడా నిర్ణీత సమయంలో ప్రకటించామని తెలిపారు.పరీక్షా వ్యవస్థలో మార్పులపై దృష్టిపరీక్షా పత్రాల లీకేజీ వంటి ఘటనలు దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణ విధానంలో మరింత పటిష్ఠమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. పరీక్షల భద్రత, పారదర్శకతపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.ఎన్టీయే భేటీలో పలు అంశాలపై చర్చఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ వివాదంతో పాటు పార్లమెంట్ సమావేశాలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారని తెలిపారు.నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మంత్రి తప్పుకోవడం లేదా కేంద్రం ఆయనను తప్పించడం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని సీజేపీ స్పష్టం చేసింది. విద్యా వ్యవస్థలో తక్షణ సంస్కరణలు అవసరమని పేర్కొంటూ.. తమ డిమాండ్లను కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు కూడా అందజేసింది. ఆ డిమాండ్లపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా సీజేపీ నిరసనలపై స్పందించారు. యువత సమస్యలను ప్రభుత్వం వినాలని, నీట్ వ్యవహారంలో బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. -
రాహుల్, ప్రియాంక గాంధీ విడుదల
కాక్రోచ్ జనతా పార్టీ తగ్గేదే లే అంటోంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌పై పట్టు బట్టి కూర్చుంది. ఈ క్రమంలో రెండో రోజు ఇవాళ పార్లమెంట్ మార్చ్ నిర్వహించబోతోంది. దీంతో ఢిల్లీలో మరోసారి హైఅలర్ట్ నెలకొంది. -
10 నెలల కిందటే చెప్పా.. కేటీఆర్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సమీపంలో జరిగిన కాక్రోచ్ పార్టీ (CJP) ఆందోళనల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. యువత ఆకాంక్షలను పట్టించుకోకపోతే దేశంలో జెన్-జీ ఉద్యమం తప్పదని తాను 10 నెలల క్రితమే హెచ్చరించానని కేటీఆర్ పేర్కొన్నారు.ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘దాదాపు 10 నెలల క్రితం ఓ మీడియా సమావేశంలో.. యువత ఆశయాలు, ఆకాంక్షలను పరిష్కరించకపోతే మన దేశంలో జెన్-జీ నిరసన తప్పదని చెప్పాను’’ అని గుర్తుచేశారు.‘‘ఢిల్లీలో నిన్న జరిగిన నిరసనల తర్వాత కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుత పాలన, జవాబుదారీతనం, విద్యా రంగ సంస్కరణలపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది’’ అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. యువతలో పెరుగుతున్న అసంతృప్తికి కారణాలను గుర్తించి, విద్యా వ్యవస్థలో మార్పులు, ఉద్యోగ అవకాశాలు, పాలనలో పారదర్శకత వంటి అంశాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. పార్లమెంట్ వైపు చేపట్టిన ‘చలో సంసద్’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండడంతో.. పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. About 10 months ago, I had made a comment at a media event that a Gen-Z protest is imminent in our country if the aspirations of youngsters are not addressed After yesterday’s Delhi protest, it is high time for the Union Govt to address the demand for accountability and… pic.twitter.com/9kTIDx9Oi8— KTR (@KTRBRS) July 21, 2026 -
నేడు మళ్లీ ‘చలో సంసద్’!.. సీజేపీ ఆందోళనతో ఉత్కంఠ
న్యూఢిల్లీ: పార్లమెంట్ వైపు చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్ ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో.. మంగళవారం కూడా ఆందోళనలు కొనసాగిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రకటించింది. సోమవారం జరిగిన నిరసనల్లో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకోవడంతో.. మరోసారి పరిస్థితులు అదుపుతప్పకుండా ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోమవారం రాత్రి జంతర్ మంతర్ వద్ద మాట్లాడుతూ.. మంగళవారం కూడా పార్లమెంట్ మార్చ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘మేం ఈ నిరసన ప్రదేశాన్ని వదిలిపెట్టం.. మళ్లీ పార్లమెంట్ వైపు కదులుతాం’’ అని ఆయన తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వెల్లడించారు.సోమవారం హైటెన్షన్.. టియర్ గ్యాస్, లాఠీచార్జ్పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజున CJP ఇచ్చిన ‘సంసద్ చలో’ పిలుపుతో వేలాది మంది కార్యకర్తలు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.అయితే భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో పలువురు నిరసనకారులతో పాటు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు.పోలీసుల కీలక ప్రకటననిరసనల్లో 118 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆందోళనకారుల దాడుల్లో 20 ప్రభుత్వ వాహనాలు ధ్వంసమైనట్లు తెలిపారు. ఘర్షణలకు సంబంధించిన వీడియోలు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నామని, హింస వెనుక కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.మరోవైపు జంతర్ మంతర్ పరిసరాల్లో కొంతకాలం పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. రాత్రి వరకు కూడా అక్కడ భారీగా పోలీసులు, ఆందోళనకారులు మోహరించారు.చర్చలకు ప్రభుత్వం ప్రయత్నంఘర్షణల మధ్య కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలకు మార్గం సుగమం చేసింది. కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో రెండుసార్లు సమావేశమైనట్లు సమాచారం. తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా అందించాలని మంత్రి సూచించగా.. అనంతరం మూడు ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించినట్లు తెలుస్తోంది.మంగళవారం మళ్లీ మార్చ్.. పోలీసుల వ్యూహంమంగళవారం మరోసారి పార్లమెంట్ వైపు మార్చ్ చేపడతామని సీజేపీ ప్రకటించడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వేళ.. విపక్షాల నిరసనలు, సీజేపీ ఆందోళనలతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మంగళవారం ‘చలో సంసద్’ ఎలాంటి మలుపు తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
చలో సంసద్.. రణరంగం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘చలో సంసద్ ర్యాలీ’రణరంగాన్ని తలపించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే ఉభయసభల సాక్షిగా ఎంపీలను నిలదీసి విద్యార్థుల సమస్యలకు పరిష్కారం తేల్చుకుంటామంటూ వేలాది మంది కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు, పరీక్షార్థుల తల్లిదండ్రులు సోమవారం పార్లమెంట్ దిశగా మొదలెట్టిన ర్యాలీ చివరకు ఉద్రిక్తంగా ముగిసింది. ఆదివారం అర్ధరాత్రి నాటికే జంతర్‌మంతర్‌లోని దీక్షా స్థలికి వేలాదిగా మద్దతుదారులు, విద్యార్థులు చేరుకుని సోమవారం ఉదయం పార్లమెంట్ దిశగా ర్యాలీ మొదలుపెట్టగా పోలీసులు మొదట్లోనే అడ్డుకున్నారు. పార్లమెంట్, సెంట్రల్ విస్టా, కన్నాట్ ప్లేస్, సమీప ప్రాంతాల్లో 163వ సెక్షన్‌ను విధించారు. ర్యాలీకి అనుమతిలేనందున ఐదుగురికి మించి గుమికూడవద్దని హెచ్చరించారు. వదంతలు వ్యాపించకుండా ఉండేందుకు సెంట్రల్ ఢిల్లీ పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను కొన్ని గంటలపాటు పోలీసులు నిలిపేశారు. ఉద్యమకారులున్న చోట్ల జామర్లను ఏర్పాటుచేశారు. అయినాసరే పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మరింత మంది విద్యార్థులు, కార్యకర్తలు, మద్దతుదారులు బస్సులు, ఆటోలు, బైక్‌లలో వేర్వేరు దారుల్లో పార్లమెంట్ సమీపానికి చేరుకున్నారు. స్కూల్ యూనిఫామ్‌లో పాఠశాల విద్యార్థులు మొదలు కాలేజీ స్టూడెంట్స్, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, వృద్ధులు, యోగేంద్ర యాదవ్ వంటి సామాజికవేత్తలు పెద్దసంఖ్యలో పార్లమెంట్ సమీప రోడ్లమీదకొచ్చారు. జాతీయజెండాలు చేతపట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. భారత్ మాతాకీ జై, జై భీం, వందేమాతరం, ధర్మేంద్ర ప్రధాన్ దిగిపో నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. వీళ్లు ముందుకెళ్లకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుగా ఉంచారు. వాటినీ ఆందోళనకారులు తొలగించారు. దీంతో వీళ్లను అదుపుచేయడం కోసం పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. దీంతో పలువురు తీవ్రస్థాయిలో గాయపడ్డారు. పార్లమెంట్ స్ట్రీట్, పటేల్ చౌక్, కాన్స్టిట్యూషన్ క్లబ్, శాస్త్రీ భవన్, రైల్ భవన్ సమీప ప్రాంతాల్లో జనాన్ని చెదరగొట్టేందుకు బాష్పవాయుగోళాలు సైతం ప్రయోగించారు. పోలీసులు ఇష్టమొచ్చినట్లు చితకబాదుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తోటి కార్యకర్తలను కొడుతున్నాసరే ఇంకొందరు అలాగే రోడ్డు మీద బైఠాయించి ‘కొట్టండి సార్ కొట్టండి’అని తమ తీవ్రస్థాయి నిరసన తెలపడం ఒక వీడియోలో కన్పించింది. ‘‘పోలీసులు కొందరి తల పగలగొట్టారు. కిందపడ్డ విద్యార్థులనూ వదల్లేదు’’అని 55 ఏళ్ల హెలెన్ అనే మహిళ తెలిపారు. గాయపడిన వారిని తోటి విద్యార్థులు హుటాహుటిన సమీప ఆస్పత్రుల్లో చేర్పించారు. అయితే విద్యార్థుల నుంచి సైతం పోలీసులు తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదుర్కొన్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి. ఈ తోపులాటలో 118 మంది పోలీసులు గాయపడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి. తమపై జనం రాళ్లు రువ్వడంతోనే లాఠీచార్జ్ చేయాల్సివచ్చిందని పోలీసులు తమ చర్యను సమరి్థంచుకున్నారు. ఈ ఘటనలో 100కుపైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత అందర్నీ విడిచిపెట్టే ఆస్కారముందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే సమీప రామ్మనోహర్ లోహియా ఆస్పత్రిలో 65 మెడికో లీగల్ కేసులు నమోదయ్యాయి. ర్యాలీలో లద్దాఖ్ సామాజికవేత్త, నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలిని పోలీసులు జుట్టు పట్టుకుని లాగి కొట్టారని వచ్చిన వార్త అవాస్తవమని ఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ స్పష్టం చేశారు.మా డిమాండ్లు నెరవేర్చండి నడ్డాతో సీజేపీ ప్రతినిధుల చర్చలు విన్నపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్న మంత్రి న్యూఢిల్లీ: దాదాపు మూడు వారాలుగా దీక్షపర్వంలో మునిగిపోయిన సీజేపీ కార్యకర్తలకు తొలిసారిగా ప్రభుత్వం నుంచి పిలుపొచ్చింది. దీంతో సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లు సోమవారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ ప్రధాన డిమాండ్లను మంత్రికి వెల్లడించారు. ‘‘ఎలాంటి షరతుల్లేకుండా ఆస్పత్రి నుంచి సోనమ్ వాంగ్చుక్ను విడుదలచేయాలి. ఆయన ఒక వీడియో సందేశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు అనుమతించాలి. ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యాశాఖ పదవి నుంచి తప్పించాలి లేదా ఆయనతో రాజీనామా చేయించాలి. నీట్–యూజీ,2026 ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో తీవ్ర నిరాశతో బలవన్మరణాలకు పాల్పడిన పరీక్షార్థులకు తలో రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం తక్షణం ప్రకటించాలి. దీక్షాస్థలిని నాశనంచేసిన పోలీసులు ఇకపై కార్యకర్తల జోలికి వెళ్లకూడదు. శాంతియుత నిరసనను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేసేందుకు యత్నించకూడదు’’అని నడ్డాకు అందజేసిన లేఖలో సీజేపీ ప్రతినిధులు పేర్కొన్నారు. సీజేపీ డిమాండ్లపై ప్రభుత్వ నాయకత్వం అంతర్గతంగా చర్చించేలా చేస్తానని ప్రతినిధులకు నడ్డా హామీ ఇచ్చారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని తర్వాత నడ్డా మీడియాతో చెప్పారు. ‘‘మా షరతులను నడ్డాకు తెలిపాం. వీటిని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన మాకు హామీ ఇచ్చారు’’అని తర్వాత అశుతోష్ రంకా తెలిపారు. సోమవారం ఉదయం 11.50 గంటలకు సీజేపీ ప్రతినిధులతో ఫోన్లో మంతనాలు జరిపామని, సాయంత్రం వాళ్లు స్వయంగా వచ్చి మెమోరాండం సమర్పించారని నడ్డా చెప్పారు. ఇప్పటికే ఈ మూడు డిమాండ్లపై ప్రభుత్వ పెద్దలు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీక్ష కొనసాగిస్తా వాంగ్‌చుక్ సంసద్ ర్యాలీలో పాల్గొనేందుకు తనను డిశ్చార్జ్ చేయాలని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్‌కు సోనమ్ వాంగ్‌చుక్ ఒక లేఖ రాశారు. ఆస్పత్రిలో తన ఆరోగ్యం బాగానే ఉందని, నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు పంపించాలని కోరారు. తాను నిరాహార దీక్షను విరమించాలంటే ప్రభుత్వం మూడు షరతుల్ని ఒప్పుకోవాలని చెప్పారు. ‘‘పేపర్ లీకేజీ ఉదంతాలకు తమదే బాధ్యత అని ప్రభుత్వం తన తప్పు ఒప్పుకోవాలి. లేదంటే ర్యాలీగా పార్లమెంట్‌కు వచ్చిన సీజేపీ నాయకులతో ఉభయసభల ఎంపీలు మాట్లాడి ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చిస్తామని వెంటనే హామీ ఇవ్వాలి. లేదంటే అధికార కూటమి ఎంపీలు ఆస్పత్రికి వచ్చి ఇదే అంశంపై నాకు స్వయంగా హామీ ఇవ్వాలి’’అని వాంగ్‌చుక్ ఒక టిష్యూపేపర్ మీద షరతులు రాసి ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. కానీ ర్యాలీలో కార్యకర్తలతో పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన కారణంగా తన దీక్షను ఇకమీదటా కొనసాగించాలని ఆయన ఆ తర్వాత నిర్ణయించుకున్నారు.దీప్కేను నిర్బంధించిన పోలీసులు! దీక్షా స్థలి నుంచి సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కేను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించారని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ ఆరోపించారు. సోమవారం సాయంత్రంకల్లా దీక్షా స్థలిలోని టెంట్లు, మైకులు, కార్పెట్లు, బ్యానర్లు, జెండాలను పోలీసులు తొలగించారు. అటువైపు ఎవరూ రాకుండా జంతర్‌మంతర్ వద్ద రోడ్డుకు రెండు వైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. దీంతో దాదాపు 1,000 మంది ఉద్యమకారులు కొంతదూరంలోనే నిలిచిపోయారు. సమీపంలోని కేరళ హౌస్ సమీపంలో భైఠాయించి ఇక్కడి నుంచే ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఉద్యమనేతలు స్పష్టంచేశారు. అయితే దీప్కేను అరెస్ట్చేశామన్న వార్తల్లో నిజంలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టంచేశారు. -
ధరేంద్ర ప్రధాన్ రాజీనామాపై జేపీ నడ్డాతో కాక్రోచ్ నేతల భేటీ
-
కాక్రోచ్ నిరసనతో దద్దరిల్లిన ఢిల్లీ
-
బీజేపీ ప్రభుత్వానిదే బాధ్యత
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సోమవారం చేపట్టిన చలో సంసద్ ర్యాలీలో పాల్గొన్న యువత పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రతిపక్ష నాయకులు తప్పుబట్టారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వారిపై భాష్పవాయువు ప్రయోగించి, లాఠీచార్జి చేయడాన్ని ఖండించారు. విద్యార్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. పార్లమెంట్ వేదికగా ప్రభుత్వ తీరును ఎండగడతామని పేర్కొన్నారు.విద్యార్థులకు న్యాయం జరగాలి: అఖిలేశ్బీజేపీ ఒక ప్రభుత్వంలా కాకుండా అహంకారంతో వ్యవహరిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. నీట్లో అంత పెద్ద కుంభకోణం జరిగింది కాబట్టే, ప్రజలు ఇప్పటికీ దాని గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారని అన్నారు. నీట్ (NEET) విద్యార్థులకు న్యాయం జరగాలన్నారు. చలో సంసద్ ర్యాలీలో పాల్గొన్న వారిపై భద్రతా సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. విద్యార్థులపై లాఠీఛార్జీలు, అఘాయిత్యాలకు బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అఖిలేశ్ యాదవ్ సతీమణి, ఎంపీ డింపుల్ యాదవ్.. తమ పార్టీ నేతలతో కలిసి స్వయంగా సీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు.వారిని ఎందుకు కొడుతున్నారు? : ప్రియాంక గాంధీవిద్యార్థుల సమస్యలపై పార్లమెంట్లో చర్చించడానికి మోదీ సర్కారు ఇష్టపడడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. చర్చలు జరపకుండా విద్యార్థులపై అణచివేతకు పాల్పడుతోందని బీజేపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. "మేమంతా చర్చ జరగాలని కోరుతున్నాం. విద్యా విధానంలో సమస్యలు, ప్రధానమైన లోపాలు ఉన్నాయి. అయినప్పటికీ, మీరు దీనిపై చర్చించడానికి ఇష్టపడటం లేదు; దానికి బదులుగా, విద్యార్థులపై బాష్పవాయువును ప్రయోగిస్తున్నారు.. వారిని కొడుతున్నారు. దేనికోసం? వారు మన పిల్లలే కదా అని ప్రియాంక వ్యాఖ్యానించారు. యువత వేదన పడుతోంది: చంద్రశేఖర్ ఆజాద్నీట్ విద్యార్థులకు న్యాయం చేసే విషయంపై తాము పార్లమెంటులో పోరాడతామని ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. సీజేపీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. "ప్రభుత్వం తన 'ధర్మాన్ని' పాటిస్తోంది, పోలీసులు తమ 'ధర్మాన్ని' పాటిస్తున్నారు. ఈ నేల పట్ల నా బాధ్యతను నిర్వర్తించే పోరాటంలో నేను ఒక భాగంగా ఉన్నాను. ఈ దేశ యువకుడిగా, యువత పడుతున్న వేదన నాకు అర్థమవుతుంది. వారి గొంతుకగా నిలవడానికి, వారికి అండగా ఉండటానికి నేను ఇక్కడ ఉన్నాను. వారికి అన్యాయం జరుగుతోంది, ప్రభుత్వం దీనిని జరగనిస్తోందని వ్యాఖ్యానించారు. చదవండి: నిరాహార దీక్ష విరమించిన అభిజిత్ దీప్కేఅహంకారం వద్దు: కేజ్రీవాల్మోదీ సర్కారు అహంకారాన్ని విడిచిపెట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ''న్యాయం కోరుతూ వీధుల్లోకి వచ్చిన వీరు మన సొంత పిల్లలు. మీ అహంకారాన్ని పక్కనపెట్టి వారి మాట వినండి. దేశ యువత లక్షలాదిగా జంతర్ మంతర్ వద్ద గుమిగూడారు. వారి మాట వినకుండా ప్రభుత్వం లాఠీచార్జికి పాల్పడుతోంది. ఇది సరికాద''ని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. పిరికిపంద చర్య.. ఇదే మొదటిసారి: మహువా మొయిత్రాఎన్డీఏ సర్కారు తీరుతో కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. సీజేపీ పోరాటంపై బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఆమె విమర్శించారు. "ఇటువంటి తెల్లవారుజాము దాడులు సాధారణంగా శత్రు దేశాలపై జరుగుతుంటాయి. ప్రజాస్వామ్యంలో, అత్యంత దారుణమైన ఒక అంశంపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ సొంత పౌరులపై ప్రభుత్వం ఇలా తెల్లవారుజామున రహస్యంగా, పిరికిపంద చర్యకు పాల్పడటం ఇదే మొదటిసారి. గత 10 ఏళ్లలో 152 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి, అంటే సగటున నెలకు ఒకటి చొప్పున లీక్ అయ్యాయన్నమాట. దీనివల్ల 7-8 కోట్ల మంది పిల్లల భవిష్యత్తు ప్రభావితమైంద''ని అన్నారు. -
నిరాహార దీక్ష విరమించిన అభిజిత్ దీప్కే
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సోమవారం చేపట్టిన చలో సంసద్ ర్యాలీతో దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ వైపు దూసుకువచ్చిన సీజేపీ కార్యకర్తలను భద్రతా దళాలు ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగించి, లాఠిచార్జి చేసి చెదరగొట్టాయి. దీంతో పార్లమెంట్ సమీపంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.మరోవైపు జంతర్ మంతర్ వద్ద ఉద్విగ్న పరిస్థితులు కనిపించాయి. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరాహారదీక్ష విరమించారు. 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఐసా విద్యార్థి నాయకులు నేహా, మనీష్, అమీన్ కూడా తమ దీక్షలకు ముగింపు పలికారు. వీరితో బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌కుమార్ ఝా, ఆర్జేడీ నేత రాజారామ్ పాల్, సీపీఎం ఎంపీ అమ్రారామ్, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ దీక్షలు విరమింపజేశారు. నిరాహారదీక్ష ముగిసినా సీజేపీ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా వీరు ప్రకటించారు.దీక్ష విరమించేందుకు అంగీకరించిన వాంగ్చుక్తాను చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష విరమిస్తానని సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటించారు. ఈ మేరకు మూడు షరతులతో ఆస్పత్రి నుంచి ఆయన స్వదస్తూరితో లేఖ విడుదల చేశారు. మరోవైపు సీజేపీ ర్యాలీలో పాల్గొనేందుకు తనను అనుమతించాలని ఆయన కోరారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ర్యాలీకి వెళ్తానని అన్నారు. థాంక్యూ ఖర్గేయువత ఆందోళన గురించి పార్లమెంట్లో ప్రస్తావించినందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు కాక్రోచ్ జనతా పార్టీ ధన్యవాదాలు తెలిపింది. రాజ్యసభలో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠిచార్జి చేశారని, ఇది సరికాదని ఆయన అన్నారు.వర్షాన్ని సైతం లెక్కచేయకుండా..ఢిల్లీలో వర్షంలోనూ కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీ కొనసాగింది. చలో సంసద్ ర్యాలీలో పాల్గొనేందుకు దేశం నలు మూలల నుంచి వేలాదిగా యువత హస్తినకు తరలివచ్చారు. భద్రతా సిబ్బంది అడ్డుకున్నా లెక్కచేయకుండా ముందుకు సాగారు. పలువురు సినిమా నటులు, రాజకీయ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, హక్కుల కార్యకర్తలు కూడా సీజేపీ నిరసన ర్యాలీలో పలుపాంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. వీడియోలు వైరల్సీజేపీ ర్యాలీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోటెత్తాయి. యువత వేలాదిగా తరలిరావడంతో పార్లమెంట్ పరిసర ప్రాంతాలు నినాదాలతో మార్మోగాయి. ఓ యువకుడిని భద్రతా సిబ్బంది చుట్టుముట్టి కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. భద్రతా సిబ్బంది లాఠీలతో కొడుతున్నా ఆ యువకుడు ఏమాత్రం బెదరకుండా ఎదురెళ్లడం అందరినీ ఆలోచింపజేసింది. लोकतंत्र का दमन करती सरकार।🥺संविधान विरोधी लोगों के सत्ता में आने से यही होता है।😳 pic.twitter.com/iShgP5LBqW— Cockroach Janta Party (@CJP_for_India) July 20, 2026 -
కాక్రోచ్ ముట్టడి.. అమిత్ షాతో ధర్మేంద్ర ప్రదాన్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ అవకతకవలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలను కోరుతూనే.. కేంద్రం విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు చేపట్టిన ఆందోళన తీవ్రతరమైంది. సోమవారం పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నం జరగ్గా.. పోలీసులు, భద్రతా సిబ్బంది నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కఠిన చర్యలతో.. పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు. అదే సమయంలో..కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రదాన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రదాన్‌పై ఆరోపణలు చేస్తూ ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏదైనా నిర్ణయం వెలువడుతుందా? లేదంటే కేవలం పరిస్థితిని సమీక్షించే భేటీనా? అనేదానిపై మరికాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ధర్మేంద్ర ప్రదాన్‌తో అమిత్ షా సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న సమయంలోనే.. మరోవైపు పార్లమెంట్ సమీపంలో సీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని నిరసన తెలుపుతున్నారు. అంతకు ముందు కేంద్రంతో చర్చలు ఉంటాయని సీజేపీ ప్రతినిధులు ప్రకటించగా.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆ ప్రచారాన్ని ఖండించారు. ప్రముఖ పర్యావరణ వేత్త సోనం వాంగ్‌చుక్ ఈ డిమాండ్లతోనే ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఇచ్చిన చలో సంసద్ పిలుపు మేరకు మద్దతు దారులు భారీగా తరలి రావడం గమనార్హం. బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నంఆందోళనకారులు పార్లమెంట్ ప్రధాన గేటు వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పరిస్థితి తోపులాటకు దారితీసింది. ఆందోళనకారులు భద్రతా బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని నిలువరించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.పార్లమెంట్ గేట్లు మూసివేతకార్యకర్తలు పార్లమెంట్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోవడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా పార్లమెంట్ గేట్లను మూసివేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి జరపడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు తెలుస్తోంది.భద్రత కట్టుదిట్టంపార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఆందోళనను అడ్డుకునేందుకు భారీగా మోహరించారు. కొంతసేపు నిరసనలు, నినాదాలతో పార్లమెంట్ పరిసరాలు హోరెత్తాయి. అమిత్ షా–ధర్మేంద్ర ప్రదాన్ భేటీ ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు పార్లమెంట్ వద్ద చోటుచేసుకున్న నిరసనలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. -
జంతర్ మంతర్ లాఠీచార్జ్.. రాజ్యసభలో రాజకీయ మంటలు
న్యూఢిల్లీ: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీస్ చర్య అంశం పార్లమెంట్లో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని ప్రస్తావించడంతో సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.రాజ్యసభ తిరిగి ప్రారంభమైన కొద్దిసేపటికే ఖర్గే మాట్లాడుతూ.. జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న వేలాది మంది విద్యార్థులపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగిందని ఆరోపించారు. విద్యార్థుల గొంతును అణిచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. వేలాది మంది విద్యార్థులను మౌనం చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జంతర్ మంతర్ వద్ద వారిపై లాఠీచార్జ్ చేశారు అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై బలప్రయోగం చేయడం సరికాదని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఖర్గే అధికార పక్షంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. చందా చోరీకి మద్దతుదారులు ట్రెజరీ బెంచ్‌లలో కూర్చున్నారు(అయోధ్య రామ మందిర విరాళాల వివాదాన్ని ఉద్దేశించి) అంటూ చేసిన వ్యాఖ్యలు సభలో మరింత ఉద్రిక్తతకు కారణమయ్యాయి. అధికారపక్ష సభ్యులు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఖర్గే ప్రసంగం కొనసాగుతున్న సమయంలో ప్రతిపక్ష ఎంపీలు లేచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇరువైపుల సభ్యుల నిరసనల మధ్య సభా కార్యక్రమాలు కొనసాగించడం కష్టంగా మారడంతో రాజ్యసభను కొద్దిసేపటికే వాయిదా వేశారు.#WATCH | Delhi: Rajya Sabha adjourned to meet again at 12 Noon today.Leader of the Opposition in Rajya Sabha Mallikarjun Kharge says, "You have allowed me to present my views regarding this paper leak and the NEET examination scandal. This is a matter concerning students; I am… pic.twitter.com/2bRWp771zI— ANI (@ANI) July 20, 2026ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యా సంస్కరణలు, నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు మద్దతుగా పలువురు రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు కూడా స్పందించారు. నిరసనల సమయంలో పోలీసులు చేపట్టిన చర్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే శాంతిభద్రతల పరిరక్షణ కోసమే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. జంతర్ మంతర్ ఘటన ఇప్పుడు పార్లమెంట్లో ప్రధాన రాజకీయ అంశంగా మారింది. విద్యార్థుల నిరసనలు, పోలీస్ చర్య, ప్రభుత్వ వైఖరిపై చర్చలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. -
పార్లమెంట్ ఆవరణలో కాక్రోచ్ల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే దేశ రాజధానిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్‌తో పార్లమెంట్ పరిసరాలు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేయడంతో.. ట్రాఫిక్ ఆంక్షలు, రద్దీ కారణంగా సాధారణ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.నీట్ NEET పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం సీజేపీ మద్దతుదారులు పార్లమెంట్ వైపు ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఈ మార్చ్‌కు ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా పార్లమెంట్ వైపు ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతించబోమని పేర్కొంటూ నిరసనకారులను అడ్డుకున్నారు.జంతర్‌మంతర్‌లో లాఠీచార్జ్.. ఉద్రిక్తతజంతర్మంతర్ నుంచి పార్లమెంట్ వైపు వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని దాటేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా న్యూఢిల్లీ జిల్లాలో BNSS సెక్షన్ 163 కింద ఆంక్షలు అమల్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా ఐదుగురు.. అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడం నిషేధమని వెల్లడించారు.And it has finally begun. Security personnel using lathicharge to disperse crowd at CJP protest in Delhi. pic.twitter.com/JYTNKLq0Tj— Piyush Rai (@Benarasiyaa) July 20, 2026పార్లమెంట్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్సీజేపీ నిరసన, భారీ భద్రతా ఏర్పాట్ల కారణంగా పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలు, సిబ్బంది సైతం రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.పని చేయని ఫోన్లు?ఇదే సమయంలో పార్లమెంట్ ఆవరణలో, పరిసర ప్రాంతాల్లో కొంతసేపు మొబైల్ ఫోన్లు సరిగా పనిచేయడం లేదన్న ఫిర్యాదులు కూడా వినిపించాయి. దీంతో కొందరు ఎంపీలు, ఇతరులు కమ్యూనికేషన్ సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిసింది. అయితే మొబైల్ సేవల అంతరాయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.మెట్రో స్టేషన్లు మూసివేత.. కట్టుదిట్టమైన భద్రతనిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్, జంతర్‌మంతర్, ఇతర కీలక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. భద్రతా కారణాలతో రాజీవ్ చౌక్, జనపథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ్ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు.నిరసన వెనుక కారణాలివేనీట్ సహా పోటీ పరీక్షల్లో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలన్న లక్ష్యంతో ఉద్యమం చేపట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణ వేత్త సోనం వాంగ్‌చుక్ ఇచ్చిన పిలుపు నేపథ్యంలోనే సీజేపీ ఈ ర్యాలీని చేపట్టింది.ఇటీవల వ్యంగ్య డిజిటల్ ఉద్యమంగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ.. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ సంస్థ చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్ పార్లమెంట్ సమావేశాల వేళ రాజకీయంగా వేడి పెంచింది. -
కేంద్రం..కాక్రోచ్ జనతా పార్టీ మధ్య చర్చలు
కేంద్రం సీజేపీల మధ్య చర్చలు కాక్రోచ్ పార్టీ బృందంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చర్చలు నడ్డాకు విజ్ఞాపన పత్రాన్ని అందించింన సీజేపీ జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా భేటీ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలని భేటీలో స్పష్టతలేదంటే తమ నిరసన కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కాక్రోచ్ పార్టీ సీజేపీకి కేంద్రానికి మధ్య కొనసాగుతున్న చర్చలుప్రభుత్వంతో సీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్ చర్చలు డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్ ప్రభుత్వంతో సీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్ చర్చలు అయితే,ప్రభుత్వం వైపు చర్చలు జరుపుతున్నట్లు రాని అధికారిక ప్రకటన కేంద్ర మంత్రి జేపీ నడ్డా తమను చర్చలకు పిలిచారు చర్చలకు తాను, మరో అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా చర్చలు జరుపుతామని సౌరవ్ దాస్ వెల్లడి సీజేపీ ఛలో పార్లమెంట్ మార్చ్‌లో ఎంపీ డింపుల్ యాదవ్ సీజేపీ ఛలో పార్లమెంట్ మార్చ్‌లో ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ డింపుల్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారంటున్న ఎస్పీ నేతలు డింపుల్‌తో పాటు పలువురుని నిర్భందించారని ఆరోపణలు ఢిల్లీలో కొనసాగుతున్న ఉద్రిక్తత పార్లమెంట్‌ను ముట్టడించిన సీజేపీ కార్యకర్తలు పార్లమెంట్‌కు వెళ్లే మార్గాలలో సీజేపీ కార్యకర్తల భైటాయింపు కార్యకర్తలపై పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగం పలువురు ఆందోళన కారులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు పోలీసుల అదుపులో దీప్కేపోలీసుల అదుపులో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేదీప్కే దీక్షను విరమింపచేసిన పోలీసులుఅనంతరం పోలీసుల అదుపులో దీక్కే పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాపార్లమెంట్ ఉభయ సభలు వాయిదాప్రతిపక్షాల ఆందోళనతో లోక్‌సభ,రాజ్య సభ రేపటికి వాయిదా సీజేపీ ఆందోళనలో పాల్గొంటా పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనేందుకు తనకు అనుమతి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ సీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనకు స్వయంగా వెళ్లి మద్దతు తెలపాలని ఉందన్న సోనమ్ ఆస్పత్రి నుంచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సప్ధర్‌గంజ్ ఆస్పత్రి సూపరిటెండెంట్లేఖపార్లమెంట్ వద్ద హై అలర్ట్పార్లమెంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్లమెంట్ గేట్లను మూసివేసిన సీఐఎస్ఎఫ్పెద్ద ఎత్తున పార్లమెంట్ వైపు దూసుకొస్తున్న కాక్రోచ్ కార్యకర్తలు. ప్రధాన గేటు వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు. టియర్ గ్యాస్ ప్రయోగం.. To disperse protestors, security personnel lob tear gas shells at the crowd marching towards the parliament in Delhi. https://t.co/ltC8tB3Lht pic.twitter.com/WTqgbLSSrq— Piyush Rai (@Benarasiyaa) July 20, 2026బారికేడ్లను తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం. కాక్రోచ్ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు. నిరసనకారులను చెదరగొడుతున్న పోలీసులు.. పార్లమెంట్ లోపల సెక్యూరిటీ అలర్ట్.. Security beefed up at Parliament gate. Quick response teams take position with assault rifles as CJP protesters marks towards the parliament. Video via @Elizasherine pic.twitter.com/1cTjbf919T— Piyush Rai (@Benarasiyaa) July 20, 2026 పార్లమెంట్‌ను ముట్టడించిన సీజేపీసీజేపీ కార్యకర్తలు పార్లమెంట్‌ను ముట్టడించారు. పార్లమెంట్ వద్ద హైటెన్షన్ చోటుచేసుకుంది. పార్లమెంట్ ప్రధాన గేటు వద్దకు భారీ సంఖ్యలో సీజేపీ కార్యకర్తలు. కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. నిరసనకారులను చెడగొడుతున్న పోలీసులు. మరోవైపు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీపార్లమెంట్ గేట్లను మూసివేసిన పోలీసులు. ఆందోళకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం VIDEO | Delhi: As the CJP's march protest swells, a multi-tiered security lockdown has been put to place to prevent the thousands of marching protesters from breaching the area.Security personnel physically secured the massive iron gates of the Parliament complex. Red fire… pic.twitter.com/DbS6gWbRtX— Press Trust of India (@PTI_News) July 20, 2026 పార్లమెంట్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత..పార్లమెంట్ ప్రధాన గేటుకు చేరుకున్న సీజేపీ కార్యకర్తలు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్పోలీసులు, సీజేపీ కార్యకర్త మధ్య తోపులాట.ఆందోళకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం.సీజేపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు సీజేపీతో మేం చర్చలు జరపం: నడ్డాజేపీ నడ్డాతో చర్చలు ఉంటాయన్న సీజేపీసీజేపీ వ్యాఖ్యలను ఖండించిన నడ్డా.సీజేపీతో ఎలాంటి చర్చలు ఉండవన్న నడ్డాసీజేపీతో మేం చర్చలు జరపం: నడ్డా పార్లమెంట్ ముట్టడికి కాక్రోచ్ పార్టీ విఫలయత్నం.ప్రెస్‌క్లబ్ దగ్గర ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు. Cockroach Janta Party's March to Parliament Updates ll FOEJ Media ll pic.twitter.com/nIVfCdrYj2— FOEJ Media (@FoejMedia) July 20, 2026 పార్లమెంట్ వద్ద పనిచేయని ఫోన్స్..పార్లమెంట్ పరిసరాల్లో పనిచేయని మొబైల్ ఫోన్స్.సీజేపీ పార్లమెంట్ మార్చ్ పిలుపుతో మొబైల్ నెట్‌వర్క్‌పై నిషేధం.సెంట్రల్ ఢిల్లీలో మొబైల్ నెట్‌వర్క్‌పై నిషేధం.పార్లమెంట్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్.పార్లమెంట్‌కు వచ్చేందుకు ఎంపీల అవస్థలు.ఎక్కడికక్కడే భారీగా నిలిచిపోయిన వాహనాలు. बड़ी खबर,Jantar Mantar से संसद मार्च करने जा रहे युवाओं को Delhi Police खदेड़ रही है। https://t.co/CISITchlqB pic.twitter.com/3LF9DXoZfH— Neeraj Bhawani (@Neeraj_Bhawanii) July 20, 2026కేంద్రంపై విద్యార్థుల ఆగ్రహం.. జంతర్ మంతర్‌కు భారీగా తరలివచ్చిన యువతధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలువిద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాలని డిమాండ్నీట్ పేపర్ లీక్ సహా అనేక పోటీ పరీక్షల లీక్‌పై విద్యార్థుల ఆగ్రహంకేంద్ర ప్రభుత్వం స్పందించాలని నినాదాలునీట్ అక్రమాలకు నిరసనగా చల్ పార్లమెంట్ మార్చ్.. #WATCH | Delhi: Azad Samaj Party-Kanshiram President and MP, Chandrashekhar Azad and TMC MP Mahua Moitra at the CJP's protest march site.Protesters gathered for CJP's protest march clash with RPF personnel at Jantar Mantar; RPF personnel & police use lathis for crowd control. pic.twitter.com/UpZDIcbD5O— ANI (@ANI) July 20, 2026జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తత..జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తత..సీజేపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. సీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్. సీజేపీ ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు.పోలీసులతో సీజేపీ కార్యకర్తల వాగ్వాదం#WATCH | Delhi | Protesters gathered for CJP's protest march clash with RPF personnel at Jantar Mantar; RPF personnel & police use lathis for crowd control pic.twitter.com/gijaCjJksW— ANI (@ANI) July 20, 2026ఢిల్లీ:జంతర్ మంతర్‌లో ఇంటర్నెట్ సిగ్నల్ నిలిపివేతకాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ నేపథ్యంలో నెట్వర్క్ నిలిపివేతపనిచేయని ఫోన్ ఇంటర్నెట్ డేటామెట్రో స్టేషన్‌పై పోలీసులు ప్రత్యేక నిఘాఐదు మెట్రో స్టేషన్లు మూసివేత Govt closed the exits on Metro Stations near Jantar Mantar.People started jumping over and exiting.Now the Metros are not even stopping at these stations.This in itself proves that this movement is beyond our analysis.This is a Jan Andolan now 🔥🔥🔥 pic.twitter.com/t429dj25GT— Jatin (@ja3_bajaj) July 20, 2026 పోలీసుల తనిఖీలు..సీజేపీ మార్చ్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ఢిల్లీకి వచ్చే అన్ని దారుల్లో తనిఖీలు.ఢిల్లీ-గురుగ్రామ్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. #WATCH | Delhi Police continue their security checks in view of the CJP's call for a March to Parliament todayVisuals from the Delhi-Gurugram Border. pic.twitter.com/jmU7q0ysnc— ANI (@ANI) July 20, 2026 దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్‌లో ఉన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజున కాక్రోచ్ జనతా పార్టీ(CJP) తలపెట్టిన ‘చలో సంసద్’ మార్చ్ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా హై సెక్యూరిటీ జోన్లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.కాగా.. సీజేపీ జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చింది. నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు 5 వేల మందికి పైగా సిబ్బందిని భద్రత కోసం రంగంలోకి దించారు. అదనంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన 25కు పైగా బెటాలియన్లను కీలక ప్రాంతాల్లో మోహరించారు. మహిళా భద్రతా సిబ్బందిని కూడా విధుల్లో ఉంచారు.15 భద్రతా జోన్లుగా ఢిల్లీ విభజన.. భద్రతా చర్యల్లో భాగంగా న్యూఢిల్లీ ప్రాంతాన్ని 15 సెక్యూరిటీ జోన్లుగా విభజించారు. ప్రతీ జోన్‌కు సీనియర్ పోలీసు అధికారులను బాధ్యులుగా నియమించారు. ఇంటెలిజెన్స్ విభాగం, ఢిల్లీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్‌లు నిరసనకారుల రాకపోకలపై గంట గంటకు సమాచారం అందిస్తున్నాయి. సోమవారం ఉదయం 4 గంటల నుంచే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.Thousands of supporters gather at Jantar Mantar ahead of the 'Chalo Sansad' march organised by the #CockroachJantaParty . Delhi Police have deployed heavy security, multi-layer barricading and traffic arrangements to maintain law & order.#ChaloSansad #JantarMantar #Delhi… pic.twitter.com/z8MdcUDt9E— Ram Naresh (@RamNareshindian) July 20, 2026 పలు కీలక ప్రాంతాల్లో ఆంక్షలువిజయ్ చౌక్, పార్లమెంట్ స్ట్రీట్, ప్రధానమంత్రి నివాసం, సేవా తీర్థ, ఇండియా గేట్ పరిసరాలు, రాష్ట్రపతి భవన్ తదితర హై సెక్యూరిటీ ప్రాంతాల్లో ఎలాంటి నిరసనలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఢిల్లీలో సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. అనుమతి లేకుండా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం, ర్యాలీలు నిర్వహించడం నిషేధించారు.VIDEO | Delhi: Heavy security has been deployed on Jantar Mantar, Raisina Road and Parliament Circle ahead of the Cockroach Janta Party's proposed march to Parliament today, to press for education reforms. pic.twitter.com/OWFvMhv05t— Press Trust of India (@PTI_News) July 20, 2026వాటర్ క్యానన్లు, బారికేడ్లు సిద్ధంనిరసనల సమయంలో పరిస్థితులు అదుపు తప్పకుండా పోలీసులు వాటర్ క్యానన్లు, వజ్రా యాంటీ రయట్ వాహనాలు, ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు, రిజర్వ్ బలగాలను కూడా అప్రమత్తం చేశారు. మెట్రో స్టేషన్లపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. అవసరమైతే కొన్ని స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సమీప ఆసుపత్రులను కూడా అత్యవసర పరిస్థితుల కోసం అప్రమత్తం చేశారు. ఢిల్లీకి వచ్చే అన్ని మార్గాల్లో వాహన తనిఖీలు పెంచారు. బారికేడ్లు, సీసీటీవీ నిఘా, యాంటీ సబోటేజ్ తనిఖీలు, నిరంతర పెట్రోలింగ్ కొనసాగుతున్నాయి.#WATCH | Delhi: Founding President of the Cockroach Janta Party, Abhijeet Dipke, says, "The biggest march in India's history is about to take place. For the past 10-12 years, attempts have been made to destroy democracy in this country. By sitting at Jantar Mantar for a month,… pic.twitter.com/9qjO1ACNtY— ANI (@ANI) July 20, 2026అభిజీత్ కీలక వ్యాఖ్యలు.. ‘చలో సంసద్’ మార్చ్‌కు దేశ చరిత్రలోనే అతిపెద్ద నిరసనగా నిలిచే స్థాయిలో ప్రజలు తరలివస్తున్నారని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే తెలిపారు. జంతర్ మంతర్ వద్ద ఆయన మాట్లాడుతూ, గత 10–12 సంవత్సరాలుగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తి తిరిగి వచ్చిందని అన్నారు. “దేశం నలుమూలల నుంచి ప్రజలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. నేను అమెరికాలో ఉన్నప్పుడు చాలామంది రోడ్లపైకి ఎవరూ రారని, ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్గానే మిగిలిపోతుందని చెప్పారు. కానీ ఇప్పుడు జంతర్ మంతర్‌కు వచ్చే నాలుగు ప్రధాన రహదారులను చూడండి.. అవన్నీ పూర్తిగా నిండిపోయాయి” అని పేర్కొన్నారు. పార్లమెంట్‌కు వెళ్లే తమ మార్చ్‌ను ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు శాంతియుతంగా నిరసనలో పాల్గొంటారని, తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. -
ఆమరణ దీక్షను విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్
విద్యా వ్యవస్థలో వైఫల్యాలు, పేపర్ లీక్ ఆరోపణలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆమరణ దీక్షను విరమించేందుకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ సిద్ధమయ్యారు. ఆయన పిలుపు మేరకు మద్దతుదారులు, కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ ముట్టడికి సిద్ధమైన వేళ.. ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. అయితే మూడు షరతులు నెరవేరిస్తేనే దీక్ష విరమిస్తానని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. జూన్ 28న ప్రారంభమైన వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష 23వ రోజుకు చేరుకుంది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న దీక్షను పోలీసులు ఇటీవల తొలగించి ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి చేతిరాతతో విడుదల చేసిన ఓ ప్రకటనలో వాంగ్‌చుక్.. దీక్ష ముగించేందుకు మూడు షరతులను వెల్లడించారు. విద్యా వ్యవస్థలో ఇటీవల చోటుచేసుకున్న వైఫల్యాలు, పేపర్ లీక్ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు హామీ ఇవ్వాలని కోరారు. అలాకాకుంటే తన ఆరోగ్య పరిస్థితి కారణంగా దీక్ష కొనసాగించడం సాధ్యం కాకపోతే.. ఎంపీలు, రాజకీయ నాయకులు ఆసుపత్రికి వచ్చి ఇదే హామీ ఇస్తే తాను ఉపవాస దీక్షను విరమిస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తన కదలికలు, మాట్లాడే స్వేచ్ఛ, కమ్యూనికేషన్‌పై ఆంక్షలు ఉన్నాయని వాంగ్‌చుక్ ఆరోపించారు.Activist Sonam Wangchuk tweets, "... I will end my fast on 20th July if:a. If the govt takes accountability of the recent failures in Education system, Paper leaks etc orb. If I and the leadership of CJP reach the doorsteps of Parliament where MPs and leaders of various… pic.twitter.com/XBAgvbkvkw— ANI (@ANI) July 20, 2026భార్య ప్రకటనలో రెండే!ఇదే సమయంలో వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మో కూడా ఆయన దీక్ష విరమణపై స్పందించారు. రాజకీయ నేతలు ఆయనను కలసి.. విద్యా వ్యవస్థలో వైఫల్యాలపై పార్లమెంట్లో చర్చకు హామీ ఇస్తే దీక్ష ముగిస్తారని ఆమె తెలిపారు.ఆమె వెల్లడించిన రెండు అంశాల్లో.. ఒకటి రాజకీయ నేతలు వాంగ్చుక్ను కలవడం, రెండోది విద్యా వ్యవస్థలో బాధ్యతపై పార్లమెంట్లో అంశాన్ని లేవనెత్తుతామని హామీ ఇవ్వడం. అయితే ఆ తర్వాత వాంగ్‌చుక్ స్వయంగా విడుదల చేసిన ప్రకటనలో ఆరోగ్య పరిస్థితి, ప్రభుత్వ బాధ్యత వంటి అంశాలను కలిపి మూడు షరతులుగా వివరించారు.ప్రైవేటు ఆసుపత్రికి తరలింపుపై కోర్టు నిరాకరణవాంగ్చుక్ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని ఆయన భార్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే మధ్యంతరంగా తరలించేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. దీర్ఘకాల ఉపవాసం కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య పర్యవేక్షణ అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, బలవంతపు చర్యలు జరుగుతున్నాయని ప్రాథమికంగా భావించలేమని పేర్కొంది. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది.నేడు ‘చలో సంసద్’.. ఢిల్లీలో భారీ భద్రతమరోవైపు వాంగ్‌చుక్ మద్దతుదారులు సోమవారం ‘చలో సంసద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న రోజే ఈ కార్యక్రమం చేపట్టడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమతి లేకుండా ఎలాంటి మార్చ్‌కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ ప్రాంతంలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు చేశారు. జంతర్‌మంతర్, పార్లమెంట్ పరిసరాల్లో భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలపై ఆంక్షలు విధించారు.వైద్యుల పర్యవేక్షణలో వాంగ్చుక్దాదాపు మూడు వారాలుగా ఆహారం తీసుకోకపోవడంతో వాంగ్‌చుక్ 10 కేజీల బరువు కోల్పోయారు. బలహీనత, డీహైడ్రేషన్‌కు గురయ్యారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ.. రక్త పరీక్షలు, ఇతర ఆరోగ్య సూచికలను నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నీట్ ప్రశ్నపత్రం లీక్ వంటి అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని వాంగ్‌చుక్ వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన దీక్ష విరమణ ప్రకటన, ‘చలో సంసద్’ కార్యక్రమం దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. -
నేడు చలో సంసద్ ర్యాలీ
న్యూఢిల్లీ: ‘చలో సంసద్’ ర్యాలీని విజయవంతం చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పట్టుదలతో ఉంది. ఆ పార్టీకి మద్దతుగా ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌కు భారీగా జనం తరలివచ్చారు. ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఆదివారం రాత్రంతా నిరసన కొనసాగించాలని, సోమవారం పార్లమెంట్ వరకు ర్యాలీ చేపట్టాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. నిర్ణిత సమయానికి ప్రజలను సమీకరించకముందే దాదాపు 20 వేల మంది జంతర్‌మంతర్, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నారని సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద ప్రధాన్ రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. రాజకీయ నాయకులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో వాంగ్చుక్ను కలిసి, విద్యా రంగంలో జవాబుదారీతనం పెంచే అంశాన్ని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తుతామని ఖచ్చితమైన హామీ ఇస్తేనే సోనమ్ సోమవారం దీక్ష విరమిస్తారని ఆయన భార్య గీతాంజలి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. -
అభిజిత్ దీప్కేకు రాజ్ ఠాక్రే వారసుడి మద్దతు
న్యూఢిల్లీ: విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరాహారదీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించడంపై పౌర సమాజం నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరదాలు అడ్డుపెట్టి ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పంతానికి పోకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వాంగ్‌చుక్ దీక్షను అడ్డుకున్నా ఉద్యమం ఆగబోదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. తాను నిరాహారదీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. సీజేపీ పోరాటానికి పలు పార్టీల నాయకులు మద్దతు తెలుపుతున్నారు.మహారాష్ట్ర నవనిర్మాణ సేన నాయకుడు అమిత్ ఠాక్రే శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ చేరుకుని సీజేపీ పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. నిరాహారదీక్ష చేపట్టిన అభిజిత్ దీప్కేను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోనమ్ వాంగ్‌చుక్ పట్ల పోలీసుల వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఇలాంటి అణచివేత చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని అన్నారు. విద్యార్థుల కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించడం సరైంది కాదని అన్నారు. ప్రజలంతా సీజేపీ పోరాటానికి మద్దతు తెలపాలని ఆయన కోరారు.ప్రభుత్వం బాధ్యత వహించదా?నీట్ అవకతవకలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. "నీట్ పరీక్షల్లో అవకతవకల కారణంగా దేశంలో 20 మందికి పైగా యువతీ యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ పరిస్థితికి ప్రభుత్వం బాధ్యత వహించదా? దేశంలో జవాబుదారీతనం లేదు. ఇలాంటి సమయంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాంట్లు వస్తున్నాయి. కచ్చితంగా ఆయన రాజీనామా చేయాల్సిందేనని అమిత్ ఠాక్రే అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుని సీజేపీతో చర్చలు జరపాలని సూచించారు.చదవండి: ఆమిర్‌ఖాన్‌కు ఆదిత్య ఠాక్రే కౌంటర్ రాజ్ ఠాక్రే వారసుడుమహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) వ్యవస్థాపకుడు రాజ్ ఠాక్రే కుమారుడే అమిత్ ఠాక్రే. ఎమ్మెన్నెస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. 2020లో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన 34 ఏళ్ల అమిత్ ఠాక్రే.. ఎమ్మెన్నెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2024 శాసనసభ ఎన్నికల్లో ముంబైలోని మహిం నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019లో మిథాలి బొరుడేను ఆయన వివాహం చేసుకున్నారు. తాజాగా సీజేపీ ఉద్యమానికి మద్దతు తెలిపి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. MNS leader @amitrthackeray met Abhijeet Dipke today to extend his support to the protest, conveying solidarity on behalf of MNS chief @RajThackeray He expressed deep anguish over the Delhi Police’s actions against Sonam Wangchuk Sir this morning. pic.twitter.com/Y6jWF1AuLq— Cockroach is Back (@Cockroachisback) July 18, 2026 -
జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. దీక్షకు దిగిన అభిజిత్ దీప్కే
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చౌక్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను పోలీసులు ఆస్పత్రికి తరలించిన ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్షకు దిగాడు. “మా ఉద్యమం ఆగదు.. పోరాటం కొనసాగుతుంది” అంటూ ఆయన ప్రకటించారు.నీట్ పరీక్షలో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ జూన్ 20వ తేదీ నుంచి నిరసనలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ పోరాటానికి మద్దతుగా సోనం వాంగ్‌చుక్ జంతర్ మంతర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శనివారం నాటికి 21వ రోజుకు చేరుకుంది.దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం ఆయనను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సూచనల మేరకే ఈ చర్య తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ చర్యపై CJP నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాంగ్‌చుక్ శాంతియుతంగా నిరసన చేస్తున్న సమయంలో పోలీసులు బలవంతంగా తరలించారని ఆరోపించారు.‘ఉద్యమం ఆగదు’.. దీక్షకు దిగిన అభిజిత్వాంగ్చుక్ తరలింపును వ్యతిరేకిస్తూ CJP చీఫ్ అభిజిత్ దీప్కే స్వయంగా నిరాహార దీక్ష ప్రారంభించాడు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకునే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘మా ఉద్యమం ఆగదు. ఈ పోరాటం కొనసాగుతుంది. ఎల్లుండి పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించి తీరతాం. మా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేదాకా ఇక్కడి నుంచి కదలం’’ అని అభిజిత్ దీప్కే ప్రకటించాడు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచాలని, నీట్ వివాదంపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన మరోసారి డిమాండ్ చేశాడు.పోలీసులపై ఆరోపణలుఇంతకుముందు కూడా అభిజిత్ దీప్కే పోలీసులపై ఆరోపణలు చేశారు. జంతర్ మంతర్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో తనపై పోలీసులు దాడి చేశారని, తనను కొట్టి అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. “నన్ను కొట్టారు.. సోనం సర్‌ను బలవంతంగా తీసుకెళ్లారు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ధ్రువీకరించలేదు.పోలీసుల వివరణమరోవైపు ఢిల్లీ పోలీసులు మాత్రం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఆస్పత్రికి తరలించామని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడమే తమ ఉద్దేశమని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం వాంగ్‌చుక్ ప్రస్తుతం స్పృహలో ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.జంతర్ మంతర్ వద్ద..వాంగ్‌చుక్ ఆస్పత్రికి తరలింపు అనంతరం నిరసనకారులను జంతర్ మంతర్ నుంచి ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. దీంతో కొంతసేపు అక్కడ వాగ్వాదం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.నీట్ పరీక్షలో అవకతవకలు, పరీక్షల నిర్వహణలో లోపాలపై న్యాయ విచారణ జరపాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని CJP డిమాండ్ చేస్తోంది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. సోనం వాంగ్‌చుక్ దీక్ష, పోలీసుల చర్య, అభిజిత్ దీప్కే తాజా నిరసనతో జంతర్ మంతర్ పరిణామాలు మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. -
నన్ను కొట్టారు.. సోనం సర్‌ను ఈడ్చుకెళ్లారు!
సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం అయిన వేళ.. జంతర్ మంతర్ వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు ఆయనను శనివారం ఉదయం ఆస్పత్రికి తరలించారు. ఈ పరిణామంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బలవంతంగా వాంగ్చుక్ను తరలించారని ఆరోపించారు.సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. తనపై పోలీసులు దాడి చేశారని, తనను కొట్టి అదుపులోకి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. జంతర్ మంతర్ నిరసన ప్రదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇది జరిగిందని చెప్పారు. ‘‘నన్ను కొట్టి అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్‌లో పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ప్రజలను కొడుతున్నారు. సోనం సర్‌ను బలవంతంగా ఈడ్చుకెళ్లారు’’ అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. అయితే పోలీసులపై చేసిన ఈ ఆరోపణలను అధికారులు ధ్రువీకరించలేదు.21వ రోజు దీక్ష.. ఆస్పత్రికి వాంగ్చుక్నీట్ పరీక్షలో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ.. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్‌చుక్ జంతర్ మంతర్‌లో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనతో పాటు పలువురు విద్యార్థులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు.దీక్ష 21వ రోజుకు చేరుకోవడంతో వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆయనను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన స్పృహలో ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.కోర్టు ఆదేశాల మేరకే చర్యలు: పోలీసులువాంగ్చుక్ ఆరోగ్యం విషమిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ప్రతిరోజూ వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వైద్య సహాయం అందించాలని.. మరీ అవసరమైతే బలవంతంగా ఆహారం అందించాలని అధికారులను ఆదేశించింది.#BREAKING: The Delhi Police has stopped Abhijeet Dipke where he was staying. People are telling me that Sonam Wangchuk is being picked up from the protest site. Students are being lathicharged! pic.twitter.com/kkKtSI83hO— Saurav Das (@SauravDassss) July 18, 2026హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సలహా మేరకే వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా నిరసనకారులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడిందని, అయితే పోలీసులు సంయమనం పాటించారని న్యూఢిల్లీ డీసీపీ కార్యాలయం వెల్లడించింది.అభిజిత్ దీప్కే అదుపులో.. CJP ఆగ్రహంసీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు. అయితే తమ నేతను అక్రమంగా అడ్డుకున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపించారు. వాంగ్‌చుక్ చేస్తున్న నిరసనను అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, శాంతియుత ఆందోళనకు ఆటంకాలు కల్పిస్తున్నారని పార్టీ నేతలు ఆరోపించారు.ఇంతకు ముందు దాడి!ఇదే సమయంలో జంతర్ మంతర్ వద్ద వాంగ్చుక్పై గతంలో కొందరు వ్యక్తులు దాడికి ప్రయత్నించారని కూడా అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఒక వస్తువు విసిరినా ఆయనకు ఎలాంటి గాయం కాలేదని తెలిపారు. నిరసనను భగ్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.జంతర్ మంతర్ వద్ద టెన్షన్వాంగ్చుక్ ఆస్పత్రికి తరలింపు అనంతరం.. నిరసనకారులను అక్కడి నుంచి ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. అందుకు వాళ్లు నిరాకరించడంతో.. తీవ్ర వాగ్వాదం నడుమ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నాం లోపు ఖాళీ చేయాలని పోలీసులు నిరసనకారులకు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. -
ఉపేక్షించడం సరికాదు!
సమస్యలనూ, సంక్షోభాలనూ ఉపేక్షిస్తేనో, నిర్లక్ష్యం చేస్తేనో ముగిసిపోవు. మాయంకావు. వాటిని పట్టించుకుని, పరిష్కరించటానికి ప్రయత్నించటం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఉండాల్సిన బాధ్యత. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గత నెల 6న మొదలుకొని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో విద్యారంగ సమస్యలపై ఆందోళన చేస్తోంది. గత 19 రోజులుగా విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్నదనీ, మరో రెండురోజులు దీక్ష కొనసాగితే ఆయన ప్రాణానికి ముప్పువాటిల్లే ప్రమాదం ఉన్నదనీ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం వాంగ్చుక్ను ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయిస్తూ, ఆ నివేదికల్నిబట్టి వైద్యపరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని గురువారం కేంద్రానికి సూచించింది. ఉద్యమకారులు ఒక్కరోజు నిరసనకు అనుమతి తీసుకుని అక్కడినుంచి కదలక పోవటం ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే అంశమే. అలాగని ఆ నిరసనపై పాలకులు కన్నెర్ర చేయలేదు. ఈ సంయమనాన్ని మెచ్చుకోవాల్సిందే. బహుశా సామాజిక మాధ్యమాల్లో సీజేపీ స్వల్పకాలంలోనే అనూహ్యంగా రెండుకోట్ల మందికిమించి మద్దతును సాధించటం ఇందుకొక కారణం కావొచ్చు. సరిగ్గా ఈ కారణంతోనే సీజేపీ దీర్ఘకాలిక ఆందోళనకు సిద్ధపడింది. అయితే నిరశనలతో వచ్చే సమస్యేమంటే... ఒక స్థాయికెళ్లాక జరగరానిది జరిగితే ఉద్యమం కాస్తా చేయిదాటే ప్రమాదం ఏర్పడుతుంది. ‘జాతీయ మీడియా’ ఈ ఉద్యమానికి ప్రాధాన్యం ఇవ్వనంతమాత్రాన ఇలాంటివి జరగబోవని చెప్పలేం. అందువల్లే ప్రతిష్ఠకు పోకుండా ప్రభుత్వం చర్చకు ఆహ్వానిస్తే పరిష్కారం సంగతి తర్వాత... ముందు తమ స్వరాన్ని విన్నారన్న సంకేతం వెళ్తుంది. మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసినప్పుడు ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదనీ, మారిన పరిస్థితుల్లో ఏ సమస్యనైనా ప్రజాస్వామ్య పరిధిలో శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చనీ నక్సలైట్లకు అనేకులు హితవు పలికారు. ఇప్పుడు సీజేపీ ఉద్యమాన్ని ఉపేక్షించటంవల్ల వారిలో ఏ కొందరైనా తమ అభిప్రాయం తప్పన్న భావన కొచ్చే అవకాశం ఉండదా? ఉద్యమాలు వెల్లడించే సమస్యల తీవ్రతను గ్రహించటం పాలకులు చేయాల్సిన పని. ఇటు ఉద్యమకారులు కూడా ప్రభుత్వానికీ, ప్రజలకూ సమస్య తీవ్రతను చాటడం, వాటిని పరిష్కరించమని కోరడం తప్ప అందుకోసం తీవ్ర చర్యలకు పాల్పడటం సరికాదని గుర్తించాల్సివుంది. నెలన్నర నుంచి సాగుతున్న ఈ ఉద్యమంలో కొందరికి ఇప్పటికే ఈ అవగాహన ఏర్పడి ఉండొచ్చు. తనను నిరాహారదీక్ష విరమించుకోమంటున్నవారి కోసం వాంగ్‌చుక్ విడుదల చేసిన సందేశంలో ఒకచోట... ‘నేను దీక్ష విరమిస్తే ప్రభుత్వాలకు జవాబుదారీతనం అవసరం లేదన్న అభిప్రాయం కలగదా?’ అని ప్రశ్నించారు. జరిగిందేమిటో, విరమణ ఎందుకవసరమైందో ప్రజలు గ్రహించలేరనుకోవటం సరికాదు.ఢిల్లీ హైకోర్టు చెప్పినట్టు ఏ పౌరుడి ప్రాణమైనా విలువైనదే. కానీ వాంగ్‌చుక్ లాంటి అంకితభావంగల సామాజిక ఉద్యమకారులూ, భిన్నంగా ఆలోచించి సృజనాత్మక ఆవిష్కరణలు చేయగలిగినవారూ ఈ దేశానికి చాలా అవసరం. లద్దాఖ్ వంటి కఠినమైన భౌగోళిక పరిస్థితులున్న ప్రాంతానికి అనువైన వైవిధ్యభరిత ఆవిష్కరణలు చేసి ఆయన అంతర్జాతీయంగా ప్రశంసలు పొందారు. శీతాకాలంలో నీరు వృథా పోతూ, సాగు కాలంలో నీటి ఎద్దడివుండే ఆ ప్రాంతంలో ఆ సమస్యకు తన మేధస్సుతో శాశ్వత పరిష్కారం చూపారు. సౌరశక్తి ఆధారిత మట్టి ఇళ్ల ఆలోచన కూడా ఆయనదే. సరిహద్దుల్లో గడ్డకట్టే చలిలో విధులు నిర్వహించే జవాన్లకోసం రూపొందించిన సౌరశక్తి టెంట్లు అపూర్వం. తన తండ్రి, జమ్మూ–కశ్మీర్ మాజీ మంత్రి అయిన సోనమ్ వాంగ్యాల్ ఒరవడిలో ఆయన ఉద్యమిస్తున్నారు. లద్దాఖ్‌కు రాష్ట్రప్రతిపత్తి, దాన్ని ఆరో షెడ్యూల్లో చేర్చి రాజకీయ రక్షణ కల్పించడంవంటి డిమాండ్లతో ఈ మూడేళ్లలో పలుమార్లు ఆయన నిరశనలు చేశారు. శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం అదే రీతిలో ముగియాలని, పట్టుదలకు పోకుండా చర్చలకు ఉపక్రమించాలని అనేకమంది కోరుకుంటున్నారు. అటు సోనమ్ వాంగ్‌చుక్, ఇటు ప్రభుత్వం వినాలి. -
‘కాక్రోచ్’ ఉద్యమానికి ప్రకాశ్ రాజ్ మద్దతు
న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, పరీక్ష వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసన శనివారం 22వ రోజుకు చేరుకుంది. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ జంతర్ మంతర్ వద్దకు చేరుకొని నిరసన కారులకు సంఘీభావం తెలిపారు. అలాగే ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన అమరణ నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది. తాను ఆధునిక గాంధీనో లేదా హీరోనో కాదని.. కేవలం ఒక సాధారణ పౌరుడిని మాత్రమేనని వాంగ్‌చుక్ ఈ సందర్భంగా అన్నారు. కేరళ మాజీ మంత్రి థామస్ ఐజాక్, త్రిపుర ప్రతిపక్ష నాయకుడు జితేంద్ర చౌదరి కూడా జంతర్‌మంతర్ దీక్షా శిబిరాన్ని సందర్శించారు. నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. ప్రకాశ్ రాజ్, ఐజాక్, జితేంద్ర చౌదరి నిరసనకారులతో మాట్లాడారు. పరీక్షల్లో పదే పదే జరుగుతున్న అవకతవకలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శకమైన, నిష్పక్షపాత మైన, విశ్వసనీయమైన పరీక్షా విధానం కోసం చేపట్టిన ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామ ని ప్రకటించారు. వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపుతున్నామని వెల్లడించారు. సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేశారు. నిద్రించినప్పుడు రక్తపోటు 109/72 ఎంఎం హెచ్‌జీ గాను, కూర్చున్నప్పుడు 106/74 ఎంఎం హెచ్‌జీ గాను నమోదైంది. హృదయ స్పందన నిమిషానికి 81 సార్లు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి 78 ఎంజీ/డీఎల్ గాను రికార్డయ్యింది. ఆయన బరువు 58.45 కిలోలకు చేరుకుంది. నిరాహార దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 7.5 కిలోల బరువు తగ్గారు. వాంగ్‌చుక్ శరీరంలో నీటి శాతం బాగానే ఉందని, మానసికంగా చురుకుగా ఉన్నారని బులెటిన్‌లో పేర్కొన్నారు. జీవితానికి మీరే హీరో కావాలి దీక్ష కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు వాంగ్‌చుక్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంత బలహీనంగా ఉన్నానని చెప్పారు. అయినప్పటికీ తన సంకల్పంలో మార్పు రాలేదన్నారు. సోషల్ మీడియాలో ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. చాలామంది తనను 21వ శతాబ్దపు గాంధీ లేదా ఆధునిక గాంధీ అని పిలుస్తున్నారని, మరికొందరు తనను హీరో అంటున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు తనకు ఇబ్బంది కలిగిస్తున్నాయని వెల్లడించారు. తాను గాంధీని కాదు, హీరోని కూడా కాదని వివరణ ఇచ్చారు. బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయత్నించే ఒక సాధారణ పౌరుడిని మాత్రమేనని స్పష్టంచేశారు. ఇతరుల్లో హీరోల కోసం వెతకడం మానేసి, పౌరులుగా బాధ్యత తీసుకోవాలని ప్రజలను కోరారు. ‘‘జీవితానికి మీరే హీరో అవ్వండి. పౌరులుగా మీ బాధ్యతలను నెరవేర్చండి’’అని పిలుపునిచ్చారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని ప్రజలకు సూచించారు. ‘‘మీరు ప్రతిరోజూ ఇక్కడికి రాలేకపోతే, కనీసం ఒక్క రోజైనా జంతర్ మంతర్ వద్ద మాతో చేరండి. మీరు ఢిల్లీకి రాలేకపోతే, ఎక్కడ ఉన్నా ఉపవాసం పాటించి మీ సందేశాన్ని పంచుకోండి’’అని వాంగ్‌చుక్ కోరారు. నిరసనకారులు లేవనెత్తిన సమస్యలను ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించేలా ఒత్తిడి పెంచడానికి జూలై 20న పార్లమెంటు వరకు ప్రతిపాదించిన యాత్రలో ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. -
విషమంగా వాంగ్‌చుక్ ఆరోగ్యం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో వారం రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం విషమిస్తోంది. ఆయన ఐదు కిలోల మేర బరువు తగ్గారని, ఆరోగ్యం క్షీణిస్తోందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)శనివారం ఆదోళన వెలిబుచ్చింది. పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్‌తో సీజేపీ నిరసనలు చేపట్టిన విషయం తెల్సిందే. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం ఎక్స్‌లో..‘దీక్ష కారణంగా సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం రోజురోజుకీ విషమిస్తోంది. ప్రధాని మోదీ ఇప్పటి వరకు మంత్రి ప్రధాన్‌ను తొలగించలేదు. ఇంకా ఎంత సమయం తీసుకుంటారు?’అని ప్రశ్నించారు. కనీసం 20 మంది విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్న తర్వాత కూడా ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రిగా ఎందుకు కొనసాగిస్తున్నారని నిలదీశారు. వాంగ్చుక్కు జరగరానిదేమైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని దీప్కే హెచ్చరించారు.ఆరోగ్యం విషమించినా సరే, ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకునేదాకా దీక్ష విరమించేది లేదని సోనమ్ గట్టిగా చెబుతున్నారని దీప్కే మరో పోస్టులో తెలిపారు. ‘ఎగ్జామ్ పేపర్’అని రాసి ఉన్న కాగితాలను ఓ వ్యక్తి తినేందుకు ప్రయత్నిస్తుండగా రెండు కాక్రోచ్లు అడ్డుకుంటున్నట్లుగా ఉన్న వ్యంగ్యాత్మక కార్టూన్, గో బ్యాక్ ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యాఖ్యతో ఆయన షేర్ చేశారు. కాగా, తమ ప్రాంత అభివృద్ధికి చేస్తున్న డిమాండ్లపై కేంద్రం, లద్దాఖ్ ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతిని సోనమ్ వాంగ్‌చుక్ శుక్రవారం రాత్రి ఎక్స్‌లో స్వాగతించారు.అదేవిధంగా, విద్యా శాఖ జవాబుదారీతనం విషయంలోనూ ప్రభుత్వం స్పందించాలని కోరారు. జంతర్మంతర్లోనే మరో వేదికపై ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ)కు చెందిన ఆరుగురు నేతలు చేపట్టిన నిరాహార దీక్ష కూడా వారం రోజులు పూర్తి చేసుకుంది. దీక్షలో కూర్చున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం సంయుక్త కార్యదర్శి దానిష్ అలీ తీవ్ర అస్వస్థతగకు గురవడంతో శనివారం సాయంత్రం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరి్పంచారు. ఆమె బ్లడ్ సుగర్ స్థాయిలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని విద్యార్థి నేతలు తెలిపారు. మిగతా ఐదుగురు నిరశన కొనసాగిస్తున్నారన్నారు.నీట్, తదితర పరీక్షల్లో అకవతవకలపై జూన్ 20వ తేదీ నుంచి, 15 రోజులుగా జంతర్‌మంతర్‌లో నిరసనలు కొనసాగిస్తుండటం తెల్సిందే. మమ్మల్ని నిజంగానే కాక్రోచ్లుగానే భావిస్తున్నారా? ప్రధాని మోదీకి సీజేపీ లేఖ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జంతర్‌మంతర్ వద్ద 15 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నా ప్రధాని మోదీ స్పందించకపోవడంపై సీజేపీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇదే వేదికపై వారం రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని సీజేపీ పేర్కొంది. ఇకనైనా మౌనం వీడాలని ప్రధాని మోదీని కోరింది.‘ఇది మానవత్వానికి సంబంధించిన ప్రశ్న: జంతర్ మంతర్ నిరసనలను మీరు ఇంకెన్నాళ్లు విస్మరిస్తారు?’పేరుతో రాసిన రెండు పేజీల లేఖను శనివారం సీజేపీ విడుదల చేసింది. లేఖపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, మరో ఏడుగురు ప్రతినిధుల సంతకాలున్నాయి. ’మీ మౌనం మమ్మల్ని ఒక ప్రశ్న అడిగేలా చేస్తోంది..మేమంతా కేవలం బొద్దింకలం(కాక్రోచ్) మాత్రమేనని మీరు నిజంగానే భావిస్తున్నారా?’ అని ప్రశ్నించింది. ’ప్రధానిగా మీరు సీజేపీ నిరాహార దీక్షపై స్పందించడం లేదు.మీ మౌనం ఈ దేశ యువతను పట్టించుకోవాల్సిన అవసరం లేని కేవలం పురుగులుగా భావిస్తున్నారనేందుకు పరోక్ష అంగీకారం’అని వ్యాఖ్యానించింది. ‘పాలకులపై నైతికపరమైన ఒత్తిడిని తీసుకు వచ్చేందుకు ఉద్దేశించిందే నిరాహార దీక్ష. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన సోనమ్ వాంగ్‌చుక్ వంటి వ్యక్తి ఆహారం తీసుకోవడానికి నిరాకరించడంపై ప్రభుత్వం నుంచి నైతిక, రాజకీయ పరమైన స్పందన వస్తుందని ఆశించడం సహజం. అయినప్పటికీ, మీరు ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు’అని సీజేపీ ఆ లేఖలో పేర్కొంది.కోట్లాది మంది యువత నమ్మకాన్ని, భవిష్యత్తును ఛిన్నాభిన్నం చేసిన పరీక్షా పత్రాల లీకేజీలను అరికట్టడంలో ప్రభుత్వం పదేపదే విఫలమైనందుకే దీక్ష చేపట్టినట్లు వివరించింది. జూన్ 20న నిరసన ప్రారంభం కావడానికి ముందు 11గా ఉన్న విద్యార్థుల ఆత్మహత్యలు ఇప్పుడు 29కి చేరాయని సీజేపీ తెలిపింది. ’ఏ ప్రభుత్వమూ ప్రశ్నించడానికి అతీతం కాదు. ఏ మంత్రి కూడా బాధ్యత నుంచి తప్పించుకోలేరు. సమాధానాలు డిమాండ్ చేస్తున్న పౌరుల గొంతును ఏ యంత్రాంగమూ నొక్కేయలేదు’ అని ఆ లేఖలో స్పష్టం చేసింది. -
టీ దుకాణం పెట్టుకోవడమూ నేరమేనా?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 10 రోజులుగా నిరసన సాగిస్తున్న తమకు పోలీసులు కనీస సౌకర్యాలను కూడా అందనివ్వడం లేదని ఆరోపించారు. తమకు టీ అందజేస్తున్న అనికేత్ పటేల్ అనే వ్యక్తిని సైతం ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారన్నారు. నిరసనకారులకు ఆహారం, దుస్తులు తీసుకువచ్చే వారినీ వదిలిపెట్టడం లేదని దీప్కే చెప్పారు. అనికేత్ పటేల్ ఆహ్వానం మేరకు అతడి టీ దుకాణం వద్దకు, అతడి ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. టీ దుకాణం పెట్టుకోవడమూ నేరమేనా అంటూ పోలీసులను ప్రశ్నించారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిరసన వేదిక వద్ద బందోబస్తు విధుల్లో ఉండే పోలీసులకు తాను గులాబీలు, టీ అందజేస్తానన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యతలను నిర్వర్తించాలని వారిని కోరుతానని చెప్పారు. ఇదే వేదికపై నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్‌చుక్ కోసం పోర్టబుల్ టాయిలెట్ సౌకర్యం కల్పించాలని ఆదివారం రాత్రి నిరసన చేపట్టినట్లు వెల్లడించారు. జంతర్ మంతర్‌లోని పబ్లిక్ టాయిలెట్లకు నీటి సౌకర్యం లేదని చెప్పారు. పరీక్షపత్రాల లీకేజీలకు కేంద్రమే బాధ్యత వహించాలనే డిమాండ్‌తో ఆదివారం పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించడం తెల్సిందే. సీజేపీ నేతృత్వంలో ఇదే డిమాండ్‌తో జూన్ 20వ తేదీన దీప్కే సారథ్యంలో ఆందోళనలు మొదలయ్యాయి. ప్రజాస్వామ్య ఉద్యమానికి మచ్చు తునక ఈ సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్ మాట్లాడుతూ..జంతర్‌మంతర్‌లో విద్యార్థులు, వలంటీర్లు శాంతియుతంగా కొనసాగిస్తున్న నిరసన ప్రజాస్వామ్య తరహా ఉద్యమానికి ఓ ఉదాహరణ అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో తమ వంతుగా భాగస్వాములయ్యారని చెప్పారు. పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్న వలంటీర్లు, సహకరిస్తున్న పోలీసులకు వాంగ్‌చుక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో దేశ వ్యతిరేక అంశమేదీ లేదని చెప్పారు. వీరంతా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మాత్రమే కోరుతున్నారని వివరించారు. ‘మీరు ఇలాగే మొండిగా వ్యవహరిస్తూ పోతే నష్టపోయేదీ మీరే. ప్రజలకు మీపై నమ్మకం పోతుంది. ఆ తర్వాత వారు మిమ్మల్ని తిరస్కరిస్తారు. ప్రజల బాధను మీరు అర్థం చేసుకున్నప్పుడే మిమ్మల్ని అంగీకరిస్తారు’అంటూ వాంగ్‌చుక్ వ్యాఖ్యానించారు. నీక్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ)కి చెందిన ఆరుగురు విద్యార్థి నేతలు ఇక్కడే మరో వేదికపై ఆదివారం నుంచి నిరాహార దీక్ష ప్రారంభించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, బృందా కారత్, సీపీఐ నేత డి.రాజా నిరసన చేపట్టిన విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. -
డైపర్ల విరాళాల ఉద్యమం చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ
న్యూఢిల్లీ: ‘నీట్’ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజధానిలో తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలు మంగళవారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, పేపర్ లీకేజీలపై తమ నిరసనను మరింత ఉధృతం చేసేందుకు ఆందోళనకారులు ‘డైపర్ ఏ డే కీప్స్ లీక్స్ అవే’ (రోజుకో డైపర్ లీకేజీలను అడ్డుకుంటుంది) అనే నినాదంతో ఒక వినూత్నమైన ‘డైపర్ల విరాళాల ఉద్యమాన్ని’ ప్రారంభించారు. జంతర్ మంతర్ వద్దకు వచ్చే వారు ఒక డైపర్‌ను తీసుకొచ్చి, దానిపై మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌ను రాసి ఇవ్వాలని, వాటిని విద్యాశాఖ మంత్రికి అందజేస్తామని నిరసనకారులు ప్రకటించారు.ఉధృతమవుతున్న ఆందోళనలు గత శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ధర్నా కార్యక్రమం రేయింబవళ్లు కొనసాగుతోంది. భారీగా పోలీసులు మోహరించినప్పటికీ, విద్యార్థులు, మద్దతుదారులు రాత్రి వేళల్లో కూడా నిరసన స్థలంలోనే బస చేస్తున్నారు. సోమవారం రాత్రి, నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల స్మారకార్థం జంతర్ మంతర్ వద్ద కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. తొలుత పోలీసులు ఈ కొవ్వొత్తుల ప్రదర్శనకు అనుమతించలేదని, ఆ తర్వాత అనుమతి లభించిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటం ఆగేది లేదని నిరసనకారులు స్పష్టం చేశారు.పరీక్షా కేంద్రాలకు కొన్ని నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను రీ-టెస్ట్ రాయడానికి అనుమతించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించారని, కానీ ఇంత పెద్ద పేపర్ లీకేజీకి కారణమైన వారిపై మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అభిజీత్ దిప్కే తీవ్రంగా విమర్శించారు. తప్పు చేసిన వారిని వదిలేసి, అమాయక విద్యార్థులను అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం జరిగిన రీ-టెస్ట్‌కు హాజరైన పలువురు నీట్ అభ్యర్థులు కూడా ఈ నిరసనల్లో పాల్గొని తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వచ్చి విద్యార్థుల బాధలను ఆలకించాలని వారు విజ్ఞప్తి చేశారు.తనిఖీల వివాదం – పోలీసుల వివరణఈ నిరసనల్లో ఎస్ఎఫ్ఐ, ఐసా, ఏఐఎస్ఎఫ్ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా పాల్గొన్నాయి. విద్యార్థుల కోసం నిరసన స్థలంలోనే ఒక ఉచిత గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాగా, ధర్నాలో పాల్గొనకుండా విద్యార్థులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు వారి ఆధార్ కార్డులను, చిరునామా వివరాలను సేకరిస్తున్నారని అభిజీత్ దిప్కే ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు పూర్తిగా ఖండించారు. తాము జంతర్ మంతర్ వద్ద ఎలాంటి ఆధార్ తనిఖీలు చేపట్టలేదని, అటువంటి వివరాలేవీ సేకరించలేదని, ఆ ఆరోపణలన్నీ వాస్తవ విరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. -
కాక్రోచ్ పార్టీ సంచలన ఆరోపణలు!
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, అవకతవకల నడుమ మరోసారి పరీక్షను నిర్వహించారు. అయితే దీనిపై కూడా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు కేంద్రం తీరును ఖండిస్తూ.. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇప్పుడు సంచలన ఆరోపణలకు దిగింది.. నీట్-యూజీ పేపర్ లీక్ వివాదంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు, సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం పొందిన అభిజిత్ దీప్కే.. నిరసనకారుల పట్ల అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జంతర్‌మంతర్‌లోని మరుగుదొడ్లకు వరుసగా రెండో రోజూ నీటి సరఫరా నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. నిరసనలకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆయన సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.అంతేకాకుండా నిరసనకారులకు నీళ్లు, అరటిపండ్లు పంపిణీ చేస్తున్న వారి ఆధార్ కార్డు వివరాలు, చిరునామాలు సేకరిస్తున్నారని ఢిల్లీ పోలీసులపై ఆరోపణలు చేశారు. ప్రజలకు సహాయం చేస్తున్న వారిని సైతం అనుమానాస్పదంగా చూడటం సరైంది కాదని అభిజిత్ పేర్కొన్నారు.జంతర్‌మంతర్‌లో నిరసనకారుల కోసం స్వచ్ఛంద సంస్థలు, మద్దతుదారులు లంగర్ ఏర్పాటు చేసి ఆహారం, లస్సీ పంపిణీ చేస్తున్నారు. అనేక మంది రాత్రంతా అక్కడే బస చేస్తుండటంతో చెప్పులు, సామాన్లు, పాత్రలు అక్కడే కనిపిస్తున్నాయి. పోలీసులు అనుమతి గడువు ముగిసిందని తెలిపినా.. ప్రత్యామ్నాయ వేదిక కేటాయించే వరకు తాము నిరసన కొనసాగిస్తామని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు.నీట్-యూజీ లీక్ వ్యవహారంలో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ ఉద్యమానికి తాజాగా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి.మరోవైపు మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త జ్ఞానేశ్వర్ రఘునాథ్ థోరట్ఈ నిరసనల్లో చేరడం హైలైట్ అయ్యింది. “విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతారు. కానీ కొందరి లాభం కోసం పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే అది లక్షలాది కుటుంబాలకు అన్యాయం చేసినట్టే” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నీట్-యూజీ పేపర్ లీక్ వివాదం ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు రీ టెస్ట్‌ను కూడా ఎన్టీఏ సరిగ్గా నిర్వహించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు జంతర్‌మంతర్ వేదికగా కొనసాగుతున్న నిరసనలు, కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణలు మరోసారి ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చాయి. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ బాధ్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ ఉద్యమం ఇంకా ఎంత దూరం వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
ఢిల్లీలో సీజేపీ నిరసనలు..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ధర్నాకి దిగింది. విద్యా వ్యవస్థలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహించాలని, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరసనల్లో పాల్గొంటూ, కేంద్ర విద్యాశాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నీట్ పరీక్ష పేపర్ లీక్, సీబీఎస్సీ మూల్యాంకన వివాదాలు, నియామక పరీక్షల్లో అవకతవకలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీజేపీ నిరసనల సందర్భంగా భారీ ఎత్తున నిరుద్యోగులు అక్కడికి చేరుకున్నారు. 20 जून को कॉकरोचो के सरदार ने जंतर मंतर के रंगारंग कार्यक्रम के लिए चम्मच और थाली लाने के लिए कहा है ताकि आते जाते राहगीर अपने घर का बासी खाना इनके थाली में डाल जाए और यह चम्मच चाट कर खाएं pic.twitter.com/GFTHnG1xVo— Kikki Singh (@singh_kikki) June 19, 2026ఇదిలా ఉండగా.. ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందిన కాక్రోచ్ జనతా పార్టీ, యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతీకగా మారింది. జూన్ 6న ఢిల్లీలో నిర్వహించిన తొలి భారీ నిరసనకు వందలాది మంది విద్యార్థులు, యువత హాజరయ్యారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. సీజేపీ నాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసి, పరీక్షల అవకతవకల కారణంగా నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న విద్య, ఉద్యోగ సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకున్న సీజేపీ ఉద్యమం రాబోయే రోజుల్లో మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
NEET రూ. కోటి ఇవ్వండి : ప్రధానికి సీజేపీ అభిజీత్ బహిరంగ లేఖ
నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆత్మహత్యలకు పాల్పడిన నీట్ బాధితుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నీట్ అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్‌తో శాంతియుత ఉద్యమాన్ని సాగిస్తున్న అభిజీత్ తన తాజా డిమాండ్‌తో ఒక లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నీట్ (NEET) 2026 పరీక్షా పేపర్ లీక్ వివాదం, పరీక్ష రద్దు మరియు రీ-టెస్ట్ నిర్ణయాల వల్ల కలిగిన తీవ్ర మానసిక ఒత్తిడి, నిరాశ కారణంగా దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఈ నేపథ్యంలో గత కొన్ని వారాలుగా 11 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, అందులో ఐదు మరణాలు గత 48 గంటల్లోనే సంభవించాయని దీప్కే లేఖలో పేర్కొన్నారు. వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీ సంఘటనలు, రీ-టెస్ట్ ఒత్తిడికి తట్టుకోలేక తీవ్ర మనస్తాపంతో ఉసురు తీసుకుంటున్నవిద్యార్థల కుటుంబాలలో తీవ్ర మానసిక ఆందోళనను రేకెత్తిస్తోందని వాదించారు. ఈ ఒత్తిడి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఘోరమైన ధోరణి తగ్గకపోగా, మరింత తీవ్రమవుతోంది. గత రెండు నెలల్లో, ఆత్మహత్యలకు పాల్పడిన పలువురు విద్యార్థుల శోకతప్త కుటుంబాలను తాను వ్యక్తిగతంగా కలుసుకున్నానంటూ అభిజీత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్యాపరమైన నిరాశ కారణంగా ఇకపై ఏ యువ విద్యార్థి బలికాకుండా ఉండేందుకు అవసరమైన నిర్మాణాత్మక సంస్కరణలను తీసుకు రావాలని ప్రధానికి సూచించారు.ఇదీ చదవండి: షాకింగ్ : కట్టేసి, జుట్టు కత్తిరించి, పైశాచికంగా.. వీడియో వైరల్పిల్లలను కోల్పోయిన భరించలేని మానసిక వేదనతో పాటు, ఈ కుటుంబాలు ఇప్పుడు ఆర్థికంగా కూడా భారీగా నష్టపోయాయని పేర్కొన్నారు. పిల్లల మంచి భవిష్యత్తు కోసం చాలా కుటుంబాలు పెద్ద మొత్తంలో విద్యా రుణాలు తీసుకున్నాయని, అయితే విద్యావ్యవస్థలోని లోపాలతో వారి ఆశలు ఆడియాలయ్యాయని చెప్పారు.ఇదీ చదవండి: అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లుOpen Letter to PM:We urge PM @narendramodi to provide ₹1 crore in compensation to the families of students who died by suicide due to the paper leak crisis. pic.twitter.com/p6gOuNRvsT— Abhijeet Dipke (@abhijeet_dipke) June 19, 2026అభిజీత్ దీప్కే డిమాండ్స్తమ జీవితకాల పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి, విద్యా రుణాలు తీసుకున్న బాధిత కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించాలి.పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుని జవాబుదారీలను చేయాలి.విద్యావ్యవస్థలో జరుగుతున్న వరుస లోపాలు, పేపర్ లీకేజీల వల్ల ప్రజల్లో నమ్మకం పోయిందని పేర్కొంటూ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. జంతర్ మంతర్ వద్ద జూన్ 21 నిరసనమరో వైపు తమ డిమాండ్లను నెరవేర్చాలని , పోటీ పరీక్షలపై మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించేలా సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ ఇప్పటికే ఢిల్లీలోని జంతర్‌మంతర్ సహా, దేశంలో అనేక ప్రధాన నగరాల్లో ఉద్యమాన్ని చేపట్టింది సీజేపీ ఆధ్వర్యంలో మరింత ఒత్తిడి తెచ్చేందుకు జూన్ 20 నుండి దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గుమిగూడనున్నట్లు దీప్కే ప్రకటించారు. కాగా, నీట్ యూజీ (NEET UG 2026) రీ-ఎగ్జామినేషన్ జూన్ 21న దేశవ్యాప్తంగా కేటాయించిన పరీక్షా కేంద్రాలలో జరగాల్సి ఉంది.ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీ -
పవన్ కామెంట్స్ పై GEN-Z ఫైర్
-
Cockroach Party: 'కాక్రోచ్' అభిజీత్‌పై దాడి చెంపపై కొట్టిన యువకుడు
-
మేం ఎన్నికల్లో పోటీ చేయం
నాగ్‌పూర్: ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తమకు లేదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో మంగళవారం నాగ్‌పూర్‌లో తలపెట్టిన నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన దీప్కే మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి నిలబెడతారా అని ప్రశ్నించగా, ‘మేం ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి. నా ఉద్దేశం ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం ఎన్నికల్లో పోటీకి దిగడం సబబా?’అని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీతో తీవ్ర ఆందోళనకు గురైన విద్యార్థులను ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా బలవన్మరణాలకు పాల్పడిన ఐదారుగురు విద్యార్థుల తల్లిదండ్రులకు ముందుగా ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని దీప్కే డిమాండ్ చేశారు. ‘మోదీజీ ప్రపంచంలోనే ఏం జరిగినా ట్వీట్లు చేస్తుంటారు. కానీ, ఇక్కడ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మాత్రం పట్టించుకోరు. కనీసం సంతాప సందేశం కూడా ట్వీట్ చేయరు. మన్‌కీ బాత్, పరీక్షా పే చర్చ ఇంకా ఎన్ని రోజులు..? కనీసం విద్యార్థుల మన్‌కీబాత్ వినిపించుకోండి’అంటూ దీప్కే తీవ్రంగా స్పందించారు. సోమవారం జైపూర్‌లో నిరసన సందర్భంగా తనపై జరిగిన దాడిపై దీప్కే స్పందిస్తూ.. ‘ఈ ఘటన వెనుక ఆర్ఎస్ఎస్ నేతల హస్తముందని’ దిప్కే పేర్కొన్నారు. -
కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేపై దాడి
-
ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు)
-
హైదరాబాద్ లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. భారీగా పోటెత్తిన Gen-z
-
లీక్ అయితే పరీక్షార్థికి పరిహారం
పుణె: ప్రతిష్టాత్మక నీట్ యూజీ ప్రశ్నపత్రాల లీకేజీలు, సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్‌లో వైఫల్యాలు, క్యూట్ పరీక్ష నిర్వహణలో అసమర్థత వంటి పలు దారుణోదంతాలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గురువారం దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. తొలి దఫాలో పుణెలో తొలి నిరసన కార్యక్రమాన్ని గురువారం మొదలెట్టింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సారథ్యంలో పుణెలోని సావిత్రీభాయ్ ఫూలే పుణె విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు, పార్టీ అభిమానులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీజేపీ తమ ‘పరీక్షల మేనిఫెస్టో’ను విడుదలచేసింది. మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయకపోతే జూన్ 20వ తేదీన పుణె విద్యార్థులంతా ఢిల్లీకొచ్చి ఉద్యమిస్తారని దీప్కే స్పష్టంచేశారు. హిందూ–ముస్లిం విభజన అంశాలపై రాజకీయాలు నడుస్తున్నాయి. వీటి నుంచి దృష్టి మరలిస్తేనే స్తంభించిన దేశ ప్రగతి రథాలు ముందుకు కదులుతాయని దీప్కే అన్నారు. ‘‘హిందూ–ముస్లిం విభజన రాజకీయాలతో యువత విసిగెత్తిపోయారనేందుకు మా కాక్రోచ్ నిదర్శనం. ఇలాంటి రాజకీయాలతో సమాజం కంపుకొడుతోంది. ఈ కంపు పోగొట్టేందుకే బొద్దింకలొచ్చాయి. ప్రభుత్వంతో చర్చలకు మేం సిద్ధం. మాతో చర్చలకు ముందుకురాకుండా ప్రభుత్వం మా సోషల్‌మీడియా ఖాతాలను స్తంభింపజేయడంలో బిజీగా మారింది’’అని ఆయన వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు... → ఇకమీదట ప్రభుత్వాలు నిర్వహించే కోర్సులు, ఉద్యోగ సంబంధ పరీక్షల్లో ఒక ప్రశ్నపత్రం లీక్ అయినా సరే ఆ పరీక్ష రాసిన అభ్యర్థి/విద్యార్థికి రూ.10,000 నష్టపరిహారం ఇవ్వాలి → లక్షలాది మంది రాసే పరీక్షల వేళ అభ్యర్థులు వేగంగా, సమయానికి పరీక్షాకేంద్రానికి చేరుకునేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలి → పరీక్ష రద్దయితే ఆ రద్దయిన పేపర్ మాత్రమే 72 గంటల్లోపు మళ్లీ నిర్వహించేలా ‘షెడ్యూల్ చేసిన తేదీ’లను ముందే నిర్ణయించుకోవాలి. ఆ తేదీల్లో పరీక్ష కచ్చితంగా నిర్వహించాలి → ఆన్లైన్లో పేపర్లను దిద్దడం మానేసి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లు స్వయంగా పేపర్లను దిద్దాలి. → రాసిన పరీక్ష రద్దయి తర్వాత పరీక్ష రాసేలోపు వయోపరిమితి దాటిపోయే అభ్యర్థులకు చివరి అవకాశం ఇవ్వాలి → కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాలను ఆడిటింగ్ చేయాలి → పరీక్షలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడో సంస్థకు ఇస్తే వాళ్ల గత చరిత్రను క్షుణ్ణంగా తనిఖీచేయాలి -
కాక్రోచ్ జనతా పార్టీపై అడ్వకేట్ రజని ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మా పోరాటం ఆగదు
ఛత్రపతి శంభాజీనగర్: జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీపై ఉందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తేల్చిచెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకొనేదాకా తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడారు. దేశంలో గత 12 ఏళ్లుగా రాజకీయాలు కేవలం హిందూ–ముస్లిం ఎజెండా చుట్టూ తిరుగుతున్నాయని ఆక్షేపించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఇప్పటికైనా మారాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత దేశంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పు కోసం ఎజెండాను రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఛత్రపతి శంభాజీనగర్‌లోని సొంత ఇంటికి చేరుకున్న అభిజిత్ దీప్కేకు ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్న ప్రధాని మోదీ మన దేశంలో పేపర్ లీక్‌ను ఆపలేరా? అని దీప్కే ప్రశ్నించారు. జెన్ జెడ్ యువత ఎవరికీ భయపడబోరన్న సంగతి శనివారం నాటి జంతర్‌మంతర్ ధర్నాతో తెలిసిపోయిందన్నారు. తప్పులు జరిగితే యువత ప్రశ్నిస్తూనే ఉంటుందని ఉద్ఘాటించారు. ఈ ధర్నాకు 7,000 మంది హాజరయ్యారని, తమ ఉద్యమం ఇక దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని స్పష్టంచేశారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నీట్–యూజీ పేపర్ లీక్ వల్ల లక్షల మంది నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎవరూ బాధ్యత తీసుకోకపోతే వ్యవస్థ సక్రమంగా ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారు. దీప్కే ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇది ట్రైలర్ మాత్రమే జంతర్‌మంతర్ ధర్నా ఒక ట్రైలర్ మాత్రమేనని అభిజిత్ దీప్కే వ్యాఖ్యానించారు. ధర్నాకు హాజరైనవారికి ఆదివారం ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలియజేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను 7 రోజుల్లోగా పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మహా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. శనివారం జరిగిన ధర్నాకు చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. విద్యా వ్యవస్థకు సంబంధించిన సమస్యలపై విద్యార్థులు, యువతలో పెరుగుతున్న ఆగ్రహాన్ని ఈ ధర్నా ఒక ప్రతీకగా నిలిచిందన్నారు. ఈ శాంతియుత నిరసన కార్యక్రమం ప్రభుత్వానికి ఒక ట్రైలర్‌ను చూపించిందని వివరించారు. ప్రజలంతా కలిసికట్టుగా గళాన్ని వినిపించకపోతే వ్యవస్థలో ఆశించిన మార్పు రాదని తేల్చిచెప్పారు. -
కాక్రోచ్ జనతా పార్టీకి భయపడాలా? జెన్ Z ఇలా ఉందేంటి?
బొద్దింక అంటే ఏంటి? ఒక పురుగా, ఒక కీటకమా, లేక అసంతృప్తితో ఉన్న భారతీయ యువకుడిని అలా పిలుస్తున్నారా? కొత్తగా రూపుదిద్దుకుంటున్న "కాక్రోచ్ జనతా పార్టీ"ని ఇష్టపడుతున్న వారిని అడిగితే ‘‘పైవి అన్నీ’’ అనే సమాధానం వస్తుంది. ఇప్పటివరకు ఇది వ్యంగ్యంగా పుట్టిన ఒక ఆసక్తికర గ్రూప్ మాత్రమే. ఇదొక క్వాసీ రాజకీయ పార్టీ. అంటే పూర్తిస్థాయి రాజకీయ పార్టీ కాకపోయినా, రాజకీయ లక్ష్యాలు ఉన్న పార్టీ లేదా రాజకీయాలపై ప్రభావం చూపే గ్రూపు.కానీ భారత ప్రజాస్వామ్య ప్రస్తుత పరిస్థితిపై అసంతృప్తిగా ఉన్న దేశ యువతకు తామే ప్రతినిధులమని ఇది చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో కొన్ని మిలియన్ల మంది అలా భావిస్తున్నారు. అయితే, ఇది క్షణికావేశం, కొన్ని రోజుల్లో నిరుగారిపోయే ఉత్సాహమేనా?కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఆన్లైన్ జోక్‌గా మొదలైంది. నిరుద్యోగ యువతపై భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య ప్రతిస్పందనగా ఇది పుట్టుకొచ్చింది. ఆ మీమ్ వేగంగా వ్యాపించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే మిలియన్ల మంది దాని సామాజిక మాధ్యమ ఖాతాలను అనుసరించడం మొదలుపెట్టారు. చాలా మంది వ్యాఖ్యాతలు వెంటనే దీన్ని బీజేపీ వ్యతిరేక ఉద్యమంగా అభివర్ణించారు. కానీ అది కథలో సగం మాత్రమే.పెద్ద సందేశం ఏమిటంటే, ఎన్నికల్లో యువత భాగస్వామ్యం భారీ స్థాయిలో ఉందని గణాంకాలు చూపుతున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలకు అదే బలమైన కొలమానం. అనేక దేశాల్లో జెన్ జీ ఓటర్లు రాజకీయాలను చాలా భిన్న దృష్టితో చూస్తున్నారు. భారతదేశంలో వారిలో చాలా మంది బీజేపీ పాలన కాలంలోనే (2014 నుంచి ఇప్పటివరకు) పెరిగారు. ఉద్యోగాలు, జీవన వ్యయం, గృహాలు, రవాణా, స్వచ్ఛమైన గాలి, మెరుగైన ప్రజా సేవలు. ప్రస్తుత రాజకీయ వర్గం ఈ ప్రాథమిక అవసరాలను అందిస్తోందా? అని చాలా మంది భావిస్తున్నారు. ఆ అసంతృప్తి కొత్త గొంతుకలకు, కొత్త మార్పులకు అవకాశం కల్పిస్తోంది.అయితే, సామాజిక మాధ్యమంలో వచ్చే ప్రజాదరణ ఎన్నికల వేళ ఉండే ప్రజాదరణతో సమానం కాదు. మిలియన్ మంది ఫాలో అయ్యే వారు ఉన్నారంటే, అదే మిలియన్ మంది ఓట్లు వేస్తారన్న నమ్మకం లేదు. వాస్తవానికి మిలియన్ మంది అనుసరించే ఒక ఇన్ఫ్లూయెన్సర్ నిజమైన ఎన్నికల్లో కొన్ని వందల ఓట్లు కూడా పొందడంలో ఇబ్బంది పడవచ్చు. ఆన్లైన్లో ఎవరినైనా అనుసరించడానికి ఒక ట్యాప్ చాలు. కానీ ఓటు వేయడానికి నిబద్ధత, వ్యవస్థీకరణ, విశ్వాసం, ఓటర్ల హాజరు అవసరం.కాక్రోచ్ జనతా పార్టీకి భయపడాలా? కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నటికీ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా కనుమరుగైపోవచ్చు. కానీ దాన్ని తక్కువ అంచనా వేయడం కూడా పొరపాటే. ఎందుకంటే ఉద్యమాలు తరచుగా హాస్యం, అసంతృప్తితోనే మొదలవుతాయి.అప్పట్లో భారత్ అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం ప్రజల ఆగ్రహానికి వ్యక్తీకరణగా మొదలైంది. నెట్‌వర్క్‌లు, చర్చలు, పౌరుల భాగస్వామ్యంతో అది వేగం అందుకుంది. మిలియన్ల మంది ఒక జోక్ (సీజేపీ వంటి) వెనుక నిలబడినప్పుడు, ఆ జోక్ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. దాన్ని ఏ రాజకీయ వర్గమైనా వినడం మంచిది. -
వాట్సాప్‌లో ‘బొద్దింకల పార్టీ’: క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ!
లుథియానా: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. ‘వ్యవస్థను మారుద్దాం, ఉద్యమంలో భాగస్వాములుకండి’ అంటూ వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాలను నమ్మి ఇప్పటికే పలువురు బాధితులు డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని లుథియానా పోలీసులు ఒక అధికారిక వీడియోను విడుదల చేస్తూ, ఈ సైబర్ ఉచ్చులో పడవద్దంటూ ప్రజలను అప్రమత్తం చేశారు.నకిలీ మెంబర్షిప్ ఈ కుట్రలో భాగంగా సైబర్ కేటుగాళ్లు యువతను, సామాజిక మార్పును కోరుకునే వారిని టార్గెట్ చేస్తున్నారు. ‘దేశ ప్రయోజనాల కోసం చేరండి’, ‘అవినీతిపై గళమెత్తండి’ అనే ఆకర్షణీయమైన నినాదాలతో వాట్సాప్, సోషల్ మీడియాలో నకిలీ లింకులను పంపుతున్నారు. ఈ సందేశాలతో పాటు వచ్చే ఫిషింగ్ లింక్‌ను క్లిక్ చేయగానే, వినియోగదారుల వ్యక్తిగత వివరాలు దొంగిలించడమే కాకుండా మొబైల్లో హానికరమైన మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుందని ఉత్తరప్రదేశ్ పోలీస్ సైబర్ సెక్యూరిటీ సలహాదారు రాహుల్ మిశ్రా పేర్కొన్నారు.లింక్ నొక్కితే జరిగే నష్టం ఏంటి?సాధారణంగా కేవలం లింక్‌ను క్లిక్ చేయడంతోనే నేరుగా డబ్బులు కట్ కావు. కానీ, ఆ లింక్ ఓపెన్ చేయగానే వచ్చే నకిలీ వెబ్సైట్లలో ఓటీపీ, బ్యాంక్ వివరాలు, లేదా యూపీఐ పిన్ నమోదు చేయమని అడుగుతారు. ఆ వివరాలను పూరించిన వెంటనే క్షణాల్లో అకౌంట్లు ఖాళీ అవుతాయి. ముఖ్యంగా విద్యార్థులు, రాజకీయల్లొ ఆసక్తి ఉన్నవారు, డిజిటల్ అవగాహన తక్కువగా ఉన్న సీనియర్ సిటిజన్లే లక్ష్యంగా ఈ మోసాలు సాగుతున్నాయి. ఏదైనా అధికారిక సంస్థ పేరుతో వచ్చే సందేశాల యూఆర్ఎల్, డొమైన్ స్పెల్లింగులను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ఈ నకిలీ లింకులను గుర్తించవచ్చు.పొరపాటున క్లిక్ చేస్తే ఏం చేయాలి?ఒకవేళ మీరు పొరపాటున ఆ లింక్‌ను క్లిక్ చేసి, మీ బ్యాంకింగ్ వివరాలను పంచుకుంటే అస్సలు ఆందోళన పడకుండా వెంటనే అప్రమత్తం కావాలి. ఆలస్యం చేయకుండా వెంటనే మీ బ్యాంక్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి డెబిట్/క్రెడిట్ కార్డులను, యూపీఐ సేవలను బ్లాక్ చేయించుకోవాలి. మీ నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చాలి. ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు జరిగినా తక్షణమే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ ‘1930’ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి లేదా సమీపంలోని సైబర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాలి.ఇది కూడా చదవండి: 50 శాతం మార్జిన్‌తో ‘బొద్దింక’ వ్యాపారం! -
జల్లికట్టు ఉద్యమం చూపిన పాఠం మరవొద్దు: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత బాధ్యతతో పరిశీలించి, సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.నేటి భారతదేశంలో లక్షలాది మంది యువకులు ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ తగిన ఉద్యోగ అవకాశాలు లేక నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, ఉద్యోగ నియామకాలపై అనిశ్చితి వంటి అంశాలు యువతలో ఆందోళనను పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ప్రభుత్వాలు కేవలం పరిపాలనా అంశాలుగానే కాకుండా సామాజిక సమస్యలుగా కూడా చూడాల్సిన అవసరం ఉందన్నారు.చరిత్రను పరిశీలిస్తే ప్రజల హృదయాల్లో పుట్టిన ఉద్యమాలను ఏ శక్తీ అడ్డుకోలేదని ఆయన గుర్తు చేశారు. 2017లో చెన్నైలోని మేరినా బీచ్ వేదికగా జరిగిన జల్లికట్టు ఉద్యమం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రారంభంలో కొద్దిమంది యువకులు, విద్యార్థులతో మొదలైన ఆ ఉద్యమం క్రమంగా లక్షలాది మంది ప్రజల మద్దతు పొందిందన్నారు. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకే లక్ష్యంతో ఐక్యమై ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు.జల్లికట్టు ఉద్యమం రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కాకుండా ప్రజల ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రజా ఉద్యమంగా చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ప్రజల సంకల్పం ఎంత బలంగా ఉంటుందో ఆ ఉద్యమం దేశానికి చూపించిందని వ్యాఖ్యానించారు. ప్రజల భావోద్వేగాలను గౌరవించిన ప్రభుత్వాలు చట్టసవరణలు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు.యువతలో నిరాశ, నిరుత్సాహం పెరిగినప్పుడు వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి రెండు ప్రజాస్వామ్య మార్గాలను ఎంచుకుంటారని కేతిరెడ్డి పేర్కొన్నారు. ఒకటి శాంతియుత ప్రజా ఉద్యమాలు కాగా, మరొకటి బ్యాలెట్ ద్వారా తమ ఆకాంక్షలను వ్యక్తపరచడం అని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్‌పై ఉన్న అనిశ్చితి కారణంగా యువతలో అసంతృప్తి పెరిగిందని, అది రాజకీయ వ్యవస్థలో మార్పు కోరే భావనగా కూడా వ్యక్తమవుతోందన్నారు.జల్లికట్టు వంటి ప్రజా ఉద్యమాలు ఒకవైపు కనిపిస్తుండగా, ఎన్నికల రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయాలను పరిశీలించే ధోరణి కూడా కనిపించిందన్నారు. దీనికి తమిళ సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కళగం పార్టీ సాధించిన అనూహ్య ప్రజాదరణ ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిణామాలు సహజమని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా యువతలో అభద్రతాభావం పెరగడానికి విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షల నిర్వహణ వంటి అనేక కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ అంశాలపై యువతలో చర్చలు, ఆందోళనలు పెరుగుతున్నాయని, వాటిని పాలకులు సకాలంలో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యువత ఆవేదనను నిర్లక్ష్యం చేయడం ఏ ప్రభుత్వానికీ మంచిది కాదని హెచ్చరించారు.ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు పరిష్కారం సంభాషణ, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన ద్వారానే సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా ఉద్యమాలు పుట్టుకురావడానికి కారణమయ్యే పరిస్థితులను ముందుగానే గుర్తించి నివారించడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. అలా జరగని పక్షంలో ప్రజా ఉద్యమాలు అనివార్యమవుతాయని పేర్కొన్నారు.ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని, వారి సమస్యలను సకాలంలో పరిష్కరించే ప్రభుత్వాలే చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. యువత శక్తిని తక్కువ అంచనా వేయరాదని సూచిస్తూ, యువత కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో, శాంతియుత మార్గాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని కోరారు. ప్రభుత్వాలకు హెచ్చరికలు ఇవ్వడం కంటే శాంతియుత మార్గాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. -
50 శాతం మార్జిన్‌తో ‘బొద్దింక’ వ్యాపారం!
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా శనివారం జరిగిన సీజేపీ నిరసనల్లో ఒక ఆసక్తిక ఘట్టం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వ్యంగ్యాత్మక ఉద్యమం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) తన మొట్టమొదటి ఆఫ్‌లైన్ నిరసన ప్రదర్శనను నిర్వహించింది. ‘నీట్’ పరీక్షల ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అభిజీత్ దిప్కే నేతృత్వంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శన ఒక వ్యాపార కేంద్రంగానూ కనిపించింది. ఈ ఉద్యమానికి సంబంధించిన లోగోలు, గుర్తులను క్యాష్ చేసుకునేందుకు కొందరు వ్యాపారులు నిరసన స్థలంలోనే దుకాణాలు తెరిచారు. బొద్దింకల థీమ్‌తో డిజైన్ చేసిన మాస్కులు, జెండాలు, టీ-షర్టులను విక్రయిస్తూ సందడి చేశారు.లాభాల మార్జిన్‌పై నెటిజన్ల ట్రోల్స్ఈ విక్రయాలకు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో ఒక రిపోర్టర్ మాస్కులు అమ్ముతున్న వ్యక్తిని ‘ఈ మాస్కు ప్రింటింగ్ ఖరీదు ఎంత?’ అని అడగగా, అతడు ‘15 రూపాయలు’ అని సమాధానమిచ్చాడు. ‘మరి దీన్ని ఉచితంగా పంచుతున్నారా?’ అని ప్రశ్నిస్తే.. ‘లేదు, 30 రూపాయలకు అమ్ముతున్నా’ అంటూ బదులిచ్చాడు. రూ.250 రూపాయలకు టీ-షర్టులు విక్రయించారు. మొత్తంగా చూస్తే 50 శాతం లాభంతో ఈ వ్యాపారం సాగింది.ఇది కూడా చదవండి: అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత? -
కేంద్రంపై గళం ఎత్తిన కాక్రోచ్ జనతా పార్టీ..!
-
కదం తొక్కిన కాక్రోచ్
న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, నీట్(యూజీ)లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతుదారులు శనివారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ధర్నాకు భారీ స్పందన లభించింది. ఇన్నాళ్లూ సోషల్ మీడియా ప్రచారానికే పరిమితమైన ఆ పార్టీ తొలిసారిగా క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగింది. పాఠశాల, కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బొద్దింకల మాస్క్ లు ధరించి, భారత రాజ్యాంగ ప్రతులు, పుస్తకాలు, పువ్వులు, జాతీయ జెండాలు, ప్లకార్డులు చేతపట్టుకొని కదం తొక్కారు. ప్రవేశ పరీక్షలు, ఉద్యోగాల నియామక ప్రక్రియలో జవాబుదారీతనం కోరుతూ నినాదాలు చేశారు. సంస్కరణలు, పారదర్శకత కావాలని తేల్చిచెప్పారు. ధర్నాకు ఇతర రాష్ట్రాల నుంచి జనం వ్యయ ప్రయాసలను సైతం లెక్కచేయకుండా హాజరు కావడం గమనార్హం. పటిష్టమైన భద్రత మధ్య శనివారం ఉదయం ప్రారంభమైన ధర్నా సాయంత్రం వరకు కొనసాగింది. నీట్(యూజీ) వాయిదా పడడం వల్ల ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆందోళన వ్యక్తంచేశారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీప్కే శనివారం ఉదయం అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని చేతబూని ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చారు. అనంతరం జంతర్‌మంతర్ వద్ద ధర్నా స్థలికి చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు. విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా తమ పార్టీని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. అన్నింటికీ సిద్ధపడే వచ్చా.. ‘‘ఇది దీర్ఘకాల పోరాటం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నెల రోజుల క్రితం సోషల్ మీడియాలో పోరాటం ప్రారంభించాం. కానీ, సిగ్గులేని పాలకులు ఆయనతో రాజీనామా చేయించకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. మన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేశారు. పోస్టులు తొలగించారు. మా పోస్టులను తొలగించవచ్చేమో గానీ ఈ విశ్వం నుంచి మమ్మల్ని ఎవరూ తొలగించలేరు. అన్నింటికీ సిద్ధపడే ఢిల్లీకి తిరిగొచ్చా. ఎలాంటి చర్యలు తీసుకున్నా భయపడే ప్రసక్తే లేదు. విమానం దిగడానికి కొద్ది క్షణాల ముందు.. నా స్వేచ్ఛా జీవితపు చివరి క్షణాలను గడుపుతున్నట్లు నాకు అనిపించింది. ఆశయం కోసం నా స్వేచ్ఛను త్యాగం చేయడానికి సైతం పూర్తిగా సిద్ధమయ్యా. కొంతమంది ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయి ఉండవచ్చు. జైలు శిక్ష పడుతుందనే భయంతో విశ్వాసాలను వదులుకున్నారు. కానీ విద్యార్థులు, యువత అలా ఎప్పటికీ లొంగిపోరు. మేము ఎవరికీ భయపడడం లేదు. నేను అమెరికాకు వెళ్లినప్పటి కంటే స్వదేశానికి తిరిగి వచి్చనప్పుడే నా తల్లి ఎక్కువగా బాధపడింది. నన్ను పోలీసులు అరెస్టు చేస్తారని ఆమె ఆందోళన చెందుతోంది. నా తల్లి మాత్రమే కాకుండా.. రాజకీయాల గురించి మాట్లాడే ప్రతి యువతీ యుకుకుడి తల్లి భయపడుతోంది. ఇంకెన్నాళ్లు ఇలా భయపడుతూ బతుకుతారు. ఇకపై భయపడబోమని గట్టిగా చెప్పండి’’అని అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. నిర్మాణాత్మక మార్పు రావాలి పరీక్షల చుట్టూ వివాదాలు, ఫలితాలపై అనిశ్చితి, అధికారుల నుంచి జవాబుదారీతనం లేకపోవడం వంటివి విద్యా వ్యవస్థపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని జంతర్‌మంతర్ ధర్నాలో నిరసనకారులు ఆక్షేపించారు. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలు తగిన శ్రద్ధ పెట్టడం లేదని విమర్శించారు. అధికార బీజేపీతో పాటు ప్రతిపక్షాల పనితీరుపైనా కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో లోపాలు కేవలం విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు సైతం ఆందోళనకరంగా మారుతున్నాయని చెప్పారు. తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోందని వారు భయపడుతున్నట్లు పేర్కొన్నారు. దేశంలో జనాభా స్థితిగతుల్లో వస్తున్న మార్పుల గురించి తరచుగా మాట్లాడుతున్నారు తప్ప యువత భవిష్యత్తు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని నిరసనకారులు మండిపడ్డారు. వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు రావాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎక్కువ మంది కలిసి ఒకేసారి గొంతు విప్పితే అది బలంగా వినిపిస్తుందన్న ఉద్దేశంతో ఈ ధర్నాకు హాజరయ్యామని కొందరు స్పష్టంచేశారు. ఎక్కువ మంది రాజకీయ కోణంలో స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వాల పనితీరు నచ్చడం లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ప్రత్యామ్నాయం కావాలని ఆకాంక్షించారు. అవినీతి ప్రతి స్థాయిలోనూ ఉందని, దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా విద్య, యువత ఆకాంక్షలు, పరిపాలన రాజకీయ మార్పుపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’పేరిట ఆన్లైన్ పోరాటం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జంతర్‌మంతర్ వద్ద ఆరుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతోనే ముందు జాగ్రత్త చర్యగా వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాక్రోచ్–ఇన్–చీఫ్ అభిజిత్ దీప్కే జంతర్‌మంతర్ ధర్నాలో ప్రముఖ సామాజిక, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ అగ్రనేత ఎ.రాజాతోపాటు పలువురు సామాజిక కార్యకర్తలు, విద్యారి్థ, యువజన సంఘాల సభ్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి ఎన్సీపీ(ఎస్పీ)నేత రోహిత్ పవార్ సైతం మద్దతు పలికారు. యువత శాంతియుత నిరసన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వాంగ్‌చుక్ అన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతించడాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. అభిజిత్ దీప్కేను కాక్రోచ్–ఇన్–చీఫ్‌గా వాంగ్‌చుక్ అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి దించేయకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ హెచ్చరించారు. వారు శనివారం మీడియాతో మాట్లాడారు. విద్య, పరిపాలన అంశాలపై విస్తృత యువజన ఉద్యమానికి జంతర్ మంతర్ ధర్నా నాంది పలికిందని అన్నారు. ప్రభుత్వానికి వారం రోజులపాటు సమయం ఇస్తున్నామని, ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడమో లేక ఆయనే స్వయంగా రాజీనామా చేయడమో జరగాలని తేల్చిచెప్పారు. గడువులోగా ప్రభుత్వం స్పందించపోతే మహా ఉద్యమం తప్పదన్నారు. శాంతియుత ప్రదర్శనలు నిర్వహించడానికి సంసిద్ధత వ్యక్తంచేస్తూ వివిధ రాష్ట్రాల్లోని మద్దతుదారుల నుంచి తమకు సందేశాలు అందుతున్నాయని తెలిపారు. తదుపరి కార్యాచరణను ప్రకటించే ముందు వారంరోజులపాటు వేచి చూస్తామని పేర్కొన్నారు. శనివారం నాటి నిరసన ప్రదర్శన ఒక ముఖ్యమైన ఘట్టమని వెల్లడించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించడానికి యువత సిద్ధంగా ఉందన్నారు. మన విద్యా వ్యవస్థను సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైందని.. ఆ సంస్కరణను తాము మేము ఈ రోజు ప్రారంభించామని ప్రకటించారు. ఇది ఆరంభం మాత్రమేనని, దేశంలో యువతకు ఎన్నో సమస్యలు ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు గుర్తుచేశారు. ఈ దేశంలోని జెన్ జెడ్, యువత రక్తంలో గాం«దీ, అంబేడ్కర్ ఉన్నారని స్పష్టంచేశారు. ధర్మేంద్ర ప్రధాన్ శనివారం సాయంత్రం 5 గంటల్లోగా పదవి నుంచి దిగిపోవాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తొలుత డెడ్‌లైన్ విధించారు. తర్వాత ఆ పార్టీ నిర్వాహకులు డెడ్‌లైన్‌ను వారం రోజులకు పొడిగించారు. -
7 రోజుల్లో రాజీనామా చేయాలి.. లేదంటే...
న్యూఢిల్లీ: ‘‘కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏడు రోజుల్లో రాజీనామా చేయాలి.. లేదంటే ప్రధాని మోదీ ఆయనను పదవి నుంచి తొలగించాలి" అని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, దీనిపై గళం వినిపించడమే ప్రస్తుతానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పింది.వ్యంగ్యాత్మక ఆన్లైన్ ఉద్యమంగా ప్రారంభమై, జనరేషన్-జీ వల్ల వేగంగా ఎదిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ).. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.సీజేపీ అధినేత అభిజీత్ దిప్కే స్పందిస్తూ... ‘‘ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే ప్రణాళికలు లేవు" అని చెప్పారు. నేటి నిరసన కేవలం ట్రైలర్ మాత్రమేనని తెలిపారు. "నా తల్లిదండ్రులను కలిసేందుకు ఇంటికి వెళ్తున్నాను. వారిని చివరిసారి కలిసి ఏడాదికి పైగా అయింది. గత 15 రోజులుగా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెదిరింపుల కారణంగా ఇంటిని విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు వారిని తిరిగి ఇంటికి తీసుకెళ్తాను" అని ఎక్స్‌లో పేర్కొన్నారు."ఉద్యమాలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించడం వల్ల ఏమి సాధిస్తారని ప్రజలు అంటారు. కానీ వాటి ద్వారా మేము ఇంకా జీవించి ఉన్నామని నిరూపిస్తాం! ప్రభుత్వానికి మేము కేవలం కీటకాల్లా కనిపించవచ్చు. కానీ మేము జీవించి ఉన్నాం. మా హక్కుల కోసం పోరాడే సామర్థ్యం మాకు ఉంది" అని కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్‌లో పేర్కొంది.కాగా, విద్యాభ్యాసం కోసం అమెరికాలో ఉన్న దిప్కే శనివారం తెల్లవారుజామున భారత్‌కు చేరుకుని, నిరసనలో పాల్గొనేందుకు జంతర్ మంతర్‌కు వెళ్లారు. నీట్-యూజీ, సీయూఈటీ, సీబీఎస్ఈ, ఎస్ఎస్సీ జీడీ వంటి ప్రధాన జాతీయ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణల చుట్టూ ఈ నిరసన సాగింది.దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులపై పరీక్షలకు సంబంధించిన వివాదాలు ప్రభావం చూపాయని పేర్కొంటూ, భారత విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం కోరే యువత చేస్తున్న ఉద్యమంగా సీజేపీ తన ప్రచారాన్ని మలిచింది. ఈ ఉద్యమం ఆన్లైన్లో విపరీతంగా ఆదరణ పొందింది. తమకు లక్షలాది మంది మద్దతుదారులు ఉన్నారని, సామాజిక మాధ్యమ వేదికల్లో బలమైన జనరేషన్-జీ అనుచర వర్గం ఉందని సంస్థ చెబుతోంది.నిరసనకు ముందు సంస్థ తన నిర్మాణాన్ని అధికారిక రూపంలో ఏర్పాటు చేసే చర్యలు కూడా చేపట్టింది. సౌరవ్ దాస్, విజేత దహియా, ఆశుతోష్ రాంకాను అధికారిక ప్రతినిధులుగా ప్రకటించింది. వీరు మాధ్యమాలతో మాట్లాడనున్నారు.ప్రతినిధులు నిరసన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. పాల్గొనేవారు క్రమశిక్షణ పాటించాలని, జాతీయ జెండాలు, పుస్తకాలు తీసుకురావాలని, రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని, నిరసనను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు.వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే భద్రతా కారణాలు, ప్రజలకు అసౌకర్యం కలగొచ్చనే ఆందోళనల దృష్ట్యా, తాను వచ్చినప్పుడు ఢిల్లీ విమానాశ్రయానికి రావద్దని మద్దతుదారులను కోరారు. అరెస్టు సహా చట్టపరమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందనే ఆందోళనను కూడా వ్యక్తం చేశారు. అయినప్పటికీ, ఉద్యమం రాజ్యాంగ పరిమితులలోనే కొనసాగుతుందని, శాంతియుత భిన్నాభిప్రాయ వ్యక్తీకరణపై దృష్టి పెడుతుందని చెప్పారు. ఈ ఉద్యమంలో లడఖ్ ఉద్యమనేత సోనం వాంగ్‌చుక్ కూడా పాల్గొంటున్నారు. -
కాక్రోచ్ పార్టీ నినాదాలతో దద్దరిల్లిన జంతర్ మంతర్
-
సీజేపీ ధర్నాలో ఆసక్తికర డిమాండ్, విద్యామంత్రిగా ఆయన?
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసుల అనుమతి తరువాత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ధర్నా విజయవంతంగా కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్‌తో ఆవిర్భవించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్ అభిజీత్ దిప్కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, విద్యా విధానంలోని లోపాల వల్ల మరణించిన విద్యార్థులకు సీజేపీ ఘన నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా మరణించిన విద్యార్థుల పేర్లను అభిజీత్ దిప్కే చదివి వినిపించారు. సామాజికకార్యకర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.ఈ నిరసనలో వినిపించిన డిమాండ్ మరిత విశేషంగా నిలిచింది. సోనమ్ తమ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని విద్యార్థులు కోరారు, అయితే ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ఆయన తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని న స్పష్టం చేశారు. యువత బాధ్యత తీసుకోవాలని అభిలషించారు. రాజకీయ నాయకులు మరియు ఉన్నతాధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోనమ్ వాంగ్‌చుక్ కోరారు. తనకు నిరసనలు చేయడం ఇష్టం ఉందనీ, కానీ న్యాయం కోసం ఇలాంటి తప్పవని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు రావాలని కూడా ఆయన పేర్కొన్నారు. Sonam Wangchuk arrives at Jantar Mantar to join the protest.There are more press reporters then cockroachs 🪳#cjp_पार्टी pic.twitter.com/nbYShqORbD— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) June 6, 2026కాగా ఈ నిరసనకు నాయకత్వం వహించేందుకు 'కాక్రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం ఉదయం అమెరికా నుండి ఢిల్లీకి చేరుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆత్మకథ ప్రతిని చేతిలో పట్టుకుని విమానాశ్రయం నుండి బయటకు రావడం ఆయన అభిమానులను మరింత ఉత్సాహపర్చింది. -
ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ధర్నా.. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్
-
నిరసనల వేదిక ‘జంతర్ మంతర్’ అసలు కథ!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్.. నేడు దేశంలో ఏ చిన్న అన్యాయం జరిగినా, హక్కుల కోసం పోరాడాలన్నా గుర్తుకువచ్చే ఏకైక చిరునామా. తాజాగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నీట్-యూజీ పేపర్ లీక్ వివాదంపై చేపట్టిన భారీ నిరసనతో ఈ ప్రాంతం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఒకప్పుడు గ్రహాల గమనాన్ని లెక్కించే వైజ్ఞానిక కేంద్రంగా వెలిసిన ఈ కట్టడం, దేశ రాజకీయాలను శాసించే నిరసనల హబ్‌గా ఎలా మారింది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర ఏంటి?ఖగోళ కేంద్రంగా జంతర్ మంతర్ ఆవిర్భావంనిజానికి జంతర్ మంతర్ అనేది రాజకీయాలకు సంబంధించిన స్థలం కాదు. 18వ శతాబ్దంలో అంబర్ మహారాజు సవాయ్ జైసింగ్ II దీనిని నిర్మించారు. సంస్కృతంలోని 'జంత్ర' (ఖగోళ పరికరం) అనే పదం నుండి దీనికి 'జంతర్ మంతర్' అనే పేరు వచ్చింది. ఆ కాలంలో సమయాన్ని, నక్షత్రాలు, గ్రహాల గమనాన్ని ఖచ్చితంగా లెక్కించడానికి ఒక వైజ్ఞానిక ప్రయోగశాలగా దీనిని ఏర్పాటు చేశారు. దీని చుట్టూ ఉన్న భారీ నిర్మాణాలు శాస్త్రీయ పరికరాలుగా పనిచేసేవి.బోట్ క్లబ్ నుండి జంతర్ మంతర్ రోడ్డుకు మారిన వేదిక1993 కంటే ముందు ఢిల్లీలో నిరసనలు, ధర్నాలకు ప్రధాన వేదిక ఇండియా గేట్ సమీపంలోని 'బోట్ క్లబ్ లాన్స్'గా ఉండేది. అయితే, 1988లో జరిగిన ఒక భారీ రైతు ధర్నా కారణంగా దేశ రాజధానిలో సాధారణ జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నగరంలో తీవ్ర ఆటంకాలు కలగడంతో, అధికారులు బోట్ క్లబ్ వద్ద నిరసనలపై ఆంక్షలు విధించారు. దానికి ప్రత్యామ్నాయంగా, పార్లమెంట్‌కు సమీపంలో ఉంటూ.. ప్రజాస్వామ్య యుతంగా నిరసనలు తెలుపుకోవడానికి వీలుగా ఉండే ‘జంతర్ మంతర్ రోడ్డు’ను అధికారిక నిరసన స్థలంగా ప్రకటించారు. అలా 1993 నుండి ఇది ఉద్యమాల వేదికగా రూపాంతరం చెందింది.దేశాన్ని కదిలించిన చారిత్రక ఉద్యమాలుగడిచిన కొన్ని దశాబ్దాలుగా ఎన్నో చారిత్రక మరియు సామాజిక మార్పులకు జంతర్ మంతర్ సాక్ష్యంగా నిలిచింది.అన్నా హజారే ఉద్యమం (2011): అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే నేతృత్వంలో సాగిన జన లోక్‌పాల్ ఉద్యమం ఇక్కడి నుంచే దేశాన్ని కదిలించింది. ఈ ఉద్యమ ఫలితంగానే తదనంతరం ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ ఆవిర్భవించింది.నిర్భయ ఆందోళనలు (2012): దేశవ్యాప్తంగా ప్రజాగ్రహాన్ని రగిల్చిన నిర్భయ హత్యాచార ఘటనపై పెద్ద ఎత్తున యువత, పౌరులు ఇక్కడే చేరి న్యాయం కోసం పోరాడారు.ఇతర ప్రముఖ నిరసనలు: రోహిత్ వేముల మరణం తర్వాత జరిగిన విద్యార్థి ఆందోళనలు, ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ కోసం మాజీ సైనికులు చేసిన సుదీర్ఘ పోరాటాలు ఇక్కడే సాగాయి.నిషేధం.. ఆపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు2017లో పర్యావరణ కారణాలు, స్థానికులకు కలిగే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’జంతర్ మంతర్ వద్ద నిరసనలపై నిషేధం విధించింది. అయితే శాంతియుతంగా నిరసన తెలపడం అనేది పౌరుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని స్పష్టం చేస్తూ 2018లో గౌరవ సుప్రీంకోర్టు ఇక్కడ ధర్నాలు చేసుకునే ప్రజాస్వామ్య హక్కును పునరుద్ధరించింది.ఇది కూడా చదవండి: ‘బొద్దింకలు’ భయపడవు, చావవు: అభిజీత్ దిప్కే -
కదం తొక్కిన కాక్రోచ్.. జంతర్ మంతర్ వద్ద ధర్నా (చిత్రాలు)
-
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు.. ఢిల్లీలో ఉత్కంఠ!
సాక్షి, న్యూఢిల్లీ: నీట్, సీబీఎస్ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళనపై అత్యవసర విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. నిరసనను అడ్డుకోవాలని శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతూ ‘సేవ్ ఇండియా ఫౌండేషన్’ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) తోసిపుచ్చింది.ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఆవిర్భవించిన సీజేపీ విదేశీ సర్వర్ల ద్వారా దేశంలో అస్థిరత సృష్టించేందుకు కుట్ర చేస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. యువతను రెచ్చగొట్టేలా ఆన్లైన్లో పోస్టులు పెడుతున్నారని, దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, జాతీయ రహదారుల వద్ద ముందు జాగ్రత్తగా భద్రతా చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ నిరసనకు అనుమతి నిరాకరించాలని లేదా వేరే ప్రాంతానికి మార్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.వాదనలు విన్న జస్టిస్ సౌరభ్ బెనర్జీ, జస్టిస్ అమిత్ శర్మల వెకేషన్ బెంచ్ ఈ పిల్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. ఆందోళనకు సంబంధించిన ప్రస్తుత దశలో ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు పిటిషన్‌ను విచారణ జాబితాలో చేర్చేందుకు నిరాకరిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనకు తరలి రావాల్సిందిగా దేశంలోని యువతకు దిప్కే సోషల్ మీడియా వేదికగా ఇటీవల పిలుపునివ్వడం తెల్సిందే. అంతేకాదు, 6న ఢిల్లీకి వస్తున్న తనను విమానాశ్రయం వద్దే కలుసుకోవాలని కూడా అతడు కోరాడు. -
‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ ఉద్యమాన్ని ఇలా చేసిందనుకో..: సార్థక్ సిద్ధాంత్
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ-ఓఎస్ఎమ్ (ఆన్-స్క్రీన్ మార్కింగ్) విజిల్ బ్లోయర్లలో ఒకరైన సార్థక్ సిద్ధాంత్ (17).. " కాక్రోచ్ జనతా పార్టీ" వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేకు ఓ సందేశం ఇచ్చాడు. ఉద్యమం ఇంటర్నెట్లో యూజర్ల దృష్టిని ఆకర్షించేలా కాకుండా నిజమైన కారణాల ఆధారంగా కొనసాగాలని చెప్పారు. అంటే, కేవలం సోషల్ మీడియాలో వైరల్ కావడం, లైక్‌లు, వ్యూస్, ఫాలోవర్లను సంపాదించడమే లక్ష్యంగా ఉద్యమాలు నడపకూడదని ఆయన చెప్పాడు.విజిల్ బ్లోయర్ అంటే సంస్థలోని లోపాలు, అవకతవకలు, అక్రమాలను బయటపెట్టే వ్యక్తి. 12వ తరగతి మార్కుల పట్టికల్లో తేడాలను గుర్తించిన తర్వాత సీబీఎస్ఈ ఓఎస్ఎమ్ మూల్యాంకన వ్యవస్థలోని లోపాలను బయటపెట్టిన కీలక వ్యక్తులుగా సిద్ధాంత్, వేదాంత్, "ఎథికల్ హ్యాకర్" నిసర్గ నిలిచారు. ఈ ముగ్గురూ దేశం దృష్టిని ఆకర్షించారు. ఈ ఏడాది పరీక్షల వివాదాలపై వీరు గళం విప్పుతున్నారు. ఇందులో ప్రశ్నపత్రం లీక్ కారణంగా రద్దైన నీట్-యూజీ 2026 పరీక్ష కూడా ఉంది. ఆ పరీక్షకు జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించనున్నారు.భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల ‘‘బొద్దింకలు’’ అంటూ చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య స్పందనగా మొదలైన వైరల్ ఆన్లైన్ ఉద్యమం ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ గురించి సార్థక్ సిద్ధాంత్ మాట్లాడాడు. తాను రాజకీయాల్లోకి వెళ్లనని చెప్పాడు. విద్యార్థులు ఏర్పాటు చేసే ఏ పార్టీ అయినా, వాళ్లు చేసే ఏ ప్రచారం అయినా నిజమైన కారణం ఆధారంగా ఉండాలని తెలిపాడు.విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాలు వారి ఆగ్రహాన్ని అర్థవంతమైన చర్యగా మార్చేలా ఉండాలని తెలిపాడు. సమస్య పరిష్కారం దిశగా నిజమైన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డాడు."నేను కొంత దర్యాప్తు చేశాను, నిసర్గ్ కొంత దర్యాప్తు చేశాడు. విద్యార్థులకు సాయం చేయాలనే ఉద్దేశంతో వాటిని బయటపెట్టాం" అని సార్థక్ సిద్ధాంత్ చెప్పాడు. పరిశోధన ఆధారంగా జరిగే ఉద్యమాలకు, సామాజిక మాధ్యమాల ప్రభావంతో నడిచే ధోరణులకు మధ్య తేడాను ఆయన ప్రస్తావించారు. తన వ్యాఖ్యల్లో వేదాంత్ శ్రీవాస్తవ గురించి ప్రస్తావంచాడు.ఆన్లైన్ వేదికలకే ఉద్యమాన్ని పరిమితం చేయొద్దని సిద్ధాంత్ హెచ్చరించాడు. ఇంటర్నెట్ యాక్టివిజం బాగానే ఉంది, కానీ వెనుక సీట్లలో కూర్చుని ఏమీ చేయకపోవడం మాత్రం సరైంది కాదని చెప్పారు. కేవలం ఆన్లైన్లో ప్రాచుర్యం పొందడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యమానికి తాను మద్దతు ఇవ్వనని తెలిపాడు."అవును, ఇంటర్నెట్ యాక్టివిజం బాగానే ఉంది. నేను చేసినది, నిసర్గ్ చేసినది, వేదాంత్ చేసినది సాధారణంగా ఇంటర్నెట్ యాక్టివిజమే. కానీ అభిజీత్ దిప్కే ప్రారంభించిన ఉద్యమానికి మద్దతు ఇస్తున్నవారు వెనుక సీట్లలో కూర్చుని ఏమీ చేయకపోతే, ఏ కార్యక్రమంలోనూ చురుకుగా పాల్గొనకపోతే, అది సరికాదు" అని సిద్ధాంత్ చెప్పారు.సార్థక్ సిద్ధాంత్ ఎవరు?సార్థక్ సిద్ధాంత్ తన వెబ్సైట్ సార్థక్సిద్ధాంత్.కామ్/కోఎంప్ట్లో తన పరిశోధన ఫలితాలను ప్రచురించాడు. కేంద్ర ప్రజా కొనుగోలు పోర్టల్(Central Public Procurement portal)లోని టెండర్ పత్రాలను అనేక రోజుల పాటు పరిశీలించిన తర్వాత ఈ వివరాలు వెల్లడించారు. సీబీఎస్ఈ ఉత్తీర్ణత శాతం తగ్గడంతో ఓఎస్ఎమ్ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి. కొందరు విద్యార్థులు తప్పులు, అసమానతలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు.‘హౌ సీబీఎస్ఈ రీరోట్ రూల్స్ టు ఫేవర్ కోఎంప్ట్ ఎడ్యూటెక్’ అనే శీర్షికతో ఉన్న సిద్ధాంత్ బ్లాగ్‌లో, టెండర్ ప్రక్రియలో వరుసగా జరిగిన మూడు దశల్లో అర్హత ప్రమాణాలు, సాంకేతిక నిబంధనలను బోర్డు పద్ధతిగా మార్చిందని ఆరోపించారు. దీని వల్ల చివరకు విజేతగా నిలిచిన హైదరాబాద్‌కు చెందిన కోఎంప్ట్ ఎడ్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నాడు. "ప్రజా సంస్థ తన సొంత నిబంధనలను తిరిగి రాసి, విద్యార్థుల భవిష్యత్తుతో ఎలా ఆడుకుందో చెప్పే కథ ఇది" అని సిద్ధాంత్ తన బ్లాగ్ ప్రారంభంలో రాశాడు. ఆ సంస్థ ఎలాంటి తప్పూ చేయలేదంటూ ఖండించింది. సీబీఎస్ఈ కూడా అదే చెప్పింది.విద్య, మహిళలు, పిల్లలు, యువజనులు, క్రీడల పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు హాజరు కావాలని సిద్ధాంత్‌ను గత మంగళవారం కోరారు. ఓఎస్ఎమ్ వ్యవస్థ కోసం సీబీఎస్ఈ మూడు వేర్వేరు టెండర్లు విడుదల చేసిందని సిద్ధాంత్ స్థాయీ సంఘానికి తెలిపారు. 2025 ఫిబ్రవరిలో విడుదలైన తొలి టెండర్, విన్నర్ లేకుండానే రద్దైంది. 2025 మేలో విడుదలైన రెండో టెండర్‌కు నాలుగు బిడ్లు వచ్చాయి, కానీ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. 2025 ఆగస్టులో విడుదలైన మూడో టెండర్‌కు ర్యాంక్‌గురు, టీసీఎస్, కోఎంప్ట్ బిడ్లు దాఖలు చేశాయి. సాంకేతిక దశలో ర్యాంక్‌గురు అర్హత సాధించకపోవడంతో చివరకు కాంట్రాక్ట్ కోఎంప్ట్కు దక్కింది. -
కాక్రోచ్ పార్టీ చీఫ్ రాకముందే .. భయంతో ఇల్లు ఖాళీ చేసిన పేరెంట్స్!
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే జూన్ 6న ఢిల్లీలో చేపట్టబోయే భారీ ఆందోళన కార్యక్రమం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. బోస్టన్‌కు చెందిన ఈ పారిశ్రామికవేత్త, సోషల్ మీడియా సెలబ్రిటీ భారత్‌లో అడుగుపెట్టకముందే పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ నిరసన ప్రదర్శనకు ముందే మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు తమ నివాసాన్ని తాత్కాలికంగా వేరే చోటికి మార్చడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ ఇంటి వెలుపల భారీగా పోలీసు బలగాలను మోహరించారు.భద్రతా కారణాలతోనే ఇల్లు ఖాళీఅభిజీత్ దిప్కే తలపెట్టిన ఢిల్లీ నిరసనపై దేశవ్యాప్తంగా పబ్లిక్ అటెన్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్త చర్యగా తమ నివాసాన్ని తాత్కాలికంగా మార్చినట్లు అభిజీత్ తండ్రి భగవాన్‌రావు దిప్కే తెలిపారు. తమకు ఎలాంటి ప్రత్యక్ష బెదిరింపులు రాలేదని, కేవలం కొడుకు సామాజిక ఉద్యమంపై వస్తున్న విపరీతమైన ప్రచారం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. మొదట తన కొడుకును ఈ ప్రచారం నుండి తప్పుకోవాలని కోరినప్పటికీ, చివరకు అతని నిర్ణయాన్ని గౌరవించక తప్పలేదని ఆయన పేర్కొన్నారు.విద్యా సంస్కరణల కోసమే పోరాటంరాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు, ప్రభుత్వ విధానాలపై విమర్శలతో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న 30 ఏళ్ల అభిజీత్ దిప్కే, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ద్వారా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. జూన్ 6న ఢిల్లీ విమానాశ్రయం నుండి ప్రారంభం కానున్న ఈ నిరసన మార్చ్ పూర్తిగా విద్యా రంగంలో సంస్కరణలు, జవాబుదారీతనం కోసమేనని నిర్వాహకులు చెబుతున్నారు. పూర్తిగా చట్టబద్ధమైన పద్ధతిలోనే ఈ బహిరంగ ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.పార్టీ పెట్టే ఆలోచన లేదు.. లీగల్ సపోర్ట్ సిద్ధంప్రముఖ మానవ హక్కుల న్యాయవాది అసీమ్ సరోదే ఈ కార్యక్రమానికి చట్టపరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఈ ఉద్యమాన్ని అధికారిక రాజకీయ పార్టీగా మార్చే ఉద్దేశం అభిజీత్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం చట్ట పరిధిలోనే ఈ నిరసన సాగుతుందని తెలిపారు. ఈ ఢిల్లీ ఆందోళనకు మద్దతుగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, నటుడు ప్రకాష్ రాజ్, విశ్లేషకులు విశంభర్ చౌదరి, జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లే వంటి ప్రముఖులను అభిజీత్ ఆహ్వానించారు. మరోవైపు కొడుకు రాజకీయ యాక్టివిటీపై తల్లి అనిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, అతను రాజకీయాల కంటే ప్రొఫెషనల్ కెరీర్‌పై దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.ఇది కూడా చదవండి: కోటా: ‘నీట్’ సీటు వేటలో అనంత లోకాలకు.. -
భారత్‌కు తిరిగొస్తున్న సీజేపీ దీప్కే
న్యూఢిల్లీ: నిరుద్యోగ యువత బొద్దింకల్లా సమాజాన్ని పాడుచేస్తోందన్న విమర్శలతో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విదేశాల నుంచి భారత్‌కు తిరిగొస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీ, సీబీఎస్ఈ ఉదంతం, క్యూట్–యూజీ పరీక్ష ఆలస్యం ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాచేయాలంటూ తాను జూన్ ఆరోతేదీన ఢిల్లీలో శాంతియుత ధర్నా చేపట్టనున్నట్లు దీప్కే ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’, ఇన్‌స్టా గ్రామ్‌లో ఒక వీడియోను విడుదలచేశారు. ‘‘మనందరం ఒక్కతాటి మీదకొచ్చి శాంతియుత నిరసన ప్రదర్శన చేయాల్సిన సమయం వచ్చింది. రాజ్యాంగబద్ధ మార్గంలో పయనిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని శాంతియుతంగా మన నిరసన వాణిని వినిపిద్దాం. మనందరం ఒక్కటిగా గొంతుకను వినిపిస్తే మన వాదనలతో వాళ్లు కూడా ఏకీభవిస్తారు. జూన్ ఆరోతేదీన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకుందాం. శనివారం సాయంత్రం ఢిల్లీకి రాగానే మనందరం కలిసి నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్దాం. శాంతియుత ర్యాలీకి అనుమతికోరదాం. పరీక్షల సంబంధల వివాదాలతో లక్షలాది మంది పరీక్షార్థులు ఎంతో మనోవేదనను అనుభవిస్తున్నారు. దీనికి ప్రభుత్వం, నేతలు జవాబుదారీగా ఉండాల్సిందే’’అని దీప్కే అన్నారు. ‘‘మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాచేయాలంటూ మొదలైన ఆన్లైన్ సంతకాల ఉద్యమంలో ఇప్పటికే లక్షలాది మంది సంతకాలు పంపించారు. ఉత్తరప్రదేశ్ మొదలు రాజస్థాన్, మహారాష్ట్రదాకా విద్యాసంబంధ నిరసనకార్యక్రమాలు ఇప్పటికే జోరందుకున్నాయి’’అని దీప్కే గుర్తుచేశారు. ‘‘ఇటీవలి కాలంలో వివాదాలకు నిలయంగా మారిన పలు పరీక్షల కారణంగా దాదాపు కోటి మంది పరీక్షార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. ఇంతజరిగినా మంత్రి ప్రధాన్ రాజీనామాచేయట్లేదంటూ దేశంలో జవాబుదారీతనమే లేదని స్పష్టమవుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం, వివాదంతో నేను ఢిల్లీలో అడుగుపెట్టగానే అరెస్ట్‌చేస్తారని నా కుటుంబసభ్యులు, బంధువులు, స్నహితులు చెబుతున్నారు. నాకు మద్దతిచ్చే వారంతా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి మనలోని ఐక్యతను చాటండి’’అని దీప్కే పిలుపునిచ్చారు. ‘‘ఇప్పటికీ మన దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని నమ్ముతున్నా. మన ర్యాలీకి అనుమతి వస్తుందని ఆశిస్తున్నా. మహాత్మాగాం«దీజీ, బీఆర్ అంబేడ్కర్, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ అంటే నాకు అమితమైన భక్తి. అందరికంటే నాకు రాజ్యాంగంపై విశ్వాసం ఎక్కువ. జైలుశిక్ష భయంతో ఎన్నాడూ భయపడుతూ బతకగలం? శాంతియుతర్యాలీలను ప్రోత్సహించే రాజ్యాంగానికి బద్దులైన బొద్దింకలన్నీ ఏకమై కోట్లాది మంది విద్యార్థుల భవితను కాపాడాలి’’అని దీప్కే వ్యాఖ్యానించారు.


