Photo Credit: ICC Twitter
అఫ్గానిస్తాన్ జట్టు 2027 వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు తోడు ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా అఫ్గానిస్తాన్ నేరుగా ఈ అవకాశాన్ని దక్కించుకుంది. సోమవారం జరిగిన వన్డేలో అఫ్గాన్ మూడు వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 46.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది.
గావిన్ హోయ్ (36) టాప్ స్కోరర్‌గా నిలవగా, కేడ్ కార్మిచల్ (32), జై మూంద్రా (31) పర్వాలేదనిపించారు. అప్గానిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, గజన్‌ఫర్‌చెరో మూడు వికెట్లతో విజృంభించగా, యామిన్ అహ్మద్‌జయ్ 2 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం అఫ్గానిస్తాన్ 44.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ (71) అర్ధసెంచరీతో రాణించగా, ఆఖర్లో రషీద్ ఖాన్ (37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఐర్లాండ్ బౌలర్లలో గావిన్ హోయ్ 4 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అఫ్గానిస్తాన్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే బుధవారం జరగనుంది.
డెడ్‌లైన్ సెప్టెంబర్..
సెప్టెంబర్ 2026 వరకు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్–8 స్థానాల్లో ఉండే జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. దక్షిణాఫ్రికా ఆతిథ్య జట్టు కావడంతో టాప్–9కు అవకాశం దక్కుతుంది. బంగ్లాదేశ్ కూడా క్వాలిఫై అయింది. అయితే రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్ ఈ అవకాశం కోల్పోయింది. దాంతో విండీస్ వరల్డ్ కప్‌కు అర్హత సాధించాలంటే క్వాలిఫయింగ్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది.
𝐌𝐀𝐓𝐂𝐇-𝐖𝐈𝐍𝐍𝐈𝐍𝐆 𝐑𝐀𝐒𝐇𝐈𝐃 𝐊𝐇𝐀𝐍! 🪄
3/44 with the ball! 🎯
37* with the bat! 💥@rashidkhan_19 delivered another brilliant all-round performance to guide Afghanistan to victory and claim his second successive Player of the Match award! 👏💙#AfghanAtalan |… pic.twitter.com/r4JZlbJJNk— Afghanistan Cricket Board (@ACBofficials) August 10, 2026


