కాక్రోచ్ జనతా పార్టీ.. అభిజిత్‌ దిప్కే ఇంటికి పోలీసుల భద్రత | cockroach Janata party founder house police protect | Sakshi
Sakshi News home page

కాక్రోచ్ జనతా పార్టీ.. అభిజిత్‌ దిప్కే ఇంటికి పోలీసుల భద్రత

May 24 2026 3:47 PM | Updated on May 24 2026 4:17 PM

cockroach Janata party founder house police protect

ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ. సోషల్‌ మీడియా వేదికగా పుట్టుకొచ్చి కేవలం ఒక వారం వ్యవధిలోనే ప్రధాన పార్టీల సోషల్ మీడియా సభ్యత్వాన్ని దాటి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దిప్కే నివాసానికి పోలీసులు భద్రత కల్పించారు. అతని నివాసం వద్ద అవాంచనీయ ఘటనలు జరగకుండా నిరంతరం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.  

నిరుద్యోగం, పరీక్ష పత్రాల లీకేజీలు, విద్యా సంబంధిత సమస్యలపై మీమ్స్,రాజకీయ వ్యాఖ్యానాల ద్వారా గతవారం సోషల్‌మీడియాలో పురుడుపోసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ కొద్ది రోజుల్లోనే రెండుకోట్లకు పైగా ఫాలోవర్స్‌ను దాటిపోయింది. సీజేఐ ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన వాఖ్యల నేపథ్యంలో ఈ పార్టీ ఆవిర్భావం జరిగింది.  

అయితే దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతాపార్టీ సంచలనం సృష్టిస్తున్ననేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఇంటికి పోలీసులు రక్షణ కల్పించారు. అతని నివాసం వద్ద రద్దీ లేకుండా చూసేందుకు, ఎంఐడీసీ వాలుజ్ ప్రాంతంలోని ఆయన నివాసానికి తాము ఇరవై నాలుగు గంటల సాధారణ పోలీసు భద్రతను కల్పించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పంకజ్ అతుల్కర్  తెలిపారు. అంతేకాని ఎటువంటి బెదిరింపులు దీనికి కారణం కాదని పేర్కొన్నారు. 

కాగా కాక్రోచ్‌ జనతా పార్టీకి పాకిస్థాన్‌, బిలియనీర్ జార్జ్‌ సోరోస్ నెట్‌వర్క్‌ల నుంచి మద్దతు లభిస్తోందని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఆరోపించారు.  ఈ ఆరోపణలను కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఖండించారు. మా పార్టీకి పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధం లేదు. కేంద్రమంత్రి చేసిన ఆరోపణలు నిరాదారమైనవన్నారు. పార్టీ ఉద్దేశ్యం కేవలం భారతీయ ప్రజల సమస్యలను వినిపించడం, యువతలో అవగాహన పెంచడమేనని స్పష్టం చేశారు. 

కాక్రోచ్ జనతా పార్టీకి కేవలం భారత్‌లోనే 94శాతం మంది ఫాలోవర్స్‌ ఉన్నారని తెలిపారు. పార్టీ డిజిటల్ ఉద్యమంపై విస్తృతమైన అణచివేత జరుగుతోందని, తమ సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ, వెబ్‌సైట్‌ను తొలగించారని లేదా హ్యాక్ చేశారని, దీంతో తమ అధికారిక వేదికల్లో దేనికీ తమకు ప్రాప్యత లేకుండా పోయిందని అభిజిత్ దిప్కే ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement