'క్షమించండి.. అది సాధ్యం కాదు' | Heinrich Klaasen Issues Official Statement On Retirement Reversal For 2027 World Cup | Sakshi
Sakshi News home page

Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'

May 2 2026 12:49 PM | Updated on May 2 2026 1:37 PM

Heinrich Klaasen Issues Official Statement On Retirement Reversal For 2027 World Cup

ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్ స్టార్‌, సౌతాఫ్రికా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. మిడిలార్డర్‌లో ఎస్ఆర్‌హెచ్‌కు కీల‌క ఆట‌గాడిగా క్లాసెన్ మారాడు. దాదాపు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ అత‌డి బ్యాట్ నుంచి ప‌రుగులు వ‌స్తున్నాయి. 

బుధ‌వారం(ఏప్రిల్ 29) ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ క్లాసెన్ స‌త్తాచాటాడు. కేవ‌లం 30 బంతుల్లోనే 65 ప‌రుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో భీక‌ర ఫామ్‌లో ఉన్న క్లాసెన్ త‌న అంత‌ర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్‌ను వెన‌క్కి తీసుకోమ‌ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీట‌ర్స‌న్ సూచించాడు. 

"సౌతాఫ్రికా ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క ప్ర‌పంచ‌క‌ప్ కూడా గెల‌వ‌లేదు. వ‌చ్చే ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ వారి సొంత‌గ‌డ్డ‌పైనే జ‌ర‌గ‌నుంది. కాబ‌ట్టి ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెంట‌నే అత‌డికి ఫోన్ చేసి, రిటైర్మెంట్ వెన‌క్కి తీసుకుని జ‌ట్టులో చేర‌మ‌ని కోరాలి" అని పీట‌ర్స‌న్ ఎక్స్ వేదిక‌గా రాసుకొచ్చాడు.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఇదే విష‌యంపై క్లాసెన్ స్పందించాడు. త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యంపై అత‌డు స్ప‌ష్ట‌త ఇచ్చాడు. త‌ను తిరిగి జాతీయ జ‌ట్టుకు ఆడాల‌ని అనుకోవ‌డం లేద‌ని క్లాసెన్ తేల్చి చెప్పేశాడు.

"సారీ.. మ‌ళ్లీ తిరిగి నేను అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడ‌లేను. ఇప్పుడు నా జీవితంలో కొత్త అధ్యాయం మొద‌లైంది. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) లో రోటర్‌డామ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాను. ఈ ఈటీపీఎల్ లీగ్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే నా ల‌క్ష్య‌మ‌ని" క్లాసెన్ స్పోర్ట్స్‌ టుడేకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. 

కాగా క్లాసెన్‌ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. బోర్డుతో విభేదాల కారణంగానే క్లాసెన్‌ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
చదవండి: IPL 2026: వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. కట్ చేస్తే! భారీ షాకిచ్చిన బీసీసీఐ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement