breaking news
Baluchistan
-
ఆ దాడి చేసింది మేమే.. BLA ప్రకటన
బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 22న పాకిస్థాన్ సైనిక దళాలపై జరిగిన దాడికి BLA దే బాధ్యత అని ప్రకటించింది. బలూచిస్థాన్నికి స్వతంత్ర్యం కల్పించేంతవరకూ ఈ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది.ఫిబ్రవరి 22న అలహాబాద్ ప్రాంతంలోని మాచ్ ప్రాంతంలో పాకిస్థాన్ భద్రత బలగాల కాన్వాయిపై మెరుపుదాడి జరిగింది. ఈ అటాక్‌లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన నలుగురు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. అయితే ఈ దాడికి తమదే బాధ్యతని BLA ప్రకటించింది. పాక్ ఆక్రమణలో ఉన్న బలూచిస్థాన్‌కు స్వాతంత్ర్యం కల్పించే వరకూ పోరాటం ఆపేది లేదని BLA స్పోక్స్ పర్సన్ ఆజాద్ బలూచ్ తెలిపారు.అయితే అంతకుముందు బలూచిస్థాన్ తిరుగుబాటు దారులపై పాకిస్థాన్ ఆర్మీ విరుచుకుపడింది. ఇటీవల ఆ సైన్యం జరిపిన దాడుల్లో 177 మందికి పైగా మృతిచెందారు. BLA ఆర్మీకి వారికి ఎటువంటి సహాయక చర్యలు అందకుండా ఉండేందుకు రైలు సేవలను సైన్యం నిలిపివేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్ను కట్ చేసింది. అయితే బలూచిస్తాన్‌లోని ఉగ్రవాదులతో సహా వారి సానూభూతిపరుల నెట్వర్క్ మెుత్తంగా 4 నుంచి 5వేల మధ్య ఉండే అవకాశం ఉందని పాక్ మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. -
పాక్‌లో ఆరని చిచ్చు.. బలూచ్ విముక్తి సాధ్యమయ్యేనా?
బలూచిస్తాన్.. పాక్‌లోని ఈ రాష్ట్రం అపార సహజ సంపదకు నిలయం. అయినా దారిద్య్రం నీడలో మగ్గుతున్న ఈ గడ్డపై ఇప్పుడు విముక్తి నినాదం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. పాకిస్తాన్ సైనిక ఉక్కుపాదం కింద నలిగిపోతున్న బలూచ్ ప్రజల పోరాటం.. కేవలం భూభాగం కోసమే కాదు, అది వారి అస్తిత్వానికి సంబంధించినది. అంతర్గత కల్లోలాలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల మధ్య నలిగిపోతున్న ఈ ప్రాంతానికి నిజంగానే విముక్తి లభిస్తుందా? లేదా ఈ మంట ఇలానే రగులుతుటుందా? ఇదే ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న.భూభాగంలో 44 శాతం వాటాపాకిస్తాన్లోని మొత్తం భూభాగంలో 44 శాతం వాటా కలిగిన బలూచిస్తాన్ గత కొన్ని దశాబ్దాలుగా తీవ్రమైన అశాంతికి గురవుతోంది. ఈ ప్రాంతంలో వేర్పాటువాద గ్రూపులు స్వయంప్రతిపత్తితో పాటు సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం దాడులను ముమ్మరం చేస్తున్నాయి. అపారమైన సహజ వనరులు ఉన్నప్పటికీ, తమ ప్రాంతం వెనుకబడి ఉందన్న అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.మహిళలు సైతం తిరుగుబాటు బలూచ్ తిరుగుబాటుదారులు కఠినమైన పర్వత ప్రాంతాలను ఆసరాగా చేసుకుని, ఆధునిక ఆయుధాలతో పాక్ భద్రతా బలగాలకు సవాలు విసురుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ పోరాటంలో మహిళలు ఆత్మహుతి దాడులకు సైతం సిద్ధపడటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం అక్కడి సామాజిక అసంతృప్తి ఎంతగా ఉందో స్పష్టం చేస్తోంది.కీలక సరిహద్దులతో ప్రత్యేక గుర్తింపుసుమారు 3,47,190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న బలూచిస్తాన్.. విస్తీర్ణంలో భారత్‌లోని ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల ఉమ్మడి వైశాల్యం కంటే పెద్దది. దీనికి పశ్చిమాన ఇరాన్, ఉత్తరాన ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులు ఉన్నాయి. భారత్‌తో నేరుగా సరిహద్దు లేనప్పటికీ, అరేబియా సముద్ర తీరంలోని 770 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం దీనికి అంతర్జాతీయ ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది.చైనా ప్రయోజనాలుబలూచిస్తాన్లోని గ్వాదర్ నౌకాశ్రయం అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైనదిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా చైనా చేపట్టిన ‘చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్’(సీపీఈసీ) ప్రాజెక్టు ఇక్కడి నుంచే సాగుతుంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’కు ఇది సమీపంలో ఉండటంతో, ఈ ప్రాంతంపై పట్టు కోసం చైనా, పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.సామాజిక స్థితిగతులుసుమారు 1.5 కోట్ల జనాభా కలిగిన ఈ ప్రావిన్స్‌లో 52 శాతం మంది బలూచ్‌లు. 36 శాతం పష్తూన్లు నివసిస్తున్నారు. రాజధాని క్వెట్టా నగరం ఈ ప్రాంతానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ బ్రాహుయి, హజారా వంటి మైనారిటీ వర్గాలు వారు కూడా ఉన్నారు. అయితే స్థానిక వనరులపై తమకు అధికారం లేకపోవడంపై ఇక్కడ నిరంతరం ఘర్షణలు జరుగుతున్నాయి.పాలకుల తీవ్ర నిర్లక్ష్యంబలూచిస్తాన్ సహజ వనరుల గని. ఇక్కడ భారీ స్థాయిలో సహజ వాయువు, బంగారం, రాగి, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. కానీ ఈ వనరుల ద్వారా వచ్చే ఆదాయం తమ అభివృద్ధికి కాకుండా, పాక్ కేంద్ర ప్రభుత్వానికే చేరుతోందని బలూచ్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్థిక దోపిడీయే వేర్పాటువాదానికి ప్రధాన కారణంగా మారుతోంది.‘మహా బలూచిస్తాన్’ ఆకాంక్షవేర్పాటువాద గ్రూపులు కేవలం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్తోనే ఆగకుండా, పక్కనే ఉన్న ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్‌లోని బలూచ్ ప్రాబల్య ప్రాంతాలను కలిపి ‘మహా బలూచిస్థాన్’ ఏర్పాటు చేయాలని కలలుగంటున్నాయి. అయితే మూడు దేశాల సరిహద్దులతో ముడిపడి ఉండటం వల్ల ఈ లక్ష్యం అత్యంత సంక్లిష్టంగా, సవాలుతో కూడినదిగా మారింది.ఇదే అతిపెద్ద అవరోధంబలూచ్ నేతలు తమది స్వతంత్ర దేశంగా చెప్పుకుంటున్నప్పటికీ, ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశం కూడా దీనిని గుర్తించలేదు. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై దౌత్యపరమైన మద్దతు లేకపోవడం దేశ స్వాతంత్ర్య పోరాటానికి పెద్ద అడ్డంకిగా మారింది. చైనా వంటి శక్తులు పాకిస్తాన్‌కు అండగా నిలుస్తున్నంత కాలం, దౌత్యపరమైన గుర్తింపు లభించడం అంత సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ సుంకాలు: భారత్‌కు భారీ ఊరట -
పాక్‌కు బలూచ్ సవాలు!
బలూచిస్తాన్ స్వాతంత్య్ర కాంక్షను ఉక్కుపాదాల కింద తొక్కివుంచాలని ఏడు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ పాలకులకు యథాప్రకారం మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత వారం చివరిలో తొమ్మిది జిల్లాల్లో కొనసాగించిన ఆత్మాహుతి దాడుల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) 84 మంది పాక్ సైనికుల్ని హతమార్చి, మరో 18 మందిని అపహరించింది. ప్రతీకారంగా తాము జరిపిన దాడుల్లో 133 మంది బీఎల్ఏ మిలిటెంట్లు చనిపోయారని పాక్ సైన్యం ప్రకటించింది. ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ భాషనూ, సంస్కృతినీ విస్మరించిన పర్యవసానంగా అది విడివడి బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించిన సంగతి తెలిసి కూడా దేశంలో 40 శాతం భూభాగం గల బలూచిస్తాన్‌ను పాక్ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కోటిన్నరమంది జనాభా నివసించే ఆ ప్రాంతానికి ఒకపక్క అఫ్గానిస్తాన్, మరోపక్క ఇరాన్, మూడోవైపు అరేబియా సముద్రం ఉండగా వర్షాభావ పరిస్థితుల కారణంగా అత్యధిక భూభాగంలో భూగర్భ జలాలే ఆధారం. అక్కడ పండే యాపిల్స్, ద్రాక్ష, బాదం, ఖర్జూరం వగైరాలు విదేశాలకు ఎగుమతి అవుతాయి. పాక్ పండ్ల ఎగుమతుల్లో 90 శాతం వాటా బలూచిస్తాన్ ప్రాంతానిదే. నీటి పారుదల సదుపాయం పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో గోధుమ, వరి, బార్లీ, ఆలుగడ్డ పండుతాయి. ఇంతగా దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నా బలూచిస్తాన్ అభివృద్ధిని పాలకులు పూర్తిగా మరిచిపోయారు. అక్కడి భూపొరల్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. రాగి, సీసం, క్రోమైట్, గ్రానైట్, జింకు వగైరాలున్నాయి. చమురు, సహజ వాయువు, బొగ్గు, బంగారం ఉన్నాయి. వీటిల్లో బంగారం, రాగి గనుల నిర్వహణ చైనా చేతుల్లో ఉంది. అది పెట్టుబడి పెట్టి నిర్మించిన గ్వాదర్ నౌకాశ్రయం బలూచిస్తాన్ ప్రాంతం లోనిదే. 6,500 కోట్ల డాలర్లతో చైనా నిర్మించతలపెట్టిన చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చైనాలోని షిన్జియాంగ్ నుంచి గ్వాదర్ వరకూ ఉంటుంది. చైనా దోపిడీ చాలలేదన్నట్టు నిరుడు సెప్టెంబర్‌లో అమెరికా కూడా వచ్చింది. ఆ దేశానికి చెందిన బహుళ జాతి సంస్థ స్ట్రాటజిక్ మెటల్స్‌తో పాక్ సైన్యం అనుబంధ సంస్థ 50 కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇదంతా ఆ ప్రాంత అభివృద్ధి కోసమేనంటూ ప్రభుత్వం చెబుతున్నదంతా బూటకమనీ, గ్వాదర్ నౌకాశ్రయం తర్వాత తమ మత్స్యకారులు జీవిక కోల్పోయారనీ, గుక్కెడు మంచినీళ్లు దొరకడం కూడా కష్టమవుతున్నదనీ బీఎల్ఏ ఆరోపణ. పాకిస్తాన్ ఆవిర్భవించాక 1948లో బలూచిస్తాన్‌ను బలవంతంగా విలీనం చేసుకుంది. అప్పటి నుంచి తిరుగుబాట్లు సాగుతూనే ఉన్నాయి. అణిచేద్దామని చూసిన ప్రతి సారీ అవి మరింత తీవ్రంగా పోటెత్తుతున్నాయి. పాక్ సంస్కృతి, సంప్రదాయాలతో తమకేమాత్రం పోలిక ఉండదని, ఒక దేశంగా ఉంటేనే అస్తిత్వ పరిరక్షణ, అభివృద్ధి సాధ్యమని ఆ ప్రాంతవాసుల వాదన. ఇందుకోసం వామపక్ష భావాలతో ప్రభావితుడైన మీర్ గౌస్ బిజెంజో ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిధిలో పోరాటాలు జరిగాయి. పాక్ పరిధిలోనే స్వయంపాలనకు హామీ ఇవ్వాలన్న డిమాండ్‌తో నేషనల్ అవామీ పార్టీ (ఎన్ఏపీ) ఏర్పాటు చేసి, 1970 ఎన్నికల్లో బలూచిస్తాన్, ప్రస్తుత ఖైబర్ ఫఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ మరో మూడేళ్లకే అప్పటి జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వం సైనిక చర్య ద్వారా ఆ రెండు ప్రభుత్వాలనూ కూలదోసింది. ఈ అప్రజాస్వామిక చర్యే అనంతర కాలంలో మిలిటెన్సీకి బీజం వేసింది. బలూచిస్తాన్‌లో పాక్ సైన్యం చేయని దురాగతం లేదు. బలూచ్ యూనివర్సిటీలోనూ, వెలుపలా యువతను అపహరించటం, హతమార్చటం దానికి అలవాటైన విద్య. 2011 నుంచి ఇంతవరకూ 10,000 మంది మాయమయ్యారంటే ఇదెంతగా ఉందో అంచనా వేయొచ్చు. 2018 తర్వాత బలూచ్ మిలిటెంట్ సంస్థలు ఏకం కావటంతో పోరాటాలు ఉద్ధృతమయ్యాయి. నిరుడు మార్చిలో జాఫర్‌ఖాన్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ చేయటం మొదలుకొని పాక్ సైన్యంపై సాగిస్తున్న నిరంతర దాడులు పాలకుల్ని ఊపిరాడకుండా చేస్తున్నాయి. చారిత్రక ఆకాంక్షలను అణగదొక్కి, అభివృద్ధిని విస్మరించే ఏ పాలకులకైనా ఇదే దుఃస్థితి ఎదురవుతుంది. తప్పు తెలుసుకోకుండా, గుణపాఠం నేర్చుకోకుండా, మిలిటెంట్లకు భారత్ మద్దతుందని అనవసర యాగీ చేయటం పాక్ పాలకుల నిస్సహాయతకు అద్దం పడుతోంది. -
పాక్ ఆర్మీ దాడులు.. 177కు చేరిన BLA మృతులు
బలూచిస్థాన్ తిరుగుబాటు దారులపై పాకిస్థాన్ ఆర్మీ విరుచుకుపడుతుంది. తాజాగా ఆ ప్రాంతంలో దాడి చేసి మరో 22 మంది BLA ( బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ) సైనికులను మట్టుబెట్టించినట్లు తెలిపింది. దీంతో సైన్యం దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 177కు చేరుకున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.BLA ఆర్మీ కోసం పాకిస్తాన్ సైనికులు గాలింపును తీవ్రతరం చేస్తున్నారు. బీఎల్ఎఫ్ స్థావరాలపై పక్కా ప్రణాళికతో దాడి చేసి వారి స్థావరాలను ధ్వంసం చేశారు. భద్రతా చర్యలలో భాగంగా క్వెట్టా ప్రాంతంలో రైలు సేవలను సైన్యం నిలిపివేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్ను కట్ చేసింది. భద్రతా బలగాలు ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఉగ్రమూకల స్థావరాలను నిర్విర్యం చేస్తున్నాయని పాక్ ఆర్మీ ప్రకటించింది.అయితే ఇటీవలే బలుచిస్థాన్ ఆర్మీ ఉగ్రదాడులు చేసిన తర్వేతే కౌంటర్‌గా ఈ దాడులు చేపడుతున్నట్లు బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. కేవలం రాజకీయ చర్చల ద్వారానే ఉగ్రవాదాన్ని నిర్మూలించలేమని వారికి తగిన రీతిలో బదులివ్వడానికి పటిష్టమైన సైన్యం అవసరమన్నారు.అయితే బలూచిస్తాన్‌లోని ఉగ్రవాదులతో సహా వారి సానూభూతిపరుల నెట్వర్క్ మెుత్తంగా 4నుంచి 5వేల మధ్య ఉండే అవకాశం ఉందని సర్ఫరాజ్ బుగ్తీ అభిప్రాయపడ్డారు. ఈ దాడులలో ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా పాకిస్థాన్ ఆర్మీ సంయమనం పాటించిందని ఆయన తెలిపారు. -
పాక్‌లో 70 మంది మిలిటెంట్లు మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్‌లో భద్రతా బలగాలు, మిలిటెంట్ల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో కనీసం 70 మంది మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. వీరితో పాటు 10 మంది భద్రతా బలగాలు ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో ఆర్మీకి, బలుచిస్థాన్ తిరుగుబాటు దారులకు మధ్య పెద్దఎత్తున కాల్పులు జరిగాయి. బలుచిస్థాన్ ప్రాంతంలోని 12 ప్రాంతాలలో ఆ దేశ భద్రత బలగాలు, పోలీసులు స్థావరాలే టార్గెట్‌గా ఈ దాడులు జరిగాయి. శుక్రవారం రాత్రి మెుదలైన ఈ కాల్పులు శనివారం ఉదయం వరకూ సాగినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడులలో 70 మంది బలూచిస్థాన్ మిలిటెంట్లు ప్రాణాలు వదలగా, 10 మంది వరకూ సైనికులు మృతి చెందినట్లు బలూచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.బలూచిస్థాన్ ప్రాంతంలోని క్వెట్టా, మక్రాన్, హబ్, చమన్, నసీరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలలో ఈ దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండడంతో ముష్కరుల దాడిని అప్రమత్తంగా తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు. నసీరాబాద్ జిల్లాలో ముష్కరులు రైల్వేట్రాక్‌పై బాంబు అమర్చగా దానిని నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. అయితే భద్రతా బలగాలు జరిగిన దాడిలో ఇదివరకూ 70 మంది ఉగ్రవాదులు మరణించారని మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. -
సల్మాన్ ఖాన్‌ను 'ఉగ్రవాది'గా ప్రకటించిన పాకిస్తాన్.. కారణం ఇదే..
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) కొద్దిరోజుల క్రితం బలూచిస్తాన్ (Balochistan)ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పాక్ మీడియాలో వస్తున్న నివేదికల ప్రకారం సల్మాన్‌ను ఒక ఉగ్రవాదిగా ముద్రవేసి.. పాకిస్తాన్ 1997 ఉగ్రవాద నిరోధక చట్టంలోని 4వ షెడ్యూల్ కింద ఆయన పేరును చేర్చారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానించబడిన వ్యక్తుల బ్లాక్‌లిస్ట్‌లో సల్మాన్ పేరును పొందుపరిచారు. పాక్ చట్టాల ప్రకారం ఈ లిస్ట్‌లో ఉన్న వారిపట్ల నిఘా, కదలికలపై ఆంక్షలతో పాటు చట్టపరమైన చర్యలకు అవకాశం కల్పిస్తుంది.పాక్ విషయంలో సల్మాన్ ఏమన్నారంటే..?కొద్దిరోజుల క్రితం సౌదీ అరేబియాలో ‘జాయ్ ఫోరమ్ 2025’ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.. ఇందులో కి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో పాటు షారుక్ ఖాన్, ఆమిర్‌ఖాన్ వంటి స్టార్స్ పాల్గొన్నారు. ఈ వేదికపై సల్మాన్ మాట్లాడుతూ.. భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. ఒక హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే తప్పకుండా సూపర్‌హిట్ అవుతుంది. ఆపై తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలు కూడా ఇక్కడ కోట్ల రూపాయలు రాబడుతున్నాయి. దీనంతటికీ కారణం పలు దేశాలకు చెందిన ప్రజలు సౌదీలో ఉండటమేనని చెప్పాలి. బలూచిస్తాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ (Pakistan) నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. అంటూ ఆయన మాట్లాడారు.సల్మాన్‌పై బలూచిస్తాన్ ప్రశంసలుసల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రభుత్వానికి కోపం తెప్పించింది. బలూచిస్తాన్, పాకిస్థాన్‌లను సల్మాన్‌ఖాన్ వేర్వేరుగా చెప్పడం ఏంటి అంటూ భగ్గుమంది. పాకిస్థాన్‌కు చెందిన బలోచిస్థాన్‌ను ఇలా వేరు చేసి మాట్లాడటం ఏంటి అంటూ అక్కడి మీడియా కూడా విమర్శలు చేసింది. అయితే, బలూచిస్తాన్ వేర్పాటువాద నాయకులు మాత్రం సల్మాన్ చేసిన ప్రకటనను స్వాగతించారు. బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది మీర్ యార్ బలూచ్ ఒక ట్వీట్ కూడా చేశారు. సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ఆరు కోట్ల బలూచిస్తాన్ ప్రజలకు ఆనందాన్ని కలిగించిందని కృతజ్ఞత తెలిపారు. ఇలా మాట్లాడేందుకు చాలా దేశాలు వెనకడుగు వేశాయని వారు గుర్తుచేశారు. బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించడాన్ని హైలైట్ చేసేలా సల్మాన్ వ్యాఖ్యలు చేరుతాయని అభిప్రాయపడ్డారు.ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ చాలా వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది. ఇక్కడ చమురు, బొగ్గు, బంగారం, రాగి తదితర వనరులు ఎక్కువగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్ ఖజానాను కాపాడుతుంది. కానీ, బలూచిస్తాన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో పాక్ నిర్లక్ష్యంగా ఉండటంతో అక్కడ వ్యతిరేకత మొదలైంది. ఫలితంగా రాజకీయ అనిశ్చితి ఏర్పడటం ఆపై వేర్పాటువాదులు శక్తిమంతమయ్యారు. ఇప్పుడు ఏకంగా ఆక ప్రత్యేక ఆర్మీని ఏర్పాటు చేసుకునే రేంజ్‌కు బలూచిస్తాన్ చేరుకుంది. పాక్‌కు పక్కలో బల్లెంలా బలూచిస్తాన్ తయారైంది. పాక్ నుంచి వేరు కావడంతో పాటు ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడాలని ఇక్కడి ప్రజలు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు.Salman Khan has been placed on the Fourth Schedule by the Government of Balochistan.@BeingSalmanKhan #Balochistan pic.twitter.com/Pbg1uaKiJU— Nasir Azeem (@BeloetsjNasir) October 25, 2025I don’t know if it was slip of tongue, but this is amazing! Salman Khan separates “people of Balochistan” from “people of Pakistan” . pic.twitter.com/dFNKOBKoEz— Smita Prakash (@smitaprakash) October 19, 2025 -
పాక్‌లో ఉద్రిక్తత.. ‘సురబ్’పై బీఎల్ఏ జెండా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(Baloch Liberation Army)(బీఎల్ఏ) తాజాగా తాము సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అక్కడి బ్యాంక్, లెవీ స్టేషన్, పోలీస్ స్టేషన్ తదితర ప్రధాన ప్రభుత్వ స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. క్వెట్టా-కరాచీ, సురబ్-గిడ్డర్ రహదారులపై రాపిడ్ చెకింగ్,పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.గత కొన్నాళ్లుగా బీఎల్ఏ తిరుగుబాటుదారులు పాకిస్తాన్లో అలజడి సృష్టిస్తున్నారు. ఈ నేపధ్యంలో బలూచిస్తాన్(Balochistan)పై పాకిస్తాన్ పూర్తిగా నియంత్రణను కోల్పోయింది. పాక్‌తో జరిగిన తీవ్ర ఘర్షణల తర్వాత పాకిస్తాన్ సైన్యాన్ని, పోలీసు దళాలను విజయవంతంగా వెనక్కి నెట్టగలిగామని బలూచ్ సాయుధ బృందం కమాండర్లు తెలిపారు.దీనిపై పాకిస్తాన్ అధికార వర్గాలు స్పందిస్తూ, కొందరు సాయుధ వ్యక్తులు సురబ్ నగరంలోకి ప్రవేశించారని తెలిపారు. వారు ముగ్గురు ప్రభుత్వ అధికారుల ఇళ్లపై కాల్పులు జరిపారని, ఆ అధికారులను కిడ్నాప్ చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. అలాగే ఒక బ్యాంకును స్వాధీనం చేసుకున్నారని, కొన్ని దుకాణాలను తగలబెట్టారని తెలిపారు. అయితే వారు సురబ్ నగరంపై నియంత్రణ సాధించలేదన్నారు. కాగా శుక్రవారం బలూచిస్తాన్‌లోని సురబ్ నగరంలో ఉగ్రవాదులు ఒక అధికారి ఇంటిపై దాడి చేయడంతో ఆయన మృతి చెందినట్లు ప్రావిన్షియల్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.ఇది కూడా చదవండి: పూంచ్ బాధితులకు హోం మంత్రి పరామర్శ -
పాక్ దళాలు, కాన్వాయ్ లపై బీఎల్ఎ దాడులు
-
పాక్‌లో పేలుళ్లు.. 30 మంది బలి
కరాచీ: సార్వత్రిక ఎన్నికలకు పాకిస్తాన్ సిద్ధమవుతున్న వేళ బుధవారం జంట పేలుళ్లతో పాకిస్తాన్ దద్దరిల్లింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ బాంబు పేలుడు ఘటనల్లో మొత్తంగా 25 మంది మరణించారు. 42 మంది గాయపడ్డారు. పర్వతమయమైన బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని వేర్వేరు పార్టీ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఈ జంట పేలుళ్లు జరిపారని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ పేలుళ్లు జరిపింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించుకోలేదు. తొలి పేలుడు పిషిన్ జిల్లాలోని స్వతంత్ర అభ్యర్థి అస్ఫాందర్ ఖాన్ కకర్ ఆఫీస్ బయట జరిగింది. ఈ పేలుడులో 20 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. ఒక గంట తర్వాత కిల్లా అబ్దుల్లా ప్రాంతంలోని జమియత్ ఉలేమా ఇస్లామ్–పాకిస్తాన్ పార్టీ కార్యాలయం బయట జరిగింది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల ప్రక్రియల్లో పౌరుల భాగస్వామ్యాన్ని తగ్గించేందుకే ఇలా ఉగ్రవాదులు బాంబు దాడులతో భయపెడుతున్నారని బలూచిస్తాన్ పంజ్‌ఘర్ సీనియర్ పోలీసు అధికారి అబ్దుల్లా చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బాంబుపేలుళ్ల జరగడంతో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను పటిష్టం చేశారు. బలూచిస్తాన్‌లో పెరిగిన దాడులు అఫ్గానిస్తాన్, ఇరాన్‌లతో సరిహద్దులు పంచుకుంటున్న పర్వతమయ బలూచిస్తాన్‌లో ఇటీవల బాంబు దాడులు ఎక్కువయ్యాయి. మంగళవారం సైతం 10 గ్రనేడ్ దాడులు జరిగాయి. వేర్వేరు ప్రావిన్స్‌లలోని భద్రతా పోస్ట్‌లు, ఎన్నికల ప్రచార కార్యాలయాలు, ర్యాలీలపై ఈ దాడులు జరిగాయి. ఆదివారం నుంచి లెక్కిస్తే ఈ సంఖ్య ఏకంగా 50కి చేరింది. చాన్నాళ్ల నుంచి బలూచిస్తాన్‌లో వేర్వేరువాద శక్తుల క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. సైన్యం ఏరివేత చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జనవరిలో 24 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. చదవండి: పాక్ ఎన్నికల బరిలో...ఆమె అంతంతే -
పాక్‌లో ఆత్మాహుతి దాడులు.. 58 మంది మృతి
కరాచీ: మసీదుల్లో మిలాదునబి వేడుకలే లక్ష్యంగా పాకిస్తాన్లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఆత్మాహుతి దాడుల్లో 58 మంది మృత్యువాతపడగా మరో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లా కేంద్రంలోని ఓ మసీదులో ప్రార్థనల సమయంలో జరిగిన బాంబు దాడిలో 54 మంది చనిపోయారు. మరో 100 మంది గాయపడ్డారు. మృతుల్లో డీఎస్పీ నవాజ్ గషో్కరి కూడా ఉన్నారు. గుర్తు తెలియని దుండగుడు డీఎస్పీ నవాజ్ కారు పక్కనే నిలబడి తనను తాను పేల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో సుమారు 20 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అదేవిధంగా, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ హంగు నగరంలోని దవోబా పోలీస్ ఠాణాలోకి అయిదుగురు ఉగ్రవాదులు ప్రవేశించారు. భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా మరో నలుగురు పారిపోయారు. వారిలో ఒకరు పక్కనే ఉన్న మసీదులోకి చేరుకుని తనను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో మసీదులో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది గాయపడ్డారు. మిగతా ముగ్గురు ఉగ్రవాదుల కోసం వేట సాగుతోందని పోలీసులు చెప్పారు. ఈ దాడులకు తాము కారణం కాదంటూ తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ తెలిపింది. ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)కు చెందిన కీలక కమాండర్‌ను భద్రతా బలగాలు కాల్చి చంపిన మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఐఎస్ పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి. -
పాకిస్తాన్లో దారుణం.. తండ్రిని చంపినట్టే కుమారుడిని కూడా..
ఇస్లామాబాద్: సోమవారం అర్ధరాత్రి బలూచిస్తాన్‌లోని పంజ్గూర్ జిల్లాలో ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ల్యాండ్‌మైన్ పేల్చారు దుండగులు. ఈ పేలుడులో యూనియన్ కౌన్సిల్ (యుసి) ఛైర్మన్‌తో సహా కనీసం ఏడుగురు మరణించారని అధికారులు ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న బల్గతార్ యుసి ఛైర్మన్ ఇష్తియాక్ యాకూబ్ తోపాటు వాహనంలో ప్రయాణిస్తున్న ఇతరులను లక్ష్యంగా చేసుకుని దుండగులు రిమోట్ సాయంతో పేల్చడానికి ల్యాండ్‌మైన్ అమర్చారని పంజ్గూర్ డిప్యూటీ కమిషనర్ అమ్జద్ సోమ్రో తెలిపారు. వాహనం బల్గతార్ ప్రాంతంలోని చకర్ బజార్ వద్దకు రాగానే దుండగులు రిమోట్ సాయంతో వాహనాన్ని పేల్చివేశారని ఫలితంగా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మృతుల్లో మహ్మద్ యాకూబ్, ఇబ్రహీం, వాజిద్, ఫిదా హుస్సేన్, సర్ఫరాజ్, హైదర్ ఉన్నట్లు వీరంతా బల్గతార్, పంజ్గూర్ ప్రాంతానికి చెందినవారని అన్నారు. ఈ ప్రమాదం జరిగిన చోటే 2014లో ఇష్తియాక్ యాకూబ్ తండ్రి యాకుబ్ బల్గాత్రి తోపాటు అతని పదిమంది అనుచరులను కూడా ఇదే తరహాలో బాంబుదాడిలో హత్య చేయబడ్డారు. ఆనాటి ఆ దాడికి సూత్రధారులం తామేనంటూ బలూచ్ లిబరేషన్ ఫ్రంట్(BLF) అప్పుడే ప్రకటించింది. తాజాగా జరిగిన సంఘటనకు కూడా వారే బాధ్యులై ఉంటారని అధికారులు భయపడుతున్నారు. ఇది కూడా చదవండి: ఇటలీ తీరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి -
పుండు మీద కారం చల్లేలా.. పీసీబీకి హైకోర్టు షాక్
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల కావడంతో క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం ఊహించని షాక్ తగిలింది. త్వరలో పీసీబీకి చైర్మన్‌కు సంబంధించి జరగనున్న ఎన్నికపై బలూచిస్తాన్ హైకోర్టు స్టే విధించింది.జూలై 17 వరకు ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో రిపోర్టు ప్రకారం.. 2014 రాజ్యాంగ చట్టాన్ని పీసీబీ గవర్నింగ్ బాడీ ఉల్లఘించినట్లు ఆరోపణలు రావడంతో ఎన్నికలు నిలిపివేయాలని కోర్టు తెలిపింది. అయితే పీసీబీ వాదనను వినడానికి కూడా ఇష్టపడని హైకోర్టు గవర్నింగ్ బాడీలో ఉన్న ప్రతినిధులందరికి నోటీసులు జారీ చేసింది. కోర్టు నిర్వహించే తదుపరి సెషన్‌కు హాజరవ్వాలని కోరింది. అయితే పీసీబీ చైర్మన్‌గా జకా అష్రఫ్ పేరు ఖరారు అయినప్పటికి కోర్టు నుంచి క్లియరెన్స్ వస్తేనే పీసీబీ చైర్మన్‌కు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఆరోపణలు నిజమని తేలితే మాత్రం పీసీబీ గవర్నింగ్ బాడీ ప్రాసెస్‌ను మొత్తం రద్దు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి పీసీబీ గవర్నింగ్ బాడీ పది మంది పాలకవర్గంతో ఉంటుంది. ఇందులో ఇద్దరు ప్రధాని సిఫార్సు చేసిన వ్యక్తులు ఉంటే.. మిగతావారిలో నలుగురు ప్రాంతీయ ప్రతినిధులు, మరో నలుగురు సేవా ప్రతినిధులు ఉంటారు. వీరందరు కలిసి నూతన చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే పీసీబీ చైర్మన్ ఎవరనేది మాత్రం ప్రధానమంత్రి చేతుల్లో ఉంటుంది. ఎన్నికైన నూతన పీసీబీ చైర్మన్ మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. ఇక ఇవాళ విడుదలైన వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌కు సంబంధించి పాకిస్తాన్ తన మ్యాచ్‌లన్నీ దక్షిణాది నగరాల్లో ఆడనుండగా.. భారత్‌తో మ్యాచ్‌ను మాత్రం అహ్మదాబాద్‌లో ఆడనుంది. అక్టోబర్ 15న జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి పాకిస్తాన్ భారత్‌తో మ్యాచ్‌ను కూడా దక్షిణాది నగరాల్లో లేదా కోల్‌కతా, ముంబైలో నిర్వహించాలని కోరింది. కానీ అందుకు ఒప్పుకొని బీసీసీఐ అహ్మదాబాద్‌లోనే ఆడాలంటూ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి ఓటు వేసిన ఐసీసీ భారత్-పాక్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది. అంతేగాక దక్షిణాదిన పాకిస్థాన్ రెండు వేదికలు (చెన్నై, బెంగళూరు) తమకు అనుకూలంగా లేవంటూ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఐసీసీ దానిని పట్టించుకున్న పాపాన పోలేదు. చదవండి: వన్డే వరల్డ్‌కప్-2023 మ్యాచ్ టైమింగ్స్, తదితర వివరాలు -
పాకిస్తాన్ రక్తసిక్తం.. వందకుపైగా సైనికులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ రక్తసిక్తమైంది. మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. పంజూర్, నోష్కీ పోస్టులపై రెండు ఆత్మాహుతిదాడులు జరిగాయి. ఒక్కో దాడిలో ఆరుగురు సూసైడ్ బాంబర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో వందల మంది పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం. కాగా, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా పర్యటనకు ముందు ఈ దాడులు జరగడం పాక్ ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. చదవండి: ('సీఎం సార్ హెల్ప్ మీ'.. గమనించి వెంటనే కారు ఆపి..) -
పాక్ పైత్యం: వాళ్ల ఫోన్లలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని మోగాల్సిందే..
ఇస్లామాబాద్: అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు, సీనియర్ ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్ రింగ్టోన్లను 'పాకిస్తాన్ జిందాబాద్' ట్రాక్‌కి సెట్ చేయాలని బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా ఈ నిబంధనను అందరూ తప్పక పాటించాలని హుకుం కూడా జారీ చేసింది. సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు అధికారులు వివరాలను మాత్రం వెల్లడించలేదు. దీని ప్రకారం ప్రభుత్వ విభాగంలో పని చేసే చీఫ్ స్థాయి అధికారుల నుంచి చిన్న స్థాయి అధికారుల వరకు వారి మొబైల్ ఫోన్ రింగ్టోన్లుగా పాకిస్తాన్ జిందాబాద్ అనే పెట్టుకోవాల్సిందే. ప్రాంతీయ ప్రభుత్వ సేవలు, సాధారణ పరిపాలన విభాగం చీఫ్ సెక్రటరీ సెప్టెంబర్ 29న ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా ఏ కారణాలను వెల్లడించకుండా ఈ నిర్ణయం ఏంటని విమర్శలు వెల్లువెత్తగా, మరో వైపు సోషల్‌మీడియాలో నెటిజన్లు దీనిపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. చదవండి: వరుస సంక్షోభాలు.. చైనాకు భారీ దెబ్బే: గోల్డ్‌మన్ సాక్స్ -
పాకిస్తాన్‌కు సాయం నిలిపివేయండి: అల్తాఫ్
లండన్: మైనార్టీలపై అకృత్యాలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు అందిస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేయాలని ముత్తహిద కైమీ ఉద్యమ నేత అల్తాఫ్ హుసేన్ అమెరికాకు విజ్ఞప్తి చేశారు. తద్వారా సింధు, బలూచిస్తాన్, ఖైబర్ ఫంక్తువా, గిల్గిట్ బల్టిస్తాన్‌లో నివసించే మైనార్టీలకు వేధింపుల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ఆల్- ఖైదా, తాలిబన్, లష్కర్-ఎ-తొయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రసంస్థలను పాక్ ఐఎస్ఐ సృష్టించిందని.. వందలాది మంది ఉగ్రవాదులను తయారు చేసిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య ముసుగులో ఐఎస్ఐ చేస్తున్న అకృత్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రజలను అత్యంత అణచివేతకు గురిచేసే ప్రపంచంలో ఏకైక ప్రభుత్వాన్ని నడిపిస్తోంది సైన్యమే అంటూ ఘాటు విమర్శలు చేశారు.(పాక్‌లో హిందువులపై పెచ్చుమీరుతున్న అకృత్యాలు) ఈ మేరకు అల్తాఫ్ పెంటగాన్‌కు లేఖ రాశారు. ‘‘పాకిస్తాన్ సైన్యం సింధు, బలూచిస్తాన్, కేపీకే, గిల్టిట్ బల్టిస్తాన్ ప్రాంతాలను ఆక్రమించింది. మైనార్టీలపై పాశవిక, క్రూర చర్యలకు పాల్పడుతోంది. నేటికీ అక్కడ అణచివేత కొనసాగుతోంది. శక్తిమంతమైన నిర్ణయాలు తీసుకునే మీ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్‌కు అందిస్తున్న పౌర, సైన్య సహకారాన్ని నిలిపివేయండి’’అని లేఖలో కోరారు. ఇక అమెరికాలో ఆగ్రహజ్వాలలకు కారణమైన నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై కూడా అల్తాఫ్ స్పందించారు. నిరసనకారులను శాంతింపజేసేందుకు అధికారులు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారని.. అదే విధంగా జాతి వివక్షను పూర్తిగా నిర్మూలించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. (లాక్డౌన్ ఎత్తివేస్తాం.. ఆ శక్తి లేదు: ఇమ్రాన్ ఖాన్) కాగా పాకిస్తాన్లో మైనార్టీలపై జరుగుతున్న అకృత్యాలను ప్రశ్నించేందుకు ముత్తాహిద కౌమీ ఉద్యమం పేరిట అల్తాఫ్ హుసేన్ 1984, మార్చి 18న పార్టీని స్థాపించారు. సెక్యూలర్ పార్టీగా పేరొందిన ఎంక్యూఎమ్ ప్రస్తుతం రెండు వర్గాలు చీలిపోయింది. ఎమ్‌క్యూఎమ్- లండన్ బాధ్యతలను అల్తాఫ్ పర్యవేక్షిస్తుండగా.. పాకిస్తాన్‌లోని పార్టీ విభాగాన్ని ఖాలిద్ మక్బూల్ సిద్ధిఖీ నడిపిస్తున్నారు. ముజాహిర్ల(పాకిస్తాన్‌కు వలస వచ్చిన ఉర్దూ మాట్లాడే ముస్లింలు) హక్కులకై పోరాడే ఎంక్యూఎమ్ 1990-1999 మధ్య కాలంలో పాకిస్తాన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. చదవండి: హాంకాంగ్‌పై చైనా ఆధిపత్యం.. నేపాల్, పాకిస్తాన్ మద్దతు -
కరోనా: డాక్టర్లపై లాఠీఛార్జ్.. అరెస్ట్
ఇస్లామాబాద్ : చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచదేశాలకు పాకింది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేల మంది మృత్యువాతపడ్డారు. కరోనాపై పోరాటం చేస్తున్న డాక్టర్లు, సైంటిస్టులనే దేవుళ్లుగా అందరూ భావిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వైద్యసిబ్బందికి అవసరమైన పరికరాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల కనీస ధర్మం. అయితే వారికి అవసరమైన సామాగ్రిని అందించకపోగా, నిరసన తెలిపిన డాక్టర్లు, వైద్యసిబ్బందిపై లాఠీఛార్జ్ చేసి అరెస్ట్ చేసింది పాకిస్తాన్‌లోని బలుచిస్తాన్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో కరోనా విధులు నిర్వర్తిస్తున్న 53 మంది డాక్టర్లు, వైద్యసిబ్బందిని అరెస్ట్ చేసినట్లు క్వెట్టా పట్టణ పోలీస్ సీనియర్ అధికారి అబ్దుల్ రజాక్ మీడియాకు తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే?? ‘కరోనా వార్డులకు వెళ్లి రోగులకు చికిత్స చేసే డాక్టర్లకు, ఇతర వైద్యసిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) కిట్ల కొరత ఉంది. మాస్కులు, గ్లౌజులు, చేతి తొడుగులు, పూర్థిస్థాయి గౌనులు అందుబాటులో లేవు. పీపీఈ కిట్లను అందించాలని గత కొన్ని వారాలుగా ప్రభుత్నాన్ని కోరుతున్నాం. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఆస్పత్రి ముందు నిరసన తెలిపాం. అంతేకాకుండా మేమేందరం(డాక్టర్లు, వైద్య సిబ్బంది) సీఎం ఇంటికి వెళ్లి ఇదే విషయాన్ని గట్టిగా చెప్పాలనుకున్నాం. కానీ పోలీసులు మమ్మల్ని అడ్డుకొని లాఠీఛార్జ్ చేసి అరెస్ట్ చేశారు’అని క్వెట్టా పట్టణ డాక్టర్ల సమాఖ్య అధ్యక్షుడు యాసీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పింది ఏంటంటే? అయితే డాక్టర్లు, వైద్యసిబ్బంది అరెస్ట్‌పై బలుచిస్తాన్ ప్రభుత్వం స్పందించింది. ‘పీపీఈ కిట్ల కొరత ఉన్నది నిజమేనని అంగీకరిస్తున్నాం. అయితే కిట్ల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కానీ డాక్టర్లు, వైద్యసిబ్బంది ఓపిక పట్టకుండా నిరసన చేపట్టారు. 144 సెక్షన్‌ను ఉల్లంఘించారు. అందుకే ఆరెస్ట్ చేశాం’అని బులచిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. ఇక డాక్టర్లపై లాఠీచార్జ్, అరెస్ట్ చేయడంపై అన్ని వైపుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కష్ట సమయంలో డాక్టర్లను కాపాడుకోవాల్సింది పోయి ఆరెస్ట్ చేయడం దారుణమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పాకిస్తాన్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,469కి చేరింది. బలుచిస్తాన్‌లో 192 కేసులు నమోదు అయ్యాయి. పాక్‌లో ఇప్పటి వరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారని గణాంకాలు వెల్లడించాయి. చదవండి: పాత మందుతో 48 గంటల్లో వైరస్‌కు చెక్? అమెరికాలో మరింత తీవ్రం! -
పాక్‌లో ఉగ్రవాద శిక్షణకు సకల సౌకర్యాలు
పాకిస్తాన్లో వేలాది మంది యువకులను బలవంతంగా ఉగ్రవాదులు 'డీరాడికలైజేషన్ క్యాంప్స్' కేంద్రాలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తున్నట్లు భారత ఇంటలిజెన్స్ ఏజెన్సీకి సమాచారం అందింది. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ పాకిస్తాన్‌లోని పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతాలలో డజనుకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసి 700 మందికి శిక్షణ అందించే విధంగా రూపొందించినట్లు ఉపగ్రహ చాయా చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది యువకులకు శిక్షణ ఇస్తూనే వారి అవసరాల మేరకు అత్యున్నత మౌళిక సదుపాయాలతో నిర్మించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో ప్రార్థనలు చేసేందుకు మసీదు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, విలాసవంతమైన గదులను ఏర్పాటు చేశారు. (కత్తెరించినా తెగని ఉక్కు కంచె ఏర్పాటు) ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు శిక్షణ పొందుతున్న వారిలో 92శాతం 35 కన్నా తక్కువ వయసువారే కావడం, మరో 12 శాతం 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారని తెలిసింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనడానికి వారు శిక్షణ అందిస్తున్న హైటెక్ శిబిరాలే చెబుతున్నాయని ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. జమ్మూ కాశ్మీర్, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల చొరబాట్లను ఆపేందుకు ఉక్కు కంచె నిర్మాణాలు ఏర్పాటు చేస్తామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యల తర్వాత పాక్ డీరాడికలైజేషన్ శిబిరాలు చర్చనీయాంశంగా మారాయి. -
పాక్ విషయాల్లో మన జోక్యం ఎందుకు?
హైదరాబాద్: బలూచిస్తాన్ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తప్పుబట్టారు. పాకిస్తాన్ అంతర్గత విషయాల్లో మనం జోక్యం చేసుకుంటే కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ జోక్యం పెరిగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భాగంగా బలూచిస్తాన్, జిల్జిత్, పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పాక్ ప్రభుత్వం చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘన వల్ల అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారని, వారికి మద్దతుగా మాట్లాడినందుకు తనకు వారు కృతజ్ఞతలు తెలిపారని మోదీ పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో మోదీ వ్యాఖ్యలు సరికాదని ఏచూరి అన్నారు. బలూచిస్తాన్ లో భారత్ జోక్యం చేసుకుంటే అది మతపరమైన వివాదాలకు తావిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
పోలీసుల కాల్పుల్లో నలుగురు తీవ్రవాదుల హతం
పోలీసు సిబ్బంది జరిపిన కాల్పుల్లో నిషేధిత తీవ్రవాద సంస్థ తెహ్రిక్-ఈ-తాలిబాన్‌కు చెందిన నలుగురు తీవ్రవాదులు మృతి చెందారని సీఐడీ ఎస్పీ చౌదరి అస్లామ్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. మృతుల వద్ద నుంచి దాదాపు 200 కేజీల పేలుడు పదార్థంతోపాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మృతుల్లో ఇద్దరిని గుర్తించినట్లు తెలిపారు. బాంబుల తయారీలో వారిద్దరు నిపుణులని పేర్కొన్నారు. గత అర్థరాత్రి బలూచిస్థాన్ నుంచి కరాచీ వైపు వస్తున్న ఓ ట్రక్‌ను పోలీసులు తనిఖీలలో భాగంగా అపారు. అయితే ఆ ట్రక్‌లో ఉన్న తీవ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దాంతో పోలీసులు ఎదురుదాడికి దిగారు. ఆ ఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలపాయ్యారు. అయితే వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చౌదరి అస్లామ్ వివరించారు. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల అనంతరం పాకిస్థాన్‌లో కరాచీలో జరిగిన పలు బాంబు దాడులతో ఈ తీవ్రవాదుల ప్రమేయం ఉందని చౌదరి అస్లామ్ చెప్పారు.


