భారత్‌తో వన్డే సిరీస్‌.. ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన! స్టార్లు వచ్చేశారు | Harry Brook leads as England bring back Jofra Archer, Gus Atkinson for ODIs against India | Sakshi
Sakshi News home page

IND vs ENG: భారత్‌తో వన్డే సిరీస్‌.. ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన! స్టార్లు వచ్చేశారు

Jul 3 2026 6:51 PM | Updated on Jul 3 2026 7:52 PM

Harry Brook leads as England bring back Jofra Archer, Gus Atkinson for ODIs against India

టీమిండియాతో స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న మూడు వ‌న్డేల సిరీస్ కోసం 16 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈ సిరీస్‌కు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. జోస్ బట్లర్, సామ్ కరన్, జో రూట్, ఆదిల్ రషీద్ వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

అంతేకాకుండా దాదాపు ఎనిమిదిల నెల‌ల త‌ర్వాత స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చ‌ర్ ఇంగ్లండ్ వ‌న్డే జ‌ట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. గాయం కార‌ణంగా ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌కు ఆర్చ‌ర్ దూర‌మ‌య్యాడు. ఇప్పుడు అత‌డు పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డంతో వ‌న్డేల‌కు కూడా అత‌డిని ఎంపిక చేశారు.  

ఆర్చర్‌తో పాటు శ్రీలంక టూర్‌కు దూరమైన ఫాస్ట్ బౌలర్లు గుస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్‌లు కూడా తిరిగి జట్టులోకి వచ్చారు. అలాగే ఈ జ‌ట్టులో  22 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ జేమ్స్ కోల్స్‌కు చోటు ద‌క్కింది. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తుండ‌డంతో సీనియ‌ర్ జ‌ట్టుకు అత‌డిని సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు.  ఈ స‌సెక్స్ యువ ఆట‌గాడు టీ20 జ‌ట్టులో కూడా స‌భ్యునిగా ఉన్నాడు. ఈ మూడు వ‌న్డేల సిరీస్ జూలై 14 నుండి జూలై 19 వరకు జరగనుంది. భార‌త జ‌ట్టును బీసీసీఐ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

వన్డే సిరీస్ షెడ్యూల్ వివరాలు:
మొదటి వన్డే: జూలై 14 – ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్)

రెండవ వన్డే: జూలై 16 – సోఫియా గార్డెన్స్ (కార్డిఫ్)

మూడవ వన్డే: జూలై 19 – లార్డ్స్ (లండన్)

ఇంగ్లండ్ వ‌న్డే జట్టు:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, జో రూట్, జోష్ టంగ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement