వైభవ్‌ కాదు.. అతడి సెలక్షన్‌ ఒక అద్భుతం! | Good That He Has Been Fast-Tracked: Zaheer Khan | Sakshi
Sakshi News home page

వైభవ్‌ కాదు.. అతడి సెలక్షన్‌ ఒక అద్భుతం!

Aug 10 2026 3:59 PM | Updated on Aug 10 2026 4:16 PM

Good That He Has Been Fast-Tracked: Zaheer Khan

పంజాబ్ యువ పేస‌ర్ గుర్నూర్ బ్రార్ టీమిండియా త‌ర‌పున అద్భుతంగా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. జ‌స్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌ల‌కు బ్యాక‌ప్ బౌల‌ర్‌ను వెతుకుతున్న స‌మ‌యంలో సెల‌క్ట‌ర్ల దృష్టిలో పడ్డాడు గుర్నార్.  6 అడుగుల 5 అంగుళాల పొడవున్న ఈ రైట్ ఆర్మ్ పేసర్‌.. గంటకు 142 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. 

వన్డేల్లో తనను నిరూపించుకున్న గుర్నార్.. ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్‌లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో గుర్నూర్ అరంగేట్రం చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుర్నూర్ బ్రార్‌పై టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. గుర్నూర్‌కు మంచి బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని, సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతాడని జహీర్ కొనియాడాడు.

"అధిక వేగంతో బౌలింగ్ చేయగల యువ ఫాస్ట్ బౌలర్లు భారత జట్టులోకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గుర్నార్ బ్రార్ వంటి యంగ్ పేసర్‌ను త్వరితగతిన జట్టులోకి తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. అత‌డికి అద్భుత‌మైన టాలెంట్ ఉంది. బంతిని ఇరువైపులా స్వింగ్ చేయగలడు. కేవ‌లం ఒక్క వేగ‌మే కాదు స‌రైన లైన్ అండ్ లెంగ్త్‌తో కూడా బౌలింగ్ చేయ‌గ‌ల‌డు.

అత‌డు సుదీర్ఘ కాలం పాటు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కొన‌సాగుతాడ‌ని నేను న‌మ్ముతున్నాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో జ‌హీర్ పేర్కొన్నాడు. కాగా 26 ఏళ్ల  గుర్నార్ బ్రార్ గ‌త కొంత‌కాలంగా మూడు ఫార్మాట్ల‌లోనూ నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజ‌న్‌లో పంజాబ్ త‌ర‌పున గుర్నార్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. కేవ‌లం 7 మ్యాచ్‌ల‌లోనే 26 వికెట్లు ప‌డ‌గొట్టి సెల‌క్ట‌ర్ల దృష్టిని ఆకర్షించాడు.

ఆ తర్వాత పంజాబ్ టీ20 లీగ్‌లో కూడా టాప్ వికెట్ టేకర్‌గా(22) అతడు నిలిచాడు. ఐపీఎల్‌లో మాత్రం అతడు ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అయినప్పటికి అతడి టాలెంట్‌ను పరిగణలోకి తీసుకుని జాతీయ జట్టులో సెలక్టర్లు చోటిచ్చారు. అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో అరంగేట్రం చేసిన గుర్నూర్ తన సూపర్ బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 వన్డేల్లో అతడు 11 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇప్పుడు టెస్ట్ జట్టులో కూడా అతడు చోటు కొట్టేశాడు.!
చదవండి: Bhuvaneshwar Kumar: నేను ఎందుకు కాదంటాను? అంతా వాళ్ల చేతిలోనే ఉంది
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement