గౌతమ్‌ గంభీర్‌ రికార్డుపై కన్నేసిన రవీంద్ర జడేజా | Ravindra Jadeja set to surpass Ishant Sharma, enter elite Test bowling list | Sakshi
Sakshi News home page

IND vs SL: గౌతమ్‌ గంభీర్‌ రికార్డుపై కన్నేసిన రవీంద్ర జడేజా

Aug 10 2026 9:14 PM | Updated on Aug 10 2026 9:24 PM

Ravindra Jadeja set to surpass Ishant Sharma, enter elite Test bowling list

PC: X

టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా దాదాపు 8 నెలల తర్వాత తిరిగి జాతీయ జ‌ట్టు త‌ర‌పున ఆడేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టులో జడేజా బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు జడేజాను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. 

జడేజా ముందున్న రికార్డులు ఇవే
👉ఈ మ్యాచ్‌లో జడేజా మరో రెండు వికెట్లు పడగొడితే టెస్టుల్లో 350 వికెట్లు మైలు రాయిని అందుకున్న ఐదో భారత బౌలర్‌గా నిలుస్తాడు.

👉అదేవిధంగా మరో 4 వికెట్లు సాధిస్తే శ్రీలంకపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో ఐదో స్దానానికి చేరుకుంటాడు. ప్రస్తుతం ఈ రికార్డు వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ పేరిట ఉంది. ఇషాంత్ శర్మ 12 టెస్టుల్లో 36 వికెట్లు తీయగా, జడేజా 7 టెస్టుల్లోనే 23.72 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. 

ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (74 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (62), హర్భజన్ సింగ్ (53), కపిల్ దేవ్ (45) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు. 

👉అదేవిధంగా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ రికార్డుపై కూడా అతడు కన్నేశాడు. మరో 60 పరుగులు చేస్తే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గంభీర్‌(4,154)ను జడ్డూ అధిగమిస్తాడు. కాగా జడేజా మంచి టచ్‌లో ఉన్నాడు. శ్రీలంక ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో జడేజా బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించాడు.
చదవండి: వైభవ్‌ కాదు.. అతడి సెలక్షన్‌ ఒక అద్భుతం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement