breaking news
Pakistan
-
ఇమ్రాన్ ఖాన్ మరణించారా?
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, PTI అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం విషయంలో ఈ దేశ జర్నలిస్టు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు ఆ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇమ్రాన్ జైలులోనే మరణించి ఉండొచ్చంటూ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. రావల్పిండిలోని ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్ లో ఉన్న ముగ్గురు సీనియర్ సైనికాధికారులు ఇమ్రాన్ ఖాన్ ఇక బతికి లేరని భావిస్తున్నారని ఆయన తెలిపారు. అయితే ఈ సమాచారం ధ్రువీకరించబడలేదని, ఆ అధికారులు కూడా ఇమ్రాన్ మరణాన్ని ప్రత్యక్షంగా చూడలేదని జర్నలిస్ట్ స్పష్టం చేశారు.2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనను కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించినా అనుమతి లభించడం లేదని ఆరోపిస్తోన్నారు. ఇమ్రాన్‌కు స్వతంత్ర వైద్య పరీక్షలు నిర్వహించాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. గత ఏడాది కూడా ఆయన జైలులో మరణించారంటూ పుకార్లు వచ్చాయి. అయితే డిసెంబర్ 2న ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ అడియాలా జైలులో ఇమ్రాన్‌ను కలసి, ఆయన శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారని తెలిపారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.మరోవైపు ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోతే భారీగా ఆందోళనలు చేపడతామని PTI హెచ్చరించింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి, PTI నేత సొహైల్ అఫ్రిది మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన 20 లక్షల మందికి పైగా ప్రజలు రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. యువతలో తీవ్ర ఆగ్రహం ఉందని, దాన్ని నియంత్రించడం అధికారులకు సాధ్యం కాదని హెచ్చరించారు. సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్ వైపు భారీ లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు PTI ప్రకటించింది. అంతకుముందే ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోతే సుప్రీంకోర్టు, ఆ తర్వాత అడియాలా జైలు ఎదుట నిరసనలు చేపట్టి, దేశవ్యాప్తంగా ఆందోళనలు విస్తరిస్తామని అఫ్రిది వెల్లడించారు.ఇమ్రాన్ ఖాన్ నిర్బంధ పరిస్థితులపై అంతర్జాతీయ స్థాయిలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 13 మంది అమెరికా కాంగ్రెస్ సభ్యులు విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఈ విషయమై లేఖ రాశారు. ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా బీబీ నిర్బంధ పరిస్థితులపై పాకిస్థాన్‌తో చర్చించాలని కోరారు. ఇమ్రాన్‌ను రోజుకు 23 గంటల వరకు ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారన్న ఆరోపణలు, ఆయన కుడి కంటికి తీవ్ర నష్టం జరిగిందన్న నివేదికలు, 85 శాతం చూపు కోల్పోయినట్లు న్యాయవాది చేసిన ఆరోపణలను లేఖలో ప్రస్తావించారు. అయితే ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు ఇప్పటివరకు ఎలాంటి ధ్రువీకరించిన ఆధారం లేదు.ఆయనను కలిసేందుకు ఆంక్షలు, ఆరోగ్యంపై ఆందోళనలు, సైనిక వర్గాల పేరుతో వచ్చిన ధ్రువీకరించని సమాచారం, PTI భారీ నిరసనలకు పిలుపు నేపథ్యంలో పాకిస్థాన్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
పాక్.. సౌదీ.. టర్కీ ఒప్పందం ఒక్కటైన మూడు ముస్లిం దేశాలు..
-
భారీ జంప్ కొట్టిన బాబర్ ఆజం.. రెండేళ్ల తర్వాత టాప్-10లోకి ఎంట్రీ
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం టెస్ట్ క్రికెట్లో మళ్లీ తన పాత స్థానాన్ని అందుకున్నాడు. తాజాగా విడుదలైన ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో బాబర్ టాప్-10లోకి తిరిగి వచ్చాడు.దాదాపు రెండేళ్ల తర్వాత అతడు టాప్-10లో చోటు సంపాదించడం విశేషం. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడటంతో బాబర్ ర్యాంకింగ్ మెరుగుపడింది.ఐదు స్థానాలు ఎగబాకి..వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. విదేశీ గడ్డపై టెస్ట్ విజయం కోసం పాక్ మూడేళ్లకు పైగా ఎదురుచూసింది. ఈ విజయంతో సిరీస్‌లోనూ పాక్‌కు కీలక ఫలితం దక్కింది.ఈ మ్యాచ్‌లో బాబర్ తొలి ఇన్నింగ్స్‌లో 88 పరుగులు చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ ప్రదర్శనతో బాబర్ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకున్నాడు.సెప్టెంబర్ 2024 తర్వాత ఇదే తొలిసారిబాబర్ ఆజం చివరిసారిగా 2024 సెప్టెంబర్ ప్రారంభంలో ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్నాడు. ఆ తర్వాత ఫామ్‌లో ఒడిదుడుకులతో ర్యాంకింగ్స్‌లో క్రమంగా కిందికి పడిపోయాడు. ఇప్పుడు వెస్టిండీస్‌పై కీలక ఇన్నింగ్స్‌తో మరోసారి టాప్-10లోకి ప్రవేశించాడు.బాబర్‌తో పాటు మరో ఇద్దరికీ లాభంతాజా ర్యాంకింగ్స్‌లో బాబర్‌తో పాటు మరో ఇద్దరు పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా మెరుగైన స్థానాలను అందుకున్నారు. చాలా కాలం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ వెస్టిండీస్ సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. అతని ప్రదర్శనకు ర్యాంకింగ్స్‌లో మంచి ఫలితం దక్కింది. అతడు ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 32వ స్థానానికి చేరాడు.బాబర్ మినహా టాప్-10 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు లేవు. ట్రవిస్ హెడ్, హ్యారీ బ్రూక్, జో రూట్ టాప్-3 బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. భారత్ తరఫున శుభ్‌మన్ గిల్‌దే (7) టాప్ ర్యాంక్. యశస్వి జైస్వాల్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నాడు. కుల్దీప్ యాదవ్, సిరాజ్, జడేజా వరుసగా 14 నుంచి 16 స్థానాల్లో నిలిచారు. పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ విండీస్‌తో రెండో టెస్ట్‌లో రాణించడంతో 5 స్థానాలు మెరుగుపర్చుకొని 30వ స్థానానికి చేరాడు. -
సంకేతమే అయినా మున్ముందు సవాలే!
సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియే ఆగస్ట్ 7న ‘మక్కా రక్షణ ఒడంబడిక’పై రియాద్‌లో సంతకాలు చేశాయి. దీనికి సైనికపరంగాకన్నా ఇతరత్రా ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇది పశ్చిమాసియాలో నీరుగారుతున్న అమెరికా ప్రాభవాన్ని వెల్లడిస్తోంది. భద్రతా ప్రాధాన్యాల రీత్యా ఈ మూడు దేశాల మధ్యనున్న సారూప్యత బహు స్వల్పం. అమెరికా– ఇరాన్ మధ్య యుద్ధ పర్యవసానాలు సౌదీకి తలనొప్పిగా పరిణమించాయి. ఇరాన్‌తో దాని వైరం 1979 నుంచి సాగుతోంది. పాక్ దృష్టంతా భారత్‌పైనే. ‘నాటో’ కూటమిలో ఒకటిగా ఉన్న తుర్కియే అటు పశ్చిమాసియాలోనూ, ఇటు ఉత్తరాఫ్రికాలోనూ తన పలుకుబడిని పెంచుకోవాలని చూస్తోంది. ఆ ప్రాంతంలో నమ్మదగిన రక్షణ సామగ్రి ఎగుమతి దారుగా అవతరించాలని కోరుకుంటోంది. ఇలా వైరుధ్యాలున్నా రక్షణ కోసం ఈ మూడు దేశాలు ఒక వర్గంగా ఏర్పడటం ప్రతీకాత్మకంగా గణనీయమైనదే. ఇది మూడు భారీ మార్పులను ప్రతిబింబిస్తోంది: భిన్నమైన వ్యూహాత్మక, భద్రతా ప్రాధాన్యతలు; నూతన భద్రతా భాగస్వామ్యాల కోసం అన్వేషణ; అమెరికాపై ఇన్నాళ్ళూ ఉన్న నమ్మకం సడలిపోవడం.అమెరికాపై పోతున్న ఆశలుపశ్చిమాసియా, దానిని అనుకుని ఉన్న ప్రాంతాలు ఒక భద్రతా చట్రాన్ని కల్పించుకోవడంలో కొన్ని దశాబ్దాలుగా వాషింగ్టన్‌పైనే ఆధారపడుతూ వచ్చాయి. అమెరికా నుంచి ఆయుధాలు కొని సౌదీ అరేబియా దాని నుంచి భద్రతాపరమైన పూచీకత్తులు సంపాదించింది. తుర్కియే ఎలాగూ ‘నాటో’లో సభ్యురాలు. పాకిస్తాన్ ‘‘నాటో’యేతర ప్రధాన మిత్రపక్షం’.ఆరామ్‌కోపై జరిగిన ఇటీవలి దాడులపైనా, హౌతీలను కట్టడి చేయడంపైనా అమెరికా స్పందన పేలవంగా ఉందని సౌదీ భావిస్తోంది. సిరియా విషయంలో ‘నాటో’తో తుర్కియే చాలా ఏళ్లుగా ఘర్షణపడుతోంది. ఎఫ్–35 యుద్ధ విమానాల విక్రయాలు, కుర్దుల అంశం కూడా దాన్ని చిరాకుపరుస్తున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగడం, 2009 తర్వాత అమెరికా క్రమంగా భారత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపించడంతో వ్యూహాత్మకంగా ఏకాకినవుతున్నానని పాక్ భావిస్తూ ఉండవచ్చు. రియాద్, అంకారా, ఇస్లామాబాద్ ఒకదానికొకటి రక్షణగా నిల వాలని నిర్ణయించుకోవడం గణనీయమైన పరిణామమే. ఈ ఒడంబడిక ప్రస్తుతానికి పస లేనిదిగా కనిపించవచ్చుకానీ, ఇక్కడ సంకే తానికే ఎక్కువ ప్రాధాన్యం. మూడు ప్రధాన ముస్లిం మెజారిటీ సైనిక శక్తులు చేతులు కలుపుతున్నాయి. పాకిస్తాన్ అమ్ములపొదిలో అణ్వస్త్రం ఉంది. తుర్కియేలో ప్రధాన రక్షణ సామగ్రి పరిశ్రమలు న్నాయి. సౌదీ అరేబియాకు చమురు నిల్వలు పుష్కలం.ఇజ్రాయెల్‌కు సంకటమే!ఈ మూడు దేశాల్లో ఏ దేశంపైన దాడి జరిగినా మిగిలిన రెండు దేశాలపైన కూడా దాడి జరిగినట్లుగానే భావించాలని పేర్కొంటున్న క్లాజు మక్కా ఒప్పందానికి ప్రాముఖ్యతను సంతరిస్తోంది. కాకపోతే, భాష అస్పష్టంగా ఉంది. ‘నాటో’ ఆర్టికల్ 5 తరహాలో, ఆటోమే టిక్‌గా యుద్ధానికి దిగుతామనే నిర్దుష్టమైన పదజాలాన్ని చేర్చలేదు. సమైక్య కమాండ్ల ప్రస్తావన లేదు. సంయుక్తంగా స్థావరాలు నిర్వహిస్తామని ఎక్కడా ప్రకటించలేదు. ఈ ఒడంబడిక తక్షణ సైనిక ప్రభావం పరిమితం కావచ్చు. కానీ, అస్పష్టతకు కూడా భౌగోళిక రాజకీయాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఇది శత్రు దేశాల్లో అయోమయాన్ని సృష్టిస్తుంది. వాటి రక్షణ సన్నద్ధత ఖర్చును పెంచుతుంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు సంబంధించిన భద్రతా చర్చల్లో తల దూర్చాలని తుర్కియే చాలా కాలంగా అభిలషిస్తోంది. కానీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, అమెరికా దాన్ని దూరంపెడుతూ వచ్చాయి. ఇపుడు మక్కా ఒడంబడికతో తుర్కియే ఆ రకమైన చర్చల్లో పాల్గొనేందుకు ప్రవేశార్హత సంపాదించుకున్నట్లు అయింది. ఇది ఇజ్రాయెల్‌కు కంటక ప్రాయంగా మారడం ఖాయం. గాజాలో ఇజ్రాయెల్ చర్యలను తుర్కియే బాహాటంగా విమర్శిస్తోంది. మక్కా రక్షణ ఒడంబడికతో అటు తుర్కియే, ఇటు అణ్వస్త్ర సహిత పాకిస్తాన్ పశ్చిమాసియా భద్రతకు సంబంధించిన అధికారిక చర్చల్లో మొదటిసారిగా పాల్గొనేందుకు ప్రయత్నించవచ్చు. ఇంత కాలం అమెరికా నేతృత్వంలోని అబ్రహాం ఒప్పందాల గొడుగు నీడన ఇజ్రాయెల్ పనులు చక్కబెట్టుకుంటూ వస్తోంది. గల్ఫ్ కౌన్సి ల్తో సన్నిహిత సంబంధాలు నెరపుతోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా భద్రతాపరమైన సహకారాన్ని గుట్టుచప్పుడు కాకుండా అందిస్తోంది. తద్వారా, పాక్‌ను ఆమడదూరంలో ఉంచుతూ వస్తోంది. తాజా ఒడంబడిక ఈ సూత్రీకరణలన్నింటినీ అస్తవ్యస్తం చేస్తోంది. ఇజ్రాయెల్‌ను గుర్తించని పాక్‌కు గల్ఫ్ భద్రతా చర్చల బల్ల వద్ద కుర్చీ కల్పిస్తోంది. పాలస్తీనియన్ల తరఫున వకాల్తా పుచ్చుకున్నదిగా తనను చాటుకునే తుర్కియేకు సంస్థాపరమైన పరపతిని తెచ్చిపెడుతోంది. భారత్ ఎందుకు జాగ్రత్తపడాలి?ఈ ఒడంబడికతో న్యూఢిల్లీకి సంబంధం లేదని అనడానికి లేదు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సిసలైన కాపలాదారుగా భారత్ తనను తాను చాటుకుంటూ వస్తోంది. సాగర జలాలకు సంబంధించినంతవరకు భద్రతకు నికరంగా భారత్ పైనే ఆధారపడ టానికి ప్రాధాన్యం ఇస్తారనే భావనపైనే ప్రధాని నరేంద్ర మోదీ తన ‘సాగర్’, ‘మహాసాగర్’ విధానాలను నిర్మించుకుంటూ వచ్చారు. సౌదీ అరేబియా 14 దేశాలతో కలసి జూలై 30న ఒక మారిటైమ్ సెక్యూరిటీ క్లస్టర్‌ను ప్రారంభించింది. కానీ ఈ గ్రూపులో భారత్ భాగంగా లేదు. భారతదేశానికి బదులుగా పాక్, తుర్కియేలతో రక్షణ అవగాహన కల్పించుకునేందుకు సౌదీ మొగ్గు చూపడాన్నే ఒక భౌగోళిక రాజకీయ సంకేతంగా తీసుకోవాలి. భారత్‌తో ఆర్థిక సంబంధాలు, ఇంధన వర్తకం వృద్ధి చెందుతున్నా, సంక్షోభం ముంచుకొస్తే, భారతదేశాన్ని ఒక ముఖ్యమైన భద్రతా భాగ స్వామిగా రియాద్ చూడదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. పాకిస్తాన్ పరపతి పెరుగుతూండటం రెండవ అంశం. రెండు పవిత్ర మసీదులకు రక్షణదారుగా ఉన్న దేశంతోనూ, ఒక ‘నాటో’ సైనిక శక్తితోనూ రక్షణ ఒడంబడిక కుదుర్చుకోవడం ఇస్లామాబాద్‌కు దౌత్యపరమైన విలువ తెచ్చిపెడుతోంది. అంతర్జాతీయంగా పాక్ ఏకాకి అయిందనే కథనానికి ఇది గండికొడుతోంది. బలాబలాల మధ్య సమతూకాన్ని మక్కా రక్షణ ఒడంబడిక రాత్రికి రాత్రి మార్చేయకపోవచ్చు. సంయుక్త సున్నీ సైనిక శక్తి రేపటికి రేపే అవతరించకపోవచ్చు. కానీ, ఈ ఒడంబడిక రెండు చేదు వాస్తవాలను వెల్లడిస్తోంది. ఒకటి– కీలకమైన మధ్యవర్గ శక్తులు కేవలం అమెరికాపై ఆధారపడే ధోరణి నుంచి దూరం జరుగుతున్నాయి. రెండు– ఈ వైవిధ్యీకరణలో సిద్ధాంతాన్ని పక్కనపెట్టి, తక్షణ ఆచరణాత్మక దృక్పథంతో నూతన కూటములు ఏర్పడుతున్నాయి. ఢిల్లీ ఎదుట సునిశితమైన సవాల్ ఉంది. గల్ఫ్ నుంచి ఆగ్నేయాసియా వరకు భద్రతను కల్పించగల శక్తిగా అవతరించాలని కోరుకుంటున్న భారత్ తన ‘సాగర్’, ‘మహాసాగర్’ విధానాలను సౌదీ అరేబియా వంటి దేశాలు అక్కున చేర్చుకోగలిగినవిగా మలచాలి. సి. ఉదయ్ భాస్కర్వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ -
కాల్పుల తర్వాత కౌగిలింతలా? పీవోకేలో పొలిటికల్ గేమ్!
పీవోకేలో ఆందోళనలు, భద్రతా చర్యల తర్వాత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వరం మార్చారు. నెలలుగా కొనసాగుతున్న నిరసనలపై కఠిన వైఖరి ప్రదర్శించిన ప్రభుత్వం.. ఇప్పుడు చర్చల ప్రతిపాదనతో ముందుకొచ్చింది. సమస్యలకు పరిష్కారం బలప్రయోగంలో లేదని, చర్చల ద్వారానే మార్గం కనుగొనాలని షెహబాజ్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటనపై నిరసనకారుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పీవోకేలో జరిగిన తీవ్ర నిరసనలు, భద్రతా చర్యల నేపథ్యంలో షెహబాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ద్రవ్యోల్బణం, భారీ విద్యుత్ ఛార్జీలు, ఆర్థిక నిర్లక్ష్యం, ఎన్నికల ప్రక్రియపై ఆరోపణలు వంటి అంశాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఆందోళనలు ఉధృతమయ్యాయి. అయితే “సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి’’ అని షెహబాజ్ పేర్కొన్నారు. రాబోయే ప్రభుత్వం కూడా నిరసనకారులతో చర్చల ప్రక్రియను కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.క్రాక్‌డౌన్ తర్వాత మారిన స్వరంపీవోకేలో రెండు నెలలకు పైగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. విద్యుత్ ధరల తగ్గింపు, ఆర్థిక సమస్యల పరిష్కారం, రాజకీయ సంస్కరణలు వంటి డిమాండ్లతో వారు ఆందోళనలు చేస్తున్నారు. నిరసనల్లో విద్యార్థులు, వ్యాపారులు, రవాణా కార్మికులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)పై గతంలో కఠిన చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు అదే వర్గాలతో చర్చలకు సిద్ధమని ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నిరసనకారులు మాత్రం ఇది సమస్యల పరిష్కారానికి నిజమైన ప్రయత్నమా? లేదంటే ఆందోళనల తీవ్రతను తగ్గించేందుకు చేస్తున్న వ్యూహమా? అని ప్రశ్నిస్తున్నారు.‘అల్లర్లకు ప్రయత్నిస్తే సహించం’చర్చలకు సిద్ధమని చెబుతూనే షెహబాజ్ హెచ్చరికలు కూడా చేశారు. శాంతియుతంగా తమ సమస్యలను చెప్పేవారితో చర్చిస్తామని, అయితే ప్రాంతంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం గతంలో కొందరు నిరసనకారులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపించింది. ఈ ఆరోపణల ఆధారంగానే భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.ఎన్నికల వేళ రగిలిన అసంతృప్తిపీవోకేలో ఎన్నికల ప్రక్రియ కూడా వివాదాలకు కారణమైంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓట్ల ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని JAAC ఆరోపించింది. ఘర్షణలు, భద్రతా బలగాల చర్యల మధ్య ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మూడు దశల్లో జరగాల్సిన ఎన్నికల్లో పాకిస్థాన్ ముస్లిం లీగ్–నవాజ్ (PML-N) ఆధిపత్యం సాధించినట్లు సమాచారం. 45 ఎన్నికైన స్థానాల్లో మెజారిటీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకున్నట్లు తెలుస్తోంది.మృతుల సంఖ్యపై భిన్న వాదనలుజూన్లో ప్రారంభమైన ఘర్షణల్లో కనీసం 11 మంది మరణించినట్లు అధికారిక పలు వార్తా కథనాల నివేదికలు చెబుతుండగా.. నిరసనకారుల వర్గాలు మాత్రం మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉందని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ గణాంకాలను పాకిస్థాన్ ప్రభుత్వం ఖండిస్తోంది.‘దేశభక్తులే’ అంటున్న పీఎంఎల్–ఎన్షెహబాజ్ సన్నిహితుడు, పీఎంఎల్–ఎన్ నేత రానా సనావుల్లా కూడా నిరసనకారులపై స్వరం మార్చారు. JAACలో ఉన్న వారిలో 99 శాతం మంది దేశభక్తులేనని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారితో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.చర్చల వెనుక రాజకీయ లెక్కలు?అణచివేతతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పుడు చర్చల ప్రతిపాదన చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా అసంతృప్తిని తగ్గించడం, ప్రాంతంలో శాంతి నెలకొల్పడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. అణచివేత తర్వాత చర్చల మాట ఎత్తిన షెహబాజ్ ప్రభుత్వం.. నిజంగా సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తుందా? లేదంటే ఇది కేవలం రాజకీయ వ్యూహమా? అన్నది ఇప్పుడు పీవోకేలో ప్రధాన చర్చగా మారింది.నెలల తరబడి నిరసనలను ఎదుర్కొనేందుకు కఠిన వైఖరి అవలంబించిన ప్రభుత్వం.. ఇప్పుడు శాంతి, చర్చల భాష మాట్లాడటం పీవోకేలో కొత్త చర్చకు దారితీసింది. విమర్శకులు దీనిని “ముందు అణచివేత.. తర్వాత సామరస్య పాఠాలు” అంటూ వ్యంగ్యంగా అభివర్ణిస్తున్నారు. -
ముంబై 26/11 ఉగ్రవాది మిస్టరీ డెత్.. పాక్‌లో హైటెన్షన్!
దాయాది దేశం పాకిస్తాన్లో లష్కరే తోయిబా (LeT) కీలక ఆపరేటివ్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం సంచలనంగా మారింది. ఓ గుర్తు తెలియని ప్రాంతంలో భోజనం చేసిన అనంతరం మసీదుకు వెళ్లిన అబ్దుల్ అజీజ్.. అక్కడి ప్రవేశద్వారం వద్ద ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, అతడి మరణానికి అసలు కారణమేంటన్నది ఇప్పటికీ అధికారికంగా తేలలేదు. భోజనం చేసిన తర్వాతే కుప్పకూలడంతో విష ప్రయోగం జరిగిందా? లేక సహజ కారణాలతోనే మరణించాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దురంధర్‌లో చూపించినట్టేనా?ఇటీవల ఉగ్రవాదం, ఇంటెలిజెన్స్ ఆపరేషన్ల నేపథ్యంలో చర్చకు వచ్చిన ‘దురంధర్’ కోణంతో ఈ ఘటనను కొందరు సోషల్ మీడియాలో పోల్చుతున్నారు. ముఖ్యంగా ఒక కీలక ఉగ్రవాది అకస్మాత్తుగా.. ఎలాంటి కాల్పులు, పేలుళ్లు లేకుండా.. భోజనం తర్వాత మృతి చెందడం పలు ఊహాగానాలకు కారణమవుతోంది. అయితే “దురంధర్ తరహాలో భారత ఏజెన్సీల ఆపరేషన్ జరిగిందా?” అనేది ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారం లేని ప్రశ్న మాత్రమే.ఎందుకింత ప్రాధాన్యం?అబ్దుల్ అజీజ్ సాధారణ వ్యక్తి కాదని నివేదికలు చెబుతున్నాయి. అతడు లష్కరే తోయిబాలో కీలక స్థాయిలో పనిచేసిన ఆపరేటివ్‌గా, 2008 ముంబై 26/11 ఉగ్రదాడులతో సంబంధం ఉన్న వ్యక్తి. లష్కరే తోయిబా వ్యవస్థలో అతడికి కీలక బాధ్యతలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లలో మరణించిన లష్కరే ఉగ్రవాదుల కుటుంబాలకు సంబంధించిన వ్యవహారాలను చూసే విభాగంతో అతడికి సంబంధం ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అందుకే ఇలాంటి వ్యక్తి ఎలాంటి కాల్పులు లేదా దాడి ఆనవాళ్లు లేకుండా ఆకస్మికంగా మృతి చెందడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.కాగా, అబ్దుల్ అజీజ్ మసీదుకు వెళ్లే ముందు ఓ తెలియని ప్రదేశంలో భోజనం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత మసీదు వద్దకు చేరుకుని కుప్పకూలిపోయాడు. ఈ క్రమం కారణంగానే ఆహారంలో విషపదార్థం కలిపారా? అనే అనుమానం తెరపైకి వచ్చింది. అయితే విషప్రయోగం జరిగిందని ఇప్పటివరకు ఫోరెన్సిక్ లేదా అధికారిక నివేదిక ధృవీకరించలేదు.పాక్‌లో మిస్టరీ మరణాలుఅబ్దుల్ అజీజ్ మరణం వెలుగులోకి రావడంతో పాకిస్తాన్లో కీలక ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తుల అనుమానాస్పద మరణాలపై మరోసారి చర్చ మొదలైంది. అబ్దుల్ అజీజ్ మృతికి కారణం తెలుసుకోవాలంటే పోస్ట్‌మార్టం, టాక్సికాలజీ/ఫోరెన్సిక్ పరీక్షలు, అతడు భోజనం చేసిన ప్రదేశానికి సంబంధించిన దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజీ వంటి వివరాలు కీలకం కానున్నాయి. అవి బయటకు వస్తేనే ఇది సాధారణ వైద్య కారణాలతో జరిగిన మరణమా.. విషప్రయోగమా.. లేక నిజంగానే పక్కా టార్గెట్ ఆపరేషనా? అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
‘నో మ్యాన్స్ ల్యాండ్’.. ఈ భూమిపై ఎవరికీ హక్కు లేదా?
రెండు దేశాల సరిహద్దుల మధ్య ఎవరికీ చెందని భూమిగా పిలిచే ‘నో మ్యాన్స్ ల్యాండ్’ (No Man's Land), ‘జీరో లైన్’ (Zero Line) గురించి తరచూ చర్చలు జరుగుతుంటాయి. దేశాల మధ్య వివాదాలు, సరిహద్దు భద్రత మధ్య ఈ ప్రత్యేక ప్రాంతంపై ఎవరికి అధికారాలు ఉంటాయనే వివరాలు తెలుసుకుందాం.సరిహద్దుల్లో ‘నో మ్యాన్స్ ల్యాండ్’ అంటే ఏమిటి?ప్రపంచంలోని పలు దేశాలు తమ పొరుగు దేశాలతో సరిహద్దులను పంచుకుంటున్నాయి. ఇలా రెండు దేశాల సరిహద్దుల మధ్య వదిలివేసిన ఖాళీ భూమిని ‘నో మ్యాన్స్ ల్యాండ్’ అని పిలుస్తారు. దీనిని కొన్నిసార్లు ‘జీరో లైన్’ అని కూడా వ్యవహరిస్తారు. ప్రత్యేకించి భారత్-పాకిస్తాన్ సరిహద్దుల సందర్భంలో ఈ పదం ఎక్కువగా వాడుకలో వినిపిస్తుంటుంది. ఈ ప్రత్యేక ప్రాంతంపై ఏ ఒక్క దేశానికీ ప్రత్యేకమైన యాజమాన్య హక్కులు ఉండవు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం ఎవరికీ చెందని భూమి మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ఏర్పాటు చేసిన ఒక ‘బఫర్ జోన్ ’ మాదిరిగా పనిచేస్తుంది.‘జీరో లైన్’ ఎక్కడ ఉంటుంది?.. ప్రత్యేకత ఏమిటి?రెండు దేశాల సరిహద్దులు ముఖాముఖిగా కలిసే వాస్తవిక రేఖను ‘జీరో లైన్’ అని అంటారు. భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని పలు ప్రాంతాలలో ఈ జీరో లైన్ స్పష్టంగా హైలైట్ చేసి ఉంటుంది. అదే సమయంలో జమ్ము కశ్మీర్ లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)వద్ద దీని పరిస్థితి మరింత సున్నితంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో రెండు దేశాల సైనిక చౌకీలు ఎదురుగా మోహరించి ఉంటాయి. సరిహద్దుల్లో జరిగే ప్రతీ చిన్న కదలికను ఇరు దేశాల భద్రతా బలగాలు అత్యంత నిశితంగా గమనిస్తూ ఉంటాయి.నిజంగా ఎవరికీ హక్కులు ఉండవా?జీరో లైన్ చుట్టుపక్కల ఉండే భూభాగాన్ని సాధారణంగా ‘నో మ్యాన్స్ ల్యాండ్’ అంటారు. ఇది ఏ దేశపు పౌరులు కూడా వినియోగించడానికి వీలు లేని ప్రాంతం. సాధారణ పరిస్థితుల్లో ఇక్కడ ఏ దేశపు ప్రత్యక్ష పౌర నియంత్రణ ఉండదు. భద్రతాపరమైన కఠిన నిబంధనల కారణంగా సామాన్య ప్రజల ప్రవేశంపై ఇక్కడ నిషేధం కొనసాగుతుంది. కొన్నిసార్లు ఇదే వివాదాస్పద ప్రాంతం ఇరు దేశాల మధ్య జరిగే ఘర్షణలు, కాల్పులు, సైనిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారుతుంది.రక్షణ వలయంగా మారిన సరిహద్దు భద్రతజీరో లైన్ పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు అత్యంత కఠినంగా, పటిష్టంగా ఉంటాయి. భారతదేశం వైపు నుంచి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పాకిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ రేంజర్స్ నిరంతరం గస్తీ కాస్తుంటాయి. పలు అత్యంత సున్నితమైన ప్రాంతాలలో మందుపాతరలు, అత్యాధునిక స్పై గ్యాజెట్లు, భారీ సైనిక శిబిరాలు ఏర్పాటై ఉంటాయి. ఈ కారణాల వల్ల ఎలాంటి అనుమతి లేకుండా ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం చట్టపరమైన నేరం మాత్రమే కాకుండా, ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంది.చారిత్రక వివాదాలు.. సరిహద్దు ఉద్రిక్తతలుప్రపంచ చరిత్రలో ఇలాంటి భూమిని చేజిక్కించుకోవాలనే దురాశతో పలు దేశాల మధ్య భీకర యుద్ధాలు కూడా జరిగాయి. నేటికీ భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న జమ్ముకశ్మీర్ లోని ప్రాంతాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ సున్నితమైన సరిహద్దుల వల్లే ‘నో మ్యాన్స్ ల్యాండ్’ ప్రాముఖ్యత మరింత పెరిగింది.ఒక చిన్న పొరపాటు తెచ్చే మృత్యువు‘నో మ్యాన్స్ ల్యాండ్’, ‘జీరో లైన్’ ప్రాంతాలలో నిఘా వ్యవస్థ అత్యంత పటిష్ఠంగా ఉంటుంది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ఈ ప్రాంతంలోకి కాలుపెట్టాలని చూస్తే, క్షణాల్లో ప్రణాలు పోయే అవకాశం ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు, నిఘా నేత్రాల మధ్య ఉండే ఈ భూభాగంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెను ముప్పుకు దారి తీస్తుంది. అందుకే సరిహద్దు ప్రాంతాలలో నివసించే ప్రజలు అనునిత్యం అప్రమత్తంగా మెలుగుతారు.సరిహద్దుల నిర్వహణ - ఒక నిరంతర సవాలురెండు దేశాల మధ్య శాంతి భద్రతలను కాపాడటంలో ‘జీరో లైన్’, ‘నో మ్యాన్స్ ల్యాండ్’ కీలక పాత్ర పోషిస్తాయి. సరిహద్దు ఉల్లంఘనలను అరికట్టడానికి, అసాంఘిక శక్తుల చొరబాట్లను నివారించడానికి ఇరు దేశాల రక్షణ దళాలు నిత్యం సిద్ధంగా ఉంటాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, ఈ సున్నితమైన సరిహద్దులను భద్రంగా ఉంచేందుకు ప్రభుత్వాలు నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.ఇది కూడా చదవండి: జపాన్ పర్యటనకు ఐఆర్సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ! -
కశ్మీరీలకు పాకిస్తాన్‌పై ప్రేమేం లేదు!
కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్‌పై ప్రేమ లేదు. ఈ మాట అంటున్నది అధీన రేఖకు రెండు వైపులా కశ్మీరీల గురించి కూడా. ప్రస్తుతం రేఖకు ఆవలివైపున గత రెండు నెలలుగా మరోమారు ఆందోళనలు జరగడాన్ని చూస్తున్నాం. అదే సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇటు వైపున గలవారికి కూడా ఎటువంటి ప్రేమ లేదు. వాస్తవం ఇది కాగా... ఇటువారంతా కేవలం మత దృష్టితో పాకిస్తాన్‌పై ప్రేమతో భారత వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నారనే ప్రచారాలను రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు.ఇండియానే ఎందుకు కోరుకున్నారు?పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి చర్చించేముందు, సందర్భం వచ్చింది గనక మన కశ్మీర్ విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం. వలస పాలన ముగుస్తుండిన 1947లో బ్రిటిష్‌వారు ఇక్కడి సంస్థానాలకు భారత యూనియన్‌లో లేదా పాకిస్తాన్లో విలీన మయ్యే స్వేచ్ఛను ఇచ్చారు. అపుడు కశ్మీర్ పాలకుడు హిందువు కాగా, ప్రజలు మెజారిటీ సంఖ్యలో ముస్లింలు. రాజు హరిసింగ్ గానీ, ప్రజలు గానీ పాకిస్తాన్లో చేరేందుకు ఇష్టపడలేదు. అప్పటి ప్రధాన రాజకీయ పక్షం నాయకుడు షేక్ అబ్దుల్లా పూర్తిగా ఇండియా పక్షం వహించాడు. కోరుకుంటే పాకిస్తాన్లో చేరగల అవకాశం దేశ విభజన చట్ట ప్రకారం ఉండి కూడా, భారతదేశంలో విలీనాన్ని ఎందుకు కోరుకున్నారు? నేను కశ్మీర్‌లోని మొత్తం 22 జిల్లాల్లోనూ మూడుసార్లు విస్తారంగా పర్యటించినపుడు, ఇతర విషయాలను అట్లుంచి ప్రత్యేకంగా ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు ప్రయత్నించాను. నేను వెళ్లిన జిల్లాలలో ముస్లిం మెజారిటీ ప్రాంతమైన కశ్మీర్ లోయతో పాటు పాకిస్తాన్ సరిహద్దుల వెట ఉండి ఆ ప్రభావాలు గణనీయంగా గల కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ జిల్లాలు కూడా ఉన్నాయి. రెండుసార్లు వెళ్లినపుడైతే మిలిటెంట్ చర్యలు ఉధృతంగా సాగుతున్నాయి. మిలిటెంట్లకు పాకిస్తాన్ సహాయాలు అందు తూనే ఉన్నాయి. అయిన్పటికీ ఏ దశలోనూ ఒక చిన్న వర్గం తప్ప పాకిస్తాన్‌ను కోరుకోకపోవడం గమనార్హం. ఇద్దరికీ సరిపడనిదే!మొట్టమొదటి వేర్పాటువాద ఆజాద్ కశ్మీర్ ప్లెబిసైట్ సంస్థ ఆ తర్వాత జమ్మూ–కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌గా మారినప్పుడు వారి లక్ష్యం రెండు వైపులా గల కశ్మీరీలను వేరుపరిచి స్వతంత్ర దేశాన్ని నెలకొల్పడం. ఆ సంస్థను ఇండియా, పాకిస్తాన్ రెండూ అణచి వేశాయి. ఆ సంస్థ ముగిసిన తర్వాత కొంత కాలానికి 26 పార్టీలు, సంస్థలతో ఆల్ పార్టీ హుర్రియత్ కాన్ఫరెన్స్ ఏర్పడింది. నేను ఆ సంస్థ ముఖ్య నాయకులు కొందరితో మాట్లాడాను. విషయం ఏమంటే... లిబరేషన్ ఫ్రంట్ రెండు దేశాలను వ్యతిరేకించే కశ్మీరీ జాతీయవాద సంస్థ కాగా, హుర్రియత్లో కొద్దిమంది మాత్రమే పాకిస్తాన్ అనుకూలురు. సామాన్య ప్రజానీకంలో అత్యధికులు పాకి స్తాన్‌కు ఎంతమాత్రం అనుకూలురు కాదు. అదే సమయంలో వారందరికీ ఇండియాపై తీవ్రమైన ఫిర్యాదులున్నాయి. ఈ ద్వంద్వ స్థితిని అర్థం చేసుకోవాలంటే ముందు చరిత్రలోకి వెళ్లి, తర్వాత స్వాతంత్య్రానంతర వర్తమానంలోకి రావాలి. మొదటి నుంచి హిందూమతం ఉండిన కశ్మీర్లోకి క్రీస్తు పూర్వమే బౌద్ధం బలంగా ప్రవేశించింది. అశోకుడు (శ్రీనగర్‌ను స్థాపించింది ఆయనే), కుషాణులు బాగా వ్యాపింప చేశారు. మధ్య ఆసియా వర్తకుల ద్వారా ఇస్లాం వచ్చిన తర్వాత 14వ శతాబ్దంలో సూఫీ యిజం విస్తరించింది. ఈ విధమైన బౌద్ధం, సూఫీయిజం కలగలిసిన ప్రభావాలు కశ్మీరీల విశ్వాసాలు, ఆలోచనలు, సంస్కృతులపై వేసిన బలమైన ముద్రలు నేటికీ ఉన్నాయి. అందువల్లనే వారు జనసంఖ్య రీత్యా మెజారిటీ సున్నీలే అయినా పాకిస్తాన్‌లోని జనాభాతో, అక్కడి పాలకులతో ఏకీభావం లేదు. 1947లో లేదు. ఇప్పటికీ లేదు. అయితే, రెండు వైపులగల జాతి అనే భావన మాత్రం ఉంది. అందుకే కశ్మీర్ మొత్తంగా స్వతంత్రం కావాలని ప్రయత్నించిన రోజులలో లిబరేషన్ ఫ్రంట్‌కు విస్తారమైన సానుభూతి లభించింది. ఈ భావనలు తెలిసినందువల్లనే కశ్మీర్ ప్రతిపత్తిపై ప్లెబిసైట్ జర పాలన్న ప్రతిపాదన కొందరు చేయగా, ఇండియాతో పాటు పాక్ కూడా వ్యతిరేకించింది. స్వతంత్ర కశ్మీర్ వారికి కూడా సరిపడనిదే!మారని మౌలిక దృష్టిఇదంతా చరిత్రతో పాటు, 1947 అనంతరపు తొలినాళ్ల పరిస్థి తులు. ఆ తర్వాతకు వచ్చి, మూడు విషయాలను చూస్తే చిత్రం పూర్తవుతుంది. ఒకటి, పాకిస్తాన్‌పట్ల ఆ తర్వాత కూడా, చివరకు మిలిటెన్సీ కాలంలోనూ జనబాహుళ్యంలో ప్రేమ కలగకపోవడం. రెండు, ఇండియాపైన కూడా ప్రేమ ఏర్పడకపోవడం. అయినప్పటికీ పాకిస్తాన్‌తో పోల్చినప్పుడు ఇండియా మెరుగనుకోవడం. మూడవది భవిష్యత్ గురించి వారి ఆలోచనలు. ప్రత్యేక దేశంగా ఏర్పడినాక పాకిస్తాన్లో ఉంటూ వచ్చిన పరి స్థితులు ఇటువైపు కశ్మీరీలకు నచ్చలేదు. అభివృద్ధి, ప్రజల జీవి తాలు, శాంతి భద్రతలు, అప్రజాస్వామికతలు, సైనిక కుట్రలతో పాటు, అటువైపు గల తమ కశ్మీర్ సోదరులు, బంధుమిత్రుల పరి స్థితి, హక్కుల లేమి, అణిచివేతలు అందుకు తోడయ్యాయి. అటు చేరినా తాము బాగుపడేది ఏమున్నది కనుక అనే ప్రశ్నను నేను అన్నివైపుల నుంచీ విన్నాను. తమ మిలిటెంట్ యువకులకు అక్కడి నుంచి సహాయం అందటం వరకు కొంత సానుకూలతను కల్పించినా, మౌలికమైన దృష్టి మాత్రం మారలేదు. ఇండియా స్వతంత్రమైన తర్వాత 40 సంవత్సరాల వరకు కశ్మీర్లో మిలెటెన్సీ లేదు. నిజానికి ఆ కాలమంతా నేషనల్ కాన్ఫ రెన్స్, కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా లేనంత విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డాయి. అభివృద్ధి మృగ్యమై తీవ్ర అసంతృప్తి ఏర్ప డింది. అయినా కేంద్ర ప్రభుత్వాలు చేసింది శూన్యం. అది చాలద న్నట్లు ప్రజాస్వామిక విధి విధానాలతో నిమిత్తం లేకుండా రాజ కీయ క్రీడలు యథేచ్ఛగా సాగించాయి. కశ్మీర్ ఒక సున్నిత స్థితిలో గల సరిహద్దు రాష్ట్రం, పాకిస్తాన్ అవకాశం కోసం పొంచి ఉన్నదనే స్పృహ సైతం లేకుండా పోయింది.అటువంటి పరిస్థితులతో ఇక ఓపిక నశించిన ప్రజలు 1987 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ రెండింటినీ ఓడిస్తు న్నట్లు ఓట్ల లెక్కింపులో స్పష్టమవుతుండగా... కనీవిని రీతిలో రిగ్గింగ్ జరిపి తామే గెలిచారు. పట్టరాని ఆగ్రహానికి గురై మిలిటెన్సీ మార్గం పట్టింది. పాకిస్తాన్ ఆ అవకాశాన్ని అందుకుంది. అప్పటి నుంచి 35 సంవత్సరాలుగా మిలిటెన్సీనైతే గణనీయంగా అణిచి వేశారు గానీ ప్రజలు విశ్వాసాన్ని సంపాదించలేక పోయారు. మధ్యలో ఆ ప్రయత్నాలు జరిగింది వీపీ సింగ్, పీవీ నరసింహా రావుల కాలంలో మాత్రమే. ప్రజలు కూడా వారిని విశ్వసించారు. బీజేపీ రాకతో పరిస్థితి తిరిగి క్షీణమార్గం పట్టింది. టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మిసైల్ సక్సెస్.. ఒక్కసారి పేల్చితే పాకిస్తాన్ మొత్తం బూడిద
-
అమెరికానే కాపాడలేకపోయింది.. ఇంక పాక్-టర్కీ ఏం చేస్తాయి?
పశ్చిమాసియాలో మారుతున్న భద్రతా సమీకరణాలకు సంకేతంగా పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మూడు దేశాలు కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో కుదిరిన ఈ ఒప్పందం ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఒక దేశంపై దాడిని మిగిలిన రెండు దేశాలపై దాడిగా పరిగణించేలా రూపొందించిన ఈ రక్షణ కూటమి.. సౌదీ భద్రతా వ్యూహంలో కీలక మార్పుగా మారింది. అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.టర్కీ, పాకిస్థాన్‌తో చేసుకున్న రక్షణ ఒప్పందాలు సౌదీ అరేబియాకు శాశ్వత భద్రతను అందించలేవని ఇరాన్ విమర్శించింది. అమెరికానే కాపాడలేకపోతోంది.. ఇంక పాక్ టర్కీలు వచ్చి ఏం చేస్తాయి?.. ఏం సాధిస్తాయి? అంటూ డీల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల కమిషన్ సభ్యుడు ఎబ్రహీం రెజాయీ ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘కాగితపు ఒప్పందాలతో భద్రత రాదు’సోషల్ మీడియా వేదికగా స్పందించిన రెజాయీ.. “టర్కీ, పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న కాగితపు ఒప్పందాలు సౌదీకి భద్రతను తీసుకురావు. అమెరికాతో ఎన్నో ఏళ్లుగా కొనసాగించిన సంబంధాలు కూడా సౌదీకి భద్రత ఇవ్వలేదు” అని వ్యాఖ్యానించారు. సౌదీ తన విధానాలను మార్చుకుంటే ఇతర దేశాల నుంచి భద్రత కోసం ఆధారపడాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. గతంలో సౌదీ భద్రత కోసం అమెరికాపై ఆధారపడిన తీరును ప్రస్తావిస్తూ ఇరాన్ ఈ విమర్శలు చేసింది.మక్కా వేదికగా మూడు దేశాల డిఫెన్స్ డీల్అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య ఈ రక్షణ ఒప్పందం కుదిరింది. ఇస్లాం పవిత్ర నగరమైన మక్కాలో జరిగిన సమావేశంలో మూడు దేశాల నేతలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ సందర్భంగా ఈ ఒప్పందం ఖరారైంది. మూడు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఉమ్మడి భద్రతా వ్యూహాలను రూపొందించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.ఒకరిపై దాడి.. ముగ్గురిపై దాడిగానే!ఈ రక్షణ ఒప్పందంలోని కీలక అంశం పరస్పర భద్రత. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై అయినా సాయుధ దాడి జరిగితే.. దాన్ని మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించేలా నిబంధనలు రూపొందించారు. దాడి జరిగిన సమయంలో పరస్పర సహకారం, రక్షణ రంగంలో సమన్వయం పెంచుకోవడం ఈ ఒప్పందం లక్ష్యమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. మూడు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాల ఆధారంగా ఈ ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.సౌదీ ఎందుకు కొత్త రక్షణ భాగస్వామ్యాల వైపు?ఇరాన్‌తో పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియా తన రక్షణ భాగస్వామ్యాలను విస్తరిస్తోంది. గతంలో సౌదీ చమురు కేంద్రాలు, కీలక మౌలిక వసతులపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్‌లోని మిలీషియా గ్రూపులు ఉన్నాయని సౌదీ ఆరోపించింది. దీంతో భద్రత విషయంలో కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా కొత్త భాగస్వామ్యాలను పెంచుకోవాలని రియాద్ భావిస్తోంది.ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, గల్ఫ్ ప్రాంతంలో నౌకాయానం ప్రభావితమవడం వంటి పరిణామాలు కూడా ఈ రక్షణ ఒప్పందానికి కారణాలుగా మారాయి.భారత్-పాక్ కోణంలోనూ చర్చఈ ఒప్పందం మరో కోణంలోనూ చర్చకు దారితీస్తోంది. ఒకవేళ భవిష్యత్‌లో పాకిస్థాన్‌పై భారత్ సైనిక చర్య చేపడితే ఈ రక్షణ ఒప్పందం ఎలా ప్రభావితం చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒప్పందంలోని పరస్పర రక్షణ నిబంధన ప్రకారం.. పాకిస్థాన్‌పై జరిగే దాడిని మిగిలిన దేశాలు ఎలా పరిగణిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి రక్షణ ఒప్పందాల్లో ప్రతిస్పందన విధానం, సైనిక సహాయం, దౌత్య మద్దతు వంటి అంశాలు ఆయా దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ఆ లెక్కన.. ఈ ఒప్పందం ఉన్నంత మాత్రాన సౌదీ అరేబియా, టర్కీ వెంటనే ఏదైనా ఘర్షణలోకి దిగాల్సిందేనని స్పష్టమైన హామీ లేదు.మారుతున్న సమీకరణాలుపాక్, సౌదీ, టర్కీ రక్షణ ఒప్పందం మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త మార్పులకు సంకేతంగా మారింది. ఒకవైపు ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుండగా.. మరోవైపు సౌదీ తన భద్రతా వ్యవస్థను విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు దేశాల కొత్త రక్షణ కూటమి భవిష్యత్‌లో పశ్చిమాసియా శక్తి సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
పాకిస్థాన్, సౌదీ, తుర్కియే కీలక ఒప్పందం
పశ్చిమాసియా యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ (Mecca Joint Defence Agreement) పేరుతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న ఆ దేశాలు.. ఏ దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణించనున్నాయి. ఈ కీలక రక్షణ ఒప్పందంపై ఆ దేశాలు సంతకాలు చేశాయి. పెరుగుతున్న భద్రతా ఆందోళనల వేళ ఈ ఒప్పందం మూడు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాలలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా.. అది మిగతా అన్ని దేశాలపై జరిగిన దాడిగానే పరిగణనలోకి తీసుకోనున్నాయి. మూడు దేశాలలో ఏ ఒక్క దానిపై సాయుధ దాడి జరిగినా.. అది మూడింటిపై జరిగిన దాడిగానే భావిస్తారు. అలాగే మూడు దేశాల మధ్య రక్షణ సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను మరింత పెంపొందించడానికి ఇది తోడ్పడుతుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.సౌదీ అరేబియాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సైనిక దళాల అధిపతి (ఆర్మీ చీఫ్) ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి షరీఫ్ గురువారం మూడు రోజుల పర్యటన నిమిత్తం అక్కడకు చేరుకున్నారు.ఇరాన్ యుద్ధంలో భాగంగా పలుమార్లు దాడులను ఎదుర్కొన్న సౌదీ అరేబియా, తన రక్షణ భాగస్వామ్యాలను విస్తరించుకోవాలని భావిస్తోంది. తుర్కియేకి చెందిన 'హేబర్ టర్క్' మీడియా కథనం ప్రకారం.. ఈ ఒప్పందం ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, నిఘా సమాచారాన్ని పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. గాజా, ఇరాన్, లెబనాన్లలో జరుగుతున్న ఇతర ప్రాంతీయ పోరాటాల విషయంలో టర్కీ, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో కూడా ఈ ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది.అమెరికా ఈ ప్రాంతంలో తన స్వంత ప్రయోజనాలతో పాటు ఇజ్రాయెల్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో.. మారుతున్న ప్రాంతీయ పరిస్థితులు, ఘర్షణల ప్రభావం వలన కొత్త మిత్రులను, శత్రువులను గుర్తించడానికి దేశాలు కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబరులో కూడా పాకిస్తాన్, సౌదీ అరేబియాలు ఒక వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై సంతకం చేయడం గమనార్హం. ఆ సమయంలో ఒక దేశంపై దాడి జరిగితే రెండింటిపై జరిగిన దాడిగా పరిగణిస్తామని తెలిపాయి. ఇస్లామాబాద్ దశాబ్దాలుగా సౌదీ అరేబియాతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. సుమారు 25 లక్షలకు పైగా పాకిస్తానీయులు ఈ దేశంలో పనిచేస్తున్నారని అంచనా. పాకిస్తాన్ క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి సౌదీ అరేబియా ఆర్థిక సాయాన్ని అందిస్తూ వస్తోంది. -
పతకాలు తెచ్చాను.. నాపై ఇంత విద్వేషమా?
పాకిస్తాన్ స్టార్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ఒక ఈవెంట్లో విఫలమైనంత మాత్రాన తనను దూషించడం సరికాదన్నాడు. తాను దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చానని.. అయినప్పటికీ తనను అనరాని మాటలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.ఒలింపిక్స్‌లో స్వర్ణంకాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో అర్షద్ నదీమ్ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఈటెను రికార్డు స్థాయిలో 92.7 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలిచాడు. తద్వారా విశ్వ క్రీడల్లో పాకిస్తాన్‌కు తొలి వ్యక్తిగత పసిడి పతకం అందించిన అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు.సీన్ రివర్స్ఈ నేపథ్యంలో అర్షద్ నదీమ్‌పై ఇంటా.. బయట ప్రశంసల వర్షం కురిసింది. సన్మానాలు, సత్కారాలతో అతడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. చివరగా టోక్యోలో జరిగిన వరల్డ్‌కప్ చాంపియన్షిప్స్ల మెడల్ ఈవెంట్లో అత్యుత్తమంగా 82.75 మీటర్ల దూరం ఈటెను విసిరిన అర్షద్.. ఆ తర్వాత ఒక్కసారి కూడా కనీసం 80 మీటర్ల మార్కు కూడా దాటలేకపోయాడు.తాజాగా గ్లాస్కో వేదికగా కామన్వెల్త్ గేమ్స్-2026లోనూ అర్షద్ నదీమ్ వైఫల్యాలు కొనసాగాయి. కామన్వెల్త్ గేమ్స్-2022లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచిన అతడు.. ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగాడు. దారుణ వైఫల్యంతో..అయితే, తొలి ప్రయత్నంలోనే బ్యాలెన్స్ చేసుకోలేక ఫౌల్ కావడంతో ఫైనల్ రౌండ్లో అతడికి చేదు అనుభవమే మిగిలింది. ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ విఫలమైన అర్షద్ నదీమ్ టాప్-8కు చేరలేక ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఈసారి కనీసం కాంస్యం కాదు కదా.. ఫైనల్లో మరో మూడు ప్రయత్నాలు చేసే అవకాశం లేకుండానే నిష్క్రమించాడు. దీంతో పాకిస్తాన్ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అర్షద్ నదీమ్‌పై ఘాటు విమర్శలు చేశారు. అభ్యంతరకర పదజాలంతో అతడిని తిట్టారు.నేనూ పాకిస్తాన్ గడ్డ మీద పుట్టినవాడినేఈ నేపథ్యంలో అర్షద్ నదీమ్ తాజాగా స్పందించాడు. ‘‘కామన్వెల్త్ గేమ్స్‌లో నా వైఫల్యానికి సంబంధించి నేను ఎలాంటి సాకులు చెప్పాలనుకోవడం లేదు. అయితే, నేనూ పాకిస్తాన్ గడ్డ మీద పుట్టినవాడినే.పతకాలు అందించానుగతంలో దేశానికి ఎన్నో పతకాలు అందించాను. కానీ నా పట్ల అమర్యాదపూర్వకంగా, మనసు గాయపడే విధంగా మాట్లాడుతున్నారు. నేనూ మీలో ఒకడిననే గుర్తించండి. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోవద్దని చెబుతూ నా తల్లిదండ్రులు నాకు చెప్పారు.నేను లాగే ఉన్నాను. డబ్బు, పేరు ప్రఖ్యాతుల వల్ల నేనేమీ పొగరుబోతులా తయారుకాలేదు. చలి ఎక్కువగా ఉన్న చోట జావెలిన్ త్రోయర్ల కండరాలు పట్టేయడం సహజం. రిథమ్ కూడా కోల్పోవడం జరుగుతుంది. నేను ప్రాక్టీస్ చేసిన పరిస్థితులు.. క్రీడా వేదిక పరిస్థితులు వేరు.ఏదేమైనా గ్లాస్గోలో నేను మెరుగ్గా రాణించాల్సింది. కానీ గెలవలేకపోయాను. ఎల్లప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు వంద శాతం కృషి చేస్తాను. కఠిన శ్రమనే నమ్ముకున్న నాకు ఆ దేవుడే మార్గం చూపిస్తాడు. ఆయన నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది’’ అని అర్షద్ నదీమ్ ఆవేదన వ్యక్తం చేశాడు.అందుకే ఫెయిల్ అయ్యాడా?కాగా అర్షద్ నదీమ్ తన కోచ్‌గా సల్మాన్ బట్‌ను కొనసాగించడంతో.. పాకిస్తాన్ అమెచూర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్తో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ చేసేందుకు అతడికి ఫెడరేషన్ నుంచి ఎలాంటి సహకారం అందలేదనే వార్తలు వచ్చాయి. లాహోర్‌లో ఎర్రటి ఎండలో అర్షద్ ప్రాక్టీస్ చేయగా.. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో అందుకు విరుద్ధంగా పూర్తి చలి వాతావరణం ఉండటం అతడి ప్రదర్శనపై ప్రభావం చూపినట్లు సమాచారం.చదవండి: టీమిండియాతో మ్యాచ్.. వన్డే తరహాలో లంక బ్యాటర్ల విధ్వంసం -
రూట్ సారథ్యంలో...
లండన్: రెండేళ్ల విరామం అనంతరం డాన్ లారెన్స్ ఇంగ్లండ్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నెల 19 నుంచి పాకిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ గురువారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం తిరిగి జో రూట్ సారథిగా ఎంపిక కాగా... గాయం కారణంగా జాకబ్ బెథెల్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. 2024లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన లారెన్స్... బ్యాటింగ్ ఆర్డర్లో స్టోక్స్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఆఫ్‌స్పిన్ వేయగలగడం లారెన్స్‌కు అదనపు బలం.బ్రెండన్ మెకల్లమ్ స్థానంలో ఇటీవల ఇంగ్లండ్ హెడ్‌కోచ్‌గా ఎంపికైన స్టీఫెన్ ఫ్లెమింగ్ గైర్హాజరీలో ట్రెస్కోథిక్ జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు. గత తొమ్మిది టెస్టుల్లో ఏడింట ఓడిన ఇంగ్లండ్... 2024 డిసెంబర్ తర్వాత టెస్టు సిరీస్ గెలవలేదు. ఇంగ్లండ్ జట్టు: రూట్ (కెప్టెన్), ఆర్చర్, అట్కిన్సన్, బషీర్, బ్రూక్, కార్స్, సామ్ కుక్, కాక్స్, డకెట్, ఫిషెర్, ఎమిలియో, లారెన్స్, పోప్, రాబిన్సన్, జేమీ స్మిత్, టంగ్. -
రెండో టెస్టులో పాకిస్తాన్ విజయం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్): బ్యాటర్ల పట్టుదలకు బౌలర్ల క్రమశిక్షణ తోడవడంతో వెస్టిండీస్‌తో రెండో టెస్టులో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమంగా ముగించింది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 103/6తో బుధవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ చివరకు 46.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. కవెమ్ హెడ్జ్ (71 బంతుల్లో 34; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... తేజ్‌నారాయన్ చందర్‌పాల్ (17), అమిర్ జంగూ (13), కెప్టెన్ రోస్టన్ చేజ్ (17), షై హోప్ (15), సీల్స్ (0), గ్రీవ్స్ (3) విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్, సాజిద్ ఖాన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం 75 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 23.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసి గెలుపొందింది. అజాన్ అవైస్ (18), ఇమాముల్ హక్ (9) ఎక్కువసేపు నిలవలేకపోగా... తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అబ్దుల్లా షఫీఖ్ (24 నాటౌట్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులు చేయగా... పాకిస్తాన్ జట్టు 387 పరుగులు చేసింది. 2023 తర్వాత విదేశాల్లో పాకిస్తాన్‌కిదే తొలి టెస్టు విజయం కావడం గమనార్హం. -
పాక్‌తో రెండో టెస్ట్.. విండీస్‌కు భారీ ఎదురుదెబ్బ
పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బ్యాటర్ బ్రాండన్ కింగ్ గాయం కారణంగా మ్యాచ్‌లో మిగిలిన భాగానికి దూరమయ్యాడు. ఆగస్టు 4న మూడో రోజు ఆట సందర్భంగా అతడికి తీవ్ర లోయర్ బ్యాక్ మసిల్ స్పాసమ్స్ వచ్చాయి.పాక్ ఇన్నింగ్స్‌లో 75వ ఓవర్ సందర్భంగా బాబర్ ఆజమ్ రనౌట్‌లో కింగ్ కీలక పాత్ర పోషించాడు. బాబర్ సింగిల్ కోసం ప్రయత్నించగా, తిరిగి క్రీజులోకి రావాల్సి వచ్చింది. ఆ సమయంలో కవర్ ప్రాంతం నుంచి కింగ్ విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకడంతో బాబర్ రనౌట్ అయ్యాడు.అయితే ఈ అద్భుతమైన ఫీల్డింగ్ ప్రయత్నం కింగ్‌కు తీవ్ర గాయాన్ని మిగిల్చింది. బంతిని అందుకుని డైరెక్ట్ త్రో వేసే సమయంలో అతడు ఇబ్బందికరంగా ల్యాండ్ కావడంతో వెన్ను కండరాల్లో తీవ్ర నొప్పి వచ్చింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అతడిని స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.క్రికెట్ వెస్టిండీస్ వైద్య బృందం ప్రాథమిక పరీక్షల అనంతరం కింగ్‌కు లోయర్ బ్యాక్ మసిల్ స్పాసమ్స్ ఉన్నట్లు నిర్ధారించింది. వైద్య బృందం అతడిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. గాయం మరింత తీవ్రం కాకూడదనే ఉద్దేశంతో మిగిలిన మ్యాచ్‌కు అతడిని దూరంగా ఉంచారు.కింగ్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేశాడు. అతడి గైర్హాజరీ వెస్టిండీస్ బ్యాటింగ్ కూర్పుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో అతడు బ్యాటింగ్‌కు రాలేడు.కింగ్ లేని లోటు ఈ మ్యాచ్‌లో విండీస్ గెలుపోటములను శాశించే స్థితిలో ఉంది. ఆట నాలుగో రోజు విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఘోరంగా పతనమైంది. తొలి సెషన్ సమయానికి ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేసింది. జస్టిన్ గ్రీవ్స్ (3), షమార్ జోసఫ్ (9) క్రీజ్‌లో ఉన్నారు. మరో రెండు వికెట్లు పడితే విండీస్ ఇన్నింగ్స్ ముగుస్తుంది. సాజిద్ ఖాన్ (4 వికెట్లు), అలీ ఉస్మాన్ (3 వికెట్లు) విండీస్‌ను ఘెరంగా దెబ్బతీశారు. ప్రస్తుతం విండీస్ కేవలం 72 పరుగుల లీడ్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో విండీస్ ఓటమి తప్పించుకోవాలంటే ఏదైనా మహాద్భుతమే జరగాలి. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ గెలవడంతో విండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. -
దొంగదారిలో భారత్‌లోకి పాకిస్తాన్ ఖర్జూరాలు..
భారత్ విధించిన నిషేధాన్ని తప్పించుకుని మూడో దేశం ద్వారా భారత్‌లోకి పాకిస్తానీ ఖర్జూరాల దిగుమతికి చేసిన ప్రయత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అడ్డుకుంది. గుజరాత్‌లోని కాండ్లా పోర్టులో పాకిస్తాన్ మూలానికి చెందిన 364 మెట్రిక్ టన్నుల డ్రై ఖర్జూరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3 కోట్లుగా అధికారులు వెల్లడించారు.నిర్దిష్ట సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు కాండ్లా పోర్టులో వచ్చిన 13 కంటైనర్లను తనిఖీ చేశారు. పత్రాల్లో ఈ సరుకును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి వచ్చినవిగా పేర్కొన్నప్పటికీ, దర్యాప్తులో అసలు మూల దేశం పాకిస్తాన్ అని తేలింది. పాకిస్తాన్ నుంచి సరుకును తొలుత దుబాయ్‌కు తరలించి, అక్కడ మరో కంటైనర్లలోకి మార్చిన అనంతరం భారత్‌కు ఎగుమతి చేసినట్లు విచారణలో గుర్తించారు.గుగ్గుల్ రెసిన్ కేసులోనూ ఇదే తరహా మోసంకాండ్లా ఘటనకు కొద్దిరోజుల ముందే తమిళనాడులోని ట్యుటికోరిన్ పోర్టులోనూ ఇలాంటి వ్యవహారాన్ని డీఆర్ఐ గుర్తించింది. సుమారు 14 మెట్రిక్ టన్నుల పాకిస్తాన్ మూలానికి చెందిన గుగ్గుల్ రెసిన్ దాదాపు రూ.1.4 కోట్ల విలువైన సరుకును అధికారులు అడ్డుకున్నారు. ఈ సరుకును సోమాలియా మూలానికి చెందిన సహజ రెసిన్గా పత్రాల్లో చూపించి, దుబాయ్ మీదుగా భారత్‌కు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. నకిలీ పత్రాలను ఉపయోగించినట్లు గుర్తించిన అధికారులు ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.పాకిస్తాన్ వస్తువులపై ఎందుకు నిషేధం?పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మూలానికి చెందిన వస్తువుల దిగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది. ప్రత్యక్షంగానే కాకుండా మూడో దేశాల ద్వారా పరోక్షంగా దిగుమతి చేసుకోవడం లేదా రవాణా చేయడం కూడా నిషేధం. దీంతో పాకిస్తాన్ నుంచి సరుకులను దుబాయ్ వంటి మూడో దేశాలకు తరలించి, అక్కడి నుంచి భారతదేశానికి పంపే మార్గాలను అక్రమంగా ఉపయోగించే ప్రయత్నాలపై డీఆర్ఐ నిఘా పెంచింది.ఇదీ చదవండి: ఉచితంగా 20 వేల విమాన టికెట్లు.. ఫ్రీ ఆఫర్! -
జంతర్ మంతర్‌లో పెట్రోల్ బాంబులతో దాడికి ప్లాన్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన నిరసన ప్రదర్శనను లక్ష్యంగా చేసుకుని పెట్రోల్ బాంబు దాడికి పన్నాగం పన్నిన పాకిస్థాన్ గూఢచార సంస్థ ‘ఐఎస్ఐ’ మద్దతుగల ఉగ్రవాద మాడ్యూల్‌ను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. ఈ ఉదంతానికి సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఉగ్రదళానికి చెందిన సభ్యులు నిరసన సమయంలో జంతర్ మంతర్‌ను సందర్శించి, రవాణా సాయం అందుకోవడంతో పాటు పెట్రోల్ బాంబులను కూడా సమకూర్చుకున్నారు. భద్రతా సిబ్బంది, పోలీసులను, ఇతర యూనిఫాం ధరించిన అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని పాకిస్థాన్ హ్యాండ్లర్లు నిందితులకు శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.అయితే ఈ దాడిని అమలు చేయడం సాధ్యపడకపోవడంతో, అనుమానితులు పంజాబ్‌కు తిరిగి వెళ్లిన తర్వాత నిఘా వర్గాల ఆధారంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను పోలీసులు గుర్తించారు. అమృత్‌సర్‌లో ఐఎస్ఐ మద్దతుగల రెండు సరిహద్దు ఉగ్రవాద మాడ్యూళ్లను పోలీసులు ఛేదించారు. నలుగురు మైనర్లతో సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో మూడు అక్రమ పిస్టల్స్, నాలుగు పెట్రోల్ బాటిల్ బాంబులు, తొమ్మిది తూటాలను స్వాధీనం చేసుకున్నారు.విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు స్థానిక యువకులను ఉగ్ర కార్యకలాపాల కోసం నియమించుకోవడం, భద్రతా స్థావరాలపై నిఘా పెట్టడం, అక్రమ ఆయుధాలను సమకూర్చడం వంటి పనులకు ఈ ముఠా పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. రైల్వే ట్రాక్‌ల వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి, ఆ ఫుటేజ్‌ను విదేశాల్లోని హ్యాండ్లర్లకు పంపినట్లు దర్యాప్తులో తేలింది. అమృత్‌సర్‌లోని మోకంపుర, ఎయిర్పోర్ట్, సి-డివిజన్ పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఇతర అనుసంధానాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: దుబాయ్‌లో భారీ పేలుళ్లు: జెబెల్ అలీని కమ్మేసిన దట్టమైన పొగ! -
కామన్వెల్త్ గేమ్స్ ముగింపులో ట్విస్ట్.. విమానం ఎక్కకుండా పరారైన అథ్లెట్లు
గ్లాస్గో వేదికగా జరిగిన 11 రోజుల పాటు జరిగిన కామన్వెల్త్ గేమ్స్-2026కు ఆదివారం ఎండ్‌కార్డ్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిష్టాత్మక క్రీడలు ఘనంగా ముగిసినప్పటికి పలువురు విదేశీ అథ్లెట్లు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. యుగాండా బాక్సింగ్ బృందంలోని నలుగురు బాక్సర్లు (నూహు బట్టే, ఏంజెల్ కటుషాబే, ఇబ్రహీం కెమిస్, ఎమిలీ నకలేమా) మంగళవారం జట్టుతో తిరుగు ప్రయాణం కావాల్సిన విమానాన్ని ఎక్కలేదు. ఎన్బీఎస్ స్పోర్ట్స్ కథనం ప్రకారం.. సదరు బాక్సర్లు మెరుగైన శిక్షణ సదుపాయాలు, అవకాశాలు కోసం స్కాట్లాండ్లోనే ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. అదృశ్యమైన క్రీడాకారుల ఆచూకీ కోసం స్కాట్లాండ్ పోలీసులు వెతకడం ప్రారంభించారు.పాక్ బాక్సర్ మిస్సింగ్..మరోవైపు ఈ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న పాకిస్తాన్ బాక్సర్ ఖుద్రతుల్లా కూడా అదృశ్యమయ్యాడు. దీంతో పాకిస్తాన్ బాక్సింగ్ ఫెడరేషన్ మరోసారి విమర్శల పాలైంది. గతంలో పలు దేశాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల సందర్భంగానూ పాకిస్తాన్ బాక్సర్లు అదృశ్యమైన ఉదంతాలు నమోదు కాగా... ఇప్పుడు తాజగా ఖుద్రతుల్లా వ్యవహారం వెలుగు చూసింది.‘పోటీల అనంతరం ఖుద్రతుల్లా కనిపించకుండా పోయాడు. అతడి పాస్‌పోర్ట్ టీమ్ మేనేజర్ వద్దే ఉన్నప్పటికీ అతడు మాత్రం అదృశ్యమయ్యాడు’ అని పాకిస్తాన్ ఒలింపిక్ సంఘం సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. 2022 బర్హింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల సందర్భంగానూ పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు బాక్సర్లు సులేమాన్ బలోచ్, నజీరుల్లా ఖాన్ ఇలాగే అదృశ్యమయ్యారు. 2024లో ఇటలీలో జరిగిన ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో... ఆసియా పసిడి పతక విజేత జోహైబ్ రషీద్ అతడి రూమ్మెట్ విదేశీ కరెన్సీని దొంగలించి కనిపించకుండా పోయాడు. కాగా ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో పాకిస్తాన్ ఏకైక కాంస్య పతకం సాధించింది. మొత్తం 36 మంది బృందం ఈ పోటీల్లో పాల్గొనగా... అందులో మహిళా బాక్సర్ ఫాతిమా జెహ్రా మాత్రమే మెడల్ గెలిచింది. -
కేంద్ర ప్రభుత్వంలో మిత్రులు.. పీవోకేలో శత్రువులు..
పాకిస్తాన్లో ఒకే ప్రభుత్వంలో భాగస్వాములు.. కానీ, పీవోకేలోని ముజఫరాబాద్‌లో మాత్రం ప్రత్యర్థులు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) ఎన్నికలు పాక్ అధికార కూటమిలోని రెండు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర రాజకీయ పోరుకు వేదికగా మారాయి. ఒకవైపు ప్రజా ఆందోళనలు, కాల్పులు, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. మరోవైపు ఎన్నికల ఫలితాలపై అధికార కూటమిలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP), పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.కాగా, పాకిస్తాన్‌లోని కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షాలుగా ఉన్న ఈ రెండు పార్టీలు.. పీవోకేలో మాత్రం ఆధిపత్యం కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. ఒకే కూటమిలో కొనసాగుతున్నా.. ఎన్నికల రంగంలో మాత్రం ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్తూ రాజకీయ యుద్ధం సాగిస్తున్నాయి. పీవోకేలో ఎన్నికల తొలి రెండు దశల్లో PML-N ఆధిక్యం సాధించడంతో PPP తీవ్రంగా స్పందించింది. PPP అధినేత బిలావల్ భుట్టో జర్దారీ ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, తమ పార్టీకి చెందిన ఓట్లను ప్రభావితం చేశారని ఆరోపించారు. కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను ఆక్రమించారని, తమ పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపించారని, బ్యాలెట్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని PPP నేతలు ఆరోపించారు.ప్రజలు నిజంగా తిరస్కరించిన చోట ఓటమిని అంగీకరిస్తామని, కానీ దొంగిలించిన ఫలితాలను మాత్రం అంగీకరించబోమని బిలావల్ భుట్టో స్పష్టం చేశారు. PML-Nను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఆ పార్టీ విజయాలు ప్రజా మద్దతుతో కాకుండా అక్రమాల ఆధారంగా సాధిస్తున్నాయని విమర్శించారు. అయితే PML-N ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ప్రజలే ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని, ఓటమిని అంగీకరించలేని వారు ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి మరియమ్ నవాజ్ కూడా ఎన్నికల ఫలితాలను ప్రజల విజయంగా అభివర్ణించారు.ఇమ్రాన్ కోసం కూటమి.. ఇక, 2022లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని తొలగించే సమయంలో PPP, PML-N సహా పలు పార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయి. రాజకీయ అవసరాల నేపథ్యంలో ఏర్పడిన ఈ కూటమి ప్రస్తుతం POK ఎన్నికల కారణంగా అంతర్గత విభేదాలను బయటపెడుతోంది. ఇస్లామాబాద్‌లో కలిసి పాలన సాగిస్తున్న పార్టీలు.. ముజఫరాబాద్‌లో మాత్రం పరస్పర ప్రత్యర్థులుగా మారాయి. ఈ రాజకీయ పోరుకు మరోవైపు POKలో ప్రజా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆర్థిక సమస్యలు, ధరల పెరుగుదల, పరిపాలనా విధానాలు, పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతమయ్యాయి. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే, పాక్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ, నిరసనల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందని ఆరోపించింది. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత, అరెస్టులు, భారీగా భద్రతా బలగాల మోహరింపుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉండగా.. పీవోకే ఎన్నికల తొలి దశలో మొత్తం 13 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో PML-N తొమ్మిది స్థానాలు గెలుచుకోగా, PPP నాలుగు స్థానాలు సాధించింది. రెండో దశలో కూడా PML-N ఆధిక్యం కొనసాగించింది. మూడో, చివరి దశ ఎన్నికలు ఆగస్టు 10న జరగనున్నాయి. ప్రస్తుతం POK ఎన్నికలు సాధారణ రాజకీయ పోటీని దాటి.. పాకిస్తాన్ అధికార కూటమిలోని రెండు ప్రధాన పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా మారాయి. ప్రజలు తమ సమస్యలపై నిరసనలు చేస్తున్న వేళ.. రాజకీయ పార్టీలు మాత్రం అధికారం, స్థానాల కోసం పోరాడుతున్నాయి. -
ఉగ్ర శిబిరాలను వణికిస్తున్న ‘అజ్ఞాత దాడులు’
పాకిస్థాన్ గడ్డపై గత కొద్ది సంవత్సరాలుగా ఓ రహస్య పరిణామం తీవ్ర కలకలం రేపుతోంది. అక్కడి ఉగ్రవాద నెట్‌వర్క్‌లను, రక్షణ రంగ నిపుణులను నివ్వెరపరుస్తున్న ఈ ఉదంతంలో లష్కర్ ఎ తోయిబా, జైష్ ఏ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందిన పలువురు కీలక ఉగ్రవాదులు వరుసగా నేలకూలుతున్నారు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జరుగుతున్న ఈ మరణాలు ఉగ్రవాద శిబిరాల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి.అజ్ఞాత హంతకుల అటాక్..పాకిస్థాన్‌లోని పంజాబ్, కరాచీ, ఖైబర్ పఖ్తుంఖ్వా, పీవోకే ప్రాంతాల్లో గత కొద్ది కాలంగా భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలపై వచ్చే అజ్ఞాత వ్యక్తులు అత్యంత సమీపంలోకి వచ్చి కాల్పులు జరిపి నిమిషాల వ్యవధిలో మాయమవుతున్నారు. ఈ మిస్టరీ హత్యలు పాక్ నిఘా వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.లష్కర్ సీనియర్ నేత సంచలన ప్రకటనసరిహద్దు అవతల నుంచి పనిచేసే లష్కర్ ఏ తోయిబా సీనియర్ సభ్యుడు రిజ్వాన్ హనీఫ్ ఇటీవల సంచలన వాస్తవాన్ని బయటపెట్టాడు. 2020 నుంచి ఇప్పటివరకు తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా సభ్యులు పాకిస్థాన్‌లో హతమయ్యారని బహిరంగంగా అంగీకరించారు. ఒక ఉగ్రవాద సంస్థ ఈ స్థాయిలో నష్టాన్ని అంగీకరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల వరుస హతంఈ మిస్టరీ దాడుల్లో భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఎంతో మంది కీలక టెర్రరిస్టులు అంతమొందారు. 2016 పఠాన్‌కోట్ దాడి సూత్రధారి మౌలానా షాహిద్ లతీఫ్, 1999 ఐసీ-814 విమాన హైజాక్ నిందితుడు జహూర్ మిస్త్రీ, హిజ్బుల్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ వంటి ప్రముఖులు వేర్వేరు సందర్భాల్లో విగతజీవులుగా మారారు.అంతర్జాతీయంగా చర్చనీయాంశంపాక్లో జరుగుతున్న ఈ లక్షిత హత్యలను అంతర్జాతీయ మీడియా సంస్థలు మిస్టరీ కిల్లింగ్స్‌గా అభివర్ణించాయి. ఈ ఘటనల వెనుక విదేశీ ఏజెన్సీల హస్తం ఉందని పాకిస్థాన్ అధికారులు అప్పుడప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ, వాటికి తగిన ఆధారాలు చూపలేకపోయాయి. మరోవైప పాక్ భూభాగంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను అణచివేయాలని భారత్ అంతర్జాతీయ వేదికలపై పదే పదే స్పష్టం చేస్తూ వస్తోంది.అందుబాటులో లేని అధికారిక జాబితాలష్కర్ సీనియర్ నేత 30 మందికి పైగా హతమైనట్లు ప్రకటన చేసినప్పటికీ, ఆ మృతుల పూర్తి అధికారిక జాబితాను ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ లేదా పాక్ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. కేవలం పబ్లిక్ డొమైన్లో లభిస్తున్న విశ్వసనీయ సమాచారం, ప్రాథమిక రికార్డుల ఆధారంగానే కొన్ని ప్రధాన పేర్లు వెలుగులోకి వచ్చాయి.మిస్టరీ వీడని హత్యలు.. ఉగ్రశిబిరాల్లో దడఅబూ ఖతాల్ సింధి, ఖాలిద్ రజా, సలీమ్ రెహమానీ వంటి కీలక ఉగ్రవాదుల హత్యల కేసుల దర్యాప్తు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. నిందితుల ఆచూకీ లభించకపోవడం, వరుస హత్యల పరంపర కొనసాగుతుండటంతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శ్రేణుల్లో కంటి మీద కునుకు లేకుండా పోతోంది.ఇది కూడా చదవండి: ‘బంగ్లా’ రాజకీయాల్లో సునామీకి షేఖ్ హసీనా సిద్ధం! -
అంత తొందరెందుకు బాబర్..!
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు మరోసారి టెస్టు సెంచరీ అందని ద్రాక్షగానే మిగిలింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక రెండో టెస్టులో అతడు 88 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. సెంచరీకి చేరువలో ఉండగా రనౌట్ కావడంతో బాబర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు.మూడో రోజు తొలి ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే వారికన్ సంధించిన బంతిని ఆఫ్‌సైడ్ వైపు ఆడిన బాబర్ సింగిల్ కోసం పరుగు ప్రారంభించాడు. పిచ్ మధ్యలోకి వచ్చిన తర్వాత నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న అబ్దుల్లా షఫీక్ నుంచి తిరిగి వెళ్లాలన్న సంకేతం రావడంతో వెనక్కి మళ్లాడు. అప్పటికే ఆలస్యమైంది.బ్రాండన్ కింగ్ అద్భుతమైన డైరెక్ట్ హిట్‌తో బాబర్‌ను రనౌట్ చేశాడు. దీంతో 147 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 88 పరుగులు చేసిన అతడు పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. రనౌట్ తర్వాత బాబర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. పెవిలియన్‌కు వెళ్లే సమయంలో చాలా కోపంగా ఉన్నట్లు కనిపించింది.మూడున్నరేళ్లుగా ఎదురుచూపులుబాబర్ చివరిసారిగా 2022 డిసెంబర్లో టెస్టు సెంచరీ చేశాడు. న్యూజిలాండ్‌తో కరాచీలో జరిగిన టెస్టులో అతడు అద్భుతంగా ఆడి 161 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు సెంచరీ చేసుంటే 10వ టెస్ట్ సెంచరీ అయ్యేది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు బాబర్ ఔటయ్యాక పాక్ స్వల్ప వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. రెండో రోజే సెంచరీ పూర్తి చేసిన అబ్దుల్లా షఫీక్ (130), సాజిద్ ఖాన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు స్కోర్ 323-6గా ఉంది. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 21 పరుగులు వెనుకపడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 344 పరుగులకు ఆలౌటైంది. జస్టిన్ గ్రీవ్స్ (73), రోస్టన్ ఛేజ్ (70) అర్ద సెంచరీలతో రాణించారు. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ గెలిచిన విండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. -
CWG 2026: పాకిస్థాన్ బాక్సర్ మిస్సింగ్
కామన్వెల్త్ గేమ్స్ 2026 తర్వాత పాకిస్థాన్ బాక్సర్ కుద్రతుల్లా (Qudratullah) మిస్ అయినట్లు తెలుస్తోంది. పోటీలు ముగిసిన అనంతరం టీమ్ హోటల్ నుంచి వెళ్లిన అతడు అదృశ్యమైనట్లు సమాచారం. అతని పాస్‌పోర్ట్ కూడా టీమ్ మేనేజర్ వద్దే ఉన్నట్లు తెలుస్తోంది.ఇదే తొలిసారి కాదుఅంతర్జాతీయ టోర్నీల సమయంలో పాకిస్థాన్ బాక్సర్లు అదృశ్యమైన ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2022 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా సులేమాన్ బలోచ్, నజీరుల్లా ఖాన్ బర్మింగ్‌హామ్‌లో అదృశ్యమయ్యారు. అప్పట్లోనూ వారి పాస్‌పోర్టులు మేనేజర్ వద్దే ఉన్నట్లు సమాచారం.2024లో ఇటలీలో జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్ సందర్భంగా ఆసియా గోల్డ్ మెడలిస్ట్ బాక్సర్ జోహైబ్ రషీద్ (పాక్) తన రూమ్మేట్కు చెందిన విదేశీ కరెన్సీ, విలువైన వస్తువులను తీసుకుని బస్టో అర్సిజియో పట్టణంలో అదృశ్యమైనట్లు ఆరోపణలు వచ్చాయి.ఒక్క పతకంతో సరిపెట్టుకున్న పాక్కామన్వెల్త్ గేమ్స్ 2026లో పాక్‌కు ఒకే ఒక పతకం లభించింది. ఈ పోటీల్లో మొత్తం 36 మంది సభ్యులు పాల్గొనగా..మహిళల బాక్సింగ్‌లో ఫాతిమా జెహ్రా కాంస్య పతకాన్ని సాధించింది. -
పొలిటికల్ బాంబు పేల్చిన నఖ్వీ
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ అతి పెద్ద పొలిటికల్ బాంబు పేల్చాడు. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి కూడా అయిన.. దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణాన్ని గుర్తించామని ప్రకటించారు. ఈ వ్యవహారంలో న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు, బ్యాంకర్లు కూడా ఉన్నారని ఆరోపించారు."21 ఏళ్లుగా లంచాలు ఇచ్చారు, తీసుకున్నారు. బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటాం" అని వ్యాఖ్యానించారు. అయితే కుంభకోణానికి పాల్పడ్డ వ్యక్తుల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు.నఖ్వీ కొద్ది రోజుల కిందటే మరో సంచలన ఆరోపణ చేశారు. పాకిస్థాన్ పాలనా వ్యవస్థ కుప్పకూలిపోయిందని వ్యాఖ్యానించారు. నఖ్వీ వరుసగా చేస్తున్న సంచలన ఆరోపణలు పాక్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. అతడికి దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు పొసగడం లేదని ప్రచారం జరుగుతోంది. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆదేశాలతోనే నఖ్వీ ప్రభుత్వంపై ఆరోపణుల చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. నఖ్వీ-మునీర్ చాలాకాలంగా ప్రధానిపై గుర్రుగా ఉన్నారని సమాచారం. ఈ కారణంగానే వారు ఇలాంటి ఆరోపణులు చేస్తున్నారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే, నఖ్వీ పీసీబీ అధ్యక్షుడిగా, పాక్ అంతర్గత మంత్రిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. తాజాగా అతడు మహిళల ఆసియా కప్‌కు సంబంధించిన షెడ్యూల్ డిస్కషన్లో పాల్గొన్నాడు. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ప్రకటన త్వరలోనే వెలువడాల్సి ఉంది. -
భారత్ కంటే ముందే పాక్ తరపున ఆడిన సచిన్..?
సచిన్ టెండూల్కర్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో చెరగని సంతకం. మాస్టర్ బ్లాస్టర్ తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లు, అరుదైన రికార్డులను సాధించాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడే రోల్‌మోడల్. అయితే క్రికెట్ గాడ్‌గా పేరు గాంచిన సచిన్ కెరీర్లో ఎవరికీ తెలియని ఒక రహస్యముంది.భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడానికి రెండేళ్ల ముందే... సచిన్ పాకిస్తాన్ జట్టు తరఫున మైదానంలోకి దిగాడు. అవును మీరు విన్నది నిజమే. 1987లో బ్రబోర్న్ స్టేడియంలో పాక్ తరపున సబ్‌స్ట్యూట్‌గా సచిన్ ఫీల్డింగ్ చేశాడు.అసలేమి జరిగిదంటే?1987 ఏడాది ఆరంభంలో పాకిస్తాన్ ఐదు టెస్టులు, ఆరు వన్డేల సిరీస్‌లో తలపడేందుకు భారత పర్యటనకు వచ్చింది. ఈ సిరీస్‌లు ఆరంభానికి ముందు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా భారత్-పాకిస్తాన్ మధ్య 40 ఓవర్ల ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు ముంబైలోని చార్రిత్మక బ్రబోర్న్ స్టేడియం వేదికైంది. ఈ మ్యాచ్‌కు సచిన్ బాల్ బాయ్‌గా ఉన్నాడు. అప్పటికి టెండూల్కర్ వయస్సు వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే. అయితే లంచ్ బ్రేక్ సమయంలో పాక్ ఆటగాళ్లు జావేద్ మియాందాద్, అబ్దుల్ ఖాదిర్ విశ్రాంతి కోసం హోటల్‌కు తిరిగి వెళ్లిపోయారు.దీంతో మైదానంలో ఫీల్డింగ్ చేయడానికి ఇద్దరు సబ్‌స్ట్యూట్స్ అవసరమయ్యారు. వెంటనే అప్పటి పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్.. అక్కడి క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ ఇన్ఛార్జ్ దగ్గరకు వెళ్లి ఇద్దరు లోకల్ కుర్రాళ్లను సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్ పంపంచండి అని అడిగాడు. హేమంత్ ఎవరిని పంపాలా అని ఆలోచిస్తుండగా 13 ఏళ్ల సచిన్ నేను వెళ్తా అని ముందుకొచ్చాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పాకిస్తాన్ గ్రీన్ జెర్సీ ధరించి మైదానంలో అడుగుపెట్టాడు. మైదానంలోకి వెళ్లిన సచిన్‌ను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయమన్నారు. నాటి భారత కెప్టెన్ కపిల్ దేవ్ ఒక భారీ షాట్ కొట్టగా... బంతి గాల్లోకి లేచింది. సచిన్ చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ బంతిని ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ కపిల్ కొట్టిన బంతి బౌండరీ అవతల పడింది. మాస్టర్ బ్లాస్టర్ ప్రత్యామ్నాయ ఫీల్డర్‌గా సుమారు 25 నిమిషాల పాటు మైదానంలోనే ఉన్నాడు. సచిన్ తన ఆటోబయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో కూడా ఈ సంఘటన గురించి ప్రస్తావించాడు.ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు పాకిస్తాన్ జట్టు తరపున ఓసారి ఫీల్డింగ్ కూడా చేశాను. ఆ విషయం ఆయనకు గుర్తుందో లేదో అని సచిన్ రాసుకొచ్చారు. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అక్కడికి సరిగ్గా మూడేళ్ల తర్వాత టెండూల్కర్.. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్ వంటి స్టార్లు ఉన్న పాక్ జట్టుపైనే తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.చదవండి: టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే? -
పాక్ పైశాచికం: ‘పీఓకే’ చూపించారని ‘అల్ జజీరా’ బంద్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో జరుగుతున్న నిరసనల కవరేజ్ నేపథ్యంలో, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలలో ‘అల్ జజీరా ఇంగ్లీష్’తో సహా పలు వార్తా వెబ్సైట్లను నిలిపివేశారు. పీఓకేలో జరుగుతున్న ఆందోళనలు, భద్రతా బలగాల అణచివేతపై విస్తృతమైన వార్తా కథనాలు వెలువడుతున్న తరుణంలో ఈ డిజిటల్ సెన్సార్షిప్ అమలైనట్లు సమాచారం.పీఓకేలో ఎన్నికల ప్రక్రియ, నిరసనలపై అల్ జజీరా ‘ఎంపిక చేసిన వార్తాకథనాలు’ (సెలెక్టివ్ రిపోర్టింగ్) ప్రసారం చేస్తోందని పాకిస్థాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణల ప్రామాణికతను ఏబీపీ న్యూస్ స్వతంత్రంగా ధృవీకరించలేదు. ముజఫరాబాద్‌లో ఓటింగ్‌కు ఎవరూ ముందుకు రాని విధంగా వాతావరణం ఉందని, గత 50 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ నిలిపివేత కారణంగా అక్కడి పరిస్థితులను నివేదించడం కష్టతరమైందని అల్ జజీరా పేర్కొంది.ముజఫరాబాద్‌లో మార్కెట్లు, బ్యాంకులు, పెట్రోలు బంకులు మూతపడ్డాయని, ప్రజా రవాణా నిలిచిపోయిందని తెలిపింది. ఆగస్టు 10 వరకు దశలవారీగా పీఓకేలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ నుంచి ఇప్పటివరకు జరిగిన హింసాత్మక ఘటనల్లో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామాబాద్, రావల్పిండి ప్రాంతాలలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు, జూన్ 2న పాకిస్థాన్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా, పలు యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించేందుకు ఇస్లామాబాద్ కోర్టు గతంలో ప్రయత్నించింది.ఇది కూడా చదవండి: ‘చాందీపురా’ కలకలం: 22 మంది మృతి.. 35 మందికి పాజిటివ్ -
మా వాళ్లు 30 మంది ఖతమయ్యారు.. భారత్ పనే ఇది!
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)కు చెందిన ఓ ఆపరేటివ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గత మూడు, నాలుగేళ్లలో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా సభ్యులు పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో హతమైనట్లు ఆ సంస్థ ప్రతినిధి రిజ్వాన్ హనీఫ్ పేర్కొన్నాడు. అయితే ఈ హత్యల వెనుక భారత నిఘా సంస్థలు ఉన్నాయని అతడు ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో రిజ్వాన్ హనీఫ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో లష్కరే తోయిబా సభ్యులు లక్ష్యంగా దాడులకు గురయ్యారని పేర్కొన్నాడు. పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావలకోట్ వంటి ప్రాంతాల్లో తమకు చెందిన వ్యక్తులు మరణించారని చెప్పాడు.“గత మూడు నుంచి నాలుగేళ్లలో 30 మందికి పైగా మా సభ్యులు భారత నిఘా ఏజెంట్ల చేతిలో హతమయ్యారు” అని అతడు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ ఘటనలను అతడు “తెలియని గన్‌మెన్ మోడల్”unknown gunman modelగా అభివర్ణించాడు.Lashkar-E-Taiba's First Ever Explosive Admission 🔥🔥🔥Lashkar-e-Taiba/JKUM terrorist Rizwan Hanif openly admits that more than 30 members of the outfit were eliminated by unknown gunmen (Indian agents), across Peshawar, Karachi, Rawalpindi, Rawalakot and Muzaffarabad over the… pic.twitter.com/gXr0jIeYmH— OsintTV 📺 (@OsintTV) August 3, 2026అయితే ఈ ఆరోపణలకు సంబంధించి భారత ప్రభుత్వంగానీ, ఇటు భద్రతా సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పాకిస్థాన్ తరచూ ఈ దాడులకు భారత్‌ను కారణంగా చూపుతుండగా.. న్యూఢిల్లీ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తున్నాయి.తొలిసారి.. ఒప్పుకోలులష్కరే తోయిబా అనుబంధ వ్యక్తి ఒకరు తమ సంస్థకు చెందిన ఇంతమంది సభ్యులు వరుసగా హతమైనట్లు బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి అని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌లో పలువురు ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల దాడుల్లో మరణించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల వెనుక ఎవరు ఉన్నారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. ఎలా పుట్టింది లష్కరే తోయిబా?లష్కరే తోయిబా పాకిస్థాన్‌లో ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ. 1980ల చివర్లో హఫీజ్ మహ్మద్ సయీద్, జఫర్ ఇక్బాల్, అబ్దుల్లా అజామ్‌లు ఈ సంస్థను స్థాపించారు. తొలినాళ్లలో ఇది మర్కజ్-ఉద్-దవా-వల్-ఇర్షాద్ అనే సంస్థకు అనుబంధంగా పనిచేసింది. సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో ఏర్పాటైన ఈ సంస్థ.. ఆ తర్వాత తన కార్యకలాపాలను జమ్మూ కశ్మీర్‌పై కేంద్రీకరించింది. కశ్మీర్లో సాయుధ పోరాటం పేరుతో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చిందని భారత్ ఆరోపిస్తోంది.ముంబై దాడులతో ప్రపంచ దృష్టిలోకిలష్కరే తోయిబా పేరు 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా చర్చకు వచ్చింది. ముంబైలోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, నరిమన్ హౌస్ సహా పలు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందని భారత్ ఆరోపించింది. అనంతరం ఐక్యరాజ్యసమితి, అమెరికా సహా పలు దేశాలు ఈ సంస్థను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చాయి.భారత్, పాశ్చాత్య దేశాలు లష్కరే తోయిబాకు పాకిస్థాన్‌లోని కొన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని గతంలో ఆరోపించాయి. అయితే పాకిస్థాన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చింది.విద్వేష వ్యాఖ్యలపై వివాదంతాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన రిజ్వాన్ హనీఫ్.. గతంలోనూ ఇతర మతాలపై అభ్యంతరకర, విద్వేషపూరిత వ్యాఖ్యలు కూడా ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాద సంస్థలు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తాయని భద్రతా నిపుణులు చెబుతున్నారు.అసలు ఎవరి హస్తం?లష్కరే తోయిబా సభ్యులుగా చెప్పబడుతున్న వ్యక్తుల హత్యల వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు. అయితే రిజ్వాన్ హనీఫ్ వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు, వాటిపై జరుగుతున్న దాడులపై మరోసారి చర్చకు తెరలేపాయి. భారత్ షరామామూలుగానే ఈ ఆరోపణలను ఖండించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. -
47 ఏళ్ల రికార్డును సమం చేసిన పాక్ బౌలర్
వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్ జట్టులో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తొలి టెస్ట్‌లో 8 వికెట్లతో (రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన) సత్తా చాటినప్పటికీ, రైట్ ఆర్మ్ మీడియం పేసర్ మహ్మద్ అబ్బాస్‌ను ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి తప్పించారు. ఈ ఆశ్చర్యకర పరిణామం ద్వారా అబ్బాస్ ఓ పాకిస్తాన్ రికార్డును సమం చేశాడు.ముందు మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసినా, ఆ తర్వాతి మ్యాచ్‌లో జట్టులో చోటు దక్కని రెండో పాకిస్తానీ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.47 ఏళ్ల ముందు (1979-80) భారత పర్యటనలో ఎహ్తెషాముద్దీన్ నాలుగో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/47) సత్తా చాటాడు. కానీ ఆ తర్వాతి టెస్టులో అప్పటి కెప్టెన్ అసిఫ్ ఇక్బాల్ అతడిని తప్పించి ఇమ్రాన్ ఖాన్‌ను జట్టులోకి తీసుకున్నాడు. తాజాగా అబ్బాస్ కూడా ముందు టెస్టులో 5 వికెట్లు తీసినప్పటికీ, తదుపరి టెస్టులో ప్లేయింగ్ XIకి దూరమయ్యాడు.అబ్బాస్ స్థానంలో నసీమ్ షా తమ్ముడు ఉబైద్ షా జట్టులోకి వచ్చాడు. అతడికి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (రెండో టెస్ట్‌కు వేదిక) పరిస్థితులకు సరిపోడనే కారణంతో అబ్బాస్‌ను బెంచ్‌కు పరిమితం చేసినట్లు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తెలిపాడు.అయితే అబ్బాస్‌ను తప్పించడం సరైన నిర్ణయం కాదని మ్యాచ్ తొలి రోజే తేలిపోయింది. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఉబైద్ 9 ఓవర్లలో 56 పరుగులిచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. దీంతో వెస్టిండీస్ 239/5తో తొలి రోజు ఆట ముగించింది.తొలి టెస్ట్‌లో బంతితో సత్తా చాటిన జస్టిన్ గ్రీవ్స్ ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో రాణించి (64 నాటౌట్) విండీస్ జట్టును ఆదుకున్నాడు. అతడికి జతగా కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (36 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. -
భారత అధికారికి పాక్ రేంజర్ సెల్యూట్.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: అటారీ-వాఘా సరిహద్దులో పాకిస్థాన్ రేంజర్ భారత సైనిక ఉన్నతాధికారికి సెల్యూట్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. బీటింగ్ రిట్రీట్ వేడుక సందర్భంగా ఓ పాకిస్థాన్ రేంజర్ భారత సైన్యానికి చెందిన సీనియర్ అధికారికి సెల్యూట్ చేయడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి ప్రతిగా భారతీయ అధికారి కూడా ఆ సైనిక అభివాదనాన్ని స్వీకరించారు.కెమెరాకు చిక్కిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఇది సైనిక వృత్తిపరమైన సంప్రదాయాలకు, దుస్తుల (యూనిఫాం) గౌరవానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. సరిహద్దుల్లో జరిగే అధికారిక వేడుకలు, ఫ్లాగ్ మీటింగ్‌లు ఇతర సైనిక సదస్సుల సమయంలో ఇరు దేశాల సైన్యాలు అంతర్జాతీయ సైనిక నిబంధనలు, ప్రోటోకాల్‌ను పాటిస్తాయని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో వ్యక్తిగత లేదా రాజకీయ విభేదాలకు అతీతంగా హోదా, యూనిఫాంకు సముచిత గౌరవం ఇస్తారని తెలిపారు.ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘ఇది భారత్ లేదా పాకిస్థాన్‌కు సంబంధించినది కాదు, యూనిఫాం ధరించిన సైనికుల మధ్య సీనియర్ అధికారికి దక్కే గౌరవం’ అని ఒక యూజర్ రాసుకొచ్చారు. మరొకరు స్పందిస్తూ ‘ఇది కేవలం సైనిక సంప్రదాయానికి ప్రతీక’ అని పేర్కొన్నారు. మరో వ్యాఖ్యలో ‘ఇలాంటి సమయాల్లో రాజకీయం కంటే సైనిక ప్రోటోకాల్దే పైచేయి అవుతుంది’ అని రాశారు. సైనిక నిబంధనల ప్రకారం ఎదుటి అధికారి ఉన్నత హోదాలో ఉంటే సెల్యూట్ చేయడం ఆనవాయితీ అని, సీనియర్ అధికారులు దాన్ని మర్యాదపూర్వకంగా స్వీకరిస్తారని కొందరు స్పష్టం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నప్పటికీ, ఇది ఏ నాటిదనే దానిపై ఎలాంటి ధృవీకరణ లభించలేదు. దీంతో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Comedycrest.in™ (@comedycrest.in)ఇది కూడా చదవండి: నా కల సొంతూరికి సర్పంచ్: అభిజీత్ దీప్కే -
బాంబర్ బీభత్సం.. షాకింగ్ విజువల్స్ వైరల్!
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ మరోసారి ఉగ్రదాడితో వణికిపోయింది. శాంతి కోసం నిర్వహించిన ఓ నిరసన ర్యాలీనే లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. స్వాత్ జిల్లాలోని కబాల్ పట్టణంలో పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే దాడి దృశ్యాలు.. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ దాడి జరిగిన సమయంలో అక్కడ ప్రజలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నారు. "మిలిటెన్సీని అంతం చేయాలి.. ప్రజలకు భద్రత కల్పించాలి" అంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఓ ఆత్మాహుతి బాంబర్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించి, భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో గేటు వద్దే పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు.పోలీసులే టార్గెట్.. శాంతి ర్యాలీపై పంజాస్వాత్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రకారం ఈ దాడిలో పలువురు పోలీసు సిబ్బంది కూడా మృతి చెందారు. దాడి జరిగిన ప్రాంతం కిక్కిరిసి ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. పేలుడు శబ్దం వినిపించగానే ప్రజలు భయంతో పరుగులు తీశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించేందుకు స్థానికులు సహకరించారు.ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. అయితే ఖైబర్ పఖ్తున్ఖ్వాలో చురుకుగా ఉన్న తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP)పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అసలు ఇక్కడే ఎందుకు దాడులు?పాకిస్థాన్‌లో ఉగ్రవాద సమస్యకు అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఖైబర్ పఖ్తున్ఖ్వా ఒకటి. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటం, కొండ ప్రాంతాలు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు కారణంగా ఈ ప్రాంతం చాలా కాలంగా ఉగ్రవాద గ్రూపులకు స్థావరంగా మారింది. గతంలో ఈ ప్రాంతం పాకిస్థాన్ తాలిబాన్ వంటి మిలిటెంట్ గ్రూపుల ప్రభావంలో ఉండేది. పాకిస్థాన్ సైన్యం చేపట్టిన ఆపరేషన్లతో కొంతకాలం దాడులు తగ్గినా.. ఇటీవలి సంవత్సరాల్లో మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతున్నాయి.TTP మళ్లీ పుంజుకుంటోందా?తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) లక్ష్యం పాకిస్థాన్‌లో తమకు అనుకూలమైన కఠిన ఇస్లామిక్ పాలన ఏర్పాటు చేయడం. ఈ సంస్థ భద్రతా బలగాలు, ప్రభుత్వ సంస్థలు, తమకు వ్యతిరేకంగా మాట్లాడే పౌరులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్‌లోని కొన్ని మిలిటెంట్ గ్రూపులకు ధైర్యం పెరిగిందని భద్రతా నిపుణులు చెబుతున్నారు. అయితే ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం తమ భూభాగం నుంచి పాకిస్థాన్‌పై దాడులు జరగడం లేదని చెబుతోంది.శాంతి కోరుతున్న ప్రజలే ఎందుకు బలవుతున్నారు?ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని సాధారణ ప్రజలు ఏళ్లుగా ఉగ్రవాదం, సైనిక చర్యల మధ్య నలిగిపోతున్నారు. ఒకప్పుడు పర్యాటక ప్రాంతంగా పేరున్న స్వాత్ లోయ కూడా ఉగ్రవాద ప్రభావాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు అక్కడి ప్రజలు మళ్లీ అలాంటి పరిస్థితులు రావద్దని కోరుతున్నారు. అయితే శాంతి కోసం గొంతెత్తుతున్న వారినే లక్ష్యంగా చేసుకోవడం ఉగ్రవాదుల వ్యూహంలో భాగమని నిపుణులు అంటున్నారు. ప్రజల్లో భయాన్ని పెంచడం, ప్రభుత్వంపై నమ్మకాన్ని దెబ్బతీయడం, భద్రతా వ్యవస్థను సవాలు చేయడమే ఇలాంటి దాడుల ప్రధాన ఉద్దేశమని విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: ఎవడ్రా సామి నువ్వు.. పాక్‌ను ఇంతలా వణికిస్తున్నావ్?పాక్‌కు పెరుగుతున్న భద్రతా సవాల్ఒకవైపు సరిహద్దు ఉద్రిక్తతలు, మరోవైపు అంతర్గత ఉగ్రవాదం పాకిస్థాన్‌కు పెద్ద సవాల్‌గా మారాయి. కేవలం సైనిక చర్యలతోనే ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయడం సాధ్యం కాదని.. స్థానిక ప్రజల విశ్వాసం, అభివృద్ధి, సరిహద్దు నియంత్రణ వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.శాంతి కోసం జరిగిన ర్యాలీపై జరిగిన ఈ దాడి.. ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఉగ్రవాద సమస్య ఇంకా ఎంత తీవ్రంగా ఉందో మరోసారి బయటపెట్టింది. ప్రజలు భయంతో జీవించే పరిస్థితికి ముగింపు పలకడం పాకిస్థాన్ ముందున్న అతిపెద్ద సవాల్‌గా మారింది.BREAKING: A suicide blast struck Kabal Police Station in Swat district, Khyber Pakhtunkhwa, Pakistan, during a nearby peace rally. Reports indicate at least 16 people, including 10 police officers, were killed, with many others injured.#BreakingNews #Pakistan #Swat…— WorldNewsRank (@WNewsRankX) August 3, 2026 -
నాడు సన్మానాలు, సత్కారాలు.. తర్వాత తొక్కిపడేశారు!
ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌కు మొట్టమొదటి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించిన అథ్లెట్ అర్షద్ నదీమ్. పారిస్ ఒలింపిక్స్-2024లో అనూహ్య రీతిలో ఈ జావెలిన్ త్రోయర్ ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. తద్వారా విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జావెలిన్ త్రోయర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు.ఈ క్రమంలో పాకిస్తాన్లో అర్షద్ నదీమ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అతడు సన్మానాలు, సత్కారాలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. అతడి ప్రదర్శన రోజురోజుకీ దిగజారిపోయింది.చేదు అనుభవంతాజాగా కామన్వెల్త్ గేమ్స్-2026లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్షద్ నదీమ్.. కనీసం కాంస్యం కూడా గెలవలేకపోయాడు. తొలి ప్రయత్నంలోనే ఫౌల్ కావడంతో అతడికి ఫైనల్ రౌండ్లో చేదు అనుభవం ఎదురైంది. టాప్-8కు చేరలేక అతడు ఎలిమినేట్ అయ్యాడు. గత ఎడిషన్‌లో పసిడితో మెరిసిన అతడు ఈసారి కనీసం కాంస్యం కూడా లేకుండానే వెనుదిరిగాడు.చెప్పినట్లు వినలేదని...అయితే, ఇందుకు పాకిస్తాన్ అమెచూర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (PAAF)తో అతడికి ఉన్న విభేదాలే కారణం అని తెలుస్తోంది. PAAF అభీష్టానికి వ్యతిరేకంగా అర్షద్.. సల్మాన్ బట్‌ను తన కోచ్‌గా ఎంచుకున్నట్లు సమాచారం. నిజానికి సల్మాన్‌పై PAAF 2025 అక్టోబరులో జీవితకాల నిషేధం విధించింది. ఆ తర్వాత నెల రోజుల వ్యవధిలోనే నిషేధం ఎత్తివేసింది.దీంతో అర్షద్ సల్మాన్ మార్గదర్శనంలో ప్రాక్టీస్ చేశాడు. అయితే, ఇందుకు PAAF ఏమాత్రం సహకరించలేదని సమాచారం. పాకిస్తాన్ క్రీడా బోర్డు సైతం అర్షద్ నదీమ్ సన్నాహకాలకు కావాల్సిన నిధులు విడుదల చేయలేదని అతడి సన్నిహిత వర్గాలు గతంలో స్థానిక మీడియాకు తెలిపాయి.ఈ నేపథ్యంలో విదేశాల్లో ప్రాక్టీస్ చేయడం వీలుకాక.. లాహోర్‌లో ఎర్రటి ఎండల్లో అర్షద్ ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. కామన్వెల్త్ క్రీడల వేదికైన గ్లాస్గో (స్కాట్లాండ్)లో ఇందుకు పూర్తి వ్యతిరేకమైన వాతావరణం ఉండటం అతడి ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.అతడికి ఎంతటి దుస్థితిఈ పరిణామాల నేపథ్యంలో అర్షద్ నదీమ్ ఈసారిక పతకం లేకుండానే వెనుదిరిగినట్లు అతడి సన్నిహితవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, పాక్ మాజీ బాక్సర్ హుసేన్ షా ఈ విషయం గురించి మాట్లాడుతూ..‘‘సరైన ఆదాయం లేని.. నిరుపేద కుటుంబం, చిన్న గ్రామం నుంచి వచ్చి దేశాన్ని తలెత్తుకునేలా చేసిన అథ్లెట్ అతడు. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో దేశానికి పసిడి పతకాలు అందించాడు. కానీ ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ కోసం సన్నద్ధమయ్యే వాతావరణం కూడా మా క్రీడా సంస్థ కల్పించలేకపోయింది.పాక్ క్రీడా వ్యవస్థలోని లోపానికి ఇది నిలువెత్తు నిదర్శనం’’ అని హుసేన్ షా మండిపడ్డాడు. కాగా అంతకుముందు సల్మాన్‌తో పాటు సౌతాఫ్రికా కోచ్ టెర్సస్ లీబెన్బెర్గ్తో అర్షద్ ప్రాక్టీస్ చేసి అత్యుత్తమ ఫలితాలు అందుకున్నాడు.సరైన సదుపాయాలు ఉంటే స్వర్ణం గెలిచేదాన్నిమరోవైపు.. పాకిస్తాన్‌కు ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో ఏకైక పతకం అందించిన బాక్సర్ ఫాతిమా జెహ్రా సైతం పాక్ క్రీడా బోర్డు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తనకు సరైన సదుపాయాలు కల్పించి ఉంటే కచ్చితంగా మెరుగైన పతకం అందించేదానినని పేర్కొంది. కాగా ఫాతిమా కాంస్య పతకం గెలిచింది. ఇక పాకిస్తాన్ నుంచి ఈసారి మొత్తంగా 36 మంది సభ్యుల బృందం గ్లాస్గోకు వెళ్లగా.. కేవలం ఒకే ఒక్క పతకం దక్కింది.చదవండి: గిల్, అభిషేక్ శర్మ కీలక నిర్ణయం -
పాక్‌లో భీకర ఆత్మాహుతి దాడి
పెషావర్: పాకిస్తాన్‌లోని కల్లోలిత ఖైబర్ ప్రావిన్స్‌లో ఆదివారం భీకర ఆత్మాహుతి దాడి జరిగింది. స్వాత్ జిల్లాలోని కబాల్ పట్టణంలో చేపట్టిన శాంతి ర్యాలీ సమయంలో ఘటన చోటుచేసుకుంది. ర్యాలీ పోలీస్‌స్టేషన్ సమీపానికి రాగానే ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. పేలుడు తీవ్రతకు ఐదుగురు పోలీసులు, ఒక చిన్నారి సహా 14 మంది చనిపోయారు. గాయాలపాలైన మరో 15 మందిని ఆస్పత్రులకు తరలించారు. ఈ దాడికి తమదే బాధ్యతంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. స్థానిక గిరిజన కౌన్సిల్ స్వాత్ అమన్ జిర్గా సారథ్యంలోని జరిగిన ఈ ర్యాలీలో పాల్గొన్న వారు శాంతి నెలకొనాలంటూ ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. కాగా, కబాల్ పోలీస్ స్టేషన్లోకి చొరబడేందుకు యత్నించిన దుండగుడిని ప్రధాన గేట్ వద్ద పోలీసులు అడ్డుకోగా, అతడు అక్కడికక్కడే పేల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో పెనుముప్పు తప్పిందన్నారు. -
పాక్‌ను మరోసారి చిత్తు చేసిన శ్రీలంక.. మరో సిరీస్ కైవసం
శ్రీలంక పర్యటనలో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టుకు వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. తొలుత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కోల్పోయిన (1-2తో) ఈ జట్టు.. తాజాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది.డంబుల్లా వేదికగా ఇవాళ జరిగిన రెండో టీ20లో ఆతిథ్య జట్టు పాక్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రీలంక మరో 14 బంతులు (17.4 ఓవర్లు) మిగిలుండగానే కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ చమారీ ఆటపట్టు (40), సంజనా కవిండి (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడి లంక విజయంలో కీలకపాత్ర పోషించారు. విష్మి గుణరత్నే (31), హర్షిత సమరవిక్రమ (37 నాటౌట్) కూడా ఉపయోగకరమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఖర్లో కవిష దిల్హరి (14 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించింది. పాక్ బౌలర్లలో హనీ 2, వహీదా, అయేషా జాఫర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు పాక్ తరఫున ఓపెనర్లు మునీబా అలీ (45), షావాల్ జుల్ఫికర్ (48) రాణించారు. ఆఖర్లో ఫాతిమా (30 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. మిగతా ప్లేయర్లలో ఎమాన్ నసీర్ 21, అయేషా జాఫర్ 8, సైరా జబీన్ 16, హనీ 2 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో ప్రబోధ 2, సుగంధక కుమారి, చమారీ ఆటపట్టు, కవిష దిల్హరి తలో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో టీ20 ఆగస్ట్ 4న జరుగనుంది. -
మేరీ కోమ్ స్ఫూర్తి.. కామన్వెల్త్లో పాకిస్తాన్‌కు తొలి పతకం
భారత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీ కోమ్ ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మేరీ కోమ్ ఇచ్చిన స్ఫూర్తి భారత్‌లో ఎంతోమంది మహిళా బాక్సర్లను పుట్టేలా చేసింది. అయితే తాజాగా ఆమె ఇచ్చిన స్ఫూర్తి దేశ సరిహద్దులను కూడా దాటి పాకిస్తాన్‌ను కూడా తాకింది. విషయంలోకి వెళితే పాకిస్తాన్ బాక్సర్ అయిన 22 ఏళ్ల ఫాతిమా జహ్రా కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 60 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది.తద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన తొలి పాకిస్తాన్ బాక్సర్‌గా ఫాతిమా నిలిచింది. అంతేకాదు ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో ఫాతిమా సాధించిన పతకమే వారికి మొదటిది కావడం గమనార్హం. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న సర్ఘోడాలో పెరిగిన ఫాతిమా భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్‌ను ఆదర్శంగా తీసుకుంది. మేరీ కోమ్ జీవితం ఆధారంగా 2014లో బాలీవుడ్లో తెరకెక్కిన బయోపిక్ అప్పటికి 10 ఏళ్ల వయసు ఉన్న ఫాతిమాపై చెరగని ముద్ర వేసింది. ఆ సినిమాలో మేరీ కోమ్ జీవితంలో ఎన్నో కష్టాలను దాటుకొని దిగ్గజ బాక్సర్‌గా పేరు పొందడం ఫాతిమాను బాగా ఆకట్టుకుంది. ఆ క్షణంలోనే తాను కూడా బాక్సర్ కావాలని కలలు కన్నది. అయితే ఫాతిమా బాక్సర్ అయ్యే క్రమంలో సొంత దేశంలో ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంది. ఫాతిమా కుటుంబం బాక్సింగ్‌కు వ్యతిరేకంగా ఉండేది. ఆమెను శిక్షణకు వెళ్లనిచ్చేవారు కాదు. కానీ సంవత్సరాల తరబడి ఫాతిమా చేసిన పోరాటం ఆమెపై వ్యతిరేకతను పోగొట్టి మద్దతు పెరిగింది. అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇవాళ వాళ్ల దేశానికి కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం తీసుకొచ్చి అందరి చేత శెభాష్ అనిపించుకుంది. కాగా పతకం సాధించిన అనంతరం ఫాతిమా మాట్లాడుతూ.. భారతదేశానికి చెందిన మేరీ కోమ్ నాకు స్ఫూర్తి. ఆమె జీవితంపై తీసిన సినిమాను నేను అప్పట్లో ప్రతీరోజు చూసేదాన్ని. నేను బాక్సింగ్ మొదలుపెట్టినప్పుడు ఆ సినిమా చూస్తూ శిక్షణ తీసుకునేదాన్ని. ఆమె అంటే నాకు చాలా గౌరవం. దేవుడి దయవల్ల ఇవాళ ఆమె లాగే మా దేశానికి ఒక పతకం తీసుకొచ్చాను. ఏదో ఒకరోజు ఆమెలానే మా దేశానికి నేను కూడా పేరు ప్రఖ్యతలు తీసుకొస్తానని ఆశిస్తున్నా* అని తెలిపింది.ఇక మేరీకోమ్ ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెచ్యూర్ బాక్సింగ్‌లో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసింది. మేరీకోమ్ తన కెరీర్లో ఆరు ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిళ్లు, ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాలు, ఐదు ఆసియా ఛాంపియన్షిప్లను గెలిచి అత్యున్నత శిఖరాన్ని అందుకుంది. More history has been made at the 2026 Commonwealth Games as Fatima Zahra becomes the first women from Pakistan to medal in boxing. 🇵🇰Zahra lost in the semi finals against Marie-Bathoul Al-Ahmadieh, who will go on to face Priya Priya of India in the final. #TimeForWorldBoxing pic.twitter.com/SpSuDpBhVB— World Boxing (@RealWorldBoxing) July 31, 2026చదవండి: సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా పటీదార్.. అందరి కళ్లు అతడిపైనే! -
‘ధురంధర్’ ల్యారీ మళ్లీ వార్తల్లో! ఈసారి..
సినిమాల్లో చూపించిన చీకటి ప్రపంచం.. నిజ జీవితంలోనూ అంతే భయానకంగా ఉంటుందా? పాకిస్థాన్‌లోని కరాచీ గ్యాంగ్‌వార్ ప్లేస్ ‘ల్యారీ’ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ‘ధురంధర్’లో చూపించిన ఈ ప్రాంతంలో గ్యాంగ్ కల్చర్, అండర్‌వల్డ్ ఆధిపత్య పోరు వాస్తవమనే విషయం మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఒకప్పుడు ల్యారీని తన గుప్పిట్లో ఉంచుకున్న గ్యాంగ్‌స్టర్ ఉజైర్ బలోచ్ సోదరుడు జుబైర్ బలోచ్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కరాచీలోని ల్యారీ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట కూర్చుని ఉన్న జుబైర్ బలోచ్‌పై బైక్‌పై వచ్చిన సాయుధులు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ దాడిలో అతడికి ఛాతీ, పొత్తికడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు సాధారణ పౌరులు కూడా గాయపడ్డారు. పోలీసుల ప్రకారం.. చాకీవారా రోడ్డులోని సింగూ లేన్ ప్రాంతంలో జుబైర్‌పై దాడి జరిగింది. అతడిని వెంటనే కరాచీ సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ దాడి వెనుక ఉంది ఎవరు? అనేదానిపై ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. గ్యాంగ్ వార్, వ్యక్తిగత కక్షలు, పాత నేర సంబంధాలు.. ఇలా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని అక్కడి అధికారులు ప్రకటించారు. ల్యారీ అంటేనే గ్యాంగ్‌ల గడ్డకరాచీ నగరంలోని ల్యారీ ప్రాంతానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు రాజకీయ ప్రభావం, గ్యాంగ్‌ల ఆధిపత్యం, ఆయుధ సంస్కృతికి ఈ ప్రాంతం కేంద్రంగా ఉండేది. చిన్న వీధుల్లో పెరిగిన గ్యాంగ్‌లు క్రమంగా భారీ నెట్‌వర్క్‌లుగా మారి.. ప్రాంతీయ రాజకీయాలు, స్థానిక వ్యాపారాలపై ప్రభావం చూపిన సందర్భాలు ఉన్నాయి. ఇదే నేపథ్యంతో.. నిజజీవిత ఘటనల స్ఫూర్తితో మాంచి మసాలా స్పై డ్రామాగా ‘ధురంధర్’ సినిమాను మలిచాడు దర్శకుడు ఆదిత్య ధార్.ఎవరీ ఉజైర్ బలోచ్?ఇప్పుడు కాల్పులకు గురైన జుబైర్ బలోచ్.. ఉజైర్ బలోచ్ సొంత తమ్ముడు. ఉజైర్ బెలూచ్ కరాచీలోని ల్యారీ ప్రాంతంలో రెహమాన్ డకాయిట్ వారసుడిగా ఎదిగాడు. రెహమాన్ మరణం తర్వాత అతడి కజిన్ అయిన ఉజైర్ చేతికి ల్యారీ గ్యాంగ్ పగ్గాలు వెళ్లాయి. అయితే సినిమాలో సొంత సోదర బంధంగా చూపించారు. ఆ తర్వాత.. కరాచీ అండర్వల్డ్లో ఉజైర్ పేరు మరింత ప్రభావవంతంగా మారింది. అతడిపై హత్యలు, పోలీసులపై దాడులు, ఆయుధ కేసులు సహా అనేక ఆరోపణలు ఉన్నాయి. 2012లో భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణలకు సంబంధించిన కేసుల్లోనూ అతడి పేరు వచ్చింది. ఆఖరికి 2020లో పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం గూఢచర్యం కేసులో అతడిని దోషిగా తేల్చి 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది(సినిమాలో రణ్వీర్ హమ్జా పాత్ర ఉజైర్ను పక్కా స్కెచ్‌తో ఇరికించినట్లు చూపించాడు). వాస్తవంగా.. ఇప్పటికీ అతడిపై పలు కేసులు కొనసాగుతున్నాయి.ఒకప్పుడు తుపాకుల మోత, గ్యాంగ్‌ల ఆధిపత్యానికి పేరున్న ల్యారీ.. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి రావడంతో కరాచీ భద్రతపై చర్చ మొదలైంది. ఉజైర్ బలోచ్ కుటుంబంపై జరిగిన ఈ దాడి వెనుక అసలు కథ ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.పాక్‌లో వాళ్ల అంతం.. ఎప్పుడూ మిస్టరీనే?పాకిస్థాన్‌లో గ్యాంగ్స్టర్లు, అండర్‌వల్డ్ డాన్లు, ఉగ్ర సంబంధం ఉన్న నేతల జీవితాలు తరచూ అనూహ్య మలుపులు తిరుగుతుంటాయి. ఆధిపత్య పోరులు, రాజకీయ విభేదాలు, ప్రత్యర్థి వర్గాల దాడులు.. ఇలా పలువురు కీలక వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. ఆ సమయాల్లో భారత్‌పైనా పాక్ ఆరోపణలు గుప్పించిన సందర్భాలు లేకపోలేదు. అయితే కొన్ని ఘటనల్లో దాడి వెనుక అసలు కారణాలు, కుట్రదారులు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. -
పాక్ హోంమంత్రి హెచ్చరిక.. మునీర్‌కు ముప్పు సంకేతమా?
పాకిస్తాన్లో పెరుగుతున్న అసంతృప్తి, యువతలో ఆగ్రహం, కుప్పకూలుతున్న పాలనా వ్యవస్థపై ఆ దేశ హోంమంత్రి మొహ్సిన్ నక్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. సాధారణంగా ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంటాయి. కానీ ఇక్కడ ఏకంగా అంతర్గత వ్యవహారాల మంత్రే.. నిరాశకు గురైన యువత ఒక్కటైతే దేశాన్ని మార్చగల శక్తి వారికి ఉందని హెచ్చరించడం ఆసక్తికర పరిణామంగా మారింది.ఇస్లామాబాద్‌లో జరిగిన పాకిస్తాన్ ఎకనామిక్ సమ్మిట్‌లో పాల్గొన్న మొహ్సిన్ నక్వీ, దేశంలోని పాలనా వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న విధానాలతో సమస్యలకు పరిష్కారం లభించదని, పరిపాలనా వ్యవస్థలో మూలస్థాయి మార్పులు అవసరమని అన్నారు. ‘ఇప్పుడు మనం జీవిస్తున్న వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ విధానంతో సమస్యలను పరిష్కరించలేం. నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టకపోతే పదేళ్ల తర్వాత కూడా ఇవే సమస్యలపై చర్చించాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.బొద్దింకలైనా సరే.. ఏకమైతే శక్తే!దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించిన నక్వీ.. వారికి ఆర్థిక సాయం కంటే ఉద్యోగాలు, ప్రతిభకు గుర్తింపు, న్యాయం ముఖ్యమని అన్నారు. ‘ప్రజలకు కావాల్సింది న్యాయం, ప్రతిభకు విలువ, ఉద్యోగ అవకాశాలు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చేసిన ఓ వ్యాఖ్య మాత్రం సంచలనంగా మారింది. ‘ఆ యువకుడిని యువత అనండి... బొద్దింక అనండి... ఇంకేదైనా అనండి. కానీ ఆ బొద్దింకలన్నీ ఒక్కటైతే అన్నింటినీ తలకిందులు చేయగలవు’ అని అన్నారు. నక్వీ నేరుగా ఏ నిరసనను ప్రస్తావించకపోయినా, ఇటీవల భారత్‌లో జరిగిన సీజేఐ (CJP) ఉద్యమం, దాని రాజకీయ ప్రభావాల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాకిస్తాన్‌లోనూ యువతలో పెరుగుతున్న నిరాశ, నిరుద్యోగం, అవకాశాల కొరత ఒక పెద్ద ఉద్యమానికి దారితీయవచ్చన్న ఆందోళన ఈ వ్యాఖ్యల్లో కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదే సమయంలో పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆసిమ్ మునీర్ పాత్రపై కూడా నక్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. మునీర్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కటే దేశ సమస్యలను పరిష్కరించలేవని, రాజకీయ నాయకులు కలిసి పాలనా వ్యవస్థను మార్చకపోతే శాశ్వత ఫలితాలు రావని అన్నారు. ‘రాజకీయ నాయకులు దేశ వ్యవస్థను సరిచేయకపోతే ఫీల్డ్ మార్షల్ చేస్తున్న కృషికి ప్రయోజనం ఉండదు’ అని స్పష్టం చేశారు. మునీర్ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయనని పలుమార్లు చెప్పారని గుర్తుచేసిన నక్వీ, అన్ని రాజకీయ పార్టీలు కలిసి దేశ పరిపాలనను మెరుగుపర్చేందుకు పనిచేయాలని సూచించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేస్తున్నప్పటికీ, వ్యవస్థలో మార్పులు లేకపోతే అది కేవలం సమస్యలపై తాత్కాలిక చర్యలకే పరిమితమవుతుందని అభిప్రాయపడ్డారు.భారీ అప్పులు, బలహీన పాలన, నెమ్మదించిన అధికార యంత్రాంగం, నిరుద్యోగం, ప్రతిభ ఆధారిత అవకాశాల కొరత వంటి సమస్యలు పాకిస్తాన్‌ను వెంటాడుతున్నాయని నక్వీ పేర్కొన్నారు. వీటికి తాత్కాలిక పరిష్కారాలు కాకుండా వ్యవస్థాగత సంస్కరణలే అవసరమని అన్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఆర్థిక కష్టాలు, రాజకీయ విభేదాల మధ్య దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రజల అసంతృప్తి ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో పాలక వర్గాల్లోనే చర్చకు వస్తుండటం పాకిస్తాన్ భవిష్యత్ రాజకీయాలపై ఆసక్తిని పెంచుతోంది. -
బ్రాడ్‌పీక్‌పై హిమపాతం
ఇస్లామాబాద్/కఠ్మాండు: పాకిస్తాన్‌లోని బ్రాడ్ పీక్‌పై సంభవించిన హిమపాతంతో పదిమందితో కూడిన పర్వతారోహకుల బృందం గల్లంతైంది. కారకోరమ్ పర్వతశ్రేణిలోని 8,051 మీ టర్ల ఎత్తయిన బ్రాడ్‌పీక్‌ను బ్రిటిష్ స్పెషల్ ఫో ర్సెస్ మాజీ సభ్యుడు, నేపాలీ ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా(43) సారథ్యంలోని 10 మంది పర్వతారోహకుల బృందం అధిరోహించేందుకు ప్రయతి్నంచింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 9 గంటల సమయంలో బ్రాడ్ పీక్‌పై 7 వేల మీటర్ల ఎత్తులో ఉండగా సంభవించిన హిమపాతంలో చిక్కుకుని ఈ బృందంలోని వారంతా గల్లంతయ్యారు. ఇందులో ఆరుగురు నేపాలీలు కాగా, పాక్, ఒమన్, అమెరికా, చైనాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వరకు నలుగురు మృతదేహాలను వెలికి తీశామని ఆలై్పన్ క్లబ్ ఆఫ్ పాకిస్తాన్ (ఏసీపీ) ప్రెసిడెంట్ మేజర్ జనరల్ ఇర్ఫాన్ అర్షద్ తెలిపారు. ఈ నలుగురిలో ఒకరు నేపాల్ వాసి గురుంగ్ కాగా, మరొకరు ఒమన్ దేశస్తురాలు నదీరా అహ్మద్ అని చెప్పారు. మిగతా ఇద్దరినీ గుర్తించాల్సి ఉందన్నారు. అన్వేషణలో రెండు పాక్ మిలటరీ హెలికాప్టర్లు పాల్గొంటున్నాయని, అయితే వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా ఉందని పేర్కొన్నారు. కాగా, ట్రాకింగ్ డేటా ప్రకారం పూర్ణా ఇంకా కదులుతూ ఉండవచ్చని పూర్జా వ్యాపార భాగస్వామి అయిన మింగ్మా డేవిడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రాడ్ పీక్‌పై హిమపాతం సంభవించినప్పటి నుంచి పూర్జా ట్రాకింగ్ పరికరం లొకేషన్ మారుతూనే ఉందన్నారు. చైనా సరిహద్దుకు సమీపంలో గిల్గిట్–బాల్టిస్తాన్ ప్రాంతంలో ఉన్న బ్రాడ్ పీక్ అధిరోహకులకు అత్యంత సవాళ్లతో కూడిన పర్వతాల్లో ఒకటి. ఎవరీ నిర్మల్ పూర్జా? పూర్జా ప్రపంచంలోని ప్రసిద్ధ పర్వతారోహకుల్లో ఒకరు. 2019లో కేవలం 6 నెలల వ్యవధిలోనే 8వేల మీటర్లకు మించి ఎత్తున్న 14 శిఖరాలను అధిరోహించి వెలుగులోకి వచ్చారు. పూర్జాకంటే ముందు ఈ రికార్డును దక్షిణ కొరియాకు చెందిన కిమ్ చాంగ్–హో నెలకొల్పారు. అయితే, ఆయన ఈ ఘనతను సాధించడానికి ఏడేళ్లు పట్టింది. పూర్జా సాధించిన ఘనతను ‘14 పీక్స్: నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్’పేరుతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చేశారు. పూర్జా 9 మంది నేపాలీ పర్వతారోహకులతో కలిసి ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తైన కే2 పర్వతాన్ని శీతాకాలంలో అధిరోహించి రికార్డు సృష్టించారు. అంతకుముందు పూర్జా బ్రిటిష్ సైన్యంలో 16 ఏళ్లు సేవలందించారు. 2018లో మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం అందుకున్నారు. -
భారత్‌తో పోలుస్తావా?.. పాక్‌లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనల విషయంలో భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. ఆ దేశ అధికార వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మోదీ సర్కార్‌ను చూసి నేర్చుకోండి’’ అంటూ పాకిస్థాన్ పాలకులకు హితవు పలికారు. ప్రజల గొంతును అణచివేయడం కాకుండా.. వారి సమస్యలను వినే సంస్కృతి అలవర్చుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పాకిస్థాన్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.పాకిస్థాన్‌లో ఇటీవల విద్యార్థులు, రాజకీయ కార్యకర్తలు చేపట్టిన నిరసనలపై భద్రతా బలగాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో భారత్‌లో విద్యార్థుల నిరసనలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు వంటి నిర్ణయాలు తీసుకుందని అలీమా ఖానుమ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆవేదనను వినడం ప్రభుత్వ బాధ్యత అని, ఆ విషయంలో భారత్‌ను చూసి పాకిస్థాన్ ప్రభుత్వం నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.‘‘భారత్‌లో విద్యార్థులు రోడ్డెక్కితే ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ పాకిస్థాన్‌లో ప్రజలు ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులు, బెదిరింపులే ఎదురవుతున్నాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల గొంతును అణచివేయడం కాదు’’ అంటూ ఆమె మండిపడ్డారు. అధికార యంత్రాంగం ప్రజల హక్కులను గౌరవించకుండా వ్యవహరిస్తోందని, ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదని అలీమా హెచ్చరించారు.అలీమా ఖానుమ్ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే పాకిస్థాన్ రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందన వ్యక్తమైంది. అధికార పక్షానికి చెందిన నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పుబడగా, పాకిస్థాన్‌ను భారత్‌తో పోల్చడం సరికాదని పేర్కొన్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ నేతలు మాత్రం ఆమె వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే విమర్శలను అంగీకరించే సంస్కృతి అవసరమని వారు అభిప్రాయపడ్డారు.ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దేశంలో రాజకీయ ప్రత్యర్థులను అణచివేస్తున్నారని, న్యాయవ్యవస్థపై కూడా ఒత్తిళ్లు పెరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీమా ఖానుమ్ చేసిన "మోదీ సర్కార్‌ను చూసి నేర్చుకోండి" వ్యాఖ్యలు భారత్-పాకిస్థాన్ పోలికలకే కాకుండా, పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య పరిస్థితులపై కూడా మరోసారి చర్చను రేకెత్తించాయి.ప్రస్తుతం ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది. కొందరు అలీమా ఖానుమ్ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు భారత్‌ను ఉదాహరణగా చూపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా, ఆమె చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కొత్త దుమారానికి తెరలేపాయి.నీట్ యూజీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు, గ్రేస్ మార్కుల వివాదంపై విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా పలు ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించి.. పరీక్ష రద్దు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివాదం తీవ్రం కావడంతో కేంద్రం విచారణలు, సంస్కరణలపై చర్యలు చేపట్టింది. విద్యార్థుల ఆందోళనలు కొనసాగిన నేపథ్యంలో ప్రభుత్వం–నిరసనకారుల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యార్థులు తమ నిరసనలను విరమించినట్లు ప్రకటించారు. -
వాళ్లంతా భారత్‌లాగే మాకు శత్రువులు
ఇస్లామాబాద్: మెరుగైన జీవనం, పాలన, అవకాశాలు కోరుతూ ఉద్యమిస్తున్న పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉద్యమకారులపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఇస్లామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పాక్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వాళ్లంతా భారత్‌లాగే మాకు బద్ద శత్రువులు. ఉద్యమకారులతో చర్చలకు కూర్చునే ప్రసక్తే లేదు.వాళ్లంతా పాకిస్తాన్‌కు విరోధులే’’అని అన్నారు. గత రెండ్రోజుల్లో పాక్ భద్రతా బలగాలు ఏకంగా 37 మంది ఉద్యమకారులను పొట్టనబెట్టుకున్నాయని ఉద్యమసంఘాల కూటమి ‘జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ(జేఏఏసీ)’బుధవారం ప్రకటించిన వేళ ఆసిఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఓవైపు జేఏఏసీ బృందం తమతో చర్చలు జరిపిందని, 38 డిమాండ్లను తమ ఎదుట ఉంచిందని ప్రధానమంత్రి సలహాదారు రాణా సనావుల్లా ప్రకటించగా అందుకు భిన్నంగా రక్షణమంత్రి మాట్లాడటం గమనార్హం. పీఓకే శాసనసభ తొలి దశ ఎన్నికలు జరిగిన సోమవారం రోజు రావలకోట్ నుంచి ముజఫరాబాద్‌కు శాంతియుత ర్యాలీ చేస్తున్న తమపై పోలీసులు కాల్పులు జరిపి చిన్నారులు, మహిళలు సహా 37 మందిని చంపేశారని జేఏఏసీ తెలిపింది. ‘‘ఉద్రిక్తతకు దారి తీసిన ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదు. గతంలో ప్రభుత్వం నుంచి సాయుధ శిక్షణ పొందిన పీఓకే వాసులు ఇప్పుడు ప్రభుత్వం మీదకు తుపాకీ గురిపెట్టారు’’అని ప్రధానమంత్రి సలహాదారు రాణా సనావుల్లా వ్యాఖ్యానించారు. -
ఓవరాక్షన్ చేసిన పాక్ ఆటగాళ్లకు శిక్ష
వెస్టిండీస్‌తో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్లు ఖుర్రమ్ షెహ్జాద్, మహ్మద్ అబ్బాస్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.ఇద్దరూ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు (వికెట్లు తీసిన అనంతరం ప్రత్యర్థి బ్యాటర్లను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు) తేలడంతో తలో డీమెరిట్ పాయింట్ కేటాయించింది. అలాగే అబ్బాస్‌కు అధికారిక హెచ్చరికతో పాటు ఖుర్రమ్ షెహ్జాద్కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ప్రతిపాదించిన శిక్షను ఇద్దరూ అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా పోయింది.ఈ మ్యాచ్‌లో అబ్బాస్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. షెహ్జాద్ కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండేసి వికెట్లు తీశాడు. వీరిద్దరూ అద్భుతంగా రాణించినా పాక్‌కు ఓటమి తప్పలేదు. 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 120 పరుగులకే కుప్పకూలి 90 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో టెస్ట్ ఆగస్టు 2 నుంచి క్వీన్స్ పార్క్‌లో జరగనుంది. -
పీవోకేలో మంటలు: పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులపై భద్రతా బలగాల కాల్పుల్లో 14 మంది మృతి చెందిన ఘటనపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని కూడా భారత్‌తో సమానంగా శత్రువులుగా చూస్తానని ఆయన పేర్కొన్నారు.స్థానిక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ వ్యతిరేకంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని వ్యాఖ్యానించారు. ‘‘నేను నిరసనకారులను కూడా భారత్ మాదిరిగానే శత్రువులుగా పరిగణిస్తాను’’ అని ఆయన చెప్పడం వివాదాస్పదమైంది. ఆందోళనకారులతో చర్చలకు అవకాశం లేదని, వారు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.పీవోకేలో కాల్పులు.. 14 మంది మృతిపీవోకేలోని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు సాగిన భారీ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో కనీసం 14 మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినట్లు నిరసనకారులు వెల్లడించారు. పలువురు గాయపడ్డారు.పీవోకే అసెంబ్లీలో కశ్మీరీ శరణార్థులకు కేటాయించిన 12 స్థానాలను రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రిజర్వ్ సీట్ల విధానం వల్ల స్థానిక ప్రజల రాజకీయ హక్కులు ప్రభావితం అవుతున్నాయని JAAC ఆరోపిస్తోంది. ఇస్లామాబాద్‌కు చెందిన రాజకీయ పార్టీలు పీవోకే రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతోందని వారు విమర్శిస్తున్నారు.అయితే పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. నిరసనకారుల వద్ద ఆధునిక ఆయుధాలు ఉన్నాయని, వారు భద్రతా సిబ్బందిపై దాడి చేయడంతోనే బలగాలు స్పందించాయని అధికారులు చెబుతున్నారు. ఇరువర్గాల వాదనలను స్వతంత్రంగా నిర్ధారించడం సాధ్యం కాలేదు.కారణాలు ఉన్నాయిపీవోకేలో ప్రస్తుత ఆందోళనలు ఒక్కసారిగా మొదలైనవి కావు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదల, విద్యుత్ కొరత, నిరుద్యోగం, పాలనా వైఫల్యాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. చౌక ధరలకు విద్యుత్, గోధుమ పిండి సరఫరా, స్థానిక ప్రజలకు మెరుగైన పాలన, ఎక్కువ రాజకీయ హక్కులు కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా కొనసాగుతున్న నిరసనలు ఇప్పుడు ఇస్లామాబాద్ పాలనపై పెద్ద ఎత్తున వ్యతిరేకతగా మారాయి.భారత్ స్పందన ఇదే..పీవోకేలో జరుగుతున్న పరిణామాలపై ఇటు భారత్ కూడా స్పందించింది. అక్కడ చేపడుతున్న ఎన్నికల ప్రక్రియను కేవలం పాకిస్థాన్ ఆక్రమణను సమర్థించుకునే ప్రయత్నంగా భారత్ అభివర్ణించింది. పీవోకేలో ప్రజల అసంతృప్తికి కారణం ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పాలనా వైఫల్యాలేనని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.ఇదిలా ఉండగా.. పీవోకే నిరసనకారులను భారత్‌తో పోల్చుతూ ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన సమయంలో మరింత కఠిన వైఖరి ప్రదర్శించడం ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మరోసారి పాక్ చిత్తు.. సిరీస్ శ్రీలంక వశం
శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పర్యాటక పాకిస్తాన్ జట్టు 1-2 తేడాతో కోల్పోయింది. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జులై 28) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 40 ఓవర్లలో 187 పరుగులకే చాపచుట్టేయగా.. శ్రీలంక 37.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ పాక్ గెలవగా.. రెండు, మూడు మ్యాచ్‌లను గెలిచిన శ్రీలంక సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య జులై 31, ఆగస్ట్ 2, 4 తేదీల్లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది.చెలరేగిన లంక బౌలర్లుటాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన శ్రీలంక పాక్‌ను స్వల్ప స్కోర్‌కే మట్టికరిపించింది. చేతన విముక్తి (3-36), కెప్టెన్ చమారీ (3-27), కవిష దిల్హరి (3-27) చెలరేగి బౌలింగ్ చేశారు. పాక ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసిన ఫాతిమా సనా టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా ప్లేయర్లలో గుల్ ఫెరోజా (40), మునీబా అలీ (34), నజిహా అల్వి (30) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు కూడా సత్తా చాటారు. చమారీ ఆటపట్టు (52), హాసిని పెరీరా (50 నాటౌట్), హర్షిత సమరవిక్రమ (71 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి, తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరి ఇన్నింగ్స్‌లో విష్మి గౌతమ్ (12) మాత్రమే తక్కువ స్కోర్‌కు ఔటైంది. -
పాక్ ప్లేయర్ చారిత్రక శతకం
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ తాజా మాజీ కెప్టెన్ షాన్ మసూద్ అద్భుత శతకంతో సత్తా చాటాడు. మూడో రోజు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మసూద్ 163 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ శతకం అతని టెస్ట్ కెరీర్లో 7వది. వెస్టిండీస్‌పై తొలి టెస్ట్ సెంచరీ.చారిత్రక శతకంటరౌబాలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. ఈ వేదికపై టెస్ట్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా షాన్ మసూద్ చరిత్ర సృష్టించాడు. 2025 జనవరిలో దక్షిణాఫ్రికాపై శతకం తర్వాత దాదాపు 18 నెలల విరామం అనంతరం మసూద్ చేసిన సెంచరీ ఇది.బ్యాట్‌తో సమాధానంఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) షాన్ మసూద్‌ను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ స్థానంలో బాబర్ ఆజంను మళ్లీ కెప్టెన్‌గా నియమించింది. కెప్టెన్సీ కోల్పోయిన వెంటనే మసూద్ బ్యాట్‌తో తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.కెప్టెన్సీ ఎందుకు తొలగించారంటే..?2023లో టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మసూద్ నాయకత్వంలో పాకిస్తాన్ జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేదు.* ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఓటమి* దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఓటమి* బంగ్లాదేశ్ చేతిలో స్వదేశంలో, వారి దేశంలో టెస్ట్ సిరీస్ పరాజయాలుఈ ఫలితాల నేపథ్యంలో నాయకత్వంలో మార్పు అవసరమని భావించిన PCB, మసూద్‌ను తప్పించి బాబర్ ఆజంను మళ్లీ టెస్ట్ కెప్టెన్‌గా నియమించింది.మ్యాచ్ విషయానికొస్తే.. హోరాహోరీగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా.. జస్టిన్ గ్రీవ్స్ (11-6-27-5) దెబ్బకు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకే చాపచుట్టేసింది. మసూద్ (109) సెంచరీ చేయడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్, పాక్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 155 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు విండీస్‌లో పర్యటిస్తుంది. -
బాబర్ ఆజం వరల్డ్ రికార్డు
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం టెస్ట్ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన అతడు.. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలోనూ 4500కిపైగా పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతను ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్లో మరే ఆటగాడు సాధించలేదు.బాబర్ మూడు ఫార్మాట్లలో పరుగులు* టెస్టులు: 4504 పరుగులు* వన్డేలు: 6626 పరుగులు* టీ20 అంతర్జాతీయాలు: 4596 పరుగులుఅంతర్జాతీయ కెరీర్ గణాంకాలు2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బాబర్, అప్పటి నుంచి అన్ని ఫార్మాట్లలో కలిపి 15726 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతని కంటే ఎక్కువ పరుగులు చేసిన వారు కేవలం ఇద్దరే.* జో రూట్: 18575 పరుగులు* విరాట్ కోహ్లీ: 18303 పరుగులు* బాబర్ ఆజం: 15726 పరుగులుఇటీవలి ఫామ్ ఆందోళనకరంవ్యక్తిగత రికార్డు సాధించినప్పటికీ, బాబర్ ఇటీవలి కాలంలో టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.2023 ప్రారంభం నుంచి టెస్టుల్లో: * 32 ఇన్నింగ్స్ * 859 పరుగులు * సగటు: 26.84 * ఒక్క సెంచరీ కూడా లేదు.వన్డేలు, టీ20ల్లో కూడా పరుగులు చేసినప్పటికీ, అతని స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వస్తున్నాయి.విండీస్-పాక్ తొలి టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా.. జస్టిన్ గ్రీవ్స్ (11-6-27-5) దెబ్బకు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకే చాపచుట్టేసింది. తాజా మాజీ కెప్టెన్ షాన్ మసూద్ (109) సెంచరీ చేయడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్, పాక్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 155 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు విండీస్‌లో పర్యటిస్తుంది. -
పీవోకేలో ఎన్నికలు రక్తసిక్తం.. ఆందోళనకారులపై కాల్పులు
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరిగిన మెుదటి విడత ఎన్నికలు రక్తసిక్తంగా మారాయి. ఎన్నికల వేళ ఆందోళనకారులపై జరిపిన పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 19 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. పీవోకేలో గత కొద్ది రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం శాసనసభకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మెుదటి దశ ఎన్నికల్లో మారణహోమం జరిగింది.పీవోకేలో గత కొంతకాలంగా నిరసనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పీవోకే శాసనసభలో పాకిస్థాన్‌లో నివసించే శరణార్థుల కోసం కేటాయించిన 12 రిజర్వ్డ్ సీట్లను రద్దుతో పాటు భారీగా పెరిగిన విద్యుత్ ధరలు, ద్రవ్యోల్బణంతో పాటు అక్కడి ఆర్మీ అరాచకాలగకు విసిగిపోయిన ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు.దశాబ్దాలుగా పాకిస్థాన్ తమ ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలో పూర్తిగా విస్మరిస్తోందని, స్థానిక వనరులను దోచుకుంటూ ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.ఈ నేపథ్యంలోనే జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. అయితే ఈ ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోని అక్కడి ప్రభుత్వం అక్కడి అసెంబ్లీ స్థానాలకు ముడు దశలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తొలిదశ ఎన్నికలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఎన్నికలు వద్దంటూ నిరసన చేస్తున్న ఆందోళనకారులపై పాకిస్తాన్ రేంజర్లు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 19 మంది మరణించారు. అలాగే పదుల సంఖ్యలో జనాలు గాయపడ్డారు. అయితే గాయపడ్డవారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కాగా నిరనలు తారాస్థాయికి చేరినప్పటికీ పోలింగ్ సిబ్బందిని బంధీలుగా ఉంచి... ఆయుధాల బెదిరింపులతో బోగస్ ఓటింగ్, రిగ్గింగ్‌కు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి సమాహ్ని ప్రాంతంలో ఒక పోలింగ్ బూత్ నుండి సాయుధ వ్యక్తులు బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది.జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC) పిలుపు మేరకు ముజఫరాబాద్‌కు ర్యాలీ నిర్వహిస్తుండగా... రావాలాకోట్‌లో నిరసనకారులపై పాకిస్థాన్ బలగాలు కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ముజఫరాబాద్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో నిరసనకారులు సిద్ధమవుతుండగా, రావాలాకోట్‌లో భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయని స్థానికులు ఆరోపించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అకీల్ భాయ్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను, అక్కడి పరిస్థితులు, జరిగిన పరిణామాలను వివరించారు. #PoJK This is a military-dominated state where civilian governance is merely a facade and real power lies with the army. Calling this system “constitutional” is misleading.An entire establishment, intoxicated by power, has trampled upon law, constitution, and ethics… pic.twitter.com/R4LhZyZnq6— KashmirFact (@Kashmir_Fact) July 28, 2026 -
‘మాకే లేదు ఇంకేం ఇస్తాం’: పాక్ క్రియేటర్
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనలపై పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ బిలాల్ హసన్ చేసిన భావోద్వేగ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో బిలాల్ హసన్ మాట్లాడుతూ.. ‘మా మధ్య ద్వేషం పెరిగిందని నాకు తెలుసు, కానీ నిరసనల్లోని ప్రతి గుర్తును, పోస్టర్‌ను, అంతర్గత జోక్‌ను మేం (పాకిస్థానీయులు) అర్థం చేసుకోగలం. మేం మా పోలికలను దాంట్లో చూసుకుంటాం. ఏదేమైనా మేం విడిపోయిన తల్లిదండ్రుల సంతానం’ అని పేర్కొన్నారు.భారతదేశంలో విద్యార్థుల నిరసనకు మద్దతు తెలుపుతూ.. ‘వీరు పిల్లలు. ఎంతో ధైర్యవంతులు. తమ దేశం మెరుగైన భవిష్యత్తును సాధించడం కోసమే వారు నిరసన తెలుపుతున్నారు. అందులో ఏదో ఒక అందం ఉంది’ అని అన్నారు. ఈ నిరసనలకు పాక్ నిధులు సమకూర్చిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను హసన్ ఖండించారు. ‘పాకిస్థాన్ నిరసనలకు నిధులు ఇచ్చిందని అంటున్నారు. మా దేశాన్ని నడుపుకోవడానికే మా వద్ద సరిపడా డబ్బు లేదు. ఇక మేం వాటికి ఎలా నిధులు సమకూర్చగలం?" అని హసన్ ప్రశ్నించారు. ‘ఫ్రమ్ పాకిస్థాన్ టు ఇండియా’ అనే శీర్షికతో ఈ వీడియోను పోస్ట్ చేశారు.భారత్, పాకిస్థాన్లలో నిరసనకారుల పట్ల అనుసరిస్తున్న తీరును కూడా ఆయన పోల్చారు. పాకిస్థాన్‌లో విద్యార్థులు తీవ్రమైన ప్రభుత్వ చర్యలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. చివరగా భారతీ విద్యార్థులకు సందేశమిస్తూ ‘మిమ్మల్ని ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి ఆలోచించి రిస్క్ తీసుకోండి. ఐక్యంగా ఉండండి. అమ్ముడుపోకండి’ అని హసన్ సూచించారు. ఈ వీడియోకు ఆన్లైన్లో విపరీతమైన స్పందన వస్తోంది. భారత్, పాకిస్థాన్ వినియోగదారులు హసన్ పరిశీలనా శక్తిని ప్రశంసిస్తున్నారు. -
పాక్‌లో వైద్య సంక్షోభం.. ప్రాణాలొదులుతున్న బాధితులు!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసీయూ)పూర్తిగా నిండిపోవడంతో తీవ్రమైన వైద్య ఆరోగ్య సంక్షోభం తలెత్తింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు తక్షణ వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. ఈ దుస్థితి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది.జనాభా భారీగా పెరిగినా.. మౌలిక వసతులు శూన్యంఇస్లామాబాద్లోని ప్రముఖ పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీఐఎంఎస్) ఆస్పత్రిని కేవలం 5 లక్షల మంది జనాభా కోసం ప్రారంభించారు. కానీ నేడు సుమారు 50 లక్షల మందికి పైగా ప్రజల వైద్య అవసరాలను ఈ ఒక్క ఆసుపత్రే తీర్చాల్సివస్తోంది. జనాభా పెరుగుతున్నప్పటికీ, దానికి తగినట్లుగా ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, నిపుణులైన వైద్య సిబ్బంది సంఖ్య మాత్రం పెరగలేదు. దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులపై తీవ్రమైన భారం పడుతోంది.సీనియర్ జర్నలిస్ట్ మరణంతో..పాక్‌కు చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అబిద్ రజా కజ్మీకి పక్షవాతం రావడంతో వైద్యులు వెంటనే వెంటిలేటర్‌పై ఉంచాలని సూచించారు. కానీ పిమ్స్ ఆసుపత్రిలోని 12 ఐసీయూ వెంటిలేటర్లు అప్పటికే పూర్తిగా నిండిపోయాయి. కుటుంబ సభ్యులు ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గం మధ్యలోనే ఆయన మరణించారు. ఈ విషాద ఘటన పాకిస్థాన్‌లో నెలకొన్న ఆరోగ్య సంక్షోభం అసలు స్వరూపాన్ని దేశం ముందుంచింది.అందని ద్రాక్షలా వెంటిలేటర్లుపిమ్స్ ఆస్పత్రిలో సుమారు 90కి పైగా వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కొత్తగా వచ్చే తీవ్రమైన రోగులకు అవి వెంటనే దొరకడం లేదు. న్యూరాలజీ, పల్మోనాలజీ విభాగాల్లో చేరిన రోగులు కొన్నిసార్లు 15 నుంచి 20 రోజుల పాటు వెంటిలేటర్‌పైనే ఉండాల్సి వస్తోంది. దీంతో ఈ ప్రాణరక్షక పరికరాలు నిరంతరం వినియోగంలో ఉండి, అత్యవసర సమయాల్లో ఖాళీగా ఉండటం లేదు.‘నో రిఫ్యూజల్' విధానంతో..ఎలాంటి తీవ్రమైన రోగితోనైనా సరే చికిత్సను తిరస్కరించకూడదనే కఠినమైన నిబంధన పిమ్స్ ఆస్పత్రిలో అమలవుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులను కూడా ఈ విధానం వల్ల వెనక్కి పంపకుండా చేర్చుకుంటున్నారు. పడకలు ఖాళీ లేకపోయినా స్ట్రెచర్లపైనే చికిత్స అందించాల్సి వస్తోంది. ఇది మానవతా దృక్పథంతో మంచిదే అయినప్పటికీ, పరిమిత వనరుల మధ్య ఆసుపత్రిపై అంతులేని ఒత్తిడిని పెంచుతోంది.కేవలం కొత్త యంత్రాలు కొంటే సరిపోతుందా?ప్రభుత్వం కేవలం పెద్ద సంఖ్యలో కొత్త వెంటిలేటర్లను కొనుగోలు చేయడం వల్ల మాత్రమే ఈ సంక్షోభం సమసిపోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి వెంటిలేటర్‌ను సరిగ్గా ఆపరేట్ చేయడానికి శిక్షణ పొందిన ఎనస్థీషియస్టులు, క్రిటికల్ కేర్ నిపుణులు, నర్సులు, టెక్నీషియన్లు అత్యవసరం. కానీ పాకిస్థాన్ ప్రభుత్వ ఆసుపత్రులలో ఇటువంటి నిపుణులైన మానవ వనరుల కొరత చాలా తీవ్రంగా ఉంది.గగనంగా మారిన ప్రైవేట్ వైద్యం.. పాకిస్థాన్‌లో ప్రైవేట్ ఆసుపత్రులలో ఐసీయూ వైద్యం సామాన్యులకు అందనంత ఖరీదైనదిగా మారింది. ఒక్కో రోగికి రోజువారీగా సుమారు 3 లక్షల పాకిస్థానీ రూపాయల వరకు ప్రైవేట్ యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. అంత భారీ మొత్తాన్ని భరించే ఆర్థిక స్థోమత లేకపోవడం కారణంగా మధ్యతరగతి, పేద ప్రజలు పూర్తిగా ప్రభుత్వ ఆస్పత్రులపైనే ఆధారపడవలసి వస్తోంది.ప్రాథమిక వైద్య రంగం విఫలందేశంలోని జిల్లా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరైన సేవలు అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. స్థానిక స్థాయిలోనే నయం కావాల్సిన చిన్నపాటి రోగాలతో కూడిన రోగులు కూడా నేరుగా పెద్ద ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా పెద్ద ఆస్పత్రులపై అనవసరమైన భారం పడి, నిజమైన అత్యవసర రోగులకు వైద్యం దక్కని పరిస్థితి ఏర్పడుతున్నది.ఇది కూడా చదవండి: నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్! -
పాక్‌తో తొలి టెస్ట్.. హోప్ సెంచరీ మిస్
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకే ఆలౌటైంది. స్టార్ ప్లేయర్ షాయ్ హోప్ (92) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మరో బ్యాటర్ కవెమ్ హాడ్జ్ (84) కూడా సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. వీరిద్దరు రాణించడంతో విండీస్ ఈ స్కోరైనా చేయగలిగింది.మిగతా ప్లేయర్లలో తేజ్‌నరైన్ చంద్రపాల్ 21, బ్రాండన్ కింగ్ 12, ఆమిర్ జాంగూ 21, జస్టిన్ గ్రీవ్స్ 15, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ 10, కీమర్ రోచ్ 3, షమార్ జోసఫ్ 23, జేడన్ సీల్స్ డకౌట్, జోమెల్ వార్రికన్ 1 (నాటౌట్) చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అలీ 4 వికెట్లతో సత్తా చాటగా.. మొహమ్మద్ అబ్బాస్ 3, ఖుర్రమ్ షెహజాద్ 2, ఆమిర్ జమాల్ ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్, తాజా మాజీ కెప్టెన్ షాన్ మసూద్ అజేయ అర్ద సెంచరీతో (88) సత్తా చాటగా.. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (63) అర్ద సెంచరీతో రాణించాడు. కెప్టెన్ బాబర్ ఆజం 23 పరుగులకు ఔట్ కాగా.. మరో ఓపెనర్ అజాన్ అవైస్ డకౌటయ్యాడు. షాన్ మసూద్‌తో పాటు సల్మాన్ అఘా (0) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 112 పరుగులు వెనుకపడి ఉంది. విండీస్ బౌలర్లలో రోచ్, సీల్స్, షమార్ తలో వికెట్ తీశారు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. -
పాక్ బాక్సర్‌ను చిత్తు చేసి పతకం రేసులో జాదుమణి
కామన్వెల్త్ గేమ్స్ 2026లో బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ జాదుమణి పతకం ఆశలు రేపుతున్నాడు. క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన జాదుమణి పతకానికి అడుగుదూరంలో నిలిచాడు. పురుషుల బాక్సింగ్‌లో భారత బాక్సర్ జాదుమణి సింగ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జాదుమణి 5-0తో పాకిస్తాన్ బాక్సర్ సుమామా రెహమాన్‌ను మట్టికరిపించాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం జాదుమణి ఈ విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితమిస్తున్నట్లు తెలిపాడు. "నా విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితం చేస్తున్నాను. పాకిస్థాన్‌పై గెలవడం చాలా గొప్పగా అనిపించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో మరింత మెరుగ్గా రాణించి భారత్‌కు స్వర్ణం సాధించిపెడతాను''అని జాదుమణి పేర్కొన్నాడు. తొలి రౌండ్లో బై లభించిన జాదుమణి రెండో రౌండ్లో స్కాట్లాండ్కు చెందిన ఆరోన్ కల్లెన్పై 5-0తో అజేయ విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రిక్వార్టర్స్‌లో పాకిస్తానీ బాక్సర్‌పై విరుచుకుపడిన జాదుమణి 5-0తో ఏకగ్రీవ విజయాన్ని సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇక జాదుమణి మంగళవారం క్వార్టర్స్ ఫైట్‌లో తలపడనున్నాడు. క్వార్టర్ ఫైనల్లో గెలిచి సెమీస్‌లోకి ప్రవేశిస్తే అతనికి కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్‌లో సెమీఫైనల్లో ఓడిపోయిన ఇద్దరికీ కాంస్య పతకాలు లభిస్తాయి.ఇక మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రీతి పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి దెబోరా మావ్ (కెన్యా) రెండో రౌండ్లోనే చేతులెత్తేసింది. ఇక స్విమ్మింగ్‌లో భారత ఫ్రీస్టయిల్ రిలే జట్టు ఫైనల్‌కు చేరింది. 4X200 ఫ్రీస్టయిల్ రిలే హీట్‌లో దక్షణ్, అనీశ్ గౌడ, ఆర్యన్ నెహ్రా, శ్రీహరి నటరాజ్లతో కూడిన భారత జట్టు 7ని:39.48 సెకన్లలో లక్ష్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్ ఫైనల్లో భారత ప్లేయర్ తపన్ మొహంతి 70.100 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు. లాన్ బౌల్స్‌లో మహిళల పెయిర్ ఈవెంట్లో రూపా రాణి–పింకీ సింగ్ (భారత్) జోడీ, పురుషుల సింగిల్స్‌లో పుతుల్ సోనోవాల్ (భారత్) పరాజయాలు చవిచూసి ముందంజ వేయడంలో విఫలమయ్యారు. 🚨 INDIA’S JADUMANI SINGH THRASHED PAKISTANI BOXER 5-0 AT COMMONWEALTH GAMES 2026 🇮🇳🔥Jadumani Singh Mandengbam said - "I dedicate my win to the Kargil heroes. I felt great winning against Pakistan."Another day, Another humiliation for Pakistan 😅pic.twitter.com/1REqzhnEoe— Ajay Jadeja (@AjayJadeja171) July 27, 2026 -
భారత జెన్-జీకి పాక్, శ్రీలంక, నేపాల్ సెల్యూట్.. రియాక్షన్లు ఇవే..
భారత జెన్-జీని తరచూ మొబైల్లో ఎక్కువ సమయం గడిపే తరం, ప్రతి విషయాన్నీ మీమ్స్‌గా మార్చే తరం, తీవ్రమైన అంశాలపై ఎక్కువసేపు దృష్టి పెట్టని తరంగా భావించేవారు. కానీ గత నెల రోజులుగా అదే బలహీనతలు వారి అతిపెద్ద బలంగా మారాయి. వరుసగా సాగిన విద్యార్థి ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేశాయి. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఉద్యమంలో సంప్రదాయ రాజకీయ ప్రకటనల స్థానంలో మీమ్స్ వచ్చాయి. ఇన్‌స్టా రీల్స్ ప్రజలను సమీకరించే సాధనంగా మారాయి.ఈ ఉద్యమం ఇప్పుడు భారత్‌కే పరిమితం కాలేదు. పొరుగు దేశాల్లో కూడా దీని గురించి చర్చ సాగుతోంది. జెన్-జీ దృష్టి త్వరగా మళ్లిపోతుందని సాధారణంగా చెబుతుంటారు. కానీ భారత్‌లో జరిగిన ఈ ఉద్యమం శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్ యువత దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ దేశాల్లో గతంలో కూడా యువజన ఉద్యమాలు జరిగాయి. అందువల్ల భారత్‌లోని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమంపై అక్కడ ప్రత్యేక ఆసక్తి కనిపించింది.దీనిపై పాకిస్థాన్ యువతి ఒకరు మాట్లాడుతూ.. "ఇలా చేస్తుంటే ప్రేమలో పడిపోతానేమో... మీరు ఇంత బాగా చేస్తుంటే నేను మిమ్మల్ని ఎలా ద్వేషిస్తాను?" అని అన్నారు. భారత జెన్-జీ చూపించిన ధైర్యం, ఐక్యత ఎవరినైనా ఆకట్టుకుంటాయి. సరిహద్దులు వేరు కావచ్చు. కానీ ఈ తరం ఆలోచనలు, ఉత్సాహం ఒక్కటేనని చెప్పారు. పాకిస్థాన్‌కు చెందిన పలువురు యువకులు అవకాశం వస్తే తామూ భారత విద్యార్థుల్లాగే వీధుల్లోకి వచ్చేవాళ్లమని అన్నారు. ఓ యువకుడు మాట్లాడుతూ.. "కాక్రోచ్ జనతా పార్టీ చాలా కూల్‌గా ఉంది. వారు అవసరానికి మించి సీరియస్‌గా ఉండరు. అదే నాకు నచ్చింది. జెన్-జీకి సాటి ఎవరూ లేరు" అని చెప్పాడు.ఒక ప్లేట్ బిర్యానీకే అమ్ముడుపోయేవాళ్లం ముంబైలో వైరల్ అయిన ఓ వీడియోను కూడా అతను ప్రస్తావించాడు. అందులో పోలీసులు విద్యార్థులను వాహనంలో తీసుకెళ్తుండగా, వెనుక నుంచి ఎవరో నిశ్శబ్దంగా తాళం తీసేయడంతో విద్యార్థులు బయటకు వచ్చి పరుగులు తీశారు. మరో పాకిస్థాన్ యువకుడు మాట్లాడుతూ.. భారత విద్యార్థులు మతం, కులానికి అతీతంగా ఐక్యంగా నిలిచారని, కానీ పాకిస్థాన్‌లో ప్రజలు పంజాబీ-పష్తూన్, సున్నీ-షియా వంటి విభజనల్లో ఉన్నారని అన్నాడు."అదే భారత్ జెన్-జెడ్ అతిపెద్ద బలం. పాకిస్థాన్ జెన్-జీ అంత సులభంగా ఒక్కటవుతుందని నాకు అనిపించడం లేదు." భారత్ ఉద్యమానికి పాకిస్థాన్ నుంచి నిధులు వస్తున్నాయన్న ఆరోపణలపై పాకిస్థాన్ కంటెంట్ క్రియేటర్ బిలాల్ హసన్ వ్యంగ్యంగా మాట్లాడుతూ.. "మా దేశాన్ని నడపడానికే మా దేశం వద్ద డబ్బు లేదు. భారత ఉద్యమానికి ఎలా నిధులు ఇస్తాం?" అని అన్నాడు.బిలాల్ హసన్ అనే యువకుడు మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్ జరగొచ్చు. కానీ పాకిస్థాన్‌లో చాలా సందర్భాల్లో ప్రజలను నేరుగా తీసుకెళ్లి అదృశ్యం చేస్తారు’’ అని చెప్పారు. పాకిస్థాన్‌లో చాలామందిని "ఒక ప్లేట్ బిర్యానీ"కే కొనుగోలు చేయవచ్చని వ్యాఖ్యానించారు.శ్రీలంక యువతపై ప్రభావంభారత విద్యార్థి ఉద్యమం శ్రీలంక యువతపై కూడా ప్రభావం చూపింది. 2022లో శ్రీలంక యువత ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత రాజపక్స ప్రభుత్వం అధికారాన్ని వీడింది. ఇప్పుడు శ్రీలంకలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపై కార్టూన్లు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు కూడా వచ్చాయి. ప్రముఖ కార్టూనిస్ట్ అవంతా ఆర్టిగాలా పంచుకున్న వ్యంగ్య చిత్రంలో ప్రభుత్వం "బొద్దింకలను" అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, భారత్ ఇళ్లలో వాడే "లక్ష్మణ రేఖ" కూడా వాటిని ఆపలేకపోయినట్టు చూపించారు.భారత్ ఉద్యమంలో ఎక్కువగా చర్చకు వచ్చిన చిత్రం ముంబైకి చెందిన రియా అహీర్ పోలీసు వాహనం ముందు చేతులు చాపి నిలిచిన ఫొటో. చాలామంది దీన్ని 1989 తియానన్మెన్ స్క్వేర్‌లోని ప్రసిద్ధ "ట్యాంక్ మ్యాన్" చిత్రంతో పోల్చారు. శ్రీలంక లా కాలేజీ విద్యార్థిని స్వస్థిక అరులింగం ఫేస్బుక్లో ఈ చిత్రాన్ని పంచుకుంటూ "వైబింగ్ ఎట్ అనదర్ లెవల్" అని రాశారు. 2022 శ్రీలంక ఉద్యమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త బువాంకా పెరేరా ఇన్‌స్టాగ్రామ్‌లో భారత యువతకు సందేశం పంపారు."శ్రీలంక నుంచి ప్రారంభమై ఆసియా అంతటా వ్యాపించిన యువజన ఉద్యమాల జ్వాల భారత్‌ను చాలాకాలం తాకలేదనిపించింది. కానీ ఇప్పుడు రాజ్యాంగం, దేశ వ్యవస్థాపకులు కలలు కన్న భారత్ కోసం భారత యువత పోరాడుతుండటం చూసి ఆనందంతో కళ్లలో నీళ్లు వస్తున్నాయి" అని ఆయన అన్నారు. నేపాల్ యువత మద్దతునేపాల్లో కూడా భారత్ జెన్-జీ ఉద్యమంపై సానుకూల స్పందనలు వచ్చాయి. కాఠ్మాండూ కంటెంట్ క్రియేటర్ అవినాశ్ మిశ్రా మాట్లాడుతూ.. భారత విద్యార్థుల ఆగ్రహం పూర్తిగా సమంజసమని, దాన్ని అతిగా స్పందించారని చెప్పలేమన్నారు. "వీధుల్లో విద్యార్థులను చూసినప్పుడు నా మనసు అప్పుడూ బాధపడింది. ఇప్పుడూ బాధపడుతోంది" అని చెప్పారు. 2025లో నేపాల్ జెన్-జీ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, అది కూడా యువత శక్తికి ఉదాహరణగా నిలిచి చివరకు కేపీ ఓలీ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేసిందని అన్నారు.జెన్-జీ నుంచి ప్రపంచం నేర్చుకుంటోంది..ఢిల్లీ జంతర్ మంతర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచం తొలిసారి భారత్ జెన్-జీ మీమ్స్, నినాదాలు, వైరల్ వీడియోలను చూసి నవ్వడమే కాదు, వాటి నుంచి నేర్చుకోవడం కూడా ప్రారంభించింది. పొరుగు దేశాల నుంచి వచ్చిన స్పందనలు చూస్తే, భారత్ విద్యార్థి ఉద్యమం సరిహద్దులు దాటి యువతకు స్ఫూర్తిగా మారిందని తెలుస్తోంది. శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్‌కు చెందిన పలువురు యువకులు భారత విద్యార్థుల ఐక్యత, ధైర్యం, సృజనాత్మక నిరసనను ప్రజాస్వామ్య ఉద్యమానికి కొత్త ఆదర్శంగా అభివర్ణించారు. -
పాక్‌తో తొలి టెస్ట్.. హాడ్జ్ అజేయ అర్ధశతకం
టరౌబాలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ ఓ మోస్తరు ప్రదర్శన చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. తేజ్‌నరైన్ చంద్రపాల్ (21), బ్రాండన్ కింగ్ (12), ఆమిర్ జాంగూ (21) ఔట్ కాగా.. కవెమ్ హాడ్జ్ (83) అజేయ అర్ద శతకంతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అతడికి జతగా షాయ్ హోప్ (39) క్రీజ్‌లో ఉన్నాడు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 2, ఆమిర్ జమాల్ ఓ వికెట్ తీశారు.వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో తొలి రోజు కేవలం 67 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. హాడ్జ్ అజేయ అర్ధశతకంతో జట్టును బలమైన స్థితిలో నిలిపాడు.ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ పేసర్లు మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రం షెహ్జాద్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 13 పరుగుల వద్ద బ్రాండన్ కింగ్ వికెట్‌ను అబ్బాస్ పడగొట్టాడు.అనంతరం వర్షం కారణంగా దాదాపు రెండు గంటల ఆట నిలిచిపోయింది. ఆట పునఃప్రారంభమైన తర్వాత హాడ్జ్ ఓపికగా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఈ దశలో తేజ్‌నరైన్ చందర్‌పాల్‌ను ఆమిర్ జమాల్ ఔట్ చేశాడు. కొద్ది సేపటికి ఆమిర్ జాంగూను అబ్బాస్ పెవిలియన్‌కు పంపాడు.అనంతరం షాయ్ హోప్‌తో కలిసి హాడ్జ్ నాలుగో వికెట్‌కు అజేయంగా 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో రోజు కూడా వర్షం ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో వెస్టిండీస్ ఏ విధమైన బ్యాటింగ్ వ్యూహాన్ని అనుసరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. రెండో టెస్ట్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆగస్ట్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు పాక్ వెస్టిండీస్ సెలెక్ట్ ఎలెవెన్‌తో ఓ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ పాక్‌కు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇచ్చింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు అజాన్ అవైస్, బాబర్ ఆజం సెంచరీలు చేశారు. -
సెంచరీలతో కదంతొక్కిన లంక ప్లేయర్లు.. చిత్తుగా ఓడిన పాక్
3 మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు తొలి ఓటమి చవిచూసింది. వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.హంబన్‌తోట వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. సిద్రా అమీన్ (100) అజేయ శతకంతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఏమాత్రం తడబడని శ్రీలంక విష్మి గుణరత్నే (123), హర్షిత సమరవిక్రమ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో 46.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.పాక్ ఇన్నింగ్స్‌లో సిద్రా సెంచరీతో సత్తా చాటగా.. మునీబా అలీ (45), అయేషా జాఫర్ (49), కెప్టెన్ ఫాతిమా సనా (25) విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు. శ్రీలంక తరఫున విష్మి గుణరేత్న ఔటయ్యాక.. హర్షితకు కవిష దిల్హరి (40 నాటౌట్) సహకరించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవడంతో సిరీస్ 1-1 వద్ద కొనసాగుతోంది. తొలి వన్డేలో శ్రీలంకపై పాక్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌లోని నిర్ణయాత్మక మూడో వన్డే ఇదే హంబన్‌తోట వేదికగా జులై 28న జరుగనుంది. -
పాక్‌తో సిరీస్‌కు ఎంపిక.. ఆడేందుకు విండీస్ ప్లేయర్ నిరాకరణ!
పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శుక్రవారం జట్టును ప్రకటించింది. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ పాక్‌తో సిరీస్‌కు దూరమైనట్లు విండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఒకటి ఉంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడడం తనకు ఇష్టం లేదన్న కారణంగానే, జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ అల్జారీ జోసెఫ్ ఆడేందుకు నిరాకరించాడని విండీస్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అల్జారీ వ్యక్తిగత కారణాలతో సిరీస్ నుంచి తప్పుకోలేదని, పాక్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు అతడు నిరాకరించడంతో జట్టు నుంచి తప్పించాల్సి వచ్చిందని సామీ పేర్కొన్నాడు. జోసెఫ్ లేకపోవడం విండీస్‌కు పెద్ద లోటు అని, కానీ తమ జట్టు పాక్‌పై రాణిస్తుందని సామీ ధీమా వ్యక్తం చేశాడు. జట్టు ఎంపిక అనంతరం కోచ్ డారెన్ సామీ మీడియాతో మాట్లాడాడు. జోసెఫ్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సామీ మాట్లాడుతూ.. ‘అల్జారీ జోసెఫ్ పాక్‌తో ఆడేందుకు నిరాకరించిన విషయం నా పరిధిలో లేదు. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్నఒక ఆటగాడు ఇలా జట్టు ఎంపికను తిరస్కరించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా లేదా పరిష్కారాలు కనుగొనాలన్నా అది బోర్డు డైరెక్టర్లకే వదిలేస్తున్నా’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. 29 ఏళ్ల అల్జారీ జోసెఫ్ ఇటీవలే గాయం నుంచి కోలుకున్నాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో ఆడాడు. రెండు మ్యాచులలో 6 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు అల్జారీ జోసెఫ్ వెస్టిండీస్ తరఫున 42 టెస్టులు ఆడాడు. ఇందులో ఏకంగా 130 వికెట్లు పడగొట్టాడు. 87 వన్డేల్లో 141, 45 టీ20లలో 62 వికెట్లు తీశాడు. మూడు ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. వెస్టిండీస్, పాక్ మధ్య తొలి టెస్టు శనివారం ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 2 నుంచి జరుగుతుంది. -
పాకిస్తాన్‌కు కొత్త చిక్కులు.. 2015 నాటి పరిస్థితి మళ్లీ వస్తుందా?
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్‌ను మరోసారి క్లిష్ట పరిస్థితిలోకి నెడుతున్నాయి. ఇరాన్-అమెరికా ఘర్షణలు, హౌతీ తిరుగుబాటుదారుల కదలికలు, సౌదీ అరేబియా భద్రతపై ముప్పు నేపథ్యంలో పాకిస్తాన్‌పై సైనికంగా స్పందించాలనే ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2015లో యెమెన్ యుద్ధ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితినే పాకిస్తాన్ ఎదుర్కొంది. సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి హౌతీలపై యుద్ధం ప్రారంభించినప్పుడు, తమకు మద్దతుగా పాకిస్తాన్ సైన్యాన్ని పంపాలని రియాద్ కోరింది. అయితే పాకిస్థాన్ పార్లమెంట్ విస్తృత చర్చల అనంతరం యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకూడదని నిర్ణయించింది.అప్పట్లో పాకిస్తాన్‌కు రెండు వైపులా సవాళ్లు ఎదురయ్యాయి. ఒకవైపు సౌదీ అరేబియాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న రక్షణ, ఆర్థిక సంబంధాలు ఉండగా, మరోవైపు ఇరాన్ పొరుగుదేశంగా ఉండటంతో ఆ దేశంతో సంబంధాలను దెబ్బతీయాలని ఇస్లామాబాద్ కోరుకోలేదు. తాజాగా మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ వేడెక్కుతున్నాయి. హౌతీలు సౌదీ లక్ష్యాలను టార్గెట్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలు, ఎర్ర సముద్రంలో నౌకాయాన భద్రతపై ఆందోళనలు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దౌత్యపరంగా సమతుల్య వైఖరిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవైపు సౌదీ అరేబియాకు మద్దతు ప్రకటిస్తూనే, మరోవైపు ఇరాన్‌తో సంబంధాలను కొనసాగించాలని చూస్తోంది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతూ, సౌదీ భద్రతకు మద్దతు ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చితే పాకిస్తాన్‌పై ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలనే ఒత్తిడి పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2015లో యెమెన్ యుద్ధానికి దూరంగా నిలిచిన పాకిస్థాన్.. ఇప్పుడు మరోసారి అదే నిర్ణయాన్ని కొనసాగించగలదా? లేక మారిన పరిస్థితులు దాని విధానాన్ని మార్చేలా చేస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.పాకిస్తాన్‌కు మూడు ప్రధాన సవాళ్లు..సౌదీతో వ్యూహాత్మక సంబంధాలను కాపాడుకోవడంఇరాన్తో పొరుగుదేశ సంబంధాలను కొనసాగించడంప్రత్యక్ష యుద్ధంలో చిక్కుకోకుండా దేశ ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను రక్షించడంఅయితే, పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతోంది. మరోవైపు, సైనికంగా ఏదైనా చర్య తీసుకుంటే అది దేశీయంగా, అంతర్జాతీయంగా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇస్లామాబాద్ ప్రస్తుతం "దౌత్య సమతుల్యత" విధానాన్నే అనుసరిస్తోంది. యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా, అవసరమైతే మధ్యవర్తిత్వ పాత్ర పోషించాలని ప్రయత్నిస్తోంది. -
పాక్‌లో భీకర ఆత్మాహుతి దాడి.. 15 మంది దుర్మరణం
ఇస్లామాబాద్: వాయవ్య పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని భద్రతా తనిఖీ కేంద్రం పైకి దూసుకెళ్లారు. ఈ దుర్ఘటనలో 12 మంది సైనికులు, ఇద్దరు పోలీసులు,ఓ అటవీ శాఖ ప్రభుత్వ అధికారి సహా మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భీకర దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన పాక్ సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఈ మేరకు శుక్రవారం పాకిస్థాన్ సైన్యం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న వాయవ్య ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని టాంక్ జిల్లాలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఉగ్రవాదులు భద్రతా వలయాన్ని ఛేదించి లోపలికి చొరబడటానికి ప్రయత్నించారని, అయితే సైనికులు వారిని అడ్డుకోవడంతో.. ఉగ్రవాదులు పేలుడు పదార్థాల వాహనాన్ని చెక్ పోస్ట్ వెలుపలి రక్షణ గోడకు బలంగా ఢీకొట్టారని ఆర్మీ తెలిపింది. ఈ భారీ పేలుడు దాటికి అక్కడి భద్రతా మౌలిక సదుపాయాలు,భవనం తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్థానిక తాలిబాన్ ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో తమ సంస్థకు చెందిన నలుగురు ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నట్లు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో వాయవ్య పాకిస్థాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. -
వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఎగిరి గంతేస్తున్న పాకిస్తాన్!
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు రోస్టన్ ఛేజ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, జోమెల్ వారియోకన్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ జోషువా బిషప్ తొలిసారిగా విండీస్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 26 ఏళ్ల బిషప్ గడిచిన మూడు వెస్టిండీస్ ఛాంపియన్షిప్ సీజన్లలో ఏకంగా 91 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.గడిచిన మూడు వెస్టిండీస్ ఛాంపియన్షిప్ సీజన్లలో ఈయన 91 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ జోషువా బిషప్ తొలిసారిగా విండీస్ టెస్టు జట్టులోకి పిలుపు అందుకున్నాడు. అదేవిధంగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొడకండరాల గాయానికి గురైన ఓపెనర్ జాన్ కాంప్‌బెల్.. పాక్‌తో టెస్ట్‌లకు దూరమయ్యాడు.అతడి స్ధానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కిర్క్ మెకెంజీకి సెలక్టర్లు అవకాశమిచ్చారు. మరోవైపు స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇది నిజంగా కరేబియన్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. జోషఫ్ వంటి స్టార్ బౌలర్ జట్టులో లేకపోవడంతో విండీస్ గడ్డపై పాక్ బ్యాటర్లు పండగ చేసుకోనున్నారు.కాగా ఆల్‌రౌండర్ కిమో పాల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కేమర్ రోచ్, జేడెన్ సీల్స్, షమర్ జోసెఫ్‌లు ఫాస్ట్ బౌలర్లగా ఉన్నారు. ఈ సిరీస్‌లోని మొదటి టెస్టు మ్యాచ్ జూలై 25 నుంచి 29 వరకు టారోబాలోని 'బ్రియన్ లారా క్రికెట్ అకాడమీ' మైదానంలో జరగనుంది. ఈ వేదికపై అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరగనుండడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
Asian Games: క్రికెట్ ‘డ్రా’ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ప్రతిష్టాత్మక 2026 ఆసియా గేమ్స్‌కు సంబంధించి క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది. ఏకకాలంలో పురుషుల, మహిళల క్రికెట్‌మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు. రెండు విభాగాల్లో టెస్టు సభ్యత్వం కలిగిన నాలుగు దేశాలు (భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్) నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. కాగా ఆసియా గేమ్స్ జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి.అయితే క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అటు పురుషుల.. ఇటు మహిళల క్రికెట్లో ఫైనల్ లేదా సెమీస్‌లోనే తలపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మహిళల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో భారత్ తమ మ్యాచ్‌ను జపాన్‌తో ఆడనుంది. ఇక పురుషుల క్రికెట్లో మాత్రం టీమిండియా పాక్‌తో నేరుగా సెమీస్ లేదా ఫైనల్ పోరులో తలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.పురుషుల క్రికెట్లో ఇలా..పురుషుల టోర్నీ విషయానికొస్తే టెస్టు సభ్యత్వం కలిగిన భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్నాయి. క్వార్టర్స్‌లో మిగిలిన నాలుగు స్థానాల కోసం ఆరుజట్ల మధ్య లీగ్ దశ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ లీగ్ దశలో గ్రూప్-ఏ నుంచి అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్ ఉండగా; గ్రూప్-బి నుంచి చైనా, మలేషియా, ఓమన్ ఉన్నాయి. లీగ్ దశలో రెండు గ్రూప్‌ల్లో నుంచి టాప్-2లో నిలిచిన జట్లు క్వార్టర్స్ చేరుకోనున్నాయి. క్వార్టర్స్‌లో గెలిచిన నాలుగు జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు స్వర్ణం కోసం ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా, ఓడిన జట్లు కాంస్య పతక పోరు కోసం తలపడనున్నాయి. టెస్టు సభ్యత్వం కలిగినప్పటికీ అఫ్గానిస్తాన్ ప్రిలిమినరీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.గ్రూప్-ఏ: అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్గ్రూప్-బి నుంచి చైనా, మలేషియా, ఒమన్జపాన్తో హర్మన్ సేన అమీతుమీ..మహిళల విభాగంలోనూ ఇవే జట్లు పోటీలో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్మ్యాచ్లే నిర్వహించనున్నారు. క్వార్టర్ ఫైనల్లో భారత్‌తో జపాన్, థాయ్‌లాండ్‌తో పాకిస్తాన్, చైనాతో బంగ్లాదేవ్, శ్రీలంకతో మలేషియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్వార్టర్స్‌లో గెలిచిన జట్లు సెమీస్‌లో అడుగుపెట్టనున్నాయి. సెమీస్‌లో గెలిచిన జట్ల మధ్య స్వర్ణ పతక పోరు జరగనుంది.మహిళల క్రికెట్లో క్వార్టర్స్ షెడ్యూల్భారత్ vs జపాన్బంగ్లాదేశ్ vs చైనాశ్రీలంక vs మలేషియాపాకిస్తాన్ vs థాయిలాండ్సెమీ-ఫైనల్స్భారత్/జపాన్ vs బంగ్లాదేశ్/చైనాశ్రీలంక/మలేషియా vs పాకిస్తాన్/థాయిలాండ్2022లో డబుల్ స్వర్ణాలు..2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాయి. ఆనాడు టీమిండియా పురుషుల కెప్టెన్‌గా రుతురాజ్ వ్యవహరించాడు. వర్షంతో ఫలితం రాకపోవడంతో అత్యధిక విజయాలు సాధించిన భారత్‌కు గోల్డ్ మెడల్ ఇవ్వగా, అఫ్గానిస్తాన్ వెండిని గెలుచుకుంది. ఇక హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని మహిళల జట్టు ఫైనల్లో శ్రీలంకను ఓడించి బంగారు పతకాన్ని అందుకుంది. ఈ గేమ్స్‌లో పాకిస్తాన్ రెండు విభాగాల్లోనూ నాలుగో స్థానానికే పరిమితం కావడం గమనార్హం.Read: గోళీలాట మాదిరే లాన్ బౌల్స్.. కాని చిన్న ట్విస్ట్! -
సౌదీ ఆఫర్‌తో కొత్త పవర్ గేమ్... పాక్ ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!
ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, సౌదీ అరేబియా మధ్య కుదిరిన కొత్త పౌర అణు ఒప్పందం మధ్యప్రాచ్య శక్తి సమీకరణాలను మార్చే అంశంగా మారింది. బయటకు చూస్తే ఇది అణు విద్యుత్ అవసరాల కోసం కుదిరిన ఒప్పందంలా కనిపిస్తున్నా, దీని వెనుక ఉన్న వ్యూహాత్మక అవకాశాలే ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు కారణమవుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించిన ఈ ఒప్పందం ద్వారా సౌదీ అరేబియాకు తన దేశంలోనే యురేనియం శుద్ధి చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఈ సాంకేతికతను ఒక నిర్దిష్ట స్థాయికి మించి అభివృద్ధి చేస్తే, అణు ఆయుధాల తయారీకి అవసరమైన పదార్థాలను కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఒప్పందం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ పరిణామం ఇజ్రాయెల్‌లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ ఉద్రిక్తతలు, భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్, సౌదీ భవిష్యత్తులో అణు సామర్థ్యం సాధించే అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఒక దేశం అణు సాంకేతికతను అభివృద్ధి చేసిన తర్వాత దాని వినియోగం పూర్తిగా శాంతియుతంగానే ఉంటుందని ఎప్పటికీ హామీ ఇవ్వలేమన్నది ఇజ్రాయెల్ వాదన. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ గతంలో చేసిన ఒక వ్యాఖ్య కూడా ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది. ఇరాన్ అణు ఆయుధాన్ని అభివృద్ధి చేస్తే, సౌదీ కూడా అదే దిశలో అడుగులు వేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సౌదీ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉంది.ఈ పరిణామంలో మరో దేశం పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అదే పాకిస్థాన్. సౌదీ అరేబియా, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా బలమైన వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. రక్షణ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రెండు దేశాలు సన్నిహితంగా వ్యవహరిస్తున్నాయి. పాకిస్థాన్ అణు కార్యక్రమానికి గతంలో సౌదీ మద్దతు ఇచ్చిందనే ఆరోపణలు అంతర్జాతీయ స్థాయిలో వినిపించినప్పటికీ, ఇరు దేశాలు వాటిని అధికారికంగా అంగీకరించలేదు. 1980లలో పాకిస్థాన్ అణు కార్యక్రమం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో సౌదీతో రహస్య అవగాహన ఉందనే వార్తలు వచ్చాయి. భవిష్యత్తులో ప్రాంతీయ సంక్షోభం ఏర్పడితే పాకిస్థాన్ నుంచి అణు సహకారం పొందే అవకాశం ఉందనే ఊహాగానాలు అప్పటి నుంచి కొనసాగుతున్నాయి. ఇప్పుడు సౌదీకి అణు సాంకేతికతపై మరింత సానుకూలత లభించే అవకాశం రావడంతో ఈ పాత చర్చలు మరోసారి తెరపైకి వచ్చాయి.అయితే ఒక దేశం అణు ఆయుధాన్ని తయారు చేయడం అంత సులభమైన ప్రక్రియ కాదు. యురేనియం శుద్ధి సామర్థ్యం ఒక భాగం మాత్రమే. దానికి తోడు అణు వార్‌హెడ్ రూపకల్పన, క్షిపణి వ్యవస్థల అభివృద్ధి, సాంకేతిక పరీక్షలు, భద్రతా వ్యవస్థలు వంటి అనేక అంశాలు అవసరం. అయినప్పటికీ, అణు సామర్థ్యానికి దారితీసే సాంకేతిక మార్గం తెరుచుకోవడం కూడా అంతర్జాతీయ భద్రతలో కీలక పరిణామంగానే పరిగణిస్తారు. అమెరికా దృష్టిలో ఈ ఒప్పందం కేవలం అణు విద్యుత్ ప్రాజెక్టు కాదు. మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని కొనసాగించడం, సౌదీతో సంబంధాలను మరింత బలోపేతం చేయడం, చైనా వంటి దేశాల ప్రభావాన్ని పరిమితం చేయడం వంటి వ్యూహాత్మక లక్ష్యాలు కూడా ఇందులో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక ఇజ్రాయెల్ మాత్రం భద్రతా కోణంలో ఈ పరిణామాన్ని చూస్తోంది. భవిష్యత్తులో సౌదీ అణు సామర్థ్యం ప్రాంతీయ శక్తి సమతుల్యతను మార్చే అవకాశం ఉందని ఆ దేశంలోని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఒప్పందం ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రావాల్సి ఉంది. అమెరికా కాంగ్రెస్ పరిశీలన, అంతర్జాతీయ పర్యవేక్షణ, భద్రతా నిబంధనలు వంటి అనేక దశలు ముందున్నాయి. అయినప్పటికీ, ఈ పరిణామం ఒక విషయం స్పష్టం చేస్తోంది. -
పాక్ ఆరోపణలను తోసిపుచ్చిన భారత్
న్యూయార్క్: ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా అనుసరిస్తున్న పాకిస్తాన్‌కు ఒప్పందాల సహకరాన్ని అందించడం సాధ్యంకాదని ఐక్యరాజ్య సమితి(యూఎన్ఓ)లో భారత్ స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్, సింధు జలాల ఒప్పందం అంశాలపై ఐక్యరాజ్యసమితిలో పాక్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. జమ్మూ కశ్మీర్ భారతదేశంలోనే అంతర్భాగంగా, విడదీయరాని భాగంగా ఉంది, ఉంటుందని స్పష్టం చేసింది. ‘సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి, భారత్ జలాలను ఆయుధంగా వాడుకుంటోంది. చట్ట విరుద్ధంగా 24 కోట్ల మందికి పైగా పాకిస్తానీల జీవనోపాధికి ముప్పు గలిగిస్తోంది’అంటూ యూఎన్ఓలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ ఆరోపణల నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. సహజ వనరులపై భద్రతా మండలిలో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో యూఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ మాట్లాడారు. ‘సింధు జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా ఉపయోగిస్తున్నప్పుడు, పరస్పర విశ్వాసం, సద్భావనల ఆధారంగా సహకారాన్ని ఆశించలేము’అని అన్నారు. ‘జమ్మూ కశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగా, విడదీయరాని భాగంగా ఉంది, ఉంటుంది. ఇది వాస్తవం, దీనిని పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది. భారత సార్వ¿ౌమ భూభాగంపై పాకిస్తాన్ చేస్తున్నది దురాక్రమణ మాత్రమే. భారత్‌ను వేలెత్తి చూపడానికి బదులుగా, పాకిస్తాన్ తన సొంత వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ తన ప్రజలకు మేలు చేసుకుంటే మంచింది’అని ఆయన పేర్కొన్నారు. సింధు పరీవాహక ప్రాంతంలోని ఆరు నదుల జలాలను పంచుకోవడంపై ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ల మధ్య 1960లో సంతకాలు చేసిన ఒప్పందం సింధు జలాల ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం, తూర్పు నదులను భారతదేశానికి, పశ్చిమ నదులను అధికభాగం పాకిస్తాన్‌కు కేటాయించారు. అయితే 2025 ఏప్రిల్ 22 నాటి పహల్గామ్ ఉగ్రదాడి తరువాత సరిహద్దు ఉగ్రవాదం నేపథ్యంలో ఒప్పందం కింద సహకారం కొనసాగించలేమని భారత్ ఆ సంధిని నిలిపివేసింది. -
ఈ వీడియోను మీరూ నమ్మారా? రాజ్‌నాథ్ సింగ్ అలా చెప్పలేదు..
న్యూఢిల్లీ: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిరసనకారులను బెదిరించినట్టు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వీడియోను పాకిస్థాన్ ప్రచార నెట్వర్క్ తప్పుడు సమాచారంతో వ్యాప్తి చేసినట్టు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది.పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఆ ప్రచారాన్ని నకిలీగా తేల్చింది. వైరల్ వీడియోను కృత్రిమంగా రూపొందించారని, ప్రజలను తప్పుదారి పట్టించే తప్పుడు సమాచార ప్రచారంలో భాగంగా పాకిస్థాన్ ప్రచార అకౌంట్లు దాన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నాయని తెలిపింది.ఆన్లైన్లో ప్రచారం అవుతున్న తప్పుడు వీడియోతో పాటు రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడిన ఎలాంటి మార్పులు చేయని వీడియోను కూడా ఫ్యాక్ట్ చెక్ విభాగం విడుదల చేసింది.ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలపై రక్షణ మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది. “ఈ వీడియో నకిలీ, కృత్రిమ మేధతో రూపొందించారు. ఢిల్లీ నిరసనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అలాంటి ప్రకటన చేయలేదు” అని ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది.ధ్రువీకరణ లేని సమాచారాన్ని షేర్ చేయవద్దని పీఐబీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భారత ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద పోస్టులను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగానికి తెలియజేయాలని సూచించింది. నిజమైన సమాచారం కోసం అధికారిక సోర్సులనే నమ్మాలని కోరింది.రాజ్‌నాథ్ సింగ్ ఏమన్నారు?బుధవారం రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ) 2026 ప్రశ్నపత్రం లీక్ వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు.విద్యార్థులను రాజకీయ సాధనంగా ఉపయోగించేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో.. “ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మన దేశ విద్యార్థులను, యువతను రాజకీయ సాధనంగా ఉపయోగించేందుకు కొందరు ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరం” అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ⚠️ Fake Video Alert!🚨Pakistani propaganda accounts are circulating a video of Defence Minister Rajnath Singh claiming that he made threatening remarks about the protesting students. #PIBFactCheck:❌ The video is #Fake and AI-generated.✅ Defence Minister @rajnathsingh… pic.twitter.com/nmmaHTsarp— PIB Fact Check (@PIBFactCheck) July 23, 2026 -
భారత్‌లో అంత బాగా నిరసనలు.. మనమేమో చేతగానోళ్లలా..
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల నిరసనను గమనిస్తున్న పాకిస్థానీయుల్లో ఆసక్తితో పాటు అసూయ కనిపిస్తున్నాయి. "పాకిస్థాన్‌లో ఇలా నిరసనలు ఎందుకు జరగవు?" అని వాళ్లకు వాళ్లే ప్రశ్నించుకుంటున్నారు.నీట్ ప్రశ్నపత్రం లీకులపై జరుగుతున్న నిరసనలు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. యువత ముందుండి నడిపిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఈ ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. సరిహద్దు అవతల పాకిస్థానీయులు ఆశ్చర్యంతో వీటిని గమనిస్తున్నారు. పాటలు, నినాదాలు, ఉద్యమ లక్ష్యం అన్నింటినీ విశ్లేషిస్తున్నారు.క్రికెట్ కోసమైతే వస్తారు.. పాకిస్థాన్ యువత ఎందుకు వీధుల్లోకి రావడం లేదని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు ఆ దేశీయులు. ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్ వద్ద లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు చూసే జనం.. అక్కడ ఇతర కారణాలపై (సమస్యలపై) మాత్రం ఎందుకు గుమిగూడడం లేదని ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి సమాధానం ఏంటంటే "పాకిస్థాన్‌లో అసలు ప్రజాస్వామ్యమే లేదు" అని కంటెంట్ క్రియేటర్ మహ్మద్ వలీద్ చెప్పిన మాటతో చాలామంది ఏకీభవిస్తున్నారు.‘‘డాన్’’ పత్రిక మాజీ సంపాదకుడు సిరిల్ అల్మీడా జంతర్ మంతర్ నిరసనలను "రావల్పిండీకి హెచ్చరిక"గా అభివర్ణించారు. రావల్పిండి నగరంలోనే పాకిస్థాన్ సైన్య ప్రధాన కార్యాలయం ఉంది. తమ దేశంలో ఇలాంటి విప్లవం రావడం లేదని నిరాశ చెందుతున్నారు.పోలీసుల దౌర్జన్యానికి వస్తే రెండు దేశాల్లోనూ పరిస్థితి ఒకేలా ఉంటుందని అంటున్నారు. వలీద్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియోలో భారత యువత నుంచి పాకిస్థాన్ యువత నేర్చుకోవాల్సిన విషయాలను వివరించారు. నిరసన చేయాలంటే పెద్ద స్థాయిలో చేయాలని ఆయన అన్నారు. "పాకిస్థానీయులు తమ సంకల్పాన్ని ఎప్పుడూ చూపలేరు. 'నాకు ఏమాత్రం పట్టదు' అనే ధోరణితో ఉంటారు. డిగ్రీ తీసుకుని దేశం వదిలి వెళ్లడంపైనే మాట్లాడుతుంటారు. ఇది ఓడిపోయిన వారి ప్రవర్తన" అని చెప్పారు.బంగ్లా, భారత్‌లోనే నిరసనలు మరో పాకిస్థాన్ కంటెంట్ సృష్టికర్త నోమీ సయ్యద్ మాట్లాడుతూ.. "ఈ ఉపఖండంలో బంగ్లాదేశీయులు మార్పు తీసుకురాగలుగుతున్నారు. భారతీయులు నిరసన చేయగలుగుతున్నారు. పాకిస్థాన్‌లో మాత్రం అలాంటి వారు లేరు. మా దేశంలో ఇలాంటి విప్లవం ఎప్పుడూ రాదు" అని ఆయన అన్నారు.మరో ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్ మహ్వాష్ అజాజ్ మాట్లాడుతూ.. భారత్‌లోని నిరసనలకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని చెప్పారు. "వందే మాతరం పాడుతూ దేశ అభివృద్ధి కోసం నిరసన చేస్తారు. కానీ, పాకిస్థానీయులను మాత్రం ఇక్కడ వేర్పాటువాదులుగా ముద్ర వేస్తారు" అని అన్నారు.అయితే అందరూ ఇదే అభిప్రాయంతో లేరు. మానవ హక్కుల పాత్రికేయురాలు అలిఫియా సోహైల్ మాట్లాడుతూ.. "పాకిస్థాన్ నిరసనల గురించి మీరు మాట్లాడే తీరు, భారత మీడియా భారత్‌లోని నిరసనల గురించి మాట్లాడే తీరులానే ఉంది" అని అన్నారు."భారత కంటెంట్ సృష్టికర్తలు, ఇన్ఫ్లూయెన్సర్లు తమ ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంటున్నారు. ఇక్కడ మాత్రం అణచివేతకు పాల్పడేవారి గొంతుకగా మారేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. వెన్నెముక లేని వర్గం" అని అబ్దుల్లా అనే ఎక్స్ యూజర్ పేర్కొన్నారు. -
పాక్‌కు ఉబర్ డ్రైవర్ ఫోన్.. వైరల్ చేసిన భారత మహిళ
న్యూఢిల్లీ: ఉబర్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ.. డ్రైవర్ ఫోన్లో పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తితో మాట్లాడుతుండటాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన స్వాతి గోయల్ శర్మ ఇటీవల ఉబర్ క్యాబ్‌లో ప్రయాణించారు. ఆ సమయంలో క్యాబ్ డ్రైవర్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండగా ఆమె గమనించారు. ‘మీరు పాకిస్థాన్ నుంచా?’ అని డ్రైవర్ అంటుండటంతో ఆమె అప్రమత్తమయ్యారు. వెంటనే తన ఫోన్ తీసి ఆ సంభాషణను దాదాపు 51 సెకన్ల పాటు వీడియో రికార్డు చేశారు.రైడ్ ముగిసిన తర్వాత మహిళ ఆ డ్రైవర్‌ను నిలదీయగా.. తాను ‘ట్రూమీట్’ అనే మొబైల్ యాప్‌లోని ఓ గ్రూప్‌లో సభ్యుడిగా ఉన్నానని, అందులో చాలా మంది పాకిస్థానీలు కూడా ఉన్నారని డ్రైవర్ సమాధానమిచ్చాడు. ఆ యాప్‌లో భారతీయులను మతపరమైన చర్చల్లోకి లాగుతుంటారని, హిందూ ఆచారాలపై అనవసరమైన ప్రశ్నలు అడుగుతుంటారని డ్రైవర్ వివరించినట్లు స్వాతి తెలిపారు. In the Uber cab I took today, I overheard the driver saying - “aap pakistan se ho na…”I started recording after that. The driver started - aapki Mecca medina mein pehle shivling thi..” You can hear the rest of what he said in this video till my destination arrived Before… pic.twitter.com/c9GbBxwgGz— Swati Goel Sharma (@swati_gs) July 21, 2026ఈ తరహా చాటింగ్ యాప్‌ల ద్వారా ఉగ్రవాద సంస్థలు ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉందని స్వాతి ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా ఏజెన్సీలు ఇలాంటి వాటిపై నిఘా వేయాలని, ఇలాంటి విదేశీ యాప్‌ల పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన స్క్రీన్షాట్లు, వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఏఐతో భారీ సంక్షోభం: జర్నలిస్ట్ రాబర్ట్ పెస్టన్ భవిష్యవాణి! -
భారత్‌లో నిరసనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
భారత్‌లో జరుగుతున్న నిరసనలపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న నిరసనలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా ఇలా అన్నాడు.I am disturbed because every protest in India seems to have the same script.1. Abuse Lord Ram.2. Abuse Bharat Mata.3. Abuse PM Modi.4. Abuse PM Modi’s late mother.5. Abuse Brahmins.6. Abuse Hindutva.No discussion.No solutions.Only slogans, abuse, and chaos.The…— Danish Kaneria (@DanishKaneria61) July 22, 2026"భారత్‌లో జరిగే ప్రతి నిరసనకూ ఒకే రకమైన స్క్రిప్ట్ ఉండటం బాధాకరం. అనేక నిరసనల్లో సమస్యల పరిష్కారం కంటే రాముడిని తిట్టడం, భరతమాతను తిట్టడం, నరేంద్ర మోదీని, ఆయన తల్లిని తిట్టడం, హిందుత్వం, బ్రాహ్మణులపై విమర్శలు చేయడమే ఎక్కువగా కనిపిస్తుంది. చర్చలు లేవు, పరిష్కారాలు లేవు.. నినాదాలు, దూషణలు, గందరగోళమే కనిపిస్తుంది.అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాకముందే కొందరు రైతులు ఢిల్లీ ముట్టడికి సిద్ధమవుతున్నారు.ప్రతిపక్ష రాజకీయ వర్గాలు నేపాల్ తరహా పరిస్థితిని సృష్టించగలమనే భ్రమలో ఉన్నాయి. రోజురోజుకు పరిస్థితి మరీ సర్కస్‌లా మారుతుంది. వాస్తవాలను నిర్ధారించుకోకుండా నిరసన తెలపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, దేశం ఎలా పురోగమించగలదు" అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు.దానిష్ కనేరియా చేసిన ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు అతడి అభిప్రాయాలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నారు.కాగా, పాక్ మాజీ లెగ్ స్పిన్నర్ అయిన కనేరియా గతంలోనూ భారత దేశానికి, ప్రధాని మోదీకి అనుకూలంగా మాట్లాడి వార్తల్లో నిలిచాడు. కనేరియా హిందువు కావడంతో పాక్ జట్టులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని గతంలో చాలాసార్లు ప్రస్తావించాడు. -
పాక్‌కు భారత్ గట్టి కౌంటర్.. ఉగ్రవాదంపై నిలదీత!
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో సరిహద్దు ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. జమ్ము కశ్మీర్‌పై పాకిస్తాన్ అవాస్తవాలను ప్రచారం చేస్తూ, అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తోందని ఐరాసలో భారత్ శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీశ్ తీవ్రంగా తప్పుబట్టారు.సహజ వనరుల పాలన, శాంతి, భద్రత, సమృద్ధికి పునాది అనే అంశంపై జరిగిన ఐరాస భద్రతా మండలి ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో ఆయన మాట్లాడారు. జమ్ము కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, విడదీయరాని భాగమని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న రాజ్యాంగ, చట్టపరమైన వాస్తవం ఇదేనని తేల్చిచెప్పారు.కశ్మీర్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఏకైక వివాదం భారత్ భూభాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకోవడమేనని హరీశ్ స్పష్టం చేశారు. సింధు జలాల ఒప్పందంపై మాట్లాడుతూ, ఈ విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. సరిహద్దు ఉగ్రవాదం కొనసాగుతున్న తరుణంలో పరస్పర విశ్వాసం, సద్భావనతో కూడిన సహకారం ఉండదని ఆయన తేల్చిచెప్పారు. భారత్‌పై నిందలు వేయడం మాని, పాకిస్తాన్ తన దేశంలోని అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.ఇది కూడా చదవండి: ఆన్లైన్లో సీజేపీ నిరసన: 8.4 లక్షలు దాటిన సంతకాలు! -
ఆక్రమిత కశ్మీర్‌కు ప్రధాని కావాలనేదే నా ఆశ: నవాజ్ షరీఫ్
లాహోర్: పాకిస్తాన్ ఆక్రమిత్ కశ్మీర్(పీవోకే)కు ప్రధాని మంత్రి కావాలనేదే తన కల అని మాజీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వెల్లడించారు. నవాజ్ ప్రస్తుతం పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్) పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. జూలై 27వ తేదీ నుంచి ఆగస్ట్ పదో తేదీ వరకు జరిగే పీవోకే ఎన్నికల్లో గెలిచి ప్రధాని అవ్వాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.ముజఫరాబాద్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో నవాజ్ మాట్లాడారు. ‘నా సొంత ప్రావిన్స్ పంజాబ్ కంటే పీవోకే అంటేనే నాకు ప్రేమ ఎక్కువ. ఇది నా రెండో సొంతిల్లు. మా పూర్వీకులు ఇక్కడి నుంచే వలస వచ్చారు. ఈసారి ఎన్నికల్లో మా పార్టీ గెలిస్తే ఈ ప్రాంతానికి ప్రధానిని చేయాలని దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ను కోరతా. ఇక్కడ ప్రధానిగా కొనసాగితే ఈ ప్రాంత అభివృద్ధిని స్వయంగా పర్యవేక్షించే భాగ్యం దక్కుతుంది’ అని నవాజ్ వ్యాఖ్యానించారు. పీఎంఎల్–ఎన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని నవాజ్ హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారులు, విద్య, వైద్య రంగాల అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.ఇదిలా ఉండగా, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ–కాశ్మీర్లో అంతర్భాగమేనని భారత్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తోంది. 1994లో భారత పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం ప్రకారం, పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ఈ ప్రాంతం భారతదేశానికి చెందినదేనని, దానిపై భారతదేశానికే పూర్తి హక్కులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటిస్తోంది. భారత విదేశాంగ శాఖ కూడా పీవోకేపై పాకిస్తాన్ చేసే రాజకీయ వ్యాఖ్యలు లేదా ఎన్నికలను భారత సార్వభౌమాధికారాన్ని ప్రభావితం చేయలేవని పలుమార్లు స్పష్టం చేసింది. -
అమెరికాని రూ. 96 వేల కోట్లు అడిగిన పాకిస్థాన్!
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్, తన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి అమెరికా సహాయాన్ని కోరింది. అమెరికా-ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించిన తర్వాత, పాకిస్థాన్ అమెరికా నుండి 10 బిలియన్ (రూ. 96,536 కోట్ల) డాలర్ల భారీ ఆర్థిక సహాయాన్ని కోరినట్లు రాయిటర్స్ కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణంలో పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరించి, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ దౌత్యపరమైన క్రెడిట్‌ను ఉపయోగించుకుని, ఇప్పుడు వాషింగ్టన్ నుండి ఈ భారీ ఆర్థిక ప్రయోజనాన్ని పొందాలని పాకిస్థాన్ ఆశిస్తోంది. ఒకవేళ అమెరికా గనుక ఈ 10 బిలియన్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపితే, అది పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు సంజీవనిలా మారుతుంది. దీనివల్ల పాకిస్థాన్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. యూఎస్ డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ పడిపోకుండా స్థిరపడుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. అయితే,ఈ విన్నపంపై అటు అమెరికా, ఇటు పాకిస్థాన్ ప్రభుత్వం గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.కానీ, పాక్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్‌తో భేటీ అయినప్పుడు.. ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల వల్ల తమ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా దెబ్బతింటుందో వివరించినట్లు పాక్ విదేశాంగ శాఖ ధృవీకరించింది. పాకిస్థాన్ ప్రస్తుతం ఐఎంఎఫ్ నుండి పొందిన 7 బిలియన్ల ప్యాకేజీ కింద కొనసాగుతోంది. ఈ లోన్ పొందడం కోసం పాక్ ప్రభుత్వం ప్రజలపై భారీగా పన్నులు పెంచడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవడం వంటి కఠినమైన సంస్కరణలను అమలు చేస్తోంది.2023లో ఒక దశలో పాకిస్థాన్ దేశం పూర్తిగా దివాళా తీసే పరిస్థితికి రాగా, అప్పట్లో ఐఎంఎఫ్ ఇచ్చిన మూడు బిలియన్ల అత్యవసర నిధులు కాపాడాయి. ఆ తర్వాత వాతావరణ మార్పుల తట్టుకునేందుకు మరో 1.3 బిలియన్ల లోన్ కూడా పొందింది. ఇవన్నీ ఉన్నప్పటికీ, చైనా, సౌదీ అరేబియాలు ఇచ్చే అప్పులపైనే పాకిస్థాన్ విదేశీ నిల్వలు ఆధారపడి ఉన్నాయి.అసలు ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీ అంటే ఏంటి?ఇది అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తన ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా అందించే చాలా అరుదైన ఆర్థిక ప్యాకేజీ. ఏదైనా మిత్రదేశం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు దాని కరెన్సీని కాపాడటానికి, డాలర్ ఫండింగ్ లేదా గ్యారెంటీల రూపంలో అమెరికా ఈ సహాయాన్ని అందిస్తుంది. గతంలో 2002లో ఉరుగ్వే దేశానికి, 2025లో అర్జెంటీనా దేశానికి అమెరికా ఇటువంటి ప్యాకేజీలను ప్రకటించింది. -
పాక్ క్రికెటర్లకు పీసీబీ వింత కండీషన్
పాకిస్తాన్ క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు (PCB) వింత కండీషన్ పెట్టింది. లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో శిక్షణ పొందే ఆటగాళ్ల ఫిట్నెస్ మెరుగుపరిచేందుకు 'పాడెల్' ఆటను తప్పనిసరి చేసింది. ప్రతి రెండో రోజు 40 నిమిషాల పాటు ప్రతి ఆటగాడు పాడెల్ గేమ్‌ను ఆడాల్సిందేనని ప్రకటన జారీ చేసింది.పీసీబీ సీనియర్ సెలెక్టర్, డైరెక్టర్ ఆఫ్ హై పెర్ఫార్మెన్స్ ఆకిబ్ జావెద్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆటగాళ్ల చురుకుదనం, రిఫ్లెక్సులు, కదలికలు, ఫీల్డింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడమే ఈ చర్య లక్ష్యమని ఆయన చెప్పారు.ఇప్పటికే పలువురు క్రికెటర్లు పాడెల్ ఆడుతున్నప్పటికీ, అందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆకిబ్ తెలిపారు. ఇప్పుడు ఎన్సీఏలోనే ప్రత్యేక పాడెల్ కోర్టును ఏర్పాటు చేయడంతో శిక్షణతో పాటు ఈ ఆటను కూడా ఆడే అవకాశం కల్పించినట్లు చెప్పారు.టెన్నిస్, స్క్వాష్ అంశాల కలయికతో ఆడే పాడెల్ చిన్న కోర్టులో జరిగినప్పటికీ, అధిక స్థాయి ఫిట్నెస్, వేగం, స్టామినా అవసరమయ్యే క్రీడగా గుర్తింపు పొందింది. అందుకే దీన్ని క్రికెటర్ల శిక్షణలో భాగం చేశామని ఆకిబ్ వెల్లడించారు.అంతేకాకుండా, భవిష్యత్తులో ఎన్సీఏలో బాస్కెట్‌బాల్ కోర్టులు, స్నూకర్‌తో పాటు ఇతర ఇండోర్ గేమ్స్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే అత్యాధునిక ఏఐ (AI) బౌలింగ్ మెషీన్‌ను అకాడమీలో అందుబాటులోకి తీసుకువచ్చామని, ఆటగాళ్ల నైపుణ్యాలను మరింత మెరుగుపరచడమే పీసీబీ లక్ష్యమని ఆకిబ్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే, పాకిస్తాన్ జట్టు వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. ఆ పర్యటనలో భాగంగా మూడు టెస్ట్‌లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం పాక్ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ పర్యటనతో కెప్టెన్‌గా బాబర్ ఆజం శకం మళ్లీ మొదలవుతుంది. మాజీ కెప్టెన్ షాన్ మసూద్ వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడిని తొలగించి బాబర్‌కు కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ కట్టబెట్టారు. -
మధ్యవర్తిత్వం పేరుతో పాక్ స్కెచ్.. అమెరికాకు వల ?
ఇస్లామాబాద్: ఇరాన్- అమెరికా యుద్ధంలో మధ్యవర్తి పాత్ర పోషిస్తూ పాక్ ఇచ్చినా బిల్డప్ అంతా ఇంతా కాదు. ఇస్లామాబాద్ టాక్స్ పేరుతో పెద్ద హంగామానే చేసింది. ఇంత చేసి యుద్ధం ఆగడం మాట అటుంచితే అది మరింత ముదిరింది. అయితే ఈ మధ్యవర్తిత్వం పేరుతో అమెరికాకు మరింత దగ్గరైన పాక్ ఇప్పుడు ఆ దేశం నుంచి మెల్లగా ఆర్థిక సాయం పొందే ప్లాన్ వేస్తోంది.ఆర్థిక సంక్షోభంలో సతమతమవుతున్న పాక్, వాషింగ్టన్ నుండి $10 బిలియన్ల 'ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీ' ని కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, దేశంలో పడిపోతున్న విదేశీ మారక నిల్వలను పునరుద్ధరించడానికి, పాకిస్తానీ రూపాయి విలువపై ఒత్తిడిని తగ్గించడానికి ఊరట లభించినట్లవుతుందని కథనాలు పేర్కొన్నాయి.పాకిస్తాన్ ప్రభుత్వం యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్కు పంపిన ప్రతిపాదనలో, ఐదేళ్ల కాలపరిమితి కలిగిన $10 బిలియన్ల ద్వైపాక్షిక ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని అమెరికాను కోరింది. ప్రస్తుతం పాకిస్తాన్ $7 బిలియన్ల IMF ప్రోగ్రామ్ కింద కఠినమైన ఆర్థిక నిబంధనలను అమలు చేస్తోంది. దీనివల్ల పన్నుల పెంపు, ప్రభుత్వ వ్యయం తగ్గించడం వంటి కొన్ని ప్రజాదరణ లేని నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది. యుఎస్ అందించే ఈ సదుపాయం లభిస్తే పాకిస్తాన్‌కు IMF నిధులపై మరియు ఆకస్మిక రుణాలపై ఆధారపడటం తగ్గుతుంది.'ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్' సదుపాయం ?యుఎస్ ట్రెజరీ నుండి లభించే ఈ సదుపాయాలు చాలా అరుదుగా ఇస్తారు. ఇవి సాధారణంగా "ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫండ్" ద్వారా డాలర్లు, స్వ్యాప్లు (swaps) లేదా గ్యారెంటీల రూపంలో లభిస్తాయి. గతంలో 2025లో అర్జెంటీనాకు, 2002లో ఉరుగ్వేకు ఈ విధమైన ప్యాకేజీలు అందించారు. మెక్సికోకు కూడా 1940ల నాటి $9 బిలియన్ల స్వ్యాప్ లైన్ అందుబాటులో ఉంది.పాకిస్తాన్ ప్రస్తుత ఆర్థిక స్థితి2023లో $3 బిలియన్ల IMF స్టాండ్‌బై ఒప్పందంతో డిఫాల్ట్ కాకుండా బయటపడిన పాకిస్తాన్, ఆ తర్వాత $7 బిలియన్ల ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ మరియు వాతావరణ మార్పుల కోసం $1.3 బిలియన్ల రుణాన్ని పొందింది. అయినప్పటికీ, పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు ఇంకా చైనా మరియు సౌదీ అరేబియా రోల్ఓవర్లు, డిపాజిట్లపైనే ఆధారపడి ఉన్నాయి.ఏప్రిల్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి పాకిస్తాన్ $3.5 బిలియన్లు చెల్లించాల్సి రాగా, సౌదీ అరేబియా $3 బిలియన్ల కొత్త మద్దతును అందించింది. 2026 చివరి నాటికి తమ విదేశీ మారక నిల్వలు $20 బిలియన్లకు చేరుకుంటాయని పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసింది.ఫిచ్ రేటింగ్స్, హెచ్చరికలుIMF ప్రోగ్రామ్ వల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కొంత స్థిరపడినప్పటికీ, పెరిగే ఇంధన ధరలు మరియు సరఫరా అంతరాయాలు విదేశీ మారక నిల్వలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఫిచ్ రేటింగ్స్ హెచ్చరించింది. అలాగే క్రెడిట్ రేటింగ్ తక్కువగా ఉండటం వల్ల విదేశీ పెట్టుబడులు రావడం లేదు. -
అంతర్జాతీయ వేదికపై పాక్ పరువు పాయే!
న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ)పై కెనడా విదేశాంగ మంత్రితో పాకిస్తాన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఐడబ్ల్యూటీతో పాటు, కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కెనడాను కోరారు. అయితే కెనడా విదేశాంగ మంత్రితో జరిగిన ఈ సమావేశం అనంతరం ఇరు దేశాల సంయుక్త ప్రకటనలో సింధు జలాల ఒప్పందం గానీ, కశ్మీర్ అంశం గానీ ఎక్కడా ప్రస్తావనకు రాలేదు.అంతర్జాతీయ వేదికలపై నిత్యం భారత్‌పై నిందలు మోపే పాకిస్తాన్ ప్రయత్నాలకు కెనడాలో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెనడా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆ దేశ విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తోందని, దీనిపై అంతర్జాతీయంగా ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కశ్మీర్ వివాదంలోనూ మధ్యవర్తిత్వం వహించాలని కోరినట్లు సమాచారం.అయితే, దౌత్య సంబంధాల పరంగా పాక్ అభ్యర్థనలను కెనడా పెద్దగా పట్టించుకోలేదని స్పష్టమైంది. భేటీ ముగిసిన తర్వాత విడుదల చేసిన అధికారిక సంయుక్త ప్రకటనలో కశ్మీర్, సింధు జలాల వివాదం గురించి కనీసం ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. దీంతో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ మరోమారు పరువు తీసుకున్నట్లయ్యింది.ఇది కూడా చదవండి: అభిషేక్ బెనర్జీకి హైకోర్టు షాక్ .. కంటి చికిత్సకు సలహా! -
పాక్‌లో మరింత పేదరికం.. ప్రతి10 మందిలో ముగ్గురు..
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్లో పేదరిక రేటు భారీగా పెరిగింది. ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒడిదుడుకులు, గ్రామీణ-పట్టణ వ్యత్యాసాల వల్ల దాదాపు ప్రతి 10 మందిలో ముగ్గురు (28.9 శాతం మంది) పేదరిక రేఖకు దిగువన జీవిస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.‘డాన్’ ప్రచురించిన విశ్లేషణ ప్రకారం.. పాకిస్తాన్ తాజా హౌస్‌హోల్డ్ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ సర్వే (హెచ్ఐఈఎస్), పాకిస్తాన్ సోషల్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ మెజర్మెంట్ (పీఎస్ఎల్ఎం) గణాంకాల ఆధారంగా 2024-25 నాటికి జాతీయ పేదరిక రేటు 28.9 శాతానికి చేరింది. 2018-19లో ఇది 21.8 శాతంగా ఉండేది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత వెలువడిన ఈ సర్వే దేశవ్యాప్తంగా జీవన ప్రమాణాలు ఏ విధంగా దిగజారాయో స్పష్టం చేస్తోంది.గ్రామీణ ప్రాంతాలు ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావానికి తీవ్రంగా గురయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం సుమారు ఎనిమిది శాతం మేర పెరగగా, పట్టణ ప్రాంతాల్లో ఆరు శాతం పెరిగింది. చెల్లింపుల సంక్షోభాలు, కొవిడ్-19 మహమ్మారి, నిరంతర ద్రవ్యోల్బణం, పెరిగిన వస్తువుల ధరలు, సుదీర్ఘ ఆర్థిక సర్దుబాటు చర్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఇది కూడా చదవండి: సొరంగంలో విషాదం.. పలువురు కార్మికులు గల్లంతు! -
పాకిస్తాన్.. ఆ నిజాన్ని దాచేసింది!
ఢిల్లీ: భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' ముందు పాకిస్తాన్ సైన్యం ఘోరంగా విఫలమైందని.. ఆ పరాజయాన్ని కప్పిపుచ్చుకోవడానికే పాక్ మిలిటరీ విజయం సాధించామంటూ అబద్ధపు ప్రచారాన్ని సృష్టించిందని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ నియాజీ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... 'ఆపరేషన్ సింధూర్'లో పాకిస్తాన్ సైనిక నాయకత్వం ప్రజలకు చెప్పినట్లుగా ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' అపార విజయం సాధించిందని.. తమ సైన్యం ఓటమిని అంగీకరించలేక నిజాలను తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.ఇజ్రాయెల్, పాకిస్థాన్ సంబంధాలపైనా ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కొన్ని దేశాలు ఇప్పటికీ ఇజ్రాయెల్‌ను ఓ దేశంగా గుర్తించడం లేదన్నారు. ఆ లిస్ట్‌లో ఉన్న పాకిస్థాన్.. ఇటీవల ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించే దిశగా అడుగులు వేస్తుండటం కూడా ఇరు దేశాల మధ్య ఘర్షణ తీవ్రతరం కాకపోవడానికి కారణమని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ 'అబ్రహం అక్కార్డ్స్’లో చేరి.. ఇజ్రాయెల్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించే దిశగా అడుగులు వేయించేందుకే అంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు.ఈ యుద్ధం.. మరింత పెద్దది కాకుండా నిలిచిపోవడానికి కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని.. పాకిస్తాన్ నాయకత్వం తమ పరువు కాపాడుకోవడానికి ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకుని సహాయం చేశారని తెలిపారు. కాగా, నోరీన్ నియాజీ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ సైనిక వర్గాల్లో కలకలం రేపాయి. ఈ ప్రకటనలు వెలువడిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NCCIA) ఆమెకు నోటీసులు జారీ చేసింది. -
బలూచ్ బిగ్ ట్విస్ట్‌తో చైనా-పాక్ ఫ్రెండ్షిప్ ఖతం!
పాకిస్థాన్ ఉనికినే ప్రశ్నిస్తూ, ఆ దేశపు అతిపెద్ద ప్రావిన్స్(రాష్ఠ్రం) ‘బలూచిస్తాన్’ నుండి ఒక సంచలన ప్రకటన వెలువడింది. బలూచ్ నేత మీర్ యార్ బలూచ్ సోషల్ మీడియాలో చేసిన ఒక వైరల్ ట్వీట్ అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపింది. బలూచిస్తాన్‌ను ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించడమే కాకుండా, ఆ ప్రాంతంలోని 85 శాతం భూభాగంపై తమ నియంత్రణ ఉందని ఆయన పేర్కొనడం పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సొంత జెండా, జాతీయ గీతం ‘బలూచీ ఫాలూస్’ పేరుతో కొత్త కరెన్సీని కూడా ప్రకటించడంతో, ఈ ప్రాంతం మళ్లీ ప్రపంచ రాజకీయాల్లో చర్చాంశంగా మారింది.బలూచిస్తాన్ ఎందుకు కీలకం?పాకిస్థాన్ మొత్తం వైశాల్యంలో అతిపెద్ద ప్రాంతమైన బలూచిస్తాన్, ఆ దేశానికి ప్రాణవాయువు వంటిది. ఇది కేవలం భౌగోళికంగానే కాకుండా, ఖనిజ సంపద పరంగానూ ఎంతో సమృద్ధిగా ఉంది. ఇక్కడ బంగారం, రాగి, సహజ వాయువు, బొగ్గు వంటి అరుదైన ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ ప్రావిన్స్ గనుక పాకిస్థాన్ నుంచి విడిపోతే, పాక్ ఆర్థిక స్థితిగతులు కుప్పకూలడం ఖాయం. అత్యంత వ్యూహాత్మకమైన ఈ ప్రాంతం, ఆసియా దేశాల మధ్య ఒక ప్రధాన ‘గేట్‌వే’గా పనిచేస్తోంది.దశాబ్దాల సుదీర్ఘ పోరాటం1947లో భారత్-పాకిస్థాన్ విభజన జరిగినప్పటి నుండే బలూచిస్తాన్‌లో నిరసనలు మొదలయ్యాయి. 1950, 60, 70 దశకాల నుంచి ఇప్పటి వరకు ఎన్నో సార్లు బలూచ్ ప్రజలు తిరుగుబాటు చేశారు. స్వయంప్రతిపత్తి కోసం, తమ సహజ వనరులపై తమకే హక్కు ఉండాలని, మానవ హక్కుల ఉల్లంఘన ఆపాలని కోరుతూ వీరు దశాబ్దాలుగా పాకిస్థాన్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు.కళాత్ సంస్థానం చరిత్రబలూచిస్తాన్ చరిత్ర 1947 నాటిది. విభజన సమయంలో కళాత్, మకరన్, లాస్ బేలా, ఖారన్ అనే నాలుగు స్వతంత్ర సంస్థానాలు ఉండేవి. అందులో కళాత్ అత్యంత శక్తివంతమైనది. 1947 ఆగస్టు 11న ఖాన్ ఆఫ్ కళాత్ మీర్ అహ్మద్ యార్ ఖాన్ దీన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించారు. కానీ 227 రోజుల తర్వాత, 1948 మార్చి 20న, బలవంతంగా పాకిస్థాన్‌లో విలీనం చేయబడింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పాక్ దమనకాండకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం రగిలిపోతూనే ఉంది.పేదరికంలో మగ్గుతున్న సంపన్న ప్రాంతంపాకిస్థాన్లోని ఇతర ప్రాంతాలకు గ్యాస్, విద్యుత్ అందిస్తున్న బలూచిస్తాన్, దురదృష్టవశాత్తూ పేదరికంలో కూరుకుపోయింది. ఇక్కడ 70 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. తమ వనరులను కేంద్రం దోచుకుంటోందని, తమకు దక్కాల్సిన అభివృద్ధి అందడం లేదని బలూచ్ జాతీయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ వివక్షే ‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ’ వంటి సంస్థలు ఆయుధాలు పట్టేలా చేసింది.చైనాకు బలూచిస్తాన్ ఎందుకు ముఖ్యం?చైనా చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్’కు బలూచిస్తాన్ గుండెకాయలాంటిది. 65 బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్ట్ ద్వారా చైనా, పశ్చిమ ప్రాంతాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానించాలని చూస్తోంది. ముఖ్యంగా గ్వాదర్ ఓడరేవు చైనాకు ఎంతో కీలకం. ఇది ప్రపంచ వాణిజ్య మార్గాలను శాసించడానికి, మలక్కా జలసంధిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి చైనాకు ఉన్న ఏకైక మార్గం.ఆయుధ సంపత్తిపై పాక్ ఆందోళనబలూచ్ తిరుగుబాటుదారుల వద్ద ఇప్పుడు అత్యంత ఆధునిక ఆయుధాలు ఉన్నాయని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్వయంగా పార్లమెంట్లో అంగీకరించారు. పాక్ సైన్యం వద్ద ఉన్న ఆయుధాల కంటే శక్తివంతమైనవి విద్రోహుల వద్ద ఉన్నాయని ఆయన చెప్పడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఈ తిరుగుబాటును అణచివేయడం పాకిస్థాన్‌కు సవాలుగా మారింది.స్వతంత్ర దేశం అయ్యే అవకాశం ఉందా?ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా గుర్తింపు రావడం కష్టమైనప్పటికీ, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మారాలనే ఆకాంక్ష ఏమాత్రం తగ్గలేదు. పాకిస్థాన్ తన సైనిక శక్తితో ఎంత అణచివేసినా, బలూచ్ ప్రజల స్వేచ్ఛాకాంక్ష రోజురోజుకూ బలపడుతోంది. అధికారిక గుర్తింపు లేకపోయినా, ఈ ప్రాంతం పాకిస్థాన్ అస్థిరతకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: ప్రపంచం మెచ్చిన పాట.. సింగర్‌కు దక్కింది ఇంతేనా? -
రియల్ స్టోరీ చెప్పి.. గుండె గుభేల్మనిపించిన డాక్టర్
తెల్లని శాలువా కప్పుకున్న వృద్ధురాలు తమ దగ్గరకు వచ్చిందని, ఆమె మనిషి కాదని ఓ డాక్టర్ చెప్పారు. ఆయన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌లోని ఓ ఆసుపత్రిలో తనకు ఎదురైన భయానక ఘటనను ఆ డాక్టర్ వివరించారు. ఆ ఘటన తనతో పాటు సిబ్బందినీ వణికించిందని తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఓ వృద్ధురాలు నర్సులతో కలిసి ఉన్న తన దగ్గరకు వచ్చిందని చెప్పారు. తనకు ఇటీవలే పుట్టిన మనవడిని పరీక్షించాలని ఆమె కోరినట్టు వివరించారు.తన మనవడికి జ్వరం వచ్చిందని వృద్ధురాలు చెప్పడంతో డాక్టర్ వెంటనే ఆ గదికి వెళ్లాడు. శిశువును పరీక్షించగా, అప్పటికే అతడు శ్వాస తీసుకోవడం ఆపేశాడని గుర్తించారు. వెంటనే చికిత్స అందించడంతో ఆ చిన్నారి గుండె స్పందన మళ్లీ వచ్చిందని తెలిపారు.ఆ ఘటన తర్వాత చిన్నారి తల్లిదండ్రులను డాక్టర్ పిలిచి, వారి బిడ్డ ప్రాణాలు కాపాడేలా చికిత్స కోసం తీసుకువచ్చిన అమ్మమ్మకు కృతజ్ఞతలు చెప్పాలని డాక్టర్ కోరారు. అప్పుడు ఆ అమ్మమ్మ ఎన్నో ఏళ్ల క్రితమే చనిపోయిందని వారు చెప్పడంతో డాక్టర్, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఆసుపత్రుల్లో సాధారణమేనని చాలామంది అన్నారు. మరికొందరు తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను పంచుకున్నారు."ఒంటరిగానే స్వర్గానికి ప్రయాణం పూర్తి చేయాలని అమ్మమ్మకి తెలుసు. తన కుటుంబంలో ఇంకెవరూ తనతో రావద్దని ఆమె అనుకుంది. అందుకే ఆ శిశువును కాపాడింది" అని ఓ యూజర్ పేర్కొన్నారు."32 ఏళ్లుగా నర్సుగా పని చేస్తున్నాను. నేను చెప్పగలిగే ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. ఆత్మలు నిజంగానే ఉంటాయి. ఆసుపత్రులు అలాంటి అనుభవాలతో నిండి ఉంటాయి" అని మరో వ్యక్తి రాశారు.ఆ డాక్టర్ అన్నీ అసత్యాలు చెబుతున్నారని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి The Gaming Doc (@gamingdocmbbs) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది -
పాక్ పవర్ సెంటర్లో ప్రకంపనలు.. మునీర్ సామ్రాజ్యానికి కొత్త సవాల్
పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి అధికారం ఎవరి చేతుల్లో ఉంది? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. సైన్యం ప్రభావం, మతపరమైన రాజకీయాలు, ఆఫ్ఘనిస్థాన్‌తో సంబంధాలు.. ఈ మూడు అంశాలు ఒకే సమయంలో ఢీకొంటూ ఇస్లామాబాద్‌లో కొత్త ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ప్రముఖ మతపరమైన రాజకీయ నేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ‘రాజకీయాలు చేయాలనుకుంటే యూనిఫాం తీసేసి ఎన్నికల్లోకి రండి.. ప్రజల తీర్పును ఎదుర్కోండి’ అన్న ఫజ్లుర్ రెహ్మాన్ వ్యాఖ్యలు పాకిస్తాన్లో సైన్యం పాత్రపై మరోసారి చర్చను రేపాయి.ఫజ్లుర్ రెహ్మాన్ ఎవరు?మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సాధారణ రాజకీయ నాయకుడు కాదు. పాకిస్తాన్లో దశాబ్దాలుగా ప్రభావం చూపుతున్న మతపరమైన రాజకీయ నేతల్లో ఆయన ఒకరు. ఆయన నేతృత్వంలోని జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (JUI-F) పార్టీకి ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్థాన్ ప్రాంతాల్లో ప్రభావం ఉంది. అలాగే, పాకిస్థాన్ పార్లమెంట్లో పలుమార్లు సభ్యుడిగా ఉన్నారు. మతపరమైన చట్టాల అమలుకు మద్దతు ఇచ్చే రాజకీయ వర్గానికి ప్రతినిధిగా గుర్తింపు పొందారు. ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్‌తో చారిత్రక సంబంధాలు ఉన్న మత పెద్దగా కూడా ఆయనకు పేరు ఉంది.రెహ్మాన్ పేరు వినగానే ఆఫ్ఘనిస్థాన్ అంశం కూడా తెరపైకి వస్తుంది. కాగా, పాకిస్థాన్ సైన్యం ప్రస్తుతం తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్థాన్‌తో సంక్లిష్ట సంబంధాలను ఎదుర్కొంటోంది. అయితే, ఆయన రాజకీయాలు ప్రధానంగా ఎన్నికలు, పార్లమెంటరీ మార్గాల ద్వారా సాగుతాయి. గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద నిరసనలకు నాయకత్వం వహించారు. రాజకీయ వ్యవస్థలో సైన్యం పాత్రపై విమర్శలు చేశారు. అందుకే ఆయన తాజా వ్యాఖ్యలు సాధారణ రాజకీయ విమర్శగా కాకుండా, సైన్యం ప్రభావంపై నేరుగా ప్రశ్నగా భావిస్తున్నారు.1990ల నుంచి..రెహ్మాన్ తాలిబాన్ భావజాలానికి దగ్గరగా ఉన్న మత వర్గాలతో సంబంధాలు కొనసాగించారు.పలువురు తాలిబాన్ నాయకులు పాకిస్థాన్‌లోని JUI అనుబంధ మదర్సాల్లో చదివినట్లు నివేదికలు ఉన్నాయి.2001లో అమెరికా ఆఫ్ఘనిస్థాన్‌పై దాడి చేసినప్పుడు ఆయన అమెరికా వ్యతిరేక ర్యాలీలు నిర్వహించారు.2021లో తాలిబాన్ మళ్లీ ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలని పిలుపునిచ్చారు.కాబూల్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని పాకిస్థాన్‌కు సూచించారు.అయితే ప్రస్తుతం పాకిస్థాన్–ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. అయినప్పటికీ ఫజ్లుర్ మాత్రం చర్చల ద్వారానే పరిష్కారం రావాలని చెబుతున్నారు.మునీర్‌తో విభేదాలు ఎందుకు?ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒకప్పుడు ఫజ్లుర్ రెహ్మాన్, ఆసిమ్ మునీర్ ఎదుగుదలకు పరోక్షంగా సహకరించిన రాజకీయ పరిణామాల్లో భాగమయ్యారు. 2018లో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2020లో ప్రతిపక్షాలు కలిసి పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్మెంట్ (PDM) ఏర్పాటు చేశాయి. దీనికి ఫజ్లుర్ రెహ్మాన్ నాయకత్వం వహించారు. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం తెచ్చింది. 2022లో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. అదే సమయంలో ఆసిమ్ మునీర్ 2022లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయ్యారు. తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి.పాకిస్తాన్లో సైన్యం ఎప్పటి నుంచో అత్యంత శక్తివంతమైన సంస్థగా ఉంది. దేశ రాజకీయాల్లో సైన్యం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపుతుందనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. ఆసిమ్ మునీర్ ప్రస్తుతం పాకిస్తాన్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరు. ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు. భద్రతా విధానాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పాక్ రక్షణ వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. అందుకే ఆయనపై వచ్చే విమర్శలు వ్యక్తిగత విమర్శలుగా కాకుండా సైన్యం పాత్రపై రాజకీయ చర్చగా మారుతాయి. సైన్యం రక్షణ వ్యవహారాలకు పరిమితం కావాలి.. రాజకీయ నిర్ణయాలు ప్రజలు ఎన్నుకున్న నాయకులు తీసుకోవాలి అని ఫజ్లుర్ డిమాండ్ చేశారు.సైన్యం చరిత్రాత్మక పాత్ర..పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి అక్కడి రాజకీయ వ్యవస్థలో సైన్యం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. దేశంలో పలు మార్లు సైనిక పాలనలు వచ్చాయి. ప్రస్తుతం ప్రత్యక్ష సైనిక పాలన లేకపోయినా, విదేశాంగం, భద్రత, భారత్-ఆఫ్ఘనిస్థాన్ విధానాల్లో సైన్యం ప్రభావం కొనసాగుతుందని విమర్శకులు చెబుతారు.1958: జనరల్ అయూబ్ ఖాన్ తొలి సైనిక పాలన.1977: జనరల్ జియా ఉల్ హక్ అధికారం స్వాధీనం.1999: జనరల్ పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు.పాక్ ముందున్న సవాల్ ఇదే..ఒకవైపు దేశ భద్రతను కాపాడే శక్తివంతమైన సైన్యం.. మరోవైపు ప్రజల ఓట్లతో వచ్చే రాజకీయ నాయకత్వం.. ఇంకోవైపు మత ప్రభావంతో ఎదిగిన రాజకీయ శక్తులు.. ఈ మూడు శక్తుల మధ్య సమతుల్యత ఎటు వెళ్తుందో రాబోయే రోజులు నిర్ణయించనున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్లో పోరు కేవలం ఇద్దరు నాయకుల మధ్య కాదు.. అది అధికారం ఎవరి చేతుల్లో ఉండాలనే దశాబ్దాల ప్రశ్నకు కొనసాగింపు. ఈ మూడు ఢీకొంటున్న వేళ ఇస్లామాబాద్‌లో కొత్త పవర్ గేమ్ మొదలైంది. -
పాక్ ఆల్‌రౌండర్‌పై నిషేధం.. గణాంకాలు రద్దు
పాకిస్థాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) శిక్ష విధించింది. 2026 టీ20 ప్రపంచకప్ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షలో నిషేధిత పదార్థం కార్బాక్సీ-టీఎచ్‌సీ (Carboxy-THC) ఉన్నట్లు తేలడంతో తొలుత మూడు నెలల నిషేధం విధించిన ఐసీసీ, అనంతరం దానిని ఒక నెలకు తగ్గించింది.పోటీకి వెలుపల తీసుకున్నట్లు అంగీకారంఫిబ్రవరి 7న కొలంబోలో నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ అనంతరం నిర్వహించిన పరీక్షలో నవాజ్ నమూనా పాజిటివ్‌గా వచ్చింది. ఈ పదార్థాన్ని పోటీ సమయంలో కాకుండా బయట వినియోగించినట్లు, ఇది ఆటలో ప్రదర్శన మెరుగుపరచడానికి కాదని నవాజ్ అంగీకరించినట్లు ఐసీసీ వెల్లడించింది.సస్పెన్షన్ ఎత్తివేతమే 1 నుంచి స్వచ్ఛందంగా తాత్కాలిక సస్పెన్షన్‌ను అంగీకరించిన నవాజ్ ఇప్పటికే రెండున్నర నెలలకుపైగా ఆటకు దూరంగా ఉన్నందున, ప్రస్తుతం అతనిపై ఉన్న నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేసింది. అయితే ఐసీసీ ఆమోదించిన వ్యసన నివారణ (Substance Abuse) చికిత్స కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించింది.గణాంకాలు రద్దునిబంధనల ప్రకారం, ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నవాజ్ ప్రదర్శనతో పాటు, మే 1న తాత్కాలిక సస్పెన్షన్ అమల్లోకి వచ్చే వరకు అతను ఆడిన మ్యాచ్‌ల వ్యక్తిగత గణాంకాలన్నింటినీ రద్దు చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. -
టైం బాంబ్‌లు అమర్చి.. భారీ ఉగ్ర కుట్ర భగ్నం
దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) భగ్నం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జైష్ ఏ మహ్మద్ (JeM)తో సంబంధాలు ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేసింది. ఈ నెల ప్రారంభంలో ఇదే ఉగ్ర మాడ్యుల్‌కు చెందిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అలాగే విచారణలో.. దేశంలోని పలు ప్రాంతాల్లో టైం బాంబ్ పేలుళ్లకు ఈ ముఠా కుట్ర పన్నినట్లు నిర్ధారించారు.పటాన్ జిల్లాలోని ఖడియాల్ గ్రామంలో గురువారం ఐదుగురు జేషై గ్రూప్ సభ్యుల్ని గుజరాత్ ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. అరెస్టైన వారిలో బిలాల్ అబిద్‌భాయ్ షెరా, మహ్మద్ అయూబ్ కడివాలా, మహ్మద్ పలాన్పురి అలియాస్ ఖలీ అయూబ్ సున్సారా, షఫియా రైస్ ముక్తి, మహ్మద్ హసన్ కర్డియా ఉన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన ఎనిమిది మంది అనుమానితుల విచారణలో ఈ ఐదుగురి పేర్లు బయటపడినట్లు అధికారులు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరచగా.. జూలై 24 వరకు ఏటీఎస్ కస్టడీకి అప్పగించారు.దర్యాప్తులో భాగంగా ఓ నిందితుడు.. టైం బాంబ్ తయారు చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ముఠా టైం బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడాలని చూసిందని చెప్పారు. అయితే బాంబు తయారీకి సంబంధించిన సామగ్రి, జైష్ ఏ మహ్మద్‌కు సంబంధించిన ఉర్దూ సాహిత్యం ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. ముఠా సభ్యులు తయారు చేసిన పేలుడు పదార్థాన్ని పరీక్షించేందుకు ప్రయత్నించారని, అయితే ఆ ప్రయోగం విఫలమైందని అధికారులు వెల్లడించారు. బాంబు తయారీ సామగ్రి ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడ దాచారు? ఉగ్ర సంస్థకు సంబంధించిన సాహిత్యం వారికి ఎలా చేరింది? అనే అంశాలపై ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది.ఈ కేసులో జూలై 3న గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో జైష్ ఏ మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఎనిమిది మందిని ఏటీఎస్ అరెస్ట్ చేసింది. గుజరాత్లో క్రియాశీల ఉగ్ర నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు అప్పట్లో పోలీసులు వెల్లడించారు. తాజా అరెస్టులతో జైష్ ఏ మహ్మద్ మాడ్యూల్ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో పెద్ద ఎత్తున పేలుళ్లకు జరిగిన కుట్రను ముందుగానే గుర్తించి అడ్డుకున్నట్లు ఏటీఎస్ అధికారులు చెబుతున్నారు. -
పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్ కొత్త ఎత్తుగడ!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర మలుపు తిరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే.. ఎర్ర సముద్రానికి ప్రవేశ ద్వారమైన బాబ్ అల్-మందెబ్ జలసంధిని మూసివేసేందుకు సిద్ధంగా ఉండాలని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ సూచించింది!. ఈ సమాచారం బయటకు రావడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లతో పాటు ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరిగాయి.రాయిటర్స్ కథనం ప్రకారం.. ఇప్పటికే హౌతీలు క్షిపణులు, డ్రోన్లను బాబ్ అల్-మందెబ్ ప్రాంతానికి సమీపంలో మోహరించి, ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఎర్ర సముద్ర మార్గం కూడా దెబ్బతింటే ప్రపంచ చమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.బాబ్ అల్-మందెబ్ జలసంధి(Bab al-Mandab Strait) ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఎర్ర సముద్రాన్ని ఏడెన్ గల్ఫ్‌తో అనుసంధానించే ఈ జలసంధి మీదుగానే ఆసియా-యూరప్ మధ్య పెద్దఎత్తున చమురు, సహజవాయువు, ఇతర వాణిజ్య సరకు రవాణా జరుగుతుంది. ఈ మార్గం మూసివేయబడితే నౌకలు ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా సుదీర్ఘ మార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో రవాణా ఖర్చులు, బీమా ప్రీమియాలు పెరిగి అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో హౌతీలను వ్యూహాత్మక ఒత్తిడి సాధనంగా ఉపయోగించేందుకు టెహ్రాన్ ప్రయత్నిస్తోందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇరాన్‌పై నేరుగా దాడులు జరిగితే సమాధానం కేవలం తన భూభాగానికే పరిమితం కాకుండా, ప్రాంతంలోని కీలక సముద్ర మార్గాలపై కూడా ప్రభావం చూపించేలా వ్యూహం అమలు చేసే అవకాశాన్ని ఈ పరిణామాలు సూచిస్తున్నాయని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు... ఇదే సమయంలో ఈ పరిణామాలు పాకిస్థాన్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. హౌతీలు ఇటీవల సౌదీ అరేబియాపై మళ్లీ క్షిపణి దాడులు ప్రారంభించడంతో ఇస్లామాబాద్‌లో ఆందోళన పెరిగింది. ఒకవైపు ఇరాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగించాలని చూస్తున్న పాకిస్థాన్, మరోవైపు సౌదీ అరేబియాతో ఉన్న రక్షణ భాగస్వామ్యాన్ని కూడా కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.గత ఏడాది కుదిరిన రక్షణ ఒప్పందం ప్రకారం వేలాది మంది పాకిస్థాన్ సైనికులు ప్రస్తుతం సౌదీ అరేబియాలో విధులు నిర్వహిస్తున్నారు. యుద్ధం మరింత విస్తరించి సౌదీపై దాడులు తీవ్రతరమైతే.. పాకిస్థాన్ తటస్థంగా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి "సౌదీపై దాడి అంటే పాకిస్థాన్‌పైనే దాడిగా పరిగణిస్తాం. అదే మా రెడ్‌లైన్" అని రాయిటర్స్‌కు చెప్పడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.మరోవైపు ఎర్ర సముద్రంలో హౌతీలు నౌకలపై దాడులు ప్రారంభిస్తే.. ప్రపంచ వాణిజ్యంతో పాటు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో అంతరాయాల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు.. ఎర్ర సముద్ర మార్గం కూడా దెబ్బతింటే ఇంధన దిగుమతులు, సరకు రవాణా మరింత సంక్షోభంలో పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం పరిస్థితి పూర్తిస్థాయి ఘర్షణకు దారితీయకపోయినా, ఇరాన్, హౌతీలు, అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్థాన్‌ల ప్రయోజనాలు ఒకే వేదికపై ఢీకొనే పరిస్థితి ఏర్పడుతోంది. బాబ్ అల్-మందెబ్, హర్ముజ్ జలసంధుల భద్రతపై నెలకొన్న అనిశ్చితి ప్రపంచ ఇంధన సరఫరా, సముద్ర వాణిజ్యం, ప్రాంతీయ భద్రతపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముండటంతో అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను అత్యంత నిశితంగా గమనిస్తోంది. -
సంక్షోభంతో పాకిస్తాన్ సతమతం
అంతర్గత భద్రతా సమస్యలు, ఘర్షణలు, నిరసనలు, హింస, టెర్రరిస్టు ఘటనలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవు తున్నది. బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్, ఖైబర్– పఖ్తూన్ఖ్వా ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, హింస చెలరేగాయి. ఈ అంతర్గత భద్రతా సమస్యలకు తోడు సింధు జలాలను భారత్ ఆపివేస్తుందనే భయం, దిగజారి పోతున్న ఆర్థిక వ్యవస్థ, ఇరాన్–అమెరికా యుద్ధంలో దౌత్యం విఫలమవ్వటంతో పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందాన తయారైంది. అంత్యంత కీలకమైన సీపెక్ (సీపీఈసీ; చైనా–పాకి స్తాన్ ఎకనమిక్ కారిడార్) పథకం అమలవుతున్న బలూచిస్తాన్, ఖైబర్–పఖ్తూన్ఖ్వా, పీఓకే, గిల్గిత్ ప్రాంతాలలో పౌరులు పాక్, చైనాలకు వ్యతిరేకంగా ఉద్యమించటాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తున్నది. ఈ పరిణామాలు సీపెక్ భవిష్యత్తుపైన, చైనా పాత్రపైన, కశ్మీర్ వివాదంపైన ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించవచ్చు. ఆజాద్ కశ్మీర్లో ఆజాద్ ఎంత?పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్లలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత రెండు నెలలుగా జరుగుతున్న నిరసనలు తార స్థాయికి చేరుకున్నాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఆధ్వర్యంలో రావల్కోట్, మీర్పూర్, బాగ్‌లతో సహా పలు పట్టణాలలో 38 ప్రధాన డిమాండ్లతో భారీగా నిరసన ప్రదర్శ నలు జరుగుతున్నాయి. జూలై 15న రావల్కోట్లో సైన్యం కాల్పు లలో కనీసం పదిమంది పౌరులు చనిపోయినట్లు వార్తలొచ్చాయి. ముజఫరాబాద్‌కు తలపెట్టిన లాంగ్‌మార్చ్‌ను జూలై 21కి వాయిదా వేసినా, నిరసనలు ఆగలేదు. ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలో శరణార్థులకు రిజర్వ్ చేసిన 12 సీట్ల తొలగింపు, కరెంటు ఛార్జీలు, గోధుమ పిండి ధరలతో ప్రారంభమైన నిరసనలు క్రమంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతపు స్వయంప్రతిపత్తిపై వేలెత్తి చూపుతున్నాయి. పాక్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఆజాద్ (స్వాతంత్ర) కశ్మీర్‌గా పేర్కొంటుంది. ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారత అధీనంలోని కశ్మీర్ ప్రాంత ప్రజలతో పోలిస్తే తమ ఆర్థిక స్థితిగతులు, రాజకీయ స్వాతంత్య్రం ఎంత దీనంగా ఉన్నాయో అర్థం చేసుకుంటున్నారు. రావల్కోట్లో జాక్ (జేఏఏసీ) నాయకుడు సర్దార్ అమన్‌ఖాన్ ప్రదర్శనకారులనుద్దేశించి ప్రసంగిస్తూ, ఆజాద్ కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొని పాకిస్తాన్‌ను ఈ ప్రాంతం నుండి వైదొలగాలని డిమాండ్ చేయటం కొసమెరుపు. అఫ్గానిస్తాన్‌తో అంతంతే!పాకిస్తాన్లో వైశాల్యం పరంగా 40 శాతం వాటా కల్గిన బలూచిస్తాన్ అతిపెద్ద రాష్ట్రం. ఇరాన్, అఫ్గానిస్తాన్, అరేబియా సముద్రంతో సరిహద్దులు కలిగిన ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకం. రాగి, సహజ వాయువు, బంగారం వంటి కీలకమైన వనరులు బలూచిస్తా న్లో సమృద్ధిగా లభిస్తున్నాయి. బలూచి జాతికి చెందిన ప్రజలు పాక్‌లోని బలూచిస్తాన్, ఇరాన్‌లోని సిస్తాన్ బలూచిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలో నివసిస్తున్నారు. శతాబ్దాలుగా తమ ఉనికిని, స్వాతంత్య్రాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు బలూచిస్తాన్ కలాత్ సంస్థా నంగా ఉండేది. 1948లో పాక్‌లో బలూచిస్తాన్ విలీనం వివాదా స్పద పరిస్థితులలో జరిగింది. కలాత్ రాజును ఒత్తిడి చేసి విలీన పత్రంపై సంతకం పెట్టించారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1958–59, 1963–69, 1973–77 మధ్యకాలంలో బలూచిస్తాన్‌లో పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరిగాయి. 2004 నుండి మళ్లీ బలూచిస్తా న్లో తిరుగుబాటు తీవ్రమైంది. అభివృద్ధి ఫలాలు స్థానికులకు అందకపోవటం, స్థానిక ప్రజలపై సైన్యం దమనకాండ, రాజకీయ స్వయంప్రతిపత్తి లేకపోవడం స్థానిక ప్రజల వ్యతిరేకతకు కారణం. ముఖ్యంగా బలూచి లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఇటీవల పాక్ సైన్యం, భద్రతా బలగాలపై కచ్చితత్వంతో ఒకేసారి పెక్కు పట్టణా లలో విరుచుకుపడింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏకంగా హైజాక్ చేశారు. గత వారంలో బీఎల్ఏ దాడులలో 42 మంది పాక్ సైనిక సిబ్బంది చనిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. పాక్ సైన్యపు ‘ఆపరేషన్ షాబాన్’ సత్ఫలితాలను ఇస్తున్నట్టు లేదు.పాక్–అఫ్గానిస్తాన్ సరిహద్దులలోని ఖైబర్–ఫఖ్తూన్ఖ్వాప్రాంతంలోని తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) ఉగ్రవాదులు ఏకంగా పాక్ సైనిక చెక్పోస్టులుపై దాడులు చేస్తున్నారు. వీరికి అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నదని పాక్ ఆరోపణ. దీనికి ప్రతిగా పాక్ సైన్యం అఫ్గానిస్తాన్పైన ఏకంగా వైమానిక దాడులను చేపట్టింది. అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వం ప్రతిచర్యగా పాక్‌పై డ్రోన్లతో దాడి చేసింది. పశ్తూన్ (పఠాన్) తెగకు చెందిన ప్రజలు నివసిస్తున్న ఈ ప్రాంత ప్రజలు సరిహద్దుకు ఆవల అఫ్గాన్‌లోని పశ్తూన్ ప్రాంతాలతో కలిపి గ్రేటర్ పశ్తూనిస్తాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పాక్– అఫ్గాన్లకు సరిహద్దుగా ఉన్న హిందూకుష్ పర్వతాలలోని డ్యూరాండ్ లైన్‌ను అఫ్గాన్ మొదటినుండీ అంగీకరించలేదు.తెలిసివచ్చిన తరుణం62 బిలియన్ డాలర్ల వ్యయంతో పాక్‌లో చైనా అమలు చేస్తున్న సీపెక్ పథకం కింద పాక్‌లోని ప్రస్తుత సంక్షుభిత ప్రాంతాలలో కీలకమైన రహదార్లు, విద్యుచ్ఛక్తి కేంద్రాలు, రేవు పట్టణాలు, పారి శ్రామిక కేంద్రాలు, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల నిర్మాణం జరుగుతున్నది. సీపెక్ ద్వారా పాక్ గుండా అరేబియా సముద్రంలోనికి ప్రవేశించటం చైనా వ్యూహం. గిల్గిత్ బాల్టిస్తాన్ పాక్‌ను చైనాతో కలుపుతుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఈ పథకంలో భాగంగా జీలం, నీలం నదులపై కోహ్లా, కరాత్, ఆజాద్ పఠాన్లలో భారీ జలవిద్యుచ్ఛక్తి కేంద్రాలను చైనా నిర్మిస్తున్నది. కశ్మీర్లో భాగమైన ఈ ప్రాంతాలలో సీపెక్ పథ కాన్ని భారత్ వ్యతిరేకించింది. సీపెక్ రహదారికి గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రవేశ ద్వారమైతే, బలూచిస్తాన్‌లోని గ్వాదర్ రేవు పట్టణం నిష్క్రమణ స్థానం (ఎగ్జిట్ పాయింట్). గ్వాదర్‌లో భారీ డీప్ వాటర్ పోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం చైనా నిర్మిస్తున్నది. బలూచిస్తాన్‌లో సంక్షోభం సీపెక్ పథకానికి ప్రతికూలం. ఇది భారత్‌కు కలిసివచ్చే అంశం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో సంక్షోభం భారత అధీనంలోని కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన, అణచి వేత జరుగుతున్నదనే పాక్ వాదనలో డొల్లతనాన్ని బయటపెడు తున్నది. పాక్ అధీనంలోని కశ్మీర్లో ఆదర్శప్రాయమైన పాలన జరు గుతున్నదనే ప్రచారానికి ఈ నిరసనలు చెక్ పెడుతున్నాయి. అమె రికా, ఐరోపాలలోని పాశ్చాత్య మీడియా సంస్థలు ఇప్పటివరకు కశ్మీర్‌పై కొనసాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి భారత్‌కు ఇది సువర్ణావకాశం. బలూచిస్తాన్, పీఓకే, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలలో సంక్షోభానికి భారత్ కారణమని పాక్ ఆరోపిస్తున్నది. ఈ పరిణా మాల నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. అంతర్గతంగా సమస్యలను ఎదుర్కొన్నప్పుడల్లా పాక్ భారత్‌లో ఏదో ఒక ఉగ్ర చర్యకు పాల్పడి దృష్టిని మరల్చి ప్రజలను తమ వైపునకు తిప్పు కోవటానికి ప్రయత్నిస్తుంటుంది.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
యూనిఫాం తీసేసి రాజకీయాల్లోకి రండి.. అసిమ్ మునీర్‌కు రెహమాన్ సవాల్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌పై ఆ దేశ ప్రముఖ రాజకీయ నాయకుడు, జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఫజల్) అధినేత మౌలానా ఫజలుర్ రెహమాన్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో పాత్ర పోషించాలనుకుంటే సైన్యానికి రాజీనామా చేసి రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు.జూలై 12న జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన రెహమాన్.. రాజకీయ వ్యవహారాల్లో సైన్యం జోక్యం పెరుగుతోందని ఆరోపించారు. రక్షణ, భద్రతా అంశాలకు మాత్రమే పరిమితం కావాల్సిన సైన్యం, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు. రాజకీయాలు చేయాలనుకుంటే యూనిఫాం తీసేసి రాజకీయాల్లోకి రండి. ఎన్నికల్లో పోటీ చేయండి. అప్పుడు ప్రజలు యూనిఫాంలో ఉన్న వ్యక్తికి ఎన్ని ఓట్లు ఇస్తారో తెలుస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు.దేశంలో ఎవరు అధికారంలోకి రావాలి, ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి లేదా ఎవరు పదవి నుంచి దిగిపోవాలి అనేది నిర్ణయించడం సైన్యం పని కాదని రెహమాన్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటి నిర్ణయాలు ప్రజలే తీసుకోవాలని ఆయన అన్నారు.పాకిస్థాన్‌లో సైన్యం ప్రభావం క్రమంగా పెరుగుతోందని, ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కంటే ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన విమర్శించారు.దేశంలో జనాభా పెరుగుదల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీలో అసిమ్ మునీర్‌ను చేర్చిన ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా రెహమాన్ తప్పుబట్టారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సాధారణ పౌరులు మిలీషియాలను ఏర్పాటు చేసుకోవాలని లేదా ఆయుధాలు చేపట్టాలని వస్తున్న సూచనలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ భద్రతను కాపాడడం పూర్తిగా ప్రభుత్వం, సాయుధ దళాల బాధ్యతేనని, ఆ పని కోసమే వారికి వేతనాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.దేశ రక్షణ కోసం సైనికులు విధులు నిర్వర్తిస్తారు. అందుకు వారికి జీతాలు ఇస్తున్నారు. ప్రజలను ఆయుధాలు పట్టమని చెప్పడం సరైన విధానం కాదు. నేను ఎలాంటి మిలీషియాను ఏర్పాటు చేయను’అని ఆయన స్పష్టం చేశారు. పౌరులకు ఆయుధాలు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో వ్యక్తిగత కక్షలు, హింస, రక్తపాతం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించిన రెహమాన్, అలాంటి చర్యలు దేశ భద్రతకు మరింత ముప్పు తెస్తాయని అన్నారు.ఈ సందర్భంగా బలూచిస్థాన్‌లోని భద్రతా పరిస్థితిపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ మెజారిటీ ప్రాంతాల్లో పాకిస్థాన్ ప్రభుత్వ నియంత్రణ బలహీనపడిందని, ఇప్పుడు హింస పష్తూన్ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోందని పేర్కొన్నారు. -
పాకిస్తాన్ గుండెల్లో గుబులు!.. పీవోకేలో పరిస్థితి అదుపు తప్పుతోందా?
పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. స్థానిక సమస్యలు, రాజకీయ హక్కులు, పాలనా విధానాలపై అసంతృప్తితో జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు చేపట్టిన భారీ మార్చ్‌ను అడ్డుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.ఈ సందర్భంగా ఆందోళనకారుల కదలికలను నియంత్రించేందుకు సుమారు నాలుగు వేల మంది పాకిస్తాన్ రేంజర్స్‌ను మోహరించినట్లు సమాచారం. ప్రధాన రహదారులపై భద్రతను పెంచడం, కొన్ని ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించడం, నిరసనలను అడ్డుకునేందుకు పోలీసు బలగాలను రంగంలోకి దించడం వంటి చర్యలు చేపట్టారు. అలాగే, మీడియాపై కూడా నిషేధం విధించారు. దీంతో, అక్కడే ఏం జరుగుతుందన్న ఆందోళన నెలకొంది.అయితే, ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న JAAC గత కొంతకాలంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజా సమస్యలను ప్రస్తావిస్తోంది. ముఖ్యంగా రాజకీయ ప్రాతినిధ్యం, పరిపాలనలో స్థానికులకు ఎక్కువ పాత్ర, ఆర్థిక సమస్యలు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు వంటి అంశాలపై కమిటీ ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ నిరసనల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో ఒకటి పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలో పాకిస్తాన్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థులకు కేటాయించిన 12 స్థానాలు. ఈ స్థానాలు స్థానిక ప్రజల రాజకీయ హక్కులను ప్రభావితం చేస్తున్నాయని JAAC ఆరోపిస్తోంది. ఈ రిజర్వు స్థానాల వ్యవస్థలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తోంది.అయితే ఆందోళనలు శాంతియుతంగా కొనసాగకముందే పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్ల దాడులు, నిరసనలు, బలగాల ప్రతిస్పందనతో పరిస్థితి అదుపు తప్పినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఘర్షణల్లో ప్రాణనష్టం కూడా జరిగినట్లు సమాచారం. పాక్ ప్రభుత్వం మాత్రం శాంతిభద్రతల పరిరక్షణ కోసమే భద్రతను పెంచినట్లు చెబుతోంది. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు ఆందోళనకారులు మాత్రం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.ముజఫరాబాద్ వైపు సాగుతున్న ఈ మార్చ్ ఇప్పుడు కేవలం స్థానిక నిరసనగా కాకుండా పాక్ ఆక్రమిత కశ్మీర్లో పెరుగుతున్న ప్రజా అసంతృప్తికి సంకేతంగా మారింది. ఇస్లామాబాద్ ప్రభుత్వం దీనిని ఎలా ఎదుర్కొంటుంది? నిరసనకారులతో చర్చలకు దిగుతుందా? లేక కఠిన చర్యలకే పరిమితం అవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక, పాక్ ఆక్రమిత కశ్మీర్లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజా డిమాండ్లు, ప్రభుత్వ నియంత్రణ చర్యలు, భద్రతా బలగాల మోహరింపు మధ్య ఈ ప్రాంతంలో పరిస్థితులు మరింత సున్నితంగా మారాయి. -
POK.. ఆజాద్ కాదు.. ఆక్రమిత కశ్మీర్.. భగ్గుమన్న పాకిస్థాన్
ఇస్లామాబాద్: తాను తీసిన గొయ్యిలో తానే పడుతాడు అని సొమెత మన వాడుక భాషలో బాగ వాడుతుంటాం.. ఈ పదం ఇప్పుడు పాకిస్థాన్‌కు సరిగ్గా సరిపోతుంది. భారత్‌పై దురాక్రమణ చేసి భూమిని స్వాధీనం చేసుకొని దానిని ఆజాద్ కశ్మీర్ అంటూ తప్పుడు ప్రచారాలు చేసిన పాక్ ఇప్పుడు ఆప్రాంత ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తోంది. పీవోకేలో జరుగుతున్న నిరసనలను నియంత్రించడం ఇప్పుడు ఆ దేశానికి తలకు మించిన పనిగా మారింది. దీంతో వారిని కంట్రోల్ చేయలేక ఆ దేశం తలపట్టుకుంటుంది."పాక్ ఆక్రమిత కశ్మీర్" ఈ పేరు వింటే చాలు ప్రతి భారతీయుని గుండె రగులుతుంది. మన దేశానికి ఏ విధంగా సరితూగని దాయాది పాకిస్థాన్... అక్రమణ జరిపి తన దేశ నియంత్రణలో ఉంచుకున్న ప్రాంతం ఇది.. ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత్‌కు అంత కష్టమైన పని కాకపోయినా అంతర్జాతీయ ఒత్తిడి దృష్ట్యా మౌనంగా ఉండాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం ప్రజలే ఆ దేశానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు.పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఇటీవల జరిగిన నిరసనలు తీవ్ర ఆందోళనలను కలిగిస్తున్నాయి. అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేకతతో నిరసనలు చేస్తున్న ప్రజలపై అధికారులు ఇష్టారీతిన కాల్పులు జరిపారు. ఈ ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల తిరుగుబాటును అణిచివేయడం ఇప్పుడు ఆ దేశానికి పెద్దసమస్యగా మారింది. గత 78 ఏళ్లుగా ఇది ఆజాద్ కశ్మీర్ అని పాకిస్థాన్ చెబుతోందని కానీ ఇది ఆజాద్ కశ్మీర్ కాదని ఆక్రమిత కశ్మీర్ అని అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భారత చెప్పింది అదే..!PoKలో జరిగిన నిరసనలకు సంబంధించిన అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అందుకు సంబంధించిన ఒక వీడియోలో JAAC నాయకుడు మాట్లాడుతూ "గత 78 సంవత్సరాలుగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌ను 'ఆజాద్ కాశ్మీర్' అని పిలుస్తోంది. కానీ ఇప్పుడు 80,000 మందికి పైగా హాజరైన ఒక ర్యాలీలో PoK ప్రజలు ఈ వాదనను సవాలు చేశారు. కశ్మీర్ వివాదాస్పద భూభాగం కాదు. అది ఆక్రమిత భూభాగం. దానికి ఎన్నడూ స్వాతంత్ర్యం లేదు. గత 78 ఏళ్లుగా భారత్ ఇదే చెబుతుండగా, పాకిస్థాన్ దానిని ప్రచారం అని కొట్టిపారేస్తోంది. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలే తమ ర్యాలీలలో అదే విషయాన్ని చెబుతున్నారు. అని వీడియోలో మాట్లాడుతున్నారు.ప్రస్తుతం జరుగుతున్న రావల్ కోట్ ర్యాలీలో 80 వేల మందికి పైగా పాల్గొన్నారు. మరి ఈ విషయంపై పాక్ ఏం చేస్తోంది. ఈ ఎనబై వేల మందిని సైతం భారత్ పంపిందని ప్రచారం చేస్తోందా అని అక్కడి నాయకులు నిలదీశారు. ఈ నిరసనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. PoKలోని ప్రజల ఆగ్రహం ఆకస్మికంగా తలెత్తినది కాదని, ఇది పాకిస్తాన్ సంవత్సరాలుగా సాగిస్తున్న దోపిడీ, హక్కుల ఉల్లంఘనలు, అక్రమ ఆక్రమణల ఫలితమేనని తెలిపింది.Pakistan has spent 78 years calling PoJK "Azad Kashmir." 🇮🇳The people of PoJK just corrected that in front of 80,000 people.JAAC leader Sardar Aman Khan said it straight."Kashmir is not disputed territory. It is occupied territory. And it was never truly Azad."India has… pic.twitter.com/jb50aHVSQE— Aviator Anil Chopra (@Chopsyturvey) July 15, 2026 -
PoKలో రక్తపాతం.. పాక్ ఆర్మీ కాల్పులు
-
పీవోకేలో పాక్ ఆర్మీ కాల్పులు.. ఆరుగురు మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రావాలాకోట్లోని న్యూ బస్ టెర్మినల్ సమీపంలో సాధారణ ప్రజలపై అక్కడి భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. ఇస్లామాబాద్ (పాకిస్తాన్ ప్రభుత్వం)పై స్థానికుల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత ఒక్కసారిగా పెరిగాయి. పీవోకే ప్రజలు పాక్‌కు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు.వైట్‌హౌస్ ఎదుట నిరసనకాగా ఇటీవలే అమెరికాలో ఉన్న పీవోకే ప్రజలు వాషింగ్టన్లో ఉన్న వైట్ హౌస్ వెలుపల నిరసన కార్యక్రమం చేపట్టారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో పెద్దఎత్తున హింసచేలరేగుతందని పాకిస్థాన్ ఆ ప్రాంతంలో మానవహక్కులని కాల రాస్తుందని ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం పీవోకేలో జరుగుతున్న మానవతా సంక్షోభంపై దృష్టి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. PoK లోని పౌర నివాస ప్రాంతాల నుండి పాకిస్తాన్ సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, నిరాయుధులైన పౌరులపై ప్రాణాంతక బలగాలను ప్రయోగించడాన్ని అంతర్జాతీయ సమాజం అడ్డుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇంతలోనే మరోసారి ప్రాంతంలోకాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. భారత్ సహాయం చేయాలిదాదాపు 40 లక్షల మంది ప్రజలను బాహ్య ప్రపంచానికి దూరం చేస్తూ పాక్ ప్రభుత్వం అక్కడ సుదీర్ఘకాలంగా ఇంటర్నెట్ను నిలిపివేసిందని నిరసనకారులు ఆరోపించారు. స్థానిక ప్రజల ప్రాణాలను కాపాడటానికి, మానవతా సహాయాన్ని అందించడానికి భారతదేశం జోక్యం చేసుకోవాలని వారు ఒక అసాధారణ విజ్ఞప్తి చేశారు. బాధితులకు అవసరమైన సాయం అందేలా పూంచ్, డోడా సెక్టార్ల ద్వారా నియంత్రణ రేఖను తెరవాలని డిమాండ్ చేశారు.పేదరికంతో సతమతమవుతున్న ప్రజలుతాజా ఘర్షణల పక్కన పెడితే, అక్కడి ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు పలు నివేదికలు తెలిపాయి.'నేచర్'జర్నల్ 2025 నాటి అధ్యయనం ప్రకారం, ఇక్కడి జనాభాలో 66% మంది వ్యవసాయం, పశుపోషణపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయినప్పటికీ 57% కంటే ఎక్కువ కుటుంబాలు ఆహార భద్రత లేకుండా నివసిస్తున్నాయి. దాదాపు 29% మంది ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు (పాకిస్తాన్ జాతీయ సగటు 19.9% కంటే ఇది చాలా ఎక్కువ). పర్వత ప్రాంతాలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది, అక్కడ 90% కుటుంబాలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. -
అక్తర్, ఆసిఫ్ భారత్‌కు డ్రగ్స్ తెచ్చారు..!
పాకిస్తాన్ మాజీ పేసర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్‌పై భారత మాజీ కేంద్ర హోంశాఖ అధికారి ఆర్వీఎస్ మణి సంచలన ఆరోపణలు చేశారు. భారత్‌లో పర్యటించిన సమయంలో అక్తర్, ఆసిఫ్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ బాంబు పేల్చారు.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. "భారత్‌లో క్రికెట్ ఆడేందుకు వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్ బృందంలోని కొందరు డ్రగ్స్‌ను అక్రమంగా తీసుకొచ్చేవారు. షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్ భారత్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పాకిస్తాన్ హైకమిషనర్ ఎదుట ఒప్పుకున్నారు. ఆ తర్వాత వారిని వెనక్కి పంపించారు" అని అన్నారు.మాజీ పాక్ కోచ్ బాబ్ వూల్మర్ మరణాన్ని కూడా ఈ వ్యవహారంతో ముడిపెట్టారు ఆర్వీఎస్ మణి. పాకిస్తాన్ జట్టులో జరుగుతున్న డ్రగ్ స్మగ్లింగ్ విషయాన్ని బయటపెట్టాలని వూల్మర్ ప్రయత్నించారని, అందుకే ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని ఆరోపించారు.మణి చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం క్రికెట్ సర్క్సిల్స్లో దుమారం రేపుతున్నాయి. మణి 2006 నుంచి 2010 వరకు కేంద్ర హోంశాఖ అంతర్గత భద్రత విభాగంలో అండర్ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం 2013లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌ల విషయానికొస్తే.. 2003-04 నుంచి 2007 వరకు ఇరు దేశాల మధ్య పరస్పర సిరీస్‌లు జరిగాయి. అయితే 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత ఈ సిరీస్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ జట్లు ఐసీసీ లేదా ఏసీసీ టోర్నమెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. -
బంగ్లాదేశ్‌లో మాజీ దౌత్యవేత్తను వణికించిన భారత ఆడపులి
ఢాకా: దేశం కాని దేశంలో, విదేశీ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా భారత్ ప్రతిష్ఠను నిలబెట్టిన భారతీయ దౌత్యవేత్త పూజా కుమారి ఝా ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. దక్షిణాసియా మ్యాప్‌లో జమ్మూ కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపించడాన్ని ఆమె వెంటనే తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సరిదిద్దాలని కోరారు. ఆమె సమయస్ఫూర్తి, ధైర్యం సభలో ఉన్నవారి దృష్టిని ఆకర్షించింది.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ‘సార్క్ పునరుద్ధరణ - ప్రాంతీయ సమగ్రత’ అనే అంశంపై ఉన్నత స్థాయి విదేశాంగ విధాన సెమినార్ నిర్వహించారు. ఢాకాలోని బంగ్లాదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ (BIISS) ఆడిటోరియంలో జరిగిన ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, నిపుణులు పాల్గొన్నారు.సదస్సులో బంగ్లాదేశ్ మాజీ దౌత్యవేత్త అహ్మద్ తారిఖ్ కరీం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుండగా, స్క్రీన్‌పై ప్రదర్శించిన దక్షిణాసియా మ్యాప్‌లో జమ్మూ కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపించారు. దీనిని గమనించిన భారత హైకమిషన్ సెకండ్ సెక్రటరీ పూజా కుమారి ఝా వెంటనే జోక్యం చేసుకుని, ఆ మ్యాప్ వాస్తవాలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు.దీనికి స్పందించిన తారిఖ్ కరీం.. మీరు భారత్ నుంచి వచ్చారా? అని ప్రశ్నించగా.. నేను పూజా కుమారి ఝా భారత హైకమిషన్‌లో సెకండ్ సెక్రటరీ అని ఆమె తనను పరిచయం చేసుకున్నారు. అనంతరం తారిఖ్ కరీం.. మీ అభ్యంతరాన్ని నమోదు చేసుకున్నాను’ అని పేర్కొంటూ తన ప్రజెంటేషన్‌ను కొనసాగించారు.ఎవరీ పూజా కుమారి ఝా?జాతీయ మీడియా కథనాల ప్రకారం.. పూజా కుమారి ఝా 2022 బ్యాచ్‌కు చెందిన భారత విదేశాంగ సేవ అధికారిణి. ప్రస్తుతం ఢాకాలోని భారత హైకమిషన్‌లో రాజకీయ, సమాచార విభాగంలో సెకండ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె 2021 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 82వ ర్యాంకు సాధించారు. కేవలం 25 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించడం విశేషం.పూజా బీహార్ రాష్ట్రంలోని సీతామఢీ జిల్లా పురన్హియా గ్రామానికి చెందినవారు. అనంతరం ఆమె కుటుంబం ఢిల్లీకి వలస వెళ్లింది. ఆమె తండ్రి గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆఫీస్ హెల్పర్‌గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. పూజా కుటుంబంలో ఐదో కుమార్తె.ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రైవేట్ పాఠశాల నుంచి మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆమె విద్యను కొనసాగించారు. ఆమె పెరిగిన సమాజంలో ఆడపిల్లల కంటే మగపిల్లలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. అలాంటి పరిస్థితులను మార్చడానికి చదువే మార్గమని పూజా, ఆమె సోదరీమణులు నమ్మారు.ఒకప్పుడు ఆమె తండ్రి, నువ్వు ఐఏఎస్ అధికారిణి అవుతావు గానీ, బాలీవుడ్ నటి కాలేవు. పెద్ద కలలు కనకు అని చెప్పేవారని పూజా ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. అయితే తన కృషి, పట్టుదలతో ఆమె ఆ మాటలను తప్పు అని నిరూపించారు.నేడు అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, దేశ ప్రయోజనాలను ధైర్యంగా వినిపిస్తున్న పూజా కుమారి ఝా అనేక మంది యువతులకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. India’s Second Secretary at the Indian High Commission in Dhaka, Puja Jha, raised an immediate objection after a map shown during a foreign policy seminar in Bangladesh depicted Jammu & Kashmir as part of Pakistan.She stated that Jammu & Kashmir is an integral and inalienable… pic.twitter.com/a4b2IV8ZhA— Aditya Raj Kaul (@AdityaRajKaul) July 10, 2026 -
‘పాక్’తో లింకులు.. బిహార్ యువకుడి అరెస్ట్!
కతిహార్: బిహార్‌లోని కతిహార్ జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అహద్గా అధికారులు గుర్తించారు.కతిహార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) పరిచయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద ముఠాతో అహద్‌కు సంబంధాలు ఉన్నాయనే నిర్దిష్ట సమాచారం మేరకు భద్రతా సిబ్బంది సోమవారం అతడిని అదుపులోకి తీసుకుని, విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను సాంకేతికంగా విశ్లేషించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టి ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధమున్న రాణా హసీన్ అనే వ్యక్తితో నిందితుడు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు విచారణలో తేలింది.దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన చాటింగ్‌లు చేయడం, ఆడియో కాల్స్ మాట్లాడటం, దేశంలోని సున్నితమైన ప్రాంతాల సమాచారాన్ని చేరవేయడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో భారతదేశానికి వ్యతిరేకంగా, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్‌ను వ్యాప్తి చేస్తూ, పాకిస్తాన్ వాట్సాప్ ఛానళ్ల లింకులను ఇతరులకు షేర్ చేస్తూ దేశంలో ఉగ్ర నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇతర కేంద్ర భద్రతా సంస్థల సహాయంతో విచారణ జరుపుతున్నారు. -
ఢిల్లీని కమ్మేసిన పాక్ ధూళి
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో పాటు అఫ్గానిస్తాన్, ఇరాన్ దేశాల్లో సంభవించిన ధూళి తుఫానుల ప్రభావం దేశ రాజధాని ఢిల్లీపై తీవ్రంగా పడింది. ధూళి తుపానుల వల్ల ఎగసిన ఖనిజ ధూళి కణాలు బలమైన గాలులతో సరిహద్దులు దాటి వాయువ్య భారతాన్ని, ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతాన్ని కమ్మేశాయి. దాదాపు మూడేళ్ల తర్వాత మొదటిసారిగా అత్యంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకున్నామన్న ఢిల్లీ ప్రజల సంతోషం మూడు రోజుల ముచ్చటే అయ్యింది. ఈనెల 9వ తేదీ నాటికి రికార్డు స్థాయిలో 48గా నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఆదివారం నాటికి ఒక్కసారిగా 261కి పెరిగింది. గత 85 రోజుల్లో ఇంతటి కనిష్ట స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. గత వారంలో ఏక్యూఐ పరిశీలిస్తే గురువారం 48, శుక్రవారం 65, శనివారం 140గా నమోదైంది. ఆదివారం నాటికి ఒక్కసారిగా 261కి పెరిగిపోయింది. ఢిల్లీలోని కొన్ని ప్రత్యేక మానిటరింగ్ స్టేషన్లలో కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆనంద్ విహార్‌లో 449, జహంగీర్‌పురిలో 344 ఏక్యూఐ నమోదైంది. ఢిల్లీలో వాయు నాణ్యత అకస్మాత్తుగా పడిపోవడంపై కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఉపసంఘం ఆదివారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమై, కారణాలను సమీక్షించింది. క్షేత్రస్థాయిలో ధూళి నియంత్రణ చర్యలను మరింత ఉధృతం చేయాలని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీని ఆదేశించింది. రాబోయే కొద్ది రోజుల్లో వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉన్నందున, గాలి వేగం పెరిగితే తప్ప ఈ కాలుష్య కణాలు అంత త్వరగా వీడిపోవని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
పాక్ కంపెనీలో జాబ్.. రూ.2 కోట్ల ప్యాకేజీ!
కరాచీకి చెందిన ఒక కంపెనీ నుంచి తనకు మంచి జీతంతో కూడిన జాబ్ ఆఫర్ వచ్చిందని పేర్కొంటూ 21 ఏళ్ల టెకీ ఆదిత్య పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఆన్లైన్లో చర్చనీయాంశమైంది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో కొంతమంది ఆసక్తిగా స్పందించగా, మరికొందరు ఇది కేవలం సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ కోసం చేసిన ప్రయత్నమా?.. అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.ఆదిత్య షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ కంపెనీ తనకు సంవత్సరానికి 1.8 లక్షల నుంచి 2.2 లక్షల డాలర్ల వరకు బేస్ శాలరీ ఆఫర్ చేసిందని తెలిపాడు. భారత కరెన్సీలో ఈ వేతనం దాదాపు రూ.2 కోట్లు. కంపెనీ హెడ్ క్వార్టర్ కరాచీలో ఉన్నప్పటికీ, ఎక్కువ మంది ఉద్యోగులు యూకే టైమ్ జోన్ ప్రకారం పనిచేస్తారని ఆఫర్ వివరాల్లో ఉన్నట్లు వెల్లడించాడు.just received an onsite offer from a Karachi-based company.$180-220k base, visa sponsored, and the team operates in the UK timezone. should I go for it? pic.twitter.com/lCa8NdQVXF— aditya (@adxtyahq) July 12, 2026తనకు వచ్చిన ఈ ఆఫర్‌ను అంగీకరించి అక్కడికి వెళ్లాలా?, వద్దా? అని తన ఫాలోవర్లను అడుగుతూ ఆదిత్య తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు.ఈ పోస్ట్ అతి తక్కువ సమయంలోనే వైరల్ అయింది. ఈ పోస్టును చూసినవారిలో.. కొంతమంది నిజంగానే ఇది మంచి కెరీర్ అవకాశం కావచ్చని చెప్పారు. మరికొందరు మాత్రం ఆ ఆఫర్ నిజమా, కాదా? అనే సందేహాలు వ్యక్తం చేశారు. ఇంకొంతమంది ఇలాంటి పోస్టులు కేవలం ఎక్కువ లైక్‌లు, కామెంట్లు, వ్యూస్ కోసం చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అవకాశాలను అంగీకరించే ముందు కంపెనీ వివరాలు, ఉద్యోగ నిజమైనదా కాదా అనే విషయాలను పూర్తిగా పరిశీలించాలని సూచించారు. -
ఇషాన్ కిషన్ గొప్ప మనసు
భారత వికెట్‌కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన మానవత్వాన్ని చాటుతూ పాకిస్థాన్‌కు చెందిన ప్రత్యేక అవసరాలున్న (శారీరక వైకల్యం) ఓ అభిమానికి మరపురాని అనుభూతిని అందించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్‌కు ముందు చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.VIDEO OF THE DAY.....!!!! ❤️ - Ishan Kishan specially came over to meet a Pakistan fan. A lovely gesture. 👏 pic.twitter.com/xwjPxiX3dz— Sheri. (@CallMeSheri1_) July 12, 2026మ్యాచ్‌కు ముందు వార్మప్‌కు వెళ్లే క్రమంలో స్టేడియంలో ఉన్న సదరు అభిమానిని గమనించిన ఇషాన్ కిషన్ స్వయంగా అతడి వద్దకు వెళ్లాడు. అతడితో చేతులు కలిపి, చిరునవ్వుతో పలకరిస్తూ కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడాడు. ఈ అనూహ్యమైన ఆత్మీయతతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. నెటిజన్లు ఇషాన్ మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. దేశాల మధ్య విభేదాలను పక్కకు పెట్టి మంచి మనసు చాటుకున్నాడని అంటున్నారు.ఇదిలా ఉంటే, ఐదో టీ20లోనూ టీమిండియాకు ఇంగ్లండ్ చేతిలో భంగపాటే ఎదురైంది. ఈ ఓటమితో భారత జట్టు 0-4 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమై, 56 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇంగ్లండ్ తరఫున జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ (56), తిలక్ వర్మ (53) అర్ద సెంచరీలతో రాణించారు. -
ఉగ్ర నెట్ వర్క్ పై ATS నిఘా
-
పాకిస్తాన్ సరికొత్త కామెడీ షో.. మాది హిందూ సంస్కృతి!
-
కార్గో విమానం అదృశ్యం : సముద్రంలో కూలిపోయిందనే ఆందోళన
షార్జా నుండి కరాచీ వెళ్తున్న కె2 ఎయిర్వేస్ (K2 Airways) కు చెందిన బోయింగ్ 737 కార్గో విమానం (KTA1732) అదృశ్యమైంది. అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా కరాచీ సమీపంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఈ విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. నావిగేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ సమాచారం ఇచ్చిన కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది సముద్రంలో కూలిపోయి ఉండవచ్చని ఫ్లైట్రాడార్24 భావిస్తోంది. అయితే పాకిస్తాన్ అధికారులు దీనిని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (PAA) తీర ప్రాంతంలో గాలింపు , రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసింది.ఏమి జరిగింది?పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్తాన్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9:18 గంటలకు విమానంలోని నావిగేషన్ సిస్టమ్‌లో సమస్య ఉన్నట్లు పైలట్ నివేదించారు. ఆ తర్వాత రాత్రి 9:21 గంటల సమయంలో విమానం ఒక్కసారిగా ఎత్తు కోల్పోతూ, వేగంగా దిశ మార్చుకున్నట్లు రాడార్‌లో కనిపించింది. కరాచీకి పశ్చిమంగా 155 నాటికల్ మైళ్ల దూరంలో విమానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.భయంకరమైన వేగంతో కిందకు పడిపోయింది.ఇదీ చదవండి: కేతన్ హత్యకు నాలుగు నెలలముందే.. సీక్రెట్ మ్యారేజ్ఫ్లైట్రాడార్24 (Flightradar24) డేటా ప్రకారం, విమానం నుండి చివరి సిగ్నల్ వచ్చేసరికి అది సముద్ర మట్టానికి కేవలం 1,100 అడుగుల ఎత్తులో ఉంది. అంతేకాదు, అది నిమిషానికి 22,400 అడుగుల అత్యంత వేగంతో కిందకు దూసుకుయింది. అదృశ్యమైన ఈ బోయింగ్ 737-400 విమానం 1999 నాటిది. మొదట ప్రయాణీకుల విమానంగా పనిచేసి, 2012లో కార్గో విమానంగా మారింది. 2024లోనే ఇది కె2 ఎయిర్వేస్ సంస్థలో చేరింది.ఇదీ చదవండి: 42 ఏళ్ల నాటి అమ్మ దుప్పట్టా : కొత్త పెళ్లికూతురు అన్షులా ఎమోషనల్ -
నీళ్లు ఇవ్వకపోతే..యుద్ధమే : రంకెలేస్తున్న పాకిస్థాన్
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని (IWT) పక్కనబెట్టాలన్న భారతదేశం నిర్ణయం పాకిస్తాన్‌ను ఒక రేంజ్లో వణికిస్తోంది. ఈ నేపథ్యంలోనే సింధూ జలాలను ఆపితే యుద్ధమే అంటూ పాక్ కొత్త హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ పౌర ప్రభుత్వంతో పాటు అక్కడి సైన్యం కూడా తమ దేశానికి దక్కాల్సిన నీటి వాటా కోసం అవసరమైన అన్ని తీసుకుంటామని ప్రకటించడం కలకలం రేపింది.పాక్ సైనిక దళాల అధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ అధ్యక్షతన 276వ కోర్ కమాండర్ల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో సింధూ జలాల వివాదంపై పాక్ సైన్యం కీలక నిర్ణయాలు ప్రకటించింది. సైనిక కమాండర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రకటించింది. 2025 ఏప్రిల్ 24 నాటి నేషనల్ సెక్యూరిటీ కమిటీ (NSC) ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామని పునరుద్ఘాటించింది .అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన సింధూ నదీ జలాల వాటాను దక్కించు కునేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆర్మీ స్పష్టం చేసింది. తమ ప్రభుత్వ ఆదేశాలు, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సింధూ జలాల హక్కుల కోసం పోరాడుతామని సైన్యం వెల్లడించింది. గతేడాది 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతి చర్యగా 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని (Indus Water Treaty) భారతదేశం నిలిపివేసింది (Abeyance లో పెట్టింది). దీంతో పాకిస్తాన్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలోనే పాక్ సైన్యం, మంత్రులు భారత్‌పై అక్కసు వెళ్లగక్కడంతోపాటు, వార్ వార్నింగ్‌లివ్వడం శోచనీయం.పాకిస్తాన్ NSC మార్గదర్శకాలు ఏమిటి?నీటిని ఆపడం లేదా మళ్లించడం వంటి ఏ చర్యకైనా పాల్పడితే దానిని "యుద్ధ చర్య" (Act of War)గా పరిగణించాలని పాకిస్తాన్ NSC గతంలోనే నిర్ణయించింది. ఆఫ్ఘన్ తాలిబాన్ పాలనలో ఉన్న భూభాగాన్ని ఉపయోగించుకుని పాకిస్తాన్‌పై దాడులు చేస్తున్న ఉగ్రవాద సంస్థలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వారిపై 'ఆపరేషన్ గజబ్-లిల్-హక్' కింద పోరాడుతామని తెలిపింది. అలాగే కాశ్మీరీలకు తమ దౌత్య, రాజకీయ, నైతిక మద్దతు ఎప్పటికీ ఉంటుందని పేర్కొంది.బిలావల్ భుట్టో జర్దారీ హెచ్చరిక వైరల్పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఒక వీడియో వైరల్ అవుతోంది. సింధు నదీ జలాల ఒప్పందంపై రాజీ పడే ప్రసక్తి లేదు. భారత్ ఈ జలాలను ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఇందుకోసం భారతదేశంతో యుద్ధం చేయాల్సి వస్తే, అన్ని రంగాలలో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము."పాకిస్తాన్ శాశ్వతంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంతవరకు ఈ సింధు జలాల ఒప్పందం నిలిపివేతలోనే ఉంటుందని భారతదేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.సరిహద్దుల్లో శత్రుత్వం కొనసాగుతు న్నప్పుడు ద్వైపాక్షిక ఒప్పందాలు మామూలుగా సాగవని, భూమిపై ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ఒప్పందాలు నడుస్తాయని భారత్ స్పష్టం చేసింది.సింధు జలాలు- పాకిస్తాన్ 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, సట్లెజ్, బియాస్ జలాలు భారత్‌కు.. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలు పాకిస్తాన్‌కు దక్కాలి. అయితే సాధారణంగా వర్షాకాలంలో వరద హెచ్చరికల సమాచారాన్ని భారత్ పాకిస్తాన్‌తో పంచుకునేది. కానీ ఒప్పందం నిలిపివేయడంతో భారత్ ఆ సమాచారాన్ని పంచు కోవాల్సిన అవసరం ఉండదు.భారత్ ప్రాజెక్టులు: సింధు బేసిన్లో సావల్‌కోట్, రట్లే, బుర్సార్, పకాల్ దుల్, క్వార్, కిరు, కీర్తాయ్ వంటి పలు జలవిద్యుత్ ప్రాజెక్టులను భారత్ వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. పాక్ వ్యవసాయం అతలాకుతలం: పాకిస్తాన్ వ్యవసాయ రంగంలో దాదాపు 80-90 శాతం ఈ సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని ప్రధాన జలాశయాలైన తర్బెలా, మంగ్లా డ్యామ్‌లలో నీటి నిల్వలు దాదాపు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి.దీంతో తమ అత్యంత బలహీనమైన పాయింట్‌ను భారత్ టార్గెట్ చేయడంతో పాకిస్తాన్ తీవ్ర భయాందోళనకు గురవుతోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లడానికి పాక్ రాయబారులను పంపడం, ఐక్యరాజ్యసమితికి లేఖలు రాయడం, చట్టపరమైన చర్యలకు దిగడం వంటి ప్రయత్నాలు చేస్తోంది.ఇదీ చదవండి: కేతన్ హత్యకు నాలుగు నెలలముందే.. సీక్రెట్ మ్యారేజ్ -
అందుకే పాక్ ఆ పరిస్థితిలో ఉంది: భారత్
ఢిల్లీ: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్‌కు మతి భ్రమించిందని భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసిఫ్ ఏ పనీలేక తనకు అవగాహన లేని విషయాలపై పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. అలాంటి వ్యక్తి రక్షణ మంత్రిగా కొనసాగడం వల్లే పాక్ ప్రస్తుత ఆ పరిస్థితుల్లో ఉందని చురకలు వేసింది.ద్వీపదేశం సెషల్స్ కొత్తగా ఏర్పాటు చేసిన ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజాన్’ను ఇటీవల ప్రధాని మోదీకి ఇచ్చి గౌరవించిన విషయం తెలిసిందే. దీనిపై ఆసిఫ్ ‘అది అడిగి తెచ్చుకున్న కృత్రిమ గుర్తింపు’ అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసూయ మహాచెడ్డదని, ఇతరులను ద్వేషించే వారికి ఇది ఎక్కువగా ఉంటుందని ఎద్దేవా చేసింది.గత వారం సెషల్స్ దేశంలో ప్రధాని మోదీ పర్యటించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రధాని మోదీ చూపుతున్న నిబద్ధతకు, చిన్న ద్వీప దేశాల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లటానికి ఆయన చేస్తున్న కృషికిగాను ప్రస్తుత సెషల్స్ ప్రభుత్వం ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. -
పాక్ ఎయిర్‌ఫోర్స్ కెప్టెన్ అసీమ్ తారిక్‌ను కాల్చి చంపిన దుండగులు
ఇస్లామాబాద్‌లో ఓ మహిళను అపహరించేందుకు దుండగులు ప్రయత్నించగా, ఆమెను కాపాడే క్రమంలో జోక్యం చేసుకున్న పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్‌ను వారు కాల్చిచంపినట్టు పాకిస్థాన్ సమా టీవీ తెలిపింది.ఈ ఘటన మార్గల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహీన్ చౌక్ వద్ద జరిగింది. మృతుడిని గ్రూప్ కెప్టెన్ అసీమ్ తారిక్‌గా గుర్తించారు. ఆయన నైన్త్ అవెన్యూ మీదుగా వెళ్తుండగా ఓ వ్యక్తి మోటార్‌సైకిల్‌పై ఓ మహిళను బలవంతంగా ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నట్టు గమనించినట్టు సమాచారం.సమా టీవీ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రూప్ కెప్టెన్ తారిక్ జోక్యం చేసుకుని దాడిని అడ్డుకున్నారు. దీంతో ఆ మహిళ రోడ్డుకు అవతలి వైపునకు పారిపోయింది. ఈ సమయంలో అనుమానితుడు సాద్ అధికారి పట్ల దుర్భాషలాడి, ఆ తర్వాత కాల్పులు జరిపినట్టు తెలిపింది. ఈ కాల్పుల్లో అధికారి తీవ్రంగా గాయపడి ఘటన స్థలంలోనే మృతి చెందగా, నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆధారాలు సేకరిస్తున్నారు. మహిళ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ సమా టీవీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఆమె సహోద్యోగి. ఉద్యోగానికి తీసుకెళ్తానని చెప్పి మార్గం మళ్లించి మరో చోటుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని తెలిపింది. ఆమె ప్రతిఘటించడంతో పరిస్థితి మరింత విషమించేలోపు అధికారి జోక్యం చేసుకున్నారు.అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ ఈ ఘటనపై ఇస్లామాబాద్ పోలీస్ చీఫ్ నుంచి అత్యవసర నివేదిక కోరారు. నిందితుడిని వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. -
మళ్లీ పాక్ కెప్టెన్‌గా బాబర్ ఆజం.. అధికారిక ప్రకటన
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటనల కోసం స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంను మరోసారి టెస్టు జట్టు కెప్టెన్‌గా నియమించింది. ఇప్పటివరకు టెస్టు జట్టుకు నాయకత్వం వహించిన షాన్ మసూద్‌ను పదవి నుంచి తప్పిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.దాదాపు మూడు సంవత్సరాల క్రితం టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన షాన్ మసూద్ ఆశించిన స్థాయిలో జట్టును నడిపించలేకపోయాడు. అతని నాయకత్వంలో పాకిస్తాన్ ఘోర వైఫల్యాలను ఎదుర్కొంది. 16 టెస్టు మ్యాచ్‌లు ఆడగా కేవలం నాలుగింట మాత్రమే విజయాలు సాధించింది. మిగిలిన 12 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.ముఖ్యంగా ఇటీవల బంగ్లాదేశ్ చేతిలో స్వదేశంలోనే టెస్టు సిరీస్‌ను వైట్‌వాష్‌గా కోల్పోవడం మసూద్ కెప్టెన్సీకి ఎసరుపెట్టింది. గత రెండేళ్లలో అతడి నాయకత్యంలో పాక్ బంగ్లాదేశ్ చేతిలో రెండోసారి వైట్‌వాష్‌ను ఎదుర్కోవడంతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పర్యటనల్లో కూడా వరుసగా సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌గా కోల్పోయింది.ఈ పరిస్థితుల్లో మళ్లీ బాబర్ ఆజంపై పాక్ క్రికెట్ బోర్డు విశ్వాసం ఉంచింది. మసూద్‌కు ముందు కూడా బాబర్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఇటీవల టెస్ట్‌ల్లో బాబర్ ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోయినా కెప్టెన్‌గా నియమించడం గమనార్హం.కాగా, పాక్ క్రికెట్ బోర్డు ఇవాళ వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటనల కోసం తమ టెస్ట్ జట్టును ప్రకటించింది. విండీస్ పర్యటనకు 16 మంది, ఇంగ్లండ్ పర్యటనకు 17 మంది (ఫిట్నెస్ను బట్టి సౌద్ షకీల్ జట్టులో అవకాశం) సభ్యులను పాక్ సెలెక్టర్లు ఎంపిక చేశారు.ఈ రెండు పర్యటనల కోసం ప్రకటించిన జట్టులో నలుగురు కొత్త ఆటగాళ్లకు అవకాశం లభించింది. ఎడమచేతి స్పిన్నర్ అలీ ఉస్మాన్, బ్యాటర్ మహ్మద్ అవైస్ జఫర్, ఫాస్ట్ బౌలర్ ఉబైద్ షా, వికెట్‌కీపర్-బ్యాటర్ మహ్మద్ ఘాజీ ఘోరీ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు.పాకిస్తాన్ జట్టు ఈ నెల చివర్లో వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరనుంది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ జూలై 25 నుంచి 29 వరకు టరౌబాలో జరగనుండగా, రెండో టెస్టు ఆగస్టు 2 నుంచి 6 వరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో నిర్వహించనున్నారు.వెస్టిండీస్ పర్యటన అనంతరం పాకిస్తాన్ నేరుగా ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. అక్కడ మూడు టెస్టుల సిరీస్ ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరుగుతుంది. తొలి టెస్టు లీడ్స్‌లో, రెండో టెస్టు లార్డ్స్‌లో, మూడో టెస్టు బర్మింగ్‌హామ్‌లో జరగనుంది.వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటనల కోసం పాకిస్తాన్ టెస్టు జట్టు..బాబర్ ఆజం (కెప్టెన్), ఆమిర్ జమాల్, అబ్దుల్లా ఫజల్, అలీ ఉస్మాన్, అజాన్ అవైస్, ఇమామ్ ఉల్ హక్, ఖుర్రం షహ్జాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అలీ, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), మహ్మద్ అవైస్ జఫర్, మహ్మద్ ఘాజీ ఘోరీ (వికెట్‌కీపర్), సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ ఆఘా, షాన్ మసూద్, ఉబైద్ షా. -
మరో ‘సీమా హైదర్’ లవ్ స్టోరీ..‘కథ అడ్డం తిరిగింది’
శ్రీనగర్: సామాజిక మాధ్యమం ‘స్నాప్‌చాట్’ పరిచయంతో సరిహద్దులు దాటి ప్రేమికురాలిని కలవడానికి వచ్చిన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ యువకుడిని భారత సైన్యం తిరిగి పాకిస్తాన్‌కు అప్పగించింది. అధికారుల కథనం ప్రకారం.. పీఓకేలోని ముజఫరాబాద్ జిల్లాకు చెందిన జీషాన్ మీర్, జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌కు చెందిన ఇరామ్ మజీద్ అనే యువతి 2025 మే నెల నుండి స్నాప్‌చాట్‌లో మాట్లాడుకుంటూ ప్రేమలో పడ్డారు. ప్రేమికురాలిని కలుసుకోవాలనే ఉద్దేశంతో జీషాన్, ఈ ఏడాది జూన్ 1న ఉరి సెక్టార్‌లోని సిలికోట్ ప్రాంతంలో నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడు.ఆ సమయంలో సరిహద్దుల్లో పహారా కాస్తున్న భారత సైన్యం అతడిని గుర్తించి అదుపులోనికి తీసుకుంది. అనంతరం ప్రాథమిక విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. నెల రోజుల పాటు భద్రతా సంస్థల దర్యాప్తు, చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత, మానవతా దృక్పథంతో అతడిని శనివారం (జూలై 4న) కమన్ అమన్ సేతు సరిహద్దు వద్ద పాకిస్తాన్ ఆర్మీ అధికారులకు అప్పగించినట్లు సైన్యం వెల్లడించింది. విచారణ సమయంలో జీషాన్ పట్ల అత్యంత గౌరవంతో, నిష్పక్షపాతంగా వ్యవహరించామని అధికారులు తెలిపారు. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీమా హైదర్ ఉదంతాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుకు తెచ్చింది.ఇది కూడా చదవండి: మరో ‘పరీక్ష కుంభకోణం’: సమాధానాలు దిద్దకుండానే ఉద్యోగాలు! -
పాక్‌ను షేక్ చేస్తున్న కొత్త కేసు.. చిక్కుల్లో డిప్యూటీ పీఎం బంధువు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో సంచలనం సృష్టించిన ఇద్దరు విదేశీ మహిళలపై కిడ్నాప్, సామూహిక అత్యాచార కేసు దర్యాప్తులో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వెనుక క్రిప్టోకరెన్సీ వ్యాపార వివాదం ఉండి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముహమ్మద్ రజా దార్, పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బంధువుగా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.ఈ ఘటనపై పోలీసుల కథనం ప్రకారం.. నెదర్లాండ్స్‌కు చెందిన ఒక మహిళ, వెనిజులాకు చెందిన మరో మహిళ వ్యాపార అవసరాల కోసం జూన్ 29న పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చేరుకున్నారు. అయితే, వారికి ముందే పరిచయం ఉన్న ముహమ్మద్ రజా దార్.. ఇద్దరికి పాకిస్తాన్‌కు ఆహ్వానించినట్లు సమాచారం. అనంతరం వారిని ఒక ఇంటికి తీసుకెళ్లి బంధించి, పలువురు కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.క్రిప్టోకరెన్సీ వివాదం ఏమిటి?దర్యాప్తులో భాగంగా న్యాయమూర్తి ఎదుట బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిందితులు తమ వద్ద ఉన్న క్రిప్టోకరెన్సీ డిజిటల్ వాలెట్లు, పాస్వర్డులు, ఆర్థిక వివరాలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, వాటిని అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు ఆమె ఆరోపించింది. అలాగే, తమను విడుదల చేసే ముందు 1 లక్ష అమెరికన్ డాలర్లు (100,000 USD) అందాయని ప్రధాన నిందితుడు చెప్పినట్లు ఆమె వెల్లడించింది. ఈ అంశాలన్నీ ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న ఆరోపణలు. కాగా, వాటిని అధికారులు నిర్ధారించలేదు.ముందే వ్యాపార సంబంధాలుప్రాథమిక విచారణ ప్రకారం, ముహమ్మద్ రజా దార్ మరియు బాధిత మహిళలు గత ఏడాది సింగపూర్‌లో పరిచయం అయ్యారు. వారు క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వ్యాపార ప్రాజెక్టులో కలిసి పనిచేసినట్లు అధికారులు చెబుతున్నారు. అదే పరిచయంతో మహిళలకు పాకిస్థాన్‌కు వెళ్లేందుకు బిజినెస్ వీసాలు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతో వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన విభేదాలే ఈ ఘటనకు దారితీశాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు.. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. కోర్టు నిందితులను పోలీసు కస్టడీకి పంపి విచారణకు అనుమతించింది.రాజకీయ చర్చ..ఈ ఘటన పాకిస్తాన్లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఏకంగా ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ బంధువు పేరు బయటకు రావడంతో తీవ్ర కలకలం సృష్టించింది. ప్రతిపక్ష పార్టీలు నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా విచారణ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది. బాధితులు చేసిన ఆరోపణలు, క్రిప్టోకరెన్సీ వివాదం, చెల్లింపు వంటి అంశాలపై ఇంకా కోర్టు ఎలాంటి తుది తీర్పు ఇవ్వలేదు. నిందితులపై ఉన్న ఆరోపణలు విచారణలో భాగంగా పరిశీలించబడుతున్నాయి. -
మళ్లీ పాక్ కెప్టెన్‌గా బాబర్ ఆజం..!
పాకిస్తాన్ క్రికెట్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మళ్లీ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్ స్థానంలో ఆయనను తిరిగి నియమించే దిశగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.గత రెండేళ్లుగా పాకిస్తాన్ టెస్ట్ జట్టు ప్రదర్శన దారుణంగా దిగజారింది. పసికూన బంగ్లాదేశ్ చేతిలో స్వదేశంలో సిరీస్ సహా రెండు సిరీస్‌ల్లో ఓడింది. దీంతో బాబర్ ఆజం మళ్లీ టెస్ట్ కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో వెస్టిండీస్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బాబర్‌కు పగ్గాలు అప్పజెప్పవచ్చన సమాచారం.బాబర్ 2019-2023 మధ్యలో పాక్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2023 వరల్డ్ కప్ తర్వాత ఆ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. 2024లో మళ్లీ వైట్-బాల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నప్పటికీ, అదే ఏడాది చివర్లో మరోసారి రాజీనామా చేశాడు.ప్రస్తుతం షాన్ మసూద్ పాక్ టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అతని ట్రాక్ రికార్డు దారుణంగా ఉంది. అతని నాయకత్వంలో పాకిస్తాన్ 16 టెస్టుల్లో 12 మ్యాచ్‌లు ఓడిపోయింది. కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించింది. దీంతో WTC 2023–25 సీజన్‌ను పాకిస్తాన్ చివరి స్థానంలో ముగించింది.టెస్ట్ కెప్టెన్సీ విషయంలో వైట్-బాల్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పేరు కూడా పరిశీలనలోకి వచ్చినా, ఆయన ఆ ఆఫర్‌ను తిరస్కరించడంతో చివరకు బాబర్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.బాబర్ ఆజం కెప్టెన్సీ రికార్డు చూస్తే, ఇప్పటివరకు 148 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించి 84 విజయాలు సాధించాడు. టెస్ట్ ఫార్మాట్లో 20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉండగా 10 విజయాలు, 6 పరాజయాలు నమోదు చేశాడు. ఈ గణాంకాల ఆధారంగా PCB అతనికే మళ్లీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
పాక్‌లో కలకలం: యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ల కోసం ‘మాయ’ స్మగ్లింగ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లోని ఆస్పత్రుల నుంచి ప్లాసెంటా(మాయ)లను కొనుగోలు చేసి, వాటిని రహస్య ప్రాంతాల్లో ఎండబెట్టి, ప్రాసెస్ చేసి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న ఒక పెద్ద ముఠాను పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) బట్టబయలు చేసింది. ప్లాసెంటా (మాయ) అనేది గర్భధారణ సమయంలో తల్లి గర్భాశయంలో ఏర్పడుతుంది. ఇది బొడ్డు తాడు ద్వారా పిండంతో అనుసంధానమై ఉంటుంది. తల్లి రక్తం నుండి పిండానికి ఆక్సిజన్, పోషకాలు, యాంటీబాడీలను అందించడంతో పాటు, పిండం నుండి కార్బన్ డైయాక్సైడ్, ఇతర వ్యర్థాలను తొలగించడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే గర్భధారణను కొనసాగించడానికి, శిశువు ఎదుగుదలకు, ప్రసవానికి అవసరమైన హార్మోన్లను కూడా ఇది ఉత్పత్తి చేస్తుంది. ప్రసవం తర్వాత దీనిని వైద్య వ్యర్థాలుగా పారవేస్తారు.అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ ఉన్న ఖరీదైన ‘యాంటీ ఏజింగ్’ ఇంజెక్షన్ల తయారీ కోసం ఈ మానవ కణజాలాలను విదేశాలకు ఆ ముఠా స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇస్లామాబాద్‌లోని ఒక గృహంలో అక్రమంగా నిర్వహిస్తున్న ప్రాసెసింగ్ ప్లాంట్‌పై అధికారులు దాడి చేశారు. అక్కడ మానవ అవయవాలను, ముఖ్యంగా మాయలను ఎండబెట్టడానికి అమర్చిన పెద్ద పెద్ద రాక్లు, ట్రేలను కనుగొన్నారు. ఈ సోదాల్లో సుమారు 500 నుండి 550 కిలోల మాయలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వియత్నాంనకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న దాదాపు 100 కిలోల మానవ కణజాలాల షిప్‌మెంట్‌ను విమానాశ్రయంలో అడ్డుకున్నారు. ఈ అక్రమ నెట్‌వర్క్‌కు సంబంధించి ముగ్గురు చైనా పౌరులు, ఇద్దరు పాకిస్తాన్ పౌరులతో కలిపి మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.ఆస్పత్రి సిబ్బందికి ఒక్కో మాయకు సుమారు 800 పాకిస్తానీ రూపాయలు చెల్లించి ఈ ముఠా సేకరిస్తున్నట్లు విచారణలో తేలింది. వీటిని ప్రాసెస్ చేసిన తర్వాత 'షీ ప్లాసెంటా' వంటి పేర్లతో వియత్నాం వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. ఈ కణజాలంతో తయారు చేసే ఒక్కో యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ ధర అంతర్జాతీయ మార్కెట్లోలక్షల్లో పలుకుతోందని, విదేశాల్లోని సంపన్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాపారం సాగుతోందని అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: బోల్సోనారో గృహ నిర్బంధం పొడిగింపు -
పాకిస్తాన్‌కు ఊహించని శత్రువు.. పెంచిన పామే కాటేసిందా?
ఆసియా ఖండంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా?. ఇటీవల అఫ్గానిస్తాన్.. పాకిస్తాన్ భూభాగంలోని పలు లక్ష్యాలపై డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. అంతకు కొన్ని రోజుల ముందే పాకిస్తాన్ సైన్యం అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో వైమానిక దాడులు చేసింది. దానికి ప్రతీకారంగానే అఫ్గానిస్తాన్ ఈ డ్రోన్ దాడులు జరిపింది. మార్చి నెలలో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈ దాడులతో పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. దశాబ్దాలుగా మిత్రదేశాలుగా ఉన్న పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య అసలు ఈ శత్రుత్వం ఎందుకు మొదలైంది? ఇప్పుడు కొత్తగా ఈ ప్రాంతీయ రాజకీయాల్లోకి రష్యా ఎందుకు ఎంట్రీ ఇస్తోంది? ఉక్రెయిన్ యుద్ధంతో బిజీగా ఉన్న రష్యా, హఠాత్తుగా తాలిబాన్లతో చేతులు కలపడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?అప్పట్లో భాయీ భాయీ..!పాక్-అఫ్గాన్ పాలిటిక్స్‌లోకి వెళ్లే ముందు ఫ్లాష్‌బ్యాక్ తిరగేస్తే.. ఇప్పుడు ఒకరినొకరు చంపుకుంటున్న ఈ పాకిస్తాన్, తాలిబాన్లు.. ఒకప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. 1980ల కాలంలో అఫ్గానిస్తాన్‌లోకి సోవియట్ రష్యా సైన్యం ప్రవేశించినప్పుడు, వారికి వ్యతిరేకంగా పోరాడిన ముజాహిదీన్లకు, తాలిబాన్లకు పాకిస్తాన్ వెన్నుదన్నుగా నిలిచింది. అమెరికా నుంచి వచ్చిన నిధులను, ఆయుధాలను పాకిస్తానే వీరికి సరఫరా చేసింది. అంతెందుకు.. తాలిబాన్లను తయారు చేసే హక్కానీ యూనివర్సిటీ కూడా పాక్ గడ్డపైనే ఉంది. 1996లో తాలిబాన్లు మొదటిసారి కాబూల్‌ను ఆక్రమించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, వారిని అధికారిక దేశంగా గుర్తించిన కేవలం మూడు దేశాలలో పాకిస్తాన్ ఒకటి. ఆ తర్వాత 2001లో అఫ్గానిస్తాన్‌పై అమెరికా దాడి చేసి.. తాలిబాన్లను గద్దె దించినప్పుడు కూడా, పాకిస్తాన్ దొంగచాటుగా తాలిబాన్లకే మద్దతు ఇచ్చింది. అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా పాకిస్తాన్ వినలేదు. ఎందుకంటే, భవిష్యత్తులో ఎప్పుడైనా అమెరికా వెళ్లిపోతే మళ్లీ తాలిబాన్లే అధికారంలోకి వస్తారని పాకిస్తాన్‌కు తెలుసు. వారిని మచ్చిక చేసుకుంటే, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలను.. ముఖ్యంగా ‘తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్’ని వారు అణచివేస్తారని పాకిస్తాన్ ఆశపడింది.మాట వినని తాలిబాన్లు..!2021లో అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్‌ను వదిలి వెళ్ళిపోయాక, తాలిబాన్లు మళ్లీ కాబూల్‌ను హస్తగతం చేసుకున్నారు. పాకిస్తాన్ పండగ చేసుకుంది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు, పాకిస్తాన్ మాట వినడం మానేశారు. పాకిస్తాన్లో ఘోరమైన దాడులకు పాల్పడే ఖీఖ్కీ ఉగ్రవాదులను, అలాగే బలూచిస్తాన్ విముక్తి పోరాట సమూహాలను అఫ్గానిస్తాన్ గడ్డపై నుంచి ఆపడానికి తాలిబాన్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని ఫలితంగా పాకిస్తాన్లో ఉగ్రదాడులు భారీగా పెరిగిపోయాయి. ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్’ నివేదికల ప్రకారం.. గత పదేళ్లలోనే లేని విధంగా 2024, 2025 సంవత్సరాల్లో పాకిస్తాన్ భద్రతా బలగాలు భారీగా నష్టపోయాయి.దాదాపు 1,200 మందికి పైగా పాక్ సైనికులు, పోలీసులు ఈ ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. దాంతో సహనం కోల్పోయిన పాకిస్తాన్, ఇప్పుడు అఫ్గానిస్తాన్ లోపల ఉన్న ఖీఖ్కీ స్థావరాలపై వైమానిక దాడులు చేయడం ప్రారంభించింది. ముఖ్యంగా కాబూల్, కాందహార్ నగరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ‘మీరు ఉగ్రవాదులను ఆపకపోతే నేరుగా మీపైనే దాడి చేస్తాం’ అని తాలిబాన్లకు హెచ్చరికలు పంపింది. దీంతో.. ఖతార్ జోక్యం చేసుకుని కాల్పుల విరమణ కుదిర్చినప్పటికీ.. అది ఎంతో కాలం నిలవలేదు. మొన్నటికి మొన్న పాకిస్తాన్లో జరిగిన ఒక ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాక్ ఆర్మీ అఫ్గానిస్తాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. దానికి కౌంటర్‌గా తాలిబాన్లు సరిహద్దుల్లో భారీ సైనిక దాడికి దిగారు. ఇప్పుడు తాజాగా అఫ్గానిస్తాన్ డ్రోన్లు పాకిస్తాన్ సరిహద్దు దాటి వచ్చి దాడులు చేశాయి. ఇరు దేశాలూ ఇప్పుడు ఒక అంతం లేని యుద్ధ వలయంలో చిక్కుకున్నాయి.పాక్‌పై రగిలిపోతున్న తాలిబాన్లు?సరే, తాలిబాన్లు ఈ ఉగ్రవాదులను ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇక్కడ రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, వారి దగ్గర సరైన వ్యవస్థలు, సైనిక సామర్థ్యం లేదు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుతం 20కి పైగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. వాటన్నింటినీ అణిచివేయడం తాలిబాన్ల వల్ల కావడం లేదు. రెండోది, తాలిబాన్లలోనే అంతర్గతంగా గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్ ఒప్పుకొన్నా, మరో గ్రూప్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తోంది. అయితే, ఈ నిరంతర యుద్ధ వాతావరణంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. అదే.. రష్యా ఎంట్రీ!గత ఏడాది తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. ఆ తర్వాత ఈ ఏడాది మే నెలలో రష్యా, అఫ్గానిస్తాన్‌తో ఒక కీలకమైన సైనిక సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, అఫ్గానిస్తాన్ దగ్గరున్న పాత సోవియట్ కాలపు ఆయుధాలను, యుద్ధ విమానాలను రష్యా రిపేర్ చేసి, ఆధునీకరిస్తుంది. ఈ ఒప్పందం తర్వాత తాలిబాన్ల రక్షణ మంత్రి ఒక సంచలన ప్రకటన చేశారు. ‘ఇకపై పాకిస్తాన్ మాపై దాడులు చేయడానికి ధైర్యం చేయలేదు’ అనేది దాని సారాంశం. అంటే రష్యా అండ చూసుకునే తాలిబాన్లు ఇప్పుడు పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారని అర్థం చేసుకోవచ్చు.రష్యాకు వచ్చే లాభమేంటంటే..?తాలిబాన్లకు సహాయం చేయడం వల్ల రష్యాకు వచ్చే లాభం ఏంటి? మొదటి లాభం ఏంటంటే.. రష్యాకు కూడా ఉగ్రవాద భయం ఉంది. 2024లో మాస్కో కాన్సెర్ట్ హాల్‌పై దాడి చేసిన ‘ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్’ ఉగ్రవాదులు అఫ్గానిస్తాన్ నుంచే ఆపరేట్ చేస్తున్నారు. తాలిబాన్లతో దోస్తీ చేస్తే, ఆ ఉగ్రవాదులను అణచివేయవచ్చన్నది రష్యా ప్లాన్. ఇక రెండోది, ఉక్రెయిన్ యుద్ధం వల్ల సెంట్రల్ ఆసియాలో రష్యా కోల్పోయిన పట్టును మళ్లీ సాధించడం. ఇందుకోసం రష్యా తన నేతృత్వంలోని ఇ ఖీౖ కూటమిని వాడుకుంటోంది. తజకిస్తాన్ సరిహద్దుల్లో రష్యా తన సైనిక ఉనికిని భారీగా పెంచుతోంది. చివరగా చెప్పాలంటే.. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య శాంతి కుదరాలంటే అఫ్గాన్ గడ్డపై ఉగ్రవాదం అంతం కావాలి. అందుకు తాలిబాన్లకు సైనిక, ఆర్థిక సహాయం అవసరం. ఇప్పుడు రష్యా ఆ పాత్రను పోషించడానికి సిద్ధమైంది. మరి రష్యా రాకతో ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందా? లేదా పాకిస్తాన్, రష్యాల మధ్య కొత్త విభేదాలకు దారితీస్తుందా? అనేది కాలమే నిర్ణయించాలి. -హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు -
పాకిస్తాన్‌కు బిగ్ ఝలక్..
న్యూఢిల్లీ: సింగపూర్ మాజీ రాయబారి బిలహరి కౌసికన్ పాకిస్తాన్‌ను నేరుగా, నిర్మొహమాటంగా విమర్శించారు. అమెరికా-ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం పాకిస్తాన్ ప్రపంచ ప్రతిష్టను పెంచవచ్చేమో, కానీ.. దేశంలో అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించలేదన్నారు. కౌసికన్ సూటిగా పాక్ వైఫల్యం అంచున ఉన్న దేశమన్నారు. పాకిస్తాన్ సమస్య భారత్, ఆఫ్ఘనిస్థాన్ కాదని, దాని సొంత రాజకీయ నాయకులు, సైన్యమేనని స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందని ఒక ప్రపంచ సదస్సులో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.ఈ సందర్భంగా కౌసికన్..‘పాకిస్తాన్ దౌత్యపరమైన ఎత్తుగడలను బాగా వేసి ఉండవచ్చు, కానీ అది దేశ ప్రజలకు అన్నం పెట్టదని నొక్కి చెప్పారు. ఒక దౌత్యపరమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పాకిస్తాన్ చాలా చురుకుగా, చాలా విజయవంతంగా వ్యవహరించిందని, అమెరికా దృష్టిలో దౌత్యపరంగా పాకిస్తాన్‌ను పునరుద్ధరించడానికి అది కొంతవరకు దోహదపడిందని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించడానికి అది పెద్దగా ఏమీ చేయలేదన్నారు. తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మొదటి 10 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. పాక్ ఇటీవలి దౌత్య విజయాలు దీర్ఘకాలంలో అమెరికాతో దాని సంబంధాలను మారుస్తాయన్న అంచనాలపైనా ఆయన నీళ్లు చల్లారు. పాక్‌పై విధించిన ఆంక్షలన్నింటినీ అమెరికా ఎప్పటికీ ఎత్తివేయదని స్పష్టం చేశారు. భౌగోళిక కారణాలు సాకు మాత్రమే... భారత్, ఆఫ్ఘనిస్థాన్‌లతో ఉన్న సరిహద్దుల వల్లే పాకిస్తాన్ సమస్యలు ఎదుర్కొంటోందన్న ఓ పాక్ జర్నలిస్ట్ అభిప్రాయాన్ని ఆయన తిప్పికొట్టారు. ‘‘ప్రతిదానికీ భౌగోళిక స్థానాన్ని కారణంగా చూపలేరు. అది కేవలం ఒక సాకు మాత్రమే. ఆ సంక్షోభం పాక్ రాజకీయ నాయకులు, సైన్యం సృష్టించుకున్నదే’’ కౌసికన్ పేర్కొన్నారు. ప్రారంభం నుంచీ పాక్‌లో పాలన దారుణంగా ఉంది. నాకు ఎలాంటి పరిష్కారం కనిపించడం లేదు. అక్కడి రాజకీయ నాయకులు, పారీ్టలు వృధా. ఈ సమస్యలో సైన్యం కూడా పెద్ద భాగంగా ఉంది’’ అని ఆయన అన్నారు. పాకిస్తాన్ స్వతంత్ర చరిత్రలో దాదాపు సగం కాలం పాటు సైన్యం పాలనలోనే ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ పాలనలో ఉన్నా కూడా ప్రభుత్వ కార్యకలాపాలపై సైన్యం ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కౌసికన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. -
‘తక్షశిల జోలికి వెళ్లొద్దు’.. పాక్‌కు యునెస్కో హెచ్చరిక
పాకిస్థాన్‌లోని వేదకాలపు నాటి తక్షశిలలో ప్రభుత్వం చేపడుతున్న పరిరక్షణ పనులపై ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగం యునెస్కో హెచ్చరించింది. ఈ పురాతన కట్టడాల సంరక్షణ పనుల్లో సిమెంట్ వాడటమే కాక, ఇతర ఆధునిక ముడి పదార్థాలు వినియోగించడాన్ని గుర్తించింది. ఇది యునెస్కో నిబంధనలకు విరుద్ధమని పేర్కొని, ప్రపంచ వారసత్వ ప్రదేశ జాబితాలోంచి తక్షశిల తొలగిపోయే ప్రమాదముందని హెచ్చరించింది. పాకిస్థాన్ పురావస్తు శాఖ ఇటీవల తక్షశిలలో ప్రారంభించిన పునరుద్ధరణ పనుల్లో సిమెంట్ వినియోగించింది. తద్వారా పురావస్తు స్మారక చిహ్నాలను పరిరక్షించడానికి యునెస్కో అంతర్జాతీయంగా ఆమోదించిన సూత్రాలను ఉల్లంఘించింది.పాకిస్తాన్ ప్రస్తుతం ఖైబర్ పఖ్తున్వాలోని బునెర్‌లో ఉన్న బౌద్ధ క్షేత్రమైన రాణి ఘాట్‌తో పాటు సింధ్‌లోని థట్టాలో ఉన్న స్కిథో-పార్థియన్, బౌద్ధ క్షేత్రమైన భాన్భోర్ వంటి ప్రదేశాలకు ప్రపంచ వారసత్వ హోదాను కోరుతోంది. అయితే తాజాగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ చర్చల సమయంలో తక్షశిల వివాదం పాక్ చేసిన ప్రతిపాదనలకు ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. -
పాక్ హెచ్చరికలను తిప్పికొట్టిన భారత్
ఢిల్లీ: పాక్ బెదిరింపుల వేళ.. సింధు జలాల ఒప్పందంపై వెనక్కి తగ్గేది లేదని పాకిస్థాన్‌కు భారత్ తెగేసి చెప్పింది. సింధు జలాల ఒప్పందంపై భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తూ.. పొరుగు దేశం.. ఉగ్రవాదానికి పూర్తిగా స్వస్తి చెప్పేంత వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలన్న తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని భారత్ తేల్చి చెప్పింది. ఒప్పందం ఇప్పటికీ అమలులోనే ఉందని.. నీళ్లను ఆయుధంగా మార్చవద్దంటూ పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ సహా ఇతర మంత్రులు చేసిన హెచ్చరికలను భారత్ తిప్పికొట్టింది.గత ఏడాది (2025) ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన తర్వాతే భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, నాటి నుంచి పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ముందు అబద్ధాలు చెప్తోంది. సరిహద్దు నదులను పంచుకునే ఇతర దేశాలకు భారత్ నిర్ణయం ఒక ప్రమాదకరమైన ఉదాహరణగా మారుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనికి సమాధానంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నేడు పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపనంత వరకు ఏదీ మారదని తేల్చిచెప్పింది.సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరి స్థిరంగా ఉంది. పాకిస్తాన్ నిరంతరం సాగిస్తున్న సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే ఈ ఒప్పందం ప్రస్తుతం నిలిపివేయబడింది. పాకిస్తాన్ నమ్మదగిన విధంగా శాశ్వతంగా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపాలంటూ రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదానికి సురక్షిత స్థావరంగా మారిన పాకిస్తాన్, సింధు జలాల విషయంలో తానే తవ్వుకున్న గోతిలో పడి విలవిలలాడుతోందని.. కానీ ఆ విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ దాక్కున్న ఈ దేశం, ఇప్పటికీ భారత్‌పై, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌పై దాడులు చేయడానికి ఉగ్రవాదులకు తన భూభాగాన్ని వాడుకునేలా అనుమతిస్తూనే ఉంది’’ అంటూ రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు.1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రవి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు పూర్తి హక్కులు ఉండగా.. సింధు, జీలం, చెనాబ్ నదుల జలాల్లో ఎక్కువ భాగం పాకిస్థాన్‌కు కేటాయించారు. అయితే 2025 ఏప్రిల్‌లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ దాడికి పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులే కారణమని చెబుతున్న భారత్.. సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. -
బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం
క్వెట్టా/ఇస్లామాబాద్: పాకిస్థాన్ దక్షిణ పశ్చిమ రాష్ట్రం బలూచిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 40 మంది మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.శుక్రవారం ఉదయం క్వెట్టా నుంచి దేశ రాజధాని ఇస్లామాబాద్ వైపు వెళ్తున్న ఈ బస్సు షెరాని–జోబ్ హైవేపై దనసర్ ప్రాంతంలో అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారన్నదానిపై స్పష్టత లేదు. రెస్క్యూ బృందాలు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.Very sad news 😢💔At least 40 killed, 8 injured as passenger bus falls into ravine near Balochistan-KP border.#Balochistan #Accident pic.twitter.com/N222P3v64y— Balochistan Ko Bachao (BKB) (@balochistankb) July 3, 2026బస్సు ఒవర్‌లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మార్గమధ్యంలో మరో బస్సు చెడిపోవడంతో అక్కడి ప్రయాణికులను కూడా ఈ బస్సులోకి ఎక్కించారని వెల్లడించారు. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరగడం.. బస్సు అదుపు తప్పి ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. షెరాని డిప్యూటీ కమిషనర్ హజ్రత్ వాలి కకర్ మాట్లాడుతూ, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నామని, మృతదేహాలను వెలికితీసే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (MERC) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 40 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన ఎనిమిది మందిని వెంటనే జోబ్ ట్రామా సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నీటి ప్రవాహంలో కాకుండా బండ రాళ్ల మీద బస్సు పడడంతో.. ప్రమాద తీవ్రత ఎక్కువగా నమోదైందని చెబుతున్నారు. ప్రమాద స్థలంలో ఆరు అంబులెన్సులు, 12 మంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పది లైట్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు సహాయక చర్యల్లో వచ్చి చేరాయి. స్థానిక అధికారులతో పాటు సమీప ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంత రెస్క్యూ బృందాలు కూడా ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. -
‘తుపాకులు ఇచ్చింది మీరే.. ఇప్పుడు ఉగ్రవాదులమంటారా?’
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పరిపాలనలోని కశ్మీర్ (PoK)లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ పాకిస్తాన్ సైన్యంపై సంచలన ఆరోపణలు చేశారు. కాశ్మీరీల చేతుల్లో తుపాకులు పెట్టింది పాకిస్తాన్ సైన్యమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.రావలకోట్‌లో జరిగిన భారీ నిరసన సభలో అమన్ ఖాన్ మాట్లాడుతూ.. కాశ్మీరీల చేతుల్లో తుపాకులు పెట్టింది పాకిస్తాన్ సైన్యమే. ఇప్పుడు అదే సైన్యం మమ్మల్ని ఉగ్రవాదులని పిలుస్తోంది. ఇది ప్రజలను మోసం చేసే ప్రయత్నం. అంతేకాకుండా, ఎన్నో సంవత్సరాలుగా కాశ్మీర్ ప్రజలను తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం, ఇప్పుడు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తున్న వారిపైనే ఉగ్రవాదుల ముద్ర వేస్తోందని ఆయన ఆరోపించారు.కాగా, పీవోకేలో గత కొన్ని వారాలుగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అధిక ధరలు, నిరుద్యోగం, విద్యుత్ ఛార్జీల పెంపు, పరిపాలనా వైఫల్యాలు, రాజకీయ హక్కుల కొరత వంటి అంశాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రావలకోట్ సహా పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది నిరసనకారులు పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ, తమ ప్రాంతానికి మరింత స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని ప్రసంగాల్లో పాకిస్తాన్ పరిపాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అయితే, పీవోకేలో కొనసాగుతున్న ఈ పరిణామాలు అక్కడి రాజకీయ పరిస్థితులు, ప్రజా అసంతృప్తిపై మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.భారత్ వైఖరి..భారత్ ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) భారతదేశంలో అంతర్భాగమే అనే అధికారిక వైఖరిని కొనసాగిస్తోంది. మరోవైపు, పాకిస్తాన్ మాత్రం ఈ ప్రాంతంపై తన పరిపాలనా హక్కును సమర్థిస్తోంది. కాశ్మీర్ అంశంపై ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. -
పాకిస్థాన్‌లో ఫ్రెంచ్ మహిళ 10 ఏళ్ల బందీఖానా.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్!
భావప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కుల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో, ఒక మహిళ తన ఐదుగురు పిల్లలతో కలిసి ఏకంగా పదేళ్ల పాటు చీకటి గదిలోనే బందీగా నలిగిపోయిన ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ఘోర మానవ హక్కుల ఉల్లంఘన ఉదంతం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.2014లో పాకిస్థాన్‌కు వచ్చిన నాటి నుండి నేటి వరకు కనీసం సూర్యరశ్మి కూడా సరిగ్గా తగలని ఒక మట్టి ఇటుకల గదిలో బందీగా మారిన ఒక ఫ్రెంచ్ మహిళను, ఆమె ఐదుగురు పిల్లలను పాకిస్థాన్ పోలీసులు ఎట్టకేలకు రక్షించారు. లవ్ మ్యారేజ్, విదేశీ ప్రయాణం జీవితాన్ని మారుస్తుందని ఆశపడిన ఆ మహిళకు పాకిస్థాన్ సరిహద్దు గ్రామం ఒక నరకకూపాన్ని ఎలా పరిచయం చేసిందో వివరిస్తూ సాగే ఒక సంచలన నిజాల కథనం ఇది.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, 54 ఏళ్ల సిల్వీ యాస్మినా అనే ఫ్రెంచ్ మహిళ తన పాకిస్థానీ భర్త అహ్మద్ ఖాన్‌తో కలిసి పన్నెండేళ్ల క్రితం పాకిస్థాన్ అడుగుపెట్టింది. అఫ్గానిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బారా అనే చిన్న పట్టణంలో ఒక శిథిలావస్థకు చేరిన మట్టి ఇటుకల ఇంట్లోకి ఆమెను తీసుకెళ్లిన భర్త, నాటి నుండి ఆమె బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకుండా కట్టడి చేశాడు. మానసికంగా, శారీరకంగా విపరీతమైన క్రూర స్వభావం కలిగిన అహ్మద్ ఖాన్, రోజువారీగా ఆమెను పశువుకంటే హీనంగా హింసించేవాడు.కేవలం గదికే పరిమితం చేయడమే కాకుండా, బాహ్య ప్రపంచానికి ఏ చిన్న సమాచారం పొక్కినా చంపేస్తానని బెదిరిస్తూ పదేళ్లకు పైగా ఒక బందీలా ఉంచాడు. ఈ క్రమంలో పుట్టిన ఐదుగురు పిల్లలను కూడా కనీసం స్కూలు ముఖం చూడనివ్వకుండా, ఆ నలుగు గోడల మధ్యే బంధీలుగా ఉంచడం ఆ భర్త క్రూరత్వానికి పరాకాష్టగా నిలిచింది. అయితే, ఈ సుదీర్ఘ నరకయాతన నుండి బయటపడటానికి ఆ దేవుడే ఒక మార్గాన్ని చూపించాడు. ఒకరోజు భర్త కళ్ళు కప్పి, యాస్మినా కుమారుల్లో ఒకడు అత్యంత చాకచక్యంగా ఆ ఇరుకైన బందీఖానా నుండి తప్పించుకున్నాడు.ఎలాగోలా ప్రాణాలు చేతబట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆ బాలుడు, తన తల్లి పడుతున్న నరకయాతనను, తమ బందీఖానా గురించిన వివరాలను పోలీసులకు వివరించాడు. బాలుడి మాటలకు దిగ్భ్రాంతి చెందిన జిల్లా పోలీస్ చీఫ్ వకార్ అహ్మద్ నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం వెంటనే రంగంలోకి దిగింది. నిఘా నీడన ఉన్న ఆ మట్టి ఇటుకల ఇంటిపై మెరుపు దాడి చేసి, ముఖంపై తీవ్ర గాయాలతో దీనస్థితిలో ఉన్న సిల్వీ యాస్మినాను, ఆమె ఐదుగురు పిల్లలను సురక్షితంగా రక్షించారు. క్రూర భర్త అహ్మద్ ఖాన్‌ను అక్కడికక్కడే అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం జైలుకు తరలించారు.రక్షించబడిన అనంతరం పోలీసులు రికార్డ్ చేసిన వీడియోలో సిల్వీ యాస్మినా ఇంగ్లీష్, ప్యాంటో భాషల మిశ్రమంలో మాట్లాడుతూ, తనను ఈ నరకం నుండి కాపాడిన పోలీసు అధికారులకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. 2014 నుండి తాను ఈ దేశంలో కనీసం స్వేచ్ఛగా శ్వాస కూడా తీసుకోలేకపోయానని, కళ్లెదుటే పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంటే ఏమీ చేయలేని స్థితిలో రోదించానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను, తన పిల్లలను ఎలాగైనా తిరిగి ఫ్రాన్స్ పంపించి వేయాలని ఆమె అధికారులను వేడుకుంది. ప్రస్తుతం బాధితులకు రక్షణ కల్పించేందుకు వారిని మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పాకిస్థాన్ ప్రభుత్వం, బాధితుల స్వదేశీ పునరావాసం కోసం ఇస్లామాబాద్‌లోని ఫ్రెంచ్ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతోంది.పాకిస్థాన్‌లో మహిళలపై జరిగే గృహహింస, సంప్రదాయాల పేరుతో సాగే వేధింపుల తీవ్రతకు ఈ అంతర్జాతీయ ఘటనే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం, పాకిస్థాన్‌లో ప్రతి ఏటా వందలాది మంది మహిళలు భర్తలు, కుటుంబ సభ్యుల చేతిలో శారీరక, మానసిక హింసకు గురవుతున్నారు. అయితే సమాజానికి భయపడి చాలా కేసులు వెలుగులోకి రావడం లేదు. ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి విషయాల్లో కఠినమైన సంప్రదాయ నిబంధనలను ఉల్లంఘించారనే నెపంతో అక్కడ ఏటా ఎంతో మంది మహిళలు పరువు హత్యలకు గురవుతున్నారు. ఒక విదేశీ మహిళకే ఇలాంటి దుస్థితి పడితే, ఇక స్థానిక మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాలంటూ సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అంతర్జాతీయ సమాజంతో పాటు స్థానిక చట్టాలకు కూడా ఒక పెద్ద మేల్కొలుపు కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘పాక్’లో కూలిన ట్యూషన్ సెంటర్ పైకప్పు.. 14 మంది మృతి!
లాహోర్: పాకిస్తాన్‌లోని లాహోర్ నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాహ్లా జిల్లా పరిధిలోని ఈద్గా బస్తీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక నివాస భవనం పైకప్పు కూలిపోయింది. అక్కడ ఒక ప్రైవేట్ ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో 14 మంది పాఠశాల విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఏడు నుండి 13 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు క్లాసులో ఉన్నారు.ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు, స్థానికులు శిథిలాల నుండి 20 మందిని సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిలో ఒక మహిళా ఉపాధ్యాయురాలితో పాటు మరో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. భవనంపై కార్మికులు పనులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, నాణ్యతా లోపమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి కాంట్రాక్టర్‌తో సహా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఈ విషాద ఘటనపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఈ ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి, వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులను, జిల్లా అధికారులను ఆదేశించారు. -
పాక్‌పై వైమానిక దాడులు.. తాలిబాన్ సంచలన ప్రకటన
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. పాకిస్థాన్ భూభాగంలోని ఐసిస్-ఖొరాసాన్ (ISIS-K) ఉగ్రవాద స్థావరాలపై తమ బలగాలు వైమానిక దాడులు నిర్వహించినట్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ దాడుల్లో ఉగ్రవాద శిబిరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలు లక్ష్యంగా చేసుకున్నామని, అక్కడి నుంచే ఆఫ్ఘనిస్తాన్‌లో దాడులకు కుట్రలు జరుగుతున్నాయని తాలిబాన్ అధికారులు వెల్లడించారు.తాలిబాన్ సర్కార్ ప్రకటన ప్రకారం.. పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో ఐసిస్-ఖొరాసాన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తమకు నిఘా సమాచారం అందిందని పేర్కొన్నారు. దేశ భద్రత దృష్ట్యా ముందస్తు చర్యగా ఈ దాడులు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు భారీగా నష్టం వాటిల్లిందని తాలిబాన్ వర్గాలు పేర్కొన్నప్పటికీ, మృతులు లేదా గాయపడిన వారి సంఖ్యపై అధికారిక సమాచారం వెల్లడించలేదు.అయితే, ఆఫ్ఘనిస్తాన్ చేసిన ఈ ప్రకటనలను పాకిస్థాన్ ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. తమ భూభాగంలో తాలిబాన్ పేర్కొన్న ప్రాంతాల్లో ఐసిస్ స్థావరాలు లేవని, వైమానిక దాడులు జరిగాయన్న వాదన కూడా నిరాధారమని స్పష్టం చేసింది. తాలిబాన్ చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఇస్లామాబాద్ పేర్కొంది.ఇటీవలి నెలలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. సరిహద్దు దాటుతున్న ఉగ్రవాద గ్రూపులకు ఒకరిపై మరొకరు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలు తరచుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP), ఐసిస్-ఖొరాసాన్ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాల విషయంలో ఇరు దేశాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గతంలో పాకిస్థాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించినట్లు ప్రకటించగా, వాటిలో పౌరులు మరణించారని తాలిబాన్ తీవ్రంగా ఆరోపించింది.ప్రస్తుతం తాలిబాన్ ప్రకటించిన ఈ వైమానిక దాడులపై స్వతంత్రంగా ధృవీకరణ లభించలేదు. దాడులు జరిగిన ప్రాంతాలు, నష్టం వివరాలు, మృతుల సంఖ్య వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయినప్పటికీ, ఈ పరిణామం దక్షిణాసియాలో భద్రతా పరిస్థితులు, ఆఫ్ఘనిస్తాన్–పాకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పాక్ వెన్నులో వణుకు పుట్టించే ప్రకటన చేసిన పీవోకే ప్రజలు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ పాక్‌లో భాగం కాదని, అంతేగాక తాము భారత్‌తో సంబంధాలు పెంచుకుంటామని పీవోకేలో నిరసనకారులు హెచ్చరించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావలాకోట్ ప్రాంత ప్రజలు వేల సంఖ్యలో నిరసన తెలుపుతున్నారు. పాకిస్థాన్ పాలనపై చాలా కాలంగా ఉన్న అసంతృప్తి, ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆగ్రహం కారణంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమానికి పౌర హక్కుల కార్యకర్త సర్దార్ అమన్ ఖాన్ సహా స్థానిక నేతలు నాయకత్వం వహిస్తున్నారు. రావలాకోట్‌లో వేలాది మంది నిరసనకారులు మంగళవారం 22వ రోజూ ఆందోళన కొనసాగించారు.ఈద్గాహ్ మైదానంలో జరిగిన నిరసనలో పలువురు నాయకులు మాట్లాడారు. పీవోకేను ఇకపై పాకిస్థాన్ అధీన ప్రాంతంగా పరిగణించకూడదని పేర్కొన్నారు. భారత్‌తో మరింత బలమైన సంబంధాలు ఏర్పరచుకునే దిశగా అడుగులు వేస్తామని పాక్ సర్కారుని హెచ్చరించారు.పాలనపై చాలా కాలంగా ఉన్న అసంతృప్తి, ఆర్థిక ఇబ్బందులు, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ అణచివేత, పాలనా నిర్లక్ష్యంపై ఈ ఉద్యమం ప్రారంభమైంది. నిరసనల సమాచారం బయటకు వెళ్లకుండా, ప్రజల్లో అవగాహన పెరగకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా అధికారులు జూన్ 5 నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పాకిస్థాన్ అధికారులు 2 వారాల పాటు ఆహార సరఫరా, ఇతర అత్యవసర వస్తువుల రాకపోకలను అడ్డుకోవడంతో ఉద్యమం మరింత ఊపందుకుంది.అమన్ ఖాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాకిస్థాన్ పరిపాలనలో ఉన్న కశ్మీర్ పాకిస్థాన్‌లో భాగం కాదని, తమకు పాకిస్థాన్ అవసరం కంటే, పాక్‌కే ఈ ప్రాంత అవసరం ఎక్కువని వ్యాఖ్యానించారు. ఆహారం, ఇతర అత్యవసర వస్తువులపై ఆంక్షలు కొనసాగితే ఈ ప్రాంత ప్రజలు సాయం కోసం భారత్ వైపు చూడవచ్చని అన్నారు. అలా జరిగితే ప్రాంత రాజకీయ పరిస్థితులు మారిపోతాయని, పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరుగుతుందని అమన్ ఖాన్ చెప్పారు.ఒక వీడియోలో.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఈ ప్రాంతం పాకిస్థాన్‌లో భాగం కాదని ప్రకటించారు. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్‌ను తిరస్కరిస్తున్నామని, నియంతృత్వాన్ని సహించబోమని చెప్పారు. ఈ నిరసనలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కే పరిమితం కాలేదు. విదేశాల్లో నివసిస్తున్న మద్దతుదారులు కూడా పలు దేశాల్లోని పాకిస్థాన్ దౌత్య కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టారు.*RAWALAKOT ROARS:* "PoJK Is Not Part of Pakistan" Thousands defy Islamabad. Sit-in at LoC since 9 June. Aman Khan: "If Pakistan blocks food, PoK's borders could open. Islamabad will beg PoK to stay." @CMShehbaz oppression has consequences. @UN @POTUS @narendramodi… pic.twitter.com/GhI0XWjwDk— 🇮🇳Bhartiyavibhooti🇮🇳 (@Bhartiyavibhoti) June 30, 2026 -
కశ్మీర్లో కలకలం: పోలియో ప్రకటనపై పాక్ నినాదం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ ఆరోగ్య శాఖలో ఊహించని పరిణామం తీవ్ర కలకలం రేపింది. అధికారిక కార్యక్రమానికి సంబంధించిన ఒక కరపత్రంలో పొరుగు దేశానికి సంబంధించిన నినాదం కనిపించడం అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక అనధికారిక పోలియో నినాద పత్రంపై జమ్ముకశ్మీర్ ఆరోగ్య శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ‘పోలియో ఫ్రీ పాకిస్తాన్’ అనే నినాదంతో కూడిన ఈ వివాదాస్పద కరపత్రం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడంతో, ఉన్నతాధికారులు దీనిని తీవ్రంగా పరిగణించి అత్యవసర విచారణకు ఆదేశించారు.రాజౌరి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్-2026కు సంబంధించిన ఒక ప్రకటన సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ అవ్వడాన్ని గుర్తించారు. ఈ కరపత్రం బ్లాక్ మెడికల్ ఆఫీసర్ (బీఎంఓ) కార్యాలయం ద్వారా అధికారికంగా ప్రచురించినట్లు ఉంది. దీనిపై తీవ్రంగా స్పందించిన రాజౌరి సీఎమ్ఓ, సదరు బ్లాక్ మెడికల్ ఆఫీసర్‌కు తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలో దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.ఈ కరపత్రాన్ని పరిశీలించిన అధికారులకు అందులో నేషనల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ లోగోతో పాటు ‘పోలియో ఫ్రీ పాకిస్తాన్’ అనే టెక్స్ట్ కనిపించింది. ఈ లోగో లేదా నినాదానికి జమ్ముకశ్మీర్ ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్యా విభాగంతో కానీ, లేదా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కానీ ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ పత్రంలో సదరు బ్లాక్ మెడికల్ ఆఫీసర్ పేరు, అధికారిక హోదా స్పష్టంగా ముద్రించి ఉండటం గమనార్హం.ఇది కూడా చదవండి: ముంబై ఘటన: జింక్ ఫాస్ఫైడ్ అంత ప్రమాదకరమా? -
'ఆ చేతులు నరికేస్తాం'.. భారత్‌పై పాక్ ప్రేలాపనలు
భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం వివాదం మరింత ముదురుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఒప్పందాన్ని అమలులో నిలిపివేసిన భారత్‌పై పాకిస్థాన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘పాక్‌కు రావాల్సిన నీటిని అడ్డుకునే చేతులను నరికేస్తాం’’ అంటూ ఆ దేశ మంత్రి ఒకరు హెచ్చరికలు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. సింధు జలాల ఒప్పందం(Indus Water Treaty)పై పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి భారత్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇస్లామాబాద్‌లో ఆ దేశ సమాచార శాఖ మంత్రి అతౌల్లా తరార్, పర్యావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ సోమవారం సంయుక్త పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో.. భారత్ తమ దేశానికి రావాల్సిన నీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు."పొరుగు దేశ ప్రధాని తన చేతిలో ఉన్న కుళాయిని మూసేస్తానంటున్నారు. పాకిస్థాన్‌కు ఒక్క చుక్క నీళ్లు కూడా రానివ్వనని చెబుతున్నారు. మా వాటా నీటిపై ఎవరైనా చేయి వేస్తే.. ఆ చేతులను నరికేస్తాం" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే సింధు జలాల ఒప్పందం ప్రకారం తమకు దక్కాల్సిన నీటి హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని స్పష్టం చేశారు.ఒప్పందం ఇప్పటికీ అమల్లోనే: పాక్సమాచార శాఖ మంత్రి అతౌల్లా తరార్ మాట్లాడుతూ.. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం ఇప్పటికీ చట్టబద్ధంగానే అమల్లో ఉందన్నారు. ఒక దేశం ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం, సవరించడం లేదా నిలిపివేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం పాకిస్థాన్‌కు నీటిపై ఉన్న హక్కులు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా న్యాయ నిపుణులు, జలవనరుల నిపుణులతో ఇస్లామాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు కూడా నిర్వహిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. భారత్ నిర్ణయానికి అంతర్జాతీయ మద్దతు లభించలేదని కూడా పాక్ అంటోంది.🚨 Water Gone. Threats On."Touch Our Water, We'll Cut Off Your Hand": Pakistan Minister Musadik Malik.Arre bhai, koi inko batao... pichhle 1.5 saal se paani hi band haiVideo: ARY news pic.twitter.com/Kc1d2JxCN4— OsintTV 📺 (@OsintTV) June 29, 2026పహల్గామ్ తర్వాత.. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రవి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు పూర్తి హక్కులు ఉండగా.. సింధు, జీలం, చెనాబ్ నదుల జలాల్లో ఎక్కువ భాగం పాకిస్థాన్‌కు కేటాయించారు. అయితే 2025 ఏప్రిల్‌లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ దాడికి పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులే కారణమని చెబుతున్న భారత్.. సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ విశ్వసనీయంగా, శాశ్వతంగా ముగింపు పలికే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే భారత్వ వాదనను పాకిస్థాన్ ఖండించింది.యుద్ధ హెచ్చరికలు కూడా..సింధు జలాల వివాదంపై ఇప్పటికే పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు. నీటి భద్రత తమ జాతీయ భద్రతలో భాగమని, దానికి ముప్పు ఏర్పడితే భారత్‌పై యుద్ధానికి కూడా వెనుకాడబోమని వ్యాఖ్యానించారు. తాజా ప్రకటనలతో పాకిస్థాన్ మరోసారి అదే వైఖరిని కొనసాగించింది.భారత్ ఏమంటోంది?అయితే భారత్ మాత్రం పాక్ ప్రేలాపనలు పట్టించుకోవడం లేదు. తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో భారత ప్రతినిధి అనుపమా సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంలో భాగంగా ఉపయోగించే దేశం సహకార ఒప్పందాల ప్రయోజనాలు కోరడం తార్కికం కాదన్నారు. 1960లో కుదిరిన ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అతీతంగా శాశ్వత హక్కుగా పరిగణించలేమని ఆమె స్పష్టం చేశారు. గత ఆరు దశాబ్దాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, అందుకే సింధు జలాల ఒప్పందాన్ని కూడా ప్రస్తుత వాస్తవాలకు అనుగుణంగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.అలాగే జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించిన భారత్, అంతర్జాతీయ వేదికలను ఉపయోగించి పాకిస్థాన్ ఉగ్రవాదం, అంతర్గత సమస్యల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది.మరోసారి మాటల యుద్ధంపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పటికే రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక ఉద్రిక్తతలు పెరిగిన వేళ.. ఇప్పుడు సింధు జలాల ఒప్పందం కూడా మరో ప్రధాన వివాదంగా మారింది. ఒకవైపు పాకిస్థాన్ యుద్ధ హెచ్చరికలు, మరోవైపు ఉగ్రవాదం కొనసాగినంత కాలం సహకారం ఉండదన్న భారత్ వైఖరితో.. రెండు దేశాల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమవుతోంది. పరిస్థితి ఎలా మారుతుందన్నది ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. -
అఫ్గాన్ సరిహద్దుల వెంట దాడులు
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ సరిహద్దుల వెంబడి జరిపిన దాడుల్లో కనీసం 29 మంది మిలిటెంట్లు హతమయ్యారని పాకిస్తాన్ ప్రకటించింది. శనివారం కరాచీలోని పారామిలటరీ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై మిలిటెంట్లు జరిపిన దాడికి ఇది ప్రతిస్పందన అని సమాచార శాఖ మంత్రి అత్తా తరార్ చెప్పారు. నిఘా వర్గాలందించిన పక్కా సమాచారం మేరకు ఖైబర్ ప్రావిన్స్‌లోని బజౌర్ జిల్లా పరిధిలోని జమాత్ ఉల్ అహ్రార్, ఫిత్నా అల్ ఖ్వారిజ్లకు చెందిన మూడు స్థావరాలపై ఈ వైమానిక దాడులు జరిగాయన్నారు. పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ధ్వంసం చేసినట్లు చెప్పారు. కరాచీలోని పాక్ రేంజర్స్ హెడ్డాఫీసుపై దాడికి తమదే బాధ్యతంటూ నిషేధిత జమాతుల్ అహ్రార్ ప్రకటించుకుంది. 2,600 కిలోమీటర్ల పొడవైన అఫ్గాన్ సరిహద్దుల్లోని తాలిబన్ ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ ఫిబ్రవరిలో ఆపరేషన్ ఘజబ్ లిల్ హక్ పేరుతో కనీసం 53 ప్రాంతాల్లో భారీగా దాడులు చేపట్టింది. సరిహద్దులకు సమీపంలోని తమ ఖైబర్, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లలో అఫ్గాన్‌లోని తాలిబన్లు ఉగ్రదాడులను ప్రేరేపిస్తున్నారని పాక్ ఆరోపిస్తోంది. తాజాగా పాకిస్తాన్ చేపట్టిన దాడులను అఫ్గానిస్తాన్ ఖండించింది. తమ కునార్, పక్టియా, పక్టికా ప్రావిన్స్‌లపై దాడులకు దిగడాన్ని గగనతల అతిక్రమణ, సార్వభౌమత్వానికి భంగకరమంటూ పాక్ దౌత్యాధికారికి సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ కూడా కరాచీలోని రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై దాడికి అఫ్గాన్ మిలిటెంట్లే కారణమంటూ ఆ దేశ దౌత్యాధికారికి సమన్లు పంపించింది. -
17 ఏళ్లుగా అతడు అదృశ్యం.. ఇప్పటికీ పోరాడుతున్న కుమార్తె
పారిస్: బలోచ్ నేషనల్ మూవ్మెంట్ (బీఎన్‌ఎమ్) సీనియర్ నేత డాక్టర్ దీన్ ముహమ్మద్ బలోచ్ అదృశ్యమై 17 ఏళ్లు అవుతోంది. బలోచ్ స్వేచ్ఛ కోసం గొంతెత్తిన వారిని అదృశ్యం చేసి, వారి ఆచూకీని తెలియకుండా చేసే పాకిస్థాన్ చర్యలకు ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. తన తండ్రి ఆచూకీ తెలుసుకోవాలని, అదృశ్యమైన వారందరికీ న్యాయం చేయాలని ఆయన కుమార్తె సమ్మీ దీన్ బలోచ్ 17 ఏళ్లుగా శాంతియుతంగా పోరాడుతున్నా, ఆమెకూ బెదిరింపులు ఎదురవుతున్నాయని బలోచ్ నేషనల్ మూవ్మెంట్ ఆరోపిస్తోంది.ముహమ్మద్ బలోచ్ అదృశ్యానికి 17 ఏళ్లు పూర్తైన సందర్భంగా బీఎన్‌ఎమ్ అధ్యక్షుడు డాక్టర్ నసీమ్ బలోచ్ స్పందించారు. బలోచిస్థాన్‌లో అదృశ్యమైన వారు పడుతున్న బాధలకు ఈ ఘటన ఇప్పటికీ ప్రతీకగా నిలుస్తోందని అన్నారు.ఎక్స్‌లో డాక్టర్ నసీమ్ బలోచ్ దీనిపై మాట్లాడుతూ.. "ఇన్నేళ్లుగా ఓ వ్యక్తి అదృశ్యమైతే ఏ కుటుంబమైనా భరించలేదు. దాదాపు 2 దశాబ్దాలుగా ఆయన కుటుంబ సభ్యులు అనిశ్చితి, వేదన మధ్య జీవిస్తున్నారు. ఆయనకు ఏమైందో తెలుసుకునే కనీస హక్కు కూడా వారికి దక్కలేదు" అని అన్నారు.డాక్టర్ దీన్ ముహమ్మద్ కుమార్తె సమ్మీ దీన్ బలోచ్‌ను నసీమ్ బలోచ్ ప్రస్తావిస్తూ.. "తన తండ్రితో పాటు.. అదృశ్యమైన వారిని తిరిగి తీసుకురావాలన్న శాంతియుత పోరాటానికి ఆమె ధైర్యంగా అంకితమైంది. న్యాయం దక్కాల్సిన చోట కూడా ఆమె బెదిరింపులను ఎదుర్కొంటోంది. ఆమె మానవ హక్కుల పోరాటాన్ని, తన తండ్రి తిరిగి రావాలన్న ఉద్యమాన్ని విడిచిపెట్టేలా బెదిరింపులు, భయపెట్టే చర్యలు ఎదుర్కొంటోంది" అని ఆరోపించారు. ఈ ఘటన పాకిస్థాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు నిదర్శనమని ఆరోపించారు. ఇది కఠిన వాస్తవాన్ని బయటపెడుతోందని, పాకిస్థాన్‌లో ప్రభుత్వ తీరును ప్రశ్నించే వారికి మానవ హక్కులు, న్యాయం లేకుండా చేస్తున్నారని తెలిపారు. అదృశ్యమైన కుటుంబ సభ్యుడి గురించి సమాచారం అడగడాన్నే నేరంగా చూస్తున్నారని, మానవ హక్కుల పరిరక్షకులను గొంతెత్తినందుకు బెదిరిస్తున్నారని చెప్పారు. పాకిస్థాన్ పాలనలో తమ బలోచ్ ప్రజలు మౌలిక హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛను సాధించలేరని బీఎన్‌ఎమ్ నమ్ముతోందని అన్నారు. "చివరకు సత్యం, న్యాయమే గెలుస్తాయని మేము నమ్ముతున్నాం. మా లక్ష్యాలు నెరవేరే వరకు మా శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తాం" అని తెలిపారు.పోరాటంలో వెనక్కితగ్గని కుమార్తె డాక్టర్ దీన్ ముహమ్మద్ బలోచ్ కుమార్తె సమ్మీ దీన్ బలోచ్ బలోచిస్థాన్‌లో అదృశ్యాలపై గళమెత్తుతున్న ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త. ఆమె తండ్రి 2009లో అదృశ్యమైనప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం నిరంతరం పోరాడుతోంది.ఆమె బలోచ్ యక్జెహ్తీ కమిటీలో కీలక నాయకురాలిగా, వాయిస్ ఫర్ బలోచ్ మిస్సింగ్ పర్సన్స్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. 2014లో క్వెట్టా నుంచి ఇస్లామాబాద్ వరకు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి, తన తండ్రితో పాటు అదృశ్యమైన బలోచ్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.బలోచిస్థాన్‌లో బలవంతపు అదృశ్యాలు, న్యాయ విచారణ లేకుండా జరిగే హత్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ వేదికలపై కూడా ఆమె స్వరం వినిపిస్తోంది. మానవ హక్కుల పరిరక్షణలో చేసిన కృషికి గుర్తింపుగా ఆమెకు 2024లో ఫ్రంట్ లైన్ డిఫెండర్స్ అవార్డు లభించింది.ఆందోళన కార్యక్రమాల సందర్భంగా ఆమెను పలుసార్లు పాక్ బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు, విదేశీ ప్రయాణాన్ని కూడా అడ్డుకున్నట్లు మానవ హక్కుల సంస్థలు పేర్కొన్నాయి. తండ్రి ఆచూకీ కోసం మొదలైన ఆమె పోరాటం, ఇప్పుడు బలోచిస్థాన్‌లో అదృశ్యమైన వేలాది మంది కుటుంబాల తరఫున న్యాయం కోరే ఉద్యమంగా మారింది. -
పాక్ దొంగ బుద్ధి.. డబుల్ ట్యాప్ వ్యూహం!
పాకిస్తాన్ కపట దాడులతో.. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు మరోసారి నెత్తురోడింది. అర్ధరాత్రి వేళ.. జనావాసాలు, మసీదులపై మొదటిసారి దాడులు జరగగా.. సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలోనూ.. పాక్ అనైతికంగా మరోసారి మెరుపు దాడులు జరిపింది. ఈ ఘటనల్లో కనీసం 35 మంది మరణించారని, వాళ్లంతా నిషేధిత సంస్థకు చెందిన వ్యక్తులని పాక్ ప్రకటించుకుంది. అయితే ఆఫ్ఘన్ అధికారులు మాత్రం మృతుల్లో ఎక్కువ మంది అమాయక ప్రజలే ఉన్నారని చెబుతున్నారు.పక్తికా, పక్తియా, కునార్ ప్రాంతాల్లో పాకిస్తాన్ వైమానిక దళం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో దాడులు ప్రారంభించినట్లు సమాచారం. 25 నిమిషాల వ్యవధిలోనే అదే ప్రాంతాల్లో రెండో దశ దాడులు జరిగినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. వివాదాస్పదంగా భావించే “డబుల్ ట్యాప్” వ్యూహం ఈ దాడుల్లో అమలయ్యిందన్న ఆరోపణలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. మొదటి దాడుల తర్వాత సహాయక చర్యలకు వెళ్లిన వాళ్లపైనా రెండోసారి మెరుపు దాడి జరిగింది. ఈ ఘటనలతో మరణాల సంఖ్య పెరిగిందని, గాయపడిన వారి సంఖ్య వందకు పైగా చేరిందని తెలుస్తోంది.Pakistani airstrikes reportedly hit civilian areas in Afghanistan’s Paktia, Paktika, and Kunar provinces, killing more than 40 people—including women and children—and injuring dozens more. Reports describe it as one of the deadliest cross-border attacks in recent years pic.twitter.com/08pAHmtsKk— Israel Army (@Israeldefences) June 29, 2026పాకిస్తాన్ ప్రభుత్వం ఈ చర్యలను ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యంగా చేసిన “ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్లు”గా సమర్థించుకుంటోంది. దేశంలో ఇటీవల జరిగిన దాడులకు ప్రతిస్పందనగానే ఈ సైనిక చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా టీపీపీ అనుబంధ గ్రూపులపై చర్యల భాగంగా ఈ దాడులు జరిగినట్లు పాకిస్తాన్ వాదిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. పౌర ప్రాంతాలు, ఇళ్లు, మసీదులే లక్ష్యంగా మారాయని, మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని కాబూల్ అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్ చేసిన చర్యలను “అక్రమ దాడులు”గా అభివర్ణిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.2021 తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటూ వస్తున్నాయి. తరచూ సరిహద్దు ఉద్రిక్తతలు, పరస్పర ఆరోపణలు కొనసాగుతుండటంతో ప్రాంతంలో అస్థిరత నెలకొంది. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలు కూడా పూర్తిగా నిలబడలేకపోయాయి. తాజా దాడులతో సరిహద్దు గ్రామాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ఘటనలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఇల్లీగల్ కాదా?.. “డబుల్ ట్యాప్” అనే సైనిక వ్యూహాన్ని అంతర్జాతీయ చర్చల్లో చాలాసార్లు అత్యంత వివాదాస్పదమైన, మానవతా పరంగా తీవ్రంగా విమర్శించబడే పద్ధతిగా పేర్కొంటారు. సాధారణంగా మొదటి దాడి తర్వాత సహాయక బృందాలు, వైద్య సిబ్బంది, మీడియా ప్రతినిధులు చేరుకునే సమయంలో అదే ప్రాంతంపై రెండోసారి దాడి చేయడాన్ని డబుల్ ట్యాప్ దాడులంటారు. మానవ హక్కుల సంస్థలు ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నాయి. అయితే..ఇది అధికారిక అంతర్జాతీయ చట్టాల్లో ప్రత్యేకంగా “illegal by name”గా నిర్వచించబడకపోయినా.. పౌరుల భద్రత, యుద్ధ నిబంధనలు, జెనీవా కన్వెన్షన్ స్పిరిట్‌కు విరుద్ధమనే విమర్శలు బలంగా వినిపిస్తాయి. గతంలో కూడా ఇలాంటి వ్యూహాలపై ఆరోపణలు వివిధ యుద్ధాల సమయంలోనూ వినిపించాయి. ఇప్పుడు ఆఫ్ఘన్ సరిహద్దు ఘటనల్లో కూడా అదే తరహా “డబుల్ ట్యాప్” వ్యూహం ఉపయోగించారన్న ఆరోపణలు రావడంతో, ఇది మళ్లీ అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. -
పాక్ పారా మిలటరీ హెడ్డాఫీసుపై ఉగ్ర దాడి
కరాచీలోని పారా మిలటరీ విభాగం పాకిస్తాన్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై శనివారం రాత్రి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గులిస్తాన్–ఇ– జౌహార్ ప్రాంతంలోని ఈ కార్యాలయం గేట్‌ను వాహనంతో ఢీకొట్టిన సాయుధులు లోపలికి వస్తూనే కాల్పులకు దిగారని అధికారులు తెలిపారు. బలగాలు వెంటనే ధీటుగా స్పందించాయన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ముగ్గురు భద్రతా సిబ్బంది చనిపోయినట్లు తెలిసిందన్నారు. రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్(TTP) నుండి విడిపోయిన ఉగ్రవాద ముఠా 'జమాత్-ఉల్-అహ్రార్' ప్రకటించుకుంది. 'ఖులాఫా-ఎ-రషీదీన్ ఇష్తిషాదీ బ్రిగేడ్' అనే ఆత్మాహుతి దళం ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపింది. పాకిస్తాన్లో ఇటీవల పోలీసులు, భద్రతా బలగాలను లక్ష్యంగా ఉగ్రవాద దాడులు భారీగా పెరిగాయి. పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఉగ్రదాడిపై దర్యాప్తును ప్రారంభించాయి. కంట్రోల్ రూమ్, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఉగ్రవాదులు లోపలికి ఎలా ప్రవేశించారనే కోణంలో విచారణ చేపట్టారు. కరాచీలో హై అలర్ట్స్ ప్రకటించారు. -
షాకింగ్: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో ఉగ్రనేతలు?!
మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ కార్యక్రమంలో లష్కర్-ఎ-తోయిబా (LeT) కీలక నేతలు, అందునా 2025 పహల్గామ్ దాడి అనుమానిత కీలక సూత్రధారి సైఫుల్లా కసూరి సహా పలువురు హాజరైనట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి.Ex Cricketer Shoaib Akhtar's Brother died of heart attack!Shahid Akhtar's funeral was attended by PMML Islamabad President Inam ur Rehman Kamboh and other LeT terrorists.PMML serves as a proxy for LeT. Why Were LeT Leaders/Terrorists There? pic.twitter.com/ldJiocolCl— Megh Updates 🚨™ (@MeghUpdates) June 27, 2026సైఫుల్లా కసూరి గతంలో భారత్‌పై పలు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 26/11 తరహా దాడుల గురించి, సముద్ర మార్గ దాడుల గురించి అతను చేసిన వ్యాఖ్యలు భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగించాయి. పహల్గామ్ దాడికి ఇతనే సూత్రధారి అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు సైతం బలంగా ఉన్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలతో అతని కార్యకలాపాలు మరోసారి చర్చలోకి వచ్చాయి. ఎల్ఈటీకి రాజకీయ ముఖచిత్రంగా భావించే పాకిస్తాన్ మార్కాజీ ముస్లిం లీగ్ (PMML) ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం.జూన్ 24న గుండెపోటుతో అక్తర్ సోదరుడు మరణించారు. ఆయన కూడా మాజీ క్రికెటరే. గురువారం ఇస్లామాబాద్‌లోని హెచ్-8 గ్రేవ్‌యార్డ్‌లో అంత్యక్రియలు జరిగాయి. ఆ సమయంలో ప్రార్థనల సమయంలోనే వాళ్లంతా అక్కడ హల్చల్ చేశారు. అయితే.. క్రికెట్లో రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరున్న షోయబ్ అక్తర్.. భారత్‌ను ద్వేషించేలా మాట్లాడరు!. కానీ దాయాదుల పోరు సందర్భాల్లో ఎమోషనల్, ఫైర్డ్ కామెంట్స్ చేస్తారు. అదే సమయంలో భారత క్రికెట్ సిస్టమ్‌ను చాలాసార్లు ఓపెన్‌గా ప్రశంసించారు కూడా. అయితే షోయబ్ అక్తర్‌కు వాళ్లకు సంబంధాలు ఉన్నాయా? లేదంటే షాహిద్ అక్తర్‌కు వాళ్లు దగ్గరా?.. ఇప్పటివరకు షోయబ్ అక్తర్ నుంచిగానీ.. ఆయన కుటుంబం నుంచి ఎటువంటి అధికారిక స్పందన వెలువడలేదు. Prominent figures and terrorists linked to Lashkar-e-Taiba (LeT) openly attended the funeral of Shahid Akhtar, the elder brother of former Pakistani cricketer Shoaib Akhtar, in Islamabad. pic.twitter.com/Src3ftlmf1— Vyom Pallav 🇮🇳 (@VyomPallav) June 27, 2026అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం లేదంటే స్థానిక భద్రతా సంస్థల నుంచి కూడా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాధిక్ కూడా అంత్యక్రియలకు హాజరు కావడం గమనార్హం. అయితే సోషల్ మీడియాలో మాత్రం నిషేధిత సంస్థల నేతల వీడియోలు వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. సాధారణంగా అత్యంత రహస్యంగా, నీడల్లో కనిపించే ఈ నెట్వర్క్ సభ్యులు ఓ పబ్లిక్ ఈవెంట్లో ఇలా ప్రత్యక్షమవడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో నిషేధాలు ఉన్నప్పటికీ ఈ ఉగ్రసంస్థలు పాక్‌లో రాజకీయ ముసుగులో కొనసాగుతున్నాయా? అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ సంఘటన పాకిస్తాన్లో ఉగ్ర నెట్వర్క్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదన్న విమర్శలకు బలం చేకూరుస్తోంది.భారత్ గతంలో చేపట్టిన చర్యలు, సరిహద్దు భద్రతా చర్యల నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు మరింత సున్నితంగా మారాయి. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతీయ భద్రతా సమీకరణాల్లో ఈ ఘటన కొత్త చర్చకు దారి తీసింది. పరిశీలకులు మాత్రం.. నిషేధిత సంస్థలు పూర్తిగా కనుమరుగుకాకుండా “పాలిటికల్ షెల్టర్” లేదా “ఫ్రంట్ ఆర్గనైజేషన్స్” ద్వారా కొనసాగుతున్న అవకాశం ఉందని అంటున్నారు.LeT నెట్వర్క్ నేపథ్యంలష్కర్-ఎ-తోయిబా అనేది 1990ల చివర్లో ఏర్పడిన ఉగ్ర సంస్థగా గుర్తింపు పొందింది. భారత్‌లో 2008 ముంబై దాడులు సహా పలు భారీ దాడుల్లో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయంగా ఇది నిషేధిత ఉగ్ర సంస్థగా గుర్తించబడింది. సైఫుల్లా కసూరి వంటి నేతలు ఈ సంస్థలో కీలక కమాండ్ స్థాయిలో ఉన్నారని భద్రతా విశ్లేషణలు చెబుతున్నాయి. -
భారత్ 7 పాకిస్తాన్ 1
లండన్: పురుషుల ప్రొ హాకీ లీగ్ టోర్నీలో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును మరోసారి చిత్తు చేసింది. శుక్రవారం జరిగిన తమ 15వ లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 7–1 గోల్స్ తేడాతో పాకిస్తాన్ జట్టుపై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున సుఖ్జీత్ సింగ్ (20వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (26వ ని.లో), హార్దిక్ సింగ్ (34వ ని.లో), జుగ్రాజ్ సింగ్ (35వ ని.లో), అభిషేక్ (41వ ని.లో), రాజ్‌కుమార్ పాల్ (44వ ని.లో), దిల్‌ప్రీత్ సింగ్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. పాకిస్తాన్ జట్టుకు అబూ మహమూద్ (13వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన తమ 14వ లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు ‘షూటౌట్’లో 1–4తో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. భారత్, పాకిస్తాన్ జట్లు 15 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. 17 పాయింట్లతో భారత్ 7వ స్థానంలో ఉండగా... ఆడిన 15 మ్యాచ్‌ల్లోనూ ఓడిన పాక్ చివరిదైన 9వ స్థానంలో కొనసాగుతోంది. భారత జట్టు తమ చివరి మ్యాచ్‌ను రేపు ఇంగ్లండ్‌తో ఆడుతుంది. -
పాకిస్తాన్లో ఫ్రెంచ్ మహిళకు విముక్తి
ఇస్లామాబాద్: ఏళ్ల తరబడి పాకిస్తాన్లో బందీగా ఉన్న ఓ ఫ్రెంచ్ మహిళ, ఆమె ఐదుగురు పిల్లలకు విముక్తి లభించింది. పిల్లల్లో ఒకరైన టీనేజ్ కుమారుడు ఇంటి నుంచి తప్పించుకుని బయటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. జూన్ 18న వారిని దాచిన ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అత్యంత శిథిలావస్థలో ఉన్న గది నుంచి 54 ఏళ్ల సిల్వీ యాస్మినా, ఆమె పిల్లలను రక్షించారు. వారిని పెషావర్‌లోని ఆశ్రయానికి తీసుకువెళ్లారు. ఆ కుటుంబం ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్లాలని న్నట్లు పోలీసులు తర్వాత ఫ్రెంచ్ రాయబార కార్యాలయానికి తెలియజేశారు. వారి శరీరాలపై గాయాలు, దెబ్బల గుర్తులున్నాయని పోలీసులు తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న బారా పర్వత ప్రాంతంలో ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఆ్రస్టేలియాలో అక్రమంగా నివస్తున్నాడు. ఆ సమయంలో సిల్వీతో పరిచయం ఏర్పడింది. 2003లో వారిద్దరి వివాహం జరిగింది. 2014లో ఆ్రస్టేలియా నుంచి పాకిస్తాన్‌కు వచ్చారు. అప్పటికే వారికి ఇద్దరు పిల్లలు. పాకిస్తాన్‌కు వచ్చిన తరువాత మరో ముగ్గురు పిల్లలు జన్మించారు. అయితే పాకిస్తాన్‌కు వచ్చినప్పటినుంచే పరిస్థితులు మారిపోయాయయి. మహిళను ఎవరినీ కలవడానికి అనుమతించలేదు. ఆ ఇద్దరు పెద్ద పిల్లలు చదువు మాన్పించేశారు. అంతేకాదు.. పాకిస్తాన్లో పుట్టిన ముగ్గురు పిల్లలయితే పాఠశాల ముఖమే చూడలేదు. భర్త తనను, పిల్లలను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని సిల్వీ తెలిపారు. ‘‘12 ఏళ్లపాటు మా స్వేచ్ఛను హరించాడు. మమ్మల్ని రోజూ కొట్టేవాడు. నన్ను, నా పిల్లలను ఇతర వ్యక్తులతో కలవకుండా అడ్డుకున్నాడు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేశాడు. నా భవిష్యత్తు అప్పటికే నాశనమైపోయింది. నా పిల్లల భవిష్యత్తు కూడా నాశనమవుతుందని భయపడ్డాను.’’అని ఆమె పోలీసులకు చెప్పారు. -
నా భార్య సపోర్ట్ ఇండియాకే..!
భారత్‌తో క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి పాక్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన ప్రతిసారి అతడి భార్య టీమిండియానే గెలవాలని కోరుకుంటుందని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.హసన్ అలీ భార్య సమియా అర్జూ భారత్‌లో (హర్యానా) జన్మించిందన్న విషయం చాలామందికి తెలీదు. ఆమె ఫరీదాబాద్‌లోని మానవ్ రచనా యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివింది. అనంతరం దుబాయ్‌లోని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లైట్ ఇంజినీర్‌గా పని చేసింది. అక్కడే హసన్ అలీతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2019లో వీరిద్దరూ దుబాయ్‌లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.నేను కూడా బాగా ఆడాలని కోరుకుంటుంది..!‘పాక్ ప్యాషన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హసన్ అలీకి ఓ సరదా ప్రశ్న ఎదురైంది. "మీ భార్య భారతీయురాలు కాబట్టే పాకిస్తాన్ భారత్‌పై గెలవకూడదని కోరుకుంటుందా? అందుకే పాక్ జట్టు ఓడిపోతుందా?" అని ప్రశ్నించగా ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.తన భార్య సమియా అర్జూ భారతీయురాలు కావడంతో సహజంగానే భారత జట్టుకు మద్దతు ఇస్తుందని, అయితే అదే సమయంలో తాను పాకిస్తాన్ తరఫున బాగా ఆడాలని కూడా కోరుకుంటుందని తెలిపాడు."ఆమె నాకు ఎప్పుడూ మద్దతుగా ఉంటుంది. కానీ ఆమె భారతీయురాలు కాబట్టి భారత్ గెలవాలని కూడా కోరుకుంటుంది. అందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు" అని హసన్ అలీ వ్యాఖ్యానించాడు.అదే భారత్ విజయ రహస్యంభారత్ వరుసగా పాకిస్తాన్‌పై ఆధిపత్యం చెలాయించడానికి అసలు కారణం ఏమిటన్న ప్రశ్నకు హసన్ అలీ మరింత ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. భారత క్రికెట్ వ్యవస్థ ప్రస్తుతం సరైన దిశలో సాగుతోందని, ముఖ్యంగా ఐపీఎల్, దేశీయ క్రికెట్ వ్యవస్థ ఆటగాళ్లకు ఏడాది పొడవునా నాణ్యమైన పోటీని అందిస్తున్నాయని పేర్కొన్నాడు. అదే భారత జట్టు ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చెలాయించడానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు.ఇదిలా ఉంటే, హసన్ అలీ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్లో యార్క్‌షైర్ తరఫున ఆడుతున్నాడు. గత కొంతకాలంగా పాకిస్తాన్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాడు. వన్డేలు, టీ20ల్లో అవకాశాలు తగ్గిపోవడంతో మళ్లీ జాతీయ జట్టులో స్థిర స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నాడు. -
సిగ్గులేకుండా పందుల్లా మెక్కుతున్నారు.. పాక్ మహిళా క్రికెటర్లపై ఇంజమామ్ సీరియస్
-
పీవోకేపై పాకిస్తాన్ కఠిన వ్యూహాం!
ముజఫరాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో నెలలుగా కొనసాగుతున్న ప్రజా ఆందోళనలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. నిరసనలను అణచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఆహారం, మందులు, ఇంధనం వంటి నిత్యవసర వస్తువుల సరఫరాలను అడ్డుకుంటోందని స్థానిక సంస్థలు, ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఈ చర్యల వల్ల ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలు మరింత సంక్షోభంలోకి నెట్టబడ్డారని చెబుతున్నారు.ఆందోళనకారుల ఆరోపణల ప్రకారం పంజాబ్ ప్రావిన్స్ నుంచి పీవోకేలోకి వచ్చే ప్రధాన సరఫరా మార్గాలపై భద్రతా తనిఖీల పేరుతో సరుకు వాహనాలను నిలిపివేస్తున్నారు. దీనివల్ల గోధుమలు, పిండి, కూరగాయలు, వంటనూనె, పెట్రోల్, డీజిల్, వైద్య సామగ్రి వంటి వస్తువుల సరఫరా తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మెడికల్ షాపుల్లో మందుల కొరత ఏర్పడిందని, ఆసుపత్రులు కూడా అవసరమైన ఔషధాల కోసం ఇబ్బందులు పడుతున్నాయని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇంధన కొరత కారణంగా ప్రజా రవాణా, సరుకు రవాణా వ్యవస్థలు కూడా ప్రభావితమయ్యాయి.పెరుగుతున్న ఒత్తిడి..పీవోకేలో ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు పరిమితంగా ఉండటం, జీవన వ్యయం పెరగడం, ప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ దిగ్బంధం ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్రంగా పడుతోంది. మార్కెట్లలో సరుకుల కొరత కారణంగా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల ప్రజలు నిత్యవసర వస్తువుల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.పాక్ ప్రభుత్వ వైఖరిఈ ఆరోపణలను పాక్ ప్రభుత్వం అధికారికంగా ఖండించింది. భద్రతా కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో తనిఖీలు పెంచామని, సరఫరాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేయలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఉద్యమకారులు మాత్రం ఇది ప్రజా ఉద్యమాలను బలహీనపరిచేందుకు చేపట్టిన వ్యూహమని ఆరోపిస్తున్నారు.ఎందుకు ఆందోళనలు?గత కొంతకాలంగా పీవోకేలో విద్యుత్ చార్జీల పెంపు, అధిక పన్నులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిత్యవసరాల ధరల పెరుగుదల వంటి సమస్యలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాంతం అయినప్పటికీ స్థానిక ప్రజలకు అధిక ధరలకు కరెంట్ సరఫరా చేయడంపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, సమ్మెలు, బంద్ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. గత ఏడాది జరిగిన నిరసనల తర్వాత కొన్ని డిమాండ్లను అంగీకరిస్తామని పాక్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, వాటి అమలులో పురోగతి లేకపోవడంతో ప్రజలు మళ్లీ వీధుల్లోకి వచ్చారు.భద్రతా బలగాల కఠిన చర్యలు..ఇటీవలి వారాల్లో పీవోకేలో అనేక ప్రాంతాల్లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలువురు ఉద్యమ నాయకులను అరెస్ట్ చేయడం, సమావేశాలకు అనుమతులు నిరాకరించడం, నిరసనకారులపై కేసులు నమోదు చేయడం వంటి చర్యలు వివాదానికి దారితీశాయి. మానవ హక్కుల కార్యకర్తలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ సమస్యలను చెప్పుకునే హక్కును అణచివేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.అంతర్జాతీయంగా చర్చ..పీవోకేలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు కశ్మీర్ అంశాన్ని ప్రపంచ వేదికలపై ప్రస్తావించే పాకిస్తాన్, మరోవైపు తన ఆధీనంలోని ప్రాంతంలో ప్రజా అసంతృప్తిని ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రజల ఆర్థిక సమస్యలను పరిష్కరించడం కంటే కఠిన చర్యలకు ప్రాధాన్యం ఇస్తే పరిస్థితి మరింత సంక్లిష్టమయ్యే అవకాశం ఉంది. సరఫరాల కొరత కొనసాగితే పీవోకేలో మానవతా సంక్షోభం తలెత్తే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. -
పాక్ సైన్యాధ్యక్షుడి కోసం మొస్సాద్ సీక్రెట్ ఆపరేషన్?!
ఇరాన్-అమెరికా శాంతి చర్చల నేపథ్యంలో.. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌ను హత్య చేయడానికి ఇజ్రాయెల్ ప్లాన్ చేసిందా?.. ఇందుకోసం ఆ దేశపు గూఢచారి సంస్థ మొస్సాద్‌ను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దించారా?.. ఓ బ్రెజిలియన్ జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా.. పాకిస్థాన్‌తో పాటు ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో రూపొందిన ఒప్పందానికి సైతం "ఇస్లామాబాద్ మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్"గా పిలిచారు. ఆపై తదుపరి చర్చలు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగాయి. వీటికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశపు సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ కూడా హాజరయ్యారు.అయితే.. ఈ నేపథ్యంతో ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత మారియో నాఫల్ నిర్వహించిన పోడ్కాస్ట్లో బ్రెజిలియన్ జర్నలిస్టు, జియోపాలిటికల్ విశ్లేషకుడు పెపే ఎస్కోబార్ సంచలన ఆరోపణలకు దిగాడు. మొస్సాద్(Mossad) సంస్థ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆదేశాల మేరకు అసీం మునీర్‌తో పాటు పాకిస్థాన్ ప్రతినిధి బృందంపై హత్యాయత్నానికి సిద్ధమైంది. ఈ విషయమై పాకిస్థాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌కు అత్యంత విశ్వసనీయ సమాచారం అందింది అని పేర్కొన్నాడు. అంతేకాక.. ఈ సమాచారం అందిన వెంటనే పాకిస్థాన్ తన మధ్యవర్తుల ద్వారా ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరిక పంపిందని ఎస్కోబార్ చెప్పారు. "మా ప్రతినిధి బృందాన్ని తాకితే మిమ్మల్ని ప్రపంచ పటంలో నుంచి చెరిపేస్తాం" అనే సందేశం పాక్ ఇజ్రాయెల్‌కు పంపిందని ఆయన ఆ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. మొస్సాద్ అనేది ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత కీలక విదేశీ గూఢచారి సంస్థ. దీని పూర్తి పేరు "ది ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్". 1949లో స్థాపించబడిన ఈ సంస్థ.. విదేశాల్లో గూఢచర్యం, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, రహస్య సమాచార సేకరణ వంటి బాధ్యతలు నిర్వహిస్తుంది. శత్రు దేశాల్లో రహస్య ఆపరేషన్లు నిర్వహించడంలో, ఇజ్రాయెల్‌కు ముప్పుగా భావించే వ్యక్తులను గుర్తించి నిర్వీర్యం చేయడంలో మొస్సాద్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలైన అమెరికా సీఐఏ, బ్రిటన్ ఎంఐ6, రష్యా ఎఫ్ఎస్బీ(గతంలో KGB) వంటి ప్రముఖ గూఢచారి సంస్థల సరసన దీనికి చోటు ఉంది.ఇదిలా ఉండగా, పాకిస్థాన్-ఇజ్రాయెల్ సంబంధాలు ఎప్పటి నుంచో ఉద్రిక్తంగానే ఉన్నాయి. పాకిస్థాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్‌ను దేశంగా అధికారికంగా గుర్తించలేదు. గాజా విషయంలోనూ ఇజ్రాయెల్‌పై పాక్ ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూ వస్తోంది. ఈ విషయమై ఇటీవల పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఇజ్రాయెల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో పాకిస్థాన్ ‘ఇరాన్-అమెరికా’ చర్చల్లో నిజంగా తటస్థ మధ్యవర్తిగా వ్యవహరించగలదా? అనే సందేహాలు ఇజ్రాయెల్ వర్గాలు వ్యక్తం చేశాయి.అయితే మునీర్ హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై పాకిస్థాన్ ప్రభుత్వం గానీ, సైన్యం గానీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. అలాగే ఇటు ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ఈ ఆరోపణలపై స్పందించలేదు. అయితే.. ఎస్కోబార్ చేసిన ఆరోపణలను పాకిస్థాన్‌కు చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. పాక్ ప్రముఖ జర్నలిస్టు సయ్యద్ తలత్ హుస్సేన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ "ఇందులో ఒక్క ముక్క నిజం కూడా లేదు. అలాంటి ఘటన ఏదీ జరగలేదు" అని స్పష్టం చేశారు. ఒక సీనియర్ భద్రతాధికారి కూడా ఈ కథనాన్ని "వక్రీకృత ప్రచారం"గా అభివర్ణించినట్లు వెల్లడించారు. దీంతో ప్రస్తుతానికి అసీం మునీర్‌పై మొస్సాద్ హత్యాయత్నం జరిగిందన్న ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో.. కొన్ని వర్గాల్లో మాత్రమే చక్కర్లు కొడుతున్న ఆరోపణగానే ఉంది. -
అప్పుడు పాక్.. ఇప్పుడు బంగ్లాదేశ్.. భారత్ అప్రమత్తం
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ ప్రస్తుతం చైనాలో అధికారిక పర్యటనలో ఉన్నారు. చైనా ప్రధానమంత్రి లీని, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలవనున్నారు. ఈ రెండు దేశాల మధ్య చర్చల్లో ప్రధాన అంశంగా బంగ్లాదేశ్ జె-10సీఈ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదన, తుది చర్చలు వంటివి ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.పాకిస్థాన్ కూడా ఈ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌పై వీటిని ఉపయోగించినట్లు సమాచారం. ఆ సమయంలో భారత వైమానిక దళం పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాద ముప్పులను సమర్థంగా నిర్వీర్యం చేసింది.బంగ్లాదేశ్ 24 చైనా జె-10సీఈ యుద్ధ విమానాల కొనుగోలు ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ చైనా పర్యటనలో ఈ ఒప్పందం కీలక ఫలితంగా నిలవనుందని భావిస్తున్నారు.పలు నివేదికల ప్రకారం.. రక్షణ, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకుంటున్నాయి చైనా, పాకిస్థాన్. 2026 ఆగస్టు నాటికి యుద్ధ విమానాల కొనుగోలును ఖరారు చేయాలని బంగ్లాదేశ్ ఆశిస్తోంది. జె-10సీ అనేది చైనా వైమానిక దళం వినియోగించే యుద్ధ విమానం. జె-10సీఈ అనేది ఇతర దేశాలకు విక్రయించేందుకు రూపొందించిన వెర్షన్.ఈ కొనుగోలుతో పాకిస్థాన్ తర్వాత ఈ ప్రత్యేక విమానాన్ని వినియోగించే రెండో విదేశీ దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తుంది. ఒక్కో యుద్ధ విమానం విలువ సుమారు $40 మిలియన్లు ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన తుది వివరాలపై చైనా, బంగ్లాదేశ్ అధికారులు ఇంకా చర్చలు జరుపుతున్నట్లు సోర్సెస్ తెలిపాయి.బంగ్లాదేశ్ వైమానిక దళాన్ని ఆధునికీకరణ చేసుకోవాలనుకుంటోంది. జె-10సీఈ ఆ దేశ వైమానిక యుద్ధ సామర్థ్యాలను బాగా పెంచవచ్చు. అదే సమయంలో దక్షిణాసియాలో వ్యూహాత్మక ప్రభావాలు కూడా ఉంటాయి. ఇది బంగ్లాదేశ్-చైనా రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు బంగాళాఖాతంలో ప్రాంతీయ సమతౌల్యాన్ని ప్రభావితం చేయవచ్చు.ఎక్కడ మోహరిస్తారు? భారత్ విషయానికి వస్తే, మన దేశం రెండు పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఒప్పందం కుదిరి యుద్ధ విమానాలు బంగ్లాదేశ్‌కు చేరితే, వాటిని ఎక్కడ మోహరిస్తారన్నది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది.బంగ్లాదేశ్ ఇప్పటికే ఉత్తర బంగ్లాదేశ్‌లోని లాల్మొనిర్హాట్ వైమానిక స్థావరం (బీఏఎఫ్ స్టేషన్ లాల్మొనిర్హాట్)ను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మిత్రదేశాల వైమానిక స్థావరంగా ఇది పనిచేసింది. ఈ స్థావరం భారత సరిహద్దుకు కేవలం 12-15 కి.మీ దూరంలో ఉంది. వ్యూహాత్మకంగా కీలకమైన సిలిగురి కారిడార్‌కు సమీపంలోనూ ఉంది. ఈ స్థావర పునరుద్ధరణకు చైనా సాయం చేసే అవకాశంపై చర్చలు జరిగాయి. ఈ బంగ్లాదేశ్ వైమానిక దళ కేంద్రంలో కొత్త యుద్ధ విమాన హ్యాంగర్లు నిర్మించే పనులు కూడా ఉన్నాయి.కేంద్ర సర్కారు ఏమన్నది? భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఈ స్థావరం ఉండటంతో భారత్‌లో భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2025 ఆగస్టు 8న లోక్‌సభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ మాట్లాడుతూ.. “బంగ్లాదేశ్‌లోని లాల్మొనిర్హాట్ వైమానిక స్థావరానికి సంబంధించిన నివేదికలను భారత ప్రభుత్వం గమనించింది. 2025 మే 26న బంగ్లాదేశ్ సైన్యం సైనిక కార్యకలాపాల సంచాలకుడు నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని కూడా గమనించింది. ప్రస్తుతం లాల్మొనిర్హాట్ వైమానిక స్థావరాన్ని సైనిక అవసరాలకు వినియోగించే ప్రణాళికలు లేవని ఆయన చెప్పారు. జాతీయ భద్రతపై ప్రభావం చూపే అన్ని పరిణామాలను భారత ప్రభుత్వం గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోంది” అని తెలిపారు.పాకిస్థాన్ వైమానిక దళం ప్రస్తుతం 36 చైనా తయారీ చెంగ్డు జె-10సీఈ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. జె-10 విమానాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్న ఆగ్నేయాసియా దేశాల్లో ఇండోనేషియా కూడా ఒకటి. కనీసం 42 చెంగ్డు జె-10 యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ఇండోనేషియా ప్రకటించింది. చైనా యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న నిర్ణయం ఇండోనేషియా రక్షణ కొనుగోలు విధానంలో మార్పును సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఆ దేశం రష్యా, అమెరికాపై ఆధారపడేది. -
పాక్‌లోకి భారత్ విమానం.. హెచ్చరికలతో తప్పిన ప్రమాదం
అమృత్సర్: ఢిల్లీ నుంచి అమృతసర్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యతో పెద్ద ప్రమాదంలో పడింది. సాంకేతిక సమస్యతో పొరపాటున పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. అనంతరం పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ హెచ్చరికలతో అప్రమత్తమైన పైలట్లు, వెంటనే విమానాన్ని సరిదిద్ది తిరిగి భారత గగనతలంలోకి మరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అసలేం జరిగింది?జూన్ 22 రాత్రి రాత్రి 9:18 ప్రాంతంలో ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI-479) బయిలుదేరింది. అయితే సాంకేతిక సమస్యలతో పొరపాటున పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. దీంతో పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు, వెంటనే విమానాన్ని సరిదిద్ది తిరిగి భారత గగనతలంలోకి ప్రవేశపెట్టారు. దీంతో విమానం యూ-టర్న్ తీసుకుని సురక్షితంగా భారత్‌లోకి ప్రవేశించింది.అయితే విమానం అమృత్సర్ చేరుకునే సమయానికి ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రద్దీ ఎక్కువగా ఉండటంతో, అధికారులు దానిని తిరిగి ఢిల్లీకి మళ్లించారు.అనంతరం ఢిల్లీలో తనిఖీల అనంతరం తిరిగి బయలుదేరి, జూన్ 23 తెల్లవారుజామున 2:20 గంటలకు విమానం అమృత్‌సర్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.పాకిస్థాన్ ల్యాండ్‌లోకి ఎందుకు వెళ్లకూడదు?భారతదేశానికి చెందిన ఏ విమానమూ పాకిస్థాన్ గగనతలంలోకి వెళ్లకూడదు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇరు దేశాలు ఎయిర్ స్పేస్ బ్యాన్ విధించుకున్నాయి. ఒక దేశ విమానాలు మరో దేశంలో ఎట్టిపరిస్థితుల్లో గగన స్థలంలో సంచరించకూడదు. ఈ గడువను నెలనెల పొడిగింపు చేస్తూ వస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ నిషేధం జూలై 24, 2026 వరకు అమల్లో ఉంటుంది. -
‘బబితా’ కాదు ‘ఖదీజా’.. స్లీపర్ సెల్ నెట్వర్క్ గుట్టురట్టు
జైపూర్: రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) తాజాగా ఒక అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఛేదించింది. పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘జైష్-ఎ-మహమ్మద్’తో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై బబితా ధాకడ్ అలియాస్ ఖదీజా అనే మహిళను అధికారులు జైపూర్‌లో అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏటీఎస్, ఆమె దేశ వ్యతిరేక శక్తులతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించింది. ప్రస్తుతం జూన్ 27 వరకు ఆమెను ఏటీఎస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.పాకిస్తాన్ చేతుల్లో సోషల్ మీడియా ఖాతాలుసవాయ్ మాధోపూర్ జిల్లాకు చెందిన బబితా ధాకడ్ జైపూర్‌లోని వాటికా ప్రాంతంలో తండ్రితో కలిసి నివసిస్తోంది. గత కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న ఈమె సోషల్ మీడియా, వాట్సాప్ ఖాతాలను పాకిస్తాన్ నుంచే ఆపరేట్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. తన మొబైల్ సిమ్ కార్డుకు సంబంధించిన యాక్సెస్ క్రిడెన్షియల్స్ (రహస్య సమాచారం) మొత్తాన్ని ఆమె సరిహద్దు అవతలి ఉన్న హ్యాండ్లర్లకు అప్పగించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిఘా నీడలో ఉన్న కాలంలో ఆమె జైపూర్‌లోని పలు ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగినట్లు ఏటీఎస్ పేర్కొంది.మసూద్ అజహర్ కుటుంబంతో కనెక్షన్?పాకిస్తాన్‌లోని బహావల్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న పలువురు ఉగ్రవాద హ్యాండ్లర్లతో ఈమె టచ్‌లో ఉన్నట్లు డిజిటల్ ఆధారాలు లభించాయి. వారు ఆమెకు మతపరమైన బ్రెయిన్‌వాష్ (ఇండోక్ట్రినేషన్) చేసినట్లు తెలుస్తోంది. విచిత్రమేమిటంటే, ఆమెతో మాట్లాడిన వారిలో ఒకరు తాను జైష్-ఎ-మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ కుటుంబ సభ్యుడినని, బహావల్పూర్ నుండి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. ఈ వ్యవహారం వెనుక భారతదేశంలో పెద్ద ఎత్తున ‘స్లీపర్ సెల్’ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు, కొత్త రిక్రూట్మెంట్లు చేపట్టేందుకు జైష్ ముఠా ప్రయత్నించిందని అధికారులు అనుమానిస్తున్నారు.మత మార్పిడి.. పాక్‌కు వెళ్లేందుకు ప్లాన్ఏటీఎస్ అధికారుల విచారణలో బబితా పలు సంచలన విషయాలను అంగీకరించింది. ఒక పాకిస్తానీ మత గురువు (మౌల్వీ) ఫోన్ ద్వారా చేసిన బోధనలకు ఆకర్షితురాలై తాను ఇస్లాం మతాన్ని స్వీకరించి, తన పేరును ‘ఖదీజా’గా మార్చుకున్నట్లు ఆమె వెల్లడించింది. అంతేకాకుండా, ఆమెను గుట్టుచప్పుడు కాకుండా పాకిస్తాన్‌కు తీసుకువెళ్లేందుకు అవతలి వైపు ఉన్న వ్యక్తులలో చర్చించినట్లు ఒప్పుకుంది. ప్రస్తుతం ఆమెపై ఉగ్రవాద నిరోధక చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేసి, డిజిటల్ సాక్ష్యాలను ల్యాబ్‌కు పంపారు.ఇది కూడా చదవండి: మొహర్రం సెలవుపై క్లారిటీ.. ఇక ‘లాంగ్ వీకెండ్’.. -
మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇంట్లో విషాదం
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇంట్లో విషాదం నెలకొంది. మంగళవారం రాత్రి షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ కన్నుమూశాడు. తన అన్న మరణ వార్తను అక్తర్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. 'నా అన్న అల్లా దగ్గరికి వెళ్లిపోయాడు' అని ఎమోషనల్ కామెంట్‌ను జత చేశాడు. అయితే షాహిద్ ఎప్పుడు చనిపోయారన్నది కచ్చితంగా తెలియనప్పటికీ అక్తర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన సమయం ఆధారంగా మంగళవారం రాత్రే అతడు కన్నుమూసినట్లు తెలుస్తోంది. 2021లో షోయబ్ అక్తర్ తన అమ్మను కోల్పోయాడు. ఆ సమయంలో అక్తర్‌కు సోదరుడు షాహిద్ అండగా ఉన్నాడు. ఇప్పుడు అన్న కూడా మరణించడం షోయబ్ అక్తర్‌కు పూడ్చలేని లోటు అని చెప్పొచ్చు. షోయబ్ అక్తర్ క్రికెటర్‌గా మారడానికి అన్న షాహిద్ అక్తర్ ప్రోత్సాహం మరువలేనిది. అక్తర్ టీనేజీ వయసు దాకా క్రికెట్లో పెద్దగా రాణించలేకపోయాడు. అయితే ఒకసారి స్థానిక క్రికెట్ జట్టులో ప్లేయర్ అవసరం పడడంతో షోయబ్ అక్తర్‌ను ఆ మ్యాచ్‌లో ఆడేందుకు అవకాశమివ్వాలని సదరు జట్టును కోరాడు.అలా స్థానిక క్రికెట్లో రాణించిన షోయబ్ ఆ తర్వాత జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. అనంతరం అతడికి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఆరోజు అన్న షాహిద్ అండగా నిలబడకపోయుంటే ఇవాళ షోయబ్ అక్తర్ ఈ స్థాయిలో ఉండేవాడు కాదేమో. ఆరోజు ఆ మ్యాచ్ అవకాశం తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని అక్తర్ కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన షోయబ్ అక్తర్ పాకిస్తాన్ తరఫున 1997లో అరంగేట్రం చేశాడు. 14 ఏళ్ల కెరీర్లో అక్తర్ 46 టెస్టుల్లో 178 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత క్రికెట్ అనలిస్ట్‌గా, మెంటార్‌గా యాక్టివ్ మోడ్‌లో ఉన్నాడు. అంతేకాదు అక్తర్ యూట్యూబ్ చానెల్‌కు అంతర్జాతీయంగా మంచి ఫాలోయింగ్ ఉంది.Read: ‘మెస్సీపై ప్రశ్నలెందుకు’.. రొనాల్డో అసహనం! -
చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. సెమీస్‌కు ఆస్ట్రేలియా
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ గ్రూప్-ఏలో మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 13.4 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలడంతో ఆస్ట్రేలియా 113 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ మునీబా అలీ (32) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో సోఫీ, సదర్లాండ్, ఎలిస్ పెర్రీలు తలా రెండు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ (79) అర్ధశతకంతో రాణించగా, జార్జియా వోల్ (39), సదర్లాండ్ (27), నికోలా కేరీ (26 నాటౌట్) రాణించారు. పాక్ బౌలర్లలో సాదియా ఇక్బాల్, రమీన్ షమీమ్, నష్రా సంధూ తలా రెండు వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఎలీస్ పెర్రీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకుంది. పాక్‌పై విజయంతో ఆస్ట్రేలియా నాకౌట్లో అడుగుపెట్టింది. మరో బెర్తు కోసం భారత్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గురువారం భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ జట్టుతో కీలక మ్యాచ్ ఆడనుంది. -
జోరు కొనసాగించాలని...
లండన్: ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టును... ఒలింపిక్ చాంపియన్ నెదర్లాండ్స్ జట్టును ఓడించిన ఉత్సాహంలో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు తన కీలక పోరుకు సిద్ధమైంది. ప్రొ లీగ్ 2025–2026 సీజన్లో భాగంగా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తోనూ భారత్ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య నేడు తొలి మ్యాచ్ జరగనుండగా... రెండో మ్యాచ్‌ను శుక్రవారం నిర్వహిస్తారు. 2024లో చైనా వేదికగా జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో చివరిసారి భారత్, పాక్ ముఖాముఖిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలిచింది. ప్రస్తుత యూరోప్ అంచె ప్రొ లీగ్‌లో భారత్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న జట్లను ఓడించి జోరు మీదుంది. జుగ్రాజ్ సింగ్, మన్దీప్ సింగ్, శిలానంద్ లాక్రా, అభిషేక్ తమకు లభించిన అవకాశాలను గోల్స్‌గా మలుస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ జట్టు ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోయింది. కొన్నేళ్లుగా అంతర్జాతీయ హాకీలో పాకిస్తాన్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది. గత పదేళ్లలో ఈ రెండు జట్ల మధ్య 17 మ్యాచ్‌లు జరగ్గా... 15 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. మరో రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రొ లీగ్‌లోనూ పాక్‌పై తమ విజయపరంపరను కొనసాగించాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగనుంది. తొమ్మిది జట్ల మధ్య జరుగుతున్న ప్రస్తుత ప్రొ లీగ్ సీజన్లో భారత్ 10 పాయింట్లతో 8వ స్థానంలో... పాకిస్తాన్ జట్టు పాయింట్ల ఖాతా తెరవకుండానే చివరిదైన 9వ స్థానంలో ఉన్నాయి. ప్రొ లీగ్‌లో మొత్తం తొమ్మిది జట్లు 16 మ్యాచ్‌ల చొప్పున ఆడతాయి. ఇప్పటికి అన్ని జట్లు 12 మ్యాచ్‌ల చొప్పున పూర్తి చేసుకున్నాయి. ఈనెల 28తో సీజన్ ముగియనుండగా... 34 పాయింట్లతో బెల్జియం అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
బిత్తర పోయిన పాక్ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం!
స్విట్జర్లాండ్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ప్రారంభమైన ఈ చర్చలు సజావుగా కొనసాగుతున్నాయని తొలుత ప్రకటించినప్పటికీ.. వేదికపై మాత్రం తీవ్ర ఉద్రిక్తతలు, ప్రోటోకాల్ వివాదాలు, ఆకస్మిక వాకౌట్లు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మధ్య చోటుచేసుకున్న హావభావాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చల తొలి దశ ప్రారంభం నుంచే ఉత్కంఠభరిత వాతావరణంలో సాగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఈ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, ప్రోటోకాల్ అంశాలు మొదట్లోనే వివాదానికి దారితీశాయి.This was humiliation. No one in modern history has made America wait and beg for negotiations. This was the moment JD Vance should have returned to Washington. The Islamic regime did this on purpose. Trump, if you don't understand politics, you should at least understand… pic.twitter.com/NVWAxr8NMH— Amjad Taha أمجد طه (@amjadt25) June 21, 2026ముందుగా నిర్ణయించిన హ్యాండ్‌షేక్, జాయింట్ ఫోటో సెషన్లో ఇరాన్ ప్రతినిధులు పాల్గొనకపోవడం చర్చల్లో ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్ ప్రధాన చర్చాకర్త మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఫోటో-ఆప్‌ను తిరస్కరించి సమావేశ వేదిక నుంచి బయటకు వెళ్లినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.ఈ ఆకస్మిక పరిణామాల మధ్య, ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు కొద్దిసేపు ఏదో సమాచారం అందించినట్లు వీడియోల్లో కనిపించింది. ఆ వెంటనే ఇరాన్ బృందం వేదిక నుంచి వాకౌట్ చేయడంతో షెహబాజ్ షరీఫ్ ఆశ్చర్యానికి లోనయ్యారని, పక్కనే ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో వెంటనే చర్చించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. అదే.. సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పరిస్థితిని గమనిస్తూ.. షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ వద్దకు వెళ్లి కొద్దిసేపు మాట్లాడినట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఇరాన్ ప్రతినిధుల వాకౌట్ కారణం గురించి ఆయన ఆరా తీసినట్లు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.మరోవైపు.. పలకరింపుల సమయంలోనూ అమెరికా ప్రతినిధి అయిన జేడీ వాన్స్‌కు ఘోర అవమానం జరిగింది!. ఖతార్ ప్రతినిధి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్‌ను పలకరించి జేడీ వాన్స్‌ను పట్టించుకోనట్లు చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో జేడీ వాన్స్ ఆయన్ని పలకరించే ప్రయత్నం చేసినట్లు ఉంది. ఖతార్ ప్రతినిధి చేసిన పనితో పాక్ ప్రధాని బిత్తరపోయి చూస్తూ ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఇదంతా సోషల్ మీడియాలో “ప్రోటోకాల్ స్నబ్”గా(అధికారిక కార్యక్రమాల్లో ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా లేదంటే నిర్లక్ష్యంగా సరైన గౌరవం ఇవ్వకుండా వదిలేయడం) చర్చకు దారితీసింది.Watch Qatar snub Vance. So embarrassing. pic.twitter.com/RWSpcsL5IU— 🇺🇸 Pamela Geller 🇮🇱 (@PamelaGeller) June 21, 2026ఇక.. మీటింగ్ హాల్లోకి ఇరాన్ విదేశాంగ మంత్రి తిరిగి ప్రవేశించినప్పుడు, అమెరికా బృందం సభ్యులు జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్తో ఒకే గదిలో స్వల్ప క్షణాల పాటు ఉన్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ సమయంలో ఇరాన్ ప్రతినిధులు కొంత దూరం పాటించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు ఊపందుకున్నాయి. “అమెరికాకు దౌత్యపరమైన ఎదురుదెబ్బా?”, “ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనా?”, “ఇరాన్ వ్యూహాత్మక వాకౌటా?” అనే ప్రశ్నలు నెటిజన్ల మధ్య వైరల్‌గా మారాయి.అయితే మరోవైపు ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వ బృందాలు మాత్రం చర్చలు పూర్తిగా విఫలమయ్యాయన్న వార్తలను ఖండించాయి. తొలి దశ చర్చలు సుమారు 80 నిమిషాలు కొనసాగిన తర్వాత ఇరాన్ బృందం అంతర్గత సంప్రదింపుల కోసం తాత్కాలికంగా బయటకు వెళ్లినట్లు అధికారిక సమాచారం చెబుతోంది. ఇదే సమయంలో ఇరాన్ ఆర్థిక ఆంక్షల ఉపసంహరణ, నిలిచిపోయిన నిధుల విడుదల, చమురు ఆంక్షలపై సడలింపులు వంటి అంశాలపై సాంకేతిక స్థాయిలో చర్చలు కొనసాగినట్లు కూడా నివేదికలు పేర్కొంటున్నాయి. ఖతార్ సహకారంతో కొన్ని కీలక ప్రక్రియలు ప్రారంభమైనట్లు సమాచారం బయటకు వచ్చింది.మొత్తం మీద, స్విట్జర్లాండ్ వేదికపై జరిగిన ఈ చర్చలు ఒకవైపు ఉద్రిక్తతలు, వాకౌట్లు, ప్రోటోకాల్ ఘర్షణలతో సాగినా.. మరోవైపు కొంత పురోగతి సంకేతాలు కూడా కనిపించాయని అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అక్కడ కనిపించిన హావభావాలు, ఆకస్మిక పరిణామాలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. -
భారత్‌తో యుద్ధానికైనా రెడీ.. పాక్ మంత్రి సంచలన ప్రకటన
భారత్–పాకిస్తాన్ మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty) అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన తాజా వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య కొత్త రాజకీయ, దౌత్య ఉద్రిక్తతలకు దారితీశాయి. సింధూ జలాల విషయంలో పాకిస్తాన్ హక్కులను దెబ్బతీసే ఏ చర్యనైనా తమ దేశం సహించదని, అవసరమైతే భారత్‌తో యుద్ధానికైనా సిద్ధమని ఆయన హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఇటీవల భారత్ చేపడుతున్న జలవిద్యుత్ ప్రాజెక్టులు, నదీ జలాల నిర్వహణ చర్యలపై స్పందించిన ఖవాజా ఆసిఫ్.. పాకిస్తాన్‌కు వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించే లేదా అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే అది కేవలం జలాల సమస్య కాకుండా జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. పాకిస్తాన్ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, కోట్లాది ప్రజల జీవనాధారం సింధూ నదీ వ్యవస్థపై ఆధారపడి ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో నీటి హక్కులను కాపాడుకోవడానికి అన్ని మార్గాలను ఉపయోగిస్తామని చెప్పారు. అవసరమైతే యుద్ధం వరకు వెళ్లడానికి కూడా తమ దేశం వెనుకాడదని ఆయన వ్యాఖ్యానించినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది.ఇండస్ ఒప్పందం ఏమిటి?1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఇండస్ జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధూ నదీ వ్యవస్థలోని ఆరు ప్రధాన నదులను రెండు దేశాల మధ్య విభజించారు. రవి, బియాస్, సట్లెజ్ నదుల జలాలపై భారత్‌కు పూర్తి హక్కులు ఉండగా, ఇండస్, జీలం, చీనాబ్ నదుల జలాలను ప్రధానంగా పాకిస్తాన్ వినియోగించుకునేలా ఒప్పందం రూపొందించబడింది. అయితే పశ్చిమ నదులపై కూడా విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి అవసరాల కోసం కొన్ని పరిమిత హక్కులు భారత్‌కు కల్పించబడ్డాయి. గత ఆరు దశాబ్దాలుగా అనేక యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు ఎదురైనా ఈ ఒప్పందం కొనసాగుతుండటం విశేషం.ఎందుకు మళ్లీ వివాదం?గత కొంతకాలంగా జమ్మూ-కశ్మీర్ ప్రాంతంలో పలు జలవిద్యుత్ ప్రాజెక్టులను భారత్ వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా చీనాబ్, జీలం నదులపై నిర్మిస్తున్న కొన్ని ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇవి ఇండస్ ఒప్పంద నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తోంది. భారత్ మాత్రం ఈ ప్రాజెక్టులన్నీ ఒప్పంద పరిధిలోనే ఉన్నాయని, నీటి ప్రవాహాన్ని మళ్లించడం లేదా అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా, దేశానికి లభించిన హక్కులను పూర్తిగా వినియోగించుకోవడం తమ బాధ్యత అని చెబుతోంది.మారిన పరిస్థితులు..ఇటీవలి కాలంలో భారత్‌లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఇండస్ ఒప్పందంపై భారత్‌లో కూడా చర్చలు పెరిగాయి. "రక్తం, నీరు ఒకేసారి ప్రవహించలేవు" అంటూ గతంలో భారత నాయకత్వం చేసిన వ్యాఖ్యలు మళ్లీ ప్రస్తావనకు వచ్చాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదం కొనసాగితే ఇండస్ జలాల ఒప్పందంపై పునఃసమీక్ష అవసరమని భారత రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమైంది. -
భారత్‌పై విషం చిమ్మిన పాక్
ఢిల్లీ: భారతలోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు పొంచి ఉందంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా బదులిచ్చింది. జర్దారీ వ్యాఖ్యలు అత్యంత ద్వేషంతో రాజకీయ దురుద్దేశంతో కూడినవని విదేశాంగ శాఖ కొట్టిపడేసింది. భారతదేశ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడే హక్కు ఇస్లామాబాద్‌కు ఎంతమాత్రం లేదని మరోసారి స్పష్టం చేసింది.ఇటీవల పాకిస్థాన్ అధ్యక్షుడు భారత్‌పై విషం చిమ్మారు. ఎక్స్ వేదికగా భారత్‌ను విమర్శిస్తూ "భారతదేశంలోని వారణాసిలో ఉన్న 1000 ఏళ్ల నాటి 'మసీదు గంజ్ షహీదా'తో సహా చారిత్రక ముస్లిం మతపరమైన కట్టడాల కూల్చివేతలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలి, ఇలాంటి చర్యలు కొనసాగితే, అవి భారతదేశ విచ్ఛిన్నానికి నిరంతర అశాంతికి దారితీసే ప్రమాదం ఉంది" అని ఎక్స్ వేదికగా విమర్శించారు. తాజాగా దీనికి భారత్ తీవ్రస్థాయిలో బదులిచ్చింది.భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయమై మాట్లాడుతూ... "పాకిస్థాన్ అధ్యక్షుడు చేసిన నిరాధారమైన వ్యాఖ్యలను భారతదేశం ఖచ్చితంగా తిరస్కరిస్తోంది. భారతదేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడానికి అతనికి ఎలాంటి హక్కు లేదు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పాకిస్థాన్ స్వంత మానవ హక్కుల రికార్డును గమనిస్తే, ఆ దేశ అధ్యక్షుడి వ్యాఖ్యలు మరీ హాస్యాస్పదంగా అనిపిస్తాయి. వివిధ మతాలకు చెందిన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని, వారిని వేధించడంలో పాకిస్థాన్‌కు ఉన్న సుదీర్ఘమైన, దురదృష్టకరమైన చరిత్ర ప్రపంచమంతటికీ తెలిసిందే" అని స్పష్టం చేశారు.అయితే పాకిస్థాన్‌లో హిందువులపై జరిగే దాడులు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే విషయమై అక్కడి స్వచ్ఛంద సంస్థలు, ఇతర అంతర్జాతీయ పర్యవేక్షక సంస్థలు కూడా ఆ దేశంలో మతపరమైన హింసపై నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై అక్కడ నిరంతరం దాడులు జరుగుతున్నాయని మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. రాజకీయ ప్రేరేపిత దాడిజర్దారీ వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని, ఆ దేశంలో కొనసాగుతున్న మతోన్మాదం, ద్వేషపూరిత విధానాల నుంచే ఇవి పుట్టుకొచ్చాయని జైస్వాల్ ముగించారు. "ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటే, పాకిస్థాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు కేవలం ఆ దేశ జాతీయ విధానాలైన మతోన్మాదం, ద్వేషం ఆధారంగా చేసిన ఒక ఉద్దేశపూర్వక రాజకీయ దాడిగా మాత్రమే పరిగణించవచ్చు" అని ఆయన అన్నారు.వారణాసిలోని చారిత్రాత్మక 'మస్జిద్ గంజ్ షహీదా'తో పాటు భారతదేశంలోని ఇతర ముస్లిం ప్రార్థనా స్థలాల కూల్చివేతకు ముప్పు ఉందంటూ జర్దారీ సామాజిక మాధ్యమం ఎక్స్ (X) లో చేసిన పోస్ట్‌కు సమాధానంగా భారత్ ఈ ఘాటు స్పందన ఇచ్చింది. భారతదేశ అంతర్గత విషయాల్లో ఇస్లామాబాద్ జోక్యం చేసుకోకూడదని న్యూఢిల్లీ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది. -
పాక్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (జూన్ 20) జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. గ్రూప్ దశలో పాక్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ ఓటమితో ఆ జట్టు తదుపరి రౌండ్‌కు చేరుకునే అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు బంగ్లాదేశ్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి సూపర్-8 అవకాశాలను మెరుగుపర్చుకుంది. గ్రూప్-ఏలో బంగ్లా, పాక్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, భారత్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మొదటి నాలుగు స్థానాల్లో ఉండగా.. పాక్, నెదర్లాండ్స్ చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.మ్యాచ్ విషయానికొస్తే.. సౌథాంప్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (36), శోభన మోస్తరీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఆఖర్లో షోర్నా అక్తెర్ (39 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది. వీరు మినహా మరే ఇతర బంగ్లా బ్యాటర్ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేదు. పాక్ బౌలర్లు తొలి 16 ఓవర్లలో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా, చివరి 4 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకొని మూల్యం చెల్లించుకున్నారు. షోర్నా అక్తెర్ చివర్లో పాక్ బౌలర్ల భరతం పట్టింది. ముఖ్యంగా తస్మియా రుబాబ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడింది. రుబాబ్ మినహా పాక్ బౌలర్లంతా పొదుపుగా బౌలింగ్ చేశారు. కెప్టెన్ ఫాతిమా సనా (4-1-18-2), నష్రా సంధు (4-0-14-1), సదియా ఇక్బాల్ (4-0-21-1) అద్బుతమైన గణాంకాలు నమోదు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్ ఆదిలో బాగా ఆడినా, మధ్యలో లయ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్లు మునీబా అలీ (25), గుల్ ఫెరోజా (23) తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించగా.. ఆతర్వాత పాక్ 26 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి ఓటమి బాట పట్టింది. షంజిద అక్తెర్ (4-0-21-3), నహిద అక్తెర్ (4-0-18-3), రబేయా ఖాన్ (4-1-17-1), మరుఫా అక్తెర్ (4-1-18-0), రితూ మోనీ (4-0-24-1) ధాటికి పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 100 పరుగులకే పరిమితమైంది. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు మినహా ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును కూడా తాకలేకపోయారు. -
పాక్‌పై ఆఫ్ఘనిస్తాన్ వైమానిక దాడులు
ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని తమ వైమానిక దళం దాడులు చేసిందని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ దాడులు బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో జరిగినట్లు సమాచారం.ఈ శిబిరాలు ISIL-Khorasan (ఐసిస్-కె) కార్యకలాపాలకు కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అక్కడి నుంచి ఆఫ్ఘన్‌పై దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించింది.అయితే ఈ ఆరోపణలను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘన్ ప్రకటనలను అబద్ధాలు, దుష్ప్రచారంగా అభివర్ణించింది.గత కొద్ది నెలలుగా ఇరుదేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పలుమార్లు దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకోవడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. చైనా మధ్యవర్తిత్వంతో జరిగిన శాంతి ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలితాన్ని ఇవ్వలేదు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా ఇరు దేశాలు కయ్యానికి కాలుదువ్వుతుండటంతో మరింత ఆందోళన కలిగిస్తుంది. -
భారత్-పాక్ సరిహద్దుల్లో అరుదైన ‘షేక్‌హ్యాండ్’
శ్రీనగర్: ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం.. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో.. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LoC) వద్ద అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. భారత సైన్యం అదుపులో ఉన్న పాకిస్థాన్ పౌరుడు అసద్ ఖాన్‌ను స్వదేశానికి అప్పగించే సందర్భంగా ఇరు దేశాల సైన్యాధికారులు పరస్పరం కరచాలనం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. మానవతా విలువలకు కట్టుబడి ఉన్న భారత సైన్యం.. అసద్ ఖాన్‌ను గౌరవంగా చూసుకుంది. అనంతరం పాకిస్థాన్ సైన్యానికి అప్పగించింది. దీంతో పాక్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా తీత్వాల్ సెక్టార్ పరిధిలోని సిమారి ప్రాంతంలో గత వారం నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన అసద్ ఖాన్‌ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆయన పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా (కేపీకే) ప్రాంతానికి చెందినవాడని సైన్యం వెల్లడించింది. అయితే, అతడిని విడుదల చేయాలని పాకిస్థాన్‌లోని పలువురు నెటిజన్లు భారత సైన్యాన్ని కోరారు.కొంతకాలం పాటు నిర్బంధంలో ఉంచిన అధికారులు.. అసద్ ప్రవర్తనపై ఎటువంటి అనుమానం రాకపోవడంతో తిరిగి స్వదేశానికి పంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో అసద్ ఖాన్‌ను సరిహద్దు క్రాసింగ్ పాయింట్ దగ్గర పాకిస్థాన్ సైన్యానికి అధికారికంగా అప్పగించారు. ఈ సందర్భంగా తీసిన చిత్రాలను భారత సైన్యం తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో విడుదల చేసింది. వాటిలో భారత సైన్యానికి చెందిన మేజర్ హోదా అధికారి, పాకిస్థాన్ సైన్యాధికారితో కరచాలనం చేస్తున్న దృశ్యం కనిపించింది.Repatriation of Pak NationalA Pakistani national, Asad Khan, a resident of Khyber Pakhtunkhwa (KPK), who was apprehended in Simari village, Kupwara, on 12 June 2026 after crossing the Line of Control, was repatriated to Pakistan on 18 June 2026.During his stay in India, Asad… pic.twitter.com/4MUKLUylZh— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) June 19, 2026ఈ సందర్భంగా భారత సైన్యం విడుదల చేసిన ప్రకటనలో, “ఖైబర్ పఖ్తూన్ఖ్వా నివాసి అసద్ ఖాన్ జూన్ 12న నియంత్రణ రేఖ దాటి సిమారి గ్రామం వద్ద పట్టుబడ్డాడు. జూన్ 18న అతడిని పాకిస్థాన్‌కు తిరిగి పంపించాం. భారత్‌లో ఉన్నంత కాలం అతడిని గౌరవంగా.. మానవతా దృక్పథంతో చూసుకున్నాం. సైన్యం నైతిక విలువలకు నిదర్శనం” అని పేర్కొంది. -
యుద్ధం మొదలవుతుంది..!చైనా వాడు పాకిస్థాన్ ను కుక్కలా పెంచుకుంటున్నాడు..!
-
పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. భారత్ దెబ్బ అదుర్స్
దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత్ మరోసారి విరుచుకుపడింది. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్, పాక్ మధ్య సింధూ జలాల ఒప్పంద విషయంలో పాకిస్తాన్‌ను కడిగిపారేసింది. పాత ఒప్పందానికి ఇప్పుడు కాలం చెల్లిపోయిందని గట్టి హెచ్చరికలు చేసింది. అలాగే, అంతర్జాతీయ వేదికలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే పాక్ కుటిల ప్రయత్నాలకు భారత్ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది.జెనీవాలో శుక్రవారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 62వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత్ తన 'రైట్ ఆఫ్ రిప్లై'ను ఉపయోగించుకుంది. ఈ సందర్భంగా భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమ సింగ్ మాట్లాడుతూ.. భారత్‌పై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరి అత్యంత స్పష్టంగా ఉందన్నారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా మార్చుకున్న పాకిస్తాన్, అంతర్జాతీయ సహకార ఫలాలను, డిమాండ్ చేయడం ఆ దేశ అవివేకానికి నిదర్శనమన్నారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందం ప్రస్తుత పరిస్థితులకు, మారుతున్న ప్రపంచ పరిణామాలకు ఎంతమాత్రం సరిపోదని తేల్చి చెప్పారు. కాలం మారిందని, అలాగే ఒప్పందం కూడా మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆరు దశాబ్దాల నాటి ఈ ఒప్పందాన్ని ఎప్పటికీ చెక్కుచెదరని శాశ్వత హక్కుగా లేదా జవాబుదారీతనం లేని అధికారంగా భావించలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వేదికలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు.#WATCH | First Secretary at the Permanent Mission of India to the United Nations, Anupama Singh says, "Our position on Indus Water Treaty is well known. It defies logic that a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation… pic.twitter.com/D3takMgklM— ANI (@ANI) June 18, 2026అలాగే, పాక్‌ను ఫ్రాంకెన్‌స్టైన్ స్టేట్ (సొంతంగా సృష్టించిన భూతం చేతిలోనే నాశనమయ్యే పరిస్థితి)గా అభివర్ణించారు. పాక్ తన అంతర్గత సవాళ్ల పరిష్కారంపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. పాక్ రక్షణ మంత్రే స్వయంగా ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, వారిని మోహరించడం తమ ప్రభుత్వ విధానమని గతంలో బహిరంగంగానే అంగీకరించారని ఆమె గుర్తు చేశారు. అంతటి ఉగ్రవాద చరిత్ర ఉంచుకుని, మళ్లీ తామే ఉగ్రవాద బాధితులమని పాక్ చెప్పుకోవడం ఒక పెద్ద హాస్యాస్పదంగా ఉందన్నారు. వారు పెంచిన ఉగ్రవాద భూతమే ఇప్పుడు తనను తిరిగి కరుస్తుంటే పాక్ షాక్‌కు గురవుతోందని దుయ్యబట్టారు.అయితే, గతేడాది పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో, పాకిస్తాన్ ఉగ్రవాదానికి స్వస్తి పలికేంత వరకు సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. పాకిస్తాన్ మనుగడ పూర్తిగా సింధూ నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. పాక్‌లో 16 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమిలో దాదాపు 80 శాతం భూమికి ఈ నదీ జలాలే ఆధారం. అంతేకాకుండా, ఆ దేశం ఉపయోగించే మొత్తం నీటి వినియోగంలో 93 శాతం సింధూ నది నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో, తన దేశ ఆర్థిక, భౌగోళిక మనుగడకు కారణమైన నదీ జలాల విషయంలో పాక్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భారత్ సూచించింది. -
బంగాళాఖాతంలోకి పాక్ జలాంతర్గాములు!
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ విమోచన యుద్ధం వేళ పాకిస్తాన్ నావికాదళాన్ని భారత్ దారుణంగా దెబ్బతీశాక బంగాళాఖాతం జలాల వైపు కన్నెత్తిచూడని పాకిస్తాన్ 55 సంవత్సరాల తర్వాత మళ్లీ బంగాళాఖాతం వైపు దృష్టిసారించింది. చైనా తయారీ హంగోర్ శ్రేణి జలాంతర్గామిని బంగాళాఖాతంలో నిఘా కోసం మొహరించాలని పాక్ యోచిస్తోంది. పీఎన్ఎస్ హంగోర్ జలాంతర్గామి ఇటీవలే కరాచీకి చేరుకుంది. అంతకుముందు చైనా నుంచి వస్తూ అంతర్జాతీయ సముద్రజలాల గుండా పయనిస్తూ ఈ జలాంతర్గామి శ్రీలంక సమీపంగా వచ్చింది.ఈ జలాంతర్గామికి ఎస్కార్ట్‌గా వస్తున్న నౌకల కాన్వాయ్(ఫ్లోటిల్లా)కు కమాండర్ ఒమర్ ఫరూఖ్ కొలంబో పోర్ట్‌లో మాట్లాడారు. ‘‘అధునాతన హంగోర్ తరగతి జలాంతర్గామితో పాక్ ఇకపై సముద్రతలంలోనూ తన సత్తా చాటనుంది. బంగాళాఖాతంలో మా కార్యకలాపాలకు ఇది ఎంతో దోహదపడుతుంది. ఇది ఆట తీరును మార్చేసే గేమ్ ఛేంజర్. ఈ రకం ఎనిమిది జలాంతర్గాములను సమకూర్చుకోబోతున్నాం’’అని ఆయన వెల్లడించారు. అరేబియా సముద్రం దాటి బంగాళాఖాతం దాకా తమ నిఘా కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తున్నట్లు కమాండర్ చెప్పడంతో పాక్ కుయుక్తి బహిర్గతమైంది. బంగాళాఖాతం ఎందుకంత కీలకం? భారత్–పాకిస్తాన్ యుద్ధం వేళ డయ్యూ పరిధిలో భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రీని పాక్‌కు చెందిన పీఎన్ఎస్ హంగోర్ జలాంతర్గామి మూడు టార్పెడోలతో దాడిచేసి ముంచేసింది. అయినాసరే యుద్ధంపై దీని ప్రభావం ఏమాత్రం పడలేదు. భీకరంగా దాడిచేసిన భారత్ పాక్ పీచమణిచింది. అప్పట్నుంచి బంగాళాఖాతంలో పాక్ జలాంతర్గాముల సంచారమే లేదు. తాజాగా బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం కూలడం, పాక్ అనుకూల ప్రభుత్వం కొలువుతీరడంతో దశాబ్దాల తర్వాత బంగాళాఖాతంపై పాక్ కన్నుపడింది. భౌగోళికంగా బంగాళాఖాతంపై భారత పట్టు అధికం.అండమాన్ నికోబార్ దీవులు ఉండటంతో అక్కడి నుంచి సముద్రంలోపలికి 370 కిలోమీటర్లదాకా భారత ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ ఉంది. అక్కడిదాకా సముద్రజలాలపై సర్వాధికారం భారత్‌కే దఖలుపడుతోంది. ఉత్తర తీరం వైపే విశాఖపట్నంలో భారత నావికాదళ తూర్పు కమాండ్ ప్రధాన స్థావరం ఉంది. ఇదే బంగాళాఖాతం బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, మలేసియా, ఇండోనేసియాలకూ తీరప్రాంతంగా ఉంది.అదీకాకుండా బంగాళాఖాతం అనేది భారత వస్తూత్పత్తులు, ఇంధన వాణిజ్యానికి, నౌకల రాకపోకలకు కీలక మార్గంగా మారింది. ఇంతటి కీలకమైన ప్రాంతంలో పాక్ అడుగుపెట్టడం భారత నావికా, నిఘా కార్యకలాపాలకు అవరోధంగా మారే ఆస్కారముంది. పాక్ తన తీర ప్రాంతానికి సుదూరంగా హిందూ మహాసముద్రంలో బంగాళాఖాతంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తే భారత్‌కు ఎప్పుడూ తలనొప్పేనని యుద్దరంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. సముద్ర జలాల్లో హంగోర్ జలాంతర్గామి -
భారత్‌కు పాక్ కొత్త సవాల్.. 1971 గాయం మానలేదా?
భారత్-పాకిస్తాన్ మధ్య 1971 యుద్ధంలో ఘోర పరాజయం తర్వాత దాదాపు ఐదు దశాబ్దాలుగా బంగాళాఖాతంలో పెద్దగా కనిపించని పాకిస్తాన్ నౌకాదళం.. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాంతంపై దృష్టి సారిస్తోంది. చైనా సాయంతో నిర్మించిన అత్యాధునిక హంగోర్-క్లాస్ జలాంతర్గాములను బంగాళాఖాతంలో మోహరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన సమాచారం దక్షిణాసియా వ్యూహాత్మక వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది కేవలం నౌకాదళ విస్తరణేనా? లేక 1971 తర్వాత కోల్పోయిన వ్యూహాత్మక ప్రభావాన్ని తిరిగి సాధించాలనే ప్రయత్నమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.1971లో ఏం జరిగింది?1971 యుద్ధం పాకిస్తాన్ చరిత్రలోనే అతిపెద్ద సైనిక, రాజకీయ పరాజయం. తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్‌గా అవతరించింది. దీంతో పాక్‌కు బంగాళాఖాతంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం పూర్తిగా దెబ్బతింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్‌కు చెందిన అత్యంత కీలక జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ (PNS Ghazi) విశాఖపట్నం సమీపంలో మునిగిపోయింది. తూర్పు ప్రాంతంలో భారత నౌకాదళం సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించడంతో పాకిస్తాన్‌కు బంగాళాఖాతంలో కార్యకలాపాలు నిర్వహించే అవకాశం దాదాపు లేకుండాపోయింది. అప్పటి నుంచి పాక్ నౌకాదళం ప్రధానంగా అరేబియా సముద్రం, కరాచీ, గ్వాదర్ ప్రాంతాలకే పరిమితమైంది.పాక్ ప్లానేంటి?పాకిస్తాన్ నౌకాదళం చైనా సహకారంతో కొనుగోలు చేస్తున్న 8 హంగోర్-క్లాస్ జలాంతర్గాములు దాని సముద్ర వ్యూహంలో పెద్ద మార్పునకు నాంది పలుకుతున్నాయి. మొదటి జలాంతర్గామి PNS హాంగోర్ ఇప్పటికే పాక్ నౌకాదళంలో చేరింది. మిగిలినవి 2028 నాటికి దశలవారీగా చేరనున్నాయి. పాక్ నౌకాదళ అధికారుల ప్రకారం.. ఈ కొత్త సామర్థ్యాలతో అరేబియా సముద్రానికి మాత్రమే కాకుండా తూర్పు హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం వరకు తమ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఏర్పడుతోంది.హంగోర్ జలాంతర్గాముల ప్రత్యేకత?ఈ జలాంతర్గాములు చైనా Type-039B యూవాన్ క్లాస్ నమూనా ఆధారంగా రూపొందించబడ్డాయి. ఈ సామర్థ్యాల వల్ల పాక్ నౌకాదళానికి గతంతో పోలిస్తే గణనీయమైన వ్యూహాత్మక ప్రయోజనం లభించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.వీటి ప్రధాన ప్రత్యేకతలు:AIP (Air Independent Propulsion) టెక్నాలజీనీటి అడుగున ఎక్కువకాలం ప్రయాణించే సామర్థ్యంతక్కువ శబ్దంతో కదిలే స్టెల్త్ సిస్టమ్ఆధునిక సోనార్, సెన్సార్ వ్యవస్థలుటార్పెడోలు, యాంటీ-షిప్ క్షిపణుల సామర్థ్యంభవిష్యత్తులో బాబర్-3 క్రూయిజ్ క్షిపణుల వినియోగ అవకాశాలుచైనా పాత్ర ఎంత కీలకం?ఈ ప్రాజెక్టు వెనుక అసలు శక్తి చైనానే. హంగోర్ జలాంతర్గాముల ఒప్పందం విలువ దాదాపు 5 బిలియన్ డాలర్లు. నాలుగు జలాంతర్గాములు చైనాలో, మరో నాలుగు కరాచీలో నిర్మిస్తున్నారు. ఇది కేవలం ఆయుధాల విక్రయం మాత్రమే కాదు. హిందూ మహాసముద్రంలో చైనా-పాక్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీకగా కూడా భావిస్తున్నారు. భారత్ చుట్టూ "స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్" వ్యూహాన్ని అమలు చేస్తున్న చైనా, గ్వాదర్ నుంచి బంగాళాఖాతం వరకు తన ప్రభావాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోందని భారత వ్యూహ నిపుణులు భావిస్తున్నారు.భారత్‌కు ఆందోళన అంశమేనా?సైనికంగా చూస్తే ప్రస్తుతం భారత నౌకాదళం పాకిస్తాన్ కంటే చాలా బలంగా ఉంది. విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గాములు, స్కార్పీన్ క్లాస్ సబ్మెరైన్లు, దీర్ఘశ్రేణి సముద్ర నిఘా వ్యవస్థలు, తూర్పు నౌకాదళ కమాండ్ వంటి అంశాల్లో భారత్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. అయితే, పాకిస్తాన్ జలాంతర్గాములు బంగాళాఖాతంలో కార్యకలాపాలు నిర్వహించడం వల్ల భారత నౌకాదళం తన తూర్పు తీర భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే భారత్ కూడా కొత్త జలాంతర్గాముల కొనుగోలు, దేశీయ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది.బంగ్లాదేశ్ అంశం కూడా కీలకమేపాక్ బంగాళాఖాతంలో ఉనికిని పెంచాలంటే బంగ్లాదేశ్‌తో సంబంధాలు కీలకం కానున్నాయి. గత కొంతకాలంగా ఇస్లామాబాద్-ఢాకా సంబంధాలు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే బంగాళాఖాతం ఇప్పటికీ భారత ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంగా పరిగణించబడుతుంది. అందువల్ల పాక్ ఉనికి పెరిగినా, అది ఎంత స్థాయిలో ప్రభావం చూపగలదన్నది ఇంకా ప్రశ్నగానే ఉంది. కాగా, వాస్తవానికి బంగాళాఖాతంలో పాక్ నిరంతర ఉనికి కొనసాగించడం అంత సులభం కాదు. భౌగోళిక పరిమితులు, లాజిస్టిక్స్, భారత నౌకాదళ ఆధిపత్యం వంటి అంశాలు ఇప్పటికీ ఇస్లామాబాద్‌కు పెద్ద సవాళ్లుగానే ఉన్నాయి. -
ఉత్కంఠ పోరులో పాక్‌పై సౌతాఫ్రికా గెలుపు
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికా తొలి విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాభవం తర్వాత, పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేయగా.. ఛేదనలో సౌతాఫ్రికా కూడా తడబడినా, 16.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. డెర్క్సెన్ (52) మెరుపు అర్ద సెంచరీతో, నదినే డి క్లెర్క్ (37) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లతో సౌతాఫ్రికాను గెలిపించారు.తొలుత బ్యాట్‌తో (55 నాటౌట్) సత్తా చాటిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా, ఆతర్వాత బంతితోనూ (2.5-0-16-3) చెలరేగి సౌతాఫ్రికా శిబిరంలో గుబులు రేపింది. సనాకు సదియా ఇక్బాల్ (4-0-26-2), తుబా హస్సన్ (4-0-28-2), నష్రా సంధు (4-0-28-1) కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా ఓ దశలో ఓటమి దిశగా సాగింది. అయితే అప్పటికే డెర్క్సెన్, క్లెర్క్ గెలుపుకు పునాది వేయడంతో సౌతాఫ్రికా విజయతీరాలకు చేరగలిగింది.అంతకుముందు 33 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్‌ను ఫాతిమా సనా (38 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), తుబా హస్సన్ (23) ఆదుకున్నారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 71 పరుగులు జోడించడంతో పాక్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. పాక్ ఇన్నింగ్స్‌లో సనా, తుబాతో పాటు ఇరామ్ జావెద్ (11), ఆలియా రియాజ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో కాప్ 3, షబ్నిమ్ ఇస్మాయిల్, ఖాకా తలో వికెట్ తీశారు. -
భారత మ్యాప్ వివాదం.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ (USINDOPACOM)ను మళ్లీ పాత పేరైన యూఎస్ పసిఫిక్ కమాండ్ (USPACOM)గా మార్చినట్లు ప్రకటించారు. ఎనిమిదేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఈ మార్పు చేశారు.1947 జనవరి 1న అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ యూఎస్ పసిఫిక్ కమాండ్‌గా ఏర్పాటు చేశారు. అయితే 2018లో అమెరికా అధ్యక్షుడు, అప్పటి రక్షణ మంత్రి జిమ్ మాటిస్‌లు యూఎస్ పసిఫిక్ కమాండ్‌ను కాస్తా యూఎస్ ఇండియా పసిపిక్ కమాండ్‌గా మార్చారు.ఎనిమిదేళ్ల తర్వాత పాత పేరు అయిన యూఎస్ పసిఫిక్ కమాండ్‌గా మార్పు చేశారు. సాంకేతిక, చారిత్రక వారసత్వాన్ని గౌరవించేందుకే మళ్లీ పాత పేరును తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అయితే పేరు మారుస్తూ అమెరికా రక్షణ శాఖ వెబ్సైట్లో యూఎస్ పసిఫిక్ కమాండ్ మ్యాప్‌ను ఏర్పాటు చేసింది. ఆమ్యాప్పై తీవ్ర దుమారం చెలరేగింది. ఆ మ్యాప్‌లో అమెరికా పీవోకేను పాక్ భూభాగంలో చూపించింది. దీంతో తప్పుడు మ్యాప్‌ను ప్రదర్శించడంపై భారతీయులు ట్రంప్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం అమెరికా-భారత్ సంబంధాలపై దౌత్య పరమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. -
ఎడారిలో ‘ఫ్యూయల్ రైడర్స్’.. ప్రతీ ట్రిప్ ఓ సవాలే..
ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. ఎడారి గాలులు శరీరాన్ని కాల్చేస్తున్నాయి. ఒకవైపు సాయుధ ఘర్షణలు, మరోవైపు భద్రతా బలగాల తనిఖీలు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రతిరోజూ వందలాది బైకర్లు ఇరాన్-పాకిస్తాన్ సరిహద్దు మీదుగా పెట్రోల్, డీజిల్‌ను తరలిస్తూ జీవన పోరాటం సాగిస్తున్నారు. ఇది కేవలం అక్రమ రవాణా కథ కాదు. పేదరికం, నిరుద్యోగం, సరిహద్దు ప్రాంతాల నిర్లక్ష్య అభివృద్ధి రాసిన ఒక విషాద గాథ.ఇరాన్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం వేలాది మంది యువకులు ఇదే జీవితాన్ని గడుపుతున్నారు. ఇరాన్లో తక్కువ ధరకు లభించే ఇంధనాన్ని పాకిస్తాన్‌కు తరలిస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. చట్టపరంగా ఇది అక్రమ రవాణాగా పరిగణించబడుతున్నప్పటికీ, స్థానికుల దృష్టిలో ఇది బతికే మార్గం. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ మరియు ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రాంతాల మధ్య దాదాపు 900 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఈ ప్రాంతం ఎడారులు, కొండలు, నిర్జన మార్గాలతో నిండి ఉంటుంది. అధికారిక వాణిజ్య అవకాశాలు తక్కువగా ఉండటంతో వేలాది మంది స్థానికులు ఇంధన రవాణాపైనే ఆధారపడుతున్నారు.ఇరాన్లో ప్రభుత్వ సబ్సిడీల కారణంగా ఇంధన ధరలు తక్కువగా ఉంటాయి. అదే ఇంధనాన్ని పాకిస్తాన్లో విక్రయిస్తే మంచి లాభం వస్తుంది. ఈ ధరల వ్యత్యాసమే భారీ స్థాయిలో ఇంధన రవాణాకు కారణమైంది. సరిహద్దు ప్రాంతాల్లోని డిపోల నుంచి పెట్రోల్, డీజిల్‌ను జెర్రీ క్యాన్లలో నింపుకుని బైక్‌లకు కట్టుకొని ప్రయాణించడం అక్కడ సాధారణ దృశ్యంగా మారింది. ఒక్కో బైక్‌పై అనేక క్యాన్లలో వందల లీటర్ల ఇంధనాన్ని మోస్తారు. ఇంధనం బరువుతో బైక్ నియంత్రణ కోల్పోతే ప్రమాదం తప్పదు. చిన్న స్పార్క్ వచ్చినా అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కుటుంబ పోషణ కోసం ఈ ప్రమాదాలను లెక్కచేయకుండా యువకులు ఈ పనిలో కొనసాగుతున్నారు.ఈ ప్రాంతంలో పరిస్థితులను మరింత క్లిష్టం చేస్తున్నది భద్రతా సమస్య. బలూచ్ సాయుధ గ్రూపుల కార్యకలాపాలు, భద్రతా దళాల ఆపరేషన్లు, సరిహద్దు పర్యవేక్షణ కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్నిసార్లు కాల్పులు, అరెస్టులు, వాహనాల స్వాధీనం వంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి. అయినప్పటికీ జీవనోపాధి కోసం ప్రజలు ఈ మార్గాన్ని వదిలిపెట్టలేకపోతున్నారు.నిపుణుల అంచనా ప్రకారం రోజుకు లక్షల లీటర్ల నుంచి మిలియన్ల లీటర్ల వరకు ఇరానియన్ ఇంధనం వివిధ మార్గాల ద్వారా పాకిస్తాన్లోకి చేరుతోంది. గతంలో వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం రోజుకు సుమారు 5 నుంచి 6 మిలియన్ లీటర్ల ఇంధనం అక్రమ మార్గాల్లో పాక్‌లోకి ప్రవేశించిన సందర్భాలు ఉన్నాయి. ఈ వ్యాపారంలో వేలాది వాహనాలు, పడవలు, బైకులు పాల్గొంటున్నట్లు అంచనాలు ఉన్నాయి. పాక్ ప్రభుత్వం ఈ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, స్థానికుల జీవనాధారం దీనిపైనే ఆధారపడటంతో సమస్య సంక్లిష్టంగా మారింది. అధికారుల దృష్టిలో ఇది స్మగ్లింగ్. కానీ సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజల దృష్టిలో ఇది ఆకలి నుంచి బయటపడే మార్గం.ఇటీవలి కాలంలో మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇరాన్‌పై ఆంక్షలు, ఇంధన సరఫరా సమస్యలు ఈ వ్యాపారాన్ని మరింత ప్రాధాన్యంగా మార్చాయి. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఆంక్షల వల్ల నష్టపోయిన ఇరాన్‌కు ఇది అదనపు ఆదాయ మార్గంగా మారగా, పాకిస్తాన్‌లోని పేద ప్రాంతాలకు చౌకైన ఇంధనం అందించే వ్యవస్థగా కొనసాగుతోంది. -
పాకిస్థాన్‌లో కాల్పులు.. పదేళ్ల విదేశీ చిన్నారి మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒక పోలీసు అధికారి చేసిన పొరపాటుతో పదేళ్ల ముక్కపచ్చలారని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దొంగతనానికి సంబంధించిన ముఠాను ఛేదిస్తున్న క్రమంలో జరిపిన కాల్పుల్లో పోరపాటున విదేశీయులకు బుల్లెట్లు తగిలాయి. ఈ ఘటనలో ఆస్ట్రేలియాకు చెందిన బాలిక అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ కేసుకు సంబంధించి ఒక పోలీసు అధికారిని అరెస్టు చేశారు.పంజాబ్ పోలీసుల కథనం ప్రకారం, దోపిడీ జరిగినట్లు సమాచారం రావడంతో పోలీసులు వెను వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ సమయంలో అనుమానితులు కుటుంబ కారులో పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని ఒక కుటుంబానికి చెందిన వాహనాన్ని అడ్డగించారు. వారు ఆపకపోవడంతో అధికారి పొరపాటుగా భావించి కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. అయితే ఈకాల్పుల ఘటనలో దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియాకు చెందిన 10 ఏళ్ల హానియా అనే బాలిక మరణించగా, ఆమె తండ్రి, సోదరుడు గాయపడ్డారని తెలిపారు. దీంతో ఈ కాల్పులకు కారణమైన అధికారని పోలీసులు అరెస్టిు చేశారు.కాగా ఆస్ట్రేలియా పెర్క్కు సంబంధించిన బాధితులు పాకిస్థాన్‌లోని తమ బంధువులను కలవడానికి వచ్చారని ఆ సమయంలో కాల్పులు జరిగాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ఆస్ట్రేలియ ప్రధాని ఆంటోనియా ఆల్బనీస్ విచారం వ్యక్తం చేశారు. దీనిపై పారదర్శకమైన విచారణ జరగాలని కోరారు. గాయపడిన వారికి ఆస్ట్రేలియా కాన్సులేట్ సహాయం అందిస్తున్నట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.An Australian family's been caught up in a horror shooting while on holidays in Pakistan. Police opened fire, killing a nine-year-old girl and wounding her father and brother, apparently mistaking them for thieves. pic.twitter.com/zAZxr1ccou— 7NEWS Sydney (@7NewsSydney) June 13, 2026 -
ముగిసిన ఇరాన్-అమెరికా యుద్ధం
పశ్చిమాసియా సంక్షోభానికి ఎట్టకేలకు తెర పడింది. మూడు నెలలుగా జరుగుతున్న ఇరాన్-అమెరికా యుద్దం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు.. ఇటు ఇరాన్ జాతీయ భద్రతా మండలి కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. దీంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.లెబనాన్ సహా అన్ని సరిహద్దు ఫ్రంట్లలో తక్షణమే సైనిక చర్యలు నిలిపివేయాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. ఈ అంగీకారంతో 60 రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. ఈ కాలంలో ఇరు దేశాలు మరిన్ని శాంతి చర్చలు నిర్వహించి దీర్ఘకాలిక పరిష్కారానికి మార్గం సుగమం చేయనున్నాయి. అయితే ఈ డీల్ తాలుకా మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఖతార్ మధ్యవర్తిత్వంతోనే ఈ ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది. డీల్ కుదిరిన నేపథ్యంలో.. ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకా దళ దిగ్భంధనం తక్షణమే రద్దు కానుంది. శాంతి ఒప్పందం పూర్తైందని.. ఇరాన్‌పై ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. హర్ముజ్‌ను వెంటనే తెరవాలంటూ సోషల్ మీడియాలో ఆయనో పోస్ట్ చేశారు. ప్రపంచంలోని నౌకలు హర్ముజ్‌లో ఇంజిన్లు ప్రారంభించాలని.. తమ ప్రయాణాలను తిరిగి ప్రారంభించాలని.. చమురు సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి రావాలని ట్రంప్ పేర్కొన్నారు.ఇటు ఇరాన్ తరఫున ఆ దేశ సుప్రీం మోజ్తబా ఖమేనీ మార్గదర్శకత్వంలో డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. చర్చలను విజయవంతం చేసిన ఖతార్‌కు ఇరు వర్గాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. పాకిస్తాన్ కూడా ఈ పరిణామాన్ని స్వాగతించింది. ఇరు దేశాలకు అభినందనలు తెలిపింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు అధికారిక శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ట్రంప్ పుట్టినరోజు సమయంలోనే(జూన్ 14) డీల్ కుదరడం విశేషమంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వ్యాఖ్యానించారు. భారీ మూల్యం అయితే ఈ మూడు నెలల యుద్ధం ఇరు దేశాలనే కాదు.. పలు దేశాల్ని సైతం భారీ మూల్యం చెల్లించుకునేలా చేసింది. అమెరికా వైమానిక దాడులు, క్షిపణి దాడులతో ఇరాన్‌లోని పలు సైనిక స్థావరాలు, చమురు నిల్వ కేంద్రాలు, కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హర్ముజ్‌లో అమెరికా బ్లాకేడ్ వల్ల వాణిజ్య నౌకలు ఆగిపోయాయి. మరోవైపు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల దాడుల కారణంగా అమెరికా సైనిక స్థావరాలు, ఆయుధ సంపత్తి నాశనం అయ్యాయి. ఇరువైపులా తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది.యుద్ధ ప్రభావంతో పశ్చిమాసియాలోని అనేక ప్రాంతాల్లో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. వేలాది మంది ప్రజలు తమ నివాస ప్రాంతాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ ఇంధన మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. హర్ముజ్ జలసంధి మూతపడే ప్రమాదం నెలకొనడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. సముద్ర రవాణా వ్యయాలు పెరగడంతో.. ప్రపంచ వాణిజ్యంపై కూడా ప్రభావం పడింది. ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరా వ్యవస్థలపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పాక్‌ను తిప్పేశారు
ధనాధన్ ఫార్మాట్లోనూ విశ్వవిజేతగా అవతరించాలనే లక్ష్యంతో ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన భారత మహిళల జట్టు టైటిల్ వేటను బ్రహ్మాండంగా ప్రారంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను తొలి మ్యాచ్‌లో చిత్తు చేసి టీమిండియా గెలుపు గర్జన చేసింది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, రిచా ఘోష్, హర్మన్‌ప్రీత్ విజృంభించగా... బౌలింగ్‌లో ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి, స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ తమ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చారు. బర్మింగ్‌హామ్: ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఘనవిజయంతో కప్పు వేటను ఘనంగా ప్రారంభించింది. గ్రూప్–1లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 64 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (44 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో విజృంభించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 36; 4 ఫోర్లు) రాణించింది. చివర్లో రిచా ఘోష్ (17 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) దంచికొట్టింది. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా, ఫాతిమా సనా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 17 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మునీబా అలీ (35 బంతుల్లో 41; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. పవర్‌ప్లే ముగిసేసరికి 52/1తో పటిష్ట స్థితిలో కనిపించిన పాకిస్తాన్... స్పిన్నర్ల రంగప్రవేశం తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ 10 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా... ఆంధ్ర అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి 21 పరుగులిచ్చి 3 వికెట్లు ఖాతాలో వేసుకుంది. భారత పురుష క్రికెటర్ల మాదిరిగానే... మహిళా క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్లేయర్లకు ‘షేక్ హ్యాండ్’ ఇవ్వలేదు. ప్రపంచకప్‌లో సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌తో శ్రీలంక; ఇంగ్లండ్‌తో ఐర్లాండ్ తలపడతాయి. తొలి బంతికే సిక్సర్... ఓపెనర్ షఫాలీ వర్మ (6) తొలి బంతికే సిక్స్ బాదడంతో... టీమిండియాకు మంచి ఆరంభం దక్కుతుందనుకుంటే అది సాధ్యపడలేదు. ఐదో బంతికి షఫాలీ అవుట్ కాగా... జెమీమా (1) విఫలమైంది. దీంతో భారత్ 18/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో నాయకద్వయం జట్టును ఆదుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో కలిసి వైస్ కెప్టెన్ స్మృతి ఇన్నింగ్స్‌ను నిర్మించింది. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన ఈ జంట... కుదురుకున్నాక చక్కటి షాట్లతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. మూడో వికెట్‌కు 91 పరుగులు జోడించిన అనంతరం స్మృతి అవుట్ కాగా... హార్డ్ హిట్టర్ భారతి ఫుల్మాలి (1) నిరాశ పరిచింది. ఈ దశలో దీప్తి శర్మ (12 నాటౌట్) అండతో రిచా రెచ్చిపోయింది. పాకిస్తాన్ పేలవ ఫీల్డింగ్ కూడా మనవాళ్లకు కలిసి వచ్చింది. ఒక్క ఓవర్లో 23 పరుగులు... తస్మియా రుబాబ్ వేసిన ఇన్నింగ్స్19వ ఓవర్లో భారత బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. తొలి బంతికి ఫోర్ కొట్టిన దీప్తి రెండో బంతికి సింగిల్ తీయగా... ఆ తర్వాత రిచా రఫ్ఫాడించింది. వరుసగా 4, 6, 4, 4 బాదింది. దీంతో ఆ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో మరో 15 పరుగులు రాబట్టారు. మొత్తంగా తొలి 10 ఓవర్లలో 65 పరుగులకే పరిమితమైన టీమిండియా ఆ తర్వాత 10 ఓవర్లలో 105 పరుగులు చేసింది. 87 అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా స్మతి మంధాన అవతరించింది. 86 సిక్స్‌లతో హర్మన్‌ప్రీత్ పేరిట ఉన్న రికార్డును స్మృతి అధిగమించింది.14 టి20 ఫార్మాట్లో పాకిస్తాన్‌పై భారత్ గెలిచిన మ్యాచ్‌లు. ఇరు జట్ల మధ్య 17 మ్యాచ్‌లు జరిగాయి. మూడింటిలో పాక్ గెలిచింది.166 మహిళల టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ గుర్తింపు పొందింది. 165 వికెట్లతో థిపాచా పథావోంగ్ (థాయ్‌లాండ్) పేరిట ఉన్న రికార్డును దీప్తి సవరించింది.స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ (సి) మునీబా (బి) సాదియా 6; స్మృతి (సి) సనా (బి) షమీమ్ 68; జెమీమా (సి) నటాలియా (బి) తస్మియా 1; హర్మన్‌ప్రీత్ (సి) నటాలియా (బి) సనా 36; భారతి (స్టంప్డ్) మునీబా (బి) సాదియా 1; రిచా (బి) సనా 34; దీప్తి శర్మ (నాటౌట్) 12; శ్రేయాంక పాటిల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–6, 2–18, 3–109, 4–110, 5–123, 6–168. బౌలింగ్: సాదియా 4–0–41–2; ఫాతిమా సనా 4–0–33–2; తస్మియా 4–0–41–1; రమీన్ షమీమ్ 4–0–30–1; నష్ర 4–0–25–0. పాకిస్తాన్ మహిళల ఇన్నింగ్స్: మునీబా (రనౌట్) 41; ఫెరోజా (సి) భారతి (బి) దీప్తి 12; ఆయేషా (సి) స్మృతి (బి) దీప్తి 12; సైరా జబీన్ (సి) హర్మన్ (బి) శ్రీ చరణి 2; నటాలియా (సి) హర్మన్ (బి) శ్రీ చరణి 7; సనా (సి) స్మృతి (బి) షఫాలీ 0; ఆలియా (సి) జెమీమా (బి) దీప్తి 18; షమీమ్ (సి) శ్రేయాంక (బి) శ్రీ చరణి 4; నష్ర (సి) హర్మన్ (బి) దీప్తి 4; తస్మియా (సి) జెమీమా (బి) దీప్తి 0; సాదియా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17 ఓవర్లలో ఆలౌట్) 106. వికెట్ల పతనం: 1–38, 2–53, 3–58, 4–75, 5–77, 6–79, 7–91, 8–105, 9–105, 10–106. బౌలింగ్: అరుంధతి రెడ్డి 2–0–21–0; శ్రేయాంక 3–0–17–0; క్రాంతి గౌడ్ 1–0–14–0; దీప్తి శర్మ 4–0–10–5; శ్రీ చరణి 4–0–21–3; షఫాలీ 3–0–22–1. -
టీమిండియా ఘన విజయం
పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా.. దీప్తి శర్మ (4-0-10-5) మాయాజాలానికి పాక్ 106 పరుగులకే చాపచుట్టేసింది. భారత్ తరఫున బ్యాటింగ్‌లో మంధాన (68) రాణించగా.. ఆఖర్లో రిచా ఘోష్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించింది. ఓటమి దిశగా పాక్75 పరుగుల వద్ద నాలుగు పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన పాక్.. ఓటమి దిశగా సాగుతోంది. 75 పరుగుల వద్ద మునీబా అలీని (41) దీప్తి శర్మ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రనౌట్ చేయగా.. 77 పరుగుల వద్ద ఫాతిమా సనాను (0) షఫాలీ, 79 పరుగుల వద్ద నతాలియాను (7) శ్రీ చరణి ఔట్ చేశారు. 13 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 83-6గా ఉంది. ఆలియా రియాజ్ (4), రమీన్ షమీమ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన పాక్7.4వ ఓవర్- 58 పరుగుల వద్ద పాక్ మూడో వికెట్ కోల్పోయింది. శ్రీచరణి బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్‌కు క్యాచ్ ఇచ్చి సైరా జబీన్ (2) ఔటైంది. రెండో వికెట్ కోల్పోయిన పాక్6.3వ ఓవర్- 53 పరుగుల వద్ద పాక్ రెండో వికెట్ కోల్పోయింది. దీప్తి శర్మ బౌలింగ్‌లో స్మృతి మంధనకు క్యాచ్ ఇచ్చి అయేషా జాఫర్ (12) ఔటైంది.ఇండియాకు తొలి బ్రేక్171 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్‌కు మెరుపు ఆరంభం లభించింది. 4.4 ఓవర్లలో ఆ జట్టు ఓపెనర్లు మునీబా అలీ (24), గుల్ ఫెరోజా (12) 38 పరుగులు చేశారు. అయితే 4.5వ ఓవర్లో భారత్‌కు తొలి బ్రేక్ లభించింది. ఫెరోజాను దీప్తి శర్మ ఇంటిదారి పట్టించింది. భారతి ఫుల్మలి అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఇది జరిగింది. గౌరవప్రదమైన స్కోర్ సాధించిన టీమిండియాటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించింది. ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (36) సహకరించింది. ఆఖర్లో రిచా ఘోష్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించింది. మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ 12 (నాటౌట్), షఫాలీ వర్మ 6, జెమీమా రోడ్రిగ్స్ 1, భారతి ఫుల్మాలి 1, శ్రేయాంక పాటిల్ 1 (నాటౌట్) పరుగు చేశారు. ఆపఖ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సనా, సదియా ఇక్బల్ తలో 2 వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్, రమీన్ షమీమ్ చెరో వికెట్ పడగొట్టారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్16.2వ ఓవర్- 123 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఫాతిమా సనా బౌలింగ్‌లో నతాలియాకు క్యాచ్ ఇచ్చి హర్మన్‌ప్రీత్ (36) ఔటైంది. 👉 సాదియా ఇక్బాల్ బౌలింగ్‌లో భారతీ ఫుల్మలీ (1) స్టంప్ ఔట్ కావడంతో 110 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది.మంధాన (68) ఔట్.. మూడో వికెట్ డౌన్ధాటిగా ఆడుతున్న మంధాన (68) రూపంలో టీమిండియా 109 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. రమీన్ సమీమ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన మంధాన ఫాతిమా సనాషేక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. హాఫ్ సెంచరీ బాదిన మంధానపాక్తో మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో చెలరేగింది. 34 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన మంధాన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. మంధాన (55), హర్మన్‌ప్రీత్ (21) పరుగులతో ఆడుతున్నారు.9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ ఎంతంటే..?18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. స్మృతి మంధన (28), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (17) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నారు. 9 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 54-2గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా3.2వ ఓవర్- 18 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. తస్మియా రుబాబ్ బౌలింగ్‌లో నతాలియా పర్వేజ్ క్యాచ్ పట్టడంతో జెమీమా రోడ్రిగ్స్ (1) పెవిలియన్‌కు చేరింది. తొలి బంతికే సిక్సర్.. ఐదో బంతికి వికెట్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు మెరుపు ఆరంభం లభించింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సదియా ఇక్బాల్ బౌలింగ్‌లో షఫాలీ వర్మ సిక్సర్ కొట్టింది. అయితే అదే ఓవర్ ఐదో బంతికి మునీబా అలీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (జూన్ 14) బిగ్ ఫైట్ జరుగనుంది. దాయాదులు భారత్, పాకిస్తాన్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లోనూ భారత, పాక్ కెప్టెన్లు నో హ్యాండ్ షేక్ ఆనవాయితీని కొనసాగించారు. తుది జట్లు:భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్పాకిస్తాన్: గుల్ ఫిరోజా, మునీబా అలీ(w), అయేషా జాఫర్, సైరా జబీన్, అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, ఫాతిమా సనా(c), రమీన్ షమీమ్, నష్రా సంధు, తస్మియా రుబాబ్, సదియా ఇక్బాల్ -
యుద్దంలో పాక్ ఓడిపోతే అదే చేయాలి
తిరువనంతరపురం: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని RSS ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే గతంలో చేసిన వ్యాఖ్యలు సమర్ధిస్తున్నానని తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో భగవత్ ఇలా వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ "మనం హిట్లర్ లాంటి వాళ్లం కాదు, అది మన స్వభావం కూడా కాదు. ఒకవేళ భవిష్యత్తులో జరిగే యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్తాన్ పూర్తిగా ఓడిపోతే.. అక్కడ ఉన్న ప్రజలను భారత్‌లో భాగం చేయడమో లేదా వారు ప్రశాంతంగా జీవించేలా చూడడమో చేయాలి. అందుకోసం వారితో చర్చలు జరిపే మార్గాలను (తలుపులను) ఎప్పుడూ తెరిచే ఉంచాలి" అని భగవత్ పేర్కొన్నారు. అన్యాయాన్ని, నియంతృత్వాన్ని అంతమొందించాలని అదే సమయంలో మంచిని కాపాడుకోవాలని స్పష్టం చేశారు.పాకిస్తాన్లో మారుతున్న ఆలోచనలుదేశ విభజన జరగడం తప్పని భావించే ప్రజలు పాకిస్తాన్లో చాలా మంది ఉన్నారన్నారు. అక్కడ ఉన్న పలువురు జర్నలిస్టులు కూడా ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనులను ప్రశంసిస్తున్నారని, 'రెండు దేశాల సిద్ధాంతం తప్పని, కలిసి ఉంటేనే బాగుండేదనే భావన అక్కడ అంతర్గతంగా బలంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.అదే సమయంలో ఏ దేశంతోనైనా విదేశీ సంబంధాల విషయంలో ఆర్ఎస్ఎస్కు విడిగా ఎలాంటి ప్రత్యేక విధానాలు ఉండవని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకే సంఘ్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయినప్పటికీ, అత్యంత అపార్థానికి గురైన సంస్థ కూడా ఇదేనని వ్యాఖ్యానించారు. యూనిఫామ్ వేసుకుని చేసే రూట్ మార్చ్‌లను చూసి కొందరు దీనిని పారామిలిటరీ సంస్థ అనుకుంటారని, వ్యాయామాలు చూసి వ్యాయామశాల అనుకుంటారని, కానీ బయట నుండి చూస్తే సంఘ్ అర్థం కాదని, దానిని లోపలికి వచ్చి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన కోరారు. -
మన మహిళలు రెడీ
బర్మింగ్‌హామ్: మహిళల వన్డే వరల్డ్ కప్ చాంపియన్ భారత్ తొలి సారి టి20 ప్రపంచకప్‌ను కూడా అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. టోర్నీలో నేడు జరిగే తమ తొలి మ్యాచ్‌లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ప్రస్తుత ఫామ్, ఓవరాల్‌గా ఆటగాళ్ల రికార్డులను బట్టి చూస్తే అన్ని రంగాల్లో పాక్‌కంటే పటిష్టంగా కనిపిస్తోంది. వరల్డ్ కప్‌కు ముందు ఆ్రస్టేలియా, ఇంగ్లండ్లను వారి సొంతగడ్డపై ఓడించిన హర్మన్‌ప్రీత్ సేన... స్వదేశంలో శ్రీలంకను 5–0తో చిత్తు చేసింది. ఇటీవల దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల చేతుల్లో సిరీస్‌లు కోల్పోయినా... జట్టు కూర్పులో భాగంగా చేసిన పలు ప్రయోగాల్లో ఈ ఫలితాలు వచ్చాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇప్పటి వరకు టి20 ప్రపంచకప్‌లలో పాక్‌పై భారత్ 6–2తో ఆధిక్యంలో ఉండగా... ఓవరాల్‌గా టి20ల్లో కూడా భారత్ 13–3తో పైచేయి సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ దూకుడుగా ఆరంభిస్తే భారత్ భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. మూడో స్థానంలో యస్తిక భాటియా, భారతి ఫుల్మలిలలో ఎవరికి అవకాశం లభిస్తుందనేది చూడాలి. మిడిలార్డర్లో జెమీమా, హర్మన్ తమ స్థాయికి తగ్గి ప్రదర్శన చేయాల్సి ఉంది. ఎప్పటిలాగే ఫినిషింగ్‌లో రిచా ఘోష్ మెరుపు బ్యాటింగ్ కనబర్చగల సమర్థురాలు. ప్రధాన పేసర్‌గా క్రాంతి గౌడ్ ఖాయం కాగా...అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్లలో ఒకరికే రెండో పేసర్‌గా చాన్స్ లభిస్తుంది. ముగ్గురు స్పిన్నర్లు శ్రీచరణి, నందిని శర్మ, దీప్తి శర్మలతో భారత్ ఆడటం ఖాయమైంది. మరో వైపు 2024 వరల్డ్ కప్‌లో భారత్ చేతిలో చిత్తయిన పాక్ జట్టు ఈ సారైనా పోటీనివ్వాలని భావిస్తోంది. జట్టు కెపె్టన్ ఫాతిమా సనా ఆల్‌రౌండ్ ప్రదర్శనపై జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది. మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా బంతి తగలడంతో సనా మోకాలికి గాయమైంది. అయితే ఇది ప్రమాదకరమైందని కాదని, ఆమె బరిలోకి దిగుతుందని పాక్ మేనేజ్మెట్ ప్రకటించింది. సీనియర్ ఓపెన్ మునీబా, గుల్ ఫెరోజా ఎలాంటి ఆటతీరు కనబరుస్తారనేది చూడాలి. పాక్ జట్టులో ఈ సారి కొత్త ప్లేయర్ ఇమాన్ ఫాతిమాపై అందరి దృష్టీ నిలిచింది. అండర్–19 స్థాయినుంచి వచ్చిన ఆమె టి20ల్లో 150కు పైగా స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయగల సమర్థురాలు. ఫినిషర్‌గా ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఇమాన్‌పై పాక్ ఆశలు పెట్టుకుంది.డానీ వ్యాట్ సెంచరీమహిళల టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ శుభారంభం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్–2 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 87 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 219 పరుగులు చేసింది. మహిళల టి20 ప్రపంచకప్ చరిత్రలో ఒక జట్టు అత్యధిక స్కోరు ఇదే. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ఓపెనర్ డానీ వ్యాట్ (62 బంతుల్లో 105 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగింది. అమీ జోన్స్ (38 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ సీవర్ బ్రంట్ (22 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) కూడా మెరవడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. నీలాక్షిక (39; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెయా కెంప్ 4 వికెట్లు పడగొట్టింది.ఆ్రస్టేలియా అదరహో...మాంచెస్టర్: మహిళల టి20 ప్రపంచకప్‌లో అగ్రశ్రేణి జట్టు ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ 65 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ముందుగా ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (24 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), ఎలైస్ పెరీ (36), వేర్హామ్ (32) మెరుపులతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 172 పరుగులు సాధించగా... దక్షిణాఫ్రికా 16.4 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్ 40 పరుగులతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేయగా, ఐర్లాండ్ 19.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. -
సరిహద్దు దాటి భారత్‌లో అడుగుపెట్టిన పాకిస్థానీ.. దొరికేశాడు..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో సిమ్రీ గ్రామం సమీపంలో ఓ పాకిస్థాన్ పౌరుడిని అధికారులు పట్టుకున్నారు. భద్రతా పరంగా దీన్ని భారీ విజయంగా చెప్పుకోవచ్చు. భారత సైన్యం చినార్ వారియర్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి నిర్వహించిన ‘ఆపరేషన్ సిమ్రీ’ ఫలితంగా అతడు దొరికాడు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ పాకిస్థాన్ పౌరుడు అనుమానాస్పదంగా నియంత్రణ రేఖను దాటాడు. నిర్దిష్ట నిఘా సమాచార ఆధారంగా అప్రమత్తమైన చినార్ వారియర్స్, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం ఆ వ్యక్తిని అడ్డుకుని, భద్రతా ఉల్లంఘన జరిగే అవకాశాన్ని నివారించింది."నిర్దిష్ట నిఘా సమాచార ఆధారంగా, అప్రమత్తంగా ఉన్న చినార్ వారియర్స్ జమ్మూ కశ్మీర్ పోలీసులతో కలిసి జూన్ 12న కుప్వారాలోని సిమ్రీ గ్రామం సమీపంలో అనుమానాస్పద పరిస్థితుల్లో నియంత్రణ రేఖ దాటిన ఓ పాక్ పౌరుడిని పట్టుకున్నారు. వేగంగా స్పందించిన చినార్ వారియర్స్, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం ఆ వ్యక్తిని అడ్డుకుని, భద్రతా ఉల్లంఘన జరిగే ప్రమాదాన్ని నివారించింది. చొరబాటుదారుడిపై ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది" అని చినార్ కార్ప్స్ ఎక్స్ ద్వారా పోస్టు చేసింది.నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) అంటే భారత్, పాకిస్థాన్ అధీన ప్రాంతాల మధ్య ఉన్న సైనిక విభజన రేఖ. ఈ ప్రాంతం చాలా కీలకం. ఉగ్రవాదులు చొరబడకుండా సైనికులు నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది. OP SIMRI, KupwaraBased on specific intelligence input, alert #ChinarWarriors, in a joint operation with @JmuKmrPolice, apprehended a Pak National near Simri Village, Kupwara on 12 Jun 2026, who had crossed the Line of Control under suspicious circumstances. Acting swiftly, the… pic.twitter.com/NCpX0gUbta— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) June 13, 2026 -
పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతును రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సింధు నది నీరు చేరకుండా ఎన్‌డిఎ (NDA) ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ ఏర్పాటు చేసిన 'మేధావుల సమావేశం'లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి, సామరస్యాల భాష అర్థం కాని వారికి ఎలా సమాధానం చెప్పాలో తమ ప్రభుత్వానికి బాగా తెలుసని 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ప్రపంచానికి నిరూపించామని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదానికి అండగా నిలిచే వారికి సింధు నదీ జలాలు అంద కుండా చేస్తామని హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన రక్తం, నీరు కలిసి ప్రవహించవు అన్న హెచ్చరికను రక్షణ మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, సింధు జలాల ఒప్పందాన్ని (IWT) నిలిపివేస్తూ, బాధితుల పట్ల కరుణ చూపనివారికి తమ నుంచి నీటిని ఆశించకూడదని చెప్పామన్నారు. ఉగ్రవాదులకు అండగా నిలిచేవారికి, మానవాళికే ముప్పుగా ఉన్నవారికి ఈ జలాలు అందకుండా చేస్తామన్నారు.కాగా సింధు నదీ వ్యవస్థకు చెందిన నదుల జలాల వినియోగానికి సంబంధించి 1960 సెప్టెంబర్ 19న భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం (IWT) కుదిరింది. అయితే గత ఏడాది జరిగిన దారుణమైన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, అంతర్జాతీయ చట్టం ప్రకారం సార్వభౌమ దేశంగా తనకున్న హక్కులను వినియోగించుకుంటూ, సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ నమ్మదగిన, తిరుగులేని రీతిలో మద్దతు ఉపసంహరించుకునే వరకు భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది.అలాగే గత 12 ఏళ్లలో ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ, రక్షణ మంత్రి ఆర్టికల్ 370 రద్దు, దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చడంలో పురోగతి, జీఎస్టీ (GST) అమలు, దేశవ్యాప్త విద్యుదీకరణ మరియు న్యాయ వ్యవస్థలో సంస్కరణలను ప్రస్తావించారు. ఒకప్పుడు ఉగ్రవాదానికి నిలయంగా ఉన్న కాశ్మీర్, ఇప్పుడు పర్యాటకం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో దూసుకుపోతోందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది, అక్కడ తొలిసారిగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి, మొహర్రం ఊరేగింపులు ప్రశాంతంగా సాగుతున్నాయి, దశాబ్దాలుగా మూతపడి ఉన్న సినిమా హాళ్లు తిరిగి తెరుచుకుంటున్నాయని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. -
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెన
ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన, ఆధునిక వంతెనలు ఉన్నాయి. కానీ కేవలం ఇనుప తీగలు, సరిగ్గా అమర్చని చెక్క పలకలతో నిర్మించిన ఒక వంతెనను చూస్తే మాత్రం ఎవరికైనా వణుకు పుట్టడం ఖాయం. పాకిస్తాన్‌లోని ఉత్తర పర్వత ప్రాంతంలో ఉన్న ‘హుస్సేనీ సస్పెన్షన్ బ్రిడ్జ్’ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెనగా గుర్తింపు పొందింది. గిల్గిట్-బాల్టిస్తాన్ రీజియన్‌లో ఉధృతంగా ప్రవహించే హుంజా నదిపై నిర్మించిన ఈ వంతెన పర్యాటకులకు వింత అనుభూతిని ఇస్తూనే, ప్రతి అడుగులోనూ మృత్యువును పరిచయం చేస్తుంది. అసలు ఈ వంతెన అంత ప్రమాదకరంగా ఎందుకు మారింది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం.భీకర గాలులను తట్టుకునే ప్రత్యేక వింత డిజైన్ఈ వంతెనను చూడగానే ఎవరికైనా భయం వేయడం సహజం. వంతెనపై ఉన్న చెక్క పలకల మధ్య చాలా ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది. అయితే, ఇది పాలకుల నిర్లక్ష్యం కాదు. ఇదొక వ్యూహాత్మక ఇంజనీరింగ్ డిజైన్. గోజల్ లోయలో వీచే అత్యంత వేగవంతమైన, భీకర గాలులు వంతెనను పడగొట్టకుండా ఉండటానికే ఈ ఖాళీలను ఉంచారు. ఒకవేళ ఈ చెక్కలను దగ్గర దగ్గరగా అమరిస్తే, బలమైన గాలులను తట్టుకోలేక మధ్యలోకి విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ ఖాళీల గుండా గాలులు అడ్డులేకుండా సాగిపోతాయి. అయితే ఈ ఖాళీలపై అడుగు వేస్తూ కింద ఉన్న నీటిని చూస్తూ నడవడం పర్యాటకులకు ఒక అగ్నిపరీక్షే.ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నిలిచిన వంతెనహుస్సేనీ వంతెనకు భారీ విధ్వంసం, పునర్నిర్మాణాల చరిత్ర ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న వంతెన అసలైనది కాదు. గతంలో ఇక్కడ నిర్మించిన వంతెనలు ఈ ప్రాంతంలో వచ్చే తీవ్రమైన వాతావరణ మార్పులు, రుతుపవనాల వరదలు, నదీ ప్రవాహాల ఉధృతికి కొట్టుకుపోయాయి. ప్రకృతి ఎంత క్రూరంగా ఉంటుందో చెప్పడానికి ఒక ఉదాహరణ.. ప్రస్తుత వంతెన పక్కనే పాత వంతెనకు సంబంధించిన తుప్పు పట్టిన, విరిగిపోయిన ఇనుప కేబుళ్లు ఇప్పటికీ వేలాడుతూ కనిపిస్తాయి. స్థానికులు నిరంతరం ఈ వంతెనను పర్యవేక్షిస్తూ, విరిగిపోయిన చెక్కల స్థానంలో కొత్తవాటిని మారుస్తూ పునరుద్ధరిస్తుంటారు.సాహసికులకు స్వర్గధామంప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహస ప్రియులకు ఈ వంతెన ఒక స్వర్గధామం. తమ ధైర్యాన్ని పరీక్షించుకోవడానికి ప్రతి ఏటా వందలాది మంది అంతర్జాతీయ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వంతెనపై నడుస్తున్నప్పుడు వచ్చే బలమైన గాలులకు అది ఇరువైపులా ఊగులాడుతూ ఉంటే గుండె ఆగినంత పనవుతుంది. ఎటువంటి ఆధునిక రక్షణ ఏర్పాట్లు, పటిష్టమైన రైలింగ్‌లు లేని ఈ వంతెనపై ప్రయాణం ఒక అద్భుతమైన, అత్యంత ప్రమాదకరమైన ప్రయాణ అనుభూతిని మిగుల్చుతుంది.స్థానికుల జీవననాడి..అంతర్జాతీయ పర్యాటకులకు ఇది కేవలం ఒక సాహస వినోదం మాత్రమే కావచ్చు. కానీ స్థానికులకు మాత్రం ఇది నిత్య జీవితంలో ఒక భాగం. హుస్సేనీ గ్రామాన్ని, నది అవతల ఉన్న జరాబాద్ వ్యవసాయ భూములతో అనుసంధానించే ఏకైక మార్గం ఇదే. స్థానికులు ప్రతిరోజూ భారీ బరువులను, నిత్యావసర సరుకులను నెత్తిన పెట్టుకుని ఈ ఊగిసలాడే చెక్కలపై ఎంతో సునాయాసంగా నడుచుకుంటూ వెళ్తుంటారు. వారి దైనందిన జీవన గమనానికి ఈ వంతెనే ఏకైక ఆధారం.నిర్వహణ ఖర్చులు.. పర్యాటక రుసుముఈ ప్రమాదకరమైన వంతెనను సజీవంగా ఉంచడానికి స్థానికులు ఎంతో పాటుపడుతున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల నుంచి సుమారు 200 రూపాయల (స్థానిక కరెన్సీ) నిర్వహణ రుసుమును వసూలు చేస్తారు. ఈ నిధులన్నింటినీ నేరుగా స్థానిక కమ్యూనిటీ నిధికి బదిలీ చేస్తారు. అత్యంత కఠినమైన శీతాకాలం ప్రారంభం కావడానికి ముందే వంతెనకు అవసరమైన కొత్త చెక్కలను కొనుగోలు చేయడానికి, ఇనుప తీగలను మరమ్మతు చేయడానికి ఈ డబ్బును వినియోగిస్తారు.ఇది కూడా చదవండి: ప్రశాంతత కోసం ఐటీ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం


