ఐరాసలో పాక్‌ ఆరోపణలు.. సాక్ష్యాలతో తిప్పికొట్టిన భారత్! | Pakistan Must be living in La-La land India | Sakshi
Sakshi News home page

ఐరాసలో పాక్‌ ఆరోపణలు.. సాక్ష్యాలతో తిప్పికొట్టిన భారత్!

Feb 26 2026 11:17 AM | Updated on Feb 26 2026 11:22 AM

Pakistan Must be living in La-La land India

జెనీవా: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 55వ సాధారణ సమావేశాల్లో పాకిస్తాన్‌కు చెందిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) భారత్‌పై చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఖండించింది. జమ్ముకశ్మీర్ అభివృద్ధిని చూసి పాక్ అసూయతో రగిలిపోతోందని, అందుకే అంతర్జాతీయ వేదికలపై విషం చిమ్ముతోందని భారత తొలి కార్యదర్శి అనుపమ సింగ్ ధ్వజమెత్తారు.

జమ్ముకశ్మీర్ భూభాగం భారత్‌లో అంతర్భాగమని, అది ఎప్పటికీ విడదీయలేని అంశమని ఆమె స్పష్టం చేశారు. 1947 భారత స్వాతంత్య్ర చట్టం ప్రకారం జమ్ముకశ్మీర్ భారత్‌లో విలీనం కావడం చట్టబద్ధమని, ఇది ఎవరూ మార్చలేని సత్యమని ఆమె పేర్కొన్నారు. పాకిస్తాన్ తన ఆధీనంలో ఉన్న ఆక్రమిత భూభాగాలను వెంటనే ఖాళీ చేయడమే ప్రస్తుతం ఉన్న ఏకైక అపరిష్కృత అంశమని ఆమె స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో నమోదైన రికార్డు స్థాయి ఓటింగ్ శాతం.. అక్కడి ప్రజలు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని, హింసను తిరస్కరించారని చెప్పడానికి నిదర్శనమని అనుపమ సింగ్ పేర్కొన్నారు.
 

కశ్మీరీ ప్రజలు అభివృద్ధి, ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు సాగుతున్నారని ఆమె అ‍న్నారు. గత ఏడాది ప్రారంభమైన  'చీనాబ్ రైల్వే బ్రిడ్జి'ని కూడా పాక్ నకిలీదని భావిస్తే.. ఆ దేశం ఖచ్చితంగా వాస్తవాలకు దూరంగా ‘లా-లా ల్యాండ్’ (కలల లోకం)లో బతుకుతున్నట్లేనని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం గురించి పాక్ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ, ఎన్నికైన పౌర ప్రభుత్వాలు కనీసం తమ పదవీకాలాన్ని కూడా పూర్తి చేసుకోలేని దేశం నుండి భారత్ ప్రజాస్వామ్య పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని అనుపమ సింగ్ ఘాటుగా స్పందించారు. బుధవారం జరిగిన ఈ హై-లెవల్ సమావేశంలో పాకిస్తాన్ ప్రచారం వెనుక ఉన్న కుట్రలను సాక్ష్యాధారాలతో సహా భారత్ తిప్పికొట్టింది. ఫిబ్రవరి 23 నుండి 31 వరకు కొనసాగనున్న ఈ 61వ ఐరాస మానవ హక్కుల మండలి సమావేశాల్లో భారత్ తన గొంతును బలంగా వినిపిస్తూ, పాక్ కుట్రలను ప్రపంచ దేశాల ముందు ఉంచింది.

ఇది కూడా చదవండి: అరుదైన నేతగా ప్రధాని మోదీ ఘనత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement