భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందాలు | PM Modi Invited Benjamin Netanyahu To Visit India, Signed 16 MoUs Across Key Sectors, Check Out More Details | Sakshi
Sakshi News home page

భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందాలు

Feb 26 2026 5:00 PM | Updated on Feb 26 2026 5:35 PM

Modi And Benjamin Netanyahu: India And Israel Sign Mous

జెరూసలేం: ఇజ్రాయెల్‌తో భారత్‌ పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. పలు ఒప్పందాలపై నరేంద్ర మోదీ-నెతన్యాహు సంతకాలు చేసుకున్నారు. ఇజ్రాయెల్‌ ప్రధానితో నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్‌లో పర్యటించాలని నెతన్యాహును ప్రధాని మోదీ ఆహ్వానించారు. రక్షణ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి.

విద్య, వ్యవసాయం, వాణిజ్యం, సైబర్‌ సెక్యూరిటీ, సర్వీస్‌ సెక్టార్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆవిష్కరణల రంగంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్‌లో యూపీఐ వాడకంపైనా భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ రంగంలో పరస్పర సహకారానికి భారత్‌-ఇజ్రాయెల్‌ నిర్ణయించాయి.

వ్యవసాయం నుంచి ఏఐ వరుకు పలు ఎంవోయూలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. 16 ఎంవోయూలపై భారత్‌​​-ఇజ్రాయెల్‌ సంతకాలు చేసుకున్నాయి. 11 కీలక ప్రకటనలు చేశాయి. టెక్నాలజీ కేంద్రంగా భవిష్యత్‌ సంబంధాలు ఉంటాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌కు త్వరలోనే తుదిరూపు ఇస్తామన్నారు. పశ్చిమమాసియాలో శాంతిస్థాపనకు మోదీ పిలుపునిచ్చారు. సంఘర్షణల్లో మానవత్వం బాధితురాలు కాకూడదన్నారు.


 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement