breaking news
Lok Sabha
-
ఒక రోజు అసెంబ్లీ !
సాక్షి, హైదరాబాద్: వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఒక రోజుకు మాత్రమే పరిమితం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. వర్షాకాల సమావేశాల్లో చట్టసభల్లోకి అడుగిడే యువత వయసు ప్రస్తుతం ఉన్న 25 సంవత్సరాల నుంచి 21 ఏళ్లకు తగ్గించే అంశంపై తీర్మానం ప్రవేశపెట్టి, చర్చ అనంతరం ఆమోదించిన తరువాత వాయిదా పడుతుందని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు చెప్పాయి. ఈ సమావేశాలను ఆగస్టు మొదటి వారంలోనే నిర్వహించే అవకాశం ఉందన్నాయి. తీర్మానం ఆమోదించిన వెంటనే దాన్ని కేంద్రానికి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ సమయంలోనూ వయసు తగ్గింపు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన సంగతి విదితమే. ప్రస్తుతానికి ఒక్కరోజునే సమావేశాలు ఏర్పాటు చేసి, శీతాకాల సమావేశాల సమయంలో ఎక్కువ రోజులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల తరువాత అసెంబ్లీ ప్రొరోగ్ కాకపోవడం వల్ల.. నేరుగా స్పీకర్ అసెంబ్లీని సమావేశపర్చడానికి అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. అదీకాక అసెంబ్లీలో ప్రస్తుతం మరమ్మతులు జోరుగా సాగుతున్నాయి.సెంట్రల్ హాల్ ఏర్పాటు, కిందనున్న మంత్రుల చాంబర్స్‌ను పైకి మార్చడం, సీఎం చాంబర్‌కు మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. కింద సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనసభా వ్యవహారాల మంత్రి చాంబర్లు మాత్రమే ఉంటాయి. మిగిలిన మంత్రుల చాంబర్లను మొదటి అంతస్తులోకి మార్చాలని నిర్ణయించారు. ఈ మరమ్మతులన్నీ సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం సీఎల్పీ కార్యాలయం స్థానంలో పూర్తి గ్రీనరీని ఏర్పాటు చేయాలని మొదట్లో భావించారు. ప్రస్తుతం దాని మార్పు గురించి ఎలాంటి చర్చ జరగడం లేదు. -
విద్యార్థులను హింసించే హక్కు ఎవరిచ్చారు
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీట్ పేపర్ లీక్‌పై ఆందోళనకు దిగిన విద్యార్థులను కఠినంగా అణచివేయాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చారని ఆరోపించారు. నిరసనకారులపై పోలీసుల అరాచకాలు, కాల్పులకు అమిత్ షా ఆమోదం తెలిపారని మండిపడ్డారు. పేపర్ లీక్ సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. బీజేపీని, ఆ పార్టీ మద్దతుదారులను పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఇందుకోసం మూడు వర్గాలను ప్రస్తావించారు. విద్యార్థులు, తమకు అంతా తెలుసని భావిస్తూ దేవుడిలా నటించేవారు, ఆ రెండో వర్గమే సాక్షాత్తూ దేవుడని నమ్మే అంధభక్తులు ఉన్నారని విమర్శించారు. హోంమంత్రి అమిత్ షా భయపడుతున్నారని, అందుకే ఈ రోజు సభకు రాలేదని రాహుల్ అన్నారు. విద్యార్థులపై హింసకు పాల్పడే హక్కు అమిత్ షాకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆయన మన విద్యార్థుల శరీరంలోకి పెల్లెట్లను(తుపాకీ గుళికలను) దించారని రాహుల్ ధ్వజమెత్తారు. దేశంలో విద్య నేడు ఖరీదైన వ్యాపారంగా, విద్యా వ్యవస్థ క్రూరంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్ఎస్ఎస్ గుప్పిట్లోకి విద్యా వ్యవస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై కూడా రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థను ప్రభావితం చేస్తూ, విద్యార్థులకు ఏమి బోధించాలనే దానిని ఆ సంస్థే నిర్దేశిస్తోందని ఆరోపించారు. విద్యా వ్యవస్థ ఆత్మను ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుందని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడూ విద్యా శాఖను నడపలేదని, ఆ పని చేసింది ఆర్ఎస్ఎస్ మాత్రమేనని ఆక్షేపించారు. విద్యార్థుల అసలైన శత్రువు ఆర్ఎస్ఎస్ అని విమర్శించారు. అన్‌పార్లమెంటరీ పదం తొలగింపు కొంతమంది విద్యార్థులతో జరిపిన సంభాషణ యువత విద్య, జ్ఞానాన్ని ఎలా చూస్తుందనే దానిపై తనకు ఒక అవగాహన కల్పించిందని రాహుల్ అన్నారు. విద్యారి్థగా ఉండడం అంటే ఏమిటని తాను ఒక విద్యారి్థని అడిగానని చెప్పారు. అంటే కళాశాల లేదా పాఠశాలలో చదువుకోవడం, పుస్తకాలు చదవడం అని అర్థమా? అని అడిగితే.. విశాలమైన దృక్పథం, విశాలమైన హృదయం కలిగినవారే విద్యార్థి అని ఆమె సమాధానమిచ్చారని పేర్కొన్నారు. ‘‘విద్యార్థి అంటే తనకు అన్నీ తెలియవని అంగీకరించే వ్యక్తి. తనకు తెలిసిన విషయాల స్థానంలో కొత్త జ్ఞానం వచ్చి చేరుతుంది. విశ్వం నిరంతరం పరివర్తన చెందుతూ ఉంటుందని అతనికి తెలుసు. జ్ఞానం కూడా నిరంతరం మారుతూ ఉంటుందని అతను అర్థం చేసుకుంటాడు. విద్యారి్థకి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం వినమ్రత అని ఆమె అన్నారు’’అని రాహుల్ వెల్లడించారు. తమకు అన్నీ తెలుసని భావించే మరో వర్గం గురించి కూడా ఆమె వివరించారని పేర్కొన్నారు. ‘‘తమకు అన్నీ తెలుసని కొందరు వ్యక్తులు దృఢంగా నమ్ముతారు. విశ్వం స్థిరమైనదని, జ్ఞానం తమ అంతరంగం నుంచే ఉద్భవిస్తుందని వారు భావిస్తారు. వారు అహంకారంతో ఉంటారు. వారు ఇతరుల మాట వినరు, సత్యాన్ని గౌరవించరు’’అని చెప్పారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఉపయోగించిన ఒక పదంపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యారి్థని తనతో చెప్పిన మాటలనే సభలో ప్రస్తావించానని, సభలోని ఏ సభ్యుడినీ ఉద్దేశించి అనలేదని రాహుల్ బదులిచ్చారు. రాహుల్ ఉపయోగించిన అన్‌పార్లమెంటరీ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరారు. దాంతో స్పీకర్ ఆ పదాన్ని తొలగించారు. ఎన్డీయే సభ్యుల తీవ్ర అభ్యంతరం సభలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల పట్ల అధికార ఎన్డీయే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది. దాంతో సభను రెండుసార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. రాహుల్ అబద్ధాల పుట్ట అంటూ బీజేపీ ఎంపీలు ఎదురుదాడికి దిగారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, అందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం జోక్యం చేసుకున్నారు. ఇక్కడ చర్చ జరుగుతున్నది అమిత్ షాపై కాదని అన్నారు. ఆరోపణలకు ఆధారాలు చూపించాలని రాహుల్‌కు సూచించారు. -
బిల్లుకు సభ ఆమోదం
న్యూఢిల్లీ: పేపర్ లీక్‌లను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’ను లోక్‌సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం బిల్లును సభలో ప్రవేశపెట్టగా, రెండు రోజుల సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదం పొందింది. నీట్ పేపర్ లీక్ కేసులో ప్రభుత్వం వేగంగా స్పందించిందని జితేంద్ర సింగ్ చెప్పారు. 2024లో పేపర్ లీక్ నిరోధక చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 52 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు. గత కొన్నేళ్లుగా ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన ఆత్మహత్యల రేటు తగ్గిందని పేర్కొన్నారు. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకే ఈ సవరణ బిల్లే నిదర్శనమని స్పష్టంచేశారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి పార్లమెంటరీ సంప్రదాయాలు, ప్రభుత్వ పనితీరుపై అవగాహన లేదని విమర్శించారు. బిల్లు ఆమోదం సందర్భంగా ప్రతిపక్షాలు నినాదాలు చేయడంపై జితేంద్ర సింగ్ విచారం వ్యక్తంచేశారు. దీనిపై తీవ్రంగా చర్చించి, సూచనలు ఇవ్వడానికి బదులుగా రాజకీయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తప్పుపపట్టారు. ప్రతిపక్ష నాయకుడి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. బిల్లు ఆమోదం పొందిన వెంటనే సభ మరుసటి రోజుకు వాయిదా పడింది. బిల్లులో పలు సవరణలు చేయా లని ప్రతిపక్షాలు సూచించినప్పటికీ ప్రభుత్వం అంగీకరించలేదు. ఏమిటీ సవరణ బిల్లు? → 2024లో తీసుకొచ్చిన పేపర్ లీక్ నిరోధక చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. → పేపర్ లీకేజీలకు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే దోషులకు ఐదేళ్ల నుంచి పదేళ్ల దాకా జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధించేలా ఇందులో నిబంధనలు చేర్చారు. → వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానాను ప్రతిపాదించారు. → ప్రతిపాదిత చట్టం కింద నేరాలను విచారించడానికి ఏదైనా సెషన్స్ కోర్టును ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా నియమించే అధికారాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రాంతాలకు కల్పించాలని ఈ సవరణ బిల్లు సూచిస్తోంది. → అలాగే కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసిన తేదీ నుంచి మూడు నెలలలోపు విచారణను పూర్తి చేయాలని నిర్దేశిస్తోంది.→ అవసరమైతే నేరంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసే అధికారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తోంది. → చట్టం కింద నేరాలకు సంబంధించిన దర్యాప్తును రెండు నెలల వ్యవధిలోగా పూర్తి చేయాలని నిబంధన విధించారు. → కేసుల విచారణ కోసం ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రభుత్వ న్యాయవాదులను నియమించే అధికారాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించారు. → ఏదైనా తీర్పు, శిక్ష లేదా ఉత్తర్వుపై హైకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనానికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అప్పీల్‌ను స్వీకరించిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో దానిని పరిష్కరించాల్సి ఉంటుంది. -
‘‘అందుకే రాహుల్ గాంధీ ప్రధాని నివాసం వద్దకు వెళ్లారు’’
న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్షాల ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. ఆందోళనల మధ్యే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. విపక్షాలపై జితేంద్ర సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై అమిత్ షా కాల్పులకు ఆర్డర్స్ ఇచ్చారంటూ రాహుల్ గాంధీ అనడం సరికాదని చెప్పారు."జూలై 21న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బహుశా ఏదో ప్రత్యేక ఆలోచనతో వెళ్లి ప్రధానమంత్రి నివాసం బయట బైఠాయించారు. దేశం తనను ఎన్నుకుని 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో కూర్చోబెట్టాలనే బలమైన కోరిక ఆయనకు ఉన్నట్టు కనిపించింది. ఆ ఆకాంక్ష నెరవేరకపోవడంతో ఆయన నిరాశకు, అసహనానికి గురై 7 లోక్ కల్యాణ్ మార్గ్ గేట్ల వద్ద కూర్చున్నారు. అలా చేయడం ఆయన స్థాయికి తగదని ఎంతో మర్యాదగా వివరించే ప్రయత్నం చేసినప్పుడు, తనను తీసుకెళ్లిపోవచ్చని ఆయన స్పందించారుకాల్పులు జరగలేదని పదేపదే స్పష్టం చేశారు. టియర్ గ్యాస్ వాడారు. కాల్పులు జరగలేదు కాబట్టి ఆదేశాలు జారీ చేసే ప్రశ్నే తలెత్తదు. అలాంటి ఆదేశాలు జారీ చేసే అధికారం మంత్రికి కాదు, మేజిస్ట్రేట్‌కు ఉంటుంది.ఇంత ముఖ్యమైన బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సూచనలు ఇవ్వకుండా దానిపై రాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత వాడిన అసభ్య పార్లమెంటరీ భాష దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆయనకు కనీస పార్లమెంటరీ నిబంధనలపై అవగాహన ఉన్నదా అన్న సందేహం కలుగుతోంది. ఈ దేశ భవిష్యత్తైన యువతను 'ఇడియట్స్' అని పిలవడం కన్నా దురదృష్టకరమైన విషయం ఇంకేముంటుంది?" అని అన్నారు. -
యాంటీ పేపర్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
సాక్షి,ఢిల్లీ: యాంటీ పేపర్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓట్లతో యాంటీ పేపర్ లీక్ బిల్లు పాసమైంది. పరీక్షల నిర్వహణ, పలు సంస్కరణలు చేపడుతూ బిల్లు రూపకల్పన జరిగింది. బిల్లు ఆమోదం తర్వాత రేపటికి లోక్‌సభ వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ బిల్లు, 2026 (యాంటీ పేపర్ లీక్ బిల్లు) పోటీ పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యంత కఠినమైన నిబంధనలను ప్రతిపాదిస్తోంది. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వివాదాలు, దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో ఈ సవరణ బిల్లును కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కూడా పాసయ్యింది. పేపర్ లీకేజీలు, కాపీయింగ్, ఇతర అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు కనీసం 5 ఏళ్ల నుండి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే గరిష్ట జరిమానాను రూ.10 లక్షల నుండి రూ.50 లక్షల వరకు పెంచారు.పేపర్ లీక్ చేసే వారికి కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష,రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధిస్తారు. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే సదరు నిందితులు లేదా సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ఈ బిల్లు కల్పిస్తుంది.పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు తప్పు చేస్తే రూ.5 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు, ఆయా సంస్థలను 8 ఏళ్ల పాటు బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు.పేపర్ లీక్ కేసులను వేగంగా తేల్చడానికి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. కేసు దర్యాప్తును 2 నెలల్లోగా (60 రోజులు) పూర్తి చేయాలి. చార్జ్‌షీట్ దాఖలు చేసిన 3 నెలల లోపే కోర్టులు తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా జరిగే ఇటువంటి పరీక్షల మోసాలను విచారించడానికి కేంద్రం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దించుతుంది. ఈ చట్టం దేశంలోని అన్ని ప్రధాన కేంద్ర నియామక, ప్రవేశ పరీక్షలకు వర్తిస్తుంది. ఈ కొత్త బిల్లులో దాదాపు 15 రకాల చట్టవిరుద్ధమైన చర్యలను నేరాలుగా గుర్తించారు.క్వశ్చన్ పేపర్లు లేదా ఆన్సర్ కీ లీక్ చేయడం.ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేయడం.నకిలీ అడ్మిట్ కార్డులు సృష్టించడం లేదా ఫేక్ వెబ్సైట్లు నడపడం.ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయడం కంప్యూటర్ నెట్‌వర్క్‌లను హ్యాక్ చేయడం వంటి అంశాలునన్నాయి. -
ఈ జెన్‌జీ భాష కనిపెట్టింది ఎవరో తెలుసా?
నిన్నటి వరకు సోషల్ మీడియా మీమ్స్, చాటింగ్‌ల్లో మాత్రమే కనిపించిన జెన్ జీ భాష.. ఇప్పుడు దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలోనూ వినిపించింది. రాజకీయ విమర్శలకు యువత వాడే స్లాంగ్ పదాలను ఎంపీలు ఉపయోగించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సాధారణంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్, ఆన్లైన్ సంభాషణల్లో కనిపించే పదాలు.. తాజాగా లోక్‌సభ చర్చలోనూ చోటు దక్కించుకున్నాయి.నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన చర్చలో శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే తొలుత Gen Z పదజాలాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్షాల నిరసనలను విమర్శిస్తూ.. ‘MIA’ (Missing In Action), ‘FOMO’ (Fear Of Missing Out), ‘Delulu’ (Delusional) వంటి పదాలను ఉపయోగించారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ కూడా ‘Clock it’ అనే పదాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. తేజస్వి సూర్య సైతం ‘Delulu’, ‘source code’ వంటి పదాలను ఉపయోగిస్తూ తన వాదనను వినిపించారు.It's raining Gen Z lingo in Loksabha.BJP MP Bansuri Swaraj said that PM Modi clocked by bringing a bill against the Paper leak. https://t.co/ovC4uz8QKs pic.twitter.com/o2cNJtUT4k— Political Kida (@PoliticalKida) July 28, 2026 "Congress was having FOMO and staying in DELULU".Dr. Shrikant Shinde of Shivsena just bodied Congress in Loksabha in GenZ style! 😂 pic.twitter.com/LMN5IRUQmt— Political Kida (@PoliticalKida) July 28, 2026 అయితే ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాత్రం ఈ కొత్త భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది విద్యా వ్యవస్థలోని సమస్యలపై అని.. కేవలం కొత్త పదాల ప్రదర్శన కోసం కాదని సూచించారు. అయితే ఆ తర్వాత ఆమె కూడా ‘Delulu’ పదాన్ని ఉపయోగిస్తూ.. యువత మొత్తం తమవైపే ఉందని భావించొద్దని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.'Delulu' takes over #LokSabha: #TejasviSurya, #SupriyaSule clash over who has Gen Z's support🌍 Catch the day's latest news here ➠ https://t.co/40gdOz6FIS 🗞️ pic.twitter.com/B9cr59wJTm— Economic Times (@EconomicTimes) July 28, 2026అసలు ఈ Gen Z భాష పుట్టింది ఎక్కడ?Gen Z స్లాంగ్ అనేది ఏ ఒక్క వ్యక్తి కనిపెట్టిన భాష కాదు. ఇది ఇంటర్నెట్, సోషల్ మీడియా, మీమ్ సంస్కృతి, డిజిటల్ జీవనశైలి కలిసి సృష్టించిన కొత్త భాషా రూపం. సాధారణంగా 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని Gen Zగా పిలుస్తారు. ఈ తరం చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియాతో పెరిగింది. అందుకే వీరి సంభాషణల్లో వేగం, సంక్షిప్తతకు ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది.ఎక్కువ భావాన్ని తక్కువ పదాల్లో చెప్పడం, సరదాగా స్పందించడం, ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడం కోసం కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. మొదట చిన్న ఆన్లైన్ గ్రూపులు, గేమింగ్ కమ్యూనిటీలు, సోషల్ మీడియా చర్చల్లో మొదలైన ఈ పదాలు.. TikTok, Instagram, YouTube వంటి వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి.మీమ్స్‌తో మొదలై..జెన్‌జీ భాష వ్యాప్తిలో మీమ్ కల్చర్ కీలక పాత్ర పోషించింది. ఒక సంఘటనను లేదంటే ఒక భావాన్ని సీరియస్‌గా కాకుండా సరదాగా చెప్పేందుకు యువత కొత్త పదాలను ఉపయోగించడం మొదలుపెట్టింది. ఒకప్పుడు కొత్త పదాలు సినిమాలు, టెలివిజన్, సంగీతం ద్వారా ప్రజల్లోకి వెళ్లేవి. ఇప్పుడు సోషల్ మీడియా ఆ స్థానాన్ని తీసుకుంది. ఒక వైరల్ వీడియో, ఒక మీమ్ లేదంటే ఒక ట్రెండ్ ద్వారా పుట్టిన పదం కొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇలా డిజిటల్ ప్రపంచంలో పుట్టిన పదజాలం ఇప్పుడు రాజకీయాలు, వ్యాపారం, ప్రకటనలు వంటి రంగాల్లోకి కూడా ప్రవేశించింది.యువత ఎందుకు ఇష్టపడుతోంది?ఈ భాషలో కొన్ని పదాలకు ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. ‘Delulu’ అంటే వాస్తవానికి దూరమైన ఊహల్లో ఉండటం, ‘FOMO’ అంటే ఏదైనా అవకాశం కోల్పోతామేమో అన్న భయం, ‘MIA’ అంటే కనిపించకుండా పోవడం, ‘Clock it’ అంటే ఒక విషయాన్ని గుర్తించడం లేదా నిజాన్ని బయటపెట్టడం. ‘Rizz’ అంటే ఆకర్షించే వ్యక్తిత్వం, ‘Slay’ అంటే అద్భుతంగా చేయడం, ‘No cap’ అంటే నిజం చెబుతున్నాను అనే అర్థం. సోషల్ మీడియా, మీమ్ కల్చర్ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ పదాలు ఇప్పుడు యువత సంభాషణల్లో భాగమయ్యాయి.జెన్‌జీ భాషకు ప్రధాన ఆకర్షణ దాని సరళత, వేగం. సుదీర్ఘమైన భావాలను ఒకే పదంతో వ్యక్తం చేసే అవకాశం ఈ స్లాంగ్ ఇస్తోంది. అంతేకాదు.. ఒకే తరానికి చెందిన వారు ఒకే రకమైన పదాలను ఉపయోగించడం ద్వారా తమ మధ్య ప్రత్యేకమైన అనుబంధాన్ని కూడా ఏర్పరుచుకుంటున్నారు. ఇది కేవలం మాట్లాడే విధానంలో మార్పు కాదు.. డిజిటల్ యుగంలో ఒక తరం తన గుర్తింపును వ్యక్తం చేసుకునే మార్గంగా మారింది.వ్యాపారాలకు కూడా ఉపయోగమే..ఇప్పుడు కేవలం యువత సంభాషణలకే ఈ భాష పరిమితం కాలేదు. యువ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకునే కంపెనీలు, బ్రాండ్లు కూడా ఈ పదజాలాన్ని గమనిస్తున్నాయి. ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారాల్లో యువతకు దగ్గరగా ఉండే భాషను ఉపయోగించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఒక తరం ఎలా ఆలోచిస్తోంది, ఎలా స్పందిస్తోంది అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ స్లాంగ్ ఒక సాధనంగా మారింది.విమర్శలు కూడా..అయితే Gen Z భాషపై విమర్శలు కూడా ఉన్నాయి. అధికారిక వేదికల్లో ఇలాంటి స్లాంగ్ పదాలను ఉపయోగించడం సరైనదేనా అనే ప్రశ్నలు కొందరు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా విద్య, విధానాలు వంటి తీవ్రమైన అంశాలపై చర్చ జరిగే సమయంలో భాష మరింత గంభీరంగా ఉండాలని కొందరి అభిప్రాయం.భాష ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఒకప్పుడు కొత్తగా అనిపించిన ఎన్నో పదాలు ఇప్పుడు సాధారణ వాడుకలోకి వచ్చాయి. టెక్నాలజీ, సినిమాలు, వీధి సంస్కృతి నుంచి గతంలో పదాలు వచ్చినట్లే.. ఇప్పుడు సోషల్ మీడియా కొత్త పదాలకు వేదికగా మారింది. Gen Z భాష వెనుక అసలు కథ కొన్ని విచిత్రమైన పదాల కథ కాదు. ఇంటర్నెట్ యుగంలో పెరిగిన ఒక తరం తన భావాలను, ఆలోచనలను, గుర్తింపును వ్యక్తం చేసుకునేందుకు సృష్టించుకున్న కొత్త శైలి. అందుకే మీమ్స్, చాటింగ్‌ల నుంచి మొదలైన ఈ భాష.. ఇప్పుడు పార్లమెంట్ చర్చల వరకూ చేరింది.:::వెబ్ ప్రత్యేకం -
‘దిల్ కా యాంగిల్’ మార్చుకోండి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెన్ జెడ్ తరాన్ని, వారి మనసులను గెలుచుకోవాలనుకుంటే కెమెరా యాంగిల్స్ కాకుండా ‘దిల్ కా యాంగిల్’మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా సూచించారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీ విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థుల వీపులపై పడే ప్రతి లాఠీ దెబ్బ వారి కంటే ఎక్కువగా ప్రభుత్వ ప్రతిష్టకే హాని కలిగిస్తుందని తేల్చి చెప్పారు. మంగళవారం లోక్‌సభలో పేపర్ లీక్ వ్యతిరేక బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగించి, లాఠీలతో విరుచుకుపడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.యువతుల దుస్తులు చింపేసి అవమానించడం, కనికరం లేకుండా కొట్టించడం ఏమిటని మండిపడ్డారు. దేశ యువతపై పెల్లెట్ గన్లు, ఏకే–47లతో కాల్పులు జరపడం రాక్షసత్వం కాదా? అని నిలదీశారు. ప్రభుత్వం దృష్టిలో విద్యార్థులు ఉగ్రవాదులా? అని ధ్వజమెత్తారు. ఈ రోజు ఈ ప్రశ్నలను కాంగ్రెస్ మాత్రమే కాదు, దేశం మొత్తం అడుగుతోందని అన్నారు. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.దేశంలోని యువతను ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని అడిగారు. వారి గొంతుకలను అణచివేసే హక్కు ఎవరు ఇచ్చారు? అంటూ దుయ్యబట్టారు. విద్యార్థులపై పెల్లెట్ గన్లతో దాడి చేయాలని ఎవరు ఆదేశాలు ఇచ్చారో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దేశమంతా ఇదే ప్రశ్న అడుగుతోందని వెల్లడించారు. మోదీ సత్య మార్గంలో నడవాలి పేపర్ లీకేజీలను అరికట్టడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనను ప్రియాంకా గాంధీ తోసిపుచ్చారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల పనితీరు ఇప్పటికే చాలా పేలవంగా ఉందని గుర్తుచేశారు. పార్లమెంట్లో ప్రతిపక్షాన్ని నిందించడం, డొల్ల రాజకీయ క్రీడలు ఆడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. నేటి కొత్త తరం ఎంతో అవగాహన కలిగి ఉందని, అబద్ధాలను గుర్తించగల అపారమైన సామర్థ్యాన్ని వారికి ఉందని వెల్లడించారు. యువత హృదయాలను గెలుచుకోవాలంటే ప్రధాని మోదీ సత్య మార్గంలో నడవాలని ప్రియాంకా గాంధీ సూచించారు. మోదీ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.‘‘నిజాన్ని అంగీకరించండి, బాధ్యత తీసుకోండి, పటిష్టమైన చర్యలు చేపట్టింది. నిపుణులను సంప్రదించండి. లోపాలకు తావులేని నూతన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయండి. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కలి్పంచేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలి. దేశంలో విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను విస్తరించాలి. అప్పుడే పిల్లలు ఉజ్వల భవిష్యత్తును కలలు కనగలరు’’అని స్పష్టంచేశారు. విద్యార్థులను బలవంతంగా వీధుల నుంచి తొలగించవచ్చేమో గానీ వారి ప్రశ్నలను మాత్రం తొలగించలేమని ప్రియాంకా గాంధీ తేల్చి చెప్పారు. -
పేపర్ లీక్ బిల్లు చరిత్రాత్మకం
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’చరిత్రాత్మకమని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు చట్టాన్ని తీసుకురావాలన్న అసంపూర్ణ కార్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024లో పూర్తి చేసిందని తెలిపారు. 2024 నాటి చట్టాన్ని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ బిల్లు విద్యార్థులు, యువత ప్రయోజనాలు కాపాడాలన్న ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా, మంగళవారం చర్చ ప్రారంభమైంది. మంత్రి జితేంద్ర సింగ్ చర్చకు శ్రీకారం చుట్టారు.ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల భారీ జరిమానా వంటి కఠినమైన శిక్షలు విధించేలా ‘పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’ను రూపొందించిన సంగతి తెలిసిందే. బిల్లుపై వివిధ పార్టీల సభ్యులు మాట్లాడారు. మంగళవారం అర్ధరాత్రి వరకు చర్చ కొనసాగింది. నిరసన వ్యక్తంచేసిన విద్యార్థులపై లాఠీచార్జీ చేయడాన్ని విపక్ష సభ్యులు తప్పుపట్టారు.ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అధికార పక్ష సభ్యులు బిల్లును సమరి్థంచారు. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. పేపర్ లీకేజీలను అరికట్టడానికి పటిష్టమైన చట్టం తీసుకొస్తుండడం కీలక పరిణామం అని వెల్లడించారు. అనంతరం చర్చ బుధవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యులది రాజకీయ ప్రసంగం: రిజిజు ప్రతిపక్షాలు పేపర్ లీక్ నిరోధక బిల్లు గురించి కాకుండా ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. మొత్తం చర్చ బిల్లు యోగ్యతపై కేంద్రీకృతమై ఉండాల్సిందని అన్నారు. ఆయన పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. విపక్ష సభ్యులు బిల్లు గురించి మాట్లాడలేదని, కేవలం రాజకీయాలు చేశారని అన్నారు. అందరూ రాజకీయ ప్రసంగాలు చేశారని ఆక్షేపించారు. సభలో ఇలా చేయడం సరైంది కాదన్నారు. -
ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో కీలక అంశాలపై చర్చ
న్యూఢిల్లీ: పార్లమెంట్లో మంగళవారం ఉదయం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రసంగించారు. భారత్ ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) విజయం, వ్యూహాత్మక ప్రభావం గురించి పీయూష్ గోయల్ వివరించగా.. మత్స్య రంగ వృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణను మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ భేటీకి, తొలిసారిగా కొత్తగా ఏర్పడిన ‘నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (ఎన్సీపీఐ)కు కూడా ఆహ్వానం లభించింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను వీడి ఎన్సీపీఐలో చేరిన సుదీప్ బందోపాధ్యాయ, కాకోలి ఘోష్, శతాబ్ది రాయ్ తదితర ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. Delhi: NDA Parliamentary Party's 'Mangal Milan' meeting begins at the Parliament. Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh, and other leaders attend the meeting.(ANI photos by Rahul Singh) pic.twitter.com/ckHDAIG7vJ— ANI (@ANI) July 28, 2026ప్రస్తుత వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎన్డీఏ ‘మంగళ్ మిలన్’ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. పరీక్షల సంస్కరణలు, విద్యార్థులపై పోలీసుల చర్యలంటూ విపక్షాలు చేస్తున్న ఆందోళనలు ఈ సమావేశంలో ప్రధాన చర్చాంశాలుగా మారాయి. లోక్‌సభలో విపక్షాల నినాదాల మధ్య పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నిరోధక) సవరణ బిల్లు-2026 ప్రవేశపెట్టిన తరుణంలో ఈ సమావేశం ప్రాముఖ్యత సంతరించుకుంది. పేపర్ లీక్‌లు, పరీక్షల అవకతవకలను కఠినంగా అణచివేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై చర్చించేందుకు ఎన్డీఏ పలువురు యువ ఎంపీలను రంగంలోకి దించింది. జులై 20 నాటి ‘సంసద్ చలో’ నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్లో ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. దీనికితోడు కొత్త చట్టం ప్రభావంపై కూడా విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గత సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల వెంటే ఉంటుందని, పేపర్ లీక్‌లు జాతీయ ఆందోళనకర అంశమని, దీనిపై రాజకీయాలు చేయకూడదని స్పష్టం చేశారు. పరీక్షల అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన పునరుద్ఘాటించారు.తొలగిన ప్రతిష్టంభన..పబ్లిక్ పరీక్షల బిల్లుపై చర్చపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కొనసాగుతున్న ప్రతిష్టంభన తొలగింది. మంగళవారం లోక్‌సభలో పబ్లిక్ పరీక్షల (అక్రమాల నివారణ) సవరణ బిల్లు, 2026పై చర్చ జరగనుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలతో జరిపిన సంప్రదింపులు ఫలించడంతో సభ సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది. నీట్ పేపర్ లీక్ ఉదంతం నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవస్థీకృత పరీక్షల మోసాలను అణచివేయడానికి కేంద్రం ఉద్దేశించిన నూతన బిల్లును ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. -
దేశంలో పెరుగుతున్న బిలియనీర్లు
సాక్షి, అమరావతి: దేశంలో కోటీశ్వరుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన ఐదేళ్లలో కొత్తగా 434 మంది బిలియనీర్లుగా ఎదిగారు. ఐదేళ్లలో దేశవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 142 నుంచి 576కు పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. రూ.100 కోట్లకు పైగా ఆదాయ పన్ను ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారి ఆధారంగా బిలియనీర్ల సంఖ్యను లెక్కించినట్లు తెలిపారు. గడిచిన సంవత్సర కాలంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తినా... మన దేశంలో మాత్రం కొత్తగా 161 మంది బిలియనీర్లుగా ఎదగడం విశేషం. తగ్గుతున్న ఆర్థిక అసమానతలు» దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంత ఆర్థిక అసమానతలు తగ్గుముఖం పట్టాయని పంకజ్ చౌదరి తెలిపారు. » 2023–24 గృహ వినియోగ సర్వే ఆధారంగా చూస్తే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గినీ సూచిక (ఆర్థిక అసమానతలను తెలిపేది) తగ్గిందని పేర్కొన్నారు. » 2022–23లో గ్రామీణ ప్రాంతాల్లో 0.266గా ఉన్న గినీ సూచిక. 2023–24లో 0.237కి, పట్టణాల్లో 0.314 నుంచి 0.284కు తగ్గిందన్నారు. » కోవిడ్ తర్వాత 15 ఏళ్లకు పైబడిన వాళ్లలో 2022లో 3.6 శాతంగా ఉన్న నిరుద్యోగ శాతం 2025కి 3.1 శాతానికి తగ్గిందని వివరించారు. -
పేపర్ లీకులకు చెక్.. లోక్ సభలో కీలక బిల్లు
-
పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం.. రేపటికి వాయిదా
పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు వచ్చింది. విపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టింది కేంద్రం. లోక్‌సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పరీక్షల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిబంధనలు తీసుకొస్తున్నామని కేంద్రం చెబుతుండగా.. నిరసనల సమయంలో జరిగిన పరిణామాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి.పార్లమెంట్ సమావేశాలు.. 6వ రోజు అప్డేట్స్రాజ్యసభ రేపటికి వాయిదారాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభంసభలో మళ్లీ గంగదగోళంరేపటికి వాయిదా వేసిన డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్లోక్సభ రేపటికి వాయిదాలోక్సభ సమావేశాలు తిరిగి ప్రారంభంసభలో గందరగోళం.. రేపటికి వాయిదాకాంగ్రెస్ సహా విపక్షాల ఆందోళనలతో ముందుకు సాగని సభా కార్యక్రమాలుయాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరగని చర్చవాయిదాల పర్వంలోక్సభ సాయంత్రం 5 గంటల వరకు వాయిదా3 గంటల వరకు వాయిదా పడి మళ్లీ ప్రారంభమైన రాజ్యసభఆ తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళనరాజ్యసభ మళ్లీ సాయంత్రం 5.15 గంటల వరకు వాయిదాఓం బిర్లా కీలక ప్రకటనలోక్సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లువిపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టిన కేంద్రంచర్చ ముందుకు సాగకపోవడంతో వాయిదామధ్యాహ్నం 2గం. తిరిగి ప్రారంభం కానున్న లోక్సభలోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక ప్రకటనబిల్లుపై ఎంపీల సూచనలు కోరిన స్పీకర్.మధ్యాహ్నం 1 గంట వరకు సవరణలకు అవకాశం.చర్చకు తగిన సమయం ఇస్తామని హామీ.పేపర్ లీక్‌కు భారీ శిక్షలుయాంటీ పేపర్ లీక్ బిల్లులో కీలక ప్రతిపాదనలుపేపర్ లీక్‌లో వ్యక్తులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ప్రతిపాదన.జరిమానా రూ.50 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు ఉండే అవకాశం.విద్యార్థుల లాఠీఛార్జిపై రగడపోలీసుల చర్యలపై హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని పవన్ ఖేరా డిమాండ్.నిరసనలను అణచివేయడం సరికాదని వ్యాఖ్య.సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన కాంగ్రెస్.సమగ్ర కథనం: లాఠీచార్జ్ ఎలా చేస్తారు?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుపేపర్ లీక్ బిల్లుకు కేంద్రం ప్రాధాన్యంలోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుస్పందించిన పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజుబిల్లు ఆమోదమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటనవిద్యార్థుల భవిష్యత్ రక్షణే ప్రధాన ఉద్దేశమని వెల్లడి.పేపర్ లీక్‌లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం.విపక్షాలు ఇతర అంశాలతో దృష్టి మళ్లించొద్దని సూచన.పరీక్షల వ్యవస్థపై నమ్మకం పెంచడమే లక్ష్యమని వ్యాఖ్య.లోక్‌సభ సైతం వాయిదామధ్యాహ్నానికి లోక్‌సభ వాయిదావిపక్షాల నిరసనల నడుమే.. యాంటీ పేపర్ లీక్ బిల్లు పెట్టిన కేంద్రంవిపక్షాల ఆందోళనలతో ముందుకు సాగని చర్చలోక్‌సభ మధ్యాహ్నం 2గం. కు వాయిదారాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదావాయిదా తర్వాత కూడా మారని సీన్పెద్దల సభలో విపక్షాల నిరసన గళంప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాల డిమాండ్మధ్యాహ్నం 2గం. దాకా సభ వాయిదా వేసిన చైర్మన్వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఉభయ సభలులోక్సభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళనవిపక్షాల నిరసనల నడుమే లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర జింగ్నీట్ నిరసనలు.. కేంద్రంపై పప్పు యాదవ్ ఫైర్ నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన.. ప్రభుత్వ చర్యలు తీవ్రంగా తప్పుబట్టిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ఉన్న విద్యార్థులను నేరస్తుల్లా చూస్తున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.“మన పిల్లలు ఉగ్రవాదులా? మన కూతురు నేరస్తురాలా? హక్కుల కోసం గొంతెత్తడం తప్పా?” అని పప్పు యాదవ్ వ్యాఖ్యానించారు.బిహార్‌లో దాదాపు 800 మంది విద్యార్థులను జైలుకు పంపించారని ఆరోపించారు.విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరితో దేశంలో భయానక వాతావరణం నెలకొన్నదని ఆయన విమర్శించారు.ఖర్గే తీవ్ర వ్యాఖ్యలునీట్ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అత్యంత అరుదైన ఘటన (rarest of rare) గా అభివర్ణించారు.ఈ అంశంపై రాజ్యసభలో తక్షణ చర్చకు అనుమతించాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌ను ఖర్గే కోరారు.రూల్ 267 కింద చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధన ప్రకారం ఆ రోజు జాబితాలో ఉన్న ఇతర కార్యక్రమాలను నిలిపివేసి ప్రత్యేక అంశంపై చర్చ చేపట్టవచ్చు.భారత చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఖర్గే పేర్కొంటూ.. ఈ అంశంపై వెంటనే చర్చ అవసరమని అన్నారు.ఖర్గే డిమాండ్‌పై స్పందించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్.. రూల్ 267 అమలుకు ఆ అంశం నిజంగా “rarest of rare” స్థాయిలో ఉండాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.నీట్ నిరసనల అంశం మాన్సూన్ సమావేశాల్లో రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.మోదీ సర్కార్‌పై రాహుల్ గాంధీ ఫైర్పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాపార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసనప్రధాని మోదీపై లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్విద్యార్థుల్ని అణచివేయడంలో మోదీ ప్రభుత్వ తీరు ఎక్కడైనా ఒక్కటేఢిల్లీలో పెల్లెట్లు.. పట్నాలో ఏకే 47 ప్రయోగించారుప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే स्टूडेंट्स पर लाठीचार्ज और पैलेट गन के इस्तेमाल के विरोध में विपक्ष संसद परिसर में विरोध प्रदर्शन कर रहा है#Parliament pic.twitter.com/ihXExAzby2— Poonam Pandey (@pandeypoonam20) July 27, 2026 बिहार के सीवान में छात्र प्रदर्शन के दौरान AK-47 से फायरिंग करने वाले SIT जवान अभिषेक पटेल को सस्पेंड कर दिया गया है!सिवान में छात्र आंदोलन के दौरान पुलिस अधिकारी अभिषेक पटेल ने छात्रों की दिशा में AK-47 असॉल्ट राइफल से फायरिंग की थी! pic.twitter.com/ZjyQa8fGOK— Sadaf Afreen صدف (@s_afreen7) July 27, 2026జంతర్ మంతర్‌లో లాఠీఛార్జిపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలుఛలో సంసద్ ర్యాలీ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుశాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు: సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ ధర్మాసనం.విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపి పోలీసుల మితిమీరిన బలప్రయోగాన్ని సమర్థించుకోలేం ఆందోళనల్లో ఆకతాయిలు ప్రవేశించి పోలీసులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళనకరంశాంతియుత నిరసనలు, పోలీసు చర్యల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఏకరూప మార్గదర్శకాలు అవసరం.నిరసనల్లో చొరబడే సామాజిక విద్రోహ శక్తులపై చర్యలకు అధికారులకు పూర్తి అధికారాలు ఉండాలినిరసనల్లో హింసకు తావులేకుండా నిరసనకారులు 'ఆత్మశిక్షణ' పాటించడం అత్యంత కీలకమన్న సుప్రీంకోర్టు.విద్యార్థుల నిరసనలు, పోలీసుల దాష్టీకంపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా.ఉభయ సభలు వాయిదా!ఆరో రోజు అదే తీరునీట్పై చర్చకు పట్టుబట్టిన విపక్షాలుప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ఉభయ సభలు మధ్యాహ్నం 12గం. దాకా వాయిదాప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలులోక్సభలో విపక్ష ఎంపీల ఆందోళనపబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026 నేడే ప్రవేశపెట్టాలని కేంద్రం యోచనలాఠీ ఛార్జిపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు పార్లమెంట్‌కు ధర్మేంద్ర ప్రధాన్.. పోటాపోటీ నినాదాలుపార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీలు పోటాపోటీ నినాదాలుపార్లమెంట్కు వచ్చిన మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ధర్మేంద్ర ప్రధాన్‌కు హీరో వెల్ కమ్ చెప్పిన ఎన్డీయే ఎంపీలుకేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఇండియా కూటమి ఎంపీలునీట్ లీకేజీ వ్యవహారంలో.. యువత నిరసనతో రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ఊహించినట్లే.. కాంగ్రెస్ వాయిదా తీర్మానంపార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానంవిద్యార్థులపై లాఠీఛార్జి, పెల్లెట్ గన్స్‌తో దాడిపై చర్చకు నోటీసుజంతర్ మంతర్ ధర్నా సమయంలో విద్యార్థులపై భద్రతా బలగాల బలప్రయోగంచలో సంసద్‌ను అడ్డకునే కమ్రంలో జులై 20న చోటు చేసుకున్న పరిణామాలుతీవ్రంగా ఖండించిన కాంగ్రెస్అమిత్ షాకు లేఖ రాసిన రాహుల్ గాంధీవిద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలంటున్న విపక్ష నేతపరీక్షా బిల్లు.. చర్చలో పాల్గొనేది వీళ్లే!నేడు లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026పై చర్చబిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్బిల్లుపై 8–12 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగే అవకాశంబీజేపీ తరఫున బన్సూరి స్వరాజ్ చర్చ ప్రారంభంబీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రసంగంటీడీపీ తరఫున లావు శ్రీకృష్ణ దేవరాయలుజేడీయూ నుంచి లల్లన్ సింగ్ సభలో మాట్లాడనున్నారుశివసేన తరఫున డా. శ్రీకాంత్ షిండే ప్రసంగంఅప్నా దల్ (ఎస్) నుంచి అనుప్రియా పటేల్ చర్చలో పాల్గొననున్నారుఎల్జేపీ (రామ్ విలాస్) నుంచి అరుణ్ భారతికి అవకాశంఎన్సీపీ తరఫున సునీల్ తట్కరేతృణమూల్ కాంగ్రెస్ నుంచి సయోని ఘోష్ లేదా మితాలి బాగ్ పాల్గొనే అవకాశంపరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు బిల్లు ప్రధాన లక్ష్యంబిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించే అవకాశంపై ఆసక్తిసభ.. సజావుగా సాగేనా?సీజేపీ ఆందోళన విరమణతో పార్లమెంట్ సమావేశాలపై అందరి దృష్టిగతవారమంతా విపక్షాల నిరసనలతోనే గడిచిన పార్లమెంట్కేంద్ర మంత్రి రాజీనామా కోరుతూ సభను అడ్డుకున్న విపక్షాలునీట్ లీకేజీపై చర్చ.. ప్రత్యేక చట్టంకు సిద్ధమని ప్రకటించిన కేంద్రంఅయినా వెనక్కి తగ్గని విపక్షాలు, చివరకు..ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో శాంతించిన యువతఆందోళన విరమించిన కాక్రోచ్ జనతా పార్టీనేడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుకాసేపట్లో ఖర్గే కార్యాలయంలో విపక్షాల సమావేశంయువతపై జరిగిన దాడుల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న విపక్షాలుదాడికి బాధ్యత వహించాలని ఇప్పటికే అమిత్ షాకు లేఖ రాసిన రాహుల్ గాంధీ బిల్లులో కీలక ప్రతిపాదనలుపేపర్ లీక్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు విధించేలా నిబంధనలు.లీకేజీలకు పాల్పడిన వ్యక్తులకు గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష.నిందితులపై రూ.50 లక్షల వరకు జరిమానా.వ్యవస్థీకృతంగా పేపర్ లీక్‌లకు పాల్పడే ముఠాలకు రూ.10 కోట్ల వరకు జరిమానా.ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు.కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసేలా నిబంధనలు.ఎన్డీయే వ్యూహం ఏంటి?పేపర్ లీక్‌లను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చాటే ప్రయత్నం.యువ ఎంపీలను రంగంలోకి దించి బిల్లుపై బలమైన వాదనలు వినిపించాలనే వ్యూహం.బీజేపీ నుంచి బన్సూరీ స్వరాజ్, తేజస్వీ సూర్య చర్చకు నాయకత్వం వహించే అవకాశం.టీడీపీ, జేడీయూ, శివసేన, ఎన్సీపీ, ఇతర మిత్రపక్షాల ఎంపీలు కూడా చర్చలో పాల్గొననున్నారు.విపక్షాల వ్యూహం ఏమిటి?బిల్లుకు వ్యతిరేకంగా కాకుండా.. నీట్ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించాలని భావిస్తున్నాయి.పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావాన్ని లేవనెత్తే అవకాశం.జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ మార్చ్ సమయంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నారు.ఘటనలపై ప్రధాని క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే అవకాశం.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తొలి పార్లమెంట్ సమరంనీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు.కొత్త మంత్రి తొలిసారి విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కోనున్నారు.నీట్ వివాదంపై ప్రభుత్వ వైఖరి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.10 గంటల పాటు చర్చబిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చకు అవకాశం.దాదాపు 8 నుంచి 10 గంటల పాటు చర్చ జరగనున్నట్లు సమాచారం.అధికార, విపక్ష సభ్యులు తమ వాదనలు వినిపించనున్నారు.36 రోజుల ఉద్యమం తర్వాత..నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు జరిగాయి.విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.పార్లమెంట్ మార్చ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఉద్యమం ముగిసింది. -
ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేదాకా, చర్చల ప్రసక్తే లేదు : రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ వ్యవహారంలో చర్చలపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ప్రధానమైన మూడు డిమాండ్లను నెరవేర్చేవరకు చర్చలు జరిపే సమస్యే లేదని తేల్చి చెప్పారు. సభలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యపై సభలో తాను స్పందించాలనుకున్నప్పుడు తన మైక్ లాగేసుకున్నారని విమర్శించారు. అలాగే విద్యార్థుల డిమాండ్స్ ప్రకారం నీట్ పేపర్ లీక్‌కు బాధ్యుడు, అవినీతిపరుడైన విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని, విద్యార్థులపై దాడి చేసి కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రధాని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాన్‌ను తొలగించే వరకు చర్చలుండవంటూ ప్రతిపక్షం వైఖరిని స్పష్టం చేశారు. ఈ తీవ్ర వాదోపవాదాల మధ్య సోమవారానికి లోక్‌సభ వాయిదా పడింది.ఇదీ చదవండి: నీట్ ఆందోళనలకు సుప్రీంకోర్టు లాయర్ల మద్దతు, రాజ్యాంగ ప్రవేశిక పఠనం #WATCH | Delhi: "...the students have three demands: 1) Corrupt Education Minister has to go, 2) Action against those who attacked students and beat them up, 3) PM should apologise to the students. These are the 3 conditions. We are not going to have any conversation, any… pic.twitter.com/3KrKv60CIL— ANI (@ANI) July 24, 2026 -
ఆగని విపక్షాల ఆందోళనలు
-
రాజ్యసభలో వందేమాతరం బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఐదో రోజు అదే సీన్ రిపీట్ అయ్యింది. నీట్‌పై చర్చకు సిద్ధమని కేంద్రం చెబుతున్నా.. ముందు మంత్రి రాజీనామా చేశాకే చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో.. ఓసారి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్‌సభను స్పీకర్ ఓంబిర్లా సోమవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు.. కార్గిల్ అమర వీరులకు నివాళులర్పించిన అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను సభను ప్రారంభించారు. అయితే ఆ కాసేపటికే విపక్షాల నినాదాలతో సభ మారుమోగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా తర్వాతే నీట్ లీక్ వ్యవహారంపై చర్చ జరగాలని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అయితే ప్రభుత్వం ఆందోళనకారులతో చర్చలకు సిద్ధమైందని.. ఈ తరుణంలో సభ కార్యాకలాపాలకు ఆటంకం సరికాదని కేంద్రం తరఫున ప్రకటన వెలువడింది. ఈ తరుణంలో విపక్షాల శాంతిచకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12గం. దాకా వాయిదా వేశారు. అయితే తిరిగి ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. లోక్‌సభలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. నీట్ అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు. విపక్ష నేత కే.సీ. వేణుగోపాల్‌తో మరోసారి చర్చించానని చెప్పారు. ప్రధాని మోదీ కూడా దేశానికి హామీ ఇచ్చారని, సోనమ్ వాంగ్‌చుక్ సైతం నిరాహార దీక్ష విరమించి చర్చ జరపాలని కోరారని రిజిజు పేర్కొన్నారు. నీట్‌పై చర్చకు అవకాశం ఇవ్వకపోతే అది దేశానికి సరైన సంకేతం ఇవ్వదని అన్నారు. అయినా విపక్షాలు శాంతించకపోవడంతో.. స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. Union Minister for Parliamentary Affairs Kiren Rijiju speaks in Lok Sabha. He says, "I have requested KC Venugopal ji once again today, when we are all of the opinion that there should be a discussion on NEET. The PM has assured the nation. Sonam Wangchuk has broken his hunger… pic.twitter.com/1HcLc0a5ep— ANI (@ANI) July 24, 2026ఇక.. రాజ్యసభలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. సభ కాసేపు సాగినట్లే కనిపించినా.. ఆ వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాకు డిమాండ్ చేయడం, విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. రాజ్యసభ ముందుకు వందేమాతరం బిల్లుస్వాతంత్ర్య సమర కాలం నుంచి జాతీయ భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ‘వందేమాతరం’ గీతానికి మరింత గుర్తింపు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టింది. వందేమాతర గీతాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చింది. విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.అంతకు ముందు.. పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. అర్ధరాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశం ఎందుకని?.. ప్రకటన చేయాలనుకుంటే సభలో చేయాలని.. పార్లమెంట్లో మాట్లాడితే తాము సంతోషిస్తామని.. ఆ చర్చలో తాము పాల్గొంటామని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. నీట్ లీకును తీవ్ర నేరంగా చూస్తున్నామని.. నిందితులను వదిలే ప్రసక్తే లేదని కేంద్రం అంటోంది. పేపర్‌లీక్‌లపై ఉక్కుపాదం మోపుతామని.. ఇందుకోసం కఠిన చట్టాలు తెస్తామని.. సోమవారం ఆ బిల్లును ప్రవేశపెడతామని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే అటు నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాలు మాత్రం మంత్రి రాజీనామా తర్వాత ఏదైనా అని పట్టుబడుతున్నాయి. -
ఈక్విటీలపై ఎల్టీసీజీ పన్ను రద్దు లేదు
ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నును ఎత్తివేసే ఆలోచన ఏదీ ప్రస్తుతం పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతికూల మార్కెట్ వార్తలు, నిపుణుల అంచనాల నడుమ పెట్టుబడిదారుల్లో నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ లోక్‌సభలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.పార్లమెంట్ ఉభయసభల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానమిస్తూ.. పన్ను విధానాలు, మూలధన లాభాల పన్ను రేట్లను ప్రభుత్వం వార్షిక బడ్జెట్ రూపకల్పన సమయంలోనే స్థూల ఆర్థిక పరిస్థితులను బట్టి సమీక్షిస్తుందని, ప్రస్తుతానికి ఎల్‌టీసీజీని రద్దు చేసే ఎలాంటి ప్రతిపాదన లేదని పేర్కొన్నారు.ఖజానాకు భారీగా పన్ను ఆదాయంభారత మార్కెట్లలో రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం ఊపందుకోవడంతో ఎల్టీసీజీ ద్వారా ప్రభుత్వానికి లభించే రాబడి భారీగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ (అసెస్మెంట్ ఇయర్ 2025-26) ఈక్విటీ ఎల్టీసీజీ పన్ను వసూళ్లు ఏకంగా 78.8 శాతం పెరిగి రూ.1,29,158 కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (ఏవై 2024-25) ఈ వసూళ్లు రూ.72,249 కోట్లుగా నమోదయ్యాయి.ఎఫ్‌పీఐలతో సమానమైన పన్ను నిబంధనలువిదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపులపై వస్తున్న వార్తలను కూడా ప్రభుత్వం ఖండించింది. ఈక్విటీలపై విధిస్తున్న 12.5% ఎల్టీసీజీ పన్ను రేటు స్వదేశీ రిటైల్ ఇన్వెస్టర్లకు, విదేశీ ఇన్వెస్టర్లకు సమానంగానే వర్తిస్తుందని తెలిపింది. ఎఫ్‌పీఐలకు ఇటీవల ప్రకటించిన పన్ను మినహాయింపు కేవలం ప్రభుత్వ సెక్యూరిటీల పెట్టుబడుల వరకే పరిమితమని స్పష్టం చేసింది.ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు పైబడిన ఈక్విటీ లాభాలపై 12.5% చొప్పున ఎల్టీసీజీ పన్ను అమలులో ఉంది. దేశీయ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పన్ను రాబడిని సమకూరుస్తున్న ఈ విధానాన్ని మున్ముందు కూడా కొనసాగించడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్‌లోకి పసిడి.. నేటి ధరలు ఇలా.. -
ఏపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు
-
ఏపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై లోక్‌సభలో తక్షణం సమగ్రచర్చ నిర్వహించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి సోమవారం లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పోలీసులు అధికార దుర్వీనియోగానికి పాల్పడుతున్నారని, మహిళలపై అత్యాచారాలు, లైంగికదాడులు, ఎస్సీలపై దాడులు, రాజకీయహింస, పౌరహక్కుల ఉల్లంఘనలు పెరుగుతున్నాయని ఆ తీర్మానంలో తెలిపారు. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అత్యంత కీలక అంశంగా దీనిపై సభలో అత్యవసరచర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరిగిన పలు ఘటనలను గురుమూర్తి వాయిదా తీర్మానంలో ప్రస్తావించారు. కస్టడీలోనే చంపేస్తున్నారు విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్, నెల్లూరు జిల్లా మనుబోలులో పోలీస్ కస్టడీలో దళిత యువకుడు ఏడుకొండలు మృతి, కర్నూలు జిల్లా అదోనిలో మాల గంగమ్మ, విజయవాడలో క్రాంతికుమార్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎస్కే దరియా హుస్సేన్ మరణాలు వంటివి రాష్ట్రంలో పోలీసువ్యవస్థ పనితీరుపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. వారంతా కస్టడీలోనే చనిపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. అంటే 2024 జూన్ నుంచి 2025 మార్చి వరకు మహిళలపై నమోదైన నేరాలకు సంబంధించిన గణాంకాలను కూడా ఆయన తీర్మానంలో పొందుపరిచారు. ఈ కాలంలో మొత్తం 319 ఘటనలు నమోదయ్యాయని, అందులో 126 అత్యాచారాలు, లైంగికదాడులు, 12 అత్యాచారయత్నాలు, 35 లైంగిక వేధింపులు, 97 భౌతికదాడులు, 34 హత్యలు లేదా అనుమానాస్పద మరణాలు ఉన్నాయని, వేధింపుల కారణంగా 15 ఆత్మహత్యలు లేదా ఆత్మహత్యాయత్నాల కేసులు ఉన్నాయని వివరించారు. ఎస్సీలపై 69 ఘటనలు అలాగే ఎస్సీలపై జరిగిన 69 ఘటనలను కూడా గురుమూర్తి ప్రస్తావించారు. హత్యలు, కస్టడీ హింస, పోలీసుల వేధింపులు, సామాజిక బహిష్కరణ, భూ ఆక్రమణలు, ఇళ్ల కూల్చివేత, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులు ఇందులో ఉన్నాయన్నారు. రాజకీయ హింసకు సంబంధించి 133 ఘటనలు నమోదయ్యాయని, వాటిలో 49 హత్యలు, 6 హత్యాయత్నాలు, 6 కిడ్నాప్‌లు, 58 భౌతిక దాడులు, 10 ఆస్తుల ధ్వంస ఘటనలు, రాజకీయ వేధింపుల కారణంగా జరిగినట్లు ఆరోపిస్తున్న నాలుగు ఆత్మహత్యలు ఉన్నాయని వివరించారు.రాష్ట్ర పోలీసుల పనితీరుపై హైకోర్టు 12 సందర్భాల్లో ప్రతికూల వ్యాఖ్యలు చేసిన విషయాన్ని, శాంతిభద్రతలకు సంబంధించి 79 ప్రధాన ఘటనలు జరిగిన విషయాన్ని కూడా ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడంతోపాటు పౌరుల రాజ్యాంగబద్ధ హక్కుల ఉల్లంఘనకు నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఈ అంశంపై లోక్‌సభలో సమగ్రచర్చ నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక కోరాలని, నమోదైన అన్ని ఘటనలపై కాలపరిమితితో కూడిన నిష్పక్షపాత విచారణ జరిపించాలని, ఎక్కడ ఉల్లంఘనలు నిర్ధారణ అయితే అక్కడ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గురుమూర్తి డిమాండ్ చేశారు. -
గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. విపక్ష ఎంపీలు సభలో భారీగా నినాదాలు చేస్తూ రగడ సృష్టించడంతో, స్పీకర్ లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. కాగా వందేమాతరం గేయాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణిస్తూ, మూడేళ్ల పాటు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభ ఎంపీగా కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ప్రమాణ స్వీకారం చేశారు. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నిర్వహణలో జరిగిన అక్రమాలు, విద్యార్థుల నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జవాబుదారీతనంపై అత్యవసరంగా చర్చించాలని కోరుతూ సిపిఐ రాజ్యసభ ఎంపీ పి. సంతోష్ కుమార్ రాజ్యసభలో రూల్ 267 కింద ‘సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్’ (కార్యకలాపాల నిలిపివేత) నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాపడింది. 🚨 #NewsAlert | The Monsoon Session of Parliament has commenced, and Pawan Khera has taken oath as a Rajya Sabha member.#Parliament | #MonsoonSession | #PawanKhera | #RajyaSabha | #Politics | #India | #UNI pic.twitter.com/dIVZdIDan5— United News of India (@uniindianews) July 20, 2026ఈ సమావేశాలు ప్రారంభానికి ముందు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. పార్లమెంట్ సభ్యులకు (ఎంపీలకు) పలు అంశాలపై విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ గౌరవాన్ని, పార్లమెంటరీ సాంప్రదాయాలను, సభామర్యాదలను కాపాడుతూ సభ్యులందరూ సహకార స్ఫూర్తితో సభ నడపటంలో సహకరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శాసనసభ, ఇతర పార్లమెంటరీ కార్యకలాపాలను సవ్యంగా పూర్తి చేయడం సభ్యులందరి ఉమ్మడి బాధ్యత అని స్పీకర్ తెలిపారు. ఇది ప్రజల్లో పార్లమెంట్‌పై ఉన్న నమ్మకాన్ని మరింత పటిష్టం చేయడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థల గౌరవాన్ని కూడా పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. సార్థకమైన చర్చలు, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తీసుకునే నిర్ణయాలు, పార్లమెంట్ ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా ఈ సమావేశాలు సాగేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎంపీలకు ఓం బిర్లా పిలుపునిచ్చారు. ‘నేటి నుంచి 18వ లోక్‌సభ ఎనిమిదవ సమావేశం.. వర్షాకాల సమావేశం ప్రారంభమవుతోంది. దేవుడైన ఇంద్రుడి ఆశీస్సులతో ఈ రోజు ఉదయం ఢిల్లీలో కురిసిన వర్షం వాతావరణాన్ని నూతన శక్తితో, తాజాదనంతో నింపింది. ఇదే మంగళకరమైన వాతావరణంలో పార్లమెంట్ దేశ అత్యున్నత ప్రజాస్వామ్య సంస్థగా గౌరవనీయులైన సభ్యులందరినీ స్వాగతించడానికి సిద్ధంగా ఉంది’అని పేర్కొన్నారు. आज से 18वीं लोक सभा का आठवाँ सत्र- मानसून सत्र प्रारम्भ हो रहा है।देवराज इन्द्र के आशीर्वाद स्वरूप आज प्रातः दिल्ली में हुई वर्षा ने वातावरण को नव ऊर्जा और ताजगी से भर दिया है। इसी मंगलमय वातावरण में संसद राष्ट्र की सर्वोच्च लोकतांत्रिक संस्था के रूप में सभी माननीय सदस्यों का… pic.twitter.com/cVa420LVKj— Om Birla (@ombirlakota) July 20, 2026 -
షిండే శివసేనలో ‘ఉద్ధవ్’ ఎంపీల విలీనం
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన(ఉద్ధవ్)కు చెందిన ఆరుగురు ఎంపీలను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో విలీనం చేయడానికి అంగీకారం తెలియజేశారు. అలాగే నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ)లో చేరిన 20 మంది తిరుగుబాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఎంపీలకు సభలో ప్రత్యేక సీటింగ్ కేటాయించడానికి ఆమోదం తెలిపారు. ఆరుగురు ఎంపీలు విలీనం కావడంతో షిండే నాయకత్వంలోని శివసేన బలం ఏడు నుంచి 13కు పెరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు తమ మాతృపార్టీకి సంబంధం లేకుండా సభలో ప్రత్యేకంగా ఆసీనులవుతారని వెల్లడించాయి. తమను నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో అంతర్భాగంగా గుర్తించాలన్న టీఎంసీ రెబల్ ఎంపీల వినతిపై స్పీకర్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉందని అధికారులు తెలిపారు. తిరుగుబాటు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని శివసేన(ఉద్ధవ్), టీఎంసీ నాయకత్వం విజ్ఞప్తి చేయగా, స్పీకర్ దానిపై స్పందించలేదు. తాజా సమీకరణాలతో స్పీకర్ ఓం బిర్లా తీసుకున్న తాజా నిర్ణయంలో లోక్‌సభలో అధికార ఎన్డీయే బలం మరింత పెరుగనుంది. సభలో ప్రస్తుతం 540 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సభలో ప్రస్తుతం ఎన్డీయే బలం 318 కాగా>, విపక్ష ఇండియా కూటమిలో 181 మంది ఎంపీలు ఉన్నారు. 41 మంది ఇతర పార్టీలకు చెందినవారు. -
2029కల్లా మహిళా కోటా అమలు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో సంబంధం లేకుండా ఈ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలన్న వాదనలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీస్ జారీ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవ ల ఈ మేరకు విచారణ చేపట్టింది. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా 2001 లేదా 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చట్టం–2002 కింద మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని (రాజ్యాంగ 128వ సవరణ చట్టం–2023) అమల్లోకి తెచ్చేలా కేంద్రానికి మార్గనిర్దేశం చేయాలని కోరుతూ న్యాయవాది యోగమాయ ఎం.జి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలా ముడిపెడితే ఫలితం సున్న చట్టం ఆమోదం పొందినా 2026 తర్వాత జరిగే తొలి జనాభా లెక్కల సేకరణ, తదనంతర డీలిమిటేషన్ ప్రక్రియతో దీని అమలును ముడిపెట్టడం వల్ల చట్టం నిరుపయోగంగా మారిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇటీవల పార్లమెంట్లో లోక్‌సభ సీట్ల పెంపు, దేశవ్యాప్త డీలిమిటేషన్‌కు ఉద్దేశించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు–2026 వీగిపోయిన నేపథ్యంలో ఈ పిల్ ప్రాధాన్యం సంతరించుకుంది. -
స్మార్ట్‌వాచీ, కళ్లద్దాలు వాడొద్దు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభమవుతున్న వేళ ఎంపీలకు లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం కీలక సూచనలు చేసింది. సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలో ఎక్కడైనా సరే స్మార్ట్‌వాచీలు, స్మార్ట్ కళ్లద్దాలను ఇతర సభ్యుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే రీతిలో ఉపయోగించకూడదని సూచించింది. ‘‘స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాలు, స్మార్ట్ వాచ్‌ల వంటి అనేక అత్యాధునిక పరికరాలను ఇప్పుడు విస్తృతంగా వినియోగిస్తున్నారు. వీటిని ఎంపీలు తోటి ఎంపీల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా, పార్లమెంటరీ విశేషాధికారాలను ఉల్లంఘించేలా ఉపయోగించకూడదు. పార్లమెంట్ లోపల, బయట పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఎక్కడైనా సరే సభ్యుల గోప్యత, భద్రతకు, విశేషాధికారాలకు భంగం కలిగించే విధంగా ఇటువంటి అత్యాధునిక పరికరాలను ఉపయోగించకూడదు’’ అని లోక్‌సభ సెక్రటేరియట్ సూచించింది. ఈ మేరకు ఒక బులెటిన్‌ను విడుదలచేసింది. 20వ తేదీ నుంచి ఆగస్ట్ 13వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న విషయం తెల్సిందే. -
చర్చల యుద్ధానికి సిద్ధం
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లు, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి భంగపడిన అధికార ఎన్డీఏ కూటమి ఈసారి మరింత పదునైన వ్యూహంతో ముందుకొస్తోంది. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని మోదీ సర్కార్ కృతనిశ్చయంతోఉంది. అయితే బడ్జెట్ సమావేశాల్లో ఐక్యత చాటి మహిళా రిజర్వేషన్ చట్టసవరణ బిల్లును వీగిపోయేలా చేసినట్లే ఈసారి ఉమ్మడిగా ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలని విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి.దీంతో జూలై 20వ తేదీ నుంచి ఆగస్ట్ 13వ తేదీదాకా ఈసారి వర్షాకాల సమావేశాలు వ్యూహప్రతివ్యూహాలతో హోరాహోరీగా సాగనున్నాయి. మొత్తంగా ఈసారి 19 సార్లు ఇరుసభలు సమావేశంకానున్నాయి. బడ్జెట్ సెషన్లో మహిళా రిజర్వేషన్ చట్టసవరణ బిల్లును వీగిపోయేలా చేసినప్పటికీ ఇప్పటికీ అధికార, విపక్షల బలాబలాల్లో మార్పులొచ్చాయి.ఇటీవల రాజ్యసభలో ఖాళీ అయిన 27 స్థానాల కోసం జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచి ఎన్డీఏ తన బలాన్ని పెంచుకుంది. వీళ్లుగాక స్వతంత్రులు, నామినేటెడ్ సభ్యులు, చిన్న పార్టీల మద్దతునూ కూడగడుతోంది. దీంతో రాజ్యసభలో ఎన్డీఏ బలం 150కి చేరుకోబోతోంది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి కావాల్సిన మూడింట రెండొంతుల సంఖ్యాబలం(160)కి సమీపంలో ఉండటం గమనార్హం. పశ్చిమబెంగాల్లో ఖాళీగాఉన్న మరో మూడు రాజ్యసభ స్థానాలనూ కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ తన సంఖ్యాబలాన్ని మరింత పెంచుకోనుంది. దీంతోపాటు లోక్‌సభలోనూ బీజేపీ బలం ఎక్కువకానుంది. తగ్గిన విపక్షాల బలం ఇటీవల వెలువడిన పలు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాల తర్వాత విపక్ష పార్టీల సంఖ్యాబలం తగ్గిపోయింది. దీంతో విపక్ష పార్టీల మధ్య ఐక్యత సైతం బలహీనపడింది. తమిళనాడులో ప్రభంజనం సృష్టించిన అధికార పగ్గాలు చేపట్టిన విజయ్ జోసెఫ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం సుతరామూ ఇష్టంలేని మిత్రపక్షం డీఎంకే తన మైత్రిబంధానికి చరమగీతం పాడింది. వీటికితోడు పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీని షాక్‌కు గురిచేస్తూ 20 మంది టీఎంసీ ఎంపీలు సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియాకి మద్దతు పలికారు. ఈ పార్టీ ఇప్పటికే ఎన్డీఏకూ మిత్రపక్షంగా ఉంది. మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రేకు గుబ్‌బై చెప్పి ఆరుగురు శివసేన(యూబీటీ) ఎంపీలు పరోక్షంగా బీజేపీకి మద్దతు పలకడంతో లోక్‌సభ, రాజ్యసభలో ఎన్డీఏ మరింత బలం పుంజుకుంది. విపక్షాల నుంచి సవాళ్లు.. ప్రతిష్టాత్మకమైన నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, సీబీఎస్ఈ పన్నెండో తరగతి విద్యార్థుల డిజిటల్ మూల్యాంకనం తప్పులతడకగా మారడం, అయోధ్యలోని రామమందిరానికి వచ్చిన కోట్ల రూపాయల విరాళాలు, స్వర్ణాభరణాలు చోరీకి గురికావడం, దేశంలో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని తాకడం, పశ్చిమాసియా యుద్ధాగ్ని జ్వాలల భారత్‌లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సెగలు పుట్టించడంతో ప్రభుత్వ అంతర్గత, విదేశాంగ విధానం విఫలమైందంటూ విపక్షాలు పార్లమెంట్ వేదికగా పదునైన విమర్శనాస్త్రాలు సంధించనున్నాయి. టీఎంసీ, శివసేన(యూబీటీ) తిరుగుబాటుఎంపీల మద్దతులో లోక్‌సభలో ఎన్డీఏ బలం 318 లేదా 319కి పెరిగే వీలుంది. అయినాసరే మూడింట రెండొంతుల(360) బలానికి బీజేపీ 40 స్థానాలను సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులు, నివేదికలు..ఢిల్లీలో అధికారిక నివాసంలో కాలిన కరెన్సీ కట్టలు వెలుగుచూసిన ఉదంతంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంతవర్మను పదవి నుంచి తొలగించేందుకు, కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ తన నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఈ అంశంలో అధికార, విపక్షాలు ఏకతాటిమీదకొచ్చాయి. ఇవీ బిల్లులు.. 1. రాజ్యాంగ(130వ) సవరణ బిల్లు తీవ్రమైన నేరాలకు పాల్పడి అరెస్టయి ఏకధాటిగా 30 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండిపోయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులను పదవుల నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లు సభ ముందుకురావొచ్చు. అయితే ఇప్పటికే ఈ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. 2. విదేశీ విరాళాల(నియంత్రణ) సవరణ బిల్లు, 2026 ఈ ఏడాది మార్చి 25వ తేదీన ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 3. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు గత ఏడాది డిసెంబర్లో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. 4. సెక్యూరిటీస్ మార్కెట్ బిల్లు, 2025 ఈ బిల్లును 2025 డిసెంబర్ 18వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. 5. కార్పొరేట్ చట్టాల(సవరణ)బిల్లు, 2026 2026 మార్చి 23వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. -
అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంపు
న్యూఢిల్లీ: జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకుంటే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆగ్రహావేశాలు ఎక్కువవుతున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో జనాభా సిద్ధాంతాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి అన్ని రాష్ట్రాలకు సమన్యాయం దక్కేలా ఏక రీతిగా 50 శాతం సీట్లను పెంచాలని మోదీ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు కోసం తాజాగా ముసాయిదా బిల్లును తయారుచేసే పనిలో పడ్డ ఎన్డీఏ సర్కార్ అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపు మీద సైతం కసరత్తు చేస్తోందని విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. అయితే గతంలో తీసుకొచ్చిన ముసాయిదా బిల్లు ఏప్రిల్ 17వ తేదీన మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో వీగిపోవడం తెల్సిందే. మునుపటి బిల్లును ఆధారంగా చేసుకుని కొత్తగా మోదీ ప్రభుత్వం తయారుచేసిన ముసాయిదా బిల్లులో 1971 నాటి జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్ల నిష్పత్తిని యథాతథంగా కొనసాగించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా జనాభా లెక్కలు పూర్తయ్యాక 2011 జనాభాలెక్కలను పక్కనపెట్టి లోక్‌సభ, అసెంబ్లీలో సీట్ల కేటాయింపులు జరగనున్నాయని గతంలో ప్రకటించడం తెల్సిందే. ఏప్రిల్‌లో పార్లమెంట్లో పరాభవం ఎదురైన నేపథ్యంలో ఈసారి మెజారిటీ సంఖ్యాబలం ఉన్న తర్వాతనే బిల్లుకు తుది రూపునిచ్చి సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏకు 300 మంది ఎంపీల బలముంది. మూడు ఖాళీలున్నాయి. ప్రస్తుతమున్న మొత్తం సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే కొత్త బిల్లు నెగ్గాలంటే ప్రభుత్వానికి మూడింట రెండొంతులు అంటే కనీసం 360 మంది ఎంపీల మద్దతు ఉండాల్సిందే. ప్రస్తుత మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం మహిళలకు రిజర్వేషన్ కల్పించడం అనేది 2034 ఏడాదికి ముందు అమలుచేయడం కుదరదు. 2027 జనాభా లెక్కలు పూర్తయ్యాకే ఈ రిజర్వేషన్ అమలుచేయాలని గతంలో మెలిక పెట్టారు. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి చట్టంలోని నిబంధనలు అమల్లోకి వస్తాయి. -
ఎంతలో ఎంత మార్పు!
1977 మార్చిలో ప్రప్రథమంగా కేంద్రంలో ఏర్పాటైన కాంగ్రెసేతర ప్రభుత్వ (జనతా పార్టీ) సంబరం మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసింది. కారణం, పార్టీ నాయకుల అంతర్గత కుమ్ములాట. తనకు దక్కవలసిన ప్రధాని పీఠం, మొరార్జీ దేశాయికి దక్కడంతో, ఉపప్రధాని చౌధరీ చరణ్ సింగ్ జీర్ణించుకోలేక పోయారు. ఈ తరుణంలో జనతా ప్రభుత్వాన్ని కూలదోయటానికి పక్కా వ్యూహం పన్నారు ఇందిరాగాంధీ. సరిపడా ఎంపీలతో జనతా నుండి బయ టకు వస్తే, ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌కు చెందిన 154 మంది ఎంపీలు ఆయనకు మద్దతు ఇస్తార ని చరణ్ సింగ్‌కు సంజయ్ గాంధీ ద్వారా ఆఫర్ పంపారామె. 1979 జూలై 1న మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ నుండి బయటకు వచ్చారు చరణ్ సింగ్. ఆమె ఆశించినట్టే మొరార్జీ ప్రభుత్వం పడిపోయింది.రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 1979 జూలై 28న చరణ్ సింగ్‌తో రాష్ట్రపతి భవన్లో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 23 రోజులు గడిచాక కాంగ్రెస్ ఎంపీలు చరణ్ సింగ్ ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతును వెనక్కి తీసుకున్నారు. పార్లమెంటులో బల పరీక్షకు వెళ్ళకుండానే, ఆగష్టు 20 నాడు పదవికి రాజీనామా చేసి పార్లమెంటును రద్దు చేయాల్సిందిగా రాష్ట్రపతిని కోరారు కిసాన్ నేత చరణ్ సింగ్.ఆగస్టు 22న లోక్‌సభ రద్దు కావడంతో 1980 జనవరిలో మధ్యంతర ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ గెజిట్ నోటిపికేషన్ విడుదల చేసింది. సంజయ్ గాం«ధీ తన సన్నిహితులకు, యువతకు అత్యధిక టిక్కెట్లు ఇచ్చి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపారు. కాంగ్రెస్ 353 సీట్లతో అఖండ విజయం సాధించింది. ఎమర్జెన్సీ రోజుల్లో రాజ్యాంగేతర శక్తిగా అధికారం చలాయించిన సంజయ్... అమేథీ నియోజకవర్గం నుండి గెలిచి అఫీషియల్ సూపర్ పవర్ సెంటర్‌గా ఎదిగారు.1980 జూన్ 23న ఉదయం 8 గంటలు. డిల్లీ సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్టు గగన వీధుల్లో టూ సీటర్ పిట్స్ – 2ఏ విమానం పచార్లు చేస్తూ దగ్గరే ఉన్న చెట్టుకు ఢీకొని మంటలతో నేలకూలింది. చెట్టు కొమ్మల్లో ఇరుక్కున్న రెండు శవాలు గుర్తుపట్టలేనివిధంగా కాలిపోయాయి. అవి ఆ విమానంలోని ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ సుభాష్ సక్సేనా(50), ట్రైనీ పైలట్ సంజయ్ గాంధీ (33)వి అని తేలాయి. సంజయ్ గురించి కుష్వంత్ సింగ్ ‘99: అన్ఫర్గెటబుల్ ఫిక్షన్, నాన్– ఫిక్షన్, పొయిట్రీ అండ్ హ్యూమర్’ పుస్తకంలో ఇలా అన్నారు: ‘నాకు సంజయ్ అంటే ఇష్టం. కానీ అతను జీవించి ఉంటే, ఈ దేశంలో క్రమశిక్షణ ఉండేది, అభివృద్ధి కూడా వేగంగా జరిగేది. ప్రజాస్వామ్యం మాత్రం ఉండేది కాదు.’ – జిల్లా గోవర్ధన్ ‘ రిటైర్డ్ పీఎఫ్ కమిషనర్, ముంబై -
ఇరు వర్గాల వాదనలు విన్నాకే..
న్యూఢిల్లీ: టీఎంసీ తిరుగుబాటు వర్గానికి గుర్తింపు విషయంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మమతా బెనర్జీ సారథ్యంలోని ఎంపీల వాదనలు కూడా వినే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇరుపక్షాల వాదనలతోపాటు, న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకున్నాకే ఆయన అంతిమ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం టీఎంసీ మమత వర్గం నేత అభిషేక్ బెనర్జీకి కబురు పంపారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ ధ్రువీకరించారు. సాయంత్రం 4 గంటలకు తన కార్యాలయానికి రావాలంటూ మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్పీకర్ ఓం బిర్లా మెయిల్ పంపించారని ఆజాద్ వివరించారు. అయితే, అభిషేక్ ఆ సమయంలో ఈడీ కార్యాలయంలో ఉన్నారని, అధికారుల విచారణ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి కావచ్చని ఆజాద్ అన్నారు. దీంతో, స్పీకర్‌ను అభిషేక్ కలిసే అవకాశం లేకుండా పోయిందన్నారు. రెండు రోజుల క్రితం టీఎంసీ తిరుగుబాటు ఎంపీలంతా నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ)లో చేరుతున్నట్లు ప్రకటించడం తెల్సిందే. అయితే, వీరంతా తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. టీఎంసీ రెబల్స్ వినతిపై స్పీకర్ సానుకూలంగా స్పందించిన పక్షంలో లోక్‌సభలో రెండో అతిపెద్ద ఎన్డీయే పక్షంగా ఈ వర్గం అవతరించనుంది. లోక్‌సభలో స్పీకర్ మినహాయిస్తే బీజేపీ బలం 239 కాగా, టీడీపీకి 16, జేడీయూకి 12 మంది సభ్యుల బలముంది. మా బలం 22కు చేరుకోవచ్చు తమ వర్గం ఎంపీలందరినీ చేర్చుకునేందుకు ఎన్సీపీఐ అంగీకరించిందని టీఎంసీ తిరుగుబాటు వర్గం నేతల్లో ఒకరైన కాకోలీ ఘోష్ దస్తీదార్ తెలిపారు. తమ వర్గంలోని ఎంపీల సంఖ్య ప్రస్తుతమున్న 20 నుంచి 22 వరకు పెరగొచ్చని ఆమె వెల్లడించారు. లోక్‌సభలో టీఎంసీకి 28 మంది ఎంపీలున్నారు. ‘మేమంతా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సారథ్యంలోని ఎన్డీయేతో కలిసి పనిచేస్తాం’అని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ వద్ద మీడియాకు తెలిపారు. అదేవిధంగా, బెంగాల్లో టీఎంసీ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ‘వారంతా వేరు గ్రూపు, వాళ్ల అజెండా, అంశాలు వేరే. మాకు సంబంధం లేదు’అని కాకోలీ ఘోష్ చెప్పారు. ఎన్సీపీఐతో విలీనం మొదటి దశ పూర్తయిందని టీఎంసీ తిరుగుబాటు వర్గంలోని సుదీప్ బందోపాధ్యాయ్ తెలిపారు. జూలైలో పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. టీఎంసీ గుర్తులు, ఆస్తులు, ఇతర సంస్థాగత అంశాలపై వివాదాలను కోర్టులోనే తేల్చుకుంటామని సుదీప్ తెలిపారు. కాగా, పారీ్టలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను ఎన్సీపీఐ తమకు నివేదించాల్సిన అవసరముందని ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు తెలిపారు. ఎన్సీపీఐ సారథిగా జ్యోతిప్రకాశ్ చటర్జీ లోక్‌సభలో టీఎంసీ తిరుగుబాటు వర్గం చేరికతో ఒక్కసారిగా దేశ రాజకీయక యవనికపై తళుక్కుమన్న నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ)కు నూతన సారథిగా జ్యోతిప్రకాశ్ చటర్జీ నియమితులయ్యారు. ఇటీవల కాకోలీ ఘోష్ దస్తీదార్ సారథ్యంలోని టీఎంసీ ఎంపీలు ఎన్సీపీఐలో చేరారు. అనంతర పరిణామాల్లో ఆ పార్టీ వ్యవస్థాపకురాలైన షెవ్లీ కుందు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో, కాకోలీ ఘోష్ దస్తీదార్ ఆ బాధ్యతలను చేపడతారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కాకోలీ ఘోష్ దస్తీదార్ మంగళవారం ఒక ప్రకటన చేశారు. ఎన్సీపీఐ నూతన సారథిగా జ్యోతి ప్రకాశ్ నియమితులైనట్లు ఆమె ప్రకటించారు. అయితే, ఎన్సీపీఐ మాదిరిగానే ఈ జ్యోతిప్రకాశ్ పేరు కూడా ఎవరికీ అంతగా తెలియకపోవడం విశేషం. ఎన్సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)గా చెప్పుకుంటున్న శంతను దేవ్ ఈ పరిణామంపై స్పందించారు. జ్యోతిప్రకాశ్ చటర్జీ ఎవరూ తనకు తెలియదంటూ బాంబు పేల్చారు. ఎన్సీపీఐ కోసం ఎంతో కష్టపడ్డాం, ఇప్పుడు తమ పారీ్టలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. పెద్ద నేతలెందరో మా పారీ్టలో చేరడం సంతోషంగా ఉంది. అయితే, వీరెవరూ తమను సంప్రదించలేదన్నారు.అఖిలపక్ష భేటీకి టీఎంసీ రెబల్ నేతకు ఆహ్వానంకోల్కతా: బెంగాల్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 18వ తేదీ నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు గాను ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఈ ఏర్పాటు చేసింది. మమతా బెనర్జీ అనుకూల వర్గం ఎమ్మెల్యేలకు బదులుగా ప్రభుత్వం ఆహ్వానం పంపించలేదు. తిరుగుబాటు వర్గం ఎన్నుకున్న రితబ్రత బెనర్జీకి మాత్రమే ఆహ్వానం పంపించింది. మమత సారథ్యంలోని టీఎంసీ ప్రతిపక్ష నేతగా ప్రకటించిన శోభన్‌దేవ్ చటోపాధ్యాయ్‌ను ప్రభుత్వం ఆహ్వానించలేదు. ఇటీవలి ఎన్నికల్లో టీఎంసీ నుంచి ఎన్నికైన 80 మందికిగాను 65 మంది ఎమ్మెల్యేలు రితబ్రతకు మద్దతు ప్రకటించడం తెల్సిందే. దీంతో, టీఎంసీ తిరుగుబాటు వర్గమే ప్రముఖంగా అవతరించింది. టీఎంసీలో సంక్షోభం తీవ్రరూపం దాల్చిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా, అఖిలపక్ష సమావేశానికి ఐఎస్ఎఫ్ ఎమ్మెల్యే నౌషాద్ సిద్దిఖి, ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్, సీపీఎం ఎమ్మెల్యే ముస్తాఫిజుర్ రహమాన్ హాజరయ్యారు. -
టీఎంసీలో తిరుగుబాటు తుపాను.. ఇదేం ట్విస్ట్ బాబోయ్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు సృష్టించే పరిణామం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఇప్పుడు పార్టీ చీలిక అంచుల దాకా వెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన రెబల్స్ రాసిన సీక్రెట్ లేఖ ఒకటి బయటకు రావడం కలకలం రేపుతోంది. అంతేకాదు.. అసలైన తృణమూల్ కాంగ్రెస్ తమదేనని, పార్టీ ఎన్నికల గుర్తుపై కూడా హక్కు తమకే ఉందని వారు వాదిస్తున్నట్లు సమాచారం.ఏకంగా 19 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేసి, ప్రత్యేక పార్లమెంటరీ వర్గంగా గుర్తింపు ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడం సంచలనంగా మారింది. మే 18 తేదీతో స్పీకర్‌కు పంపిన ఆ రహస్య లేఖ.. కొన్ని మీడియా సంస్థల స్టింగ్ ఆపరేషన్ తర్వాత వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో మెజారిటీ ఎంపీలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. వాళ్లలో మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్, నటి-ఎంపీ రచనా బెనర్జీ, సయోనీ ఘోష్, శతాబ్ది రాయ్, కాకోలి ఘోష్ దస్తిదార్ తదితరులు ఉన్నారు. ఈ పరిణామంతో.. తృణమూల్‌లో కేవలం తొమ్మిది మంది మాత్రమే మమతా శిబిరంలో మిగిలినట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.రెబల్ ఎంపీలకు ఏ పార్టీనో, కూటమిలోనే చేరే ఉద్దేశం లేదని వాళ్ల లేఖను బట్టి అర్థమవుతోంది. స్వతంత్ర పార్లమెంటరీ గ్రూప్‌గా పనిచేస్తామని వాళ్లు స్పీకర్‌కు రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే వారి తదుపరి వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వంటి కీలక అంశాలపై కేంద్రం తీసుకునే నిర్ణయాలను కూడా ఈ వర్గం పార్టీ అధినాయకత్వం ఆదేశాలను పాటిస్తుందా? లేదా? అనే కుతూహలం నెలకొంది.ఇప్పటికే మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యవహార శైలిపై కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తమవుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఆ అసంతృప్తే ఇప్పుడు బహిరంగ తిరుగుబాటుగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలోనూ మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కావడం, ఇప్పుడు ఎంపీలు కూడా వేరు దారి పట్టడం.. తృణమూల్ 28 ఏళ్ల చరిత్రలోనే అతిపెద్ద అంతర్గత సంక్షోభంగా కనిపిస్తోంది.ఈ వ్యవహారంలో మరో కీలక అంశం కూడా ఉంది. తిరుగుబాటు ఎంపీలు స్పీకర్‌కు లేఖ రాసిన తేదీ మే 18. అయితే పార్టీ చీఫ్ విప్‌గా సీనియర్ నేత కల్యాణ్ బెనర్జీ నియామకం మే 19న జరిగింది. దీంతో సాంకేతికంగా ఈ వర్గానికి గుర్తింపు ఇవ్వాలా? వద్దా? అన్నది స్పీకర్ పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే.. పార్టీ గుర్తుపై కూడా రెబల్ వర్గం హక్కు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ వద్దే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారని వాదిస్తూ వారు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించే అవకాశముంది. మరోవైపు నటుడు.. సీనియర్ ఎంపీ శతృఘ్న సిన్హా మాత్రం తిరుగుబాటు వర్గానికి దూరంగా ఉంటూ మమతా బెనర్జీకే తన మద్దతు ప్రకటించారు. మహువా మెయిత్రా సైతం దీదీ పక్షాన నిలిచి అధికారిక శిబిరంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే పార్టీపై పట్టు కోల్పోతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న మమతకు.. రెబల్స్ తాజా ఎత్తుగడలు మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేక వర్గం, పార్టీ గుర్తు, ఎన్నికల సంఘం పోరు.. ఇలా ఒక్కో అడుగు ముందుకేస్తున్న తిరుగుబాటు నేతలు దీదీ శిబిరంలో ఆందోళన పెంచుతున్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే.. ఈ వివాదం ఎన్నికల సంఘం నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. -
టీఎంసీలో తిరుగుబాటు.. దీదీ నెత్తిన పాలు పోస్తున్న రాజ్యాంగ సవరణ!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ తిరుగుబాటు ప్రకంపనలు రేపుతోంది. పార్టీకి చెందిన సుమారు 20 మంది లోక్‌సభ సభ్యులు మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక వర్గంగా ఏర్పడేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సంఖ్యాబలం చూస్తే ఇది దీదీకి భారీ ఎదురుదెబ్బలా కనిపిస్తున్నా.. చట్టపరంగా మాత్రం రెబల్స్‌కే షాక్ తగిలే పరిస్థితి ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.లోక్‌సభలో టీఎంసీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో 20 మంది తమవైపే ఉన్నారని తిరుగుబాటు వర్గం చెబుతోంది. అయితే రెండు మూడొంతుల మంది ఎంపీలు ఉన్నారనే కారణంతోనే అనర్హత నుంచి రక్షణ లభించదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి రాజకీయ చీలికలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన 91వ రాజ్యాంగ సవరణ ఇప్పుడు మమతా బెనర్జీ వర్గానికే అండగా నిలుస్తోందని విశ్లేషిస్తున్నారు.ఒకప్పుడు రాజకీయ పార్టీల్లో చీలికలకు చట్టంలో కొంత వెసులుబాటు ఉండేది. శాసనసభ లేదంటే పార్లమెంట్లో మూడింట ఒక వంతు మంది సభ్యులు విడిపోయినా అనర్హత నుంచి రక్షణ పొందే అవకాశం ఉండేది. అయితే 2003లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణతో ఆ నిబంధనను పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి "స్ప్లిట్"(చీలిక) అనే భావనకు చట్టపరమైన గుర్తింపు లేదు. ఇప్పుడు రక్షణ పొందాలంటే "మెర్జర్"(విలీనం) మాత్రమే మార్గంగా మిగిలింది.అక్కడే టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు చిక్కులు మొదలవుతున్నాయి. ఎందుకంటే కేవలం ఎంపీలు విడిపోయి కొత్త బ్లాక్‌గా ఏర్పడితే అది విలీనంగా పరిగణించబడదు. పార్టీ సంస్థ మొత్తం మరో పార్టీలో విలీనం కావడం.. దానికి కనీసం రెండు మూడొంతుల మంది ప్రజాప్రతినిధులు అంగీకరించడం వంటి షరతులు నెరవేరినప్పుడే అనర్హత నుంచి రక్షణ లభిస్తుంది. లేదంటే పార్టీని స్వచ్ఛందంగా వీడినట్టుగా పరిగణించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.ఇదే కారణంగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మరో ప్రశ్న వినిపిస్తోంది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అనుసరించిన వ్యూహాన్ని టీఎంసీ తిరుగుబాటు వర్గం అమలు చేయగలదా? శివసేన సంక్షోభంలో షిండే వర్గం కేవలం ఎమ్మెల్యేలను కూడగట్టుకోవడమే కాదు.. తామే అసలైన శివసేన అని ప్రకటించి పార్టీ సంస్థపై హక్కు కోసం పోరాటం చేసింది. చివరకు ఎన్నికల సంఘం ముందు తమ వాదనను నిలబెట్టి పార్టీ పేరు, గుర్తుపై ఆధిపత్యం సాధించింది.టీఎంసీ తిరుగుబాటు వర్గం కూడా అదే దారిలో నడవాలంటే కేవలం ఎంపీల సంఖ్య సరిపోదు. పార్టీ సంస్థలో, రాష్ట్ర స్థాయి నిర్మాణాల్లో, జిల్లా కమిటీల్లో, ఇతర విభాగాల్లో తమకే మెజారిటీ మద్దతు ఉందని నిరూపించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే "అసలైన టీఎంసీ మాదే" అనే వాదనకు బలం చేకూరే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రత్యేక బ్లాక్‌గా ఏర్పడటం మాత్రమే జరిగితే అనర్హత ముప్పు తప్పకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అంటే ప్రస్తుతం తిరుగుబాటు ఎంపీల ముందు రెండు మార్గాలే కనిపిస్తున్నాయి. ఒకటి.. చట్టబద్ధమైన విలీనం దిశగా అడుగులు వేయడం. రెండోది.. తామే అసలైన టీఎంసీ అని ప్రకటించి పార్టీపై హక్కు కోసం పోరాటం చేయడం. ఈ రెండింటిలో ఏదీ చేయకుండా కేవలం ప్రత్యేక వర్గంగా కొనసాగితే యాంటీ డిఫెక్షన్ చట్టం వారి మెడకు చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అందుకే రాజకీయ విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేస్తున్నారు. బయటికి చూస్తే ఇది మమతా బెనర్జీకి ఎదురుదెబ్బలా కనిపించినా.. చట్టపరంగా చూస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు ఆమెకే అండగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయ చీలికలను ప్రోత్సహించకుండా తీసుకొచ్చిన 91వ రాజ్యాంగ సవరణే ఇప్పుడు టీఎంసీ తిరుగుబాటుదారులకు అతిపెద్ద అడ్డంకిగా మారిందని చెబుతున్నారు.మొత్తానికి టీఎంసీలో జరుగుతున్నది కేవలం ఎంపీల తిరుగుబాటు మాత్రమే కాదు. ఇది పార్టీపై హక్కు కోసం సాగబోయే పెద్ద రాజకీయ, న్యాయపోరాటానికి నాంది కావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 20 మంది ఎంపీలు ఉన్నంత మాత్రాన చట్టం కళ్లలో రక్షణ లభించదు. "అసలైన టీఎంసీ ఎవరిది?" అనే ప్రశ్నకు సమాధానం దొరికే వరకు ఈ పోరాటం కొనసాగనుంది. -
రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కన్నుమూత
న్యూఢిల్లీ: లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి కశ్యప్ తుదిశ్వాస విడిచారు. 97 ఏళ్ల కశ్యప్ దీర్ఘకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గురువారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలో ని సైనిక్ఫామ్ సొంతింట్లో గుండెపోటుతో కన్నుమూశారని లోక్‌సభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో పేర్కొంది. జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఏర్పాటైన అత్యున్నత కమిటీలో కశ్యప్ సభ్యునిగా ఉన్నారు. 1983 నుంచి ఏడేళ్లపాటు లోక్‌సభ ప్రధాన కార్యదర్శిగా కశ్యప్ సేవలందించారు. జవహర్లాల్ నెహ్రూ కాలంలో కొలువుతీరిన తొలి లోక్‌సభ మొదలు 9వ లోక్‌సభాకాలం దాకా మొత్తంగా 37 సంవత్సరాలపాటు పార్లమెంట్లో పనిచేసి రాజ్యాంగం సంబంధ విషయాలపై కశ్యప్ అసాధారణ పట్టుసాధించారు. 100కుపైగా పుస్తకాలను రచించారు. స్వాతం్రత్యానికి పూర్వం యునైటెడ్ ప్రావిన్స్‌లో నేటి ఉత్తరప్రదేశ్‌లో 1929లో బిజ్నోర్ పరిధిలోని ఛాద్‌పూర్ గ్రామంలో స్వాతంత్య్రసమరయోధుల కుటుంబంలో కశ్యప్ జని్మంచారు. తండ్రి, తాతల మాదిరిగా టీనేజీలోనే దేశస్వాతంత్య్రం కోసం పోరాటం ఆరంభించారు. బిజ్మోర్లో స్థానికంగా విద్యార్థి ఉద్యమంలో పాల్గొని తర్వాత మీరట్‌లో కొనసాగించారు. ఈయన చక్కటి చదువరి. అలహాబాద్ మొదలు న్యూఢిల్లీ, వాషింగ్టన్ డీసీ, లండన్, జెనీవా నగరాల దాకా పలు విద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. అయినాసరే పాత్రికేయునిగా వృత్తిజీవితం మొదలెట్టారు. తర్వాత అలహాబాద్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తర్వాత అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా శిక్షణ పొందారు. చివరకు పార్లమెంట్లో ఉద్యోగంలో చేరారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగం అమలుతీరును పర్యవేక్షించే జాతీయ కమిషన్‌లో ముసాయిదా కమిటీ చైర్మన్‌గా సేవలందించారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాక పంచాయతీరాజ్ చట్టాలపై భారత ప్రభుత్వానికి గౌరవ రాజ్యాంగ సలహాదారుగానూ పనిచేశారు. ఆయన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం గతంలో ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది. ఈయనను ఎన్నో గౌరవ డాక్టరేట్లు వరించాయి. ఈయనకు భార్య, ఇద్దరు కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కశ్యప్ మరణవార్త తెలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. -
50 శాతం ఫార్ములాతో దక్షిణాదికి మేలు
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా 1996 సెప్టెంబర్ 13న మహిళా ఎంపీలందరూ పార్టీలకతీతంగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఏకతాటిపైకి వచ్చారు. లోక్‌సభలో ఈ విషయంపై గళమెత్తారు. మహిళా బిల్లును జాయింట్ కమిటీకి పంపడంపై దివంగత నేత సుష్మా స్వరాజ్ ‘దేశ మహిళలపై జరిగిన భారీ కుట్ర’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిల్లును జాయింట్ కమిటీకి పంపి వెంటనే లోక్ సభను రద్దు చేశారు. దీంతో మళ్లీ మహిళా బిల్లు పార్లమెంటు ముందుకు రావడానికి 27 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. మోదీ ప్రభుత్వం 2023లో ‘నారీశక్తి వందన్ అధినియం’ బిల్లు తీసుకొచ్చింది. 2034 నాటికి రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉండగా, 2029 నాటికే మహిళలకు హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి, రాజ్యాంగ సవరణ తీసుకురావాలని మోదీ ప్రభుత్వం చూసింది. కానీ, స్వార్థ రాజకీయ కుట్రల వల్ల దేశ జనాభాలో 50%గా ఉన్న మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించి, డీలిమిటేషన్ ద్వారా మరిన్ని ఎక్కువ సీట్లలో పోటీచేసే అవకాశం చేజారింది. మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ఈ రెండు చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగినవి. మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించడం, ప్రాంతీయ సమతుల్యతను కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలపరచడం– ఇవి రెండూ దేశ భవిష్యత్తును నిర్ధారించే కీలకమైన అంశాలు.దాదాపు 3 దశాబ్దాలుగా ఈ బిల్లును తీసుకురావాలని, మహిళా లోకానికి సాధికారత కల్పించాలని చర్చోపచర్చలు జరుగుతున్నప్పటికీ, కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు దీన్ని అడ్డుకున్నాయి. 1996లో దేవేగౌడ హయాంలో... ఆ తర్వాత 1998, 1999, 2002లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఈ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంది. ఎన్డీయే ఒత్తిడితో యూపీఏ హయాంలో 2008–10 మధ్యలో ఈ బిల్లును ప్రవేశపెట్టినా, తమ మిత్రపక్షాలతో కలిసి ముందుకు సాగకుండా చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. అనవసర దుష్ప్రచారండీలిమిటేషన్పై చర్చలు మొదలైనప్పటినుంచే, విపక్షాలు దక్షిణాదిపై ఎక్కడలేని ధృతరాష్ట్ర ప్రేమను కురిపించాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే... తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని గగ్గోలు పెట్టాయి. కాంగ్రెస్ ఆడిన ఈ నాటకానికి డీఎంకే, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు వంతపాడాయి. దక్షిణాదికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనీయమని ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే చెప్పినా దుష్ప్రచారం ఆగలేదు.అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు 50% సీట్లు పెంచేందుకు తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లును కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న 129 సీట్లు 50% పెరిగి 195 సీట్లకు చేరే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 సీట్లు 26కు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 స్థానాలు 38కి పెరిగేందుకు వీలుండేది. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 సీట్లు 59కి, కర్ణాటకలో 28 నుంచి 42కు, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెంచేలా మోదీ సర్కారు సరికొత్త ఫార్ములాను రూపొందించింది. దీని ద్వారా దక్షిణాది సీట్లకు ‘జనాభా ప్రాతిపదికన’ నష్టం జరగకుండా, ఆ మాటకొస్తే ప్రత్యేకమైన లాభం జరిగేలా ఈ ఫార్ములా మేలు చేకూర్చేది. దీనివల్ల ఆ యా పార్టీలకు ఏం ఒరిగిందో తెలియదు కానీ... 70 కోట్ల మంది మహిళలకు, 30 కోట్ల మంది దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు మాత్రం అన్యాయం జరిగింది. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యాన్ని మరింతగా పెంచే అవకాశాన్ని కూడా కాంగ్రెస్, వారి మిత్ర పక్షాలు దెబ్బకొట్టాయి. ప్రస్తుతం దక్షిణాదిలో ఎస్సీలకు 21 స్థానాలు, ఎస్టీలకు 5 స్థానాలు రిజర్వేషన్లుండగా... 50% సీట్లను పెంచితే, ఎస్సీలకు 32 స్థానాలు, ఎస్టీలకు 8 స్థానాలు దక్కేందుకు వీలుండేది. అలాచేస్తే దక్షిణాదికి నష్టంమహిళా బిల్లు విషయంలోనే కాదు, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాల విషయాల్లోనూ కాంగ్రెస్ ఇలాగే వ్యవహరించింది. ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు, ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుందని తెలిసినా వ్యతిరేకించింది. ఆర్టికల్ 370 రద్దు చేసి దేశ సమగ్రతను బలపరిచే ప్రయత్నం చేసినప్పుడూ వ్యతిరేకించింది. రైతుల అభివృద్ధి కోసం తెచ్చిన సంస్కరణలను రాజకీయ కారణాలతో వ్యతిరేకించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్థంలేని కొత్త ఫార్ములాను తీసుకొచ్చారు. దీని ప్రకారం... తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 సీట్లు 15కు తగ్గుతాయి. ఇది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయం. రేవంత్ రెడ్డి ఫార్ములా ప్రకారం తెలంగాణే కాదు, దక్షిణాది రాష్ట్రాలన్నీ నష్టపోతాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కాకుండా, ఈ ఫార్ములా ప్రకారం... ఏపీ 16 సీట్లు, తెలంగాణ 11 సీట్లు, కర్ణాటక 16 సీట్లు, కేరళ 16 సీట్లు, తమిళనాడు 27 సీట్లు... ఇలా మొత్తం దక్షిణాది రాష్ట్రాలు 86 సీట్లు నష్టపోనున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలు. దక్షిణాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మహిళలు చైతన్యవంతులు. చాలా సందర్భాల్లో ఇది నిరూపితమైంది. మహిళల గౌరవం, దేశ సమగ్రత, దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి అడ్డుకట్ట వేసిన పార్టీలు చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయం. జి.కిషన్ రెడ్డివ్యాసకర్త కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి -
పాత చట్టం అయితే ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును సోమవారం తిరిగి సభలో ప్రవేశపెడితే తమకు ఆమోదమే అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అవసరమైతే ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 సీట్లలో 1/3 వంతు సీట్లు, రాష్ట్రాల శాసనసభల్లో 1/3 వంతు సీట్లు మహిళలకు కేటాయించేలా బిల్లులో మార్పులు చేసి ప్రవేశపెట్టినా ఇండియా కూటమితో సహా తాము మద్దతు ఇస్తామని చెప్పారు. సోమవారం బిల్ పాస్ చేసుకుని, మంగళవారం నుంచే ఈ చట్టాన్ని అమలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ‘ఒక గంట సమయం ఇస్తే బిల్లులో మార్పులు చేసి తెస్తామని కేంద్రమంత్రి అమిత్‌షా చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే సోమవారం వరకు ప్రస్తుతమున్న 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకు రావాలి..’అని ముఖ్యమంత్రి అన్నారు. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టి రాజ్యాంగాన్ని మార్చుతామంటే దేశ ప్రజలు ఒప్పుకోరని అన్నారు. పార్లమెంట్లో ఓడిపోయింది మోదీ అహంకారమేనని వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం విలేకరులతో మాట్లాడారు. అలాగైతే నేను దక్షిణాది రాష్ట్రాల సీఎంల మద్దతు కూడగడతా.. ‘నియోజకవర్గాల పునర్విభజనకు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలి. నిపుణులతో చర్చించాలి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకోవాలి. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి జాతీయ ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలి. ఆయా రాష్ట్రాలతో సంప్రదించి శాసనసభల్లో స్థానాల సంఖ్య పెంచవచ్చు. 2011 జనాభా లెక్కలు, ఇతర డేటా ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయి. 2009లో డీలిమిటేషన్ జరిగింది. ఆ లెక్కలతో ఆగస్టు 15, 2026 లోపు మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించవచ్చు. ఆ రిజర్వేషన్లను ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో 2027లో జరిగే ఎన్నికల్లో అమలు చేయవచ్చు. ఆ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తే... తెలంగాణ సీఎంగా నేను బాధ్యత తీసుకుని దక్షిణాది రాష్ట్రాల సీఎంలు స్టాలిన్, పినరయి విజయన్, సిద్ధరామయ్య, చంద్రబాబునాయుడు, రంగసామిలతో చర్చలు జరుపుతా. ఇండియా కూటమి నేతల మద్దతు కూడగతా. 2023లో పాస్ అయిన బిల్లుకు ఒక చిన్న మార్పు చేసి రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఉద్దేశం రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్లు ఎత్తివేయడమే..’అని రేవంత్ స్పష్టం చేశారు. ప్రమాదకరమైన పునర్విభజనను అడ్డుకున్నాం.. ‘దేశ భవిష్యత్తును, సమగ్రతను బలహీనపర్చేలా దేశ రాజకీయ చిత్రపటాన్నే మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తీసుకువచ్చింది. దానిని ప్రతిపక్ష పార్టీలు ఓడించాయి. కేవలం ప్రమాదకరమైన నియోజకవర్గాల పునర్విభజననే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని, మోదీ అహంకారాన్ని నిలువరించాయి. వాస్తవానికి ఎంపీ సీట్ల పెంపుతో ఎలాంటి లాభం లేదు. కేవలం పాలసీలు రూపొందించేందుకే రెండు సభలు ఉన్నాయి. దీనికన్నా రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచడం ఉత్తమం. ఇందుకోసం 2026 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలి. మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఏ ఒక్కరూ ప్రశ్నించలేరు. దేశానికి కాంగ్రెస్ మహిళా రాష్ట్రపతి, ప్రధానమంత్రిని అందించింది. లోక్‌సభ స్పీకర్‌గా, అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులుగా మహిళలను కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ 1980లో ఏర్పడిన బీజేపీకి ఇప్పటివరకు 15 మంది అధ్యక్షులైతే అందులో ఒక్కరూ కూడా మహిళ లేరు. అడ్వాని, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్లు రెండు మూడు సార్లు అధ్యక్షులయ్యారు. కానీ ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదు..’అని సీఎం చెప్పారు. తాను సూచించిన విధానం బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌కు నచ్చకపోతే ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పాలని అన్నారు. ‘తల్లిని చంపి.. బిడ్డను రక్షించారు..’అని మోదీ రాష్ట్ర విభజనపై పలుమార్లు ద్వేషం చూపారని, ఇప్పుడు ఆయన బాటలోనే ఎంపీ తేజస్వీ సూర్య పయనిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కార్, బలరాం నాయక్, విప్‌లు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, మనోహర్‌రెడ్డి, మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బలహీనంగా ఉన్నప్పుడు కబ్జా చేస్తారు.. విలేకరుల సమావేశం అనంతరం సీఎం మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా.. ‘బిల్లులకు టీడీపీ మద్దతు ఇచ్చింది. దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఆ పార్టీకీ రాజకీయంగా నష్టం చేకూరుతుందా?’అనే ప్రశ్నకు.. ‘ప్రభావం ఏమీ ఉండదు. సభలో నీళ్లకు నీళ్లు.. పాలకు పాలు తేలిపోయాయి. అదొక ముగిసిన అధ్యాయం. బీజేపీతో ఎవరు కలిసినా వారికి ఏదో ఒకరోజు వాళ్లే (బీజేపీ) నష్టం చేస్తారు. అందుకు నితీశ్‌కుమార్, ఏక్నాథ్ షిండే, నవీన్ పట్నాయక్‌లే ఉదాహరణ. వాళ్లు బలహీనంగా ఉన్నప్పుడు వీళ్లు కబ్జా చేస్తారు. మనం బలహీనపడ్డప్పుడు వాళ్లు మనల్ని తినేస్తారు..’అని రేవంత్ వ్యాఖ్యానించారు. -
దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టాలపై YS జగన్ సంచలన పోస్ట్
-
వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. వరుదు కళ్యాణి రియాక్షన్
-
జనగణన పూర్తి కాకుండానే డీలిమిటేషన్ బిల్లు.. దక్షిణాదికి జరిగే నష్టం ఇదే!
-
దక్షిణాది ప్రాతినిధ్యానికి కోత దేశద్రోహమే: రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేవలం అధికారంలో కొనసాగడం కోసం దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలకు, చిన్న రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం తలపెట్టిన డీలిమిటేషన్ నిజానికి దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చే కుట్ర. ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యే’’అంటూ దుయ్యబట్టారు. రాజ్యాంగ (131వ) సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల బిల్లులపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చలో రాహుల్ సుదీర్ఘంగా మాట్లాడారు. సవరణ బిల్లును ‘చాలా ప్రమాదకరమైనది’గా అభివర్ణించారు. ‘‘మోదీ సర్కారు పూనుకున్న ఈ దేశ వ్యతిరేక చర్యకు విపక్షాలు మద్దతిచ్చే ప్రసక్తే లేదు. సవరణ బిల్లును ఓడించి తీరతాయి’’అని పేర్కొన్నారు. అది ఆమోదం పొందదని బీజేపీకి కూడా తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను, ప్రధాని మోదీ తీరును ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ఎండగట్టారు. దళితులు, ఓబీసీలకు అన్యాయం కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది అసలు మహిళా బిల్లు కానే కాదని రాహుల్ కొట్టిపారేశారు. ‘‘నిజమైన మహిళా బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. దాన్ని పదేళ్ల తర్వాత అమలు చేస్తామని బీజేపీ చెబుతోంది. ఇది కేవలం మహిళల మాటున దాక్కుని దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేందుకు చేసిన సిగ్గుమాలిన చర్య! జమ్మూకశ్మీర్‌లో, అస్సాంలో బీజేపీ ఇదే పని చేసింది. దాన్నిప్పుడు దేశమంతటా అమలు చేసే పనిలో పడింది. వారికి దమ్ముంటే పాత బిల్లును ఇప్పుడే తేవాలి. దాన్ని ఈ క్షణం నుంచే అమలు చేసేలా విపక్షాలన్నీ మద్దతిస్తాయి’’అని సవాలు చేశారు. ఓబీసీలు, దళితులకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించకుండా వారిని అధికారానికి దూరం చేయడమే బీజేపీ ఉద్దేశమని రాహుల్ ఆరోపించారు. అందుకే కులగణనకు ముందే హడావుడిగా బిల్లు తెచ్చిందని ఆక్షేపించారు. ‘‘బీజేపీ నేతలు ఓబీసీలను, దళితులను హిందువులని పిలుస్తారు. కానీ దేశ అధికార నిర్మాణంలో వారికి కనీస స్థానమివ్వరు! కార్పొరేట్ రంగంలో, న్యాయవ్యవస్థలో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, మీడియాలో దళితులు, ఓబీసీలు ఎక్కడున్నారు?’’అంటూ నిలదీశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ’మనువాదాన్ని’తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. దక్షిణాది, ఈశాన్య ప్రజలకు అండగా కాంగ్రెస్ దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని రాహుల్ అన్నారు. ‘‘అక్కడి సోదరసోదరీమణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత సమాఖ్యలో మీరంతా సమాన భాగస్వాములే. లోక్‌సభలో మీ ప్రాతినిధ్యాన్ని తాకే సాహసం చేయడానికి బీజేపీని అనుమతించబోం’’అని చెప్పారు. ‘‘గతంలో ఇందిరాగాం«దీ, వాజ్‌పేయి వంటి ప్రధానులు కూడా డీలిమిటేషన్ సవాలును ఎదుర్కొన్నారు. కానీ దానివల్ల దేశానికి జరిగే ప్రమాదాన్ని గుర్తించి వెనక్కి తగ్గారు’’అని ఆయన గుర్తు చేశారు. ‘16’లోనే అంతా దాగుంది! ప్రసంగం సందర్భంగా దేశ ప్రజలకు రాహుల్ గాంధీ ఒక పజిల్ ఇచ్చారు. ‘‘నిన్న లోక్‌సభలో ప్రధాని ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనించా. ఆయనలో ఉత్సాహమే లేదు. ఎందుకంటే ఈ బిల్లు పాస్ కాదని ఆయనకు తెలుసు. అంతలో తేదీ చూసి ఆశ్చర్యపోయా! అది ఏప్రిల్ ‘16’. అసలు మర్మమంతా అందులోనే దాగుంది! మీ సమస్యలన్నింటికీ సమాధానం ‘16’లోనే దొరుకుతుంది. అదేమిటో ఎవరికైనా అర్థమైతే ఎక్స్‌లో నాకు మెసేజ్ చేయండి’’అంటూ సభికుల్లో ఆసక్తి రేకెత్తించారు. మోదీ ఓ మాంత్రికుడు! ప్రధాని మోదీపై లోక్‌సభలో రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయనను బాలకోట్, సిందూర్, పెద్ద నోట్ల రద్దు మాంత్రికునిగా అభివర్ణించి సభలో కలకలం రేపారు. ‘‘ఒక బడా వ్యాపారవేత్తతో మోదీ కుమ్మక్కయ్యారు. ఈ మాంత్రికుని చరిత్ర, ప్రధాని అయ్యేదాకా జరిగిన ప్రతి విషయమూ ఆ బడా వ్యాపారవేత్తకు పూర్తిగా తెలుసు. ఆ రహస్యాల సాయంతోనే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. అమెరికాతో పలు ఒప్పందాలు కూడా ప్రధానిగా మోదీ రాజీ పడటం వల్లే జరిగాయి’’అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. అభ్యంతరకర పదాలు వాడినందుకు ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. బాలాకోట్, సిందూర్ ప్రస్తావనతో సాయుధ దళాలను రాహుల్ అవమానించారని దుయ్యబట్టారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. మోదీకి, నాకు భార్య బాదరబందీ లేదు లోక్‌సభలో నవ్వులు పూయించిన రాహుల్ మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుపై ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీని, తనను ఉద్దేశించి రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరికీ భార్య తాలూకు బాదరబందీ లేదంటూ సభలో నవ్వులు పూయించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు చేసిన సరదా వ్యాఖ్యలు ఇందుకు నేపథ్యమయ్యాయి. ‘‘కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ ఆయన భార్యపై అందమైన కవిత అల్లారు. దాంతో నా భార్య తనకోసం నేనలా కవిత చెప్పలేదని నాపై అలిగింది’’అని రిజిజు చెప్పుకొచ్చారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ, ‘‘జాతి నిర్మాణంలో మహిళలే ప్రధాన చోదక శక్తి. మగవాళ్లను వాళ్లెంతగానో ప్రభావితం చేస్తారు. తల్లి, సోదరి, భార్య నుంచి ఎంతో నేర్చుకుంటాం. అయితే ప్రధానికి, నాకు భార్య బాదరబందీ లేదనుకోండీ! కాకపోతే తల్లి, సోదరి ఉన్నారు’’అనడంతో సభికులంతా గొల్లున నవ్వారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపైనా ఈ సందర్భంగా రాహుల్ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘గురువారం సభలో నా సోదరి ప్రియాంక గొప్పగా ప్రసంగించింది. ఆ క్రమంలో 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను సాధించలేని దాన్ని తను కేవలం ఐదే నిమిషాల్లో చేసి చూపించింది. అదేమిటో తెలుసా? అమిత్ షాను నవ్వించడం!’’అనడంతో సభంతా మరోసారి నవ్వుల్లో మునిగిపోయింది. ఏమిటా ‘16 పజిల్’? లోక్‌సభలో ప్రసంగం సందర్భంగా రాహుల్ పేర్కొన్న ‘16 పజిల్’ఏమై ఉంటుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు మర్మమంతా 16 సంఖ్యలోనే దాగుందని, అదేమిటో ఎవరికైనా అర్థమైతే చెప్పాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పలు ఊహాగానాలకు తెర తీశాయి. బహుశా అధికార ఎన్డీఏ కూటమికి చెందిన 16 మంది టీడీపీ లోక్‌సభ సభ్యులు రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారన్నది ఆయన ఉద్దేశం కావచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. 16 సంఖ్య ‘ఎప్స్టీన్’లా ధ్వనిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేసింది. తద్వారా, ఆ సెక్స్ కుంభకోణానికి సంబంధించి విడుదలైన 16 నిమిషాల వీడియో టేప్‌ను ఉద్దేశించి రాహుల్ ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని సంకేతమిచ్చింది. -
నారీ.. సారీ
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు పార్లమెంటులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు, లోక్‌సభ స్థానాల సంఖ్యను 816 పెంచేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. ముందునుంచీ ఊహించినట్టుగానే బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని అధికార పక్షం సాధించలేకపోయింది. శుక్రవారం సాయంత్రం లోక్‌సభలో చేపట్టిన కీలక ఓటింగ్‌లో మొత్తం 540 మంది సభ్యులకు గాను 528 మంది పాల్గొన్నారు.బిల్లు ఆమోదానికి 352 ఓట్లు రావాల్సి ఉండగా 298 మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. 230 మంది విపక్ష సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో సవరణ బిల్లు వీగిపోయినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. దానితో పాటుగా ప్రవేశపెట్టిన డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను కూడా వెనక్కు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ఆ రెండు బిల్లులూ రాజ్యాంగ సవరణ బిల్లుతోనే ముడిపడి ఉన్నందున వాటిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో ఒక బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి! ఈ నేపథ్యంలో మోదీ సర్కారు లోక్‌సభ స్థానాల పెంపు యత్నాలకు తాత్కాలికంగా తెర పడినట్టే. సవరణ బిల్లువీగిపోయినంత మాత్రాన నిరాశ చెందబోమని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు తమ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుందని రిజిజు పేర్కొన్నారు. కాంగ్రెస్, తృణమూల్, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పక్షాలు ఎంతటి మహిళా వ్యతిరేకులో ఈ ఉదంతం మరోసారి రుజువు చేసిందంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు దుయ్యబట్టారు. మహిళా బిల్లు ముసుగులో స్వీయ రాజకీయ లబ్ధి కోసం లోక్‌సభ నియోజకవర్గాలను పెంచుకోవాలన్న బీజేపీ కుట్రలకు అడ్డుకట్ట పడిందని కాంగ్రెస్ తదితర పార్టీలు చెప్పుకొచ్చాయి. 2029 లోక్‌సభ ఎన్నికల్లోనే గాక దేశవ్యాప్తంగా ఇకపై జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ విపక్షాలు మహిళల ఆగ్రహ జ్వాలలను చవిచూడక తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. సవరణ బిల్లును విపక్షాలు ఓడించడాన్ని బీజేపీ మహిళా ఎంపీలు తీవ్రంగా నిరసించారు. శుక్రవారం సాయంత్రం లోక్‌సభ వాయిదా పడ్డ అనంతరం పార్లమెంటు ఆవరణలో వారు ధర్నాకు దిగారు. ‘మహిళలకు జరిగిన అవమానాన్ని భారత్ సహించబోదు’ అంటూ ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజె, అన్నపూర్ణా దేవి, రక్షా ఖడ్సే, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. విపక్షాల తీరును నిరసిస్తూ బీజేపీ మహిళా ఎంపీల నినాదాలు పార్లమెంటు ప్రత్యేక భేటీ మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు వీలుగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చట్టానికి మోదీ సర్కారు కీలక సవరణలు చేపట్టింది. అందుకోసం రూపొందించిన మూడు బిల్లుల ఆమోదానికి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచింది. రాజ్యాంగ (131వ సవరణ), డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లులను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేయాలని, అందుకోసం లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి 816కు పెంచాలని, అందుకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని రాజ్యాంగ సవరణ బిల్లులో కీలక ప్రతిపాదనలు చేసింది. మూడు బిల్లులపై గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం దాకా లోక్‌సభలో 18 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగింది. 130 మందికి పైగా ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును సభ ఓటింగ్‌కు చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు విపక్ష నేత రాహుల్‌గాంధీ కూడా సభలో ఉన్నారు. బిల్లు వీగిన అనంతరం రిజిజు మాట్లాడుతూ ఇది పూర్తిగా విపక్షాల పాపమేనన్నారు. దేశ మహిళలను గొప్పగా గౌరవించుకునే సువర్ణావకాశాన్ని అవి కోల్పోయాయంటూ ఆక్షేపించారు. ‘‘కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి. దేశ మహిళలు ఆ పార్టీని ఎప్పటికీ క్షమించరు’’ అంటూ దుయ్యబట్టారు. మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేదాకా తమ ప్రభుత్వం విశ్రమించబోదని మంత్రి చెప్పారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచే బిల్లును ఓడించి కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలు సంబరాలు చేసుకోవడం దారుణమని అమిత్ షా ఆక్షేపించారు. మహిళల పట్ల వారి వివక్షకు ఇది అద్దం పట్టిందన్నారు. రాజ్యాంగంపై మోదీ సర్కారు తలపెట్టిన దాడిని మాత్రమే తాము ఓడించామని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. ఎన్డీఏకు ‘ఐదు’ అదనం ‘ఇండియా’కు 3 తక్కువ మహిళా చట్ట సవరణ బిల్లుపై చేపట్టిన ఓటింగ్‌లో అధికార ఎన్డీఏ కూటమికి దాని పూర్తి బలం కంటే 5 ఓట్లు అదనంగా రావడం విశేషం. అదే సమయంలో విపక్ష ఇండియా కూటమికి మొత్తం బలం కంటే 3 ఓట్లు తగ్గాయి. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నింటికీ కలిపి 293 మంది, ఇండియా కూటమి పార్టీల్లో 233 మంది ఎంపీలున్నారు. అయితే ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లొచ్చాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. -
‘ మీరు ఓడించారు.. మీకు మహిళలే బుద్ధి చెబుతారు’
న్యూఢిల్లీ: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి కారణమైన పలు పార్టీల వైఖరికి నిరసనగా ఎన్డీయే ఎంపీలు.. పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ బిల్లును విపక్షాలే ఓడించాయంటూ నిరసనకు దిగారు. విపక్ష ఎంపీలన దేశం క్షమించదు అంటూ నినాదాలు చేశారు. ‘మీరు ఓడించారు.. మీకు మహిళలే బుద్ధి చెబుతారు’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. మహిళా లోకానికి ఇది చీకటి రోజు అని అన్నారు బీజేపీ మహిళా ఎంపీ డీకే అరుణ. మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ మోదీకే దక్కుతుందన్నారు. రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదన్నారు. మరొకవైపు హైదరాబాద్‌లో బీజేవైఎం నేతలు.. విపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళా రిజర్వేషన్‌ను రాహుల్ అడ్డుకోవడంపై మండిపడ్డారు. విపక్షాలకు వ్యతిరేకంగా బీజేవైఎం నేతలు నినాదాలు చేశారు. విపక్షాల నిజస్వరూపం మరోసారి బయటపడిందంటూ బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. డీలిమిటేషన్ ముసుగులో మహిళా బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. విపక్షాలకు మహిళలే తగిన బుద్ధి చెప్తారన్నారు. కాగా, కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. ఈరోజు( శుక్రవారం, ఏప్రిల్ 17వ తేదీ) లోక్‌సభ వేధికగా జరిగిన ఓటింగ్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి, అలాగే కొత్త జనాభా గణన నిర్వహించకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి వీలు కల్పించే డీలిమిటేషన్ బిల్లును లోక్‌సభ తిరస్కరించింది.సుదీర్ఘ చర్చల అనంతరం ప్రవేశపెట్టిన రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు వీగిపోవడంతో మిగతా రెండు బిల్లులకు ఓటింగ్ అవసరం లేకుండా పోయింది. ఈ ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొనగా, అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. -
మహిళా సెంటిమెంట్స్ ను దెబ్బతీయొద్దు ఎంపీలకు పీఎం మోదీ విజ్ఞప్తి..
-
సొంత పార్టీ నేతలపై రాఘవ్ చద్దా సెటైర్లు
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై చర్చ కొనసాగుతోంది.అయితే, ఈ కీలక బిల్లలుపై చర్చ జరిగే సమయంలో సొంత పార్టీ నేతల గైర్హాజరుపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా సెటైర్లు వేశారు.రాజ్యసభ ఉపనాయకుడి పదవి నుంచి నన్ను తొలగించారు. అయినా సరే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై చర్చ జరుగుతుంటే సభకు నేను హాజరయ్యాను. మరి వాళ్లద్దరేరి అంటూ ఆప్ పార్టీ ప్రతినిధి, పార్టీ నూతన రాజ్య సభ ఉపనాయకుడిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. నా పార్టీకి చెందిన నాయకుడు, నా స్థానంలో కొత్త నియమితులైన ఉప నాయకుడు కూడా సభలో లేరు. ఆప్ ఇటీవల తొలగించబడిన ఉప నాయకుడిని నేను. నేను సభలోనే ఉన్నాను. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని అన్నారు. రాజ్యసభలో ఆప్ ఉప నాయకుడి పదవి నుంచి చద్దాను ఇటీవల తొలగించడంతో పాటు, సభలో ఆయన మాట్లాడే సమయాన్ని కూడా పార్టీ తగ్గించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్ణయంపై పార్టీలో విభేదాలు ఉన్నాయన్న ఊహాగానాలకు ఈ పరిణామం ఆజ్యం పోసింది. -
జగనన్న పాలన మహిళలకు స్వర్ణయుగం మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం
-
మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతుండగా మైక్ కట్
సాక్షి, ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతున్న మహిళా ఎంపీ మైక్ కట్ చేయడంపై వైఎస్సార్సీపీ ఎంపీలు తనూజ రాణి, గురుమూర్తి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మైక్ కట్ చేసిన సభాస్థానంలో టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఉన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ తరఫున చర్చలో ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజారాణి పాల్గొన్నారు. టీడీపీ హయాంలో మహిళలపై కొనసాగుతున్న హింసను ఆమె ప్రస్తావించారు. ఏపీలో మహిళను తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిని చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. నామినేటెడ్ పోస్టుల్లో, కాంట్రాక్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. అమ్మ ఒడి, మహిళల పేరుపైనే ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 2019-24 వైఎస్ జగన్ పరిపాలనా కాలం మహిళలకు స్వర్ణయుగం లాంటిది. ఏపీలో మహిళలపై హింస జరుగుతుంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన ఘటన తీవ్ర ఆందోళనకరం. అధికార పార్టీలోని ప్రజాప్రతినిధులు మహిళలను వేధిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు’’ అని తనూజరాణి మండిపడ్డారు. -
టీడీపీ MLA ల రాసలీలలు.. పార్లమెంట్లో దుమ్ముదులిపేసిన మిథున్ రెడ్డి
-
BJPకి అగ్ని పరీక్ష, డీలిమిటేషన్ కష్టమే! మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్?
-
లోక్ సభలో పరువుపాయే.. TDP MLAల రాసలీలల వీడియోలపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్..
-
BJP సెల్ఫ్ గోల్! ఇరుకున పడేసిన తేజస్వి సూర్య
-
33% మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో ఓటింగ్..
-
వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు
మూడు కీలక బిల్లులకు సంబంధించి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో నేడు ఓటింగ్ ప్రక్రియ.. -
రాజకీయ ఆయుధంగా డీలిమిటేషన్
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల సాకుతో లోక్‌సభ స్థానాల పెంపునకు బలవంతంగా ఆమోదముద్ర వేయించుకునేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. బీజేపీకి బాగా అలవాటైన బుల్డోజర్ పద్ధతినే ఈ విషయంలోనూ పాటిస్తోందంటూ లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉప నేత గౌరవ్ గొగొయ్ తూర్పారబట్టారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని సవరించేందుకు గురువారం లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై చర్చను ఆయన ప్రారంభించారు. అవి మహిళా వ్యతిరేక బిల్లులంటూ మండిపడ్డారు. కులగణనకు, రాజ్యాంగానికే గాక దేశ సమాఖ్య నిర్మాణానికి కూడా ఆ బిల్లులు వ్యతిరేకమని ఆరోపించారు.ఆ బిల్లుల ద్వారా డీలిమిటేషన్‌కు దొడ్డిదారిన ఆమోదం పొందడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం తప్ప మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం కానేకాదని కుండబద్దలు కొట్టారు. బీజేపీ కేవలం తన రాజకీయ బలాన్ని పెంచుకునేందుకే డీలిమిటేషన్‌ను రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని గొగొయ్ ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్లపై ఆ పార్టీకి నిజంగా చిత్తశుద్ధే ఉంటే లోక్‌సభ స్థానాలను పెంచకుండా ప్రస్తుత సంఖ్య 543తోనే ఆ చట్టాన్ని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ ద్వారా అనుచిత రాజకీయ లబ్ధి పొందడమే మోదీ సర్కారు ఏకైక ధ్యేయమని పునరుద్ఘాటించారు.ఈ గెర్రీమాండరింగ్ (నియోజకవర్గాల సరిహద్దులను ఒక పార్టీకి లబ్ధి చేకూరేలా మార్చడం) ప్రయత్నాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ‘‘అసలు లోక్‌సభ స్థానాల పెంపు ఆలోచన ఎక్కడినుంచి వచి్చంది? ఎన్ని స్థానాలను పెంచాలన్న అంశంపై మోదీ సర్కారు తనంత తానుగానే ఎలా నిర్ణయం తీసుకుంటోంది? ఏదైనా పార్లమెంటరీ నివేదిక ఆధారంగా ఇందుకు పూనుకున్నారా? లేదా నాగపూర్ (ఆరెస్సెస్) నిర్దేశాల మేరకా? లేదంటే ఇది కేవలం ఆకాశం నుంచి ఊడిపడ్డ ఆలోచనా?’’అంటూ ధ్వజమెత్తారు. దేశమంతటా ‘అస్సాం’ప్రయోగం రాజకీయ ప్రయోజనాల కోసం డీలిమిటేషన్‌ను ఆయుధంగా మలచుకోవడం బీజేపీకి అలవాటేనని గౌరవ్ గొగొయ్ ఆరోపించారు. ‘‘గతంలోనూ ఆ పార్టీ ఎన్నోసార్లు ఇందుకు పాల్పడింది. జమ్మూకశ్మీర్, అస్సాంల్లో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను ఇష్టానుసారంగా మార్చేసి అనుచిత లబ్ధి పొందింది. దాంతో ఇప్పుడదే ప్రయోగాన్ని దేశమంతటా చేసేందుకు మోదీ సర్కారు నిశ్చయించుకుంది.అందుకు మహిళా రిజర్వేషన్లను సాకుగా వాడుకుంటోంది’’అని ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు నిజంగా సిగ్గుచేటంటూ దుయ్యబట్టారు. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేయాలని మోదీ సర్కా రు భావిస్తే అందుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ దానికి డీలిమిటేషన్‌తో ముడిపెట్టడానికి వీల్లేదు. లోక్‌సభ స్థానాలను పెంచే ప్రయత్నానికి స్వస్తి చెప్పి ప్రస్తుతమున్న 543 స్థానాలకే తక్షణం అమలయ్యేలా మహిళా రిజర్వేషన్లను వర్తింపజేయాలి’’అని గొగొయ్ డిమాండ్ చేశారు.కులగణనకు బీజేపీ వ్యతిరేకిరాజ్యాంగాన్ని మోదీ సర్కారు క్రమేపీ అన్నివిధాలా బలహీనపరుస్తూ వస్తోందని గౌరవ్ గొగొయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘కులగణన పట్ల కేంద్రం సానుకూలంగా లేదన్న అనుమానాలు కూడా నానాటికీ బలపడుతున్నాయి. మోదీ సర్కారు అందుకు తొలినుంచీ వ్యతిరేకే. కేవలం మా నేత రాహుల్‌గాంధీ ఒత్తిడి కారణంగానే కులగణనకు అయిష్టంగా అంగీకరించింది’’అని ఆయన చెప్పుకొచ్చారు.తాజాగా మూడు బిల్లులను ప్రవేశపెడుతూ లోక్‌సభలో కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ ప్రసంగించిన తీరును గొగొయ్ ఎద్దేవా చేశారు. ‘‘మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఇప్పుడే తొలిసారిగా తాము ప్రవేశపెడుతున్నాం అన్నట్టుగా మంత్రి మాట్లాడారు. కానీ 2023లోనే ఆ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఆ సందర్భంగా కూడా సభలో వాళ్లు సరిగ్గా ఇవే వాదనలు చేశారు. అప్పట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలనే ఇప్పుడు మేఘ్వాల్ మళ్లీ యథాతథంగా అప్పజెప్పారంతే!’’ అని తూర్పారబట్టారు. -
చాణక్యుడు బతికి ఉంటే.. బీజేపీ చాతుర్యానికి ఆశ్చర్యపోయేవాడు
న్యూఢిల్లీ: చాణక్యుడు ఇప్పుడు గనుక బతికి ఉంటే బీజేపీ నాయకుల రాజకీయ చాతుర్యం చూసి ఆశ్చర్యపోయేవాడని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. గురువారం మూడు బిల్లులపై జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని, దేశ సమగ్రతపై అతిపెద్ద దాడి ప్రారంభించిందని ఆరోపించారు. ఒకవైపు మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూనే మరోవైపు ఓబీసీల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. చిన్న రాష్ట్రాల ప్రాబల్యాన్ని తగ్గించి, ప్రజాస్వామ్యాన్ని ముక్కలు చేసి, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. తన మాటలకు అమిత్ షా నవ్వుతున్నారని, ఈ స్కీమ్ వెనుక ఆయనే ఉన్నారని చెప్పారు. అమిత్ షా నవ్వుతున్నారంటే తన వ్యాఖ్యలతో ఆయన ఏకీభవించినట్టేనని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో ఏకైక చాంపియన్‌గా మారాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోందని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని ప్రియాంక తేల్చిచెప్పారు. ‘ఒక ఓటు, ఒక పౌరుడు, ఒకే విలువ’అనే విధానాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మహిళలకు ఓటు హక్కు లభించిందన్నారు. అమెరికాలో ఓటు హ క్కు కోసం మహిళలు 150 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడున్న స్థానాల ఆధారంగానే రిజర్వేషన్లు కేవలం అధికారం కోసమే మహిళా రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుంటున్నారని మోదీ ప్రభుత్వంపై ప్రియాంక నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించినట్లయితే దేశంలో ప్రజాస్వామ్యం ఉనికిలో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళా కోటా చట్టాన్ని డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెట్టారో చెప్పాలని నిలదీశారు. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న స్థానాల ఆధారంగానే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. -
మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ ప్రతిపక్షాలకే
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుతో ముడిపడి ఉన్న నియోజకవర్గాల పునర్వీభజనలో ఏ ఒక్క రాష్ట్రంపైనా వివక్ష చూపే ప్రసక్తే ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. అది పెద్ద రాష్ట్రమైనా లేక చిన్న రాష్ట్రమైనా.. ఉత్తర, దక్షి ణ, తూర్పు, పశ్చిమ రాష్ట్రమైనా కూడా ఎలాంటి అ న్యాయం జరగదని స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్వీభజనలో సంస్కరణలను వ్యతిరేకించేవారిని మహిళలు ఎప్పటికీ క్షమించబోరని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ప్రధాని మోదీ జోక్యం చేసుకున్నారు. దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడారు. నియోజకవర్గాల పునర్వీభజన ప్రక్రియతో ఏ ఒక్క రాష్ట్రంలోనూ లోక్‌సభ స్థానాల నిష్పత్తి తగ్గదని వెల్లడించారు.లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఆ నిష్పత్తిలో ఎటువంటి మార్పు ఉండదని, పెరుగుదల కూడా అదే నిష్పత్తిలో ఉంటుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుపై అధికార పక్షం ఘనతను(క్రెడిట్) ఆశించడం లేదని.. ఆ క్రెడిట్‌ను ప్రతిపక్షాలే తీసుకోవచ్చని సూచించారు. ప్రతిపక్షాలకే ఖాళీ చెక్కు ఇచ్చేస్తున్నానని తెలిపారు. అంతేకాకుండా బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వ ఖర్చుతో ప్రతిపక్షాలకు ప్రచారం చేస్తామని, హోర్డింగ్‌లపై ప్రతిపక్ష నాయకుల ఫొటోలు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ల అమలును ఒకవేళ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తే తనకు సహజంగానే రాజకీయ ప్రయోజనం దక్కుతుందన్నారు. కానీ, విపక్షాలు సహకరిస్తే ఎవరికీ ఎలాంటి రాజకీయ ప్రయోజనమూ లభించదని చెప్పారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే.. ఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పుడు.. ‘‘చట్టసభల్లో రిజర్వేషన్ అనేది ఈ దేశ మహిళల హక్కు. కాబట్టి వారికి తాము ఏదో ఇస్తున్నామనే భ్రమలో ఎవరూ ఉండకూడదు. రిజర్వేషన్లపై మాకు క్రెడిట్ వద్దు. ఈ విషయంలో హామీ(గ్యారంటీ) అనే పదాన్ని వాడాలని మీరు కోరుకుంటే నేను ఆ పదాన్నే వాడతాను. నేను వాగ్దానం(ప్రామిస్) చేయాలని మీరు కోరుకుంటే నేను ఆ పదాన్నే ఉపయోగిస్తా. ఎందుకంటే ఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పుడు పదాలతో ఆడుకోవాల్సిన అవసరమే ఉండదు. నియోజకవర్గాల పునర్వీభజనపై ఎవరికీ ఎలాంటి సందేహాలు, భయాందోళనలు అవసరం లేదు. ఏ ఒక్క రాష్ట్రానికీ అన్యాయం జరగదు, వివక్ష చూపడం ఉండదు. దయచేసి రాజకీయ కోణంలో చూడొద్దు మహిళలకు హక్కులు కల్పించడాన్ని గతంలో వ్యతిరేకించినవారు మహిళల నుంచి ఆగ్రహాన్ని చవిచూశారు. తగిన పర్యవసానాలు ఎదుర్కొన్నారు. అలాంటి వారిని మహిళలు క్షమించలేదు. మహిళా రిజర్వేషన్లను దయచేసి రాజకీయ కోణంలో చూడొద్దని అందరినీ కోరుతున్నా. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు మనల్ని గమనిస్తున్నారు. వారు మన నిర్ణయాలను పరిశీలిస్తారు. నిర్ణయం కంటే కూడా మన ఉద్దేశాన్ని ఎక్కువగా బేరీజు వేస్తారు.మన ఉద్దేశంలో ఏమాత్రం లోపం ఉన్నా మహిళలు మనల్ని ఎప్పటికీ క్షమించరు. 2023లో పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్లపై చర్చ జరుగుతున్న సమయంలో ‘త్వరపడండి’అంటూ ప్రజలు గొంతెత్తారు. కానీ, 2024లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయలేకపోయాం. చాలా తక్కువ సమయం ఉండడమే అందుకు కారణం. ఇప్పుడు మనకు తగినంత సమయం ఉంది. 2029లో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఇకపై ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. అదే నేటి అనివార్యత. ఆ ధైర్యం లేక సాంకేతిక సాకులు వెతుకుతున్నారు మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని వ్యతిరేకిస్తే ప్రతిపక్షాలకే ప్రమాదం. దేశంలోని నారీ శక్తి అంతా నిశితంగా గమనిస్తోంది. మహిళల హక్కులను వ్యతిరేకించిన వారి పట్ల చరిత్ర ఎప్పుడూ దయతో వ్యవహరించలేదు. ఎంపీలందరినీ మహిళలు గమనిస్తున్నారు. రిజర్వేషన్ల విషయంలో ఎంపీల్లో తప్పుడు ఉద్దేశాలు ఉంటే ఆ విషయం మహిళలు ఎప్పటికీ మర్చిపోరు. అందుకే మన ఉద్దేశాల్లో నిజాయతీ ఉండాలి. మహిళా రిజర్వేషన్ల అమల్లో ఇప్పటికే 30 ఏళ్లు ఆలస్యం జరిగింది. మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు సాంకేతిక సాకులు (టెక్నికల్ బహనేబాజీ) వాడుతున్నాయి. మహిళల హక్కులను బహిరంగంగా తిరస్కరించే ధైర్యం వారికి లేదు. అందుకే సాంకేతిక సాకులు వెతుకుతున్నారు. కానీ, ఇప్పుడు మీరు మహిళలను మోసం చేయలేరు.నల్ల రంగు దుస్తులు ధరించినవారికి కృతజ్ఞతలు మహిళా కోటా చట్ట సవరణ బిల్లుకు నిరసనగా కొందరు నల్ల రంగు దుస్తులు ధరించి సభకు రావడాన్ని గమనించాం. నల్ల రంగు దుస్తులు దిష్టి తగలకుండా కాపాడే ‘కాలా టికా’లాగా పనిచేస్తాయి. కొందరు కొన్నిచోట్ల నల్ల జెండాలు కూడా ఎగురవేశారు. మన దేశంలో ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు దిష్టి పోవడానికి నల్లటి తిలకం దిద్దుకొనే సంప్రదాయం ఉంది. ఈ రోజు నల్ల రంగు దుస్తులు ధరించి వచి్చనవారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’’అని ప్రధాని మోదీ చెప్పారు. -
తెలంగాణ బలిదానాలకు కాంగ్రెస్సే కారణం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమంపై లోక్‌సభలో చెలరేగిన దుమారంపై కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో జరిగిన బలిదానాలకు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమని విరుచుకుపడ్డారు. గురువారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కిషన్‌రెడ్డి జోక్యం చేసుకొని వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రజలను కానీ పవిత్రమైన తెలంగాణ ఉద్యమాన్ని కానీ అవమానించే ఉద్దేశం తేజస్వీ సూర్యకు లేదన్నారు. ఒకవేళ అలా మాట్లాడి ఉంటే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యల వెనుకున్న అసలు ఉద్దేశాన్ని సభకు సవివరంగా తెలియజేశారు. కాంగ్రెస్ తప్పుడు విధానాలు, మోసపూరిత వైఖరి వల్లే తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. -
డీలిమిటేషన్.. తెలంగాణలో 26... ఏపీలో 38
సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం తెలంగాణలో లోక్‌సభ స్థానాల సంఖ్య 17నుంచి 26కు, ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 38కి పెరగనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్వీభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. గురువారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల చట్ట రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై జరిగిన చర్చలో అమిత్ షా ప్రసంగించారు. డీలిమిటేషన్ వల్ల లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న ఆందోళనను ఆయన తోసిపుచ్చారు. పునర్విభజన అనంతరం ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 129 నుంచి 50 శాతం, అంటే 195కు పెరుగుతుందని వెల్లడించారు. ‘‘దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గదు. పైపెచ్చు సభలో వాటి ప్రాతినిధ్యం మరింత పెరుగుతుంది’’అంటూ గణాంకాలతో సహా మంత్రి వివరించారు. ‘‘మొత్తం చర్చపై కేంద్ర ప్రభుత్వం తరఫున శుక్రవారం సమాధానమిస్తాను. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పదలచాను. తాజాగా ప్రవేశపెట్టిన బిల్లులపై ప్రజలకు ఎలాంటి అపోహలూ వద్దు. ఈ బిల్లులతో లోక్‌సభలో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఆ ప్రాంతానికి నష్టం జరుగుతుందని పెద్ద వాదనను లేవనెత్తుతూ భ్రాంతిని వ్యాప్తి చేస్తున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వదలచాను. సభ ముందున్న బిల్లుల ఆధారంగా వాస్తవాలు అందరి దృష్టికీ తెస్తాను. నియోజకవర్గాల పునర్వీభజనతో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య 25నుంచి 38కు, ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 4.60 నుంచి 4.65 శాతానికి పెరుగుతాయి. తెలంగాణలో స్థానాలు 17 నుంచి 26కు, ప్రాతినిధ్యం 3.13 నుంచి 3.18కి పెరుగుతాయి. తమిళనాడులో సీట్లు 39 నుంచి 59కు, ప్రాతినిధ్యం 7.18 నుంచి 7.23 శాతానికి పెరుగుతాయి. కర్నాటకలో లోక్‌సభ స్థానాలు 28నుంచి 42కు, సభలో ప్రాతినిధ్యం 5.15 శాతం నుంచి 5.14 శాతానికి చేరతాయి. కేరళలో సీట్లు 20 నుంచి 30కి, లోక్‌సభలో ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 3.68 నుంచి 3.67 శాతానికి చేరతాయి. మొత్తమ్మీద దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ స్థానాల సంఖ్య 195కు పెరుగుతుంది. లోక్‌సభలో వాటి ప్రాతినిధ్యం 23.76 శాతం నుంచి 23.97 శాతానికి పెరుగుతుందే తప్ప ఏ మాత్రమూ తగ్గదు. అలాంటప్పుడు దక్షిణాదికి అన్యాయమన్న ప్రశ్నే తలెత్తదు’’అని స్పష్టం చేశారు. జనగణనతో పాటే కులగణన ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనతో పాటే కులగణన కూడా ఉంటుందని అమిత్ షా స్పష్టం చేశారు. ‘‘కులగణన చేపట్టాలని కేంద్రం భావించడం లేదని విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తన్నాయి. మోదీ ప్రభుత్వం జనగణనతోపాటు కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. జనగణన రెండు దశల్లో ఉంటుంది. ప్రస్తుతం ఇళ్ల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. వ్యక్తిగత డేటాను తీసుకునేటప్పుడు కులగణన అంశం కూడా వస్తుంది’’అని ఆయన స్పష్టం చేశారు. 2029 తర్వాతే అమలు నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో అమలు కాబోదని సభకు అమిత్ షా తెలియజేశారు. ‘‘డీలిమిటేషన్ కమిషన్ నివేదికను పార్లమెంటు ఆమోదించి, రాష్ట్రపతి ముద్ర పడిన తర్వాతే అమల్లోకి వస్తుంది. ఇదంతా 2029కి ముందు జరిగే ప్రసక్తే లేదు. కనుక అప్పటిదాకా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు పాత నియోజకవర్గాల ప్రాతిపదికనే జరుగుతాయి’’ అని చెప్పారు.లోక్‌సభ మొత్తం స్థానాల సంఖ్య 816! లోక్‌సభలో సీట్ల సంఖ్య పెంపుపై విపక్షాల ప్రశ్నలకు బదులిస్తూ అమిత్ షా ఒక ఉదాహరణ చెప్పారు. ‘‘మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే ముందుగా మొత్తం సీట్లను 50 శాతం పెంచాలి. అప్పుడు వాటిలో 33 శాతం మహిళలకు కేటాయించినా మిగతా ఓపెన్ సీట్ల సంఖ్య యథాతథంగా ఉంటాయి. అంటే ప్రస్తుతమున్న 543 సీట్లను 50 శాతం పెంచితే వాటిలో 33 శాతాన్ని మహిళలకు రిజర్వ్ చేశాక కూడా ఓపెన్ కేటగిరీలో 543 సీట్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టే 50 శాతం పెంపును ప్రతిపాదించాం’‘అని ఆయన వివరించారు. ‘‘లోక్‌సభ స్థానాల పెంపు గరిష్టంగా 850 దాకా అనేది సుమారుగా వేసిన సంఖ్య. కచ్చితమైన సంఖ్య బహుశా 815, లేదా 816గా ఉండవచ్చు. దీనిపై సభకు సమగ్రంగా వివరణ ఇస్తా’’అని చెప్పారు. -
డీలిమిటేషన్ దంగల్‌కు... రంగం సిద్ధం!
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నుంచే అమలు చేసేందుకు మోదీ సర్కారు తలపెట్టిన కీలక కసరత్తు నిర్ణాయక దశకు చేరింది. రిజర్వేషన్ల చట్టం సత్వర అమలు, అందుకు వీలుగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు–2026, డీలిమిటేషన్ బిల్లు–2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లు–2026ను కేంద్రం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వాటి డిమాండ్ మేరకు ఈ అంశంపై డివిజన్ (ఓటింగ్)కు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. బిల్లుకు అనుకూలంగా 251 ఓట్లు, వ్యతిరేకంగా 185 ఓట్లు వచ్చాయి. అనంతరం మూడు బిల్లులనూ కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభ నిబంధన 66లోని ప్రొవైజోను సస్పెండ్ చేసి డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల బిల్లులను ఒకేసారి పరిశీలించి ఆమోదించేందుకు అనుమతివ్వాలంటూ కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ తీర్మానం ప్రవేశపెట్టారు. బిల్లులు రాజ్యాంగ సవరణతో ముడిపడ్డాయి గనుక ఇందుకు అనుమతించాలని కోరారు. స్పీకర్ అనుమతితో బిల్లులపై మొదలైన చర్చ గురువారం అర్ధరాత్రి దాకా సుదీర్ఘంగా సాగింది. బిల్లుకు అనుకూలంగా అధికార, వ్యతిరేకంగా విపక్ష సభ్యుల వాదనలతో సభ హోరెత్తిపోయింది. బిల్లులపై ఓటింగ్‌కు శుక్రవారం సాయంత్రం నాలుగింటికి ముహూర్తం ఖరారైంది. వాటిలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి. మోదీ సర్కారుకు అందుకు అవసరమైన సంఖ్యా బలం లేని నేపథ్యంలో బిల్లు ఎలా గట్టెక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దాంతో ఓటింగ్‌పై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హోరాహోరీ వాదనలు పార్లమెంటు మూడు రోజుల ప్రత్యేక సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం లోక్‌సభ సమావేశం మొదలవగానే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును విపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించడంతో దానిపై 40 నిమిషాల పాటు తీవ్ర చర్చ జరిగింది. చివరికి డివిజన్ ఓటింగ్ అనంతరం సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లును హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. తర్వాత చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగొయ్ మోదీ సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్ల సాకుతో లోక్‌సభ స్థానాలను అడ్డదిడ్డంగా పెంచుకుని రాజకీయ లబ్ధి పొందడమే బీజేపీ అసలు లక్ష్యమంటూ మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల నిమిత్తం పార్లమెంటు గతంలోనే చట్టం చేశాక మళ్లీ దానికి మార్పులను ప్రతిపాదించడం వెనక మతలబు ఏమిటని కాంగ్రెస్ సభ్యుడు కె.సి.వేణుగోపాల్ కేంద్రాన్ని నిలదీశారు. రాజ్యాంగ సవరణ బిల్లును ఇతర బిల్లులతో కలిపి చర్చకు చేపట్టరాదంటూ అభ్యంతరం వెలిబుచ్చగా దాన్ని అమిత్ షా తోసిపుచ్చారు. ఒకే అంశానికి సంబంధించిన పక్షంలో వాటిని ఉమ్మడిగా చర్చకు చేపట్టిన ఉదంతాలు గతంలో ఉన్నాయని స్పీకర్ బిర్లా స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి అంతమే! రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు రూపంలో దేశ ప్రజాస్వామ్యంపై మోదీ సర్కారు బాహాటంగా దాడికి దిగిందని కాంగ్రెస్ సభ్యురాలు ప్రియాంకా గాంధీ వద్రా దుయ్యబట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే దేశంలో ప్రజాస్వామ్యమే పూర్తిగా అంతమైపోతుందని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ స్థానాలను పెంచకుండా ప్రస్తుత 543 సీట్లకే మహిళా రిజర్వేషన్లను వర్తింపజేయడంలో కేంద్రానికి ఇబ్బందేమిటని ఆమె నిలదీశారు. సవరణ బిల్లు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వేణుగోపాల్ ఆరోపించారు. వాటి విషయంలో ఇంత హడావుడి ఎందుకని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లకు తమ పార్టీ మద్దతిస్తుందని స్పష్టం చేస్తూనే, జనగణన జరుగుతుండగానే ఈ హడావుడి కసరత్తు ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. బిల్లు ఉద్దేశాలను వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సంక్షిప్తంగా ప్రసంగించారు. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి కూడా మహిళా రిజర్వేషన్లను అమలు చేయకపోతే వారికి తీరని నష్టం జరుగుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్‌సభ స్థానాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయమూ జరగబోదని స్పష్టం చేశారు. ‘‘బిల్లును వ్యతిరేకించే పార్టీలు పూడ్చుకోలేని విధంగా నష్టపోవడం ఖాయం. అది మాకే లబ్ధి చేకూరుస్తుంది’’ అని అన్నారు. అనంతరం విపక్షాల ప్రసంగాల మధ్యలో అమిత్ షా అప్పుడప్పుడూ జోక్యం చేసుకుంటూ వాటి వాదనలను తిప్పికొడుతూ వచ్చారు. డీలిమిటేషన్ అనంతరం దక్షిణాది రాష్ట్రాల బలం ఇప్పటితో పోలిస్తే మరింత పెరుగుతుందే తప్ప తగ్గబోదని సోదాహరణంగా వివరించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశాక కూడా పురుషులకు గానీ, ఏ రాష్ట్రానికి గానీ ఎలాంటి అన్యాయమూ జరగొద్దనే లోక్‌సభ, అసెంబ్లీల్లో స్థానాలను 50 శాతం మేరకు పెంచుతున్నట్టు వెల్లడించారు. నల్ల దుస్తులతో డీఎంకే మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ డీఎంకే సభ్యులు నల్ల దుస్తులతో సభకు హాజరయ్యారు. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని ఆ పార్టీ సభ్యుడు టి.ఆర్.బాలు డిమాండ్ చేశారు. ప్రతిపాదత బిల్లుల అసలు లక్ష్యం డీలిమిటేషనే తప్ప మహిళా రిజర్వేషన్ల అమలు కాదని ఆరోపించారు. కె.సుబ్బరాయన్ (సీపీఐ), ఎన్.కె.ప్రేమ్‌చంద్రన్ (ఆరెస్పీ) తదితర విపక్ష సభ్యులు మాట్లాడుతూ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. జేడీ(యూ) తదితర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సభ్యులు బిల్లులకు మద్దతుగా మాట్లాడారు. ముహూర్తం... సాయంత్రం 4! మూడు బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్ మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు మోదీ సర్కారు ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై శుక్రవారం సాయంత్రం నాలుగింటికి లోక్‌సభ కీలక ఓటింగ్ చేపట్టనుంది. స్పీకర్ ఓం బిర్లా గురువారం సభలో ఈ మేరకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం మోదీ తన చాంబర్లో కీలక భేటీ జరిపారు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అధ్యక్షుడు నితిన నబీన్, పలు ఎన్డీఏ పక్షాల నేతలు తదితరులు అందులో పాల్గొన్నారు. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మద్దతు కూడగట్టడంపై వారంతా చర్చలు జరిపారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని కాంగ్రెస్‌తో పాటు పలు కీలక విపక్ష పార్టీలు బుధవారమే ప్రకటించడం తెలిసిందే. అధికార ఎన్డీఏ కూటమికి పార్లమెంటు ఉభయ సభల్లోనూ సొంతంగా మూడింట రెండొంతుల మెజారిటీ లేదు. ఈ నేపథ్యంలో లోక్‌సభలో శుక్రవారం జరిగే ఓటింగ్‌లో బిల్లు ఎలా గట్టెక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
దక్షిణాదిలో పెరగనున్న పార్లమెంట్ స్థానాలు ఎన్నంటే : అమిత్‌షా
సాక్షి,న్యూఢిల్లీ: డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగనుందంటూ విపక్షాల ఆరోపణలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కౌంటర్ ఇచ్చారు. బిల్లుతో దక్షిణాదిలో పార్లమెంట్ స్థానాలు 129 నుంచి 195కు పెరుగుతాయి. బిల్లుతో లాభం తప్ప నష్టం జరగదు. బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు చాలా లాభం. కర్ణాటక, తెలంగాణ బాగా లాభపడతాయి. ఈ బిల్లుతో తెలంగాణలో ఎంపీల సంఖ్య 17 నుంచి 26కు.. ఏపీలో ఎంపీ సీట్లు 25 నుంచి 38కి పెరుతాయి. అలాగే తమిళనాడులో 59కి, కర్ణాటకలో 28 నుంచి 42 స్థానాలు.. కర్ణాటకలో 28 నుంచి 42 స్థానాలకు పెరుగుతాయి. మేం సందేహాలకు సమాధానం ఇస్తాం.. వాకౌట్ చేయాల్సిన పనిలేదని విపక్షాల ఆరోపణలకు అమిత్‌షా ఎద్దేవా చేశారు. కాగా, జనాభా మార్పులను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటరీ, రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్ నిర్వచించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు ఉద్దేశించిన మూడు కీలక బిల్లులను కేంద్రం ఇవాళ(ఏప్రిల్ 16, గురువారం) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వీటిపై చర్చలో భాగంగా ప్రధాని సభలో ప్రసంగిస్తూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజకీయ రంగు పులమొద్దన్నారు.‘‘దేశ ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన బిల్లు ఇది. మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ అందరికీ దక్కుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి నష్టపోవద్దు. క్షేత్రస్థాయిలో మహిళా నాయకత్వం సిద్ధంగా ఉంది. నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలని వారంతా భావిస్తున్నారు. అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత నాది. బీసీ వర్గాల్లో జన్మించిన నాకు ప్రధాని పదవి దక్కడం రాజ్యాంగ నిర్మాతల చలవే...డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. గ్యారెంటీగా అంశాన్ని ఈ విషయాన్ని చెపుతున్నా. ఇప్పుడున్న నిష్పత్తిలో నియోజకవర్గాల్లో పెరుగుతాయి. మా విధానాల్లో స్పష్టత ఉంది. గతంలో జరిగిన మహిళలకు జరిగిన వివక్ష అనే పాపాన్ని కడిగేస్తున్నాం. సాంకేతిక అంశాలతో వ్యతిరేకించొద్దు. బిల్లును ఎలాగా ఆమోదించాలో సమయం నిర్ణయిస్తుంది. మూడు దశాబ్దాల పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారు. మహిళా బిల్లుకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతివ్వాలి. ఈ బిల్లును తేవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు’’ అని ప్రధాని మోదీ అన్నారు.డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ విపక్షాలను హెచ్చరించారు. “దేశ పార్లమెంట్ చరిత్రలో ఈ రోజును మర్చిపోలేం. మహిళా రిజర్వేషన్ గొప్ప బిల్లు. ఈ చారిత్రక సమయంలో పాలు పంచుకోవడం నా అదృష్టం. ఈ బిల్లులతో దేశానికి సరికొత్త దశ, దిశను ఇస్తున్నాం. వికసిత్ భారత్ అంటే రోడ్లు, రైళ్లు, మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు. మహిళల స్వావలంబన కూడా ఉంటేనే అది సంపూర్ణ వికసిత్ భారత్ అవుతుంది. దేశ రాజకీయాల్లో, వికసిత్ భారత్ సాధనలో మహిళల పాత్ర కీలకం...మహిళలకు అవకాశమిస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారు. రాజకీయాల్లో తమ శక్తిని చాటేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. ఎవరికైనా అవకాశమిస్తేనే కదా.. వారి సామర్థ్యం తెలుస్తుంది. రాజకీయాల్లో సామర్థ్యం, అనుభవం ఉన్న మహిళలు పుష్కలంగా ఉన్నారు. దేశ ప్రగతిలో మహిళలకూ బాగస్వామ్యం కల్పించాల్సిందే. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు.. మహిళలకు మనం ఇస్తున్న కానుక కాదు. అది వారి హక్కు" అని మోదీ వ్యాఖ్యానించారు.“ఈ బిల్లును తీసుకురాగానే కొందరు విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ మాట్లాడుతున్నారు. అలాంటి వారిని ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం, ఉత్తరాది, దక్షిణాది అనే భేదభావం మాకు లేదు. ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని హామీ ఇస్తున్నాం” అని మోదీ స్పష్టం చేశారు.ఈ బిల్లుతో కేవలం దేశంలోని మహిళలకు వారి హక్కులను కల్పిస్తున్నాం. ఈ బిల్లుపై క్రెడిట్ నాకు అవసరం లేదు. మీరే (విపక్షాలను ఉద్దేశిస్తూ) తీసుకోండి.. మహిళా బిల్లుపై అన్ని పార్టీల నేతల ఫొటోలూ వేసుకోండి. ఈ బిల్లును అడ్డుకోకుండా సహకరించి మీ గొప్పతనం చాటుకోండి. మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిద్దాం” అని మోదీ విపక్షాలను కోరారు. -
రేవంత్‌ది ఫూలిష్ ప్రతిపాదన.. లోక్‌సభలో తేజస్వీ సూర్య
సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్ విషయంలో ప్రతిపక్షాలు చేస్తోంది రాద్ధాంతమేనని.. మహిళా రిజర్వేషన్ల బిల్లు అడ్డుకోవడమే వాళ్ల ధ్యేయంగా కనిపిస్తోందని బెంగళూరు సౌత్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులపై చర్చ సందర్భంగా ఆయన విపక్షాలపై ధ్వజమెత్తారు. 1996 నుంచి మహిళా రిజర్వేషన్ల బిల్లు పెండింగ్‌లో ఉంది. గత ప్రభుత్వాలు ఈ బిల్లును విస్మరించాయి. కానీ, ప్రధాని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని మహిళలందరి తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు. కానీ, మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆలస్యమయ్యేలా ప్రతిపక్షాలు కొత్తదారులు వెతుక్కుంటున్నాయి. రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ తప్పనిసరి. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నాయి. తమిళనాడులోనూ కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. కానీ, డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు. డీలిమిటేషన్ వద్దని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ, అదే జరిగితే కేరళలో పది సీట్లు పెరుగుతాయి. ఇది కేరళకు లాభమే గానీ నష్టం కాదు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాదనలో అర్థమే లేదు. డీలిమిటేషన్ సాకుగా చూపించి మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవాలని విపక్షాలు చూస్తున్నాయి. 1996లో మొదలైన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పుడు ఓ కొలిక్కి వస్తోంది. ఈరోజు కోసం దేశం 40 ఏళ్లుగా ఎదురు చూస్తోంది. 2029లో అమలయ్యే మహిళా రిజర్వేషన్లతో దేశం అభివృద్ధిలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. సూర్యనారీశక్తి బిల్లును విపక్షాలు అడ్డుకోవడం సరికాదు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చావడానికైనా నేను సిద్ధం’’ అని తేజస్వీ సూర్య ప్రసంగించారు.సీఎం రేవంత్ ప్రతిపాదనపై స్పందిస్తూ.. డీలిమిటేషన్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాదనను చర్చ సందర్భంగా తేజస్వీ సూర్య తప్పుబట్టారు. ‘‘రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన హైబ్రిడ్ వాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. జీఎస్డీపీ ఆధారంగా సీట్ల సంఖ్య పెంచమని రేవంత్ అన్నారు. ఆ సలహా ఆయనకు ఎవరు ఇచ్చారో తెలియదు. ఆయనత ఎచ్చిన ప్రతిపాదన ఫూలిష్‌గా ఉంది. జీఎస్డీపీ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఆ లెక్కన సీట్ల సంఖ్య మారుతూ ఉండాలా?. ఆదాయం ప్రకారం ఓట్లు ఇస్తే అంబానీకి లక్ష ఓట్లు ఇవ్వాలి. రాజ్యాంగం ప్రకారం.. ఒకరికి ఒక్క ఓటే ఉంటుంది. డీలిమిటేషన్ ఏపీ, తెలంగాణలో 52 శాతం సీట్లు పెరుగుతాయి. తమిళనాడులో 49 సీట్లు పెరుగుతున్నాయి. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో 23.9 శాతం సీట్లు పెరుగుతాయి. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్ల పెంపు అనేది రాజ్యాంగబద్ధమే. డీలిమిటేషన్‌తో సీట్ల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు న్యాయమే జరుగుతుంది’’ అని తేజస్వీ అన్నారు. -
అమిత్ షా Vs కేసీ వేణుగోపాల్.. బిల్లుపై మాటల యుద్ధం
-
డీలిమిటేషన్ బిల్లులపై చర్చకు లైన్ క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: 131 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్‌సభలో గురువారం ఓటింగ్ జరిగింది. డీలిమిటేషన్ బిల్లులపై చర్చకు విపక్షాలు డివిజన్ కోరాయి. అందుకు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు. సభలో ఉన్న మొత్తం 333 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అనుకూలంగా 207, వ్యతిరేకంగా 126 మంది ఓటు వేశారు. మరో 86 మంది సభకు హాజరే కాలేదు. దీంతో డీలిమిటేషన్ బిల్లులపై సభలో చర్చకు మార్గం సుగమమైంది. అంతకు ముందు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాక.. మూడు కీలక బిల్లులను లోక్‌సభలో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘావాల్, అమిత్ షాలు ప్రవేశపెట్టారు. అయితే.. రాజ్యాంగ విరుద్ధంగా 131 సవరణ బిల్లు తీసుకొచ్చారని.. తక్షణమే దానిని వెనక్కి తీసుకోవాలని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లుపై చర్చకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ డివిజన్ కోరగా.. చివరకు అత్యధిక ఓట్లు చర్చకు అనుకూలంగా పడ్డాయి.చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. లోక్‌సభ సీట్లను 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడంతోపాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు.. అలాగే లోక్‌సభ- అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు ఉన్నాయి. -
లోక్‌సభలో డీలిమిటేషన్ మంట
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే లోక్‌సభ వేడెక్కింది. డీలిమిటేషన్, 131 రాజ్యాంగ సవరణ బిల్లులను గురువారం కేంద్రం ప్రవేశపెట్టింది. ఆ వెంటనే ఎన్డీయే కూటమి, కాంగ్రెస్-మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. 2023లోనే మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చాం. 2024 నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశాం. ఆ టైంలోనే 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదు?. జనాభా లెక్కలు, మహిళా రిజర్వేషన్ బిల్లుల తర్వాతే డీలిమిటేషన్ ఉంటుందని అన్నారు. ఇప్పుడేమో రాజ్యాంగ విరుద్ధంగా ఈ బిల్లు తీసుకొచ్చారు. బిల్లుకు అసలు కారణం వేరే ఉంది. రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం హైజాక్ చేయాలని చూస్తోంది.131 రాజ్యాంగ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ‘‘కేంద్రం తెచ్చిన బిల్లులను కేసీ వేణుగోపాల్ అవమానించారు. బిల్లును సభలో పెట్టకుండా ఎలా చర్చిస్తాం?. బిల్లు పూర్తిగా ప్రవేశపెట్టకుండానే అభ్యంతరం ఏంటి?. సభలో బిల్లు పెట్టాక మీ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. చర్చల సమయంలో అన్నింటకీ సమాధానం చెబుతాం’’ అని బదులిచ్చారు. అయితే బిల్లులను సభలో ప్రవేశపెట్టడంపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.Congress MP KC Venugopal opposes the introduction of Constitution (One Hundred and Thirty-First Amendment) Bill, 2026, Union Territories Laws (Amendment) Bill, 2026 and Delimitation Bill, 2026. pic.twitter.com/vTpO7phzQL— ANI (@ANI) April 16, 2026చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. లోక్‌సభ సీట్లను 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడంతోపాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, లోక్‌సభ- అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు ఉన్నాయి. ఇందులో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు. మిగతా రెండూ చట్టపరమైన బిల్లులు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. మిగతా రెండింటికీ సాధారణ మెజారిటీ సరిపోతుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభ ప్రారంభమైన వెంటనే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వీటిని ప్రవేశపెట్టారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే ఇంకో బిల్లును హోంమంత్రి అమిత్ షా సభ ముందు ఉంచారు. అనంతరం వీటిపై చర్చ సభలో చేపట్టారు. ఈ బిల్లులపై నేటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్లో చర్చించనున్నారు. ఈ మూడింటిపై ఒక్కో సభలో 18 గంటలపాటు ఎంపీలు మాట్లాడుతారు. ప్రధాని మోదీ ఈ సాయంత్రం లోక్‌సభలో ప్రసంగించే అవకాశం ఉంది. రాజ్యసభలో 18న చర్చ ఉంటుంది. -
చట్టసభల్లో చారిత్రక మలుపు... లోక్‌సభ స్థానాలు 850కి పెంపు... రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
-
లోక్‌సభ స్థానాలు 850కి పెంపు!
సాక్షి, న్యూఢిల్లీ: 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, అందుకోసం లోక్‌సభ స్థానాలను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో లోక్‌సభలో స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 543 నుంచి 850 దాకా పెరిగే అవకాశముంది! వీటిలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 815కు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గరిష్టంగా 35కు మించకుండా స్థానాలుంటాయి. మహిళలకు 33 శాతం లెక్కన వాటిలో గరిష్టంగా 280 నుంచి 281 స్థానాల దాకా రిజర్వు చేయనున్నారు. దీనికి వీలు కల్పించేందుకు ఉద్దేశించిన 3 బిల్లులను గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది.2029కి ముందే మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు, అందుకోసం లోక్‌సభ స్థానాల పెంపుకు వీలు కల్పించేలా రాజ్యాంగ (131వ)సవరణ బిల్లు–2026, దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు వీలుగా డీలిమిటేషన్ బిల్లు–2026, ఈ ప్రక్రియను ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీలకు కూడా వర్తింపజేసేందుకు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు–2026 వీటిలో ఉంటాయి. ఈ మూడు బిల్లులకూ ఈ ప్రత్యేక సమావేశాల్లోనే పార్లమెంటు ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటి ముసాయిదా ప్రతులను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంగళవారం ఎంపీలందరికీ పంపింది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం త్వరలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానుంది.లోక్‌సభ స్థానాల తుది సంఖ్యను పునర్విభజన కసరత్తు అనంతరం కమిషనే ఖరారు చేయనుంది. ఈ కారణంగానే పెరగనున్న లోక్‌సభ స్థానాల సంఖ్యను రాజ్యాంగ సవరణ బిల్లులో స్పష్టంగా పేర్కొనలేదు. ‘అన్ని రాష్ట్రాలకు కలిపి గరిష్టంగా 815కు మించకుండా, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35కు మించకుండా లోక్‌సభ స్థానాలుండాలి’అని మాత్రమే తెలిపారు. లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో స్థానాల సంఖ్యను 50 శాతం పెంచాలని మోదీ సర్కారు నిర్ణయించడం తెలిసిందే.ఇందుకోసం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటూ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టనున్నట్టు రాజ్యాంగ సవరణ బిల్లులో వెల్లడించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపుకు వీలుగా రాజ్యాంగంలోని పలు అధికరణలకు సవరణలను కూడా ప్రతిపాదించారు. నారీశక్తి వందన్ అధినియమ్‌గా పేర్కొనే మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలకు పార్లమెంటు ప్రత్యేక భేటీలో ఆమోదం పొందనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే వెల్లడించడం తెలిసిందే. ఈ ప్రక్రియ ఆలస్యమైతే చట్టసభల్లో విధాన నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆశిస్తున్న మహిళలందరికీ తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. 2029 నుంచే అమలయ్యేలా... మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2023లో పార్లమెంటు ఆమోదించడం తెలిసిందే. దీని ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీల్లో 33 శాతం సీట్లను మహిళలకు ప్రత్యేకిస్తారు. అయితే ఈ చట్టం 2034కు ముందు అమల్లోకి వచ్చే పరిస్థితులు లేవు. మహిళా రిజర్వేషన్లు అమలవాలంటే ప్రస్తుతం కొనసాగుతున్న జనగణన–2027 ప్రక్రియ ముగిసి, ఆ లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పుననర్విభజన చేపట్టాల్సి ఉండటమే అందుకు కారణం. కానీ మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నుంచే అమల్లోకి తేవాలని మోదీ సర్కారు భావిస్తోంది. ‘‘తదుపరి జనగణన, దాని తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది.కానీ లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు వీలైనంత త్వరగా అమలయ్యేలా చూడటం చాలా ముఖ్యం. అందుకు అనుగుణంగా మహిళా రిజర్వేషన్ల చట్టానికి అవసరమైన సవరణలు చేపట్టడమే లక్ష్యం’’అని ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదాలో కేంద్రం పేర్కొంది. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న, అంటే 2011 జనాభా లెక్కల ఆధారంగానే లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వు చేసే స్థానాలను రొటేషన్ పద్ధతిలో కేటాయిస్తారని తెలిపింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. అనంతరం వాటి పొడిగింపుపై పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుంది. మూడు బిల్లులపై 18 గంటల చర్చ మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన మూడు కీలక బిల్లులను గురువారం లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టనుంది. రాజ్యంగ (131వ సవరణ) బిల్లు–2026, డీలిమిటేషన్ బిల్లు–2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు–2026పై గురు, శుక్రవారాల్లో సభలో చర్చ జరగనుంది. అందుకు 18 గంటల సమయం కేటాయించారు. అనంతరం వాటిపై ఓటింగ్ చేపడతారు. తర్వాత మూడు బిల్లులపై శనివారం రాజ్యసభలో 10 గంటల పాటు చర్చ, అనంతరం ఓటింగ్ జరుగుతాయి. గురు, శుక్రవారాల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక కూడా జరుగుతుందని పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి.లోక్‌సభ స్థానాల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు లబ్ధి?లోక్‌సభ నియోజకవర్గాల పెంపులో దామాషా ప్రాతినిధ్య విధానాన్ని ప్రాతిపదికగా తీసుకోనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ స్థానాలను గరిష్టంగా 850 దాకా పెంచాలని రాజ్యాంగ సవరణ బిల్లు–2026లో కేంద్రం ప్రతిపాదించింది. ‘‘వాటిని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించే విషయంలో దామాషా విధానాన్ని అనుసరించనున్నారు. దీనిద్వారా దక్షిణాది రాష్ట్రాలకే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశముంది’’అని కేంద్ర వర్గాలు వివరించాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం లోక్‌సభలో వెల్లడించే అవకాశమున్నట్టు తెలిపాయి.నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోనున్న విషయం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలు కొన్ని దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణను సమర్థంగా పాటిస్తూ వస్తున్నాయి. దాంతో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే వాటిలో జనాభా పెరుగుదల తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే తమకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గి ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం పెరుగుతుందని విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి.వాడీవేడిగా సమావేశాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే మోదీ సర్కారు హడావుడిగా మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలను తెరపైకి తెచి్చందని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. మరోవైపు డీలిమిటేషన్‌తో తమకు తీవ్ర అన్యాయం జరగనుందని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం లేవనెత్తుతున్నాయి. ఈ ప్రక్రియను పార్లమెంటులోనే సవాలు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి.డీలిమిటేషన్ 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా తాజాగా జరుగుతున్న జనగణన ప్రాతిపదికన జరగాలని ఆప్, ఆర్జేడీ వంటి పార్టీలు డిమండ్ చేస్తున్నాయి. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇందుకు విపక్షాల మద్దుతు మోదీ ప్రభుత్వానికి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కని్పస్తోంది. పార్లమెంటు సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. డీలిమిటేషన్‌కు కమిషన్ ⇒ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వం ⇒ సభ్యులుగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ⇒ ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది సభ్యులులోక్సభ, అసెంబ్లీ స్థానాల పునర్ వ్యవస్థీకరణ కోసం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానుంది. దానికి సుప్రీంకోర్టు ప్రస్తుత, లేదా రిటైర్డ్ న్యాయమూర్తి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, లేదా ఎన్నికల కమిషనర్‌తో పాటు సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ఈ ప్రక్రియలో రాష్ట్రాల భాగస్వామ్యం నిమిత్తం ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది చొప్పున అసోసియేట్ సభ్యులను నియమిస్తారు. వీరిలో ఐదుగురు ఎంపీలను లోక్‌సభ స్పీకర్, ఐదుగురు ఎమ్మెల్యేలను రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు నామినేట్ చేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులు 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు భారీగా వలసలు పెరగడం, జనాభా పెరుగుదల రేటులో మార్పులతో నియోజకవర్గాల మధ్య సమతుల్యత దెబ్బతిన్నదని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరి్టకల్ 81, ఆరి్టకల్ 55కు కీలక సవరణలు చేస్తూ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా నియోజకవర్గాలను పునర్ వ్యవస్థీకరించనున్నారు. -
లోక్‌సభ స్థానాలు 850కి పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: 131వ రాజ్యాంగ సవరణకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా లోక్‌సభ స్థానాలపై కీలక నిర్ణయం తీసుకుంది.లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 815, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించేలా ప్రణాళిక రూపొందించింది. లోక్‌సభ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రతిపాదనలను ఎంపీలకు తెలియజేసింది.ఈ నెల 16 నుంచి 18 వరకు ప్రత్యేక లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై చర్చ జరగనుంది.ప్రస్తుతం దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అందులో 530 స్థానాలు రాష్ట్రాలకు, 13 స్థానాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించబడ్డాయి. ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచేలా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం ప్రతిపాదనలు ఎంపీలకు అందించింది. -
డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ చట్ట సవరణకు, లోక్‌సభ స్థానాల పెంపుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఇందుకు ఆమోదముద్ర వేసింది. లోక్‌సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి 816కు పెంచాలని మోదీ సర్కారు నిర్ణయించడం తెలిసిందే. వాటిలో 273 స్థానాలను మహిళలకు కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే నారీశక్తి వందన్ అధినియమ్ చట్టాన్ని 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే అమల్లోకి తేవాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. అందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేపట్టనున్నారు. దానితో పాటు డీలిమిటేషన్ బిల్లుకు కూడా పార్లమెంటు ఆమోదం పొందాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఏప్రిల్ 16 నుంచి 18 దాకా పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానుండటం తెలిసిందే. ఇందుకోసం బడ్జెట్ సమావేశాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఎరువుల సబ్సిడీకి రూ.41,534 కోట్లుఖరీఫ్ సీజన్‌కు ఎరువుల సబ్సిడీని 12 శాతం పెంపు నిర్ణయానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అందుకు రూ.41,533.81 కేటాయించారు. 2025 ఖరీఫ్ సీజన్ బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.4,317 కోట్లు అదనమని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో డీఏపీ ధరలు భారీగా పెరిగినా రైతులకు మాత్రం 50 కిలోల బస్తాను రూ.1,350కే అందుబాటులో ఉంచుతూ వస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు, ముడి సరుకుల ధరల్లో మార్పులకు అనుగుణంగా రాయితీని హేతుబద్ధీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. ‘‘రూ.13 వేల కోట్ల పై చిలుకు అంచనా వ్యయంతో కూడిన జైపూర్ మెట్రో రెండో దశకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది 36 స్టేషన్లతో 41 కి.మీ. మేరకు ఉంటుంది’’ అని వైష్ణవ్ వివరించారు. -
లోక్‌సభ స్థానాల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ
-
ఆగిపోయిన ‘ఆంక్షల’ బిల్లు
దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నివిధాల కలిసొస్తుందో వివరించటానికి దాన్ని సమర్థించేవారు అనేకానేక కారణాలు ఏకరువు పెడతారు. కానీ ఆ ప్రతిపాదన వెనకున్న అసలు కారణమేమిటో బుధవారం హఠాత్తుగా లోక్‌సభలో ఆగిపోయిన విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లు చెప్పకనే చెబుతోంది. ఎన్నికల బెడద వల్ల తమకిష్టమైనవి అమలుచేయటం అసాధ్యం కావటమే ఆ అసలు కారణం. ఎఫ్సీఆర్ఏ చట్టాన్ని మరింత కఠినం చేస్తూ తీసుకురాదల్చిన ఈ బిల్లుపై కాంగ్రెస్, సీపీఎంలు కేరళ ఎన్నికల సభల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నందువల్ల తాత్కాలికంగా ఆపామని బుధవారం కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. క్రైస్తవ ఓటర్లు గణనీ యంగావున్న కేరళలో తమ పార్టీ ప్రాబల్యం పెరిగిందని బీజేపీ భావిస్తోంది. ఆ మత విశ్వాసాలను అనుసరించే స్వచ్ఛంద సేవాసంస్థ (ఎన్జీవో)ల కార్యకలాపాలు కూడా అక్కడ ఎక్కువే. కనుక ఈ బిల్లుపై చర్చ జరిగితే అది నష్టం తెస్తుందని పాలకపక్షం భావించినట్టు కనబడుతోంది. కేవలం ‘దుష్ప్రచారం’ వల్లనే తాత్కాలికంగా ఆపామన్న కారణం సహేతుకంగా లేదు. సాగు చట్టాల బిల్లు మొదలుకొని లేబర్ కోడ్, నిన్న మొన్నటి జీరాం జీ వరకూ ఇలాంటి ‘దుష్ప్రచారా’నికి కొదవలేదు. కానీ అవి ఆగింది లేదు.అందరినీ ఒకే గాటన కట్టవలసిన అవసరం లేదు. ఎంతో నిజాయితీగా, అంకిత భావంతో పనిచేసే ఎన్జీవోలున్నట్టే... పేరు ప్రతిష్ఠల కోసం, సాధారణ జనాన్ని ప్రభా వితం చేయటం కోసం పనిచేసే సంస్థలు కూడా ఉంటాయి. యూరప్‌లో ఎక్కడో మారు మూల పుట్టి మన దేశంలో అట్టడుగు వర్గాలకు ఎన్నదగిన సేవలందించిన మదర్ థెరీసాను ఆ వర్గాల ప్రజలు ‘అమ్మ’గా పిల్చుకున్నారు. అలాగే ఎప్పుడూ కరవు వాతబడే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో దాదాపు అరవైయ్యేళ్లుగా నిరుపేద ప్రజానీకానికి భిన్నరంగాల్లో విశేష సేవలందిçస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఖ్యాతి అందరికీ తెలుసు. ఇదే ఎఫ్సీఆర్ఏ కింద నిరుడు ఏప్రిల్‌లో కేంద్రం ఆ సంస్థ అనుమ తులు నిలిపివేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పల్లె నుంచి ఢిల్లీ వరకూ నిరసనలు సాగించింది. ప్రధానికి లక్ష పోస్టు కార్డులు పంపే ఉద్యమాన్ని చేపట్టింది. చివరకు గత నెలాఖరున అనుమతులు పునరుద్ధరించారు. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును ఇప్పుడంటే కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది గానీ... దాన్ని మొదట తెచ్చిందీ, కాలానుగుణంగా కఠినతరం చేసిందీ ఆ పార్టీ ప్రభుత్వాలే. 1976లో ఎమర్జెన్సీ చీకటిచాటున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తొలిసారి ఈ చట్టాన్ని తెచ్చారు. అందుకు విదేశీ శక్తుల్ని కారణంగా చూపారు. దాన్ని 2010లో మరింత కఠినతరం చేసింది కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే. రష్యా సహకారంతో పూర్తికావస్తున్న కూదంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టుపై అమెరికా నిధులతో నడిచే స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. ఇక ఎన్డీయే సర్కారు వచ్చాక 2016, 2018, 2020లలో ఆ చట్టానికి సవరణలొచ్చాయి. అయినా సరిపోలేదని భావించి ఈ బిల్లు తెచ్చారు. ముఖ్యంగా లైసెన్స్ రద్దయిన సంస్థల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించే అధికారం కేంద్రా నికిచ్చేలా సెక్షన్ 15కి చేసిన సవరణే వివాదాస్పదంగా మారింది. దానిపై సంబంధిత వర్గాలతో, పార్టీలతో చర్చించి వారిలో ఉన్నాయంటున్న అపోహలను తొలగించ టానికి ఎలాంటి ప్రయత్నం జరగకుండానే బిల్లు తీసుకురావటమే సమస్య అయింది.ఎఫ్సీఆర్ఏకు 2020 సవరణల అనంతరం ఎన్జీవోలకు విరాళాలు గణనీయంగా తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో విరాళాల రూపేణా రూ. 16,490 కోట్లురాగా, 2019–20నాటికి అది కాస్తా రూ. 2,190 కోట్లకు పడిపోయింది. ఒక అంచనా ప్రకారం గత నెలాఖరు నాటికి 21,933 ఎన్జీవోల లైసెన్సులు రద్దయ్యాయి. ప్రభుత్వాలనుంచి సాయం అందని అనేక వర్గాలు ఈ సంస్థల ద్వారా లీగల్ ఎయిడ్, వైద్యసాయం, విద్య, మౌలిక సదుపాయాలు పొందుతున్నాయి. స్వచ్ఛంద సంస్థల నిర్వహణ పారదర్శకంగా ఉండాల్సిందే. ప్రమాదకర సంస్థలని రుజువైతే వాటి కార్యకలాపాలు నిలిపేయటం కూడా తప్పు కాదు. కానీ అన్నిటినీ ఒకే గాటనకట్టి పీక నొక్కాలనుకోవటం మాత్రం సహేతుకం కాదు. -
డీలిమిటేషన్ బిల్లు ఈ నెలలోనే!
న్యూఢిల్లీ: లోక్‌సభ స్థానాల పెంపు బిల్లుకు పార్లమెంటు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదముద్ర పడేలా కనిపిస్తోంది. ఇందుకు మోదీ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఏప్రిల్ మూడోవారంలో ప్రత్యేకంగా రెండు నుంచి మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. జనవరి 28న ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ ప్రకారం గురువారం నిరవధికంగా వాయిదా పడాల్సి ఉంది. ‘‘అందుకు బదులుగా, ఏప్రిల్ మూడో వారంలో ఉభయ సభలు ఏ తేదీన భేటీ అయ్యేదీ సభాపతులు గురువారం ప్రకటిస్తారు. సమావేశాలను అప్పటిదాకా వాయిదా వేస్తున్నట్టు పేర్కొంటారు’’అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల సంఖ్యను 50 శాతం మేరకు పెంచాలని ఎన్డీఏ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయానికి రావడం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత వారం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు పలు కాంగ్రెసేతర పార్టీల నేతలతో కూడా పంచుకు న్నారు. ఆ సందర్భంగా ఆయన వెల్లడించిన వివరాల మేరకు లోక్‌సభ స్థానాల సంఖ్య 543 నుంచి 816కు పెరగనుంది. వాటిలో 273 స్థానాలను మహిళలకు రిజర్వు చేయనున్నారు. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’చట్టాన్ని 2023లోనే పార్లమెంటు ఆమోదించడం తెలిసిందే. అయితే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు పూర్తయిన అనంతరమే ఆ చట్టం అమల్లోకి రానుంది. అయితే 33 శాతం మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కూడా వర్తింపజేయాలని మోదీ సర్కారు భావిస్తోంది. అందుకు వీలుగా రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ‘‘అలాగే డీలిమిటేషన్ చట్టాన్ని సవరిస్తూ మరో సాధారణ సవరణ బిల్లు కూడా ప్రవేశపెడతారు. వాటికి పార్లమెంటు ఆమోదం లభిస్తే అవి చట్ట రూపం పొంది 2029 మార్చి 31 నుంచి అమల్లోకి వస్తాయి. ఫలితంగా 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆ ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుకు వీలవుతుంది’’అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్థానాల సంఖ్యను 50 శాతం పెంచుతున్నందున వాటిలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాల సంఖ్య కూడా ఆ మేరకు పెరగనుంది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 25 నుంచి 37 లేదా 38కి పెరుగుతుంది. వాటిలో 12 నుంచి 13 సీట్లు మహిళలకు, రిజర్వు చేస్తారు. అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 262 లేదా 263కు పెరగనుంది. వాటిలో 86 నుంచి 87 స్థానాలను మహిళలకు ప్రత్యేకిస్తారు. తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయి. వాటిలో 8 నుంచి 9 సీట్లు మహిళలకు రిజర్వు చేస్తారు. అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరుగుతాయి. వాటిలో 59 స్థానాలను మహిళలకు ప్రత్యేకిస్తారు. నియోజకవర్గాల పెంపుకు 2027 జనాభా లెక్కలను కాకుండా 2011 గణాంకాలనే ప్రాతిపదికగా తీసుకోవాలని మోదీ సర్కారు నిర్ణయించింది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపు విషయమై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రధాన పారీ్టలతో ఎన్డీఏ ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉంది. -
లోక్‌సభ నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల వాకౌట్
సాక్షి, ఢిల్లీ: ప్రస్తుత రూపంలో అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రస్తుత రూపంలో అమరావతి బిల్లును అంగీకరించం అని వైఎస్సార్సీపీ తేల్చి చెప్పింది. రైతుల సమస్యలు, నిధుల గురించి చెప్పకుండా కేవలం పేరు మాత్రమే తీసుకొస్తే లాభం లేదన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.. తాము అమరావతికి కానీ, మరే ప్రాంతానికి కానీ వ్యతిరేకం కాదన్నారు.అమరావతి పేరుతో దోపిడీ.. అమరావతి బిల్లుపై లోక్‌సభలో ఇవాళ జరిగిన చర్చలో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. జీతాలు, సంక్షేమానికి డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు.. అమరావతి అభివృద్ధికి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాల నుంచి డైవర్ట్ చేయడానికే అమరావతి డ్రామా అంటూ దుయ్యబట్టారు.చర్చలో సమాజ్‌వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ కూడా మాట్లాడుతూ.. ఏపీలో ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం విశాఖ ఉంది.. విశాఖ రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేదని.. ల్యాండ్ పూలింగ్, నిధుల సమస్య వచ్చేదేకాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ పెద్దలకే లాభం.. రైతులకు ఏం వస్తుందంటూ ధర్మేంద్ర ప్రశ్నించారు. అమరావతి కోసం భారీ ఎత్తున రైతుల నుంచి భూములు తీసుకున్నారు. రైతులకు ఇప్పటివరకు పరిహారం ఎందుకివ్వలేదు? అంటూ ఆయన నిలదీశారు.ఉద్ధవ్ సేన ఎంపీ అర్వింద్‌సావంత్ మాట్లాడుతూ ఏపీ విభజన సమయంలో టీడీపీ ఐదేళ్లు ప్రత్యేక హోదా కోరిందని.. అప్పుడు శివసేన, టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అప్పుడు ఐదేళ్లు హోదా కావాలని పదేపదే అడిగారు. ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. -
అమరావతిపై లోక్‌సభలో ఎంపీ ధర్మేంద్ర కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం విశాఖ ఉంది.. విశాఖ రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేదని లోక్‌సభలో సమాజ్‌వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అన్నారు. ల్యాండ్ పూలింగ్, నిధుల సమస్య వచ్చేదేకాదు. ల్యాండ్ పూలింగ్ పెద్దలకే లాభం.. రైతులకు ఏం వస్తుందంటూ ధర్మేంద్ర ప్రశ్నించారు. అమరావతి కోసం భారీ ఎత్తున రైతుల నుంచి భూములు తీసుకున్నారు. రైతులకు ఇప్పటివరకు పరిహారం ఎందుకివ్వలేదు? అంటూ ఆయన నిలదీశారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ధరేంద్ర.. బిహార్‌ను మోసం చేసినట్టు ఏపీని మోసం చేయకండి అంటూ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇస్తే నిధుల కోసం కేంద్రం ముందు సాగిలపడక్కర్లేదంటూ వ్యాఖ్యానించారు.ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదు: ఎంపీ అర్వింద్ఉద్ధవ్ సేన ఎంపీ అర్వింద్‌సావంత్ మాట్లాడుతూ.. ఏపీ విభజన సమయంలో టీడీపీ ఐదేళ్లు ప్రత్యేక హోదా కోరింది. అప్పుడు శివసేన, టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అప్పుడు ఐదేళ్లు హోదా కావాలని పదేపదే అడిగారు. ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదు’’ అంటూ ఆయన ప్రశ్నించారు. -
అమరావతి, ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు: మిథున్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పుకొచ్చారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. జీతాలు, సంక్షేమానికి డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు.. అమరావతి అభివృద్ధికి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాల నుంచి డైవర్ట్ చేయడానికే అమరావతి డ్రామా అని అన్నారు.అమరావతి బిల్లుపై లోక్‌సభలో ఈరోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున చర్చలో ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. చర్చలో భాగంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. రెండేళ్లలో రైతులకు అభివృద్ధి చెందిన ప్లాట్ల కోసం ప్రయత్నిస్తామని చెప్పారు.. కానీ ఇవ్వలేదు. 2014-19 వరకు రైతులకు ఎలాంటి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసం తట్టుకోలేక రైతులు గుండె ఆగి చనిపోయారు. రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు ఎలా న్యాయం చేస్తారో ప్రకటించాలి. అమరావతిలో ప్రతీ ఎకరానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ నిధులను ఎక్కడినుంచి తీసుకొస్తారు?.అదనపు భూసేకరణకు అవసరం ఏముంది?. మొత్తం ఎన్ని ఎకరాల భూమి తీసుకుంటారో చెప్పాలి. తీసుకుంటున్న భూమికి జస్టిఫికేషన్ ఏంటి?. అమరావతికి చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రూ.5335 కోట్లు ఖర్చు పెట్టారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి డైవర్షన్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. రెండేళ్లలో మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. చదరపు గజానికి ఢిల్లీలో 4,000 ఖర్చు పెడుతున్నారు. అమరావతిలో చదరపు గజానికి 12,000 రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారు. 8000 రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారుబీజేపీ మాట మార్చింది.. చంద్రబాబు నాయుడు తొలుత తిరువూరులో రాజధాని ఉంటుందని చెప్పారు. ఈలోగా అమరావతిలో భూములను కాజేశారు . అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని మా పార్టీ అభిమతం. రాయలసీమలో రెండో రాజధానిగా ఉంటుందని బీజేపీ చెప్పింది. కానీ ఇప్పుడు మాట మార్చారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని వారికి లేదు. రైతుల ప్రయోజనాలు కాపాడాలి. ప్రస్తుత ఫార్మాట్లో ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. అమరావతికి, ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు. బిల్లుకు వ్యతిరేకంగా మేము వాకౌట్ చేస్తున్నాం’ అని అన్నారు. అనంతరం, లోక్‌సభలో సమాజ్‌వాదీపార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ..‘ఏపీలో అతిపెద్ద నగరం వైజాగ్ సిటీ. విశాఖను రాజధానిగా చేసి ఉంటే ఇంత భూమి, ఖర్చు, అప్పులు అవసరం ఉండేది కాదు. విశాఖపట్నం రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేది. అమరావతి పేరుతో భారీ ఎత్తున రైతుల నుంచి భూమి తీసుకున్నారు. రైతులకు నాలుగు రెట్లు నష్టపరిహారం ఇచ్చారా?. రైతులకు న్యాయం జరగాలి’ అని అన్నారు. -
డెడ్‌లైన్ ముగుస్తోంది.. ‘కగార్’పై అమిత్ షా ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: దేశంలో మావోయిస్టులు లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌కు డెడ్‌లైన్ రేపటితో (మార్చి 31) ముగియనుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో లొంగిపోయారు కీలక మావో నేతలు. హిడ్మా సహా పలువురు అగ్రనేతలను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్‌పై లోక్‌సభలో కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. ‘ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నక్సలిజం దాదాపు అంతమైంది. దేశంలో కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉంది. కాంగ్రెస్ 60 ఏళ్లపాటు ఆదివాసీల సంక్షేమాన్ని విస్మరించింది. గత పాలకులు ఆదివాసీలను తప్పుదోవ పట్టించారు.గత కాంగ్రెస్ పాలనలో ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. మావోయిస్టుల హింసలో అనేకమంది ప్రజలు నష్టపోయారు. తెలంగాణలో అనేక మంది మావో నేతలు లొంగిపోయారు. దేశంలో 12 రాష్ట్రాలు మావోయిస్టుల వల్ల తీవ్రంగా నష్టపోయాయి. కాంగ్రెస్ వైఖరి వల్లే దేశంలో నక్సలిజం పెరిగింది. ఎన్డీఏ వచ్చాకే ఆదివాసుల హక్కులను పరిరక్షించాం. నక్సలిజం కథ ముగిసింది. ఆయుధాలు వీడకుంటే కఠిన చర్యలు తప్పవు. ఆయుధాలు పట్టుకుంటే బుల్లెట్లతో మేము సమాధానం చెబుతాం. గిరిజనులను నక్సలైట్లు తప్పుదోవ పట్టించారు. వారి చేతికి ఆయుధాలు ఇచ్చి హింసకు పురికొల్పారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు లూటీ చేశారు. జనతా సర్కారు పేరుతో ప్రజలను భ్రమలో ముంచారు. జనతా ఆదాలత్ పేరుతో ఎంతోమందిని చంపారు’ అని అమిత్ షా అన్నారు. కాగా, దేశంలో ఉన్న మావోయిస్టులను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2024లో ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా కారడవుల్లో భద్రతా బలగాలు కాలు మోపాయి. ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కర్రిగుట్టల్లో గత ఏడాది 20 రోజుల పాటు పారామిలటరీ బలగాలు యుద్ధాన్ని తలపించే విధంగా ఆపరేషన్ చేపట్టాయి. ఇటువంటి ఆపరేషన్లు 2024 నుంచి ఎన్నో జరిగాయి. 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వరకు జరిగిన ఆపరేషన్‌లో భధ్రతా బలగాలు విజయం సాధించారు. -
ఆశల పల్లకీలో!
(శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి– సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు తొలి అడుగు పడింది. పునర్విభజన జరిగితే లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి కాబట్టి ఆ మేరకు రాజకీయంగా కూడా అవకాశాలు పెరుగుతాయి. 2027 జనాభా లెక్కలు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో 2011 లెక్కలతోనే ప్రక్రియ మొదలుకానుంది. ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం స్థానాలు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 182కు పెరగనుండగా, లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు పెరగనున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు 50 శాతం అంటే.. 60 స్థానాలు పెరిగితే 179 కావాలి.. కానీ ప్రతి లోక్‌సభ స్థానానికి 7 శాసనసభ స్థానాలు ఉండాలన్న నియమంతో 26 లోక్‌సభ స్థానాల పరిధిలో 182 శాసనసభ స్థానాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు వచ్చే ఎన్నికల నుంచే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రతిపాదనలతో వారికి శాసనసభలో 60, లోక్‌సభలో 9 స్థానాలు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నుంచే పెంపు అమల్లోకి వస్తుంది. ఒకే జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం ఉన్న జిల్లాల పరిధిలోనే కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. ఒక శాసనసభ నియోజకవర్గం ఒకే జిల్లా పరిధిలో ఉండాలన్న ప్రాథమిక నిబంధన మేరకు జిల్లా యూనిట్‌గా తీసుకుంటారు. ప్రస్తుతం పలు శాసనసభ నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. కానీ కొత్తగా చేపట్టే పునర్విభజనలో కొత్త నియోజకవర్గాల హద్దులు ఒకే జిల్లాకు పరిమితమవుతాయి. ఈ మేరకు పలు ప్రస్తుత నియోజకవర్గాల పరిధుల్లో మార్పులు, చేర్పులు జరుగుతాయి. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధుల్లోనూ మార్పులు, చేర్పులు జరగనున్నాయి. ఇక కొత్తగా ఏర్పాటయ్యే 63 శాసనసభ స్థానాల్లో అత్యధికం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలతో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లోనే ఏర్పాటు కానున్నాయి. పునర్విభజన ఇలా..! రాష్ట్రంలోని మొత్తం జనాభాను అన్ని నియోజకవర్గాలకు దాదాపు సమానంగా విభజిస్తారు. ప్రతి నియోజకవర్గానికి సగటుగా నిర్ణయించే జనాభా సంఖ్యలో 10 శాతం తక్కువ లేదా ఎక్కువ ఉండే వెసులుబాటు ఉంటుంది. 2011 లెక్కల మేరకు రాష్ట్ర జనాభా 3,51,90,260 మంది. దీని ప్రకారం ప్రతి నియోజకవర్గ సగటు 1,93,353గా ఉంటుంది. ఈ మొత్తానికి పది శాతం తక్కువ లేదా ఎక్కువ జనాభా సగటుతో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పునర్విభజన కోసం ఏర్పాటు చేసే కమిషన్‌కు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్‌గా, అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు సభ్యులుగా ఉంటారు. కమిషన్ తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. మహిళలకు ఎలా..? మహిళలకు కేటాయించే స్థానాలు లాటరీ ద్వారా కేటాయిస్తారా..లేక అత్యధిక జనాభా ఉన్న మొదటి 60 నియోజకవర్గాలను ఎంచుకుంటారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ అత్యధిక జనాభా ఉన్న నియోజకవర్గాలను ఎంచుకుంటే పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉన్న నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, భూపాలపల్లి, నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో అత్యధిక స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా కొత్తవి ఎన్ని.. ఆదిలాబాద్‌లో 5 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 10 నియోజకవర్గాలుండగా కొత్తగా మరో ఐదు స్థానాలు పెరగనున్నాయి. కొత్తగా ఆదిలాబాద్ అర్బన్, ఉట్నూరు, మంచిర్యాల రూరల్ లేదా లక్సెట్టిపేట, నర్సాపూర్ (నిర్మల్) నియోజకవర్గాలతో పాటు మరొకటి కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్న ఇంద్రవెల్లి, ఉట్నూరు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఉన్న నార్నూరు, గాదిగూడ మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పడే కొత్త నియోజకవర్గంలోకి వెళతాయి. నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రాంతాలతోనే ఖానాపూర్ నియోజకవర్గం హద్దులు మార్చుకుంటుంది. నిజామాబాద్‌లో 3 నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఐదు స్థానాలకు కొత్తగా మరో మూడు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటవుతాయి. కొత్తగా నిజామాబాద్ సౌత్ లేదా నార్త్, బోధన్ నియోజకవర్గం నుండి కొన్ని ప్రాంతాలను విడదీసి ఎడపల్లి లేదా బోధన్ రూరల్ నియోజకవర్గం ఏర్పాటవుతుంది. ఇక కామారెడ్డి జిల్లాలో కొత్తగా కామారెడ్డి రూరల్ æస్థానం ఏర్పాటుకు అవకాశం ఉంది. కరీంనగర్లో 5 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం 12 స్థానాలుండగా, కొత్తగా ఐదు స్థానాలు ఏర్పడతాయి. కరీంనగర్ రూరల్, జగిత్యాల రూరల్, మెట్పల్లి, సుల్తాన్‌బాద్, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల జిల్లా) నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ నుండి సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లోకి సుమారు 10 మండలాలు వెళ్లటంతో తక్కువ నియోజకవర్గాలు ఏర్పడుతున్నాయి. మెదక్‌లో 7 ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం 11 స్థానాలుండగా, కొత్తగా 7 స్థానాలు ఏర్పాటవుతాయి. అందులో సంగారెడ్డి జిల్లాలో కొత్తగా రామచంద్రాపురం, అమీన్పూర్, సదాశివపేట, మెదక్ జిల్లాలో రామాయంపేట నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్లతో పాటు కొత్తగా సిద్దిపేట రూరల్ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. రెండు స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లోని తూప్రాన్, మనోహరాబాద్, దుబ్బాకలోని చేగుంట రామాయంపేటలో చేరతాయి. నల్లగొండలో 6 ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 12 స్థానాలుండగా కొత్తగా 6 నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. కొత్తగా మిర్యాలగూడ రూరల్, నల్లగొండ రూరల్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇక యాదాద్రి భువనగిరిలో రామన్నపేట లేదా చౌటుప్పల్ లేదా మోత్కూరు నియోజకవర్గం, సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు 4 స్థానాలుండగా కొత్తగా సూర్యాపేట రూరల్, మునగాల నియోజకవర్గాలతో ఇంకో నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశం ఉంది. ఖమ్మంలో 2 ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 10 స్థానాలుండగా, పునర్విభజన అనంతరం కొత్తగా రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలంలోని పలు ప్రాంతాలతో ఖమ్మం రూరల్ నియోజకవర్గం ఏర్పాటు కానుంది. మిగిలిన స్థానాలు యథాతథంగా ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఐదు స్థానాలుండగా కొత్తగా ఒక స్థానం పెరుగుతుంది. వరంగల్‌లో 9 ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 12 నియోజకవర్గాలుండగా కొత్తగా 9 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. హనుమకొండ జిల్లాలో కాజీపేట, హసన్‌పర్తి, శాయంపేట, మడికొండ, వరంగల్ జిల్లాలో వరంగల్ సెంట్రల్, గీసుకొండ, మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ రూరల్, తొర్రూరు,, భూపాలపల్లిలో కాటారం, జనగామలో ప్రస్తుతం ఉన్న మూడు నియోజకవర్గాలు కొనసాగే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్‌లో 6 ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా 6.. మహబూబ్‌నగర్ రూరల్, గండీడ్, కోస్గి, అమరచింత, పెబ్బేరు, ఐజ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలుగా విడిపోనుంది. అందులో కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గంలో కోస్గి, మద్దూర్ ఇతర మండలాలు చేరితే,, వికారాబాద్ జిల్లాలో ఉన్న కొడంగల్, బొమ్మరాశిపేట, దుద్యాల, దౌల్తాబాద్ మరో రెండు మండలాలతో కొడంగల్ రూపురేఖలు మారనున్నాయి. హైదరాబాద్ చుట్టూ మొత్తం 51 హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య మొత్తం 51కి పెరగనుంది. హైదరాబాద్‌లో 5 స్థానాలు పెరిగి మొత్తం 20 నియోజకవర్గాలు ఏర్పాటు కానునున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో 31 స్థానాలు అవుతాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్‌లోని మండలాలతోనే ఏర్పాటవుతుంది. ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు రెండేసిగా ఏర్పడి మొత్తం 13 నియోజకవర్గాలు, మేడ్చల్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 5 స్థానాలకు తోడు కొత్తగా కాప్రా, అల్వాల్, బోడుప్పల్, కొంపల్లి, మూసాపేట తదితర స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. -
సంక్షోభాన్ని అధిగమిస్తాం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం తాలూకు ప్రతికూల ప్రభావాలు భారత్‌తో పాటు అన్ని దేశాలపైనా దీర్ఘకాలం పాటు కొనసాగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. కరోనా సంక్షోభం తరహాలోనే వాటిని కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్నివిధాలా సిద్ధంగా, సమైక్యంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘సవాళ్లనే సవాలు చేయగల సత్తా భారతీయుల సొంతమని ఎన్నోసార్లు రుజువు చేశాం. అదే మన గుర్తింపు. అదే మన బలం. ఇప్పుడు కూడా ఓపిక, సంయమనం, జాగరూకతతో వ్యవహరిద్దాం’’అంటూ పిలుపునిచ్చారు. పశ్చిమాసియా యుద్ధం, తద్వారా తలెత్తిన పరిస్థితులపై ప్రధాని సోమవారం లోక్‌సభలో ప్రకటన చేశారు. యుద్ధం కారణంగా చమురు, వంట గ్యాస్, ఎరువులు మొదలుకుని జాతీయ భద్రత దాకా తలెత్తిన ఆందోళనలను సవివరంగా ప్రస్తావించారు. వాటితో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు వివరించారు. హార్మూజ్ జలసంధి వద్ద చిక్కుబడ్డ భారత్‌కు చెందిన పలు ఇంధన నౌకలను సురక్షితంగా రప్పిస్తున్నట్టు చెప్పారు. పశ్చిమాసియా కల్లోలానికి చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కారం లభిస్తుందన్న భారత్ వైఖరిని మోదీ పునరుద్ఘాటించారు. ఈ సంక్షోభంపై పార్లమెంటు వేదికగా ఉమ్మడి గళం విని్పంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. హార్మూజ్ మూత అంగీకారం కాదు ఏ ఆర్థిక వ్యవస్థకైనా ఇంధనమే వెన్నెముక అని ప్రధాని గుర్తు చేశారు. ‘‘ప్రపంచ ఇంధన అవసరాలు తీర్చేందుకు పశ్చిమాసియా ప్రధాన వనరు. అక్కడ మూడు వారాలకు పైగా కొనసాగుతున్న సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది’’అంటూ ఆందోళన వెలిబుచ్చారు. 20 శాతానికి పైగా అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రమైన హార్మూ జ్ వంటి జల రవాణా వనరుల మూసివేత, నౌకల రాకపోకలను అడ్డుకోవడం వంటి చర్యలు ఎంతమాత్రమూ ఆమోదనీయం కాదని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పదేళ్లకు పైగా అనుసరిస్తూ వచి్చన ఇంధన వైవిధ్య వ్యూహం ఈ సంక్షోభ సమయంలో ఎంతగానో ఆదుకుంటోందన్నారు. ‘‘ఇంధనం దిగు మతి చేసుకునే దేశాల సంఖ్యను గత 11 ఏళ్లలో 27 నుంచి 41కి పెంచుకున్నాం. తద్వారా ఏదో ఒక్క దేశంపైనే మితిమీరి ఆధారపడే అగత్యం లేకుండా జాగ్రత్త పడ్డాం. ఫలితంగా భారత్ వద్ద ప్రస్తుతం 53 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలున్నాయి. వాటిని మరో 65 లక్షల టన్నులకు పెంచుకోవడంపై దృష్టి పెట్టాం. యుద్ధ సమస్యల పరిష్కారానికి సమగ్రమైన స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలను కేంద్రం రూపొందించింది. రోజువారీ ప్రాతిపదికన పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రుల గ్రూపును ఏర్పాటు చేశాం’’అని మోదీ వివరించారు.మనోళ్ల భద్రతకు చర్యలు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోటి మందికి పైగా భారతీయు భద్రతకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు మోదీ తెలిపారు. ‘‘యుద్ధం మొదలైన నాటినుంచీ 3.75 లక్షల మందికి పైగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చాం. ఇరాన్ నుంచి 700 మంది వైద్య విద్యార్థులతో పాటు 1,000 మందికి పైగా తిరిగొచ్చారు’’అని వెల్లడించారు.అక్రమ నిల్వలపై ఉక్కుపాదం కల్లోల పరిస్థితులను ఆసరాగా చేసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయతి్నంచే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. సరిహద్దు, తీర, సైబర్ భద్రతా దళాలను ఇప్పటికే పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసినట్టు వెల్లడించారు. నిత్యావసరాలు, ముఖ్యంగా ఎల్పీజీ తదితరాలను అక్రమంగా నిల్వ చేసే, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతున్నట్టు వివరించారు. కోవిడ్ లాంటి సంక్షోభం : మోదీ ప్రధాని ప్రసంగంలో మరికొన్ని కీలక అంశాలుప్రపంచ సంక్షోభాల భారం రైతులపై పడకుండా, ఎరువుల కోసం ఏర్పాట్లు.కీలకమైన ముడిసరుకుల విషయంలో నిల్వలను పెంచుకుంది.యుద్ధం, భారతదేశంలో వేసవి ఉష్ణోగ్రతల కారణంగా దేశంలో విద్యుత్ అవసరం పెరుగుతుంది ప్రస్తుతం, దేశంలోని అన్ని విద్యుత్ ప్లాంట్లలో తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయి. వరుసగా రెండో ఏడాది కూడా ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని నమోదు చేసింది. విద్యుత్ ఉత్పత్తి నుంచి సరఫరా వరకు అన్ని వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.మన పునరుత్పాదక బొగ్గు శక్తి 140 గిగావాట్లుగా ఉంది. గోవర్ధన్ యోజన కింద 40 లక్షలకు పైగా ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటుఈ యుద్ధ ప్రభావం దీర్ఘకాలికంగాఉంటుందని మోదీ హెచ్చరికకోవిడ్ లాంటి సంక్షోభం, దీన్నిఅధిగమించడానికి దేశం మరోసారి ఏకం కావాలిగతంలో కూడా ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాం. ఎప్పటిలాగానే ఐక్యంగా ఉండాలి. కాగా అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో నిత్యావసర వస్తువుల సరఫరా, ఇంధన భద్రతను నిర్ధారించడానికి తీసుకోవాల్సిన దీర్ఘకాలిక, స్వల్పకాలిక చర్యలపై చర్చించేందుకు ప్రధాని మోదీ క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ (CCS) సమావేశం నిర్వహించిన ఒక రోజు తర్వాత మోదీ ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
వైఎస్ జగన్ హయాంలోనే పేదలకు అత్యధిక ఇళ్లు: కేంద్రం
ఢిల్లీ: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పేదలకు అత్యధిక ఇళ్ల నిర్మాణం జరిగిందని లోక్‌సభలో కేంద్ర మంత్రి తోకన్ సాహు ప్రకటించారు. జగన్ హయాంలో ఐదేళ్లలో 6 లక్షల 85 వేల 864 ఇళ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. లోక్‌సభలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రశ్నకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ సమాధానం ఇచ్చారు. వైఎస్ జగన్ హయాంలో ఐదేళ్లలో 6,85,864 ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యాయన్నారు. ఇళ్ల నిర్మాణానికి అప్పటి జగన్ సర్కారు రూ.22,744 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. పీఎంఏవై పథకానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టింది గత వైఎస్ జగన్ ప్రభుత్వం. నీతి ఆయోగ్ సైతం కితాబు కాగా, ఇటీవలే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యంతో కొనసాగిందని నీతి ఆయోగ్ కితాబు ఇచ్చింది. ఏపీ వ్యయం నమూనా సంక్షేమ, మౌలిక సదుపాయాలపై ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో సొంత ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల ధోరణిని సూచించిందని ఆ నివేదిక తెలిపింది. 2023-24 రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికలపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది.రాష్ట్ర వ్యయం నమూనాను పరిశీలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చిందని.. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, సాగునీరు, ఇంధన రంగాలకు పెద్దపీట వేసిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఖర్చులలో ఎక్కువ భాగం జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు లాంటి తప్పనిసరి బాధ్యతలను నిర్వర్తిస్తూనే గత ప్రభుత్వం కీలక రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆదాయాలు ఆరోగ్యకరమైన పెరుగుదలను సూచించాయని, జీఎస్టీతోపాటు వస్తువుల పన్నులు పెరిగాయని నివేదిక పేర్కొంది.గత ప్రభుత్వంలో మూలధన వ్యయం జీఎస్డీపీలో 4 నుంచి 9 శాతం పరిధిలో ఉండటం ఆస్తుల సృష్టి, మౌలిక సదుపాయాల అభివృద్ధి వైపు స్థిరమైన పురోగతిని సూచిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. 2023-24లో మొత్తం వ్యయంలో సామాజిక సేవల వ్యయం 52.4 శాతంతో అతి పెద్ద వాటాను కలిగి ఉందని పేర్కొంది. ఇది విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణ రంగాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపింది. ఇక ఆర్థిక సేవలు 44.6 శాతం వాటాను కలిగి ఉండగా ప్రధానంగా రవాణా, నీటి పారుదల, ఇంధన రంగాలు పెట్టుబడుల ద్వారా పురోగమించాయని నివేదిక పేర్కొంది. -
రాహుల్‌పై కంగనా ‘పోకిరి’ వ్యాఖ్యల దుమారం
సాక్షి,న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ప్రవర్తన మహిళలకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని, ఆయన వ్యవహరించే తీరుతో మహిళలందరమూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నామన్నారు. అంతేకాదు రాహుల్ ఒక "టపోరీ"(ఆకతాయి)లా వచ్చి వెడతారన్న వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి.పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ 200కుపైగా మాజీ అధికారులు రాసిన బహిరంగ లేఖ రాజకీయ చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రవర్తనపై వచ్చిన విమర్శలపై రనౌత్ స్పందిస్తూ, రాహుల్‌ని చూస్తే మహిళలంతా అసౌకర్యానికి గురవుతారని, ఎందుకంటే ఒక పోకిరిలాగా దూకుడుగా మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇచ్చే వారిని ఎగతాళి చేస్తూ ఇబ్బంది పెడతారని ఆమె మండిపడ్డారు.Delhi: On Leader of Opposition Rahul Gandhi, BJP MP Kangana Ranaut says, "Hum mahilaon ko bahut zyada unko dekhkar uncomfortable feel hota hai, Kyunki ekdum jaise tapori ki tarah wo aate hain aur kisi ko bhi 'aae tu aise karke, tu tadak kar' kehte hain...'' pic.twitter.com/XzZ62MmLbg— IANS (@ians_india) March 18, 2026ప్రియాంకతో పోలికఅయితే రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా హుందాగా ప్రవర్తిస్తారని కంగనా పేర్కొన్నారు. రాహుల్ తన సోదరి ప్రియాంకగాంధీని చూసి నేర్చుకోవాలని హితవు పలకం విశేషం. ప్రియాంక ప్రవర్తన చాలా బాగుంటుందని, కానీ రాహుల్ ప్రవర్తన మాత్రం "సిగ్గుచేటు" అంటూ కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేసారు. ఇదీ చదవండి: బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత, రాజకీయ విభేదాలు ఉండవచ్చు, కానీ రాహుల్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. మహిళల గౌరవం, వారి అభ్యున్నతి పట్ల ఆయన చాలా నిబద్ధతతగా ఉంటారనీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు ఆయనతో కలిసి పనిచేశానని చెప్పారు. ఇందిరా గాంధీ, సోనియా లాంటి మహిళా నాయకత్వ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిపై ఇటువంటి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.#WATCH | Delhi | Over Kangana Ranaut's comments on Rahul Gandhi, Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi says, "There could be personal or political disagreements, but saying something like this for Rahul ji is wrong. I have seen Rahul ji's commitment towards the upliftment of… pic.twitter.com/w5tzBvsjax— ANI (@ANI) March 18, 2026 -
8 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ రద్దు!
