వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై రచ్చ.. స్పందించిన బీసీసీఐ | BCCI Reacts To Criticism Of Gautam Gambhir, Shreyas Iyer Over Stance On Vaibhav Sooryavanshis Debut | Sakshi
Sakshi News home page

ENG vs IND: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై రచ్చ.. స్పందించిన బీసీసీఐ

Jul 3 2026 9:12 PM | Updated on Jul 3 2026 9:16 PM

BCCI Reacts To Criticism Of Gautam Gambhir, Shreyas Iyer Over Stance On Vaibhav Sooryavanshis Debut

టీమిండియా త‌ర‌పున అరంగేట్రం కోసం యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ నిరీక్ష‌ణ కొన‌సాగుతోంది. ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల‌కు బెంచ్‌కే ప‌రిమిత‌మైన వైభ‌వ్‌.. ఇప్పుడు ఇంగ్లండ్ టూర్‌లోనూ డెబ్యూ చేసే సూచ‌న‌లు క‌నిపించడం లేదు. వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయిన తొలి టీ20లో వైభ‌వ్‌కు భార‌త తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు.  

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లనే ఓపెనింగ్ జోడీగా టీమ్ మేనెజ్‌మెంట్ కొనసాగిస్తోంది. సంజూ వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలం కావడంతో సూర్యవంశీకి తుది జట్టులో చోటు కల్పించాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. హెడ్ కోచ్‌, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లు మాత్రం సీనియర్ ప్లేయర్లకే మద్దతు ఇస్తున్నారు. దీంతో గంభీర్‌, అయ్యర్ తీరుపై చాలా మంది మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్‌, కోచ్ విమర్శలు చేయడం సరికాదని శుక్లా అన్నారు.

వైభవ్ సూర్యవంశీకి అద్భుతమైన టాలెంట్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్‌లో ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు. జట్టు మేనేజ్‌మెంట్‌పై వస్తున్న విమర్శలు నా వరకు వచ్చాయి.

నేను ఒక్క విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను.  మ్యాచ్ పరిస్థితిని బట్టి కోచ్, కెప్టెన్ తుది నిర్ణయం తీసుకుంటారు. సరైన సమయం వచ్చినప్పుడు వైభవ్‌కు ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది. అంతవరకు ఇలాంటి అనవసర విమర్శలు చేయడం ఆపాలి." అని 'టైమ్స్ నౌ'తో శుక్లా పేర్కొన్నారు.
చదవండి: IND vs ENG: భారత్‌తో వన్డే సిరీస్‌.. ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన! స్టార్లు వచ్చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement