
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. నేడు కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే లోక్‌సభలో గందరగోళం చెలరేగింది. ప్రతిపక్ష ఎంపీలు బీహార్‌లో ఓటు చోరీ, ఎస్‌ఐఆర్ అంశంపై గందరగోళం సృష్టించారు. రాజ్యసభ సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. డిప్యూటీ చైర్మన్ వివిధ అంశాలపై చర్చించడానికి 267 నిబంధన కింద అందిన 19 నోటీసులను తిరస్కరించారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఎగువ సభ వాయిదా పడింది. అదేవిధంగా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య లోక్‌సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది.
దీనికి ముందు లోక్‌సభలో నినాదాలు చేస్తున్న ప్రతిపక్ష ఎంపీలతో స్పీకర్ ఓం బిర్లా ‘మీరు నినాదాలు చేసేంత తీవ్రతతో ప్రశ్నలు లేవనెత్తాలని, అప్పుడే దేశ ప్రజలకు ప్రయోజనాలు లభిస్తాయని అన్నారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడానికి ప్రజలు మిమ్మల్ని ఇక్కడకు పంపలేదు, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసే అధికారం ఏ సభ్యునికీ లేదని అభ్యర్థిస్తున్నాను.. హెచ్చరిస్తున్నాను’ అని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలలో అన్నారు.
#WATCH | Rajya Sabha adjourned till 2 PM following slogannering by Opposition MPs in the House
Deputy Chairman Harivansh says, "Please let the House function. This is Zero Hour." pic.twitter.com/uYYEDordhv— ANI (@ANI) August 18, 2025
శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై ప్రత్యేక సమావేశం
ఈరోజు లోక్ సభలో మధ్యాహ్నం రెండు గంటలకు శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై ప్రత్యేక సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ చర్చను ప్రారంభించనున్నారు. అలాగే నేడు జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు- 2025 ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ దీనిని ప్రవేశపెట్టనున్నారు.
మరోవైపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై చర్చ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండటంతో వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. శుక్రవారం ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంటు నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు ‘ఓటు చోరీ’ నిరసన ప్రదర్శన నిర్వహించారు.