సాక్షి, న్యూఢిల్లీ: నీట్ వ్యవహారంలో చర్చలపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ప్రధానమైన మూడు డిమాండ్లను నెరవేర్చేవరకు చర్చలు జరిపే సమస్యే లేదని తేల్చి చెప్పారు. సభలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సమస్యపై సభలో తాను స్పందించాలనుకున్నప్పుడు తన మైక్ లాగేసుకున్నారని విమర్శించారు. అలాగే విద్యార్థుల డిమాండ్స్ ప్రకారం నీట్ పేపర్ లీక్‌కు బాధ్యుడు, అవినీతిపరుడైన విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని, విద్యార్థులపై దాడి చేసి కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రధాని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాన్‌ను తొలగించే వరకు చర్చలుండవంటూ ప్రతిపక్షం వైఖరిని స్పష్టం చేశారు. ఈ తీవ్ర వాదోపవాదాల మధ్య సోమవారానికి లోక్‌సభ వాయిదా పడింది.
ఇదీ చదవండి: నీట్ ఆందోళనలకు సుప్రీంకోర్టు లాయర్ల మద్దతు, రాజ్యాంగ ప్రవేశిక పఠనం
#WATCH | Delhi: "...the students have three demands: 1) Corrupt Education Minister has to go, 2) Action against those who attacked students and beat them up, 3) PM should apologise to the students. These are the 3 conditions. We are not going to have any conversation, any… pic.twitter.com/3KrKv60CIL
— ANI (@ANI) July 24, 2026