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ తొలి దఫా సమావేశాల వేళ లోక్‌సభలో సభాకార్యకలాపాలకు అడ్డుతగిలారన్న కారణంగా ఫిబ్రవరి మూడో తేదీన సస్పెన్షన్‌కు గురైన ఎనిమిది మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను మోదీ సర్కార్ రద్దుచేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. సస్పెన్షన్‌ను మంగళవారం ఎత్తేయనున్నట్లు సమాచారం.సీపీఐ(ఎం) ఎంపీ ఎస్.వెంకటేసన్తోపాటు ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు గుర్జీత్ సింగ్ ఔజ్లా, హిబీ ఈడెన్, సీ కిరణ్ కుమార్ రెడ్డి, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మాణిక్యం ఠాకూర్, ప్రశాంత్ పదోలే, డియాన్ కురియన్కోసేలపై ఏప్రిల్ రెండో తేదీదాకా ఉన్న సస్పెన్షన్ వేటును తొలగించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో నిర్ణ యించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో వీళ్లపై సస్పెన్షన్‌ను రద్దుచేయాలంటూ విపక్షనేతలు డిమాండ్ చేయడంతో సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ట్రాన్స్‌జెండర్‌కు స్పష్టమైన నిర్వచనం
న్యూఢిల్లీ: ట్రాన్స్‌జెండర్ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇస్తూ కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ శుక్రవారం లోక్‌సభలో ట్రాన్స్‌జెండర్ పర్సన్స్(ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్(ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) చట్టం–2019లో కొన్ని మార్పులు చేసి ఈ బిల్లును రూపొందించారు. ట్రాన్స్జెండర్లకు హాని తలపెట్టే వారికి నేర తీవ్రతను బట్టి శిక్షలు విధించే అంశాన్ని బిల్లులో చేర్చారు. విభిన్న లైంగిక ధోరణులు, స్వీయ లైంగిక గుర్తింపు కలిగిన వ్యక్తులను ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో చేర్చకూడదని ఇందులో ప్రతిపాదించారు. ట్రాన్స్జెండర్ల రక్షణ కోసం ఉన్న చట్టం ప్రయోజనాలు అసలైన, అర్హులైన వ్యక్తులకే చేరాలంటే ఈ పదానికి కచి్చతమైన నిర్వచనం ఇవ్వడం అత్యవసరం అని పేర్కొన్నారు. 2019 నాటి చట్టంలోని రక్షణలు, ప్రయోజనాలు చాలా విస్తృతమైనవని తెలిపారు. వాటిని అనర్హులకు అందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తిని నిర్వచించడానికి బిల్లులో సబ్‌క్లాజ్ చేర్చారు. జని్మంచిప్పుడు నిర్ధారించిన లింగం(స్త్రీ లేదా పురుషుడు) కాకుండా, తమకు నచి్చన లేదా భిన్నమైన లింగ గుర్తింపుతో జీవించే వ్యక్తిని ట్రాన్స్‌జెండర్ అనొచ్చు. సామాజికంగా–సాంస్కృతికంగా కిన్నెర్, హిజ్రా, అరావణి, జోగ్తా, కొజ్జా (నపుంసకుడు) వంటి గుర్తింపులు ఉన్న వ్యక్తులు ట్రాన్స్జెండర్లు అవుతారు. ఇంటర్‌సెక్స్ వైవిధ్యాలు కలిగిన వ్యక్తి లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లింగ లక్షణాలు ఉన్న వ్యక్తిని ట్రాన్స్‌జెండర్‌గా నిర్వచించాలి. ఒక వ్యక్తి ట్రాన్స్‌జెండర్ అవునో కాదో నిర్ధారించడానికి నిపుణుల సలహా తీసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ లేదా డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలోని మెడికల్ బోర్డుకు ఈ అధికారం ఉంటుంది. ట్రాన్సజెండర్లుగా అధికారికంగా గుర్తింపు పొందిన వ్యక్తులు తమ గుర్తింపును బర్త్ సరి్టఫికెట్ సహా ఇతర ధ్రువపత్రాల్లో మార్చుకోవచ్చు. -
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గ్యాస్ మంటలు
-
సీఈసీని తొలగించాలంటూ నోటీసు
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపునకు ఇటీవల తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షాలు.. తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) తొలగింపునకు సైతం నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు సిద్ధం చేసిన నోటీసుపై మొత్తం 193 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఇందులో 130 మంది లోక్‌సభ సభ్యులు కాగా, 63 మంది రాజ్యసభ ఎంపీలని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఈ నోటీసును లోక్‌సభకు లేదా రాజ్యసభ చైర్మన్‌కు అందజేసే అవకాశాలున్నాయంటున్నారు.ముందుగా ఎవరికి ఇచ్చేదీ స్పష్టం కావాల్సి ఉంది. సీఈసీ తొలగింపు కోరుతూ ఇవ్వనున్న నోటీసుపై సంతకాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ఎంపీలు ముందుకు వచ్చారని ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. నోటీసుకు అవసరమైన సంఖ్యలో సంతకాలను ఇప్పటికే సేకరించినప్పటికీ, గురువారం కూడా ఎంపీలు కొందరు ఆసక్తి కనబరిచారన్నారు. సీఈసీ తొలగింపును కోరాలంటే లోక్‌సభలో కనీసం 100 మంది, అదే రాజ్యసభలో అయితే 50 మంది ఎంపీలు సంతకాలు చేస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్య పారీ్టలతోపాటు, అధికారికంగా ఆ కూటమిలో చేరని ఆప్‌కు చెందిన ఎంపీలు కూడా నోటీసుపై సంతకాలు చేశారని ఆ నేత వివరించారు. ఓటరు జాబితా సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) విషయంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అధికార పక్షానికి అనుకూలంగా, వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపుపై జరిగే విచారణను ఆయన అడ్డుకుంటున్నారంటున్నాయి. కాగా, సీఈసీని తొలగించాలంటూ పార్లమెంట్లో నోటీసు జారీ చేయనుండటం ఇదే మొదటిసారి కానుంది. తొలగింపు తీర్మానాన్ని పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. తీర్మానం ఆమోదం పొందాలంటే, సభలోని మొత్తం సభ్యులలో మెజారిటీ (50% కంటే ఎక్కువ) ఉండటంతో పాటు, ఆ సమయంలో సభకు హాజరై ఓటేసిన వారిలో రెండింట మూడొంతుల మెజారిటీ తప్పనిసరి. -
చమురు కొరతలేదు : వదంతులకు ఇది సమయం కాదు : హర్దీప్ పూరి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఎల్పీజీ సిలిండర్లపై ఏర్పడిన సంక్షోభంపై లోక్‌సభలో దుమారం రేగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. గ్యాస్ సంక్షోభంతో దేశం అల్లాడిపోతోందంటూ ఆరోపించారు. దీంతో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి. హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) వివరణ వచ్చారు. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఆందోళన అవసరం లేదని తెలిపారు. గృహాసరాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఆసుపత్రులు , విద్యా సంస్థలకు ఆటంకం లేకుండా సరఫరా చేస్తామని మంత్రి అన్నారు. గ్యాస్ సరఫరాపై రాష్ట్రాలకు ఎప్పటికపుడు సూచనలి స్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. విపక్షాల ఆందోళన మధ్యే మంత్రి ఈ వివరణ ఇచ్చారు. వదంతలను వ్యాప్తి చేయడానికి ఇది సమయం కాదంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. దేశంలో డీజిల్, పెట్రోల్ లేదా కిరోసిన్ కొరత లేదని హామీ ఇచ్చారు. సరఫరా గొలుసులు సజావుగా పనిచేస్తున్నాయన్నారు.మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంధన సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా ఉందని కానీ, భారతదేశ ముడి చమురు సరఫరా స్థానం సురక్షితంగా ఉందని, హార్ముజ్ అందించే దానికంటే ఎక్కువ పరిమాణంలో లభించిందని చెప్పారు.90 మిలియన్ల మెట్రిక్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాం. గల్భ్కు బదులుగా నార్వే కెనడా నుంచి దిగుమతికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. ఇంధన సరఫరాను నిర్ధారించేందుకు కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నా యన్నారు.ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా వివాదం ఉన్నప్పటికీ భారతదేశ ముడి చమురు సరఫరాకు ఇబ్బంది లేదని చెప్పారు.కొన్ని ప్రాంతాలలో కనిపించే ఒత్తిడి ఏదైనా ఉత్పత్తి లేదా సరఫరా వైఫల్యం వల్ల కాదని, తాత్కాలిక డిమాండ్ కారణంగా ఉందని పూరి అన్నారు.LPG వినియోగదారులకు డెలివరీ ప్రామాణీకరణ కోడ్ కవరేజీని 50శాతం నుండి 90శాతానికి విస్తరిస్తున్నా మని, దీని కింద వినియోగదారు OTP నిర్ధారణ తర్వాత మాత్రమే సిలిండర్ డెలివరీ అయినట్లు గుర్తిస్తామని ఇది మళ్లింపు అవకాశాలను తగ్గిస్తుందని ఆయన సభకు తెలియజేశారు. బుకింగ్-టు-డెలివరీ చక్రం దాదాపు 2.5 రోజులు కొనసాగుతుందని, సిలిండర్ల బుకింగ్ , సరఫరా పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు , గ్రామీణ, ప్రాంతాలలో 45 రోజుల గ్యాప్ ఉంటుందని ఆయన అన్నారు.కాగా గ్యాస్ కొరత సమస్యను త్వరగా పరిష్కరించాలంటూ విపక్షాలు చేపట్టిన నిరసనలో పాల్గొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఏ దేశానికైనా ఇంధన భద్రత ప్రాథమికమని నొక్కి చెబుతూ, భారతదేశం తన గ్యాస్‌ను ఎక్కడి నుండి కొనుగోలు చేస్తుందనే దానిపై నిర్ణయాలను ప్రభావితం చేయడానికి అమెరికాను ఎందుకు అనుమతించాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పుడు విదేశాంగ విధానాల కారణంగా గ్యాస్, పెట్రోల్ వంటి ఇంధనాల విషయంలో తీవ్ర సవాళ్లు ఎదుర్కోబోతోందని హెచ్చరించారు.ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికన్-ఇజ్రాయెల్ దాడుల కారణంగా ప్రారంభమైన ఈ వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చమురు సరఫరాను, ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. -
పార్లమెంట్: ఎల్పీజీ కొరతపై దద్దరిల్లిన ఉభయ సభలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్పీజీ (వంటగ్యాస్) సిలిండర్ల తీవ్ర కొరత, పెరుగుతున్న ధరలపై గురువారం పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. పెరుగుతున్న సామాన్యుడి కష్టాలపై కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు నిరసన గళం విప్పగా, మరోవైపు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు దారితీసి, తీవ్ర వాగ్వాదాల మధ్య వీగిపోయింది. కేంద్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే దేశంలో ఇంధన సంక్షోభం ముదిరిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు.Lok Sabha Speaker Om Birla returns to the Chair after the no-confidence motion against him moved by the Opposition was rejected yesterday.He says, "On the two-day discussion which was held, I will also present my view. Lok Sabha is adjourned till noon today." pic.twitter.com/X33hpaULDs— ANI (@ANI) March 12, 2026‘హోర్ముజ్ జలసంధి దిగ్బంధం వల్ల ఖతార్, అబుదాబి నుంచి రావాల్సిన చమురు, గ్యాస్ దిగుమతులు నిలిచిపోయాయి. ఈ యుద్ధం ముంచుకొస్తుందని తెలిసినా ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేదు?’ అని ఆయన ప్రశ్నించారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయని, గృహ అవసరాల సిలిండర్ కోసం 25 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నోట్ల రద్దు, కరోనా సమయాల్లోనూ ప్రభుత్వం ఇలాగే బుకాయించిందని, ఇప్పుడు కూడా అదే బాటలో సాగుతోందని విమర్శించారు. VIDEO | Parliament session: Lok Sabha Leader of Opposition Rahul Gandhi on the reported LPG crisis says, “The Prime Minister says there is no need to panic. But he himself appears panicked for completely different reasons. You saw yesterday that the Prime Minister’s chair inside… pic.twitter.com/lA7pVRFqlv— Press Trust of India (@PTI_News) March 12, 2026కేవలం గ్యాస్ మాత్రమే కాకుండా, యుద్ధ ప్రభావం వల్ల 60 వేల టన్నుల బాస్మతీ ఎగుమతులు నిలిచిపోయాయని, మందుల తయారీకి వాడే ముడిపదార్థాల ధరలు 30 శాతం పెరగడంతో సామాన్యునికి వైద్యం భారమైందని విపక్షాలు ఆరోపించాయి. వస్త్ర, విమానయాన, ఉక్కు, ఆటోమొబైల్ రంగాలు కుదేలవుతున్నాయని ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంటు వెలుపల మీడియాతో పేర్కొన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. ఇదిలావుండగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని 118 మంది ఎంపీలు ఇచ్చిన నోటీసుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. నాలుగు దశాబ్దాల తర్వాత స్పీకర్‌పై ఇలాంటి తీర్మానం రావడం దురదృష్టకరమన్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ.. "సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసేవారు.. సభకు ఎంతసేపు వస్తున్నారో చూసుకోవాలి. జాతీయ సగటు హాజరు 80 శాతం ఉంటే, ఆయన హాజరు 43-51 శాతమే ఉంది’ అని ఎద్దేవా చేశారు.రైతులకు నష్టం జరుగుతోందన్న కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టిన షా.. 2013 నాటి డబ్ల్యూటీవో ఒప్పందాలే ప్రస్తుత సమస్యలకు మూలమని అన్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం, జగదాంబికా పాల్ అధ్యక్షతన జరిగిన ఓటింగ్‌లో స్పీకర్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. అయితే, హోంమంత్రి వాడిన కొన్ని పదాలు అసందర్భంగా ఉన్నాయని విపక్షాలు ఆరోపించగా, సభాపతి వాటిని రికార్డుల నుంచి తొలగించారు. యుద్ధం ముగిసే వరకు ఇంధన భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని విపక్షాలు పట్టుబట్టాయి.ఇది కూడా చదవండి: మార్చి ప్రత్యేకం: విశ్వం మెచ్చిన వింత పూలు -
‘చరిత్రలో ఇదే తొలిసారి’: లోక్‌సభలో రాహుల్ ఆగ్రహం
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడతలో రాజకీయ సెగలు మరింతగా రాజుకున్నాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సభలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించడంతో గందరగోళం నెలకొంది. చర్చ సందర్భంగా అధికార పక్ష సభ్యులు పదేపదే తన పేరును ప్రస్తావించడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ప్రతిపక్ష నేతను సభలో మాట్లాడనివ్వకుండా అడ్డుకోవడం ఇదే తొలిసారి అని ఆయన మండిపడ్డారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ సభను పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.సభాపతి ఓం బిర్లా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అవిశ్వాస తీర్మానంపై ఫిబ్రవరిలోనే సుమారు 118 మంది ఎంపీలు సంతకాలు చేయగా, దీనిపై చర్చకు 10 గంటల సమయాన్ని కేటాయించారు. తీర్మానం నెగ్గాలంటే విపక్షాలకు సాధారణ మెజారిటీ అవసరం. అయితే, స్పీకర్ ఎన్నడూ పక్షపాతంగా వ్యవహరించలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. విపక్షంలోని 50 మందికి పైగా ఎంపీలు వ్యక్తిగతంగా తనను కలిసి, ఈ తీర్మానంతో తాము ఏకీభవించడం లేదని, కేవలం ఒత్తిడి మేరకే సంతకాలు చేశామని చెప్పారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.వంట గ్యాస్ కొరతపై..దేశంలో వంట గ్యాస్ (ఎల్పీజీ) కొరతను నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో విపక్ష నేతలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతిని, గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా సామాన్యులకు సిలిండర్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్ రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. 2019 నుంచి లోక్‌సభలో ‘డిప్యూటీ స్పీకర్’ పదవి ఖాళీగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపించింది. గతంలో స్పీకర్‌పై తీర్మానం ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ సభను నడిపించేవారని, కానీ ప్రస్తుతం ఆ వ్యవస్థే లేకుండా పోయిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కాగా ఇరాన్ తదితర గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతల కారణంగా చిక్కుకుపోయిన వెయ్యి మందికి పైగా భారతీయ మత్స్యకారులను వెంటనే స్వదేశానికి తీసుకురావాలని కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్ డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: పప్పన్నం పెట్టకుండా 10 వేల పెళ్లిళ్లు? -
ప్రతిపక్ష నేతకు అవకాశమివ్వలేదు
స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారు. కానీ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరించారు. ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని ఆయన ఎన్నోసార్లు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మరో సభ్యుడికి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. – కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై మంగళవారం చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాల నడుమ సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓం బిర్లా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, కొందరు మహిళా ఎంపీలపైఆయన నిరాధార ఆరోపణలు చేశారని, కొన్ని అంశాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరారు.స్పందించిన అధికార పక్షం, ఓం బిర్లాను తొలగించేందుకు తీసుకువచ్చిన తీర్మానం వార్తల్లో నిలిచేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నంగా అభివర్ణించింది. ఓం బిర్లా నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారంటూ మద్దతు తెలిపింది. స్పీకర్ స్థానంలో ఉన్న వారు తమను తాము సమర్థించుకునేందుకు సభలో జరిగే ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ ఓటింగ్‌కు దూరంగా ఉండాలని బిర్లా నిర్ణయించుకున్నారు. హోం మంత్రి అమిత్ షా ప్రసంగంతో బుధవారం ఈ తీర్మానంపై చర్చ ముగియనుంది.తటస్థంగా ఉంటారని ఆశించాం. కానీ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తీర్మానంపై చర్చను ప్రారంభించారు.సభా మర్యాదను కాపా డేందుకు, రాజ్యాంగాన్ని రక్షించేందుకే స్పీకర్‌ను తొలగించేందుకు ప్రతిపక్షం తీర్మానం తీసుకు రావాల్సి వచ్చిందన్నారు. ‘స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారు. కానీ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరించారు. ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని ఆయన ఎన్నోసార్లు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మరో సభ్యుడికి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు’అని గొగోయ్ ఆరోపించారు. సభలో వాక్ స్వాతంత్య్రం లేనేలే దన్నారు. సభ్యులందరికీ వ్యక్తిగతంగా స్పీకర్‌తో సత్సంబంధాలే ఉన్నప్పటికీ, ఈ తీర్మా నం తేవాల్సి రావడం విచారకరమని గొగోయ్ పేర్కొన్నారు. అందరికీ అవకాశమిచ్చారు: మంత్రి రిజిజుఈ చర్చ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు జోక్యం చేసుకుంటూ.. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యవక్తం చేశారు. వాస్తవానికి ఓం బిర్లా సభ్యుల పట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించారన్నారు. అధికార పక్షం కంటే ప్రతిపక్ష సభ్యులకే తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు ఎక్కువ అవకాశాలిచ్చారని తెలిపారు. అధికారం కోల్పోయిన 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యవస్థలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈసారి స్పీకర్ పదవినే లక్ష్యంగా చేసుకుందని, ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని ఆయన అభివర్ణించారు. డీఎంకే నేత టీఆర్ బాలు, టీడీపీకి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, శివసేన(యూబీటీ) సభ్యుడు అర్వింద్ సావంత్, టీఎంసీకి చెందిన మహువా మొయిత్రా, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే చర్చలో పాల్గొన్నారు. -
Parliament Budget Session: స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం చర్చ
Parliament Budget Session Updates:లోక్‌సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్తీర్మానంలో మూడు అంశాలను ప్రస్తావించిన కాంగ్రెస్1. రాష్ట్రపతి ప్రసంగంపై రాహుల్ గాంధీని మాట్లాడేందుకు అంగీకరించకపోవడం2. 8 మంది కాంగ్రెస్ ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడం3. విపక్ష మహిళా ఎంపీలపై ఆరోపణలు చేయడం అవిశ్వాస తీర్మానం పై సంతకాలు సరైన రీతిలో లేకపోయినా స్పీకర్ ఓం బిర్లా అనుమతించారని తెలిపిన ప్యానెల్ స్పీకర్ జగదంబిక పాల్కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాలుకొనసాగుతున్న రెండో దఫా పార్లమెంట్ సమావేశాలుసభలో లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లాను తొలగించాలని తీర్మానం ప్రవేశ పెట్టనున్న ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్ సెషన్ మొదటి దశలో స్పీకర్‌కు వ్యతిరేకంగా తీర్మానం దాఖలు చేసిన ప్రతిపక్షంతీర్మానంపై సంతకం చేసిన 118 మంది సభ్యులు పార్లమెంటరీ వర్గాల సమాచారం ప్రకారం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభ జరిగే సమయంలో మాట్లాడటానికి అనుమతించలేదని ఆరోపణలు గౌరవ్ గొగోయ్, మనీష్ తివారీ, దీపేందర్ సింగ్ హుడా, జోతిమణి వంటి ప్రతిపక్ష ఎంపీలు దిగువ సభలో ఈ తీర్మానానికి అనుకూలంగా వాదనలుప్రభుత్వం తరుఫున చర్చను ప్రారంభించనున్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుచర్చ సమయంలో మాట్లాడనున్న సీనియర్ బీజేపీ నాయకులు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే, రవిశంకర్ ప్రసాద్, భర్తృహరి మహతాబ్లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ కూడా సభలో ప్రసంగిస్తారు. -
చర్చకు రాని అవిశ్వాసం
న్యూఢిల్లీ: పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాల తొలి రోజైన సోమవారం కూడా లోక్‌సభలో పాత దృశ్యాలే పునరావృతమయ్యాయి. విపక్ష సభ్యులు పదేపదే కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. పశ్చిమాసియాలో పరిస్థితిపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటన చేయబోతుండగా అడ్డుకున్నారు. ఆ సంక్షోభంపై పూర్తిస్థాయి చర్చకు పట్టుబట్టారు. తొలి విడత బడ్జెట్ సమావేశాల్లో తాము లేవనెత్తిన పలు ఇతర అంశాలకు సంబంధించి ప్లకార్డులు ప్రదర్శించారు. వాటన్నింటికీ ప్రభుత్వం అప్పుడే వివరంగా బదులిచ్చిందని సభాపతి స్థానంలో ఉన్న జగదంబికా పాల్ గుర్తు చేశారు. పశ్చిమాసియాపై చర్చకు వారిచ్చిన వాయిదా తీర్మానాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు.‘‘స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలిచ్చిన అవిశ్వాస తీర్మానం ఇప్పటికే ఈ రోజు ఎజెండాలో ఉంది. ఒకే రోజు రెండు అంశాలపై చర్చ ఎలా సాధ్యం? పశ్చిమాసియాపై చర్చ కావాలంటే సభా వ్యవహారాల కమిటీని సంప్రదించండి’’అని సూచించారు. వారు పట్టువీడకపోవడంతో ఆగ్రహించారు. ‘‘విపక్ష సభ్యులు పరిణతి లేకుండా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. రాజకీయ ఎజెండా ప్రకారం వ్యవహరిస్తున్నారు’’అంటూ మందలించారు. వారు సభా మర్యాద పాటించడం లేదంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆక్షేపించారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో సభ పదేపదే వాయిదా పడింది. మధ్యాహ్నం మూడింటికి సమావేశమయ్యాక కూడా అవే పరిస్థితులు కొనసాగాయి. బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపడదామని విపక్ష సభ్యులకు పాల్ విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది. దాంతో ఆ అంశాన్ని చర్చకు చేపట్టకుండానే సభ మంగళవారానికి వాయిదా పడింది. పశ్చిమాసియాపై చర్చ ఉండబోదు: కేంద్రం పశ్చిమాసియా సంక్షోభంపై పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ చేపట్టాలన్న విపక్షాల డిమాండ్లకు కేంద్రం అంగీకరించే అవకాశం లేదని సమాచారం. దీనిపై విదేశాంగ మంత్రి ఉభయ సభల్లో ఇప్పటికే ప్రకటన చేసినందున ఇక చర్చ అనవసరమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. మోదీ బండారం బయటపడుతుందనే! ⇒ పశ్చిమాసియాపై చర్చకు వెనుకంజ: రాహుల్ ⇒ పార్లమెంటు ఆవరణలో విపక్షాల ధర్నా సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమాసియా కల్లోలంపై పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. ఉభయ సభల్లో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన అనంతరం పార్లమెంట్ మకరద్వారం వద్ద విపక్ష ఎంపీలు ధర్నాకు దిగారు. ఈ సంక్షోభానికి సంబంధించిన కీలకాంశాలపై మోదీ సర్కారు మౌనం పాటిస్తోందని ఆరోపించారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ కేంద్రానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నిరసనలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాం«దీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ , తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమాసియా విషయంలో అమెరికా బ్లాక్‌మెయిలింగ్‌కు మోదీ లొంగిపోయారని రాహుల్ ఆరోపించారు. ‘‘ఈ అంశంపై పార్లమెంటులో చర్చ చేపడితే అవన్నీ బయటపడతాయని కేంద్రం భయపడుతోంది. అందుకే చర్చకు వెనకాడుతోంది’’అని ఆరోపించారు.‘అవిశ్వాసం’పై నేడు చర్చ? న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సభ మంగళవారం చర్చకు చేపట్టే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తదితరులు చర్చలో పాల్గొంటారు. అనంతరం చర్చకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బదులిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తీర్మానాన్ని వీలైనంత త్వరగా చర్చకు చేపట్టాలని కేంద్రం భావిస్తున్నట్టు వెల్లడించాయి.స్పీకర్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ 118 మంది విపక్ష ఎంపీలు తొలి విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయనపై అవిశ్వాస తీర్మానానికి నోటీసివ్వడం తెలిసిందే. నాటినుంచీ లోక్‌సభ సమావేశాలకు బిర్లా సారథ్యం వహించడం లేదు. అవిశ్వాస తీర్మానంపై సభ నిర్ణయం వెలువడేదాకా స్పీకర్ విధులకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. మంగళవారం ఆయన సాధారణ ఎంపీగా చర్చలో పాల్గొనే అవకాశముందని లోక్‌సభ వర్గాలు తెలిపాయి. గతంలో మూడుసార్లు స్పీకర్లపై అవిశ్వాస తీర్మానాలిచ్చినా ఒక్కటి కూడా నెగ్గలేదు. -
సభ్యుల మధ్య లోపిస్తున్న సమాచారం
లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చను అడ్డుకున్న వ్యవహారం సద్దుమణగింది. కానీ, లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లాపై ప్రతిపక్షాలు అవి శ్వాస తీర్మానం ప్రతిపాదించడంతో పాలక, ప్రతిపక్షాల మధ్య మరో ఘర్షణాయుత అంకానికి తెర లేచింది. సభా వ్యవహారాలలో తమకు తగినంత సమయం ఇవ్వలేదని ప్రస్తుత సమావేశాల పొడవునా ప్రతిపక్షాలు స్పీకర్ బిర్లాపై ఆగ్రహంగా ఉన్నాయి. మాజీ ప్రధాన సైనికాధికారి జనరల్ మనోజ్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంలోని అంశాలను చర్చకు పెట్టాలని రాహుల్ గాంధీ కోరుకున్నారు. ఈ పుస్తకం ఇంకా అధికారికంగా మార్కెట్లోకి రాలేదు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రచురణకు ఇంకా ఆమోదం తెలుపవలసి ఉంది. ప్రచురణకర్తలు అనుమతి కోరుతూ పుస్తక ప్రతిని రక్షణ శాఖకు పంపినట్లు జనరల్ నరవణె వెల్లడించారు. రాహుల్ ఆ పుస్తకం హార్డ్ కాపీని పార్లమెంట్ ఆవరణలో చూపించారు. పుస్తకం సాఫ్ట్ కాపీలు ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవు తున్నాయి. ప్రచురణకు ఆమోద ముద్ర కోసం ఎదురు చూస్తున్న పుస్తకం ఇంటర్నెట్లో ఎలా అందుబాటులోకి వచ్చిందంటూ దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఎంతవరకు రాయొచ్చు?ప్రచురణకు అనుమతి పొందని పుస్తకంలోని అంశాలను ఎలా లేవనెత్తుతారన్న వైఖరిని ప్రభుత్వం తీసుకుంది. అది సాంకేతికంగా సరైనదే కావచ్చు. కానీ, 2020లో తూర్పు లద్దాఖ్‌లో భారత–చైనా సైనికుల మధ్య ఘర్షణలకు సంబంధించి నరవణె ఏం రాసిఉంటారో ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. ప్రభుత్వం పెదవి విప్పక పోవడం వల్ల ఈ అంశంపై దాని అభిప్రాయం ఏమిటో తెలుసు కోకుండానే, సర్క్యులేషన్లో ఉన్న అంశాలను ఆధారం చేసుకుని చాలా మంది ఒక నిర్ధారణకు వచ్చేసే ప్రమాదం ఉంది. జ్ఞాపకాలకు అక్షర రూపం ఇచ్చేటపుడు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఒకటుంది. సీనియర్ పదవులను నిర్వహించిన సైనిక, పౌర అధికారులు రహస్య విషయాలను బయటకు పొక్కించే ఉబలా టాన్ని వదులుకోవడం మంచిది. తాము సర్వీసులో ఉన్నపుడు రాజ కీయ నాయకత్వంతో జరిపిన మాటామంతీ నమ్మకం పునాదిగా సాగి ఉంటుందనే సంగతిని వారు గుర్తెరగాలి. దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని భావించినపుడు ఆ చర్చల వివరాలను రాయకపోవడం వారికి గౌరవ ప్రదమే కాదు, పాటించవలసిన విధి కూడా. సర్వీసులో ఉన్నపుడు, రిటైరైన తర్వాత కూడా ఏది ఎంత వరకు చెప్పాలో అంతవరకు చెప్పడమే విధాయకం. నాయకులు పొరపాటు చేశారని లేదా తమ నమ్మకాన్ని వమ్ము చేశారని ఈ అధి కారులు భావించినా, ఆ నమ్మకానికి గండి కొట్టే విధంగా వ్యవహరించే లగ్జరీ లేదా స్వేచ్ఛ (రిటైరైన తర్వాత కూడా) వారికి ఉండదు. సీనియర్ సైనిక, పౌర అధికారులు తమకు అప్పగించిన పను లకు తమ బాధ్యతల పరిధి లోపలే వారు భాష్యం చెప్పాల్సిఉంటుంది. ఏదైనా ఒక అంశాన్ని తమ విచక్షణకు విడిచిపెట్టినపుడు తమ సైనిక బాధ్యతలకు పరిమితమై మాత్రమే వారు వాటికి భాష్యం చెప్పాలి తప్ప, వాటిని దౌత్య, రాజకీయపరమైన పరిధి వరకు తీసుకెళ్ళకూడదు. రాజకీయ నాయకత్వం దేశ ప్రయోజనా లను దృష్టిలో పెట్టుకుని, దౌత్య, రాజకీయ పరమైన అంశాలను పరి గణనలోకి తీసుకుని, అటువంటి సందర్భాలలో తమకు ఆ విచక్ష ణాధి కారాలు కల్పించిందని సైనిక నాయకులు గ్రహించాలి. కొరవడిన సంభాషణభిన్న రాజకీయ పార్టీల మధ్య తగినంత కమ్యూనికేషన్ లోపించిన వెలితిని లోక్ సభలో ఇటీవలి ప్రతిష్టంభన, తదనంతరం ఓం బిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వెల్లడిస్తున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. జాతీయ ప్రాధాన్యంగల అంశాలపై పాలక, ప్రతిపక్ష నాయకులు ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకునే వారని మాజీ సివిల్ సర్వెంట్ల అనుభవాలను చదివితే తెలుస్తుంది. దౌత్యపరంగా ఏదైనా ఒక పెద్ద ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్న పుడు లేదా దేశం హఠాత్తుగా ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్పుడు ప్రభుత్వ నేతలు ప్రతిపక్ష నాయకులకు పరిస్థితిని వివరించిన సందర్భాలు దౌత్యవేత్తగా గడిపిన వృత్తి జీవితంలో నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అంతమాత్రాన ఆ యా అంశాలపై ఆ యా పార్టీల వైఖ రులు కానీ, రాజకీయ గతులు కానీ మారిపోవు. కానీ, ఆ యాఅంశాలపై ఎదురవుతున్న సవాళ్ళు, అవకాశాలకు సంబంధించి రాజకీయంలోని అన్ని వర్గాలవారికి ఒక అవగాహన కల్పించినట్లు అయ్యేది. భిన్న స్రవంతులకు చెందిననాయకులు కొన్ని సందర్భా లలో నేరుగా మాట్లాడుకునేవారు. ఒక్కోసారి వారు నమ్మినబంట్ల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకునేవారు.నేడు పాలక, ప్రతిపక్ష నాయకులు వైషమ్యాలు, కోపతాపాలు, దూషణలతో కూడిన దాడులకు దిగడం చూస్తూంటే, ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ నెరపుకునే ఆ సంప్రదాయం లోపించిందని లేదాఉండవలసినంతగా లేదని తేటతెల్లమవుతోంది. గోప్యంగా వివరించొచ్చు!నరవణె పుస్తకంలోని అంశాలను లేవనెత్తడానికి ప్రయత్నించి నపుడు, ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకున్న ఎటువంటి చర్చకు తాము అనుమతించలేమని ప్రభుత్వం చెప్పి ఉండాల్సింది. ఆ పుస్తక ప్రచు రణకు అనుమతించకపోవడానికి గల కారణాలను తాము విడిగా వివరించగలమని తెలిపి ఉండాల్సింది. పుస్తకంలో ఉన్నదని చెబు తున్న ఉదంతంతో సహా, తూర్పు లద్దాఖ్ ఘటనల పూర్వాపరాల గురించి గోప్యంగా వివరించి ఉండవచ్చు. రాజకీయ నాయకులందరూ దేశ ప్రయోజనాలకు అంకితమై ఉన్నవారేనన్న ఉద్దేశంతో ఈ మాట చెప్పవలసి వస్తోంది. వేటిని వెల్లడించవచ్చు వేటిని రహస్యంగా ఉంచాలనే వివేచన వారందరికీ ఉండి ఉంటుంది. మాజీ ప్రధాని ఐ.కె. గుజ్రాల్ హయాంలో విదేశీ వ్యవహారాలపై స్థాయీ సంఘం సమావేశంలో జరిగిన ఓ ఘటనను చెబుతాను. వేటిపై చర్చించవచ్చునో, వేటిని చర్చించకూడదో రాజకీయ తర గతికి తెలుసునని ఆ సంఘటన నిరూపించింది.అఫ్గానిస్తాన్‌లో ‘నార్తర్న్ అలయన్స్’కు భారత్ చేస్తున్న సాయం గురించి అప్పటి విదేశాంగ కార్యదర్శి కె. రఘునాథ్‌ను లోతుగా ప్రశ్నిస్తున్నారు. ఆయన సూటిగా జవాబివ్వకుండా అరకొర మాటలతో దాట వేస్తు న్నారు. సభ్యులు అసహనానికి లోనవడంతో, గుజ్రాల్ జోక్యం చేసు కుని, విదేశాంగ శాఖ ఏం చేస్తున్నదీ తనకు తెలుసునని, చర్చనుఅంతటితో ముగించారు. ఏ సభ్యుడూ ఇక నిరసన తెలుపలేదు. -వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-వివేక్ కాట్జూ -
CJIకి సుప్రీం కోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలపై ఫిర్యాదుల వెల్లువ
న్యూఢిల్లీ: గడిచిన గత పదేళ్ల కాలంలో సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ న్యాయవాదులపై సుమారు 8,360 చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి ఫిర్యాదులు అందినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. 2024లో అత్యధికంగా 1,170 ఫిర్యాదులు, 2025లో 1,102 ఫిర్యాదులు నమోదయ్యాయిఅవినీతి, లైం**పరమైన, ఇతర తీవ్రమైన అంశాల్లో సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులు,హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదులు ఏమైనా వచ్చాయా? గత పదేళ్ల కాలంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి.సంబంధిత ఫిర్యాదుల విషయంలో ఎలాంటి మెకానిజం పనిచేస్తుంది?’ అంటూ లోక్‌సభలో ద్రవిడ మున్నేట్ర కజగం ఎంపీ మాథేశ్వరన్ వీఎస్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కోరారు. అందుకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వివరణ ఇచ్చారు.గడిచిన పదేళ్ల కాలంలో సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులపై 8,630 ఫిర్యాదులు అందాయని తెలిపారు.ఈ సందర్భంగా ఏ సంవత్సరంలో ఎన్ని ఫిర్యాదులు అందాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల కాలంలో వచ్చిన ఫిర్యాదుల వివరాల్ని వెల్లడించారు.అనంతరం, న్యాయమూర్తులపై ఫిర్యాదులను సేకరించడానికి కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పర్యవేక్షణ వ్యవస్థ (CPGRAMS) కాకుండా ప్రభుత్వానికి మరేదైనా యంత్రాంగం ఉందా? జవాబుదారీతనం నిర్ధారించడానికి అటువంటి ఫిర్యాదులను క్రమపద్ధతిలో నమోదు చేసి పర్యవేక్షించేలా మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రతిపాదిస్తుందా? అని కూడా అడిగారు.ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదును కోర్టు 'ఇన్-హౌస్ ప్రొసీజర్' ద్వారా స్వీకరిస్తారని మేఘ్వాల్ అన్నారు. అదేవిధంగా, సంబంధిత హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వీకరిస్తారని తెలిపారు. అయితే, సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారా? లేదా? వంటి వివరాల్ని వెల్లడించలేదు. -
‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల భవిష్యత్తును గందరగోళంలో పడేశారు’
ఢిల్లీ: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల భవిష్యత్తును గందరగోళంలో పడేశారని వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు.. ఉద్యోగాలు, ఉపాధి కోసం పోరాటం చేస్తున్నారన్నారు. లోక్‌సభలో ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పని చేస్తున్న కార్మికుల గురించి ప్రస్తావించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగాలు, ఉపాధి కోసం పోరాటం చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అకస్మాత్తుగా 5000 మంది కార్మికులను తొలగించారు. పెద్ద ఎత్తున నిరసనలు చేస్తే వెయ్యి మందిని మళ్లీ నియమించుకున్నారు. అక్కడ కార్మికుల భవిష్యత్తు గందరగోళంలో పడేశారు. చట్టాలపై కార్మికులకు తగిన అవగాహన కల్పించాలి. కార్మికుల భవిష్యత్తును గందరగోళ పరిచేలా విధానాలు ఉండకూడదు. వివాదాల పరిష్కారానికి తగిన చట్టాలు అవసరం’ అని పేర్కొన్నారు. -
రాహుల్ సభ్యత్వం రద్దు! జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా
-
లోక్‌సభలో నిరసనల హోరు.. సభ వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నేడు (గురువారం) లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. ముఖ్యంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, ఎంపీల సస్పెన్షన్ అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ప్రశ్నోత్తరాల సమయానికి తీవ్ర అంతరాయం కలిగింది. స్పీకర్ స్థానంలో ఉన్న పీసీ మోహన్.. సభ్యులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, ‘మాకు న్యాయం కావాలి’ అంటూ విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ఈ గందరగోళం మధ్యే 13 ప్రశ్నలకు సమాధానాలు లభించినప్పటికీ, పరిస్థితి అదుపు తప్పడంతో సభ వాయిదా పడింది.ప్రతిపక్ష ఎంపీలు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. ఇది భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టే ‘ట్రాప్ డీల్’ అని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఈ ఒప్పందంపై చర్చించాలని వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. రష్యా నుంచి చమురు దిగుమతులు, వ్యవసాయ రాయితీల విషయంలో కేంద్రం దేశ ప్రయోజనాలను పణంగా పెడుతోందని విపక్షాలు ఆరోపించాయి. ఈ నిరసనల సెగ సభలో స్పష్టంగా కనిపించడంతో కార్యకలాపాలు సాఫీగా సాగలేదు.బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే విపక్ష నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా ప్రవేశపెట్టిన తీర్మానం సభలో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. రాహుల్ గాంధీకి విదేశీ శక్తులతో సంబంధాలు ఉన్నాయని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని దూబే డిమాండ్ చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళనను ఉధృతం చేశారు. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరిపోవడంతో సభలో ఒకానొక దశలో తీవ్ర గందరగోళం నెలకొంది, ఇది సభ వాయిదాకు ప్రధాన కారణంగా నిలిచింది. -
భరతమాతనే... అమెరికాకు అమ్మేశారు
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై మోదీ సర్కారును విపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఒప్పందం పేరిట మన తల్లి భరతమాతనే అమెరికాకు అమ్మేశారంటూ నిప్పులు చెరిగారు. ‘‘వ్యవసాయం, ఇంధనంతో సహా అన్ని రంగాలనూ అమెరికా చేతికి అప్పగించేశారు. ఆ దేశానికి పూర్తిస్థాయి లొంగిపోయారు. దేశాన్ని ఇలా అడ్డంగా అమ్మేసినందుకు మీకు కనీసం సిగ్గుగా అనిపించడం లేదా?’’అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. బుధవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చలో రాహుల్ ప్రసంగించారు. అమెరికాతో ఏకపక్ష ఒప్పందాన్ని మోదీ సర్కారు ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. ‘‘పలు విషయాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా నేరుగా విపరీతమైన ఒత్తిడి పెట్టింది. పూర్తిగా ఆయన మెడలు వంచి నొక్కిపట్టింది. అందుకే దేశాన్ని మోదీ అమెరికాకు అమ్మేశారు. కేవలం అధికారం కాపాడుకోవడానికి జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టారు. లేదంటే ఇలాంటి ఏకపక్ష ఒప్పందానికి ఆయనే కాదు, ఏ భారత ప్రధానీ అంగీకరించబోడు’’అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యర్థి మెడను దొరకబుచ్చుకున్నాక దాన్ని గట్టిగా నొక్కిపడతారు. దాంతో అతను అల్లాడిపోతాడు. లొంగిపోయానంటూ చేతులెత్తేస్తాడు. మోదీ చేసింది సరిగ్గా అదే’’అంటూ ఎద్దేవా చేశారు. ‘‘వాణిజ్య ఒప్పందం ద్వారా మన రైతుల ప్రయోజనాల విషయంలో కేంద్రం పూర్తిగా రాజీ పడింది. జౌళి రంగాన్ని నేలమట్టం చేశారు. మన డేటాను, రైతులను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను, మన శక్తియుక్తులను, చిన్న, మధ్యతరహా వ్యాపారాలనూ అమ్మేశారు. ఇంధన భద్రతను గాలికొదిలేశారు. ఇకపై మనం ఎవరి నుంచి చమురు కొనుగోలు చేయాలో నిర్ణయించేది అమెరికాయే తప్ప మన ప్రధాని కాదు! పైగా ఆ కొనుగోళ్లను అగ్ర రాజ్యమే నిత్యం పర్యవేక్షిస్తుంటుంది. వారు చెప్పిన వాళ్ల దగ్గర కొనకపోతే మనపై మళ్లీ 50 శాతం టారిఫ్‌లు బాదుతారు. మన ఆర్థిక, ఇంధన రంగాలను మనపైకే ఆయుధాలుగా గురి పెట్టేందుకు అమెరికాను కేంద్రం అనుమతించింది’’అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ ప్రయోజనాల కోసమే... వాణిజ్య ఒప్పందం పేరుతో మోదీ సర్కారు అమెరికాకు దాసోహమన్న తీరు చాలా విషాదకరమని రాహుల్ అన్నారు. ‘‘మోదీ కేవలం తాను మాత్రమే లొంగిపోలేదు. 150 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తునే అమెరికాకు అప్పగించేశారు. అధికార బీజేపీ ఆర్థిక ఆయువుపట్లలో ఒకరిపై అమెరికాలో కేసు నడుస్తుండటమే ఇందుకు కారణం. సొంత పార్టీ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికే దేశాన్ని అగ్ర రాజ్యానికి మోదీ అమ్మకం పెట్టారు’’అంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘డిజిటల్ వాణిజ్య నిబంధనలపై నియంత్రణను కేంద్రం పూర్తిగా అమెరికాకు వదిలేసుకుంది. డేటా లోకలైజేషన్‌ను తొలగించేసింది. అమెరికా నుంచి డేటా వరదకు గేట్లెత్తేందుకు ఒప్పుకుంది. బడా టెక్ కంపెనీలకు 20 ఏళ్ల ట్యాక్స్ హాలిడేలు ప్రకటించేసింది. మొదట్లో మనపై కేవలం 3 శాతంగా ఉండే అమెరికా టారిఫ్‌లు ఇప్పుడు 18 శాతానికి పెరిగాయి. అమెరికా వస్తూత్పత్తులపై భారత టారిఫ్‌లు మాత్రం 16 శాతం నుంచి ఎకాయెకి సున్నాకు పడిపోయాయి. అమెరికా దిగుమతులు 46 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 146 బిలియన్ డాలర్లకు పెరగనున్నాయి’’అంటూ రాహుల్ మండిపడ్డారు. ‘‘కేంద్రం మన వ్యవసాయ రంగాన్ని అమెరికాకు బార్లా తెరిచేసింది. దాంతో అక్కడి వ్యవసాయోత్పత్తులు మన మార్కెట్లను ముంచెత్తనున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా మన రైతులు భారీ సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారు. మోదీకి ముందు ఏ ప్రధానీ ఇలాంటి సిగ్గుచేటైన పని చేయలేదు. ఇకముందు మరే ప్రధానీ చేయబోడు’’అన్నారు. అధికార పక్ష సభ్యులు పదేపదే లేచి రాహుల్ ప్రసంగానికి అడ్డుతగిలారు. ఆయన నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. చేతనైతే వాటికి రుజువులు చూపాలని సవాలు చేయగా అందుకు తాను సిద్ధమేనని రాహుల్ బదులిచ్చారు.మేమైతే ఇలా చేసేవాళ్లం ‘‘యుద్ధాల శకం ముగిసిందని మోదీ అంటున్నారు. కానీ నిజానికి మనమున్నదే యుద్ధాల శకంలో! ఇలాంటప్పుడు మన బలాలేమిటో అవగాహన ఉండాలి. ప్రజలే మన నిజమైన బలం’’అని రాహుల్ అన్నారు. ‘‘ఇండియా కూటమే గనుక అధికారంలో ఉంటే వాణిజ్య ఒప్పందం విషయంలో పూర్తిగా భిన్నంగా వ్యవహరించేది. డేటా మన అతి పెద్ద ఆస్తి. అది అమెరికాకు అందుబాటు ఉండాలంటే భారత్‌ను అమెరికా సేవకునిలా గాక సమాన భాగస్వామిగా పరిగణించాలని ట్రంప్‌కు కుండబద్దలు కొట్టేవాళ్లం. ఆ హోదాలోనే చర్చలు జరిపేవాళ్లం. దేశ ఇంధన భద్రతపై, మన రైతుల ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని, వాటిపై చర్చలకు తావు లేదని ఆయన ముఖం మీదే చెప్పేవాళ్లం. పాక్ ఆర్మీ చీఫ్‌తో ట్రంప్ అల్పాహార భేటీ వంటి ఉదంతాలపై కచి్చతంగా అభ్యంతరం వ్యక్తం చేసేవాళ్లం’’అని చెప్పుకొచ్చారు.ఎప్స్టీన్ ఫైల్స్‌లో అంబానీ, పురీ అమెరికాతో పాటు పలు దేశాల్లో సంచలనం సృష్టిస్తున్న ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం టేపుల్లో కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురీ, వ్యాపారవేత్త అనిల్ అంబానీ పేర్లు కూడా ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. బుధవారం సాయంత్రం పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. -
లోక్ సభలో రాహుల్ వ్యాఖ్యలు దుమారం
-
‘అస్థిరత దిశగా ప్రపంచం’: రాహుల్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై జరుగుతున్న చర్చల్లో బుధవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ప్రపంచమంతా స్థిరత్వం నుండి తీవ్రమైన అస్థిరత వైపు వేగంగా పయనిస్తున్నదని ఆయన హెచ్చరించారు. ప్రపంచ దేశాల మధ్య మారుతున్న సంబంధాలను గమనించకుండా.. ఆర్థిక ప్రణాళికలు రచించడం సాధ్యం కాదని రాహుల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో తలెత్తుతున్న అలజడులు భారత ఆర్థిక వ్యవస్థపై, దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతాయని, దీనిని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలని రాహుల్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన ఎకనామిక్ సర్వేను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ, అందులో తాను గమనించిన రెండు అత్యంత లోతైన అంశాలను సభకు వివరిస్తున్నానని అన్నారు. అందులో మొదటిది ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, అమెరికా ఆధిపత్యాన్ని చైనా, రష్యా లాంటి శక్తులు సవాలు చేస్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు. ఇక రెండవది ఇంధనం, ఆర్థిక వ్యవస్థలను ఆయుధాలుగా మలుచుకుంటున్న తీరు అని అన్నారు. ఈ పరిణామాలు ప్రపంచాన్ని మునుపెన్నడూ లేని విధంగా అంచనాలకు అందని స్థితికి నెట్టేస్తున్నాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) చేసిన ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అనే వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఈ సందర్భంగా తప్పుబట్టారు. ప్రస్తుతం మనం యుద్ధాల యుగంలోకే ప్రవేశిస్తున్నామని రాహుల్ పేర్కొన్నారు. ఉక్రెయిన్, గాజా, ఇరాన్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ మేఘాలను ఆయన ఉదాహరణగా చూపారు. శాంతి స్థాపన జరుగుతుందన్న అంచనాలు ఇక చెల్లవని, నిరంతర సంఘర్షణలే నేటి ప్రపంచ వాస్తవమని రాహుల్ స్పష్టం చేశారు.అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్ ఆధిపత్యం క్రమంగా తగ్గుతోందని రాహుల్ అన్నారు. ప్రపంచమంతా అస్థిరమైన, ఊహించని కొత్త ఒరవడిలోకి మారుతోందని విశ్లేషించారు. లోక్‌సభలో అధికార పక్ష సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, డాలర్ ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవాలని రాహుల్ సూచించారు. పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం తదితర అంతర్గత సమస్యలతో పాటు, ప్రపంచ అస్థిరతలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపకల్పన ఉండాలని రాహుల్ తన ప్రసంగంలో డిమాండ్ చేశారు. -
‘తొలగింపు నోటీసు’లో లోపాలు.. మరో అవకాశం ఇచ్చిన స్పీకర్
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ విపక్ష ఎంపీలు సమర్పించిన నోటీసులో సాంకేతిక, విధానపరమైన లోపాలు ఉన్నట్లు లోక్‌సభ సచివాలయం గుర్తించింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఫార్మాట్లో ఈ నోటీసు లేదని అధికారులు స్పష్టం చేశారు. సాధారణంగా ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు నోటీసును తిరస్కరించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ స్పీకర్ ఓం బిర్లా ఈ భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు.ఈ నోటీసులో ప్రధానంగా కాలక్రమ లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఈ నోటీసులో రాబోయే కాలానికి సంబంధించిన సంఘటనలను సుమారు నాలుగు సార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం జరిగిన సంఘటనల ఆధారంగానే నోటీసు ఉండాలి తప్ప, భవిష్యత్తు తేదీలను పేర్కొనడం నిబంధనలకు విరుద్ధం. ఇటువంటి పొరపాట్ల వల్ల ఈ నోటీసును రద్దు చేసే అధికారం సచివాలయానికి ఉన్నప్పటికీ, తదుపరి చర్యల కోసం స్పీకర్ సానుకూలంగా స్పందించారు.సాంకేతిక కారణాలతో నోటీసును తోసిపుచ్చకుండా, అందులోని లోపాలను సరిదిద్దుకునేలా విపక్షాలకు అవకాశం కల్పించాలని స్పీకర్ సచివాలయ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని, అవసరమైన సవరణలు చేయించిన తర్వాతే ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. సవరించిన నోటీసు అందిన వెంటనే, నిబంధనలకు లోబడి త్వరితగతిన పరిశీలించాలని సచివాలయానికి ఆదేశాలు జారీ చేశారు.సవరించిన నోటీసు తిరిగి సమర్పించిన తర్వాత, అది పార్లమెంటరీ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో అధికారులు మరోసారి తనిఖీ చేయనున్నారు. అన్నీ సవ్యంగా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల మొదటి విడత ముగిసిన తర్వాత, రెండో విడత ప్రారంభంలో ఈ అంశాన్ని చర్చకు స్వీకరించే అవకాశం ఉంది. విపక్షాల ప్రతిపాదనపై తుది నిర్ణయం వారు సమర్పించే సవరణల పైనే ఆధారపడి ఉంటుందని సచివాలయ వర్గాలు తెలియజేశాయి. -
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. నోటీసుపై 120 మంది విపక్ష ఎంపీల సంతకాలు
-
పోలవరంపై రాజీపడొద్దు.. ఏపీని అప్పుల కుప్పగా మార్చొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: తమ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ఎత్తు తగ్గించి ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్యాయం చేయవద్దని కోరారు. 2026–27 బడ్జెట్‌పై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను లెక్కలతో సహా ఎండగట్టారు. తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరి్థకమంత్రిని అభినందిస్తూ.. 2026–27 మూలధన వ్యయాన్ని రూ.12.21 లక్షలకోట్లకు పెంచడాన్ని స్వాగతించారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11.5 శాతం పెరుగుదల అని చెప్పారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. పోలవరాన్ని 194 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సి ఉండగా, బడ్జెట్ ప్రసంగంలో దీన్ని 41.15 మీటర్లకే పరిమితం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 41.15 మీటర్ల వద్ద కేవలం 75 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయగలమని, దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యం నెరవేరదని చెప్పారు. తద్వారా లక్షలాదిమంది రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55 వేలకోట్లు కాగా, సవరించిన వ్యయం రూ.30,436 కోట్లకు కుదించడం రాష్ట్ర రైతులకు చేసే ద్రోహమేనని మండిపడ్డారు. ఆఫ్ బడ్జెట్ అప్పులతో రాష్ట్రం ఎటు పోతోంది? ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో మొత్తం అప్పులు రూ.3.32 లక్షలకోట్లు ఉంటే.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే రూ.3.20 లక్షలకోట్ల అప్పులు చేసిందని దుయ్యబట్టారు. ఏపీఎండీసీ ద్వారా రూ.9 వేలకోట్లు, ఏపీఎస్సీఎల్ ద్వారా వేలకోట్లు అప్పులు చేస్తూ రాష్ట్ర ఖజానాను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని చెప్పారు. ఏపీఎండీసీ నిధులను ప్రైవేట్ వ్యక్తులు నేరుగా వాడుకునేలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఇలాంటి ఆఫ్ బడ్జెట్ అప్పుల వల్ల భవిష్యత్తులో జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కుట్ర గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రతిష్టాత్మకంగా చేపట్టారని గుర్తుచేశారు. లక్షలకోట్లు అప్పులు చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం రూ.5 వేలకోట్లు ఎందుకు ఖర్చు చేయలేకపోతోందని ప్రశ్నించారు. పేదలకు అందాల్సిన వైద్యవిద్యను ప్రైవేట్‌పరం చేయడం వెనుక మర్మమేమిటని నిలదీశారు. ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులు, సామాన్య ప్రజలు వైద్యానికి దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రానికి సంబంధించిన ఇతర కీలక డిమాండ్లు రాష్ట్రానికి సంబంధించి ఆయన పలు డిమాండ్లు చేశారు. అవి.. » విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను తక్షణమే నిలిపేసి, దానికి ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలి. » విభజన హామీ అయిన కడప స్టీల్‌ప్లాంట్‌ను త్వరితగతిన పూర్తిచేయాలి. » కడప–బెంగళూరు రైల్వేలైన్ పనులను 100 శాతం కేంద్ర నిధులతో యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి. » ఉపాధిహామీ పథకం స్థానంలో వచ్చిన వీబీజీ రామ్ పథకంలో రాష్ట్ర వాటాను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచడం వల్ల ఏపీ వంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలు నష్టపోతాయి. ఈశాన్య రాష్ట్రాల తరహాలో ఏపీకి కూడా 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలి. » రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఎగువ పెన్నార్ అనుమతులు రద్దయ్యాయి. కేంద్రం చొరవ తీసుకుని ఆ అనుమతులను పునరుద్ధరించాలి. -
స్పీకర్‌ను తొలగించాలి
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు విపక్షాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. బిర్లాను స్పీకర్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నోటీసిచ్చింది. రాజ్యాంగంలోని 94–సి ఆర్టీకల్ కింద లోక్‌సభ సెక్రెటరీ జనరల్ ఉత్పల్కుమార్ సింగ్‌కు దాన్ని అందజేసింది. ‘‘సభా వ్యవహారాల నిర్వహణలో ఓం బిర్లా పూర్తిగా ఏకపక్షంగా, విపక్షాల పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధ పదవిని దుర్వినియోగం చేస్తున్నారు’’అని ఆరోపించింది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉప నేత గౌరవ్ గొగోయ్, ఆ పార్టీ చీఫ్ విప్ కె.సురేశ్, విప్ మొహ్మద్ జావెద్ విపక్షాల తరఫున మంగళవారం మధ్యాహ్నం సెక్రెటరీ జనరల్‌కు నోటీసు అందజేశారు. ఓం బిర్లాను లోక్‌సభ స్పీకర్ పదవి నుంచి తొలగించాలంటూ తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. ‘‘సభలో పలుమార్లు విపక్ష సభ్యులను మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించలేదు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై విపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రసంగాన్ని పూర్తి కూడా చేయనివ్వలేదు. స్పీకర్ వివక్షాపూరిత ధోరణికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. విపక్ష నేతను సభలో అసలు మాట్లాడనివ్వనే లేదు. ఫిబ్రవరి 4న ఒక బీజేపీ ఎంపీ మాజీ ప్రధానులపై అత్యంత అభ్యంతరకరంగా మాటల దాడి చేసేందుకు స్పీకర్ అనుమతించారు. పైగా అలా చేసినందుకు ఆయనను కనీసం ఒక్కసారైనా మందలించలేదు.ఇలాంటి ప్రవర్తనను అలవాటుగా మార్చుకున్న సదరు సభ్యునిపై తక్షణం చర్యలు తీసుకోవాలని మేం పదేపదే విజ్ఞప్తి చేసినా స్పీకర్ పట్టించుకోలేదు’’అని నోటీసులో ఎంపీలు ఆరోపించారు. పలువురు కాంగ్రెస్ సభ్యులు సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్థానం వద్దకు వెళ్లి ‘అనూహ్య చర్య’కు దిగాలని భావించినట్టు కచ్చితమైన సమాచారం తన వద్ద ఉందని స్పీకర్ చేసిన ప్రకటనను కూడా వారు ప్రస్తావించారు. ‘‘స్పీకర్ చేసిన ఈ ఆరోపణలు పూర్తి నిరాధారం. అంతేగాక కాంగ్రెస్ ఎంపీల పరువుప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయి. పార్లమెంటరీ పద్ధతులను, నియమ నిబంధనలను పరిరక్షించాల్సిన స్పీకరే ఇలాంటి నిరాధారణ ఆరోపణలు చేసేందుకు నిండు సభను వాడుకోవడం దారుణం. ఇది రాజ్యాంగబద్ధ పదవిని పూర్తిగా దుర్వినియోగం చేయడమే. ప్రజా సమస్యలపై గళమెత్తకుండా విపక్ష సభ్యులను స్పీకర్ పలుమార్లు అడ్డుకున్నారు’’అంటూ నోటీసులో పేర్కొన్నారు. ఎనిమిది మంది విపక్ష ఎంపీలను ఏకపక్ష సస్పెండ్ చేయడం తదితరాలను కూడా అవిశ్వాస తీర్మానానికి కారణాలుగా వారు పేర్కొన్నారు. ఈ తీర్మానం మార్చి 9న సభ ముందుకు వచ్చే అవకాశమున్నట్టు లోక్‌సభ వర్గాలు పేర్కొన్నాయి. రెండోసారి నోటీసు! స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు యోచిస్తున్నట్టు సోమవారం ఉదయమే వార్తలు రావడం తెలిసిందే. దానిపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని అనంతరం విపక్ష నేతలు తెలిపారు. మంగళవారం ఉదయమే రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. స్పీకర్‌పై నోటీసివ్వాలని ఈ సందర్భంగా వారంతా నిర్ణయించారు. అనంతరం చివరి ప్రయత్నంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజుతో విపక్ష నేతలు భేటీ అయి తమ డిమాండ్లపై మరోసారి చర్చించారు. ఆయన నుంచి సానుకూల స్పందన లేదంటూ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌కు అవిశ్వాస తీర్మాన నోటీసు అందజేశారు. అయితే తేదీని తప్పుగా పేర్కొనడంతో సాయంత్రం దాన్ని వెనక్కు తీసుకుని మరో నోటీసు సమర్పించారు. సంతకం చేయని రాహుల్! అవిశ్వాస తీర్మానం నోటీసుపై పలు పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలు సంతకాలు చేసినట్టు విపక్షాలు తెలిపాయి. వారిలో కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, వామపక్షాలు, ఆర్జేడీ సభ్యులున్నారు. శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీలు సంతకాలు చేయకపోయినా అవిశ్వాస తీర్మానానికి ఆ పార్టీలు మద్దతు తెలిపాయి. మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నోటీసుపై సంతకం చేయకపోవడం గమనార్హం. విపక్ష నేత రాహుల్‌గాంధీ కూడా సంతకం చేయలేదని సమాచారం!తీర్మానంపై తేలేదాకా విధులకు దూరంస్పీకర్ ఓం బిర్లా నిర్ణయం కాంగ్రెస్ తదితర విపక్షాలు తనపై ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానం అంశం పరిష్కారమయ్యేదాకా విధులకు దూరంగా ఉండాలని స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ కార్యాలయాన్ని ఉటంకిస్తూ బిర్లా సన్నిహిత వర్గాలు ఈ మేరకు వెల్లడించాయి. నైతిక ప్రమాణాలకు కట్టుబడుతూ ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు వివరించాయి. స్పీకర్‌పై గానీ, డిప్యూటీ స్పీకర్‌పై గానీ అవిశ్వాస తీర్మానం సభ పరిశీలనలో ఉండగా కార్యకలాపాలకు వారు అధ్యక్షత వహించరాదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 96 కూడా నిర్దేశిస్తోంది. విపక్షాలు అందజేసిన అవిశ్వాస తీర్మానం నోటీసును పరిశీలించాల్సిందిగా లోక్‌సభ సెక్రెటరీ జనరల్ ఉత్పల్కుమార్ సింగ్‌ను స్పీకర్ ఆదేశించారు. దానిపై నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇప్పుడేం జరుగుతుంది?స్పీకర్ ఓం బిర్లాను తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటూ విపక్షాలు నోటీసివ్వడం ఆసక్తికరంగా మారింది. అధికార బీజేపీ, విపక్షాల మధ్య పార్లమెంటులో పది రోజులుగా సాగుతున్న రగడ కాస్తా ఈ ఉదంతంతో కొత్త మలుపు తిరిగింది. దాంతో ఇకపై ఏం జరుగుతుందోనన్న ఆసక్తి మొదలైంది. స్పీకర్ తొలగింపు ప్రక్రియను ఆర్టీకల్ 94సి లో స్పష్టంగా పొందుపరిచారు. దానిప్రకారం అవిశ్వాస తీర్మానం సాధారణ మెజారిటీతో నెగ్గితే స్పీకర్ ఉద్వాసనకు గురవుతారు. అవిశ్వాస తీర్మానం కోసం నోటీసివ్వడంతో ఈ ప్రక్రియ మొదలవుతుంది.దానిపై కనీసం ఇద్దరు ఎంపీల సంతకం చేయాల్సి ఉంటుంది. అందులో స్పీకర్‌పై నిర్దిష్టమైన అభియోగాలను పేర్కొనడం తప్పనిసరి. అప్పుడు మాత్రమే స్పీకర్‌కు అవిశ్వాస తీర్మానంపై స్పందించేందుకు అవకాశం ఉంటుందని లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ పి.డి.టి.ఆచారి తెలిపారు. ‘‘తర్వాత తీర్మానంలోని భాష ప్రమాణాల మేరకు ఉన్నదీ లేనిదీ డిప్యూటీ స్పీకర్ పరిశీలిస్తారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ ఎవరూ లేరు గనుక చైర్పర్సన్ల ప్యానల్లోని సీనియర్ మోస్ట్ సభ్యుడు ఆ బాధ్యత చేపట్టే అవకాశముంది. నోటీసిచ్చిన 14 రోజుల అనంతరం తీర్మానం సభ పరిశీలనకు వస్తుంది. సభాపతి దాన్ని సభ పరిశీలనకు ఉంచుతారు. తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారు లేచి నిలబడాల్సిందిగా కోరతారు.కనీసం 50 మంది సభ్యులు లేచి నిలబడితే తీర్మానాన్ని పరిశీలిచేందుకు సభ అనుమతి లభించినట్టు ప్రకటిస్తారు. అనంతరం తీర్మానంపై చర్చ చేపడతారు. 10 రోజుల్లో దానిపై సభ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తీర్మానంలో తనపై మోపిన అభియోగాలపై మాట్లాడేందుకు, తన చర్యలను సమర్థించుకునేందుకు ఆర్టీకల్ 96 స్పీకర్‌కు అవకాశం కలి్పస్తోంది’’అని ఆయన వివరించారు. స్పీకర్‌పై ఇప్పటికే దాకా మూడుసార్లు అవిశ్వాస తీర్మానాలు పెట్టినా, రెండుసార్లు ఓటింగ్ దాకా వచ్చినా అవి వీగిపోయాయి.స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు అనుసరించే పద్ధతి భిన్నంగా ఉండటమే అందుకు కారణమని ఆచారి తెలిపారు. ‘‘మెజారిటీ లెక్కింపు విషయంలో ఓటింగ్‌కు హాజరైన ఎంపీలను మాత్రమే కాకుండా, ఖాళీలను మినహాయించి లోక్‌సభ సభ్యులుగా ఉన్న వారందరి సంఖ్యనూ పరిగణనలోకి తీసుకుంటారు. అప్పుడు మెజారిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ పాలక పక్షానిదే అవుతుంది. కనుక తీర్మానం వీగిపోతుందే తప్ప గట్టెక్కదు’’అని వివరించారు. గతంలో స్పీకర్లు జీవీ మౌలాంకర్ (1954), హుకుంసింగ్ (1966), బలరాం జాఖడ్ (1987)పై విపక్షాలు అవిశ్వాస తీర్మానాలిచ్చినా అవి వీగిపోయాయి. -
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కీలక నిర్ణయం
ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై స్పష్టత వచ్చే వచ్చే వరకు లోక్‌సభకు రాకూడదని నిర్ణయం తీసుకున్నారు. మార్చి 9న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. లోక్‌సభ సమావేశాలు ప్రారంభం నుంచి స్పీకర్ ఓంబిర్లా సభ నిర్వహణలో పక్షపాతం చూపిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సభలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడకుండా మైక్ కట్ చేయడం, సభ నుంచి కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం వంటి కారణాలను ఉదహరించాయి. అదే సమయంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కాంగ్రెస్ మహిళా ఎంపీలపై చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ క్రమంలో లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా అనర్హులు అంటూ ఆయనపై 120మంది ప్రతిపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం జారీ చేశారు.ఈ సందర్భంగా లోక్‌సభను ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ ఓంబిర్లాను ఆర్టికల్ 94(సీ) నిబంధనల ప్రకారం ఆయన్ను పదవి నుంచి తొలగించే అధికారం ఉందంటూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో పాటు లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగం వివాదానికి దారితీసింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ (ఎంఎం) నరవణే ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ’ అనే పుస్తకం రాశారు. కానీ అది ఇంకా పబ్లిష్ కాలేదు. నరవణే పుస్తకంలో 2020లో తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సైనిక ప్రతిష్టంభన,గల్వాన్ లోయ ఘర్షణ, అగ్నిపథ్ ప్రణాళిక, ఆగస్టు 31, 2020 రాత్రి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన సంభాషణతో పాటు పలు సున్నిత అంశాలు అందులో పేర్కొన్నారు. అయితే కారవాన్ మ్యాగజైన్లో ఈ పుస్తకంపై వచ్చిన ఆర్టికల్‌లోని కొన్ని భాగాలను రాహుల్ చదివే ప్రయత్నం చేశారు. అందుకు ఓంబిర్లా ఒప్పుకోలేదు. నిబంధనల ప్రకారం లోక్‌సభలో పబ్లిష్ అవ్వని పుస్తకాన్ని సభలో ఉదహరించకూడదు సూచించారు. నరవణే రాసిన పుస్తకం పబ్లిష్ కానప్పటికీ రాహుల్ గాంధీకి చేతికి ఆ పుస్తకం ఎలా వెళ్లిందనేది ప్రశ్నార్ధకంగా ఉంది. దీనిపై అధికార ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పుస్తకంలోని అంశాల గురించి ప్రస్తావించేందుకు ఓంబిర్లా అనుమతి ఇవ్వలేదనే కారణంతో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు తేలింది. -
లోక్‌సభ: అవిశ్వాస తీర్మానంపై విపక్షాల్లో చీలిక?
న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై విపక్షాల్లో చీలిక ఏర్పడింది. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు టీఎంసీ నిరాకరించింది. అయితే కాంగ్రెస్ ఇప్పటికే వందమందికి పైగా ఎంపీల సంతకాలను సేకరించింది. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధానిపై దాడి చేశారన్న స్పీకర్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ముందు లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్ష సభ్యులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ నేడు (మంగళవారం) స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఫిబ్రవరి 4న సభా మర్యాదలను కాపాడేందుకు స్పీకర్ చేసిన ప్రయత్నాలను గుర్తుచేస్తూ, గందరగోళం సృష్టించిన ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటు ప్రతిష్టను దిగజార్చేలా కొందరు సభ్యులు వ్యవహరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతిపక్ష ఎంపీలు మునుపెన్నడూ లేని విధంగా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని బీజేపీ ఎంపీలు తమ లేఖలో వివరించారు. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకురావడమే కాకుండా, స్పీకర్ టేబుల్‌పైకి ఎక్కి కాగితాలు చింపి, విసిరారని ఆరోపించారు. మరికొందరు మహిళా ఎంపీలు దూకుడుగా వ్యవహరిస్తూ, ప్లకార్డులు పట్టుకుని ట్రెజరీ బెంచీల వైపు వెళ్లారని, ఏకంగా ప్రధానమంత్రి కూర్చునే సీటును కూడా చుట్టుముట్టారని వారు పేర్కొన్నారు. ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.బీజేపీ లేఖకు ఒకరోజు ముందే కాంగ్రెస్ మహిళా ఎంపీలు కూడా స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రధాని మోదీ సభకు గైర్హాజరు కావడాన్ని సమర్థించుకునేందుకు పాలకపక్షం ఒత్తిడికి లొంగి, స్పీకర్ తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. తమపై బురద చల్లడం ద్వారా వారిలోని లోపాలను కప్పిబుచ్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. ప్రియాంక గాంధీ వాద్రా, జ్యోతిమణి సహా పలువురు నేతలు సంతకం చేసిన ఈ లేఖలో.. తమపై చేస్తున్న ఆరోపణలను వారు పూర్తిగా తోసిపుచ్చారు. తాము రాజ్యాంగ విలువలపై నమ్మకం ఉన్నవారమని, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. -
లోక్‌సభలో అవే దృశ్యాలు.. మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. అధికార, విపక్షాల మధ్య పలు అంశాలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉండటంతో సోమవారం కూడా సభ కార్యకలాపాలేవీ చేపట్టకుండానే వాయిదా పడింది. తొలుత ఉదయం రెండుసార్లు, అనంతరం మధ్యాహ్నం రెండింటి తర్వాత మంగళవారానికి సభను వాయిదా వేయాల్సి వచ్చింది. వారం రోజులుగా సభ నిత్యం అంతరాయాలనే ఎదుర్కొంటూ వస్తుండటం తెలిసిందే. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు విపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రయత్నించడం, అందుకు మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలపడం రగడకు దారితీసింది. నాటినుంచి సభలో ఆందోళనలు మినహా కార్యకలాపాలేవీ సాగడం లేదు. పదేపదే అవాంతరాలు ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టింది. ఆ వెంటనే విపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నినాదాలకు దిగారు. తాము లేవనెత్తిన పలు అంశాలపై తక్షణ చర్చకు పట్టుబట్టారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వాటిని లేవనెత్తవచ్చని స్పీకర్ ఓం బిర్లా సూచించారు. రాహుల్‌తో సహా సభ్యులంతా తమ అంశాలను లేవనెత్తవచ్చన్నారు. అయినా సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. కేవలం కార్యకలాపాలను స్తంభింపజేయడమే లక్ష్యంగా వారు వ్యూహం రూపొందించుకుని సభకు వచ్చారంటూ మండిపడ్డారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా వేశారు. తిరిగి సమావేశం కాగానే, ముందుగా రాహుల్‌ను మాట్లాడనివ్వాల్సిందేనని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. నిబంధనల మేరకు బడ్జెట్‌పై చర్చ ప్రారంభం కావాల్సి ఉందని సభాపతి స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ తమ ప్రధాన వక్తగా శశి థరూర్ పేరు ఇచి్చనందున ఆయన మాట్లాడాలని సూచించారు. విపక్షాల నినాదాలు ఆగకపోవడంత సభ మధ్యాహ్నం రెండిటితో వాయిదా పడిడంది. తిరిగి సమావేశం కాగానే సభాపతి స్థానంలో ఉన్న సంధ్యా రాయ్ బడ్జెట్‌పై చర్చను ప్రారంభించాల్సిందిగా థరూర్‌కు సూచించారు. తన ప్రసంగానికి ముందు విపక్ష నేత రాహుల్ కొన్ని అంశాలను లేవనెత్తదలచారని థరూర్ పేర్కొన్నారు. రాహుల్ బడ్జెట్‌పై ప్రసంగిస్తే అభ్యంతరం లేదని రాయ్ బదులిచ్చారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ, బడ్జెట్‌పై చర్చకు ముందు పలు అంశాలపై మాట్లాడేందుకు తనకు అవకాశమివ్వాలని పట్టుబట్టారు. అందుకు తనకు అవకాశమిస్తానని విపక్ష సభ్యులతో సమావేశం సందర్భంగా స్పీకర్ అంగీకరించినట్టు వెల్లడించారు. కానీ అలాంటిదేమీ లేకుండా నేరుగా బడ్జెట్‌పై చర్చను మొదలు పెడుతున్నారంటూ ఆక్షేపించారు. తనకు అలాంటి సమాచారమేదీ లేనందున ఇతర అంశాలు లేవనెత్తేందుకు అనుమతించలేనని రాయ్ పేర్కొన్నారు. స్పీకర్ అలాంటి అంగీకారానికి రాలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు స్పష్టం చేశారు. ఒప్పందంపైనే రాహుల్ మాట్లాడాలనుకుంటే దానిపై స్పందించేందుకు స్పీకర్ సభలో అందుబాటులో ఉండాల్సి ఉంటుందన్నారు. అధికార, విపక్షాల్లో ఎవరూ పట్టు వీడకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు రాయ్ ప్రకటించారు. ప్రధాని ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానం ఫిబ్రవరి 5న ఆమోదం పొందడం తెలిసిందే! ఇలా జరగడం 22 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఫిబ్రవరి 4న ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే సందర్భంగా ఆయన స్థానం వద్దకు వెళ్లి అనూహ్య చర్యకు పాల్పడాలని కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించుకున్నట్టు కచి్చతమైన సమాచారం అందిందని స్పీకర్ పేర్కొన్నారు. అందుకే ఆయన భద్రత దృష్ట్యా సభకు రావద్దని తానే సూచించినట్టు తెలిపారు. దీన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా తోసిపుచ్చారు. అది పచ్చి అబద్ధమన్నారు. -
వాయిదా పర్వం
న్యూఢిల్లీ: లోక్‌సభలో వి పక్షాల ఆందోళనలు శుక్రవారం కూడా నిర్నిరోధంగా కొనసాగాయి. దాంతో కార్యకలాపాలేవీ సాగించకుండానే సభ మరోసారి వాయిదాపడింది. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు పలు అంశాలపై ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. స్పీకర్ ఓం బిర్లా వారించినా లాభం లేకపోయింది. దాంతో, ఇలాంటి అంతరాయాలతో ఈ సమావేశాల్లో ఇప్పటికే ఏకంగా 19 గంటల విలువైన సభా సమయం వృథా అయిందంటూ ఆయన ఆవేదన వెలిబుచ్చారు. కాంగ్రెస్ సభ్యురాలు ప్రియాంకగాంధీ అడగాల్సిన ప్రశ్న కూడా జాబితాలో ఉందని తెలిపారు. అయినా లాభం లేకపోవడంతో, ఇటువంటి సభను తాను నడపలేనంటూ స్పీకర్ ఆగ్రహం వెలిబుచ్చారు. నాలుగు నిమిషాలకే సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశమయ్యాక కూడా అవే దృశ్యాలు కన్పించాయి. సభ్యులు నినాదాల నడుమ తిరిగి వెల్‌లోకి దూసుకెళ్లారు. తమ స్థానాల్లోకి తిరిగి వెళ్లాల్సిందిగా ప్యానెల్ స్పీకర్ కృష్ణప్రసాద్ తెన్నేటి పదేపదే విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. వారం రోజులుగా... లోక్‌సభ గత సోమ వా రం నుంచీ విపక్షాల నిరసనలలో అట్టుడు కుతోంది. పలు అంశాలపై అధికార, విపక్షాలు నడుమ నువ్వా, నేనా అన్నట్టు తలపడుతున్నాయి. 2020 భారత్–చైనా ఘర్షణకు సంబంధించి నాటి ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణె రాసిన పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు రాహుల్ చేసిన ప్రయత్నం వివాదానికి దారి తీయడం తెలిసిందే. దానిపై మొదలైన రగడ కొనసాగుతూనే ఉంది. దాంతో రాష్ట్రప తి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని గత 22 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని సమాధానం లేకుండానే సభ ఆమోదించింది.కాంగ్రెస్ నిరసన లోక్‌సభ వాయిదా పడ్డాక పార్లమెంటు ప్రాంగణంలో మకరద్వారం వద్ద కాంగ్రెస్‌తో పాటు పలు ఇతర పారీ్టల ఎంపీలు నిరసనకు దిగారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, నరవణె పుస్తకం, 8 మంది ఎంపీల సస్పెన్షన్ తదితరాలపై నినాదాలతో హోరెత్తించారు. ‘వాణిజ్య వల’అంటూ అమెరికా ఒప్పందంపై బ్యానర్ ప్రదర్శించారు. ప్రియాంక, సస్పెండైన ఎంపీలతో పాటు పలువురు వీటిలో పాల్గొన్నారు. -
ప్రధాని సమాధానం లేకుండానే.. లోక్‌సభలో తీర్మానం ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభ ఆమోదం తెలిపింది. పార్లమెంట్ చరిత్రలో గత 22 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని మోదీ బుధవారమే సమాధానం ఇస్తారని భావించినప్పటికీ, నినాదాలు, నిరసనల కారణంగా సభ గురువారానికి వాయిదా పడిన విషయం తెల్సిందే. గురువారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభమైన సభ కూడా కొద్దిసేపటికే వాయిదా పడింది. తిరిగి 12 గంటలకు సభ ఆరంభమయ్యాక సైతం ప్రధాని మోదీతో పాటు కేంద్రప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇండియా కూటమి ఎంపీలు నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాం«దీకి మాట్లాడే అవకాశం నిరాకరించారంటూ ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నరేంద్ర–సరెండర్’ అంటూ ప్రధాని మోదీ వ్యతిరేక నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వెల్‌లోకి వెళ్లారు. కాశీలో మణికరి్ణక ఘాట్ వ్యవహారంపై బ్యానర్లు ప్రదర్శిస్తూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు.. టీఎంసీ, ఇతర ఇండియా కూటమి సభ్యులు కూడా వారికి జత కలిశారు. ఈ గందరగోళం మధ్యే జనవరి 28న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ సభలో చదివి వినిపించారు. ఆ తీర్మానాన్ని మూజువాణి ఓటు ద్వారా సభ ఆమోదించింది. తీర్మానానికి ప్రతిపక్షాలు చేసిన సవరణలను స్పీకర్ తిరస్కరించారు. -
‘సర్’పై కమల్ హాసన్ ఏమన్నారంటే..
ఢిల్లీ: కమల్ హాసన్ రాజ్యసభలో చేసిన తొలి ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమిళనాడులో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR)పై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ వల్ల అర్హులైన సుమారు కోటి మంది ఓటర్లు చనిపోయిన వారి జాబితాలో చేరే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు, కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా తన తొలి ప్రసంగంలోనే ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్పై విమర్శలు గుప్పించారు. ఆయన దీన్ని ఒక వ్యాధిగా అభివర్ణిస్తూ, ఇది ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీసే చర్య అని అన్నారు.సవరణ ప్రక్రియలో తప్పుగా పేర్లు తొలగించబడే అవకాశం ఎక్కువగా ఉంది. ఫలితంగా, నిజంగా జీవించి ఉన్న ఓటర్లు కూడా జాబితాలో లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఎన్నికల సంఘం ఈ విధమైన చర్యల ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని కమల్ హాసన్ ఆరోపించారు. ప్రజలకు ఉన్న ఓటు హక్కును కాపాడటం ప్రభుత్వాల బాధ్యత అని, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతత్వం కోసం ప్రయత్నించకూడదని ఆయన స్పష్టం చేశారు.తమిళనాడులో ఇటీవల జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో 97.4 లక్షల పేర్లు తొలగించబడ్డాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 6.41 కోట్ల నుంచి 5.43 కోట్లకు తగ్గింది. ఈ తొలగింపులపై ఇప్పటికే వివాదం చెలరేగింది.తన ప్రసంగంలో కమల్ హాసన్ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, ప్రజల హక్కులను గౌరవించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. “ప్రజాస్వామ్యం శాశ్వతం, కానీ ప్రభుత్వాలు తాత్కాలికం. ప్రజల హక్కులను దెబ్బతీయడం ఎప్పటికీ అంగీకారయోగ్యం కాదు’అని వ్యాఖ్యానించారు.కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజల హక్కుల పరిరక్షణపై ఆయన చేసిన ఆందోళన, భవిష్యత్తులో రాజకీయ వేదికపై మరింత చర్చకు దారితీయనుంది. -
లోక్ సభలో మోదీపై దాడి? బయటపడ్డ సంచలన వీడియో..
-
2.5 కోట్లకుపైగా ఆధార్ నంబర్ల డియాక్టివేట్
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ డేటాబేస్‌ను మరింత సురక్షింతంగా, విశ్వసనీయంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరణించిన 2.5 కోట్లకుపైగా ప్రజల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడిచింది. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద లిఖితపూర్వంగా సమాధానం ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థగా నిలిచిన ఆధార్‌లో ప్రస్తుతం సుమారు 134 కోట్ల మందికి సంబంధించిన వినియోగదారులు ఉన్నారని తెలిపారు. అయితే వ్యక్తి మరణించిన తర్వాత ఆధార్ నంబర్ క్రియాశీలకంగా ఉంటే, సంక్షేమ పథకాల దురి్వనియోగం, గుర్తింపు సంబంధ మోసాలు జరిగే ఆస్కారం ఉండటంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు, సంస్కరణ కార్యక్రమం చేపట్టిందని మంత్రి తెలిపారు. ఆధార్ వినియోగదారుడి చిరునామాలో నమోదైన రాష్ట్రం, మరణం నమోదైన రాష్ట్రం వేరుగా ఉంటే అలాంటి వ్యక్తుల వివరాలు సమీకరించి మరణాలను ధృవీకరించుకుంటామని వెల్లడించారు. ఆ తర్వాత ఆయా వ్యక్తుల ఆధార్ నంబర్లను నిలిపిస్తున్నట్లు స్పష్టం చేశారు. గుర్తింపు మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా వినియోగదారులు తమ బయోమెట్రిక్స్‌ను లాక్/అన్‌లాక్ చేసుకునే సదుపాయం కలి్పస్తున్నట్లు పేర్కొన్నారు. లావాదేవీల సమయంలో లబి్ధదారు భౌతికంగా ఉన్నట్లు నిర్ధారించే ’లైవ్‌నెస్ డిటెక్షన్’ ఫీచర్‌తో కూడిన ఫేస్ అథెంటికేషన్, ఆధార్ సెక్యూర్ క్యూఆర్ కోడ్, ఆఫ్‌లైన్ ఈ–కేవైసీ వంటివి అందుబాటులోకి తెచి్చనట్లు వివరించారు. వినియోగదారుల ప్రధాన బయోమెట్రిక్ సమాచారాన్ని యూఐడీఏఐ ఎవరితోనూ పంచుకోదని, డేటాను ఎన్‌క్రిపె్టడ్ ఫార్మాట్లో భద్రపరచడం తప్పనిసరి చేశామని జితిన్ ప్రసాద స్పష్టం చేశారు. -
సభలో రచ్చరచ్చ
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం, మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణే పుస్తకంపై లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు బుధవారం సైతం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు నిజాలు బహిర్గతం చేయాలని పట్టుబట్టారు. సభలో బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉండగా, ఆయన సభకు హాజరు కాలేదు. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు ప్రారంభించారు. శాంతించాలంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. దాంతో స్పీకర్ సభను ఉదయం 11 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యుల ఆందోళన ఆగలేదు. ప్రభుత్వం సమాధానం చెప్పేదాకా విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. విపక్ష ఎంపీలు తొలుత వెల్‌లో బైఠాయించారు. అనంతరం బ్యానర్లు ప్రదర్శిస్తూ అధికార పక్ష సభ్యులవైపు దూసుకొచ్చారు. నరవణే పుస్తకంపై సభలో రాహుల్ గాం«దీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి తీరును కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అమిత్ షా తప్పుపట్టారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల దాకా, తర్వాత 2 గంటల దాకా వాయిదా వేశారు. మరో వాయిదా తర్వాత 5 గంటలకు సభ మళ్లీ ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ సమయంలోనే ప్రధాని ప్రసంగించాల్సి ఉంది. కాంగ్రెస్ మహిళా ఎంపీ వర్షా గైక్వాడ్ సహా మరికొందరు మహిళా సభ్యులు ప్రధాని కూర్చొనే స్థానం వద్దకొచ్చి ఘోరావ్ చేశారు. అప్పుడు మోదీ సభలో లేరు. వెనక్కి రావాలంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కోరినా విపక్ష సభ్యులు పట్టించుకోలేదు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రాయ్ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. పరిస్థితి అదుపులో లేకపోవడం వల్లనే మోదీ సభకు రాలేదని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ చెప్పారు. రాహుల్‌కు పోటీగా దూబే పుస్తక ప్రదర్శన..మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ‘ఎడ్వినా అండ్ నెహ్రూ’, ‘మిత్రోఖిన్ ఆర్కైవ్’ అనే పుస్తకాలను సభలో ప్రదర్శిస్తూ వాటి గురించి ప్రస్తావించడంతో వివాదం మొదలైంది. దివంగత ప్రధానమంత్రులు నెహ్రూ, ఇందిరా గాం«దీ, రాజీవ్ గాంధీపై ఆయన విమర్శలు చేశారు. వారు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అయితే, సభలో పుస్తకాల గురించి ప్రస్తావించడానికి వీల్లేదని సభాపతి స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెన్నేటి స్పష్టంచేశారు. నిషికాంత్ దూబ్ తీరుపై మండిపడుతూ కాంగ్రెస్ సహా ఇతర విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో సభాపతి లోక్‌సభను సాయంత్రం 5 గంటల దాకా వాయిదా వేశారు. తర్వాత కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. నిషికాంత్ దూబేపై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేశారు. -
లోక్‌సభలో 8 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్
ఢిల్లీ: లోక్‌సభలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంతవరకు సస్పెన్షన్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, గుర్జీత్ ఓజ్లా, రాజా వారింగ్, హిబి ఈడెన్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. స్పీకర్ తీరుకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో సస్పెండ్ అయిన ఎంపీల ఆందోళనకు దిగారు.రాహుల్ గాంధీ ‘చైనా’ కామెంట్స్‌పై ఉదయం నుంచి లోక్‌సభలో చర్చ జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. భారత్-చైనా సరిహద్దు వివాదానికి సంబంధించి మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవాణే ఇంకా ప్రచురించని పుస్తకం ఆధారంగా వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ.. భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో వ్యాఖ్యలు చేయడంతో వివాదం నెలకొంది.విపక్ష సభ్యులు.. సభాపతి చైర్ వైపు కాగితాలను విసిరేయడంతో గందరగోళం నెలకొంది. 8 మంది ప్రతిపక్ష ఎంపీలను లోక్‌సభ సస్పెండ్ చేసింది. ఈ వ్యాఖ్యల్ని హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. అనంతరం లోక్‌సభ కార్యకలాపాలు రేపటికి వాయిదా పడ్డాయి.కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభలో 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని.. 8 మందిలో తానూ ఉన్నానని తెలిపారు. స్పీకర్.. రాహుల్ గాంధీ మైక్‌ను కట్ చేయడాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేశారు. రాహుల్ గాంధీ ఎన్నో సందర్భాలలో వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేస్తే సమావేశాన్ని వాయిదా వేసే విధంగా ప్రవర్తించారు. దేశ ప్రజల ముందు కాంగ్రెస్ ఎంపీల వలనే సభ వాయిదా పడుతున్నట్టు బీజేపీ ప్రచారం చేస్తున్నారు.నరేంద్ర మోదీ ట్రంప్‌కు సరెండర్ అయ్యారు. రాష్ట్రపతి ప్రసంగంపై జరుగుతున్న డిబేట్లో రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ఆయన మైకు కట్ చేశారు. ఆయన మైక్ కట్ చేస్తే మేము ఎందుకు కట్ చేశారని అడిగేందుకు స్పీకర్ పోడియం ముందుకు వెళ్లాం. 8 మందిపై కావాలనే సస్పెన్షన్ వేటు వేశారు. మా నోరు మూయించాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. మిగతా ఎంపీలందరూ మా తరఫున రేపు సభలో ప్రశ్నిస్తూనే ఉంటారు. రేపు పార్లమెంట్ ఆవరణలో సస్పెన్షన్ గురైన ఎనిమిది మంది ఎంపీలం ఆందోళన చేస్తాం.స్పీకర్ అనే వ్యక్తి ఏ కులానికి చెందినవారనేది మేము చూడలేదు. మాకు అవకాశం ఇవ్వకపోవడంతోనే ఆందోళన చేశాం. మేం మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తున్నారు. బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుంది’’ అని కిరణ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. -
లోక్‌సభలో నరవణె పుస్తకం రగడ -రాహుల్‌కు బీజేపీ కౌంటర్
-
సభలో ‘చైనా’ రగడ!
న్యూఢిల్లీ: ‘చైనా రగడ’ సోమవారం లోక్‌సభను కుదిపేసింది. 2020 నాటి భారత్, చైనా ఘర్షణలకు సంబంధించి విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. వాటికి సంబంధించి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె పుస్తకంలోని పలు అంశాలను రాహుల్ సభలో ప్రస్తావించడం కలకలం రేపింది. విపక్ష నేత వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు బీజేపీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ప్రచురణ కాని పుస్తకంలోని అంశాలను ఉటంకించడాన్ని ఆక్షేపించారు.సభను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారంటూ దుయ్యబట్టారు. నరవణె పుస్తకం గురించిన ఉటంకింపులను అనుమతించబోనని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించినా రాహుల్ పట్టించుకోలేదు. పలువురు విపక్ష నేతలు ఆయనకు మద్దతుగా నిలవడంతో గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. దాంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.ఒక్క వాక్యానికే భయమెందుకు?సోమవారం లోక్‌సభ సమావేశమై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టింది. బీజేపీ సభ్యుడు తేజస్వి సూర్య మాట్లాడుతూ కాంగ్రెస్ దేశభక్తిపై పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. అనంతరం ప్రసంగించిన రాహుల్ వాటిపై మండిపడ్డారు. ‘‘నెహ్రూ–చైనా అంశంపై మాట్లాడాలని నేను అనుకోలేదు. కానీ కనుక సూర్య చేసిన విమర్శలకు బదులుగా దానిపై మాట్లాడక తప్పడం లేదు. నెహ్రూ కేవలం తాను రాజనీతిజ్ఞుడినని చెప్పుకునేందుకు వేలాది ఎకరాల భూభాగాన్ని చైనాకు సరెండర్ చేశారని నిరాధారణ ఆరోపణలకు దిగుతున్నారు’’ అన్నారు. ఆ క్రమంలో 2020 భారత్, చైనా గాల్వాన్ ఘర్షణల గురించి జనరల్ నరవణె తన పుస్తకంలో రాసిన అంశాలను ఉటంకించారు. అందుకు అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ పుస్తకం ప్రచురణ అయిందో లేదో ముందుగా రాహుల్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో మొదలైన రగడ 50 నిమిషాలకు పైగా కొనసాగింది. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి పుస్తకం, వార్తా పత్రిక క్లిప్పింగ్ తాలూకు అంశాలనూ సభలో ప్రస్తావించడానికి అనుమతి లేదని ఓం బిర్లా స్పష్టం చేశారు. వాటి ప్రస్తావనకు అడ్డంకులేమీ లేవని రాహుల్ వాదించారు. నరవణె పుస్తకం ప్రచురితం కాలేదని రాజ్‌నాథ్ అభ్యంతరం తెలిపారు. దానిపై ఒక మేగజైన్లో వచ్చిన వ్యాసంలోని అంశాలనే ఉటంకిస్తున్నానని రాహుల్ బదులిచ్చారు. ‘‘ఉగ్రవాదంపై రాజీలేని పోరు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటారు. నేను ఒక్క వాక్యం చదివితే ఎందుకంతగా బెంబేలెత్తిపోతున్నారు?’’ అంటూ ఎద్దేవా చేశారు. ఆ పుస్తక ప్రస్తావనను అనుమతించడం లేదని ఓం బిర్లా పునరుద్ఘాటించారు. ‘అయితే నేనేం మాట్లాడాలో మీరే చెప్పండి’ అని రాహుల్ అనడంతో, ‘నేనేమీ మీ సలహాదారును కాదు’ అంటూ స్పీకర్ ఆగ్రహించారు. స్పీకర్ రూలింగ్‌కు కట్టుబ డకుంటే ఏం చర్యలు తీసుకోవాలో సభ నిర్ణయించాల్సి వస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు హెచ్చరించారు. అయినా రాహుల్ వెనక్కు తగ్గకపోవడంతో పుస్తక ప్రస్తావన తగదంటూ ఆయన్ను బిర్లా పదేపదే వారించారు. పుస్తకాన్ని ప్రచురించొద్దంటూ నరవణెను కేంద్రం బెదిరించిందంటూ రాహుల్ తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజ్‌నాథ్ మండిపడ్డారు. అదే నిజమైతే దానిపై నరవణె కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రాహుల్‌కు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మద్దతుగా నిలిచారు. ఆయనను మాట్లాడేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. వెంటనే అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలకు దిగారు. గందరగోళం నడుమ సభను మధ్యాహ్నం మూడింటిదాకా స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం కూడా ఇండో–చైనా సరిహద్దు అంశాన్ని లేవనెత్తేందుకు రాహుల్ తిరిగి ప్రయత్నించారు. అందుకు అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సైన్యాన్ని న్యూనతపరిచే వ్యాఖ్యలకు దిగొద్దని రాహుల్‌కు రిజిజు సూచించారు. ప్రతిష్టంభన నడుమ సభ సాయంత్రం నాలుగింటిదాకా వాయిదా పడింది. మోదీకి, మంత్రులకు నచ్చదు!సభ మళ్లీ సమావేశమయ్యాక రాహుల్ తన ప్రసంగం కొనసాగించారు. తాను లేవనెత్తుతున్నది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పారు. ‘‘సహజంగానే ప్రధాని మోదీకి, రక్షణ మంత్రికి ఇది నచ్చదు. అందుకే నన్ను మాట్లాడనివ్వడం లేదు’’ అంటూ దుయ్యబట్టారు. మహువా మొయిత్రా, కల్యాణ్ బెనర్జీ (టీఎంసీ), మనోజ్ ఝా (ఆర్జేడీ) తదితర విపక్ష సభ్యులు రాహుల్‌కు బాసటగా నిలిచారు.మోదీ, రాజ్‌నాథ్ దోషులుగా తేలతారనే...సభలో నన్ను అడ్డుకున్నారు: రాహుల్‘‘2020లో చైనాతో ఘర్షణ సందర్భంగా మన సైనిక బలగాల నమ్మకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వమ్ము చేశారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె పుస్తకంలోని అంశాలు వెలుగులోకి వస్తే ఆ ఉదంతంలో వారిద్దరూ దోషులుగా రుజువవుతారు. ఆ భయంతోనే నేను సదరు అంశాలను ప్రస్తావించకుండా బీజేపీ సభ్యులు లోక్‌సభలో పదేపదే అడ్డుకున్నారు’’ అని విపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. సోమవారం సభ వాయిదా పడ్డాక పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ, రాజ్‌నాథ్ గురించి ఆ పుస్తకంలో నరవణె రాశారు. చైనాతో ఘర్షణకు సంబంధించి వారిద్దరూ తనకు ఏం చెప్పిందీ, ఎలాంటి ఆదేశాలిచ్చిందీ స్పష్టంగా పేర్కొన్నారు. దాన్నే నేను సభలో ప్రస్తావించా. ఆ రెండు మూడు వాక్యాల్లో విషయమంతా స్పష్టంగా బయటపడిపోయేది. పైగా వాటిని రాసింది నాటి ఆర్మీ చీఫ్! కానీ ఆ మాత్రానికే మోదీ సర్కారు బెంబేలెత్తిపోతోంది. ఎందుకంటే అది వెలుగులోకి వస్తే వారిద్దరి బండారం బయటపడుతుంది’’ అన్నారు. 2020లో చైనా చొచ్చుకొస్తున్నప్పుడు మోదీ 56 అంగుళాల ఛాతీ ఏమైపోయిందంటూ ఎద్దేవా చేశారు. ‘‘అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని నడిపే నాయకుడు స్పష్టంగా దిశానిర్దేశం చేయాలి. అంతే తప్ప నిర్ణయాలను ఇతరుల భుజస్కంధాలపై నెట్టి బాధ్యతల నుంచి తప్పించుకోవద్దు. కానీ మోదీ చేసింది సరిగ్గా అదే! ఆర్మీ మాజీ చీఫ్ రాసిన పుస్తకాన్ని ప్రచురణ కూడా కానివ్వడం లేదు’’ అని రాహుల్ ఆరోపించారు.నిబంధనల దుర్వినియోగం: కాంగ్రెస్సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీని మోదీ సర్కారు అవహేళన చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. పైగా ఆయన గొంతు నొక్కేందుకు నిబంధనలను కూడా దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడింది. నరవణె పుస్తకంలోని నిజాలు వెలుగులోకి వస్తాయన్న భయంతోనే చౌకబారు చేష్టలకు దిగారని కాంగ్రెస్ సీనియర్ నేత కె.సి.వేణుగోపాల్ ఆరోపించారు. ఇది నయా ఫాసిజానికి తిరుగులేని తార్కాణమంటూ ధ్వజమెత్తారు.పార్లమెంటును కించపరిచారువిపక్ష నేత రాహుల్‌గాంధీ తన ప్రవర్తనతో పార్లమెంటు గౌరవానికే భంగం కలిగించారని బీజేపీ దుయ్యబట్టింది. అంతేగాక భారత్–చైనా సరిహద్దు అంశంపై నిరాధారణ ఆరోపణలు, బాధ్యతారహిత వ్యాఖ్యలతో సైనికుల ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బ తీశారంటూ ఆక్షేపించింది. రాహుల్ పూర్తిగా భారత వ్యతిరేక శక్తుల భాష మాట్లాడుతున్నారని మంత్రులు, బీజేపీ నేతలు మండిపడ్డారు. సభలో రాహుల్ ప్రవర్తన భారత్ పరువును మంటగలిపేందుకు పక్కా పథకం ప్రకారం పన్నిన కుట్రలో భాగమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆరోపించారు. పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. విలువైన సభా సమయాన్ని రాహుల్ వ్యర్థపరిచారని మండిపడ్డారు. ‘‘జాతీయ భద్రతతో ఆటలాడొద్దు. దాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకోవద్దు’’ అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో భారత భూభాగాన్ని చైనాకు కోల్పోయినందుకు రాహుల్ తక్షణం దేశానికి క్షమాపణ క్షమాపణ చెప్పాలని రిజిజు డిమాండ్ చేశారు. రాహుల్ ఏకంగా నిండు సభలోనే మన దేశ శత్రువుల భాష మాట్లాడుతున్నారంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ మండిపడ్డారు.ఆ పుస్తకంలో ఏముంది?లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ, మంత్రుల నడు మ రగడకు కేంద్ర బిందువుగా మారిన ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణె పుస్తకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన తన సైనిక జీవితం తాలూకు జ్ఞాపకాలకు ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పేరిట పుస్తక రూపమిచ్చారు. పెంగ్విన్ పబ్లిషింగ్ హౌజ్ దాన్ని ప్రచురించాల్సి ఉంది. అందుకు రక్షణ శాఖ అనుమతి కోసం ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నట్టు నరవణె గత అక్టోబర్‌లో పేర్కొన్నారు! ఈ నేపథ్యంలో ఆ పుస్తకంపై ద కారవాన్ మేగజైన్ గత నెలలో కవర్ పేజీ వ్యాసం ప్రచురించింది. రాహుల్ సోమవారం సభలో ఉటంకించింది ఆ వ్యాసంలోని అంశాలనే! తద్వారా, గాల్వాన్ ఘర్షణ వంటి అతి కీలక ఉదంతంపై సరైన నిర్ణయం తీసుకోవడంలో మోదీ సర్కారు తాత్సారం చేసిందని చెప్పేందుకు ఆయన ప్రయత్నించారు.నిర్ణయాన్ని నాకే వదిలారు: నరవణె2020 జూన్15 రాత్రి తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత, చైనా సైనిక దళాల మధ్య భారీ ఘర్షణ జరిగింది. వాటిలో కల్నల్ సంతోష్‌కుమార్‌తో సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనావైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగి నా డ్రాగన్ దేశం ఆ వివరాలను బయ టికి రానివ్వ లేదు. ఆ ఘర్షణల సమయంలో నరవణె ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న వేళ 2020 ఆగస్టు 31న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో తన భేటీ గురించి పుస్తకంలో నరవణె రాశారు. ‘‘(గాల్వాన్ ఉద్రిక్తతలపై) ప్రధాని మోదీతో మాట్లాడానని రాజ్‌నాథ్ నాకు చెప్పారు. ‘అది పూర్తిగా సైనిక నిర్ణయం. మీకు ఏది సరైందనిపిస్తే అలా చేయండి’ అన్నారు. దాంతో బాధ్యతంతా పూర్తి గా నాపైనే పడింది. ‘చైనా దూకుడును అడ్డుకు నేందుకు) నేనే సరైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఏం చేయాలా అని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపో యాను’’ అని అందులో నరవణె రాసుకొచ్చి నట్టు కారవాన్ వ్యాసం పేర్కొంది. ‘‘పుస్తకం బ్యాక్ కవర్‌పై 1999 కార్గిల్ యుద్ధ సమయంలో ఆర్మీ చీఫ్‌గా చేసిన జనరల్ వి.పి.మాలిక్ రాసిన అభిప్రాయం కూడా ఆసక్తికరంగా ఉంది. ‘గాల్వన్ లోయ ఘర్షణ, దానికి ముందు, తర్వాత జరిగిన పలు ఉదంతాల గురించి పుస్తకంలో రాసిన అంశాలు చదువుతుంటే పాఠకులంతా భావోద్వేగాలతో ఊగిపోవడం ఖాయం’ అని మాలిక్ రాసుకొ చ్చారు’’ అంటూ వ్యాసం ముక్తా్తయించింది. -
రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27వ సంవత్సరానికి సంబంధించి ఆదివారం కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2026–27 ఆర్థిక సంవత్పరానికి రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆమె ప్రకటించారు. దేశ తయారీ రంగానికి ఊతమిచ్చేలా పలు చర్యలను ప్రతిపాదించారు. గ్లోబల్ డేటా సెంటర్లకు టాక్స్ హాలిడేను ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. అదేవిధంగా వ్యవసాయం, పర్యాటక రంగాలకు పలు రాయితీలను ప్రతిపా దించారు. అంతర్జాతీయ పెరుగుతున్న అస్థిరతల నేపథ్యంలో...దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక బ్లూప్రింట్‌ను ఆమె ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపట్టిన నిర్మలా సీతారామన్ వరసగా 9 సార్లు పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డ్‌ను సృష్టించారు. దేశ చరిత్రలో మహిళా ఆర్థిక మంత్రి ఇన్ని సార్లు ఆర్థికపద్దును సభ ముందుకు తేవడం ఇదే తొలిసారి. మాజీ ప్రధానమంత్రి, దివంగత మొరార్జీ దేశాయ్ అందరికంటే ఎక్కువగా 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎంఎస్ఎంఈకి రూ.10వేల కోట్ల ఫండ్దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ ఎంఈ) ఛాంపియన్లుగా ఎదగడానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రూ.10,000 కోట్లతో డెడికేటెడ్ ఫండ్‌ను తాజా బడ్జెట్లో ప్రకటించింది. నూతన ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఉత్పాదకత పెంచడం, వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సమగ్ర ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. మన కర్తవ్యం నెరవేర్చుకో వడానికి సంస్కరణల ఎక్స్‌ప్రెస్ వేగం ఇలాగే కొనసాగుతుందని స్పష్టంచేశారు. మనకు మూ డు కర్తవ్యాలు ఉన్నట్లు చెప్పారు. అవి.. వేగవంతమైన, సుస్థిరాభివృద్ధి, ఆకాంక్షలు నెరవేర్చు కోవడం–సామర్థ్యాలు పెంచుకోవడం, సబ్కా సాత్, సబ్కా వికాస్ అని వివరించారు. ఇందులో భాగంగా ఎంఎస్ఎస్ఈలు ఛాంపియ న్లుగా మారాలన్నది ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గ్రోత్ ఇంజన్ కు ఎంఎస్ఎంఈలు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఆయా కంపెనీలకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అందుకోసం రూ.10,000 కోట్లతో ప్రత్యేక నిధిని ప్రతిపాదించారు. రక్షణ రంగానికి సింహ భాగంపొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా మిలటరీ ఆధునీకరణపై కేంద్రం ఫోకస్ పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో రక్షణ రంగానికి సింహ భాగం కేటాయించింది. ముఖ్యంగా మూలధన వ్యయంలో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా లక్ష కోట్లకు పైగానే కేటాయింపులు జరిపింది. 2025–26లో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రికార్డు స్థాయిలో రూ.7,84,678 కోట్లు ప్రకటించింది. ప్రస్తుత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 15 శాతం అధికంగా కేటాయింపులు జరిపింది. పాకిస్తాన్ పై ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో అత్యాధునిక యుద్ధరీతులపై కేంద్రం దృష్టి పెట్టింది. కొత్త ఆ యుధాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధనౌకలు, మిలటరీ హార్డ్‌వేర్ కొనుగోళ్లు లక్ష్యంగా మొత్తం రక్షణ బడ్జెట్లో మూలధన వ్యయం కోసం రూ.2,19,306 కోట్లు కేటాయించింది. వికసిత్ భారత్‌కు రోడ్‌మ్యాప్: ప్రధాని మోదీఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత్ బారత్‌కు రోడ్‌మ్యా ప్ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నా రు. ‘‘ఇదొక విశిష్టమైన, ప్రతిష్టాత్మకమైన బడ్జెట్. ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసే బడ్జెట్. ప్రపంచ వేదికపై మనదేశ ప్రతిష్ట మరింత పెరగడం ఖాయం. అద్భుత అవకాశాలకు ఈ బడ్జెట్ ఒక రహదారి. వికసిత్ భారత్–2047కు బలమైన పునాదిగా నిలుస్తుంది. దేశం ప్రయాణిస్తున్న సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌కు నూతన వేగం, నూతన శక్తి లభించడం తథ్యం. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలను బలోపేతం చేయడానికి రోడ్‌మ్యాప్‌గా తోడ్పడుతుంది. దేశ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను కచ్చితంగా తీరుస్తుంది. మన పరిశ్రమలు లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి ఎదగడానికి ప్రభుత్వం సహకరిస్తుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 సంవత్సరానికి గాను బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదిసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించారు. -
లోక్ సభ నిరవధిక వాయిదా
ఢిల్లీ: కాలుష్యంపై చర్చించకుడానే లోక్ సభ నిరవధిక వాయిదా పడింది. నిన్న వీబీ జీ-రామ్-జీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇవాళ కూడా విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. వీబీ జీ-రామ్-జీ బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ ఫొటోలతో విపక్షాల నిరసనకు దిగాయి. రాత్రంత సంవిధాన్ సదన్ ముందు తృణమూల్ ఎంపీలు నిరసనలు తెలిపారు.తెల్లవారుజాము దాకా అక్కడే ఉండి ఎంపీలు నిరసనలు తెలిపారు. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవికా మిషన్–గ్రామీణ(జీ రామ్ జీ) బిల్లుకు గురువారం పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. తొలుత లోక్‌సభలో విపక్షాల నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సభలో బిల్లు ప్రతులను చించేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మోదీ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని, గాం«దీజీ ఆశయాలు, ఆదర్శాలను నీరుగారుస్తోందని మండిపడ్డారు.పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ఏమిటని నిలదీశారు. గాం«దీజీ వారసత్వాన్ని నామరూపాల్లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. జీ రామ్ జీ బిల్లుపై లోక్‌సభలో దాదాపు 8 గంటలపాటు చర్చ జరిగింది.జీ రామ్ జీ బిల్లును కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లును ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. సమగ్ర పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. బిల్లులో సవరణలు సూచించడానికి తగినంత సమయం ఇవ్వాలని కోరారు. సుదీర్ఘ చర్చ తర్వాత మూజువాణి ఓటుతో అర్ధరాత్రి దాటాక రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. -
విపక్షాల నిరసన మధ్యే ‘జీ-రామ్-జీ’ బిల్లుకు ఆమోదం
ఢిల్లీ: వికసిత భారత్ జీ రామ్ జీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసన మధ్యే ‘జీ-రామ్-జీ’ బిల్లుకు ఆమోదం లభించింది. వీబీ-జీ-రామ్-జీ బిల్లు పత్రులను చించి విపక్షాలు నిరసన తెలిపాయి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం మార్చగా.. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. విపక్షాల ఆందోళనతో లోక్‌సభ రేపటికి(శుక్రవారం) వాయిదా పడింది.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్–గ్రామీణ(వీబీ–జీ రామ్ జీ) బిల్లుపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, ఈ బిల్లుతో కూలీలకు ప్రతిఏటా 125 రోజులపాటు పని లభిస్తుందని కేంద్రం చెబుతోంది. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలన్న జాతిపిత మహాత్మాగాంధీ కల నెరవేరుతుందని కేంద్ర సర్కార్ అంటోంది. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీజీ పేరును తొలగించడం పట్ల కాంగ్రెస్ సభ్యుడు జైప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అది అతిపెద్ద నేరమన్నారు. కాగా, దేశంలో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) 100 శాతం అనుమతిస్తూ కేంద్రం తీసుకొచ్చిన సబ్కా బీమా సబ్కా రక్షా(బీమా చట్టాల సవరణ) బిల్లు–2025 పార్లమెంట్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును మంగళవారం లోక్‌సభలో ఆమోదించగా, బుధవారం రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. బీమా రంగంలో ప్రస్తుతం 74 శాతం ఎఫ్‌డీఐలను ఆమోదిస్తున్నారు. దీన్ని ఇకపై 100 శాతానికి పెంచబోతున్నారు. అలాగే, కాలం చెల్లిన 71 చట్టాలను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన రిపీలింగ్, అమెండ్మెంట్–2025 బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. -
రాష్ట్రాలపై భారం మోపి.. ‘ఉపాధి’ని ఎత్తేసే కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ పేదలకు కష్టకాలంలో అండగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని అటకెక్కించేందుకు.. పేదలకు హక్కుగా ఉన్న ఉపాధిని అగమ్యగోచరంగా మార్చేలా, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాల మెడపై కత్తి వేలాడదీసేలా రూపొందించిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ బిల్లు–2025’పై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌సభలో బుధవారం ఈ బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్రా లపై భరించలేనంత భారం మోపి, పరోక్షంగా ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పొట్టకొట్టే ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ‘ఇన్నాళ్లూ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఒక చట్టబద్ధమైన హక్కుగా ఉండేది. కానీ కేంద్రం తెస్తున్న కొత్త బిల్లులోని అస్పష్టమైన నిబంధనల వల్ల ఆ హక్కును పేదలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ బిల్లు పేదల్లో తీవ్ర అభద్రతాభావాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తోంది. నిధుల కేటాయింపులో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో కేంద్రం 90 శాతం నిధులు ఇస్తుండగా, రాష్ట్రాలు కేవలం 10 శాతం మాత్రమే భరిస్తున్నాయి. కొత్త బిల్లులో కేంద్రం తన వాటాను 60 శాతానికి తగ్గించుకుని, రాష్ట్రాలపై ఏకంగా 40 శాతం భారం మోపడం దారుణం. ఇది సమాఖ్య స్ఫూర్తికే విఘాతం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలను మరింత సంక్షోభంలోకి నెట్టేయడమే. మరీ ముఖ్యంగా.. రాష్ట్రాలు తమ వాటా 40 శాతం నిధులను ముందుగా జమచేస్తేనే, కేంద్రం తన వాటా నిధులను విడుదల చేస్తుందన్న నిబంధన పెట్టడం పూర్తిగా అసంబద్ధం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత పెద్ద మొత్తాన్ని ముందుగా ఎలా సర్దుబాటు చేస్తాయి? ఈ నిబంధన ఆచరణ సాధ్యం కాదు. ఇది పథకాన్ని నిర్వీర్యం చేయడమే. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లలో సగటున రూ.8 వేలకోట్లు ఉపాధి హామీ కోసం ఖర్చు చేశారు. కొత్త నిబంధన అమలైతే రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.3,200 కోట్లు భరించాల్సి వస్తుంది. ఇంతటి భారీ భారాన్ని రాష్ట్రం మోయలేదు. పనిదినాల పెంపు ఆచరణ సాధ్యం కాదు..మరోవైపు పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచామని కేంద్రం గొప్పగా చెప్పుకొంటున్నా.. అది ఆచరణలో సాధ్యం కాదు. రాష్ట్రాలు తమ వాటా నిధులను కట్టలేకపోతే, కేంద్రం నిధులు ఆగిపోతాయి. అప్పుడు ఈ పెంచిన పనిదినాల వల్ల పేదలకు ఒరిగేదేమీ ఉండదు. ఇది కేవలం కంటితుడుపు చర్యగానే మిగిలిపోతుంది..’ అని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులను గమనించకుండా, ఏకపక్షంగా రూపొందించిన ఈ బిల్లును వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఇతర వాటాదారులతో విస్తత చర్చలు జరిపిన తర్వాతే, పేదల ప్రయోజనాలు కాపాడేలా మార్పులు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
6,117 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 6,117 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే శాఖ బుధవారం వెల్లడించింది. వ్యక్తిగత గోప్యానికి ఏవిధమైన ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. వైఫైను అందించేందుకు ఆయా ప్రయాణికుల మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని మాత్రమే యాక్సెస్ చేస్తున్నామని, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 1,731 స్టేషన్లలో సీసీటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటుచేశామని తెలిపారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పాదచారుల వంతెనలు, వేచి ఉండే హాళ్లు, టికెట్ కేంద్రాల వద్ద సీసీటీవీలను ఏర్పాటుచేశారు. రైళ్లలో దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు బోగీల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 11,953 బోగీల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు బోగీల్లో జరిగే కదలికలను తెలుసుకుని, ప్రయాణికుల భద్రతను కాపాడుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. -
బీమా బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) 100 శాతం అనుమతిస్తూ కేంద్రం తీసుకొచ్చిన సబ్కా బీమా సబ్కా రక్షా(బీమా చట్టాల సవరణ) బిల్లు–2025 పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ బిల్లును మంగళవారం లోక్‌సభలో ఆమోదించగా, బుధవారం రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. బీమా రంగంలో ప్రస్తుతం 74 శాతం ఎఫ్‌డీఐలను ఆమోదిస్తున్నారు. దీన్ని ఇకపై 100 శాతానికి పెంచబోతున్నారు. రాజ్యసభలో బిల్లుకు ప్రతిపక్షం సూచించిన పలు సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. సమగ్ర పరిశీలన కోసం బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపించాలని విపక్ష సభ్యులు కోరగా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. రాజ్యసభలో బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. ప్రజలకు మేలు జరిగేలా బీమా రంగంలో మరిన్ని సానుకూల మార్పులు రాబోతున్నాయని చెప్పారు. ఈ రంగంలో విదేశీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయని వెల్లడించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇప్పటికే పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. ప్రజలకు, వ్యాపారాలకు, వ్యవసాయానికి బీమా రక్షణ విస్తృతంగా లభిస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. 100 శాతం ఎఫ్డీలతో బీమా సదుపాయం మరింత విస్తరిస్తుందని, చౌకగా పాలసీలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ రంగంలో వృద్ధికి అపరిమిత అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. విదేశీ కంపెనీల రాకతో పోటీ పెరిగి, కొత్త పాలసీలు వస్తాయని, ప్రీమియం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా దేశంలో యువతకు మరిన్ని ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ‘శాంతి’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం అణు ఇంధన రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశానికి వీలు కల్పిస్తూ ప్రభుత్వం రూపొందించిన సస్టైనబుల్ హార్నెసింగ్, అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా(శాంతి) బిల్లును లోక్‌సభలో బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించారు. బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి. సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. ప్రైవేట్ కంపెనీల రాకతో అణు ఇంధన రంగం మరింత వేగం పుంజుకుంటుందని చెప్పారు. ‘రామ్ జీ’ బిల్లుపై చర్చ ప్రారంభం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్–గ్రామీణ(వీబీ–జీ రామ్ జీ) బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడారు. ఈ బిల్లుతో కూలీలకు ప్రతిఏటా 125 రోజులపాటు పని లభిస్తుందన్నారు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలన్న జాతిపిత మహాత్మాగాంధీ కల నెరవేరుతుందని వివరించారు. ఉపాధి హామీ పథకం నుంచి గాం«దీజీ పేరును తొలగించడం పట్ల కాంగ్రెస్ సభ్యుడు జైప్రకాశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అది అతిపెద్ద నేరమని పేర్కొన్నారు. 71 పాత చట్టాల రద్దు బిల్లుకు సై కాలం చెల్లిన 71 చట్టాలను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన రిపీలింగ్, అమెండ్మెంట్–2025 బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించింది. మంగళవారం లోక్‌సభలో, బుధవారం రాజ్యసభలో ఆమోదించారు. -
లోక్‌సభలో ‘ప్రియాంకం’.. అన్న లేని లోటు తీరుస్తూ..
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష నేత రాహుల్ విదేశీ పర్యటనలో ఉండగా.. ఆయన గైర్హాజరీపై విమర్శలు గుప్పించిన బీజేపీకి సభలో సీన్ రివర్స్ అయింది. తొలిసారి ఎంపీగా అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా.. కాంగ్రెస్‌కు సారధ్యం వహిస్తూ, అధికార పక్షంపై విరుచుకుపడుతున్నారు. ప్రియాంక తన వాగ్ధాటితో రాహుల్ లేని లోటును భర్తీ చేయడమే కాకుండా, విపక్షాలకు కొత్త ఊపిరి పోశారు.ముఖ్యంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ (ఉపాధి హామీ) స్థానంలో కేంద్రం తెచ్చిన ‘జి రామ్ జి’ బిల్లుపై ప్రియాంక పోరాటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త బిల్లు పేదల ఉపాధి హక్కును హరిస్తుందని, గ్రామ సభల అధికారాలను బలహీనపరుస్తుందని ఆమె సభలో గట్టిగా వాదించారు. నిధుల కేటాయింపులో కేంద్రం పెత్తనాన్ని ప్రశ్నిస్తూ, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆమె చేసిన విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.సభలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార పక్షం ‘కుటుంబం’ పేరుతో చేసిన వ్యాఖ్యలకు ప్రియాంక ఇచ్చిన కౌంటర్ అందరినీ ఆకట్టుకుంది. ‘గాంధీ మా కుటుంబ సభ్యుడు కాదు. కానీ ఆయన ఈ దేశానికి తండ్రి, మన అందరికీ కుటుంబ సభ్యునితో సమానం’ అంటూ ఆమె ఇచ్చిన సమాధానం బీజేపీ నేతలను ఆత్మరక్షణలో పడేసింది. కేవలం పేరు మార్పుల కోసమే ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని, చర్చ లేకుండా బిల్లులను ఏకపక్షంగా ఆమోదించడం ప్రజాస్వామ్యానికే చేటని ఆమె హెచ్చరించారు.కేవలం వారం రోజుల వ్యవధిలోనే ప్రియాంక ఒక అనుజ్ఞురాలైన నాయకురాలిగా లోక్‌సభలో తనదైన ముద్ర వేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీలపై బీజేపీ చేసే విమర్శలకు గట్టి సమాధానమిస్తూ.. ‘ఒకేసారి చర్చ పెట్టి ఆ అధ్యాయాన్ని ముగించండి’ అంటూ ఆమె విసిరిన సవాల్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. రాహుల్ విదేశాల్లో ఉన్నా, లోక్‌సభలో కాంగ్రెస్ గళం మరింత బలంగా వినబడటంలో ప్రియాంక సక్సెస్ అయ్యారని పలువురు అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘సింధూర్‌లో అదే జరిగింది’.. క్షమాపణలు లేవన్న చవాన్ -
‘రోజ్‌గార్’ బిల్లుపై గరం గరం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 20 ఏళ్లుగా అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో.. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ప్రతిఏటా 125 పనిదినాలకు హామీ ఇస్తూ మరో చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం లోక్‌సభలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్–గ్రామీణ(వీబీ–జీ రామ్ జీ) బిల్లు–2025ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి.చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం పట్ల మండిపడ్డాయి. బిల్లును క్షుణ్నంగా పరిశీలించాలని, అందుకోసం పార్లమెంటరీ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశాయి. చరిత్రాత్మకమైన ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడానికి మోదీ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆరోపించాయి. విపక్షాల అభ్యంతరాలను శివరాజ్‌సింగ్ చౌహాన్ కొట్టిపారేశారు. తమ ప్రభుత్వం గాం«దీజీ ఆశయాలు, ఆదర్శాలను విశ్వసించడమే కాకుండా త్రికరణ శుద్ధిగా అమలు చేస్తోందని వివరించారు. ఉపాధి హక్కుపై దెబ్బ: ప్రియాంక మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ముసాయిదా బిల్లు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిరుపేదలకు ఏడాదికి 100 రోజులపాటు పని దొరుకుతోందని అన్నారు. మోదీ ప్రభుత్వం పేదల ఉపాధి హక్కును దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ చట్టం అమలుకు కేంద్రం 90 శాతం నిధులు ఇస్తోందని, ప్రస్తుతం దీన్ని 60 శాతానికి కుదిస్తున్నారని తప్పుపట్టారు. దీనివల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. పథకం నుంచి గాం«దీజీ పేరు తొలగించడం అన్యాయమని అన్నారు. జాతిపితను అపహాస్యం చేస్తున్నారు: బాలు గాం«దీజీ గ్రామాల్లో నివసించారని, పేదల సంక్షేమం కోసం పనిచేశారని డీఎంకే సభ్యుడు టి.ఆర్.బాలు చెప్పారు. పేదలకు ఉపాధి కల్పించడానికి మన్మోహన్సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని నీరుగార్చవద్దని కేంద్రాన్ని కోరారు. జాతిపితను మోదీ ప్రభు త్వం అపహాస్యం చేస్తోందని విమర్శించారు. వీబీ–జీ రామ్ జీ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. గాందీజీ ఫొటోలను ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం ఆందోళనకు దిగారు. గాంధీజీకి జరిగిన అవమానాన్ని దేశం సహించబోదంటూ నినదించారు. రాముడి పేరును బద్నాం చేయొద్దు: థరూర్ వీబీ–జీ రామ్ జీ బిల్లును లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యతిరేకించారు. 1971 నాటి బాలీవుడ్ పాటను ప్రస్తావించారు. ‘ఈ పని చేయొద్దు, రాముడి పేరును బద్నాం చేయొద్దు’ అని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. పేదలకు అండగా నిలస్తున్న పథకాన్ని బలహీనపర్చొద్దని తేల్చిచెప్పారు. అనుమానాలు వద్దు: కేంద్రం బిల్లుపై అనుమానాలు అవసరం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధన దిశగా గ్రామీణ పేదల ఉపాధికి హామీ ఇస్తూ చట్టం తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇది ఆధునిక చట్టబద్ధమైన ఏర్పాటు అని పేర్కొంది. పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం దీని ఉద్దేశమని వివరించింది. విప్ జారీ చేసిన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తమ లోక్‌సభ సభ్యులకు మంగళవారం విప్ జారీ చేసింది. రాబోయే మూడు రోజులపాటు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని ఆదేశించింది. వీబీ–జీ రామ్ జీ సహా కీలకమైన బిల్లులపై చర్చ, ఓటింగ్ జరిగే అవకాశం ఉందని పేర్కొంది. బిల్లులపై జరిగే చర్చల్లో పాల్గొనాలని, ప్రజల గొంతుకను వినిపించాలని సూచించింది. గాందీజీ ఆదర్శాలకు అవమానంమహాత్మా గాంధీ ఆదర్శాలను ప్రభుత్వం అవ మానిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. కేంద్రం తెచ్చిన బిల్లును తప్పుపడుతూ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. గ్రామీణ పేదల జీవనోపాధిని దెబ్బకొట్టాలన్నదే మోదీ ప్రభుత్వ అసలు ఉద్దేశమని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, యువత భవిష్యత్తు నాశనమవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలువీబీ–జీ రామ్ జీ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఈ మేరకు అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులకు లేఖ రాశారు. మహాత్మాగాంధీ చిత్రపటాలు చేతబూని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. -
లోక్‌సభలో వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకల సమావేశాల్లో భాగంగా ఈరోజు(సోమవారం, డిసంబర్ 15వ తేదీ) లోక్‌సభలో కేంద్రం రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు, మరొకటి ది రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లు. ఈ రెండు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లును జేపీసీ(జాయింట్ పార్లమెంటరీ కమిటీ) పంపే అవకాశం ఉంది. వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు అంటే..ఉన్నత విద్య నియంత్రణను పూర్తిగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది.యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈ వంటి సంస్థలను రద్దు చేసి వాటి స్థానంలో ఒకే గొడుగు కింద వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ (VBSA) అనే కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.12 మంది సభ్యులతో కూడిన వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ అనే అత్యున్నత కమిషన్ ఏర్పాటుచేసి, ఉన్నత విద్యా విధానాలు, ప్రమాణాలు, నాణ్యత నియంత్రణను ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది. దీని ద్వారా కేంద్రానకి అధిక అధికారాలుంటాయి. దీని ఫలితంగా ఉన్నత విద్య నియమ నిబంధనలు అనేవి కేంద్రం నియంత్రణలోకి వస్తాయి. ముందుగా ప్రతిపాదించిన భారత ఉన్నత విద్యా కమిషన్( Higher Education Commission of India బిల్లును ఇప్పుడు వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లుగా మార్చారు.ప్రయోజనాలుసమగ్ర నియంత్రణగా అమలు చేయడానికి వీలవుతుంది. అన్ని ఉన్నత విద్యా సంస్థలకు ఒకే విధమైన ప్రమాణాలు.విభిన్న సంస్థల మధ్య గందరగోళం తగ్గుతుంది.ఒకే కమిషన్ ద్వారా విద్యా ప్రమాణాలు కఠినంగా అమలు చేయవచ్చు.ది రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లుపాత చట్టాలను రద్దు చేయడం లేదా వాటిలో మార్పులు చేయడం కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లు. ఇది కొత్త చట్టాలను తీసుకురావడానికి లేదా పాత చట్టాల్లోని అనవసరమైన, పాతబడ్డ నిబంధనలను తొలగించడానికి ఉపయోగిస్తారుఇప్పటికే ఉన్న చట్టాల్లో మార్పులు చేయడం. ఉదాహరణకు, ఒక చట్టంలోని సెక్షన్లో పదాలను మార్చడం, కొత్త నిబంధనలను చేర్చడం, లేదా పాత నిబంధనలను సవరించడం జరుగుతంది. దీని ద్వారా చట్ట వ్యవస్థను సులభతరం చేయడం జరుగుతుంది. రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చమరొకవైపు రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ జరుగుతుంది. ఈ చర్చల్లో వైఎస్సార్సీపీ తరుఫున ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఏపీ ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ అక్రమాలకు బాధ్యులెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లలో అనేక తేడాలున్నాయన్నారు. సీసీటీవీ ఫుటేజ అందుబాటులో ఉంచాలన్నారు. ఈవీఎంలను నమ్మలేని పరిస్థితి వచ్చిందని, పేపర్ బ్యాలెట్‌పై అందరికీ నమ్మకం ఉందన్నారు వైవీ సుబ్బారెడ్డి. -
పార్లమెంట్ ప్రాంగణంలో ఈ–సిగరెట్.. ఆ ఎంపీపై చర్యలు తీసుకోవాల్సిందే
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ ఈ–సిగరెట్ తాగుతూ దొరికిపోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సౌగతా రాయ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా సదరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సౌగతా రాయ్ గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో నిషేధిత ఈ–సిగరెట్ తాగుతూ కనిపించారు. అనురాగ్ ఠాకూర్ ఈ అంశాన్ని ఆదేరోజు లోక్‌సభలో ప్రస్తావించారు. పవిత్రమైన పార్లమెంట్లో సిగరెట్ తాగడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. సౌగతా రాయ్‌పై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. దాంతో అనురాగ్ ఠాకూర్ శుక్రవారం లిఖిపూర్వక ఫిర్యాదు అందించారు. నిషేధిత సిగరెట్ తాగడం చట్టప్రకారం తీవ్రమైన నేరమని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్లమెంట్ గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీపై మండిపడ్డారు. యువతకు ప్రమాదకరమైన సందేశం ఇచ్చారని ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, నిందితుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఈ–సిగరెట్లను ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే నిషేధించింది. ఇదిలా ఉండగా, ఈ–సిగరెట్ తాగడం చిన్న విషయమని, దీనిపై రాద్ధాంతం అవసరం లేదని సౌగతా రాయ్ ఇప్పటికే తేల్చిచెప్పారు. మరోవైపు అనురాగ్ ఠాకూర్ తీరును తృణమూల్ కాంగ్రెస్ మరో ఎంపీ కీర్తి ఆజాద్ తప్పుపట్టారు. లిఖితపూర్వక ఫిర్యాదులో సౌగతా రాయ్ పేరు ఎందుకు ప్రస్తావించలేదని కీర్తి ఆజాద్ ప్రశ్నించారు. -
పరస్పర ఆరోపణలు పక్కనపెట్టి కాలుష్యంపై చర్చిద్దాం
న్యూఢిల్లీ: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికార, విపక్షాలు కలిసికట్టుగా కృషి చేయాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విన్నవించారు. పరస్పరం ఆరోపణలు చేసుకోవడం పక్కనపెట్టి.. వాయు కాలుష్యంపై అధికార, విపక్ష సభ్యులు కలిసి సభలో సమగ్ర చర్చ జరపాలని కోరారు. ప్రజల ఇక్కట్లు తీర్చడానికి ఇరుపక్షాలు కలిసి పని చేస్తాయన్న సందేశాన్ని ఇద్దామన్నారు. దేశవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న కాలుష్యంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధాన నగరాల్లో ప్రజలు విష వాయువు దుప్పటి కింద నివసిస్తున్నారని చెప్పారు. లక్షలాది మంది చిన్నారులు ఉపిరితిత్తుల జబ్బుల బారిన పడుతున్నారని, వారి భవిష్యత్తు దెబ్బతింటోందని అన్నారు. ప్రజలు క్యాన్సర్ పీడితులుగా మారుతున్నారని, వృద్ధులు శ్వాస సంబంధిత వ్యాధులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలుష్య సమస్యపై లోక్‌సభలో చర్చ చేపట్టాలని కోరారు. శుక్రవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిన కాలుష్యం రాజకీయ సిద్ధాంతపరమైన అంశం కాదని అన్నారు. ఈ సమస్యకు తక్షణమే పరిష్కార మార్గం కనిపెట్టాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు. చర్చకు సిద్ధం: కిరణ్ రిజిజు రాహుల్ విజ్ఞప్తిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సానుకూలంగా స్పందించారు. కాలుష్యంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. దీనిపై లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమయం కేటాయిస్తుందన్నారు. -
లోక్ సభలో E-సిగిరెట్ కలకలం
-
అమిత్ షా, రాహుల్ మాటల యుద్ధం
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, అమిత్ షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఓట్ల చోరీపై తనతో చర్చకు సిద్ధమా? అని రాహుల్ సవాలు విసిరారు. ఎన్నికల సంఘం అండతోనే బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తోందని మంపడ్డారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల కమిషనర్లకు పూర్తి స్వేచ్ఛ, అధికారాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, దీని వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. హరియాణాలో ఓట్ల చోరీ జరగలేదంటూ అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. అక్కడ ఓట్ల చోరీకి ఆధారాలున్నాయని చెప్పారు. అమిత్ షా స్పందిస్తూ ప్రతిపక్ష నాయకుడు చెప్పినట్లు తాను నడుచుకోవాలా? అని నిలదీశారు. విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపారు. అమిత్ షా భయపడుతున్నారని, ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్లిపోయారని రాహుల్ ఎద్దేవా చేశారు. నా ప్రశ్నకు సమాధానమేది?ఓట్ల చోరీ అనేది అతిపెద్ద దేశద్రోహమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభలో తాము అడిగిన ప్రశ్నలకు అమిత్ షా సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. రాహుల్ బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత, ఓట్ల చోరీ, ఈవీంఎల పనితీరు గురించి తాము ప్రశి్నస్తే అమిత్ షా ఒక్కమాట కూడా మట్లాడలేదని అన్నారు. ఓట్ల చోరీపై ఇప్పటికే ఆధారాలు చూపించానని గుర్తుచేశారు. కానీ, అమిత్ షా దానిపై స్పందించలేదని రాహుల్ ఆక్షేపించారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేర్వేరు రాష్ట్రాల్లో ఓట్లు వేస్తున్నారని, దీనిపై అమిత్ షా ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలని నిలదీశారు. ‘సర్’ను గబ్బర్‌సింగ్‌లా మార్చారు ‘‘గౌరవప్రదమైన ‘సర్’ పదాన్ని గబ్బర్‌సింగ్‌లా భయంకరమైన అంశంగా మార్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరిట ప్రజలను వేధిస్తున్నారు. సర్ సర్ అంటూ బీజేపీ ఎంతగా గొంతు చించుకున్నా బెంగాల్ ప్రజలు మాత్రం మేడమ్‌కు(మమతా బెనర్జీ) అండగా నిలుస్తారు. బీజేపీ నేతలు బెంగాల్లో కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజలకు కనిపిస్తుంటారు. ఎన్నికల్లో ఓడిపోయి ఇంటికి తిరిగివెళ్లారు. బీజేపీ బిహార్‌లో గెలిచిందేమో గానీ బిహార్‌లో వారి ఆటలు సాగవు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎందుకు చేపట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ – శతాబ్ది రాయ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బ్యాలెట్ పేపర్ల విధానం కావాలి ‘‘ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానం తీసుకురావాలి. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేస్తోంది. చాలా ఏళ్లుగా బీజేపీకి సహకరిస్తోంది. ఎన్నికల సంఘానికి కలి్పంచిన కొన్ని చట్టపరమైన వెసులుబాట్లను తొలగించాలి. ప్రధాని ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల ఎంపికకు సంబంధించిన ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలి’’ – డింపుల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఎస్ఐఆర్ అంటే బ్యాక్‌డోర్ ఎన్ఆర్సీ ‘‘పౌరుల జాతీయ రిజిస్టర్(ఎన్ఆర్సీ)కి మరో రూపమే ఎస్ఐఆర్. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసుగులో దొడ్డిదారిన ఎన్ఆర్సీని అమలు చేస్తున్నారు. మతం ఆధారంగా ఓటు హక్కును తొలగించడానికి ద్రోహపూరితమైన ప్రక్రియ జరుగుతోంది. ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చాలి. ఎస్ఐఆర్ చేపట్టడం పార్లమెంటరీ వ్యవస్థను ఉల్లంఘించడమే అవుతుంది. పౌరులకు పార్లమెంట్ ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు కూడా ఈ ప్రక్రియ విరుద్ధమే’’ – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ప్రజల హృదయాలను మోదీ హ్యాక్ చేశారు ఎన్నికల్లో నెగ్గడానికి ఈవీఎంలను హ్యాక్ చేయాల్సిన అసవరం ప్రధాని మోదీకి ఎంతమాత్రం లేదు. ఎందుకంటే ఆయన ప్రజల హృదయాలను హ్యాక్ చేశారు. వారి మనసులు గెల్చుకున్నారు. ప్రజల అండతో ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగకుండా ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టిస్తున్నారు’’ – కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ మళ్లీ బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్ కావాలా? ‘‘ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల విధానం మళ్లీ ప్రవేశపెడితే అప్పటి అరాచకాలు పునరావృతం అవుతాయి. బూత్ ఆక్రమణ, రిగ్గింగ్ మళ్లీ జరుగుతుంది. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ల వాడకాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు సమరి్థంచాయి. ఈవీఎంలకు అనుకూలంగా ఎన్నో తీర్పులిచ్చాయి. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదు. ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేస్తే ఎవరూ ముందుకు రాలేదు. ఈవీఎంలను అనుమానాలను ఇకనైనా మానుకోవాలి. ఈవీఎంలతో ఎన్నికలు వేగంగా, సురక్షితంగా జరుగుతాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. కానీ, ఎన్నికలు ముసిగిన తర్వాత ఓట్ల చోరీ అంశంపై ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. నిజంగా ఓట్ల చోరీ జరిగిందని రుజువులుంటే ఎందుకు ఫిర్యాదు చేయలేదో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఎన్నికలు స్వచ్ఛంగా, పారదర్శకంగా జరగడానికి ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది. ఎన్నికల వరుస పరాజయాలను జీరి్ణంచుకోలేక ఎన్నికల సంఘంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ మరో 15–20 ఏళ్లపాటు అధికారంలో కొనసాగడం తథ్యం’’ – రవి శంకర్ ప్రసాద్, బీజేపీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి -
చొరబాటుదారుల ఓట్ల కోసమే!
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోంశాఖ అమిత్ షా కొట్టిపారేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగితే.. తప్పుడు మార్గాల్లో ఎన్నికల్లో నెగ్గే అవకాశం పోతుందని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ వరుస ఓటములకు ఆ పార్టీ నాయకత్వమే తప్ప ఈవీంఎలు లేదా ఓట్ల చోరీ కారణం కాదని తేల్చిచెప్పారు. దేశంలో ఎన్నికల సంస్కరణలపై బుధవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం అక్రమ వలసదారులను ఓటర్ల జాబితాలో కొనసాగించడానికే ఎస్ఐఆర్ను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఎంతగా వ్యతిరేకించినా, సభ నుంచి ప్రతిపక్షాలు ఎన్నిసార్లు వాకౌట్ చేసినా సరే చొరబాటుదారులను గుర్తించడం, వారి ఓట్లను తొలగించడం, వారిని బయటకు పంపించడం తథ్యమని తేల్చిచెప్పారు. అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించినవారికి ఓటు హక్కు ఇవ్వాలనడం న్యా యమేనా? అని ప్రశ్నించారు. చొరబాటుదారులను అధికారికంగా గుర్తించి, ఎన్నికల జాబితాలో చేర్చాలంటూ నిస్సిగ్గుగా వాదిస్తున్నాయంటూ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడుసార్లు ఓట్ల చోరీ జరిగింది ‘‘దేశంలో మూడుసార్లు ఓట్ల చోరీ జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ ఓట్ల చోరీకి పాల్పడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాలని కోరుతూ 28 మంది ఆయనకు మద్దతిచ్చారు. నెహ్రూకు కేవలం ఇద్దరే మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ ఓట్ల చోరీతో నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరా గాంధీ ఎన్నికను న్యాయస్థానం కొట్టివేసింది. అయినా సరే ఆమె ప్రధానమంత్రి అయ్యారంటే కారణం ఓట్ల చోరీ. ఇక సోనియా గాంధీ ఈ దేశ పౌరురాలు కాకముందే ఎన్నికల్లో ఓటు వేశారు. అలా చేయడం ఓటు చోరీ కాదా? విపక్ష నాయకులు కేసుల్లో ఓడిపోతే న్యాయమూర్తిని నిందిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలపై నిందలేస్తున్నారు. ఆ నిందలను జనం పట్టించుకోకపోతే ఓట్ల చోరీ జరిగిందంటున్నారు. బిహార్‌లో కాంగ్రెస్ పరాజయానికి ముమ్మాటికీ ఆ పార్టీ నాయకత్వమే కారణం. ఈవీఎంలు లేదా ఓట్ల చోరీ కారణం అనడం ఉత్తమాట. కాంగ్రెస్ పెద్దలు ఏదో ఒకరు ఆ పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పక తప్పదు. ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి మృతి చెందినవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, 18 ఏళ్ల వయసున్నవారిని చేర్చడం, విదేశీయులను తొలగించడం ఎస్ఐఆర్ అసలు ఉద్దేశం. ఈ ప్రక్రియను వ్యతిరేకించడం ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయొచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. నిజానికి మన దేశ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి. ఓట్ల చోరీ ఓట్ల చోరీ అంటూ కేకలు పెట్టారు. చొరబాటుదారులను కాపాడాలంటూ యాత్రలు చేశారు. చివరికి బిహార్ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో మేమే గెలిచాం. ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల సంఘాన్ని, ఓటర్ల జాబితాను తప్పుపట్టడం, ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగితే ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఎందుకు పోటీచేశాయి? దేశంలో ఇప్పటిదాకా ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సందర్భాల కంటే ఓడిపోయిన సందర్భాలే ఎక్కువ. అయినా సరే ఏనాడూ ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టలేదు. ఈవీఎంలతో ఎన్నికల చోరీని అడ్డుకోవచ్చు. తప్పుడు పనులు చేయడం సాధ్యం కాదు. అందుకే విపక్షాలు ఈవీఎంలు వద్దంటున్నాయి. వారి బండారం పూర్తిగా బయటపడింది. దేశ ప్రజలు ప్రతిపక్షాలకు ఓట్లు వేయడం లేదు. ఎస్ఐఆర్తో చొరబాటుదారుల ఓట్లు కూడా రద్దయితే ఇక పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. 2004, 2009లో ఈవీఎంలతో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా! 2014లో ఓడిపోయిన తర్వాతే ఈవీఎంలపై ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చించకుండా మేము పారిపోవడం లేదు. ఎస్ఐఆర్ అంశం ఇప్పుడు ఎన్నికల సంఘం పరిధిలో ఉంది. అందుకే సభలో చర్చించలేం. ఎన్నికల సంస్కరణలపై చర్చించాలని కోరితే వెంటనే అంగీకరించాం. ఎస్ఐఆర్పై ఏకపక్షంగా అసత్య ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం ఇకనైనా మానుకోవాలి’’ అని అమిత్ షా తేల్చిచెప్పారు. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. కాంగ్రెస్ హయాంలోనే ఎస్ఐఆర్ ప్రారంభం ఎస్ఐఆర్ గురించి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయి. చొరబాటుదారులు మన ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను ఎన్నుకొనే పరిస్థితి ఉంటే దేశ ప్రజాస్వామ్యం భద్రంగా ఉంటుందా? ఈ విషయం అందరూ ఆలోచించాలి. చరిత్ర గురించి మేము మాట్లాడడం ప్రతిపక్షాలకు నచ్చడం లేదు. చరిత్ర తెలుసుకోకుండా సమాజం గానీ, దేశం గానీ ఎలా ముందుకెళ్తాయి. దేశంలో మొట్టమొదటి ఎస్ఐఆర్ను 1952లో నిర్వహించారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు. రెండోసారి 1957లో నెహ్రూ హయాంలో, మూడోసారి 1961లో నెహ్రూ హయాంలోనే ఎస్ఐఆర్ నిర్వహించారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో, ఇందిరా గాంధీ హయాంలో, రాజీవ్ గాంధీ హయాంలో, పీవీ నరసింహారావు హయాంలో కూడా ఎస్ఐఆర్ చేపట్టారు. అనంతరం అటల్ బిహారీ వాజ్‌పేయి పాలనలో, మన్మోహన్ సింగ్ పాలనలోనూ ఎస్ఐఆర్ జరిగింది. అప్పట్లో ఎస్ఐఆర్ను ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. ఎన్నికలు స్వచ్ఛంగా జరగాలంటే, ప్రజాస్వామ్యం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఎస్ఐఆర్ అవసరం కాబట్టి వ్యతిరేకించలేదు. -
ఈ ఏడాదే 1.40 లక్షల రేషన్‌కార్డుల రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో 2025లో అక్టోబర్ నెల వరకు కేవలం పది నెలల కాలంలోనే ఏకంగా 1,40,947 రేషన్ కార్డులను రద్దు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ వేదికగా వెల్లడించింది. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సహా ఇతర ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా బుధవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2020లో 12,154, 2022లో 4,988, 2023లో 34,064, 2024లో 3,424, 2025లో (అక్టోబర్ వరకు) 1,40,9473 రేషన్ కార్డులను రద్దు చేసినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 56,60,367 రేషన్ కార్డులు అమలులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. నకిలీ కార్డుల ఏరివేత, అనర్హుల గుర్తింపు, కుటుంబ సభ్యుల మరణాలు, శాశ్వత వలసలు వంటి కారణాలతోనే ఈ కార్డులను రద్దు చేసినట్టు రాష్ట్రాలు నివేదించాయని కేంద్రం తెలిపింది. కేవలం ఈ–కేవైసీ లేదా ఆధార్ ధ్రువీకరణ పూర్తి కాలేదన్న ఏకైక కారణంతో ఏ ఒక్క రేషన్‌కార్డునూ రద్దు చేయలేదని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. అంగన్వాడీల్లో ఖాళీల మోతతెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత గత మూడేళ్లలో రెట్టింపు అయ్యిందని రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ సురేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ఇచ్చిన సమాధానంలో తెలిపారు. కేంద్రం ప్రవేశ పెట్టిన ‘పోషణ్ ట్రాకర్’గణాంకాల ప్రకారం తెలంగాణలో అక్టోబర్ 2022 నాటికి 1,344 ఖాళీలు, అక్టోబర్ 2023 నాటికి 1,317 ఖాళీలు, అక్టోబర్ 2024 నాటికి 2,056 ఖాళీలు, అక్టోబర్ 2025 నాటికి 2,757 ఖాళీలు ఉన్నాయి. 2023 అక్టోబర్ నాటికి 1,317గా ఉన్న ఖాళీలు, 2025 అక్టోబర్ నాటికి ఏకంగా 2,757కు చేరాయి. ‘మిషన్ సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0’పథకం అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని, ఖాళీల భర్తీ విషయమై రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు.మైనారిటీల సంక్షేమంపై నాలుగేళ్లుగా ఒక్క ప్రతిపాదన కూడా రాలేదు తెలంగాణలో మైనారిటీ సంక్షేమ పథకాల అమలులో భాగంగా మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం’కింద 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు ప్రతిపాదన కూడా పంపలేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో స్పష్టం చేశారు. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మైనా రిటీ విద్యార్థులకు ఆసరాగా నిలిచే ప్రీ–మెట్రిక్, పోస్ట్– మెట్రిక్, మెరిట్–కమ్–మీన్స్ స్కాలర్‌షిప్‌ల అమలుకు 2021–22 తర్వాత అనుమతి ఇవ్వలేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఎన్ఎండీఎఫ్సీ ద్వారా కెనరా బ్యాంక్ సహకారంతో ఇస్తున్న రుణాల సంఖ్య దారుణంగా పడిపోయిందని.. 2022–23లో 669 మందికి రూ. 6.08 కోట్ల రుణాలు ఇవ్వగా.. 2024–25 నాటికి లబ్ధిదారుల సంఖ్య కేవలం 8 మందికి (రూ. 4 లక్షలు) పడిపోయిందన్నారు. పోలీసులకు కేంద్రం మొండిచేయినార్కోటిక్స్, సైబర్ బ్యూరోలకు నిధులు ఇవ్వలేంతెలంగాణలో మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాలకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలను బలోపేతం చేసేందుకు నిధులు కావాలన్న రాష్ట్ర అభ్యర్థనను కేంద్రం తోసిపుచ్చింది. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘పోలీసుల ఆధునీకరణ పథకం’కింద 2024–25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ పరిమితికి మించి ఈ అభ్యర్థన ఉందని, అందుకే దీనిని పరిగణనలోకి తీసుకోలేమని మంత్రి స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం వల్లే 17 రైల్వే పనుల్లో జాప్యం తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి భూసేకరణ జాప్యం వల్లే రైల్వే ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్రం తేల్చిచెప్పింది. తెలంగాణకు మొత్తం 63 ఆర్వోబీ పనులు మంజూరు కాగా, అందులో 17 పనులు రాష్ట్ర ప్రభుత్వం కారణంగానే ఆలస్యమవుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ స్పష్టం చేశారు. లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ వంశీకష్ణ గడ్డం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఇందులో 16 చోట్ల భూసేకరణ సమస్యలు ఉండగా, ఒకచోట అలైన్మెంట్ ఖరారు కావాల్సి ఉందన్నారు. భూసేకరణ, ఆక్రమణల తొలగింపు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉంటేనే పనులు వేగవంతం అవుతాయని మంత్రి పేర్కొన్నారు. -
లాగ్ ఔట్ అంటే 'లాగ్ ఔటే'!
రిమోట్, హైబ్రీడ్ వర్క్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్.. విధానం ఏదైనా ఈ డిజిటల్ యుగంలో ఒకవైపు పనిభారం మరోవైపు కెరీర్లో పరుగు. వెరసి ఉద్యోగులు విశ్రాంతి కరువై అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. తీవ్ర పని ఒత్తిడితో కొందరు ‘కఠిన నిర్ణయాలూ’ తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ కల్చర్ వచ్చాక ఉద్యోగుల పనితీరు మారింది. గంటలకొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చోవడం ఉద్యోగుల వంతు అవుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే.. పని గంటలు ముగిశాక కూడా ఆఫీస్ నుంచి ఫోన్, వీడియో కాల్స్, మెయిల్స్, సందేశాలకు స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ స్పందించకపోతే ఎక్కడ వేటుపడుతుందోనన్న ఆందోళన ఉద్యోగులను వెంటాడుతోంది. దీనికితోడు వారానికి 90 గంటల పని ఉండాలంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ ఈ ఏడాది ప్రారంభంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఓలా భవీశ్ అగర్వాల్ సైతం ఇదే రీతిన స్పందించడంతో పని గంటల విషయంలో భారత్‌లో కార్పొరేట్ కంపెనీల వర్క్‌ప్లేస్ కల్చర్‌కు వారి వ్యాఖ్యలు ప్రతిబింబం అంటూ పెద్ద దుమారమే రేగింది. వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌పై తీవ్ర చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ‘రైట్ టు డిస్కనెక్ట్’ బిల్లు తెరపైకి వచ్చింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే ఇటీవల లోక్‌సభలో రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు–2025ను ప్రవేశపెట్టారు. అధికారిక పని గంటలు ముగిశాక.. సెలవు దినాల్లో పని సంబంధిత కాల్స్, సందేశాలు, ఈ–మెయిల్స్, వీడియో కాల్స్‌ను ఉద్యోగులు తిరస్కరించేలా చట్టపరమైన హక్కును కల్పించాలని కోరుతూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. – సాక్షి, స్పెషల్ డెస్క్నిరంతరం అందుబాటులో..నేటి డిజిటల్ ప్రపంచంలో అధిక పని కారణంగా తీవ్ర మానసిక, భావోద్వేగ, శారీరక ఒత్తి డిని తగ్గించడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్యకరమైన పని–జీవిత సమతౌల్యతను ప్రోత్సహించడం ‘రైట్ టు డిస్కనెక్ట్’ లక్ష్యమని సుప్రియా సూలే చెప్పారు. ‘ఆధునిక వర్క్ కల్చర్‌లో ఉద్యో గులు నిరంతరం అందుబాటులో ఉండటం సర్వసాధార ణమైంది. స్పందించేందుకు డిజి టల్ సాధ నాలు సౌలభ్యంగానే ఉన్నప్పటికీ కార్మికులు రేయింబవళ్లు ఈ–మెయిల్స్‌ను తనిఖీ చేయ డానికి, సందేశాలకు ప్రతిస్పందించడానికి ఒత్తిడిని అనుభవిస్తున్న సంస్కృతిని కూడా ఈ సాధనాలు సృష్టించాయి’ అని సభ దృష్టికి తీసుకెళ్లారు. పని గంటలకు మించి డిజిటలై జేషన్ ద్వారా విధులు నిర్వర్తించినప్పటికీ అదనపు చెల్లింపులు చేయకుండా కంపెనీలు సాగిస్తున్న కార్యకలాపాలను అడ్డుకోవడం కూడా ఈ బిల్లు ఉద్దేశమని ఆమె వివరించారు.అమలుపైనే ఆధారం..కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బందిలో రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇది కార్యరూపంలోకి వస్తే వర్క్‌ప్లేస్ కల్చర్ మారడం ఖాయమని వారు భావిస్తున్నారు. ఈ బిల్లు ఉద్యోగుల వ్యక్తిగత సమయాన్ని కాపాడటం, శ్రేయస్సును ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ బిల్లు ఉద్దేశం నిజంగా నెరవేరడంపై సందేహం తలెత్తుతోంది. బిల్లు చట్టంగా మారి ఉద్యోగులకు బలమైన రక్షణ కల్పించినా దీర్ఘకాలంగా పాతుకుపోయిన పని సంస్కృతి నిబంధనలను మార్చడానికి ఇది ఒక్కటే సరిపోకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ‘డిస్కనెక్ట్ బిల్లు కాగితంపై చాలా బాగుంది. కానీ సంస్థలు అమలు చేసే పని విధానంపై నిజమైన మార్పు ఆధారపడి ఉంటుంది. అవాస్తవిక పనిభారం, సరిహద్దులు లేకపోవడం, పేలవమైన సమయ నిర్వహణ పద్ధతుల వంటి సమస్యలను కంపెనీలు పరిష్కరించకపోతే లొసుగులు రాజ్యమేలతాయి’ అని ఓ సైకాలజిస్ట్ వ్యాఖ్యానించారు. మూలాన్ని మార్చడం ద్వారా..రైట్ టు డిస్కనెక్ట్తో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. పనివేళల్లో ఉత్సాహంగా ఉండటానికి కష్టపడటం, కఠినమైన గడువులను జయించడానికి ఒత్తిడిని ఎదుర్కోవడం లేదా సిబ్బంది కొరత వంటివి ఉద్యోగులు తరచూ ఎదుర్కొనే సవాళ్లను ఈ బిల్లు పరిష్కరించదని నిపుణులు చెబుతున్నారు. ‘చట్టపరమైన నిబంధనలు మాత్రమే కార్యాలయాల్లో పని సంస్కృతిని మార్చలేవు. సమస్య మూలానికి మందు వేయడం ద్వారా ఆరోగ్యకరమైన పని–జీవిత సమతౌల్యత సాధించవచ్చు. అనుకూలమైన, ఆచరణాత్మకమైన, రోజువారీ వాస్తవాలపై ఆధారపడిన వ్యవస్థలు ఉద్యోగులకు అవసరం’ అని వారు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలను అర్థవంతంగా రూపొందించడానికి ఉద్యోగులు, సంస్థలు కలిసి పనిచేయాలన్నది నిపుణుల భావన.బిల్లులో ఏముందంటే..» అధికారిక పని గంటల తరువాత, సెలవు రోజుల్లో ఆఫీస్ ఫోన్‌కాల్స్, వీడియోకాల్స్, మెయిల్స్, సందేశాలను ఉద్యోగులు తిరస్కరించవచ్చు. » స్పందించని సిబ్బందిపై కంపెనీ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు.» ఒకవేళ నిబంధనలను కంపెనీ ఉల్లంఘిస్తే.. మొత్తం ఉద్యోగుల వేతనంలో ఒక శాతానికి సమానమైన మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు.» సిబ్బంది హక్కుల పరిరక్షణకు ప్రత్యేక సంక్షేమ సంస్థ ఏర్పాటు.» అధికారిక సమయానికి మించి పనిచేసే ఉద్యోగులకు ప్రామాణిక వేతనాల ప్రకారం ఓవర్ టైం చెల్లింపుతో పరిహారం. » పనివేళల తరువాత ఉద్యోగులను సంప్రదించడానికి పరస్పరం అంగీకరించిన నిబంధనలను రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు. -
లోక్ సభలో అమిత్ షా స్పీచ్
-
బ్రెజిల్ మహిళ ఫొటోపై సమాధానం లేదు: రాహుల్
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఎనిమిదవ రోజున(బుధవారం) లోక్‌సభలో.. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ప్రారంభించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కసరత్తుపై లోక్‌సభ చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మనీష్ తివారీ ఈ చర్చను ప్రారంభించారు. ఆయన ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలను డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ చర్చను ముందుకు తీసుకెళుతూ.. ఎన్నికల కమిషన్.. ఎన్నికలను రూపొందించేందుకు పాలక భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో కుమ్మక్కవుతున్నదంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓటు చోరీని మించిన జాతి వ్యతిరేక చర్య మరొకటి లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారు. ఎలక్షన్ కమిషన్, సిబిఐ , ఈడి, ఐటి విభాగాలను బిజెపి కబ్జా చేసిందన్నారు. ఎన్నికల కమిషనర్ల సెలక్షన్ల కమిటీ నుంచి సిజెఐ ని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో సీసీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వడం లేదని చెబతూ, ఈవీఎం వెరిఫికేషన్ కు యాక్సెస్ ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల జాబితాలో 22 సార్లు బ్రెజిల్ మహిళ ఫోటో ఉందని, దీనిపై తన ప్రశ్నలకు ఎన్నికల సంఘం జవాబులు చెప్పడం లేదన్నారు. ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని, తాను అధికారంలోకి వస్తే అన్నింటిని చక్కదిద్దుతామని రాహుల్ పేర్కొన్నారు.కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ ఇండిగో వైఫల్యం వల్ల ఆర్థిక నష్టం అత్యంత భారంగా మారిందని అన్నారు. ఇప్పటివరకు మొత్తం ఆర్థిక నష్టం ఎంతో తెలియదు. ఎన్ని టిక్కెట్లు రద్దు చేశారో తెలుస్తోంది.ఈ విషయంలో ఇతర నష్టాల సంగతేంటి? హోటల్ బుకింగ్, ఈవెంట్లు రద్దు అయ్యాయి. వీటన్నింటినీ ఎవరు భరిస్తారు? ఈ భారీ వైఫల్యం కారణంగా ప్రయాణికులు ఎంత ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారో ప్రభుత్వానికి ఏమైనా అంచనా ఉందా?" అని కార్తీ చిదంబరం ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనను సమర్థించారు. పార్లమెంట్ సమావేశం జరుగుతోంది. అయినప్పటికీ కాలుష్యం గురించి లేదా ఎన్నికల సంస్కరణల గురించి ప్రధానమంత్రికి పెద్దగా పట్టింపు లేదు.వారు 150 ఏళ్ల నాటి వందేమాతరం గురించి మాట్లాడుతున్నారు, కానీ యువత నిరుద్యోగం గురించి ఎటువంటి ఆందోళన లేదు అని రంజీత్ రంజన్ ఎద్దేవా చేశారు. వారు ఎవరి సమస్యలను పరిష్కరిస్తున్నారు? రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్తున్నారు? అని అడుగుతున్నారు. 140 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసే అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందా?" అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో కూడా ఎన్నికల సంస్కరణలపై చర్చ చేపట్టనున్నారు. దీనికి ముందు వందేమాతరం 150వ వార్షికోత్సవంపై చర్చ కొనసాగింది. అంతకు ముందు రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వందేమాతరం 150వ వార్షికోత్సవంపై రాజ్యసభలో ప్రత్యేక చర్చను చేపట్టారు. వందేమాతరంపై విమర్శలు చేసేవారు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. -
బ్యాలెట్ పేపర్‌కు మళ్లుదాం: లోక్‌సభలో విపక్షాలు
న్యూఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో ఈవీఎంల వినియోగానికి స్వస్తిపలికి మళ్లీ బ్యాలెట్ పేపర్ విధానాన్ని పునరుద్ధరించాలని మంగళవారం ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో జరిగిన చర్చలో విపక్షాలు డిమాండ్‌చేశాయి. ఈ మేరకు పలు విపక్షపార్టీల ఎంపీలు మాట్లాడారు. ‘‘ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు చాంతాడంత క్యూ లైన్లలో నిల్చునే ప్రతి ఒక్క ఓటరులో తమ ఓటు సద్వినియోగం అవుతోందన్న భరోసాను కల్పించాలి. ఈవీఎంలతో మోసగిస్తున్నారని నేను చెప్పడంలేదు. కానీ ఈవీఎంలను దుర్వినియోగం చేయొచ్చు అనేది మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలను.ఈవీఎంలపై ఓటర్లలో గూడుకట్టుకుపోయిన అపోహలను తొలగించాలంటే రెండే మార్గాలున్నాయి. ఈవీఎం ఓట్లకు సరిసమానంగా వీవీప్యాట్ చిట్టీలను అన్నింటినీ లెక్కించాలి. లేదంటే ఈవీఎంలను పక్కనపడేసి మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానానికి వెళ్లాలి. పేపర్ బ్యాలెట్ విధానమే అత్యంత ఉత్తమం. ఎందుకంటే సాంకేతికంగా ఎంతో పురోగమించిన జపాన్, అమెరికా సైతం ఈవీఎంలాంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాలను పక్కనబెట్టేసి పేపర్బ్యాలెట్కు జై కొట్టాయి. ఎంతకాదన్నా ఈవీఎంలు అనేది మెషీన్లు. ఎలాంటి మెషీన్లో అయినా మార్పులు చేయొచ్చు’’ అని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ అన్నారు. ‘‘ పేపర్ బ్యాలెట్ పట్ల ఓటర్లలో ఎంతో విశ్వసనీయత, నమ్మకం ఉన్నాయి. బ్యాలెట్ విధానం మంచిది’’ అని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ‘‘మీట అయితే ఓటరు నొక్కుతున్నాడుగానీ తన ఓటు ఎటు పోతుందనేది ఇప్పటికీ అతనికి ఇక చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈవీఎంలో ఇదే స్పష్టత కరువైంది. ఓటరు మదిలో సూక్ష్మస్థాయి అనుమానం ఉన్నాసరే దానిని నివృత్తిచేయాల్సిందే. అనుమానాలతో ఎన్నికల క్రతువును కొనసాగించడం నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకోదు’’ అని శివసేన (యూబీటీ) నేత అనిల్ దేశాయ్ అన్నారు. సీపీఐ(ఎం) నేత ఆమ్రా రామ్, రాష్ట్రయ జనతాదళ్ ఎంపీ అభయ్ కుమార్ సిన్హా సైతం ఇదే వాదనకు తమ మద్దతు ప్రకటించారు. 2004 ఏడాది నుంచి ఐదు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించిన విషయం విదితమే. -
సాయంత్రం 6 దాటాక 51 లక్షల ఓట్లా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని, అప్పుడే గెలిచిన వారికైనా, ఓడిన వారికైనా వ్యవస్థపై నమ్మకం ఉంటుందని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో జరిగిన వింత పోకడలను ఎండగట్టారు. ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతికత కలిగిన దేశాలే ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలెట్ పేపర్వైపు వెళుతుంటే.. మనం ఇంకా ఈవీఎంలను పట్టుకుని వేళ్లాడటంలో అర్థం లేదని చెప్పారు. ఏపీ ఎన్నికల్లో పోలింగ్ సరళిపై మిథున్‌రెడ్డి తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3 కోట్ల 38 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఏకంగా 15 శాతం ఓట్లు.. అంటే సుమారు 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి. రాష్ట్ర చరిత్రలో 2014లోగానీ, 2019లోగానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ ఆకస్మిక పెరుగుదల ఎలా సాధ్యమైందో అర్థం కావడం లేదు. ఒడిశాలోనూ ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి’ అని ఆయన సభ దృష్టికి తెచ్చారు. చార్జింగ్ పెరగడం.. స్లిప్పులు తగులబెట్టడం..‘విజయనగరంలో కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ చార్జింగ్ 99 శాతంగా ఉంది. కానీ పోలింగ్ రోజున అది 60 శాతమే ఉంది. వాడకం తర్వాత బ్యాటరీ చార్జింగ్ తగ్గాలి. కానీ, ఎలా పెరుగుతుంది? అని మా మాజీ ఎంపీ ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ నుంచి స్పందన లేదు. స్ట్రాంగ్‌రూమ్ సీసీటీవీ ఫుటేజీ అడిగితే ఇవ్వలేదు. కనీసం వీవీపాట్ స్లిప్పులు లెక్కించమని అడిగితే.. వాటిని తగులబెట్టేశాం, ధ్వంసం చేశాం అని సమాధానం ఇచ్చారు. అనుమానం ఉన్న ఈవీఎంలను కాకుండా వేరేవాటిపై మాక్ పోలింగ్ నిర్వహించారు’ అని మిథున్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పోలింగ్ బూత్‌లో మరీ విడ్డూరం ‘హిందూపురం నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్‌లో మరీ విడ్డూరం జరిగింది. ఒకేరోజు, ఒకే సమయాన జరిగిన ఎన్నికల్లో.. ఒక బూత్‌లో మా ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు వచ్చాయి. కానీ అదే బూత్‌లో మా ఎమ్మెల్యే అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. అక్కడ మాకు ఐదుగురు ఏజెంట్లున్నారు. వాళ్ల కుటుంబసభ్యుల ఓట్లే 30 వరకు ఉంటాయి. గత 30 ఏళ్లుగా మేము గెలుస్తున్న బూత్ అది. ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు పడినచోట, ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక్క ఓటు పడటం ఈవీఎంల పనితీరుపై అనుమానాలకు తావిస్తోంది’ అని చెప్పారు. అమెరికానే బ్యాలెట్ వైపు వెళ్తోందిటెక్నాలజీలో ఎంతో ముందున్న ఎలాన్ మస్క్ వంటి వారే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెబుతున్నారని, అమెరికాలో 92 శాతం ఎన్నికలు బ్యాలెట్ పేపర్ మీదే జరుగుతున్నాయని మిథున్‌రెడ్డి చెప్పారు. నెదర్లాండ్స్, జర్మనీ, ఐర్లాండ్, ఫిన్లాండ్, బంగ్లాదేశ్ వంటి దేశాలన్నీ ఈవీఎంలను రద్దుచేసి బ్యాలెట్ పేపర్‌కు మళ్లాయని తెలిపారు. ‘నేను మూడుసార్లు ఎంపీగా గెలిచింది ఈవీఎంల మీదనే అయినా, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి తీసుకురావాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రతి పోలింగ్ బూత్‌లో వెబ్‌కాస్టింగ్ ఉండాలని, ఆ ఫుటేజీని అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలని మిథున్‌రెడ్డి సూచించారు.కేంద్రమంత్రి పెమ్మసానిపై మిథున్‌రెడ్డి సెటైర్లుఎస్ఐఆర్పై జరిగిన చర్చలో మిథున్‌రెడ్డి మాట్లాడుతుండగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అడ్డుపడ్డారు. దీంతో ‘ఉపాధిహామీ పథకం డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. రాష్ట్రంలోని కూలీల పరిస్థితులపై నీకు సరైన అవగాహన లేదు. బ్యాలెట్ పేపర్ విషయంపై మాట్లాడుతుండగా ఈ విషయంలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు’ అంటూ మిథున్‌రెడ్డి ప్రతిఘటించారు. ‘లేదు వచ్చాయి, అయ్యాయి’ అంటూ పెమ్మసాని ఏదో చెప్పబోతుండగా.. ‘ఎలా వచ్చాయి? బస్సులో వచ్చాయా?’ అంటూ మిథున్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉపాధిహామీ నిధులపై మిథున్‌రెడ్డి ప్రస్తావించిన సమయంలో కూటమి ఎంపీలు ఎవరూ నోరు మెదపకపోవడం, పెమ్మసానికి సపోర్ట్‌గా మాట్లాడకపోవడం గమనార్హం. -
పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగాలి: లోక్‌సభలో మిథున్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)ను విపక్షాలు వ్యతిరేకిస్తుండడంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నేడు ఈ అంశంపై చర్చ జరిగింది. అందరికీ సౌకర్యంగా ఉంటే.. ఎస్ఐఆర్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదని వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే.. ఈ చర్చలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై మాట్లాడారు. అందరికీ సౌకర్యంగా ఉంటే.. ఎస్ఐఆర్తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలి. వెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతం.... ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 6గం. తర్వాత అకస్మాత్తుగా ఓటింగ్ శాతం పెరిగింది. ఆ తర్వాతే సుమారు 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి. మేం ఇచ్చిన ఫిర్యాదుల పైన ఈసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. విజయనగరం పార్లమెంటులో కౌంటింగ్ సమయంలో 99 శాతం, పోలింగ్ సమయంలో 60 శాతం చార్జింగ్ ఉంది. ఈవీఎంలో చార్జింగ్ ఎలా పెరిగిందని అడిగితే సమాధానం లేదు. వీవీ ప్యాట్ స్లిప్పులు అడిగితే అప్పటికే తగలబెట్టామని చెప్పారు. వెరిఫికేషన్ కోసం ఈవీఎంలు అడిగితే వేరే వాటిని ఇచ్చారు.... ఈసీ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఫిర్యాదులు చేసిన ఉపయోగం ఉండడం లేదు. హిందూపురం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బూత్ లో మా పార్టీ కికు 472 ఓట్లు వస్తే.. అక్కడే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఎలన్ మస్క్ సహా అనేక మంది నిపుణులు అంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందుకే పేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలి. పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయి’’ అని మిథున్‌రెడ్డి అన్నారు. -
Manish Tewari: EVM సోర్స్ కోడ్ ఎవరి దగ్గర ఉంటుంది
-
జస్టిస్ స్వామినాథన్‌పై అభిశంసన నోటీసు
లోక్‌సభలో మంగళవారం కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌ను తొలగించాలంటూ ఇండియా బ్లాక్ ఎంపీలు అభిశంసన (impeachment) నోటీసులు సమర్పించారు. డీఎంకే ఎంపీ కనిమొళి ఆధ్వర్యంలోని ఎంపీల బృందం.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి నోటీసుల అందజేసింది. మధురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రాంగణంలో కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి ఇస్తూ తాజాగా జస్టిస్ జీఆర్ స్వామినాథన్ తీర్పు ఇచ్చారు. ఈ స్థలం సమీపంలో 14వ శతాబ్దపు దర్గా ఉండటంతో సామాజిక ఉద్రిక్తతలకు దారితీస్తుందనే అభ్యంతరాలు వెల్లవెత్తాయి. డీఎంకే.. దాని మిత్రపక్షాలు ఆయన తీర్పు పక్షపాతంగా ఉందని ఆరోపించాయి. గతంలో దీపం కొండ అడుగున ఉన్న స్తంభం వద్ద వెలిగించేవారు. కానీ, జస్టిస్ స్వామినాథన్ తీర్పు ప్రకారం దీపం కొండ మధ్యలో ఉన్న స్తంభం వద్ద వెలిగించాలి అని ఆదేశించారు. ఈ తీర్పు సెక్యులర్ విలువలకు విరుద్ధంగా ఉందంటూ మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ లోక్‌సభలో 120 ఎంపీల సంతకాలతో కూడిన అభిశంసన పిటిషన్ సమర్పించాయి. డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, ఎస్పీ అధినేత.. ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆ సమయంలో కనిమొళి వెంట ఉన్నారు. VIDEO | Delhi: DMK leader Kanimozhi submits an Impeachment Notice to Lok Sabha Speaker Om Birla, seeking the removal of Madras High Court Judge G R Swaminathan, after obtaining signatures from more than 120 MPs.Congress MP Priyanka Gandhi Vadra, Samajwadi Party chief Akhilesh… pic.twitter.com/yzn9gq2lio— Press Trust of India (@PTI_News) December 9, 2025 భారతదేశంలో న్యాయమూర్తులపై అభిశంసన చాలా అరుదుగా జరుగుతుంది. అయితే తాజా పరిణామాలతో తమిళనాడులో రాజకీయ-న్యాయపరమైన ఘర్షణ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో.. లోక్‌సభ స్పీకర్ నిర్ణయం కీలకంగా మారనుంది. ఆయన నోటీసును స్వీకరిస్తేనే ప్రక్రియ ముందుకు సాగుతుంది. నెక్ట్స్ ఏం జరగొచ్చు.. స్పీకర్ నోటీసును పరిశీలిస్తారు.. అవసరమైతే విచారణ కమిటీ ఏర్పాటు చేస్తారులోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ 2/3 మెజారిటీతో తీర్మానం ఆమోదం కావాలిచివరగా రాష్ట్రపతి ఆమోదిస్తేనే న్యాయమూర్తి పదవి నుంచి తొలగింపబడతారుజస్టిస్ స్వామినాథన్ నేపథ్యం.. జస్టిస్ జీఆర్ స్వామినాథన్ తమిళనాడు తంజావూర్ జిల్లా తిరువారుర్‌లో(1968లో) జన్మించారు. సేలం, చెన్నైలో న్యాయవిద్యను పూర్తి చేశారు. న్యాయవాదిగా దీర్ఘకాలం పనిచేసి, తర్వాత మద్రాస్ హైకోర్టులో మధురై బెంచ్‌కు అదనపు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా సేవలందించారు. అటుపై 2017లో హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తన పనితీరును ప్రజలకు తెలియజేయడానికి రిపోర్ట్ కార్డు విడుదల చేసిన మొదటి జడ్జి కూడా ఈయనే. గతంలో బీజేపీ అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా తిరుపరంకుండ్రం కార్తీక దీపం తీర్పు వల్ల రాజకీయ వివాదం చెలరేగింది. -
ఇండిగో సంక్షోభంపై లోక్‌సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
-
‘రూ.830 కోట్లు కేటాయించాం.. 1191 పోస్టులు ఖాళీ’
న్యూఢిల్లీ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో సిబ్బంది తక్కువగా ఉందనే విషయాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అంగీకరించారు. త్వరలోనే వీటిని పూర్తి చేసి ‘సాయ్’ను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. గత ఆగస్టులో క్రీడలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ‘సాయ్’ (SAI)లో నిధుల కొరత ఉందని, తగినంత సిబ్బంది కూడా లేదని తమ నివేదికలో వెల్లడించింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ లోక్‌సభలో ఎంపీ ఆడూర్ ప్రకాశ్ అడిగిన ప్రశ్నపై మాండవీయ స్పందించారు. ‘ప్రభుత్వం ఈ నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకుంది. స్పోర్ట్స్ అథారిటీలో మొత్తం 1191 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కొన్నింటికి సంబంధించిన నియామక ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. బడ్జెట్లో ‘సాయ్’కు రూ.830 కోట్లు కేటాయించాం. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో మా వద్దకు వచ్చిన ప్రతిపాదనలను బట్టి ఈ నిధులు ఇస్తాం. అయితే ఏడాది మధ్యలో కూడా అవసరమైతే తగిన పరిశీలన అనంతరం అదనపు నిధులు కూడా ఇస్తాం’ అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి గణాంకాలు తాము నమోదు చేయడం లేదని... అయితే పోటీలు, శిక్షణ సమయంలో వారికి సరైన, సురక్షిత వాతావరణం కల్పించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని కూడా మాండవీయ పేర్కొన్నారు. చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
నేడు ఎస్ఐఆర్పై చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే, ఎన్నికలపై సంస్కరణలపై మంగళవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు చర్చను లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. ఈ అంశంపై లోక్‌సభలో మొత్తంగా పది గంటల సమయం కేటాయించారు. కాంగ్రెస్ తరఫున కేసీ వేణుగోపాల్, మనీష్ తివారీ, వర్ష గైక్వాడ్, మొహమ్మద్ జావైద్, ఉజ్వల్ రామన్ సింగ్, ఇషా ఖాన్ చౌదరి, మల్లు రవి, ఇమ్రాన్ మసూద్‌లు మాట్లాడతారు. తర్వాత ప్రభుత్వం తరఫున కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బుధవారం చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ‘ఓట్ల చోరీ‘, ఎన్నికల కమిషన్ జవాబుదారీతనం అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశముంది. ఓటర్ల జాబితాలో గణనీయమైన వ్యత్యాసాలు, ఎన్నికల విధానాలను తారుమారు చేయడం వంటి అంశాలపై ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించడం తెల్సిందే. మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల్లో తీవ్రమైన తప్పిదాలు జరిగాయని, ఓటరు జాబితా సవరణ పేరిట పెద్ద ఎత్తున నిజమైన పౌరుల ఓట్లను తొలగించారని, నకిలీ ఓట్లను కలిపారని రాహుల్ గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఎస్ఐఆర్ కసరత్తు చాలా మంది బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ) పాలిట శాపంగా తయారైందని, అందుకే తీవ్ర ఒత్తిడితో పలువురు చనిపోయారని విపక్షాలు ఆరోపి స్తున్నాయి. ఈ అంశాన్ని విపక్ష సభ్యులు సభలో లేవనెత్తేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. -
బంకిం దా కాదు.. బంకిం బాబు అనండి
న్యూఢిల్లీ: లోక్‌సభలో సోమవారం వందేమాతరంపై ప్రత్యేక చర్చ సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. వందేమాతర గీత రచయిత బంకించంద్ర చటర్జీ పేరును ప్రధాని నరేంద్ర మోదీ ‘బంకిం దా’అని అని పలికారు. దీనిపై బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. బంకిం దా కాదు.. బంకిం బాబు అనండి అంటూ సూచించారు. బంకించంద్ర చటర్జీ పేరు చివర గౌరవ సూచకంగా బాబు అనే మాట చేర్చాలని చెప్పారు. అందుకు మోదీ స్పందింస్తూ... ‘‘బంకిం బాబు అని చెబుతా. మీకు కృతజ్ఞతలు. మీ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నా’’అని బదులిచ్చారు. మిమ్నల్ని దాదా అని సంబోధించవచ్చా? అందుకు మీకేమైనా అభ్యంతరమా? అంటూ సౌగతా రాయ్‌ని సరదాగా ప్రశ్నించారు. దా అంటే బెంగాలీ భాషలో అన్న అని అర్థం. మరింత గౌరవంగా బాబు అని అంటుంటారు. బిహార్‌లో గెలిచాం.. ఇక బెంగాల్ పనిపడతాం వందేమాతరంపై చర్చను ప్రారంభించడానికి ప్రధాని మోదీ లోక్‌సభలోకి ప్రశిస్తుండగా, అప్పటికే సభలో ఉన్న బీజేపీ ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ‘బిహార్‌లో గెలిచాం.. ఇక బెంగాల్ పని పడతాం’అంటూ నినదించారు. అలాగే వందేమాతరం అంటూ మోదీకి అభివాదం చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగబోతున్నాయి. -
నెహ్రూ ప్రతిష్టను ఎవరూ దెబ్బతీయలేరు
న్యూఢిల్లీ: చరిత్రను తిరగరాయడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు. వందేమాతరంపై చర్చకు రాజకీయ రంగు రుద్దడానికి ఆరాటపడ్డారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఏ అంశంపై చర్చ జరిగినా జవహర్లాల్ నెహ్రూ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారో చెప్పాలని ప్రధాని మోదీని ప్రశ్నించారు. బీజేపీ ఎంతగా ప్రయత్నించినా, ఎంత దు్రష్పచారం చేసినా ఈ దేశానికి నెహ్రూ అందించిన సేవలు, ఆయన సాధించిన ఘనతలపై చిన్న మరక కూడా అంటించలేదని తేల్చిచెప్పారు. నెహ్రూ ప్రతిష్టను ఎవరూ దెబ్బతీయలేరని పేర్కొన్నారు. వందేమాతరం గీతానికి మహోన్నత స్థానాన్ని, జాతీయ గీతం హోదాను కల్పించింది కాంగ్రెస్ పారీ్టయేనని గుర్తుచేశారు. వందేమాతరం 150వ వార్షికోత్సవంపై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో గౌరవ్ గొగోయ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఎక్కడ ఏం అంశంపై మాట్లాడినా నెహ్రూను, కాంగ్రెస్‌ను నిందించడం ఒక అలవాటుగా మార్చుకున్నారని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్లో జరిగిన చర్చలో నెహ్రూ పేరును 14 సార్లు, కాంగ్రెస్ పేరును 50 సార్లు ప్రస్తావించారని గుర్తుచేశారు. ఇప్పుడు వందేమాతరంపై చర్చలో నెహ్రూ పేరును 10 సార్లు, కాంగ్రెస్ పేరును 26 సార్లు తీసుకొచ్చారని ఆక్షేపించారు. 2022లో రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చలో మోదీ నోటివెంట నెహ్రూ ప్రస్తావన 15 సార్లు వచ్చిందన్నారు. 2020లో జరిగిన చర్చలో 20 సార్లు నెహ్రూ ప్రస్తావన తెచ్చారని వెల్లడించారు. మోదీ పాలనలో విభజించు, పాలించు విధానం నిజానికి వందేమాతరం పూర్తి గీతాన్ని ముస్లిం లీగ్ వ్యతిరేకించిందని గౌరవ్ గొగోయ్ వెల్లడించారు. వారి ఒత్తిళ్లను పట్టించుకోకుండా వందేమాతరం గీతాన్ని జాతీయ సభల్లో ఆలపించాలని 1937లో కాంగ్రెస్ నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ నిర్ణయాన్ని ముస్లిం లీగ్‌తోపాటు హిందూ మహాసభ కూడా వ్యతిరేకించాయని అన్నారు. బీజేపీ నాయకులు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఎప్పుడు పోరాటం సాగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్ర పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు వందేమాతరం గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశాన్ని అర్థం చేసుకోవడానికి బీజేపీ ఏనాడూ ప్రయత్నించలేదని విమర్శించారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో భాషలు ఉన్నప్పటికీ జాతీయ గ్రంథం మాత్రమే రాజ్యాంగమేనని గొగోయ్ ఉద్ఘాటించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాజ్యాంగాన్ని తాము కాపాడుకుంటున్నామని చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజల హక్కులను హరిస్తోందని దుయ్యబట్టారు. నేడు దేశంలో బ్రిటిష్ పాలన లేకపోయినా మోదీ పాలనలో విభజించు, పాలించు విధానం అమలవుతోందని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రజల సమస్యల గురించి మాట్లాడుకుండా ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ రాజధానిలో బాంబు పేలితే దాని గురించి నోరువిప్పలేదని తప్పుపట్టారు. మోదీ పాలనలో ప్రజలకు భద్రత ఉందా? అని ప్రశ్నించారు. -
బెంగాల్ ఎన్నికల కోసమే ఈ డ్రామా
న్యూఢిల్లీ: వందేమాతరంపై పార్లమెంటులో చర్చించాల్సిన అవసరం అసలు ఏముందని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ నిలదీశారు. కేవలం పశి్చమ బెంగాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రధాని నరేంద్ర మోదీ ఈ డ్రామాకు తెర తీశారంటూ దుయ్యబట్టారు. తొలి ప్రధాని నెహ్రూ వందేమాతరాన్ని అవమానించారన్న మోదీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వందేమాతర రచయిత బంకించంద్ర చటర్జీ బెంగాలీ గనుక, ఆ గేయంపై చిచ్చు రాజేసి ఓట్లు రాబట్టుకోవడమే మోదీ పన్నాగమని ఆరోపించారు. ‘ఇందుకోసం బెంగాల్ కే చెందిన మరో స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ కు నెహ్రూ రాసిన లేఖను మోదీ అడ్డం పెట్టుకుంటున్నారు. కానీ మోదీ ఆరోపించినట్టుగా వందేమాతరంలోని కొన్ని చరణాలు ముస్లింలను కించపరిచేలా ఉన్నాయని నెహ్రూ ఎన్నడూ అనలేదు. పైగా మోదీ చెబుతున్నట్టుగా వాటిని తీసేయించనూ లేదు. నిజంగా ఆయన అలా చేసి ఉంటే వందేమాతరంలోని తొలి రెండు చరణాలనే జాతీయ గేయంగా ఆమోదించిన రాజ్యాంగ అసెంబ్లీలో సభ్యుడైన ఆరెస్సెస్ నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ అభ్యంతర పెట్టలేదేం?‘అని ప్రశ్నించారు. ముస్లిం సంతుషీ్టకరణ కోసం నాటి ముస్లిం లీగ్ నేత జిన్నా డిమాండ్ కు లొంగి వందేమాతరంలోని పలు పంక్తులను నెహ్రూ తొలగించారని మోదీ పార్లమెంటులో ఆరోపించడం తెలిసిందే. ఈ విషయమై నెహ్రూ రాసిన లేఖే ఇందుకు రుజువని ఆయన చెప్పారు. ఇదంతా పచ్చి అబద్ధమని ప్రియాంక స్పష్టం చేశారు. వందేమాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో చేపట్టిన ప్రత్యేక చర్చలో సోమవారం ఆమె పాల్గొన్నారు. నెహ్రూపై మోదీ ఆరోపణలన్నింటినీ పూర్తిస్థాయిలో తిప్పికొట్టారు. వందేమాతరంలోని కొన్ని పంక్తులపై నెహ్రూ అభ్యంతరాలు లేవనెత్తారన్నది నాటి మతోన్మాద శక్తుల దుష్ప్రచారమే తప్ప అందులో నిజం లేదని ఆమె చెప్పారు. బోస్ కు నెహ్రూ లేఖలో కొద్ది భాగాన్ని మాత్రమే తన వాదనకు అనువుగా మోదీ అన్వయించుకున్నారని ఆక్షేపించారు. ‘నెహ్రూపై మీకెందుకీ అకారణ ద్వేషం? మీకు గనుక దమ్ముంటే నెహ్రూపై మీరు చేస్తాను అన్ని ఆరోపణల మీదా పూర్తి స్థాయిలో ముందుగా సభలో చర్చ చేపడదాం రండి. ఆ తర్వాత ఈ అంశానికి మీరు శాశ్వతంగా తెర వేయాలి. మీ రాజకీయ ప్రయోజనం కోసం అవసరమైనపుడల్లా నెహ్రూపై బురదజల్లడాన్ని మానుకోవాలి‘ అంటూ మోదీ సర్కారుకు సవాలు ప్రియాంక విసిరారు. ‘కనీసం ఆ తర్వాతైనా ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి నిజమైన సమస్యలపై చర్చిద్దాం. తద్వారా సభా సమయాన్ని సద్వినియోగం చేద్దాం‘ అని సూచించారు. ‘మోదీ దాదాపు 12 ఏళ్లుగా ప్రధానిగా ఉంటున్నారు. దేశం కోసం పోరాడినందుకు నెహ్రూ దాదాపు అంతేకాలం జైల్లో గడిపారు‘ అంటూ తూర్పారబట్టారు. మోదీలో భయం.. ప్రధానికి ఆత్మవిశ్వాసం నానాటికీ సన్నగిల్లుతోందని ప్రియాంక అన్నారు. ‘కొద్ది రోజులుగా అది కొట్టొచి్చనట్టు కనిపిస్తోంది. మోదీ ఒకప్పటి మోదీ కాదు. అన్నింటికీ భయపడుతూ గడుపుతున్నారు. ఆయన విధానాలన్నీ దేశాన్ని నానాటికీ బలహీన పరుస్తుండటమే అందుకు కారణం’అని ప్రియాంక అన్నారు. #WATCH | During debate in Lok Sabha on 150 years of 'Vande Mataram, Congress MP Priyanka Gandhi Vadra says, "The truth is that Modi is no longer the Prime Minister he once was. The truth is, it's beginning to show. His self-confidence is declining. His policies are weakening the… pic.twitter.com/nkHAOooBSe— ANI (@ANI) December 8, 2025 -
‘వందేమాతరం’పై నేడు ప్రత్యేక చర్చ
న్యూఢిల్లీ: జాతీయ గీతం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరగనుంది. ప్రధాని మోదీ ఈ చర్చను ప్రారంభిస్తారు. పలువురు కేంద్ర మంత్రులు సహా వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతారు. ప్రత్యేక చర్చకు సభలో 10 గంటల సమయం కేటాయించారు. అవసరమైతే మరికొంత సమయం కేటాయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వందేమాతర గీతం గురించి ఎక్కువ మంది తెలియని విషయాలు, ముఖ్యమైన అంశాలు సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. బెంగాలీ కవి బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది. నవంబర్ 7న మొదలైన ఈ వేడుకలు ఏడాదిపాటు కొనసాగుతాయి. ఇందులో భాగంగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక చర్చ చేపట్టాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో చర్చ జరుగనుంది. ఎగువసభలో వందేమాతరంపై చర్చను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. ఇదిలా ఉండగా, వివాదాస్పద ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సహా ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో మంగళవారం, బుధవారం చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆ తర్వాత ఈ అంశంపై రాజ్యసభలో చర్చ ప్రారంభమవుతుంది. -
రక్షణ పరిశ్రమల్ని ఆకర్షించలేని ఏపీ
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణరంగ పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్ ఆకర్షించలేకపోతున్నట్లు రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ చెప్పారు. లోక్‌సభలో శుక్రవారం వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవా బిస్తూ.. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా రక్షణ తయారీ రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్‌లు (కేంద్ర పథకాలు) ప్రారంభించలేదని తెలిపారు. వైద్య పరికరాల ఎగుమతుల్లో వృద్ధి మన దేశం నుంచి వైద్య పరికరాల ఎగుమతులు 2021–22లో 2.9 బిలియన్ డాలర్లుండగా 2024–25లో 4.1 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువులశాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. వైద్యపరికరాల దేశీయ ఉత్పత్తి వృద్ధిరేటు ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. ఐఆర్ఎస్పై నాలుగే ఫిర్యాదులుగత పదేళ్లలో ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్ఎస్) పనితీరులో జరిగిన అక్రమాలు, అవకతవకలు, ఆలస్యాలకు సంబంధించి నాలుగు ఫిర్యాదులు మాత్రమే అందినట్లు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్.. వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
పాన్ మసాలా తయారీ యూనిట్లపై సెస్
న్యూఢిల్లీ: ప్రతిపాదిత హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లులో పాన్ మసాలా తయారీ యూనిట్లపై పన్ను విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రకటించారు. ఈ పన్ను ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకుంటామని, ఆరోగ్య పథకాల కోసం వెచ్చిస్తామని తెలిపారు. హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు–2025పై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రత్యేక ప్రయోజనాల కోసం సెస్ విధించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 270 వీలు కల్పిస్తోందని చెప్పారు. అనంతరం బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. పాన్ మసాలా, అలాంటి ఉత్పత్తులను తయారు చేసేందుకు వినియోగించే యంత్రాలు, వాటి సామర్థ్యం ఆధారంగా విధించే సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని జాతీయ భద్రత, ప్రజారోగ్యం కోసం వినియోగించుకునేందుకు ఈ బిల్లులో ఏర్పాటుంది. గతంలోనూ ఇలా సెస్‌లను వివిధ వనరులపై ప్రభుత్వాలు విధించాయన్నారు. 1974 నుంచి క్రూడాయిల్‌పై సెస్, 2001 నుంచి నేషనల్ కెలామిటీ కంటింజెంట్ డ్యూటీ, 2000 నుంచి రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ పేరుతో పన్ను వసూలు చేస్తున్న చరిత్ర ఉందన్నారు. పాన్ మసాలా చౌకగా మారడానికి, అదే సమయంలో ఆదాయాన్ని కోల్పోయేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆమె తెలిపారు. వినియోగం ఆధారంగా పాన్ మసాలాపై గరిష్టంగా 40 శాతం మేర జీఎస్టీ ఉంటుందని చెప్పారు. అయితే, జీఎస్టీ ఆదాయంపై ఈ సెస్ ఎటువంటి ప్రభావం చూపదని ఆమె స్పష్టం చేశారు. -
ఉద్యోగులకు ఆఫీసు కాల్ కట్ చేసే హక్కు
న్యూఢిల్లీ: పని వేళలు పూర్తయ్యాక ఆఫీసు నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఈమెయిళ్లను స్వీకరించడంపై ఉద్యోగులకు హక్కు కల్పించేందుకు ఉద్దేశించిన ప్రైవేట్ సభ్యుల బిల్లు లోక్‌సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. ప్రభుత్వం చట్టం చేయాల్సిన అవసరముందని భావించే అంశాలపై లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ప్రైవేటుగా బిల్లులను ప్రవేశపెట్టవచ్చు. ప్రభుత్వం సమాధానం ఇచ్చిన తర్వాత సాధారణంగా ఈ ప్రతిపాదిత బిల్లులను ఉపసంహరించుకుంటారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే శుక్రవారం లోక్‌సభలో ఈ మేరకు ‘రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు–2025’ను ప్రవేశపెట్టారు. ప్రతి ఉద్యోగి పని వేళల తర్వాత, సెలవు దినాల్లో వచ్చే విధి నిర్వహణ సంబంధిత ఫోన్ కాల్స్, ఈమెయిల్స్‌ను డిస్కనెక్ట్ చేసేందుకు హక్కు ఉండాలి. ఇందుకోసం ఉద్యోగుల సంక్షేమ సంస్థను ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించారు. తమిళనాడును నీట్ ప్రవేశ పరీక్ష నుంచి మినహాయించాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్, దేశంలో మరణ శిక్షను రద్దు చేయాలంటూ డీఎంపీ ఎంపీ కనిమొళి, జర్నలిస్టులకు భద్రత కల్పించాలని విశాల్దాదా ప్రకాశ్ బాపు పాటిల్(స్వతంత్ర) ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారు. -
పోలవరం రిజర్వాయర్ కాదు.. బ్యారేజే
సాక్షి, అమరావతి: పోలవరం జలాశయం కాదు.. కేవలం బ్యారేజ్ మాత్రమేనని గురువారం లోక్‌సభలో కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ పరోక్షంగా తేల్చిచెప్పారు. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.30,436 కోట్లని తెలిపారు. సకాలంలో ప్రాజెక్టును పూరి చేయడం కోసం రూ.12,157 కోట్లను అదనపు సహాయం కింద కేంద్రం ఇస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.20,658 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో నదుల అనుసంధానంపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సీఆర్ పాటిల్ రాతపూర్వకంగా సమాధానం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లుగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 2019లో ఆమోదించింది. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచి్చన మేరకు 45.72 మీటర్ల గరిష్ఠమట్టంలో నీటిని నిల్వచేసేలా పోలవరాన్ని పూర్తిచేయాలంటే ఆ మేరకు నిధులు అవసరం. కానీ.. పోలవరం ప్రాజెక్టులో నీటినిల్వ కనీసమట్టం (ఎండీడీఎల్) 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ.. ప్రాజెక్టును పూర్తిచేసేలా 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ మేరకు పనులు పూర్తిచేయడానికి సవరించిన అంచనా వ్యయం రూ.30,436 కోట్లుగా తేల్చింది. ఇప్పటిదాకా విడుదల చేసిన నిధులు పోను.. ప్రాజెక్టును పూర్తిచేయడానికి అవసరమైన రూ.12,157 కోట్లను విడుదల చేస్తామని పేర్కొంది. ప్రాజెక్టును 2027 మార్చిలోగా పూర్తిచేయాలని షరతు పెట్టింది. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తుకే నీటినిల్వను పరిమితం చేస్తే.. 115.4 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయవచ్చు. కానీ.. ఆ స్థాయిలో నీటిని నిల్వచేస్తే కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదని, కేవలం 1.98 లక్షల ఎకరాలకే.. అదీ గోదావరి వరదల సమయంలో మాత్రమే నీటిని అందించే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వచేస్తే పోలవరం ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలతోపాటు కృష్ణా డెల్టాలో 13.8 లక్షలు, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలను స్థీరికరించడంతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 63.8 టీఎంసీలను సరఫరా చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. కానీ.. పోలవరంలో నీటినిల్వ ఎత్తును 41.15 మీటర్లకే కేంద్ర కేబినెట్ పరిమితం చేస్తూ తీర్మానం చేసినా ఆ సమావేశంలో ఉన్న టీడీపీ మంత్రులు నోరుమెదపలేదు. ఇక లోక్‌సభలో గురువారం పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.30,436 కోట్లేనని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాతపూర్వకంగా తేల్చిచెప్పినా టీడీపీ ఎంపీలు మౌనం దాల్చారు. అంటే.. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తువరకే నీటినిల్వను పరిమితం చేస్తూ ప్రాజెక్టును పూర్తిచేయడానికి నిధులు ఇస్తున్నామని కేంద్రం మరోసారి స్పష్టం చేసినట్లు అర్థమవుతోంది. నీటినిల్వను 41.15 మీటర్లకు పరిమితం చేస్తే.. పోలవరం రిజర్వాయర్ కానేకాదని.. కేవలం బ్యారేజీగా మిగిలిపోతుందని నీటిపారుదలరంగ నిపుణులు చెబుతున్నారు. 2005లోనే గోదావరి–కృష్ణా అనుసంధానం ఇక పోలవరం (గోదావరి)–విజయవాడ(కృష్ణా) అనుసంధానాన్ని ఎన్‌డబ్ల్యూడీఏ 1999లో ప్రతిపాదించిందని.. దాన్ని 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిందని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ చెప్పారు. పోలవరం కుడికాలువ ద్వారా 4,666 మిలియన్ క్యూబిక్ లీటర్ల (164.82 టీఎంసీలు) గోదావరి–కృష్ణా అనుసంధానం చేపట్టందని వివరించారు. పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పీఎఫ్ఆర్ను 2025 మే 22న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి సమర్పించిందని తెలిపారు. దానిపై బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోపాటు కృష్ణా, గోదావరి బోర్డుల అభిప్రాయం కోరామని, వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
రచ్చ బదులు చర్చ!
పార్లమెంటు శీతకాల సమావేశాలు ఈసారి కూడా వాయిదాల్లోనే ముగిసిపోతాయని నిరాశపడినవారికి మంగళవారం పాలక, ప్రతిపక్షాలు ఒక అంగీకారానికి రావటం ఊరట నిచ్చింది. ఎన్నికల సంఘం(ఈసీ) వివిధ రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే (సర్) పేరిట కొనసాగిస్తున్న ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంటులో చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టడం, అందుకు కేంద్రం సిద్ధపడకపోవడం పర్యవసానంగా సమావేశాల తొలి రోజు నుంచే ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ‘సర్’ను చర్చిద్దామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు విపక్షం అంగీకరించింది. దేశ ప్రజల సార్వభౌమా ధికారానికి పార్లమెంటు ప్రతీక అంటారు. ప్రజా సమస్యలపై చర్చకు, దేశ ప్రగతికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవటానికి, చట్టాల రూపకల్పనకు అది ప్రధాన వేదిక. పాలకపక్ష జవాబుదారీతనాన్ని పెంచటం, ప్రజల గొంతుక వినిపించటం విపక్షాలు చేసే పని. కానీ ఆచరణలో అదంతా ఎటో కొట్టుకుపోతోంది. లోక్‌సభ చరిత్ర గమనిస్తే దాని వర్తమాన స్థితి ఆశ్చర్యం కలిగిస్తుంది. 1952–70 మధ్య అది ఏడాదికి సగటున 121 రోజులు సమావేశమయ్యేది. అంటే అయిదేళ్లలో సగటున 605 రోజులు సమావేశాలుండేవి. అటు తర్వాత నుంచి ఏడాది సగటు 68 రోజులకొచ్చింది. అయిదేళ్ల సగటు 340 రోజులకు తగ్గింది. దాదాపు సగానికి పడిపోయిన పని దినాలైనా సజావుగా సాగుతున్న జాడలేదు. సమావేశాలు మొదలవుతున్నాయంటే ప్రతిష్టంభన సృష్టించటమే విపక్షాల ఏకైక వ్యూహంగా మారింది. సభలో ఆందోళనలు నిర్వహించటం, ముందుకు సాగనీయకపోవటం తమ ప్రజాస్వామిక హక్కని విపక్షాలు భావిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటు ఔన్నత్యం గురించి, ప్రజా స్వామ్యం గురించి గంభీరోపన్యాసాలివ్వటం... విపక్షంలో ఉంటే సమావేశాలకు ఆటంకం కలిగించటం రివాజైంది. ఆ తర్వాత చానెళ్లకొచ్చి మహోద్రేకంతో ఊగిపోతూ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవటం దానికి అదనం. ఈ మొత్తం వ్యవహారంలో సామాన్య పౌరులకు పనికొచ్చేది ఒక్కటీ ఉండదు. పార్లమెంటు సమావేశాలు సక్రమంగా సాగకపోవటం వల్ల ప్రజలకు జరిగే అన్యాయం సాధారణమైనది కాదు. ఎంతో కీలకమనుకున్న బిల్లులు సైతం ప్రవేశపెట్టిన కొన్ని రోజుల్లోనే ఆమోదం పొంది చట్టంగా మారుతున్నాయి. వాటిని అధ్యయనం చేయ టానికీ, అభ్యంతరాలు చెప్పటానికీ, సవరణలు ప్రతిపాదించటానికీ సమయం ఎక్కడ? కొన్ని బిల్లులైతే నిండా గంట పాటైనా చర్చించిన దాఖలా ఉండటం లేదు. చాలా బిల్లులు విపక్షాల ఆందోళనల మధ్యే ఆమోదం పొందినట్టు ప్రకటించటం ఇటీవలి కాలంలో పెరి గింది. బడ్జెట్ ప్రతిపాదనలూ, ద్రవ్యబిల్లులు కూడా ఏ చర్చా లేకుండానే సునాయాసంగా గట్టెక్కుతున్నాయి. పార్లమెంటులో ఎంతో ప్రాధాన్యం ఉండే ప్రశ్నోత్తరాల సమయం వాయిదాల కారణంగా కుంచించుకుపోతోంది.‘సర్’ చాటున తనకు సంబంధం లేని పౌరసత్వ నిర్ధారణ బాధ్యతను ఈసీ భుజాన కెత్తుకుంది. ఇందువల్ల ఓటర్‌గా నమోదు కావాలంటే ముందు ఈ దేశ పౌరులమని నిరూపించుకోవాల్సిన బాధ్యత జనం పైనే పడింది. అందుకోసం గడువులోగా దాఖలు చేయాల్సిన పత్రాలు అందరి వద్దా అప్పటికప్పుడు లభ్యమయ్యేవి కాదు. తల్లితండ్రుల పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన పత్రాలు సైతం తెచ్చివ్వాలంటే కూలీ నాలీ చేసుకునే పౌరులు ఎక్కడికని, ఎంతకని తిరుగుతారు? ఈ స్థితిలో బిహార్‌లో ఓటుహక్కు కోల్పోయిన 47 లక్షల మందిని ‘విదేశీయులు’గా ముద్రేయటం సాధ్యమేనా? చిత్ర మేమంటే ఇంతటి కీలకమైన నిర్ణయంపై ముందుగా పార్లమెంటు చర్చించలేదు. ప్రస్తుతం ఆ అంశాన్ని సుప్రీంకోర్టు విచారిస్తుండగా సభలో చర్చకు రాబోతోంది! ఇది కూడా మొత్తంగా ఎన్నికల సంస్కరణలపై కావటం వల్ల ఆ చర్చ కాస్తా ఎటు మళ్లుతుందో తెలియదు. ఇటీవలి కాలంలో ఈవీఎంల వింతలూ, ఎన్నికలైనాక ప్రకటించే పోలింగ్ శాతం పెరుగుతూ పోవటం వంటి అంశాల్లో ఈసీ మౌనమే సమాధానమవుతోంది. ఎన్నికల సంస్కరణల కన్నా ముందు ఈసీ పనితీరు ప్రక్షాళన, ఆ సంస్థ జవాబు దారీతనం పెంచటం వగైరాల అవసరం ఉంది. వీటన్నిటినీ పార్లమెంటు సమగ్రంగా చర్చిస్తుందా? పరస్పర నిందారోపణలతో కాలం గడుస్తుందా? ఈ నెల 9న జరగబోయే చర్చను దేశమంతా ఆసక్తితో గమనిస్తుంది. -
చార్జీల భారం తగ్గించేలా భారత్ ట్యాక్సీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీల రైడ్–ఆధారిత మొబైల్ యాప్‌ల అధిక చార్జీల భారం నుంచి ఉపశమనం కల్పించే లక్ష్యంతో ‘భారత్ ట్యాక్సీ’ యాప్‌ను తీసుకురావాలని యోచిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ప్రైవేట్ కంపెనీల అధిక చార్జీల మోత నుంచి ఇటు ప్రయాణికులకు విముక్తి కల్పిస్తూనే డ్రైవర్లకు సైతం అధిక లాభాలు ఒనగూరేలా యాప్‌ను డిజైన్చేస్తున్నట్లు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ విషయం వెల్లడించారు. ‘‘ సహకారసంస్థల దన్నుతో బైకులు, ఆటోలు, కార్లలో వినియోగించేలా రైడ్–ఆధారిత మొబిలిటీ యాప్‌ను తీసుకురావాలని ప్రతిపాదించాం.ప్రయాణికులు ఎంతో సులభంగా రైడ్ బుక్ చేసుకునేలా యాప్ డిజైన్ ఉంటుంది. చార్జీల్లో పారదర్శకత, వాహన ట్రాకింగ్, సందేహాలు నివృత్తిచేసేందుకు పలు భాషల్లో 24 గంటలూ సేవలందించే కస్టమర్‌కేర్ సౌకర్యం, భద్రత, సురక్షణల వంటి ఎన్నో ఫీచర్లతో యాప్‌ను సిద్ధంచేస్తాం. ఈ యాప్‌లో సంస్థ కమిషన్ అనేది సున్నా. అందుకే డ్రైవర్లకు ఎలాంటి కమిషన్ కోతలు లేకుండా నేరుగా భారీ ప్రయోజనం చేకూరుతుంది. కోఆపరేటివ్ సొసైటీకొచ్చే ఆదాయం నేరుగా డ్రైవర్లకే చేరుతుంది. తక్కువ చార్జీల కారణంగా ప్రయాణికులకు సైతం సొమ్ము ఆదా అవుతుంది.అటు డ్రైవర్లకు, ఇటు ప్రయాణికులకు లబ్ధిచేకూరేలా ధరల శ్రేణి ఉంటుంది’’ అని అమిత్ షా అన్నారు. ‘భారత్ ట్యాక్సీ’ డిజిటల్ యాప్‌ను సహకార్ ట్యాక్సీ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వ దన్నుతో పలు కేంద్ర, రాష్ట్ర, డ్రైవర్ల సహకార సంఘాలు ఇందులో వాటాదారులుగా ఉన్నాయి. రాష్ట్రాల సహకార సొసైటీల చట్టం–2002 కింద ఈయాప్‌ను 2025 జూన్ ఆరోతేదీన నమోదుచేశారు. డ్రైవర్లు సైతం ఈ సహకార్ ట్యాక్సీ కార్పొరేషన్లో భాగస్వాములుగా ఉండటం విశేషం. ‘సహకార్ సే సమృద్ధి’ దార్శనికతలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. -
రెండోరోజూ అదే తీరు
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వేపై పార్లమెంట్లో చర్చకు విపక్షపార్టీల సభ్యులు పట్టుబట్టడంతో శీతాకాల సమావేశాల రెండోరోజు సభాకాలంసైతం నిరుపయోగంగా ముగిసింది. ఎస్ఐఆర్పై చర్చకు తామేమీ విముఖత చూపట్లేమని, కాలావధిపై పట్టుబట్టడం సరైన పద్ధతికాదంటూ కేంద్రప్రభుత్వం వ్యాఖ్యానాలతో విపక్షాలు ఏమాత్రం సంతృప్తిచెందలేదు. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జార్జియా ప్రతినిధి బృందాన్ని పార్లమెంట్ గ్యాలరీలోకి ఆహా్వనించి సభాకార్యక్రమాలు మొదలెట్టారు.ప్రశ్నోత్తరాల సమయం ఆరంభంకాగానే విపక్షసభ్యులు తమతమ స్థానాల నుంచి లేచినిలబడి ఎస్ఐఆర్పై వెంటనే చర్చించాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళనల నడుమే పలువురు మంత్రులు తమను అడిగిన లిఖితపూర్వక ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయినా విపక్షసభ్యులు నినాదాలు ఆపలేదు. దీంతో స్పీకర్ ఆగ్రహంతో ‘‘ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు ఉండటం సహజం. కానీ సభలో కొందరు సభ్యుల ప్రవర్తన ఏమాత్రం ఆమోదనీయంగా లేదు. సభ గౌరవాన్ని కాపాడండి. ప్రతి ఒక్క సభ్యునికి మాట్లాడే అవకాశమిస్తా. అప్పటిదాకా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యయుత పార్లమెంట్‌గా సభ అత్యున్నత ప్రమాణాలను పాటించండి’’ అని హితవు పలికారు.అయినా నినాదాలు సద్దుమణగకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైన కేవలం 10 నిమిషాలకే నినాదాలు రెట్టించడంతో సభను వెంటనే 2 గంటలకు వాయిదావేశారు. లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటలకు మళ్లీ మొదలైనా విపక్షసభ్యుల నినాదాలతో హోరెత్తిపోయింది. ఎస్ఐఆర్పై చర్చకు ప్రభుత్వం సైతం సమాయత్తమవుతోందని, సభ సజావుగా సాగేలా సంయమనం పాటించాలని విపక్ష సభ్యులకు సభాధ్యక్షుడి స్థానంలో కూర్చున్న దిలీప్ సైకియా విజ్ఞప్తిచేశారు. విపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదావేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీల ధర్నాఎస్ఐఆర్తోపాటు ఎన్నికల సంస్కరణలపై ఉభయసభల్లో చర్చకు ప్రభుత్వం సమ్మతి తెలపకపోవడంతో నిరసనగా విపక్ష పార్టీల ఎంపీలు మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో ధర్నాకు దిగారు. నిరసనలోభాగంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిచ్చారు. ‘‘ఎస్ఐఆర్ను అంతం చేద్దాం. ఓట్ల చోరీకి ముగింపు పలుకుదాం’, ‘ఎస్ఐఆర్ అంటేనే ఓట్ల చోరీ’, ‘వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల ఓట్లను తొలగించారు’’ అనే ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు.ఈ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ వాద్రాసహా పలు విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ‘‘ పార్లమెంట్ దేశ ప్రజలదని మోదీ పదేపదే అంటారు. తీరా ప్రజాసమస్యలపై చర్చిద్దామంటే జడుసుకుంటారు. చర్చించకుండా పారిపోతున్నారు’’ అని ఎద్దేవాచేశారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఓటింగ్ హక్కుల కంటే పెద్ద సమస్య మరోటి ఉంటుందా?’’అని తర్వాత ‘ఎక్స్’లో రాహుల్ ఒక పోస్ట్ చేశారు. డీఎంకే నేతలు కనిమొళి, టీఆర్ బాలు, సీపీఐ(ఎం) నేత జాన్ బ్రిట్టాస్ తదితరులు సైతం పార్లమెంట్ మకరద్వారం వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు -
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని వసతి గృహాల్లో వరుసగా ఫుడ్‌పాయిజనింగ్ ఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి చెప్పారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని చంద్రబాబు ప్రభుత్వాన్ని సోమవారం లోక్‌సభలో కోరారు. నాయుడుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తితో పాటు రాష్ట్రంలో జరిగిన పలు సంఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో పరిశుభ్రత లోపం, పాడైన ఆర్వో ప్లాంట్లు, శుభ్రం చేయని నీటిట్యాంకులు, వంటగది అపరిశుభ్రతవల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం వంటి వివరాలు తెలపాలని కోరారు. దీనికి కేంద్ర విద్యా శాఖ సహాయమంత్రి జయంత్ చౌదరి జవాబిస్తూ.. ఇటీవల కొన్ని పాఠశాలల్లో నీరు, ఆహారం కలుషితం కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారందరికీ చికిత్సచేసి డిశ్చార్జ్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని చెప్పారు.రాష్ట్రంలో 22 పీఎంకేకేలునైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏపీలో 22 ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాలు (పీఎంకేకేలు) ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి జయంత్ చౌదరి తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. వీటి ద్వారా 2022–25 మధ్య 12,091 మంది శిక్షణ పొందారన్నారు.మడ అడవుల అభివృద్ధికి రూ.13.077 కోట్లు రాష్ట్రంలో మడ అడవుల అభివృద్ధి కోసం రూ.13.077 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి కీర్తివర్థన్ సింగ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ తనూజారాణి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. మడ అడవులను ప్రోత్సహించడానికి, పునరుద్ధరించడానికి, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థల స్థితిస్థాపకతను పెంచడానికి మాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హాబిటాట్స్, టాంజిబుల్ ఇన్కమ్స్ ప్రారంభించినట్లు చెప్పారు.ప్రభుత్వ బడుల్లో భారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్య..ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి జయంత్ చౌదరి చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ సమాచారం ప్రకారం.. 2024–25లో 1–8 తరగతుల విద్యార్థుల నమోదు తగ్గి నట్లు చెప్పారు. 2022–23లో 31,71,466 మంది బడికి రాగా.. 2024–25లో 26,15,935 మంది మాత్రమే హాజ రైనట్లు తెలిపారు. 2022–23 కంటే 2024–25లో 5,55,531 మంది తగ్గిపోయారని చెప్పారు. -
రక్షణ, ఆరోగ్య రంగాల్లో నిధులకు కేంద్రం ప్రయత్నం
జాతీయ భద్రత, ప్రజారోగ్య రంగాల కోసం అదనపు నిధులను సమీకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ‘ఆరోగ్య భద్రత, జాతీయ భద్రతా సెస్ బిల్లు-2025’ను ప్రవేశపెట్టనుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కీలక బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది.ఈ ప్రతిపాదిత సెస్ అనేది నిర్దిష్ట వస్తువుల ఉత్పత్తి, తయారీ యంత్రాలకు వర్తిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. త్వరలో ముగియనున్న పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్‌ను ఈ కొత్త సెస్ భర్తీ చేయనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీని ద్వారా పొగాకు ఉత్పత్తులపై ఉన్నత స్థాయి జీఎస్టీ రేటును కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని సమాచారం.ఈ సెస్‌ను అమల్లోకి తీసుకువచ్చేందుకు జాతీయ భద్రత, ప్రజారోగ్యం అనే రెండు ప్రధాన అంశాలు కారణంగా ఉన్నాయి. ఇటీవలి ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంటరీ స్థాయి ప్యానెల్ ‘ఫ్యూచర్ వార్ఫేర్ ఫండ్’ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఈ నిధిని సాయుధ దళాల్లో భవిష్యత్ యుద్ధ సాంకేతికతల అధ్యయనం కోసం ఉపయోగించాలని సూచించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రక్షణ కేటాయింపులు ఇప్పటికే రూ.6.18 లక్షల కోట్లు దాటాయి. ఈ సెస్ అమల్లోకి వస్తే మరింత నిధులు చేరే అవకాశం ఉంటుంది.ప్రజారోగ్యం, పథకాల విస్తరణఆయుష్మాన్ భారత్ వంటి కీలక ఆరోగ్య పథకాల విస్తరణకు అదనపు వనరుల అవసరం ఉంది. ప్రస్తుతం దేశ జనాభాలోని 40 శాతం ప్రజలకు చెందిన సుమారు 55 కోట్ల మంది లబ్ధిదారులకు అంటే దాదాపు 12.37 కోట్ల కుటుంబాలకు ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా లభిస్తోందని ప్రభుత్వ చెబుతుంది. 2025-26లో ఆరోగ్య రంగానికి సుమారు రూ.1 లక్ష కోట్ల వ్యయం అంచనా వేయగా, జాతీయ ఆరోగ్య విధానం ఆరోగ్య వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలని సిఫారసు చేస్తోంది. దాంతో ఈ సెస్ ఎంతో తోడ్పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.సెంట్రల్ ఎక్సైజ్ చట్టం సవరణఈ కొత్త సెస్ బిల్లుతో పాటు, 1944కి చెందిన వలస పాలన కాలం సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్‌ను కూడా ప్రభుత్వం సవరించనుంది. సవరణ అనంతరం ఎక్సైజ్ సుంకం కేవలం ముడి పెట్రోలియం, పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్, సహజ వాయువు, పొగాకు ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తుందనే అంచనాలున్నాయి. దీనికి సంబంధించి ఇంకా సమగ్ర వివరాలు తెలియాల్సి ఉంది. పన్ను పరిధిని విస్తరించే ఉద్దేశం లేకపోయినా సమకాలీన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పాత చట్టాన్ని ఆధునీకరించడమే ఈ సవరణ లక్ష్యం అని ప్రభుత్వం పేర్కొంది.ఇప్పటికే అమలవుతున్న సెస్లుఆదాయపు పన్నుపై 4% హెల్త్, ఎడ్యుకేషన్ సెస్.పెట్రోల్, డీజిల్‌పై వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్, రోడ్లు, మౌలిక సదుపాయాల సెస్.పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్.సాధారణంగా ఈ సెస్‌ల నుంచి వచ్చే ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలతో పంచుకోదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తరచూ విమర్శలు వస్తున్నాయి.సరిహద్దు ఉద్రిక్తతలు, పెరుగుతున్న ఆరోగ్య డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం ఈ రెండు కీలక రంగాలను సమానంగా బలోపేతం చేయాలని చూస్తోంది. అయితే సెస్‌లపై అధికంగా ఆధారపడటం వల్ల కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సంబంధాలు, వినియోగదారులపై అదనపు భారం వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు బిల్లులు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ప్రధాన చర్చాంశంగా మారనున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగాలు మట్టి కొట్టుకుపోతాయి!.. మస్క్ ఇంటర్వ్యూ -
ఈసారి పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులు
న్యూఢిల్లీ: మరో వారం రోజుల్లో ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే కీలక బిల్లుల జాబితా సిద్ధమైంది. పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేట్ రంగానికి స్వాగతం పలికేందుకు ఉద్దేశించిన బిల్లుతోపాటు 10 బిల్లులను ఈసారి పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం విడుదలైన ‘లోక్‌సభ, రాజ్యసభ బులెటెన్’లో కేంద్రం పలు అంశాలను వెల్లడించింది. అణు ఇంధన బిల్లు, 2025తోపాటు కార్పోరేట్ చట్టాల(సవరణ) బిల్లు–2025, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు–2025, జాతీయ రహదారుల(సవరణ) బిల్లులను ఉభయసభల ముందుకు తీసుకురానున్నారు. జాతీయ రహదారుల విస్తరణ, పొడగింపు కోసం భూసేకరణ ప్రక్రియ అత్యత అత్యంత పారదర్శకంగా, వేగంగా జరిగేందుకు వీలుగా నేషనల్ హైవేస్(సవరణ) బిల్లు తీసుకొస్తున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చట్టం–1992, డిపాజిటరీస్ చట్టం–1996, సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్(నియంత్రణ)చట్టం–1956లను విలీనంచేసేందుకు ఉద్దేశించిన సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు–2025ను తీసుకొస్తున్నారు. ఆర్టిట్రేషన్, కాన్సిలియేషన్ చట్టంలోని 34వ సెక్షన్‌కు సవరణలు తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చేయని తప్పులకు కంపెనీల డైరెక్టర్లు బాధ్యులవుతున్న నేపథ్యంలో అవాంఛనీయ దర్యాప్తు, విచారణల నుంచి డైరెక్టర్లకు రక్షణ కలి్పంచే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్టిట్రేషన్, కాన్సిలియేషన్ చట్ట సంబంధ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి, సూచనల కోసం కమిటీకి సిఫార్సుచేయాలని కేంద్రం భావిస్తోంది. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 240వ అధికరణం పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును సైతం ప్రవేశపెట్టనున్నారు. ఇది చట్టంగా మారితే ఇకపై రాష్ట్రపతి నేరుగా చండీగఢ్‌పై విధానపర నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక్కడ స్వతంత్ర ప్రధాన కార్యదర్శి బదులు ఇకపై స్వతంత్ర అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. తమ ఉమ్మడి రాజధాని చండీగఢ్‌పై సర్వహక్కులు తమకే దక్కుతాయని భగవంత్ మాన్(ఆప్) సారథ్యంలోని పంజాబ్ రాష్ట్రప్రభుత్వం వాదించడంతో కేంద్రం హుటాహుటిన ఈ చట్టం తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి సెషన్ డిసెంబర్ ఒకటో తేదీన మొదలై 15 సిట్టింగ్‌ల తర్వాత డిసెంబర్ 19న ముగియనుంది. ఏకీకృత ఉన్నత విద్యా కమిషన్ లక్ష్యంగా.. దేశంలో ఏకీకృత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకురానుంది. దీనికి ‘ది హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(హెచ్ఈసీఐ)’బిల్లు అని పేరు పెట్టారు. విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఇకపై స్వయంప్రతిపత్తితో అత్యంత పారదర్శకతతో అత్యున్నత విద్యాప్రమాణాలను పాటించేలా చేయడమే ఈ బిల్లు లక్ష్యమని న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. హెచ్ఈసీఐను ఏర్పాటుచేయాలని నూతన విద్యావిధానం(ఎన్ఈపీ)లో ప్రతిపాదించడం తెల్సిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బోధనేతర ఉన్నత విద్యా అంశాలను చూసే విశ్వవిద్యాలయాల నిధులసంఘం(యూజీసీ), సాంకేతిక విద్యాంశాలను చూసే అఖిలభారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ), ఉపాధ్యాయుల విద్యాంశాలను చూసే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిలను విలీనంచేస్తూ హెచ్ఈసీఐ తేవాలని బిల్లులో ప్రతిపాదించనున్నారు. -
కళంకిత నేతల తొలగింపు బిల్లు కమిటీకి అపరాజిత సారంగి సారథ్యం
న్యూఢిల్లీ: తీవ్ర నేరపూరిత కేసుల్లో 30 రోజులకు మించి జైళ్లో గడుపుతున్న కళంకిత ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులను పదవుల నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లును సమీక్షించేందుకు ఏర్పాటుచేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ బుధవారం ఏర్పాటుచేసింది. బీజేపీ మహిళా ఎంపీ అపరాజితా సారంగి జేపీసీకి సారథ్యంవహిస్తారని లోక్‌సభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో పేర్కొంది. అప్రతిష్ట మూటగట్టుకున్న నేతలను పదవుల నుంచి తొలగించేందుకు ఇటీవల కేంద్రప్రభుత్వం రాజ్యాంగ(130వ సవరణ)బిల్లు– 2025, జమ్మూ, కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ(సవరణ)బిల్లు–2025, కేంద్రపాలిత ప్రభుత్వాల(సవరణ)బిల్లు–2025లను తీసుకురావడం తెల్సిందే. ఈ బిల్లులను సమీక్షించేందుకు లోక్‌సభ మొత్తంగా 31 మంది సభ్యులతో జేపీసీని బుధవారం ప్రకటించింది. విపక్ష పార్టీలు ఈ కమిటీని బహిష్కరించినప్పటికీ నలుగురు విపక్ష పార్టీల సభ్యులకు కమిటీలో చోటు కలి్పంచారు. ఒక నామినేట్ సభ్యుడు సహా బీజేపీ నుంచి 15 మంది, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నుంచి 11 మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. బీజేపీ లోక్‌సభ సభ్యులు రవిశంకర్ ప్రసాద్, భర్తృహరి మహతాబ్, ప్రదాన్ బారువా, బ్రిజ్మోహన్ అగర్వాల్, విష్ణుదయాళ్ రామ్, డీకే అరుణ, పురుషోత్తమ్భాయ్ రూపాలా, అనురాగ్ ఠాకూర్, బ్రిజల్ లాల్, ఉజ్వల్ నికమ్, నబామ్ రేబియా, నీరజ్ శేఖర్, మనన్ కుమార్ మిశ్రా, కె. లక్ష్మణ్‌లు కమిటీలో ఉన్నారు. ఎన్సీపీ–ఎస్పీ పార్టీ నాయకురాలు సుప్రియా సూలే, అకాలీదళ్ నాయకురాలు హర్సిమ్రత్ బాదల్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, వైఎస్సార్సీపీ సభ్యుడు నిరంజన్ రెడ్డి తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ ప్యానెల్లో సభ్యత్వం తీసుకోబోమని ఇప్పటికే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రకటించాయి. ఎన్డీఏ కూటమిలోని దాదాపు ప్రతి పార్టీ తరఫున ఒకరికి కమిటీలో ప్రాధాన్యతదక్కింది. -
జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు..కన్సల్టెంట్‌గా అడ్వొకేట్ ఉమేష్ సాల్వి
న్యూఢిల్లీ: జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల వివాదంలో భాగంగా ఆ కేసును విచారించే జడ్డిల కమిటీకి సహాయం చేయడానికి న్యాయవాది కరణ్ ఉమేష్ సాల్వి కన్సల్టెంట్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్వీకర్ ఓం బిర్లా.. ఉమేష్ సాల్విని కన్సల్టెంట్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ వర్మపై అభిశంసన ప్రక్రియలను ప్రారంభించడానికి లోక్‌సభలో మద్దతు ఇచ్చిన తీర్మానం తర్వాత ఈ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా సదర కమిటీకి న్యాయ సహాయం అందించడానికి కరణ్ ఉమేష్ సాల్విని కన్సల్టెంట్‌గా నియమించారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలన్న ప్రతిపాదనపై ఆగస్టు నెలలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో 146 మంది ఎంపీలు సంతకాలు చేశారు. దీనిలో భాగంగా ముగ్గురు సభ్యులతో కూడిన జడ్జిల ప్యానల్‌ను నియమించగా, తాజాగా కరణ్ ఉమేవ్ సాల్విని కన్సల్టెంట్‌గా నియమించారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్ మోహన్ శ్రీవాస్తవ్, సీనియర్ న్యాయవాది బి.వి. ఆచార్యలు సభ్యులుగా ఉన్నారు. ఇదీ చదవండి: పాక్‌ను వణికించిన దీపావళి.. యాంటీ స్మోగ్ గన్లతో తక్షణ చర్యలు


