వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. కట్ చేస్తే! భారీ షాకిచ్చిన బీసీసీఐ | BCCI pulls up Kyle Jamieson for aggressive send-off to Vaibhav Sooryavanshi | Sakshi
Sakshi News home page

IPL 2026: వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. కట్ చేస్తే! భారీ షాకిచ్చిన బీసీసీఐ

May 2 2026 10:45 AM | Updated on May 2 2026 10:57 AM

BCCI pulls up Kyle Jamieson for aggressive send-off to Vaibhav Sooryavanshi

ఐపీఎల్‌-2026లో శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అవుట్‌ చేశాక అతిగా సంబరాలు చేసుకున్న ఢిల్లీ పేసర్ కైల్ జేమీసన్‌కు బీసీసీఐ షాకిచ్చింది. జేమీసన్‌ను హెచ్చరించడంతో పాటు అతడి ఖాతాలో ఒక డెమెరిట్ పాయింట్‌ను చేర్చింది.

ఏమి జరిగిందంటే?
రాజస్తాన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన జేమీసన్ బౌలింగ్‌లో వైభవ్ తన ఎదుర్కొన్న మొదటి బంతిని బౌండరీకి పంపాడు. అయితే మరుసటి బంతికే జేమీసన్ ఒక అద్భుతమైన డెలివరీతో వైభవ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో జేమీసన్ అతిగా సంబరాలు చేసుకున్నాడు.

ఈ కివీ స్పీడ్ స్టార్‌ 15 ఏళ్ల వైభవ్ వద్దకు వెళ్లి గట్టిగా అరుస్తూ సెండాఫ్ ఇచ్చాడు. అతడి ప్రవర్తనపై ఫీల్డ్ అంపైర్‌లు సైతం అగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు 15 ఏళ్ల పిల్లోడుపై నీ ప్రతాపమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

దీంతో బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జేమీసన్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ను ఉల్లంఘించినట్లు బోర్డు నిర్ధారించింది. దీంతో బీసీసీఐ అతడిపై ఈ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
చదవండి: IPL 2026: అన్నా.. సారీ.. నిన్ను త‌క్కువ‌గా అంచ‌నా వేశాం!


 

 

Advertisement
 
Advertisement
Advertisement