పాక్‌ పైత్యం: వాళ్ల ఫోన్లలో ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అని మోగాల్సిందే.. | Sakshi
Sakshi News home page

Pakistan: ట్రోలింగ్‌: అధికారుల ఫోన్లలో ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అని మోగాల్సిందే..

Published Fri, Oct 1 2021 10:47 AM

Pakistan Zindabad Ringback Tone Must Govt Employees Balochistan - Sakshi

ఇస్లామాబాద్‌: అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు, సీనియర్ ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్ రింగ్‌టోన్‌లను 'పాకిస్తాన్ జిందాబాద్' ట్రాక్‌కి సెట్ చేయాలని బలూచిస్తాన్  ప్రావిన్స్‌ ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా ఈ నిబంధనను అందరూ తప్పక పాటించాలని హుకుం కూడా జారీ చేసింది. సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  అయితే అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు అధికారులు వివరాలను మాత్రం వెల్లడించలేదు.

దీని ప్రకారం ప్రభుత్వ విభాగంలో పని చేసే చీఫ్‌ స్థాయి అధికారుల నుంచి చిన్న స్థాయి అధికారుల వరకు వారి మొబైల్‌ ఫోన్‌ రింగ్‌టోన్‌లుగా పాకిస్తాన్‌ జిందాబాద్‌ అనే పెట్టుకోవాల్సిందే. ప్రాంతీయ ప్రభుత్వ సేవలు, సాధారణ పరిపాలన విభాగం చీఫ్‌ సెక్రటరీ సెప్టెంబర్ 29న ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా ఏ కారణాలను వెల్లడించకుండా ఈ నిర్ణయం ఏంటని విమర్శలు వెల్లువెత్తగా, మరో వైపు సోషల్‌మీడియాలో నెటిజన్లు దీనిపై విపరీతంగా ట్రోల్స్‌ చేస్తున్నారు.

చదవండి: వరుస సంక్షోభాలు.. చైనాకు భారీ దెబ్బే: గోల్డ్‌మన్‌ సాక్స్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement