breaking news
Vaibhav Suryavanshi
-
వైభవ్ ఒక అద్భుతం.. కానీ ఓపిక పట్టాల్సిందే: శ్రేయస్ అయ్యర్
భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. శనివారం బెంగళూరు వేదికగా జరగాల్సిన నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో, ఇరు జట్లు ట్రోఫీని సంయుక్తంగా పంచుకున్నాయి.ఈ సిరీస్ ముగింపు సందర్భంగా భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కడంపై శ్రేయస్ స్పష్టత ఇచ్చాడు. వైభవ్ ఒక అద్భుతమైన ఆటగాడని, కానీ తుది జట్టులో చోటు కాస్త ఓపిక పట్టాలని అయ్యర్ అన్నాడు.కాగా వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ మొత్తానికి వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అంతకముందు అఫ్గానిస్తాన్ సిరీస్‌లోనూ అతడికి ఆడే అవకాశం దక్కలేదు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతుండడమే ఇందుకు ప్రధాన కారణం."వైభవ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం జట్టులో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ రూపంలో ఇద్దరు అద్భుతమైన ఓపెనర్లు ఉన్నారు. టీ20 ప్రపంచకప్ విజయంలో వారు కీలక పాత్ర పోషించడమే కాకుండా, తర్వాతి సిరీస్‌లలోనూ నిలకడగా రాణిస్తున్నారు. అలాంటప్పుడు వారిని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు. కానీ వైభవ్‌కు కచ్చితంగా అవకాశం వస్తుంది. అతడు తన ప్రాసెస్‌పై దృష్టి పెట్టి కాస్త ఓపికగా ఉండాలి. ఇదే విషయాన్ని నేను అతడికి పదే పదే చెబుతుంటాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో వెల్లడించాడు.కాగా అక్టోబర్ 22 నుంచి క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్-కివీస్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు ఈ జట్టులో చోటు దక్కింది.చదవండి: BAN vs ZIM: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే -
ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. చరిత్ర సృష్టించిన ఆసీస్ బ్యాటర్
ఆస్ట్రేలియా క్రికెటర్ జేక్ ఫ్రేజర్ మెగర్క్ చరిత్ర సృష్టించాడు. ఆసీస్ తరఫున లిస్ట్-‘ఎ’ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానంలో ఉండగా.. మెగర్క్ నాలుగో స్థానంలో నిలిచాడు.14 బంతుల్లోనే అర్ధ శతకంజేక్ ఫ్రేజర్ మెగర్క్ ప్రస్తుతం దేశీ వన్డే కప్‌తో బిజీగా ఉన్నాడు. సౌత్ ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. క్వీన్స్‌లాండ్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఆది నుంచే విరుచుకుపడ్డ ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం 14 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.49 బంతుల్లోనే సెంచరీతద్వారా ఆస్ట్రేలియా వన్డే కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన క్రికెటర్ మెగర్క్ చరిత్రకెక్కాడు. ఇక హాఫ్ సెంచరీ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ.. 49 బంతుల్లోనే శతకం బాదాడు. మొత్తంగా కేవలం 63 బంతుల్లోనే పది ఫోర్లు, తొమ్మిది సిక్స్‌ల సాయంతో 122 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా వన్డే కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన క్రికెటర్లుజేక్ ఫ్రేజర్-మెగర్క్- సౌత్ ఆస్ట్రేలియా తరఫున క్వీన్స్‌లాండ్‌పై 14 బంతుల్లో ఫిఫ్టీ (2026)జేక్ ఫ్రేజర్-మెగర్క్- సౌత్ ఆస్ట్రేలియా తరఫున టాస్మేనియాపై 18 బంతుల్లో ఫిఫ్టీ (2023)గ్లెన్ మాక్స్వెల్- విక్టోరియా తరఫున టాస్మేనియాపై 19 బంతుల్లో ఫిఫ్టీ (2010-11)మిచెల్ ఓవెన్- టాస్మేనియా తరఫున విక్టోరియాపై 20 బంతుల్లో ఫిఫ్టీ (2025)లిస్ట్- ‘ఎ’ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్లువైభవ్ సూర్యవంశీ- ఇండియా- ‘ఎ’ తరఫున శ్రీలంక- ‘ఎ’పై 2026లో 11 బంతుల్లో ఫిఫ్టీకౌశల్య వీరరత్నె- రాగమ తరఫున కరునెగలపై 2005-06లో 12 బంతుల్లో ఫిఫ్టీతిశారా పెరీరా- శ్రీలంక ఆర్మీ తరఫున బ్లూమ్ఫీల్డ్పై 2020-21లో 13 బంతుల్లోరోరీ క్లెవిన్వెల్ట్- వెస్టర్న్ ప్రావిన్స్ తరఫున క్వాజులూ నాటల్‌పై 2010-11లో 14 బంతుల్లోజేక్ ఫ్రేజర్ మెగర్క్- సౌత్ ఆస్ట్రేలియా తరఫున క్వీన్స్‌లాండ్‌పై 2026లో 14 బంతుల్లో ఫిఫ్టీ. ఇదీ చదవండి: భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా -
IND vs WI: తుదిజట్టులో దక్కని చోటు.. వైభవ్ సూర్యవంశీ పోస్ట్ వైరల్
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో చావో రేవో తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికి ఇరుజట్లు చెరో రెండు గెలిచి.. 2-2తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా శనివారం నాటి ఐదో టీ20తో సిరీస్ విజేత ఎవరో తేలనుంది.వాటర్ బాయ్ సేవలకే పరిమితంఈ నేపథ్యంలో టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. కాగా ఇటీవల జపాన్ వేదికగా ఆసియా క్రీడలు-2026లో భారత్ తరఫున ఆడిన ఈ పదిహేనేళ్ల పిల్లాడు.. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లో పూర్తైన నాలుగు మ్యాచ్‌లలోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు.భారత టీ20 ఓపెనింగ్ జోడీగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ కొనసాగుతుండటంతో వైభవ్ వాటర్ బాయ్ సేవలకే పరిమితం కావాల్సి వచ్చింది. జపాన్‌లో తాత్కాలిక హెడ్‌కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ మార్గదర్శనంలో వైభవ్- అభిషేక్ ఓపెనర్లుగా రాగా.. సంజూ వన్‌డౌన్‌లో ఆడాడు.ఇప్పట్లో అవకాశం ఇవ్వనుఅయితే, టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మాత్రం ఇప్పటికే వైభవ్‌కు తుదిజట్టులో చోటు ఇచ్చే అంశం గురించి కుండబద్దలు కొట్టేశాడు. టీ20 వరల్డ్‌కప్-2026 హీరో సంజూతో పాటు ఇతర సీనియర్లకు అవకాశాలు ఇచ్చే క్రమంలో.. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇంకొన్నాళ్లు వేచిచూడక తప్పదని పలుమార్లు స్పష్టం చేశాడు.అందుకు తగినట్లుగానే వైభవ్ సూర్యవంశీ విండీస్‌తో సిరీస్‌లో ఇప్పటికి ఒక్క అవకాశం కూడా పొందలేకపోయాడు. మరోవైపు.. సంజూ- అభిషేక్ ఈ సిరీస్‌లో నిలకడగా రాణించలేకపోతున్నారు. ఇప్పటి వరకు సంజూ 11, 82, 3, 56.. అభిషేక్ 21, 20, 69, 29 పరుగులు చేశారు.ఇంకా నమ్మకం ఉందిఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీని సిరీస్ నిర్ణయాత్మక ఐదో టీ20లోనైనా తప్పక ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఇన్‌స్టా స్టోరీలో బ్యాట్ ఎత్తిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘లక్ష్యం చేరకుంటానని.. ఇంకా నమ్మకం ఉంది’ అని ఎమోజీని షేర్ చేశాడు. తద్వారా తనకు అవకాశం ఇస్తే.. కచ్చితంగా సిరీస్ గెలిపిస్తానని వైభవ్ చెప్పకనే చెప్తున్నాడని.. అతడిని బెంగళూరులో ఆడించాలని అభిమానులు గంభీర్‌కు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా పదిహేనేళ్ల సూర్యవంశీ.. ఇప్పటికి టీమిండియా తరఫున ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడి 186కు పైగా స్ట్రైక్‌రేటుతో 246 పరుగులు చేశాడు. మరో‘సారీ’ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో ఆఖరి టీ20లోనూ వైభవ్‌కు మొండిచేయే ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. ఓపెనింగ్ జోడీగా సంజూ- అభిషేక్ కొనసాగనున్నట్లు సమాచారం. ఇక గాయపడిన అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది.వెస్టిండీస్‌తో ఐదో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నమన్ ధిర్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్.ఇవీ చదవండి: చందర్‌పాల్ విధ్వంసం.. సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్Kavya Maran Weds Anirudh: ఏజ్ గ్యాప్, ఇద్దరి ఆస్తుల విలువ ఎంత? -
గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth
-
మైదానంలోనే కాదు.. బయటా మాస్ బ్యాటింగే! వైభవ్ వీడియో వైరల్
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం బ్యాట్‌తోనే కాకుండా తన మాటకారితనంతోనూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఆసియా క్రీడల్లో విజేతగా నిలిచిన భారత జట్టుతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సన్మాన వేడుకలో పాల్గొనేందుకు వైభవ్ గురువారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో వైభవ్‌కు ఘన స్వాగతం లభించింది.విమానాశ్రయం నుండి బయటకు వస్తున్న వైభవ్ సూర్యవంశీని కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులు, ప్యాపరాజీలు ఒక్కసారిగా చుట్టుముట్టారు. అయినప్పటికీ అభిమానులను, కెమెరామెన్లను ఏమాత్రం నిరాశపరచకుండా ఆయన చిరునవ్వుతో ఫోటోలకు పోజులిచ్చారు.ఈ క్రమంలోనే వీడియోలు, ఫోటోలు తీసే ఉత్సాహంలో ప్యాపరాజీలు వెనక్కి నడుచుకుంటూ ముందుకు వెళ్లడాన్ని వైభవ్ గమనించాడు. వారి భద్రతపై ఆందోళన చెంది, వెంటనే తనదైన శైలిలో వారిని అప్రమత్తం చేశారు. ఫోటోలకు పోజులిస్తూనే... "రీల్స్ తీసే పిచ్చిలో ఏదైనా వాహనం కింద పడతారు జాగ్రత్త!" అంటూ చమత్కరించారు. చుట్టూ ఉన్న వాహనాలను గమనిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.ఆయన చెప్పిన మాటలకు అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.🔴 VAIBHAV SURYAVANSHI GETS ANGRY ON PAPS 🤯 Vaibhav 🎙️: “Reels ke chakkar mein thok jaaoge tum!” 😭💀 https://t.co/Gj8wcKqO7Z— Sam (@cricsam02) October 15, 2026 -
‘ఛాన్స్ ఇవ్వొద్దని భీష్మించుకున్నారు.. వాటర్ బాటిళ్లు మోయడమే పని’
టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ చాన్నాళ్లుగా సొంతగడ్డపై బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ పదిహేనేళ్ల పిల్లాడు.. ఆరంభంలో విఫలమైనా తిరిగి పుంజుకున్నాడు.ముఖ్యంగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి 151 పరుగులు చేసి.. భారత్ 3-0 తేడాతో జింబాబ్వేను క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.వీవీఎస్ ఛాన్స్ ఇచ్చినా.. గంభీర్ నో!అయితే, ఆ వెంటనే స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ.. వైభవ్ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. సీనియర్ ఓపెనర్ సంజూ శాంసన్ రాకతో ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు తుదిజట్టులో చోటు కరువైంది. అయితే, ఆసియా క్రీడలు-2026 టోర్నీలో తాత్కాలిక హెడ్‌కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ వైభవ్‌ను ఆడించాడు.కానీ.. తాజాగా వెస్టిండీస్‌తో సొంతగడ్డపై టీ20 సిరీస్‌లోనూ వరుస మ్యాచ్‌లలో వైభవ్‌ను మళ్లీ పక్కనపెట్టేశారు. తాజాగా హైదరాబాద్ వేదికగా విండీస్‌తో నాలుగో టీ20లోనూ వైభవ్‌కు మొండిచేయే ఎదురైంది. టీ20 ప్రపంచకప్-2026 హీరో సంజూకు వరుస అవకాశాలు ఇచ్చే క్రమంలో ఈ బిహారీ పిల్లాడు మరికొన్నాళ్లు వేచిచూడక తప్పదని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఇప్పటికే స్పష్టం చేశాడు.అవకాశం ఇవ్వొద్దని వాళ్లు భీష్మించుకున్నారుఈ పరిణామాల నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా ఘాటుగా స్పందించాడు. ‘టైమ్స్ నౌ’తో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత టీమిండియా యాజమాన్యం.. ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేయడం ద్వారా జట్టును పటిష్టం చేయగలమని భావిస్తుందేమో!.. అందుకే వాళ్లు వైభవ్‌ను పక్కనపెడుతున్నారు.ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. వారితో మాట్లాడితే మీకు అన్నీ అర్థమవుతాయి. తదుపరి తరం ఆటగాళ్లను తయారు చేయాలంటే వారికి ఆడే అవకాశాలు ఇవ్వాలని తెలిసి వస్తుంది. ఈ పిల్లాడికి అవకాశం ఇవ్వొద్దని వాళ్లు భీష్మించుకుని కూర్చున్నారు.నీళ్ల బాటిళ్లు మోయడం వల్ల నో యూజ్అతడిని విసిగెత్తిపోయేలా చేస్తున్నారు. జట్టుకు తాను ఉపయోగం లేదనే భావన కల్పిస్తున్నారు. అలాంటపుడు ఆ పిల్లాడు ఎంతలా వేదన చెంది ఉంటాడు. ఈ వయసులో వరుస మ్యాచ్‌లు ఆడితేనే అతడిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేగానీ బెంచ్ మీదే ఉంటూ.. నీళ్ల బాటిళ్లు మోయడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదు.ప్రస్తుతం ఉన్న మేనేజ్మెంట్ నియంతృత్వ ధోరణి అవలంభిస్తోంది. వాళ్ల మనసుకు ఏది తోస్తే అదే చేస్తున్నారు. అంతేతప్ప ఆటగాళ్లు, వారి భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. వైభవ్ ఓ తుఫాను లాంటివాడు. అతడిని ఎవరూ ఆపలేరు. నక్షత్రాలు, సూర్యుడి మాదిరి అతడు ప్రకాశించడాన్ని ఎవరూ ఆపలేరు. కాకపోతే అందుకు తగిన అవకాశాలు రావాలి. కచ్చితంగా ఆ సమయం వస్తుంది’’ అని మనీశ్ ఓజా పేర్కొన్నాడు.చదవండి: పాకిస్తాన్ కెప్టెన్ ప్రపంచ రికార్డు -
అతడికి మరోసారి నిరాశే.. నాలుగో టీ20కి భారత తుదిజట్టు ఇదే!
ఉప్పల్ వేదికగా మరికొన్ని గంటల్లో భారత్, వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు ఉదయమే మైదానానికి చేరుకొని ముమ్మర సాధన చేశాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు వెస్టిండీస్ మాత్రం మూడో టీ20లో విజయానికి చేరువగా వచ్చి ఓడిపోయినప్పటికీ, నేటి వన్డేలో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.ఈ నేపథ్యంలో నాలుగో టీ20కి టీమిండియా జట్టు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశముంది. అభిషేక్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉండడంతో పాటు ఐపీఎల్లో తన హొంగ్రౌండ్ కావడం అతడికి సానుకూలాంశం. ఇక మరో ఓపెనర్ సంజూ సామ్సన్ విఫలమవుతున్నప్పటికీ, ఉప్పల్ మైదానంలో అతడికి ఉన్న ట్రాక్ రికార్డు దృశ్యా అభిషేక్‌తో కలిసి మరోసారి ఓపెనింగ్ చేయనున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌కు కూడా వైభవ్ సూర్యవంశీ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్, నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి కీలకం కానున్నారు. మ్యాచ్‌లో కళ్లన్నీ లోకల్ బాయ్ తిలక్ వర్మపైనే నెలకొన్నాయి. 73 అంతర్జాతీయ మ్యాచ్‌ల కెరీర్ తర్వాత తొలిసారి తన సొంతగడ్డపై భారత్ తరఫున బరిలోకి దిగుతున్న తిలక్‌వర్మపై అందరి దృష్టీ నిలిచింది. గత టీ20లో అనూహ్యంగా రనౌటైన తిలక్ ఈసారి గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. ఆల్రౌండర్లుగా అక్షర్‌పటేల్, నితీశ్‌కుమార్‌రెడ్డి, నమన్ ధీర్‌లు మంచి ఆటను కనబరుస్తున్నారు. బౌలింగ్ విభాగంలో అర్షదీప్ వైడ్లు ఎక్కువగా వేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లు మరోసారి చెలరేగితే విండీస్‌కు కష్టాలు తప్పవనిపిస్తోంది.నాలుగో టీ20కి భారత జట్టు అంచనాఅభిషేక్ శర్మ, సంజూ సామ్సన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్‌కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్.ఇదీ చదవండి:న్యూజిలాండ్‌తో సిరీస్.. ఆ ముగ్గురి వల్లే జట్ల ఎంపిక ఆలస్యం!నాలుగో టీ20.. సహచరులకు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ వార్నింగ్! -
‘హైదరాబాద్‌లో ఖేల్ ఖతం.. ఆఖరి మ్యాచ్‌లో అతడిని ఆడించండి’
టీమిండియా- వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందగా.. పరుగుల వరద పారిన రెండో టీ20లో విండీస్ ఏకంగా 250 పరుగుల లక్ష్యాన్ని మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే ఊదేసింది.ఇక ఆదివారం ఇండోర్‌లో జరిగిన మూడో టీ20 కూడా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. భారత్ విధించిన 224 పరుగుల లక్ష్యానికి చేరువగా వచ్చే ప్రయత్నం చేసిన కరేబియన్ జట్టు.. పద్నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో శ్రేయస్ అయ్యర్ సేన ఊపిరి పీల్చుకుంది.2-1తో ఆధిక్యంలో టీమిండియాతద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది టీమిండియా. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. హైదరాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా.. 2-2తో సమం చేయాలని విండీస్ పట్టుదలగా ఉన్నాయి.సంజూ నిలకడలేని ఆటఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు మరోసారి చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఓపెనింగ్ జోడీని మారిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా విండీస్‌తో ఈ సిరీస్‌లో ఇప్పటికి మూడు మ్యాచ్‌లలో ఓపెనర్లలో అభిషేక్ శర్మ 21, 20, 69 పరుగులు చేయగా.. సంజూ శాంసన్ 11, 82, 3 పరుగులు సాధించాడు.గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న సంజూ రెండో టీ20లో 82 పరుగులు చేసి టచ్‌లోకి వచ్చినా.. ఇండోర్ మ్యాచ్‌లో మళ్లీ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో సంజూకు బదులు.. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.అయితే, వెస్టిండీస్‌తో సిరీస్ మొత్తంలో సంజూనే ఆడిస్తామని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. కాబట్టి వైభవ్ బెంచ్‌కే పరిమితం కాక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.హైదరాబాద్‌లో ఖేల్ ఖతం.. ఆఖరి మ్యాచ్‌లో అతడిని ఆడించండిస్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ మ్యాచ్‌లో గెలిచేసి టీమిండియా 3-1తో సిరీస్ సొంతం చేసుకోవాలి. ఇక ఆఖరిదైన ఐదో టీ20లో వైభవ్ సూర్యవంశీని ఆడించాలి. నాలుగో మ్యాచ్‌తోనే సిరీస్‌ను చుట్టేసి.. సూర్యవంశీని చివరి మ్యాచ్‌లో ఆడించడం అన్నింటికంటే మెరుగ్గా ఉంటుంది’’ అని అభిషేక్ నాయర్ అన్నాడు. కాగా పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పటికి టీమిండియా తరఫున ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడి 246 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక టీమిండియా- వెస్టిండీస్ మధ్య ఐదో టీ20కి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక.చదవండి: యువీ డకౌట్.. బంగ్లాదేశ్ చేతిలో ఇండియా చాంపియన్స్ ఓటమి -
'అతడిని చూస్తే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లుంది'
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌ను చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లుగా అనిపిస్తోందని సెహ్వాగ్ తెలిపాడు. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడాలనే ఆలోచన కొంతవరకు నా ఆలోచనలాగే ఉందని పేర్కొన్నాడు. శనివారం పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక సభ్య సమావేశంలో పాల్గొన్న సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.‘‘ఆటకు వయసుతో ప్రామాణికం ఉండకూడదు. ఉదాహరణకు అండర్-19 అయితే, మీ వయస్సు 19 ఏళ్ల లోపు ఉండాలి. కానీ మీరు ఐపీఎల్లో ఆడినా లేదా భారత్ తరఫున ఆడినా, వయస్సుతో పనేమీ ఉండదు. 37 ఏళ్ల వయసులో కోహ్లీ జాతీయ జట్టుకు ఆడుతున్నాడు.. అలాగే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా ఆడుతున్నాడు. ఇక్కడ వయసు కంటే వారు చేసే ప్రదర్శననే ముఖ్యం. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ తన అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. తొలి బంతి నుంచే కసితీరా బాదాలనుకుంటాడు. మరి అతడికి ఎప్పుడు అవకాశం వస్తుంది, భారత్ తరఫున ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడు అన్నదే ముఖ్యం. వయసు విభాగాల క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆటగాళ్ల వయసు పరిగణలోకి తీసుకోవాలి కానీ ఐపీఎల్ లేదా భారత జట్టుకు ఆడిన అనుభవం ఉన్న ఆటగాడికి వయసు కొలమానం కాకూడదు అనేది నా అభిప్రాయం’’ అని చెప్పుకొచ్చాడు.15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి దూసుకొచ్చిన వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం టీ20 క్రికెట్లో టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే వయసు దృష్ట్యా అతడు ఫామ్‌లో ఉన్నప్పటికీ తుదిజట్టులో అవకాశం కోసం ఎదురుచూడా ల్సిందేనని ఇటీవలే భారత హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. దీంతో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ వైభవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పటివరకు 8 టీ20 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ 186 స్ట్రైక్ రేట్‌తో 246 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి.ఇదీ చదవండి: ఊతప్ప మెరుపులు వృథా.. సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమిక్రిస్టియానో రొనాల్డోకు భారీ షాక్ -
సంజూ ఔట్.. వైభవ్ ఇన్...! టీమ్ ఇండియాలో భారీ మార్పులు?
-
విండీస్‌తో రెండో టీ20కి ముందు వైభవ్ విధ్వంసం
విండీస్‌తో రేపు జరుగబోయే రెండో టీ20కి ముందు టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టు మేనేజ్మెంట్కు స్ట్రాంగ్ మెసేజ్ పంపాడు. నెట్స్‌లో అతడు భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అలవోకగా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. జట్టు సమీకరణల వల్ల వైభవ్‌కు అవకాశాలు రాని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైభవ్ తనలోని విధ్వంసకర కోణాన్ని మేనేజ్మెంట్కు మరోసారి గుర్తు చేశాడు.నెట్స్‌లో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ కూడా చెలరేగిపోయాడు. వైభవ్‌తో పోటీపడి మరీ షాట్లు ఆడాడు. వీరిద్దరి బ్యాటింగ్ విన్యాసాలు చూసి పోలీసులు, ప్రేక్షకులు, మీడియా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, రెండో టీ20 రాంచీ వేదికగా జరుగనుంది. ఇది ఇషాన్ కిషన్‌కు సొంత మైదానం. రేపటి మ్యాచ్‌లో ఇషాన్ ప్రదర్శన కోసం స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే, రేపటి మ్యాచ్‌లో భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగవచ్చు. ఇదే జరిగితే వైభవ్ సూర్యవంశీకి మరోసారి నిరాశ తప్పదు. మేనేజ్మెంట్ సంజూ శాంసన్‌పై విశ్వాసాన్ని కొనసాగించినంత కాలం వైభవ్‌ది ఇదే పరిస్థితి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. లక్నో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెరీర్లో తొలి టీ20 శతకంతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఇదీ చదవండి: ఐపీఎల్‌తో మరోసారి పోటీపడనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ -
వినోద్ కాంబ్లీ గతి ఏమైందో తెలుసు కదా!: టీమిండియా దిగ్గజం
టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన ఈ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్.. భారత అండర్-19 జట్టు తరఫునా అద్భుతాలు చేశాడు. యూత్ క్రికెట్లో ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర శతకాలు బాది తానేంటో నిరూపించుకున్నాడు.పదిహేనేళ్ల వయసులోనే అరంగేట్రంఇక అండర్-19 వరల్డ్‌కప్-2025 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి.. భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు. అనంతరం ఈ ఏడాది ఐపీఎల్లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఏకంగా 776 పరుగులు చేసి.. అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.ప్రశంసల వర్షంఈ పరిణామాల నేపథ్యంలో కేవలం పదిహేనేళ్ల వయసులోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు వైభవ్ సూర్యవంశీ. అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. నిలకడగా రాణిస్తూ.. టీ20 జట్టు ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు ఈ బిహారీ పిల్లాడు.ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తదుపరి సూపర్ స్టార్ అతడేనంటూ దేశీ, విదేశీ దిగ్గజ క్రికెటర్లు అతడిని కొనియాడుతున్నారు. అయితే, టీమిండియాకు మొట్టమొదటి వరల్డ్‌కప్ అందించిన లెజెండరీ కెప్టెన్ కెప్టెన్ కపిల్ దేవ్ మాత్రం వైభవ్ విషయంలో భిన్నంగా స్పందించాడు.అతడి గతి ఏమైందో తెలుసు కదా!తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ విషయంలో తొందరపాటు తగదు. అతడి గురించి ఇప్పుడే అంచనా వేయడం సరికాదు. నిజంగా అతడికి ఆడగల సామర్థ్యం ఉందా? అంటే అవునని చెప్పవచ్చు.కానీ క్రికెట్లో చాలా మంది ఇలాంటి.. ఇంతకు మించిన నైపుణ్యాలతో దూసుకువచ్చారు. అయితే, అనతికాలంలోనే వారు కనుమరుగైపోయారు. వినోద్ కాంబ్లీనే చూడండి. అతడి గతి ఏమైందో తెలుసు కదా!.. అతడి గురించి మనం ఏం మాట్లాడగలము?వైభవ్ ఇప్పుడు పదిహేను- పదహారేళ్ల పిల్లాడు మాత్రమే. అతడికి కనీసం ఇంకో మూడేళ్ల సమయం ఇవ్వాలి. అప్పుడు అతడి గురించి చర్చిస్తే బాగుంటుంది. కాలక్రమేణా వైభవ్ జీవనశైలి, ఆలోచనా విధానం మారిపోతుంది. అప్పుడే అతడు ఆటలో ఇదే స్థాయిలో కొనసాగగలడా? లేదా అన్నది తెలుస్తుంది.జీవనశైలి, క్రమశిక్షణ ముఖ్యంఅతడి ప్రదర్శనల కంటే కూడా.. అతడి జీవనశైలి ఎలా ఉండబోతున్నదే ముఖ్యమైన అంశంగా మారుతుంది. క్రమశిక్షణతో ఉంటే భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పటికే సచిన్, రోహిత్, విరాట్లను చూశాము. ఈ ముగ్గురు మనల్ని గర్వపడేలా చేశారు.తదుపరి సూపర్‌స్టార్ ఎవరు? అన్న ప్రశ్న ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పుడు పదిహేనేళ్ల వైభవ్‌కు ఆ అవకాశం వచ్చింది. అతడు తదుపరి విరాట్ కాగలడా? అంటే కాలమే ఇందుకు సమాధానం చెప్తుంది’’ అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs WI: ఇంకెన్నాళ్లు అతడికి అవకాశాలు ఇస్తారు?అప్పుడు ఐదెకరాల భూమి.. ఇప్పుడు మూడు ఖరీదైన అపార్ట్మెంట్లు కొన్న విరుష్క -
IND vs WI: ఇంకెన్నాళ్లు అతడికి అవకాశాలు ఇస్తారు?
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ది కీలక పాత్ర. ఈవెంట్ ఆరంభంలో తుదిజట్టులో చోటు దక్కకపోయినా.. నాకౌట్ దశలో తిరిగి వచ్చి ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్.ధనాధన్ దంచికొట్టిసూపర్-8 దశలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 50 బంతుల్లో 97 (నాటౌట్), ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో 42 బంతుల్లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 46 బంతుల్లో 89 పరుగులతో దుమ్ములేపాడు సంజూ. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి సత్తా చాటాడు.వరుస వైఫల్యాలుఆ తర్వాత ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆరంభంలో తడబడ్డ సంజూ.. ఆ తర్వాత వరుస సెంచరీలతో ఫామ్‌లోకి వచ్చాడు. అయితే, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో మరోసారి తేలిపోయాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 5, 0 పరుగులు చేసిన సంజూ.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 1, 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు.అనంతరం జపాన్‌తో ఏకైక టీ20లోనూ విఫలమైన సంజూ (9).. ఆసియా క్రీడలు-2026లో సెమీస్‌లో శ్రీలంకతో మ్యాచ్‌లో 7, పాకిస్తాన్‌తో ఫైనల్లో 2 పరుగులు మాత్రమే చేశాడు. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో తొలి టీ20లో 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.అప్పుడు ఇషాన్.. ఇప్పుడు వైభవ్ఈ నేపథ్యంలో సంజూ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నిజానికి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు ఇషాన్ కిషన్ సంజూకు పోటీగా రాగా.. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ కూడా ఓపెనింగ్ స్థానానికి గట్టి పోటీనిస్తున్నాడు. దీంతో సంజూ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయినట్లు అతడి వైఫల్యాల ద్వారా అర్థమవుతోంది.అయితే, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మాత్రం సంజూకు ఎల్లవేళలా మద్దతుగా ఉంటానని హామీ ఇవ్వడం అతడికి కాస్త సానుకూలాంశం. వరల్డ్‌కప్ హీరోను కాదని.. వైభవ్‌కు ఇప్పుడే వరుస అవకాశాలు ఇవ్వలేమని గంభీర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సంజూ ఆట తీరు అతడికి కూడా తలనొప్పిగా మారింది.గంభీర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితిముఖ్యంగా జట్టు ఓడిపోతే మాత్రం సంజూపై వేటు వేయాలనే డిమాండ్లు పెరిగితే.. గంభీర్ కూడా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఏదేమైనా ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ విండీస్‌తో శుక్రవారం నాటి రెండో టీ20లోనైనా బ్యాట్ ఝులిపించాల్సిందే. లేదంటే తుదిజట్టు నుంచి కనుమరుగయ్యే దుస్థితి వస్తుంది.ఇంకెన్నాళ్లు అతడికి అవకాశాలు ఇస్తారు?టీమిండియాకు దూరమైన క్రికెటర్ హనుమ విహారి కూడా ఇదే మాట అంటున్నాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో సంజూ శాంసన్‌ను యాజమాన్యం ఇంకెన్నాళ్లు కొనసాగిస్తుందని ప్రశ్నించాడు. ఈ మేరకు.. ‘‘సంజూ మరోసారి విఫలమయ్యాడు. ఇంకెన్నాళ్లు అతడికి అవకాశాలు ఇస్తారు?నిజానికి నేను అతడికి అభిమానినే. సంజూ ఆడితే చూడాలని నాకూ ఉంది. అయితే, ప్రస్తుతం సంజూ తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయాడు. వరల్డ్‌కప్ టోర్నీకి ముందు ఇషాన్ జట్టులోకి తిరిగి వచ్చినపుడు కూడా సంజూ సరిగ్గా ఆడలేకపోయాడు.ఒత్తిడిలో కూరుకుపోయాడుఇప్పుడు వైభవ్ అతడి వెంట పడుతున్నాడు. గట్టి పోటీనిస్తున్నాడు. దీంతో సంజూ మరోసారి ఒత్తిడిలో కూరుకుపోయాడు. జట్టులో స్థానం ఉంటుందో లేదోనన్న భయం అతడిని వెంటాడుతోంది. ఇలాంటి సందర్భాల్లో ఒత్తిడి సహజం. అయితే, చాలా మందికి ఈ విషయం పెద్దగా అర్థం కాదు. ఏదేమైనా ఒత్తిడిని జయిస్తేనే సంజూ కెరీర్ సాఫీగా సాగుతుంది’’ అని హనుమ విహారి చెప్పుకొచ్చాడు.చదవండి: అప్పుడు ఐదెకరాల భూమి.. ఇప్పుడు మూడు ఖరీదైన అపార్ట్మెంట్లు కొన్న విరుష్క -
జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లో ఆడే తొలి రెండు మ్యాచ్‌ల కోసం బిహార్ క్రికెట్ అసోసియేషన్ 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. బీసీసీఐ నియమించిన పరిశీలకుల పర్యవేక్షణలో పూర్తి పారదర్శకంగా ఈ జట్టు ఎంపిక జరిగింది. అయితే ఈ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కకపోవడం గమనార్హం. ప్రస్తుతం అతడు భారత సీనియర్ జట్టు తరపున జాతీయ విధుల్లో బిజీగా ఉండడం ఇందకు కారణం. గత సీజన్లో వైభవ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈసారి అతడు అందుబాటులో లేకపోవడంతో ఆ బాధ్యతలను హిమాన్షు సింగ్‌కు అప్పగించారు. అదేవిధంగా మరోసారి బిహార్ జట్టును ముందుండి నడిపించేందుకు ఆల్‌రౌండర్ సకీబుల్ గని సిద్దమయ్యాడు.రాజ్‌గిర్ స్టేడియంలో చారిత్రక మ్యాచ్సకీబుల్ గని నేతృత్వంలోని బిహార్ జట్టు అక్టోబర్ 11న ఉత్తర ప్రదేశ్‌తో తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. కొత్తగా నిర్మించిన 'రాజ్‌గిర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం' వేదికగా జరగనున్న ఈ పోరు బిహార్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలవనుంది. ఈ మైదానంలో జరుగుతున్న తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఇదే కావడం విశేషం.బిహార్ రంజీ జట్టు (తొలి రెండు మ్యాచ్‌లకు):సకీబుల్ గని (కెప్టెన్), హిమాన్షు సింగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ లోహరుకా, మంగళ్ మహ్రూర్, నమన్ గౌరవ్, పీయూష్ సింగ్, బిపిన్ కుమార్ సౌరభ్ (వికెట్ కీపర్), శర్మన్ నిగ్రోధ్ (వికెట్ కీపర్), ఆకాష్ రాజ్, పృథ్వీ రాజ్, ఖాలిద్ ఆలం, సూరజ్ కుమార్ కశ్యప్, షకీబ్ హుస్సేన్, ఎండి ఇజార్, షబ్బీర్ ఖాన్, రాఘవేంద్ర సింగ్, ఆమోద్ యాదవ్.స్టాండ్‌బై ఆటగాళ్లు:నవాజ్ ఖాన్, మలయ్ రాయ్, దానిష్ ఆలం, తను కుమార్ సింగ్, సచిన్ కుమార్ సింగ్, ప్రశాంత్ కుమార్ సింగ్. -
యువరాజ్ రికార్డు బ్రేక్ చేస్తా.. బుడ్జోడి బిగ్ డ్రీమ్స్
-
తుదిజట్టు.. అతడి పేరు మర్చిపోయిన శ్రేయస్ అయ్యర్
లక్నో వేదికగా వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘ఏకనా పిచ్ మిశ్రమంగా ఉంటుంది. ఇక్కడ తేమ ప్రభావం కూడా పడుతుంది. కాబట్టి మేము ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాము.కఠిన సవాలుశనివారమే ఆసియా క్రీడల ఫైనల్ గెలిచి స్వర్ణంతో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత.. మూడు రోజుల్లోనే (మంగళవారం) ఈ మ్యాచ్ ఆడటం కాస్త ఇబ్బందిగానే ఉంది. నిజానికి జపాన్ నుంచి వచ్చిన తర్వాత నేను ఒక్క రోజు మా ఇంట్లో ఉన్నాను. ఆ తర్వాత లక్నోకు వచ్చేశాను.వాళ్లు అద్భుతంగా ఆడుతున్నారుఏదేమైనా ఈరోజు మ్యాచ్ మాకు కఠిన సవాలు విసరబోతోంది. విండీస్ ఆఖరి వన్డేలో అద్భుతంగా ఆడింది. టీ20 క్రికెట్లో కరేబియన్ల ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండేళ్లుగా వాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు.విండీస్ జట్టును అంచనా వేయడం చాలా కష్టం.. షాయీ హోప్ సహా ఎంతో మంది అద్బుతమైన బ్యాటర్లు ఆ జట్టులో ఉన్నారు. ఆల్రౌండర్లకు కూడా కొదవలేదు’’ అని పేర్కొన్నాడు. వెస్టిండీస్‌ను తాము ఎంతమాత్రం తేలికగా తీసుకోవడం లేదని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు.అతడి పేరు మర్చిపోయిన శ్రేయస్ అయ్యర్అదే సమయంలో విండీస్‌తో తొలి టీ20 తుదిజట్టుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ శ్రేయస్ అయ్యర్ ఓ ఆటగాడి పేరు మర్చిపోయాడు. ‘‘మా తుదిజట్టులో రవి బిష్ణోయి, నితీశ్ రెడ్డి, వైభవ్ సూర్యవంశీ లేరు. ఇంకో ఆటగాడు కూడా ఈరోజు ఆడటం లేదు. నేను అతడి పేరును మర్చిపోయాను.హా.. గుర్తొచ్చింది. ప్రిన్స్ యాదవ్ కూడా తుదిజట్టులో లేడు’’ అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. కాగా జపాన్ వేదికగా ఆసియా క్రీడల టోర్నీ ఫైనల్లో పాకిస్తాన్‌పై గెలిచిన టీమిండియా వరుసగా రెండో ఎడిషన్‌లో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.వైభవ్‌తో పాటు అతడికి దక్కని చోటుఇక పాక్‌తో టైటిల్ పోరులో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో పాటు రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా ఆడారు. అయితే, వాషీ, బుమ్రాకు విండీస్ సిరీస్ నుంచి విశ్రాంతినివ్వగా.. విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్లకు చోటు దక్కలేదు. ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధిర్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు.ఇటీవలే వెస్టిండీస్‌తో సిరీస్ సందర్భంగా వన్డేల్లో అరంగేట్రం చేసిన నమన్ ధిర్.. తాజాగా మంగళవారం నాటి మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20లలోనూ అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. విండీస్‌తో తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచి వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.తొలి టీ20కి భారత తుదిజట్టుఅభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, నమన్ ధిర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మయాంక్ యాదవ్బెంచ్: వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయి, నితీశ్ కుమార్ రెడ్డి.విండీస్ తుదిజట్టుషాయీ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమిల్ పూరన్, షిమ్రన్ హెట్మెయిర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫానే రూథర్‌ఫర్డ్, రొమారియో షెఫర్డ్, మాథ్యూ ఫోర్డ్, రోస్టన్ ఛేజ్, అకీల్ హొసేన్, షమార్ జోసెఫ్, షమార్ స్ప్రింగర్.బెంచ్: ఆమిర్ జాంగూ, గుడకేశ్ మోటి, కీమో పాల్, క్విన్టిన్ సామ్ప్సన్.చదవండి: నాశనం చేస్తున్నారు: గంభీర్, గిల్‌పై మాజీ క్రికెటర్ ఫైర్ -
ఆడటం రాక బుడ్డోడి పై ఏడుపా? పాక్ మాజీ క్రికెటర్ల ఫైర్
-
మరికొన్ని గంటల్లో మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే
భారత్-వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ మంగళవారం లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరగనుంది. ఈ క్రమంలో తొలి టీ20 కోసం టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తన భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని పక్కనబెట్టి, అభిషేక్ శర్మకు జోడీగా సంజూ శాంసన్‌ను అతడు ఎంపిక చేశాడు.ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో శాంసన్, సూర్యవంశీ ఇద్దరూ తుది జట్టులో ఆడినప్పటికీ, విండీస్‌తో మ్యాచ్‌కు మాత్రం వీరిద్దరిలో ఒకరికే చోటు దక్కుతుందని అతడు అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తరహాలోనే చోప్రా కూడా సంజూ వైపే మొగ్గు చూపాడు.ఆకాశ్ చోప్రా ఎంపిక చేసిన జట్టులో బ్యాటింగ్ ఆర్డర్లో మూడు, నాలుగు స్ధానాల్లో వరుసగా ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు అవకాశమిచ్చాడు. ఐదో స్ధానంలో తిలక్ వర్మకు ఛాన్స్ దక్కింది. ఆల్‌రౌండర్ల కోటాలో శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్‌కు చోటు లభించింది.మ్యాచ్ పరిస్థితిని బట్టి దూబే, నితీశ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకోవచ్చని చోప్రా పేర్కొన్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేయగా, ఫాస్ట్ బౌలర్లుగా అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్‌లకు అవకాశమిచ్చాడు.చోప్రా ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేఅభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్చదవండి: హర్మన్ ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం -
‘ఆడకపోయినా అతడు నష్టపోయేదేం లేదు’
లక్నో వేదికగా ఇవాళ వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌కు ముందు నిర్వహించే ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన మోర్కెల్ మాట్లాడుతూ.. భారత టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత తుది జట్టులో చోటు దక్కకపోయినా పెద్దగా నష్టపోయేది ఏమీ లేదని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌లో బరిలోకి దిగే ఉత్తమ జట్టు ఎంపికపై సెలెక్టర్లు, హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని మోర్కెల్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది జూన్ నుంచి టీమిండియా టీ20 జట్టు బిజీగా గడుపుతూ వస్తోందని, అందుకే విండీస్‌తో టీ20 సిరీస్‌కు కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చేందుకు గంభీర్ కొత్త కాంబినేషన్‌తో ప్రయోగాలు చేసే అవకాశముందని మోర్కెల్ తెలిపాడు.ఇక వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం జట్టులో ఉన్న అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కలిసి ప్రయాణం చేయడం, వారితో కలిసి ప్రాక్టీస్ చేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకునే అద్భుతమైన అవకాశం అతడికి లభించనుంది. వైభవ్ టాలెంట్ గురించి మనందరికీ తెలుసు.తుదిజట్టులో చోటు దక్కకపోయినా సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఎంత ఎక్కువ సమయం గడిపితే, అంత ఎక్కువ మేలు జరుగుతుంది. మ్యాచ్‌లో ఆడే అవకాశం రానప్పటికీ డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం, డగౌట్లో కూర్చోవడం, సీనియర్లతో కలిసి ట్రావెల్ చేయడం ద్వారా మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. అతడి వయసును దృష్టిలో పెట్టుకొని చూస్తే భవిష్యత్తులో భారత్‌కు కీ ప్లేయర్‌గా మారతాడనడంలో సందేహం లేదు.’ అని చెప్పుకొచ్చాడు.ఆసియా గేమ్స్‌లో పాకిస్తాన్‌ను ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్న టీమిండియా ఫుల్ స్క్వాడ్‌తో విండీస్‌తో సిరీస్‌లో బరిలోకి దిగుతోంది. ఒకటి రెండు మార్పులు మినహా ఆసియా గేమ్స్‌లో ఆడిన జట్టే తొలి టీ20లో ఆడనుంది. ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది.Lucknow, Uttar Pradesh: Bowling Coach, Indian Men’s Cricket Team, Morne Morkel says, "I think for the spectators it's going to be fantastic viewing. I think for both sides. At the moment the red flag of the problem might be our guys travelling back after the Asian Games. Some of the guys only arrived a couple of days ago. So jet lag and government getting rid of their attorney..."— IANS (@ians_india) October 5, 2026ఇదీ చదవండి: ‘ఇమ్రాన్‌ను పశువు కంటే హీనంగా చూస్తున్నారు’ -
అతడి కోసం వైభవ్‌పై వేటు!.. తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే!
వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా రేపటి నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. కాగా తొలి టీ20 మ్యాచ్‌కు లక్నోలోని ఎక్నా క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. సొంతగడ్డపై టీ20 సిరీస్ ఆడుతుండడంతో టీమిండియా ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ, వెస్టిండీస్‌ను తక్కువ అంచనా వేయలేం. రెండుసార్లు టీ20 చాంపియన్స్ అయిన వెస్టిండీస్ టీ20 క్రికెట్లో బలమైన జట్టుగా పరిగణించవచ్చు.బౌలింగ్ పెద్దన్నగా అర్ష్దీప్తుది జట్టులో ఒకటి రెండు మార్పులు మినహా ఆసియా గేమ్స్‌కు ఆడిన జట్టే దాదాపు విండీస్‌తో బరిలోకి దిగనుంది. అయితే ఆసియా గేమ్స్‌లో టీమిండియా బౌలింగ్ దళానికి నాయకత్వం వహించిన జస్ప్రీత్ బుమ్రాకు విండీస్‌తో సిరీస్‌కు విశ్రాంతినిచ్చారు. దీంతో ఆసియా గేమ్స్‌తో పాటు జపాన్‌తో మ్యాచ్‌కు దూరమైన అర్ష్‌దీప్ సింగ్ సిరీస్‌కు ఫ్రంట్‌లైన్ బౌలర్‌గా వ్యవహరించనున్నాడు. రవి బిష్ణోయ్‌పై వేటుఅతడికి ప్రిన్స్ యాదవ్ లేదా మయాంక్ యాదవ్‌లలో ఒకరు బాధ్యత పంచుకోనున్నారు. ఇక విండీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడిన కుల్దీప్ ఆసియా గేమ్స్‌లో పాల్గొనలేదు. కానీ విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన కుల్దీప్ ఆడడం ఖాయం కావడంతో ఆసియా గేమ్స్‌లో విఫలమైన రవి బిష్ణోయ్‌పై వేట పడనుంది. ఇక ఆల్రౌండర్లుగా శివమ్ దూబే, అక్షర్ పటేల్, నమన్ ధీర్ కొనసాగే అవకాశముంది. దీంతో నితీశ్‌కుమార్ రెడ్డి బెంచ్‌కే పరిమితం కానున్నాడు.బ్యాటింగ్ విభాగానికి వస్తే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ మరోసారి ఓపెనర్లుగా వచ్చే అవకాశముంది. ఆసియా గేమ్స్‌లో పేలవ ప్రదర్శన కనబరిచినప్పటికీ సంజూ శాంసన్‌కు మరో అవకాశం దక్కనుంది. వైభవ్ సూర్యవంశీ ఆడుతాడని ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా గంభీర్ వ్యాఖ్యలతో అతడు బెంచ్‌కు పరిమితమయ్యే అవకాశముంది. ఇక వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌కు రానున్నారు. ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఆరో స్థానంలో ఆడనున్నాడు.గంభీర్ వ్యాఖ్యలు వైరల్..విండీస్‌తో తొలి టీ20కి ముందు భారత హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ వైభవ్ సూర్యవంశీని ఆడించడంపై స్పందించాడు. 'వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించడం కష్టమవుతోంది. అతను ఫామ్‌లో ఉన్న మాట వాస్తవమే. కానీ, జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదనేది అతనికి అర్థమయ్యేలా చెప్పాను. కొన్నిసార్లు అత్యుత్తమ ప్రదర్శన చేసే ఆటగాడైనా సరే.. అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఒకవేళ వైభవ్‌ను ఆడిస్తే.. అభిషేక్, సంజూ శాంసన్‌లలో ఎవర్ని తప్పించాలనేది కష్టమవుతుంది. గత కొంతకాలంగా మెరుగ్గా రాణిస్తున్న ఈ కాంబినేషన్‌ను ఉన్నట్టుండి మార్చలేం. రెండు, మూడు వైఫల్యాలకే .. సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టి కుర్రాళ్లను ఆడించడం సరికాదు. పాపులర్ అయ్యే నిర్ణయాలు తీసుకోవడం సరైన నిర్ణయమే. కానీ సరైన నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైన పని. సంజూ-అభిషేక్ జోడీని కొనసాగించి మేం మంచి నిర్ణయమే తీసుకున్నామని అనిపిస్తోంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.తొలి టీ20 భారత తుది జట్టు అంచనా:అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నమన్ ధీర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్/మయాంక్ యాదవ్ఇదీ చదవండి: న్యూజిలాండ్ టూర్‌కు ముందు భారత ఆటగాళ్ల కీలక నిర్ణయం -
15 ఏళ్ల కుర్రాడిని హేళన చేస్తావా?.. పాక్ ఆల్‌రౌండర్‌పై కమ్రాన్ అక్మల్ ఫైర్
ఆసియా క్రీడలు 2026 క్రికెట్ టోర్నీ ఫైనల్లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని పాక్ ఆల్‌రౌండర్ సైమ్ అయూబ్ హేళన చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీని అవుట్ చేసిన తర్వాత సైమ్ అయూబ్ ‘బేబీసిట్టింగ్’ తరహా సెలబ్రేషన్ చేసుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది.దీంతో అయూబ్‌పై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. భారత అభిమానులతో పాటు పలువురు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సైతం అయూబ్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ కమ్రాన్ అక్మల్, సైమ్ అయూబ్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం సోషల్ మీడియా పబ్లిసిటీ కోసమే అయూబ్ ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు"ప్రస్తుతం మన జట్టు ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు. కానీ సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం కోసం గత కొంతకాలంగా ఇలాంటి చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇది అంతర్జాతీయ క్రికెట్ అనే విషయాన్ని టీమ్ మేనేజ్మెంట్ గుర్తించాలి. వైభవ్ సూర్యవంశీకి 13, 14 లేదా 15 ఏళ్లు కావచ్చు.. కానీ అతడు తన ప్రతిభతో సీనియర్ స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. సైమ్ అయూబ్ ఇంకా చిన్న పిల్లాడు కాదు, ముందు తన సొంత ప్రదర్శనపై దృష్టి పెడితే మంచిది" అని అక్మల్ గేమ్ ప్లాన్’ యూట్యూబ్ షోలో పేర్కొన్నాడు.కాగా ఫైనల్ మ్యాచ్‌లో అయూబ్ దారుణంగా విఫలమయ్యాడు. వైభవ్ సూర్యవంశీ వికెట్ తీసినప్పటికీ అయూబ్ తన నాలుగు ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకున్నాడు. ఫీల్డింగ్‌లో రెండు క్యాచ్‌లను జారవిడిచాడు. అదేవిధంగా బ్యాటింగ్‌లో 22 బంతులు ఎదుర్కొని 29 పరుగులు ఔటయ్యాడు.చదవండి: IND vs WI: వైభవ్ సూర్యవంశీపై వేటు.. క్లియర్‌గా చెప్పేసిన కెప్టెన్! -
వైభవ్ సూర్యవంశీపై వేటు.. క్లియర్‌గా చెప్పేసిన కెప్టెన్!
ఏషియన్ గేమ్స్-2026 క్రికెట్ పోటీల్లో స్వర్ణం గెలుచుకున్న భారత పురుషుల జట్టు.. ఇప్పుడు స్వదేశంలో వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ అక్టోబర్ 6న లక్నో వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కేది అనుమానంగానే మారింది.ఆసియా క్రీడల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, జట్టు కూర్పు కారణాల వల్ల వైభవ్‌ను మరోసారి బెంచ్‌కే పరిమితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెగ్యులర్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లనే విండీస్‌తో సిరీస్‌లోనూ కొనసాగించనున్నట్లు సమాచారం.గతనెలలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లోనూ వైభవ్ మూడు మ్యాచ్‌లకు గాను డ్రింక్స్ బాయ్‌గానే పరిమితమయ్యాడు. పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్ అనంతరం జియో హాట్‌స్టార్‌తో మాట్లాడిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి."ప్రస్తుతం మేము ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఓపెనర్లతోనే ముందుకు వెళ్తున్నాం. వారు ఆ స్థానానికి పూర్తిగా అర్హులు. ప్రస్తుతం వైభవ్ 15 మంది సభ్యుల జట్టులోనే ఉన్నాడు కాబట్టి అతడికి భవిష్యత్తులో ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. అవకాశం వచ్చినప్పుడు అతడు మైదానంలో ఖచ్చితంగా ఆధిపత్యం చెలాయిస్తాడనే నమ్మకం ఉంది" అని శ్రేయస్ వెల్లడించాడు.వైభవ్‌తో తనకున్న బంధం గురించి మాట్లాడుతూ.. "నేను వైభవ్‌తో చాలా క్లోజ్‌గా ఉంటాను. అందరూ అతనితో ఎప్పుడూ క్రికెట్ గురించే మాట్లాడుతుంటారు, కానీ నేను మైదానం వెలుపల అతడి జీవనశైలి, కుటుంబం, ఇతర విషయాల గురించి ఎక్కువగా చర్చిస్తాను. అది అతనికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అతడు చూడటానికి చాలా సైలెంట్‌గా ఉంటాడు కానీ. మైదానంలో మాత్రం ప్రత్యర్థులపై విరుచుకుపడతాడు. డ్రెసింగ్ రూమ్‌లో కూడా చాలా సరదాగా ఉంటాడు" అని అయ్యర్ పేర్కొన్నాడు.చదవండి: WCL 2026: భారత్‌తో విభేదాలు.. కీలక టోర్నీ నుంచి పాక్ అవుట్ -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. తొలి ఇండియన్‌గా
ఏషియన్ గేమ్స్-2026 క్రికెట్ టోర్నీ విజేతగా టీమిండియా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై 19 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. వరుసగా రెండో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ తుది పోరులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ (61), తిలక్ వర్మ (51) అద్భుతమైన అర్ధ శతకాలతో (హాఫ్ సెంచరీ) మెరిశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పాక్ యువ ఆటగాడు హసన్ నవాజ్ (51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 96) వీరోచిత పోరాటం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. పాక్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.వైభవ్ అరుదైన ఘనతఈ మ్యాచ్ అనంతరం విజేతలైన భారత ఆటగాళ్లకు ఐసీసీ చైర్మన్ జై షా స్వర్ణ పతకాలను అందజేశారు. ఈ క్రమంలో టీమిండియా యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత సాధించాడు. ఆసియా క్రీడల చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన యంగెస్ట్ భారత అథ్లెట్‌గా వైభవ్ రికార్డులకెక్కాడు.అంతకుముందు ఈ రికార్డు షూటర్ సౌరభ్ చౌదరి పేరిట ఉండేది. 2018 జకార్తా ఆసియా క్రీడలలో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 16 ఏళ్ల వయస్సులో సౌరభ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయస్సులోనే పసిడి పతకం సాధించి సౌరభ్ రికార్డును బ్రేక్ చేశాడు.చదవండి: IND vs WI: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు -
ఫైనల్లో పాకిస్తాన్ చిత్తు.. టీమిండియాదే గోల్డ్ మెడల్ (ఫోటోలు)
-
Asian Games Finals: వైభవ్‌కు ఎగతాళి చేసిన పాక్ బౌలర్
భారత్-పాకిస్తాన్ మధ్య ఇవాళ జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ ఫైనల్స్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని (15) ఔట్ చేసిన తర్వాత పాక్ బౌలర్ సైమ్ అయూబ్ ఓవరాక్షన్ చేశాడు. బేబీ సిట్టింగ్ గెశ్చర్‌తో వైభవ్‌ను ఆటపట్టించాడు.HMM...THAT’S SOME CELEBRATION! 🤨 🍼Saim Ayub knows how BIG BOSS BABY's wicket was 🙆 Watch Pakistan vs India in the Men's Cricket Final at the 20th Asian Games Aichi-Nagoya 2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames… pic.twitter.com/eUGsSMrIOo— Sony Sports Network (@SonySportsNetwk) October 3, 2026ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించిన వైభవ్ సహచరుడు అభిషేక్ సైమ్పై ప్రతీకారం తీర్చుకున్నాడు. వైభవ్‌ను ఔట్ చేసిన ఓవర్లోనే సిక్సర్, వరుసగా రెండు బౌండరీలు బాదాడు. ఈ తంతు ఇన్నింగ్స్ మూడో ఓవర్లో జరిగింది. సైమ్ అప్పటికే వరుసగా రెండు సిక్సర్లు బాదిన వైభవ్‌ను తొలి బంతికే బోల్తా కొట్టించాడు. వైభవ్ అనవసరమైన రివర్స్ స్వీప్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. దీనిపై అభిషేక్ కూడా అసహనం వ్యక్తం చేశాడు.వైభవ్ ఔటైన తర్వాత గేర్ మార్చిన అభిషేక్ 20 బంతుల్లోనే అర్ద సెంచరీ పూర్తి చేశాడు. ఈ మధ్యలో సంజూ శాంసన్ (2) ఔటయ్యాడు. మొత్తంగా 28 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి అరాఫత్ మిన్హాస్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 120-3గా ఉంది. ఇషాన్ కిషన్ (17), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (15) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ఇదీ చదవండి: Asian Games Finals, IND VS PAK: అభిషేక్ శర్మ విధ్వంసం -
IND vs PAK: ఫైనల్లో వైభవ్ విఫలం.. అభిషేక్ రియాక్షన్ వైరల్
ఆసియా క్రీడలు- 2026 పురుషుల టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. పసిడి పతక పోరులోనూ ఓపెనర్లుగా అభిషేక్ శర్మ- వైభవ్ సూర్యవంశీ జోడీని యాజమాన్యం కొనసాగించింది.తొలి ఓవర్లో కష్టంగాకాగా జపాన్‌లోని నిశిన్ పిచ్‌పై స్పిన్ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పిన్ ఆల్‌రౌండర్ సయీబ్ ఆయుబ్తో పాక్ తమ బౌలింగ్ ఎటాక్ ఆరంభించింది. ఈ క్రమంలో తొలి ఓవర్లో వైభవ్ రెండు సింగిల్స్ తీయగా.. అభిషేక్ ఒక్క పరుగు మాత్రమే రాబట్టాడు. వైడ్ రూపంలో ఒక పరుగు వచ్చింది.Vaibhav Sooryavanshi started off with a Bossy SIX 💥 Watch Pakistan vs India in the Men's Cricket Final at the 20th Asian Games Aichi-Nagoya 2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames #AichiNagoya2026… pic.twitter.com/NrxD0MIGKR— Sony Sports Network (@SonySportsNetwk) October 3, 2026వరుసగా రెండు సిక్సర్లుఅయితే, రెండో ఓవర్లో వైభవ్ గేరు మార్చాడు. సాద్ మసూద్ బౌలింగ్‌లో రెండు, మూడు బంతుల్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఇలా భారీ షాట్లతో అలరించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ మూడో ఓవర్లో తొలి బంతికే సయీమ్ ఆయుబ్ బౌలింగ్‌లో.. వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ANOTHER ONE! ⚡Vaibhav pulls it high over mid wicket giving a blazing start to India's innings. 🔥Watch Pakistan vs India in the Men's Cricket Final at the 20th Asian Games Aichi-Nagoya 2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/HdMpOdL5fS— Sony Sports Network (@SonySportsNetwk) October 3, 2026 ఏంటిది వైభవ్?పాక్‌తో ఫైనల్లో మొత్తంగా 9 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ రెండు సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వైభవ్ అనవసరమైన రవర్స్ స్వీప్ షాట్ ఆడి అవుటైన నేపథ్యంలో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ‘ఏంటిది వైభవ్?’ అన్నట్లుగా అతడు ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది.ఇక వైభవ్ స్థానంలో వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ (2) కూడా నిరాశపరచగా.. అభిషేక్ మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇరవై బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన ఈ లెఫ్టాండర్.. మొత్తంగా 28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 61 పరుగులు సాధించాడు. అరాఫత్ మిన్హాస్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. చదవండి: IND vs WI: శ్రేయస్ అయ్యర్‌దే తుది నిర్ణయం కావాలి! -
IND vs WI: ‘వైభవ్ సూర్యవంశీని తప్పక ఆడించాలి’
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి ఇప్పుడే చర్చ మొదలైంది. ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20లకు సెప్టెంబరు 27- అక్టోబరు 17 మధ్య షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే.ఫైనల్ తర్వాత స్వదేశానికితొలుత వన్డే సిరీస్ మొదలు కాగా.. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. శనివారం నాటి మూడో వన్డేలోనూ గెలుపొంది క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 టోర్నమెంట్లో శనివారం నాటి ఫైనల్ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశానికి చేరుకోనుంది.వీవీఎస్ లక్ష్మణ్ కీలక నిర్ణయంఅనంతరం అక్టోబరు 6 నుంచి రెగ్యులర్ హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో భారత టీ20 జట్టు విండీస్‌తో సిరీస్ మొదలుపెడుతుంది. ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడల్లో టీమిండియాకు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక హెడ్‌కోచ్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంకతో సెమీ ఫైనల్ సందర్భంగా లక్ష్మణ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.ఈ ముగ్గురు టాపార్డర్‌లో కుదురుకుంటే..ఓపెనింగ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ.. ఇలా ముగ్గురినీ టాపార్డర్‌లో ఆడించాడు. ఓపెనర్లుగా వైభవ్, అభిషేక్ బరిలోకి దిగగా.. సంజూ వన్‌డౌన్‌లో వచ్చాడు. ఇదే కాంబినేషన్‌ను సొంతగడ్డపై వెస్టిండీస్‌తో సిరీస్‌లోనూ కొనసాగించాలని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.ఒకవేళ ఈ ముగ్గురు టాపార్డర్‌లో కుదురుకుంటే.. వీరిలో ఒక్కరు మెరుగ్గా ఆడినా భారత జట్టు వరుస విజయాలు సాధించడం ఖాయమని కైఫ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు..గంభీర్‌ను కాదనైనా సరే శ్రేయస్ నిర్ణయం తీసుకోవాలి‘‘విండీస్‌తో సిరీస్‌కు వీవీఎస్ కోచ్‌గా ఉండడు. అయితే కెప్టెన్ మాత్రం శ్రేయస్ అయ్యరే కదా!.. టాపార్డర్ విషయంలో శ్రేయస్ గట్టి నిర్ణయం తీసుకోవాలి. అభిషేక్, వైభవ్, సంజూలను తుదిజట్టులో ఆడించాలి.వాళ్లు ముగ్గురూ గనుక టాపార్డర్‌లో కుదురుకుని.. ఈ కాంబినేషన్ వర్కౌట్ అయిందంటే అద్భుతమైన ఫలితాలు రాబట్టవచ్చు. అయితే, ఇక్కడ కోచ్ (గంభీర్)తో సమస్య రావొచ్చు. అయినా సరే శ్రేయస్ ఒప్పించగలగాలి. ఆ ముగ్గురిలో ఒక్కరు బ్యాట్ ఝులిపించినా టీమిండియా ఆరోజు తప్పక విజయం సాధిస్తుంది.వన్డౌన్లోనైనా వైభవ్వైభవ్ను పక్కన పెట్టడం ఏ రకంగానూ మంచిది కాదు. అతడిని ప్రపంచకప్ టోర్నీకి సిద్ధం చేయాలంటే వరుస అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం అభిషేక్- సంజూను ఓపెనర్లుగా కొనసాగిస్తే వైభవ్‌ను వన్డౌన్లోనైనా ఆడించాలి’’ అని కైఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన సంజూకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుందని ఇటీవల గంభీర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాబట్టి యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరికొన్నాళ్లు వేచి చూడక తప్పదని కుండబద్దలు కొట్టాడు గంభీర్.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా యువ సంచలనం -
IND vs PAK T20I Final: ఉత్కంఠ పోరు.. పాక్‌ను చిత్తు చేసిన భారత్
ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 టోర్నమెంట్ ఫైనల్లో టీమిండియా- పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకునేందుకు బరిలోకి దిగాయి. జపాన్‌లోని నిశిన్ వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ భారీ స్కోరు ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర అర్ధ శతకం (28 బంతుల్లో 61) బాదగా.. ఆఖర్లో తిలక్ వర్మ, శివం దూబే మెరుపులు మెరిపించారు. దూబే 15 బంతుల్లో 27 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 21 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. మొత్తంగా 22 బంతులు ఎదుర్కొని 51 పరుగులు చేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్.. ఆఖరి ఓవర్ వరకు పట్టుదలగా పోరాడి.. చివరికి 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. హసన్ నవాజ్ ఒంటరి పోరాటం (51 బంతుల్లో 96) చేశాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి శివం దూబే బౌలింగ్‌లో అవుటై సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఫలితంగా పాక్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 192 పరుగులకు పరిమితమైంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వాషింగ్టస్ సుందర్, శివం దూబే తలా రెండు వికెట్లు కూల్చారు.మరోసారి స్వర్ణంఆసియా క్రీడల్లో టీమిండియా వరుసగా రెండోసారి స్వర్ణం గెలిచింది. గత ఎడిషన్‌లో అఫ్గానిస్తాన్‌తో ఫైనల్ వర్షంవల్ల రద్దు కాగా రుతురాజ్ సేన పసిడి పతకాన్ని ముద్దాడింది. ఇక తాజాగా దాయాది పాకిస్తాన్‌ను ఓడించి మరోసారి బంగారు పతకం గెలిచి అభిమానులకు అసలైన మజా అందించింది. పాక్ రజతంతో సరిపెట్టుకుంది.UPDATES:👉19 పరుగుల తేడాతో టీమిండియా జయభేరి 👉భయపెట్టిన నవాజ్👉19.6: దూబే బౌలింగ్‌లో నవాజ్ అవుట్👉19.4: దూబే బౌలింగ్‌లో సిక్సర్ బాదిన నవాజ్👉వైడ్ వేసిన దూబే👉19.1: దూబే బౌలింగ్‌లో ఫోర్ బాదిన హసన్ నవాజ్పందొమ్మిది ఓవర్లలో పాక్ స్కోరు: 179-5👉విజయానికి ఆఖరి ఓవర్లో 33 పరుగులు కావాలి 👉18.3: బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్ బాదిన సాద్ మసూద్పాక్ ఐదో వికెట్ డౌన్👉17.6: ఆఖరి బంతికి సిక్సర్ బాదిన సాద్ మసూద్.. విజయానికి 12 బంతుల్లో 44 పరుగులు కావాలి.👉17.3: పాకిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన అబ్దుల్ సమద్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. పాక్ 👉విజయానికి ఇంకా 14 బంతుల్లో 50 పరుగులు కావాలి. పదిహేడు ఓవర్లలో పాక్ స్కోరు: 160-4👉విజయానికి 19 బంతుల్లో 54 పరుగులు కావాలి👉దూబే 16 పరుగులు సమర్పించుకున్నాడు.👉16.4: ఈసారి అబ్దుల్ సమద్ ఫోర్ బాదాడు👉16.2: మరో ఫోర్ బాదిన నవాజ్👉16.1: దూబే బౌలింగ్‌లో ఫోర్ బాదిన నవాజ్పదహారు ఓవర్లలో పాక్ స్కోరు: 144-4👉విజయానికి 24 బంతుల్లో 68 పరుగులు కావాలి👉ఈ ఓవర్లో పద్నాలుగు పరుగులు ఇచ్చిన అక్షర్ పటేల్👉హసన్ నవాజ్ 68, అబ్దుల్ సమద్ మూడు పరుగులతో ఉన్నారు.👉15.1: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన నవాజ్పదిహేను ఓవర్లలో పాక్ స్కోరు: 130-4👉విజయానికి 31 బంతుల్లో 82 పరుగులు కావాలి👉ఈ ఓవర్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చి వికెట్ తీసిన శివం దూబే👉హసన్ నవాజ్ 60, అబ్దుల్ సమద్ 2 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్👉14.1: శివం దూబే బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన సయీమ్ (22 బంతుల్లో 29). అబ్దుల్ సమద్ క్రీజులోకి రాగా.. హసన్ 58 పరుగులతో ఉన్నాడు.పద్నాలుగు ఓవర్లలో పాక్ స్కోరు: 126-3👉విజయానికి 36 బంతుల్లో 86 పరుగులు కావాలి👉సయీమ్ , హసన్ నవాజ్ పరుగులతో ఉన్నారు.👉13.6: బుమ్రా బౌలింగ్‌లో ఫోర్ బాదిన హసన్ నవాజ్👉కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి ఈ ఓవర్లో కేవలం తొమ్మిది పరుగులు ఇచ్చిన బుమ్రాపదమూడు ఓవర్లలో పాక్ స్కోరు: 117-3👉సయీమ్ 24 , హసన్ నవాజ్ 54 పరుగులతో ఉన్నారు.👉ఈ ఓవర్లో ఏకంగా 20 పరుగులు ఇచ్చిన రవి బిష్ణోయి👉12.6: ఫోర్ బాదిన నవాజ్👉12.2: బిష్ణోయి బౌలింగ్‌లో సిక్సర్ బాదిన హసన్ నవాజ్.. హాఫ్ సెంచరీ పూర్తిపన్నెండు ఓవర్లలో పాక్ స్కోరు: 97-3👉సయీమ్ 24, హసన్ నవాజ్ 34 పరుగులతో ఉన్నారు.👉ఈ ఓవర్లో 8 పరుగులు ఇచ్చిన వాషింగ్టన్ సుందర్పదకొండు ఓవర్లలో పాక్ స్కోరు: 89-3👉సయీమ్ 22, హసన్ నవాజ్ 28 పరుగులతో ఉన్నారు.👉ఈ ఓవర్లో 13 పరుగులు ఇచ్చిన అభిషేక్ శర్మ👉10.5: వరుసగా రెండో ఫోర్ బాదిన సయీమ్👉10.4: అభిషేక్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన సయీమ్ పది ఓవర్లలో పాక్ స్కోరు: 76-3👉విజయానికి 60 బంతుల్లో 136 పరుగులు కావాలి👉సయీమ్ 12, హసన్ 26 పరుగులతో ఉన్నారు. 👉ఈ ఓవర్లో 14 పరుగులు ఇచ్చిన రవి బిష్ణోయి👉9.4: మరో సిక్సర్ బాదిన హసన్👉9.2: రవి బిష్ణోయి బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన హసన్ నవాజ్తొమ్మిది ఓవర్లలో పాక్ స్కోరు: 62-3👉సయీమ్ 11, హసన్ 13 పరుగులతో ఉన్నారు. 👉ఈ ఓవర్లో పది పరుగులు ఇచ్చుకున్న అభిషేక్👉8.4: అభిషేక్ శర్మ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన హసన్ఎనిమిది ఓవర్లలో పాక్ స్కోరు: 52-3 👉సయీమ్ 10, హసన్ 4 పరుగులతో ఉన్నారు. ఈ ఓవర్లో 10 పరుగులు👉7.4: రవి బిష్ణోయి బౌలింగ్‌లో సిక్సర్ బాదిన సయీమ్ ఆయుబ్ఏడు ఓవర్లలో పాక్ స్కోరు: 42-3👉ఈ ఓవర్లో కేవలం మూడు పరుగులు ఇచ్చి.. వికెట్ తీసిన అక్షర్👉సయీబ్ ఆయుబ్, హసన్ నవాజ్ చెరో రెండు పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ కోల్పోయిన పాక్👉6.1: అక్షర్ బౌలింగ్‌లో వాషింగ్టన్కు క్యాచ్ ఇచ్చి అవుటైన సదాకత్ (18 బంతుల్లో 23) Brilliant catch from Washington Sundar as Pakistan go deep in trouble in the chase 🔥Watch Pakistan vs India in the 20th Asian Games Gold Medal Match, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames #AichiNagoya2026… pic.twitter.com/pXbXHTJwiI— Sony Sports Network (@SonySportsNetwk) October 3, 2026పవర్ ప్లేలో పాక్ స్కోరు: 39-2 (ఆరు ఓవర్లు)👉పొదుపుగా బౌలింగ్ చేసిన వాషీ.. కేవలం మూడు పరుగులే ఇచ్చాడు.ఐదు ఓవర్లలో పాక్ స్కోరు: 36-2👉హసన్ నవాజ్ 0, సదాకత్ 22 పరుగులతో ఉన్నారు.పాక్ రెండో వికెట్ డౌన్👉4.5: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో దూబేకు క్యాచ్ ఇచ్చి ఉస్మాన్ ఖాన్ అవుట్ (6 బంతుల్లో 3). BAPU BREAKTHROUGHS ARE PERMANENT🔥Axar into the attack and the wickets just keep coming💪Watch Pakistan vs India in the 20th Asian Games Gold Medal Match, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames #AichiNagoya2026… pic.twitter.com/7VqSfbguRV— Sony Sports Network (@SonySportsNetwk) October 3, 2026నాలుగు ఓవర్లలో పాక్ స్కోరు: 34-1👉విజయానికి ఇంకా 178 పరుగులు కావాలి👉ఉస్మాన్ 1, సదాకత్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన పాక్👉3.4: వాషీ బౌలింగ్‌లో అక్షర్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగిన ఫర్హాన్ (11 బంతుల్లో 10)👉3.3: ఫోర్ బాదిన ఫర్హాన్👉3.1: వాషింగ్టన్కు ఫోర్‌తో ఆహ్వానం పలికిన సదాకత్మూడు ఓవర్లలో పాక్ స్కోరు: 24-0👉పొదుపుగా బౌలింగ్ చేసిన బుమ్రా.. కేవలం మూడు పరుగులే ఇచ్చాడు.రెండు ఓవర్లలో పాక్ స్కోరు: 21-0👉అక్షర్ పటేల్ 10 పరుగులు ఇచ్చుకున్నాడు. ఫర్హాన్ 6, సదాకత్ 13 పరుగులతో ఉన్నారు.రెండు నోబాల్స్ వేసిన బుమ్రా👉భారత బౌలింగ్ అటాక్ ఆరంభించిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. తొలి బంతినే నోబాల్‌గా వేశాడు. అతడి బౌలింగ్‌లో ఐదో బంతి కూడా నోబాల్ కాగా.. మాజ్ సదాకత్ ఫోర్ బాదాడు. మొత్తానికి తొలి ఓవర్లో బుమ్రా 11 పరుగులు ఇచ్చుకున్నాడు. పాక్ స్కోరు: 11-0. ఫర్హాన్ 1, సదాకత్ 8 పరుగులతో ఉన్నారు. భారత్ స్కోరు: 211- 6 (20).. పాక్ లక్ష్యం 212👉19.6: సింగిల్ తీసిన తిలక్👉19.5: రెండు పరుగులు తీసి.. 21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన తిలక్ వర్మ👉19.4: బ్యాక్వర్డ్ స్వ్కేర్ లెగ్ మీదుగా మరో సిక్సర్ బాదిన తిలక్👉19.3: దనియాల్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ బాదిన తిలక్ వర్మTilak Varma clearly enjoys batting against Pakistan. Here’s the proof! 😮💨 Watch Pakistan vs India in the 20th Asian Games Gold Medal Match, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #AsianGames #AichiNagoya2026… pic.twitter.com/jCZu7ZAREJ— Sony Sports Network (@SonySportsNetwk) October 3, 2026ఆరో వికెట్ కోల్పోయిన భారత్👉19.1: అహ్మద్ దనియాల్ బౌలింగ్‌లో మాజ్ సదాకత్‌కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్‌గా వెనుదిరిగిన శివం దూబే (15 బంతుల్లో 27; రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు). అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు.పందొమ్మిది ఓవర్లలో భారత్ స్కోరు: 195-5👉తిలక్ వర్మ 18 బంతుల్లో 36 , దూబే 14 బంతుల్లో 27 పరుగులతో ఉన్నారు. 29 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యం👉18.5: ఈసారి ఫోర్ బౌండరీ బాదిన తిలక్ వర్మ👉18.3: ఫోర్ కొట్టిన దూబే👉18.2: ఈసారి లాంగాన్ మీదుగా సిక్సర్ బాదిన దూబే👉18.1: సయీమ్ ఆయుబ్ బౌలింగ్‌లో లాంగాఫ్ మీదుగా సిక్స్ కొట్టిన శివం దూబేపద్దెనిమిది ఓవర్లలో భారత్ స్కోరు: 172-5👉తిలక్ వర్మ 30, దూబే 10 పరుగులతో ఉన్నారు.👉17.6: మరో సిక్సర్ బాదిన తిలక్ వర్మ👉17.5: సూఫియాన్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదిన తిలక్ వర్మ👉17.1: సూఫియాన్ బౌలింగ్‌లో లాంగాఫ్ మీదుగా ఫోర్ బాదిన తిలక్ వర్మపదిహేడు ఓవర్లలో భారత్ స్కోరు: 154-5👉తిలక్ వర్మ 13, దూబే తొమ్మిది పరుగులతో ఉన్నారు.👉16.5: బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా ఫోర్ బాదిన దూబే👉16.1: అబ్రార్ బౌలింగ్‌లో డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా ఫోర్ బాదిన తిలక్పదహారు ఓవర్లలో భారత్ స్కోరు: 142-5👉తిలక్ వర్మ ఏడు, దూబే నాలుగు పరుగులతో ఉన్నారు.పదిహేను ఓవర్లలో భారత్ స్కోరు: 137-5👉తిలక్ వర్మ నాలుగు, దూబే రెండు పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ కోల్పోయిన భారత్👉14.1: అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో సాహిబ్జాదా ఫర్హాన్‌కు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 21) ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. శివం దూబే క్రీజులోకి వచ్చాడు.పద్నాలుగు ఓవర్లలో భారత్ స్కోరు: 133-4👉శ్రేయస్ 21, తిలక్ వర్మ రెండు పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్👉13.1: అరాఫత్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ బౌల్డ్ (18 బంతుల్లో 20; మూడు ఫోర్లు). తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు.పదమూడు ఓవర్లలో భారత్ స్కోరు: 128-3👉శ్రేయస్ 19, ఇషాన్ 20 పరుగులతో ఉన్నారు.పన్నెండు ఓవర్లలో భారత్ స్కోరు: 124-3👉శ్రేయస్ 17, ఇషాన్ 18 పరుగులతో ఉన్నారు.పదకొండు ఓవర్లలో భారత్ స్కోరు: 120-3👉ఇషాన్ 17, శ్రేయస్ 15 పరుగులతో ఉన్నారు.పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 114-3👉ఇషాన్ 12, అయ్యర్ 15 పరుగులతో ఉన్నారు.👉9.4: సూఫియాన్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన శ్రేయస్ అయ్యర్. Sarpanch Saab bringing the class to the big stage! 👌Watch Pakistan vs India in the 20th Asian Games Gold Medal Match, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #AsianGames #AichiNagoya2026 #BaarBaarBharatHarBaarBharat pic.twitter.com/4Ajc8UbF4b— Sony Sports Network (@SonySportsNetwk) October 3, 2026తొమ్మిది ఓవర్లలో భారత్ స్కోరు: 103-3👉8.6: డీప్ ఎక్స్ట్రా కవర్ మీదుగా బౌండరీ బాదిన శ్రేయస్ అయ్యర్.. సెంచరీ కొట్టిన టీమిండియా👉8.1: అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో ఫోర్ బదిన ఇషాన్ ఎనిమిది ఓవర్లలో భారత్ స్కోరు: 94-3మూడో వికెట్ కోల్పోయిన భారత్👉7.5: అరాఫత్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ (28 బంతుల్లో 61; మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లు). ఇషాన్ క్రీజులోకి వచ్చాడు.👉7.4: అరాఫత్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్సర్ బాదిన అభిషేక్ శర్మఏడు ఓవర్లలో భారత్ స్కోరు: 85-2👉అభిషేక్ 24 బంతుల్లో 54, అయ్యర్ ఆరు బంతుల్లో 5 పరుగులతో ఉన్నారు.పవర్ ప్లేలో భారత్ స్కోరు: 81-2 (6 ఓవర్లు)👉అభిషేక్ 52, అయ్యర్ 3 పరుగులతో ఉన్నారు.అభిషేక్ శర్మ మెరుపు అర్ధ శతకం👉5.6: దనియాల్ బౌలింగ్‌లో డీప్ ఎక్స్ట్రా కవర్ మీదుగా సిక్సర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న అభిషేక్. 20 బంతుల్లో 52. 👉5.3: వైడ్.. ఫోర్.. ఐదు పరుగులు👉5.1 ఓవర్: దనియాల్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదిన అభిషేక్ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 53-2👉అభిషేక్ 40, అయ్యర్ 3 పరుగులతో ఉన్నారు.👉4.1 ఓవర్: అరాఫత్ మిన్హాస్ బౌలింగ్‌లో డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్ బాదిన అభిషేక్UNSTOPPABLE ABHI! ⚡Abhishek Sharma brings up a stunning 20-ball fifty with a six as India are building up the lead against Pakistan! 🔥Watch Pakistan vs India in the 20th Asian Games Gold Medal Match, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/v6Ig2hxV6e— Sony Sports Network (@SonySportsNetwk) October 3, 2026 నాలుగు ఓవర్లలో భారత్ స్కోరు: 52-2👉అభిషేక్ 32, అయ్యర్ సున్నా పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన భారత్👉3.5 ఓవర్: దనియాల్ బౌలింగ్‌లో అరాఫత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన సంజూ (2). శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.👉3.2 ఓవర్: అహ్మద్ దనియాల్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్సర్ బాదిన అభిషేక్.. టీమిండియా హాఫ్ సెంచరీమూడు ఓవర్లలో భారత్ స్కోరు: 43-1👉అభిషేక్ 9 బంతుల్లో 25 పరుగులతో, సంజూ ఒక పరుగుతో ఉన్నారు.👉2.6 ఓవర్: లాంగాఫ్ మీదుగా ఫోర్ బాదిన అభిషేక్👉2.5 ఓవర్: లాంగాన్ మీదుగా ఫోర్ బాదిన అభిషేక్👉2.4 ఓవర్: సయీబ్ ఆయుబ్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదిన అభిషేక్ శర్మవైభవ్ అవుట్👉2.1 ఓవర్: సయీమ్ ఆయుబ్ బౌలింగ్‌లో వైభవ్ ఉస్మాన్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మొత్తంగా తొమ్మిది బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేసి అవుటైన వైభవ్. సంజూ క్రీజులోకి వచ్చాడు.రెండు ఓవర్లలో భారత్ స్కోరు: 28-0👉అభిషేక్ 11, వైభవ్ 15 పరుగులతో ఉన్నారు.👉ఆరో బంతి నోబాల్ కాగా.. ఫ్రీ హిట్‌ను ఫోర్‌గా మలిచిన అభిషేక్ అభిషేక్ భారీ సిక్సర్👉ఐదో బంతికి సిక్సర్ బాదిన అభిషేక్వైభవ్ వరుస సిక్సర్లు👉రెండో ఓవర్ రెండో బంతికి సాద్ మసూద్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన వైభవ్👉మూడో బంతిని కూడా సిక్సర్‌గా మలిచిన వైభవ్తొలి ఓవర్లో భారత్ స్కోరు: 4-0సయీబ్ ఆయుబ్ బౌలింగ్‌లో వైభవ్ రెండు సింగిల్స్, అభిషేక్ ఒక సింగిల్ తీశారు. వైడ్ రూపంలో ఒక పరుగు వచ్చింది.నో షేక్హ్యాండ్తొలి సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్.. రెండో సెమీస్ మ్యాచ్‌లో శ్రీలంకను టీమిండియా ఓడించి పసిడి పతక పోరుకు అర్హత సాధించాయి. ఇక టాస్ సందర్భంగా ఆసియా కప్-2025, టీ20 ప్రపంచకప్-2026 నాటి ఘటనే పునరావృతమైంది. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాక్ సారథి సాహిబ్జాదా ఫర్హాన్‌తో కరచాలనం చేయలేదు.ఇదిలా ఉంటే.. శ్రీలంకతో సెమీ ఫైనల్లో ఆడిన తుదిజట్టులో మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగింది. ఫలితంగా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో మరోసారి చోటు దక్కింది. కఠినమైన పిచ్నిశిన్ పిచ్‌పై స్పిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. బ్యాటింగ్ అంత తేలిక కాదని గత మ్యాచ్‌ల ద్వారా ఇప్పటికే నిరూపితమైంది. అయితే, సెమీస్‌లో భారత పేసర్ బుమ్రా కూడా ఇక్కడ రాణించడం సానుకూల అంశం. ఇక తుదిజట్టులోస్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, స్పెషలిస్టు రవి బిష్ణోయితో పాటు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి పార్ట్‌టైమ్ స్పిన్నర్లు కూడా ఉన్నారు.తుదిజట్లుభారత్వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, జస్ప్రీత్ బుమ్రా.పాకిస్తాన్సాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), మాజ్ సదాకత్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), సయీమ్ ఆయుబ్, హసన్ నవాజ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అహ్మద్ దనియాల్, సాద్ మసూద్, అబ్రార్ అహ్మద్, సూఫియాన్ మొకీమ్. -
‘అది వైభవ్‌కు.. క్రికెట్‌కు ఏమాత్రం మంచిది కాదు’
వైభవ్ సూర్యవంశీ.. భారత అండర్-19 జట్టు, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున సత్తా చాటి పదిహేనేళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ఈ చిచ్చర పిడుగు. యూత్ వన్డే, టీ20, టెస్టుల్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి.. ఐపీఎల్‌లోనూ శతకాల మోత మోగించాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్.ఇంపాక్ట్ ప్లేయర్గాఇక ఈ ఏడాది ఐపీఎల్లో ఏకంగా 237కు పైగా స్ట్రైక్‌రేటుతో 776 పరుగులు సాధించిన వైభవ్ సూర్యవంశీ. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అయితే, 2026 సీజన్లో వైభవ్ ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు. ఫీల్డింగ్ సమయంలో బౌలర్లతో రాయల్స్ యాజమాన్యం అతడి స్థానాన్ని భర్తీ చేసేది.అది వైభవ్‌కు.. క్రికెట్‌కు ఏమాత్రం మంచిది కాదుఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కారణంగా వైభవ్ సూర్యవంశీ ఈసారి ఐపీఎల్లో చాలా తక్కువసార్లు మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు. అతడికి ఇప్పుడు కేవలం పదిహేనేళ్లే.ఇప్పటి నుంచే కేవలం బ్యాటింగ్‌కు పరిమితమై.. ఫీల్డింగ్‌కు తరచుగా దూరంగా ఉండటం.. అతడితో పాటు క్రికెట్‌కు కూడా ఎంతమాత్రం సరికాదు. ఈ ఏడాది శివం దూబే విషయంలోనూ ఇదే జరిగింది’’ అని బద్రీనాథ్ పేర్కొన్నాడు.కాగా గతేడాది ఐపీఎల్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఇప్పటికి 23 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని కేవలం రెండు క్యాచ్‌లు మాత్రమే అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కొనసాగించే విషయంలో అభిప్రాయాలు చెప్పాలని బీసీసీఐ ఇటీవల ఫ్రాంఛైజీలను కోరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఫామ్ కోల్పోతే పరిస్థితి ఏమిటి?ఇక టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్.. వైభవ్ సూర్యవంశీ విషయంలో బద్రీనాథ్ అభిప్రాయంతో ఏకీభవించాడు. ‘‘ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల మంచి వినోదం దొరుకుతున్న మాట వాస్తవమే. కానీ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు మైదానంలోకి ఫీల్డింగ్ చేయకపోవడం సరికాదు.ఎంతకాలం అతడు కేవలం బ్యాటింగ్ అనే నైపుణ్యంపై మాత్రమే ఆధారపడి జట్టుతో కొనసాగుతాడు. ఒకవేళ ఫామ్ కోల్పోతే అతడి పరిస్థితి ఏమిటి?.. అందుకే అతడు దులిప్ ట్రోఫీలో ఇటీవల బౌలింగ్ చేయడం కూడా మొదలుపెట్టాడు.ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్లో ఒక్క నైపుణ్యం మాత్రమే ఉంటే సరిపోదు. కచ్చితంగా ఫీల్డింగ్ చేయాల్సిందే’’ అని ఆర్. శ్రీధర్ పేర్కొన్నాడు. కాగా దులిప్ ట్రోఫీ-2026 రెడ్‌బాల్ టోర్నీలో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. లెఫ్టార్మ్ స్పిన్‌తో రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతడు ఆసియా క్రీడలు-2026 టీ20 టోర్నీతో బిజీగా ఉన్నాడు.చదవండి: IND vs WI: మూడో వన్డే.. అతడికి నో!.. ఆ ఇద్దరికి చోటివ్వాలి! -
సెమీఫైనల్లో ఇషాన్-వైభవ్ ఊచకోత!
-
Asian Games Cricket: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్
ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 క్రికెట్లో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ బ్యాట్ ఝులిపించాడు. జపాన్ వేదికగా శ్రీలంకతో గురువారం నాటి సెమీ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో జట్టును ఆదుకున్నాడు. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై సహచరులంతా పెవిలియన్‌కు వరుస కట్టినా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ మాత్రం మొక్కవోని ఆత్మవిశ్వాసంతో రాణించాడు.భారీ అర్ధ శతకంఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ 46 బంతులు ఎదుర్కొని.. నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 80 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడి తోడు యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (21 బంతుల్లో 38) రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది.Pocket Dynamo's6️⃣“IN HIS ARC, AND IT’S OUT OF THE PARK!” 🚀Watch India vs Sri Lanka, Men’s Cricket Semi-Final 2, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames #AichiNagoya2026 #BaarBaarBharatHarBaarBharat pic.twitter.com/9KOtrjxmLL— Sony Sports Network (@SonySportsNetwk) October 1, 2026సరికొత్త చరిత్ర ఇదిలా ఉంటే.. శ్రీలంకతో సెమీ ఫైనల్ సందర్భంగా.. అర్ధ శతక వీరుడు ఇషాన్ కిషన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో భారత జట్టు తరఫున ఐదు లేదంటే అంతకంటే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు.అంతర్జాతీయ టీ20లలో ఐదు లేదంటే అంతకంటే లోయర్ ఆర్డర్లో వచ్చి అత్యధిక స్కోరు సాధించిన భారత క్రికెటర్లు👉ఇషాన్ కిషన్- 80 (నాటౌట్)- శ్రీలంక మీద 2026లో నిశిన్, జపాన్ వేదికగా👉మనీశ్ పాండే- 79 (నాటౌట్)- సౌతాఫ్రికా మీద 2018లో, సెంచూరియన్, సౌతాఫ్రికా వేదికగా👉యువరాజ్ సింగ్- 77 (నాటౌట్)- ఆస్ట్రేలియా మీద 2013లో, రాజ్‌కోట్, భారత్ వేదికగా👉హార్దిక్ పాండ్యా- 71 (నాటౌట్)- ఆస్ట్రేలియా మీద 2022లో, మొహాలీ, భారత్ వేదికగా👉రింకూ సింగ్- 69 (నాటౌట్)- అఫ్గానిస్తాన్ మీద 2024లో బెంగళూరు, భారత్ వేదికగా👉రింకూ సింగ్- 68 (నాటౌట్)- సౌతాఫ్రికా మీద 2023లో గెబెర్హ, సౌతాఫ్రికా వేదికగా.చదవండి: IND vs WI ODI: ఇది అసలు క్రికెట్ కానే కాదు: మండిపడ్డ గంభీర్ -
Semi Final: వైభవ్ మెరుపులు.. ఇషాన్ కిషన్ విధ్వంసకర ఇన్నింగ్స్
జపాన్ వేదికగా శ్రీలంకతో సెమీ ఫైనల్లో ఆరంభంలో తడబడ్డ టీమిండియా ఆ తర్వాత తిరిగి పుంజుకుంది. ఓపెనర్ వైభవ్ సూర్యంశీ మెరుపులకు తోడు.. ఐదో నంబర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దంచికొట్టడంతో మెరుగైన స్కోరు సాధించగలిగింది. ఆదిలోనే ఎదురుదెబ్బలుఆసియా క్రీడలు- 2026 పురుషుల టీ20 క్రికెట్ టోర్నీలో భాగంగా రెండో సెమీ ఫైనల్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లలో అభిషేక్ శర్మ (3 బంతుల్లో 7) వచ్చీ రాగానే పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ (9 బంతుల్లో 7) కూడా విఫలమయ్యాడు.అంతా ఫెయిల్అయితే, మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపులు మెరిపించాడు. మొత్తంగా 21 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 38 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (13 బంతుల్లో 13)తో పాటు.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (13 బంతుల్లో 8), వైస్ కెప్టెన్ తిలక్ వర్మ (4 బంతుల్లో 2), ఆల్‌రౌండర్ శివం దూబే (9 బంతుల్లో 3) పెవిలియన్‌కు వరుస కట్టారు.𝐅𝐄𝐀𝐑𝐋𝐄𝐒𝐒. 𝐅𝐋𝐀𝐌𝐁𝐎𝐘𝐀𝐍𝐓. 𝐕𝐀𝚰𝐁𝐇𝐀𝐕! 🚀The teenage sensation turns on the heat in the Men's Cricket Semi-Final at Aichi-Nagoya 2026 🔥Watch India vs Sri Lanka, Men’s Cricket Semi-Final 2, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/DPlqKERcbu— Sony Sports Network (@SonySportsNetwk) October 1, 2026ఆదుకున్న ఇషాన్ఓవైపు వికెట్లు పడుతున్నా ఐదో నంబర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మాత్రం నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. కేవలం 46 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 80 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (3 బంతుల్లో 7 నాటౌట్) తోడుగా నిలిచాడు. Pocket Dynamo's6️⃣“IN HIS ARC, AND IT’S OUT OF THE PARK!” 🚀Watch India vs Sri Lanka, Men’s Cricket Semi-Final 2, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames #AichiNagoya2026 #BaarBaarBharatHarBaarBharat pic.twitter.com/9KOtrjxmLL— Sony Sports Network (@SonySportsNetwk) October 1, 2026లంక లక్ష్యం 170ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్లు తరిందు రత్ననాయకె, కెప్టెన్ సహాన్ అరాచిగే చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. వనుజ సహాన్, లసిత్ క్రూస్‌పుల్లె, నువానిదు ఫెర్నాండో తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.చదవండి: ఇది అసలు క్రికెటే కాదు.. రికార్డుల కోసం మాత్రమేనా?: గంభీర్ అసహనం -
Asian Games Cricket: సెమీ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపులు
ఆసియా క్రీడలు- 2026 పురుషుల టీ20 క్రికెట్ టోర్నీ సెమీ ఫైనల్ సందర్భంగా.. టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ.. చాన్నాళ్ల తర్వాత తుదిజట్టులోకి వచ్చాడు. జపాన్ వేదికగా శ్రీలంకతో గురువారం నాటి మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు.అభిషేక్, సంజూ విఫలంతొలి ఓవర్లో లంక స్పిన్నర్ తరిందు రత్ననాయకె బంతితో రంగంలోకి దిగగా వైభవ్.. ఆఖరి బంతికి ఫోర్ బాది ఖాతా తెరిచాడు. రెండో ఓవర్లో సహానే అరాచిగే బౌలింగ్‌లో దూకుడుగా ఆడే ప్రయత్నంలో అభిషేక్ (3 బంతుల్లో 7) పెవిలియన్ చేరాడు.ఈ క్రమంలో వైభవ్‌కు సంజూ శాంసన్ తోడయ్యాడు. అయితే, మూడో ఓవర్ ఆఖరి బంతికే సంజూ (7) తరిందు బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి రాగా.. వైభవ్ కాస్త దూకుడు పెంచాడు. నాలుగో ఓవర్లో చివరి రెండు బంతులకు వరుసగా ఫోర్లు బాది టచ్‌లోకి వచ్చాడు.వైభవ్ ధనాధన్... 4,6,4ఇక ఐదో ఓవర్లో తరిందుకు వైభవ్ చుక్కలు చూపించాడు. ఆఖరి మూడు బంతుల్లో వరుసగా 4,6,4 లతో చెలరేగాడు. అయితే, ఆరో ఓవర్లో బినుర ఫెర్నాండో తొలుత ఇబ్బంది పెట్టినా.. ఐదో బంతికి వైభవ్ సిక్సర్ బాది అతడిని పనిష్ చేశాడు. ఈ లెఫ్టాండర్ ఓపెనర్ మెరుపుల కారణంగా భారత్ పవర్ ప్లే (తొలి ఆరు ఓవర్లు)లో రెండు వికెట్ల నష్టానికి 58 పరుగుల మేర మెరుగైన స్కోరు చేయగలిగింది.ఊహించని షాక్ అయితే, ఏడో ఓవర్లోనూ దూకుడు కొనసాగించాలని చూసిన వైభవ్ సూర్యవంశీకి ఊహించని షాక్ తగిలింది. లంక కెప్టెన్, స్పిన్నర్ సహాన్ అరాచిగే రెండో బంతికి వైభవ్‌ను ఊరించగా.. భారీ షాట్‌కు యత్నించిన ఈ పదిహేనేళ్ల పిల్లాడు బంతిని గాల్లోకి లేపాడు. ఇంతలో సినేత్ జయవర్దెనె ఊహించని రీతిలో లో క్యాచ్ అందుకోగా.. వైభవ్ మెరుపులకు తెరపడింది. ఇదిలా ఉంటే.. పది ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్లు నష్టపోయి కేవలం 88 పరుగులే చేయగలిగింది. లంక స్పిన్నర్ల ధాటికి అభిషేక్ శర్మ (7), సంజూ శాంసన్ (7), శ్రేయస్ అయ్యర్ (13) చేతులెత్తేయగా.. వైభవ్ మాత్రం ఫర్వాలేదనిపించాడు. మొత్తంగా 21 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 38 పరుగులు రాబట్టాడు. దూకుడుగా ఆడే క్రమంలోవ్యూహం బెడిసి కొట్టి అర్ధ శతకం కూడా అందుకోకుండానే వైభవ అవుటయ్యాడు.UPDATE: IND vs SL వైభవ్ మెరుపులు.. ఇషాన్ కిషన్ విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత్ స్కోరెంతంటే?చదవండి: ఇది అసలు క్రికెటే కాదు.. రికార్డుల కోసం మాత్రమేనా?: గంభీర్ అసహనం 𝐅𝐄𝐀𝐑𝐋𝐄𝐒𝐒. 𝐅𝐋𝐀𝐌𝐁𝐎𝐘𝐀𝐍𝐓. 𝐕𝐀𝚰𝐁𝐇𝐀𝐕! 🚀The teenage sensation turns on the heat in the Men's Cricket Semi-Final at Aichi-Nagoya 2026 🔥Watch India vs Sri Lanka, Men’s Cricket Semi-Final 2, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/DPlqKERcbu— Sony Sports Network (@SonySportsNetwk) October 1, 2026 -
టీమిండియా బ్యాటింగ్.. తుది జట్టులో వైభవ్
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భాగంగా ఇవాళ జరుగుతున్న రెండో సెమీఫైనల్లో భారత్, శ్రీలంక తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత తరఫున చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వచ్చాడు. అలాగే జపాన్‌తో జరిగిన ఏకైక టీ20కి విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తుది జట్టులోకి వచ్చాడు. వైభవ్ తుది జట్టులోకి రావడంతో రెగ్యులర్ ఓపెనర్ సంజూ శాంసన్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), శ్రేయాస్ అయ్యర్(c), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రాశ్రీలంక (ప్లేయింగ్ XI): లసిత్ క్రూస్పుల్లే, సినెత్ జయవర్దన, సోహన్ డి లివెరా(w), అషెన్ బండార, సహన్ అరాచ్చిగే(సి), నువానీడు ఫెర్నాండో, చమిక కరుణరత్నే, వనుజా సహన్, విజయకాంత్ వియాస్కాంత్, తరిందు రత్నాయకే, బినుర ఫెర్నాండోఫైనల్స్కు పాక్ఇవాళ జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి పాక్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆ మ్యాచ్‌లో ఓడిన బంగ్లాదేశ్‌కు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం ఉంది. భారత్-శ్రీలంక మ్యాచ్ విజేత పాకిస్తాన్‌తో ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటే, ఓడిన జట్టు బంగ్లాదేశ్‌తో కాంస్యం కోసం పోటీపడుతుంది.ఇదీ చదవండి: Asian Games Men's Cricket: ఫైనల్స్‌కు పాకిస్తాన్ -
చెమట చిందిస్తూ.. కండలు చూపిస్తూ తిలక్ వర్మ (ఫొటోలు)
-
వైభవ్ రూపంలో వారికి ప్రమాదం పొంచి ఉంది..!
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరో ఆరు నెలల్లోనే సూర్యవంశీ భారత టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. అదే జరిగితే తిలక్ వర్మ లేదా శివమ్ దూబేలో ఒకరు తుది జట్టులో చోటు కోల్పోవాల్సి వస్తుందని చెప్పాడు.ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన సూర్యవంశీ.. జింబాబ్వే పర్యటనలో సత్తా చాటాడు. అయితే ప్రస్తుతం అతడు తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. త్వరలోనే పరిస్థితి మారుతుందని కైఫ్ అంచనా వేశాడు."తిలక్ జట్టుకు వైస్ కెప్టెన్ అని తెలుసు. కానీ గతంలో వైస్ కెప్టెన్లు కూడా జట్టు నుంచి తప్పించబడ్డ సందర్భాలు ఉన్నాయి. శివమ్ దూబే ప్రతి మ్యాచ్‌లోనూ పరుగులు చేయడం లేదు. అతడు ఇంకా మెరుగుపడాలి. అతడికి ఫీల్డింగ్ బలహీనత కూడా ఉంది. అతడు పూర్తి స్థాయి బౌలింగ్ ఆల్‌రౌండర్ కూడా కాదు.మరో ఆరు నెలల్లో తిలక్ లేదా దూబేలో ఒకరు జట్టు నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. వారి స్థానంలో సూర్యవంశీ తుది జట్టులోకి వస్తాడు" అని కైఫ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తిలక్, దూబేకు వార్నింగ్ ఇచ్చాడు.ఇక్కడ కైఫ్ వార్నింగ్‌లో అర్దముంది. ఎందుకంటే తిలక్, దూబే ఇటీవలికాలంలో పెద్దగా రాణించలేకపోతున్నారు. 2025, 2026లో తిలక్ వర్మ స్ట్రైక్‌రేట్ 129, 143గా మాత్రమే ఉంది. అతడు పెద్దగా స్కోర్లు కూడా చేయలేదు. దూబే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అతడి బ్యాటింగ్‌లో నిలకడగా రాణించాల్సి ఉంది. బౌలింగ్‌లోనూ అతడి ఎకానమీ రేట్ 11.33కు చేరింది. ఒకవేళ సూర్యవంశీ బౌలింగ్‌లో మరింత మెరుగైతే.. దూబే స్థానానికి ప్రమాదం తప్పదు. ఇదీ చదవండి: 'కోహ్లితో నాకేంటి?.. నా ఆటయితే పూర్తి కాలేదు' -
వాళ్లిద్దరిలో ఒకరిపై వేటు.. వైభవ్ సూర్యవంశీకి లైన్ క్లియర్!
టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ.. గత కొన్నాళ్లుగా బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు. జింబాబ్వే పర్యటనలో అదరగొట్టినప్పటికీ.. ఈ పదిహేనేళ్ల పిల్లాడిని యాజమాన్యం వరుస మ్యాచ్‌లలో పక్కనపెట్టింది. స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా సంజూ శాంసన్ తిరిగి రాగా.. వైభవ్‌పై వేటు పడింది.సంజూ కోసం తప్పదువైభవ్ సూర్యవంశీ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ ప్రపంచకప్ వీరుడు సంజూ కోసం అతడిని పక్కనపెట్టక తప్పదని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తుదిజట్టులో చోటు కోసం మరికొన్నాళ్లు చూడాల్సిందేనని కుండబద్దలు కొట్టాడు.ఈ నేపథ్యంలో జపాన్‌తో ఏకైక టీ20 మ్యాచ్‌లోనూ వైభవ్ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం భారత టీ20 జట్టు ఆసియా క్రీడలు-2026 టోర్నీ కోసం జపాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ర్యాంకింగ్స్ ఆధారంగా టీమిండియా ఈ ఈవెంట్లో నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.అయితే, ఈసారి కూడా వైభవ్ సూర్యవంశీకి మొండిచేయి చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ ఉన్నప్పటికీ త్వరలోనే ఈ బిహారీ పిల్లాడు కూడా తుదిజట్టులోకి వస్తాడని అంచనా వేశాడు.వాళ్లిద్దరిలో ఒకరిని తప్పిస్తే వైభవ్‌కు లైన్ క్లియర్! ఇందుకోసం తిలక్ వర్మ లేదంటే శివం దూబేను యాజమాన్యం పక్కనపెట్టాల్సి ఉంటుందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘తిలక్ వైస్ కెప్టెన్ అన్న సంగతి నాకూ తెలుసు. అయితే, గతంలో వైస్ కెప్టెన్‌ను కూడా తుదిజట్టు నుంచి తప్పించిన దాఖలాలు ఉన్నాయి.మరోవైపు.. శివం దూబే. అతడి ఆటలో నిలకడ లేదు. ఫీల్డింగ్‌లో కూడా బలహీనంగా ఉన్నాడు. అతడు సరైన బౌలింగ్ ఆల్‌రౌండర్ కూడా కాదు. కేవలం బ్యాటర్‌గానే తుదిజట్టులో ఉంటున్నాడు. కాబట్టి ఆరు నెలల తర్వాత తిలక్ లేదంటే దూబే తుదిజట్టు నుంచి కనుమరుగు కావడం ఖాయం.వీరిద్దరిలో ఒకరిని తప్పించి వైభవ్‌కు మార్గం సుగమం చేస్తారనుకుంటున్నా. నా ప్రస్తుత అభిప్రాయం. ఆసియా క్రీడల్లో వైభవ్‌ను తప్పక ఆడించాలి. బౌలర్ యశ్ ఠాకూర్‌కు ఇంకా తనను తాను పూర్తిగా నిరూపించుకోలేదు. కాబట్టి అతడిని పక్కనపెట్టవచ్చు’’ అని కైఫ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఓపెనింగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 6 మ్యాచ్‌లు ఆడి 193 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: వెస్టిండీస్ కెప్టెన్ ప్రపంచ రికార్డు -
ఆ రాత్రి నిద్రపోలేదు.. మళ్లీ అదే మాట.. కుండబద్దలు కొట్టిన గంభీర్
‘‘ఇప్పటి వరకు నా రెండేళ్ల కోచింగ్ కెరీర్లో ఆ రాత్రి నాకు నిద్రపట్టనేలేదు. సంజూకు నేను ఇదే విషయం చెప్పాను. కోచ్‌గా నేను తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం ఇదేనని అన్నాను.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ప్లేయర్ ఆఫ్ టోర్నీగా నిలిచిన ఆటగాడిని.. ఆ మెగా ఈవెంట్ తర్వాత మూడు, నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడించి పక్కనపెట్టడం సాధారణ విషయం కాదు. అందుకు వైభవ్ సూర్యవంశీ ఫామ్ ప్రధాన కారణమని చెప్పవచ్చు.సంజూ అర్థం చేసుకున్నాడుసిరీస్ గెలవాలన్న లక్ష్యం ఒక్కటే కళ్ల ముందు మెదిలింది. అందుకోసం మార్పులకు కూడా సిద్ధపడ్డాము. కోచ్‌గా ప్రతి ఒక్కరికి ప్రతీ సిరీస్ గెలవడమే ప్రధాన లక్ష్యం. నేను కూడా అంతే. ఆరోజు సంజూతో నేను నిజాయితీగా.. మనసు విప్పి మాట్లాడాను. వైభవ్ లాంటి ఫామ్‌లో ఉన్న ఆటగాడిని జట్టులోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించాను.సంజూ అర్థం చేసుకున్నాడు. అతడు జట్టు గురించి మాత్రమే ఆలోచించాడు. అది చాలా మంచి విషయం. ఏదేమైనా వైభవ్ లాంటి యువ ఆటగాళ్లు తుదిజట్టులో చోటు కోసం ఎదురుచూడక తప్పదు. వైభవ్‌కు అర్థమయ్యేలా చెప్పానుమంచి ఫామ్‌లో ఉన్నా సరే.. సుదీర్ఘకాలంగా జట్టుకు సేవలు అందిస్తున్న ఆటగాళ్ల కోసం కొన్నిసార్లు త్యాగం చేయాల్సి ఉంటుందని.. అవకాశం వచ్చే వరకు ఎదురుచూడాలని వైభవ్‌కు అర్థమయ్యేలా చెప్పాను’’ అని టీమిండియా హెడ్‌కోచ్ కోచ్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు.మళ్లీ అదే మాట.. కుండబద్దలు కొట్టిన గంభీర్ఇంగ్లండ్ పర్యటనలో ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ను పక్కనపెట్టి.. పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీని ఆడించడం తన కోచింగ్ కెరీర్లో తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయమని గంభీర్ పునరుద్ఘాటించాడు. ఏదేమైనా వైభవ్ మరికొంతకాలం బెంచ్‌కే పరిమితకాక తప్పదని మరోసారి కుండబద్దలు కొట్టాడు. వెస్టిండీస్‌తో టీమిండియా సిరీస్ ఆరంభానికి ముందు జియోస్టార్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.ఘోర పరాభవంకాగా యూకే పర్యటనలో భారత టీ20 జట్టుకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. తొలుత పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ అయిన టీమిండియా.. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్‌వాష్ అయింది.ఇక ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో తొలి టీ20లో విఫలమైన సంజూను పక్కనపెట్టిన యాజమాన్యం.. ఇంగ్లండ్‌తో రెండో టీ20 సందర్భంగా వైభవ్‌ను అరంగేట్రం చేయించింది. అయితే, అతడు వరుసగా విఫలం కావడంతో మళ్లీ ఐదో టీ20లో సంజూను ఆడించింది.వైభవ్ బెంచ్‌కే పరిమితంఆ తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లగా.. సంజూకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చి.. అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా వైభవ్‌ను దించారు. జింబాబ్వే మీద విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అయితే, ఆ తర్వాత స్వదేశంలో ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో సంజూ ఆడగా.. వైభవ్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు.చదవండి: సెహ్వాగ్ కొడుకు మెరుపులు.. కెప్టెన్ సెంచరీ! ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ -
బుడ్డోడికి పోటీగా మరో యంగ్ సెన్సేషన్.. ఎవరీ యశ్..?
-
కోహ్లి, ధోనీ, డివిలియర్స్ వేస్ట్.. సూర్యకుమార్ యాదవ్ సంచలన కామెంట్స్
-
డబుల్ సెంచరీ పక్కా జపాన్ తో మ్యాచ్ కు వైభవ్ ఎంట్రీ ?
-
పాపం వైభవ్ సూర్యవంశీ.. మరో'సారీ'
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి తుది జట్టులో చోటు దక్కలేదు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో పూర్తిగా బెంచ్‌కే పరిమితమైన ఈ యువ బ్యాటర్.. ఇప్పుడు జపాన్‌తో జరుగుతున్న చారిత్రక మ్యాచ్‌కూ దూరమయ్యాడు. ప్రస్తుతం వైభవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, జట్టు యాజమాన్యం మాత్రం సీనియర్ ప్లేయర్ సంజూ శాంసన్‌కే ఓపెనర్‌గా మొగ్గు చూపింది. సీనియర్లకే ప్రాధాన్యత ఇస్తామని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇదివరకే స్పష్టం చేయడంతో సూర్యవంశీకి నిరాశే మిగిలింది.మరోవైపు, ఈ మ్యాచ్ నుంచి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక మైదానం తడిగా ఉండటంతో మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.తుది జట్లుఇండియా: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, యశ్ రవిసింగ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్జపాన్: కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ (కెప్టెన్), లాచ్లాన్ యమమోటో-లేక్, వటారు మియౌచి, అలెగ్జాండర్ షిరాయ్-పాట్మోర్ (వారం), చార్లీ హింజ్, రియో సకురానో-థామస్, బెంజమిన్ ఇటో-డేవిస్, ఇబ్రహీం తకాహషి, డెక్లాన్ మకో మకో మటోమ్, టాక్లాన్ సుజ్మాచదవండి: చరిత్ర సృష్టించి టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
జపాన్ జట్టులో బీహార్ క్రికెటర్.. ‘వైభవ్ నా ఫేవరెట్ ప్లేయర్’
జపాన్, టీమిండియా మధ్య చారిత్రక టీ20 మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. రేపు జపాన్‌లోని సానో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జపాన్ జట్టులో భారత్‌కు చెందిన బీహార్ క్రికెటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీ తన ఫేవరెట్ అని పేర్కొన్న అభిషేక్ ఆనంద్.. తన బీహారీ సోదరులైన వైభవ్, ఇషాన్ కిషన్‌ను కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు మనసులో మాటను బయటపెట్టాడు.అభిషేక్ మాట్లాడుతూ.."ప్రస్తుతం అందరి ఫేవరెట్ వైభవ్ సూర్యవంశీ. అయితే భారత జట్టులోని ఆటగాళ్లందరూ గొప్పవారే. కానీ, నా బీహారీ సోదరులైన ఇషాన్ కిషన్, వైభవ్‌లను కలిసే అవకాశం వస్తే అస్సలు వదులుకోను. భారత జట్టుకు ఆతిథ్యం ఇవ్వడానికి మేం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ మ్యాచ్ జరగడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మేం కూడా రాణించాలంటే భారత్-జపాన్ మధ్య బంధం మరింత బలంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని వెల్లడించాడు.జాబ్ కోసం జపాన్ వచ్చి..అభిషేక్ ఆనంద్ కథ ఎంతో స్ఫూర్తిదాయకం. క్రికెట్‌పై ప్రేమ ఉన్నప్పటికీ, భవిష్యత్తు కోసం అతను ఉద్యోగ మార్గాన్ని ఎంచుకున్నాడు. బీహార్‌లో పుట్టి పెరిగిన అభిషేక్ ఐఐటీ కాన్పూర్‌లో చదివాడు. అనంతరం క్యాంపస్ ప్లేస్మెంట్లో అతనికి ప్రముఖ కంపెనీ 'యాక్సెంచర్ జపాన్' నుంచి భారీ ప్యాకేజీతో ఉద్యోగావకాశం వెతుక్కుంటూ వచ్చింది. యాక్సెంచర్ ఇంటర్వ్యూ పూర్తయ్యాకా ఆఫర్‌ను స్వీకరించాలా? వద్దా? అని నిర్ణయించుకోవడానికి కంపెనీ యాజమాన్యం అతడికి కేవలం 2 గంటల సమయం మాత్రమే ఇచ్చారు.అయితే మరోవైపు క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అభిషేక్ ఆనంద్..తనకు నచ్చిన జాబ్ వదులుకోవడం ఇష్టంలేదు. ఆ సమయంలో జపాన్‌లో క్రికెట్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో వెతికాడు. అదృష్టవశాత్తూ, సరిగ్గా అదే ఏడాది జపాన్ జట్టు ఈస్ట్ ఆసియా-పసిఫిక్ వరల్డ్ కప్ క్వాలిఫయర్‌కు అర్హత సాధించినట్లు వార్తలు కనిపించాయి. ఆ వార్తను చూశాక జపాన్‌లో కూడా క్రికెట్‌కు భవిష్యత్తు ఉంటుందని అభిషేక్ ఒక భావనకు వచ్చాడు. రెండు గంటల సుదీర్ఘ పరిశోధన తర్వాత యాక్సెంచర్ ఆఫర్‌ను అంగీకరించి జపాన్‌కు వచ్చాడు.జపాన్‌కు వచ్చిన తర్వాత అభిషేక్ యాక్సెంచర్‌లో జాబ్ చేస్తూనే క్రికెటర్‌గా రాణించాడు. 'టోక్యో ఫాల్కన్ క్రికెట్ క్లబ్' తరఫున ఆడటం ప్రారంభించాడు. తొలి మూడేళ్లలో నిలకడగా రాణించడంతో అతనికి జపాన్ జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. 11 మ్యాచ్‌లాడి 564 పరుగులు సాధించాడు. అలా ఉద్యోగం కోసం పరాయి దేశానికి వచ్చి, తన కలల క్రీడలో జాతీయ స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు అదే దేశంలో తన సొంత రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లను కలవాలని ఆశిస్తున్నాడు. ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలకు సంబంధించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా జపాన్, టీమిండియా ప్రత్యేక మ్యాచ్ ఆడనున్నాయి. ఇప్పటికే చారిత్రక మ్యాచ్ ఆడేందుకు టీమిండియా జపాన్‌లో అడుగుపెట్టింది.Abhishek Anand, 28.Rohtas, Bihar → IIT Kanpur (Chemistry, captained the college team) → Tokyo job → Japan T20Is.T20I debut: vs Cook Islands, May 9, 202518 T20Is | 275 runs | HS 55 | 1 wicketHow he got thereCampus placement (Accenture Japan). Interview line: he wanted to… pic.twitter.com/VtRxH3Vp5m— Cricket Hub (@Anurag9793) September 21, 2026 🚨 A Bihari will play for Japan against India at the Asian Games! 🇯🇵🇮🇳Meet Abhishek Anand from Rohtas, Bihar. He moved from India to Japan for work, started playing local cricket and eventually earned a place in Japan’s national team.He says, “I look like a Japanese player… pic.twitter.com/sM2HQCzDBi— Elysium (@CricketElysium) September 19, 2026ఇదీ చదవండి: సీఎస్కే హెడ్‌కోచ్‌గా జహీర్ ఖాన్ -
జపాన్‌తో చారిత్రక టీ20.. వైభవ్ ఇన్! సంజూ అవుట్?
ఏషియన్ గేమ్స్ 2026 మెన్స్ క్రికెట్ పోటీల ఆరంభానికి ముందు ఆతిథ్య జపాన్‌తో ఏకైక టీ20 మ్యాచ్‌లో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. భారత్-జపాన్ దేశాల మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాలను పురస్కరించుకుని మంగళవారం సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ చారిత్రక మ్యాచ్ జరగనుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే జపాన్‌కు చేరుకోగా, ఈ మ్యాచ్‌లో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోందో అంచనా వేద్దాం.వైభవ్ సూర్యవంశీ రిటర్న్?అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కవచ్చు. అఫ్గాన్ సిరీస్‌లో మంచి ఫామ్‌లో రాణించిన సంజూ శాంసన్‌కు ఏషియన్ గేమ్స్‌కు ముందు విశ్రాంతి ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ శాంసన్‌కు రెస్ట్ ఇస్తే వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు.బౌలింగ్ విభాగంలో మార్పులుఏషియన్ గేమ్స్ దృష్ట్యా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతని స్థానంలో యశ్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20కి దూరమైన ప్రధాన పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రానున్నాడు. ఈ మార్పులు మినహా అఫ్గానిస్థాన్ సిరీస్‌లో ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.భారత తుది జట్టు( అంచనా) వైభవ్ సూర్యవంశీ / సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, యష్ ఠాకూర్.చదవండి: IND: జపాన్, లంక, ఆసీస్‌తో.. రేపు రెండు టీ20లు, ఒక ‘టెస్టు’! -
IND vs JPN T20I: జట్లు, టైమింగ్, ప్రత్యక్ష ప్రసారం.. వివరాలు ఇవే
ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు టీమిండియా జపాన్‌తో ఏకైక టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య మంగళవారం (సెప్టెంబరు 22) జరిగే ఈ మ్యాచ్‌కు సనో అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదిక. కాగా భారత్- జపాన్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో తలపడటం ఇదే మొదటిసారి కావడం విశేషం.క్రీడల అభివృద్ధికి సహకారాన్ని ఆశిస్తూభారత్- జపాన్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఇరుదేశాల పురుష క్రికెట్ జట్ల మధ్య ఈ మేరకు ఏకైక టీ20 మ్యాచ్ నిర్వహణకు సన్నాహకాలు చేశారు. ‘స్పోర్ట్-75’ పేరుతో రూపొందుతున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఇరుదేశాల మధ్య క్రీడల అభివృద్ధికి సహకారాన్ని ఆశిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇక జపాన్‌తో జరిగే ఏకైక టీ20కి శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే సిద్ధమైంది. మరోవైపు జపాన్ సైతం ప్రపంచ చాంపియన్ టీమిండియాతో పోటీ పడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఈ మ్యాచ్‌కు సంబంధించిన జట్లు, ఆరంభ సమయం, ప్రత్యక్ష ప్రసారం తదితర వివరాలు తెలుసుకుందామా?!టీమిండియా వర్సెస్ జపాన్.. ఏకైక టీ20 మ్యాచ్వేదిక: సనో అంతర్జాతీయ క్రికెట్ మైదానంటైమింగ్భారత కాలమానం ప్రకారం మంగళవారం (సెప్టెంబరు 22) ఉదయం 9.30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభంఎక్కడ చూడాలంటే..స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ (టీవీ), ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్సైట్ (డిజిటల్).జట్లు ఇవేభారత్శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, రవి బిష్ణోయి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్.జపాన్కెండెల్ కడోవాకీ ఫ్లెమింగ్ (కెప్టెన్), చార్లీ హరా హింజే, బెంజమిన్ ఇటో-డేవిస్, కొయి కుబోటా, వటారు మియాచి, రియో సకురనో-థామస్, అలెక్స్ శిరాయి-పాట్మోర్, షోమా సుగయా-స్లేటర్, డెక్లాన్ సుజుకి, ఇబ్రహీం తకహషి, మకొటో తానియమా, లచ్లాన్ యమామొటో, అలెస్టెర్ కడోవాకీ-ఫ్లెమింగ్, జేక్ కుసుడ-నైర్, సుయోషి తకడా.చదవండి: ఆసీస్‌పై వీరేందర్ సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ విధ్వంసం -
మరో చరిత్ర సృష్టించనున్న వైభవ్ సూర్యవంశీ..!
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించేందుకు సిద్దంగా ఉన్నాడు. ఏషియన్ గేమ్స్ 2026లో అతడు బరిలోకి దిగితే, ఈ గేమ్స్‌లో పాల్గొనే అన్ని దేశాల సభ్యుల (అథ్లెట్ లేదా క్రికెటర్) కంటే అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పుతాడు.ఏషియన్ గేమ్స్‌లో భారత్ క్రికెట్ జట్టు ఆడబోయే తొలి మ్యాచ్ సమయానికి (సెప్టెంబర్ 29, రెండో క్వార్టర్ ఫైనల్) వైభవ్ వయసు 15 ఏళ్ల 178 రోజులుగా ఉంటుంది. ఇంత కంటే చిన్న వయసు సభ్యుడు ఎవరూ ప్రస్తుత ఆసియా క్రీడల్లో పాల్గొనడం లేదు. మరోవైపు ఈ ఏషియన్ గేమ్స్‌లో అత్యంత పెద్ద వయస్కురాలైన అథ్లెట్ కూడా భారత్ నుంచే బరిలోకి దిగుతుండటం విశేషం. 55 ఏళ్ల 8 నెలల వయసున్న భారత అశ్వ క్రీడాకారిణి శృతి వోరా ఈ ఘనత సాధించారు.కాగా, ఇటీవలికాలంలో వైభవ్ వయసు విషయంలో దాదాపు అన్ని పాత రికార్డులను బద్దలు కొడుతున్నాడు. ఏషియన్ గేమ్స్‌లో కూడా అతడికి తుది జట్టులో చోటు దక్కితే మరో రికార్డు ఖాతాలో వేసుకుంటాడు.అయితే తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. మరి ఏషియన్ గేమ్స్‌లో అయినా అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.ఏషియన్ గేమ్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతుంది. ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైనట్లే. వీరిద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వైభవ్ తుది జట్టు బెర్త్‌పై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రీడల్లో భారత్ గరిష్టంగా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలుగుతుంది. ఏదో ఒక మ్యాచ్‌లో వైభవ్‌కు ఆడే అవకాశం వచ్చినా, ఏషియన్ గేమ్స్ అతి పిన్న వయస్కుడి రికార్డు అతడి ఖాతాలో వచ్చి పడుతుంది. ఇదీ చదవండి: రాజకీయాల్లోకి షమీ..? -
అభిషేక్-వైభవ్.. ఇక్కడ సింహాలు.. అక్కడ పిల్లులు!
టీమిండియా టీ20 ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ- వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై భారత మాజీ ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు ప్రమాదకర బ్యాటర్లు అని.. స్వదేశంలో విధ్వంసకర ఆట తీరుతో విరుచుకుపడుతున్నారని కొనియాడాడు.విదేశీ గడ్డ మీద మాత్రంఅయితే, అదే సమయంలో విదేశీ గడ్డ మీద మాత్రం అభిషేక్- వైభవ్ తేలిపోతున్నారని సందీప్ పాటిల్ ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా అభిషేక్ శర్మ ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం 131 పరుగులే చేశాడు.మరోవైపు.. సంజూ శాంసన్ స్థానంలో తుదిస్థానంలో చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్ గడ్డ మీదే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 42 పరుగులే చేయగలిగాడు.ఇక్కడ సింహాలు.. అక్కడ పిల్లులు!ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ స్పోర్ట్స్నెక్ట్స్తో మాట్లాడుతూ.. ఈ ఇద్దరు లెఫ్టాండర్ బ్యాటర్ల ఆట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అభిషేక్ శర్మ- వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ గురించి నేను ఓ విషయం గమనించాను. ఇండియాకు వెలుపల.. విదేశీ గడ్డపై బాల్ స్వింగ్ అవుతున్న వేళ.. ఇద్దరూ బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బందిపడుతున్నారు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు ఈ సమస్యను అధిగమించే దిశగా ప్రయత్నాలు చేయాలి. లేదంటే.. స్వదేశంలో సింహాలు.. విదేశాల్లో పిల్లుల మాదిరిగా మారిపోతారు. ఇది జరగకూడదు’’ అని సందీప్ పాటిల్ పేర్కొన్నాడు.జింబాబ్వే గడ్డ మీద ఇరగదీసిన వైభవ్ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత టీ20 జట్టు జింబాబ్వే టూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వైభవ్ సూర్యవంశీ.. మూడు టీ20లలో వరుసగా 19 బంతుల్లోనే 50, 9 బంతుల్లోనే 20, 49 బంతుల్లోనే 81 పరుగులతో దుమ్ములేపాడు.ఫలితంగా ఈ సిరీస్‌లో టీమిండియా జింబాబ్వేను 3-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. వైభవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. అయితే, స్వదేశంలో ఇటీవల అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో మాత్రం అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఓపెనర్‌గా సంజూ శాంసన్ తిరిగి రావడంతో వాటర్ బాయ్‌గా సేవలు అందించాడు.అభిషేక్ 30 బంతుల్లోనేమరోవైపు.. అఫ్గాన్‌తో సిరీస్‌లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా మూడో టీ20లో కేవలం 30 బంతుల్లోనే శతక్కొట్టి.. టీ20లలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన టీమిండియా బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ నేపథ్యంలో సందీప్ పాటిల్ అభిషేక్‌పై ప్రశంసలు కురిపిస్తూనే.. ఇదే ఆట తీరు విదేశాల్లోనూ కొనసాగించాలని ఆకాంక్షించాడు.చదవండి: భారత జట్టు హెడ్‌కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ! -
'వైభవ్‌లో ఆ స్కిల్స్ లేవు.. టెస్టు క్రికెట్‌కు సెట్ కాడు'
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్.. భవిష్యత్తులో టెస్టు ఫార్మాట్లో రాణించడానికి ఇబ్బంది పడతాడని పనేసర్ అభిప్రాయపడ్డాడు.అండర్-19 తో పాటు ఐపీఎల్‌లోనూ సంచలన ప్రదర్శన చేసి భారత సీనియర్ జట్టులోకి అడుగు పెట్టిన వైభవ్.. తన అద్భుతమైన ఆటతీరుతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనప్పటికి తుది జట్టులో మాత్రం ఈ చిచ్చర పిడుగుకు చోటు దక్కలేదు. కాగా సూర్యవంశీ కేవలం వైట్‌బాల్ క్రికెట్లోనే కాదు సుదీర్ఘ ఫార్మాట్లోనూ రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్లోనూ ఈస్ట్‌జోన్ తరపున సూర్యవంశీ సత్తాచాటాడు. అంతకుముందు ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన యూత్ టెస్టు సిరీస్‌లోనూ అతడు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికి వైభవ్ టెస్టు క్రికెట్లో విజయవంతం కాలేడని పనేసర్ వ్యాఖ్యనిచండం గమనార్హం."వైభవ్ సూర్యవంశీ టెస్టు క్రికెట్లో సక్సెస్ అవుతాడని నేను అనుకోవడం లేదు. అతడి ఆ స్ధాయికి తగ్గ స్కిల్స్ లేవు. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టెస్టులు, టీ20లు రెండింటిలోనూ టాప్-10లో కొనసాగుతున్న ఏకైక బ్యాటర్ హ్యారీ బ్రూక్ మాత్రమే" అని పనేసర్ పేర్కొన్నాడు.చదవండి: భారత జట్టులో అతడి పేరు చూసి షాకయ్యా! -
బుడ్డోడికి షాక్ ఇచ్చిన గంభీర్.. అప్పటివరకు టీంలో నో ప్లేస్
-
సంజూను పక్కనపెట్టాను.. వైభవ్ వేచి చూడాల్సిందే: గంభీర్
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఢిల్లీ వేదికగా అఫ్గాన్ ఆతిథ్యం ఇచ్చిన మూడు టీ20లలోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. గత సిరీస్‌లో భాగంగా జింబాబ్వేపై టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు.మెరుపు అర్ద శతకాలుఅయినప్పటికీ అఫ్గాన్‌తో సిరీస్‌లో యాజమాన్యం వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టింది. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తిరిగి రావడంతో అభిషేక్ శర్మకు జోడీగా అతడినే ఓపెనర్‌గా కొనసాగించింది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ (10)లో విఫలమైనప్పటికీ మిగిలిన రెండు టీ20లలో సంజూ మెరుపు అర్ధ శతకాల (57, 50)తో దుమ్ములేపాడు.కుండబద్దలు కొట్టిన గంభీర్ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ తుదిజట్టులో చోటు కోసం మరికొన్నాళ్లు వేచి చూడకతప్పని పరిస్థితి నెలకొంది. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించాడు. ‘‘వైభవ్ దృష్టి కోణం నుంచి చూసినప్పటికీ.. అతడు మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉంది.అతడు ఎంతటి ప్రతిభావంతుడో మాకూ తెలుసు. అద్భుతాలు చేయగల సామర్థ్యం అతడికి ఉంది. అయితే, గత కొన్నేళ్లుగా అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లకు తొలి ప్రాధాన్యం దక్కడం సహజం. అలాంటి ప్లేయర్లకు దీర్ఘకాలం అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇక సంజూ శాంసన్ సత్తా ఏమిటో అందరికీ తెలిసిందే. ప్రపంచకప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన ఆటగాడు అతడు. ప్రతిభ లేకుండా ఎవరూ ఈ స్థాయికి చేరుకోలేరు కదా!.. తన శక్తి మేర జట్టు కోసం అతడు పనిచేశాడు.సంజూను పక్కనపెట్టాను.. అదే కఠిన నిర్ణయంఏదేమైనా ఇంగ్లండ్ పర్యటనలో సంజూను తప్పించి వైభవ్‌కు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. నా కోచింగ్ కెరీర్లో ఇదే అత్యంత కఠిన నిర్ణయం అనుకుంటాను. ఐర్లాండ్‌తో సిరీస్‌లో అతడు విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదు.అయితే, కొన్నిసార్లు ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను కొనసాగిస్తాం. మరికొన్నిసార్లు ప్రపంచకప్ వంటి మేజర్ టోర్నీలో సత్తా చాటిన కాంబినేషన్‌ను కొనసాగించాలని భావిస్తాం. రెండు, మూడు మ్యాచ్‌లలో విఫలమైనంత మాత్రాన వారిపై చెత్త ఆటగాళ్లుగా ముద్రవేయలేము.మా జట్టు బాగుందిఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో మాకు చేదు అనుభవం ఎదురైన మాట వాస్తవమే. కానీ గత ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టు.. ఆ తర్వాత వెంటనే మరో వరల్డ్‌కప్ టోర్నీలో టైటిల్ గెలిచిన జట్టు.. ఒకటీ రెండు ఓటముల కారణంగా చెడ్డది అయిపోదు’’ అని గంభీర్ శ్రేయస్ అయ్యర్ సేనను సమర్థించాడు.కాగా అఫ్గాన్‌ను 3-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. అంతకుముందు జింబాబ్వే పర్యటనలో కూడా ఇదే ఫలితం సాధించింది. అయితే, యూకే టూర్లో భాగంగా ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో శ్రేయస్ అయ్యర్ సేన క్లీన్‌స్వీప్ అయింది. చదవండి: అభిషేక్ ఓ అద్భుతం.. వాళ్ల ఆట తీరు ప్రశంసనీయం! -
IND vs AFG: తుదిజట్టు ఇదే.. అభిషేక్, సంజూతో పాటు వైభవ్!
అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే కైవసం చేసుకుంది. తొలి టీ20లో ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో ఓడించిన శ్రేయస్ అయ్యర్ సేన... రెండో మ్యాచ్‌లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది.ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా- అఫ్గాన్ మధ్య గురువారం నామమాత్రపు మూడో టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. దీంతో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పెరిగింది.ఇషాన్‌కు విశ్రాంతిఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘సిరీస్ గెలిచాం కాబట్టి మూడో టీ20లో వైభవ్‌ను ఆడించడం మంచి ఆప్షనే అవుతుంది. నా అభిప్రాయం ప్రకారం.. రెండు మ్యాచ్‌లలో సత్తా చాటిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లలో ఎవరో ఒకరికి విశ్రాంతినిచ్చినా బాగానే ఉంటుంది.ఇటీవల దులిప్ట్రోఫీలోనూ ఇషాన్ అదరగొట్టాడు. కాబట్టి అతడికి బ్రేక్ ఇవ్వడం మంచిది. అభిషేక్ లేదంటే సంజూతో కలిసి వైభవ్ ఓపెనింగ్ చేస్తాడు. కావాలనుకుంటే సంజూ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు’’ అని వసీం జాఫర్ పేర్కొన్నాడు. కాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అఫ్గాన్ బోర్డు టీమిండియాకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.అఫ్గానిస్తాన్‌తో మూడో టీ20కి వసీం జాఫర్ సూచించిన భారత తుదిజట్టుసంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. -
వైభవ్ తో పోటీనా... రిపోర్టర్ ప్రశ్నకు సంజూ శాంసన్ దిమ్మతిరిగే కౌంటర్
-
వాటర్‌బాయ్‌గా వైభవ్!.. సూర్యవంశీ తండ్రి స్పందన ఇదే
అఫ్గానిస్తాన్‌తో రెండు టీ20 మ్యాచ్‌లలో టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్, ఓపెనర్ సంజూ శాంసన్ రాక కారణంగా ఈ పదిహేనేళ్ల పిల్లాడికి తుదిజట్టులో చోటు దక్కడం లేదు. దీంతో వైభవ్ జట్టుకు వాటర్ బాయ్‌గా సేవలు అందిస్తున్నాడు.సిరీస్ టీమిండియా కైవసంఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాగా అఫ్గాన్ బోర్డు ఢిల్లీ వేదికగా టీమిండియాకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం నాటి తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్.. మంగళవారం జరిగిన రెండో టీ20లోనూ ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ కంటే ముందు భారత టీ20 జట్టు జింబాబ్వేలో పర్యటించింది. జింబాబ్వేలో ధనాధన్ఇందులో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడగా.. వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి 151 పరుగులు సాధించి.. జట్టు క్లీన్‌స్వీప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.అయితే, జింబాబ్వేతో సిరీస్‌కు దూరమైన వరల్డ్‌కప్ వీరుడు సంజూ శాంసన్ అఫ్గాన్‌తో సిరీస్ సందర్భంగా పునరాగమనం చేశాడు. దీంతో వైభవ్‌పై వేటు పడింది. అయితే ,తొలి టీ20లో సంజూ 10 పరుగులే చేసి అవుటయ్యాడు. దీంతో వైభవ్‌ను కాకుండా సంజూను ఆడించి తప్పుచేశారనే విమర్శలు వచ్చాయి.మావాడు సిద్ధంగానే ఉన్నాడు.. కానీఈ నేపథ్యంలో అఫ్గాన్‌తో టీమిండియా రెండో టీ20కి ముందు స్టేడియానికి వచ్చిన వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీని స్పోర్ట్స్‌తక్ పలకరించింది. వైభవ్‌కు తుదిజట్టులో చోటు దక్కడం లేదు.. రెండో మ్యాచ్‌లోనైనా అవకాశం వస్తుందనుకుంటున్నారా? అని ప్రశ్నించింది.ఇందుకు బదులిస్తూ.. ‘‘మీ అందరి ఆశీర్వాదాలు వైభవ్‌పై ఉండాలి. మాకు అదే పదివేలు. జట్టుకు అవసరమైన వేళ అతడు సిద్ధంగా ఉంటాడు. నా కుమారుడు ఇప్పటికీ పూర్తిస్థాయి ప్రదర్శన ఇచ్చేందుకు సన్నద్ధంగానే ఉన్నాడు. ఏదేమైనా జట్టు గెలవడం ముఖ్యం. మాకు అదిచాలు’’ అని సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు.కాగా రెండో టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరిమితం కాగా.. అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా సంజూ బరిలోకి దిగాడు. కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా విమర్శలకు చెక్ పెట్టాడు. అయితే, నామమాత్రపు మూడో టీ20లో మాత్రం మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వైభవ్‌ను ఆడిస్తామని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంకేతాలు ఇచ్చాడు. చదవండి: అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్‌తో పోటీ.. స్పందించిన సంజూ -
అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్‌తో పోటీ.. స్పందించిన సంజూ
టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. అఫ్గానిస్తాన్‌తో రెండో టీ20 సందర్భంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు అర్ధ శతకంతో అలరించాడు. మొత్తంగా 22 బంతులు ఎదుర్కొన్న సంజూ.. ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 57 పరుగులు సాధించాడు.తొలి మ్యాచ్‌లో విఫలం కావడంతోకాగా జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న సంజూ శాంసన్.. అఫ్గాన్‌తో ఢిల్లీలో జరుగుతున్న టీ20 సిరీస్‌తో టీమిండియాలోకి తిరిగి వచ్చాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం పది పరుగులే చేసి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో సంజూపై విమర్శల వర్షం కురిసింది.బ్యాట్‌తోనే సమాధానం సంజూకు బదులు.. జింబాబ్వేలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా పంపాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు సంజూ. రెండో టీ20లో భారత ఇన్నింగ్స్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి తన బ్యాటింగ్ పదును తగ్గలేదని నిరూపించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి సత్తా చాటాడు.వైభవ్, అభిషేక్‌తో పోటీపై స్పందనఈ నేపథ్యంలో అఫ్గాన్‌పై విజయానంతరం సంజూ శాంసన్ మీడియాతో మాట్లాడగా.. సహచర ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలతో పోటీ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘బయటి ప్రపంచం దృష్టిలోనే వాళ్లిద్దరు (అభిషేక్, వైభవ్) నాకు పోటీదారులు. అయితే, జట్టుగా మేమంతా ఒకటే.దేశం కోసం ఆడుతున్నాము. అన్నింటికంటే జట్టు విజయమే మా మొదటి ప్రాధాన్యం. ఆ తర్వాతే వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తాము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకరి పట్ల ఒకరికి ప్రతికూల ఆలోచనలు ఉండవు. కోపం తెచ్చుకునే మైండ్‌సెట్ కూడా ఉండదు.నన్ను కాదని అతడిని ఎలా ఆడిస్తారు?‘నాకు కాకుండా.. అతడికే ఎందుకు అవకాశం ఇచ్చారు?.. నన్ను కాదని అతడిని ఎలా ఆడిస్తారు?’ అనే ప్రశ్నలకు తావు లేదు. అలాంటి మనస్తత్వం ఉంటే ఇక్కడ పనికిరాదు’’ అని సంజూ శాంసన్ విలేకరులతో పేర్కొన్నాడు. ఏదేమైనా గతంలో విమర్శల గురించి ఆలోచిస్తూ బాధపడేవాడినన్న ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. ప్రస్తుతం తానెంతో పరిణతి సాధించానని తెలిపాడు.కచ్చితగా ప్రభావం ఉంటుంది.. కానీ‘‘ప్రస్తుతం నాకు తగినంత అనుభవం, పరిణతి వచ్చాయి. కెరీర్ ఆరంభంలో ట్రోల్స్ చూసి బాధపడేవాడిని. నేనేమీ యంత్రాన్ని కాదు. ఆటగాళ్లు రోబోలు కాదు. కాబట్టి.. ‘అలాంటి మాటలు నాపై ప్రభావం చూపలేవు’ అని సులువుగా చెప్పలేము. ఎందుకంటే కొంతమంది మాటలు తప్పకుండా ప్రభావం చూపుతాయి.అయితే, గతంలో మాదిరి నేను ఇప్పుడు ఆ మాటల్ని పట్టించుకోవడం మానేశాను. ఒక షాట్ ఆడేముందు గతంలో చాలా ఆలోచించేవాడిని. సోషల్ మీడియాలో ఎలాంటి విమర్శలు వస్తాయో ఊహించుకునేవాడిని. కానీ ఇప్పుడు కేవలం ఆట మీదే పూర్తిగా దృష్టి పెట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఎలాంటి సమస్యా ఉండదనే పరిణతి సాధించాను’’ అని సంజూ శాంసన్ ట్రోల్స్‌కు కౌంటర్ ఇచ్చాడు.చదవండి: ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డుSanju Samson putting Mohammed Nabi through the boundary tour. 😮💨 Watch #AFGvIND 2nd T20I LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork pic.twitter.com/hNKWkuiSbL— Sony Sports Network (@SonySportsNetwk) September 15, 2026 -
IND vs AFG: భారత తుదిజట్టు ఇదే.. ఒకే ఒక్క మార్పు!
అఫ్గానిస్తాన్‌తో రెండో టీ20కి టీమిండియా సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో జయభేరి మోగించిన శ్రేయస్ అయ్యర్ సేన.. మంగళవారం నాటి మ్యాచ్‌లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.సునాయాస విజయంకాగా ఢిల్లీ వేదికగా ఆతిథ్య అఫ్గాన్‌తో తొలి టీ20లో టీమిండియా మంచినీళ్లప్రాయంగా గెలుపొందింది. అఫ్గాన్ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 13.4 ఓవర్లలోనే ఊదేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్ (32 బంతుల్లో 82) కారణంగా భారత్‌కు ఈ విజయం సాధ్యమైంది.ఇక ఈ మ్యాచ్‌తో తిరిగి టీమిండియాలోకి వచ్చిన మరో ఓపెనర్ సంజూ శాంసన్ మాత్రం విఫలమయ్యాడు. కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని తిరిగి తుదిజట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. గత సిరీస్‌లో జింబాబ్వేలో సత్తా చాటిన ఈ పదిహేనేళ్ల పిల్లాడిని పక్కనపెట్టి.. సంజూకు అవకాశం ఇస్తే అతడు మాత్రం తేలిపోయాడనే విమర్శలు వస్తున్నాయి.వైభవ్ మరోసారి బెంచ్‌కే పరిమితం!ఈ నేపథ్యంలో అఫ్గాన్‌తో రెండో టీ20లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా అన్న చర్చ మొదలైంది. సంజూను తప్పించి వైభవ్‌ను ఆడిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. మెజారిటీ మంది విశ్లేషకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. సంజూకు మరో అవకాశం ఇస్తారని.. ఈ మ్యాచ్‌లోనూ విఫలమైతే అతడిని ఇక పూర్తిగా పక్కనపెట్టేస్తారని అభిప్రాయపడుతున్నారు.వరుస మ్యాచ్‌లలో విఫలమైన తర్వాత జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ.. సీనియారిటి, ప్రపంచకప్-2026 ప్రదర్శన ఆధారంగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు ఇంకో ఛాన్స్ ఇవ్వడమే సరైందని పేర్కొంటున్నారు. ఒక మార్పు అనివార్యం!ఇదిలా ఉంటే.. సంజూ- వైభవ్ విషయం ఎలా ఉన్నా.. భారత తుదిజట్టులో ఒక మార్పు మాత్రం అనివార్యం కానున్నట్లు తెలుస్తోంది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా అఫ్గాన్‌తో మిగిలిన రెండు మ్యాచ్‌ల నుంచి దూరమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండో టీ20లో రవి బిష్ణోయి వరుణ్ స్థానాన్ని భర్తీ చేస్తాడని తెలుస్తోంది.అఫ్గానిస్తాన్‌తో రెండో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయి. -
‘నా భార్య అరిచేసింది.. ఆమెకు కూడా అన్నీ అర్థమవుతున్నాయి’
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 జట్టు ఓపెనింగ్ విషయంలో మేనేజ్మెంట్కు స్పష్టత లేదని.. ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని మండిపడ్డాడు. టీమిండియా నాయకత్వ బృందం కేవలం విశ్లేషకులకే కాకుండా.. సగటు అభిమానులకు కూడా చిరాకు తెప్పిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా జింబాబ్వే పర్యటన తర్వాత భారత టీ20 జట్టు తాజాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో సిరీస్ ఆడుతోంది. ఢిల్లీలో అఫ్గాన్ మూడు టీ20లకు ఆతిథ్యం ఇస్తుండగా.. తొలి మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, అఫ్గాన్‌తో తొలి టీ20లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు.వైభవ్ బెంచ్‌కే పరిమితంజింబాబ్వే పర్యటనలో సత్తా చాటి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు పొందినప్పటికీ.. సీనియర్, వరల్డ్‌కప్-2026 వీరుడు సంజూ శాంసన్ రాక వల్ల వైభవ్ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే, ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌ను కాదని సంజూతో ఓపెనింగ్ చేయించగా.. అతడు కేవలం పది పరుగులే చేసి పూర్తిగా నిరాశపరిచాడు.నా భార్య అరిచేసింది..ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఆదివారం మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడలేదు. దీంతో మేము మ్యాచ్‌ను పక్కనపెట్టేసి మూవీతో టైమ్‌పాస్ చేయాల్సి వచ్చింది. అసలు వైభవ్‌ను ఎందుకు ఆడించడం లేదని నా భార్య అరిచేసింది.గత సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు గెలిచిన ప్లేయర్‌ను ఎలా పక్కనపెడతారని ప్రశ్నించింది. నా భార్యకు కూడా ఆట, సెలక్షన్ తీరు గురించి ఇంతలా అర్థమవుతోంది. సగటు అభిమానులకు కూడా మీ వ్యూహాలు మింగుడుపడటం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి.తప్పుడు సంకేతాలు ఇస్తున్నారుసూర్యవంశీ సేవల్ని మీరు సరిగ్గా వాడుకోవడం లేదు. ఇక రెండో టీ20లో అతడికి అవకాశం ఇస్తారేమో. ఒకవేళ అతడు ఆ మ్యాచ్‌లో విఫలమైతే మాత్రం మళ్లీ తుదిజట్టు నుంచి తప్పిస్తారు. ఆటగాళ్లకు మీరు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. ప్రదర్శన ఎలా ఉన్నా మరుసటి మ్యాచ్‌లో చోటు దక్కుతుందో లేదోనన్న ఆందోళన పెంచుతున్నారు. వైభవ్ సూర్యవంశీ ఇటీవల దులిప్ ట్రోఫీ టోర్నీలోనూ అదరగొట్టాడు. అంతకుముందు ఐపీఎల్, భారత్-ఎ జట్టు తరఫున.. అదే విధంగా అంతర్జాతీయ టీ20లలో రాణించాడు. సంజూను చూస్తే జాలేస్తుందిఅయినా సరే అతడి విషయంలో ఇలా ఎందుకు చేస్తున్నారు’’ అని హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీరుపై క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే విధంగా వైభవ్ ఒక్కడి విషయంలోనే కాకుండా.. సంజూ శాంసన్ విషయంలోనూ మేనేజ్మెంట్ వైఖరి సరిగ్గా లేదని చిక్కా విమర్శించాడు. సంజూను చూస్తే జాలేస్తుందని.. వైభవ్ రాకతో అతడి స్థానానికి ఎసరు వచ్చిందన్నాడు. యాజమాన్యానికి నిజంగా సంజూ పట్ల సానుకూల వైఖరి ఉంటే వరుస అవకాశాలు ఇవ్వాలని.. వైభవ్‌తోనే కొనసాగాలని భావిస్తే అతడిని పక్కనపెట్టేయాలని సూచించాడు. అంతేతప్ప దాగుడుమూతలు ఆడటం సరికాదని క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. కాగా భారత్- అఫ్గాన్ మధ్య మంగళవారం రెండో టీ20 జరుగనుండగా.. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.చదవండి: మా వాడు వైభవ్ పనిపట్టాడు.. ఇంకేం భయం?: జపాన్ కెప్టెన్ -
వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్లో పెను సంచలనంగా మారిన టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ.. డబ్బు సంపాదనలోనూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. నివేదికల ప్రకారం వైభవ్ ఒక్క రోజు బ్రాండ్ ఎండార్స్మెంట్ షూట్‌కు సుమారు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని AMP Sports & Entertainment వ్యవస్థాపకుడు, CEO ఇంద్రనీల్ దాస్ స్వయంగా చెప్పాడు.రాబోయే రెండు మూడేళ్లలో వైభవ్ బ్రాండ్ విలువ మరింత పెరిగి, ప్రస్తుతం తీసుకుంటున్న ఫీజుకు రెట్టింపు అవుతుందని ఆయన అంచనా వేశాడు.సచిన్‌తో పోలికబ్రాండ్ విలువలో వైభవ్‌ను మార్కెట్ నిపుణులు దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తున్నారు. Houlihan Lokey IPL Valuation Study 2026 ప్రకారం, వైభవ్‌కు ఉన్న ఆకర్షణ సచిన్ స్థాయికి దగ్గరగా ఉంది. భయమెరుగని బ్యాటింగ్ శైలి వైభవ్ క్రేజ్‌ను మరింత పెంచుతుంది. కొందరు క్రికెటేతర అభిమానులు కేవలం వైభవ్ బ్యాటింగ్ చూసేందుకే స్టేడియాలకు తరలి వస్తున్నారు.13 ఏళ్లకే కోటీశ్వరుడువైభవ్ 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టి అతి పిన్న వయస్కుడైన కోటీశ్వరుడిగా నిలిచాడు. ఐపీఎల్ 2025కు ముందు రాజస్థాన్ రాయల్స్ అతడిని జట్టులోకి తీసుకుంది. తొలి సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్, 206 స్ట్రైక్‌రేట్‌తో 252 పరుగులు చేశాడు. ఇందులో ఓ సునామీ శతకం కూడా ఉంది.రెండో సీజన్లో మరింత విధ్వంసంతన రెండో ఐపీఎల్ సీజన్లో (2026) వైభవ్ మరింత రెచ్చిపోయాడు. ఏకంగా 776 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గానిలిచాడు. అతడి స్ట్రైక్‌రేట్ ఏకంగా 237.31గా ఉంది.టీమిండియాలోనూ చోటుఐపీఎల్లో అద్బుత ప్రదర్శనల తర్వాత బీసీసీఐ కూడా వైభవ్‌పై నమ్మకం ఉంచింది. యూకే పర్యటనకు అతడిని ఎంపిక చేసింది. ఇప్పటివరకు 6 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన వైభవ్, ఐపీఎల్ తరహా ప్రదర్శనలు చేయనప్పటికీ.. ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించాడు. ఇదీ చదవండి: మావాడు ఇప్పటికే వైభవ్ పనిపట్టాడు.. ఇంకేం భయం?: జపాన్ కెప్టెన్ -
మావాడు వైభవ్ పనిపట్టాడు.. ఇంకేం భయం?: జపాన్ కెప్టెన్
టీమిండియాతో చారిత్రక మ్యాచ్ ఆడేందుకు జపాన్ క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకీ ఫ్లెమింగ్.. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ విధ్వంసకర ఓపెనర్ దూకుడుకు కళ్లెం వేసేందుకు తమ దగ్గర అస్త్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు.భారత్- జపాన్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇరుదేశాల పురుషుల క్రికెట్ జట్ల మధ్య తొలిసారి మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. సెప్టెంబరు 22న ఇరుజట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జరుగనుంది. జపాన్‌లోని సానో అంతర్జాతీయ మైదానం ఇందుకు వేదిక.ఇప్పటికే వైభవ్‌ను ఓసారి అవుట్ చేశాడుఈ నేపథ్యంలో జపాన్ కెప్టెన్ కెండెల్ ‘విజ్డెన్’ షోలో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ సూర్యవంశీని ఎదుర్కొనే విషయంలో మాకు ఎలాంటి ఆందోళనా లేదు. ఎందుకంటే.. మా జట్టులో ఉన్న పదిహేడేళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆసియా కప్ అండర్-19 టోర్నీలో ఇప్పటికే వైభవ్‌ను అవుట్ చేశాడు. దూకుడుకు కళ్లెం వేసి అతడి పనిపట్టాడు. కాబట్టి ఇంకేం భయం?’’ అని పేర్కొన్నాడు.చార్లీ హరా బౌలింగ్లోకాగా అండర్-19 ఆసియా కప్-2024 టోర్నీలో భాగంగా జపాన్‌తో మ్యాచ్ సందర్భంగా పరుగులు రాబట్టేందుకు వైభవ్ సూర్యవంశీ ఇబ్బంది పడ్డాడు. మొత్తంగా 23 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 23 పరుగులే చేయగలిగాడు. భారత ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో జపాన్ యువ స్పిన్నర్ చార్లీ హరా-హింజే వైభవ్‌ను అవుట్ చేశాడు.అంత ఈజీ కాదు.. కథ వేరుగా ఉందిఅయితే, జపాన్ కెప్టెన్ కెండెల్ చెప్పినట్లు వైభవ్ సూర్యవంశీని తమ యువ స్పిన్నర్‌తో కట్టడి చేయడం అంత తేలికేమీ కాదు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ స్సిన్నర్ల బౌలింగ్‌లో 17 ఇన్నింగ్స్‌లో కలిపి 146 బంతుల్లో 336 పరుగులు సాధించాడు. సగటు 37 కాగా.. స్ట్రైక్‌రేటు 228.08. ఇందులో 20 ఫోర్లు, 34 సిక్సర్లు ఉండటం విశేషం.ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడిన పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ.. 193 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున 23 మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 1028 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. సంజూ శాంసన్ రాక వల్ల తొలి టీ20 సందర్భంగా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.చదవండి: వైభవ్‌ను కాదని నీకు ఛాన్స్ ఇస్తే ఏం చేశావు? -
గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్ టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే
-
వైభవ్‌ను కాదని నీకు ఛాన్స్ ఇచ్చి ఏం లాభం?
టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి విఫలమయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20 సందర్భంగా కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో సంజూ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అప్పటి నుంచి విఫలంటీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంజూ.. ఆ ఈవెంట్ తర్వాత టీమిండియా తరఫున ఇప్పటికి ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 43 పరుగులే చేయడం ఇందుకు కారణం.ఈ నేపథ్యంలో సంజూను కాదని అభిషేక్ శర్మకు జోడీగా వైభవ్ సూర్యవంశీని ఫిక్స్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఫామ్‌లో ఉన్న వైభవ్‌ను కాదని.. సంజూను ఆడించడాన్ని తప్పుబట్టాడు.వైభవ్‌ను కాదని ఛాన్స్ ఇచ్చి ఏం లాభం?ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘అప్పుడప్పుడు సంజూకు తుదిజట్టులో అవకాశం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి? అతడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఓసారి జట్టు నుంచి తప్పించిన తర్వాత సహజంగానే ఆటగాడు ఫామ్ కోల్పోతాడు. కానీ తిరిగి పుంజుకునే ప్రయత్నం చేస్తాడు.అయితే, సంజూ విషయంలో ఇది జరుగలేదు. అయినా సరే అతడికి ఎందుకు అవకాశం ఇస్తున్నట్లు? ఇదే అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న. జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గానూ నిలిచాడు.PC: Xనేనేం తప్పు చేశాను?అయినా సరే జింబాబ్వేలో ఆడిన ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ- వైభవ్ సూర్యవంశీలను ఎందుకు విడదీసినట్లు? ఇది మరో ప్రశ్న. ఇప్పటికీ టీ20లలో తమ అత్యుత్తమ ఓపెనింగ్ కాంబినేషన్ ఏదోనన్న అంశంపై టీమిండియా స్పష్టతకు రాలేకపోతోందా? ఇంకెంత కాలం ఈ విషయం గురించి ఆలోచిస్తారు?వైభవ్ కచ్చితంగా.. ‘నేనేం తప్పు చేశాను’ అని అడిగే ఉంటాడు. ఇంతటి గందగోళం ఎందుకు? ఓపెనింగ్‌కు సంబంధించిన సరైన కూర్పు ఏదో తెలుసుకోండి’’ అని మహ్మద్ కైఫ్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు.అందుకే ఆడించారేమో!అయితే, అదే షోలో పాల్గొన్న మరో మాజీ క్రికెటర్ మోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘సంజూ సీనియర్ ఆటగాడు. ప్రపంచకప్ టోర్నీలో గొప్పగా ఆడాడు. మరో విషయం ఏమిటంటే.. వైభవ్ ఆడితే తుదిజట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్ల సంఖ్య పెరుగుతుంది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం కూడా సంజూ వైపు మొగ్గు చూపి ఉంటారు’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్ అఫ్గాన్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు అర్ధ శతకం (32 బంతుల్లో 82)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (33 బంతుల్లో 42) కూడా రాణించాడు. మరోవైపు.. సంజూ ఎనిమిది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో 10 పరుగులు చేసి.. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో డార్విష్ రసూలీకి క్యాచ్ ఇచ్చి నిరాశగా పెవిలియన్ చేరాడు.చదవండి: వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి? -
'వైభవ్ అంటే భయం లేదు.. మా ప్లాన్స్ మాకున్నాయి'
భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ పోరుకు సమయం అసన్నమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ షురూ కానుంది. అయితే, ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. గత జింబాబ్వే సిరీస్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో దుమ్ములేపిన వైభవ్.. ఇప్పుడు సొంత గడ్డపై ఎలా రాణిస్తాడా? అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వైభవ్ గురించి అఫ్గానిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యవంశీని కట్టడి చేయడానికి తమ జట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని, అతడి వికెట్ సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని జద్రాన్ స్పష్టం చేశాడు.కాగా సూర్యవంశీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరపున వైభవ్ సంచలన ప్రదర్శన చేశాడు. 5 ఇన్నింగ్స్‌లలో అతను మొత్తం 192 పరుగులు చేశాడు. రెడ్-బాల్ క్రికెట్లో తన ప్రతిభను చాటిన ఈ యువ సంచలనం.. ఇప్పుడు తనకు కలిసొచ్చిన టీ20 ఫార్మాట్లో మెరుపులు మెరిపించేందుకు సిద్దమయ్యాడు."వైభవ్ సూర్యవంశీ అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు. ఐపీఎల్‌లోనే కాకుండా వివిధ స్థాయిలలో ఆడుతూ ఇప్పటికే తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. అతడి బ్యాటింగ్ గురించి మా జట్టులో విస్తృతంగా చర్చించాం. మా జట్టులోని కొందరు ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉన్నవారు కావడంతో.. వైభవ్ బలాలు, బలహీనతలపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది.అంతేకాకుండా అతడి బ్యాటింగ్ వీడియోలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. అతడిని త్వరగా అవుట్ చేసేందుకు మా వ్యూహాలను సిద్ధం చేసుకున్నాం" అని జద్రాన్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! వెస్టిండీస్‌లో? -
నాతో పెట్టుకోకు వైభవ్ కు చుక్కలు చూపించిన బుమ్రా
-
#80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్ప్రైజ్!
భారత్‌ను ప్రస్తుతం ‘80s’ ట్రెండ్ షేక్ చేస్తోంది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసుకున్నా ‘80s’ ట్రెండ్ పిచ్చ వైరల్‌గా మారిపోయింది. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల దాకా తమకు నచ్చిన ఫొటోను చాట్ జీపీటీకి ఇచ్చి ప్రాంప్ట్ సహాయంతో ‘80s’ ట్రెండ్ ఫొటోలను సృష్టించి స్టేటస్‌లుగా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదే ‘80s’ ట్రెండ్ టీమిండియా క్రికెట్‌కు కూడా పాకింది. తాజాగా బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో టీమిండియా క్రికెటర్ల 80s ట్రెండ్ ఫొటోలను పంచుకుంది. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో రేపటి నుంచి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న టీమిండియా క్రికెటర్లకు వారి ‘80s’ ఫొటోలను చూపించింది. దీనిపై ఒక్కో క్రికెటర్ ఒక్కోలా రియాక్ట్ అవ్వడం కనిపించింది. Photo Credit: BCCI Twitterముఖ్యంగా అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, అభిషేక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అర్షదీప్ సింగ్‌లు తమ ‘80s’ ఫొటోలు చూసుకొని తెగ మురిసిపోయారు. అభిషేక్ శర్మ అయితే అచ్చం హాలీవుడ్ హీరోని తలపించే విధంగా ఉన్నాడంటూ ఇషాన్ కిషన్ ఆటపట్టించడం విశేషం. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. బుమ్రా, సంజూ శాంసన్ ఇలా అందరు క్రికెటర్లు తమ ఫొటోలను గుర్తుపట్టగా.. రవి బిష్ణోయి, యష్ ఠాకూర్లు మాత్రం తమ ఫొటోలను పోల్చుకోలేకపోయారు. Photo Credit: BCCI Twitterమొదట శివమ్ దూబే తన ఫొటో బదులు యశ్ ఠాకూర్‌ను చూపించాడు. అయితే వెంటనే తన ఫొటోను చూపిస్తూ.. ఇందాకా చూపించింది యశ్ ఠాకూర్‌ది అని పేర్కొన్నాడు. ఇక బుమ్రా మాత్రం తన ఫొటోను చూసుకోవడానికి ఇష్టపడలేదు. 2 నిమిషాల 40 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.Photo Credit: BCCI Twitterఇక రేపు (ఆదివారం) భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. జట్టు కూర్పు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినప్పటికీ, ఓపెనింగ్ విషయంలోనే మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఓపెనింగ్‌లో వైభవ్ లేదా శాంసన్‌లలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి. విశ్వసనీయ సమాచారం మేరకు వైభవ్‌ను బెంచ్‌కు పరిమితం చేసి శాంసన్‌కు అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది.Vintage vibes. Priceless reactions. 😂🎥 #TeamIndia takes on the 1980s trend 😉 - By @RajalArora #AFGvIND pic.twitter.com/nSaClHHdyn— BCCI (@BCCI) September 12, 2026ఇదీ చదవండి: ఆసియా గేమ్స్‌కు కొత్త రంగు జెర్సీలో టీమిండియా! -
వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్!
ఏషియన్ గేమ్స్-2026కు ముందు టీమిండియా మరొక కీలక పోరుకు సిద్దమైంది. శ్రేయస్ అయ్యర్ సారధ్యంలోని భారత జట్టు.. సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి తిరిగి రావడంతో భారత్ ఈసారి పూర్తి స్ధాయి జట్టుతో బరిలోకి దిగుతోంది.ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 సెప్టెంబర్ 13న ఢిల్లీ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ భారత తుది జట్టు ఎలా ఉండబోతోనేది ఆసక్తిరంగా మారింది. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ జట్టులోకి పునరాగమనం చేయడంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తొలి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఒకవేళ సంజూ తొలి టీ20లో విఫలమైతే సూర్యవంశీని తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకురావాలని హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా యూకే పర్యటనలో శాంసన్ విఫలం కావడంతో వైభవ్‌కు భారత్ తరపున ఓపెనర్‌గా ఆడే అవకాశముంది. అయితే ఇంగ్లండ్ టూర్లో మూడు మ్యాచ్‌లు వైభవ్ నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యాడు.దీంతో ఆ సిరీస్‌లో ఆఖరి టీ20కు అతడిని పక్కన పెట్టి మళ్లీ సంజూకు ఛాన్స్ ఇచ్చారు. ఆ మ్యాచ్‌లో సంజూ తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అనంతరం జింబాబ్వే టూర్‌కు విశ్రాంతి ఇవ్వడంతో సిరీస్ మొత్తం సూర్యవంశీనే భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఇంగ్లండ్ టూర్లో విఫలమైన వైభవ్.. జింబాబ్వేపై మాత్రం అదరగొట్టాడు. కానీ ఇప్పుడు వైభవ్ కంటే సీనియర్ అయిన శాంసన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని టీమ్ మేనెజ్మెంట్ భావిస్తుందంట.ఈ క్రమంలో తొలి టీ20లో శాంసన్ ఆడడం దాదాపు ఖాయమైనట్లే. మరోవైపు గాయాల నుంచి కోలుకుని వచ్చిన జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డిలు తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోనున్నారు. అదేవిధంగా జింబాబ్వే టూర్‌కు దూరంగా ఉన్న పేసర్ అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిలు కూడా ఢిల్లీ టీ20లో ఆడనున్నారు.అఫ్గాన్‌తో తొలి టీ20కు భారత తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్చదవండి: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్.. ప్రకటన విడుదల -
వైభవ్ లాంటి ప్లేయర్ ఒక్కరు కూడా పాక్‌లో లేరు: వసీం అక్రమ్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌పై దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ విమర్శల వర్షం గుప్పించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో పోలిస్తూ పీఎస్ఎల్ ఒక్క ప్రతిభావంతుడైన ఆటగాడిని కూడా తాయారు చేయలేకపోయిందని అక్రమ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించాడు. కాగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో అదరగొట్టిన వైభవ్.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో సత్తాచాటుతున్నాడు. ఈ క్రమంలోనే అద్భుత ప్రదర్శనలతో రాణిస్తున్న వైభవ్‌ను ఉదాహరణగా చూపిస్తూ పీసీబీపై అక్రమ్ మండిపడ్డాడు."పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభమై దశాబ్దానికి పైగానే పూర్తయింది. ఈ లీగ్ ద్వారా కొంతమంది నైపుణ్యం కలిగిన బౌలర్లు వెలుగులోకి వచ్చినప్పటికీ.. పటిష్టమైన ఒక్క బ్యాటర్‌ను కూడా మనం తయారుచేసుకోలేకపోయాం. నిజమైన క్రికెట్ పురోగతి సాధించాలంటే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వంటి అపార ప్రతిభ కలిగిన యంగ్ బ్యాటర్లు మన దగ్గర నుంచి కూడా రావాలి.ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్‌ను బలోపేతం చేయాలంటే క్లబ్ క్రికెట్ స్థాయి నుంచే మార్పు మొదలవ్వాలి. ఇందుకోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కరాచీ, లాహోర్లలో క్లబ్ క్రికెట్ మౌలిక సదుపాయాల కల్పనకు చెరో 100 మిలియన్ రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉంది" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్ పేర్కొన్నాడు.చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్‌హౌజ్.. ‘కైలాష్పతి’ ఆస్తి విలువ ఎంతంటే? -
'వైభవ్ సూర్యవంశీ వద్దు.. అతడే బెటర్'
భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఢిల్లీ వేదికగా ఆదివారం (సెప్టెంబర్ 13) జరగనుంది. అయితే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ జట్టులోకి తిరిగి రావడంతో, భారత తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఎందుకంటే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రాకముందు భారత రెగ్యులర్ ఓపెనర్లగా శాంసన్, అభిషేక్ శర్మలు వ్యవహరించారు. ఐర్లాండ్ టూర్‌తో పాటు ఇంగ్లండ్ సిరీస్‌లో సంజూ తొలి మ్యాచ్‌లో విఫలమం కావడంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించారు. సంజూ స్ధానంలో వైభవ్‌కు అవకాశమిచ్చారు. ఈ బిహార్ ఆటగాడు కూడా తీవ్ర నిరాశపరిచాడు. దీంతో ఆఖరి టీ20కు వైభవ్‌ను పక్కన పెట్టి శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చారు. ఈ కేరళ ఆటగాడు 14 బంతుల్లో 27 పరుగులు సాధించి జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే అనంతరం జింబాబ్వే పర్యటనకు శాంసన్‌కు విశ్రాంతిని ఇచ్చి వైభవ్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించారు. ఈ సిరీస్‌లో మాత్రం వైభవ్ దుమ్ములేపాడు. మూడు మ్యాచ్‌లలో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సంజూ స్క్వాడ్‌లోకి తిరిగి రావడంతో టీమ్ మేనెజ్మెంట్ ఓపెనర్‌గా ఎవరికి అవకాశమిస్తుందో వేచి చూడాలి. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు ముందు మాజీ కెప్టెన్ అజింక్య రహానే టాప్-3 ప్లేయర్లను ఎంపిక చేశాడు. ఇందులో వైభవ్‌కు చోటు దక్కలేదు."టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ముగ్గురు బ్యాటర్లనే అఫ్గాన్ సిరీస్‌లో కూడా టాప్-3లో కొనసాగించాలి. వరల్డ్‌కప్‌లో సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ రెండు, మూడు ఇన్నింగ్స్‌లలో విఫలం కావడంతో అతడిని పక్కన పెట్టారు. ఇది సరైన నిర్ణయం కాదు. అతడికి మరో అవకాశం ఇవ్వాలి. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కూడా గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నారు. ఆ ఇద్దరిని కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగించాలి. అయితే వైభవ్ మంచి ప్లేయర్ ఎలాంటి సందేహం లేదు. అతడికి భవిష్యత్తులో చాలా అవకాశాలు వస్తాయి. ప్రస్తుతానికి మాత్రం శాంసన్, అభిషేక్, ఇషాన్‌లు టాప్-3లో ఉండాలి" అని తన యూట్యూబ్ ఛానల్లో రహానే పేర్కొన్నాడు.చదవండి: వైభవ్‌కు చుక్కలు చూపించిన జస్ప్రీత్ బుమ్రా -
వైభవ్‌కు చుక్కలు చూపించిన జస్ప్రీత్ బుమ్రా
ఢిల్లీ వేదికగా ఆదివారం నుంచి భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. గత రెండు నెలలుగా గాయంతో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నెట్స్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేస్తూ కనిపించాడు.తన ధనాధన్ పేస్‌తో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని బుమ్రా తిప్పలు పెట్టాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి వైభవ్ నెట్స్‌లో గట్టిగానే శ్రమించాడు. నెట్ ప్రాక్టీస్‌లో బుమ్రా వేసిన ఐదు బంతుల్లో వైభవ్ ఒక్కదాన్ని మాత్రమే సరిగ్గా షాట్ ఆడగలిగాడు. మొదటి గుడ్ లెంగ్త్ బంతికి డిఫెన్స్ ఆడబోయి మిస్ అవ్వగా, రెండో బంతిని వదిలేశాడు. మూడో బంతికి బుమ్రా యార్కర్ విసరగా వైభవ్ అతికష్టం మీద ఎదుర్కొన్నాడు.నాలుగో బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బంతిని కూడా వదిలేసిన వైభవ్, ఐదో ఓవర్ పిచ్ బంతిని మాత్రం కవర్స్ మీదుగా బౌండరీకి తరలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ప్రాక్టీస్‌లో బుమ్రా ఆధిక్యం ప్రదర్శించినా ఐపీఎల్-2026లో మాత్రం ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు బుమ్రాను ధాటిగానే ఎదుర్కొన్నాడు. కాగా ఈ నెట్ సెషన్ వైభవ్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఫీల్డింగ్ డ్రిల్స్‌లో మూడు క్యాచ్‌లను నేలపాలు చేయడమే కాకుండా ఇతర పేసర్ల బౌలింగ్‌లోనూ ఆడేందుకు వైభవ్ ఇబ్బంది పడ్డాడు.వైభవ్ తన ఫామ్ కొనసాగిస్తాడా?కాగా వైభవ్‌కు ఇది మూడో అంతర్జాతీయ టీ20 సిరీస్. ఇంగ్లండ్ టూర్లో డెబ్యూ చేసిన వైభవ్.. తన పేలవ ప్రదర్శనలతో నిరాశపరిచాడు. కానీ ఆ తర్వాత జింబాబ్వే పర్యటనలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మూడు ఇన్నింగ్స్‌లలో 50 సగటుతో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ అతడు సత్తాచాటాడు. ఇప్పుడు అదే ఫామ్‌ను అఫ్గానిస్తాన్‌పై కొనసాగించాలని వైభవ్ ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే సంజూ శాంసన్ రూపంలో వైభవ్ స్ధానానికి ముప్పు పొంచి ఉంది. ఓపెనర్‌గా టీమ్ మేనెజ్మెంట్ వైభవ్‌ను కొనసాగిస్తుందా? లేదా మళ్లీ సంజూకు అవకాశమిస్తుందో? ఆదివారం వరకు వేచి చూడాలి.చదవండి: ‘విరామం ఎక్కువైతే లయ కోల్పోతాను’Jasprit Bumrah vs Vaibhav Sooryavanshi. What happened next? pic.twitter.com/Ep6igaQUnf— Tanuj Lakhina (@tanujlakhina) September 11, 2026 -
నెట్స్‌లో చెమటోడ్చిన బుమ్రా
న్యూఢిల్లీ: భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కొంత విరామం తర్వాత మళ్లీ జట్టుతో చేరాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సమయంలో గాయంతో తప్పుకున్న బుమ్రా... ఇప్పుడు కోలుకొని అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు సిద్ధమయ్యాడు. శుక్రవారం అతను ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. సాధనలో బుమ్రాకు ఎదురుగా నిలిచింది 15 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. వీరిద్దరి మధ్య నెట్స్‌లో ఆసక్తికర పోరు సాగింది. ఐపీఎల్లో ఇప్పటికే బుమ్రాను ఎదుర్కొన్న వైభవ్... ఇక్కడ మాత్రం తగిన రీతిలో జవాబివ్వడంలో విఫలమయ్యాడు. బుమ్రా వరుసగా వేసిన పదునైన బంతులకు వైభవ్ వద్ద సమాధానం లేకపోయింది. అతికష్టమ్మీద వాటిని ఎదుర్కొన్న అతను... ఒకటి, రెండు బంతులను మాత్రం నియంత్రణతో మంచి షాట్లుగా మలిచాడు. ఇతర పేసర్లు అర్ష్ దీప్ సింగ్, యశ్ ఠాకూర్ల బౌలింగ్‌లో కూడా వైభవ్ సమర్థంగా ఆడలేకపోయాడు.దాంతోపాటు పలుమార్లుసునాయాస ఏరియల్ క్యాచ్‌లు వదిలేసి ఫీల్డింగ్‌లో కూడా ఈ బిహార్ కుర్రాడు నిరాశపర్చాడు. మరోవైపు నెట్స్‌లో భారత టి20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా బుమ్రా బౌలింగ్‌లో మెరుగ్గా ఆడలేకపోయాడు. ఇక్కడా బుమ్రా ఆధిపత్యమే సాగింది. అతను పూర్తి ఫిట్‌గా ఉండటంతో పాటు తనదైన శైలిలో బౌలింగ్ చేస్తున్న తీరు భారత టీమ్ మేనేజ్మెంట్కు సంతృప్తిని కలిగించిందనడంలో సందేహం లేదు. -
సంజు దెబ్బకు వైభవ్ అవుట్, టీ 20 ప్లేయింగ్ 11 భారీ మార్పులు
-
వైభవ్ మాస్ రివెంజ్ తిలక్ కు దిమ్మతిరిగే షాక్
-
'డీఆర్ఎస్ ఏముందిలే బ్రో.. కాబోయే కెప్టెన్‌వి నువ్వు’
ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్‌జోన్ జట్టు 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా మాత్రమే గాక బ్యాటర్‌గానూ అదరగొట్టిన ఇషాన్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 350కి పైగా పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. మరోవైపు సెమీస్‌లో (తొలి ఇన్నింగ్స్‌లో 92 రన్స్, రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ ఫైనల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ తనకిచ్చిన వైస్ కెప్టెన్సీ బాధ్యతలను మాత్రం వైభవ్ సమర్థంగా నిర్వహించాడు. మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కు తలలో నాలుకలా కొనసాగుతూ వచ్చిన వైభవ్ తన కెప్టెన్ డీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు సెమీస్‌లో ఇషాన్ గాయంతో కొన్ని ఓవర్ల పాటు మైదానంలోకి రాలేదు. ఆ సమయంలో వైభవ్ స్టాండిన్ కెప్టెన్‌గానూ అదరగొట్టాడు. అతడు తీసుకున్న డీఆర్ఎస్ ఫలితాలు అనుకూలంగా రావడంతో తొలి విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈస్ట్‌జోన్ డగౌట్ వద్ద ఇషాన్ కిషన్.. వైభవ్ సూర్యవంశీని ఆకాశానికెత్తిన వీడియోను బీసీసీఐ కాస్త ఆలస్యంగా విడుదల చేసింది. ఈ వీడియోలో వైభవ్‌ను ఇషాన్ కిషన్ సరదాగా ఆటపట్టించాడు. వైభవ్ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఇషాన్ తన సమక్షంలో వైభవ్ మాట్లాడాలంటూ నవ్వుతూ పేర్కొన్నాడు.ఇషాన్ మాట్లాడుతూ.."డీఆర్ఎస్ విషయంలోనూ ప్రతి చోటా క్రెడిట్ అంతా వైభవ్‌కే దక్కింది. నిజానికి రివ్యూ తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నా. కానీ దగ్గరికి వచ్చి చాలా కాన్ఫిడెంట్‌గా ‘రివ్యూ లే లో భాయ్’ అంటూ చెప్పాడు. అంతే.. ఇంటర్నెట్ అంతా ‘వైభవ్, వైభవ్..’ అంటూ ప్రశంసలు. కెప్టెన్‌గా డీఆర్ఎస్ తీసుకునేది నేను.. క్రెడిట్ అంతా ఈ చిచ్చర పిడుగుకే వచ్చింది" అంటూ ఇషాన్ సరదాగా వైభవ్‌ను ట్రోల్ చేశాడు.దీనికి వైభవ్ సూర్యవంశీ కూడా ఇషాన్‌కు స్టన్నింగ్ రిప్లై ఇచ్చాడు. "మీరు ఉన్నప్పుడు రివ్యూ తీసుకోమని చెప్పింది నేనే.. కానీ గాయంతో పెవిలియన్‌లో ఉన్నప్పుడు డీఆర్ఎస్ తీసుకున్నది ఎవరు? అది కూడా చెప్పండి" అంటూ వైభవ్ చురక వేశాడు. వైభవ్ సమాధానాన్ని ఇషాన్ అలా చూస్తూ ఉండిపోయాడు.‘అవును.. అప్పుడు కూడా వైభవే రివ్యూలు తీసుకున్నాడు. సక్సెస్ అయ్యాడు. అతడిలో కెప్టెన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో వైభవ్ కెప్టెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం అతడి కెరీర్ ఎలా సాగుతుందో. వైభవ్ జట్టులో ఉండటం వల్ల చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది. జట్టులోని ప్రతి ఒక్కరినీ.. అది జూనియర్ అయినా, సీనియర్ అయినా.. జాగ్రత్తగా చూసుకుంటాడు. ఓహ్.. జూనియర్ అంటే నువ్వు ఒక్కడివే కదా! సారీ.. సారీ’ అంటూ ఇషాన్ మరోసారి సరదాగా వ్యాఖ్యానించాడు.Ishan Kishan with Vaibhav Sooryavanshi. 😂❤️ pic.twitter.com/hAB688xia1— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2026Read: ‘వైభవ్.. నువ్వు నా కెరీర్‌కు కూడా సాటి రాలేవు’ -
‘వైభవ్.. నువ్వు నా కెరీర్‌కు కూడా సాటి రాలేవు’
ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్‌జోన్ జట్టు 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో సౌత్‌జోన్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఈస్ట్‌జోన్ టైటిల్‌ను అందుకుంది. ఈస్ట్‌జోన్ టైటిల్ గెలవడంలో జట్టులోని ప్రతీ ఆటగాడిది కీలకపాత్రే అని చెప్పొచ్చు. ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ ధనాదన్ ఆటతీరు, అభిమన్యు ఈశ్వరన్ క్లాస్, కెప్టెన్ ఇషాన్ కిషన్ మాస్ డబుల్‌సెంచరీ, కుమార్ కుషాగ్ర సెంచరీ.. ఇక బౌలింగ్‌లో ముకేశ్‌కుమార్, మహ్మద్ షమీ.. ఇలా జట్టు మొత్తం సమిష్టి ప్రదర్శన చేయడంతోనే ఈస్ట్‌జోన్ దులీప్ ట్రోఫీని దక్కించుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ ప్రశంసలు కురిపించాడు. కనీసం నా కెరీర్ వయసుకు కూడా సాటి రాని వైభవ్ ఇవాళ స్టార్ ఆటగాడిగా మారిపోయాడని షమీ పేర్కొన్నాడు. షమీ మాట్లాడుతూ.."నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా జట్టులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. నిజం చెప్పాలంటే వైభవ్ వయసు అక్షరాలా నా కెరీర్‌తో వయసుతో సమానం. అతడిలో టీనేజ్ అమాయకత్వం అలాగే ఉంది. అందరితో సరదగా జోకులు వేయడానికి ఇష్టపడతాడు. 15 ఏళ్ల వయసులో ఒక కుర్రాడు ఏం చేస్తాడో వైభవ్ అదే చేస్తున్నాడు. కానీ పరిణితితో కూడిన దృక్పథాన్ని అలవరచుకున్నాడు. ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించగల శక్తి అతడి సొంతం. వైభవ్ లాంటి యువకులు ఇప్పటికే చాలా పరిణితి చెంది ఉంటారు. క్రికెట్ ఆడే స్థాయి, ఐపీఎల్, ఇతర ఒత్తిడుల కారణంగా ఎంతో పరిణితి వస్తోంది. వైభవ్ విషయంలో అది ఎప్పుడో రుజువయ్యింది. కాబట్టి అలాంటి వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు." అని చెప్పుకొచ్చాడు.2011లో జన్మించిన వైభవ్ వయసుతోనే షమీ కెరీర్ వయసు సమానం కావడం విశేషం. 2011లో షమీ తొలిసారి దేశవాళీలో సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఇక 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో ఆడే అవకాశం ఎంతమంది ఆటగాళ్లకు లభిస్తుంది? కానీ వైభవ్ ఆ అవకాశాన్ని పొందడమే కాదు, తనని తాను నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడి, 206.56 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ అత్యధిక పరుగులు (776 పరుగులు) చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. తన ఆటతో వైభవ్ రాజస్తాన్ రాయల్స్‌ను ఒంటిచేత్తో ప్లేఆఫ్స్ చేర్చడం విశేషం.షమీ, వైభవ్ కీలకపాత్రఈస్ట్జోన్ దులీప్ ట్రోఫీని ఎగరేసుకుపోవడంలో షమీ, వైభవ్ సూర్యవంశీలు కీలకపాత్ర పోషించారు. నార్త్ ఈస్ట్‌జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో విఫలమైనప్పటికీ, సెంట్రల్ జోన్‌తో జరిగిన సెమీస్‌లో వైభవ్ సూర్యవంశీ (92, 40 పరుగులు) అదరగొట్టాడు. ఇక ఫైనల్లో 44 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మరోవైపు, క్వార్టర్ ఫైనల్స్‌లో షమీ పొదుపుగా బౌలింగ్ చేయగా, సెమీస్‌లో 5 వికెట్లు పడగొట్టి సెంట్రల్ జోన్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. ఇక ఫైనల్స్‌లో, అతను ఫ్లాట్ పిచ్‌పై రవిచంద్రన్ స్మరణ్ వంటి కీలక వికెట్‌తో సహా మరో 2 వికెట్లు పడగొట్టాడు.Read: ఫైనల్లో సబలెంకా; పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు! -
వైభవ్‌పై ఫిర్యాదు చేసిన తిలక్ వర్మ.. అసలేం జరిగిందంటే
దులీప్ ట్రోఫీ-2026 విజేతగా ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్‌జోన్ నిలిచిన సంగతి తెలిసిందే. సౌత్‌జోన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ‘డ్రా’గా ముగియగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఈస్ట్‌కు 14 ఏళ్ల తర్వాత ట్రోఫీ దక్కింది. అయితే ఈ మ్యాచ్‌లో సౌత్‌జోన్ కెప్టెన్ తిలక్ వర్మ, ఈస్ట్‌జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ మధ్య సరదా స్లెడ్జింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.అసలేమి జరిగిందంటే?తొలి రోజు ఆటలో వైభవ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తిలక్ అతడి వద్దకు వెళ్లి.. ఏంటి వైస్ కెప్టెన్? అంత స్లోగా బ్యాటింగ్ చేస్తున్నావు? అని స్లెడ్జ్ చేశాడు. అయితే అందుకు బదులుగా నాలుగో రోజు ఆటలో తిలక్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు వైభవ్ కూడా అతడిని సరదాగా ఆటపట్టించాడు. తిలక్ వద్దకు దగ్గరగా వెళ్లి మాట్లాడే క్రమంలో వైభవ్ భుజం అతడికి తగిలింది. దీంతో తిలక్ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అంపైర్ వచ్చి వైభవ్‌ను మందలిస్తుండగా.. "సార్, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నాతో కూడా ఇలాగే జరిగింది" అని వైభవ్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈస్ట్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(270) అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం సౌత్‌జోన్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత ఈస్ట్‌జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆఖరి రోజు ఆటలో 7 వికెట్ల నష్టానికి 388 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కౌనైన్ ఖురేషీ (190 బంతుల్లో 116 నాటౌట్; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా, అనుకూల్ రాయ్ (112 బంతుల్లో 64; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుమార్ కుషాగ్ర (46) రాణించారు.సౌత్ బౌలర్లలో నిధీశ్ 2 వికెట్లు పడగొట్టగా...సీవీ మిలింద్, సిరాజ్, రషీద్, విజయ్ ఒక్కో వికెట్ తీశారు. గురువారం 48.2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఈస్ట్ మరో 176 పరుగులు జోడించింది. ఫలితం ‘డ్రా’ ఖాయం కావడంతో సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగకుండా ఇరు జట్ల కెప్టెన్లు ఆటను ముగించేందుకు అంగీకరించారు. ఇషాన్ కిషన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... తిలక్ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.చదవండి: ENG vs PAK: సేమ్ సీన్ రీపీట్! అప్పుడు సెహ్వాగ్.. ఇప్పుడు పాక్ ఓపెనర్Pure drama in the #DuleepTrophy 2026 Final! 🍿#TilakVarma had a word for #VaibhavSooryavanshi in the 1st innings... and the youngster served it right back while Tilak was batting! 🔥🗣️ pic.twitter.com/DPdi3iwVRA— Star Sports (@StarSportsIndia) September 10, 2026 -
గెలుపు జోష్‌లో హల్చల్ చేసిన ఇషాన్, వైభవ్
దులీప్ ట్రోఫీ 2026 టైటిల్‌ను ఈస్ట్ జోన్ కైవసం చేసుకుంది. సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రా అయినా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ఆ జట్టు విజేతగా నిలిచింది. ఈస్ట్ జోన్ టైటిల్ గెలవడం ఇది మూడోసారి. పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇషాన్ కిషన్ నేతృత్వంలో ఈ జట్టు చాంపియన్‌గా అవతరించింది.Handshakes in the middle to conclude a fantastic Final 🤝East Zone clinch the #DuleepTrophy 2026 title by virtue of first-innings lead 🏆#EZvSZ pic.twitter.com/4DJjNHkAHD— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026టైటిల్ గెలిచిన తర్వాత ఈస్ట్ జోన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా కెప్టెన్ ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ స్టంప్స్ చేతబట్టి భాంగ్రా డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. జట్టు కోచ్ రతన్ కుమార్, సహాయక సిబ్బంది, ఇతర ఆటగాళ్లతో కలిసి ఇషాన్, వైభవ్ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ గెలుపును ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.బ్యాట్‌తోనూ అదరగొట్టిన ఇషాన్ కిషన్టైటిల్ గెలిచాక తనదైన శైలిలో చిందులేసిన ఇషాన్, ఈస్ట్ జోన్ టైటిల్ గెలవడంలోనూ అత్యంత కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతడు భారీ డబుల్ సెంచరీ (270), హాఫ్ సెంచరీ (80) సాయంతో 350 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో తన జట్టు భారీ స్కోర్ (708) చేయడానికి ప్రధాన కారకుడయ్యాడు. ఈ స్కోరే (ఆధిక్యం) ఈస్ట్ జోన్ టైటిల్ గెలవడానికి కారణమైంది. బ్యాట్‌తో తన అద్భుత ప్రదర్శన కారణంగా ఇషాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సౌత్ జోన్ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో అద్బుత పోరాటం (99) చేసిన ఆ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. తిలక్ అంతకుముందు సెమీఫైనల్లో అద్భుత శతకంతో మెరిశాడు. చదవండి: దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. 13 ఏళ్ల తర్వాత మరో టైటిల్. -
దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. 13 ఏళ్ల తర్వాత మరో టైటిల్
దేశవాళీ ప్రతిష్టాత్మక ఫస్ట్ క్లాస్ టోర్నీ దులీప్ ట్రోఫీని ఈస్ట్ జోన్ జట్టు మూడోసారి సొంతం చేసుకుంది. దాదాపు పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరోసారి చాంపియన్‌గా అవతరించింది. కెప్టెన్‌గా, ఆటగాడిగా ఈ విజయంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు.. సౌత్ జోన్ సారథిగా వ్యవహరించిన తిలక్ వర్మ బ్యాటర్‌గా రాణించినప్పటికీ.. కెప్టెన్‌గా మాత్రం చేదు అనుభవం ఎదుర్కొన్నాడు.𝙏𝙝𝙖𝙩 𝙒𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙁𝙚𝙚𝙡𝙞𝙣𝙜 🏆 Congratulations to the Ishan Kishan-led East Zone on winning their third #DuleepTrophy title 👏👏#EZvSZ | @ishankishan51 pic.twitter.com/u6D4UvOTEp— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్ ఆదివారం మొదలైంది. టాస్ గెలిచి తొలి రెండురోజుల పాటు బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ జట్టు.. మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఇషాన్ డబుల్ సెంచరీటాపార్డర్లో ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44).. వన్‌డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ (85) అదరగొట్టారు. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ (270)తో కదం తొక్కాడు. మరోవైపు.. కుమార్ కుశాగ్రా శతక్కొట్టగా (101).. అనుకుల్ రాయ్ (45), ఎండీ కౌనియన్ ఖురేషి (40) రాణించారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ తిలక్ వర్మ 99 పరుగులు చేయగా.. దేవదత్ పడిక్కల్ 62 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో సీవీ మిలింద్ 43 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ, ఎండీ కౌనియన్ ఖురేషి, శిఖర్ మోహన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో సౌత్ జోన్ 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఫాలో ఆన్ ఆడించకుండా..ఆ తర్వాత సౌత్‌కు ‘ఫాలోఆన్’ ఇవ్వకుండా ఈస్ట్ బుధవారమే బ్యాటింగ్‌కు దిగింది. వైభవ్ సూర్యవంశీ (8), ఈశ్వరన్ (3) విఫలమైనా...ఇషాన్ కిషన్, శిఖర్ మోహన్ మూడో వికెట్‌కు 126 పరుగులు జోడించి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచారు.ఇషాన్ 80 పరుగులు చేయగా.. శిఖర్ మోహన్ 52 పరుగులతో రాణించాడు. ఇక ఆఖరిదైన గురువారం నాటి ఐదో రోజు ఆటలో ఆల్‌రౌండర్ ఖురేషి అజేయ శతకం (116)తో రాణించగా.. అనుకుల్ రాయ్ హాఫ్ సెంచరీ (64) సాధించాడు. మిగిలిన వారిలో కుమార్ కుశాగ్రా 46 పరుగులు చేశాడు.మ్యాచ్ డ్రా.. ఈస్ట్దే టైటిల్ఈ క్రమంలో 388 పరుగుల వద్ద ఏడు వికెట్ల నష్టానికి ఈస్ట్ తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తద్వారా మొత్తంగా 760 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. దీంతో ఆఖరి రోజు ఆట కాబట్టి సౌత్ జోన్ ‘డ్రా’కు అంగీకరించింది. నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లోనూ ఈస్ట్ ఆధిక్యంలో ఉన్నందున ట్రోఫీ ఈస్ట్ జోన్‌కే దక్కింది. ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.Handshakes in the middle to conclude a fantastic Final 🤝East Zone clinch the #DuleepTrophy 2026 title by virtue of first-innings lead 🏆#EZvSZ pic.twitter.com/4DJjNHkAHD— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026 -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైభవ్ గర్ల్ ఫ్రెండ్ ఫొటోలు
-
వైభవ్ సూర్యవంశీకి షాక్
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి షాక్ తగిలింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో అతడు రెండు స్థానాలు కోల్పోయి 49వ స్థానానికి పడిపోయాడు. ఇదే సమయంలో అతడి ఐపీఎల్ జట్టు (రాజస్థాన్ రాయల్స్) సహచరుడు, దక్షిణాఫ్రికా యువ ఓపెనర్ లుహాన్ డ్రి ప్రిటోరియస్ ఏకంగా 61 స్థానాలు మెరుగుపర్చుకొని 44 స్థానానికి ఎగబాకాడు.ఇటీవల ముగిసిన నమీబియా ట్రై-సిరీస్‌లో ప్రిటోరియస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 56.50 సగటుతో, 179.37 స్ట్రైక్‌రేట్‌తో 226 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ప్రిటోరియస్ మెరుపుల కారణంగా సౌతాఫ్రికా ట్రోఫీని కైవసం చేసుకుంది.భారీ జంప్ కొట్టిన మరో సౌతాఫ్రికన్ప్రిటోరియస్తో పాటు నమీబియా ట్రై సిరీస్‌లో చెలరేగిన మరో దక్షిణాఫ్రికా ఆటగాడు కానర్ ఎస్టర్‌హుయిజన్ కూడా ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ కొట్టాడు. ఈ సిరీస్‌లో 126 పరుగులు చేసిన అతడు, ఏకంగా 65 స్థానాలు ఎగబాకి 25వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అతని కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్.కాగా, టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ తన టీ20 టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. పాక్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్, టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా తమ రెండు, మూడు స్థానాలను కాపాడుకున్నారు. మరో టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.బౌలర్ల విభాగంలో రషీద్ ఖాన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. భారత్ తరఫున వరుణ్ చక్రవర్తి అత్యుత్తమంగా ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నాడు. చదవండి: 300 పరుగులు పూర్తి చేసిన ఇషాన్ కిషన్ -
సిక్కోలు కుర్రాడి మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లాంక్
చెపాక్ వేదికగా సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్‌జోన్ విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌జోన్ 708 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా.. అందుకు బదులుగా తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకే ఆలౌటైంది. తిలక్ వర్మ సెంచరీ మిస్సౌత్జోన్ జట్టులో తిలక్ వర్మ (99), దేవదత్ పడిక్కల్ (62) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆ జట్టు 300 మార్కును దాటగలిగింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌జోన్‌కు 300 పరుగులకు పైగా భారీ ఆధిక్యం లభించింది. అంతేకాకుండా సౌత్‌జోన్ ఫాలో-ఆన్ కూడా దాటలేకపోయింది. వైభవ్ విఫలంఅయినప్పటికీ ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సౌత్‌జోన్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా.. వారే రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించేందుకు మైదానంలోకి దిగారు. అయితే ఈస్ట్‌జోన్ తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ వికెట్లను కోల్పోయింది. సిక్కోలు కుర్రాడి దెబ్బమూడు పరుగులు చేసిన ఈశ్వరన్‌ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపగా.. యువ సంచలనం వైభవ్‌ను సిక్కోలు కుర్రాడు త్రిపురాన విజయ్ అవుట్ చేశాడు.ఇన్నింగ్స్ ఆరువ ఓవర్లో విజయ్ తొలి బంతిని ఔట్‌సైడ్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే బంతిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైన వైభవ్.. ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి ఓవర్ కవర్స్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ బంతి ఎక్కువగా టర్న్ అయ్యి అతడి బ్యాట్‌ను దాటుకుంటూ వికెట్ కీపర్ జగదీశన్ చేతికి వెళ్లింది. వెంటనే జగదేశన్ స్టంప్స్‌ను గిరాటేశాడు. అప్పటికి క్రీజు బయట ఉండడంతో 8 పరుగులు చేసిన వైభవ్ స్టంపౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో కూడా విజయ్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.చదవండి: IPL 2027: రూ.20 కోట్లు ఇస్తే హెడ్‌కోచ్‌గా వస్తా? -
ఈస్ట్‌జోన్‌దే టైటిల్!.. చరిత్ర సృష్టించనున్న వైభవ్!
దులీప్ ట్రోఫీని ఈసారి ఈస్ట్ జోన్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫైనల్లో సౌత్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్‌జోన్‌కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్‌కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉండడంతో డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో ఏ జట్టు ఆధిక్యంలో నిలిస్తే వారికే దులీప్ ట్రోఫీ దక్కనుంది. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ 13 సంవత్సరాల తర్వాత టైటిల్ అందుకోనుంది. ఇదే సమయంలో జట్టులో సభ్యుడిగా ఉన్న వైభవ్ సూర్యవంశీ కూడా చరిత్ర సృష్టించనున్నాడు. వైభవ్ సూర్యవంశీ వయసు 15 ఏళ్లు కావడంతో, అత్యంత పిన్న వయస్సులో దులీప్ ట్రోఫీ నెగ్గిన జట్టలోని ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటికే టోర్నీలో సెమీఫైనల్లో హాఫ్ సెంచరీ సాధించి అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచిన వైభవ్, కప్‌ను ఈస్ట్‌జోన్ సొంతం చేసుకుంటే మాత్రం పైన చెప్పుకున్న ఘనత కూడా వైభవ్ ఖాతాలో చేరనుంది.డ్యాన్స్ చేసిన వైభవ్..ఇక మ్యాచ్‌లో సౌత్‌జోన్ ఇన్నింగ్స్ సందర్భంగా త్రిపురానా విజయ్ వికెట్ పడినప్పుడు వైభవ్ సూర్యవంశీ డ్యాన్స్ మూమెంట్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 708 పరుగులు చేసిన ఈస్ట్‌జోన్‌కు పోటీ ఇచ్చే క్రమంలో సౌత్‌జోన్ తరఫున ఆ జట్టు కెప్టెన్ తిలక్ వర్మతో పాటు దేవదత్ పడిక్కల్, సీవీ మిలింద్ కాస్త ప్రతిఘటించారు. తాను ఒక ఎండ్‌లో పాతుకుపోయినప్పటికీ, మరో ఎండ్‌లో మాత్రం వరుసగా వికెట్లు పడడంతో వైభవ్ ఉబ్బితబ్బియయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన త్రిపురానా విజయ్ కెప్టెన్‌తో ఏర్పడిన సయన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఖురేషీ వేసిన ఆఫ్‌స్టంప్ బంతిని తిలక్ వర్మ కట్‌షాట్ ఆడాడు. తనవైపు వచ్చిన బంతిని అభిజిత్ సర్కార్ వేగంగా అందుకొని అంతే వేగంతో వికెట్ కీపర్ ఇషాన్ వైపు విసిరాడు. అప్పటికే తిలక్ సింగిల్ తీయాలా వద్దా అనే డైలమాలోనే ముందుకు పరిగెత్తాడు. దీంతో కాస్త లేటుగా రనప్ అందుకున్న త్రిపురానా విజయ్ స్ట్రైక్ ఎండ్‌కు చేరేలోపే ఇషాన్ వికెట్లను గిరాటేయడంతో అతడు రనౌట్ అయ్యాడు. విజయానికి చేరువ కావడంతో సంతోషం పట్టలేని వైభవ్ చిన్న డ్యాన్స్ మూమెంట్ ఇవ్వడం కెమెరాలకు చిక్కింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌జోన్ 708 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (270) డబుల్ సెంచరీ సాధించగా, కుమార్ కుషాగ్ర (101) సెంచరీ చేశాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్థసెంచరీలు సాధించారు. సౌత్‌జోన్ బౌలర్లలో త్రిపురానా విజయ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం సౌత్‌జోన్ 107.3 ఓవర్లలో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ (99) ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకోగా, పడిక్కల్ (62) అర్థసెంచరీ సాధించాడు. ఈస్ట్‌జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు తీయగా, షమీ, ఖురేషి, శిఖర్ మోహన్ తలా 2 వికెట్లు పడగొట్టారు.Excellent reflex catch and run out ⚡️Top-fielding efforts bring wickets for East Zone 👌South Zone are 322/8 Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/FKDmQcDYG3— BCCI Domestic (@BCCIdomestic) September 9, 2026Read: ‘పూటుగా తాగి పీడకలనుకొని మరిచిపోతా’ -
708 పరుగులు.. అయినా నో డిక్లరేషన్.. తెలివిలేదా?
దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో అతి భారీ స్కోరు సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టైటిల్ పోరులో.. ఇషాన్ కిషన్ సేన సమిష్టిగా రాణించింది.ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందిస్తే.. వన్‌డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ (85) భారీ స్కోరు దిశగా పునాది వేశాడు. నాలుగో స్థానంలో వచ్చిన సుదీప్ కుమార్ ఘరామీ (6) విఫలమైనప్పటికీ.. కెప్టెన్ ఇషాన్ కిషన్ మాత్రం పట్టుదలగా ముందుకు సాగాడు.270 పరుగులుఈ క్రమంలో ద్విశతకం పూర్తి చేసుకున్న తర్వాత ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినప్పటికీ.. ఆఖర్లో మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. మొత్తంగా 334 బంతులు ఎదుర్కొన్న లెఫ్టాండర్ బ్యాటర్.. 30 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 270 పరుగులు సాధించాడు. ఇషాన్‌కు తోడుగా కుమార్ కుశాగ్రా శతకం (101)తో చెలరేగాడు.I.C.Y.M.I2️⃣7️⃣0️⃣ runs3️⃣3️⃣4️⃣ balls3️⃣0️⃣ fours7️⃣ sixes8️⃣0️⃣.8️⃣3️⃣ SRWatch 🎥 highlights of Ishan Kishan's marathon knock 👌👌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/An6sT09tfu— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2026708 పరుగులు చేసి ఆలౌట్మిగిలిన వారిలో అనుకూల్ రాయ్ (45) ఎండీ కౌనేన్ ఖురేషి (40) రాణించగా.. టెయిలెండర్ మహ్మద్ షమీ 28 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్ ఈ మేరకు సమిష్టిగా రాణించి రెండు రోజులు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేసింది. మొత్తంగా మొదటి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ 163 ఓవర్లు ఆడి 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది.తెలివిలేదా?.. నిజానికి రెడ్‌బాల్ మ్యాచ్‌లో ఫలితం తేలాలంటే.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఈ స్థాయి భారీ స్కోరు సాధించడం కంటే.. కాస్త ముందుగానే డిక్లేర్ చేసి.. ఫలితం సాధించే దిశగా ముందుకు వెళ్తుంది. కానీ ఇషాన్ కిషన్ మాత్రం జట్టు ఆలౌట్ అయ్యేంత వరకు బ్యాటింగ్ చేయించాడు. ఇందుకు రెండు రోజులు తీసుకున్నాడు.నిబంధనల ప్రకారమే తెలివిగానిజానికి ఇలా చేయడం ద్వారా మ్యాచ్ డ్రా అవుతుందే తప్ప ఫలితం తేలదు. అయినా ఇషాన్ ఎందుకిలా చేశాడు?.. ఇషాన్ మాత్రమే కాదు.. ఆ స్థానంలో ఏ కెప్టెన్ ఉన్నా ఇలాగే చేస్తాడు. ఎందుకంటే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రెడ్‌బాల్ క్రికెట్ నిబంధనల ప్రకారం..రంజీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఫైనల్ మ్యాచ్ కోసం టెస్టు మాదిరే ఐదు రోజులు కేటాయిస్తారు. అయితే, ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే గనుక తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. అందుకే ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసేందుకే మొగ్గుచూపింది.336 పరుగులకే ఆలౌట్.. ఈస్ట్ జోన్ గెలుపు లాంఛనమేఇక సౌత్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 709 పరుగులు చేస్తేనే మ్యాచ్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. కానీ తిలక్ వర్మ కెప్టెన్సీలోని సౌత్ జోన్ ఈ విషయంలో దారుణంగా విఫలమైంది. బుధవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఫలితంగా ఈస్ట్ జోన్‌కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక బుధవారం ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉండగా.. గురువారం ఒక్కరోజు మిగిలి ఉంది. ఇలాంటి సమయంలో ఈస్ట్ జోన్ ఫాలో ఆన్ ఆడించకుండా డ్రా చేసుకునేందుకే మొగ్గుచూపే అవకాశం ఉంది. కాబట్టి దులిప్ ట్రోఫీ-2026 విజేతగా ఈస్ట్ జోన్ గెలుపు లాంఛనమే అని చెప్పవచ్చు.చదవండి: టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరంటే? -
వైభవ్..నువ్వు సూపర్ రా! బుడోడిపై ఇషాన్ ప్రశంసలు
-
వారెవ్వా వైభవ్ సూర్యవంశీ!.. ఇషాన్‌ను ఒప్పించి మరీ!
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విమర్శించిన వాళ్లకు ఆటతో పాటు నాయకత్వ నైపుణ్యాలతోనూ అదిరిపోయేలా కౌంటర్ ఇస్తున్నాడంటూ కొనియాడుతున్నారు. కాగా రెడ్‌బాల్ క్రికెట్లో అంతగా అనుభవం లేనప్పటికీ పదిహేనేళ్ల వైభవ్‌కు బీసీసీఐ కీలక బాధ్యతను అప్పగించిన సంగతి తెలిసిందే.అపుడే వైస్ కెప్టెన్‌గానా?ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2026 టోర్నీలో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్‌కు వైభవ్‌ను డిప్యూటీగా నియమించింది. దీంతో చిన్న వయసులోనే, అనుభవం లేని వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా ఎలా నియమిస్తారని భారత మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.అయితే, వైభవ్ అటు ఆటగాడిగా రాణిస్తూనే.. తన నాయకుడిగానూ తానేం తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. సెంట్రల్ జోన్‌తో సెమీ ఫైనల్లో ఇషాన్ గైర్హాజరీలో వైభవ్ ఒకరోజు మొత్తం కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది.708 పరుగులకు ఆలౌట్ఇక టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ సౌత్ జోన్‌తో తలపడుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో.. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 708 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఈ క్రమంలో మంగళవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా సౌత్ జోన్ తమ బ్యాటింగ్ మొదలుపెట్టింది.సందిగ్దంలో జట్టుఈ నేపథ్యంలో ఆరో ఓవర్లో ఈస్ట్ జోన్ పేసర్ ముకేశ్ కుమార్ వేసిన రెండో బంతిని సౌత్ జోన్ ఓపెనర్ రికీ భుయ్ బౌండరీ దిశగా తరలించే ప్రయత్నం చేశాడు. అయితే, లెంగ్త్‌ను తప్పుగా అంచనా వేసిన రికీ షాట్ ఆడటంలో విఫలం కాగా.. వికెట్ కీపర్ కుమార్ కుశాగ్రా బంతిని క్యాచ్ పట్టి.. అప్పీలు చేశాడు.ఇషాన్‌ను ఒప్పించిన వైభవ్అయితే, ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దీంతో రివ్యూకు వెళ్లాలా? వద్దా? అన్న సందేహంలో ఉన్న కెప్టెన్ ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లిన వైభవ్ సూర్యవంశీ.. ‘రివ్యూ తీసుకో.. పర్లేదు’ అంటూ సలహా ఇచ్చాడు. కానీ మిగతా ఆటగాళ్లు మాత్రం బంతి ముందుగా బ్యాట్‌ను తాకిందా? లేదంటే ప్యాడ్‌కు తాకిందా? అనే సందేహంలో ఉన్నారు.అయితే, ఇషాన్ కిషన్ వైభవ్ మాట మీద నమ్మకంతో రివ్యూకు వెళ్లగా.. రికీ భుయ్ అవుటైనట్లు తేలింది. దీంతో ఈస్ట్ జోన్ సంబరాలు అంబరాన్నంటాయి. వైభవ్ సూర్యవంశీని ఇషాన్, ముకేశ్‌తో పాటు మిగతా జట్టు సభ్యులందరూ అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దులిప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ తొలి ఇన్నింగ్స్‌లో 37 బంతులు ఎదుర్కొని 44 పరుగులు చేశాడు.చదవండి: IND vs AUS: భారత జట్టులో మార్పులు🗣️ Take it...take itVaibhav Sooryavanshi 🤝 ReviewThe vice-captain urges the captain to take the review, and it turns out to be successful 🙌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/MmtESDSnMy— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2026 -
ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్
-
సెంచరీతో ఇరగదీసిన ఇషాన్ కిషన్.. తొలిరోజు ఈస్ట్‌జోన్‌దే
చెన్నై చిదంరం స్టేడియం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్ తొలిరోజే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అజేయ సెంచరీతో కదం తొక్కడంతో ఆ జట్టు భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. ఆదివారం సౌత్‌జోన్‌తో మొదలైన ఫైనల్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్‌జోన్ 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (135 బంతుల్లో 111 నాటౌట్), కుమార్ కుషాగ్ర (75 బంతుల్లో 63 నాటౌట్) క్రీజులో ఉన్నారు. సౌత్‌జోన్ బౌలర్లలో సీవీ మిలింద్ 2 వికెట్లు తీయగా, త్రిపురాణా విజయ్ ఒక వికెట్ పడగొట్టాడు.వైభవ్ మాస్.. అభిమన్యు, శిఖర్ క్లాస్టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్‌జోన్‌కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. వన్డే తరహాలో వేగంగా ఆడిన వైభవ్ సూర్యవంశీ (35 బంతుల్లో 44, 5 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టాడు. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (86 బంతుల్లో 72 పరుగులు) మరో ఎండ్‌లో నింపాదిగా ఆడాడు. వైభవ్ ఔటయ్యాకా బరిలోకి దిగిన శ్రీకర్ మోహన్ (120 బంతుల్లో 85 పరుగులు) కూడా తనదైన శైలి బ్యాటింగ్‌తో అలరించాడు. అభిమన్యు, సుదీప్ కుమార్ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగిన్పటికీ, శిఖర్‌కు జత కలిసిన ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. సౌత్‌జోన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ఇషాన్ అర్ధసెంచరీ మార్క్ చేరుకున్నాడు. శిఖర్ ఔటైనప్పటికీ, కుమార్ కుషాగ్ర వేగంగా ఆడి పరుగులు రాబట్టాడు. ఇషాన్ కిషన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా ఇషాన్ కిషన్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇది పదో సెంచరీ. అనంతరం కాసేపటికే కుమార్ కుషాగ్ర కూడా అర్థసెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో మరో 10 ఓవర్లు మిగిలి ఉండగానే బ్యాడ్‌లైట్ కారణంగా అంపైర్లు తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు.💯 for Ishan Kishan 👏He brings it up in style 💥The East Zone captain leading from the front with a superb knock 🙌Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/ql9el4G60Q— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026చదవండి: సాత్విక్-చిరాగ్ జోడీ చరిత్ర.. చైనా గోడను బద్దలుకొట్టి విజేతలుగా! -
ఏంటి వైస్ కెప్టెన్.. ఇంత స్లోగా ఆడుతున్నావ్?
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలోనూ సత్తాచాటుతున్నాడు. సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు సౌత్ జోన్‌తో జరుగుతున్న తుది పోరులోనూ అదరగొట్టాడు.టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను సైతం ఈ చిచ్చరపిడుగు వదల్లేదు. కేవలం 37 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసి సౌత్ జోన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.తిలక్ మాస్టర్ ప్లాన్అయితే దూకుడుగా ఆడుతూ డేంజర్‌గా మారుతున్న వైభవ్‌ను అడ్డుకోవడానికి వైభవ్‌ను కట్టడి చేసేందుకు సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేశాడు. వైభవ్ దగ్గరకు వెళ్లి, "ఏంటి వైస్ కెప్టెన్.. ఇంత స్లోగా ఆడుతున్నావు?" అంటూ చిన్నగా మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు.తిలక్ విసిరిన ఈ మాటల వలలో పడ్డ వైభవ్, ఒక్కసారిగా ఏకాగ్రత కోల్పోయాడు. తర్వాతి బంతికే భారీ పుల్ షాట్‌కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో వైభవ్ ఆధిపత్యానికి తెరపడింది. తిలక్ వర్మ వేసిన ఈ మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోందితుది జట్లుఈస్ట్ జోన్: అభిమన్యు ఈశ్వరన్, వైభవ్ సూర్యవంశీ, కుమార్ కుషాగ్రా, సుదీప్ కుమార్ ఘరామి, శిఖర్ మోహన్, ఇషాన్ కిషన్(కెప్టెన్), మహ్మద్ కౌనైన్ ఖురైషి, అనుకుల్ రాయ్, మహమ్మద్ షమీ, అభిజిత్ కె సర్కార్, ముఖేష్ కుమార్సౌత్ జోన్: రికీ భుయ్, నారాయణ్ జగదీషన్(వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షేక్ రషీద్, తిలక్ వర్మ(కెప్టెన్), స్మరణ్ రవిచంద్రన్, శ్రేయస్ గోపాల్, త్రిపురాన విజయ్, మహ్మద్ సిరాజ్, చామ వి మిలింద్, మహ్మద్ నిధీష్చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్Tilak Verma vs Vaibhav Suryavanshi. pic.twitter.com/YIDfgF0qps— Ishan's Fan (@Ishanworld32) September 6, 2026 4️⃣,6️⃣,4️⃣Vaibhav Sooryavanshi on the charge with some delightful shots 🔥The 50-run stand also comes up between Vaibhav and Abhimanyu Easwaran 🙌Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/0XLR4LI50R— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026 -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. సిరాజ్‌ను సైతం వదల్లేదు
చెన్నై వేదికగా సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మెరుపులు మెరిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో తనదైన శైలిలో సూర్యవంశీ విరుచుకుపడ్డాడు. సౌత్‌జోన్‌కు ప్రాతనిధ్యం వహిస్తున్న స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను సైతం వైభవ్ వదల్లేదు. 7వ ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో వైభవ్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 14 పరుగులు పిండుకున్నాడు. ఓవరాల్‌గా 37 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేశాడు. మరోసారి షార్ట్ లెంగ్త్ డెలివరీకే వైభవ్ తన వికెట్‌ను కోల్పోయాడు. సీవీ మిలింద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద సూర్యవంశీ దొరికిపోయాడు. ఇక ఈస్ట్‌జోన్ 21 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది.తుది జట్లుఈస్ట్ జోన్: అభిమన్యు ఈశ్వరన్, వైభవ్ సూర్యవంశీ, కుమార్ కుషాగ్రా, సుదీప్ కుమార్ ఘరామి, శిఖర్ మోహన్, ఇషాన్ కిషన్(కెప్టెన్), మహ్మద్ కౌనైన్ ఖురైషి, అనుకుల్ రాయ్, మహమ్మద్ షమీ, అభిజిత్ కె సర్కార్, ముఖేష్ కుమార్సౌత్ జోన్: రికీ భుయ్, నారాయణ్ జగదీషన్(వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షేక్ రషీద్, తిలక్ వర్మ(కెప్టెన్), స్మరణ్ రవిచంద్రన్, శ్రేయస్ గోపాల్, త్రిపురాన విజయ్, మహ్మద్ సిరాజ్, చామ వి మిలింద్, మహ్మద్ నిధీష్చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్4️⃣,6️⃣,4️⃣Vaibhav Sooryavanshi on the charge with some delightful shots 🔥The 50-run stand also comes up between Vaibhav and Abhimanyu Easwaran 🙌Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/0XLR4LI50R— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026 -
వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా
-
'అతడి కోసమే నా భార్య క్రికెట్ చూస్తోంది'
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెడ్ బాల్ క్రికెట్లోనూ సత్తాచాటుతున్నాడు. సెంట్రల్ జోన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ సెమీ-ఫైనల్లో ఈస్ట్‌జోన్ తరపున సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 132 పరుగులు చేసి తన జట్టు ఫైనల్‌కు చేరడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అయితే టీ20ను తలపిస్తూ బ్యాటింగ్ చేశాడు. ఓ దశలో తన ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్‌ను సునాయసంగా అందుకునేలా కనిపించిన సూర్యవంశీ.. 92 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. ఇప్పుడు సెప్టెంబర్ 6 నుంచి సౌత్‌జోన్‌తో ప్రారంభం కానున్న ఫైనల్ మ్యాచ్‌కు సూర్యవంశీ సన్నదమవుతున్నాడు.ఈ నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్‌పై భారత మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ ఒక అద్భుతమని, అతడి కారణంగానే తన భార్య దులీప్ ట్రోఫీని చూస్తుందని శ్రీకాంత్ వెల్లడించాడు.వైభవ్ ప్రస్తుతం మంచి రిథమ్‌లో ఉన్నాడు. అతడిని ప్రోత్సహించాలి గానీ, ఎప్పుడూ నిరుత్సాహపరచకూడదు. సరైన మార్గంలో నడిపిస్తే భవిష్యత్తులో అతడు కచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడు. టెస్ట్ క్రికెట్‌కు పూర్వ వైభవం తెచ్చే సత్తా వైభవ్‌కు ఉంది. అతడి ఆట తీరు వల్లే అందరూ ఇప్పుడు దులీప్ ట్రోఫీని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఆఖరికి మా భార్య కూడా వైభవ్‌కు పెద్ద అభిమానిగా మారిపోయింది. కేవలం అతడి బ్యాటింగ్ చూడడం కోసమే ఆమె దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లను వీక్షిస్తోంది" అని చిక్కా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా ఈ బిహార్ క్రికెటర్ ఇప్పటికే వరల్డ్ క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. అటు అండర్-19 నుంచి ఇటు అంతర్జాతీయ క్రికెట్ వరకు ఎన్నో అద్భుత రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చదవండి: సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్! -
సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్!
నమీబియా వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 టోర్నమెంట్లో దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్‌కు చేరింది. శుక్రవారం చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 11 పరుగుల తేడాతో ఆతిథ్య నమీబియాపై విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఒక పరాజయంతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకోగా... జింబాబ్వే 2 విజయాలు, 2 ఓటములతో 4 పాయింట్లు సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లుహాన్ ప్రిటోరియస్ (53 బంతుల్లో 101; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కగా... మరో ఓపెనర్ కానర్ ఎస్తెర్హుజెన్ (40 బంతుల్లో 88, 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) దంచికొట్టారు.ఈ జంట తొలి వికెట్‌కు 11.3 ఓవర్లలోనే 156 పరుగులు జోడించడం విశేషం. నమీబియా బౌలర్లలో జాన్ బాల్ట్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో వీరోచితంగా పోరాడిన నమీబియా... చివరకు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 217 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్లు లారెన్ స్టీన్‌క్యాంప్ (44 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), జాన్ ఫ్రైలింక్ (36 బంతుల్లో 72; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకాలతో పోరాడినా ఫలితం లేకపోయింది. సఫారీ బౌలర్లలో నొబాని మొకోనా 2 వికెట్లు పడగొట్టాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో జింబాబ్వేతో దక్షిణాఫ్రికా తలపడనుంది.ప్రిటోరియస్ వరల్డ్ రికార్డ్ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటిన ప్రిటోరియస్ ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్ తరపున సెంచరీ సాధించిన అతి పిన్న వయష్కుడిగా ప్రిటోరియస్ రికార్డులకెక్కాడు. సఫారీ సూపర్ స్టార్ 20 ఏళ్ల 161 రోజుల వయసులో ఈ ఘనతను సాధించాడు. ఇంతకముందు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్(20 ఏళ్ల 337 రోజులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో జజాయ్‌ను ప్రిటోరియస్ అధిగమించాడు. స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సెంచరీ సాధిస్తే.. ప్రిటోరియస్ రికార్డ్‌ను బ్రేక్ చేస్తాడు.చదవండి: నేడు పాకిస్తాన్‌తో భారత్ ఢీ -
వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ప్రత్యేక నిఘా!
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించనుంది. పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరేంగట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ కెరీర్ తొందరగా ముగియకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళికలు చేపట్టనుంది. వైభవ్‌ను చూస్తుంటే భవిష్యత్తు సచిన్‌లా కనిపిస్తున్న తరుణంలోనే అతడి కెరీర్ ఒక్క సిరీస్, ఏడాది లేదా రెండేళ్లకే పరిమితం కాకూడదని, అతడి కెరీర్ సుదీర్ఘంగా సాగాలని బీసీసీఐ భావిస్తోంది. వైభవ్‌తో పాటు ప్రతిభ చూపుతున్న యువ ఆటగాళ్లకు సరైన మార్గదర్శకత్వం, సహకారం అందించాలని ముంబైలో గురువారం నిర్వహించిన బీసీసీఐ కీలక సమావేశంలో నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆటగాడిని ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సచిన్ టెండూల్కర్‌లా వైభవ్ సూర్యవంశీ దేశానికి సుదీర్ఘకాలం సేవలందించే ఆటగాడిగా ఎదగాలని బీసీసీఐ కోరుకుంటోందని చెప్పారు. అతడి కెరీర్‌ను ప్రతి దశలోనూ నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సీవోఈ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఇటీవలే వైభవ్ 15 ఏళ్ల 157 రోజుల వయసులో దులీప్ ట్రోఫీ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అర్ధశతకం చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 57 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. భారత్ ఆ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ద్వారా భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అతడు 776 పరుగులు చేశాడు. 237.30 స్ట్రైక్‌రేట్‌తో ఆడాడు. ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలు బాదాడు. 72 సిక్సర్లతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.చదవండి: హాంకాంగ్‌పై విజయం.. స్మృతి మంధాన కన్నీటిపర్యంతం! -
సిరాజ్‌తో పాటు ఆ ఇద్దరు టీమిండియా స్టార్లకు పిలుపు!
దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్ టోర్నమెంట్ దులిప్ ట్రోఫీ-2026 సీజన్ తుదిదశకు చేరుకుంది. సెప్టెంబరు 6న మొదలయ్యే ఫైనల్లో ఈస్ట్ జోన్- సౌత్ జోన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందుకు చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియం వేదిక.ముగ్గురు టీమిండియా స్టార్లకు పిలుపుఈ నేపథ్యంలో దులిప్ ట్రోఫీ ఫైనల్లో ఆడాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి ముగ్గురు టీమిండియా స్టార్లకు పిలుపు వచ్చినట్లు సమాచారం. భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్, శతకాల వీరుడు దేవదత్ పడిక్కల్ సౌత్ జోన్ తరఫున బరిలోకి దిగనున్నట్లు PTI వెల్లడించింది.కాగా ఈ ముగ్గురూ ఇటీవల శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టులు ఆడారు. అయితే, సాయి సుదర్శన్ గాయం కారణంగా దూరం కాగా.. పడిక్కల్ ఊహించని రీతిలో తుదిజట్టులోకి వచ్చాడు. మూడో స్థానంలో వచ్చి రెండు సెంచరీలతో అలరించాడు.మళ్లీ దేశీ క్రికెట్ బరిలోతదుపరి న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా టెస్టులు ఆడాల్సి ఉండగా.. పడిక్కల్ మళ్లీ దేశీ క్రికెట్ బరిలో దిగుతుండటం విశేషం. దులిప్ ట్రోఫీ ఫైనల్లోనూ సత్తా చాటి టీమిండియాలో తన స్థానం సుస్థిరం చేసుకోవాలని పడిక్కల్ పట్టుదలగా ఉన్నాడు.ఇక కేఎల్ రాహుల్‌తో పాటు పడిక్కల్ కూడా దేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ఆడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు చివరగా ఫిబ్రవరి 2026లో జమ్మూ కశ్మీర్‌తో రంజీ ట్రోఫీ ఫైనల్లో బరిలోకి దిగారు. అయితే, జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ఇక సిరాజ్ హైదరాబాద్ ఆటగాడన్న సంగతి తెలిసిందే.స్టార్ల మధ్య పోరు దులిప్ ట్రోఫీ ఫైనల్ నేపథ్యంలో కేఎల్ రాహుల్, పడిక్కల్, సిరాజ్ సౌత్ జోన్‌కు ఆడనున్నారు. ఈ జట్టుకు టీమిండియా స్టార్ తిలక్ వర్మ కెప్టెన్. మరోవైపు.. ఈస్ట్ జోన్‌ను ఫైనల్‌కు చేర్చడంలో టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన వంతు పాత్ర పోషించాడు. ఈ జట్టుకు భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్ కాగా.. వైభవ్ అతడికి డిప్యూటీ.టీమిండియా స్టార్ల రాకతో దులిప్ ట్రోఫీ ఫైనల్ మరింత రసవత్తరంగా మారనుంది. తిలక్ వర్సెస్ ఇషాన్ పోరులో.. రాహుల్, పడిక్కల్, సిరాజ్... వైభవ్ సూర్యవంశీ ఆట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సౌత్ జోన్లో తనయ్ త్యాగరాజన్ స్థానాన్ని సిరాజ్ భర్తీ చేస్తున్నట్లు సమాచారం.చదవండి: టీమిండియా హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ -
దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?
-
వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! అస్సలు ఊహించి ఉండడు?
టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ తిరిగి జాతీయ టీ20 జట్టులోకి వచ్చాడు. జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న శాంసన్‌ను.. అఫ్గానిస్తాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. దీంతో అఫ్గాన్ సిరీస్‌లో భారత ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. జింబాబ్వే టూర్లో శాంసన్ లేకపోవడంతో భారత ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ ప్రారంభించారు. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలో సంజూ విఫలం కావడంతో సూర్యవంశీకి ఓపెనర్‌గా అవకాశమిచ్చారు. కానీ సంజూ స్ధానంలో జట్టులోకి వచ్చిన వైభవ్ కూడా తీవ్ర నిరాశపరిచాడు.దీంతో ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20కు వైభవ్‌ను తప్పించి శాంసన్‌ను మళ్లీ తుది జట్టులోకి తీసుకొచ్చారు. ఆ మ్యాచ్‌లో శాంసన్ 27 పరుగులు సాధించి జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చాడు. అయినప్పటికి ఆ తర్వాత జింబాబ్వే టీ20 సిరీస్‌కు అతడిని పక్కన పెట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది. టీ20 ప్రపంచకప్ హీరోని జట్టు నుంచి తప్పిస్తారా? అని సెలక్టర్లపై చాలా మంది మాజీలు మండిపడ్డారు. అయితే అతడిని జట్టు నుంచి తప్పించలేదని, కేవలం విశ్రాంతి మాత్రమే ఇచ్చారని బీసీసీఐ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. ఇప్పుడు మళ్లీ సంజూ టీ20 జట్టులోకి వచ్చాడు.ఈ క్రమంలో సంజూ రాకతో వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్ తగిలే అవకాశముంది. ఎప్పటిలాగే భారత ఇన్నింగ్స్‌ను సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే 15 ఏళ్ల సూర్యవంశీ బెంచ్‌కు పరిమితం కావాల్సిందే. ఒకవేళ శాంసన్ విఫలమైతేనే వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కనున్నట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్ జట్టుకు సూర్యవంశీ ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్‌తో సిరీస్ ప్రారంభం కానుండటంతో, తొలి మ్యాచ్ ఎంపికకు అతడు అందుబాటులో ఉండటం అనుమానంగానే మారింది.చదవండి: అతడు జట్టులో ఎందుకు? ముగ్గురిలో.. ఇద్దరు ఫిట్‌గా లేరు.. గ్రేట్! -
మరోసారి దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ.. కానీ!
దులిప్ ట్రోఫీ-2026 సెమీ ఫైనల్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో వరుసగా బౌండరీలు బాది దుమ్ములేపాడు. అయితే, ఆఖరికి యశ్ ఠాకూర్ పైచేయి సాధించడంతో.. అదే ఓవర్లో అవుటై వైభవ్ పెవిలియన్ చేరాడు.దులిప్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో భాగంగా ఈస్ట్ జోన్- సెంట్రల్ జోన్ తలపడుతున్నాయి. బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. సౌత్ జోన్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ అయింది.ధనాధన్ఆ తర్వాత ఈస్ట్ జోన్ సైతం సరిగ్గా 266 పరుగులే చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ హాఫ్ సెంచరీ (69) సాధించగా.. వైభవ్ సూర్యవంశీ ఆది నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పొట్టి క్రికెట్ మాదిరి చెలరేగి కేవలం 42 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.ఆ తర్వాత కూడా ఇదే జోరు కొనసాగించిన వైభవ్ సూర్యవంశీ.. సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఏడు ఫోర్లు, ఏడు సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేశాడు. అయితే, హర్ష్ దూబే బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి విఫలం కాగా.. అర్షద్ ఖాన్ క్యాచ్ పట్టడంతో వైభవ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.నెమ్మదిగా మొదలుపెట్టినా..ఇదిలా ఉంటే.. సౌత్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 158 పరుగులకే కుప్పకూలింది. దీంతో మంగళవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఈస్ట్ జోన్ 159 పరుగుల లక్ష్య ఛేదనకు దిగింది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ ఆరంభంలో కాస్త నెమ్మదిగానే ఆడినా.. 14వ ఓవర్లో మాత్రం దూకుడు ప్రదర్శించాడు. 4⃣,6⃣,4⃣,4⃣, 🇼Vaibhav Sooryavanshi 🆚 Yash Thakur battle part 2⃣ 🔥#DuleepTrophy | #CZvEZScorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/wX8L5AHdTB— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026ఆఖరి బంతికి అవుట్సౌత్ జోన్ పేస్ బౌలర్ యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో మొదటి బంతికి ఫోర్ బాదిన వైభవ్.. రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. మూడు, నాలుగు బంతుల్లో మళ్లీ ఫోర్లు బాదాడు. అయితే, ఐదో బంతికి పరుగుకు యత్నించని వైభవ్.. ఆఖరి బంతికి మరోసారి షాట్‌కు యత్నించి వికెట్ సమర్పించుకున్నాడు.What. A. Catch 😮Central Zone captain Rajat Patidar pulls off an absolute blinder 🔥Scorecard ▶️ https://t.co/kyExeix2VY#DuleepTrophy | #CZvEZ pic.twitter.com/NfAD3Kk9RH— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026యశ్ ఠాకూర్ వేసిన బౌండరీ వైపు తరలించగా.. సౌత్ జోన్ కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకోవడంతో వైభవ్ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. లక్ష్య ఛేదనలో మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 40 పరుగులు చేశాడు. చదవండి: ‘నువ్వెంత కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’ -
రింకూ సింగ్ విఫలం.. వైభవ్ సూర్యవంశీ దంచికొడితే!
దులిప్ ట్రోఫీ-2026 సెమీ ఫైనల్లో ఈస్ట్ జోన్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. సెంట్రల్ జోన్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ వరుస విరామాల్లో వికెట్లు కూల్చారు. ఫలితంగా సెంట్రల్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 158 పరుగులకే కుప్పకూలింది.నామమాత్రపు లక్ష్యంతద్వారా ఈస్ట్ జోన్‌కు 159 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని విధించగలిగింది. కాగా బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ సెమీస్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే, కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడగా.. అతడి డిప్యూటీ వైభవ్ సూర్యవంశీ తొలిరోజే తాత్కాలిక కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు.ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్.. సెంట్రల్ జోన్‌ను 266 పరుగులకు ఆలౌట్ చేసింది. ముకేశ్ కుమార్, అభిజీత్ సర్కార్ మూడేసి వికెట్లు కూల్చగా.. మహ్మద్ షమీ, ఎండీ కౌనియన్ ఖురేషి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.టీ20 ఫార్మాట్ తరహాలో ధనాధన్అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా 266 పరుగులకే ఆలౌట్ అయింది. ఈస్ట్ జోన్ ఈ స్కోరు చేయడంలో ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్, వైభవ్ సూర్యవంశీదే కీలక పాత్ర. అభిమన్యు అర్ధ శతకం (106 బంతుల్లో 69)తో ఆకట్టుకోగా.. వైభవ్ మాత్రం టీ20 ఫార్మాట్ తరహాలో ధనాధన్ దంచికొట్టాడు.అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది 92 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో సుదీప్ ఘరామి (25) ఒక్కడే చెప్పుకోగదగ్గ స్కోరు చేశాడు.చెలరేగిన ముకేశ్ కుమార్, షమీఈ క్రమంలో రెండో రోజు తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్ జోన్.. ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ఇక మంగళవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 158 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లలో అమన్ మోఖడే (41) రాణించాడు. సౌత్ జోన్ ఇన్నింగ్స్‌లో అతడిదే టాప్ స్కోరు.Superb bowling 🙌Mukesh Kumar outsmarts Aman Mokhade with an excellent setup👌#DuleepTrophy | #CZvEZ pic.twitter.com/voMx1Bt43n— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026మిగిలిన వారిలో రింకూ సింగ్ (20) నిరాశపరచగా.. హర్ష్ దూబే 24, అర్షద్ ఖాన్ 25 పరుగులు రాబట్టారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ షమీ మూడు వికెట్లు కూల్చాడు. అనుకుల్ రాయ్, ఎండీ కౌనియన్ ఖురేషి, అభిజిత్ సర్కార్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. మూడో రోజు ఆట సందర్భంగా ఈస్ట్ జోన్ సారథి ఇషాన్ కిషన్ తిరిగి వచ్చాడు. దీంతో బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టమైంది.Brilliant reflexes 👌Mohd. Shami pulls off a fantastic one-handed-catch off his own bowling to dismiss Harsh Dubey 🙌#DuleepTrophy | #CZvEZScorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/G7ZYgbpmi7— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026ఇక సౌత్ జోన్ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఈస్ట్ జోన్ బరిలోకి దిగింది. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరే వైభవ్ సూర్యవంశీ దంచికొడితే మాత్రం ఈస్ట్ జోన్ సులువుగానే ఫైనల్ చేరడం ఖాయం.చదవండి: భారత్‌తో సిరీస్.. ఆసీస్ జట్ల ప్రకటన -
కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్ బ్యాడ్ టైం అంటే ఇదేరా బుద్దోడా
-
సచిన్‌ను వెంటాడిన ఫోబియా వైభవ్‌కు అంటుకుందా?
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు (అన్ని ఫార్మాట్లు) సాధించిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే సచిన్‌కు నెర్వస్ నైంటీస్ ఫోబియా ఉండేది. ఈ కారణంగా సచిన్ చాలాసార్లు సెంచరీలు చేజార్చుకున్నాడు. ఒకవేళ సచిన్‌కు 90 ఫోబియా లేకపోయుంటే అతడి ఖాతాలో 150 సెంచరీలు ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా చిన్న వయసులోనే క్రికెట్లో అడుగుపెట్టి సచిన్ రికార్డును బద్దలుకొట్టిన వైభవ్ సూర్యవంశీని కూడా 90 ఫోబియా చుట్టుముట్టేసింది. ఈ మధ్యకాలంలో వైభవ్ తొంభైల్లో చాలాసార్లు ఔటయ్యాడు.ఇటీవలి కాలంలో ఐపీఎల్ నుంచి దేశవాళీ టోర్నీలు, అనధికారిక మ్యాచ్‌లు చూసుకుంటే వైభవ్ వరుసగా 93 (38 బంతుల్లో), 97 (29 బంతుల్లో), 96 (47 బంతుల్లో), తాజాగా దులీప్ ట్రోఫీలో 92 పరుగుల వద్ద సెంచరీలకు అతి సమీపంలోకి వచ్చి అవుట్ అయ్యాడు. ఇలా ఇప్పటికే నాలుగు సెంచరీలను చేజార్చుకున్నాడు.ఏమిటీ నెర్వస్ నైంటీస్?90 ఫోబియాను క్రికెట్ పరిభాషలో "నెర్వస్ నైంటీస్" (Nervous Nineties) అని పిలుస్తారు. ఒక బ్యాటర్ సెంచరీ (100 పరుగులు) మైలురాయికి చేరుకునే ముందు, 90 నుండి 99 పరుగుల మధ్య ఒత్తిడికి గురై అవుట్ అవ్వడాన్ని ఇది సూచిస్తుంది. సాధారణంగా బ్యాటర్లు 90ల్లోకి రాగానే సెంచరీ కోసం కాస్త నెమ్మదిగా ఆడతారు. ఈ తరుణంలో అనవసర ఒత్తిడికి లోనయ్యి వికెట్‌ను ఇచ్చేసుకుంటారు. సచిన్ తన కెరీర్లో చాలాసార్లు ఈ నెర్వస్ నైంటీస్ను ఎదుర్కొన్నాడు. తాజాగా వైభవ్‌ను కూడా నెర్వస్ నైంటీస్ ఫోబియా చుట్టుముట్టినట్లుగా అనిపిస్తోంది.ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. రజత్ పటీదార్ (5), ఆర్యన్ పాండే (4) క్రీజులో కొనసాగుతున్నారు. ప్రస్తుతం సెంట్రల్ జోన్ 43 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు ఈస్ట్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ కాగా, తొలి ఇన్నింగ్స్‌లో సెంట్రల్ జోన్ కూడా 266 పరుగులకే ఆలౌటైంది.HEARTBREAKING MOMENT FOR VAIBHAV SOORYAVANSHI !💔Vaibhav Suryavanshi missed his maiden century in the Duleep Trophy by just 8 runs. - Just look at the reaction of Vaibhav Suryavanshi 😭😭 pic.twitter.com/BYA3KPUSc3— lndian Sports Network (@IS_Netwrk29) August 31, 2026Read: దుమ్మురేపుతున్న షమీ.. ప్రొఫెషనల్ క్రికెట్లో అరుదైన ఫీట్ -
పాపం వైభవ్ సూర్యవంశీ!.. చరిత్రకెక్కినా చేదు అనుభవం!
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి చేదు అనుభవం ఎదురైంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సెంచరీ చేసే అవకాశాన్ని ఈ పదిహేనేళ్ల పిల్లాడు మరోసారి తృటిలో చేజార్చుకున్నాడు. కాగా దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2026లో వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సెమీ ఫైనల్లో భాగంగా కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడగా.. అతడి డిప్యూటీ అయిన వైభవ్ తాత్కాలిక సారథిగా పగ్గాలు చేపట్టాడు. బెంగళూరు వేదికగా ఆదివారం సెంట్రల్ జోన్‌తో మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈస్ట్ జోన్‌కు అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. కేవలం 42 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో విరుచుకుపడ్డ ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.100-run stand 🙌Vaibhav Sooryavanshi and Abhimanyu Easwaran with a solid opening stand so far 🤝Scorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/7eVSb3iuPU— BCCI Domestic (@BCCIdomestic) August 31, 2026 ఇదే జోరు కొనసాగిస్తూ వైభవ్ సూర్యవంశీ సెంచరీకి చేరువయ్యాడు. అయితే, 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్ష్ దూబే బౌలింగ్‌లో అర్షద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి ఈ ఓపెనింగ్ బ్యాటర్ పెవిలియన్‌కు చేరాడు. మొత్తంగా 81 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదిన వైభవ్ సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 93. ఇప్పుడు 92 పరుగుల వద్ద అవుటై దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మిస్ అయ్యాడు.తొలి ప్లేయర్‌గా ఘనతకాగా సెంచరీ చేజార్చుకున్నప్పటికీ అత్యంత పిన్న వయసులోనే దులిప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. 15 ఏళ్ల 157 రోజుల వయసులో అతడు ఈ ఘనత సాధించాడు.ఆల్ టైమ్ రికార్డు మిస్‌అయితే, కాస్త నెమ్మదిగా ఆడి ఉంటే.. దులిప్ ట్రోఫీ చరిత్రలో అత్యంత చిన్న వయసులోనే శతక్కొట్టిన ప్లేయర్‌గా వైభవ్ సూర్యవంశీ ఆల్‌టైమ్ రికార్డు సాధించేవాడు. కానీ హర్ష్ దూబే బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన వైభవ్ విఫలమయ్యాడు. బంతిని గాల్లోకి లేపగా డీప్ మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అర్షద్ క్యాచ్ పట్టడంతో వైభవ్ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇదిలా ఉంటే.. అభిమన్యు ఈశ్వరన్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.భోజన విరామ సమయానికి ఈస్ట్ జోన్ 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ 58, సుదీప్ కుమార్ ఘరామీ 16 పరుగులతో క్రీజులో నిలిచారు. వైభవ్ అవుటైన వెంటనే వన్‌డౌన్ బ్యాటర్ కుమార్ కుశాగ్రా డకౌట్‌గా వెనుదిరిగాడు.చదవండి: అదంతా నాటకం: పాక్ ఓపెనర్‌పై ఇంగ్లండ్ దిగ్గజం ఫైర్! -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దెబ్బకు 57 ఏళ్ల రికార్డ్ బ్రేక్
బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్‌జోన్ తాత్కాలిక కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ యువ సంచలనం.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. 15 ఏళ్ల వైభవ్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.ఈ క్రమంలో కేవలం 42 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 92 పరుగులు చేసి తన ఫస్ట్‌క్లాస్ సెంచరీని తృటిలో చేజార్చకున్నాడు. కాగా ఈ ఫైరీ ఫిప్టీతో సూర్యవంశీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.దులీప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల 157 రోజుల వయస్సులో సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత లెజెండరీ క్రికెటర్ లక్ష్మణ్ సింగ్ పేరిట ఉండేది. అతడు 1969లో 16 ఏళ్ల 23 ఏళ్ల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో 57 ఏళ్ల లక్ష్మణ్ సింగ్ రికార్డ్‌ను వైభవ్ బద్దలు కొట్టాడు.తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌జోన్ 25 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. క్రీజులో అభిమన్యు ఈశ్వరన్(53), ఎస్ కుమార్(4) ఉన్నారు. అంతకుముందు సెంట్రల్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. పేస్ బౌలర్లు ముకేశ్ కుమార్, అభిజిత్ కె. సర్కార్ తలా మూడు వికెట్లతో సత్తా చాటారు. వీరితో పాటు మహమ్మద్ షమీ, ఖురేషీ చెరో రెండు వికెట్లు తీశారు. సెంట్రల్ జోన్ బ్యాటర్లలో రింకూ సింగ్ (88 బంతుల్లో 60) అర్ధశతకంతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆర్యన్ జుయల్ (46), యశ్ ఠాకూర్ (30) పర్వాలేదనిపించారు.చదవండి: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. ప్రపంచ రికార్డ్ బ్రేక్100-run stand 🙌Vaibhav Sooryavanshi and Abhimanyu Easwaran with a solid opening stand so far 🤝Scorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/7eVSb3iuPU— BCCI Domestic (@BCCIdomestic) August 31, 2026 strong> -
పాపం సంజూ..! వైభవ్ సూర్యవంశీ దెబ్బకు కెరీర్ ఊహించని మలుపు!
శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు టీ20ల్లో అఫ్గానిస్తాన్‌తో తలపడేందుకు సిద్దమైంది. న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 13 నుంచి భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ సెప్టెంబర్ 3న ప్రకటించనున్నారు.అయితే జింబాబ్వే టూర్‌కు దూరమైన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సంజూ శాంసన్‌ను స్క్వాడ్‌లోకి తీసుకున్నా తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే. ఎందుకంటే ఓపెనర్‌గా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తనను నిరూపించుకున్నాడు.మరోసారి భారత ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలు ప్రారంభించే అవకాశముంది. అలాగే ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌కే యాజమాన్యం మొగ్గు చూపుతుండటంతో, సంజూ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. ఒకవేళ వైభవ్ లేదా ఇషాన్ విఫలమైతే శాంసన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కనుంది. మరోవైపు ఫిట్నెస్ సమస్యల కారణంగా స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు ఈ సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.అయితే తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లు మాత్రం పూర్తి ఫిట్నెస్ సాధించడంతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక పేస్ బౌలింగ్ బాధ్యతలను అర్ష్‌దీప్ సింగ్ లీడ్ చేయనున్నాడు. జింబాబ్వే టూర్‌కు దూరంగా ఉన్న అర్ష్‌దీప్ అఫ్గాన్ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. రీఎంట్రీలో ఆకట్టుకున్న యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ తన స్ధానాన్ని నిలబెట్టుకోనున్నాడు. అదేవిధంగా స్పిన్ బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, రవిబిష్ణోయ్‌లకు చోటు దక్కనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.అఫ్గానిస్తాన్‌తో టీ20లకు భారత జట్టు(అంచనా)శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్చదవండి: 11వ స్ధానంలో సరికొత్త చరిత్ర.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రికార్డ్ -
అంపైర్‌కే షాక్ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ.. 3 సెకెన్లలో! వీడియో వైరల్
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యహరిస్తున్నాడు. రెగ్యులర్ సారధి ఇషాన్ కిషన్ గాయం కారణంగా మైదానం వీడడడంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న వైభవ్ జట్టు బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడు తీసుకున్న ఒక సంచలన నిర్ణయం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. వైభవ్ అద్భుతమైన రివ్యూతో సెంట్రల్ జోన్ స్టార్ బ్యాటర్ ఆర్యన్ జుయల్‌ను పెవిలియన్‌కు పంపాడు.సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ తొలి బంతిని జుయల్‌కు ఔట్ సైట్ ఆఫ్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని ఆర్యన్ జుయల్ ఆఫ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ వికెట్ కీపర్ కుమార్ కుశాగ్ర చేతుల్లో పడింది. వెంటనే వికెట్ కీపర్‌తో పాటు ఈస్ట్ జోన్ ఆటగాళ్లు క్యాచ్‌కు అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ వైభవ్ మొదట రివ్యూ తీసుకోవాలా వద్దా అనే సందేహంలో పడ్డాడు. అయితే సహచర ఆటగాళ్లతో చర్చించి 3 సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉండగా వైభవ్ డీఆర్ఎస్కు వెళ్లాడు. థర్డ్ అంపైర్ 'అల్ట్రాఎడ్జ్' పరిశీలించగా బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టమైన స్పైక్ కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అవుట్‌గా ప్రకటించాడు. 15 ఏళ్ల వయసులోనే కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ చూపించిన సమయస్ఫూర్తికి జట్టు సభ్యులంతా హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: బీసీసీఐ బిగ్ ప్లాన్.. ఇంగ్లండ్‌కు ‘కాశ్మీర్ ఎక్స్‌ప్రెస్’ ఆకిబ్ నబీ!Stand-in Captain Vaibhav Sooryavanshi goes for the review with 3 seconds remaining...and gets it right 👏DRS done right as the set Aryan Juyal (46) is dismissed ✅The celebrations say it all 🙌#DuleepTrophy pic.twitter.com/IwBQbr8hJQ— BCCI Domestic (@BCCIdomestic) August 30, 2026 -
15 ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ
టీమిండియా యువ సంచలనం, బ్యాటింగ్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించాడు. 15 ఏళ్ల వయసులోనే సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి రికార్డు నెలకొల్పాడు. దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా సెంట్రల్ జోన్‌తో ఇవాళ మొదలైన తొలి సెమీఫైనల్లో వైభవ్ ఈస్ట్ జోన్ తాత్కాలిక కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.CAPTAIN VAIBHAV SOORYAVANSHI 🔥- Vaibhav Sooryavanshi is currently leading the Easy Zone team in Duleep Trophy. pic.twitter.com/cGaFDpceMD— Johns. (@CricCrazyJohns) August 30, 2026రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో గాయపడటంతో వైభవ్‌కు ఈ అవకాశం వచ్చింది. సీనియర్ జట్టు కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో వైభవ్ చిరునవ్వుతో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్ లాంటి సీనియర్ బౌలర్లను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. వారితో అతడు ఎలా వ్యవహరిస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వైభవ్‌కు ఇది కేవలం రెండో దులీప్ ట్రోఫీ మ్యాచ్. ఓవరాల్‌గా 10వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మాత్రమే. ఇంత తక్కువ అనుభవంలో షమీ లాంటి అనుభవజ్ఞుడైన పేసర్‌ను వైభవ్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈస్ట్ జోన్‌కు త్రిపుర పేసర్ అభిజిత్ సర్కార్ శుభారంభం అందించాడు. అమన్ మొఖాడే (8), కునాల్ చందేలా (6)లను ఆదిలోనే ఔట్ చేశాడు. కొద్ది సేపటికే ముకేశ్ కుమార్ సెంట్రల్ జోన్ కెప్టెన్ రజత్ పాటిదార్ (12)ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. దీంతో సెంట్రల్ జోన్ 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు స్కోర్ 81-3గా ఉంది. ఆర్యన్ జుయల్ (42), యశ్ రాథోడ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు సంబంధించి కీలక అప్డేట్స్ -
వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. టీమిండియా నుంచి ఆ ఇద్దరికే చోటు!
టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో టాప్ 5 ఆల్-ఫార్మాట్ ప్లేయర్లను ఎంచుకున్నాడు. ఈ జాబితాలో భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు అగ్రస్ధానం దక్కింది.ఆ తర్వాత రెండో స్ధానంలో ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు కార్తీక్ ఛాన్స్ ఇచ్చాడు. మూడు, నాలుగు స్దానాల్లో హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్), యశస్వి జైశ్వాల్(భారత్)కు చోటు దక్కింది. చివరగా ఐదో స్దానంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకు డీకే అవకాశమిచ్చాడు.కాగా టాప్ ప్లేస్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ గత కొంత కాలంగా వన్డే, టెస్టుల్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. భారత టీ20 జట్టుకు అతడు దూరంగా ఉన్నప్పటికి ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ లీగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ కారణంగానే గిల్‌ను ఆల్‌ఫార్మాట్ ప్లేయర్‌గా కార్తీక్ ఎంపిక చేశాడు. ట్రావిస్ హెడ్ కూడా మూడు ఫార్మాట్లలోనూ ఆసీస్‌కు కీలక ప్లేయర్‌గా మారాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే సత్తా అతడిది. ఇక ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లో కూడా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడుతున్నాడు. ప్రస్తుతం పాక్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ దుమ్ములేపుతున్నాడు. అయితే యశస్వి జైశ్వాల్, రచిన్ రవీంద్రలు మాత్రం గత కొంతకాలంగా తమస్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. అయినప్పటికి డికే వారికి బెస్ట్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ల జాబితాలో అవకాశమిచ్చాడు. కాగా ఈ లిస్ట్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు ఇచ్చి ఉంటే బాగుండేది అని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే 15 ఏళ్ల వైభవ్ ఇప్పటికే టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో తన సత్తాను నిరూపించుకున్నాడు. అయితే వైభవ్ ఇంకా భారత జట్టు తరపున టెస్టు, వన్డే డెబ్యూ చేయనుందున కార్తీక్ ఈ లిస్ట్‌లో చోటు ఇవ్వలేదు.చదవండి: ‘బౌలింగ్ ఇవ్వమని పేచీ.. క్యాచ్ డ్రాప్.. కోపంతో ఊగిపోయా’ -
బుడ్జోడి ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్.. ఆస్ట్రేలియా సిరీస్ లో నో ఛాన్స్.. అసలు కారణం ఇదే
-
వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం
టీమిండియా యువ సంచలనం, బ్యాటింగ్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని పేద, ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు వినియోగిస్తానని ప్రకటించాడు. అలాంటి విద్యార్థులు లేదా వారి గురించి తెలిసిన వారు తనను సంప్రదించాలని కోరాడు.I want to use my X payout to support a needy student’s education📚If you or someone you know is a genuinely deserving student who is struggling financially with school/college expenses, please come forward or tag them here.I’d be happy to help in whatever way I can. Let’s… https://t.co/dVuZgwJhSy— Vaibhav Sooryavanshi (@Vaibhavsooryava) August 29, 2026నాకు సాధ్యమైన విధంగా సహాయం చేయడానికి సంతోషిస్తాను. తాను చేయబోయే సహాయానికి ఒక అర్థవంతమైన ప్రయోజనం కల్పిద్దామని పిలుపునిచ్చాడు. ఈ మేరకు ఇవాళ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని వైభవ్ నిన్ననే (ఆగస్ట్ 28) ఎక్స్ ద్వారా వెల్లడించాడు. 'గొప్ప విషయాలు రాబోతున్నాయి. చూస్తూ ఉండండి' అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు.వైభవ్ గొప్ప మనసుకు సమస్త ప్రజానీకం ఫిదా అవుతుంది. 15 ఏళ్ల వయసులో వైభవ్ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడని జనాలు కొనియాడుతున్నారు. వైభవ్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ప్రతి ఒక్కరు అతడికి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా, వైభవ్ స్వతహాగా ఇంకా స్కూలింగ్ కూడా పూర్తి చేయలేదు. ప్రస్తుతం అతడు 10వ తరగతి విద్యార్ది. క్రికెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు అతడు ఈ ఏడాది బోర్డు పరీక్షలను వాయిదా వేసుకున్నాడు. వైభవ్ ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో పాల్గొంటున్నాడు. ఈ టోర్నీలో ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. తాజాగా నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బ్యాట్‌తో రాణించలేకపోయినా, బంతితో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అతడు 4 బంతుల వ్యవధిలో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 210 పరుగుల తేడాతో గెలుపొందిన ఈస్ట్ జోన్ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆగస్ట్ 30న మొదలయ్యే తొలి సెమీస్‌లో ఆ జట్టు సెంట్రల్ జోన్‌తో తలపడనుంది. చదవండి: టీ20 క్రికెట్లో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన నమీబియా -
నో శ్రేయస్, నో వైభవ్.. నిర్ణయం మార్చుకున్న బీసీసీఐ!
ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్‌కు పంపే జట్టు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సందిగ్దంలో పడినట్లు సమాచారం. జపాన్‌లో జరిగే ఈవెంట్‌కు ద్వితీయ శ్రేణి జట్టును పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా భారత టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను తొలగించిన బీసీసీఐ.. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే.అయ్యర్ కెప్టెన్సీలోఈ క్రమంలో జూన్‌లోనే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆసియా క్రీడల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించిన యాజమాన్యం.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని కూడా ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుంచి ఆసియా క్రీడల తాజా ఎడిషన్ మొదలుకానుంది.తీవ్ర అసంతృప్తి!జపాన్‌లోని ఐచి నగోయా ఇందుకు వేదిక. అయితే, అక్కడ క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి సరైన వసతులు ఇంకా ఏర్పాటు చేయలేదని సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ANIతో మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐతో పాటు ఆసియా క్రికెట్ మండలి సైతం జపాన్‌లోని క్రీడా వేదిక వద్ద ఉన్న సదుపాయాలతో సంతృప్తిగా లేదు.అందుకే ముందుగా అక్కడికి ఒక అబ్జర్వర్‌ను పంపించాలనకుంటున్నాయి. అబ్జర్వర్ నుంచి నివేదిక వచ్చిన తర్వాతే జట్టు మార్పు విషయంలో నిర్ణయం ఉంటుంది. ఒకవేళ సరైన వసతులు అక్కడ లేనట్లయితే.. ద్వితీయ శ్రేణి జట్టును పంపే అవకాశం ఉంది.మరీ టెంట్లలోనా?ఈ విషయం గురించి ఇప్పటికే మేము జపాన్ ఒలింపిక్స్ అధికారులతో మాట్లాడాము. డ్రెసింగ్రూమ్లను టెంట్లలో ఏర్పాటు చేశారు. వాష్‌రూమ్‌లు టెంట్లకు 500 మీటర్ల దూరంలో ఉన్నాయి. హోటల్ గదులు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇవన్నీ ఆందోళన కలిగించే విషయాలు. ఆటగాళ్లు కచ్చితంగా అసంతృప్తికి లోనవుతారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అందుకే బి- టీమ్?ఇక పిచ్ కూడా అత్యంత నాసిరకంగా ఉందని బీసీసీఐతో పాటు పాకిస్తాన్ బోర్డు ప్రతినిధులు కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఐసీసీ నిబంధనల ప్రకారం.. మ్యాచ్‌ను కనీసం రెండు వేల మంది ప్రేక్షకులు అయినా వీక్షించేలా స్టేడియం ఉండాలి. కానీ జపాన్‌లో అలాంటి పరిస్థితి లేదని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ తమ ద్వితీయ శ్రేణి జట్లను పంపే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గత ఆసియా క్రీడల ఎడిషన్‌లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో పురుషుల జట్టు.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళా జట్టు స్వర్ణ పతకాలు సాధించాయి.ఆసియా క్రీడలకు భారత పురుషుల టీ20 జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్‌రెడ్డి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, జస్ప్రీత్ బుమ్రా.మహిళల టీ20 జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి.కమలిని (వికెట్ కీపర్), భారతి ఫుల్మలి, శ్రీచరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, నందిని శర్మ.చదవండి: భారత జట్టులో లేని వైభవ్.. కారణం ఇదే! -
భారత జట్టులో వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. కారణమిదే?
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే యూత్ వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టులో భారత దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్‌ల కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్‌లకు చోటు దక్కింది. ఇప్పటికే అన్వయ్ భారత అండర్-19 జట్టు తరఫున ఆడినప్పటికీ, ఆర్యవీర్ ఎంపిక కావడం ఇదే తొలిసారి. అయితే ఈ జట్టులో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసి సత్తా చాటిన వైభవ్‌కు ఈ జూనియర్ జట్టులో చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే సూర్యవంశీని ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేయకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది.బీసీసీఐ 2016లో ఒక కీలక నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం.. వయస్సు పరంగా అర్హత ఉన్నప్పటికీ ఆటగాళ్లు కేవలం ఒక్క అండర్-19 ప్రపంచకప్‌లో మాత్రమే పాల్గొనాలి. సూర్యవంశీ ఇప్పటికే 2026 అండర్-19 ప్రపంచకప్‌లో ఆడాడు. దీంతో అతడు మరో ఎడిషన్‌లో పాల్గొనేందుకు అర్హుడు కాదు. అందుకే అతడిని అండర్-19 ప్రణాళికల నుంచి సెలక్టర్లు పక్కన పెట్టారు.ఇకపై సూర్యవంశీ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించడు. గతంలో ఈ నిబంధన కారణంగానే ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 2018 అండర్-19 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అయితే ఈ రూల్ అమలులోకి రాకముందు సర్ఫరాజ్ ఖాన్, సందీప్ శర్మ, విజయ్ జోల్ వంటి ఆటగాళ్లు రెండుసార్లు అండర్-19 ప్రపంచకప్‌లు ఆడారు. సూర్యవంశీ ప్రస్తుతం భారత సీనియర్ జట్టు తరఫున స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్నాడు.భారత అండర్–19 వన్డే జట్టు: లక్ష్య రాయ్‌చందాని (కెప్టెన్), యశ్వర్ధన్ చౌహాన్, రజత్ బఘేల్, ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, కుషాగ్ర ఓజా, అర్జున్ రాజ్‌పుత్, మనాల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్, యశ్వీర్, రోహిత్ యాదవ్, షవిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకటనాగ విజయ సుభాశ్, కావ్య పటేల్.భారత్ అండర్–19 టెస్టు జట్టు: యశ్వర్ధన్ చౌహాన్ (కెప్టెన్), లక్ష్య రాయ్‌చందాని, సాగర్ విర్క్, కుషాగ్ర ఓజా, మనాల్ చౌహాన్, కుష్ పటేల్, మానవ్ కృష్ణ, అభిప్రాయ్ విశ్వాస్, రోహిత్ యాదవ్, ఇషాన్ ఓం, అయాన్ అక్రమ్, ప్రణవ్ రాఘవేంద్ర, ప్రియాన్షు సింగ్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ యాదవ్. -
వైభవ్, జైస్వాల్‌పై కఠిన చర్యలు తీసుకోండి: భారత మాజీ క్రికెటర్
టీమిండియా యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీళ్లిద్దరు హద్దు మీరుతున్నారన్నాడు. కాబట్టి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి విజ్ఞప్తి చేశాడు.కాగా ఇటీవల భారత్-‘ఎ’ జట్టు శ్రీలంకలో పర్యటించిన సంగతి తెలిసిందే. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-‘ఎ’తో కీలక మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో భారత్ ఓడిపోయింది. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ క్రీజును వీడుతుండగా.. లంక ప్లేయర్ విశేన్ హలంబగే.. ‘మ్యాచ్ అయిపోయింది. ఇంటికి వెళ్లు’ అని కవ్వించినట్లు తెలిసింది.ఇందుకు వైభవ్ ధీటుగా బదులిచ్చాడు. సహనం కోల్పోయిన ఈ పదిహేనేళ్ల పిల్లాడు లంక ప్లేయర్‌పైకి దూసుకువెళ్లి విశేన్‌ను వెనక్కి నెట్టాడు. అతడూ వైభవ్‌నూ తోసేయగా.. మిగతా లంక ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు. అయితే, ఇది అనధికారిక మ్యాచ్ కాబట్టి ఐసీసీ పెద్దగా చర్యలు తీసుకోలేదని సమాచారం.ఇక తాజాగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ శ్రీలంకతో రెండో టెస్టు సందర్భంగా అసితా ఫెర్నాండోతో గొడవపడ్డాడు. జైసూను అవుట్ చేసిన తర్వాత అసితా ఏదో అనడంతో.. అతడిపైకి దూసుకెళ్లి హెల్మెట్‌తో డ్యాష్ ఇచ్చాడు. అతడూ జైసూ పైపైకి వెళ్లాడు. దీంతో ఐసీసీ జైస్వాల్, అసితాలకు జరిమానా వేయడంతో పాటు వారి ఖాతాలో డీమెరిట్ పాయింట్ జత చేసింది.ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘ప్రియమైన ఐసీసీ, బీసీసీఐ.. ఇటీవల ఇండియా-ఎ టూర్ సందర్భంగా వైభవ్.. ఇప్పుడు జైస్వాల్.. వీళ్లిద్దరు హద్దు మీరి ప్రవర్తించారు. వీరిని ఇలాగే కొనసాగిస్తే కష్టం. మళ్లీ అవే తప్పులు పునరావృతం చేస్తారు.క్రీడా స్ఫూర్తికి ముఖ్యంగా వాళ్లిద్దరి భవిష్యత్తుకు ఇది ఎంత మాత్రం మంచి కాదు’’ అని ఎక్స్ వేదికగా మంజ్రేకర్ ఐసీసీ, బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అయితే, నెటిజన్లు మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది మంజ్రేకర్‌కు మద్దతు పలుకుతూ ఉంటే.. మరికొందరు మాత్రం ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లే రెచ్చగొట్టారని.. అందుకు వైభవ్, జైసూ కేవలం స్పందించారంటూ వారిని సమర్థిస్తున్నారు.చదవండి: IND vs SL: ఫాలో ఆన్ ఆడి గెలిచిన జట్లు ఇవే! -
జట్టు మారనున్న జైస్వాల్!.. స్పందించిన రాజస్తాన్ రాయల్స్
ఐపీఎల్-2027 వేలానికి ముందే పలువురు స్టార్ క్రికెటర్ల ట్రేడింగ్ జరుగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈసారి జట్టు మారడం ఖాయమనే ఊహాగానాలు వస్తుండగా.. అలాంటిదేమీ లేదని యాజమాన్యం పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది.అయినప్పటికీ వదంతులు మాత్రం ఆగటం లేదు. హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్ లేదంటే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో చేరతాడనే ప్రచారం జరుగుతోంది. దీనితో పాటు రాజస్తాన్ రాయల్స్‌తో ముంబై చర్చలు జరుపుతోందని.. హార్దిక్‌ను ఇచ్చి అతడికి బదులు యశస్వి జైస్వాల్‌ను తీసుకోనుందనే రూమర్లు వినిపిస్తున్నాయి.రాయల్స్ తరఫున అరంగేట్రంకాగా 2020లో రాజస్తాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన జైస్వాల్.. తన అద్భుతమైన ఆట తీరుతో పోస్టర్ బాయ్‌గా మారిపోయాడు. ఈ క్రమంలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేసి టెస్టుల్లో ఓపెనర్‌గా పాతుకుపోయాడు. అయితే, వైభవ్ సూర్యవంశీ వచ్చిన తర్వాత జైస్వాల్ ఒత్తిడికి లోనవుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జైసూ ‘స్థానాన్ని’ ఆక్రమించేసిన వైభవ్?ముఖ్యంగా ఐపీఎల్-2026లో పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ ఏకంగా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలవడం జైసూను ఒత్తిడిలోకి నెట్టేసిందని పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు. ఓపెనర్లుగా జైస్వాల్ కాస్త ఆచితూచి ఆడగా.. వైభవ్ మాత్రం దూకుడుగా ఆడుతూ రోజురోజుకీ తన గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నాడు. రాయల్స్ జట్టుకు ప్రధాన గుర్తింపుగా పేరు తెచ్చుకుంటున్నాడు.అసంతృప్తి.. ఒత్తిడి?మరోవైపు.. 2026కు ముందు రాజస్తాన్ తమ కెప్టెన్ సంజూ శాంసన్‌ను చెన్నైకి ట్రేడ్ చేసింది. అతడి స్థానంలో జైస్వాల్కే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ రియాన్ పరాగ్ వైపే మొగ్గుచూపిన యాజమాన్యం జైస్వాల్‌ను కెప్టెన్సీ రేసు నుంచి పక్కనపెట్టింది. ఓవైపు కెప్టెన్సీ విషయంలో అసంతృప్తిగా ఉన్న జైసూ.. మరోవైపు వైభవ్ విషయంలో ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో జట్టును వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.జైస్వాల్ మావాడుఈ విషయంపై రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ అధికారి ఒకరు తాజాగా స్పందించారు. తమకైతే జైస్వాల్‌ను వదులుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకైతే జట్టు మార్పు గురించి జైస్వాల్ మాతో ఏమీ చర్చించలేదు.వచ్చే సీజన్లో అతడిని దృష్టిలో పెట్టుకునే మేము ప్రణాళికలు రచించుకుంటున్నాము. అయితే, కొన్ని వదంతులు మా దాకా వచ్చాయి. మేము మాత్రం జైస్వాల్‌ను మా ప్లేయర్‌గానే భావిస్తున్నాము. అతడు మా ఆటగాడు’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. మరి ఇంతకు జైస్వాల్ తనకు తొలి అవకాశం ఇచ్చిన రాయల్స్‌తో కొనసాగుతాడా?.. మీకో దండం అంటూ కొత్త దారి వెతుక్కుంటూ ఫ్రాంఛైజీ మారతాడా? అనేది త్వరలోనే తేలనుంది.చదవండి: శ్రీలంక ఆలౌట్.. ఫాలో ఆన్ ఆడిస్తున్న టీమిండియా!.. ఫాలో ఆన్ అంటే? -
బౌలింగ్ లోను అదరగొట్టిన బుడ్లోడు ఒకే ఓవర్ లో రెండు వికెట్లు
-
ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన ఇషాన్, వైభవ్ జట్టు
దులీప్ ట్రోఫీ 2026 తొలి క్వార్టర్ ఫైనల్లో ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్) నేతృత్వంలోని ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్‌పై ఇన్నింగ్స్ 210 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్.. సుదీప్ కుమార్ ఘరామీ (146), షాబాజ్ అహ్మద్ (167) సెంచరీలతో కదంతొక్కడంతో 467 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన నార్త్ ఈస్ట్ జోన్ జట్టు.. అభిజిత్ సర్కార్ (5-20), షాబాజ్ అహ్మద్ (3-20) ధాటికి 111 పరుగులకే కుప్పకూలింది.ఆతర్వాత ఫాలో ఆన్‌లోనే ఏమాత్రం ప్రతిఘటించలేకపోయిన నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 146 పరుగులకే ఆలౌటై, ఇన్నింగ్స్ తేడాతో పరాజయంపాలైంది. అనుకూల్ రాయ్ (5-37) రెండో ఇన్నింగ్స్‌లో నార్త్ ఈస్ట్ జట్టును దెబ్బకొట్టాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రెండో ఇన్నింగ్స్‌లో బంతితో సత్తా చాటి 2 వికెట్లు (4 బంతుల వ్యవధిలో) తీశాడు. చదవండి: బౌలర్‌గానూ ఇరగదీసిన వైభవ్ సూర్యవంశీ -
బౌలర్‌గానూ ఇరగదీసిన వైభవ్ సూర్యవంశీ
బ్యాటింగ్ సంచలనం, టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ బంతితోనూ ఇరగదీశాడు. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్ఫైనల్లో కేవలం నాలుగు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి తన ఫస్ట్‌క్లాస్ వికెట్ల ఖాతా తెరిచాడు. ఈ టోర్నీలో వైభవ్ ఈస్ట్ జోన్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.నాలుగు బంతుల్లో రెండు వికెట్లునార్త్ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 26వ ఓవర్ వద్ద ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్.. షాబాజ్ అహ్మద్ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి బంతిని అందించాడు. తొలి ఓవర్లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన వైభవ్.. ఆ తర్వాత ఓవర్లో అద్భుతం చేశాడు.28వ ఓవర్లో కిషన్ లింగ్డోహ్ను ఔట్ చేసి తన తొలి ఫస్ట్‌క్లాస్ వికెట్ సాధించాడు. వైభవ్ బంతిని అటాక్ చేయడానికి లింగ్డోహ్ ముందుకొచ్చాడు. అయితే బంతికి భారీ లీడింగ్ ఎడ్జ్ రావడంతో కవర్ ప్రాంతం వైపు వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న డెనిష్ దాస్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు.ఆ తర్వాత మరో మూడు బంతులకే వైభవ్ మరో వికెట్ తీశాడు. ఇమ్లివాటి లెమ్తుర్ బ్యాట్ అంచును తాకిన బంతిని ఇషాన్ కిషన్ అద్భుతమైన రిఫ్లెక్స్‌తో క్యాచ్ పట్టాడు. దీంతో ఒకే ఓవర్లో వైభవ్‌కు రెండు వికెట్లు దక్కాయి.VAIBHAV SOORYAVANSHI, THE BOWLER 🔥- Sooryavanshi picks 2 wickets in 4 balls in Duleep Trophy Quarter-Final. pic.twitter.com/G5pfCmFXYF— Johns. (@CricCrazyJohns) August 25, 2026బంతితోనూ వైభవ్‌కు మంచి భవిష్యత్తు..?వైభవ్ సూర్యవంశీ ప్రధానంగా బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. భారీ షాట్లు ఆడగల సామర్థ్యంతో అతను ఇప్పటికే భారత క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు.అయితే వైభవ్ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ కూడా. అతని బౌలింగ్‌లో హిప్ రొటేషన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. దులీప్ ట్రోఫీలో లభించిన అవకాశాన్ని అతను చక్కగా ఉపయోగించుకుని నాలుగు బంతుల్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు.దీంతో భవిష్యత్తులో అవసరమైనప్పుడు బంతితోనూ జట్టుకు ఉపయోగపడే పార్ట్‌టైమ్ ఆల్‌రౌండర్‌గా ఎదిగే అవకాశం వైభవ్‌కు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సచిన్‌తో మరో పోలికచిన్న వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్లోకి వచ్చి సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్‌ను ఇప్పటికే పలువురు సచిన్ టెండూల్కర్‌తో పోల్చుతున్నారు. సచిన్ కూడా చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి బ్యాట్‌తో పాటు అప్పుడప్పుడు బంతితోనూ భారత్‌కు కీలక వికెట్లు అందించాడు. ఇప్పుడు వైభవ్ కూడా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో తన ప్రతిభను చూపించడం ఆసక్తికరంగా మారింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ గెలుపు దిశగా సాగుతోంది. ఫాలో ఆన్ ఆడుతున్న ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 102 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి భారీ ఇన్నింగ్స్ ఓటమి దిశగా పరుగులు పెడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 111 పరుగులకే కుప్పకూలింది. దీనికి ముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగుల భారీ స్కోర్ చేసింది. చదవండి: సిరాజ్ రెచ్చగొట్టాడు.. ప్రసిద్ద్ పని కానిచ్చేశాడు..! -
వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో వెనుక కారణమిదే?
దులీప్ ట్రోఫీ 63వ ఎడిషన్ ఆదివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈస్ట్ జోన్‌తో నార్త్ఈస్ట్ జోన్, నార్త్ జోన్‌తో వెస్ట్ జోన్ తలపడుతున్నాయి. అయితే దులీప్ ట్రోఫీలో అందరి కళ్లు ఈస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీపై నెలకొని ఉన్నాయి. కానీ మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే వైభవ్ మూడు ఫోర్లు కొట్టినప్పటికీ చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. నార్త్ఈస్ట్ జోన్ పేసర్ బిష్వోర్జిత్ కొంతోజమ్ బౌలింగ్‌లో వైభవ్ వెనుదిరిగాడు. అయితే పెవిలియన్ చేరుతున్న క్రమంలో వైభవ్ జెర్సీ వెనుక భాగంలో ఉన్న సంఖ్యకు టేప్ అంటించి ఉండడం అభిమానులు గమనించారు. ఆ తర్వాత ఫీల్డింగ్ సమయంలోనూ వైభవ్ జెర్సీ వెనుక భాగంలో టేప్ అలాగే ఉండడం కనిపించింది. దీంతో అసలు వైభవ్ జెర్సీకి టేప్ ఎందుకు వేసుకున్నాడనే దానిపై ఆరా తీశారు. దీంతో విషయం బయటపడింది.మ్యాచ్‌లో వైభవ్ 13వ నంబర్ ఉన్న జెర్సీని ధరించాడు. నిజానికి వైభవ్ సూర్యవంశీ జెర్సీ నెంబర్ 3. ఐపీఎల్ రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఇదే జెర్సీ నెంబర్‌తో బరిలోకి దిగాడు. ఆ తర్వాత టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సమయంలోనూ వైభవ్ మూడు నెంబర్ జెర్సీతోనే ఆడాడు. అయితే దులీప్ ట్రోఫీలో వైభవ్‌కు మూడో నెంబర్ జెర్సీ స్థానంలో 13వ నెంబర్ జెర్సీ అందించారు. ఈస్ట్ జోన్ జట్టు వైభవ్ కోసం తనకు అచ్చొచ్చిన మూడో నెంబర్ జెర్సీని అందించడంలో విఫలమైందని లాజిస్టిక్స్ మేనేజర్ తెలిపాడు. తనకు మూడు నెంబర్ జెర్సీ అయితేనే అచ్చొస్తుందని భావించాడేమో.. అందుకే వైభవ్ తనకు ఇచ్చిన 13వ నెంబర్ జెర్సీలో ఒకటి సంఖ్య కనిపించకుండా టేప్ అంటించాడు. ఒకటి సంఖ్య లేకపోవడంతో ఇప్పుడు ఆ జెర్సీ 3 నెంబర్‌గా మారిపోయింది. ఇక మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ 6 బంతుల్లో 8 పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో అభిమానులు వైభవ్ జెర్సీపై ఫన్నీ కామెంట్స్ చేశారు. "పాపం జెర్సీ మారడంతో వైభవ్‌కు లక్ కలిసిరాలేదని కొందరు పేర్కొంటే... ఒకవేళ తనకు అచ్చొచ్చిన 3వ జెర్సీ నెంబర్‌ను ఇచ్చి ఉంటే మ్యాచ్‌లో ఇరగదీసేవాడేమో" అని మరికొందరు తెలిపారు. అయితే వైభవ్ తన జెర్సీని తెప్పించాలని ఇప్పటికే ఈస్ట్‌జోన్ జట్టుకు సమాచారం ఇచ్చాడట. రెండో ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ తన లక్కీ నెంబర్ జెర్సీతోనే బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు.Exciting early battle 🔥4️⃣,4️⃣,🇼Bishworjit Konthoujam wins the contest against Vaibhav Sooryavanshi 👌#DuleepTrophyScorecard ▶️ https://t.co/XJFhfvvTIU pic.twitter.com/4xGnLaAhpx— BCCI Domestic (@BCCIdomestic) August 23, 2026Read: బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ కీలక ప్రకటన! -
ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ విఫలమైనా.. భారీ స్కోరు!
దులిప్ ట్రోఫీ- 2026 క్వార్టర్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ భారీ స్కోరు సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామి, బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ భారీ శతకాలతో చెలరేగి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ప్రతిష్టాత్మక దేశీ రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ మ్యాచ్‌లు ఆదివారం మొదలయ్యాయి.ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్- నార్త్ ఈస్ట్ జోన్ తలపడుతున్నాయి. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 2లో టాస్ గెలిచిన నార్త్ ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి.వైభవ్ సూర్యవంశీ విఫలంఓపెనర్లలో సీనియర్ అభిమన్యు ఈశ్వరన్ (15), వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (8) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన కుమార్ కుశాగ్రా (55).. నాలుగో నంబర్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామీ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.ఘరామీ, షాబాజ్ సెంచరీలుఈ క్రమంలో ఘరామీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 185 బంతులు ఎదుర్కొన్న అతడు.. 25 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 146 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో విరాట్ సింగ్ (2), కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (4) నిరాశపరిచారు.ఇలాంటి తరుణంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ అనూహ్య రీతిలో నిలకడైన ఆటతో సెంచరీతో కదం తొక్కాడు. మొత్తంగా 244 బంతులు ఎదుర్కొన్న షాబాజ్.. 167 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉన్నాయి. ఇక మిగిలిన వారిలో అనుకూల్ రాయ్ (37) ఓ మోస్తరుగా రాణించగా.. మహ్మద్ షమీ 11, ముకేశ్ 7, అభిజిత్ సర్కార్ 9 (నాటౌట్) పరుగులు చేశారు.A masterclass in grit and determination! 🏏Shahbaz Ahmed brings up a magnificent 150 (211) for East Zone in the Duleep Trophy 2026-27, anchoring the innings with pure class. 🌟#DuleepTrophy #EastZone #ShahbazAhmed #CAB pic.twitter.com/RChs72osxT— CABCricket (@CabCricket) August 24, 2026 స్కోరెంతంటే?ఫలితంగా ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 112.5 ఓవర్లు ఆడి 467 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఘరామీ- షాబాజ్ అత్యధికంగా ఆరో వికెట్‌కు 150 పరుగులు జోడించారు. మరోవైపు.. అనుకుల్ రాయ్‌తో కలిసిషాబాజ్ ఏడో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక నార్త్ ఈస్ట్ జోన్ బౌలర్లలో ఆకాశ్ చౌదరి, ఫిరోయిజామ్ జోటిన్ మూడేసి వికెట్లు తీయగా.. బిశ్వోర్జిత్ కొంతుజమ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. కెప్టెన్ రంగ్సేన్ జొనాథన్, టెచి నెరి తలా ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్ -
సెంచరీలతో కదంతొక్కిన ఘరామీ, షాబాజ్
దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా ఇవాళ (ఆగస్ట్ 23) మొదలైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఈస్ట్ జోన్-నార్త్ ఈస్ట్ జోన్.. నార్త్ జోన్-ఈస్ట్ జోన్ జట్లు తలపడుతున్నాయి. తొలి క్వార్టర్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఈస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది.రెండో క్వార్టర్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన ఈస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.సెంచరీలతో కదంతొక్కిన ఘరామీ, షాబాజ్నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ ప్లేయర్లు సుదీప్ కుమార్ ఘరామీ (146), షాబాజ్ అహ్మద్ (100 బ్యాటింగ్) సెంచరీలతో కదంతొక్కారు. ఈ జట్టు స్టార్ ప్లేయర్లు, కెప్టెన్, వైస్ కెప్టెన్లు ఇషాన్ కిషన్ (4), వైభవ్ సూర్యవంశీ (8) నిరాశపరిచారు. మిగతా ప్లేయర్లలో అభిమన్యు ఈశ్వరన్ 15, కుమార్ కుషాగ్రా 55, విరాట్ సింగ్ 2, అనుకూల్ రాయ్ 22 (బ్యాటింగ్) చేశారు. నార్త్ ఈస్ట్ జోన్ బౌలర్లలో జొతిన్ 3, ఆకాశ్ చౌదరి 2, బిష్వోర్జిత్ ఓ వికెట్ పడగొట్టారు.సత్తా చాటిన తనుశ్, తుషార్నార్త్ జోన్‌తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో వెస్ట్ జోన్ బౌలర్లు తనుశ్ కోటియన్ (4-72), తుషార్ దేశ్‌పాండే (4-57) సత్తా చాటారు. వీరికి ముకేశ్ చౌదరి (1-47), శార్దూల్ ఠాకూర్ (1-38) సహకరించారు. నార్త్ జోన్ ప్లేయర్లలో తొమ్మిదో నంబర్ ఆటగాడు అన్షుల్ కంబోజ్ (60) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇతనితో పాటు ఆయుశ్ బదోని (51), ఆయుశ్ దొసేజా (42) రాణించారు. కమ్రాన్ ఇక్బాల్ 26, యశ్ ధుల్ 9, అబ్దుల్ సమద్ 6, కన్హయ్య వధవాన్ 5, నిషాంత్ సింధు 15, అబిద్ ముస్తాక్ 19, అర్షదీప్ సింగ్ 4, సునీల్ కుమార్ 0 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించగా.. పృథ్వీ షా (22) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే ఆబిద్ ముస్తాక్ అద్భుతమైన బంతితో అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్‌ను (3) అర్షదీప్ సింగ్ పెవిలియన్‌కు పంపాడు. ఆట ముగిసే సమయానికి ముషీర్ ఖాన్ (6), శివాలిక్ శర్మ (0) క్రీజ్‌లో ఉన్నారు. -
నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ.. అంచనాలు తల్లకిందులు
దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దారుణంగా నిరాశపరిచాడు. రెడ్‌బాల్ క్రికెట్ తొలి పరీక్షలోనే అతడు ఘోరంగా విఫలమయ్యాడు. నార్త్ ఈస్ట్ జోన్‌తో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఇవాళ ప్రారంభమైన మ్యాచ్‌లో వైభవ్ 6 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.ఈ మ్యాచ్‌కు ముందు వైభవ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈస్ట్ జోన్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపిక కావడం అతడి రెడ్‌బాల్ సామర్థ్యాన్ని పరీక్షించే కీలక అవకాశంగా ఉండింది. అయితే ఈ అవకాశాన్ని వైభవ్ ఒడిసిపట్టుకోలేకపోయాడు. తక్కువ స్కోర్‌కే ఔటై, అభిమానులను నిరాశపరిచాడు.ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్‌కు దిగగా, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి వైభవ్ ఓపెనర్‌గా వచ్చాడు. రెండో ఓవర్లో బంతిని ఎదుర్కొన్న అతడు బిష్వర్జిత్ కొంథౌజమ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. దీంతో భారీ స్కోర్ చేసేలా కనిపించాడు.అయితే అదే ఓవర్ చివరి బంతికి అతడి ఇన్నింగ్స్ ముగిసింది. కొంథౌజమ్ ఆఫ్ స్టంప్ వెలుపల గుడ్ లెంగ్త్‌లో బంతిని వేశాడు. దానిని పాయింట్ దిశగా ఆడేందుకు ప్రయత్నించగా, గల్లీలో ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చాడు.వైట్‌బాల్ క్రికెట్లో దూకుడుగా ఆడే వైభవ్‌కు రెడ్‌బాల్ ఫార్మాట్లో ప్రధాన సవాలు షాట్ ఎంపిక, ఓపికగా బ్యాటింగ్ చేయడం. కొత్త బంతిపై ప్రతి బంతినీ దాడి చేయకుండా, పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ గేర్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.సూర్యవంశీకి ఇదే మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో మరో అవకాశం లభించే అవకాశం ఉంది. అక్కడ భారీ స్కోరు సాధిస్తే తొలి ఇన్నింగ్స్‌లో ఎదురైన వైఫల్యాన్ని కొంతవరకు భర్తీ చేయడమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని రెడ్‌బాల్ అవకాశాలకు తనను తాను బలంగా ప్రతిపాదించుకోగలడు.మ్యాచ్ విషయానికొస్తే.. 27 ఓవర్లు ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ స్కోర్ 13-4గా ఉంది. అభిమన్యు ఈశ్వరన్ (15), వైభవ్ సూర్యవంశీ (8), కుమార్ కుషాగ్రా (55), విరాట్ సింగ్ (2) ఔట్ కాగా.. కెప్టెన్ ఇషాన్ కిషన్ (4), సుదీప్ కుమార్ ఘరామీ (49) క్రీజ్‌లో ఉన్నారు. -
వైభవ్‌కు టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వాలి..!
భారత బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టెస్టు క్రికెట్లోనూ అవకాశాలు ఇవ్వాలని భారత మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. 15 ఏళ్ల వైభవ్‌ను రెడ్‌బాల్ క్రికెట్లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.ఐర్లాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ద్రవిడ్.. వైభవ్ ప్రస్తుతం ఐపీఎల్, అంతర్జాతీయ టీ20ల ద్వారా వైట్‌బాల్ అనుభవం సంపాదిస్తున్నాడని, అదే సమయంలో దేశవాళీ క్రికెట్లో రెడ్‌బాల్ మ్యాచ్‌లు కూడా ఆడేలా చూడాలని అన్నారు.దులీప్ ట్రోఫీ కీలకం2026 దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్‌కు వైభవ్ ప్రాతినిధ్యం వహించనున్న నేపథ్యంలో, ఈ టోర్నీ అతడి రెడ్‌బాల్ సామర్థ్యాలను పరీక్షించడానికి కీలకంగా మారనుందిని.. భవిష్యత్తులో టెస్టు క్రికెట్‌కు ఎంపిక కావాలంటే ఇలాంటి అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోవాలని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు.అయితే వైభవ్‌పై అంచనాలు పెట్టుకునే విషయంలో తొందరపడకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు పెద్ద స్థాయిలో విజయాలు సాధించాడని, ఇక ముందు ఆటలో హెచ్చుతగ్గులు సహజమేనని, అందుకే అతడికి తగినంత సమయం ఇవ్వాలని సూచించారు.రెడ్‌బాల్‌లో ఇంకా మెరుగవ్వాలి..!వైట్‌బాల్ క్రికెట్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన వైభవ్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం అంతగా ప్రభావం చూపలేదు. ఇప్పటివరకు ఎనిమిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు 17.25 సగటుతో 207 పరుగులు మాత్రమే చేశాడు.అందుకే దులీప్ ట్రోఫీ అతడికి ముఖ్యమైన పరీక్ష కానుంది. ఇందులో రాణిస్తే ఆస్ట్రేలియా-ఏతో జరిగే అనధికారిక టెస్టులకు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.సెహ్వాగ్‌లా X-ఫ్యాక్టర్ అవుతాడా..?వైభవ్ సాంకేతికంగా ఇంకా సంపూర్ణ బ్యాటర్‌గా ఎదగాల్సి ఉన్నప్పటికీ, అతడి దూకుడు టెస్టు జట్టుకు ప్రత్యేకమైన X-ఫ్యాక్టర్‌గా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి.గతంలో భారత టెస్టు జట్టులో వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనర్‌గా దూకుడైన పాత్ర పోషించాడు. వేగంగా పరుగులు చేస్తూ ప్రత్యర్థి బౌలింగ్ దాడిపై ఒత్తిడి పెంచేవాడు. అదే తరహాలో వైభవ్ కూడా భవిష్యత్తులో టెస్టుల్లో దూకుడైన ఓపెనర్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ప్రస్తుతానికి అతడికి టెస్టు జట్టులో స్థానం కంటే రెడ్‌బాల్ క్రికెట్లో ఎక్కువ అనుభవం, ఓర్పు, సాంకేతిక పరిణతి సాధించడం అవసరం. ద్రవిడ్ చెప్పినట్లుగా, వైభవ్ విషయంలో తొందరపడకుండా సమయం ఇవ్వడం కీలకం. -
భారత వరల్డ్ కప్ జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు!
వన్డే వరల్డ్‌కప్-2027కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి భారత జట్టు కూర్పుపై ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యయి. తాజాగా ఈ మెగా టోర్నీ కోసం సీఎస్కే మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించాడు.ఉతప్ప అందరిని ఆశ్చర్యపరుస్తూ తన వరల్డ్ కప్ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటిచ్చాడు. ప్రస్తుత వన్డే జట్టులో రోహిత్ శర్మకు బ్యాకప్‌గా ఉన్న యశస్వి జైశ్వాల్‌ను కాదని వైభవ్‌కు రాబిన్ ఛాన్స్ ఇచ్చాడు. 15 ఏళ్ల వైభవ్ ఇటీవల భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.తన డెబ్యూ సిరీస్‌లో విఫలమైనప్పటికి తర్వాత జింబాబ్వే పర్యనటలో మాత్రం వైభవ్ ఇరగదీశాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు వచ్చే నెలలో జరగనున్న ఏషియన్ క్రీడలకు సన్నదమవుతున్నాడు. అయితే సూర్యవంశీ ఇప్పుడే వన్డే జట్టులోకి సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఓపెనింగ్ స్లాట్ కోసం ఇప్పటికే జైశ్వాల్, రుతురాజ్ వంటి యువ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత వీరిలో ఎవరో ఒకరు ఆ స్దానాన్ని భర్తీ చేయనున్నారు.ఇక రాబిన్ ఉతప్ప తను ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లగా కేఎల్ రాహుల్‌తో పాటు సంజూ శాంసన్‌లకు అవకాశమిచ్చాడు. ఇషాన్ కిషన్‌కు బదలుగా సంజూను ఉతప్ప ఎంపిక చేశాడు. సంజూ చివరగా భారత్ తరపున మూడేళ్ల కిందట వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ జట్టులో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఉతప్ప ఎంపిక చేశాడు. అదేవిధంగా అందరి మాజీ క్రికెటర్లలానే రాబిన్ కూడా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో భువనేశ్వర్ అద్భుతంగా రాణిస్తుండడంతో అతడిని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక చివరగా స్పెషలిస్ట్ స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్‌కు ఈ కర్ణాటక మాజీ క్రికెటర్ అవకాశమిచ్చాడు.ప్రపంచకప్ టోర్నీకి ఉతప్ప ఎంపిక చేసిన జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్ -
వైభవ్‌పై కామెంట్స్ తర్వాత ప్రియాన్ష్‌కు దిగ్వేశ్ రాఠీ ఝలక్
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2026లో యువ క్రికెటర్ల మధ్య పోటీ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఐపీఎల్లో ఇప్పటికే సత్తా చాటిన ప్రియాన్ష్ ఆర్య, దిగ్వేశ్ రాఠీ మధ్య తాజాగా జరిగిన పోరు చర్చనీయాంశమైంది.ఔటర్ ఢిల్లీ వారియర్స్, పురానీ ఢిల్లీ-6 మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్య ఆరంభంలో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఫాస్ట్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న అతడు కేవలం 20 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.అయితే దిగ్వేశ్ రాఠీ బౌలింగ్‌కు రావడంతో పరిస్థితి మారిపోయింది. రాఠీ వేసిన బంతిని ఆర్య లాంగ్-ఆన్ దిశగా షాట్ ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. ఆర్య వికెట్ పడగొట్టిన వెంటనే రాఠీ తనదైన శైలిలో ‘నోట్‌బుక్ సెలబ్రేషన్’ చేసుకున్నాడు.ఐపీఎల్‌లోనూ రాఠీ ఇదే తరహా సెలబ్రేషన్‌తో వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు DPLలో ఆర్య వికెట్ తర్వాత మరోసారి నోట్‌బుక్ తీసినట్లు సంబరాలు చేసుకోవడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.ఆర్య vs సూర్యవంశీఇటీవల ప్రియాన్ష్ ఆర్య వైభవ్ సూర్యవంశీ కంటే తాను మెరుగైన సిక్స్ హిట్టర్ అని చెప్పుకోవడం చర్చనీయాంశమైంది.ఇద్దరూ 2025 సీజన్ నుంచి ఐపీఎల్లో ఆడుతున్నారు. ఇప్పటివరకు ఆర్య 30 ఇన్నింగ్స్‌ల్లో 839 పరుగులు, 191.99 స్ట్రైక్‌రేట్‌తో సాధించాడు. సూర్యవంశీ 23 ఇన్నింగ్స్‌ల్లోనే 1,028 పరుగులు, 228.95 స్ట్రైక్‌రేట్‌తో దూసుకెళ్తున్నాడు.సిక్సర్ల విషయంలోనూ సూర్యవంశీదే పైచేయి. ఆర్య తన ఐపీఎల్ కెరీర్లో 57 సిక్సర్లు కొట్టగా, సూర్యవంశీ ఇప్పటికే 100 సిక్సర్ల మార్క్‌కు చేరువయ్యాడు.DPLలో ఆర్యకు ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవుఔటర్ ఢిల్లీ వారియర్స్ తరఫున ఆడుతున్న ఆర్యకు DPL 2026లో ఇప్పటివరకు పెద్దగా కలిసిరాలేదు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 133 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ కూడా 156.47గానే ఉంది.ఆరంభాల్లో దూకుడుగా ఆడుతున్నప్పటికీ భారీ స్కోర్లుగా మార్చడంలో ఆర్య విఫలమవుతున్నాడు. పురానీ ఢిల్లీ-6పై 19 బంతుల్లో చేసిన 46 పరుగులే ఈ సీజన్లో అతడి అత్యుత్తమం. -
వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలి? హర్భజన్ సమాధానమిదే
టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే వరల్డ్ క్లాస్ బౌలర్లను అతడు ఎదుర్కొంటున్న తీరు నిజంగా ఒక అద్భుతం.మైదానంలో సూర్యవంశీని అడ్డుకోవడం ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వైభవ్‌ను కట్టడి చేసేందుకు ఒకే ఒక్క మార్గం ఉందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అతడికి డిఫెన్సివ్‌గా బౌలింగ్ చేయడం కంటే, వికెట్ పడగొట్టేందుకు ప్రయత్నించడమే బెటర్ అని భజ్జీ తెలిపాడు. "వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ప్లేయర్. కేవలం 14-15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్‌ను శాసించే ఆటగాడిని నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. వరల్డ్ క్లాస్ బౌలర్లు సైతం అతడికి బౌలింగ్ చేయడానికి భయపడుతున్నారు.అయితే అతడిని ఔట్ చేయాలంటే ఒకే మార్గం ఉంది. అతడిని పరుగులు సాధించకుండా ఉండేలా బౌలింగ్ చేస్తే మీరు అతడిని ఔట్ చేయలేరు. వికెట్ గురుంచే ప్రయత్నం చేయాలి. షాట్ ఆడేందుకు ఆఫర్ చేయాలి. ఇది ప్రతిసారీ వర్కవుట్ కాకపోవచ్చు. కొన్ని సార్లు ఆ బంతులు సిక్సర్లగా కూడి వెళ్లవచ్చు. ఇదంతా ఆటలో భాగమే. ఏదేమైనప్పటికి వైభవ్ ఒక అసాధరణ ప్లేయర్ అని మనం అంగీకరించాలి" అని ఓ ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు. -
వైభవ్ విషయంలో నేనైతే అది అంగీకరించను: ఆసీస్ దిగ్గజం
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ గురించి ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ పదిహేనేళ్ల పిల్లాడి ఆటకు తాను ఫిదా అయ్యానని.. అతడు కేవలం పొట్టి ఫార్మాట్‌కే పరిమితం కాబోడని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా వైభవ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఆరంభంలో విఫలమైనా..ఈ సిరీస్‌లో వైభవ్ (13,15,14) విఫలమైనప్పటికీ.. జింబాబ్వే గడ్డ మీద అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి 151 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా టీ20 సిరీస్‌లో జింబాబ్వేను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు.ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీకి సిద్ధమవుతున్నాడు. ఈస్ట్ జోన్ జట్టుకు అతడు ఏకంగా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో విమర్శలు రాగా.. మాథ్యూ హెడెన్ తాజాగా స్పందించాడు.ఫిట్‌గా ఉండటం ముఖ్యంANIతో మాట్లాడుతూ.. ‘‘కొంతమంది వైభవ్ కేవలం పొట్టి ఫార్మాట్ ప్లేయర్ మాత్రమే అని అంటున్నారు. నేనైతే ఆ విషయాన్ని అంగీకరించను. సంప్రదాయ ఫార్మాట్లోనూ అదరగొట్టగల సత్తా అతడికి ఉంది. అయితే, ఇందుకు వైభవ్ ఫిట్‌గా ఉండటం ముఖ్యం.అంతకంటే ముందు.. మానసికంగా అతడు మరింత దృఢంగా మారాలి. ఏదేమైనా పదిహేనేళ్ల వయసులోనే అతడు అద్భుతమైన ఆట తీరుతో తనను తాను నిరూపించుకున్నాడు. ఐపీఎల్ వంటి బ్లాక్‌బస్టర్ టోర్నమెంట్లో కేవలం పాల్గొనడమే కాకుండా.. ఏకంగా సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగానూ నిలిచాడు. దీనిని బట్టి వైభవ్ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.వరల్డ్‌క్లాస్ ప్లేయర్‌గా ఎదుగుతాడుఅతడు కచ్చితంగా వరల్డ్‌క్లాస్ ప్లేయర్‌గా ఎదుగుతాడు. అయితే, వైభవ్ ఆట తీరును మరింత మెరుగపరచుకోవాల్సి ఉంటుంది. అతడికి అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. అయితే, వాటిని ఎలా ఉపయోగిస్తాడన్నదే ముఖ్యం’’ అని మాథ్యూ హెడెన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్.. 776 పరుగులు చేశాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. చదవండి: నాడు పావురాల రెట్టల వల్ల పోయిన పరువు.. తాజా పరిణామంపై సింధు స్పందన -
కళ్లు చెదిరే ఎండార్స్మెంట్లు.. వైభవ్ సంపాదన ఎంతంటే?
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి సంచలనం సృష్టించాడు. మ్యాచ్‌ల పరంగా ఆట ఎలా ఉన్నా ఎండార్స్మెంట్ల విషయంలో మాత్రం వైభవ్ సూర్యవంశీ దూసుకెళ్తున్నాడు. దీంతో 15 ఏళ్ల వయసుకే కళ్లు చెదిరే మొత్తాన్ని అందుకుంటున్న వైభవ్ సంపాదనలోనూ స్టార్ హోదా పొందాడు. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతున్న సమయంలోనే వైభవ్ సూర్యవంశీ తన బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజులు పెంచినట్లు సమాచారం. అయినప్పటికీ అతడి కోసం ఎండార్స్మెంట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. వైభవ్ వాణిజ్య విలువకు సంబంధించి ఒక్కోటి కోటి రూపాయల మార్కును దాటినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం అతడి నికర ఆస్తి విలువ రూ. 7 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. దీనికి తోడు ఐపీఎల్ జీతం, మ్యాచ్ ఫీజులు, దేశవాళీ క్రికెట్ రూపంలో వస్తున్న డబులు అదనమని చెప్పొచ్చు.వైభవ్ ఆమోదించిన బ్రాండ్లు..👉ఎస్ఎస్ బ్యాట్స్: సచిన్ టెండూల్కర్ తన ఐకానిక్ MRF బ్యాట్ స్పాన్సర్‌షిప్‌తో ప్రసిద్ధి చెందగా, సూర్యవంశీ ఇంకా ఏ కార్పొరేట్ దిగ్గజంతోనూ భారీ ఒప్పందం కుదుర్చుకోలేదు. అయితే, అతను ప్రస్తుతం సరీన్ స్పోర్ట్స్ (SS)తో సంవత్సరానికి సుమారు రూ. 50 లక్షల విలువైన పరికరాల ఒప్పందాన్ని కలిగి ఉన్నాడు. SS మార్కెట్లో ప్రత్యేకమైన "వైభవ్ సూర్యవంశీ ఎడిషన్" బ్యాట్లను కూడా విడుదల చేసింది.👉కాంప్లాన్: 2026 ప్రారంభంలో వైభవ్ కాంప్లాన్ వారి "థోడా ప్లాన్, థోడా కాంప్లాన్" ప్రకటన ప్రచారానికి అంబాసిడర్‌గా మారాడు. సరైన పోషణ , అంకితభావంపై దృష్టి సారించే ఈ ప్రకటన, ఒక యువ అథ్లెట్‌గా సూర్యవంశీ నిజ జీవిత దినచర్యను ప్రతిబింబిస్తుండడం విశేషం.👉గూగుల్ పే: ప్రస్తుతం వైభవ్ గూగుల్ పే ప్రచారకర్తగా ఉన్నాడు. ఈ ప్రకటనలో, అతడు తన తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాకు అనుసంధానించబడిన UPIని ఉపయోగిస్తూ, టీనేజర్ల కోసం సురక్షితమైన డబ్బు నిర్వహణను హైలైట్ చేస్తూ ప్రచారం చేస్తున్నాడు.👉రెడ్‌బుల్: ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ తరఫున ధ్రువ్ జురెల్‌తో కలిసి వైభవ్ రెడ్‌బుల్ చాలెంజ్‌లో పాల్గొని అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.👉జార్ఖండ్ ఆరోగ్యశాఖ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతను చురుకుగా, ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేలా ప్రేరేపించడానికి వైభవ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తామని జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి 2026 మేలో ఒక ప్రకటన విడుదల చేశారు.👉ఇక ఇంగ్లండ్ పర్యటన ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ గత నెలలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో రెండు మెరుపు అర్ధశతకాలతో 151 పరుగులు చేశాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహించనున్న వైభవ్ వైస్‌కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు.Read: ‘అతడి జోలికి వెళ్లొద్దు’.. ఫిఫాకు ట్రంప్ వార్నింగ్! -
వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదే!
-
వైభవ్‌కు నిజంగా 15 ఏళ్లేనా? ఆసీస్ దిగ్గజం బ్రెట్‌లీ సమాధానమిదే
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయస్సులోనే అద్భుతాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు ఐపీఎల్, జూనియర్ క్రికెట్లో దుమ్ములేపిన వైభవ్.. ఇప్పుడు సీనియర్ జట్టు తరపున కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు.తన అరంగేట్ర సిరీస్‌లో విఫలమైనప్పటికి జింబాబ్వే పర్యటనలో మాత్రం అదరగొట్టాడు. జింబాబ్వే బౌలర్లను ఎదుర్కోవడానికి అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ప్లేయర్లు ఇబ్బంది పడినప్పటికి .. సూర్యవంశీ మాత్రం వారిని ఉతికారేశాడు. అంతకుముందు ఐపీఎల్లో కూడా వరల్డ్‌క్లాస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హేజిల్‌వుడ్, కమిన్స్‌ను కూడా వైభవ్ వదల్లేదు.అయితే చిన్న వయసులోనే ఇంతటి పరిణతి సాధించడం వల్ల విదేశీ క్రికెట్ వర్గాలలో వైభవ్ వయస్సుపై ఇంకా సందేహలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ వయస్సుతో సంబంధం లేదని, అతడు ఎంత గొప్పగా క్రికెట్ ఆడుతున్నాడనే దానిపైనే అందరూ దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డాడు. 17 లేదా 18 ఏళ్లు ఉన్నా సరే పర్వాలేదు."వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ఆటగాడు. అతడికి నిజంగా 15 ఏళ్లేనా? అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. కానీ నాకు అతడి వయసుతో సంబంధం లేదు. అతడు 15 ఏళ్ల కుర్రాడైతే చాలా సంతోషం. ఒకవేళ 17 లేదా 18 ఏళ్లు ఉన్నా సరే నాకు అనవసరం. అతడు అత్యున్నత స్ధాయిలో ఎలా క్రికెట్ ఆడుతున్నాడన్నదే ముఖ్యం. టీమిండియాకు దొరికిన గొప్ప ఆణిముత్యం అతడు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తాడు. అతడు ఇప్పటికే వరల్డ్ బెస్ట్ టీ20 లీగ్ ఐపీఎల్లో సత్తాచాటాడు. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్ నేను ఎప్పటికి మర్చిపోను. ఆ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన ఆస్ట్రేలియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. వారు ఎంత వేగంతో బౌలింగ్ చేస్తే వైభవ్ అంతే అలవోకగా షాట్లు ఆడాడు. అతడి బ్యాట్ స్పీడ్ నిజంగా అద్భుతం. సరైన టైమింగ్ కూడా అతడి వద్ద ఉంది. అతను ఇప్పటికీ ఒక చిన్నపిల్లవాడే, అతనిపై అనవసర ఒత్తిడి పెట్టకుండా ఆడుకోనివ్వాలి" అని బీర్ బైసెప్స్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెట్‌లీ పేర్కొన్నాడు. -
‘మీ పిల్లాడి క్రమశిక్షణ విషయంలో నిర్లక్ష్యం వద్దు’
క్రికెట్ ప్రపంచంలోకి దూసుకువచ్చిన నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ. పద్నాలుగేళ్ల వయసులోనే ఫార్మాట్లకు అతీతంగా అదరగొట్టాడు. భారత్ అండర్-19 జట్టు తరఫున దుమ్ములేపిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన వైభవ్.. ఈ ఏడాది అత్యధిక పరుగుల వీరుడిగా ఏకంగా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో పదిహేనేళ్ల వయసులోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ గడ్డపైతద్వారా అత్యంత చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్‌గా దిగ్గజ సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఇంగ్లండ్ గడ్డపై తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన వైభవ్ సూర్యవంశీ.. వరుసగా మూడు మ్యాచ్‌లలో (13,15,14) విఫలమయ్యాడు. అయితే, జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో మాత్రం రెండు అర్ధ శతకాలతో రాణించాడు. టీమిండియా జింబాబ్వేను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్.వైభవ్ కుటుంబానికి కీలక సూచనలుఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రపంచ క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా అతడి ఆట గురించే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానే వైభవ్ సూర్యవంశీ కుటుంబానికి కీలక సూచనలు చేశాడు.ఇంగ్లండ్ మాజీ స్టార్లు మైకేల్ వాన్, అలిస్టర్ కుక్, డేవిడ్ లాయిడ్, ఫిల్ టఫ్నిల్తో కలిసి ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సమయంలోనే వైభవ్‌కు సరైన మార్గదర్శనం అవసరం. అతడి కుటుంబం మాత్రమే ఇది చేయగలదు.ప్రస్తుతం అతడికి ఏది అత్యంత ముఖ్యమో అతడి కుటుంబమే చెప్పాలి. అతడి కోసం షెడ్యూల్, ప్రణాళికలను రచించాలి. ముఖ్యంగా చిన్న వయసులోనే వచ్చిన కీర్తిప్రతిష్టలు చూసి అతడు పక్కదారి పట్టకుండా కాపాడుకోవాలి.క్రమశిక్షణ ముఖ్యంజట్టుతో పాటు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎన్నో కొత్త పరిచయాలు అవుతాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అతడికి చెప్పాలి. కుటుంబమే అతడి బలం. వచ్చే ఐదు, పదేళ్లలో వైభవ్‌ను వారెంత క్రమశిక్షణగా ఉంచుతారో అదే అతడి భవిష్యత్తును నిర్ణయిస్తుంది’’ అని రహానే పేర్కొన్నాడు. కాగా వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ ప్రత్యేక అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనలకు అతడితో పాటు తల్లిదండ్రులను కూడా అనుమతించింది. వైభవ్ వయసు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. చదవండి: ధోని గది తలుపు ఒక్కసారి మూతపడితే అంతే ఇక! -
వాళ్ళకి దూరంగా ఉండు లేదంటే.. బుర్డోడికి ఉతప్ప వార్నింగ్
-
‘వైభవ్ వాటికి దూరంగా ఉండు.. లేదంటే మరో పృథ్వీ షానే!’
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో వైట్‌బాల్ ఫార్మాట్లో తనదైన ముద్ర వేయగల సామర్థ్యం వైభవ్ కలిగి ఉన్నాడని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. గతంలో పృథ్వీ షా తక్కువ వయసులోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత వేరే విషయాలపై దృష్టి పెట్టడంతో కెరీర్ దారి తప్పిందని, వైభవ్ అలా దారి తప్పకూడదని పరోక్షంగా హెచ్చరించాడు.ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఊతప్ప మాట్లాడాడు. ‘వైట్‌బాల్ క్రికెట్లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే వైభవ్ ఎక్కువ ప్రభావం చూపగలడు. ఎందుకంటే సచిన్ లాగే చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. సచిన్ ఎంతటి పేరు ప్రతిష్టలు సాధించాడన్నది అందరికీ తెలిసింది. మరి వైభవ్ దానిని ఎలా నిలబెట్టుకుంటాడనేది ఆసక్తిగా మారింది. అంధఃపాతాళానికి పృథ్వీ షా..‘భారత క్రికెట్లో చిన్న వయసులో ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో పైకి వచ్చినవాళ్లను అరుదుగా చూశాం. ఉదాహరణకు వినోద్ కాంబ్లీ, పృథ్వీ షాలను తమ కెరీర్‌ను 17-18 ఏళ్ల వయసులోనే ప్రారంభించారు. ఈ ఇద్దరు భారత క్రికెట్లో ఎంతో ముద్ర వేస్తారని అంతా భావించారు. కాంబ్లీ సంగతి పక్కనబెడితే, పృథ్వీ షా కెరీర్ ట్రాక్ తప్పడానికి ప్రధాన కారణం అతడి వయస్సే. చిన్న వయసులోనే స్టార్డమ్ చూసిన పృథ్వీ షాకు కెరీర్ కంటే మిగతా విషయాలపై ఫోకస్ పెరిగింది. గర్ల్‌ఫ్రెండ్స్ మోజుతో పాటు ఎండార్స్మెంట్ రూపంలో యాడ్ చేయడంతో సంపాదనపై ఆసక్తి పెరిగింది. దీంతో ఎంతో భవిష్యత్తు ఉన్న పృథ్వీ షా కెరీర్ అంధఃపాతాళానికి పడిపోయింది. కాబట్టి వైభవ్ సూర్యవంశీకి అతడి వయస్సే పెద్ద సవాల్ కానుంది. ప్రస్తుతం 15 ఏళ్ల వయసున్న వైభవ్ రానున్న ఐదేళ్ల పాటు ఎలాంటి మచ్చ లేకుండా ఆటపై దృష్టి పెడతాడా అన్నది చూడాలి. వీలైనంత వరకు వయసు రీత్యా గర్ల్‌ఫ్రెండ్స్‌పై మోజు, ఎడాపెడా ఎండార్స్మెంట్లకు సంతకాలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. సరైన దారిలోనే..ఇప్పటికైతే వైభవ్ తనకు ఎలాంటి ఎండార్స్మెంట్ ఆఫర్ వచ్చినా ఆలోచించి అడుగు వేస్తున్నాడు. అంతేకాదు కేవలం ఆటపైనే దృష్టి పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే వైట్‌బాల్‌లో సచిన్‌ను మించిన అద్భుతం అవుతాడు. అలా కాదని వ్యవహరిస్తే మాత్రం మరో పృథ్వీషాగా మిగిలిపోవడం ఖాయం. ఇప్పటికిప్పుడు సచిన్‌తో పోల్చడం సరైన చర్య కాకపోయినప్పటికీ, వైభవ్‌లో దాగున్న అపారమైన సామర్థ్యం అతడిని ప్రత్యేకంగా నిలుపుతుంది’ అని చెప్పుకొచ్చాడు.Read: సామ్ బిల్లింగ్స్ సిక్సర్ల వర్షం.. దూసుకెళ్తున్న ట్రెంట్ రాకెట్స్ -
నా వరల్డ్ రికార్డును బద్దలు కొట్టేది అతడే: బట్లర్
టీ20 క్రికెట్లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ చారిత్రాత్మక మైలురాయిని అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బట్లర్ రికార్డులకెక్కాడు. 'ది హండ్రెడ్' టోర్నీలో భాగంగా వేల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ ఈ ఫీట్ సాధించాడు. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరపున ఆడిన బట్లర్ కేవలం 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బట్లర్ ఈ రికార్డును అందుకున్నాడు. ఈ గుజరాత్ టైటాన్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటివరకు 522 మ్యాచ్‌ల్లో 14,833 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ కీరన్ పొలార్డ్ పేరిట ఉండేది. పొలార్డ్ 746 మ్యాచ్‌ల్లో 14,803 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో పొలార్డ్‌ను బట్లర్ అధిగమించాడు. ఈ ఫీట్ సాధించిన అనంతరం బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో తన రికార్డును బద్దలు కొట్టే అవకాశముందని బట్లర్ అన్నాడు."టీ20 క్రికెట్లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఏదో ఒక రోజు నా రికార్డును వేరొకరు బద్దలు కొడతారు. ఆ ఆటగాడు బహుశా వైభవ్ సూర్యవంశీ కావచ్చు. క్రికెట్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. పరిస్థితులు త్వరగా మారుతుంటాయి.కొన్ని నెలల క్రితం నేను ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడు నాకెరీర్‌లోనే అత్యుత్తమంగా బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఒడిదొడుకులు ఎదురైనప్పుడు వదిలేయడం లేదా ఫామ్ కోసం కష్టపడడం అనే రెండు మార్గాలే ఉంటాయి. నేను శ్రమించడానికే మొగ్గు చూపాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో బట్లర్ పేర్కొన్నాడు.చదవండి: కళ్లు చెదిరేలా షకీబ్ అల్ హసన్ ఆస్తుల విలువ! -
22 బంతుల్లోనే రికార్డు శతకం.. 95 ఏళ్ల క్రితమే!
టీ20 క్రికెట్ వచ్చాకా ఆటలో వేగం పెరిగిపోయింది. దీంతో అతి తక్కువ బంతుల్లోనే సెంచరీలు నమోదు చేస్తున్న బ్యాటర్ల సంఖ్య పెరిగిపోతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సెంచరీ భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ నుంచి వచ్చింది. రెండు వరుస ఐపీఎల్ సీజన్లలో తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన రికార్డును వైభవ్ తన పేరిట లిఖించుకున్నాడు. 2025 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న వైభవ్.. 2026 సీజన్లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో 37 బంతుల్లో శతకం సాధించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే రెండు ఫాస్టెస్ట్ సెంచరీలు సాధించిన వైభవ్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు వైభవ్‌ను ఆకాశానికెత్తుతున్నాం కానీ 95 ఏళ్ల క్రితమే టెస్టు క్రికెట్లో ఆసీస్ దిగ్గజ బ్యాటర్ సర్ డాన్ బ్రాడ్‌మన్ కేవలం మూడు ఓవర్లలోనే సెంచరీ మార్క్ సాధించడం విశేషం. 1931 నవంబర్ 2న బ్లాక్హెత్ తరఫున బ్రాడ్‌మన్ న్యూ సౌత్‌వేల్స్ వేదికగా లిత్గో పొటరీస్తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటేంటే అప్పట్లో ఒక ఓవర్‌కు ఆరు బంతులకు బదులు 8 బంతులుండేవి. తాను ఎదుర్కొన్న తొలి ఓవర్లో 33 పరుగులు (8 బంతులు), రెండో ఓవర్లో 40 పరుగులు (8 బంతులు), మూడో ఓవర్లో 27 పరుగులు (ఆరు బంతులు).. మొత్తంగా 22 బంతులెదుర్కొని కేవలం 18 నిమిషాల్లోనే బ్రాడ్‌మన్ 100 పరుగుల మార్క్‌ను చేరుకోవడం విశేషం. ఇక ఆ మ్యాచ్‌లో ఓవరాల్‌గా బ్రాడ్‌మన్ 256 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు, 29 ఫోర్లు ఉన్నాయి.అప్పటికే సూపర్ ఫామ్‌లో ఉన్న బ్రాడ్‌మన్‌కు ఈ రికార్డు పెద్ద లెక్క కాదు. ఎందుకంటే టెస్టు క్రికెట్ చరిత్రలో బ్రాడ్‌మన్ ప్రపంచ రికార్డు సృష్టించారు. టెస్టుల్లో బ్రాడ్‌మన్ సగటు 99.94. ఇప్పటికీ ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. మొత్తంగా బ్రాడ్‌మన్ 52 టెస్టుల్లో 99.94 సగటుతో 6,996 పరుగులు సాధించాడు. ఇందులో 29 సెంచరీలు, రికార్డు స్థాయిలో 12 డబుల్ సెంచరీలున్నాయి. తన కెరీర్లో చివరి టెస్టు ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు చేసి ఉన్నా బ్రాడ్‌మన్ సగటు వందగా ఉండేది. కానీ తన చివరి మ్యాచ్‌లో బ్రాడ్‌మన్ డకౌట్ అయ్యాడు.Read: పంత్ హవా.. ఆదాయపు పన్ను చెల్లింపులో అగ్రస్థానం! -
వైభవ్‌నే పక్కనపెడతారా?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం విషయంలో మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరు సరికాదని విమర్శించాడు. ఈ పిల్లాడిని ఐర్లాండ్‌పై గడ్డపై ఆడిస్తే ఫలితం వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.కాగా ఐపీఎల్, భారత అండర్-19 జట్టు తరఫున అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీని టీమిండియా సెలక్టర్లు యూకే పర్యటనకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత ఐర్లాండ్, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లు ఆడింది భారత జట్టు.సంజూ వరుస వైఫల్యాలుఅయితే, ఐర్లాండ్‌లో సంజూ శాంసన్- అభిషేక్ శర్మను ఓపెనింగ్ జోడీగా కొనసాగించిన యాజమాన్యం.. వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ సిరీస్‌లో భారత జట్టు ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ అయింది. ఇక సంజూ ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌లలోనూ తేలిపోయాడు.అరంగేట్రంలో తేలిపోయిన వైభవ్అనంతరం ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ సంజూ విఫలం కావడంతో.. ఎట్టకేలకు వైభవ్‌కు రెండో టీ20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. అయితే, పదిహేనేళ్ల ఈ బిహారీ పిల్లాడు.. తొలి మ్యాచ్‌లో కేవలం 13 పరుగులే చేశాడు. ఆ తర్వాత 15,14 పరుగులకే నిష్క్రమించాడు.జింబాబ్వే గడ్డ మీద దూకుడుదీంతో ఇంగ్లండ్‌తో ఐదో టీ20 నుంచి వైభవ్‌ను తప్పించి మరోసారి సంజూకే అవకాశమిచ్చారు. అయితే, జింబాబ్వేతో టీ20 సిరీస్ నుంచి సంజూకు విశ్రాంతినివ్వగా.. వైభవ్‌కు మళ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ సిరీస్‌లో భాగంగా ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 50, 20, 81 పరుగులు సాధించాడు.జింబాబ్వేను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు.ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‘‘వైభవ్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో అతడి సత్తా ఏమిటో అంతా చూశారు. వరుస మ్యాచ్‌లలో అదరగొట్టి ఏకంగా ఆరెంజ్‌క్యాప్ గెలుచుకున్నాడు.నిజానికి ఐర్లాండ్‌లోనే అతడి అరంగేట్రం జరగాల్సింది. అప్పుడే అతడు నిర్భయంగా ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టి.. అక్కడా రాణించేవాడు. కానీ మేనేజ్మెంట్ ఏం చేసింది. ఆరెంజ్ క్యాప్ విన్నర్‌ను ఐర్లాండ్‌లో పక్కనపెట్టి.. నీళ్ల బాటిళ్లు మోయమని బెంచ్‌కే పరిమితం చేసింది.వైభవ్ ఒక ప్రత్యేకమైన ఆటగాడు. అతడిని మీరు ఐర్లాండ్‌లోనే ఆడిస్తే.. గొప్పగా ఉండేది. ఇంగ్లండ్‌లో అతడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించేవాడు. కానీ ఇంగ్లండ్‌లో అతడు తేలిపోయాడు. దీంతో మళ్లీ తుదిజట్టు నుంచి అతడిని తప్పించారు.అతడినే పక్కనపెడతారా?జోఫ్రా ఆర్చర్‌కు వైభవ్ ఆట తీరు తెలుసు కాబట్టి అతడిని సులువుగానే అవుట్ చేయగలిగాడు. ఏదేమైనా వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున మున్ముందు అదరగొట్టడం ఖాయం. కానీ ఆరంభమే ఇంకాస్త సులువుగా ఉంటే బాగుండేది.అతడొక స్పెషల్ టాలెంట్. అతడిని తుదిజట్టు నుంచి తప్పించి ప్రయోగాలు చేయొద్దు. జింబాబ్వే మీద అతడు ఎలా ఆడాడో చూశారు కదా!.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు’’ అని మహ్మద్ కైఫ్ మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు గుప్పించాడు.చదవండి: సన్‌రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం.. 100 బంతుల్లోనే 241 రన్స్ -
సీనియర్లు ఉండగా ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీని నియమించడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఈ విషయంలో సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టగా.. తాజాగా భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. రెడ్‌బాల్ క్రికెట్లో అనుభవం లేని ఆటగాడిని ఏకంగా వైస్ కెప్టెన్‌ను చేయడం ఏమిటని ప్రశ్నించాడు.అనుభవం తక్కువకాగా దేశవాళీ ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ ఎంపిక కాగా.. అతడి డిప్యూటీగా పదిహేనేళ్ల వైభవ్‌కు అవకాశం దక్కింది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటికీ ఈ బిహారీ పిల్లాడు రెడ్‌బాల్ క్రికెట్లో మాత్రం ఇప్పటికి కేవలం 8 మ్యాచ్‌లు ఆడి 207 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి ఏకంగా వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇవ్వడంపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ విషయం గురించి భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దీప్ దాస్ గుప్తా సైతం సెలక్టర్ల నిర్ణయంపై పెదవి విరిచాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..సీనియర్లు ఉండగా ఇదేం పద్ధతి?‘‘వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడాన్ని నేను అస్సలు సమర్థించను. అనుకూల్ రాయ్ వంటి సీనియర్ ప్లేయర్లు ఎంతో మంది జట్టులో ఉన్నారు. చాలా ఏళ్లుగా వాళ్లంతా రెడ్‌బాల్ క్రికెట్లో సేవలు అందిస్తున్నారు. అలాంటి వాళ్లకి నాయకత్వ బృందంలో చోటివ్వాలి.15, 16 ఏళ్ల వయసుకే వైభవ్ సూర్యవంశీ క్రికెటర్‌గా పరిణతి సాధించాడని నేను ఒప్పుకొంటాను. అతడి ప్రతిభ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే, రెడ్‌బాల్ క్రికెట్లో పూర్తిగా ఆడకముందే అతడికి వైస్ కెప్టెన్‌గా బాధ్యత ఇవ్వడం సరికాదు.అతడు ఇప్పుడిప్పుడే ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. వైస్ కెప్టెన్ స్థాయికి తగ్గ గణాంకాలు కూడా ప్రస్తుతం అతడి ఖాతాలో లేవు. ముందు అతడిని ఆడనివ్వండి. తనను తాను నిరూపించుకోనివ్వండి’’ అని దీప్ దాస్ గుప్తా సెలక్టర్లకు హితవు పలికాడు.మా నిర్ణయం సరైందేఇదిలా ఉంటే.. ఈస్ట్ జోన్ సెలక్టర్ ప్రవంజన్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్న సంగతి తెలిసిందే. వైభవ్ సూర్యవంశీ ఏదో ఒకరోజు టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదుగుతాడని.. అన్నీ తెలిసే తాము అతడిని ఇప్పుడు వైస్ కెప్టెన్‌ని చేశామని పేర్కొన్నాడు. దులిప్ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగా వైభవ్ భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉందన్నాడు.చదవండి: ఇంగ్లండ్ గడ్డ మీద ఇరగదీస్తున్న కుల్దీప్ యాదవ్ -
అందుకే వైస్ కెప్టెన్‌గా వైభవ్: కుండబద్దలు కొట్టిన సెలక్టర్
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి దక్కిన ప్రమోషన్ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదిహేనేళ్ల ఈ బిహారీ పిల్లాడు ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ టోర్నీలో ఈస్ట్ జోన్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్ సారథ్యంలో వైభవ్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.అయితే, వైభవ్ సూర్యవంశీకి ఏకంగా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు ఇవ్వడం పట్ల కామెంటేటర్ హర్షా భోగ్లే అభ్యంతరం వ్యక్తం చేశాడు. రెడ్‌బాల్ క్రికెట్లో పెద్దగా అనుభవం లేని పిల్లాడిని కీలక పదవికి ఎలా ఎంపిక చేస్తారని సెలక్టర్లను ప్రశ్నించాడు. అందుకే అతడిని వైస్ కెప్టెన్‌ని చేశాముఈ నేపథ్యంలో ఒడిశా మాజీ క్రికెటర్, ఈస్ట్ జోస్ సెలక్షన్ కమిటీలో భాగమైన ప్రవంజన్ ములిక్ స్పందించాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘వైభవ్‌ను కెప్టెన్‌గా నియమించలేదు కదా!.. అతడు ఇప్పుడు కేవలం వైస్ కెప్టెన్ మాత్రమే. ఆ జట్టుకు ఇషాన్ కిషన్ సారథి. అయితే, ఇషాన్ వికెట్ కీపర్ కూడా!రోజంతా ఇషాన్ యాక్టివ్గానే ఉంటాడు. కాబట్టి వైభవ్‌కు పెద్దగా పనేమీ ఉండదు. అయితే, ఇషాన్‌కు డిప్యూటీగా అతడు ఎంతో కొంత నేర్చుకుంటాడు. మరింత పరిణతి సాధిస్తాడు. అందుకే అతడిని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశాము. ఏదో ఒకరోజు టీమిండియా కెప్టెన్ అవుతాడుదులిప్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఉప నాయకుడిగా ఉండటం గొప్ప అవకాశం. అతడు టీమిండియా తరఫున బాగా ఆడాలని కోరుకుంటున్నాడు. మేము కూడా యువ ఆటగాళ్లకు సరైన సమయంలో అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నాము. ఎవరికి తెలుసు.. ఏదో ఒకరోజు వైభవ్ టీమిండియా కెప్టెన్ కూడా అవ్వొచ్చు.ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే మేము అతడికి వైస్ కెప్టెన్‌గా అవకాశం ఇచ్చాము. ఇంతకు ముందు భారత అండర్-19 జట్టుకు, బిహార్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ జట్టుకు అతడు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. దులిప్ ట్రోఫీ సందర్భంగా జాతీయ సెలక్టర్లు అతడి ఆటను తప్పక పరిశీలిస్తారు. అతడు త్వరలోనే భారత టెస్టు జట్టుకు కూడా ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు కదా!’’ అని ప్రవంజన్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.చదవండి: టీమిండియాకు శుభవార్త -
కొడితే సిక్స్ పడాల్సిందే.. వైభవ్ కీలక వ్యాఖ్యలు
-
వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేస్తారు?
టీమిండియా యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి ఊహించని ప్రమోషన్ దక్కింది. ఇటీవల జింబాబ్వే గడ్డ మీద టీ20 సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన ఈ 15 ఏళ్ల కుర్రాడు... దులీప్ ట్రోఫీలో పాల్గొనే ఈస్ట్ జోన్ జట్టుకు ఎంపికయ్యాడు. ఏకంగా వైస్ కెప్టెన్‌గా అతడు నియమితుడయ్యాడు. అభిమానుల హర్షంభవిష్యత్తులో వైభవ్‌ను అన్ని ఫార్మాట్ల ప్లేయర్‌గా తీర్చిదిద్దే దిశగా ఇది తొలి అడుగు కానుంది. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే వైభవ్‌కు ప్రతిష్టాత్మక టోర్నీలోని జుట్టుకు ఉపనాయకుడిగా వ్యవహరించే అవకాశం రావడం పట్ల అభిమానులు హర్షం చేస్తున్నారు.అదే విధంగా.. ‘వైభవ్ పిన్న వయసులోనే ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికవడం బిహార్ క్రికెట్‌కు గర్వకారణం. అతడి అద్భుత ప్రదర్శనపై సెలక్టర్లు నమ్మకముంచారు’ అని బిహార్ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు హర్షవర్ధన్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు.వైస్ కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేస్తారు?అయితే, ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే మాత్రం ఈ విషయంపై భిన్నంగా స్పందించాడు. రెడ్‌బాల్ క్రికెట్లో అంతగా అనుభవం లేని ఈ పదిహేనేళ్ల పిల్లాడిని సీనియర్ జట్టుకు వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎలా నియమిస్తారని సెలక్టర్ల నిర్ణయాన్ని ప్రశ్నించాడు.ఈ మేరకు ఎక్స్ వేదికగా.. ‘‘సీనియర్ రెడ్‌బాల్ జట్టుకు వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడానికి గల కారణం ఏమిటో నాకర్థం కావడం లేదు. నిజానికి ఈ విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు ఇప్పటి వరకు రెడ్‌బాల్ క్రికెట్లో కేవలం 12 ఇన్నింగ్స్ ఆడి.. 207 పరుగులు చేశాడు.అతడి ప్రతిభ అసాధారణం. కానీ ఇప్పుడిప్పుడే అతడు ఎదుగుతున్నాడు. నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ముఖ్యంగా రెడ్‌బాల్ క్రికెట్లో అతడు ఇంకా మొదటి దశలోనే ఉన్నాడు’’ అని హర్షా భోగ్లే సెలక్టర్ల నిర్ణయాన్ని విమర్శించాడు.ఇషాన్ కిషన్ సారథ్యంలోకాగా ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 6 వరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో దులిప్ ట్రోఫీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకోసం ఇషాన్ కిషన్ సారథ్యంలో 15 మందితో కూడిన ఈస్ట్ జోన్ జట్టును బుధవారం ప్రకటించారు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వైభవ్ ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడి 207 పరుగులు చేశాడు. ఇక సూర్యవంశీకి ఇదే తొలి దులీప్ ట్రోఫీ కాగా... సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్ , షహబాజ్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్ ఈస్ట్ జోన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌కు ఈస్ట్ జోన్ జట్టు: ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ ఘరామి, షహబాజ్ అహ్మద్, సూరజ్ జైస్వాల్, మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, కుమార్ కుషాగ్ర, షిక్జార్ మోహన్, అనుకూల్ రాయ్, విరాట్ సింగ్, శుభ్రంసు సేనాపతి, డేనిశ్ దాస్, అభిజిత్ సర్కార్. చదవండి: శ్రీలంకతో టెస్టులకు పంత్‌ను ఎలా సెలక్ట్ చేశారు?: డివిలియర్స్I wonder what the thinking is behind making Sooryavanshi vice-captain of a senior red ball team. He has played 12 innings for 207 runs @ 17.25. His talent is extraordinary but there is a learning curve and he is at the bottom of it in red ball cricket.— Harsha Bhogle (@bhogleharsha) July 30, 2026 -
BCCI నుంచి వైభవ్‌కు బిగ్ గిఫ్ట్.. వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్!
-
ఎవరికీ భయపడేదే లేదు!.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 వయస్సులోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నిన్నటి వరకు జూనియర్ క్రికెట్ టోర్నీలు, ఐపీఎల్లో సత్తాచాటిన వైభవ్.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తన మార్క్‌ను చూపించాడు. ఇటీవల జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వైభవ్ రెండు హాఫ్ సెంచరీలు సాధించి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు.ఈ పర్యటనలో బ్లెస్సింగ్ ముజార్బానీ, రిచర్డ్ నగరావ వంటి స్టార్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కాగా సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో భారత స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ స్ధానానికి ఎసరు పెట్టాడు. ఈ చిచ్చరపిడుగు ఎంట్రీతో సంజూ జట్టులో చోటు కోల్పోయాడు.సెప్టెంబర్‌లో జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలకు సంజూ ఎంపికైనప్పటికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. ఇక జింబాబ్వే టూర్లో అదరగొట్టిన సూర్యవంశీ బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం ఈస్ట్ జోన్ జట్టు వైస్ కెప్టెన్‌గా సూర్యవంశీ ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో ఇషాన్ కిషన్‌కు డిప్యూటీగా సూర్య వంశీ వ్యవహరించనున్నాడు. బీసీసీఐ అతడిని అన్ని ఫార్మాట్ల ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే అతడికి వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. దీంతో సూర్యవంశీపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్ష్ వర్ధన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంత చిన్న వయస్సులోనే వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్ కావడం బీహార్ క్రికెట్‌కు ఎంతో గర్వకారణమని హర్ష వర్ధన్ కొనియాడాడు,.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ బిహార్ వండర్ కిడ్ తాజాగా రాజస్తాన్ రాయల్స్ తరపున జడేజాతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వైభవ్‌కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. "మీరు ఏ బౌలర్‌ను ఎదుర్కోవడానికి భయపడతారు? అని హోస్ట్ వైభవ్‌ను ప్రశ్నించాడు. ఇందుకు వైభవ్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. "ఇప్పటి వరకు అయితే ఎవరికీ లేదు" అని నాలుగు పదాల్లో తేల్చి చేప్పేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా సూర్యవంశీ ఐపీఎల్లో జస్ప్రీత్ బుమ్రా, హాజిల్‌వుడ్, కమిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం వదల్లేదు. -
వైస్ కెప్టెన్‌గా ఎంపికైన వైభవ్ సూర్యవంశీ
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్న కొద్ది రోజులకే, భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ 2026 కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు సంపాదించిన వైభవ్ ఇప్పటివరకు ఎనిమిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడినా, భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్‌గా గుర్తింపు పొందుతున్నాడు.జూలై 29న ప్రకటించిన 15 మంది సభ్యుల ఈస్ట్ జోన్ జట్టుకు భారత వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.ఈ జట్టులో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, షాబాజ్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్ తదితరులు కూడా చోటు దక్కించుకున్నారు.దులీప్ ట్రోఫీ 2026 ఈస్ట్ జోన్ జట్టు: అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ కుమార్ ఘరామి, షాబాజ్ అహ్మద్, సూరజ్ సింధు జైస్వాల్, మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), కుమార్ కుషాగ్ర, శిఖర్ మోహన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్, సుభ్రాంశు సేనాపతి, వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), దెనీష్ దాస్, అభిజిత్ సర్కార్.స్టాండ్‌బై ఆటగాళ్లు: ఆయుష్ లోహరుకా, శ్రీదామ్ పాల్, సాంబిత్ ఎస్. బరాల్, శరణ్‌దీప్ సింగ్, స్వస్తిక్ సమల్.కాగా, దులీప్ ట్రోఫీ ఆగస్ట్ 23 నుండి సెప్టెంబర్ 10 వరకు జరుగనుంది. 23నే ప్రారంభం కానున్న తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్‌తో తలపడనుంది. ఆగస్ట్ 15 నుండి 27 మధ్యలో టీమిండియా శ్రీలంక పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నప్పటికీ.. టెస్ట్ జట్టులో ఇషాన్, వైభవ్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. -
అగ్రపీఠంపై గిల్.. వైభవ్ భారీ జంప్
తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్ల హవా కొనసాగింది. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఏకంగా 230 స్థానాలు ఎగబాకి కెరీర్లోనే అత్యుత్తమమైన 48వ ర్యాంక్‌కు చేరుకోగా, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మళ్లీ ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా నిలిచాడు.జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తాజా ర్యాంకింగ్స్‌లో భారీగా లాభపడ్డాడు. ప్రస్తుతం అతను 536 రేటింగ్ పాయింట్లతో 48వ స్థానంలో కొనసాగుతున్నాడు.అదే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఇషాన్ కిషన్ 916 రేటింగ్ పాయింట్లతో టీ20 బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (912 కెరీర్ బెస్ట్), విరాట్ కోహ్లీ (909 కెరీర్ బెస్ట్) వంటి భారత దిగ్గజాల కెరీర్ రేటింగ్లను కూడా అధిగమించాడు. టీ20 చరిత్రలో అత్యధిక బ్యాటింగ్ రేటింగ్‌ల జాబితాలో అభిషేక్ శర్మ (931), డేవిడ్ మలాన్ (919) తర్వాత ఇషాన్ కిషన్ (916 కెరీర్ బెస్ట్) మూడో స్థానంలో ఉన్నాడు.ఇతర భారత ఆటగాళ్లలో తిలక్ వర్మ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో ర్యాంక్‌కు చేరుకోగా, శ్రేయస్ అయ్యర్ ఏడు స్థానాలు ఎగబాకి 24వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల జాబితాలో రవి బిష్ణోయ్ 31 స్థానాలు ఎగబాకి 41వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.మరోవైపు, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో డారిల్ మిచెల్ అగ్రస్థానాన్ని కోల్పోవడంతో శుభ్‌మన్ గిల్ తిరిగి ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా అవతరించాడు. ఈ ఏడాది జనవరి నుంచి అగ్రస్థానంలో కొనసాగిన మిచెల్‌ను వెనక్కి నెట్టి గిల్ మళ్లీ అగ్రపీఠాన్ని అధిరోహించాడు. -
బుడ్డోడు దెబ్బకు అభిషేక్ పై వేటు.. వెళ్లి IPL ఆడుకో
-
వైభవ్‌కు బ్రాడ్‌మన్‌తో పోలిక
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ భారత బ్యాటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో మెరిసి, భారత్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్‌ను ఉతప్ప ఏకంగా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్‌తో పోల్చాడు. సొంత యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ ఉతప్ప ఇలా అన్నాడు."వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ టెక్నిక్ డాన్ బ్రాడ్‌మన్‌ను గుర్తు చేస్తుంది. బ్రాడ్‌మన్ చాలా అరుదుగా ఎల్బీడబ్ల్యూ అయ్యేవాడు. వైభవ్ కూడా అదే తరహా టెక్నిక్‌తో ఆడుతున్నాడు"పోలికకు కారణంబ్రాడ్మన్ తన టెస్ట్ కెరీర్లో కేవలం నాలుగు సార్లు మాత్రమే LBW అయ్యాడు. వైభవ్ ఇప్పటివరకు ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ కలిపి ఒక్కసారి మాత్రమే LBWగా ఔటయ్యాడు. అతని ఓపెన్ స్టాన్స్, హై బ్యాక్‌లిఫ్ట్ కారణంగా బంతి లైన్లోకి త్వరగా రావడం వల్ల LBW అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.జింబాబ్వే సిరీస్‌లో అదరగొట్టిన వైభవ్ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన వైభవ్.. జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల్లో అద్భుతంగా ఆడాడు. 3 ఇన్నింగ్స్‌ల్లో 2 అర్ద సెంచరీల సాయంతో 151 పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.పోలికలపై జాగ్రత్త అవసరంఇదిలా ఉంటే, వైభవ్‌ను ఇప్పుడే డాన్ బ్రాడ్‌మన్ వంటి దిగ్గజాలతో పోల్చడం సరైంది కాదని పలువురు మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. అతను ఇప్పుడే అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. ఇలాంటి పోలికలు యువ ఆటగాడిపై అనవసరమైన అంచనాలు, ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.ప్రస్తుతం వైభవ్ అసాధారణ ప్రతిభను చూపిస్తున్నా, అతని నిజమైన స్థాయిని నిర్ణయించడానికి ఇంకా అనేక సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ అవసరం. -
నా కల నెరవేరింది.. వైభవ్ ఎమోషనల్ కామెంట్స్
-
గాయపడిన వెనక్కి తగ్గని బుడ్డాడు.. వైభవ్ పై లక్ష్మణ్ ప్రశంసలు
-
సీనియర్స్ కే ఆ అర్హత దక్కాలి వాళ్ళ తర్వాతే నేను
-
నా కల నెరవేరింది.. వారి వల్లే ఇదంతా: వైభవ్ సూర్యవంశీ
తన అరంగేట్ర సిరీస్‌లో విఫలమైన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వే పర్యటనలో ఇరగదీశాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలతో సహా మొత్తంగా 151 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. హరారే వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లోనూ వైభవ్ సత్తాచాటాడు.49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. దీంతో సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ఈ రెండు అవార్డులను గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ నిలిచాడు. ఈ నేపథ్యంలో తనకు సపోర్ట్‌గా నిలిచిన టీమ్ మేనెజ్మెంట్కు వైభవ్ ధన్యవాదాలు తెలిపాడు."నా కల నెరవేరింది. మొదటిసారిగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్ కోసం తీవ్రంగా శ్రమించాను. హరారే వచ్చిన తర్వాత మేము మూడు రోజుల పాటు ప్రాక్టీస్ చేశాం. ఇంతకుముందు ఇదే వేదికపై అండర్-19 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడాను. ఈ గ్రౌండ్లో ఆడడం నాకు చాలా ఇష్టం. అదేవిధంగా కెప్టెన్, కోచ్‌లు, సహచర ఆటగాళ్లందరూ నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. వారి వల్లే నేను ఇక్కడ మెరుగైన ప్రదర్శన చేయగలిగాను. టీ20 క్రికెట్లో మొదట నుంచి ఎలా ఆడుతున్నానో.. ఇక్కడ కూడా అదే కొనసాగించాను.జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వడమే నా ప్రధాన లక్ష్యం. ఒకసారి కుదురుకున్నాక, ఇన్నింగ్స్‌ను భారీ స్కోరుగా మలచడానికి ప్రయత్నించాను. సిరీస్ అంతటా ఇదే ప్లాన్‌తో ముందడుగు వేశాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో వైభవ్ పేర్కొన్నాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు మళ్లీ జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో భారత్ తరపున బరిలోకి దిగనున్నాడు. -
‘అగార్కర్ వింటున్నావా? వైభవ్‌ను రోహిత్‌కు జతగా పంపాలి’
వన్డే ప్రపంచకప్ 2027 దృష్ట్యా టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని వన్డేల్లో కూడా ఆడిస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ అభిప్రాయపడ్డాడు. ఓపెనింగ్‌లో రోహిత్‌కు జతగా వైభవ్‌ను పంపించి కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు ట్యాగ్ చేస్తూ తన సందేశాన్ని వెల్లడించాడు. దీనివల్ల మిడిలార్డర్ కూడా బలంగా మారుతుందని ఫరూఖ్ వెల్లడించాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫరూఖ్ ఇంజినీర్ మాట్లాడుతూ.. 'గిల్ క్లాస్ ప్లేయర్. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. అయితే ఆరంభంలోనే దూకుడుగా ఆడే స్వభావం గిల్‌కు లేదు. అయితే వైభవ్ సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండర్ కావడంతో పాటు రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించగలడు. వైభవ్ ధాటిగా ఆడుతున్నాడంటే ఒక ఎండ్‌లో రోహిత్ క్రీజులో నిలబడేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. వైభవ్ ఉన్నంతసేపు రోహిత్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. ఇక క్లాస్ బ్యాటర్ అయిన గిల్‌కు నాలుగో స్థానం సరైనది. కోహ్లి ఎలాగూ మూడో స్థానంలో వస్తాడు. ఐదు, ఆరు స్థానాల్లో శ్రేయస్, రాహుల్ వస్తారు. అయితే వైభవ్‌ను వయసుతో ముడిపెడుతూ వన్డేల్లో అవకాశాలు ఇవ్వడం లేదు. నా వరకు 15 ఏళ్ల వయసు అనేది వన్డే క్రికెట్లో ఎంట్రీకి అర్హతే. అయితే కొందరు మాత్రం వైభవ్‌ను టీ20ల్లోనే ఆడించాలని, వన్డేల్లో ఇప్పుడే అవసరం లేదని అంటున్నారు. కానీ ఒక బ్యాటర్‌కు ఏ ఫార్మాట్ అయినా పరుగులు చేయడమే ప్రధానం. ఆరంభంలో ఒకటి రెండు మ్యాచ్‌లు విఫలమైనప్పటికీ, కుదురుకుంటే ఎంత ప్రమాదకారో ఇప్పటికే వైభవ్ రుచి చూపించాడు. అతడు ఆడితే ఓడినవాటి కంటే గెలిచే మ్యాచ్‌లే ఎక్కువగా ఉంటాయి. నా దృష్టిలో సర్ వీవీ రిచర్డ్స్ గొప్ప బ్యాటర్. అతడంత గొప్ప బ్యాటర్‌ను నేను చూడలేదు. ఇప్పుడు సూర్యవంశీ కూడా అలానే కనిపిస్తున్నాడు. రాబోయే కాలంలో వైభవ్ కచ్చితంగా భారతదేశ భవిష్యత్తు ఆశాకిరణంగా మారనున్నాడు.'అని ఫరూఖ్ ఇంజినీర్ చెప్పుకొచ్చాడు.ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో సిరీస్‌ల్లో అంతగా ఆకట్టుకోని వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో మాత్రం అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌లు కలిపి 151 పరుగులు సాధించిన వైభవ్ ఖాతాలో రెండు అర్ధసెంచరీలున్నాయి. తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా సొంతం చేసుకున్నాడు.Read: కసి మీదున్న సూర్యకుమార్.. 3 గంటల్లో వెయ్యి బంతులా! -
‘అసాధారణమే కానీ మెరుగుపడాలి’.. వైభవ్‌కు చురకలు!
జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగుల మెరపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సిరీస్‌లో రెండు అర్ధసెంచరీలు సాధించిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా ఎగరేసుకుపోయాడు. ఈ నేపథ్యంలోనే జింబాబ్వే టూర్‌కు గంభీర్ స్థానంలో కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. 15 ఏళ్ల వయసులోనే అద్భుతాలు చేస్తున్న వైభవ్‌కు ఎంతో భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. చిన్న వయసులో అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న వైభవ్ ఫిట్నెస్ విషయంలో మాత్రం మరింత కష్టపడాలని యాజమాన్యం కోరుకుంటుందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం లక్ష్మణ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. 'వైభవ్ గురించి మాకు బాగా తెలుసు. సుమారు రెండున్నరేళ్ల క్రితం, 2024 అండర్-19 ప్రపంచకప్‌నకు ముందే అతని ప్రతిభను గుర్తించాం. విజయవాడలో జరిగిన క్వాడ్రాంగులర్ సిరీస్‌లో ఇండియా-బి తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో వైభవ్ ఒకడిగా ఉన్నాడు. అప్పటి నుంచి బీసీసీఐ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) క్యాంపుల్లో వైభవ్ నిరంతరం శిక్షణ పొందుతున్నాడు. అంతేకాదు అండర్-19 ప్రపంచకప్‌లోనూ వైభవ్ సూర్యవంశీ టాప్ స్కోరర్‌గానూ నిలిచాడు. వైభవ్‌లో వచ్చిన పరిణతి, అవగాహన అసాధారణంగా పెరిగాయి. అందుకే కఠిన పరిస్థితులను సైతం తట్టుకుని, ఒత్తిడిలో మేటి ఆటగాళ్లపై రాణించగలుగుతున్నాడు. అయితే, అతను మెరుగుపరుచుకోవాల్సిన ముఖ్యమైన అంశం అతని ఫిట్నెస్. అతని వయసు కేవలం 15 ఏళ్లేనని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆఖరి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడినా, మైదానంలోనే ఉండాలని అతను కోరుకున్నాడు. కానీ, మా ఫిజియో సూచన మేరకు అతన్ని బయటకు పంపించాల్సి వచ్చింది. జట్టు కోసం ప్రతీ విషయంలోనూ ది బెస్ట్ అందించాలనే తపన అతనిలో ఉంది' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ये #VaibhavSooryavanshi के बारे में बात कर रहे है।“वैभव हर कीर्तिमान पार करेगा”इनका नाम VVS Laxman हैं जिन्हें तब की Mighty आस्ट्रेलियाई खिलाड़ी और मीडिया "Very Very special "Laxman" बोला करती थी।जिसने 134 टेस्ट मैच खेला है और कभी टीम इंडिया के मशहूर fab-4 का हिस्सा थे।…— Uday Yadav (@USY_79) July 27, 2026 -
హరారేలో 'వైభవం'.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 35 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ నామమాత్రపు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(27), రింకూ సింగ్(25), ఇషాన్ కిషన్(29) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ రెండు, సికిందర్ రజా, ముజార్బానీ, మాధవీరే తలా వికెట్ పడగొట్టారు.బర్ల్ ఒంటరి పోరాటంఅనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగల్గింది. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్(54 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ రెండు, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs ZIM: అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
జింబాబ్వే పర్యటనలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో వైభవ్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఓ దశలో తొలి అంతర్జాతీయ సెంచరీ చేసేలా కనిపించిన సూర్యవంశీ.. భారీ షాట్‌కు ప్రయత్నించి 81 పరుగుల వద్ద ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ సిరీస్‌లో అతడికి ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఈ చిచ్చర పిడుగు ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 16 ఏళ్ల వయస్సు నిండకముందే ఒకటి కంటే ఎక్కువ అర్ధశతకాలు నమోదు చేసిన తొలి ప్లేయర్‌గా వైభవ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.కాగా తొలి టీ20లో వైభవ్ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు సాధించి, టీ20 క్రికెట్లో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా నిలిచాడు. అదేవిధంగా ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 86 సిక్సర్లు బాదాడు. ప్రపంచంలో ఏ ఇతర ఆటగాడు కూడా ఈ ఏడాది ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక టీ20 సిక్సర్లు (108 సిక్సర్లు - 2025లో) కొట్టిన రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉంది. రాబోయే నెలల్లో వైభవ్ ఈ రికార్డును దాటేసే అవకాశముంది.That was Hugeeeeee by Vaibhav Sooryavanshi 💥🤯🤯😯 pic.twitter.com/Y8pxze9nyg— TheFakeFakeer (@TheFakeFakeer) July 26, 2026 -
అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ.. సెంచరీ చేస్తాడనుకుంటే?
జింబాబ్వే గడ్డపై టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. హరారే వేదికగా జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో సూర్యవంశీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తన శైలికి విరుద్దంగా బ్యాటింగ్ చేసిన వైభవ్.. 31 బంతుల్లో తన రెండో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత వైభవ్ తన బ్యాటింగ్‌లో దూకుడు పెంచాడు. దీంతో అతడు తొలి అంతర్జాతీయ సెంచరీ సాధిస్తాడని భావించారు. కానీ స్పిన్నర్ మాధవిరే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.దీంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. కాగా తొలి టీ20లో వైభవ్ మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. -
మూడో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్
India vs Zimbabwe 3rd T20 live updates and highlights: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 35 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగల్గింది. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్(54 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ రెండు, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(81) మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. జింబాబ్వే ఆరో వికెట్ డౌన్‌జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన మరుమణి.. అశోక్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.జింబాబ్వే ఐదో వికెట్ డౌన్‌జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన మాధవీరే.. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.స్పీడ్ పెంచిన జింబాబ్వే బ్యాటర్లు15 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 4 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో మాధవీరే(28), ర్యాన్ బర్ల్(40) ఉన్నారు. ఆతిథ్య జట్టు విజయానికి 30 బంతుల్లో 71 పరుగులు కావాలి.జింబాబ్వే నాలుగో వికెట్ డౌన్‌జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన బెన్ కుర్రాన్.. బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 77/4జింబాబ్వే మూడో వికెట్ డౌన్యశ్ ఠాకూర్ వేసిన నాలుగో ఓవర్లో జింబాబ్వే వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. డియాన్ మైర్స్(19), సికిందర్(0) వెంటవెంటనే ఔటయ్యారు. 5 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 40/3జింబాబ్వే తొలి వికెట్ డౌన్193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో బెన్నెట్ ఔటయ్యాడుజింబాబ్వే టార్గెట్ ఎంతంటే?హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో భారత బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(27), రింకూ సింగ్(25), ఇషాన్ కిషన్(29) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ రెండు, సికిందర్ రజా, ముజార్బానీ, మాధవీరే తలా వికెట్ పడగొట్టారు.భారత్ నాలుగో వికెట్ డౌన్భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. బ్రాడ్ ఎవాన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 172/4వైభవ్ అవుట్వైభవ్ సూర్యవంశీ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు.ఇషాన్ కిషన్ అవుట్ఇషాన్ కిషన్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన కిషన్.. రజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.వైభవ్ ఫిప్టీవైభవ్ సూర్యవంశీ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. వైభవ్ 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ 95 పరుగలు చేసింది. క్రీజులో వైభవ్‌తో పాటు ఇషాన్ కిషన్(29) ఉన్నాడు.దూకుడుగా ఆడుతున్న వైభవ్భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(18 బంతుల్లో 31) దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్లకు టీమిండియా స్కోర్: 60/1అభిషేక్ అవుట్జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. హరారే వేదికగా జరుగుతున్న మూడో టీ20లో 2 పరుగులు చేసి ఔటయ్యాడు.హరారే వేదికగా నామమాత్రపు మూడో టీ20లో భారత్-జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ చివరి టీ20లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది.ప్రిన్స్ యాదవ్, శివమ్ దూబేల స్ధానంలో అశోక్ శర్మ, సూర్యన్ష్ షెడ్గేలు తుది జట్టులోకి వచ్చారు. జింబాబ్వే కూడా ఓ మార్పు చేసింది. రిచర్డ్ నగరావా స్ధానంలో వెల్లింగ్టన్ మసకద్జాకు అవకాశమిచ్చారు.తుది జట్లుజింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీభారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ


