న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ జాతీయ భద్రతా చట్టం (NSA) కింద నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన భార్య గీతాంజలి జె ఆంగ్మో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ఆంగ్మో పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు వాదించారు.
హింసకు వ్యతిరేకంగా మాట్లాడి, జాతి నిర్మాణంలో 30 అవార్డులు అందుకున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను ఇప్పుడు నేరస్థుడిగా చిత్రీకరిస్తున్నారని ఆయన భార్య సుప్రీంకోర్టుముందు వాపోయారు. సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధాన్ని సవాలు చేస్తూ సిబల్, ఆయన నిర్బంధానికి సంబంధించి పూర్తి కారణాలు అందించలేదనీ దీనికి వ్యతిరేకంగా వాదించేందుకు సరైన అవకాశం కూడా ఎప్పుడూ ఇవ్వలేదని వాదించారు. నిర్బంధానికి కారణాలు నిర్బంధించబడిన వ్యక్తికి అందించకపోతే, ఆదేశం (నిర్బంధం) "విటియేటెడ్" అని చట్టం నిర్దేశిస్తుందని నొక్కి చెబుతూ, సిబల్ నిర్బంధం మరియు ఆధారాల సరఫరాపై చట్టాన్ని ప్రస్తావించారు
కాగా ప్రభుత్వాలకు ప్రజా శాంతి లేదా జాతీయ భద్రతకు ముప్పుగా భావించే వ్యక్తులపై ముందస్తు చర్య తీసుకునే అధికారం ఇచ్చే NSA చట్టం కింద గత ఏడాది సెప్టెంబర్ 26న అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఆయనను జోధ్‌పూర్‌కు తరలించారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద రాష్ట్ర హోదా మరియు రక్షణలను డిమాండ్ చేస్తూ లడఖ్‌లోని లేహ్‌లో జరిగిన నిరసనల సందర్భంగా హింస చెలరేగడంతో ఆయనపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు మోపారు.దీనిపై అతని భార్య , విద్యావేత్త గీతాంజలి ఆంగ్మో అతని నిర్బంధాన్ని సవాలు చేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆంగ్మో తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఈ కేసువిచారణ జనవరి 12న వాయిదా పడింది.
ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్!
వాంగ్ చుక్ వాదన"నిర్బంధానికి గల అన్ని కారణాలను అందించకపోతే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 22 (5) ఏకపక్ష అరెస్టు , నిర్బంధం నుండి రక్షణ కల్పిస్తుందని వాంగ్ చుక్ తెలిపారు. సెప్టెంబర్ 10న నేను నిరాహార దీక్షకు దిగాను. దీక్ష 15వ రోజున, హింసాత్మక సంఘటనలు జరిగాయి, దానితో నేను చాలా కలత చెంది24న నా నిరాహార దీక్షను విరమించాను , హింస ఆపాలని ఒక ప్రసంగం ఇచ్చాను.. 26న అదుపులోకి తీసుకున్నారు. 1922లో ఫిబ్రవరి 4న చౌరీ చౌరా సంఘటన తర్వాత బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయాలని మహాత్మా గాంధీ తీసుకున్న నిర్ణయంతో వాంగ్ చుక్ పోల్చుకున్నారు. అలాగే తనను నేరస్థుడిగా చూపించడానికే వాస్తవాలను తారుమారు చేస్తున్నారన్న వాంగ్‌చుక్ వాదనను సిబల్ కోర్టుకు తెలిపారు.
ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, వీడియో వైరల్
పెళ్లికి పిలిస్తే రాలేదు.. కట్ చేస్తే అస్థిపంజరం దొరికింది


