టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక ఏడు మ్యాచ్‌ల తర్వాత శ్రేయస్ అయ్యర్ గెలుపు రుచిని చూసిన సంగతి తెలిసిందే. అయ్యర్ నాయకత్వంలో భారత జట్టు ఐర్లాండ్ (0-2), ఇంగ్లాండ్ (0-4) సిరీస్‌లలో వరుస ఓటములను చవిచూసింది.
అనంతరం జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను మాత్రం భారత్ క్లీన్ స్వీప్ చేసింది. అయ్యర్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి సిరీస్ విజయం. అయితే శ్రేయస్ కెప్టెన్‌గా తొలి ఏడు మ్యాచ్‌లలో విఫలమైనప్పటికి వ్యక్తిగత ప్రదర్శన పరంగా మాత్రం ఆకట్టుకున్నాడు.
ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లో ఈ ముంబైకర్ బ్యాట్‌తో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో అయ్యర్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఫలితాలు అనుకూలంగా రాకపోయినప్పటికి శ్రేయస్ అయ్యర్ చాలా ప్రశాంతంగా వ్యవహరించాడని చోప్రా కొనియాడాడు.
"శ్రేయస్ అయ్యర్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అతడు ఎప్పుడూ ప్రతికూల విషయాల గురుంచి ఆలోచించడం, మాట్లడడం గానీ చేయడు. మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుందనే సూత్రాన్నిఅతడు బలంగా నమ్ముతాడు. ఆ మైండ్‌సెట్ వల్లే జట్టులో ఎప్పుడూ నెగెటివిటీకి తావివ్వడు.
ఆటగాళ్లు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలరు. సహజంగా క్రికెట్ లాంటి క్రీడల్లో ప్రతీ ఒక్కరిపై ఒత్తిడి ఎలానూ ఉంటుంది. అదనంగా కెప్టెన్ లేదా కోచ్ కూడా ఒత్తిడి పెంచితే ఆటగాళ్లు రాణించలేరు. కానీ అయ్యర్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం.
చాలా కూల్‌గా ఉండి ఆటగాళ్లకు పూర్తి స్వేఛ్చను ఇస్తాడు. ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తూ జట్టులో మంచి వాతావరణాన్ని పెంపొందించే వారే నిజమైన కెప్టెన్" అని దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: IND vs SL: భారత్‌తో టెస్టు సిరీస్.. శ్రీలంక క్రికెట్ బోర్డు ఊహించని నిర్ణయం


