పాకిస్థాన్ బలూచిస్థాన్‌లో భద్రతా బలగాలు, మిలిటెంట్ల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో కనీసం 70 మంది మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. వీరితో పాటు 10 మంది భద్రతా బలగాలు ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్లు పేర్కొన్నారు.
పాకిస్థాన్‌లో ఆర్మీకి, బలుచిస్థాన్ తిరుగుబాటు దారులకు మధ్య పెద్దఎత్తున కాల్పులు జరిగాయి. బలుచిస్థాన్ ప్రాంతంలోని 12 ప్రాంతాలలో ఆ దేశ భద్రత బలగాలు, పోలీసులు స్థావరాలే టార్గెట్‌గా ఈ దాడులు జరిగాయి. శుక్రవారం రాత్రి మెుదలైన ఈ కాల్పులు శనివారం ఉదయం వరకూ సాగినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడులలో 70 మంది బలూచిస్థాన్ మిలిటెంట్లు ప్రాణాలు వదలగా, 10 మంది వరకూ సైనికులు మృతి చెందినట్లు బలూచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.
బలూచిస్థాన్ ప్రాంతంలోని క్వెట్టా, మక్రాన్, హబ్, చమన్, నసీరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలలో ఈ దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండడంతో ముష్కరుల దాడిని అప్రమత్తంగా తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు. నసీరాబాద్ జిల్లాలో ముష్కరులు రైల్వేట్రాక్‌పై బాంబు అమర్చగా దానిని నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. అయితే భద్రతా బలగాలు జరిగిన దాడిలో ఇదివరకూ 70 మంది ఉగ్రవాదులు మరణించారని మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.


