ఈపీఎస్‌ పెన్షన్‌ వెయ్యి రూపాయలా..! | Congress Questioned Center Over EPS Pension | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌ పెన్షన్‌ వెయ్యి రూపాయలా..!

Mar 19 2026 8:27 AM | Updated on Mar 19 2026 11:45 AM

Congress Questioned Center Over EPS Pension

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీం(ఈపీఎస్‌)–1995 కింద ఇస్తున్న కనీస నెలవారీ పింఛను రూ.1,000ను నేటి అవసరాలకు అను గుణంగా తక్షణమే పెంచాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. మోదీ ప్రభుత్వం హయాంలో గత 12 ఏళ్లలో అనేక సామాజిక భద్రతా పథకాలు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యానికి గురవు తున్నాయని ఆరోపించింది.

ఈపీఎస్‌–1995 కింద ఇస్తున్న రూ.1,000 నెలవారీ పింఛను నేటి పరిస్థితుల్లో ఏమాత్రం సరిపోదని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నివేదిక స్పష్టంగా తెలిపిందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ బుధవారం ‘ఎక్స్‌’లో తెలిపారు. జీవనోపాధికి, గౌరవప్రదమైన జీవన స్థాయికి తగ్గట్టుగా పింఛను మొత్తాన్ని, నెలకు కనీసం రూ.7,500 వరకు పెంచాలని స్వయానా బీజేపీ ఎంపీ సారథ్యంలోని కార్మిక, వస్త్ర, నైపుణ్యాభివృద్ధిపై స్టాండింగ్‌ కమిటీయే ఈ నివేదిక ఇచ్చిందని తెలిపారు. 1995 సంవత్సరంతో పోలిస్తే నేడు జీవన వ్యయం అనేక రెట్లుగా పెరిగిందని, పింఛను మాత్రం రూ. వెయ్యిగానే కొనసాగుతోందని పేర్కొన్నారు.

‘ప్రభుత్వ వైఫల్యంతో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. వైద్యచికిత్సల ఖర్చులు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతు న్నాయి. ఇప్పుడు కూడా నెలకు ఈపీఎఫ్‌ పింఛను  వేయి ఇవ్వడమంటే ఈ విషయాన్ని ప్రభుత్వం ఆషామాషీగా తీసుకున్నట్లు అగుపి స్తోంది. అత్యంత నిస్సహాయులైన వృద్ధులు, ఆర్థికంగా వెనుకబడిన పెన్షనర్లపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement